Sri Matsya mahapuramu-2    Chapters   

షోడశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- రాజ్ఞో యుక్తదేశావస్థానమ్‌.

మత్స్యః: రాజా సహాయసంయుక్తః ప్రభూతయవ సేన్దనమ్‌| రమ్య మానత సామన్తం మధ్యమం దేశ మావసేత్‌. 1

వైశ్య శూద్ర జనప్రాయ మనాహార్యం తథా పరైః| కిఞ్చి బ్రాహ్మణసంయుక్తం బహుకర్మకరం తథా. 2

అదైవమాతృకం రమ్య మనురక్త జనాన్వితమ్‌| కరై (ర) రాపీడీతం చాపి బహుపుష్పఫలం తథా.3

ఆగమ్యం పరచక్రాణా మారాద్యం సహసా77పది | సమదుఃఖసుఖం రాజ్ఞ స్సతతం ప్రియా మాస్థితమ్‌. 4

నరీనృప విహీనం చ వ్యాఘ్రతస్కర వర్జితమ్‌| ఏవం విధం యథాలాభం రాజా విషయ మావసేత్‌. 5

రాజు ఉండవలసిన స్థానము- (రాజధానీ స్థాన వివేచనము) -దుర్గ వ్యవస్థ-

దుర్గము ఉండవలసిన స్థానము.

మత్స్య నారాయణుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను; రాజు తన రాజధానిగా ఏర్పరచుకొని దుర్గము నిర్మించవలసిన చోటునకు- తనకు సహాయిలు అందుబాటులో నుండవలయును ;అదిగడ్డి కట్టెలు సమృద్ధిగా దొరకుచోటు కావలెను; సామంతులందరుఅడకువతోనుండి తన కడకు వచ్చి సేవింప వీలుగా దేశ మధ్యము కావలెను ;వైశ్య శూద్రజనులధిగముగా నుండి ఆవశ్యమయినచో ఇతరులును ఉండుటకు అనువగునదియై బ్రాహ్మణులు కొలది మంది యుండు కర్మ కరులు (ఆయా పనులవారు) అధికముగా నుండుచోటు కావలెను; వంటల విషయమున దేవమాతృకము (మెట్ట) కారాదు ;నదీమాతృకము(మాగాణి) కావలెను ;రమ్యమై అను రక్తులగు జనులతోకూడి యుండవలెను ;అచటిజనులకు పన్నులపీడ అధికముగా నుండరాదు ;పుష్ప ఫలోపేదమైన శత్రు సేనలకు అగమ్యమై ఆపదలు (శత్రు భయాదికము) వచ్చినపుడు శీఘ్రమే ఆశ్రయించి రక్షించుకొన ననుకాలమై సుఖ దుఃఖములు సమానముగా కలిగి (ఈ రెంటిలో ఏవియు అధికముగా లేక) సతతము ప్రీతిదాయకమయి సరీనృపములు (సర్పాదులు) వ్యాఘ్రములు తన్కరులు లేక యుండవలెను; ఈ అనుకూల్య ములలోలభించునన్ని ఉన్న చోటిని రాజు తనకు తన నివాసమునకై ఎన్నికచేసి కొనవలెను ;(విషయము =ఆశ్రయము)

దుర్గనిర్మాణక్రమః.

తత్రదుర్గం నృపః కుర్యాత్షణ్ణా మేకతమం బుధః|

ధన్వందుర్గం మహీదుర్గం నర( నడ) దుర్గం తథైవచ.6

వాక్షరం చైవా మ్భుదుర్గంచ గిరిదుర్గంచ పార్థివః| సర్వేషామేవ దుర్గాణాం గిరిదుర్గం ప్రశస్యతే. 7

దుర్గంత పరికోపేతం వప్రాట్టాలకసంయుతమ్‌| శతఘ్నీయన్త్రముక్యైశ్చ శతశశ్చ సమావృతమ్‌. 8

గోపురం సకవాటంచ తత్ర స్యా త్సుమనోహరమ్‌| సపతాకం గజారూఢో యేన రాజా విశే త్పురమ్‌. 9

చతస్రశ్చ తథా తత్ర కార్యా స్త్వాయతవీథయః| ఏకస్మిం స్తత్ర వీథ్యగ్రే దేవవేశ్మ భ##వే ద్దృఢమ్‌. 10

వీథ్యగ్రేచ ద్వితీయేచ రాజవేశ్మ విధీయతే| ధర్మాధికరణం కార్యం వీథ్యగ్రేచ తృతీయకే. 11

చతుర్థేచైవ వీథ్యగ్రే గోపురంతు విధీయతే| ఆయతం చతురశ్రంవా వృత్తంవా కారయే త్పురమ్‌. 12

ముక్తి హీనం త్రికోణం యవమధ్యం తథైవచ|అర్ధచన్ద్రప్రకారంచ వజ్రాకారంచ కారయేత్‌. 13

అర్ధచన్ద్రం ప్రసంసన్తి నదీతీరేషు తద్వశాః | అన్యత్తత్ర నన కుర్వీత ప్రయత్నేన విజానతా. 14

దుర్గా నిర్మాణక్రమము.

ఇట్టి ప్రదేశమునందు రాజు *ధన్వదుర్గము మహీదుర్గము *నర దుర్గము వృక్ష దుర్గము జలదుర్గము గిరిదుర్గము అను ఆరు విధములగు దుర్గములలో ఏదో ఒక విధమగు దానిని నిర్మించవలెను ;వీనిలో ఆరవది చాల మేలు; దుర్గమునకు

*ధన్వము అనగా ఎడారి ;ఎడారిలో ఐదు యోజనముల భుజములతో ఏర్పడు చతురస్రమునకు నడుమ కట్టినకోట.

*ఇది బహుశః 'నడ' (జమ్ము గడ్డితో నిండిన విశాల ప్రదేశమునందుండు) దుర్గము; 'నడ' క్రమముగా 'నర' అని పాఠము మారి యుండును.

ఆకృతుల బొమ్మలు

దుర్గ- స్తంభ- దేవాలయాదుల శాస్త్రీయాకృతులు

చుట్టును ఆగడ్తయు ప్రాకారమును బురుజులును శతఘ్నులు మొదలగు వందల కొల దిన యంత్రములు తలుపులుగల మనోహరమగు పురద్వారము( గోపురము) దానిపై జెండా - కలిగి రాజేనుగు పై దాని నుండి ప్రవేశింపదగినంతగా ఉండ వలెను ;దుర్గపు లోపల నాలుగు పొడవగు వీథులు- వానిలో మొదటి వీథి చివర దృఢ దేవాలయము రెండవ దాని చివర రాజ భవనము మూడవ దాని చివర దర్మాధికరణ స్థానము నాలుగవ దాని చివర గోపురము (పుర ద్వారము) ఉండ వలెను ;పురము ఆయతము (దీర్ఘచతురస్రము) చతురస్రము వృత్తము త్రికోణము యవమధ్యము (దీర్ఘవృత్తము) అర్ధ చంద్రము వజ్రము (అష్టాన్రము అష్టభుజాకృతి)- ఈ ఆకృతులలో దేనిలోనైన ఉండవచ్చును ;ఇన్నిటిలోను రాజాజ్ఞ (రాజ పురుషాజ్ఞ) లేనిదే జనుల రాకపోకల కవకాశము లేకుండవలెను ;నదీ తీరమలందు కట్టు దుర్గము అర్ధ చంద్రాకృతిలోనే యుండుట ప్రశస్తమని శాస్త్రజ్ఞులందురు; (దుర్గముల ఆకృతులు 923 పుటలోవటములో చూడుడు.)

రాజ్ఞా కోశగృహం కార్యం దక్షిణ రాజవేశ్మనః| తస్యాపి దక్షిణ బాగే గజస్థానం వలిధీయతే. 15

గజానాం ప్రాఙ్ములీ శాలా కర్తవ్యా వా7ప్యు దఙ్ముఖీ| ఆగ్నేయేచ తథా భాగే ఆయుధాగార మిష్యతే. 16

మహానసం చ ధర్మజ్ఞ కర్మశాలా స్తథాపరాః| గృహం పురోధనః కార్యం వామతో రాజవేశ్మనః. 17

మన్త్రి వేదవిదాం చైవ చికిత్సాకర్తు రేవచ| తత్రైవ చ తథా భాగే కోష్ఠాగారం విధీయతే. 18

గవాం స్థానం తథైవాత్ర తురగాణాం తథైవచ| ఉత్తరాభిముఖా శ్రేణి తురగాణాం విధీయతే. 19

దక్షిణాభుముఖా వా7థ పరిశిష్టాస్తు గర్హితాః| తురగాస్తే తథా ధార్యాః ప్రదీపై స్సార్వరాత్రికైః. 20

కుక్కుటా న్వానరాంశ్చైవ మర్కటాంస్చ నరాధిప| ధారయే ధస్వశాలాసు సవత్సాం ధేనుమేవచ. 21

అజాశ్చ తత్రవై ధార్యాస్తురగాణాం హితైషిణా| గోగజాశ్వాదిసాలాసు తత్పురీషస్య నిర్గమః. 22

అస్తఙ్గతే న కర్తవ్యో దేవ దేవే దివాకరే| తత్ర తత్ర యథాస్థానం రాజా విజ్ఞాయసారథీ & 23

దద్యా దావసథస్థానం సర్వేషా మనుపూర్వశః| యోదానాం శిల్పినాం చైవ సర్వేషామవిశేషతః. 24

దద్యా దావసథా న్దుర్గే మన్త్రి కాలవిదా ఞ్చుభా &| గోవైద్యా నస్వవైద్యైం స్తథైవచ. 25

ఆహారేత భృశం రాజా దుర్గేహి ప్రబలా రుజః| కుశీలవానాం విప్రా ణాం దుర్గే స్థానం విధీయతే. 26

న బహునా మతో దుర్గే వినా కార్యం తథా భ##వేత్‌|

రాజ భవనమునకు దక్షిణముగా కోశ గృహము దానికి దక్షిణముగా గజ స్థానము తూర్పు మొగముగా గాని ఉత్తరపు మొగముగాగాని ఉండవలెను ; పురాగ్నేయమన ఆయుధా గారము వంటశాల కర్మశాలలు (కమ్మరము- వడ్రంగము- కంచరము మొదలగునవి) రాజ భవనమున కెడమగా పురోహిత గృహము మంత్రి గృహము వేద పండిత గృహము వైద్యగృహము కోష్ఠాగారము (వంట సామగ్రిశాల- ఉగ్రాణముగోస్థానము అశ్వస్థానము ఉండవలెను; అందశ్వ శ్రేణి ఉత్తరపు మొగమై కాని దక్షిణపు మొగమైకాని ఉండవలెను ; మిగిలిన మొగములు పనికిరావు; అశ్వశాలలలో రాత్రింబవల్లు ప్రదీపములు( కాగడాలు) వెలుగుచుండ వలెను. అందు కోళ్లు కోతులు విశేషించి ఎర్రమూతి కోతులు దూడలతో కూడ పాడియావులు మేకలు (ఇవి అశ్వరోగములు పోగొట్టు రక్తము మూత్రము మొదలగునవి ఇచ్చును; ) ఉండవలెను గోగజాశ్వాదిశాలలందు పేడ సూర్యాస్తమయమునకు లోపలనే తీసివేయవలెను; వీటి సారథులకు క్రమమెరిగి (ఈ శాలలున్న వరుసననుసరించి) అందరకు గృహములను ఈ శాలలకు దగ్గరలో నిర్మించవలెను; యోధులకును శిల్పులకును మంత్రుల కును దైవజ్ఞులకును ఒకే విధముగా మంచి ఇండ్లు నిర్మించి ఈయవలెను ; దుర్గములందు రోగములును పేరబలముగానుండు అవకాశము కలదు ; కావున రాజు గోగజాశ్వాది వైద్యులు తప్పక తగిన వారిని సంపాదించి దుర్గమందు నిలుపుకొన వలెను ; కుశీలవులు (గాయులు) విప్రులు మొదలగు వారికిని దుర్గమందు వసతి ఉండవలెను ; ఐనను పనిలేనిదే వీరెవ్వరును చాల మంది దుర్గములోపల నుండరాదు.

దుగ్రే ఆయుధాదిసఙ్గ్రహాః దుర్గేతు యన్త్రాః కర్తవ్యా నానా ప్రహణాన్వితాః. 27

సహస్రఘాతినో రాజం సై#్తస్తు రక్షా విధీయతే| దుర్గే ద్వారాణి గుప్తాని కార్యాణ్య పిచ భూభుజా. 28

సఙ్గ్రహశ్చాత్ర సర్వేషాం మాయుధానాం చ శస్యతే| ధనుషాం క్షేపణీయానాం తోమరాణాంచ పార్థివ. 29

శరాణా మథ ఖడ్గానాం కవచాననాం తథైవచ. 30

అశ్మనాంచ ప్రభూతానాం ముద్గరాణాంతథైవచ| పట్టసానాం త్రిశూలానాం శూలానాం చ

తథైవచ. 31

ప్రాసానాం చైవ శస్త్రాణాం శక్తీనాంచ తథైవచ| పరశ్వథానాంచక్రాణాం చర్మణాం వర్మభి స్సహ. 32

కుఠారక్షుర వేత్రాణాం పరిఘాణాం తథైవచ| తుషాణాం చైవ దాత్రాణా మఙ్గారాణాం తథైవచ. 33

సర్వేషాం శిల్పిభాణ్ణానాం సఞ్చయ స్తత్ర చేష్యతే| వాదిత్రాణాం చ సర్వేషా మోషధీనాం తథైవచ. 34

యమసానాం ప్రభూతానా మిన్దనస్యచ సఞ్చయః| గుడస్య సర్వతైలానాం రసానాం చ తథైవచ. 35

వసానా మథ మజ్జానాం స్నాయూనా మస్థిభి స్సహ| గోతర్మపటహానాం చ ధాన్యానాం సర్వత స్తథా. 36

తథైవాభ్రపటానాం చ యవగోధూమయో రపి | ఛణసర్జరసం భూర్జం జతు లా | చ టఙ్కణమ్‌. 37

రాజా సఞ్చినుయా ద్దుర్గే యచ్చాన్యదపి కించన| రత్నానాం సర్వలోహానాం వస్త్రాణాం చాప్యశేషతః. 38

కోద్రవం ముద్గమాషాణాం చణకానాం తిలై స్సహ| తథాచ సర్వసస్యానాం పాంసుగోమయయో రపి. 39

కుమ్భాశ్చాశీవిషైః కార్యా వ్యాళసింహాదయ స్తథా| మృగాశ్చ పక్షిణశ్చైవ రక్ష్యాస్తే చ పరస్పరమ్‌. 40

స్థానాని చ విరుద్ధానాం సుగుప్తాని పృథకృథక్‌ | కర్తవ్యాని మహాభాగ యత్నే పృథివీక్షితా. 41

ఉక్తాని చాప్యనుక్తాని రాజనే ద్రవ్యాణ్యశేషతః| సుగుప్తాని పురే కుర్యాజ్జనానాం హితకామ్యయా. 42

దుర్గమందాయుధాది సంగ్రహణము.

దుర్గమందు నానా యుధ యుక్త యంత్రములు వేలకొలది మందిని చంపగలవియు గుప్త ద్వారములు ను ఉండవలయును. సర్వ విధానేకా యుధములును ధనువులు వడిసెలలు పిరంగులు తోమరములు ఖడ్గములు కవచములు రాలు ముద్గరములు పట్టన

త్రిశూల ప్రాసశస్త్రశక్తి పరశ్వథ తర్మ (డాలు) వర్మ కవచ కుఠార (గొడ్డలి) క్షుర (చురకత్తి) వేత్ర (ప్రేము కర్రలు బెత్తములు) పరిఘతుష(ధాన్యాదులు పొట్టు) దాత్రములు (కొడవళ్లు) అంగారములు (బొగ్గుల) సర్వశిల్పి భాండములు (ఆయా పనివారల పిముట్లు) సర్వ వాద్యములు ఔషదములు సమృద్ధిగా అనేక విధములగు యవసములు (మేత గడ్డి తెగలు) వంట కట్టెలు బెల్లము సర్వతైలములు సర్వ రస సామగ్రి (పాలు పెరుగు తేనె మొదలగునవి) వన (క్రొవ్వువంటిది) మజ్జ- స్నాయువులు (నులినరములు) ఎముకలు ఎద్దుల చర్మముతో చేసిన తప్పెటలు మొదలగు చర్మవాద్యములు సర్వ ధాన్యములు అభ్ర పటములు (శిబిరముల నిర్మింప పనికివచ్చు వస్త్రములు మొ.) యవలు గోధుమలు రత్నములు సర్వవిధ వస్త్రములు సర్వవిధ లోహము బఠాణి పెసలు మినుములు శనగలు నూవులు ఇట్టి అన్ని పంట (ధాన్యము) లు ధూళులు గోమయములు జనుపనార నర్జరసము భూర్జ పత్రము జతు- లాక్షా (అను రెండు విధముల లక్కలు) టంకణము ఇట్టివింకెన్నియో దుర్గమందు సేకరించి ఉంచవలెను ; వీటిలో ముఖ్యముగా రత్నములు సర్వలోహములు సర్వవిధ వస్త్రములు కొర్రలు పెసలు మినుములు శనగలు నూవులు ఇంకను సర్వ సస్యములును ధూళులును గోమయమును పాములతోకూడిన కుంభములు (సింహాదులగు) క్రూర మృగములు మృగములు పక్షులు మొదలగునవి వాటి పరస్పర మైత్రీ ద్వేషముల నెరిగి నిలుపవలెను; పరస్పర విరోధముగల పదార్థములకును ప్రాణులకునను ఏర్పరచుస్థానములు అతి రహస్యములయి సురక్షితములయి ఉండవలెను; రాజు ఈ విషయమలందు ప్రయత్న పరుడు కావలెను; ఈ చెప్పినవియు ఇందు చెప్పనివి ద్రవ్యములు పురమందు జనులహితమునకై సేకరించి రహస్యముగా భద్ర పరచి ఉండవలెను.

దుర్గే సఙ్గ్రాహ్యవృక్షాః,

జీవకర్షభకాకోల మామలక్యాటరూషకా & |శాలపర్ణీపృష్ఠి(శ్ని) పర్ణీ ముద్గపర్ణీ తథైవచ. 43

మాషపర్ణీ చ మేదే ద్వే శారిబే ద్వే బలాత్రయమ్‌| వీరా శ్వసన్తీ వృష్యాచ బృహతీ కణ్టకారికా. 44

శృఙ్గీ శృఙ్గాటకీ ద్రోణీ వర్షాభూ ర్దర్భరేణుకా| మధుపర్ణీ విదార్యేషా మహాక్షీరా మహాతపాః. 45

ధన్వన స్సహదేవాహ్వా కటుకైరణ్డకం విషః| పర్ణీ శతాహ్వా మృద్వీకా ఫల్గుతాద్యాశ్చ సత్తమ. 46

శుక్రాతిశుక్రకాశ్మర్యం ఛత్రాతిచ్ఛత్రవీరిణాః| ఇక్షు రుక్షువికారాస్చ ఫణితాద్యాశ్చసత్తమ. 47

సింహీత సహదేవీ చవిశ్వేదేవాశ్వరోధకమ్‌| మధుకం పుష్పహం సాఖ్యా శతపుష్పా మదూలికా. 48

శతావరీ మధూకేచ పిప్పలం తాలమేవచ| ఆత్మగుప్తా కట్పలాఖ్యా దార్వికారాజశీర్షికీ. 49

రాజసర్షవధాన్యాక మృష్యప్రోక్తా తథోత్కటా| కాలాసాకం పద్మబీజం గోవల్లీ మధువల్లికా. 50

శీతపాకీ కుబేరాక్షీ కాకజీహ్వోరుపుష్పికా| పర్వతత్రపుసౌ చోభౌ గుఞ్జాతక పునర్నవే. 51

కశేరు కారు కాశ్మీరీ వల్యాసాలూక కేసరమ్‌| శూకధాన్యాని సర్వాణి సర్వేషాం చ తథైవచ. 52

క్షీరం క్షౌద్రం తథా తక్రం తైలం మజ్జా వసా ఘృతమ్‌| నీశ్చారిష్ట కాక్షోడవాతామ స్సోమబాణకమ్‌. 53

ఏవమాదీని చాన్యాని విజ్ఞేయా మదురో గుణః| రాజా సఞ్చినుయా త్సర్వం పురే నిరవశేషతః. 54

దాడిమామ్రాతకౌ చైవ తిన్త్రిడీకావ్లువేతనమ్‌| భవ్యకర్కన్దులకుచ కరమర్దక రూషకమ్‌. 55

బీజపూరకకణ్దూరే మలతీరాజ హన్దుకమ్‌| కోలకద్యయపర్ణాని ద్వయో రావ్లూతయోరపి. 56

పారావతం నాగరకం ప్రాచీనోళక మేవచ| కపిత్థామలకం చుక్రఫలం దన్తశఠస్యచ. 57

జామ్బవం నవనీతంచ సౌవారకలుశోదకమ్‌| సురాసవంచ మద్యాని మణ్దతక్రదధీ చ. 58

యాని శుక్లాని సర్వాణి జ్ఞేయ మావ్లుగణం ద్విజ| ఏవమాదీని చాన్యాని రాజా సఞ్చినుయా త్పురే. 59

సైన్దవోద్భిది పాఠేయపాక్య సాముద్రాలోమకమ్‌| కుప్యసౌవర్చలాబిల్వం బాలకేయం యవాహ్వకమ్‌. 60

ఔర్వం క్షారం కాలభస్మవిజ్ఞోయో లవణో గణః| ఏవమాదీని సర్వాణి రాజా సఞ్చినుయా త్పురే. 61

పిప్పలీ పిప్పలీమూలం చిత్రకం నాగరం తథా| కుబేరకం మరిచకం శిగ్రుభల్లాతసర్షపాః. 62

కుష్ఠా7జమోదా కిణిహీ హిఙ్గుమూలక ధాన్యకమ్‌| కారవీ కుఞ్జికాయాజ్యాసుముఖా కాలమా (మూ) లికా. 63

ఫణిజ్జకో 7థలశునం భూస్తృణం సురసుం తథా| కాయస్థాన వయస్థాచ హరితాళం మనశ్శిలా. 64

అమృతాచ రుదన్తీచ రోహి,ం కుహ్కుమం తథా| జయా ఏరణ్డకాణ్డీరం సల్లకీ హఞ్జికా తథా. 65

సర్వపిత్తాని మూత్రాణి ప్రాయోహరితకానిచ| ఫలాని చైవ సూక్ష్మాణి సూక్ష్మేలా హిఙ్గు పత్రికా. 66

ఏవమాదీని సర్వాణి రాజా సఞ్చినుయాచ్ఛనై ః| ఏవమాదీని సర్వాణి గణః కటుకసంహితః. 67

రాజా సఞ్చినుయాద్దుగ్రే ప్రయత్నేన నృపోత్తమ|

దుర్గ మందుండవలసిన వృక్షములు మొదలగునవి.

జీవకము ఋషభము కాకోలము అమలకి ఆటరూషకము శాలవర్ణి పృశ్ని( ష్ఠి) ముద్గు పర్ణి మా, పర్ణి మేదా జాతి ఓషదులు రెండు శారిభా జాతి మూలికలు రెండు బలాజాతి ఓషదులు మూడు- వీర- శ్వసంతి- వృష్య బృహతి- కంట -కారిక- శృంగి- శృంగాటకి - ద్రోణి వర్షాభూ - దర్భ రేణుక మధువర్ణి విదారి మహాక్షీర మహాతపస్‌- ధన్వనము- సహదేవ- కటుక- ఏరండకము- విషము (ఒక మూలిక) పర్ణి -శత్వాహ్వా ద్రాక్ష ఫల్గు ఖర్జూరము -అతిమధురము- శుక్ర -అతి శుత్ర -కాశ్మరి ఛత్త్ర వీరిణి చెరకు చెరకు నుండి ఉత్పన్న వస్తువులు ఫణితము మొదలగునవి సింహ సహదేవి విశ్వేదేవ అశ్వరోధకము- మధుకము- పుష్పహంస-శతపుష్ప-మధూలిక-శతావరి-మధుకా-పిప్పలము తాళము ఆత్మగుప్త- కట్ఫల-దార్వికా - రాజశీర్షకి-రాజ నర్షపములు-ధాన్యాకము-ఋష్యప్రోక్త-ఉత్కట- కాలశాకము-పద్మబీజము-గోవల్లి-మధువల్లిక-శీతపాకి-కుబేరాక్షి-కాకజిహ్వ-ఉరుపుష్పిక- పర్వతము-గుంజాతకము-పుర్వ-కశ్రువు-కారువు కాశ్మీరీ-వల్య - సాలూకము - కేసరము- సుంకు ఉండెడి అన్ని ధాన్యములు-అన్ని పశు మృగజాతులపోలు-తేనె మజ్జిగ- తైలములు-మజ్జ-నేయి-నీపము-అరిష్టకము- ఆక్షోటము-వాతామము-సోమబాణక(బాదా)ము ఈ మొదలగు మధుర (తీయని) గణమునకు చెంది ఓషధీ. రస జాతి ద్రవ్యములును.

దాడిమము-ఆమ్రాతకము-తింత్రిణీకము-ఆవ్లుము-వేతనము-భవ్యము కర్కంధువు లకుచము కరమర్ధకము రూషకము-బీజపూరకము కండూరము-మాలతి-రాజబంధుకము-రెండు తెగల కోలకముల పత్రము రెండు తెగల ఆవ్లూతముల పత్త్రములు పారావతము నాగరకము ప్రోచీనోళకము కపిత్థము ఆమలకము చుక్రఫలము దంతశఠఫలము-జంబూ ఫలము వనీతము సౌవీరము కలుషోదకము-సుర-ఆసవము మద్యములు మండము తక్రము దధి మొదలగు తెల్లని ఆవ్లు(పుల్లని) గణమునకు చెందిన పదార్థములును-

సైంధవము ఉద్భిదము పాథేయము పాక్యము సాముద్రలోమకము కుప్యము సౌవర్చలము బిల్వము బాల కేయము యవాహ్వకము ఔర్వము క్షారము కాలభస్మము- ఈ మొదలగు లవణ గణ పదార్థములునను-

పిప్పలి-పిప్పలివేరు-చిత్రకము-%ాగరము-కుబేరము-మరిచకము-శిగ్రువు-భల్లాతకము - సర్షపములు కుష్ఠము- అజమోద-కిణిహి-హింగువు-మూలకము-ధానన్యకము-కారవీ- కుంజికా-యాజ్యా-సుముఖా-కాలమాలికా-ఫణిజ్జకము-లశుము భూస్తృణము-సురసము-కాయస్థా-వయస్థా-హరితాళము - మనశ్శిల-అమృత-రుదంతీ- రోషిషము-కుంకుమము-జయ-ఏరండము-కాండీరము-సల్లకీ-హంజికా-ఈ మొదలగు పిత్తజనక పదార్థములును ఇటువంటివేయగు (పిత్తజనక) ప్రాణుల మూత్రములును తరచుగా పచ్చివియును సూక్ష్మములగు ఫలములును సూక్ష్మైలా-హింగు పత్త్రము- ఈ మొదలగు కటుక గణపు (కారపు) ద్రవ్యములును రాజు తన పురమునందు సేకరించి ఉంచుకొనవలయును.

ముస్తం చన్దనహ్రీబేరకృతమాలకదారవాః. 68

హరిద్రా నళదోశీరనక్తమాలకదమ్బకమ్‌ | దూర్వా పటోల కటుకా దీర్ఘత్వక్పత్రకం వచా. 69

కిరాతతి క్తభూనిమ్బ విషా చాతివిషానిచ | తాళీసపత్ర తగరం సప్తవర్ణ వికఙ్కతాః. 70

కాకోదుమ్బరికా దివ్యా తథాచైవ సురోద్భవా | షడ్గ్రన్థా రోహిణీ మాంసీ పర్పటం చాథ దన్తికా. 71

రసాఞ్జనం భృఙ్గరాజం పతఙ్గీ పరిపేలవమ్‌ | దుస్స్పర్శాగురుణీ కామా శ్యామాకం గన్ధననాకులీ. 72

రూపపర్ణీ వ్యాఘ్రనఖం మఞ్జిష్ఠా చతురఙ్గళా | రమ్భాచై వాఙ్కురాస్ఫీతా తాలాస్ఫోతా హరేణుకా. 73

వైత్రాగ్రవేతస స్తుమ్బీ విషాణీ లోధ్రమఞ్జరీ | మాలతీకరకృష్ణాఖ్యా వృశ్చికా జీవితా తథా. 74

పర్పటంచ గళూచీచ సగణ స్తిక్తసంజ్ఞకః | ఏవమాదీని సర్వాణి రాజా సఞ్చినుయా త్పురే. 75

అభయామలకే చోభే తథైవచ విభీతకమ్‌ | ప్రియఙ్గు ధాతకీపుష్పం మోచాఖ్యా చార్జునాసనాః. 76

అనన్తాస్త్రీ తువరికా స్యోనా కట్ఫలకం తథా | భూర్జపత్రం శిలాపత్రం పాటలా పత్రలోమకమ్‌. 77

సమఙ్గా త్రివృతా మూలకార్పాసం గైరికాఞ్జనమ్‌ | తిన్దుకం సమధూచ్ఛిష్టం కుమ్భీకా కుముదోత్పలమ్‌. 78

న్యగ్రోధోదుమ్బరాశ్వత్థ కింశుకా శ్శింశుపా శమీ | ప్రియాలపీలుకాసారి శిరీషాః పద్మకం తథా. 79

బిల్వో7గ్నిమన్థః ప్లక్షశ్చ శ్యామాకం చవకో ఘనమ్‌ | రాజాదనం కరీరంచ ధాన్యకం ప్రియకస్తథా. 80

కఙ్కోలాశోకబదరాః కదమ్బఖదిర ద్వయమ్‌ | ఏషాం పత్రాణి సారాణి మూలాని కుసుమానిచ. 81

ఏవమాదీని సర్వాణి కషాయాఖ్యో మతో రసః | ప్రయత్నేన నృపశ్రేష్ఠ రాజా సఞ్చినుయా త్పురే. 82

కీటాశ్చ మారణ యోగ్యా వ్యఙ్గతాయాం తథైవచ | వాతధూమాశ్చ మార్గాణాం దూషణాని తథైవచ. 83

ధార్యాణి పార్థివై ద్దుర్గే తాంస్తు వక్ష్యామి పార్థివ | విషాణాం ధారణం కార్యం ప్రయత్నేన మహీభుజా. 84

విచిత్రా శ్చాగదా ధార్యా విషస్య శమనా స్తథా | రక్షోభూతపిశాచఘ్నాః పాపఘ్నాః పుష్టివర్ధనాః. 85

కలావిదశ్చ పురుషా దుర్గే ధార్యాః ప్రయత్నతః | భీతా న్క్రుద్ధాన్‌ ప్రమత్తాంశ్చ తథైవచ విమానితా9.

కుభృత్యా న్పాపశీలాంశ్చ న రాజా వాసయే త్పురే |

యన్త్రాయుధాట్టాలచయోపపన్నం సమగ్రధాన్యౌషధి సమ్ప్రయుక్తమ్‌ | 87

వణిగ్జనై శ్చావృతా మావసేత దుర్గం సుగువ్తం నృపతి స్సదైవ 87u

ఇతి శ్రీమత్స్య మహాపురాణ రాజథర్మే దుర్గసమ్పత్తికథనం నామ షోడశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

ముస్తము చందనము హ్రీబేరము కృతమూలకము దారవము. హరిద్ర. నలదము-ఉశీరము-నక్తమాలము-కదం బకము-దూర్వ-పటోలము-కటుకా-దీర్ఘత్వక్‌- పత్రకము- వచా-కిరాతతిక్తము-భూనింబము-విష-అతివిష-తాళీన పత్రము-తగరము- సప్తవర్ణము-వికంకతము-కాకోదుంబరికా-దివ్యా-సురోద్భవా-షడ్గ్రంథా రోహిణి-మాంసి- పర్పటము. దంతికా - రసాం జనము- భృంగరాజము-పతంగి-పరిపేలవము-దుస్స్పర్శ- గురుణి-కామా-శ్యామాకము-గంధనాకులి-రూపవర్ణి- వ్యాఘ్రనఖము. మంజిష్ఠా- చతురంగుళ-రంభ-అంకురా-స్పీతా-తాలాస్ఫోతా-హరేణుకా-వైత్రాగ్రము వేతనము. తుంబీ- విషాణి-లోధ్రమంజరి- మాలతి-కరకృష్ణా-వృశ్చికా-జీవితా-పర్పటము-గళూ(గుడూ)చీ. ఈ మొదలగు తిక్త (చేదు) గణపదార్థములును.

అభయా-రెండుతెగల ఆమలకములు విభీతకము-ప్రియంగువు-ధాతకీ పుష్పము- మోచా-అర్జునము- ఆసనము- అనంతా-స్త్రీ-తువరికా-స్యోనాకము కట్ఫలము- భూర్జపత్త్రము-శిలాపత్రము-పాటలా-పత్త్రలోమకము-నమంగా-త్రివృతా మూలము. కార్పాసము-గైరికాంజననము-తిందుకము-తేనెమైనము-కుంభీకా-తెల్ల కలువ-నల్ల కలువ- న్యగ్రోధము-ఉదుంబరము-అశ్వత్థము-కింశుకము శింశుపా-శమీ-ప్రియాలము-పీలుకా-సారి శిరాషము-పద్మకము-బిల్వము-అగ్ని మంథము-ప్లక్షము-శ్యామాకము-వ(బ)- చఘనము- రాజాదనము-కరీరము-ధాన్యకము ప్రియకము-కంకోలము అశోకము బదరము కదంబము-రెండు జాతుల ఖదిరము ఈ చెప్పిన జాతుల-పత్త్రిములు సారములు వేళ్ళు పూవులు మొదలగు కషాయ (వగరు) గణ పదార్థములును రాజు తన రాజధానీ పురమందు సేకరించి ఉంచుకొనవలయును; ఇతరులను చంపుటకును వికలాంగులుగా విషము శమింపజేయు విచిత్రములగు రోగ బాధా నివారక ద్రవ్యములను రక్షోభూత పిశాచములను పాపములను శమింపజేయు సాధనములను పుష్టి వృద్ధికర పదార్థములను కలావిదులగు పురుషులను రాజు యత్న పూర్వకముగా తన రాజధాని యందుంచుకొనవలయును; కుభృత్యులను పాపశీలురగు జనులను భీతు(రు)లను క్రుద్ధులను ప్రమత్తులను అవమానితులగు వారిని రాజు తన పురమందుండనీయరాదు; ఇట్ల రాజెల్లప్పుడును యంత్రములు ఆయుధములు అట్టాలములు (బురుజులు) సర్వధాన్యములు సర్వౌషధౌషధులు వణిగ్జననులు నిండినదై సురక్షితమగు దుర్గమందు రాజు నివసించవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మములందు దుర్గ వ్యవస్థా విధానమను రెండు వందల పదునారవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters