Sri Matsya mahapuramu-2    Chapters   

ద్వాదశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

సావిత్ర్యుపాఖ్యానే-సావిత్రీయమ సంవాదే-సావిత్ర్యై యమదత్త

సత్యవజ్జీవిత చతుర్థ వరలాభః.

సావిత్రీ: ధర్మాధర్మవిధానజ్ఞ సర్వధర్మప్రవర్తక | త్వమేవ జగతో నాథః వ్రజాసంయమనో యమః. 1

కర్మణామనురూపేణ యస్మా ద్యమయసే ప్రజాః | తస్మా ద్వై ప్రోచ్యసే దేవ యమ ఇత్యేవ నామతః. 2

ధర్మేణమాః ప్రజా స్సర్వా యస్మా ద్రఞ్జయసే విభో | తస్మాచ్చ ధర్మరాజేతి నామ సద్భి ర్నిగద్యతే. 3

సుకృతం దుష్కృతం చోభో పురోధాయ జనా యదా |

త్వత్సకాశం మృతా యాన్తి తస్మా త్త్వం మృత్యు రుచ్యసే. 4

కాలం కలార్ధం కలయ న్త్సర్వేషాం త్వం హి తిష్ఠసి |

తస్మా త్కాలేతి తే నామ ప్రోచ్యతే తత్త్వదర్శిభిః. 5

సర్వేషా మేవ భూతానాం యస్మా ద న్తకరో మహా9 |

*మత్స్య-211 అ; శ్లో; 27. వాక్యాంతర్గత వాక్యము- "న భయం మరణం దేవ! ప్రాణినా మభయం క్వచిత్‌;" "హేదేవ! ప్రాణినాం అభయం క్వచిత్‌ (అపి) నన (విద్యతే)! మరణం (సర్వ) ప్రాణినాం (సర్వత్ర) భయం- భయహేతుః" ఇతివ్యవహితానన్యయః.

"దేవా! ప్రాణులకు అభయము అనుననది ఎచ్చటను లేదు; మరణము సర్వ ప్రాణులకును సర్వత్ర భయము కలిగించునది." అని యర్థము.

తస్మా త్త్వ మన్తకః ప్రోక్తః స్సర్వై ర్దేవై ర్మహాద్యుతే. 6

వివస్వత స్త్వం తనయః ప్రథమః పరికీర్తితః | తస్మా ద్వైవస్వతో నామ్నా సర్వలోకేషు కథ్యసే. 7

ఆయుష్యే కర్మణి క్షీణ గృహ్ణీసి ప్రాణిజీవనమ్‌ | తదా త్వం కథ్యసే లోకే సర్వప్రాణహరో7సి వై. 8

రెండు వందల పండ్రెండవ అధ్యాయము.

సావిత్రీయమ సంవాదము-సావిత్రికి యమునివలన చతుర్థవర లాభము.

సావిత్రి యమునితో ఇట్లనెను: ధర్మాధర్మ విధానమును (ధర్మము ఇటువంటిది అధర్మము ఇట్టిది అని) ఎరిగినన వాడా! సర్వ ధర్మములను ప్రవర్తిల్లజేయువాడా: జగములకు నాథుడవు (రక్షకుడవు) ప్రజా సంయమనుడవు (ఈమాటకు అర్థము వెంటనే వివరించబడును.) (అగు)టచే యముడవు నీవే; వారివారి కర్మములకు తగినట్లుగా ప్రజలను యమింతువు (అదుపులో ఉంతువు) కావునన దేవా! యముడు అను నామముతో వ్యవహరించబడుచున్నావు; విభూ! ఈ ప్రజలనందరును ధర్మముచే రంజిల్ల (ఆందింప) జేయుదువు కావున 'ధర్మరాజు' అని నిన్ను సజ్జనులందరు; మృతు లయిన జనులు తమ సుకృతమునో దుష్కృతమునో తమముందుచుకొని నీ సమీపమును చేరుదురు కావున నీకు మృత్యువు అను పేరు వచ్చినది; (మృతాః-యాంతి-ఏనం-ఇతి మృత్యుః అని వ్యుత్పత్తి; వీనిలో-మృత-య=మృత-యు=మృత్యు) కల (540 రెప్పపాటులు) దాని అంశములు మొదలగు కాలావయవ పరిమాణములతో ప్రాణిజీవితములను గణనచేయుచు కాలవ్యవస్థ నేర్పరతువు కావున నీకు కాలుడు అని పేరు. సర్వభూతములకు అంతమును కలిగించు మహా తత్త్వమవు కావున నీకు అంతకుడు అని వ్యవహారము; వివస్వంతునని (సూర్యుని) మొదటి కుమారుడవు గావునన నీవు వైవస్వతుడవు; ఆయువును ఈ జన్మపు ప్రారబ్ధ కర్మమును ముగియగనే ప్రాణులను నీ దగ్గరకు తీసుకొనెదవు కావునన నీవు సర్వప్రాణహరుడవు.

తవప్రసాదా ద్ధేవేశ! త్రయీధర్మో న నశ్యతి | తవ ప్రసాదాద్దేవేశ ధర్మే తిష్ఠంతి జంతవః. 9

తవ ప్రసాదా ద్దేవేశ సఙ్కరో నప్రజాయతే | సతాం సదా గతి ర్దేవ త్వమేవ పరికీర్తితః. 10

జగతో7స్య జగన్నాథ మర్యాదాపరిపాలక | త్రాహి మాం త్రిదశ##శ్రేష్ఠ దుఃఖితాం శరణాగతామ్‌. 11

పితరౌ చ తథా నాథ రాజపుత్త్రస్య దుఃఖితౌ |

యమః: స్తవేన భక్త్యా ధర్మజ్ఞే మయా తుష్టేనన సత్యవా9. 12

తవ భర్తా విముక్తో7సౌ లబ్ధకామా ప్రజాబలే | రాజ్యం కృత్వా త్వయా సార్ధం పత్సరాశీతి పఞ్చకమ్‌. 13

నాకపృష్ఠం తథా77రుహ్య త్యయా సహ స రంస్యతే |

త్వయి పుత్త్ర శతం చాపి సత్యవా న్జనయిష్యతి. 14

తే చాపి సర్వే రాజాననో వీర్యవన్తో7 మరోపమాః | ముఖ్యాస్తు నామ్నా పుత్త్రాస్తే భవిష్యన్తి హి శాశ్వతాః . 15

పితుశ్చ తే పుత్త్రశతం భవితా తవ మాతరి | మాళవ్యాం మాళవా నామ శాశ్వతాః పుత్త్రపౌత్త్రిణః. 16

భ్రాతర స్తే భవిష్యన్తి క్షత్త్రియా స్త్రిదశోపమాః | స్తోత్రేణానేన ధర్మజ్ఞే కల్య ఉత్థాయ యస్తు మామ్‌. 17

కీర్తయిష్యతి తస్యాపి దీర్ఘ మాయు ర్భవిష్యతి |

మత్స్యః: ఏతావదుక్త్వా భగవా నన్త్స ధర్మో విముచ్య తం రాజసుతం మహాత్మా. 18

అదర్శనం తత్ర యమో జగామ కాలేన సార్ధం సహ మృత్యునా చ. 18u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ సావిత్ర్యుపాఖ్యానే సావిత్రీయమసంవాదే సావిత్ర్యై యమ దత్తసత్యవజ్జీవితరూప చతుర్థవరలాభో నామ ద్వాదశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

దేవేశా! నీ యనుగ్రహముననే వేదత్రయ ధర్మము నశించకున్నది; ప్రాణులు ధర్మమందు నిలిచి యుందురు; ధర్మములు పరస్పరము సంకీర్ణము కాకయున్నవి; సజ్జనులకు ఎల్లప్పుడును గతినీవే; ఈ జగత్తున మర్యాదను (న్యాయ ధర్మముల హద్దునను) రక్షించు జగన్నాధుడవు నీవే; దుఃఖింతను శరణాగతను అగు నన్ను రక్షించుము; దేవశ్రేష్ఠా! ఈ రాజపుత్త్రుని తల్లిదండ్రులను నా వలెనే దుఃఖితులయియున్నారు; అనగా యముడిట్లనెను: ధర్మజ్ఞవగు అబలా! నీ భక్తితోను స్తవముతోను సంతుష్టుడనగు నేను నీ భర్తయగు సత్యవంతుని వదలితిని; నీ కోరిక నెరవేరినది కదా! నీవు వెడలి పొమ్ము; అతడు నీతోకూడి నాలుగు వందల ఏండ్లు రాజ్యమేలును; అనంతరము స్వర్గమును ఆరోహించి నీతో కూడి సుఖించును; ఇతడు నీయందు నూరుమంది పుత్త్రులను కనును; వారు వీర్యవంతులగు రాజులుగా దేవసమానులుగా నగుదురు; వారు రాజులలో ముఖ్యలును నీ పేరుతో (సావిత్రులు అని) ప్రసిద్ధులును శాశ్వతులును నగుదురు; నీ తండ్రికి నీ తల్లియగుమాళవియందు మాళవులను ప్రసిద్ధ నామముగల వారు (కీర్తిచే) శాశ్వతులు పుత్త్రపౌత్త్రవంతులునగు నూరుగురు కుమారులు కలుగుదురు; ఆ నీతమ్ములందరును దేవసములగు క్షత్రియులగుదురు; ధర్మజ్ఞా! ప్రభాతమున మేలుకాంచి ఈ స్తోత్రముతో నన్ను ఎవరు స్తుంతింతురో వారు కూడ దీర్ఘాయుష్మంతులగుదురు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్ర్యు పాఖ్యానమున సావిత్రీయమ సంవాదము. యముడు సావిత్రికి సత్యవంతుని జీవితమును జీవితమును వరముగా నిచ్చుట యను రెండు వందల పండ్రెండవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters