Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోదశోత్తర ద్విశతతమో ధ్యాయః

సావిత్య్రుపాఖ్యానే -సావిత్రీయమ సంవాదే- సావిత్య్రై యమదత్త

తృతీయ వరలాభః.

సావిత్రీ: ధర్మార్జే సురశ్రేష్ఠ కుతో గ్లానిః క్లమో థవా|

త్వత్పాదమూల సేవా చ పరమం ధర్మకారణమ్‌.1

ధర్మార్జనం సదా కార్యం పురుషేణ విజానతా| తల్లాభ స్సర్వలాభేభ్యో నిత్యమేవ విశిష్యతే. 2

ధర్మశ్చార్థశ్చ కామశ్చ త్రివర్గో జన్మః ఫలమ్‌| ధర్మహీనస్య కామార్థౌవన్ద్యాసుతనమౌ ప్రభో. 3

ధర్మాదర్థస్తతః కామో ధర్మా ల్లోకద్వయం తథా| ధర్మ ఏకో నయత్యేనం యత్ర క్వచన

గామినమ్‌. 4

శరీరేణ సమం నాశం సర్వ మన్యద్ధి గచ్ఛతి|ఏకో హి జాయతే జన్తు రేక ఏవ ప్రమీయతే. 5

ధర్మస్త మనుయాత్యేకో న సుహృన్చ బాన్ధవాః| క్రియా సౌభాగ్యం లావణ్యం సర్వం ధర్మేణ లబ్యతే.6

బ్రహ్మేన్ద్రో పేన్ద్ర శ##ర్వేన్దుయమార్కాగ్న్యనిలామ్భసామ్‌| వస్వశ్విదనదాద్యానాం యే లోకా స్సర్వ కామదాః. 7

ధర్మేణ తా నవాప్నోతి పురుషః పురుషాన్తక| మనోహరాణి ద్వీపాని వర్షాణి సుబహునిచ. 8

ప్రయాన్తి ధర్మేణ నరా స్తథైవ నరగణ్డికాః. నన్దనాదీని ముఖ్యాని దేవోద్యానాని యాని చ. 9

తాతని పుణ్యన లబ్యన్తే నాకపవృష్ఠ తథా నరైః| విమానాని విచిత్రాణి తతైవాప్సరస శ్శుభాః. 10

తైజసాని శరీరాణి సదా పుణ్యవతాం ఫలమ్‌| రాజ్యంనృపతిపూజా చ కామసిద్ధి స్తథేప్సితా. 11

సంస్కారాణి చ ముఖ్యాని ఫలం పుణ్యస్య దృశ్యతే| రుక్మవైఢూర్య వస్త్రాణి చన్ద్రాంసు

సదృశాని చ. 12

చామరాణి సురాధ్యక్ష భవన్తి శుభకర్మణామ్‌| పూర్ణేన్దుణ్డలాభాని రత్నాంశుఖచితాని చ. 13

దార్యతాం యాన్తి ఛత్రేణ నరాః పుణ్యన కర్మణా| జయశఙ్ఖస్వరౌఘేణ సూతమాగధనిస్వనైః|. 14

వరాసనం సభృఙ్గారం ఫలం పుణ్యస్య కర్మణః| వరాన్న పానగీతం చ నృత్తమాల్యానులేపనమ్‌. 15

రత్నవస్త్రాణి సకలం ఫలం పుణ్యస్య కర్మణః| రూపౌదార్య గుణోపేతా స్త్రయ శ్చాతిమనోహరాః. 16

వాసః ప్రాసాదపృష్ఠేషు భవన్తి శుభకర్మిణః| సువర్ణకిఙ్కిణీ మిశ్రచామరా పీడచారిణః. 17

వహన్తి తురగా దేవ నరః పుణ్యన కర్మణా| హేమపద్మైశ్చ మాతఙ్గై శ్చలత్పర్వసన్నిభైః. 18

ఖేలద్భిః పాదవిన్యాసై ర్యాన్తి పుణ్యన కర్మణా| సర్వకామప్రదే దేవే సర్వఘదురితాపహే. 19

వదన్తి భక్తిం పురుషా స్సదా పుణ్యన కర్మణా| తస్య ద్వారాణి యజనం తపో దానం దమః క్షమా. 20

బ్రహ్మచర్యం తథా సత్యం తీర్థానుసరణం శుభమ్‌| స్యాధ్యాయసేవా సాదూనాం సహవాస స్సురార్చనమ్‌. 21

గురూణాం చైవ శుశ్రూషా బ్రాహ్మణానాం చ పూజనమ్‌| ఇన్ద్రియాణాం జయశ్చైవ బ్రహ్మచర్య మమత్సరమ్‌. 22

రెండు వందల పదునొకండవ అధ్యాయము.

సావిత్రీ యమ సంవాదము- సావిత్రికి తృతీయ వరలాభము.

సావిత్రీ యమునితో ఇట్లనెను; సుర శ్రేష్ఠా! ధర్మార్జనము చేయుట జరుగునప్పుడు శ్రమ ఎక్కడిది? అదికాక ఇట్లు నీపాద మూల సేవనము పరమధర్మ సాధనము; విజ్ఞానమియగు పురుషుడు సదా ధర్మనార్జింటవలయును; ఈ లాభము సదా సర్వలాభము కంటెను విశిష్టమయినది; ధర్మార్థ కామములనెడు త్రివర్గ సాధనమే జన్మఫలము; ప్రభూ! ధర్మము నార్జించనివానికి అర్థకామములు రెండును గొడ్రాలి కొడుకువంటివి (ఉండనే వుండవు;) ధర్మముచే అర్ధమును దానిచే కామమును(లోకపు కోరికలను తీర్చుకొనుట) సాధ్యమగును; ధర్మముచేత (ఇహపర) లోకములు రెండును సాధించుకొన వచ్చును; జీవుడు ఎక్కడకు పోవలెనో అక్కడకు (సుఖస్థానమునకు) (అతని వెంటనుండి) తీసికొనిపోవునది ధర్మమొకటియే; ఇతరమంతయు శరీరముతో పాటే నశించును; జీవుడు తానొక్కడే పుట్టును; తానొక్కడే చచ్చును; మిత్రులు కాని బాంధవులు కాని కాక ధర్మమొకటి మాత్రము వానివెంట పోవును; తానాచరించు క్రియలలో సౌభాగ్యమును లావణ్యమును ధర్మముచేతనే లభించును; ప్రాణుల నంతమొందించు ధర్మరాజా! సర్వకామ (కోరికల) సుఖములనిచ్చు బ్రహ్మేంద్రో పేంద్ర శివచంద్ర యమ రవ్యగ్ని వాయు వరుణ వస్వశ్విదేవతా కుబేరాది దేవతల లోకములన్నియు ధర్మము చేతనే ప్రాణులకు లభించును; మనోహరములగు(జంబూప్రభృతి) ద్వీపములను (భరత వర్షాది) వర్షములను నందనాది ముఖ్య దేవ్యోద్యానమయులను స్వర్గమును నరులు నరోత్తములును కూడ పొందగలుగుట ధర్మము నాచరించుటచేతనే! హృదయాశ్చర్యకర విమానములును శుభరూపలగు అస్పరసలును పుణ్యవంతుల పుణ్యఫలమగు తైజసశరీరములును రాజ్యమును రాజపూజయు ఈప్సిత కామసిద్ధియు పుణ్యఫలమయి కనబడు ఉత్తమ సంస్కారములును బంగారుమును వైడూర్యాది రత్నములును చంద్రకిరణములు పోలు వస్త్రములును పూర్ణ చంద్రమండలమువంటివి రత్న ఖచితములునగు చామరములును సురాధ్యక్షా! శుభకర్మ కర్మాచరములతోనే లుండును; ఛత్త్రధారణము జయశబ్దములు శంఖద్వులు సూతమాగదుల స్తుతులు ఉత్తమాసనములు బంగారు జలపాత్రము ఉత్తములగు అన్నపానీయ గీత నృత్తమాల్య సుగంధాను లేపనములు రత్న వస్త్రములు రూపౌదార్యగుణయుక్తలగు అతి మనోహర స్త్రీలు ప్రాసాద శిఖరములయందు నివాసము బంగరు గజ్జేలతో మొవ్వలతో కూడ తలలపై చామరాలంకారములుకల అశ్వములపై స్వారీ చేయుట తిరుగుట బంగరు పద్మ చిహ్నములతో అలంకృతములయి ప్రకాశించునవి పర్వతములవంటివి ఒయ్యారపు పాద విన్యాసములతో నడుచునవియగు మదపుటేనుగులు వాహనములగుట- ఇంతయు ధర్మ పుణ్యకర్మ లభ్యములే; యజనము (యజ్ఞముల నాచరించుట) తపము దానము దమ (బహిరింద్రియనిగ్రహము) క్షమాగుణము బ్రహ్మచర్యము సత్యము శుభ తీర్థ(గురు ) సేవనము స్వాద్యాయ సేవనము సాధుసహవాసము దేవతార్చనము గురు శుశ్రూష బ్రాహ్మణ పూజనము -ఇంద్రియ జయము బ్రహ్మచర్యము అమత్సరము-ఇవి అన్నియు ధర్మార్జన సాధ్యములు.

తస్మాద్ధర్మ స్సదా కార్యః పురుషేణ విజానతా| నహి ప్రతీక్షతే మృత్యుః కృత మస్య న వా కృతమ్‌. 23

బాల ఏవ చరే ద్ధర్మ మనిత్యం దేవజీవితమ్‌| కోహి జానాతి కస్యాద్య మృత్యురేవాపతిష్యతి. 24

పశ్యతః పశ్య లోకస్యమరణం పురతస్థ్సితమ్‌| అమరస్యేవ తరిత మత్యాశ్చర్యం సురోత్తమ. 25

యువత్వాపేక్షయా బాలో వృద్ధత్వాపేక్షయా యువా| మృత్యోరుత్సంగ మారూఢః స్థవిరః కిమపేక్షతే. 26

తత్రాపి విన్దత స్త్రాణం మృత్యుభీతస్య కా గతిః | నభయం మరణం దేవ ప్రాణినా మభయం క్వచిత్‌. 27

తత్రాపి నిర్భయా స్సన్త స్సదా సుకృతకారిణః| యమః తుష్టో స్మితే విశాలాక్షి వచనై ర్దర్మసంయుతైః. 28

వినా సత్యవతః ప్రాణా స్వరం వరయ మా చిరమ్‌ |

సావిత్రీ: వరయామి త్వయా దత్తం పుత్రాణాం శత మౌరసమ్‌.29

అనపత్యస్య. లోకేషు గతిః కిల న విద్యతే| యమః కృతేన కామేన నివర్త భ##ద్రే భవిష్యతీదం సకలం త్వయోక్తమ్‌. 30

మమోపరోధ స్తవ చ క్లమ స్స్యా త్తథా ధునా తేన తవ బ్రవీమి. 30u

ఇతి శ్రీమత్స్య మహాపురాణ సావిత్య్రుపాఖ్యానే సావిత్రీయమసంవాదే సావిత్త్య్రె యమదత్త తృతీయ వరలాభో నామ ఏకాదశోత్తర ద్విశతతోమోధ్యాయః.

కావున విజ్ఞానవంతుడు అగు పురుషుడు (స్త్రీయయినను) ధర్మమాచరించవలయును; మనము చేయవలసినపనినని (ధర్మమును) చేసినను చేయకున్నును మృత్యువు (మనమది చేసివచ్చువరకు) ఎదురు చూడదు; ఇట్లు దేవా! జీవితమనిత్యము కావున బాలుడుగా ఉండగనే ధర్మమాచరించవలయును; ఎప్పుడు ఎవనికి మృత్యువు వచ్చి పడనేపడునో ఎవరు ఎరుగుదురు? చూడుము; చూచుచుండగే లోకముకు (ప్రాణికి) మరణము తన ముందే నిలిచియున్నది; సురోత్తమా! ఇట్టి ప్రాణులు తాము అమరులేమో యనునట్లు గర్వించుట అత్యాశ్చర్యకరముగదా! బాలుడు ¸°వనమునను-యువకుడు వార్థకమును-తనకు మరణము రావచ్చుననేమో కాని ఇపుడే చావురాదు లెమ్మనని ఆయా వయస్సులలో ధర్మమాచరించక వ్యర్థముగ గడపును; మృత్యుని ఒడిలో కూర్చుండిన నవృద్ధుడు కూడ తనన కిప్పుడిప్పుడే చావురాదు లెమ్మని ధర్మమాచరించ కుండును; కాని ప్రతివాడును చావునకు భయపడును; తాను ఎన్నటికిని* చావకుండవలయుననుకొనును; ఇక ఈ ప్రాణికి గతి ఏమి? దేవా! ప్రాణులకు అభయ స్థానము ఏదియులేదు; మరణము అందరకును భయస్థాన (కారణ)ము; ఇట్టి భయ కారణమగు మృత్యువునకు భయపడివారు పుణ్యకర్మ ఫలముగల ధర్మము నార్జించువారు మాత్రమే; అనగా ఈ సావిత్రీ వచములు విని యముడు "విశాలాక్షీ! నీ ధర్మ సంయుత వచనములతో సంతుష్టుడయితిని! సత్యవంతుని ప్రాణములను తప్ప వరమింకేదైన శీఘ్రముగా కోరుము." అనెను; "అనపత్యునకు (పురుష-సంతతి లేనివారికి) ఏ లోకములందును గతి (ప్రవేశము-సుఖప్రాప్తి) లేదందురుగదా! కావున నాకు ఔరస (కడుపున పుట్టిన) పుత్త్రశతము వరముగా మిమ్ము వేడు చున్నాను." అని సావిత్రి పలికెను; యముడును ఆ వరమంగీకరించి" కల్యాణీ! నీ కోరిక నెరవేరినది; ఇక మరలుము; నీవనినదిదియంతయు జరుగునను; ఇంకను నీవు నా వెంట వచ్చిననచో నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే ఈ మాట పలుకుచున్నాను." అనెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున సావిత్రీయమ సంవాదము- సావిత్రికి యముని వలన తృతీయవర లాభమునను రెండువందల పదునొకండవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters