Sri Matsya mahapuramu-2    Chapters   

నవో త్తర ద్విశతతమోధ్యాయః.

సావిత్య్రుపాఖ్యానే సావిత్రీ యమ సంపాదః.

శ్రీమత్స్యః తస్య పాటతః కాష్ఠ జజ్ఞే శిరసి వేదనా |

స వేదనార్త స్సఙ్గమ్యం భార్యాం వచన మబ్రవీత్‌. 1

ఆయాసేన మమానేన జాతా శిరసి వేదనా | తమశ్చ ప్రవిశామీవ న చ జానామి కిఞ్చన. 2

త్వదుత్సఙ్గే శిరః కృత్వా స్వప్తు మిచ్ఛామి సామ్ప్రతమ్‌ |

రాజపుత్త్రీ మేవ ముక్త్వా తదా సుష్వాప పార్థివః. 3

తదుత్సఙ్గే శిరః కృత్వా నిద్రయా೭೭ విలలోచనః |

సత్యవతః ప్రాణహరణార్థం సావిత్ర్యాస్సమక్షే యమాగమనమ్‌.

పతివ్రతా మహాభాగా తత స్సా రాజకన్యకా | 4

దదర్శ ధర్మరాజం తు స్వయం తం దేశ మాగతమ్‌ | నీలోత్పలదళశ్యామం పీతామ్భరధరం ప్రభుమ్‌. 5

విద్యుల్లతానిబద్ధాఙ్గం సతోయ మివ తోయదమ్‌ | కిరీటేనార్కవర్ణేన కుణ్దలాభ్యాం విరాజితమ్‌. 6

హారభారార్పితోరస్కం విచిత్రాఙ్గదభూషితమ్‌ | మహతా పరివారేణ కాలేన సహ మృత్యునా. 7

స తు సమ్ప్రాప్య తం దేశం దేహా త్సత్యవత స్తదా |

అఙ్గుష్ఠమాత్రం పురుషం పాశబద్ధ (బంధం) వశం గతమ్‌. 8

ఆకృష్య దక్షిణా మాశాం ప్రయ¸° సత్వర తదా| సావిత్య్రపి వరారోహా దృష్ట్వా తం గతజీవితమ్‌. 9

అనువవ్రాజ గచ్ఛంతం ధర్మరాజ మతన్ద్రితా | కృతాఞ్జలి రువాచాథ హదయేన ప్రవేపతా. 10

రెండు వందల తొమ్మిదవ అధ్యాయము

యముడు సత్యవంతుని సూక్ష్మ దేహము కొనిపోవుట- సావిత్రీయమ సంవాదము.

మత్స్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: కట్టెలు కొట్టు చుండగా సత్యవంతుడు తలనొప్పి వేయసాగెను; వేదనతో బాధపడుచువచ్చి అతడు భార్యతో ఇట్లు పలికెను; ఈ(కట్టెలు కొట్టిన) శ్రమతో నాకు తలనొప్పి కలిగినది; చీకటిలో ప్రవేశించు చున్నానేమో అనిపించుచున్నది; నాకేమియు తేలియుట లేదు; నీ తొడపై తలనుచి నిద్రించవలెననిపించు చున్నది; అని రాజ పుత్త్రితో చెప్పి నిద్రతో కండ్లు కూరుకొని పోవుచు ఆ రాజ కుమారుడు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిదురుంచెను; పతివ్రతయు మహాభాగయు అగు ఆ రాజపుత్త్రికి స్వయముగా తానొక్కడు మాత్రమే అచటికి వచ్చిన యముడు కనబడెను; అతడు నల్ల కలువపూరేకువలె నల్లనివాడు; పచ్చని వస్త్రము ధరించిన ప్రభవు; అతడు తన చుట్టును మెరుపు తీగలు చుట్టుకొనినదియగు నీటితో నిండిన మేఘమువలె నుండెను. రవి సమాన కాంతిగల కిరీటముతోను కుండలములతోను ప్రకాశించుచుండెను; అతని పక్షః స్థలమున బరువగు అనేక హారములును భుజములందు పలువన్నెల భుజకీర్తులునుండెను. అతనివెంట గొప్ప పరివారమును కాలుడును మృత్యువును కూడనుండిరి.

ఇట్టి ధర్మరాజు ఆ ప్రదేశమునకు వచ్చెను; సత్యవంతుని దేహమునుండి బొటనవ్రేలియంత పరిమాణముగల (సూక్ష్మదేహాత్మక) పురుషుని తీసి అతనికి (కర్మఫల రూప) పాశముతో బంధించి త్వరితముగ దక్షిణ దిక్కునకు పోయెను; ఉత్తమస్త్రీయగు సావిత్రియును తన పతి గత జీవితుడగుట చూచి ఏమియు తడవు చేయక సోమరితనము చూపక ఆ ధర్మరాజుననుసరించి పోవసాగెను; అంతట అట్లు పోవుచు దోసిలి పట్టి వణుకుచున్న హృదయముతో ఆమె ఇట్లు పలికెను.

సావిత్రీయమ సంవాదః.

ఇమం లోకం మాతృభక్త్యపితృభక్త్యాతు మధ్యమమ్‌ | గురుశుశ్రూషయా చైవ బ్రహ్మలోకం సమశ్నుతే. 11

సర్వే తస్యా೭೭దృతా ధర్మా యసై#్యతే త్రయ ఆదృతాః |

అనాదృతాస్తు యసై#్యతే సర్వా స్తస్యాఫలాః క్రియాః. 12

యావత్త్రయస్తే జీవేయు స్తావ న్నాన్యం సమాచరేత్‌ |

తేషాం చ నిత్యం శుశ్రూషాం కుర్యా త్ప్రియాహితే రతః. 13

తేషా మనుపరోధేన పారతన్త్య్రం యాదాచరేత్‌ | తత్త న్నివేదయే త్తేభ్యో మనోవచన కర్మభిః. 14

త్రిష్వప్యేతేషు కృత్యంహి పురుషస్య సమస్యతే |

యమః కృతేన కామేన నివర్తయాశు ధర్మోన తేభ్యోపి హి ఉచ్యతే చ. 15

మమోపరోధ స్తవ చ క్లమ స్స్యా త్తథాధునా తేన తవ బ్రవీమి |

గురుపూజారతి ర్భక్తా త్వం చ సాధ్వీ పతివ్రతా. 16

వినిర్తస్వ ధర్మజ్ఞే గ్లాని ర్భవతి తేధునా | సావిత్రీ వతిర్హి దైవతం స్త్రీణాం పతిరేవ పరాగతిః. 17

అనుగమ్యః స్త్రీయా సాధ్వ్యా పతిః ప్రాణధనేశ్వరః |

మితం దదాతి హి పితా మితం భ్రాతా మితం సుతః. 18

అమితస్య ప్రదాతారం భర్తారం కా న పూజయేత్‌| నీయతే యత్ర భర్తా మే స్వయం వా యత్ర గచ్ఛతి. 19

మయాపి తత్ర గన్తవ్యం యథాశక్తి సురోత్తమ | పతి మాదాయ గచ్ఛన్త మనుగన్తు మహం యదా. 20

త్వాం దేవ న హి శక్ష్యామి తదా త్యక్ష్యామి జీవితమ్‌ | మనస్వినీ తు యా కాచి ద్వైధవ్యాక్షరదూషితా. 21

ముహుర్తామపి జీవేత మణ్దనార్హా హ్యమణ్దితా| యమః పతివ్రతే మహాభాగే పరితుష్టో స్మి తే శుబే. 22

వినా సత్యవతః ప్రాణౖ ర్వరం వరయ మా చిరమ్‌ |

సావిత్రీః వినష్టచక్షుషో రాజ్యం చక్షుషా సహ కారయ. 23

చ్యుతరాజ్యస్య ధర్మజ్ఞ శ్వశురస్య మహాత్మనః |

యమః దూరం పథే గచ్ఛ నివర్త భ##ద్రే భవిష్యతీదం సకలం త్వయోక్తమ్‌. 24

మమోపరోధ స్తవ చ క్లమ స్స్యాత్తథాధునా తేన తవ బ్రవీమి. 24,

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ సావిత్య్రుపాఖ్యానే సావిత్రీయమసంవాదో నామ

ననవోత్ర ద్విశతతమోధ్యాయః

మాతృభక్తిచే ఈ (భూ)లోక సుఖములను పితృభక్తిచేత మధ్యమ (అంతరిక్ష) లోక సుఖములను గురు శుశ్రూష చేత బ్రహ్మలోక సుఖములను (జీవుడు) పొందును; ఈ మూడు భక్తి (సేవా) నియమములను ఎవరు ఆదరింతు(పాటింతు)రో వారు అన్ని ధర్మములను ఆదరించినవారే; ఎవరు ఇవి పాటించరో వారాచరించు సర్వక్రియలును నిష్పలము లగును; వీరు మువ్వురును జీవించియున్నంత వరకునను ఇతర ధర్మ సేవనమేమియు చేయ పనిలేదు; వారికి ప్రీతిని తనకు హితమును కలిగించుట యందాసక్తుడై ఎడతెగక వారి శుశ్రూష చేయుచుండవలెను; వీరి సేవాదికమునకు ఆటంకము లెకుండునట్లు ఇతర కార్యములేవయిన తాను చేసినను అవి వీరికి తెలుపుచు చేయుచుండవలెను. ఇట్లు పురుషుడు (జీవుడు) చేయు పనులన్నియు ఈ మువ్వురియందే ఇముడుచున్నవి.

అన విని యముడు (ధర్మరాజు) ఇట్లనెను; సావిత్రీ! నీకోరిక నెరవేరినదికదా! (నీవు అనినట్లు పుట్టినింట నీ తలిదండ్రులను (ప్రతిఇంట మగని తల్లితండ్రులను మగనిని - గురువులను- సేవించితివి;) ఇపుడిక మరణించినవారికి వెంట వచ్చి వారికి చేయవలసిన సేవ పరలోకమందేదియులేదు; అనియు ఇటనే ఉండి వారికి పారలౌకిక కర్మలు చేయవలెనియు శాస్త్రములందు చెప్పబడియున్నది; కనుక మరలుము; నీవిట్లు నా వెంట వచ్చుటచే నీకు శ్రమము; నాకు ఆటంకము; అందుచే నీకు ఈమాట చెప్పుచున్నాను; గురువుల (పెద్దల) పూజలందు భక్తి కలదానవు; అదికాక నీవు సరళ ప్రవర్తనము కల పతివ్రతవు; ధర్మమెరిగిన దానవుగదా నీవు! మరలుము; నీవిపుడు ఇంకను ముందునకు వచ్చనకొలదిని ఇంకను శ్రమమగుచుండును; అన సావిత్రి అతనితో ఇట్లనెను; స్త్రీలకు పతియే దైవతము; పతియే పరమగతి (కి సాధనము); సాధ్వియగు స్త్రీ పతి ననుసరించుటయే ధర్మము; పతియే స్త్రీకి తన ప్రాణమునకు ధనముకును ఈశ్వరుడు (సొంత దారుడు;) స్త్రీకి పితయు సోదరుడును సుతుడువు ఇచ్చునది కొంచెము మాత్రమే; అమితమగు (పుణ్య ధర్మ ఫలములను ) ఈయగలిగినది పతియొక్కడే; అట్టి పతిని ఏస్త్రీ పూజించకుండును? సురోత్తమా! నాపతి పరులచే ఎచటికి తీసికొని పోబడునో తాము స్వయముగానైన ఎచటికి పోవునో అచటికి నేనును యథాశక్తి (చేతనైనంతవరకు) పోవలసినదే! దేవా! నాపతిని తీసికొనిపోవుచున్న నీ వెంట నేను రాలేనపుడు నేను ప్రాణములనే వదలుదును; మనస్విని (అభిమానవతి)యగు ఏ స్త్రీయైనను వైధవ్యమునను పాపపు అక్షరములకు పాత్రమయి అలంకారములతో సౌభాగ్య లక్షణములతో ఉండవలసిన తాను ఆ అలంకారములకు దూరమై ముహూర్త కాలమయినను జీవించగలదా? అనగా ఆమెతో యముడిట్లనెను; పతివ్రతా! మహాభాగా శుభరూపా నీ విషయమున పరితుష్టుడనయితిని; సత్యవంతుని ప్రాణములుకాక మరేదైన కోరుము; శీఘ్రమే ఇత్తును; అనగా సావిత్రీ "మహాత్ముడు ధర్మజ్ఞుడుఅగు నా మామగారు రాజ్యమును కన్నులును పోయియున్నారు; వారికా రెండును వచ్చునట్లు వరమునిండు;" ఆన యముడు "శుభరూపా! నీవు చాల దూరము వచ్చితివి! వెనుకకు మరలుము; నీవడిగిన ఇదంతయు జరుగును; (ఇంకను వచ్చినచో) నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే ఇపుడిట్లు చెప్పుచున్నాను; (నా మాట వినుము)." అనెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున సావిత్య్రుపాఖ్యానమున యముడు (ధర్మరాజు) సత్యవంతుని సూక్ష్మదేహమును కొనిపోవుటయు సావిత్రీ యమసంవాదము సావిత్రికి ప్రథమవరప్రాప్తియుఅను రెండు వందల తొమ్మిదివ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters