Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టోత్తరద్విశతతమో7ధ్యాయః.

సావిత్య్రై సత్యవతో క్తవన వినోదవర్ణనమ్‌.

సత్యవా& వనే7స్మి న్పపక్షిభిః కీర్ణం సహకారం మోహరమ్‌ |

నేత్ర ఘ్రాణసుఖం వశ్య వసన్తే రతివర్ధనమ్‌. 1

వనేవ్యశోకం దృష్ట్వైనం రాగవన్తం సుపుష్పితమ్‌ | వసన్తో హనతీవాయం మామేవాయతలోచనే. 2

దక్షిణ దక్షిణ తేషాం పశ్య రమ్యాం వనస్థలీమ్‌ | పుష్పితైః కింశుకై ర్యుక్తాం

జ్వలితానలసవ్రభైః. 3

సుగన్ధి కుసుమామోదో వనరాజివినిర్గతః | కరోతి వాయు ర్దక్షిణ్య మావయోః క్లమనాశనమ్‌. 4

పశ్చిమేన విశాలాక్షి! కర్ణికారై స్సుపుష్పితైః | కాఞ్చనేన విభాత్యేషా వనరాజీ మనోహరా. 5

అతిముక్తలతాజాలరుద్ధమార్గా వనస్థలీ | రమ్యా సా చారుసర్వాఙ్గీ కుసుమోత్కరభూషణా. 6

మధుమత్తాళిఝుఙ్కారవ్యాజేన వరవర్ణిని | చాపాకృష్టిం కరోతీవ కామః పార్శ్వే జింఘాంసయా. 7

ఫలాస్వాదలసద్వక్త్రపుం స్కోకిలనినాదితా | విభాతి చారుతిలకా త్వమివైషా వనస్థలీ. 8

కోకిల శ్చూతశిఖర మఞ్జరీరేణుపిఞ్జరః | గదితై ర్వ్యక్తతాం యాతి కులీన శ్చేష్టితై రివ. 9

పుష్పరేణువిలిప్తాం ప్రియా మనుసర న్వనే| కుసుమం కుసుమం యాతి కూజ న్కామీ శిలీముఖః.10

మఞ్జరీం సహకారస్య కాన్తాచంచ్వగ్రపీడితామ్‌| స్వదతే బహుపుష్పేపి పుంస్కోకిలయువా ద్రుమే. 11

రెండు వందల ఎనిమిదవ అధ్యాయము.

సత్యవంతుడు సావిత్రికి వన సౌంద్రర్యము వర్ణించి చెప్పుట

సత్యవంతుడు ఇట్లు పలికెను: ఈ వనమునందు పక్షులతో వ్యాప్తమును నయనములకును ముక్కులకును సుఖకరమును వసంత ఋతువునందు ఆ నంద వర్ధకమునునగు మనోహరమయినతీయమామిడి చెట్టును చూడుము; విశాల లోచనా! ఇందు (చిగురాకులచే) ఎర్రదనము కలదియు చక్కగ పూచినదియు అగు ఈ అశోక వృక్షము చూడగా వసంతుడు నన్ను చూచి నవ్వు చున్నాడేమో అన్నట్లున్నది; దక్షిణ (అనురాగ) భావము కలదానా! ఈ దక్షిణ దిశ యందు ప్రజ్వలించు అగ్నితో సమానకాంతిగల పూచిన మోదుగలతో రమ్యమగు ఈ వనస్థలిని చూడుము; సువాసనకల పూలవాసనతో నిండినదియు వనశ్రేణి నుండి వెలివడినదియు అగు వాయువు మనపై దాక్షిణ్యము చూపుచు శ్రమ పోగొట్టు చున్నది; విశాలనేత్రా! ఈ పడమటి దిశలో చక్కగా పూచిన కర్ణికార వృక్షములతో మనోహరమగు ఈ వన శ్రేణి బంగారుతో అలంకరించబడినట్లు ప్రకాశించుచున్నది; అతిముక్త లతా సమాహముతో ఆక్రమించబడిన మార్గము కలదయి ఈ వనస్థలి మనోహర సర్వాంగీ! కుసుమ సమూహముతో అలంకరించబడినదో యనునట్లు కనబడుచున్నది; తేనెత్రావి మత్తెక్కిన తుమ్మెదల ఝుంకారమను మిషతో కాముడు హింసాదృష్టితో ఈ దగ్గరలోనుండి చాపమును ఎక్కుపెట్టి లాగుచున్నాడో యనునట్లున్నది; పండ్ల (రసము)ను ఆస్వాదించుటచే ప్రకాశించు నోరుగల గండు కోయిలల నాదముతో నిండిన ఈ వనస్థలి అందమైన తిలక వృక్షములు కలదగుటచే అందమగు తిలకముతో అలంకృతవగు నిన్ను పోలియున్నది. మామిడి కొమ్మకొనపై ఈ కోకిల పుష్పమంజరుల పరాగముతో పింజర (తెలుపు ఎరుపు కలిసిన) వర్ణముకలదై ఉండియు ఉత్తమ వంశమున పుట్టినవాడు తన కార్యములతోవలె ఇది తన కూతలతో తాను ఇదియని స్పష్టముగా తెలియుచున్నది ; తుమ్మెద పుష్పరేణువులు ఒడలినిండిన పులిమి కొనిన తన ప్రియురాలిని వెంటనంటుచు ఝుంకారముచేయుచు పూవు పూవునకు తిరుగుచున్నది; మామిడిచెట్టున పూవులు చాల ఉన్నను పడుచు గండుకోయిల తన ప్రియురాలు ముక్కుతో పొడిచిన మామిడి పూగుత్తినే ఆస్వాదించుచున్నది.

కాకః ప్రసూతాం వృక్షాగ్రే స్వా మేకాగ్రేణ చఞ్చనా |

కాకీం సమ్భావయత్యేష పక్షాచ్ఛాదితపుత్త్రికామ్‌. 12

భూభాగం చ సమాసాద్య దయుతాసహితో యువా| నాహారమపి చాదత్తే కామాక్రాన్తః కపిఞ్జలః. 13

కలవిఙ్కస్తు రమయ న్ప్రియోత్సఙ్గం సమాశ్రితః | ముహుర్ముహు ర్విశాలాక్షి ఉత్కణ్ఠయతి కామినః. 14

క్షుద్రశాఖాం సమారూఢ శ్సుకోయం సహ కాన్తయా | భ##రేణ లమ్బయ ఞ్ఛాఖాం కరోతి సకలాం గిరిమ్‌. 15

వనేత్ర పిశితాస్వాద తృప్తో నిద్రా ముపాగతః | శేతే సింహయువా కాన్తాచరణాన్తరగామినీ. 16

వ్యాఘ్రయో ర్మిథునం పశ్య శైలకన్దరసంస్థితమ్‌ | యయో ర్నేత్రప్రభాలోకే గుహా భిన్నేవ లక్ష్యతే. 17

అయం ద్వీపీ ప్రియాం లేఢి జిహ్వాగ్రేమ పునః పునః |

ప్రీతిమాయాతి మాహతీం లిహ్యామాన స్స్వకాన్తయా. 18

ఉత్సఙ్గకృతమూర్ధానం నిద్రాపహృతచేతనమ్‌ | జన్తూద్ధరణతః కాన్తం సుఖయత్యేవ వానరీ. 19

భూమౌ నివతితాం కాన్తాం మార్జారో దర్శితోదరీమ్‌| నఖై ర్దన్తైస్తుదత్యేష నచ పీడయతే యథా. 20

శశక శ్శశకీ చైతౌ సంసుస్తే పీడితే ఇమే | సంలీనగాత్రే చరణ కర్ణైర్వ్యక్తి ముపాగతే. 21

స్నాత్వా సరసి పద్మాఢ్యే నాగస్తు మదనప్రియః | సమ్భావయతి తన్వఙ్గీం మృణాళకబళైః ప్రియామ్‌. 22

కాన్తప్రోథసముత్థానైః కాన్తమార్గానుగామినీ | కరోతి కబళం ముసై#్త ర్వారాహీ పోతకానుగా. 23

దృఢాఙ్గసన్ధి ర్మహిషః కర్దమాక్తతను ర్వనే | అనువ్రజతి ధావన్తీం ప్రియా ముద్ధత ముత్సుకః. 24

ఆ చెట్టు కొనపై మగకాకి ప్రసవించి తన శిశువును రెక్కలతో కప్పిపెట్టుకొని యున్న తన ప్రియురాలిని తన ముక్కుకొనతో స్పృశించి ఆదరించుచున్నది. కామ పరవశమగు పడుచుకపింజల పక్షి తన ప్రియురాలితో కూడి భూభాగమును చేరి ఆహారమును కూడ తినకున్నది; కలవింక పక్షి ప్రియురాలి ఒడిలోచేరి ఆమెను మాటి మాటికి ఆనంద పెట్టుచు కాముకులను రెచ్చగొట్టుచున్నది. ఈ చిలుక తన ప్రియతో కూడి రెమ్మపై కూర్చిండి త బరువుతో ఆ రెమ్మ వంగుచుండ అవ్యక్తమును మధురమును అగు పలుకులు పలుకుచున్నది.

(ఇంతవరకు పక్షుల విహరణపు వర్ణనమయినది. ఇకమీట మృగముల విహరణపు వర్ణనము) ఇదుగో! అడవిలో ఇటు చూడుము. సింహము మాంసమును ఆస్వాదించి తృప్తినంది నిదురించుచున్నది; దాని ప్రియురాలు తన ప్రియుని కాళ్ళనడుమ పండుకొని యున్నది; పర్వత కందరపు నడుమ చూడుము; పులి దంపతులు ఉన్న వి; వాని కనుల వెలుగులో గుహ చీలెనో అనునట్లు కనబడుచున్నది; ఇదిగో: ఈ చిరుతపులి మాటి మాటికి నాలుకకొనతో తన ప్రియను నాకుచున్నది; తన ప్రియురాలుకూడ తను నాకుచుండ చాల ఆనందపడుచున్నది; ఈ ఆడుకోతి తన తొడపై తవపెట్టుకొని మైమరచి నిద్రించుచున్న మగకోతి పేలు తీసివేయుచు తన ప్రియునకు హాయిగొలుపుచున్నది. నేలపై వెలకిల పండుకొని యున్న ఆడుపిల్లికి నొప్పికలుగకుండగే దానిని తన గోళ్ళతో దంతములతో నొక్కుచు (హాయి గొలుపుచు)న్నది. ఈ ఆడు మగ చెవుల పిల్లులు తమ కాళ్ళనడుమ ఒడలుముడిచికొని నిద్రించుచుండ అవి కనబడకున్నను వాటి చెవులను బట్టి మాత్రము అవి ఇవి అని తెలియుచున్నది; కామాతురమగు ఈ మగ ఏనుగు తామరపూలతో నిండిన సరస్సునందు తన ప్రియురాలికి తామరతూడులతునుకలు తినుట కందించుచు ఆదరించుచున్నది; ఆడు అడవి పంది తన పిల్లలు తన వెంట వచ్చుచుండ తన ప్రియుని అనుసరించుచు అందమగు ముట్టెతో త్రవ్వి ఎత్తిన ముస్తెలను తినుచున్నది. దృఢదేహసంధులు కల అడవిదున్న ఇదిగో! ఈ అడవిలో బురద నిండిన ఒడలితో నుండినదై ఎంతో ఆస క్తితోను పొగరుగాను తన ప్రియురాలు పరుగెత్తి పోవుచున్నను దాని వెంటనంటి పోవుచున్నది.

పశ్య తార్వఙ్గి సారఙ్గం త్వం కటాక్ష విభావనైః | సభార్యం మాం హి పశ్యన్తం కౌతుహల సమన్వితమ్‌. 25

పశ్య పశ్చిమపాదేన రోహీ కణ్డూయతే ముఖమ్‌ | స్నేహార్ద్రభావా త్కర్షన్తీ భర్తారం శృఙ్గకోటినా. 26

ద్రాగిమాం చమరీం పశ్య సితవాలా మగచ్ఛతీమ్‌ | అన్వాస్తే చమరః కామీ మాం చ పశ్యతి గర్వితః. 27

ఆతపే గవయం పశ్య ప్రహృష్టం భార్యయా సహ | రోమన్థనం ప్రకుర్వాణం కాకం కకుది వారయ&.28

పశ్యాజం భార్యయా సార్థం న్యస్తాగ్రచరమ ద్వయమ్‌ | విపులే బదరీస్కన్ధే బదరాశనకామ్యయా. 29

హంసం సభార్యం సరసి విచిర న్తం సునిర్మలే | సుముక్తస్యేన్దుబిమ్బస్య పశ్య వై శ్రియ ముద్వహ&. 30

సభార్య శ్చక్రవాకోయం కమలాకరమధ్యగః | కరోతి పద్మినీం కాన్తాం సుపుష్పామివ సున్దరి.31

మయా ఫలోచ్చయ స్సుభ్రూ స్త్వయా పుష్పోచ్చయః కృతః |

ఇన్దం న కృతం సుభ్రూస్తత్కరిష్యామి సామ్ప్రతమ్‌. 32

త్వమస్య సరస స్తీరే ద్రుమచ్ఛాయాం సమాశ్రితా | క్షణమాత్రం ప్రతీక్షస్వ విశ్రమస్వచ భామిని. 33

సావిత్రీః ఏవ మేత త్కరిష్యామి మమ దృష్టిపథ స్త్వయా |

దూరం కాన్త న గన్తవ్యం బిభేమి గహనే వనే. 34

మత్స్యః తత స్స కాష్ఠాని చకార తస్మి న్వనే తదా రాజసుతాసమక్షమ్‌ |

తస్యా హ్యదూరే సరసశ్చ తస్య మేనే చ సా తం మృతమేవ రామా. 35

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ సావిత్ర్యుపాఖ్యానే సావిత్య్రై సత్యవతో క్తవన వినోదవర్ణనం నామ అష్టోత్తర ద్విశతతమోధ్యాయః.

మనోహరాంగీ! కుతూహలముతో తన వైపు చూచు నన్నును నా భార్యనగు నిన్నును ఈ సారంగము చూచు చున్నది; నీవు కూడ గట్టిగ చూచినచో బెదరునేమో! నీవు దానిని నీకడగంట చూడుము; ఇటుచూడుము; ఆడు రోహి మృగము వెనుక కాలితో తన మొగమును గోకి కొనుచున్నది; అదే సమయములో అది తన హృదయమందలి స్నేహార్ద్ర భావముతో తనకొమ్ము కొనతో తన భర్తను దగ్గరకు లాగికొనుచున్నది. నడువక కదలక కూర్చున్న చమరీ (ఆడు చమర) మృగమును త్వరగ చూడుము; దాని తోక కుచ్చుకాని రోమ సమూహముకాని ఎంత తెల్లగ నున్నదో! మగ చమరము కాముకమయి తన ప్రియురాలి నంటి పెట్టుకొని యుండి ఠీవిగా నన్ను చూచుచున్నది. ఎండలో ఆగవయమును చూడుము; నెమరు వేయుచు తన మూపురముపైనున్న కాకిని తోలుకొనుచు తన భార్యతో కూడి సంతోషముగా నున్నది; రేగు ఆకులు తినదలచి ఆ చెట్టు పెనుగొమ్మపై ముందలి రెండు కాళ్లుంచిన అడవి గొర్రె పొట్టేలును దాని భార్యను చూడుము; (జల పక్షుల వర్ణనము): చక్కని ముత్తెములతో అలంకృతమయిన చంద్రబింబపు శోభతో నుండి అతి నిర్మలమగు సరస్సునందు సంచరించుచున్న ఆహంస దంపతులను చూడుము; సుందరీ! అటుచూడుము; తన భార్యతోకూడి నరో మధ్యమందుండిన చక్ర వాక పక్షిని చూడుము; అది ఈ పద్మ సరస్సునకు చక్కని పూలతో అలంకరించుకొనిన సుందరికి ఉండు అందమును సంతరించుచున్నది; సరియే కాని- సుందరీ! ఇంతవరకు నేను పండ్లు ప్రోవుచేయగా నీవు పూలు సేకరించితివి; కాని కాష్ఠములు ప్రోవు చేయుట కాలేదు; ఇపుడిక ఆ పని చేయుదును; భామినీ! నీవు అంతలో ఒక క్షణ కాలము ఈ నర స్తట మందలి చెట్టు నీడను ఆశ్రయించివి శ్రాంతి తీసికొనుచు నా కొరకు ఎదురుచూచు ఉండుము; అంతలో నేను వత్తును; అనిన సత్యవంతుని మాటలు విని సావిత్రి - సరే; నీవు చెప్పినట్లే చేయుదును; కానిమ్ము ; ప్రియా! నీవు మాత్రము నాదృష్టి పథమునుండి దూరముగా పోవలదు; ఈ కారడవిలో నాకు భయమగును;" అనెను; అంతట సత్యవంతుడును ఆ రాజ పుత్త్రికి దూరము కాకుండగనే ఆ సరస్సునకు దగ్గరలోనే అడవిలో కట్టెలు సేకరించ సాగెను. కాని ఆమె మాత్రము తన పతి మరణించినట్లే తలచెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మనుమత్స్య సంవాదమున సావిత్య్రుపాఖ్యానమున సత్యవంతుడు సావిత్రికి వన సౌందర్యమును వర్ణించి చెప్పుట అను రెండు వందల

ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters