Sri Matsya mahapuramu-2    Chapters   

చతురు త్తరద్విశతతమోధ్యాయః.

ఉభయతోముఖీగోదానమ్‌.

మనుః ప్రసూయామానా దాతవ్యా ధేను ర్బ్రాహ్మణపుఙ్గవే |

విధినా కేన ధర్మజ్ఞ దానం దద్యాచ్చ కిం ఫలమ్‌. 1

మత్స్యః రుక్మశృఙ్గీం రూప్యకురాం ముక్తాలాఙ్గూలభూషితామ్‌ |

కాంస్యోపదోహనీం రాజ రాజ న్త్సవత్సాం ద్విజపుఙ్గవే. 2

ప్రసూయామానాం గాం దత్వా మహాత్పుణ్యఫలం లబేత్‌ |

యావద్వతో యోనిగతో యావద్గర్భం న ముఞ్చతి. 3

తావద్గౌః వృథివీ జ్ఞేయా సశైలవనకానా | ప్రసూయమానాం యో దద్యా ద్ధేనుం ద్రవిణసంయూతామ్‌. 4

ససముద్రగుహా తేన సశైలవనకాననా| చతురన్తా భ##వేద్ధత్తా పృథివీ నాత్ర సంశయః.5

యావన్తి ధేనురోమాణి వత్సస్య చ నరాధిప | తావత్సఙ్ఖ్యం యుగగణం దేవలోకే మహీయత్‌. 6

పితౄన్పితామహాం శ్చైవ తథైవ ప్రపితామహా &| ఉద్ధరేచ్ఛ న సన్దేహో నరకా ధ్భూరిదక్షిణః. 7

ఘృతక్షీరవహా నద్యో దధిపాయసర్ధమాః | యత్ర తత్ర గతిస్తస్య ద్రుమా

శ్చేప్సితకామదాః. 8

గోలోక స్సులభ స్తస్య బ్రహ్మలోకశ్చ పార్థివ |

స్త్రియశ్చ తత్రేన్దు సమానవక్త్రాః వ్రత ప్తజామ్భూనదతుల్యరూపాః |

మాహానితమ్భా న్తనువృత్తమద్యా భజన్త్యజస్రం నళినాభ##నేత్రాః. 9

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ఉభయతోముఖీగో ప్రదానికో నామ

చతురుత్తరద్విశతతమోధ్యాయః.

రెండు వందల నాలుగవ అధ్యాయము.

ఉభయతో ముఖీ గోదానము.

మనువు మత్స్యుని ఇట్లడిగెను: అపుడే ఈనుచున్న ధేనువును బ్రాహ్మణోత్తమునకు దానము చేయవలసి విధానమును దాన ఫలమును ధర్మజ్ఞా! తెలుపవేడెదను. అనగా నారాయణుడిట్లు తెలిపెను: ప్రసవించుచున్న ధేనువును బంగరు కొమ్ములతో వెండిగిట్టలతో ముత్తెముల తోకతో కంచుతో చేసి పాలు పిదుకు పాత్రలతో ఆ దూడతో కూడ బ్రాహ్మణ పుంగవునకు దానమిచ్చినచో మహాపుణ్యఫలము లభించును. దూడ యోనియందే యుండి ఇంకను గర్భమును విడువనంతవరకు ఆ ప్రసవించు గోవు పర్వతవన కాననాదులతో కూడిన సర్వ పృథివితో సమాన. ఇట్టి ధేనువును ధనముతో కూడ దానము చేయుట సర్వ సముద్ర శైల తద్గుహావన కానన సహితమయి చతురంత (నాలుగు సముద్రములు హద్దుగాగల) భూమిని దానము చేయుటలో సమానము. దానిచే ఆ దూడ కెన్ని రోమములుండునో అన్ని మహాయుగములు దాత దేవలోకమందుండును. భూరి దక్షిణలతో ఈ ప్రసూయమాన ధేను దానము చేసినచో వా%ి పితృ పితామహ ప్రపితా మహులు నరకమునుండి తరింతురు. అతడు వెళ్ళిన చోటనెల్ల నేయియు పాలును చిక్కని పెరుగును పాయసమును ప్రవహించు నదులను కోరికల నొసగు వృక్షములును లభించుచుండును. దాతకు గోలోక బ్రహ్మలోకములు ప్రాప్తించును. వానికచట నెల్ల ఇందు సమాన ముఖములును కాచిన బంగారువంటి దేహచ్ఛాయయు విశాలములగు పిరుదులును సన్నని గుండ్రని నడుములును పద్మములవంటి నేత్రములును గల స్త్రీలును లభింతురు. (ఈనుచున్న ఆవునకు వెనుక నుండి దూడ ముఖముడుటచేతను అవి రెండును ఒకటిగా ఉండుట చేతను ఈ గోవు ఉభయతో ముఖీ =రెండు వైపుల ముఖముగలది)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఉభయతో ముఖీ గోదానమను

రెండువందల నాలుగవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters