Sri Matsya mahapuramu-2    Chapters   

త్యుత్తరద్విశతతమోధ్యాయః.

పితృగాథా.

మత్స్యః ఏతద్వంశభవా విప్రా శ్శ్రాద్ధే భోజ్యాః ప్రయత్నతః |

పితృణాం వల్లభం యస్మా త్తేషు శ్రాద్ధం నరాధిప.1

అతఃపరం ప్రవక్ష్యామి పితృభిర్యాః ప్రకీర్తితాః | గాథాః పార్థివశార్దూల కామవద్భిః పురే స్వకే. 2

అపి స్యా త్సకులేస్మాకం యో నో దద్యా జ్జలాఞ్జలిమ్‌| నదీషు బహుతోయాసు శీతలాసు విశేషతః. 3

అపి స్యాత్స కులేస్మాకం తిలమిశ్రం జలాఞ్జిలిమ్‌ |

తిలమాక్షికసంయుక్తం యో నో దద్యా త్సమాహితః. 4

అపి స్యా త్స కులేస్మాకం య శ్శ్రాద్ధం నిత్య మాచరేత్‌ |

పయోమూలఫలై ర్భక్ష్యైస్తిలతోయేన వా పునః. 5

అపి స్యా త్స కులే స్మాకం ఖడ్గమాంసేన య స్సకృత్‌ |

శ్రాద్ధం కుర్యా త్ప్రయేత్నేన కాలసాకేన వా పునః. 6

అపి స్యా త్స కులేస్మాకం యో నో దద్యా త్త్రయోదశీమ్‌ |

పాయసం మధు సర్పిర్భ్యాం వర్షసుచ మఘాసుచ. 7

కాలశాకం మహాశాకం మధు మున్యన్న మేవచ| విషాణ వర్జ్యా యే ఖడ్గా అసూర్యం

తదశీమహి. 8

గయాయాం దర్శనే రాహోః ఖడ్గమాం సేన యోగినామ్‌ |

భోజయేచ్ఛ కులే స్మాకం చాయాయాం కుఞ్జరస్యచ. 9

ఆకల్పకాలికీ తృప్తి స్తేనాస్మాకం భవిష్యతి| దాతా సర్వేషు లోకేషు కామచారో భవిష్యతి. 10

ఆభూతసవ్ల్పువం కాలం నాత్ర కార్యా విచారణా | యదేత త్సకలం తస్మా దేకేనాపి చ సర్వదా. 11

తృప్తిం ప్రాప్స్యామ చానన్త్యాం కిం పున స్సర్వమేవహి|

రెండు వందల మూడవ అధ్యాయము.

పితృగాథా వర్ణనము.

మత్స్యుడు మనువుకు ఇట్లు చెప్పెను: ఈ చెప్పి ఋషివంశములందు జనించి విప్రులయందు శ్రాద్ధము జరుపుట పితృప్రీతిరకము; శ్రాద్ధములందు ఈ ఋషిగోత్రములందు జనించిన వారిని భోక్తలనుగా నియమించవలయును. ఇక ఇపుడు పూర్వము స్వపుర (స్వలోక) మందుండి పితరులీ విషయమున కీర్తించిన గాథలను వినిపింతును.

సుశీతల బహుతోయములగు నదులయందు మాకు జలాంజలి నిచ్చువాడును సమాహిత చిత్తుడై తేనెతో నూవు లతో కూడిన జలాంజలి నిచ్చువాడును పాలు- మూలములు ఫలములు భక్ష్యములు తిలజలము ఖడ్గమృగ మాంసము కాలశాకము త్రయోదశినాడు తేనెతో నేతితో పాయసము వర్షఋతువు నందు మఘానక్షత్ర దినమందు కాలశాక (బలుసుకూర) మహాశాకము (పెరుగు తోటకూర) లు తేనె నీవారన్నములు కొమ్ములు లేని ఖడ్గమృగముల మాంసము గ్రహణకాలమున గయయందు యోగులకు (తద్రూపులగు పితరులకు)ఖడ్గమాంసము గజచ్చాయాదినమందు మాంసము వీనితో శ్రాద్ధము జరుపు వాడు మాకులమందు జనించి ఎంతయో బాగుగనుండును. ఇట్టి శ్రాద్ధము వలన మాకు కల్పాంతము పరకును తృప్తి కలుగుననిన అన్నిటితో చేసిన దానివలన ఇంకెంత తృప్తి కలుగునో చెప్పవలయునా ?

అపి స్యా త్స కులేస్మాకం దద్యా త్కృష్ణాజినం చ యః. 12

అపి స్యా త్స కులేస్మాకం కశ్చి త్పురుషసత్తమః|

ప్రసూయమానాం యో ధేనుం దద్యా ద్బ్రాహ్మణపుఙ్గవే. 13

అపి స్యా త్సు కులేస్మాకం వృషభం య స్సముత్సృజేత్‌ |

సర్వవర్ణం విశేషేణ శుక్లనీలం వృషం తథా. 14

అపి స్యా త్సు కులేస్మాకం యః కుర్యా చ్ఛ్రద్ధయా న్వితః |

సువర్ణదానం గోదానం పృథవీ దాన మేవ చ .15

అపి స్యా త్సు కులేస్మాకం కశ్చి త్పురుషసత్తమః| కూరాపామ తటాకానాం వాపీనాం యశ్చ కారకః. 16

అపి స్యా త్సు కులేస్మాకం సర్వభావేన యో హరిమ్‌ |

ప్రయాతి శరణం విష్ణుం దేవేశం మధుసూదనమ్‌. 17

అపి న స్స కులే భూయా త్కశ్చి ద్విద్వా న్విచక్షణః |

ధర్మశాస్త్రాణి యో దద్యా ద్విధినా విదుషామపి. 18

ఏతావదుక్తం తవ భూమిపాల శ్రాద్ధస్య కల్పం మునిసమ్ప్రదిష్టమ్‌|

పాపాపహం పుణ్యవివర్ధం చ లోకేషు ముఖ్యత్వకరం తథైవ. 19

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ పితృగాథానుకీర్తనే శ్రాద్ధకల్పకథనం నామ

త్య్రుత్తర ద్విశతతమో ధ్యాయః.

కృష్ణాజినమును గాని ప్రసవించు ధేనువునుగాని దానమిచ్చు వాడును వృషోత్సర్గము చేయువాడును శ్రద్ధతో సువర్ణదానగోదాన పృథివీ దానములు చేయువాడును కూపారామ తటాక వాపీ ప్రతిష్ఠలు చేయువాడును సర్వభావముతో విష్ణువు (సర్వాంతర్యామి) దేవేశుడు, మధుసూదనుడునగు హరిని శరణు వేడువాడును విద్వాంసుడు విచక్షుణుడు (వివేకి) ధర్మ శాస్త్రములను యథావిధిగా విద్వాంసులకు దానమొనగు వాడును

మావంశమునందు జనించివలయును. అని పితరులు గానము చేసిరి. మనురాజా!

ఇది మునులు ఉపదేశించిన శ్రాద్ధకల్పము - పాపహరము; పుణ్యవర్ధనము; లోకములయందు ప్రధానత్వమును కలిగించును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున పితృగాథను కీర్తనము శ్రాద్ధ కల్పము అను

రెండు వందల మూడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters