Sri Matsya mahapuramu-2    Chapters   

ద్వ్యుత్తరద్విశతతమో ధ్యాయః.

ధర్మామకఋషివంశవివరణమ్‌.

మత్స్యః అస్మి న్వైవస్వతే ప్రాప్తే శృణు ధర్మస్య పార్థివ|

దాక్షాయణీభ్య స్సకలం వంశం దైవత ముత్తమమ్‌. 1

పర్వతాదిమహాదుర్గశరీరాణి నరాధిప | అరున్ధత్యాః ప్రసూతాని ధర్మ ద్వైవస్వతే న్తరే.2

అఎ్టౌచ వసవః పుత్త్రాస్సోమపాశ్చ వసో స్తథా| ధ్రువో ధరశ్చ సోమశ్చ ఆపశ్చైవానలోనిలః. 3

ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో7ష్టౌ ప్రకీర్తితాః| ధరస్య పుత్త్రో ద్రవిణః కాలః పుత్త్రో ధ్రువస్యచ. 4

కాలస్యావయవానాంతు శరీరాణినరాధిప | మూర్తిమన్తిచ కాలాద్ధి సమ్ప్ర సూతా న్యశేషతః. 5

సోమస్య భగవా న్వర్చా శ్శ్రీమాం శ్చాపస్య కీర్త్యతే | అనేక జన్మ జననః కుమారస్యానలస్యతు. 6

పురోజవా శ్చానిలస్య ప్రత్యుషస్య తు దేవలః| విశ్వకర్మా ప్రబాసస్య త్రిదశానాం స వర్ధకిః. 7

యమీసుతా ఇతి ప్రోక్తా నాగవీథ్యాదయో నవ| గ్రహరాక్షణాంచ సర్వేషా మన్యేషాం చామితౌజసామ్‌. 8

లమ్భాపుత్త్రస్స్మృతో ఘోషో భానోః పుత్త్రా స్సుభానవః |

మరుత్వత్యాం మరుత్వన్త స్సర్వే పుత్త్రాః ప్రకీర్తితాః. 9

సఙ్కల్పాయాశ్చ సఙ్కల్పా స్తథా పుత్త్రాః ప్రకీర్తితాః |

ముహుర్తాస్తు ముహుర్తాయా స్సాధ్యా స్సాద్యా సుతా మతాః. 10

మనో మనుశ్చ ప్రాణశ్చ నరో జాతశ్చ వీర్యవా& | చిత్తహార్యోయనశ్చైవ హంసో నారాయణ స్తథా. 11

విభుశ్చాపి ప్రభుశ్చైవ సాధ్యా ద్వాదశకీర్తితాః | విశ్వాయాశ్చ తథా పుత్త్రా విశ్వేదేవాః ప్రకీ ర్తితాః.12

క్రతు ర్ధక్షో వసు స్సత్యః కాలః కామోదితి స్తథా| కురజో మనుజో విశ్వో రోచమానశ్చ తేదశ. 13

ఏతావదుక్త స్తవ ధర్మవంశ స్సఙేక్షపతః పార్థివవంశముఖ్య|

వ్యాసేన వక్తుం న హి శక్తి రస్తి రాజ న్వినా వర్షశ##తై రనేకైః. 14

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ ధర్మ వంశ వివరణం నామ ద్వ్యుత్తర ద్విశతతమోధ్యాయః.

రెండు వందల రెండవ అధ్యాయము.

ధర్మ నామకఋషి వంశవివరణము.

మత్స్య జనార్ధనుడు మనువుతో ఇట్లు చెప్పెను. ఈ వై వస్వతమన్వంతరము వచ్చిన మీదట ధర్ముడనునతనికి దక్ష పుత్త్రికలయందు సకల దైవతవంశమును ఉత్పన్నమయ్యెను. వారిలో ఆరుంధతియందు 1. సకల పర్వతాది మహాదుర్గ ప్రదేశముల దేవతాత్మతత్త్వములును జనించెను. సోమపాయులు (సోమ పానము చేయు యోగ్యతకల) వసువులు ఎనిమిది మంది 2. వసువను నామెయందు జనించిరి. వారు ధ్రువుడు ధరుడు సోముడు ఆపుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రబాసుడు; ధరునకు ద్రవిణుడు ధ్రువునకు కాలుడు సుతులు కాలావయవశరీరములన్నియు మూర్తిమంతములై కాలు నకు జనించెను. సోమునకు వర్చుడు ఆపునకు శ్రీమాన్‌ అనలునకు (శివుని నుండి గంగ నుండి శరన్తంబము నుండి కృత్తికల నుండి) అనేక జన్మముల తరువాత పుట్టిన కుమారస్వామి అనిలునకు పురోజవుడు ప్రత్యుషునకు దేవలుడు ప్రభాసునకు దేవతల వడ్లంగియగు విశ్వకర్మ జనించిరి. 3. యమి అను నామెయందు నాగవీథి మొదలగునవి జనించెను. వీరు గ్రహననక్షత్రాది జ్యోతిర్గణముల శ్రేణులు; 4. లంబ అనునామె యందు ఘోషులు అనువారు కలిగిరి 5. భానువను నామెయందు భానువులు కలిగిరి. 6. మరుత్వతి యందు మరుత్వంతులను వారు కలిగిరి. 7. సంకల్పయందు సంకల్పులు 8. ముహూర్తయందు ముహుర్తములు 9. సాధ్యయందు మనువు ప్రాణుడు నరుడు జాతుడు వీర్యవంతుడు చిత్తహార్యుడు అయనుడు హంసుడు నారాయణుడు విభువు ప్రభువు అను పండ్రెండు మంది సాధ్యులు కలిగిరి. 10. విశ్వ అను ధర్ముని పత్నియందు క్రతువు దక్షుడు వసుడు సత్యుడు కాలుడు కాముడు అతిథి కురజుడు మనుజుడు విశ్వుడు రోచమానుడు అను పదిమంది విశ్వేదేవులు కలిగిరి. రాజముఖ్యా! నీకిట్లు ధర్ముని వంశమును సంక్షేవముగా తెలిపితిని. విస్తరించి చెప్పుట అనేక శతవర్షముల కాలమున తప్ప శక్యము కాదు.

ఇది శ్రీమత్స్యమహాపురాణము నందు ధర్మవంశాను కీర్తనమను

రెండు వందల రెండవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters