Sri Matsya mahapuramu-2    Chapters   

ద్విశతతమోధ్యాయః.

వసిష్ఠనిమి చరిత్రమ్‌.

శ్రీమత్స్య: వసిష్ఠస్తు మహాతేజా నిమేః పూర్వపురోహితః |

బభూవః పార్థివ శ్రేష్ఠ యజ్ఞా స్తస్య సమన్తతః. 1

శ్రాన్తాత్మా పార్థివశ్రేష్ఠ విశశ్రామ తథా గురుః | తం గత్వా పార్థివశ్రేష్ఠో నిమి ర్వచన మబ్రవీత్‌. 2

భగవ న్యష్టు మిచ్చామి తన్మాం యాజయ మాచిరమ్‌ | త మువాచ మహాతేజా వసిష్ఠః పార్థివోత్తమమ్‌. 3

కఞ్చిత్కాలం ప్రతీక్షస్వ తవ యజ్ఞై స్సుంస్కృతైః|

భృశం శ్రాన్తోస్మి విశ్రమ్య యాజయిషామి తే నృప. 4

ఏవముక్తః ప్రత్యువాచ వసిష్ఠం నృపసత్తమః | పారలౌకిక కార్యేషు కః ప్రతీక్షితు ముత్సహేత్‌. 5

న చ మే సౌహృదం బ్రహ్మ న్కృతాన్తేన బలీయసా |

ధర్మకార్యే త్వరా కార్య చలం యస్మాద్ధి జీవితమ్‌ . 6

ధర్మపథ్యౌదనో జన్తు ర్మృతోపి సుఖ మశ్నుతే | శ్వః కార్య మద్య కుర్వీత పూర్వాహ్ణే చాపరాహ్ణికమ్‌. 7

న హి ప్రతీక్షతే మృత్యుః కృతం వా యది వాకృతమ్‌ |

క్షేత్రాపణ గృహాసక్త మన్యత్రగతమానసమ్‌. 8

వృక శ్చోరణ మాసాద్య మృత్యు రాదాయ గచ్ఛతి | నైకాన్తేన ప్రియః కశ్చిద్‌ ద్వేష్వశ్చాస్య న విద్యతే. 9

ఆయుష్యే కర్మణి క్షీణ ప్రసహ్య హరతే జనమ్‌ | ప్రాణవాయో శ్చలత్వం చ త్వయా విదిత మేవ చ. 10

యత్ర వా జీవ్యతే బ్రహ్మ నణమాత్రం దద్భుతమ్‌ | శరీరం శాశ్వతం మణ్య విద్యాభ్యాసే ధనార్జనే. 11

అశాశ్వతం ధర్మకార్మే ఋణవా నస్మి సఙ్కటే | సోహం సమ్భృతసమ్భారో భవన్మూల ముపాగతః. 12

న చే ద్యాజయసే మాం త్వ మన్యం యాస్యామి యాజకమ్‌ |

ఏవ ముక్త స్తదా తేన నిమినా బ్రాహ్మణోత్తమః. 13

శశాప తం నిమిం క్రోధా ద్విదేహ స్త్వం భవిష్యసి |

శ్రాన్తం మా త్వం సముత్సృజ్య యస్మా దాన్యా న్ధ్విజోత్తమా9. 14

ధర్మజ్ఞస్తు నరేన్ద్ర! త్వం యాజకా న్కర్త మర్హసి |

ఇన్నూరవ అధ్యాయము.

వసిష్ఠ గోత్ర ప్రవరాను కీర్తనము - వసిష్ఠి నిమి చరితము.

మత్స్య జనార్ధనుడు వైవస్వతో ఇట్లు చెప్పెను: మమాతేజుడు వసిష్ఠుడు నిమియను రాజునకు పూర్వ పురోహితుడు; రాజశ్రేష్ఠా! నిమి ఎల్లప్పుడును అనేక యజ్ఞముల ననుష్టించుచుండెడి వాడు; అవి అన్నియు అనుష్టించు జేసిచేసి గురుడగు వసిష్ఠుడు అలసి విశ్రాంతికొనెను. అట్టి అతని కడకుపోయి నిమి "భగవన్‌! నేను యజింప

సంకల్పింపించుచున్నాను. నీవు వెంటనే వచ్చి నాచే యజనము నిర్విర్తింపజేయు"మనెను. మహాతేజుడగు వసిష్ఠుడా పార్థి వోత్తమునితో "కొంచెము కాలము ఓపిక పట్టుము; నీవు జరిపిన యజ్ఞములను చక్కని సంస్కారములతో జరపించి జరిపించి జరిపించి మిగుల బడలియున్నాను. కావున నృపా! విశ్రమించిన పిదప యజింపజేయుదును." అనెను. ఇట్లనిన గురునితో నిమి యిట్లు మారు పలికెను: పాలౌకిక కార్యములందు ఎవడు ప్రతీక్షించు (ఎదురుచూచు) చుండగోరును? యముడు బలియుడు అతనికి నాపై ఏమియు మైత్రీభావములేదు. జీవితము చంచలమైయినది; కావున ధర్మ కార్యచరణము నందు త్వరపడుటయే ధర్మము. ధర్మ కార్యానుష్ఠానమును తన పరలోక యాత్రయందలి దారి బత్తెనుగా భద్రపరచి కొనిన ప్రాణి మరణానంతరము కూడ సుఖించు%ు. (ఇదికాక లౌలిక కార్యములందు కూడ) రేపటి పనిని నేడే ఆచరించవలయును. అపరాహ్ణమున చేయవలసిన పనిని పూర్వాహ్ణముననే ఆచరించవలెను. మానవుడు తాను ఆ పని చేసినను చేయకున్నను మృత్యువు అందులకై వేచియుండదు. పొలములు అంగడులు ఇండ్లు మొదలగువాని యందాసక్తి గలిగి (ధర్మము కాని) ఇతర విషయములందగు మనస్సుంచి పరధ్యానములో ఉన్న మానవుని సమీపించి మృత్యువు తోడేలు గొర్రెనువలె తీసికొనిపోవును. మృత్యువునకు' ఈ ప్రాణి నాకు ప్రియమైనది; ఈ ప్రాణిద్వేష్యమయినది'. అనునదిలేదు. ఆయువునకు సంబంధించిన పూర్వ కర్మ ఫలాంశము ముగియగానే అది ప్రాణిని బలవంతముగా ఎత్తుకొనిపోవును. ప్రాణవాయువు చంచలమని నీకును తెలియునుగదా! ఏ చోటనో ఏ క్షణమో బ్రదికితిమి. అనినచో అదియు ఆశ్చర్యకరమే. విద్యాభ్యాసము విషయమునను ధనార్జనము విషయమునను శరీరము శాశ్వతమనుకొనవలెను. ధర్మ కార్యాచరణము చేయు విషయమున శరీరము అశాశ్వతమనుకొనవలెను. అని నాతలపు. కనుక అట్టి సంకటరూపమయిన ధర్మ కార్య మున నేను (దేవతలకు) ఋణపడి ఉన్నాను. అందువలన నేను సంభారములు అన్నియు సమకూర్చుకొని నీకడకు వచ్చినాను. నీవు వెంటనే నా చేత యజ్ఞమునుష్ఠింపజేయననినచో మరియొక యాజకుని కడకు పోవుదును.

అని నిమి పలుకగా వసిష్ఠుడు తానుబ్రాహ్మణోత్తముడు అయియుండియు క్రోధవశుడై నేను అలసియున్నా ననగా (నాశ్రమ తీరువరకు వేచియుండక) ధర్మజ్ఞుడవయియుండియు నీవు మరియొకని యాజకునిగా చేసికొనవలెననుకొను చున్నావు. కావున నీవు విదేహుడవయ్యెదవు. (దేహము లేనివాడు -మరణించినవాడు) అని శపించెను.

నిమి స్తం ప్రత్యువాచాథ ధర్మకార్య రతస్య మే. 15

విఘ్నం కరోషి నాన్యేన యాజనం చ తథేచ్ఛసి| శావం దదాసి యస్మాత్త్వం

విదేహోద్య భవిష్యసి. 16

ఏవ ముక్తేతు తౌ జాతౌ విదేహౌ ద్విజపార్థివౌ | దేహహీనౌ తయోర్జీవౌ బ్రహ్మాణ ముపజగ్ముతుః. 17

ఆగతౌ తౌ సమీక్ష్యాథ బ్రహ్మా వచన మబ్రవీత్‌| అద్యప్రభృతి తే స్థానం నిమిజీవ దదామ్యహమ్‌. 18

నేత్రపక్ష్మసు సర్వేషాం త్వం వసిష్యసి పార్థివ| త్వత్సమ్బన్ధా త్తథా తేషాం నిమేష స్సమ్భవిష్యతి. 19

చాలయిష్యన్తి తు తదా నేత్రపక్ష్మాణి మానవాః| ఏవముక్తే మనుష్యాణాం నేత్రపక్ష్మసు సర్వతః. 21

జగామ నిమిజీవస్తు వరదానా త్స్వయమ్భువః |వసిష్ఠజీవం భగవా న్భ్రహ్మా వచన మబ్రవీత్‌. 21

మిత్రావరుణయోః పుత్త్రో వసిష్ఠ త్వం భవిష్యసి | వసిష్ఠేతి చ తే నామ తత్రాపి చ భవిష్యతి. 22

జన్మద్వయ మతీతం చ తత్రాపి త్వం స్మరిష్యసి | ఏతస్మిన్నేవ కాలేతు మిత్రశ్చ వరుణ స్తథా. 23

బదర్యాశ్రమ మాసాద్యం తవ స్తేపతు రవ్యయమ్‌| తపస్యతే స్తయో రేవం కదాచి న్మాధవే దినే. 24

పుష్పితద్రుమసంస్థానే శుభే వాతిచ మారుతే | ఉర్వశీతు వరారోహా కుర్వతీ కుసుమోచ్ఛయమ్‌. 25

సుసూక్ష్మరక్తవసనా తయో ర్దృష్టివథం గతా| తాం దృష్ట్వా సుముఖీం సుభ్రూం నీలనీరజలోచనామ్‌. 26

ఉభౌ చక్షుభతుర్ధైర్యా త్తద్రూపపరిమోహితౌ | తపస్యతో స్తయో ర్వీర్య మన్ఖలచ్చ మృగాననే. 27

స్కన్నం రేత స్తతో దృష్ట్వా పాపభీతౌ పరస్పరమ్‌| చక్రతుః కలశే శుక్రం తోయపూర్ణే మనోరమే. 28

తయోరృషివరౌ జాతో తేజసాప్రతిమౌ భువి | వసిష్ఠశ్చా7ప్యగన్త్యశ్చ మిత్రావరుణయో స్సుతౌ. 29

నిమి వసిష్ఠునితో ఇట్లు మారుపలికెను: ధర్మ కార్యానుష్టానానక్తుడనైన నాకు విఘ్నము కలిగించుచున్నావు; ఇంకొకరిచేత యజనము చేయించుకొనుటకొప్పుకొనవు; పైగా నన్నే శపించుచున్నావు ;కావున నీవే వెంటనే విదేహుడవగుదువు. అనెను. వెంటనే ఇరువురును విదేహులయిరి. దేహహీనములగు ఆ ఇరువురి జీవములును బ్రహ్మకడకు పోగా చూచి బ్రహ్మ ఇట్లనెను. నిమిజీవా ఇంతటినుండి నీకు ప్రాణుల కనురెప్పలు స్థానముగా ఇచ్చుచున్నాను; నీవచ్చట నివసింతువు గాని; దాని సంబంధము ప్రాణులకు 'నిమిషము' 'ఱప్పపాటు' కలుగును- (నిమి-శ= నిమి దీని యందు శయనించి -విశ్రాంతిగొని-యుండును. కావున నిమిశ =నిమిష-అను శబ్దము సిద్ధించును). ఆ సమయమున మానవులు (మొదలగు ప్రాణులు) కనురెప్పలు కదలింతురు. అని బ్రహ్మ పలికిన వెంటనే స్వయంభూ వరదానమున నిమి జీవుడు మానవాది ప్రాణుల కనురెప్పలయందంతటను వ్యాపించెను; భగవానుడగు బ్రహ్మ వసిష్ఠ జీవునితో ఇట్లు పలికెను: వసిష్ఠా! నీవు మిత్రావరుణుల నెడు జంట దేవతల) కుమారుడవయ్యెదవు. ఆజన్మమునందును నీకు ఇదే నామముండును. అపుడును నీకు గడచిన రెండు జన్మల స్మృతియుండును అనెను. అదే సమయమున మిత్రుడును వరుణుడు (వరుసగా ఈ ఇద్దరును ఉదయించు సూర్యునికిని -అస్తమించు సూర్యునకు అధిష్ఠాతృ దేవతలు ) బదర్యాశ్రమమును ఆశ్రయించుకొని నిరుపమానమయి నియమమున ఎట్టి మార్పులును లేని తపమాచరించుచుండిరి. ఆ కాలమున ఒక వసంతుర్తువున వృక్ష వ్యవస్థయంతయు పూచియుండ హాయి గొలుపు గాలి వీచుచుండ ఉత్తమ సుందరియగు ఊర్వశి పూవులు కోయుచు చక్కని చాయగల మిగుల సన్నని వస్త్రము ధరించి ఉండి వారి కంటికపడుట తటస్థించెను. అందమగు మోము కనుబొమలు పద్మలోచనములు కల ఆమెను చూచి వారు ఇద్దరును తద్రూప పరిమోహితులయి తమ గుండె నిబ్బరము కోల్పోయిరి. తపస్సాచరించుచు కూర్చండిన వారి వీర్యము వారి మృగాజినాననమున పడెను. ఇట్లగుట మహాపాపము; కావున వారు పరస్పరము పాపభీతులయి (సంప్రతించుకొని) ఆ శుక్రమును మనోహరమగు జలపూర్ణ కలశమున (బిందెయం)దు ఇంచిరి. ఆ ఇరువుర తేజస్సును భూమియందే అప్రతిమ తేజోవంతులగు అగస్త్యుడు వసిష్ఠుడు అనువారు మిత్రావరుణ పుత్త్రులయి జనించిరి.

వసిష్ఠస్తూపయేమేథ భగీనీం నారదస్య తు | అరున్ధతీం వరారోహాం తస్యాం శక్తి మజీజనత్‌. 30

శ##క్రేః పరాశరః పుత్త్ర స్తమ్య వంశం నిబోధమ్‌ |

యస్య ద్వైపాయనః పుత్త్ర స్స్వయం విష్ణు రజాయత. 31

ప్రకాశో జనితో యేన లోకే భారతచన్ద్రమాః| యేనాజ్ఞానతమోన్ధస్య లోకస్యోన్మీలనం కృతమ్‌. 32

పరాశరస్య తస్య త్వం శృణు వంశ మనుత్తమమ్‌ | కాణ్దర్షభో వాహనపో జైహ్య్మపో భౌమతాపనః. 33

గోపాలిః పఞమశ్చైషా మేతే గౌరాః పరాశరాః |

ప్రపోహయా వాహ్యామయాః ఖ్యాతేయాః కౌతుజాతయః. 34

హర్యశ్విః పఞ్చమో హ్యేషాం నీలా జ్ఞేయాః పరాశరాః |

కార్షయణాః కపిముఖాః కాకేయస్థా7జపాతయః. 35

పుశ్కరః పఞ్చమశ్చైషాం కృష్ణా జ్ఞేయా ః పరాశరాః |

ఆవిష్టాయన వాలేయా స్స్వాయష్టా శ్చోపయాశ్చయే. 36

ఇషీకహస్తశ్చైవేతే శ్వేతాః సర్వే పరాశరాః| పాటికో వాదరిశ్చైవ స్తమ్భావై క్రోధనాయనాః. 37

క్షౌమిరేషాం పఞ్చమస్తు ఏతే శ్యామాః పరాశరాః| స్వల్పాయనా వార్షాయాణా సై#్తలేయాః

ఖలు యూథపాః. 38

తన్తి రేషాం పఞ్చమస్తు ఏతే ధూమ్రాః పరాశరాః| పరాశరాణాం సర్వేషాం త్య్రేర్షేయః ప్రవరోమతః. 39

పరాశరశ్చ శక్తిశ్చ వసిష్ఠశ్చ మహాతపాః| పరస్పర మవైవాహ్యా స్సర్వే పరాశరాః. 40

ఉక్తా స్తవైతే నృప వంశ ముఖ్యాః పరాశరా స్సూర్యసమప్రభావాః |

యేషాం తు నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం పురుషో జహాతి. 41

ఇతి శ్రీమత్స్య మహాపురాణ గోత్రప్రవరానుకీర్తనే వసిష్ఠగోత్రప్రవర వివరణం నామ

ద్విశతతమోధ్యాయః.

తరువాత వసిష్ఠుడు నారదుని అక్క యగు అరుంధతియును ఉత్తమ సుందరిని వివాహమాడెను. వారికి శక్తి అతనికి పరాశరుడు ఆతనికి సాక్షాద్విష్ణువు ద్వైపాయనుడు పుత్త్రులయిరి. ఆ ద్వైపాయను నుండియే ప్రకాశజనకుడగు భారతమను చంద్రుడు ఉదయించెను. అజ్ఞానాంధకారమున కన్నులు కనరాని వారికి కన్నులు తెరచి అది చూపునిచ్చెను. అట్టి ద్వైపాయనుని పితయగు పరాశరుని వంశమును తెలిపెదను వినుము. ఇది చాల ఉత్తమమయినది.

పరాశరవంశము.

గౌరపరాశరులు: కాండర్షభుడు వాహనపుడు జైహ్మ్యాపుడు భౌమతాపనుడు గోపాలి -ఐదురుగు; నీలపరా శరులు: ప్రపోహయులు వాహ్యమయులు ఖ్యాతేయులు కౌతుజాతులు హర్వశ్వి- ఐదుగురు కృష్ణపరాశరులు; కార్షా(ర్షా)యణులు కపిముఖులు కాకేయస్థులు జపాతతులు పుష్కరుడు-ఐదుగురు; శ్రా (ఆ) విష్ఠాయనులు వాతేయులు స్వాయష్టులు ఉపయులు ఇహీకహస్తులు వీరైదుగురు శ్వేతపరాశరులు; పాటికుడు వాదరిస్తంభులు క్రోధనాయనులు క్షామి- ఈ ఐదురుగును శ్యామ పరాశరులు ; స్వల్పాయనులు వార్షయణులు తై తేయువు యూథవులు తంతి- ఈ ఐదుగురు ధూమ్ర పరాశరులు; అన్ని వర్గముల పరాశరులకును పరాశరుడు శక్తి వసిష్టుడు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారెవ్వరును పరస్పరము వివాహసంబంధములను చేసికొనరాదు.

సూర్య సమప్రభావులగు ఈ పరాశర గోత్రఋషుల నామస్మరణము చేసినంత మాత్రముననే నరుడు పాప ముక్తుడగును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున వసిష్ఠనిమి చరిత్రము పరాశరగోత్ర

ప్రవరాను కీర్తనము అను ఇన్నూరవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters