Sri Matsya mahapuramu-2    Chapters   

ద్వినత్యుత్తర శతతమోధ్యాయః.

నర్మదామాహాత్మ్యే దశాశ్వ మేథాది తీర్థమహిమానువర్ణనమ్‌.

మార్కణ్డయః : తత స్త్వనరకం గచ్ఛే త్స్నానం తత్ర సమాచరేత్‌ |

స్నాతమాత్రో నరస్తత్ర నరకం చ సపశ్యతి. 1

అస్య తీర్థస్య మాహాత్మ్యం శృణు త్వం పాణ్డునన్దన | తస్మిం స్తీర్థేతు రాజేన్ద్ర యస్యాస్థీని వినిక్షిపేత్‌. 2

విలయం యాన్తి *సర్వాణి రూపవా న్జాయతే నరః |

గోతీర్థందు తతో గచ్చే ద్దృష్ట్వా పాపా త్ప్రముచ్యతే. 3

తతో గచ్ఛేత్తు రాజన్ద్ర కపిలాతీర్థముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్గోసహస్రఫలం లభేత్‌. 4

జ్యేష్టమాసేతు సమ్ర్పాప్తే చతుర్దవ్యాం విశేషతః | తత్రపోష్య నరో భక్తా కపిలాం యః ప్రయచ్ఛతి. 5

ఘృతేన దీపం ప్రజ్వాల్య ఘృతేన స్నాపయే చ్ఛివమ్‌ |

సఘృతం శ్రీఫలం జగ్ధ్వా దత్వా చాన్తే ప్రదక్షిణమ్‌. 6

ఘణ్టాభరణసంయుక్తాం కపిలాం యః ప్రయచ్ఛతి | శివతుల్యబలో భూత్వా నైవాసో జాయతే పునః. 7

అఙ్గారకదినే ప్రాప్తే చతుర్థ్యాంతు విశేషతః | స్నాపయిత్వా శివం దద్యా ద్బ్రాహ్మణభ్యస్తు భోజనమ్‌. 8

అఙ్గారకనవమ్యాం తు అమాయాం చ విశేషతః | స్నాపయేత్తత్రయత్నేన రూపవా న్త్సుభగో భ##వేత్‌. 9

ఘృతేన స్నాపయేల్లిజ్గం పూజయే ద్భక్తితో ద్విజా9 | పుష్పకేన విమానేన సహసై#్ర పరివారితః. 10

శైవం పద మవాప్నోతి యత్ర చాభిమతం భవత్‌ | అక్షయం మోదతే కాలం యథా రుద్ర స్తథైవ సః.

యదాతు కర్మసంయోగా న్మర్త్యలోక ముపాగతః | రాజా భవతి ధర్మిష్ఠో రూపవా న్జాయతే కులే. 12

నూట తొంబది రెండవ అధ్యాయము.

దశాశ్వమేధాది తీర్థ మహిమాను వర్ణనము.

మార్కండేయుడు ధర్మారాజుతో ఇట్లు చెప్పెను: తరువాత నరక తీర్థము: దానియందు స్నానమాడినచో నరక దర్శనమేయుండదు: పాండునందనా! ఈ తీర్థపు మాహాత్మ్యమును తెలిపెదను; వినుము: దీనియందు ఎవనివైన అస్థులను వైచినచో అవి అందు విలీనమగును, ఇందు స్నామాడినవాడు రూపవంతుడగును; తరువాత దర్శనమాత్రమున పాపముక్తిని కలిగించు గోతీర్థము; తరువాత కపిలాతీర్థము; దానియందు స్నానముచే గోసహస్ర దాన ఫలము లభించును; జ్యేష్ఠ (శుక్ల) చతుర్దశినాడచట ఉపవసించి భక్తితో కపిలా గోదానమొనరించినచో అది ఎట్లన నేతి వెలిగించి నేతితోనే శివునభిషేకించినచో నేతితో మారేడు ఫలమాహారముగా తినిపించి(నివేదించి)నచో తరువాత శివుని కపిలా గోవును కూడ ప్రదక్షిణించి ఘంటలతో ఆభరణములతో కూడిన ఆ గోవును దానమిచ్చినచో శివతుల్య భోగముల ననుభవించును; వాని కిక పునర్జన్మముండదు; చవితి మంగళవారమును నవమీ మంగళవారమున అమావాస్యా మంగళవారమున అచ్చట శివ నభిషేకించినచో రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడునగును; అంతమున పుష్పకవిమానముపై వేలకొలది మంది పరి వారముతో శివస్థానమునందును; తన కభిమతమగు చోట్ల నెల్ల రుద్ర సమ భోగములతో అనంతకాలము సుఖించును; ఫలభోగానంతరము కర్మ సంయోగ వశమున భూలోకమునకు వచ్చినను ఉత్తమ వంశమున రూవంతుడును ధార్మికుడునగు రాజగును.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర గణశ్వర మనుత్తమమ్‌ | శ్రావణ మాసి సమ్రాప్తే కృష్ణపక్షే చతుర్దశీ. 13

స్నాతమాత్రో నర స్తత్ర రుద్రలోకే మహీయతే |

పితృణాం తర్పణం కృత్కవా ముచ్చతేచ ఋణత్రయాత్‌. 14

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర ఋషితీర్థ మనుత్తమమ్‌ | తృణబిన్దు ర్నషిర్నామ శాపదగ్ధో వ్యవస్థితః. 15

తత్ర తీర్థప్రభావేన శాపముక్తో భ##వే ద్ద్విజః | గజ్గేశ్వర సమీపేతు గజ్గావదన ముత్తమమ్‌. 16

అకామోవా సకామోవా తత్ర స్నాత్వాతు మానవః | ఆజన్మజనితైః పాపై ర్ముచ్యతే నాత్ర సంశయః. 17

తత్ర తీర్తే నర స్స్నాత్వా వ్రజతే యత్ర శఙ్కరః | సర్వదా పర్వదివసే స్నానం తత్ర సమాచరేత్‌.

పితౄణాం తర్పణం కృత్వా హ్యశ్వమేధఫలం లభేత్‌ | ప్రయాగే యత్ఫలం దృష్టం శఙ్కరేణ మహాత్మనా. 19

తదేవ నిఖిలం పుణ్యం గఙ్గావదనసఙ్గమే |

తరువాత అనుత్తమము (అంతకంటె గొప్పదిలేనిది) అగు గణశ్వర తీర్థము; శ్రావణ కృష్ణ చతుర్దశినాడందు స్నానమాడినంతనే రుద్రలోక ప్రాప్తుడగును; పితృ తర్పణముతో (దేవ ఋషి పితృ) ఋణత్రయ మూర్తియగును; తరువాత అనుత్తమమగు ఋషి తీర్థము; తృణ బిందుడను ద్విజ ఋషి అందు స్నానమాడి ఆ తీర్థ ప్రభావమున శాపముక్తుడయ్యెను. గంగేశ్వర మను లింగమునకు దగ్గరలో గంగావదన తీర్థము కలదు; (దాని మహిమ) తెలిసి కాని తెలియకకాని (కోరికలుండికాని లేకకాని) స్నానమాడినచో ప్రాణి తన పుట్టుక మొదలు చేసిన పాపములు తొలగును; తుదకు శంకర లోక ప్రాప్తుడగును; అందు ప్రతి పర్వ సమయమందును స్నానమాడి పితృ తర్పణము చేసినచో అశ్వమేద ఫలము లభించును; ప్రయాగ తీర్థమునకు ఏ ఫలము కలదని మహాత్ముడగు శంకరుడనెనో ఈ గంగా వదన సంగమ తీర్థము కూడా అంత పలము నిచ్చును.

దశాశ్వమేధతీర్థమాహాత్మ్యమ్‌.

తసై#్యవ పశ్చిమే పార్శ్వే సమీపేనాతిదూరతః. 20

దశాశ్వమేధ నామానం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ | ఉపోష్య రజనీ మేకాం మాసి భాద్రపదే తథా. 21

అమాయాం చ నర స్స్నాత్వా వ్రజతే యత్ర శఙ్కరః |

సర్వదా పర్వానవసే స్నానం తత్ర సమాచరేత్‌. 22

పితౄనాం తర్పణం కృత్వా చాశ్వమేధఫలంలభేత్‌ |

దశాశ్వమేధా త్పశ్చిమతో భృగు ర్బ్రాహ్మణ సత్తమః. 23

దివ్యం వర్ష సహస్రంతు ఈశ్వరం పర్యుపాసత | వల్మీకే వేష్ఠిత శ్చాసౌ పక్షిణాం చ నికేతనః. 24

ఆశ్చర్యంతు మహాజ్ఞాత ముమాయా శ్శఙ్కరస్యచ | గౌరీ పప్రచ్ఛ దేవేశం కోయ మేవం తు సంస్థితః.

దేవో వా దానవో వాథ కథయస్వ మహేశ్వర |

ఈశ్వరః : భృగు ర్నామ ద్విజశ్రేష్ఠ ఋషీణాం ప్రవరో మునిః. 26

ధూమవ త్తచ్ఛిఖా జాతా తతోద్యాపి తుష్యసే | దురారాద్యోసి తేన త్వం నాత్ర కార్యా విచారణా.

ఈశ్వరః : న జనాసి మహాదేవి హ్యయం! క్రోధేన వేష్టితః |

దర్శయామి యథాతథ్యం ప్రత్యక్షం తే కరోమ్యహమ్‌. 29

తత స్స్మృతోథ దేవేన ధర్మరూపో వృష స్తదా | స్మరనా ద్దేవదేవస్య వృష శ్శీఘ్ర ముపస్థితః. 30

వదంస్తు మానుషీం వాచ మాదేశో దీయతాం ప్రభో |

ఈశ్వరః : వల్మీకం తం ఖనసై#్వనం విప్రం భూమౌ నిపాయత. 31

యోగస్థస్తు తతో ధ్యాయ న్బృగుస్తేన నిపాతితః |

తత్ఞణాత్క్రోధనన్తప్తో హస్త ముత్ఞిప్య సోశవత్‌. 32

ఏవం సమ్భాషమాణస్తు కుత్ర గచ్ఛసి రే వృష |

అద్యాహం త్వాం సకోపేన ప్రళయం త్వాం నయే వృష. 33

దర్షితస్తు తదా విప్ర శ్చాన్తరిక్షం గతో వృషం | ఆకాశే ప్రేక్షతే విప్ర ఏత దద్భత ముత్తమమ్‌. 34

దీని పశ్చిమ పార్శ్వమున చాల దగ్దరలో త్రిలోక విశ్రుతమగు దశాశ్వమేధ తీర్థము గలదు; భాద్రపదామావాస్య నాడందు స్నానమాడి ఒక అహోరాత్రముపవిసించి పితృ తర్పణము చేయుటచే దశాశ్వమేథ ఫల ప్రాప్తుడగును; దీనికి పశ్చిమమున భృగు తీర్థము గలదు; (దీని ఉత్పత్తి ఇది;) పూర్వ ము బ్రాహ్మణ నత్తముడగు భృగుడు సహస్ర దివ్య వర్ష కాలము ఇట ఈశ్వరుని ఉపాసించుచుండెను; అతని చుట్టును మీదను పుట్టి పెరిగి చుట్టివేసెను; అందు పక్షలు గూండ్లు పెట్టెను, ఇది చూచి ఉమాశంకరుల కాశ్చర్యము కలిగెను; ఇట్లున్న ఈతడెవ్వడు? దేవడా ! దానవుడా ! మహేశ్వరా! తెలుపుమని గౌరి దేవేశునడిగెను; ఈశ్వరుడును: ప్రియా ! ఇతడు భృగుడను ద్విజుశ్రేష్ఠుడు; మునియను ఋషిప్రవరుడును; ఇతడిందు సమాధిష్ఠుడయి నన్ను ధ్యానించుచున్నాడు. అనెను. అంతట దేవి పెద్దగ నవ్వి: ''ఇతనిపై ఇతని జుట్టుకొన (అగ్నిజ్వాల) పొగవలె (పొగతో కూడినదై) ఏర్పడినది; ఇప్పటికిని నీవతనిని మెచ్చకున్నావు; దీనిని బట్టి నీవు దురారాధ్యుడవు (సులభముగా మెప్పిపరానివాడు); ఇందు సందియము లేదు.'' అనెను: శివుడది విని ''దేవీ! ఇతని విషయము నీవు ఎరుగవు; ఇతడు క్రోధవేష్టితుడు; దీని యథార్థత్వము చూపి నీకు ప్రత్యక్షము చేయుదును; అనెను. అంతట మహదేవుడు ధర్మరూపుడదిగు వృషభమును స్మరించెను; దేవదేవుడు స్మరించినంతనే శీఘ్రముగా ఆ వృషము వచ్చి ఎదుట నలిచెను: ఆది మానుష వాక్కుతో ప్రభూ! ఆదేశమునిమ్మనెను: అంత ఈశ్వరుడును ఈ వల్మీకమును త్రవ్వుము: ఈ విప్రుని క్రిందకు పడవేయుము; అనెను.యోగస్థుడయి ధ్యానమందున్న భృగుని ఆ ధర్మ రూప వృషభము క్రింద పడవేసెను. తత్‌క్షణమతడు క్రోథ సంతప్తుడయి చేయి ఎత్తి ఇట్లు పలుకుచు దానిని శపించెను; ''ఓరీ! (సీ!) ఎద్దా! ఎక్కడకు పోయెదవు! వృషమా ! నేనిపుడే నాకోపముతో నాశమొందింతును'' అంత వృభమతనిని ఎత్తివేయగా ఋషి అంత రిక్షమునకు ఎగిరిపోయెను; అచ్చట అతనికా వృషభమంతరిక్షమందున్నట్లు కనబడెను: ఇది అతనికి ఉత్తమమగు అద్భుత మనిపించెను.

తతః ప్రవాసితో రుద్ర ఋషే రగ్రే వ్యవస్థితః | తృతీయం లోచనం దృష్ట్వా వైలాక్ష్యా త్పతితో భువి. 35

ప్రణమ్య దండద్భూమౌ స్తువతే పరమేవ్వరమ్‌ |

భృగుకృతశివస్తుతిః.

ప్రణిపత్య భూతానాథం భవోద్భవం త్వా మహం దివ్యరూపమ్‌. 36

భవాతీతో భువనపతే ప్రభోతుత విజ్ఞాపయే కిఞ్చిత్‌ | త్వద్గుణనికరం వక్తుం క శ్శక్తో భవతి మానుషో నామ.

వాసుకిరపి హి కదాచి ద్వదనసహస్రం భ##వే ద్యస్య|

భక్త్యా తథాపి శఙ్కర భువనపతే స్తుతి ర్ముఖర యతి మాంమహేశ. 38

వదతః క్షమస్వ భగవ న్ప్రసీద తవ చరణనిరతస్య | సత్త్వం రజ స్తమస్త్వం స్తిత్యుత్తత్త్యో ర్వినాశ##నే దేవ. 39

త్వాం ముక్త్వా భువనపే భువనేశ్వర నైవదైవతం కిఞ్చిత్‌ |

యమనియమయజ్ఞ దానవేదాభ్యాసాశ్చ ధారణా యోగాః 40

త్వద్భక్తే స్సర్వమిదం నార్హసి హి కలాసహస్రాంశమ్‌ |

ఉచ్ఛిష్టరస రాసాయనఖడ్గాఞ్జనపాదుకావివరసిద్ధి ర్వా. 41

చిహ్నం భవవ్రతానాం దృశ్యన్తే జన్మినః ప్రకటమ్‌ |

శాఠ్యేన నమతి యద్యపి దదాసి త్వం భూతి మిచ్ఛతాం దేవ. 42

భక్తిర్భభేదకరీ మోక్షాయ వినిర్మతా నాథ | పరదారపరస్వరతం పరిపరిభవదుఃఖశోక సన్తప్తమ్‌. 43

పరవదనవీక్షణపరం పరమేశ్వర మాం పరిత్రాహి | మిథ్యాభిమానదగ్ధం క్షణభఙ్గురవిభవవిలసన్తమ్‌. 44

క్రూరం కువథాభిముఖం పతితం మా పాహి దేవేః | దీనే ద్విజగణ సార్ధే బన్ధుజనే నైవ దూషితా హ్యాశా. 45

తృష్ణా తథాపి శఙ్కర కిం మూఢం మాం విడమ్బయతి |

తృష్ణాం హరస్వ శీఘ్రం లక్ష్మీం మే దేమి హృదయవాసినీం నిత్యమ్‌. 46

ఛిన్ది మదమోహపాశా నుత్తారయ మాం మహాదేవ |

కరుణాభ్యుదయం నామ స్తోత్రమిదం సర్వసిద్ధిదం దివ్యమ్‌. 47

యః పఠతి భక్తియుక్త స్తస్య తుష్యే ద్భృగో ర్యథాహి శివః |

ఈశ్వరః : అహం తుష్టోస్మి తే విప్ర వరం ప్రార్థయ చేప్సితమ్‌. 48

ఉమాయా సహితో దేవో వరం తస్య హ్యాదాపయత్‌ |

అంతట రుద్రుడు పెద్దగా నవ్వుచు ఋషి ఎదుట నిలిచెను: మూడవ కన్ను కనబడినంత ఋషి వెలవెల పోవుచు క్రింద పడెను; దండవత్‌గా భూమిపైపడి నమస్కరించి పరమేశ్వరునిట్లు స్తుతించసాగెను:

భృగు మహర్షి చేసిన శివస్తుతి.

కారణ కారణుడవును బూతనాధుడవును దివ్యరూపుడవునగు నిన్ను నమస్కరించినంతనే నేను సంసారమును దాటితిని; ఐనను భువనపతీ ! ఏదో కొంచెము మనవి చేయుదను; వేయినోళ్లు గల వాసుకికూడ ఎన్నటికి నీ గుణ సమూహమును వర్ణించ జాలడనిని మానుషుడెవ్వడు అది చేయగలడు? అయినను భువన పతీ ! శంకారా! భక్తితో నిన్ను స్తుతించు తలపు నన్నువాగునట్లు చేయుచున్నది. మహేశా! భగవన్‌ ! నును పలుకు మాటల(లోనిదోషముల)ను క్షమించుము. నీచరణముయందుఏ నిరతుడ (అత్యంతా సక్తుడ)నగు నన్ననుగ్రహించుము; దేవా ! నీవే సృష్టియందు రజోగుణముగా స్థియందు సత్త్వముగా ప్రళయమందు తమముగా నగుదువు; భువనపతీ! భువనేశ్వరా! నీవు తప్ప మరి దైవతము ఏదియు లేనేలేదు. యమ నియమములు (యోగాంగములు) యజ్ఞమలు దానములు వేదాభ్యాసములు ధారణాది యోగములు కాని ఉచ్ఛిష్టవిద్యా రసవిద్యారసాయనవిద్యా ఖడ్గ విద్యా7 జనవద్యాపాదుకావిద్యా వివర(సురంగానిధి) విద్యా సిద్ధికాని ఇందేదియు నీ భక్తికి పదునారవపాలునకుకూడ సమముకాదు; భవ (శివ) వ్రతులగు వారికి దేహములందు అదేహికిగల నీ చిహ్నము పుట్టుకతోనే ప్రకటమయి కనబడును; దేవా: కొంటెతనముతో (నిన్ను పరిక్షించు తలంతపుతో) నమస్కరించినవానికై యైనను నీవు ఐశ్వర్యము కోరిన వారికి అది ఇత్తువు. నాథా! జీవులకు సంసారబంధమును ఛేదించి (నశింపచేసి) వారికి ముక్తి నీ యదలచి నీ వందులకు సాధనముగా నీయందు భక్తినికూడ నీవే సృష్టించితివి). పరదార పరధనములందాసక్తిగల వాడను పరుల వలన పరాభవమునంది దుఃఖశోకములచే సంతాప మందినవాడను ధనాద్యాశ##చే పరుల ముఖముల వంగిచూచుట కలవాడు పడిన వాడను అగు నన్ను పరమేశ్వరా! రక్షించుము; మిథ్యాభి మానముతో దగ్ధుడను క్షణభంగురమగు విభవములనంది మిడిసి పడువాడును క్రూరుడను కుపథా (చెడు త్రోవలకు) అభిముఖుడను పతితుడను అగునన్ను దేవేశా ! రక్షించుము; దీనులగు ద్విజ సమూహముల (హృదయముల) యందు మాకెవరైన ధనమీయవలయుననియు దీనులగు బంధుజనుల (హృదయముల)యందు మమ్ము ధనికులగు మా బంధు జనుల పోషించవలయుననియు ఆశ యుండుట దూషితము (తప్పిదము)కాదు; కాని శంకార! ఋషినగు నన్నుకూడా మూఢునిగా జేసి ఆశనన్ను తనకు పశునిగా చేసికొని వెక్కిరించుచున్నదే! ఇది బాగుగా లేదు; శీఘ్రముగా ఆశనుహరించుము; సదా నా హృదయమునందు నలిగియుండు లక్ష్మిని (ఉన్నదే చాలునను హృదయానుభూతిన) ఇమ్ము. మదమోహ పాశములను ఛేధించుము; మహాదేవా ! నన్ను సంసారమునుండి దాటించుము; కరుణాభ్యుదయమను ఈ దివ్య స్తోత్రము సర్వసిద్ధి ప్రదము; దీనికి భక్తితో పఠించిన వాని విషయమున శివుడు భృగుని విషయమునందు వలెనే సంతుష్టుడగును.

ఇది విన ఈశ్వరుడు ''విప్రా! నేను నీ విషయమున సంతుష్టుడనయితిని; ఈప్పిత వరము ప్రార్థించుము; అని ఉమతో కూడియున్న ఆసోమ దేవుడ భృగునకు వరము ఈయ సిద్ధపడెను.

భృగుః : యది తుష్టోసి దేవేశ యది దేయో వరో మమ. 49

రుద్రవేదీ భ##వే దేవ మేత త్సమ్పాదయస్వ మే |

ఈశ్వరః : ఏదం భవతు విప్రేన్ద్ర క్రోథ స్తే న భవిష్యతి. 50

ఉపాసన్తే భృగోస్తీర్థం తుష్టో యత్ర మహేశ్వరః | దర్శనా త్తస్య దేవస్య సద్యః పాపా త్ప్రముచ్యే.

అవశా స్వ్వవశా వాపి మ్రియన్తే యత్ర జన్తవః | గుహ్యాతిగుహ్యా సుగతి స్తేషాం నిస్సంశయం భ##వేత్‌. 53

ఏత త్ఞేత్రం సవిపులం సర్వ పాపప్రణాశనమ్‌ | తత్ర స్నాత్వా దినం యాన్తి యే మృతాస్తేపునర్బవాః. 54

ఉపానహౌ తథా చ్ఛత్రం దేయ మన్నంతు కాఞ్చనమ్‌ |

భోజనంతు యథాశక్త్యా హ్యక్షయం చ తథాభ##వేత్‌. 55

సర్యోపరాగే యో దద్యా ద్దానం చైవ యథేచ్ఛయా | దీయమానంతు తద్దాన మక్షయం తస్య తద్భవేత్‌. 55

చన్ద్రసూర్యోపరాగే తు యత్ఫలం త్వమరకణ్టకే | తదేవ నిఖిలం పుణ్యం భృగుతీర్థే న సంశయః. 57

క్షీయన్తే సర్వదానాని యజ్ఞదాన తవః ప్రయాః | న క్షీయతే తప స్తప్తం భృగుతీర్తే న సంశయః. 58

యస్య వై తపసోగ్రేణ తుష్టేనైవ తు శమ్భునా | సాన్నిధ్యం తత్ర కథితం భృగుతీర్థే నరాధిపః. 59

ప్రఖ్యాతం త్రిషు లోకేషు యత్ర తుష్టో మహేశ్వరః | ఏవం తు వదతో దేవీం భృగుతీర్థ మనుత్తమమ్‌. 60

న జానన్తి మూఢా విష్ణు మయావిమోహితాః |

నర్మదాయాం స్తితం దివ్యం భృగుతీర్థం నరాధిప. 61

భృగుతీర్థస్య మాహాత్మ్యం య శ్శృణోతి నర స్సకృత్‌ |

సముక్త స్సర్వ పాపేభ్యో రుద్రలోకం సగచ్ఛతి. 62

అంతట భృగుడు ''దేవేశా! నీవు నాయందు సంతుష్టుడవయినచో నకా వరమీయ దగినచో నేను రుద్రతత్త్వ మెరగిన వాడను కావలయును. అను నా కోరిక సంపన్నమగు (నెవేరు)నట్లు వరమిమ్ము. అనెను. ఈశ్వరుడు ''విప్రేంద్రా! అట్లేయగుగాక! మరియు నీకిక మీదట కోపముండదు; నీ కుమారునకును నీకును ఏకాభిప్రాయముండదు; అనెను; అది మొదలు బ్రహ్మేంద్రులును దేవాసుర కింనరాదులను మహేవ్రుడు భృగుని విషయమున తుష్టుడైన ఈ భృగు తీర్తమును సేవించుచున్నారు; అట ఆ దేవని దర్శించిననంతనే పాపముక్తియగును; తమ ఇచ్ఛతోనే కాని ఇచ్ఛలేక (తెలియక అప్రయత్నముగా)కాని అచట మరణించిన ప్రాణులకు గుహ్యాతిగుహ్య (పరమ రహస్య ఉత్తమ)మగు సుగతి కలుగను; ఇది నిస్సంశయము; ఈ క్షేత్రము మహావిస్తరము; సర్వపాప ప్రణాశనకరము; ఇచట మరణించినవారిక పునారావృత్తి లేని ద్యులోక ప్రాప్తియగును; ఇచట సూర్యగ్రహణ కాలమున పాదరక్షలు ఛత్రము అన్నము కాంచనము యథాశక్తిగ దానమొనర్చినను అది అక్షయమగును; చంద్ర సూర్య గ్రహణకాలములందు అమరకంటకమున చేసిన దానాదికమెంత ఫలప్రదమో ఇచట చేసినది కూడా అంత ఫలప్రదమగును; ఇతరత్ర చేసిన సర్వదాన తపో యజ్ఞాది ఫలములయిన ఒక నాటికి క్షీణించవచ్చును కాని భృగుతీర్థమున చేసినవి ఏవియు ఎన్నటకిని క్షీణించవు. సాక్షాత్‌ గ శంభుడు భృగుని ఉగ్రతపముతో తుష్టుడైన ఈ భృగు తీర్థము త్రిలోక విఖ్యాతము; ఈ విషయమును స్వయముగా మహాదేవుడే దేవితో పలికినాడు: ఇది అంతగా అనుత్తమము. అయినను విష్ణువు మాయా విమోమితులగు వారు మాత్రము దీని మమాత్త్వమెరుగజాలరు. నర్మదా నది (తీర) మందు ఉన్న ఈ భృగు తీర్థ మాహాత్మ్యమును వినినవారు కూడ సర్వపాపముక్తులై రుద్రలోక మేగుదురు.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర గౌతమేశ్వర ముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్నుపవాసపరాయణః. 63

కాఞ్చనేన విమానేన బ్రహ్మలోకే మహీయతే | ధౌతపాపం తతో గచ్ఛేత్‌ క్షేత్రం యత్ర వృషేణ తు. 64

నర్మదాయాం కృతం రాజ న్త్సర్వపాతకనాశనమ్‌ | తత్ర తీర్థే నరస్స్నాత్వా బ్రహ్మహత్యాం వ్యపోహతి.

తస్మిం స్తీర్థేతు రాజేన్ద్ర ప్రాణత్యాం కరోతి యః | చతుర్భజ స్త్రిణత్రస్తు రుద్రతుల్యబలో భ##వేత్‌. 66

వసే త్కల్పాయుతం సాగ్రం శివతుల్యపరాక్రమః | కాలేన మహతా ప్రాప్తః పృథివ్యా మేకరా డ్భవేత్‌.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర ఐరణ్డీతీర్థ ముత్తమమ్‌ | ప్రయాగే యత్ఫలం దృష్టం మార్కణ్డయన భాషితమ్‌. 68

తత్ఫలం లభేతే సోపి స్నాతమాత్రో నరాధిప | మాసి భాద్రపదేవైవ శుక్లపక్షస్య చాష్టమీ. 69

ఉపోష్య రజనీమేకాం తస్మిన్త్స్నానం సమాచరేత్‌ | యమదూతైర్న బాధ్యేత రుద్రలోకం స గచ్ఛతి. 70

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర సిద్దో యత్ర జనార్దనః | హిరణ్యద్వీపవిఖ్యాతం సర్వపాపప్రణాశనమ్‌. 71

తత్ర స్నాత్వా నరో రాజ న్థనవా న్రూపవా న్భవేత్‌ | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర తీర్థం కనఖలం మహత్‌ . 72

గరుడేన తప స్తప్తం తస్మిం స్తీర్థే నరాధివ | ప్రఖ్యాతం త్రిషు లోకేషు యోగినీ యత్ర తిష్ఠతి. 73

క్రీడతే యోగిభి స్సార్ధం శివేన సహ నృత్యతి | తత్ర స్నాత్వా నరో రాజ న్రుద్రలోకే మహీయతే. 74

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర హంసతీర్థ మనుత్తమమ్‌ | హంసా రూప స్తత్ర వినిర్ముక్తా గతా ఊర్థ్వం న సంశయః. 75

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర సిద్దో యత్ర జనార్దనః | వారాహం రూప మాస్థాయ అర్చితః పరమేశ్వరః. 76

వారహతీర్థే య స్స్నాత్వా ద్వాదశ్యాం తు విశేషతః | విష్ణులోక మవాప్నోతి నరకం న చ పశ్యతి . 77

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర చన్ద్రతీర్థ మనుత్తమమ్‌ | పౌర్ణమాస్యాం విశేషణ స్నానం తత్ర సమాచరేత్‌. 78

స్నాతమాత్రో నర స్తత్ర మహీయతే |

తరువాత గౌతమేశ్వర తీర్థము; అందు స్నానముచేసి ఆనాడచట ఉపవసించిన వారు బంగారు విమానముపై బ్రహ్మలోక ప్రాప్తి నందుదురు; తరువాత నర్మదయాందుడినదగు ధౌత పాపతీర్థము; దీనిని ధర్మరూపుడగు వృషభ##మే ఏర్పరచెను; ఈ తీర్థము తనయందు స్నానమాడినవారి బ్రహ్మహత్యా దోషమును కూడా పోగొట్టును; ఇచ్చట ప్రాణత్యాగ మొనర్చువాడు చతుర్భుజుడును త్రినేత్రుడునునై రుద్ర సమాన బలుడగును; పదివేల కల్పములు సంపూర్ణముగా శివతుల్య పరాక్రముడై శివలోక సుఖమందును; చాలకాలము తరువాత ఇచ్చట స్నానమాత్రముననే ప్రయాగయందువలె మహాఫల మబ్బును; భాద్రపద శుక్లాష్టమినాడిచతట స్నామాడి ఒక అహోరాత్రముపవసించినవారు యమదూతత వలని బాధలందక రుద్రలోకమేగుదురు; తరువాత సాక్షాత్తుగ విష్ణునకే సిద్ధి కలిగించినదియు సర్వపాప ప్రణాశనమునగు హిరణ్య ద్వీపమును రుద్రలోకమేగుదురు; తరువాత సాక్షాత్తుగ విష్ణునకే సిద్ది కలిగించినదియు సర్వపాప ప్రణాశనమునగు హిరణ్య ద్వీపమను తీర్థము; ఇందు స్నానమాడిన వారు ధనవంతులును రూవంతులును నగుదురు; తరువాత గొప్పదియగు కనఖల తీర్థము; ఇందు గరుడుడు తపమొనరించెను; యోగినీశక్తి ఇందుండునని త్రిలోక ప్రసిద్ధమిది; ఆమె యోగులతో కలసి విహరించును; శివునితో కలిసి నృత్యము చేయును; ఇందు స్నానమాడినవారు రుద్రలోక ప్రాప్తులగుదురు; తరువాత హంస తీర్థము: అందు హంసలు పాప వినిర్మక్తములయి ఊర్థ్వలోకమేగెను; తరువాత వరాహ తీర్థము; అందు విష్ణువు కూడా సిద్దినందెను; ఇచట శివుడు వరాహరూపుడై పూజింపడును; ద్వాదశినాడు ఇందు స్నానమాడినవారు నరకమును చూడరు; విష్ణులోకమునకేగుదురు; తరువాత అనుత్తమమగు చంద్రతీర్థము; ఇందు పూర్ణిమనాడు స్నానమాడుట అధిక ఫలప్రదము, దానిచే చంద్రలోక వాసమును దానిచే మహాసుఖ ప్రాప్తియునగును.

దక్షిణన తు తీర్థేణ కన్యాతీర్థం తు విశ్రుతమ్‌. 79

శుక్లపక్షే తృతీయాయాం స్నానం తత్ర సమాచరేత్‌ | ప్రణిపత్యతు చేశానం బలి న్తేన ప్రసీదతి. 80

హరిచన్దపురం దివ్య మన్తరిక్షేతు దృశ్యతే | శక్రధ్వజే సమావృత్తే సుప్తే నాగరికే జనే. 81

నర్మదాతోయ వేగేన తరూ న్త్సవ్ల్పూవయిష్యతి | అస్మిం స్థానే నివాస స్స్యా ద్విష్ణు శ్శజ్కర మబ్రవీత్‌.

ద్వీపేశ్వరే నరస్స్నాత్వా లబే ద్బహుసువర్ణకమ్‌ | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర రుద్రకాన్యాసుసఙ్గమే. 83

స్నాతమాత్రో నర స్తత్ర దేవ్యా స్థ్సాన మవాప్నుయాత్‌ | దేవతీర్థం తతో గచ్ఛే త్సర్వ తీర్థ మనుత్తమమ్‌.

తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర దైవతై స్సహ మోదతే | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర శిఖితీర్థ మనుత్తమమ్‌. 95

య త్తత్ర దీయతే దానం సర్వం కోటిగుణం భ##వేత్‌ |

అపరపవక్షే త్వమాయాం స్నాంన తత్ర సమాచరేత్‌. 86

బ్రాహ్మణం భోజయే దేకం కోటి ర్భవతి భోజితా | భృగుతీర్థేతు రాజేన్ద్ర తీర్థం కోటి ర్వ్యవస్థితా. 87

అకామో వా సకామో వా తత్ర స్నాయాచ్చ మానవః | అవతారః కృ స్తత్ర శఙ్కరేణ మహాత్మనా. 89

ఇతి శ్రీమత్స్యమహాపురాణ నర్మదామాహాత్మ్యే దశాశ్వమేధతీర్థాది హిమానువర్ణనం నామ ద్వినవత్యుత్తర శతతమోధ్యాయః.

తరువాత నర్మదా దక్షిణ తీరమందలి కన్యాతీర్థము, ఇది చాల ప్రసిద్ధము; శుక్లపక్ష తృతీయనాడు ఇందు స్నానమాడి ఈశ్వరునికి నమస్కరించి బలి (నివేదనము) ఇచ్చినచో రుద్రుడు ప్రసన్నుడగును; అంతరిక్షమునందు హరిత (అకుపచ్చని)కాంతితో చంద్రుని నగరము కనబడుచుండగా ఇంద్ర ధ్వజోత్సవము ముగిసిన తరువాత మాసములో (రాత్రివేళ) నగరములందలి జనము నిదురించు సమయమున నర్మద తన జలవేగముతో (తన తీరములందలి) వృక్షములను తేల్చివేయు కాలములో ఈ స్థానమునందు నివసించవలయును. ఇది అధిక ఫలప్రదము; అని విష్ణుడు స్వయముగా శివునితో పలికెన; తరువాత ద్వీపేశ్వర తీర్థము; అందు స్నానము చేసినచో బహు సువర్ణము లభించును; (అధిక సంపద కలుగును.) తరువాత రుద్రకన్యా (ఉపనది) సంగమ తీర్థము; అందు స్నానమాడిన మాత్రమున దేవీస్థాన ప్రాప్తుడగును; తరువాత మహోత్తమమగు దేవతీర్థము; దాని యందు స్నానమాడినవారు దేవతలతో కూడి సుఖింతురు; తరువాత అనుత్తమమగు శిఖినీర్థము; అందు చేసిన దానములు ఇతరత్ర చేసిన అదే దానపు పలమునకు కోటిరెట్లుగ ఫలమునిచ్చును; కృష్ణపక్షమున అమావాస్యనాడు అచ్చట స్నానమాడి బ్రాహ్మనొక్కని భుజింపజేసినను కోటిమంది బ్రాహ్మణులను భుజింపజేసినట్లగును; రాజేంద్రా! ధర్మజా! మొదట చెప్పిన భృగు తీర్థమునందు కోటి తీర్థముల మహిమమున్నది; దాని మహిమము ఎట్టిదన ఇది భృగుతీర్థమని తెలిసినకాని తెలికయకాని చిత్తములో కోరికలుండికాని లేకకాని ఇందు స్నానము చేసినంత మాత్రముననే మానవలుకు సహస్రాశ్వమేధ యాగములు చేసినందున కలుగునంత ఫలము కలుగును, వారు దేవతలతో కూడా వారితోపాటుల సుఖింతురు; ఏలన ముని పుంగవుడగు భగుడే మహాసిద్ధి పొందిన ప్రదేశమది; అందు మహాత్ముడగు శంకరుడు అతనికి సాక్షాత్కరించి తన అవతారము చూపెను.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున దశాశ్వమేధ తీర్థాది మహిమాను వర్ణనమను నూట తొంబది రెండవ అద్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters