Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టాశీత్యుత్తరశతతమోధ్యాయః.

నర్మదామాహాత్య్యే కౌభేరీ సంగమ మహిమానువర్ణనమ్‌.

సూతః : పృచ్ఛన్తి చ మహాత్మానో మార్కణ్డయం మహామునిమ్‌ |

యుధిష్ఠిర పురోగాస్తే ఋషయశ్చ తపోధనాః. 1

ఆఖ్యాహి భగవం స్తథ్యం కావేరీ(కోబేరి)సజ్గమం మహత్‌ |

లోకానాం చ హితార్థాయ అస్మాకంచ వివృద్ధయే. 2

సదా పాపరతా యే తు సదా దుష్కృతకర్మిణః | ముచ్యన్తే సర్వపా పేభ్యో గచ్ఛన్తి పరమం పదమ్‌. 3

ఏతదిచ్ఛామ విజ్ఞాతుం భగవ న్వక్తు మర్మసి |

మార్కణ్డయః : శృణుధ్వం సహితా స్పర్వే యుధిష్ఠిరపురోగమాః. 4

ఆస్తి వీరో మహాయక్షః కుబేర స్సత్యవిక్రమః | ఇదం తీర్థ మనుప్రాప్య రాజా యక్షాధిపోభవత్‌. 5

సిద్ధిం ప్రాప్తో మహారాజ తన్మే నిగదత శ్శృణు | కావేరీ (కౌబేరీ) నర్మదా యత్ర సంగమో లోకవిశ్రుతః. 6

తత్ర స్నాత్వా శుచిర్భూత్వా కుబేర స్సత్యవిక్రమః |

తపోతప్యత యక్షేన్ద్రో దివ్యం వర్షశతం మహత్‌. 7

తస్య తుష్టో మహాదేవః ప్రదాతుం వర ముత్తమమ్‌ |

బోభో యక్ష మహాసత్త్వ వరం బ్రూహి యథేప్సితమ్‌. 8

బ్రూహి కార్యం యథేష్టంతు యత్తే మనసి వర్తతే |

కుబేరః యది తుష్టోసి దేవేశ యది దేయో వరో మమ. 9

అద్యప్రభృతి సర్వేషాం యక్షాణా మధిపో భ##వే |

మార్కణ్డయః : కుబేరస్య వచుశ్శ్రత్వా పరితుష్టో మహేశ్వరః. 10

ఏవమస్తు తతో దేవ స్తత్రైవాన్తరధీయత | సోపి లబ్దవరో యక్ష శ్శీఘ్రం యక్షకులం గతః. 11

పూజిత స్వర్వయక్షైస్తు హ్యభిషిక్తశ్చ పార్థివ |

నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము

కావేరీ(కౌబేరీ) సంగమ మాహాత్మ్యము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: యుధిష్ఠిరుడు మొదలగువారును తపోధనులగు ఋషులును మార్కండేయ మహామునిని ఇట్లడిగిరిః భవనమ్‌ ! లోకముల హితమునకును మాకు శుభమగుటకును సదా పాపాసక్తులయి దుష్కృతము లాచరించువారు సర్వపాపనిర్ముక్తులయి పరమపదము చేరుటకును కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మాహాత్మ్యమును మాకు చెప్పి యది తెలుప ప్రార్థించుచున్నాము; అన మార్కండేయుడిట్లు చెప్పెను; యుధిష్ఠరాదులారా ! అందరును వినుడు; వీరుడును మహా విక్రమశాలియునగు కుబేరుడను మహాయక్షుడుండెను. ఈ తీర్థమునకు వచ్చినందుననే యతడు యక్షాధి పతియయ్యెను; మహారాజా ! అతనికి సిద్ధి కలిగిన విధము తలిపెదను వినము; తోక విశ్రుతమగు కావేరీ (కౌబేరీ) నర్మదా నదుల సంగమము కలచోట సత్యవిక్రముడగు కుబేరుడను ఆయక్ష శ్రేష్ఠుడు స్నానమాడి శుచియై నూరు దివ్య వత్సరముల కాలముపాటు తపమారించెను; అతని విషయమున తుష్టుడయి మహాదేవుడు అతనికి ఉత్తమమగు వరమీయదలచివచ్చి ''మహాసత్త్వము (శక్తి) గల యక్షుడా! నీ యథేప్సిత వరమేమి? నీ మనస్సునందుగల కార్యము ఏదో తెలుపుము;'' అనగా కుబేరుడిట్లనెనె; దేవేశా ! నీవు తుష్టుడవయి నాకు వరమీయదలచినచో ఇది మొదలు నేను యక్షులకు అధిపతియగుదగాక!'' అనెను? కుబేరుని వచనమును విని మహాదేవుడు పరితుష్టుడయి సరేయని యంతర్థానమందెను; ఆ కుబేరుడును యక్ష పుంగవుడును వరమంది వెంటనే యక్ష నివాసమునకేగి సర్వయక్షుల పూజలనందుకొని వారిచే వారకిధిపతిగా అభిషిక్తుడయ్యెను.

కావేరీ(కౌబేరీ) సజ్గమం తత్ర సర్వపాపప్రణాశనమ్‌. 12

యే నరా నాభిజానన్తి వఞ్చితాస్తే న సంశయః | తస్మా త్సర్వప్రయత్నేన తత్ర స్నాయీత మానవః. 13

కావేరీ (కౌబేరీ) చ మహాపుణ్యా నర్మదాచ మహానదీ |

తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర హ్యర్చయే ద్వృషభధ్వజమ్‌. 14

అశ్వమేదఫలం ప్రాప్య రుద్రలోకే మహీయతే | అగ్ని ప్రవేశం యః కుర్యా ద్యశ్చ కుర్యా దనాశకమ్‌. 15

అనివర్త్యా గతి స్తస్య యథా మే శజ్కరోబ్రవీత్‌ | సేవ్యమానో వరస్త్రీభిః క్రీడితే దివి రుద్రవత్‌. 16

షష్టివర్ష సహస్రాణి షష్టికోట్య స్తథాపరాః | మోదతే రుద్రలోకస్థో యత్ర తత్రైవ గచ్ఛతి. 17

పుణ్యక్షయా త్పరిభ్రష్టోరాజా భవతి ధార్మికః | భోగవా న్దానశీలశ్చ మహాకులసముద్భవః 18

తత్ర పీత్వా జలం సమ్య క్ఛాన్ద్రాయణఫలం లభేత్‌ |

స్వర్గం గచ్ఛన్తి తే మర్త్యా యే పిబన్తి జలం శుభమ్‌19

గజ్గాయమునయో ర్మధ్యే యత్ఫలం ప్రాప్నుయా న్నరః |

కావేరీ (కౌబేరీ) సజ్గమే స్నాత్వా తత్ఫలం తస్య జాయతే. 20

ఏవం తు తత్ర రాజేన్ద్ర కౌబేరీసజ్గమం మహాత్‌ | పుణ్యం మహాత్ఫలం తత్ర సర్వపాపప్రణాశనమ్‌. 21

ఇతి శ్రీమత్య్సమహాపురాణ నర్మదామాహాత్మ్యే కావేరీ(కౌబేరీ)సజ్గమమహిమాను

వర్ణనం నామ అష్టాశీత్యుత్తరశతతమోధ్యాయః.

ఇట్టి సర్వపాప ప్రణాశకమగు కావేరీ (కౌబేరీ) సంగమము నెరుగనివారు జీవితమున వంచితులయినట్లే ; కావున నిది ఎరిగి మానువుడందు స్నానమాడవలయును; కావేరీ (కౌబేరీ) నర్మదలు రెండును మహాపుణ్య ప్రదములగు మహానదులే; వాటి సంగమమమందు సర్వ ప్రయత్నములతో స్నానమాడి వృషభధ్వజునర్చించినచో అశ్వమేధ ఫల మంది రుద్ర లోకమున పూజితుడయి సుఖించును; అచ్చట అగ్ని ప్రవేశముతోగాని ప్రాయోప వేశముతోగాని దేహత్యాగము చేసినచో పునరావృత్తి రహిత గతినందును; ఉత్తమ స్త్రీల పరిచర్యలందుకొనుచు ద్యులోకమున రుద్రునివలె సుఖించును; రుద్ర లోకమునందు నివసించుచు కోరిన చోటికెల్ల పోవుచు సంచరించుచు ఆరువది కోట్ల ఆరువది వేల సంవత్సరముల రుద్ర లోకముందుండి సుఖించును; పుణ్యక్షయానంతరము రుద్రలోకమునుండి భ్రంశమునందిపడినను ధార్మికుడు భోగవంతుడు దాన శీలుడు మహావంశ సంజాతుడునగు రాజగును; అచటి జలమును త్రాగినచో చాంద్రాయణ వ్రతమాచరించిన ఫలము లభించును; స్వర్గ ప్రాప్తియగును; కావేరీ (కౌబేరీ) నర్మద సంగమ స్నానముచే గంగా యమునా సంగమ స్నానఫలము లభించును; రాజేంద్రా! కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మహత్త్వము ఇట్టిది; ఇది పుణ్య కరము; మహా ఫలప్రదము; సర్వపాప ప్రణాశనకము.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మహిమాను వర్ణనమను నూట డెబ్బది ఎనిమిదవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters