Sri Matsya mahapuramu-2    Chapters   

నూట ఎనుబది నాలుగవ అధ్యాయము.

వ్యాసుడు కాశిని శపింపబూనుట-అవిముక్త మహాత్మ్య సమాప్తి.

(గమనికి: 181వ, 183వ, 184వ, అధ్యాయములందు స్కందుడు ఋషులకు అవిముక్త క్షేత్ర మహాత్మ్యమును చెప్పినవాడుగా పురాణమున కనబడుచున్నది. స్కందుడనగా శివుని పుత్త్రుడగు కుమారస్వామియని ప్రసిద్ధముగా నున్నది. కాని 181వ అధ్యాయారంభమందును ఈ 184వ అధ్యాయారంభమందును ఈ స్కందునకు గల గుణముల తెలుపు విశేషణములను బట్టి ఈ స్కందుడు కుమారస్వామి కాడేయోయని తలచవలసి వచ్చుచున్నది. ఛాందోగ్యోపని షత్తునందలి సప్తమాధ్యాయాంత వచనమునుబట్టి సనత్కుమారుడును బ్రహ్మమానస పుత్త్రునకు కూడా స్కందుడను పేరు వైదిక వాజ్మయమున కలదని తెలియుచున్నది. ఈ స్కందుడును ఆ ననకనందన సనత్సుజాత సనత్కు మారులలోని సనత్కుమారుడే అయియుండునని గ్రహించవలయును-అనువాడకుడు.)

చతురశీత్యుత్తరశతతమోధ్యాయః

అవిముక్త మాహాత్మ్యసమాప్తిః

సూతః : అవిముక్తే మహాపుణయే ఆస్తికాః ప్రియదర్శనాః |

విస్మయం పరమం జగ్ముర్హర్షగద్గదనిస్వనాః 1

ఊచుస్తే హృష్టమానస స్స్కన్దం బ్రహ్మవిదాం రవమ్‌ |

బ్రహ్మణో దేవః పుత్రస్త్వం బ్రహ్మణో బ్రాహ్మణప్రియః 2

బ్రహ్మిష్ఠో బ్రహ్మవి ద్బ్రహ్మ న్బ్రహ్మేన్ద్రో బ్రహ్మలోకకృత్‌|

బ్రహ్మవిద్బ్రహ్మచారీ త్వం బ్రహ్మాది ర్బ్రహ్మవత్సలః. 3

బ్రహ్మతుల్యోద్బవకరో బ్రహ్మతుల్య నమోస్తు తే | భావితోత్మాచ శ్రుత్వేదం పరమం పావనం మహాత్‌.

తత్త్వంతు పరమం జ్ఞాతం యద్ఞాత్వామృత మశ్నుతే. |

స్వస్తి తేస్తు గమిష్యావో భూర్లోకం శజ్కరాలయమ్‌. 5

యత్రాసౌ సర్వభూతాత్మా స్థాణుభూత స్థ్సితః ప్రభుః | సర్వలోకహితార్థాయ తపస్యుగ్రే వ్యవస్థితః. 6

సంయోజ్య యోగేనాత్మానం రౌద్రీం తను ముపాశ్రితః |

గుహ్యకై రాత్మభూతస్తు ఆత్మతుల్యగుణౖ ర్వృతః. 7

తథా బ్రహ్మాదిభి ర్దేవై స్సిద్ధైశ్చ పరమర్షిభిః | విజ్ఞాయ పరయా భక్త్యా తత్ప్రసాదా ద్గణశ్వరమ్‌. 8

వస్తుమిచ్ఛామి నియత మవిముక్తే సునిశ్చితాః | ఏవంగుణా స్థథా మార్త్యా హ్యవిముక్తే వసన్తి యే. 9

ధర్మశీలా జితక్రోధా నిర్మమానియతేన్ద్రియాః | ధ్యానయోగపరా స్సిద్ధం గచ్ఛన్తి పద మవ్యయమ్‌. 10

యోగజ్ఞా యోగసిద్ధాశ్చ యోగమోక్షప్రదం విభుమ్‌ | ఉపాసన్తే భక్తియుక్తా గుహ్యం దేవం సనాతనమ్‌. 11

అవిముక్తం సమాసాద్య ప్రాప్తయోగ మహేశ్వరాత్‌ | పరే బ్రహ్మణి సంలీనా భవసాయుజ్యతాం గతాః. 12

ఏతత్తుపరమం క్షేత్ర మవిముక్తం విదు ర్భుధాః | అప్రబుద్ధా న పశ్యన్తి భవమయావిమోమితాః. 13

తేన చైవాభ్యనుజ్ఞాతా స్తన్నిష్ఠా న్తత్పరాయాణాః | అవిముక్తే తనుం త్యక్త్వా శాన్తా యోగగతింగతాః. 14

మహాపుణ్య ప్రదమగు అవిముక్త క్షేత్రమునందు స్కందుని వలన ఆ క్షేత్ర మహ్మ్యామును వినుచున్న వారును ప్రియదర్శనులు (ప్రీతి కలిగించు శుభరూపము కలవారు)ను నగు ఆస్తికులెల్లరును హర్షముచే గద్గద కంథులయిరి; మహాశ్చర్యమందిరి; మనమునందలి హర్షముతో వారు బ్రహ్మవేత్తలలో ఉత్తముడగు ఆ స్కందునితో ఇట్లనిరి; నీవు బ్రహ్మ దేవని పుత్త్రుడవు. బ్రహ్మణ్యుడవు బ్రహ్మణ ప్రియుడవు బ్రహ్మిష్ఠుడవు బ్రహ్మవిదుడవు (పర) బ్రహ్మ రూపుడవు బ్రహ్మ (బ్రహ్మతత్త్వవేత్త) లలో ఇంద్రు(నంతటివా)డవు; బ్రహ్మలోక కర్తవు బ్రహ్మ విదుడవగుటకై బ్రహ్మచర్య వ్రత మనుష్ఠించిన(చు) వాడవు; బ్రహ్మ (వేద)మునకును ఆది భూతుడవు; బ్రహ్మ (వేద)మునందు వత్సలుడు (ప్రీతి కల వాడవు;) బ్రహ్మదేవునితో సమముగా సృష్టి చేయగలవాడవు; బ్రహ్మతో సముడవు; ఇట్టి నీకు నమస్కారము; పరమము పావనము గొప్పదియగు దీనిని విని మా ఆత్మ (మనస్సు) భావితము (ఉత్తమ సంస్కారవంతము) అయినది: ఏది ఎరిగినచో అమృతత్వము సిద్ధించునో అట్టి పరమతత్త్వమెరిగితిమి; నీకు శుభమగుగాక; మేమిపుడు శంకరుని నివాసమగు భూర్లోకమునకు పోవుదము; అచ్చటి సర్వభూతములకు ఆత్మరూపుడు (అంతర్యామి) అగు ప్రభువు స్థాణురూపుడై సర్వలోక హితార్థమయి ఉగ్రమగు తపస్సునందు నిలిచి తన ఆత్మను యోగముతో సంయోజనపరచి రౌద్ర తత్త్వప్రధానమగు దేహము దాల్చి పరమాత్మరూపుడతడు తనతో సమాన గుణములు కలవారగు గుహ్యకులను బ్రహ్మాది దేవతలును సిద్ధులును పరమ ఋషులును తమ పరివారించి యుండగా ఉన్నాడు గదా! ప్రమథ గణశ్వరా! మేముచటికేగి వచ్చిన తరువాత పరమభక్తితో క్షేత్ర మాహాత్మ్యము నెరగిన మేమందరమును సునిశ్చయముతో నియతముగా అవి ముక్తమునందే వసింపగోరుచున్నాము; అని స్కందునితో ఋషులు పలికిరి.

(అని ఇంత చెప్పి పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను:) దేవీ! అవిముక్తమందు ఈ (చెప్పబోవు) విధములగు గుణములు గలవాడు; వారు ధర్మశీలురు; క్రోధమును మమకారమును ఇంద్రియములను జయించినవారు; ధ్యానయోగపరులు, యోగసిద్ధిని ఆవ్యయ (నాశరహిత) స్థానమును పొందువారు; యోగజ్ఞులు యోగసిద్ధులు; వారు భక్తియుక్తులయి భోగయోగ మోక్షప్రదుడును విభుడును గుహ్య (రహస్య) రూపుడును సనాతనుడును అగు మహాదేవుని ఉపాసించుచుందురు; వారు అవిముక్తమందుండి మహేశ్వరుని వలన యోగమెరిగి సాధనచేసి పరబ్రహ్మముందు చిత్తలయమంది తుదకు శివ సాయుజ్యమందుదురు; ఈ అవిముక్తము పరమ (ఉత్తమ) క్షేత్రమని పండితులందురు; శివుని మాయచే విమోహితులగు అప్రబుద్ధులు (అవివేకులు) దీనిని చూడ (సరిగ తెలియ) జాలరు; శివునిచే అభ్యనుజ్ఞనంది అతనియందు శ్రద్ధ కలిగి అతనిని పరమ గమ్యముగా నెంచి అవిముక్తము నొనర్చి శాంతులయి యోగ (సిద్ధిచే గలుగు ఉత్తమ) గతిని పొందుదురు;

స్థానం గుహ్యం శ్మశానానాం సర్వేషా మేద దుచ్చతే | నహి యోగాదృతే మోక్షః ప్రాప్యతే భువి మానవైః.

అవిముక్తే నివసతాం యోగో యోక్షశ్చ సిద్ధ్యతి | అనేక జన్మనైవేహప్రాప్యతే గతి రుత్తమా. 16

ఏక ఏవ ప్రభావోస్తి క్షేత్రస్య పరమేశ్వరి | ఏకేన జన్మనా దేవి మోక్షం పశ్యత్యనుత్తమమ్‌. 17

అవిముక్తే నివసతా వ్యాసేనామితతేజసా | నైవ లబ్ధా క్వచిద్భిక్షాభ్రమమాణన యత్నతః 18

క్షుధావిష్టనుః క్ష్రుద్ధ శ్చిన్తయ ఞ్చాప ముత్తమమ్‌ | దినందినంప్రతి వ్యాస ష్షణ్మాసం యోవతిష్ఠతి. 19

కథం మమేదం నగరం భిక్షాదోషా ద్ధతం త్విదమ్‌ | విప్రోవాక్షత్త్రయో వాపి విధవా బ్రాహ్మణీపి వా.

సంస్కృతాసంస్కృతా వాపి పరిపక్తాః కథన్ను మే |

న ప్రయచ్ఛన్తి వై లోకా బ్రాహ్మణాశ్చర్యకారకమ్‌. 21

ఏషాం శాపం ప్రదాస్యామి తీర్థస్య నగరస్య తు | తీర్థం చాతీర్థతాం యాతు నగరం శాపయామ్యహమ్‌.

మాభూ త్త్రిపురుషీ విద్యా మాభూ త్త్రిపురుషంధనమ్‌ |

మాభూ త్త్రిపురుషం సఖ్యం వ్యాసో వారాణసీం శప೯. 23

అవిముక్తే నివసతాం జనానాం పుణ్యకర్మణామ్‌ | విఘ్నం సృజామి సర్వేషాం యే సిద్ధి ర్న విద్యతే. 24

వ్యాసచిత్తం తదా జ్ఞాత్వా దేవదేవ ఉమాపతిః | భీతభీత స్తదా గౌరీం తాం ప్రియాం పర్యభాషత. 25

శృణు దేవి! వచో మహ్యం యాదృశం ప్రత్యుపస్థితమ్‌ |

కృష్ణద్వైపాయనః కోపా చ్ఛాపం దాతు సముద్యతః. 26

దేవీ : కిమర్థం శపతే క్రుద్ధో వ్యాసః కేన ప్రకోపితః |

కిం కృతం భగవం స్తస్య యేన శాపం ప్రయచ్ఛతి. 27

ఇది లోకమందలి శ్మశానములన్నింటిలోను గుహ్యమగు (రహస్య తత్త్వముగల స్థానము) అని పెద్దలందురు; ఏలయన భూలోకవాసులగు మానవులగు యోగము లేనిదే ముక్తి లభించదు; కాని అవిముక్త వాసులకు మాత్రము యోగ మోక్షముల రెండును సిద్ధించును; ఈ జన్మమందే వారికి ఉత్తమగతి లభించును; దేవీ! ఏక జన్మముతోనే అనుత్తమమగు యోక్షమందుదురనున దొక్కటియే పరమేశ్వరీ! ఈ క్షేత్ర మహాప్రభావము;

(పూర్వము కారణాంతరమున అవిముక్తముపై కోపించి దానిని శపింపబూనిన వ్యాసుడును దానిని విడువజాలక పోయెను. ఆ కథ తెలిపెద వినుము.) అమిత తేజస్కుడగు వ్యాసుడొకప్పుడిందు వసించుచుండగా అతడు తన శక్తి యున్నంతవరకు సంచరించియు ఎటను భిక్ష పొందజాలకపోయెను. అతని తనువున క్షుధాక్లేశమధికమయ్యెను; అతడు క్రుద్ధుడయ్యెను; నేను దినదిన క్రమమున ఇట ఆరుమాసములుంటిని; ఇది ఎట్లు? ఈ నగరము నాకు భిక్ష నీయకున్నది; ఈ దోషముతో ఇది హతమైనది; (చెడినది;) ఇచటి బ్రాహ్మణుడో క్షత్త్రియుడో బ్రాహ్మణ విధవయో ఎవరేకాని నాకు సంస్కరించినదో సంస్కరించనిదో ఏదోయొక పరిపక్వాన్న మీయకున్నారే! ఏమి బ్రాహ్మణులు ఏమి జనులు వీరు? ఆశ్చర్య కరముగ నున్నదే! వీరికిని ఈ తీర్థమునకును ఈ నగరమునకును శాపము పెట్టుదును; దానితో తీర్థము అతీర్థమగుగాక; అవిముక్తమునందు ఎంత పుణ్యకర్మలకైరనను నాశాప ప్రభావమున వరుసగా మూడుతరములపాటు విద్యకాని ధనముకాని సఖ్యము (మోక్షము) కాని కలుగకుండుగాక! ఇట్లు శపించి ఇచటివారికి కలుగు సిద్ధియందు విఘ్నము కలిగింతును; అని అతడు శపింప సంకల్పించెను. ఇది ఎరిగి దేవదేవుడగు ఉమాపతి భయమందుచు తన ప్రియదేవి యగు గౌరితో ఇట్లనెను; దేవీ! నామాట వినుము; ఎట్టి స్థితి వచ్చినదో చూడుము; కృష్ణద్వైపాయనుడు కోపించి శపింపబూనినాడు; అనగా దేవీ ''దేవా: ఎందుచే అతడు క్రుద్దుడై శపించుచున్నాడు? అతనికి భగవానుడగు నీవేమి కీడు చేసితివి? అనగా దేవదేవు డిట్లు పలికెను:

దేవదేవః అనేన సుతప స్తప్తం బహూన్వర్షగణా న్ప్రియే |

మౌనినా ధ్యానయుక్తేన ద్వాదశాబ్దా న్వరాననే. 28

తతః క్షుధా సుసఞ్జతా బిక్షమటితు మాగతః | నైవాస్యకేనచి ద్భిక్షా గ్రాసార్థమపి భామిని. 29

ఏవం భగవతః కాల ఆసీ త్షాణ్మాసికో మునేః || తతః క్రోధపరీతాత్మా శాపం దాస్యతి సోధునా. 30

యావన్నైష శ##పే త్తావ దూపాయ స్తత్ర చిన్త్యతామ్‌ |

కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రియే. 31

కోస్య శాపా న్న బిభేతి హ్యపి సాక్షా త్పితామహః | అదైవం దైవతం కుర్యా ద్దైవం చాప్యపదైవతమ్‌.

ఆవాంతు మానుషా భూత్వా గృహస్థా విహా వాసినౌ | తస్య తృఫ్తికరీం భిక్షాం ప్రయాచ్ఛావో వరాననే. 33

ఏవ ముక్తా తతో దేవీ దేవేన శమ్బునా తదా7 వ్యాసస్య దర్శంన దత్వా కృత్వా వేషంతు మానుషమ్‌. 34

ఏహ్యేహి భగవ స్త్సద్యోభిక్షాం గ్రాహయ సత్తమ | అస్మద్గృహే కదాచిత్త్వం నాగతోసి మహామునే!. 35

ఏతచ్ఛ్రుత్వా ప్రీతమనా భిక్షం గ్రహీతు మాగతః | భిక్షా దత్తా తు వ్యాసాయ షడ్రసా అమృతోపమా. 36

అనాస్వాదిత పూర్వా సా భక్షితా ఋషినా తదా | భిక్షాం వ్యాస స్తతో భుక్త్వా చిన్తయ న్హృష్టమానసః. 37

వవన్దే వరదం దేవం దేవీంచ గిరిజాం తదా | వ్యాసః కమలపత్రాక్ష ఇదం వచన మబ్రవీత్‌ 38

ప్రియా! వరాననా ! ఇతడు మౌనియై ధ్యానయుక్తుడై పండ్రెడేసి సంవత్సరములొక్కొక్క కాలావధిగా ఏర్పరుచుకొని బహువర్షములపాటు మహా తమపమాచరించెను. అది ముగించిన తరువాత అతడు ఆకలివేసి బిక్షాటనమునకు రాగా అతనికి ఇట ఎవ్వరును అరముద్దయైనను భిక్షవేయలేదు; ఈ భగవానుడగు మునికి ఆరు మాసములపాటు గడిచినది; అందుచే క్రోధ పరీత మనస్కుడై ఇపుడు శాపము ఈయనున్నాడు. ఈతడు శపించులోపుగనే కోప నివారణమునకు ఉపాయ మాలోచించవలయును; ప్రియా! ఇతడు కృష్ణద్వైపాయన వ్యాసుడన సాక్షాత్‌ నారాయణుడే అని ఎరుగుము; సాక్షాత్పితామహుడే యయినను ఇతని శాపమునకు ఏల భయపడకుండును? ఇతడు అదైవతమును దైవతమునుగా దైవతమును అదైవతముగా చేయగలవాడు; వరాననా ! మనము మానవులుగా ఇచట వసించు గృహస్థులుగా అయి ఇతనికి తృప్తి కలిగించు భిక్ష పెట్టుదము; అని శంభుడనిన వెంటనే దేవి మానుషీరూపము దాల్చి అతనికి దర్శన మిచ్చెను. సత్తమా! భగవన్‌ ! మహామునీ! ఇంతవర కెన్నడు మా ఇంటికి రాకపోతిరి; రారండు; వెంటనే వచ్చి భిక్ష గ్రహించుడు; అనెను; అది విని ప్రీతమనస్కుడై అతడు భిక్ష అందుకొనవచ్చెను; ఆమె వ్యాసునకు షడ్రనయుక్తమయి అమృతోపమమగు భిక్ష ఇచ్చెను; అంతట ఆ ఋషియు అదివర కెన్నడును ఎరుగని రుచిగల ఆ భిక్ష భుజించెను; అతడు హర్షమందిన మనస్సుతో ఆ వరదులగు దేవదేవులకు మనస్సునందే నమస్కరించి కలమ పత్త్రనేత్రుడగు ఆ వ్యాసుడు ఇట్లనెను;

దేవో దేవీ నదీగజ్గా మిష్ట శుభా గతిః | వారాణస్యాం వివాలాక్షీ వాసః కస్య న రోచతే. 39

ఏవ ముక్త్వా తతో వ్యాసో నగీ మవలోకయ | చిన్తయాన స్తతో భిక్షాం హృదయానన్దకారిణీమ్‌. 40

అపశ్య త్పురతో దేవం దేవీం చ గిరిజాం శుభామ్‌ | గృహాజ్గణస్థితం వ్యాసం దేవ దవోబ్రవీ దిదమ్‌. 41

ఇహక్షేత్రే న వస్తవ్యం సక్రోధస్త్వం మహామునే | ఏవం విస్మయమాపన్నో మహాదేవం జగాద నః. 42

వ్యాసః : చతుర్దశ్యాం తథాష్టమ్యాం ప్రవేశం దాతుమర్హసి | ఏవ మస్త్విత్యనుజ్ఞాత స్తత్రైవాన్తరధీయత. 43

న తద్గృహంస సా దేవీ న దేవో జ్ఞాయతే క్వచిత్‌ | ఏవం త్రైలోక్య విఖ్యాతః పురా వ్యాసో మహాతపాః.

జ్ఞాత్వా క్షేత్రగుణా న్భద్రే స్థిత స్తసై#్యవ పార్శ్వతః |

ఏవం వ్యాసం స్థితం జ్ఞాత్వా క్షేత్రం శంసన్తి ఫణ్డితాః. 45

అవిముక్తగుణానాం తు కస్పమర్థో వదిష్యతి | దేవబ్రాహ్మణ విద్విష్టా దేవభక్తివిమ్బకాః. 46

బ్రహ్మఘ్నాశ్చ కృతఘ్నాశ్చ తథానైష్కృ(కృ)తికాశ్చ యే | లోకాద్విషో గురుద్విష స్తీర్థాయతన దూషకాః.

ఏవం పాపరతాశ్చైవ యే చాన్యే కుత్సితా భువి| తేషాం నాస్తీతి వాసోవై స్తితోసౌ దణ్డనాయకః 47

రక్షనార్థం నియుక్తోవై దణ్డనాయక ఉత్తమః | పూజయిత్వా యధాశక్త్యా గన్ధపుష్పాదిధూవకైః. 48

నమస్కారం తతః కృత్వా నాయకస్య తు మన్త్రవిత్‌ | సర్వవర్ణావృతే క్షేత్రే నానావిధ సరీనృపే. 50

ఈశ్వరానుగృహీతా హిత గతిం గాణశ్వరీం గతాః| నానారూప ధరా దివ్యానానావేషధరా స్తథా. 51

సురావై యస్య సర్వేచ తన్నిష్ఠా స్తత్పరాయాణాః | యదిచ్ఛన్తి పరం స్థాన మక్షయం తదవాప్నువ೯. 52

ఈ దేవుడును ఈ దేవియు గంగానదియు మృష్టాన్నమును శుభగతియు లభించు ఈ వారాణసియందు నివాసము ఓ విశాలాక్షీ! ఎవరికి ఇష్టము కాదు! అని పలకి వ్యాసుడు ఆ నగరిని పరికించి చూచుచు తన హృదయానంద కారకమగు భిక్షను గూర్చి యాలోచించుచుగా అతనికి ఎట్టఎదుట మహాదేవుడును శుభయగు గిరిజాదేవియు సాక్షాత్కారించిరి; ఇంటి ముంగిట నున్న వ్యాసునితో దేవదేవు డిట్లనెను: మహామునీ! నీవు కోపివి; ఈ క్షేత్రము నీవు వసింపదగదు; అన ఆశ్చర్యపడి అతడు మహాదేవునితో ఇట్లనెనె: నా కిందు అష్టమీ చతుర్దశులందు ప్రవేశ మీయ వేడుచున్నాను.

అన సరేయని అనుమతించి మాహాదేవు డటనే యంతర్ధాన మందెను. ఆఇల్లుగాని ఆదేవుడగాని ఆ దేవి కాని ఏదియు ఎచ్చట నెండెనో కనబడకుండ అదృశ్యమయ్యెను.

భద్రా! దేవీ : ఇట్లు త్రైలోక్య విఖ్యాతుడును మమాతపస్కడును నగు వ్యాసుడు ఈ క్షేత్రుగుణముల నెరిగి దాని సమీపమందే యుండెను. ఇట్లు అచట వ్యాసుడండుటనుబట్టియే ఈ క్షేత్రపాశ్రస్త్వమును పండితులు నిర్ణయించినారు; ఈ అవిముక్త క్షేత్రగుణముల నన్నిటిని చెప్పగలవాడెవ్వడు? దేవ బ్రాహ్హణద్వేషులు దేవభక్తిని నటించువారు వెక్కిరించు వారు బ్రాహ్మఘ్నులు కృతఘ్నులు వంచకులు జనద్వేషులు గురుద్వేషులు తీర్థక్షేత్రముల నిందించువారు అపవిత్రమొనరించు వారు పాపానక్తులు కుత్సితులు దీనియందు ప్రవేశించరాదని వసించరాదని దండనాయకుడు కాపుదలగా ఉంచబడినాడు; కావున యథోచితమంత్రముల నెరిగి వానితో ఈ దండనాయకోత్తముని గంధపుష్పదీప ధూపాదికముతోపూజించి నమస్కరించి సర్వవర్ణములవారును సర్వవిధసరీసృపములును ఆవరించియుండు ఈ క్షేత్రమున ప్రవేశించి వసించువారు ఈ శ్వరాను గ్రహు నంది గణశ్వరులు అందు గతినందిరి. నానారూపధరులను దివ్యులును నానావేష ధరులనునయి గణాధినాధరూపులయిరి; సర్వదేవతలుకూడ అవిముక్తమందు పరమేశ్వరుని యందు శ్రద్దకలిగి అతనినే పరమగతిగా నెంచి ఏగతినందగోరుదురో అట్టి పరమాక్షయ స్థానమునందిరి.

పరంపదం దేవపదా ద్విశేష మేత త్పురం బ్రహ్మఫురాత్పరః స్థితమ్‌ |

తపోబలా దీశ్వరయోగనిర్మితం న తత్సమం బ్రహ్మదివౌకసాలయమ్‌. 53

మనోరమం కామగమం హ్యనామయ మతీత్య తేజాంసి తపాంసియోగవత్‌. 54

తపాంసి యాని తప్యన్తే వ్రతాని నియమా స్తథా | సర్వతీర్థాభిషేకం తు సర్వదానఫలానిచ 55

సర్వయజ్ఞేషు యత్పుణ్య మవిముక్తే తదాప్నుయాత్‌ | అతీతం వర్తమానంచ అజ్ఞానా ద్ఞానతోపి వా. 56

సర్వం తస్య కృతం పాపం క్షేత్రం దృష్ట్వా వినశ్యతి | శాన్తైర్దాన్తైస్తపోభిర్వా యత్కిఞ్చద్దర్మసంజ్ఞితమ్‌.

సర్వమేత దవాప్నోతి అవిముక్తే జితేన్ద్రియః |

ఈ అవిముక్తపురము వరము పదము; దేవస్థానమగు స్వర్గముకంటె విశిష్టతరమయినది; బ్రహ్మపురముకంటే పైగానున్నది; అంతకంటె గొప్పది; ఈశ్వరుడు తన తపోబలముచే దీనిని నిర్మించెను. బ్రహ్మలోక స్వర్గలోకములును దీనితో సమములుకావు; ఇది మనోరమము; కోరినట్లు పోగలది; ఏ భాదలును లేనిది; సకల తేజస్సులను తపశ్శక్తులను మించిన యోగశక్తి కలది; ఈస్థానము నధిష్టించి దేవదేవుడు విరాజిల్లుచున్నాడు; తపస్సులచే వ్రతములచే నియమమములచే సర్వతీర్థాభిషేక (స్నాన)ములచే సర్వదానములచే లభించే ఫలములను సర్వయజ్ఞ ఫలములను అవిముక్త క్షేత్రవాసము చేతనే లభించును; తెలిసినకాని తెలియకకాని ఇదివరకు చేసినది ఇపుడు చేయుచున్నదియగు పాపమంతయును ఈ క్షేత్రదర్శనమున నశించును; శాంతులు దాంతులునగు మునులు తపస్సులుచేసి సంపాదించు ధర్మముచే కలుగుఫలమిచట జితేంద్రియుడై వసించుటచేతనే కలుగును.

అవిముక్తం సమాసాద్య లిజ్గమర్చయతే నరః. 58

కల్పకోటిశ##తై ర్వాపి నాస్తి తస్య పునర్బవః| అమరో హ్యక్షయశ్చైవ క్రీడన్తే(తే)రుద్రసన్నిధౌ. 59

క్షేత్రతీర్థోపనిషద మవిముక్తం న సంశయః | అవిముక్తే మహాదేవ మర్చయన్తి స్తువన్తి యే. 60

సర్వపాపవిన్తిర్ముక్తా స్తేతిష్ఠన్త్యజరామరాః | సర్వకామాశ్చ యే యజ్ఞాః పునరావర్తకాశ్చ తే. 61

అవిముక్తే మృతా యేతు సర్వే తే హ్యనివర్తకాః | గ్రహనక్షత్రతారాణాం కాలేన పతనం భ##వేత్‌. 62

అవిముక్తేమృతానాంతు పతనం నైవ విద్యతే | కల్పకోటిసహసై#్త్రస్తు కల్పకోటిశ##తైరపి. 63

న తేషాం పునరావృత్తి ర్యే మృతాః క్షేత్ర ఉత్తమే |

సంసారసాగరే ఘోరే భ్రమన్తః కాలపర్యయాత్‌. 64

అవిముక్తం సమాసాద్య గచ్ఛన్తి పరమాం గతిమ్‌ | జ్ఞాత్వా కలియుగం ఘోరం హాహాభూత మచేతనమ్‌.

అవిముక్తం న ముఞ్చన్తి కృతార్థాస్తే నరా భువి | అవిముక్తం ప్రవిష్టస్తు యది గచ్ఛేత్పున ర్నరః. 66

తదా హసన్తి భూతాని అన్యోన్యకరతాడనైః | కాక్రోధేన లోభేన గ్రస్తా యేభువి మానవాః. 67

నిష్క్రామన్తి నరా దేవి దణ్డనాయకమోహితాః | జపధ్యానవిహీనానాం జ్ఞానవర్జితచేతసామ్‌ 68

తమోభిః ప్రగృహీతానాం గతి ర్వారాణసీనృణామ్‌ | తీర్థానాం పఞ్చకం సారం విశ్వేశానన్దకాననే. 69

దశాశ్వమేధం లోలార్కః కేశవో బిన్దుమాధవః | పఞ్చమీతుమహాశ్రేష్ఠా ప్రోచ్చతే మణికర్ణికా. 70

ఏభిస్తు తీర్థవర్త్యశ్చ వర్ణ్యతే హ్యవిముక్తకమ్‌ | ఏతద్వై కథితం సర్వం దేవ్యదేవేన భాషితమ్‌ .71

అవిముకత్స్య క్షేత్రస్య తత్సర్వం కథితం ద్విజాః. 71||

ఇతి శ్రీమత్య్సమహాపురాణ దేవీదేవసంవాదే అవిముక్త మాహాత్మ్య సమాప్తికథనం నామ చతురశీత్యుత్తరశతతమోధ్యాయః.

అవిముక్తమందుండి లింగము నర్చించు నరుడు నూరుకోట్ల కల్పముల తరువాత కూడ మరల జన్మంచడు; రుద్రసంనిధియందు అమరుడు నక్షయుడునై విహారించును; ఈ క్షేత్రము సర్వతీర్థోపనిషద్‌ (రహస్య) రూపమయినది; ఇది నిస్సంశయము; ఇచట మహాదేవుని అర్చించువారును స్తుతించు వారును సర్వపాపముక్తులు జరామరణరహితులై యుందురు; సర్వకామఫల ప్రదములగు యజ్ఞములు కూడా పునరావృత్తి ప్రదములు; కాని అవిముక్తమున మృతినందు వారికి మాత్రము పునారవృత్తి లేదు; గ్రహనక్షత్ర తారాతికమయిన తమ కాలము వచ్చినపుడు పతన మందవచ్చును; అవిముక్తమున మృతి నందినవారికి పదనము లేదు; వారువందల - వేల - కోట్లసంవత్సరముల తరువాతనైన పునర్జన్మా వృత్తినందురు; ఘోర సంసారసాగరమందు పరిభ్రమించువారు కూడా కాలవశమున అవిముక్తమునకు వచ్చి అట వసించి మృతి నందినచో పరమగతినందుదురు; ఈ కలియుగము ఘోరమయినది హాహాకార జనకము; చైతన్య నాశకము అని ఎరిగి అవిముక్తమునకు వచ్చి ఆటవిడువక నివసించువారు కృతార్థులగుదురు; దీని యందు ప్రవేశించియు ఇట వసింపక విడిచిపోవు వానిని చూచి సకల భూతములును చప్పట్లు చరచుచు నవ్వును; కామ క్రోధ లోభ మోహగ్రస్తులగు మానవులు మాత్రము ఇటకు వచ్చియు దండనాయకునకు భయపడి బయటకుపోవుదురు; జపధ్యానాదికములు లేక జ్ఞానరహిత చిత్తులగు వారికి తామసులకు ఈ వారణసి పరమగతి యగును; తీర్థములందు సాభూతమగునవి ఐదు: 1. విశ్వేశుడు 2. దశాశ్వమేధము 3. లోలార్కుడు 4. బిందుమాధవుడను విష్ణువు 5. మణికర్ణిక; ఈ ఐదుతీర్థములతో కూడి ఏర్పడినదయే అవిముక్త క్షేత్రము అని పెద్దలు వర్ణించుచున్నారు; ఇదియంతయు అవిముక్తమునుగూర్చి మహాదేవుడు దేవికి చెప్పినది; ద్విజులారా! ఇది యంతయు నేను మీకు తెలిపితని.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున మహా దేవదేవీ సంవాదమున అవిముక్త క్షేత్ర మహాత్మ్య కథనమను నూట ఎనుబదియైదవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters