Sri Matsya mahapuramu-2    Chapters   

త్రిసప్తత్యు త్తరశతతమో7ధ్యాయః.

తారకామరయయుద్ధార్థం దేవకృత సేనాసన్నాహః.

శ్రీమత్స్యః: శ్రుతస్తే దైత్యసైన్యస్య విస్తారో రవినన్దనlసురపాణామపపి సైన్యన్య విస్తారం వైష్ణవం శృణు. 1

ఆదిత్యా వసవో రుద్రా హ్యశ్వినౌ చ మహాబలౌ l సబలా స్సానుగాశ్చైవ సన్నహ్యన్త యథాక్రమమ్‌. 2

పురుహూతశ్చ పురతో లోకపాల స్సహస్రదృక్‌ l;అగ్రణీ స్సర్వదేవానా మారురోపా సురద్విపమ్‌ . 3

మధ్యే చాస్య రథ స్సర్వపక్షిప్రవరరంహసః l సుచారుచక్రచరతో హేమవజ్ర పరిష్కృతః. 4

దేవగన్దర్వయక్షౌఘై రనుయాత స్సహస్రశః l దీప్తిమద్బి స్సదసై#్యశ్చ దేవబ్రహ్మర్ష్యభిష్టుతః. 5

వజ్రస్తూర్జితో ద్బూతై ర్విద్యుదిన్ద్రా యధోదితైః l యుక్తో వలాహకగణౖః పర్వతైరివ కామగైః 6

యమారుఢ స్సభగవా న్పర్యేతి సకలం జగత్‌ l హవిర్థానేషు గాయన్తి విప్రా ముఖముఖే స్థితాః. 7

స్వర్గే శక్రానుయాతేషు దేవతూర్యనినాదిషు l సైన్యే సముపనృత్యన్తి శతశో హ్యప్సరోగణాః. 8

కేతునా నాగరాజేన రాజమానో యథారవిః l యుక్తో హయసహస్రేణ మనోమారుతరం హసా. 9

స స్యన్దనవరో భాతి గుప్తో మతలినా తదాl కృత్స్నః పరివృతో మేరుర్బాస్కరస్యేవ తేజసా. 10

యమస్తు దణ్డముద్యమ్య కాలయుక్తంచ ముద్గరమ్‌ l తస్థౌ సురగణానీకె దైత్యాన్నా దేన భీషయ9. 11

నూట డెబ్బదిమూడవ అధ్యాయము.

తారకామయ యుద్ధమునకయి దేవతల సన్నాహము.

శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను. రవికుమారుడవగుమనూ ! దైత్యసేనా విస్తారమును దాని సన్నాహమును నీకు తెలిపితిని. ఇక విష్ణు పక్షీయమగు దేవసేనా విస్తారము కూడవినుము; వీరిలో ఆదిత్యులు వసువులు రుద్రులు మహాటబలులగు ఆశ్వినులు (అదితగులు12+వసువులు 8+రుద్రలు 11+అశ్వినులు 2=33:) వీరు తమ తమ బలములతో అనుచరులతో కూడ యథాక్రమముగా యుద్ద సన్నాహ మొనర్చిరి. పలు పేరులతో యజ్ఞములందు పిలువబడువాడు వేయి కన్నులు కలవాడు లోకపాలకుడు అగు ఇంద్రుడు సర్వదేవతలకు నాయకుడై వారి ముందుండి అందరకంటె ముందుగా దేవగజమగు ఐరావత మెక్కెను. అ సేనా మధ్యమునందు సర్వ పక్షి శ్రేష్ఠడగు గరుత్మంతుడు వలె వేగశాలియగు ఇంద్రుని రథ ముండెను. అది మిగుల అందమగు చక్రములును పాదము లనబడు దారుపరికరములును కలది; బంగారుతో వజ్రములతో అలంకృతము; వేలకొలదిగ దేవగంధర్వ యక్షులు దానివెంట నుండిరి. ప్రకాశవంతులగు దేవర్షులు బ్రహ్మర్షులు యజ్ఞ సదస్సులందుండు వారు ఆ రథమున కన్ని వైపుల నిలిచి స్తుతించుచుండిరి. వజ్రముల (పిడుగుల) తోను వాని ధ్వనులతోను మెరపులతోను ఇంద్ర ధనువులతోను కూడినవియు పర్వతములవలె నున్న వియు సంకల్పానుసారముగ సంచరింధునవియు అగు మేఘ సమూహములతో అది కూడి ఉండెను . దాని నారోహించియే ఇంద్రదేవుడు సకల జగత్తునందును సంచరింధునవియు అగు మేఘ సమూహములతో అది కూడి ఉండెను. దాని నారోహించియే ఆ ఇంద్రదేవుడు సకల జగత్తునందును సంచరించుచుండును. యజ్ఞారంభములందు హవిర్దానములను ప్రదేశములందు నిలిచి వాద్యములను మ్రెగించుచు వాదకులు వెంట వచ్చచుండ అప్సరసలు వందల కొలదిగ నాట్య మాడుచుండిరి. మనో వాయువేగముగల వేయి గుర్రములను పూంచినది నాగరాజ ధ్వజముతోకూడినది అగు ఆరథశ్రేష్ఠము మాతలియను నట్లుండెను. యముడు కాలపాశముతో కూడ దండమును ఎత్తి పట్టి ముద్గరమును ధరించి తన నాదముతో దైత్యులకు భయముగొల్పుచు దేవతా సేనయందు నిలిచెను.

చతుర్బి స్సాగరైర్యుక్తో లేలిహానైశ్చ సనగై ః l శజ్ఖముక్తాజ్గదధరో భిభ్రత్తోయమయం వపుః. 12

éకాలపాశా స్త్సమాభభ్ర9 హయై శ్శకరోపమైః l వాయ్వీరిజలాకారైః కుర్వ న్లీలా స్సహస్రశః. 13

పాణ్డురొద్బూతపసనః ప్రవాళరుచిరాజ్గదః l మాణిశగామోత్తమవపు ర్హారతారార్పితోదరః. 14

వరుణః పాశభృన్మధ్యే దేవానీకే స తస్థివా9 l యుద్దవేలా మభిలష న్బిన్నవేల ఇవార్ణవః. 15

యక్షరాక్షససైన్యేన గుహ్యకానాం గణౖరపి l యుక్తశ్చ శజ్ఖపద్మాభ్యాం నిధీనామధిపః ప్రభుః. 16

రాజరాజేశ్వరః శ్రీమాన్గదాపాతి రదృశ్యత l విమానయాయీ ధనదో విమానే పుష్పకే స్థితః. 17

స రాజరాజ శ్శుశుభే ధనేశో నరవాహనః l ఉక్షాణ మాస్థిత స్సజ్ఞ్యే సాక్షాదివ శివస్స్వయమ్‌. 18

పూర్వపక్షం సహస్రాకః పితృరాజశ్చ దక్షిణమ్‌ l వరుణః పశ్చిమం పక్ష ముత్తరం నరవాహనః. 19

చతుర్షు యుక్తా శ్చత్వారో లోకపాల మహాబలాః l స్వాసు దిక్షు స్వరక్షన్తతస్య దేవబలస్యతు. 20

సూర్య స్సప్తాశ్వయక్తేన థేనామితగామినా l శ్రియా జాజ్వల్యమానేన దీప్యమానైశ్చ రశ్మిభిః. 21

ఉదయాస్తగచక్రేణ మేరు పర్వతగామినా l త్రిదివద్వారచ క్రేణ తపతా లోకమవ్యయమ్‌. 22

సహస్రంరశ్మియుక్తే న భ్రాజమానేన తేజసా l చచార మధ్యే దేవానాం ద్వాదశాత్మా దినేశ్వరః. 23

సోమశ్శ్వేతై ర్హయై ర్యాతి స్యన్దనే శీతరశ్మివా 9l హిమతోయ ప్రపూర్ణభి ర్భాభి రాప్యాయయ న్జగత్‌. 24

తమృక్షపూగానుగతం శిశిరాంశుం ద్విజేశ్వరమ్‌ l శశచ్ఛాయాజ్కితతనుం నైశస్య తమసః క్షియమ్‌. 25

జ్యోతిషా మీశ్వరం వ్యోమ్ని రసానాం రసదం ప్రభుమ్‌ l ఓషదీనాం పవిత్రాణాం నిధాన మమృతస్య చ.

జగత ః ప్రథమం భాగం సౌమ్య సత్యమయం రథమ్‌ l దదృశుర్దానవా స్సోమం హిమప్రహరణం స్థితమ్‌. 27

వరుణుడుచతుస్సాగరములతోను నాలుకల క్రోయు సర్పములతోను కూడి శంఖులతో ముత్యములతో కూర్చిన భుజకీర్తులను జలమయి శరీరమును కాలపాశములను దరించి వాయవుచే కదలించబడిన జలముల వలెను. చంద్ర కిరణముల వలెను ఉన్న హయములతోవ వేలకొలది క్రీడలు క్రీడించుచు తెల్లనగు మేలయిన వస్త్రముదాల్చి పగడములతో కూర్చిన మనోహరమగు భుజకీర్తులదాల్చి మణులతో నీలమైన ఉత్తమశరీరముతో లావగుముతైముల హారములతో నిండిన ఉదరము కలిగి దేవసేనమద్యమున నిలిచియుండెను. అతడు యుద్దసమయెమెపుడెపుడు వచ్చునా యని కోరుచు చెలియలి కట్టదాటి వచ్చిన సముద్రమువలె అతడుండెను. నిధులకు అధిపతియ రాజులకు రాజులకును ఈశ్వరుడు (రాజరాజేశ్వరుడు) ధనదుడు (మహాదనవంతుడు- ధనమును ఇచ్చువాడు అని మాత్రమే కాదు) అగుకుబేరుడు యక్షరాక్షసగుహ్యక సేనతోను శంఖపద్మములనబడు నిధులతోను కూడి గదా పాణియై పుష్పక విమానము వాహనమగా గలిగి దానియందుండెను. ధనేశుడును రాజరాజును అగు ఆ కుబేరుడు నరవాహనుడై-వృషభుమారోహించిన సాక్షాచ్ఛివునివలె యుద్ద (రంగ) మున నిలిచెను ఇంద్రుడు తూర్పన యముడు దక్షిణమున వరుణుడు పడమట కుభేరుడు త్తరమున - ఇట్లు ఎల్లరును తమతమ దిక్కులందు ఉండి మహాబలులలాకొకపాలురు దేవబలమును రక్షించుచుండిరి. ద్వాదశాత్ముడు (పండ్రెండు రూపములు గలవాడు) దినమునకు (పగటి) ఈశుడు అగు సూర్యుడు ఏడు గుర్రములను పూంచినదియు అమితవేగమున పోవునది మిగులప్రకాశంచు కాంతిగలదియ ఇట్టి కిరణములతో ప్రకాశించునదియు ఉదయాస్త పర్వతముల నడుమ సంచరించునదియు మేరుపర్వతము వరకు పోయి చేయనదదియ స్వర్గద్వారము వరకును తన చక్రములు పోగా అవ్యయమగు (నాశములేని) అ స్వర్గలోకమునుగూడ ప్రకాశింప (తపింప) జేయునదియ సహస్ర కిరణయుక్తము అయి తన తేజముతో ప్రకాశించు రథమునారోహించి దేవతల (సేనల) నడుమ సంచరించుచండెను. సోముడు తెల్లని అశ్వములను పూన్చిన రథమునందు ఎక్కి చల్లని కిరణములు కలిగి హిమజలముతో నిండిన కాంతులతో లోకములకాహ్లాదము కలిగించుచు సంచరించు చుండెను. నక్షత్ర సమూహములచే అనుసరించబడువాడును చల్లని కిరణములు కలవాడును నక్షత్రముల కధిపతియు కుందేటిమచ్చ గుర్తుగానుండి శరీరముకలవాడును రాత్రులందుండు చీకటుల పోగొట్టువాడును జ్యోతిర్గణములకధిపతియురసములను అందించువాడును ప్రభువు (సమర్థుడు) పవిత్రములగు ఓషధులకును అమృతమునకునునిధియు (జగములకు సంబంధించిన సౌమ్య - రౌద్ర భాగముల రెంటిలో) మొదటిదగు సౌమ్యభాగ రూపుడునుసత్యమయుడును లోకజన సంచరణమునకు ) రథమువంటి వాడును హిమమాయుధముగా గలవాడునగు చంద్రుని దానవులు (యుద్ధరంగమున) చూచురి.

యః ప్రాణ స్సర్వభూతానం పఞ్చధా భిద్యతే నృప l సప్తస్కన్దగతాంల్లోకా స్త్రీ న్దధార చకార చ. 28

యమాహు రగ్నికర్తారం సర్వ ప్రభవ మీశ్వరమ్‌ l సప్త్వరగతో యశ్చ నితగం గీర్బి రుదీర్యతే. 29

యం వదన్త్యుత్తమం భూతం యం వదంత్యశరీరణమ్‌l సప్తస్వరగతో యశ్చ నిత్యం గీర్భి రుదీర్యతే. 29

యం వదన్త్యుత్తమం భూతం యం వదంత్య శరీరిణమ్‌l యమాహు రాకాశగమం శీ ఘ్రగం శబ్దయోనిజమ్‌. 30

సవాయుస్సర్వభూతాయురుద్ధత స్స్వేన తేజసా l వాతైః ప్రవ్యథయ న్దైత్యా న్ప్రతిలోమం సతోయదః. 31

మరుతో దేవగన్ద ర్వై ర్విధ్యాధరగణౖ స్సహ l చిక్రీడు రసిభి శ్శుభ్రై ర్నిర్ముక్తైరివపన్నగైః. 32

సృజన్త స్సర్పపతయ స్తీ వ్రం రోషమయం విషమ్‌ l శరభుతా దీవీన్ద్రాణాం చేరు ర్వ్యాత్తాననా దివి . 33

పర్వతైశ్చ శిలాశృజ్గై శ్శత శాఖైశ్చ పాదపైః l ఉపతస్థు స్సురగణా ః ప్రహర్తుం దానవం బలమ్‌. 34

యస్స దేవో హృషీకేశః పద్మనాభ స్త్రివిక్రమః l యుగాన్తే కృష్ణవర్ణభో విశ్వస్య జగతః ప్రభుః. 35

సర్వయోని స్స మధుహా హవ్యభు క్క్రతురసంస్థితః l భుమ్యపో వ్యోమభూతాత్మా శ్యామ శ్శాన్తికరో7రిహా . 36

సార్కదీప్తప్రభం దివ్య ముత్తమోత్తమతేజసమ్‌l అరిఘ్న మమరాదీనాం చక్రం గృహ్య గగదాధరః. 37

సవ్యేనాలమ్బ్య మహతీం సర్వాసురవినాశనీమ్‌l కరేణ కాలీం వపుషా శత్రుకాలప్రదాం గదామ్‌ . 38

అన్యైర్బుజైః ప్రదీప్తాభై ర్బుజగారిధ్వజః ప్రభుః l దధారాయుధజాతాని శార్జాదీని మహాబలః. 39

ఎవరు ఐదుగా భేదించి సర్వభూతములకును ప్రాణమైయుండునో సప్తస్కంధములనబడు గాలుల ఏడు పొరల యందు అమరియున్న పృథివ్యతంతరిక్షద్యులోకములను మూడింటిని ఎవడు ధరించునో నిర్మించునో ఎవడు అగ్నికి సృష్టికర్తయనియు సర్వమునకు మూలకారణుడనియు ఈశ్వరుడు (అధిపతి) యనియు (వేదజ్ఞులు) చెప్పదురో ఎవరు సప్త (సంగీత) స్వరములందును నిలిచి (లయయుక్త ) వాక్కుల రూపమున ఉచ్చరింపబడునో ఎవరు ఉత్తమ భూతమయి అశరీరుడో (మూర్తి - ఆకృతిః- లేనిడాడో) ఎవడు శబ్దమునకుజన్మకారణమగు ఆకాశమునుండి జన్మించెనో సర్వభుతములకును ఆయువుగా నుండునో (ప్రాణవాయువు ఉన్నంతవరకే ప్రాణులకు ఆయువుగదాః) అట్టి వాయుదేవత స్వజేజస్సుతో గర్వితుడై మేఘములతో మాడి దానవులకు ప్రతిలోమముగా (ఎదురుదిక్కుగా) వీచుగాలులతో వారిని చాల బాధ పెట్టసాగెను. మయత్తులనబడు గణదేవతలును దేవజాతీయులగు గంధర్వులతోను విద్యాధరులనైడుగణదేవతలతోను కూడి కుబుసము విడిచిన సర్పములవలెనున్న ఖడ్గములతో అడుచుండిరి. నాగశ్రేష్ఠులును రోషమయ విషమునువెలిక్రక్కుచు ద్యులోకమునందుసంచరించుచు ఇంద్రాది దేవతలకు తాము బాణములయి నోళ్లు (భయంకరముగా) తెరచుకొని ద్యులోవమును సంచరించసాగెను. ఇతర దేవగణముల వారును దానవసేనను కొట్టుటకయి పర్వతములతో కొండల శిలామయ శఖరమలతో వందల కొలది శాఖలుగల వృక్షములతో నిలిచిరి. దేవుడును (ప్రకాశించువాడు) హృషీకేశుడు (విషయేంద్రియాధిపతి) పద్మనాభుడు (నాభియందుండి పద్మముద్బవించినవాడు%ు) త్రి-విక్రముడు (మూడు పాదవిన్యానములతో లోకముల కొలిచి అందు వ్యాపించినవాడు) యుగా (కల్పా ) ంతమందు నల్లనికాంతిగలవాడు సర్వజగత్ప్రభుము సర్వకారణుడు మదు దానవుని చంపినవాడు క్రతువులయందు సన్నిహితుడై హవిస్సుల భుజించువాడు భుమి జలాకాశాది భూతరూపుడు వాటికి అత్మయగువాడు (దేహమందాత్మ వ్యాపించి దానికి పనులుచేయుశక్తి నిచ్చినట్లు అయాభూతముల యందుండి వానికి శక్తిని ప్రసాందించువాడు) చామనచాయవాడు శత్రునాశకుడు (అరి-హా) గధాధరుడునగు నారాయణుడు రవిదీప్తితోనిండి ప్రకాశించునది దివ్యము ఉత్తమోత్తమ తేజోవంతము దేవతలు మొదలగు సాధుజనుల శత్రువులను చంపునదిఅగు గరుడుడుధ్వజముగా గలవాడు ప్రభుడు మహాబలుడునగు నారాయణుడు ప్రకాశించు ఇతర భుజములతో శార్‌జ్గము మొదలగు అయుధములను ధరించెను.

సకశ్య పస్యాత్మభువం ద్విజం భుజగభోజనమ్‌ l పవనాధిక సజ్కాశం గగనక్షోభకం ఖగమ్‌. 40

భుజగేన్ద్రేణ వదనే నివిష్టేన విరాజితమ్‌ lమహేన్ద్రే ణామృతస్యార్థే వజ్రేణ కృతలక్షణమ్‌. 41

అమృతారమ్బనిర్ముక్తం మన్దరాద్రిమివోచ్చ్రితమ్‌ l దేవాసురవివమర్దేషు బహుశో దృష్టవిక్రమమ్‌. 42

శిఖినం బలినం చైవ తప్తకుణ్డలభుషణమ్‌ l విచిత్రపత్రవసనం ధాతుమన్తమివాచలమ్‌. 43

స్ఫీత క్రోడావలమ్బేన శీతాంశుసమతేజసా l భోగిభోగావసక్తేన మణిరత్నేన భాస్వతా. 44

వక్షభ్యాం చారుపత్రాభ్యా మావృత్య దివి లీలయా l యుగాన్తే సెన్ద్ర చాపాభ్యాం తోయదాఢ్యామివామ్బరమ్‌. 45

నీలలోహితపీతభీః పతాకాఢి రలజ్కృతమ్‌ l కేతువేష ప్రతిచ్ఛన్నం మహాకాయనికేతనమ్‌. 46

అరుణావరజం శ్రీమా నారుహ్య సమరే విభుఃl సువర్ణవర్ణవపుషా సువర్ణం ఖేచరోత్తమమ్‌. 37

తమన్వయు ర్దేవగణా మునయశ్చ సమాహితాః | గీర్బిః పరమమన్త్రాభి స్తుష్టువుశ్చ గదాధరమ్‌48

తద్వై శ్రవణసంశ్లిష్టం వైవస్వతపురస్సరమ్‌ l ద్విజరాజపరిక్షప్తం దేవరాజవిరాజితమ్‌. 49

చన్ద్రప్రభాభిర్విపులం యుద్ధాయ సమవర్తతl పవనావిద్ధనిర్ఝోషం ప్రదీప్తం వ హుతాశనమ్‌. 50

విష్ణోర్జిష్ణోశ్చ భ్రాజిష్ణో స్తేజసాచ సమావృతమ్‌ l టబలం బలవదుద్వృత్తం యుద్దాయ సవర్తత. 51

స్వస్త్యస్తు దేవేభ్య ఇతి బృహస్పతి రభాషత l స్వస్త్యస్తు దానవానీకే ఉశనా వాక్య మబ్రవీత్‌. 52

ఇతి శ్రీమత్స్యమహాపూరాణ దేవదానవసజ్గ్రామే దేవకృతసమర

సన్నాహో నామ త్రిసప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

శ్రీమంతుడు విభుడునగు విష్ణువు గరుడుని ఆరోహించెను. అతడు కశ్యప ప్రజాపతి పుత్త్రుడు- పక్షిజాతీయుడు- సర్వభోజనుడు- వాయువుకంటె ఆధికముగా ఆకాశమును క్షోభింపజేయుచు ఆకాశమున సంచరించువాడు (ఖ-గ); నోటియందు భుజగ రాజము నుంచుంకొని ప్రకాశించువాడు అమృతము విషయమయి ఇంద్రుడు వైచిన వజ్రపు (దెబ్బ) మచ్చగలవాడు అమృత నిమిత్తమయిన కార్యమునుండి బయట ఠీవితో తల ఎత్తుకొని ఉన్నతమయియున్న (మంథ) పర్వతము వంటివాడు- చాలమార్లు దేవదానవ యుద్దములందు తన విక్రమమును ప్రదర్శించినవాడు శిఖ గలవాడు బలశాలి-కాచిన బంగారుతో చేసిన కుండలములు భూషణమలుగా గలవాడు వన్నెలు గల రెక్కలు ఈకలు కలిగి గైరిక ధాతువులతొ నిండిన కొండవలె నున్నవాడు- బలిసిన వక్షమున వ్రేలాడుచున్నదియు చంద్రుని కాంతివంటి కాంతి కలదియు నాగముల పడగలయందమరియున్నదియు ప్రకాశించుచున్నదియు అగు మణిశ్రేష్ఠముతో కూడినవాడు; ప్రళయకాలమందు ఇంద్రధనువులతోకూడిన మేఘములవలె నున్న అందుమగు ఈకలు కల రెక్కలతో అకాశమును అవరించినవా; నీలము ఎర్రనివి పచ్చనివి అగు పతాకలతో అలంకరింపబడినవాడు; పతాకా వేషముతో కప్పబడిన మహాశరీరము అనెడు గ్రహముగా ఉన్నవాడు ; రవి రథ సారథియగు అరుణనకు తమ్ముడు; మంచి వన్నెగల బంగారు కాంతిగల దేహముతో కుడి మంచి రెక్కలు కలవాడు అను అర్థముతో సువర్ణుడని ప్రసిద్ధుడగు పక్షి శ్రేష్ఠుడతడు . ఇట్టి గరుడు నారోపించిన విష్ణుని అనుసరించి వెంటనంటి పోవుచు దేవతలును సమాసహితులగు మునులును పరమోత్తమ మంత్ర పవిత్రములగు వాక్కులతో అ జనార్థనుని స్తతించుచుండిరి.

ఇట్లు సన్నద్దమరున అ దేవసేన కుభేరునితో కూడియముని తన ముందుంచుకొని పక్షిరాజగు గరుడునిచే చుట్టుకొనబడి దేవరాజగు ఇంద్రునితో కూడి ప్రకాశించుచు చంద్రుని కాంతులతో విస్తరిల్లి వాయువు వీచుటచే ధ్వనుల నిచ్చుచు జయశీలుడు మిగుల ప్రకాశించువాడునగు విష్ణుని తేజసుతో ఆవృతమయి ప్రజ్వలించు అగ్నివలె ఒప్పుచు బలశాలియు గర్వించినదియునై యుద్దమనకు సిద్దమయ్యెను.

అంత -దేవతలకు శుభమగుగాక యని బృహస్పతి పలికెను. దానవ సేనకు శుభమగుతమని శుక్రుడనెను.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రమమున దేవకృత సేనా సన్నాహమను నూటడెబ్బదినాలుగవ అధ్యాయము

Sri Matsya mahapuramu-2    Chapters