Sri Matsya mahapuramu-2    Chapters   

ద్విస ప్తత్యుత్తరశతతామో7ధ్యాయః.

విష్ణుప్రతిజ్ఞాన న్తరం దైత్తదానవాదికృతయుద్దోద్యోగః.

శ్రీమత్స్య: తత్రాభయం విష్ణువచ శ్శ్రుత్వా దైతేయదానవాః l ఉద్యోగం విపులం చక్రు ర్యుద్ధాయ విజయాయచ. 1

మయస్తుకాఞ్చనమయం త్రినల్వాయతమక్షరమ్‌ l చతుశ్చక్రం సువిపులం కల్పితం చ మహాయుగమ్‌. 2

కిజ్కిణీజాలనిర్ఝోషం ద్వీపిచర్మపరిష్కృతమ్‌ l రుచిరం రత్నజాలైశ్చ హేమజాలైశ్చ శోభితమ్‌. 3

ఈహామృగగణాకీర్ణం పక్షిప ఙ్త్కివిరాజితమ్‌ l దివ్యాస్త్రతూణీరధరం పయోధరనినాదితమ్‌. 4

స్వక్షం రథవరోదారం సూవస్థం గగనోపమమ్‌ l గదాపరిఘసమ్పూర్ణం మూర్తిమన్తమివార్ణవమ్‌. 5

హేమకేయూరవలయం చన్ద్రమణ్డలకూబరమ్‌ l సపతాకధ్వజోపేతం సాదిత్యమివ మన్దరమ్‌. 6

గజేన్ద్రాభోగవపుషం క్వచిత్కేసరివర్చసమ్‌ l యుక్తమృక్షసహస్రేణసమృద్దామ్బుదనాదితమ్‌. 7

దీప్తమాకాశగం పదివ్యం రథం పరరథారుజమ్‌l అధ్యతిష్ఠ ద్రణాకాజ్షీ మేరుం దీప్తమివాంశుమా& . 8

తారముత్క్రోశవిస్తారం సర్వం హేమమయం రథమ్‌ l శైలాకారమసమ్భాధం నీలాఞ్జనచయోపమమ్‌. 9

కార్‌ష్ణాయసమయం దివ్యం లోహేషాబద్ధకూబరమ్‌ l తిమరోద్గారికిరణం గర్జన్తమివ తోయదమ. 10

లోహజాలేన మహతా సగవాక్షేణ దంశితమ్‌ l ఆయసైః పరిఘైః పూర్ణం క్షేపణీయై స్సముద్గరైః. 11

ప్రాసైరసై#్త్రశ్చ వివిధై రసంయక్తైశ్చ కణ్టకైః l శోభితం త్రాసనీయైశచ తోమరైస్సపరశ్వథైః. 12

ఉద్యన్తం ద్విషతాం హేతోర్ద్వితీయమివ మన్దరమ్‌ l యుక్తం ఖరసహస్రేణ సోద్యారోహ ద్రథోత్తమమ్‌. 13

విరోచనస్తు సజ్క్రుద్దో గదాపాణి రవస్థితః l ప్రముఖె సైన్యస్య దీప్తశృజ్గ ఇవాచలః. 14

నూట డెబ్బది రెండవ అద్యాయము.

విష్ణు ప్రతిజ్ఞానంతరము దైతగదానవాదుల యుద్ధ ప్రయత్నము.

శ్రీమత్స్యుడు మనువునకు ఇంకను ఇట్లు చెప్పెను: అంతట దైత్యులును దానవులును విష్ణువుదేవతల కభయమిచ్చెనని యుద్దమునకును తమ విజయమునకును విపుల ప్రయత్నమొనర్చిరి.

వారిలో మయుడోక మహోత్తమ రథమారోహించెను. అది స్వర్ణమయము; మూడు సల్వములు (1200 చదరపుమూరలు) విశాలమయినది . నాశములేనిది; నాలుగు చక్రములు పెద్దకాండ్లు కలదిగా నిర్మితము; చిరుగంటల మువ్వల సమూహుముతో మిగు మ్రెగుచుండెను. అది చిరుతపులి చర్మము చుట్టబడి పరచబడియుండెను. రతనాల జాలరులతో బంగరు జాలరులతో అది శోఢిల్లుచుండెను. (చెక్కిన) ఈహా మృగగణములతో వ్యాప్తమయి పక్షి పంక్తులతో ప్రకాశించుచుండెను . దివ్యాస్త్రములును అమ్ముల పొదులునుదానియందుండెను. అదిమేఘమువలె గంభీర ధ్వనికలదియు మంచి ఇరుసుపకలదియునై రథశ్రేష్ఠములలో శ్రేష్ఠమయియండెను. మంచి ఉపన్థము (రథి కూర్చుండు స్థానము ) కలిగి గదలు పరిఘలు మొదలగు ఆయుధములతో నిండి అది రథముగ రూపొందిన సముద్రమువలె ఉండెను. బంగరుతో చేసిన భుజకీర్తులు (ఒక విధమగు అలంకారములు) వలయములు (కంకణములు) దానియందలంకరించబడియుండెను నొగల చివరలు (బంగరు అలంకారములతో కూడి) చంద్రమండలమువలె (ప్రక్కలనుండి చూచువారికి) కనబడుచుండెను. దానికి పతాకలు (చిరు జెండాలు ) ధ్వజములు (పెద్ద జెండాలు ) ఉండెను. రవితో కూడి ప్రకాశించు మందరమువలె అది యుండెను. గజేంద్రునివలె విశాల కాయము కలిగియు సింహమువలె వర్చస్సు కలిగి యండెను దానియందు వేయి ఎలుగు బంటులను పూన్చిరి. అది జల సమృద్దమయిన మేఘమువలె ధ్వని చేయుచుండెను. ప్రకాశించుచుండెను; ఆకాశమున సంచరించగలదయి దివ్యమై శత్రురథములకు బాధకలిగింంచునదై యుండెను. ఇట్టి రథమారోహించి మయుడు ప్రకాశించి మేరువు నారోహించిన రవివలె కనబడుచుండెను.

ఇక విరోచను డారోహించిన రథము మిగుల ప్రకాశించునది క్రోశమును మించిన వైశాల్యము కలది చాల భాగముబంగారుతోనే అలంకరించబడినది పర్వతము వంటి రూపము కలది ఇరుకులేనిది; నల్లని కాటుక రాశివలె ప్రకాశించునది; ఏలయన అది నల్లని ఉక్కుతో చేయబడినది; కాడియు నొగలును (వాహనములను పూంచు భాగము) ఇనుముతో చేరుబడినవి; అందుచేతనే చీకటులను క్రక్కు కిరణములు పకలది ; అందుచేతనే ఉరుముచున్న మేఘమువలె కనబడునది; గవాక్ష (రంధ్ర) ములతో కూడిన పెద్దదియగు ఇనుప జాలె (వలవంటి అల్లిక పగల %ొతెర రక్షణకై) కవచముగా తొడిగినది; ఇనుముతో చేసిన పరిఘలు విసరు ఈటెలు ముద్గరములు ప్రాసములు వివిధములగు అస్త్రమలు ఒకదానితో మరియొకటి కలియని కంటకములతోకూడి భయము కలిగించు తోమరాద్యాయుధములు గండ్రగొడ్డళ్ళు- ఈ విధమలగు అయధములతో నిండినది; దైత్య శత్రవుల పధార్థమయి లేచి వచ్చుచున్న మందరమో యనునట్లున్నది; వేయి గాడిదలను పూంచినది; విరోచనుడిటువంటి రథమారోహించి మిగుల క్రుద్ధుడయి గద ధరించి అ దైత్య సైన్యమునకు ముందు ప్రకాశించు శిఖరములుకల పర్వతమో యనునట్లుండెను.

యుక్తం హయసహ స్రేణ హయగ్రీవస్తు దానవః l స్యన్దనం వాహయామాస సవత్నా నీకమర్థనః 15

వ్యాయతం కిష్కుసాహస్రం ధను ర్విష్పారయ న్మహత్‌ l వారాహః ప్రముఖే తస్థౌ సవ్రరోహ ఇవాచలః.

ఖరస్తు విక్షరం దర్పాన్నేత్రాభ్యాం రోషజం జలమ్‌ lస్పురద్దన్తోష్ఠనయనం సజ్గ్రామం సోభ్యకాజ్షద. 17

త్వష్టా త్వష్టగజం ఘోరం యానమాస్థాయ దానవఃl వ్యూహితుం దానవం వ్యూహం పరిచక్రామ వీర్యవా9. 18

విప్రచిత్తిసుతశ్చైవ శ్వేతకుణ్డలభుషణః lశ్వేతశైల ప్రతీకాశో యుద్దాయాభిముఖస్థ్సితః. 19

అరిష్టో బలిపుత్త్రస్తు వరిష్ఠాద్రిశిలాయుధః l యుద్ధాయాభిముఖ స్తస్థౌ చరాచరవికమ్పనః. 20

కిశోర స్త్వభిసంహర్షా ల్కిశోర ఇవ చోదితః l సబలాదానవాశ్చైవ సన్నహ్యన్తే యథాక్రమమ్‌. 21

అభవద్దైత్య సైన్యస్య మధ్యే రవిరివోదితః l లమ్బస్తు లమ్బమేఘాభః ప్రలమ్బామ్బరభూషణః. 22

దైత్యవ్యూహం తతో భాతి సనీహర ఇవాంశుమా 9l

హయగ్రీవుడను దానవుడు శత్రు సమూహమును మర్దించు సంకల్పముతో వేయి గుర్రములను పూంచిన రథమారోహించి ముందునకు నడచెను. వారాహుడను దానవుడు వేయి మూరల పొడవయిన మహాధనువును సారించి ధ్వనిచేయుచు ప్రరోహముతో (మొలక పర్వతములతొ- శిఖరములతో) కూడిన పర్వతమువలె ముందు నిలిచెను. ఖరుడను దైత్యుడు దర్పము వలనను రోషము వలనను కన్నుల నుండి నీరుచింది పడుచుండ పెదవులు వణకుచుండ పండ్లు పట పట కొరుకుచు సంగ్రామముకోరి ముందునకు సాగెను. వీర్యవంతుడగు త్వష్టయను దానవుడు ఎనిమిది ఏనుగులను పూన్చిన భయంకరమగు రథమారోహించి దానవుల సేనావ్యూహమును పన్నుటకై ముందునకు నడచెను. విప్రచిత్తియను దానవుని కుమారుడు తెల్లని కుండలములు భూషణములుగా దాల్చి తెల్లని పర్వతమువలె ప్రకాశించుచు యుద్దాభిముఖుడై నిలిచెను. బలిపుత్త్రుడగు అరిష్టుడనువాడు శ్రేష్ఠములగు పర్వత శిలలను అయధములుగా గ్రహించి పచరాచర లోకమును కంపింపజేయుచు యుద్దమునకు సిద్దపడెను. కిశోరుడను దానవుడు రెచ్చగొట్టబడిన సింహపుపిల్లవలె అధిక హర్షోత్సాహములతో బయలుదేరెను. వానితోపాటు దానవులు అందరును తమ తమ బలముల (సేనల) తో కుడి యథాక్రమముగా సన్నద్దులయిరి. ఇటువంటి దైతగసేనా మధ్యమున లంబుడను దావుడు (నిండయిన శరీరముతో) నీటి బరువుతో వ్రేలాడు మేఘమువంటి వాడై వ్రేలాడుచున్న వస్త్రభుషణములు దాల్చి దైత్యవ్యూపము నడుమ మంచుతో కప్పపిన రవి వలె ప్రకాశించుచుండెను.

స్వర్భానురాస్యయోధీ తు దశనౌష్ఠేక్షణాయుధః. 23

హసం స్తిష్ఠతి సైన్యానాం ప్రముఖె సమహాగ్రహ ః l అన్యే హయగతా స్తతం గజస్కన్దగతాః పరే. 24

సింహవ్యా ఘ్రగతాశ్చాన్యే వరాహర్షేషు చాపరే l కేచి త్ఖరోష్ట్రగన్తార్ఖ కేచి త్తోయదవాహనాః. 25

పదాతినో7పరే దైత్యా భీషణా వికృతాననాః l ఏకపాదా ద్విపాదాపశ్చ ననృతు ర్యుద్ధకాఙ్షిణ. 26

ఆస్పోటయన్తో బహవః క్ష్వేళ న్తశ్చ గదోపరి l దృప్తశార్దూల నిర్ఝోషా నేదు ర్దానవ పుజ్గవాః. 27

తైర్గదాపిఘై రుగ్రై శ్శిలాముసల పాణయః l బహుభిః పరిఘాకారై స్తర్జయన్తిస్మ దేవతాః. 28

పాశైశ్చ ఖడ్గైశ్చ తథా తోమరాజ్కు శపట్టసైః l చిక్రీడుస్తే శతఘ్నీభి శ్శితధారైశ్చ ముద్గరైః. 29

గణ్డశైలైశ్చ శైలైశ్చ పరిఘైశ్చోత్తమాయుధైః l చక్రైశ్చ దైత్యప్రవరా శ్చక్రు రానన్దితం బలమ్‌.30

ఏవంతు దానవం సైన్యం సర్వం యుద్దమదోత్కటమ్‌ l దేవా నభిముఖం తస్థౌ మేఘానీక వివాద్బుతమ్‌.

తదద్బుతం దైత్యసహస్ర గాఢం వాయ్వగ్ని శైలామ్బుదతోయకల్పమ్‌l బలం రణౌఘాభ్యదయాభ్యుదీర్ణం యుయుత్సు చోన్మత్త వివాబభాసే. 32

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవదానవసజ్గ్రామే తారకామయాదికృతసేనా

సన్నాహకథనం నామ ద్విసప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

మహాగ్రహమగు స్వర్భానుడు (రాహువు) నోటితోను దంతములతోను పెదవులతోను కన్నులతోను యుద్దము చేయువాడై సేనలకు ముందుభాగమం దుండెను . ఇక మిగిలిన దైత్యులు హయములను గజములను సింహములను వరాహములను ఎలుగు బంటులను ఒంటెలను మేఘములను వాహనములను చేసికొనియు కొందరు పదాతులుగాను ఉండిరి. వారు భయంకరులు వికృతముఖులు ఏకపాదులును ద్విపాదులునయి యండిరి. వారందరును యుద్దకాంక్షులై ఉత్సాహు%ుతో నృత్యము చేయుచుండిరి. భుజములను చరచుచు సకిలించుచు గర్జించుచు పులులవలె ధ్వనులుచేయుచు ఉండిరి. భయముగొల్పు గదలను పరిఘలను శిలలనుము ముసలములను చేత ధరించియు పరిఘలనుం పోలు భుజము లనే ఎత్తియు ఆ దానవులు ధేవతలను భయపెట్టుచుండిరి; వారెల్లరును పాశములతో ఖడ్గములతో తోమరములతో అంకుశములతో పట్టనములతో శతఘ్నలతోముద్గరములతో పెద్దశిలలతో శైలములతో పరిఘలతో చక్రములతో ఇంకను ఇట్టివాడియగు ఉత్తమాయధములతో అడుచు తమ సేనను ఆనందింప జేయుచుండిరి. ఈ విధముగా దానవ సేన యంతయు హద్ధువీరిన యుద్దమదముతో అద్బుతమగు మేఘసమూహమవలె అమరి దేవతలకు ఎదురుగా నిలిచెను. అ సేన వేల కొలది దైత్యులతో దట్టమయి వాయువులను అగ్నులను శైలములను మేఘములను జలములను పోలి యుద్ద పరపరయందు జయము పొందవలెనను ఉత్సాహముతో యుద్దముచేయు కాంక్షలో వెర్రిఎత్తినదివలె ప్రకాశించెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవదానవ సంగ్రామమున

తారకామయాదుల సేనానంనాహమను నూట డెబ్బదిరెండవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters