Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టషష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

పద్మోద్భవప్రాదుర్బావ- పృథివ్యుత్పత్తి- వర్ణనమ్‌.

శ్రీ మత్స్యః: అథ యోగవతాం శ్రేష్ఠ మసృజద్బూరివర్చసమ్‌ l

స్రష్టారం సర్వలోకానాం బ్రహ్మాణం సర్వతోముఖమ్‌ . 1

తస్మి9 హిరణ్మయే పద్మే బహుయోజనవి స్తృతే l సర్వతేజోగుణమయం పార్థివై ర్లక్షణౖ ర్వృతమ్‌. 2

పద్మం తచ్చ పురాణజ్ఞాః పృథివీరూపముత్తముమ్‌ l నారారుణసముద్బూతం ప్రవదన్తి మహర్షయః. 3

యా పద్మా సా రసా దేవీ పృథివీ పరిచక్ష్య తే l యే పద్మసారగురవ స్తాన్దివ్యా న్పర్వతా న్విదుః. 4

హిమవన్తంచ మేరుంచ నీలం నిషధమేవచ l కైలాసం ముఞ్జవన్తంచ తథా7ద్రిం గన్ధమాదనమ్‌. 5

పుణ్యం త్రిశిఖరంచైవ కాన్తం మన్దరమేవచ l ఉదరం పిఞ్జరం చైవ విన్ద్యవన్తంచ పర్వతమ. 6

ఏతే దేవగణానాంచ సిద్ధానాంచ మహాత్మనామ్‌ l ఆశ్రాయాః పుణ్యతీర్థానాం సర్వకామఫలప్రదాః. 7

నూట అరువది ఎనిమిదవ అధ్యాయము.

నారాయణనాభి పద్మమునుండి బ్రహ్మ ఆవిర్బవించుట-

పృథివీ సృష్టిక్రమ వర్ణనము.

[ఇంతవరకును గడచిన నూట అరువది ఏడవ అధ్యాయమున నారాయణుని సంకల్పమున అతనికాశ్రయమగు జలములయందు కలిగిన స్పందముచే క్రమముగా ఆకాశము - వాయువు- అగ్ని - జలము- అనెడు నాలుగు భూతముల యుత్పత్తి మాత్రము చెప్పబడినది. పృథివీ భుతాము కూడ ఉత్పన్నమయిననేకాని సృష్టి సమగ్ర రూపమున జరుగుటకు వీలులేదు. ఆ సృష్టి జరుపు స్రష్ట (సృష్టికర్త ) ఉత్పన్నుడు కావలయును. అందులకై భూమికగా నారాయణనాభి నుండి పద్మా విర్భావము కూడ గడచిన అధ్యాయమున చెప్పబడినది. ఈ అధ్యాయమున ఆ పద్మమునుండి బ్రహ్మ (సృష్టికర్త ) జనించుటయు ఆ పద్మపు పరిణామముగా 'పద్మా' రూపమున పృథిని ఉత్పన్నమగుటయు చెప్పబడును. పాద్మకల్ప సృష్టి క్రమమనగా ఇదియే. కల్పమనగా ప్రక్రియ అని ఇట అర్థమ. ఇట్లే ఆయా కల్పముల సృష్టి క్రమములని పురాణములందు చెప్పబడిన వాని విషయమును గూడ ఇదే విధమున సమన్వయము చేసికొనుచు విచారణ పూర్వకముగ చదువుకొనవలయును. ]

శ్రీమత్స్యడు మనువునకిట్లు చెప్పెనని సూతుడు ఋషులకీ విధముగా చెప్పసాగెను: తరువాత నారాయణుడు బహుయోజన విస్తరముగల ఆ హిరణ్మయ పద్మమునందుండి సర్వతేజోమయుడును సర్వగుణమయుడును పృథివీ భూతపు లక్షణములు కలవాడును యోగతత్త్వము నెరిగిన వారిలో శ్రేష్ఠుడును మహావర్చశ్శాలియును అన్ని వైపులకును ముఖములు కలవాడును సర్వలోక సృష్టికర్తయునగు బ్రహ్మను సృష్టించెను. నారాయణునుండి సముద్బవించిన ఆ (లోగడచెప్పిన) పద్మము పృథివీ రూపమయినదని మహర్షులు చెప్పుచున్నారు. ఈ చెప్పిన పద్మము ఏది కలదో ఆమెయే రసాదేవి (రసరూపములగు జలమునుండి పరిణమించెను. కావున) పృథివి- (విశాలమయినది కావున) అనియు చెప్పబడును. ఈ పద్మమునందలి సారముతో పరిణమించి గురువులు (బరువుల కలవి ) అగు పదార్థములు ఏవి ఉత్పన్నములయ్యెనో అవి దివ్య (మహా ) పర్వతములయ్యెను; అవి : హిమవత్‌ మేరు- నీల - నిషధ - కైలాస- ముంజవత్‌- గంధమాదన- త్రికూట - మందరో- దర- పింజర- విధ్యవత్‌ పర్వతములు. ఈ పర్వతములు దేవగతములకును సిద్ధులకును పుణగతీర్థములకును ఆ శ్రయములయి సర్వకామ (కోరికల) ఫలములను ఇచ్చుచున్నవి.

ఏతేషామన్తరే దేశో జమ్బూద్వీప ఇతి స్మృతః l జమ్బూద్వీపస్య సంస్థానం యజ్ఞియా యత్ర వై క్రియాః.

తేభ్యో యత్స్రవతే తోయం దివ్యా మృతరసోపమమ్‌ l దివ్యతీర్థశతాధారా స్సురమ్మా స్సరిత స్స్మృతాః. 9

యాన్యేతాని చ పద్మస్య కేసరాణి సమన్తతః l అసజ్ఞ్యేయాః పృథివ్యాస్తే విశ్వే యే ధాతుపర్వతాః. 10

యాని పద్మస్య వర్ణాని భూరీణి తు నరాధిప l తే దుర్గమా శ్శైలచితా వ్లుెచ్ఛదేశా వికల్పతాః. 11

యాన్యధోభాగపర్ణాని దేశావాసానభాగశః | దైత్యానా మసురాణాంచ పన్నగానాంచ పార్థిన. 12

తేషాం మహార్ణవో యత్ర తద్రసేత్యభిసంజ్ఞితమl మహాపాతకకర్మాణో మజ్జన్తే మానవా స్సదా.13

పద్మస్యాన్తరతో య త్త దేకార్ణవగతా మహీ l ప్రోక్తథ దిక్షు సర్వాసు చత్వార స్సలిలాకరాః. 14

ఏవం నారాయణస్యార్థే మహీ పుష్కరసమ్భవా l ప్రాదుర్బావో7వ్యయం తస్మాన్నామ్నా పుష్కరంసంజ్ఞితః.

ఏతస్మాత్కారణా త్తద్‌జ్ఞైః పురాణౖః పరమర్షిభిః l యజ్ఞియై ర్వేదదృష్టార్దై ర్యజ్ఞేపద్మవిధిః స్మృతః. 16

ఏవం భగవతా తేన విశ్వేషాం ధారణావిధి ః l పర్వతానాం నదీనాంచ హ్రదానాం హ్రదానాం చైవ నిర్మితః. 17

విభు స్తథై వా ప్రతిమప్రభావః ప్రభాకరాభో వరుణాసితద్యుతిః l

శ##నైస్స్వయమ్బూ శ్శయనం భుజత్తధా జగన్మయః పద్మనిధిర్మహార్ణవే. 18

ఇతి శ్రీమత్స్యమహాపురాణ పద్మోద్భవప్రాదుర్బావ పృథివ్యుత్పత్తి వర్ణనం నామ

అష్టషష్ట్యుత్తర శతతమో7ధ్యయః.

ఈ పర్వతముల నడుమ నుండు దేశమునకు జంబూ ద్వీపమని వ్యవహారము; ఏ సంస్థానమునందు (అమరికయందు) యజ్ఞ సంబంధులగు వైదిక కర్మ ప్రక్రియలు ప్రవర్తిల్లుచుండునో అదియే జంబూద్వీప సంస్థానము; ఆ పర్వతములనుండి స్రవించు దివ్యామృత రస సమానమగు జలమంతయు దివ్యములగు వందలకొలది తీర్థములకు ఆధారము లగు నదులుగా పరిణమించినది . ఈ హరినాభి పద్మపు కేసరములు ఏవి ఆ పద్మపు అన్ని దెనలందు ఉండెనో అవియే ఈ లోకమందు ఆయా గైరిక ధాతువులకు స్థానములగు ఇతర పర్వతములని తెలియవలెను. ఆ పద్మమునకు అవయవములగు అనేకములగు దళములే పర్వతములతో వ్యాప్తములయి దుర్గమములగు వ్లుెచ్ఛ దేశములని వికల్పితములయినవి (వేరువేరు విభజించడి వ్యవస్థ చేయబడినవి.) ఆ పద్మపు అడుగు భాగమునందలి (ముదుక) రేకులు ఏవి కలవో - అవియే వారివారి వాసమును అనుసరించి భాగ క్రమమున దైత్యులకు అసురులకు నాగులకు నినాసములగు దేశములయ్యెను. ఈ దైత్య దానవాదుల దేశములకు నడుమనున్న మహార్ణవ భాగము (నందలి దృభడాగము) నకు కసా(తలము) అని వ్యవహారము. మహాపాతకములనాచరించిన జనులు సదా దీనియందు పడి మునుగుదురు. ఈ పద్మమునకు నడుమ ఏకార్ణవ జలమునందు తేలియున్న భూభాగమునకు 'మహీ' అని వ్యవహారము; ఈ 'మహి' కి నాలుగు దిక్కులందు నాలుగు మహా సాగరములున్నవి.

ఈ విధముగా నారాయణుని సంకల్పానుసారము పుష్కరము (జలము- పద్మము- అని రెండర్థములు పుష్కర శబ్దమునకు గలవు; ఇచట నారాయణాశ్రయ జలములనుండియే ఆకాశాది జలాంత భూతములును జలములనుండి పద్మమును పద్మమునుండి పృథివియు జనించెను కావున రెండర్థములును సరిపోవును.) కావున 'మహి' ని 'పుష్కర సంభవ' 'పుష్కరమునుండి పుట్టినది' అందురు. కావున ఈ పాదుర్బావమునకును (సృష్టిక్రమమునకును) పుష్కర సృష్టి 'పాద్మ కల్పక్రమము' అని వ్యవహారము వచ్చినది.

ఈ హేతువుచేతనే ఈ విధమగు సృష్టితత్త్వము నెరిగిన ప్రాచీనులగు పరమర్షులు వేదములందు దర్శింపబడు అర్థతత్త్వమను అనుసరించి 'పద్మవిధిని' ( అబిష్టకాచయనముతో ఆచరించబడు యజ్ఞప్రక్రియను ) విధించిరి. (కృష్ణయజరారణ్యక ప్రథమ ప్రశ్నమును చూతురుగాక!)

ఈ విధముగా నారాయణ భగవానుడు పర్వతములు నదులు హ్రదములు మొదలగు వాని ధారణాక్రమము నిర్మించెను.

సర్వ వ్యాపియు సాటిలేని ప్రభావము కలవాడును సూర్య తేజమువంటి తేజము కలవాడును వరుణనివలె నల్లని కాంతిగలవాడును తనకు తానయి యుండువాడును (పుష్కర శబ్ధవాచ్యమగు జలములను- వానినుండి పృథివిని- పద్మమును. నిర్మించి ) పద్మమునకు నిధియై యున్నవాడును అగు నారాయణుడు క్షీరార్ణవమున శయనించి యుండును.

ఇతి శ్రీమత్స్య మహాపురాణమున పద్మోద్భవ (బ్రహ్మ) ప్రాదుర్బావ- పృథివ్యుత్పత్తి- వర్ణనమను

నూట అరువది ఎనిమిదవ అధ్యాయము.

ఏకానస ప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

మధుకైటభాసురోత్పత్తిః.

Sri Matsya mahapuramu-2    Chapters