Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తప ఞ్చశదుత్తర శతతమో7ధ్యాయః.

కుమారోత్పత్త్యాదికథనమ్‌.

వీరకః: ఏవముక్త్వా గిరిసుతాం మాతరం స్నేహవత్సలామ్‌ l ప్రవేశం లభ##తే నాన్యా నారీ కమలలోచనే. 1

సూతః: ఇత్యుక్తా తు తతో దేవీ చిన్తయామాస చేతసా l

న సా నారీ స దైత్యోసౌ వాయుర్మే యామభాషత. 2

వృథైవ వీరక్శప్తో మయా క్రోధపరీతయా l అకార్యం క్రియతే మూఢైః ప్రాయః క్రోధసమీరితైః. 3

క్రోధైన నశ్యతే కీర్తః క్రోధో హన్తి స్థిరాం శ్రియమ్‌ l అపరిచ్ఛిన్నతత్త్వార్థా పుత్త్రం శాపితవత్యహమ్‌. 4

విపరీతార్థతో నౄణాం సులభో విపదోదయఃl సా చిన్త్యైవమువాచేదం వీరకం ప్రతి శైలజా. 5

సజ్జలజ్జావికారేణ వదనేనామ్బుజత్విషా l దేవీ : అహంవీరక తే మాతా మా తే7స్తు మనసో భ్రమః. 6

శజ్కరస్మాస్మి దయితా సుతా తుహినభూభృతఃl మమగాత్రచ్ఛవిభ్రాన్త్యా మా శజ్కాం పుత్త్ర భావయ. 7

తుష్టేన గౌరతా దత్తా మమేయం పద్మజన్మనా l మరూ శప్తోస్యవిదితే వృత్తాన్తే దైత్యనిర్మితే7.8

జ్ఞాత్వా నారీప్రవేశంతు శజ్కరే రహసి స్థితే l న నివర్తయితుం శక్య శ్శాపః కింతు బ్రవీమి తే . 9

శీఘ్రమేష్యసి మే తుష్ట్యా సర్వకామసమన్వితిఃl సూతః: శిరసా తు తతో వన్ద్యమాతరం పూర్ణమానసః .10

ఉవాచోదితపూర్ణేన్దుద్యుతిం తు హిమశైలజామ్‌ l

నూట ఏబది ఏడవ అధ్యాయము.

కుమార స్వామి జనించుట.

వీరకుడు తన యందు స్నేహ వాత్సుల్యములలో నిండియున్న తన తల్లి గిరిసుత ఈ మెయేయని యెరుగడు. అందుచే ఆతడింగను ''కమలలొచనా! నాతల్లికితప్ప-మరి ఇతర స్త్రీకి ఇందు ప్రవేశము లభించదు.'' అనెను. అది విని పదేవి మనస్సునం దిట్టులాలోచించెను . వాయువునాకు ఎవరి విషయము తెలిపెనో ఆ వ్యక్తి స్త్రీ కాదు; అతడు దైత్యుడు. క్రోధవ్యాపితనైనేను అకారణముగా వీరకుని శపించితిని. క్రోధ ప్రేరితులయిన వారు మూఢులై అకార్యములు చేయుట తరచుగా జరుగుచుండును. క్రోధముచే కీర్తనశించును. క్రోధము స్థిర సంపదను చంపును. నేనును క్రోధవశముననే వాస్తవము నిశ్చయముగా ఎరుగ లేక పుత్త్రునే శపించితిని. విరుద్ధకృత్యములు చేయుటచే నరులకు విపత్తులు సులభముగా కలుగును. ఇట్లాలోచించు శైలజ వీరకునితో తన పద్మకాంతివంతమయిన మొగము సంసిద్ధమయిన లజ్జతో వికృతముగా కాగా ఇట్లు ఇట్లాలోచించుచు శైలజ వీరకునితో తన పద్మకాంతివంతమయిన మొగము సంసిద్ధమయిన లజ్జతో వికృతముగా కాగా ఇట్లు పలికెను. వీరకా! నీకు మతి పొరపాటు కలుగనిచ్చుకొనకుము; నేను మీ అమ్మను; శంకరప్రియను; హిమగిరి పుత్త్రిని; కుమారా! నాదేహకాంతి మారిన పొరబాటుచే సందేహభవన పొందకుము. తుష్టుడై పద్మసంభవుడు నాకీ గౌర కాంతి ఇచ్చెను.* దైత్యుడు (ఆడి) చేసిన మాయ తెలియనప్పుడు నేను నిన్ను శపించితిని. శంకరుడు రహస్య ప్రదేశమందుండగా అన్యస్త్రీ ప్రవేశము జరిగినది నాకు తెలియలేదు. శాపము మరల్చుట శక్యము కాదుకాని ఒకమాట చెప్పుచున్నాను. వీరకా! త్వరలో నీవు సర్వసంకల్ప పూర్ణువడు అయ్యెదవు. అనగా వీరకుడు పూర్ణమానసుడై తల్లిని శిరసా నమస్కరించి అపుడే ఉదయించిన పూర్ణచంద్రుని వలె కాంతితో నున్న హిమశైల పుత్త్రితో ఇట్లనెను.

వీరకకృగౌరీస్తుతిః.

వీరకః: నతసురాసురమౌళిమిళన్మణిప్రచయకాన్తికరాళ నఖాజ్కితే. 11

నగసుతే శరణాగతవత్సలే తవ నమోస్తు నతా ర్తివినాశిని l

తపనమణ్డలమణ్డితకన్దరే పృథుసువర్ణసువర్ణతనుద్యుతే . 12

విషభుజజ్గవిషజ్గవిభూషితే గిరిసుతే ప్రణమే (భవతీ) మహదా(మా) శ్రయే l

జగతి కః ప్రణతాభిమతం దదౌ ఝడితి సిద్ధనుతే భవతీ యథా. 13

జగతి కాఞ్చన వాఞ్చతి శజ్కరో భువనధృత్తనయే భవతీం యథా l విమలయోగవినిర్మితదుర్జయస్వతనుతుల్యమ హేశ్వరమణ్డలే. 14

విదళితాన్దకబాన్దవసంహతిస్సురవరైః ప్రథమం త్మభిష్టుతా l సితసటాపటలోద్ధతకన్ధరాభరమహామృగరాజర థాస్థితా. 15

విమలశక్తిముఖానలపిజ్గళాయతభుజౌఘవిపిష్టమహాసురా l

నిగదితా భువనైరితి చణ్డికా జనని శుమ్భనిశుమ్భనిషూదనీ. 16

ప్రణతచిన్తితదానవదానవ ప్రమథనై కరతి స్తరసా భువి l

వియతి వాయుపథే జ్వలనోజ్జ్వలే7వనితలే తవ దేవి చ యద్వపుః. 17

తదజితే7ప్రతిమే ప్రణమామ్యహం భువనభావని తే భవవల్లభే l

జలధయో లలితోద్ధతవీచయో హుతవహద్యుతయశ్చ చరాచరమ్‌. 18

ఫణసహస్రభృతశ్చ భుజజ్గమా స్త్వదభిధాసగతి మయ్యభయజ్కరాః l

భగవతి స్థిరభక్తిజనాశ్రయే ప్రతిగతో భవతీచరణాశ్రయమ్‌. 19

కరణజాతమిహాస్తు మమాచలన్ను తిలవా ప్తిఫలాశయహేతుతః l

ప్రశమమేహి మమాత్మజవత్సలే నమో7స్తు తే దేవి జగత్త్రయాశ్రయే. 20

___________________________________________________________________________

*మత్స్యమహాపురాణము- 157 అధ్యాయమున ఎనిమిదవ శ్లోకపు ఉత్తరార్దమున్త గౌరీ వచనమున వీరకునుద్దేశించి- ''మయాశక్తో7స్యవిదితే వృత్తాంతే దైత్య నిరితే'' అని యున్నది. దీని తరువాత ''జ్ఞాత్వా నారీ ప్రవేశంతు శంకరే రహసిస్థితే.'' అని 9వ శ్లోకపు ఉత్తరార్ధము;''శంకరే రహసిస్థితేనతి తస్మిన్‌ ప్రదేశే నారీ ప్రవేశం దైత్య మాయాకృతం త్వయా అజ్ఞాత్వా-కృతం అవిజ్ఞాయ - దైత్య నిర్మితే వృత్తాంతే అవిదిచే నతి త్వం

మయా (అకారణం )'' శప్తో7సి. ఇతి అన్యయః ఇచ్చట ఈ రెండు శ్లోకార్దములును ఒకే శ్లోకమనియు కావుననే ఒకే వాక్యమనియు భావించినను 'అవిదితే' అనుదానితో 'అజ్ఞాత్వా' అను దానికి నంధి సంగీకరించినిచో అన్వయము కుదురదు. అనగా శ్లొక పూర్వార్దములోనికి ఉత్తరార్దాద్యాంశము ప్రవేశించినది. ఇట్లీ శ్లోక పూర్వార్ధాంతాంశము ఉత్తరార్దాదియందు ప్రవేశించుటయు ఉండవచ్చును. ఇవి ఆర్ష రచనలలోని కొన్ని విశేషములు. ప్రథమ ద్వితీయ పాదములకు-తృతీయ చతుర్థ పాదములకును ఈ విధమగు కలయిక 'వాసాం సిజీర్ణాని' నవల్వలోత్తీర్ణ'(రఘు-2స.) మొదలైన వానియందును 'హర్తుర్యాతి' మొదలైన వానియందును మయూర శతకమందును ఎన్నియో కలవు.

వీరకుడు చేసిన గౌరీస్తవము.

సమ్రులైన సురాసురుల శిరస్సులందమరి కలిసిన మణి సమూహ కాంతితో నిమ్నో న్నతములగు గోళ్ళు గుర్తుగా కల దేవీ ! నమస్కరించిన వారి ఆర్తిని నశింపజేయుతల్లీ! శరణాగతవత్సలా! సగపుత్త్రీ! నీకు నమస్సు. రవి మండలములతో (వలె) మండిత (అలంకృత)మయిన కంఠము కల తల్లీ! బంగారువలె మంచి వన్నెకల దేహకాంతి గలదానా! విష భుజంగ రాశితో అలంకరింంపబపడిన దానా! గొప్పవారికి ఆశ్రయ మగు లదానా! (నిన్నాశ్రయించిన వారే గొపప్పవారు. ) నీకు నమస్కరింతును. నిన్నాశ్రయింతును. సిద్దుల నతులందుకొను నీవలె ప్రణతులగు వారికి శీఘ్రముగ అభిమతములు ఇచ్చినవారు లోకమందింకెవరున్నారు.? ధరణీధర (పర్వత) పుత్త్రీ! నిన్నువలె శంకరుడును మరి ఏ స్త్రీని కాని కోరడుకదా! నీవు విమలమగు యోగమచే మహేశ్వరుని వలెనే దుర్జయమగు స్వదేహకాంతిని సంపాదించితివి . అంధక బాంధవులను చీల్చిన దానవునీవు; సురవరులును మొదట నిన్నే స్తుతింతురు. తెల్లని జూలు రాశి కలిగి గర్వముతో ఠీవిగానున్న దృఢమగు మెడ గల మృగరాజనెడు రథమారోహించుదానవు; నిర్మల శక్తి కలిగిన శక్తి మొదలగు ఆయుధములు ధరించి అగ్నివలె పచ్చని జ్వలించు కాంతిగల భుజ సమూహములతో మహాసురులను పిండి చేసినదానవు: ఇందుచేతనే జగమున చండికయని చెప్పబడిన దానవు; శుంభ నిశుంభుల చంపుదానపు నీవే; ప్రణతులగు వారి చింతితము లీడేర్చుదానవు; క్రొత్త (శక్తిగల) దానవుల నలుగగొట్టుటకై లోకమున శీఘ్రముగా తీవ్రానక్తితో ప్రవ ర్తిల్లు దానవు; అగ్నివలె ప్రకాశించుచు అంతరీక్షమునందును వాయుపథమునందును భూతలమునందును వ్యాపించియుండు నీదేహము ఏది కలదో-దానితో నీవు దేవి! అజితురాలవు (ఎవరికి జయింపనలవి కాని దానవు); భువన భావనీ!( లోకసృష్టి స్థితి కర్తా!) భవుని వల్లభా! నిన్ను నమస్కరించుచున్నాను. లలిత (సుందర)ములు ఆయియు చెలరేగు ఆలలుగల సముద్రములును అగ్ని జ్వాలలును వేలకొలది పడగలు గల సర్పములును-నీ నామస్మరణము చేయుచుండు నాకు ఈ చరాచర జగమందెల్ల అభయము కలిగించునవే అగును. భగవతీ ! స్థిర భక్తి గల జనులకు ఆశ్రయమగుదానా! నీచరణములను నాకు ఆశ్రయముగా చేరుచున్నాను. నిన్ను నుతించు ఈ అల్పపూజవలన కలుగు ఫలము పొందుట కనుకూలమయి నా ఇంద్రియములన్నియు పవిత్రములగుగాక! పుత్త్రవత్సలవగు దేవీ! జగత్త్రయాశ్రయా! నా విషయమున శాంతినొందుము; నీకు నమస్కారము.

సూతః: ప్రసన్నా తు తదా దేవీ వీరకస్యేతి సంస్తుత్యా! సంస్యుత్యా! ప్రవివేశ శుభం భర్తుర్బవనం భూధరాత్మజా. 21

ద్వార్థ్సోపి వీరకో దేవా9 హరదర్శనకాజ్జిణఃl వ్యసర్జయత్స్వకాన్యేవ గృహాణ్యాదరపూర్వకః . 22

నాస్త్యత్రావసరో దేవా దేవ్యా సహ వృషాకపిః l నిభృతః క్రీడతీత్యుక్తా యయస్తే చ యథాగతమ్‌ . 23

గతేవర్షసహస్రే తు దేవా స్త్వరితమానసాఃl జ్వలనం చోదయామాసుర్జాతుం శజ్కరచేష్టితమ్‌. 24

పార్వతీశ్వరయో స్సమ్బెగకాలే శుకరూపిణో7గ్నేరన్తః పురప్రవేశః.

ప్రవిశ్య జాలరన్ద్రేణ శుకరూపీ హుతాశనః l దదృశే శయనే శర్వం రతం గిరిజయా సహ. 25

దదర్శ తం చ దేవేశో హుతాశం శుకరూపిణమ్‌ l తమువాచ మహాదేవః కిఞ్చత్క్రోధసమన్వితః. 26

శర్వః: నిషిక్తమర్దం దేవ్యాంవై శుక్రస్య శుకవిగ్రహః l లజ్జయా విరతిస్థాయాం త్వమర్ధం పిబపావక. 27

యస్మాత్తు త్వత్కృతో విఘ్న స్తస్మాత్త్వయ్యుపపద్యతే l

సూతః ఃఇత్యుక్తః ప్రాఞ్జలిర్వహ్ని రపిబ ద్వీర్య మాహితమ్‌. 28

తేనాపూర్యత తాన్ద్రేణ స్తత్తత్కాయవిభేదతః l విపాట్య జఠరం తేషాం వీర్యం మాహేశ్వరం తతః. 29

నిష్క్రాన్తం తప్తహేమాఢం వితతే శరకాననే l తస్మిన్త్సరో మహాజ్జాతం విమలంబహుయోజనమ్‌. 30

ప్రపుల్ల హేమకమలం నానాపక్షినినాదితమ్‌ l

ఇట్లు వీరకుడు చేసిన స్తుతినందుకొని దేవియగు భూధర పుత్త్రి శుభ స్వరూపమగు భర్తృ గృహము ప్రవేశించెను. వీరకుడును ద్వారమందున్న వాడగుచు హర దర్శన కాంక్షులగు దేవతలను ఆదరపూర్వముగానే వారి ఇండ్లకు పంపెను. దేవతలారా! ఇది సమయము కాదు; ధర్మరక్షకుడగు హరుడు దేవితో కూడి రహస్య విహారమందున్నాడు. అనగానే వారు తాము వచ్చిన త్రోవను (తమ తమ స్థానములకు వెళ్ళిరి.

ఇట్లు వేయి సంవత్సరములు గడచెను. దేవతల మనస్సున త్వర కలిగెను. శంకరుడేమి చేయుచున్నాడో తెలిసికొనిరమ్మని వారగ్నిని కోరిరి. హుతాశనుడు చిలుక రూపమున గవాక్ష రంధ్రము నుండి లోన ప్రవేశించి శివుడు గిరిజతో కూడి శయనమందుండుట కాంచెను. దేవేశుడగు మహాదేవుడును శుక రూపుడగు అగ్నిని చూచెను. కొంచెము కోపముతో అతడతనితో నిట్లనెను; శుకరూపుడవగు అగ్నీ ! దేవియందు నేను నిషేకించిన శుక్రమున అర్థము ఈవలనే ఉన్నది. ఆమె (నిన్ను ఇచట చూచి) సిగ్గుపడుటచే విరతి (శుక్రము గ్రహించుటను మానుకొను స్థితి) యందున్నది; కావున పావకా! ఆ శుక్రమునందలి సగమును నీవు త్రాగును. ఈ విషయమున విఘ్న మాచరించిన వాడవు నీవే కనుక నీవే ఇది త్రాగుట తగును. అనగా వహ్ని దోసిలియొగ్గి శివుడు ఉంచిన వీర్యమును తాను త్రావెను. తరువాత అగ్ని ఆ వీర్యముతో ఆయా దేవతల వేరువేరు శరీరముల (ఉదరముల) ను నింపెను. మహేశ్వరును ఆ వీర్యము ఇముడక వారి ఉదరములను బ్రద్తలు చేసికొని వచ్చెను. కాచిన బంగారు వన్నెతో ప్రకాశించి ఆవీర్యము రెల్లు అడవియందు వ్యాప్తమయ్యెను. అది అచ్చట బహుయోజన విస్తారము కలదై బాగుగ విప్పారిన నానా కమలములు కలిగి నానా పక్షినినాద సహితమై విమలమగు మహా సరస్సుగా అయ్యెను.

తచ్ర్ఛత్వాతు సరో దేవీ హేమద్రుమ మహాజలమ్‌. 31

జగామ కౌతుకావిష్టా తత్సరః కనకామ్బుజమ్‌ l తత్ర కృత్వాజల క్రీడాం తదబ్జకృతశేఖరా. 32

ఉపవిష్టా తత స్తస్యతీరే దేవీ సఖీయుతాl పాతుకామా తు తత్తోయం స్వాదు నిర్మలపజ్కజమ్‌. 33

అపశ్యత్కృత్తికాః స్నాతాష్షడర్కద్యుతిసన్నిభమ్‌ l పద్మపత్రేతు తద్వారి గృహీత్వా ప్రస్థితా గృహమ్‌. 34

తర్షాదువాచ పాస్యామి పద్మపత్రేస్థితం పయః l తతస్తా ఊచురఖిలాః కృత్తికా హిమశైలజామ్‌. 35

కృత్తికాః ; దాస్యామో యది తే గర్బస్సమ్భూతో యో భవిష్యతి l

సో7స్మాకంమపి పుత్త్రస్య్సా దస్మదామ్నాచ కీర్తమా9. 36

భ##వేల్లోకేషు విఖ్యాత స్సర్వేష్వపి శుభాననే l ఇత్యుక్తోవాచ గిరిజా కథం మద్గా త్రసమ్భవః. 37

సర్వైర వయవైర్యుక్తో భవతీభ్యస్సుతో భ##వేత్‌ l తతస్తాం కృత్తికా ఊచుర్విధాస్యామో7స్యవై వయమ్‌.

ఉత్తమాన్యుత్తమాజ్గాని యద్యేవం తు భవిష్యతిl ఉక్తా వై శైలజా ప్రాహ భవత్వేవమనిన్దితాః. 39

తతస్సా హర్షసమ్పూర్ణాః పద్మప త్రస్థితం వయః l తసై#్య దదుస్తయా చాపి తత్పీతం క్రమశో జలమ్‌. 40

పీతేతు సలిలే తస్మిం స్తత స్తస్మాత్సరోవరాత్‌ l విపాట్య దేవ్యాశ్చ తతో దక్షిణాం కుక్షి ముద్గతః. 41

కుమారోత్పత్తిః.

నిశ్చక్రామాద్భుతో బాలో లోకశోకవినాశకః l ప్రభాకరకరాకారః ప్రత ప్తకనక ప్రభః. 42

గృహీతనిర్మలోదగ్రశక్తి శూల ష్షడాననః l దృప్తాన్మారయితుం దైత్యానుదితః కనకచ్ఛవిః. 43

ఏతస్మాత్కారణాదేవ కుమారశ్చాపి సో7భవత్‌. 42u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ దేవాసురసజ్గ్రామే కుమారోత్పత్తికథనం నామ సప్తపఞ్చశ దుత్తర శతతమో7ధ్యాయః.

దేవియు సువర్ణ మహా వృక్షములు మహాజలమును గల ఆ కొలని విషయము విని కుతూహలము కలిగి కనక పద్మములు కల ఆ సరస్సునకు పోయెను. దానియందామె స్నానమాడెను. దానియందలి పద్మములను కొప్పున ముడిచికొనెను. తరువాత దేవి సఖులతో కూడినదై నిర్మల పద్మములు కల (కొలనియందలి) రుచిమంతమగు నీరు త్రావదలచి ఆ కొలని యొడ్డున కూర్చుండెను అంతలో రవి సమాన తేజోయుతలగు షట్‌ (ఆరుమంది) కాత్తికా (నక్షత్రాధి) దేవతలును వచ్చి ఆ కొలకునందు స్నానము చేసిరి. పిమ్మట * వారానీరు తామరాకునందు పట్టికొని తమ గృహమునకు పోవ బయలుదేరిరి. ఇదియంతయ పార్వతి చూచెను. అమె దప్పిగొని యున్నందున 'ఈ తామ రాకునందున్న నీరు నేను త్రావెదను.' (ఈ తామరాకునందలి నీరు నాకు త్రాగుటకు ఇండు.') అని వారితో పలికెను.

అంతట ఆ కృత్తికలందరుని పార్వతితో పలికిరి: దేవీ! నీకు గర్బమయి ఎవరు కలుగునొ-అతడు (నీకు వలెనే) మాకును కుమారుడగు (టకు నీవు ఒప్పుకొను)చో-మాపేరుతో సర్వలోకములందు విఖ్యాతుడయి కీర్తిమంతుడగు(టకు నీవంగీకరించు) చో- శుభముఖీ!నీకు మేము ఈ నీరిత్తుము . అనిరి. అందులకు పార్వతి ఇట్లనెను: నాగాత్ర (శరీర)మునుండి జనించిన సర్వావయవములను కల ఆబాలుడెట్లు మీ కుమారుడగుట సమంజనము? అనెను. అంతట కృత్తికలును- ఇట్లగుచో మేము అ బాలునకు ఉత్తమములగు ఉత్తమాంగ(శిర)ములను (మానుండి ) ఏర్పరతుము. (విధ్యాస్యాము:_ఏర్పరతుము- విశేషించి పాలను మేమే త్రాగింతుము- అని రెండర్థములు) అనిరి. వారిచే ఇట్లు చెప్పబడిన మీదట శైలజయును- అనిందిత( ప్రశంసనీయ) లారా! ట్లే అగుగాక! (కానిండు) అనెను. అంతట వారు హర్షసంపూర్ణలై పద్మ పత్రమందున్న (తమ చేతియందలి) జలమును పార్వతికిచ్చిరి. ఆమె క్రమమునను భగవన్నిర్ణయానుసారమును ఆనీరు త్రావెను. ఆ సరోవర ప్రదేశమందుండి గంహింపబడిన ఆ నీరు త్రావిన అనంతరమే ¨ఏమాత్రమును వ్యవధానము లేక ఉత్తర క్షణముననే దేవి దక్షిణ కుక్షిని చీల్చుకొని పైకి లేచుచు (ఊర్ధ్వముఖుడై) ఆశ్చర్యకరుడును లోక శోక వినాశకుడును రవి కిరణాకారుడును ప్రత ప్త కనక ప్రభుడు (బాగుగ కాచిన మేలు వన్నెకల బంగారు కాంతి గలవాడు)ను నిర్మలమును ఉదగ్రమును (వాడి యంచులు మొనలు గలది) అగుశక్తి (కాసూ అను అయుధము) ధరించిన

____________________________________________________________________________

*మత్స్యమహాపురాణము- 157 అ; శ్లో 34-35 విచిత్రముగా అన్ని ప్రతులయందును సమానముగా మారియున్న పాఠము:

అగ్ని గ్రహించి దేవతలయందు ప్రవేశ##పెట్టిన శివ వీర్యము అచట ఇముడక వారి పొట్టలు చీల్లుకొని బయటికి వచ్చి గంగా తీరమున రెల్లుఅడవిలో విశాల మనోహర నిర్మలోదక కనక పంకజ సరస్సుగా నయ్యెను. అది విని కుతూహలముతో అటకు చెలులతో వచ్చి పార్వతి అందు స్నానమాడెను. దానియందలి తామర పూవులు కొప్పున ముడుచుకొనెను. తరువాత:

33. ఉపనిష్టా తత స్తన్య తీరే దేవీ సఖీయుతా l

పాతుకామాతు తత్తోయంం స్ఫార నిర్మల వంకజమ్‌.

34. అపశ్యత్కృత్తికాః స్నాతాష్ష డర్కద్యుతి సన్నిభమ్‌ l

పద్మ పత్రేతు తద్వారి గాహత్వోప స్థితాగృహమ్‌ .

35. హర్షాదువాచ పశ్యావ: పద్మ పత్ర స్థితం వయ: l

తతస్తా ఊచురఖిలాః కృత్తికా హిమశైలజామ్‌.

'గృహీత్వా ప్రస్థితా గాహమ్‌' -'అనియు 'తర్షాదువాచ పాస్యామి పద్మవత్ర స్థితం వయః' అనియు ఉండవలెను. ¨పురాణములలో అసంబద్దతా-అసంభావ్యతలు ఉన్నవి. కావుననే వానియందంతటను అతీతమగు అర్థమేదో యున్నదను భావనతో ఆ యర్థము గ్రహించుటకు యత్నించవలెను. అదియే ఉపాసనము. వాడును (కృత్తికానక్షత్ర దేవతల నుండి ఏర్పడి అ సంఖ్య గల) ఆరు మోములుగల వాడును దర్పించిన(కు) దైత్యులను మారణమొందించుటకే ఉదయించినవాడును (అగ్ని జ్వాలల వలె) కనక కాంతి కలవాడునగు బాలుడు వెలికివచ్చెను. (కుత్పితులను మారణ మొందించును) ఈ హేతువుననే అతడు కుమారుడు (కు+మార) అని ప్రసిద్ధుడుయ్యెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున కుమారోత్పత్తి కథనమను.

ఏబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters