Sri Matsya mahapuramu-2    Chapters   

షట్పఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః.

దేవ్చాశ్చతుర్ముఖవరేణ గౌంవత్వ ప్రాప్త్యాధి కథనమ్‌.

దేవి: మాతరం మాం పరిత్యజ్య యస్మాత్త్వం స్నేహవిక్లబామ్‌ l

విహితావసర స్త్స్రీణాం శజ్కరస్య రహోవిధౌ. 1

తస్మాత్తే పరుషా రూక్షా జడా హృదయవర్జితాl గణశ క్షారనదృశీ శిలా మాతాభవిష్యతి. 2

నిమిత్త ఏష విఖ్యాతో వీరకస్య శిలోదయే l శామ్బవే ప్రక్రమేణౖవ విచిత్రాఖ్యానసంశ్రయః. 3

ఏవముత్సృష్టశాపాయా గిరిపుత్ర్యాస్త్వనన్తరమ్‌ l నిర్జగామ ముఖాత్క్రో ధస్సింహరూపి మహాబలః. 4

స తు సింహః కరాళాస్యః సటాజటిలకన్దరః l ప్రోద్భూతలమ్బలాజ్గూలో దంష్ట్రోత్కటముఖోద్భిదః. 5

వ్యాదితాస్యో లలజ్జిహ్వః క్షామకుక్షిశ్చిఖాదిషుఃl తస్యాశు వర్తితుం దేవీ వ్యవస్యత సతీ తదా. 6

జ్ఞాత్వా మనోగతం తస్యా భగవాంశ్చతురాననః l ఆజగామాశ్రమపదం సమ్పదామాశ్రయో యతః. 7

ఆగత్యోవాచ దేవేశో గిరిజాం సృష్టయా గిరా l

బ్రహ్మ; కిం పుత్త్రి ప్రాప్తుకామాసి కిమలభ్యం దదామి తే . 8

విరమ్యతామతిక్లేశాత్తపసో7స్మాన్మదాజ్ఞాయా l తచ్చ్రత్వోవాచ గిరిజా గురుం గౌరవగర్బితమ్‌. 9

వాక్యం వాచా చిరోద్గీర్ణనిర్ణీతం చిత్రవాఞ్చయాl దేవీ ; తపసా దుష్కరేణా ప్తః పతిత్వే శజ్కరో మయా. 10

స మాం శ్యామలవర్ణేతి బహుశః ప్రోక్తవా9 హరఃl స్యామహం కాఞ్చనాకారా వాల్లభ్యేని చ సంయుతా. 11

భర్తుర్భూతపతేర మేకతో నిర్విశే7జ్గవత్‌l

నూట ఏబదియైదవ అధ్యాయము.

పార్వతి బ్రహ్మ వరమున గౌరదేహ (గౌరి) యగుట.

వీరకా! నీవు నీయందతివాత్సల్య పరవశనయియున్న నన్ను ఖండించి (లెక్క పెట్టక) శంకరుని రహస్య సుఖమున అన్యస్త్రీల కవకాశమిచ్చితివి కావున పరుషయు రూక్ష (బిరుసైనది)యు జడ (అచేతన) హృదయహీన యగుశిల నీకు తల్లియగును. అని పార్వతి వీరకుని శపించెను. శివ మహిమ తత్త్వములందు గల ప్రక్రమానుసారము ఇట్టి విచిత్ర కథాశ్రయమగు ఈ వృత్తాంతమే వీరకుడు శిలనుండి జనించుటకు హేతువు. (మరియొక జన్మమున ఈ వీరకుడు శిల నుండి జనించెనని దీనినిబట్టి ఎరుగవచ్చును.)

ఇట్లు శపించిన తత్‌క్షణమే పార్వతీ ముఖమునుండి ఆమె హృద్గత మహాక్రోధము మహాబలశాలిపయగు సింహమయి వెలికి వచ్చెను. ఆ సింహము మిట్ట వల్లములు గల ముఖము కలది; జడలు నిండిన కంఠము పైకిలేచి యాడుచు వ్రేలాడుచునుండు పోడవుతోక కోరలతో వికటమగు ముఖ విస్తారము విశాలముగా తెరచిన నోరు కదలియాడు నాలుక సన్నని పొట్టకలదై (కనబడినదెల్ల ఆహారముగా) తిను కోరికతో నుండెను. నతియగు పార్వతియు తానే దానికాహారము కాదలచి యుండెను. ఆమె సంకల్పమెరిగి బ్రహ్మనకల సంపదలకు నిలయమగు ఆమె యాశ్రమమునకువచ్చి దేవితో ఇట్లు సృష్టముగా ఇట్లు పలికెను. ''బిడ్డా: నీవేమి పొందగోరుచున్నావు? అది ఎంత అలభ్యమయినను నీకిత్తును. మిగులక్లేశకరమగు ఈ తపస్సు చాలింపుము; ఇది నాయాజ్ఞ. ఆనిన వచనము విని గిరిజ లోకగురువు అగు బ్రహ్మతో చాలకాలము క్రిందటనే తాను నిర్ణయించియుండి ఇపుడు బయలు పరచుచున్నదియు చిత్రమగు వాంఛతో నిండిన వాక్కుతో ఏర్పడినదియు అగు వాక్యమును ఇట్లు ఆదర పూర్వముగా పలికెను: నేను దుష్కర తపమాచరించి శంకరుని పతిగా పొందితిని. అట్టిహరుడు నన్ను 'శ్యామలవర్ణ' 'నల్లనిది' అని చాలమారులు అనెను. నేను బంగారువన్నె కలదానను-భర్తకు ప్రీతపాత్రురాలను-కావలయును. నాపతియగు భూతపతి శరీరమును నేనును అతని శరీరమునై ప్రవేశింపవలయును.

తస్యాస్తద్భాషితం శ్రుత్వా ప్రోవాచ కమలాసనః. 12

ఏవం భవ త్వం భూయశ్చ భర్తుర్దేహార్దదారిణీ l తతస్తత్యాజ భృజ్గాజ్గీ ఫుల్లనీలోత్పలత్వచమ్‌ . 13

త్వచా సా చాభవద్దీప్తా ఘణ్టాహస్తా త్రిలోచనా l నానాభరణపూర్ణాజ్గీ పీతకౌశేయధారిణీ. 14

తామబ్రవీత్తతో బ్రహ్మా దేవీం నీలామ్బుజత్విషమ్‌ l నిశే భూధరజాదేహే సజ్ర్కాన్తా త్వం మదాజ్ఞాయా. 15

సమ్ప్రాప్తా కృతకృత్యత్వమేకానంశా పురా హ్యసి l స ఏష సింహః ప్రోద్బూతో దేవ్యాః క్రోధాద్వరాననే. 16

స తే7స్తు వాహనం దేవి కేతౌ చాస్తు మపా%ాబలః l గచ్ఛ విన్ద్యాచలం తత్ర సురకార్యం కరిష్యసి. 17

పఞ్చాలో నామ యక్షో7యం యక్షలక్షపదానుగః l దత్తస్తే కిజ్కరో దేవ మయా మాయాశ##తైర్యుతః. 18

సూతః; ఇత్యుక్తా కౌశికీ దేవీ విన్ద్యశైలం జగామ హ l ఉమాపి ప్రాప్తసజ్కల్పా జగామ గిరిశాన్తికమ్‌. 19

ప్రవిశన్తీం తదా ద్వారి హ్యపకృష్య సమాపితః l రురోధ వీరకో దేవీం హేమవేత్రలతాధరః. 20

తామువాచచ కోపేన రూపాత్తు వ్యభిచారిణీమ్‌ l ప్రయోజనం న తే7స్తీహ గచ్ఛయావన్నభేత్స్యసే. 21

దేవ్యా రూపధరో దైత్యో దేవం వఞ్చయితుం హి సః l స్వమాయయా ప్రవిష్టోసౌ దేవదేవేన ఘాతితః 22

ఘాతితే చాహమాజ్ఞప్తో నీలకణ్ఠన కోపినా l ద్వారేపి నావధానం తే యస్మాత్పశ్యామి వై తతః. 23

భవిష్యసి న మే ద్వర్థ్సో వర్షపూగాన్య నేకశఃl అతస్తే నాత్ర దాస్యామి ప్రవేశం గమ్యతాం ద్రుతమ్‌ . 24

ఇతి శ్రీమత్స్య మహాపురాణ దేవాసురసజ్గ్రామే దేవ్యాశ్చతుర్ముఖవరేణ గౌరీత్వ

ప్రాప్త్యాధికథనం నామ షట్పఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః.

పార్వతి పలిగిన ఈ మాట విని పద్మ భవుడు ఇట్లనెను. నీవు ఈ (నీవు కోరిన) విధముగనే అగుదువు. భర్తృ దేహార్ధధారిణివి కూడ అగుదువు. అనగానే తుమ్మెద వంటి దేహము కల ఆ పార్వతి వికసించిన నల్లుకలువల వంటి వన్నె కల చర్మమును విడిచెమ. ఆ నల్లకలువ కాంతితో మిగిలిన ఆమె ప్రకాశించుచర్మముతో చేతి యందు ఘంటయు మూడు కన్నులును నానా భరణములతో పూర్ణమగు శరీరా వయవములునుకలిగి పచ్చని పట్టువస్త్రము ధరించిన స్త్రీగా అయ్యెను. ఈ నల్ల కలువ కాంతితో నున్న ఆ దేవితో బ్రహ్మ ఇట్లు పలికెను: ఓనిశా! (విభావరీ! రాత్రిదేవీ!) నీవు పూర్వము నాఆజ్ఞతో పార్వతీ దేహమున సంక్రమించితివి. ఇంతవరకును ఆమెతో (ఏకా- అనంశా) ఒకటిగా- ఆమెకు అంశభూతపు కాక- ఉండి-కృతకృత్యురాలవయితివి; సుందరముఖీ! దేవీ క్రోధమువలన ఈ సింహము ఉత్పన్న మయినది కాదా! ఇది నీకు వాహనమగుటయే కాక నీధ్వజమందు కూడఉండుగాక! నీవు ఇపుడు వింధ్యాచలమునకు పొమ్ము; (ఇది విధ్య పర్వతము కాదు;) అచ్చట ఉండి నీవు దేవ కార్యము నెరవేర్చెదవుగాని; పంచాలుడను ఈ యక్షుడున్నాడే! ఇతనికి లక్షమంది అనుచరులున్నారు. ఇతడును వందల కొలది మాయల నెరిగినవాడు; ఇతనిని నీకు కింకరునిగా ఇచ్చుచున్నాను. అనిన బ్రహ్మవచనమునువిని కౌశికీదేవి వింధ్యాచలమునకేగెను. [పార్వతీ దేహము (కోశము) నుండి ఉత్పన్నయైనందున ఈమెకు కౌశికి యనిపేరు. ] తన కోరిక నెరవేరి ఉమయును గిరిశుని కడకు పోయెను. అచట అంతఃపురద్వారమున సావధానుడై ఉన్న వీరకుడు మొదటికంటె రూపము మారియున్న దేవి లోనికి ప్రవేశించుచుండ ఆమెను ఇవతలకు ఈడ్చివేసెను. హేమ వేత్రలతాధరుడు (బంగారు ప్రేపబెత్తము ధిరించినవాడు) ఆగు అతడు కోపముతో ఇట్లు పలికెను. నీకిచ్చట ఏమియు పనిలేదు. నిన్ను చీల్చివేయు లోపలనే ఇటనుండి పొమ్ము. దైత్యుడొకడు దేవీ రూపము ధరించి మమ్ములను వంచించి మాయతో లోన ప్రవేశించెను. శివుడు వానిని చంపెను. అటు తరువాత శివుడు కోపించి నన్నిట్లా జ్ఞాపించెను. ద్వారముకడ నీవు సావధానుడవుగాలేవు. కనుక నీవు ఈపని చూడనక్కరలేదు. ఆపని నేనే చూచుకొందును. అనేక సంవత్సరముల కాలము నీవు నాద్వారపాలక పదములో నుండరాదు. అని శివుడు పలికెను. కావున నీకు లోనికి ప్రవేశమీయను; త్వరగా ఇటనుండి పొమ్ము.

ఇది శ్రీమత్స్యమహా పూరాణమును దేవాసుర సంగ్రామమున

పార్వతి బ్రహ్మ వరమున గౌరి యగుట యను నూట ఏబది యారవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters