Sri Matsya mahapuramu-2    Chapters   

త్రిపంచాశదుత్తరశతతమోధ్యాయః.

పార్వతీ పరమేశ్వర వివాహాదికథనమ్‌.

సూతః : ప్రాదురాసీత్ర్పతీహార శ్శుచిశ్చీనాంశుకామ్బరః |

స జానుభ్యాం మహీం గత్వా పిహితాస్యః స్వ పాణినా. 1

ఉవాచ నిర్మలం వాక్యమల్పాక్షరపరిష్కృతమ్‌ | దైత్యేన్ద్రమర్క బృన్దానాం బిభ్రతం భాస్వరం వపుః. 2

కాలనేమి స్సురాన్బద్ధ్వా ఆదాయ ద్వారి తిష్ఠతి | స విజ్ఞాపయతి స్థేయం క్వ బన్దిభిరతి ప్రభో. 3

తన్నిశమ్యాబ్రవీద్దైత్యః ప్రతీహారస్య భాషితమ్‌ | యథేష్టం స్థీయతామేతై ర్గృహం మే భువనత్రయమ్‌. 4

కేవలం పాశబంధైస్తు విముక్తై శ్చావిలమ్బితమ్‌ |

తారకపరాజిత శ్రీవిష్ట్వాదిదేవానాం బ్రహ్మలోకగమనమ్‌.

ఏవం కృతే తతో దేవా దూయమానేన చేతసా. 5

జగ్ము ర్జగద్గురుం ద్రష్టుం శరణ్యం కమబోద్భవమ్‌ | నివేదితాశ్చ శక్రాద్యా శ్శిరోభి ర్ధరణీం గతాః. 6

________________________________________

* దీనిని బట్టి వరుణుని చేతియందలి పాశాయుధము వస్తుస్థితిలో సర్పము అని తెలియుచున్నది.

నూట ఏబది మూడవ అధ్యాయము.

పార్వతీ జనన-పార్వతీదేవీ వివాహాది వృత్తాంత కథనము.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు సింహాసనమునందు కూర్చుండియున్న తారకాసురుని కడకు వచ్చి ద్వారపాలుడు ఎదుట నిలిచెను; వాడు శుచియై చీనాంబరము (పట్టు వస్త్రము) ధరించియుండెను. వాడు మోకాళ్ళు నేలకు ఆనించి చేతితో నోరు మూసికొని అల్పాక్షరములు కలిగియుండియు స్పఎn్టార్థములతో అలంకృతమగు వచనమును రవి సమూహములంత ప్రకాశమానమగు శరీరముకల తారకునుద్దేశించి ఇట్లు పలికెను: ప్రభూ! ''కాలనేమి దేవతలను బంధించికొనివచ్చి వాకిట నిలిచియున్నాడు. బందీలు ఎట నుండవలయునని మనవి చేయుచున్నాడు. అనగా ప్రతీహారుని వచనము విని దైత్యుడిట్లనెను. ''వారు తమ ఇచ్చ వచ్చినచోట ఉండవచ్చును. భువనత్రయమును నాఇల్లే. వారికి పాశబంధములు మాత్రము త్వరగ వదలించుడు.'' ఇట్లు చేసిన తరువాత దేవతలు నొచ్చుచున్న మనస్సులతో జగద్గురుడును (గురుడు=తండ్రి) పద్మ సంభవుడును శరణ్యుడునునగు బ్రహ్మను దర్శింపబోయిరి. ద్వారపాలురచే నివేదించబడి ఆ ఇంద్రాదులు శిరస్సులు ధరణికి మోపి స్పష్టములగు వర్ణములును అర్థములును కల వచనములతో కమలాసనునిట్లు స్తుతించిరి.

తుష్టువుస్స్పష్టవర్ణార్థవచోభిః కమలాసనమ్‌ |

దేవాః : త్ర్యోఙ్కారాయాఙ్కురాయ ప్రసూత్యై విశ్వస్యాస్యానన్తభేదస్య పూర్వమ్‌. 7

సమ్భూతస్యానన్తరం సత్త్వమూర్తే సంహారేచ్ఛోస్తే నమః కాలమూర్తే |

వ్యక్తిం నీత్వా త్వం వపుస్స్వం మహిమ్నా చాసీరణ్డాత్స్వాభిధానా దచిన్త్యః. 8

ద్యావాపృథ్యోరూర్ధ్వఖణ్డాధరాభ్యా మణ్డాత్తస్మా త్త్వం విభాగం చకార |

వ్యక్తిం చైతద్యత్ర గత్వా తతోభూదేవం విద్మస్తత్ప్రణీతే వికారే. 9

వ్యక్తం జన్మాజన్మనశ్శాశ్వతస్యానన్తస్యాన్తశ్ఛారిణో దేహభాజామ్‌ |

ద్యౌస్తే మూర్ధా లోచనే చన్ద్రసూర్యౌ వ్యాళాః కేశా శ్శ్రోత్రరన్ధ్రా దిశ##స్తే. 10

గాత్రేష్వజాథ ద్యౌరపి చ స్థితా తే పాదౌ భూమిర్నాభిరన్ధ్రే సముద్రాః |

మాయా కార్యం కారణం త్వం ప్రసిద్ధో వేదైశ్శాన్తో జ్యోతిరాద్యంత్వముక్తః. 11

వేదార్థేషు త్వాం వివృణ్వన్తి వృద్ధా హృత్పిణ్డాన్త స్సన్నివిష్టం పురాణమ్‌ |

త్వామాత్మానం లబ్ధయోగా గృణన్తి సాఙ్ఖ్యే యాస్తా స్సప్తసూక్ష్మాః ప్రతీతాః 12

తాసాం హేతుశ్చాష్టమీవాస్తి గీతా స్వం స్వం తస్యోజ్జీవసి స్మాపిధానః |

దృష్ట్వా మూర్తింస్థూలసూక్ష్మాం చకార యేవై భావాః కారణౖః కేచిదుక్తాః. 13

సమ్భూతాస్తే త్వత్త ఏవాదిసర్గేభూయ స్తత్త్వో వాసనాం తేభ్యుపేయుః |

త్వత్సఙ్కల్పేనాన్తమాయాతి గూఢః కాలోమేయో ధ్వస్తసఙ్ఖ్యావికల్పః. 14

భావవ్యక్తిస్తస్య సంహార హేతు ర్వాసోనన్త్యం తస్య కర్తాసి చాత్మ& |

యేన్యే సూక్ష్మా యే చ తేభ్యోపి గీతా స్థ్సూలా భూతా శ్చాన్తరాళేచ తేషామ్‌. 15

తేభ్యస్థ్సోల్యస్త్వం పురాణప్రతీతో నూనం భూతో భూతిభాజాం ప్రభావే |

భావీచ త్వం యుక్తభావం నిరస్య వ్యక్తస్థానే వ్యక్తవృత్తిం కరోషి. 16

వ్యక్తం దేవోభ క్తిభాజాం వరణ్య స్త్రాతా గోప్తా త్వంభవానన్తమూర్తిః |

వినేము రమరాస్త్సుత్వా బ్రహ్మాణ మవికారిణమ్‌. 17

తస్థుర్మనోభి రిష్టార్థసమ్ర్పాప్తిప్రార్థనా స్తతః | ఏవం స్తుతో విరిఞ్చిస్తు ప్రసాదం పరమం గతః. 18

అమరాన్వరదం ప్రాహ వామహస్తేన నిర్దిశ& |

(ఆది మధ్యంతములందెల్ల వ్యాపించియుండు) ప్రణవత్రయ స్వరూపుడును ఇపుడిట్లు అనంతభేద భిన్నమై యున్న ఈ విశ్వమునకు మొదట అంకురమై ప్రసవరూపుడై సంభవ (సృష్టి) రూపుడై అనంతరము సత్త్వ (స్థితి) రూపుడై కడపట సంహారరూపుడునగు కాలమూర్తీ: నీకు నమస్కారము. నీవు నీ శరీరమును స్వమహిమతోనే వ్యక్త మొనర్చి నీపేరితో ప్రసిద్ధమగు అండము (బ్రహ్మాండము) నుండియే (స్థూల ప్రపంచముగా) రూపొంది అచింత్యుడ వయితివి. ఈ అండమునుండియే నీవు ద్యావా పృథివులనెడు ఊర్ధ్వా ధర ఖండములుగా విభాగమొనర్చితివి.

నీయందే ఈ విశ్వము వ్యక్తినొంది నీనుండియే సంభవించినది; నీవు రచించినవికారము (జగత్పరిణామము) విషయమున మాకు తెలిసినది ఇదియే. జన్మము (వాస్తవమున) లేనివాడును శాశ్వతుడును అనంతుడును దేహధారుల అంతఃకరణవర్తియునగు నీవు వ్యక్తుడవగుటయే (జగత్తుగా పరిణమించుటయే) నీ జన్మము. ద్యులోకము నీ శిరస్సు. చంద్ర సూర్యులు నీకన్నులు. సర్పాది సరీసృపములు నీకేశములు. దెసలు నీచెవులు; నీ అవయవుమలందే మూల ప్రకృతియు ద్యులోకమును నున్నవి. భూమి నీపాదములు. నీ నాభిరంధ్రమునందు సముద్రములున్నవి; నీవు వేదములచే మాయయు కార్యమును కారణమును శాంతుడవును ఆద్యజ్యోతియును నీవేయని చెప్పబడి ప్రసిద్ధుడవయి యున్నావు. వేదార్థములయందు అనుభవముగల వృద్ధులగు వారు నిన్ను హృత్పిండాంతర్భాగమున అమరియున్న ప్రాచీన తమ తత్త్వమునుగా చెప్పుచున్నారు; యోగనిష్ణాతులు నిన్ను ఆత్మనుగా చెప్పుదురు; సప్త సూక్ష్మ తత్త్వములుగా ప్రసిద్ధములగు 1. మహత్‌ - 2. అహంకారము 3. పంచతన్మాత్రలు (సూక్ష్మ భూతములు) నీవేయని సాంఖ్యులందురు. ఏ ఏడింటికిని హేతువగు ఎనిమిదవతత్త్వముగా పేర్కొనబడిన (అవ్యక్త) తత్త్వమునుకూడ స్వస్వరూపుమతో నీవే అపిధానుడవై మరుగుపడిన - అసాక్షాద్భూత - రూపముతో ఉజ్జీవింపజేయుచున్నావు. దృశ్యమగు స్థూల ప్రపంచమును (స్థూల భూతములను కూడ) సూక్ష్మమూర్తిని నీవే సృష్టించితివి; కారణ తత్త్వములు అని కొందరచే చెప్పబడినవియు ఆది సర్గమం (సృష్టియం)దు నీ నుండియే ఉత్పన్నమయినవి; మరల నీనుండియే అవి స్వస్వవాసనను (సంస్కారమును) పొందును. ప్రపంచమునకు భావ వ్యక్తిని (రూప స్పష్టీకరణమును) దానికి వాసమును (స్థితిని) దానికి సంహారమును అనంతత్వమును (సంసారము అనాదికావున) కలిగించువాడవు నీవే; గూఢమును అమేయమును (త్త్వమెరుగరానిది - పరిమితి నిర్ణయించ నలవికానిది) సంఖ్యా వికల్పమునకు అందరానిదియగు కాలముకూడ నీ సంకల్ప మాత్రముచేత అంతమునందును. స్థూల భూతములు అనియు సూక్ష్మభూతములు అనియు పేర్కొనబడినవి ఏవి కలవో వాని అంతర్భాగమున వానికి ఆత్మ భూతుడవైయున్న వాడవును నీవే; పురాణ (శాశ్వత) రూపుడవగు నీవే వాటికంటెను స్థూల రూపుడవయియు ప్రపంచ రూపుడవయి పరిణమించి గోచరించుచున్నావు; భూతిభాజులు (సంభూతిని-జన్మును-పొందు ప్రాణుల) పొందు ప్రభవము (ప్రభవము=ఉత్పత్తి) నందు భూతరూపుడవు (వారికంటె ముందుకూడ ఉన్నవాడవు) నీవే; అమరిన రూపమును నిరసించి (తొలటించి కొని) ఈ ప్రపంచమునకు భావి (తరువాత కూడ ఉండువాడు) కూడనీవే; వ్యక్త ప్రపంచము స్థితి నొందుటకు అనుకూలమగు వ్యక్త వ్యాపారమును (ప్రవృత్తిని) నీవే కల్పించుచున్నావు. భక్తి భాక్కులగు వారికి నీవే రక్షకుడవనుట స్పష్టము; అనంతమూర్తీ! మాకును నీవు రక్షకుడవుకమ్ము.

అని ఇట్లు దేవతు అవికారియగు బ్రహ్మనుస్తుతించి వినమ్రులయి ఇష్టార్థ ప్రాప్తిని ప్రార్థించుచున్న మనస్సు లతో నిలిచిరి. ఇట్లు స్తుతింపబడిన బ్రహ్మయును మిగుల అనుగ్రహవంతుడయ్యెను. వరదుడనగుదునని వామ హస్తముతో నిర్దేశించుచు ఇట్లు పలికెను :

బ్రహ్మకృత తారకపరాజిత శ్రీవిష్ణ్వాదిదేవావస్థాప్రశ్నాః.

బ్రహ్మా:నారీవాభర్తృకా కస్మాత్తనుస్తే త్యక్తభూషణా. 19

రాజతే న తథా శక్ర వ్లూనవక్త్రశిరోరుహా | హుతాశన విముక్తోపి ధూమేన న విరాజసే. 20

భస్మనేవ సమాచ్ఛన్నోదగ్ధదావశ్చిరోషితః | యమామయమయేనైవ శరీరేణ విరాజసే. 21

దణ్డనాలమ్బితేనైవ కృత్వా తేన పదే పదే | రజనీచరనాధోపి కిం భీత ఇవ భాససే. 22

రాక్షనేన్ద్ర క్షతారాతే త్వమరితిక్షతో యథా | తనుస్తేవరుణోచ్ఛుష్కః పరీతఇవ వహ్నినా. 23

విముక్తంతు చిరాత్పాశం పాణిభిః ప్రవిలోకయ& | వాయోభవానచేతా స్త్వమస్నిగ్ధైరివ నిర్జితః. 24

త్వం కిం వదసి సన్త్యజ్య పౌలస్త్య న కుబేరతామ్‌ | రుద్రాస్తు శూలినస్సన్తో వదధ్వం బహుశూలతామ్‌. 25

భవతాం తేన సఙ్‌క్షప్తం తేజస్తు భవతామపి | అకిఞ్చిత్కరతాం ప్రాప్తః కరస్తేన విభాసతే. 26

బలం తీక్షోత్పలాభేన చక్రేణ మధుసూదన | కిం భవాద్యుదరాలీనభువనప్రవిలోకనమ్‌. 27

క్రియతే స్తిమితాక్షేణ భవతా విశ్వతోముఖ | ఏవముక్తా స్సురాస్తేన బ్రహ్మణా బ్రహ్మమూర్తినా. 28

వాచః ప్రధానభూతత్వాన్మారుతం సమచోదయన్‌ |

అకస్మికముగ భర్త గతించగా భూషణములు విడిచిన స్త్రీవలె నీశరీరమును మొగమును వాడి కేశముల కలంకరణాదికము లేక ప్రకాశింపకయున్నదేమి? హుతాశనా! నీవు పొగలేకయు అడవిని కాల్చి చాలకాలమట్లే యుండి బూడిదతో కప్పువడినవాడువలె ప్రకాశింపకున్నావేమి? యమా! వ్యాధిమయమయిన శరీరముతో కూడి(నట్లు) అడుగడుగునను దండమును ఆసరా చేసికొని నడుచుచు ఉన్నావేమి? నిరృతీ! నీవు నిశాచరులకు అధిపతివై ఉండియు భయపడినట్లు తోచుచున్నావు; శత్రులను గాయపరచు నీవు రాక్షసేంద్రా! శత్రువు చేతిలో గాయపడినట్లున్నావే! సర్పములు చాల కాలమునకు ముందే విడిచిన (వట్టి త్రాటిరూపములోనున్న) పాశమును చూచుకొనుచు వరుణా! అగ్ని చు ట్టివేసినవాడువలె తెగ ఎండిపోయియున్నావేమి? వాయుదేవా! శత్రువులచేతిలో ఓడిపోయిన్టలు చేతోరహితుడవయి యున్నావేమి? పౌలస్త్యా! నీవు కుబేరత్వమును (ధనాధి పతిత్వమును) కోల్పోయినట్లు మాటాడకున్నావేమి? ఈ రుద్రులు శూలధారులయ్యు బహుశూలములు (కడుపు నొప్పులు) కలవారమని చెప్పకయే చెప్పుచున్నారు. ఎవరు మీయంతటి వారి తేజమును కూడ హరించిరి? మదుసూదనా! నీకరము తీక్షమును నల్లకలువవలె ప్రకాశించునదియునగు చక్రముతో ప్రకాశించక ఏమియు చేతకాని దానివలెనయినదేమి? విశ్వతోముఖా! ఱప్పవాల్పక నీవు నీవు నీ ఉదరమునందే జనించి (రక్షింతువని) అచ్చటనే దాగియున్న భువనములను (ఎట్లు రక్షింతునాయని) చూచుచున్నావేల? ఇట్లు వేదమూర్తియగు బ్రహ్మ పలుకగా వాక్కు నకు ప్రధానుడు (ప్రకృతి-మూల కారణ) రూపుడు కావున దేవతలు వాయుదేవుని ప్రేరించిరి.

బ్రహ్మాణం ప్రతి దేవకృతస్వీయావస్థావిజ్ఞాపన.ఆ

అథ విష్ణుముఖైర్దేవై శ్శ్వసనః పరిచోదితః. 19

ఆహ దేవం చతుర్వక్త్రం త్వం తు వేత్సి చరాచరమ్‌ |

క్రతవో విహితాం కిల దేవ త్వయావితతింకిల జగ్ము ర్విచిత్రగుణాః. 20

అపిపుష్టికృతః శ్రితకామఫలా విహితా ద్వజనాయక దేవగుణాః |

అపినాకమభూత్కిల యజ్ఞభుజాం భవతోవరయోగవశా త్సతతమ్‌. 31

అపహృత్య విమానగణం స కృతో దితిజేన మహామరు భూమిసమః |

కృతవానసి సర్వగుణాతిశయం యమశేషమహీధరరాజతయా. 32

కుజభూత(ప)వనాం క్వనుతామవిధిం సచ మేరుగిరర్గగనే ససదా |

అధివాసవిమారవిదాపుచితో దనుజేన పరిక్షతశృజ్గతటః. 33

ప్రవిలుణ్ఠితరత్న గుహానివహో బహుదైత్యసమాశ్రయతాం గమితః |

సురరాజసతస్యభ##యేన గతం సవిషాదశరీరనిషణ్ణతయా. 34

ఉపయెగతయా వివృతం సుచిరం విమలద్యుతిపూరితదిగ్వదనమ్‌ |

భవతైవ వినిర్మితమాదియుగే సురహేతిసహస్రమకుణ్ఠభిదమ్‌ |

దితిజస్య శరీర మవాప్య గతం శతధా మతిభేదమివాల్పమతిః. 35

నాసీరధూళిధ్వస్తాజ్గా ద్వారి ద్వార్థ్సత్వకం గతాః. 36

లబ్ధప్రవేశాః కృచ్ఛ్రేణ వయం తస్యామరద్విషః | సభాయా మమరా దేవ ప్రకృష్టైర్హ్యపవేశితాం. 37

వేత్రహసై#్త రజల్పన్త స్తథాపహసితాః పరైః | మహార్హాస్సిద్ధసర్వార్థా భవన్త స్స్వల్పభాషిణః. 38

చాటుయుక్తం వచోత్యర్ధ మమరా బహు భాషతః | సభేయం దైత్యసింహస్య న శక్రస్యావిశత్తుతామ్‌. 39

భవద్భిరితి దైత్యస్య ప్రేషై#్యర్విహసితా బహు | క్రతవో మూర్తిమన్తస్త ముపాసన్తే హ్యహర్నిశమ్‌. 40

కృతాపరాధసన్త్రాసం సన్త్యజన్తి కథంచన | తన్త్రీలయత్రయోపేతం సిద్ధగన్ధర్వకిన్నరైః. 41

సరాగముపధాతిష్టంగీయతే తస్య వేశ్మసు | హన్తాకృతోపకరణో మిత్రారిగురులాఘవే. 42

శరణాగతసన్త్యాగం త్యక్త సత్యపరిశ్రయః | ఇతి నిశ్శేషమథవా నిశ్శేషం కేనశక్యతే. 43

తస్యావినయమాఖ్యాతుం స్రష్టా తత్ర వరాయణమ్‌ |

అంతట విష్ణువు మొదలగు దేవతల ప్రేరణచే వాయుదేవుడు చతుర్ముఖుడగు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను: చరాచర (ప్రపంచ విషయ) మును నీవెరుగుదువు కదా! దేవా! నీవు విధించిన క్రతువులు ఆశ్చర్యకర గుణములు కలవయి విస్తృతిని పొందెను. మరియు వాటిచే ద్విజనాధులును దేవగణములును పుష్టిని పొందినవారును తాము కోరిన ఫలము లను పొందినవారునునయిరి. ఇదివరకును స్వర్గము దేవతలదిగానుండెను! కాని ఇపుడో - నీవిచ్చిన వరయోగ సంబంధమున తారకుడు నిరంతరముగా దేవతల విమాన గణమును అపహరించుటతో స్వర్గలోకమిపుడు మరుదేశము (ఎడారి) తో సమానమయి యున్నది. సర్వగుణాతిశయముతో కూడిన ఏమేరు పర్వతమును సకల పర్వత రాజముగా చేసియుంటివో అదియు నిరంతరముగా అధివానమునకును విహారమునకును గగనమునందుపయోగించుటతో ఆ దానవుడు దాని శిఖరములను నెత్తములను భగ్నమొనర్చినాడు. దాని గుహలయందలి రత్నములన్నియు దోచివేసి ఆ పర్వత భాగములన్నియు బహు దైత్యులకాశ్రయముగా నొనర్చినాడు. దేవరాజా! ఆ మేరువు వానికి భయపడి విషాదముతో నిండిన శరీరము కలిగి కూర్చుండుటకు చాలకాలము దైత్యులకు ఉపయోగించునదై తన విమల కాంతులతో దిఙ్ముఖములను నింపుచు నున్నది. ఆదియుగమున నీవే నిర్మించినవియు మొక్కపోనివియు భేదింపనలవికానివియు అగు దేవతల వేలకొలది ఆయుధములు ఆదైత్యుని శరీరమును చేరగానే అల్పబుద్దియగు వాని బుద్ధి పండితుల ఎదుట భేదిల్లిన విధమున భిన్న భిన్నములయి పోయినవి. వాని సేనాముఖమునంలి ధూళితో సర్వావయవములును ధ్వంసముకాగా మేము వాని వాకిట ద్వారపాలురవలె నిలిచి మిగుల శ్రమమీదట ఆదేవ విరోధి సభలోనికి ప్రవేశము సంసాదించగలిగితిమి. గొప్పవారుగా అటనుండిన వేత్రహస్తులు మమ్ములను కూర్చుండబెట్టగా నోరు మెదల్పక కూర్చుంటిమి. అటనున్న శత్రువులు మమ్మెగతాళి చేసిరి. ''దేవతలారా! మీరు మహాపూజ్యులు. సర్వర్థములు సిద్ధి పొందినవారు; మీరు మితభాషులు; ప్రశంసతో కూడినదియు అధికార్థములతో కూడినదియునగు మాట ఏదైనను ఇపుడెక్కువగా మాటాడుడు. ఇది దైత్యసింహుడగు తారకుని సభ; ఇంద్రుని సభవంటిది కాదిది.'' అని ఇట్లక్కడనున్న తారకుని సేవకులు మమ్ములను మిక్కిలిగా ఎగతాళి చేసి వెక్కిరించిరి. క్రతువులు మూర్తిమంతములయి అహర్నిశము వాని నుపాసించును; వదలినచో అపరాధమగునేమోయని అవి క్షనమయిన వానిని వదలవు; సిద్ధ గంధర్వ కిన్నరులు తంత్రీవాద్యములతో మంద్రమధ్య తార త్రివిధలయలతో రాగ యుక్తముగా వాని గృహములంధదు సన్నిహితులయియుండి గానము చేయుచుందురు. అయ్యయో! వాడు వీరు మిత్రులు వీరు శత్రువులు అని కాని వీరు గురుజనులు (బరువైనవారు) వీరు తేలికవారు అని కాని లెక్క పెట్టడు; మరుగు చొచ్చినవారిని కూడ విడిచివేయును; సత్యమునకు పరిశ్రయమీయనే ఈయడు. వాని అవి నయమును నిఃశేషముగ ఒక్కమాటలో ఇట్లు చెప్పవలసినదే; ఐనను కాకున్నను వాని అవినయమంతయు ఎవరు నిఃశేషముగా చెప్పగలరు? సృష్టికర్తవగు నీవే ఈ విషయమున శరణము (రక్షకుడవు) కావలయును.

సూతః : ఇత్యుక్త శ్చాత్మభూ ర్దేవ స్సురై ర్దైత్యవిచేష్టితమ్‌. 44

సురానువాచ భగవాం స్తతస్మ్సితముఖామ్బుజః | బ్రహ్మా : అవధ్యస్తారకో దైత్యస్సర్వైరపి సురైస్సురాః.

యస్య వధ్య స్స నాద్యాపి జాత స్త్రిభువనే పుమా& | మయా స వరదానేన ఛన్దయిత్వా నివారితం. 46

తపస స్సామ్ప్రతం రాజా త్రైలోక్యదహనాత్మకః | సచ వవ్రే వధం దైత్య శ్శిశుత స్సప్తవాసరాత్‌. 47

సచ సప్తదినో బాల శ్శజ్కరా ద్యోభవిష్యతి | తారకస్య నిహన్తా7సౌ భాస్కరాభో భ­ష్యతి. 48

సౌ7పీదానీ మపత్నీక శ్శఙ్కరో భగవా న్ప్రభుః | యచ్చాహముక్తవానస్య హ్యుత్తానకరతా సదా. 49

ఉత్తానో వరదః పాణిరేష దేవ్యా స్సదైవతు | హిమశైలస్య దుహితా సాతు దేవీభవిష్యతి. 50

తస్యాం సకామాచ్ఛర్వాణ్యాం భగవాన్పావకో యథా | జనయిష్యంతి తం ప్రాప్య తారకం స హనిష్యతి. 51

మయాభ్యుపాయ స్సకృతో యథైవం హి భవిష్యతి | శేషశ్చాప్యస్య విభవోవినశ్యేత్తదనన్తరమ్‌. 52

స్తోకకాలం ప్రతీక్షధ్వం నిర్విశ##ఙ్కేన చేతసా | ఇత్యుక్తా స్త్రిదశాస్తేన సాక్షా త్కమలయోనినా. 53

తాం వివిక్తే సమాలోక్య బ్రహ్మోవాచ విభావరీమ్‌ |

ఇట్లు దేవతలు (వాయు ముఖమున) తారకదైత్య చేష్టలు విన్నవించగా విని ఆ భగవానుడు చిరునగవు మొగమునందు తోచుచుండ వారితో నిట్లు పలికెను: దేవతలారా! దేవతలందరు కూడియు తారకుని చంపజాలరు. ఎవనికి వాడు వధ్యుడో అట్టి పురుషుడు త్రిబువనములందు ఎచ్చటను పుట్టలేదు. నేను వానికి కోరిన వరములనిచ్చి త్రిలోకము లను దహించివేయగల తపస్సు నుండి వానిని వారించితిని. ఏడు దినముల వయస్సుగల శిశువు వలన తనకు మృతి కావలెనని వాడు వరము కోరెను. అట్టి సప్త దినవయస్కుడగు బాలుడు శంకరునివలన ఎవడు కలుగునో - అతడే - రవి తేజస్కుడగు అతడే - తారకనిహంతయగును. భగవానుడును ప్రభువునగు శంకరుడు ఇంకను అపత్నీకుడుగా ఉన్నాడు. ఇదియుగాక ఏదేవి కరము ఎల్లప్పుడును ఉత్తానమయి (నిట్టనిలువుగను విప్పుకొనియు) ఉండునో ఆమె కుమారుడే వానిని చంపుననియు చెప్పియుంటినిగదా! ఇదిగో! ఈ దేవీకరము పరదమయి ఉత్తానమయియే యుండును కదా! ఆదేవి ఇక ముందు హిమశైల పుత్త్రియగును. శర్వాణియగు ఆమెయందెప్పుడు భగవానుడు కామప్రవృత్తుడై ఆ కుమారుని జనియింపజేయునో అప్పుడు ఆతనితో కూడి (యుద్ధముచేసి) తారకుడు తిరస్కృతుడు (నశించినవాడు) అగును. ఏ విధముగ ఇది జరుగునో ఆ యుపాయము నేను చేసియుంటిని. ఎక్కువ వ్యవధానము లేకుండగనే తరువాత కొలది కాలములోనే వాని విభవమంతయు వినాశమందును. మనస్సులందు భయ సందేహములు లేక కొలది కాలము వేచియుండుడు అని పద్మ సంభవుడు స్వయముగా చెప్పిన మాటవిని దేవతలు ఆయనను నమస్కరించి తమతమ అనుకూలతననుసరించి వెడలి పోయిరి.

జగ్ముస్తే ప్రణిపత్యేశం యథా యోగ్యం దివౌకసః | తతో గతేషు దేవేషు బ్రహ్మా లోకపితామమహః. 54

నిశంసస్మార దేవేశ స్స్వాం తనుం పూర్వసమ్భవామ్‌ | తతో భగవతీ రాత్రిరుపతస్థే పితామహమ్‌. 55

దేవకార్యార్థం విభావరీముద్దిశ్య బ్రహ్మోక్తిం.

బ్రహ్మా: విభావరి! మహత్కార్యం దేవానాం సముపస్థితమ్‌. 56

తత్కర్తవ్యం త్వయా దేవి ! శృణు చార్థస్య నిశ్చయమ్‌ | తారకోనామ దైత్యేన్ద్ర స్సురకేతు రనిర్జితః.

తస్యాభావాయ భగవా న్జనయిష్యతి చేశ్వరః | సుతం స భవితా తస్య తారకస్యాన్తకారకః. 58

శఙ్కరస్యాభవత్పత్నీ పురా దక్షసుతా సతీ | సా పితుః కుపితా దేవీ కస్మింశ్చిత్కారణాన్తరే. 16

భవిత్రీ హిమశైలస్య దుహితా లోకభావనీ | విరహేణ హరస్తస్యా మత్వా శూన్యం జగత్త్రయమ్‌. 20

తప్యతేహిమశైలస్య కన్దరే సిద్ధసేవితే | ప్రతీక్షమాణ స్తజ్జన్మ కఞ్చిత్కాలం నివత్స్యతి. 61

తయో స్సుతప్తతపసో స్సంయోగోభవితాశుభః | తతస్తాభ్యాంతు జనిత స్స్వల్పో వాక్కలహో భ##వేత్‌. 62

తతస్తు సంశయోభావే తారకస్యన దృశ్యతే | తయో స్సంయుక్తయో స్తస్మా త్సురతాసక్తికారణ. 63

విఘ్నస్త్వయా విధాతవ్యో యథా తాభ్యాం తథా శృణు |

గర్భశ్చ సేవ్యతాం మాతు స్వ్వేన రూపేణ రజ్యతా. 64

తతో విహస్య శర్వస్తాం విభ్రాన్తో నర్మపూర్వకమ్‌ | భర్త్సయిష్యతి తాం దేవీం తతస్సా కుపితా సతీ. 65

ప్రయాస్యతి తపః కర్తుం సా తస్మాత్తప ఆస్థితా | జనిష్యతి సుతం శర్వాదమితద్యుతిమణ్డలమ్‌. 66

స భవిష్యతి హన్తావై సురారీణా మసంశయమ్‌ | త్వయాపి దానవా దేవి హన్తవ్యా లోకదుర్జయాః. 67

యావచ్చన సతీ దేహసఙ్కాన్తగుణసఞ్చయా | తత్సఙ్గమేనతావత్త్వం దైత్యా& హన్తుం న శక్ష్యసి. 68

ఏవం కృతే తప స్తప్త్వా త్వయా సాత్మబుభూషయా | సమాప్తనియమా దేవీ తదా చోమా భవిష్యతి. 69

తదాస్వమేవ తద్రూపం శైలజా ప్రతిపత్స్యతే | తనుస్తవాపి సహజా గౌరీగర్భా భవిష్యతి. 70

దేవతలు వెడలిన అనంతరము లోక పితామహుడును దేవేశుడును అగు బ్రహ్మ సృష్ట్వాదియందు మొట్టమొదట ఏర్పడిన తన రూపమేయగు విభావరిని (ప్రలయకాల రాత్రిని) స్మరించెను. (మాయా శబళ బ్రహ్మతత్త్వపు ఒక దశయందలి రూపము ఈ విభావరీ రూపము అని దీనిని బట్టి స్పష్టమగుచున్నది. ఈ హేతువు చేతనే శ్రీదేవీ సప్తశతీపాఠ పూర్వాంగముగా రాత్రి సూక్త పఠనము సంప్రదాయమునందు ఏర్పడెను - అనువాదికుడు.) పిమ్మట వెంటనే భగవతి (దేవతారూప) యగు రాత్రి బ్రహ్మదేవుని ఎదుట నిలిచెను. ఆ సమయమున అచట మరెవ్వరును లేరు. అట్టి వివిక్త స్థానమందు ఆ విభావరిని చూచి ఆమె నుద్దేశించి బ్రహ్మ ఇట్లు పలికెను: విభావరీ! దేవతలకొక మహాకార్యము ఇపుడు తటస్థించియున్నది. వాని విషయమున నీవు చేయవలసిన పని నిశ్చిత స్వరూపమును తెలిపెద; వినుము. తారకుడను దైత్యేంద్రుడు దేవతలకు ధూమకేతువు వలె పీడాకరుడై ఉండుటేకాక జయింపబడకయున్నాడు. వాని నాశము కొరకై భగవానుడగు ఈశ్వరుడు కుమారుని జనియింప జేయును. అతడు తారకుని అంతమొందించు వాడగును.

శంకరుని భార్యయగు దక్షపుత్త్రి సతియుండెను గదా! ఆమెయొక కారణాంతరమున తన తండ్రి విషయమున కుపితురాలయ్యెను. (దేహత్యాగమును కూడ చేసెను.) లోకభావని (సృష్టికిని స్థితికిని హేతుభూత) యగు ఆదేవి హిమశైల పుత్త్రియగును. సతీదేవి విరహముచే హరుడు జగత్త్రయమును శూన్యమయినట్లు భావించి సిద్ద సేవితమగు హిమవత్పర్వత కందరమునందు తపమొనరించును. అతడట్లు కొంతకాలమామె జననమునకై ప్రతీక్షించుచు అట వసించును. (పార్వతియు ఆతనికై తపస్సు నాచరించును.) అట్టు మిక్కిలిగా తపస్సాచరించిన వారికిరువురకును లోక శుభకరమగు కలయిక (వివాహ రూపమున) జరుగును. అనంతరము వారికిరువురకును స్పల్పమగు వాక్కలహము జరుగవలయును. ఏలయన - అట్లు జరిగినచో తారకుని నాశము విషయమున సంశయము ఉండదు. అందులకై నీవు సురతాసక్తి కారణముగా సంయోగము చెందుచుండు ఆ పార్వతీ పరమేశ్వరులకు సంతానము కలుగుటలో విఘ్నము కలిగించవలసియున్నది. అది ఎట్లందువేమో - చెప్పెదను వినుము.

నీవు పార్వతీ మాతయగు మేనా గర్భమును ఆశ్రయించియుండి ఆ గర్భ(స్థ పిండ) మునకు నీవర్ణము కలుగు నట్లుచేయుము. అందువలన వివాహానంతరము శివుడు శృంగార వినోద పూర్వకముగా మాటలాడుచు (ఆమె దేహచ్ఛాయ విషయమున) విభ్రాంతినొంది వినోదమునకై ఆమెను బెదరించును. (రాత్రిదేవీ దేహచ్ఛాయ నలుపు కావున ఆమె మేనా గర్భమునందు వసించి నాటినుండియు పార్వతీ దేహచ్ఛాయ సహజముగ తెలుపేయయినను నల్లగా కనబడునట్లు చేయును. వివాహానంతరము శివుడు పార్వతి యందపుడపుడు కనబడు నలుపుచాయనే గమనించి నల్లని దానా! అని ఎగతాళి చేయుచు ఇట్టి నీవు నాకక్కరలేదని ఇట్లు బెదరించును.) అంతట పార్వతి కుపితురాలయి (ఆ నల్లని దేహచ్ఛాయను వదలించుకొని తెల్లనిచాయ సంపాదించి) గౌరి-గౌరచ్ఛాయ కలది-యగుటకై తపస్సాచరించ పోవును. ఆమెయట్లు తపమవలంబించి శివుని వలన అమిత తేజోమండల మండితుడగు కుమారుని జనింపచేయును. అతడు నిస్సంశయముగ త్రారకాది) దైత్యుల చంపువాడగును. దేవీ! నీవును లోకములకు దుర్జయులుగానున్న దైత్యులను చంపవలయును. కాని నీవు సతీదేవి ( రూపయగు పార్వతీ) దేహముతో సంబంధము కలిగి (ఆమె దేహమునందావేశించి) యున్నంతవరకును నీవు దైత్యవధ చేయజాలవు. (పార్వతి తన తపోబలమున నిన్ను తననుండి వేరుపరచును. తరువాత ఆమె గౌర దేహచ్ఛాయతో గౌరియై శివునికడకేగును. తరువాత శివుని యనుగ్రహమున కుమారుని కనును. ఈ నడుమ కాలములో నీవు మహిషుడు శంభనిశంభులు మొదలగు దానవులను చంపవలయును. దానిచే తారకుని బలమును తగ్గును. వారు స్త్రీవలన మరణమును కోరుట కుమారునివలన మరణము కోరుట యను వరములను నెరవేరి మరణింతురు. పిమ్మట పార్వతీ పుత్రుడు సప్త దిన వయస్క శిశువుగా తారకుని వధించును. అని బ్రహ్మదేవుడు విభావరికి చెప్పిన వచనపు తాత్పర్యము.) నీవు ఇట్లు చేయగా ఆమెయు తన స్వస్వరూపమును పొందగోరి పూనిన తపో నియమమును ముగించును. అంతట పార్వతియును తన స్వస్వరూపమును పొందును. నీదేహమును సహజ స్వరూపము నొందినదయి గౌరీ రూపమే తనయందు కలదిగా నగును. (నీరూపము-విభావరీ రూపము-ఆకృతియందు గౌరిగాను-దేహచ్ఛాయ మాత్రము నల్లనిదిగాను నగును.)

రూపాంశేనచ సంయుక్తా త్వముమాయా భవిష్యసి | ఏకానంశేతిలోకస్త్వాం వరదే పూజయిష్యతి. 71

తథా త్వ బహుధాకార్తె స్సర్వగా కామసాధనీ | ఓంకారవక్త్ర గాయత్రీ ప్రయత్తె ర్బ్రహ్మవాదిభిః 72

ఆక్రాన్తిరూర్జితాకారా రాజభిశ్చ మహీభుజైః | త్వం భూరితి విశాం మాతా శూద్రై స్సేవ్యేతి పూజితా. 73

క్షాన్తి ర్మునీనా మక్షోభ్యా దయా నియమినామపి | త్వం మహోపాయసన్దోహా నీతి ర్నయవిసర్పిణామ్‌. 74

పరిచ్ఛిత్తిస్స్వధర్మాణాం త్వమీహాప్రాణిహృచ్ఛయా |

త్వం యుక్తిస్సర్వభూతానాం త్వం గతి స్సర్వదేహినామ్‌. 75

త్వంచ కీర్తిమతాం కీర్తిస్వం మూర్తి స్సర్వదేహినామ్‌ |

రతిస్త్వం రక్తచిత్తానాం ప్రీతిస్త్వం హృద్యదర్శినామ్‌. 76

త్వ కాన్తి స్సర్వభూపాణాం త్వం శాన్తిర్దుష్టకర్మణామ్‌ |

త్వం భ్రాన్తి స్సర్వభూతానాం త్వం శ్రాన్తిః కామయాయినామ్‌. 77

జలధీనాం మహావేలా త్వంచ లీలా విలాసినామ్‌ | సంభూతిస్సత్‌పదార్థానాం స్థితిస్త్వం లోకపాలినామ్‌. 78

త్వం కాళరాత్రి ర్ని శ్శేషభువనావళినాశనీ | ప్రియకంఠగ్రహానన్దదాయినీ త్వం విభావరీ. 79

ఇత్యనేకవిధై ర్దేవి రూపైర్లోకే త్వ మర్చితా | యే త్వాం వేత్స్యన్తి వరదే పూజయిష్యన్తి వా7పి యే. 80

తే సర్వకామా న్ప్రాప్స్యన్తి నియతా నాత్ర సంశయుః |

నీవు ఇట్లు ఉమ (పార్వతి) రూపాంశముతో కూడిన దావయ్యేదవు. వరదురాలవగు విభావరీ! లోకము నిన్ను (పార్వతితో) ఏకాత్మక తత్త్వము అనియు 'అనంశ' ఈమె సాక్షాత్పార్వతియే కాని ఆమెకు అంశభూతురాలు కాదు.' అనియు భక్తితో పూజించును. ఆవిధముగా నీవు అనేక విధములుగా ఉండు ఆకారములతో సర్వమునందు నుండి కోరికలను సిద్దింపజేయుదువు. వేదతత్త్వ వేత్తలగు ఉపాసనాపరులగు విప్రులు 'ఓంకార వక్త్ర' - ఓంకారము ముఖముగా గలది-వేదస్వరూప' అనియు 'గాయత్రి' అనియు క్షత్త్రియులు 'ఊర్జితమగు-బలశక్తులతో కూడిన-ఆకారముగల ఆక్రాంతి అనియు వైశ్యులు 'భూదేవత' అనియు శూద్రులు 'మాతా' 'అమ్మతల్లి' అనియు నిన్ను పూజించి సేవింతురు. నీవు మునులయందు కలవరపరచనలవిగాని క్షాంతి 'ఓర్పు' గా నియమవంతులయందు 'దయ' గా నయశాస్త్రము ననుసరించి వర్తించు వారియందు మహోపాయ సందోహములతో కూడిన 'నీతి' గా 'స్వధర్మము' లకు 'పరిచ్ఛిత్తి' 'పరిమితి' గా ప్రాణుల హృదయములందు వసించు 'ఈహ' 'వాంఛ' ' ప్రయత్నము' గా ఉందువు. కీర్తిమంతులయందు 'కీర్తి' సర్వ దేహధారులయందును 'మూర్తి' 'ఆకృతి' గా అనురాగయుత చిత్తము కల వారియందు 'రతి' 'పరస్పరానురాగము' గా హృద్య-మనోహర-మగు వానియందుగల సౌందర్యమును చూచి యానందించు వారి హృదయములందలి 'ప్రీతి' 'ఆనందానుభవము' గా సర్వ భూషణములందలి 'కాంతి' గా దుష్ట కర్మాచరణములందలి 'శాంతి' గా సర్వభూతముల హృదయములందు 'భ్రాంతి' 'ఒకదాని జూచి మరియొకటియను కొనుట''గా తమ ఇచ్చవచ్చినట్లు నడుచుకొనువారియందు 'శ్రాంతి' 'అలసట' గా సముద్రములందు 'చెలియలికట్ట' గా విలాసవ (ం) తులయందు 'లీల' 'ఒయ్యారము' గా సత్తాత్మక పదార్థములందలి 'సంభూతి' 'పుట్టుక' లోకపాలకులయందు 'స్థితి' 'లోక వ్యవస్థ-లోక జీవనము' గా సకల భువన నాశనియగు 'కాళరాత్రి' గా ప్రియ కంఠాశ్లేషము వలని యానందము నందజేయు 'రాత్రి' 'విభావరి' గా ఇట్లనేక విధముల దేవీరూపవై లోకమునందు నీవర్చింపబడెదవు. వరదురాలవగు దేవీ! ఎవరు నియతులై నీ తత్త్వమునెరుగుదురో పూజింతురో వారికి అన్ని కోరికలును ఈడేరును; ఇందేమియు సంశయములేదు.

బ్రహ్మాజ్ఞప్తవిభావర్యాః హిమాచలగమనమ్‌.

ఇత్యుక్తా తు నిశా దేవీ తథేత్యుక్త్వా కృతాఞ్ఞలిః. 81

జగామ త్వరితా దేవీ గృహం హిమగిరే ర్మహత్‌ | తత్రాసీనాం మహాహర్మ్యే రత్న భూషాసమాశ్రయామ్‌. 82

దదర్శ మేనా మారాణ్డుచ్ఛవివక్త్రసరోరుహామ్‌ | కిఞ్చిచ్ఛ్యామముఖోదగ్రస్తభారావనామితామ్‌. 84

మహౌషధిగణాబద్దమన్త్రరాజనిషేవితామ్‌ | శుద్దహంసాతకానద్ధజీవరక్షామహోరగామ్‌. 83

మణిదీపగణజ్యోతిర్మహాలోకప్రకాశితే | ప్రకీర్ణబహుసిద్ధార్థే చానూనపరిచారికే. 84

శుచిచీనాంశుకచ్ఛన్నభూశయ్యాస్తరణోజ్జ్వలే | ధూపామోదమనోరమ్యే సర్జసర్వోపయోగికే. 86

తతః క్రమేణ దివసే గతే దూరే విభావరీ | విజృమ్భితసుభోదర్కే తతో మేనామహాగృహే. 87

ప్రసుత్పప్రాయ పురుషే నిద్రాభూతోపచారికే | శివలోకే శివే నూత్నే భ్రా న్తరాత్రివిహజ్గమ్‌. 88

రజనీచరసఞ్చారిభూతై రావృతచత్వరే | గాఢకణ్ఠగ్రహాలగ్నసుభ##గే సుజనే తతః 89

కించిదాభ్రమతాం ప్రాప్తే మేనానేత్రామ్బుజద్వయే |

ఆవివేశ ముఖే రాత్రిః సస్ఫుటం కృతసజ్గమా. 90

బ్రహ్మ ఇల్లు పరుక సరేయని నిశాదేవి (విభావరి-కాళరాత్రి రూపయగు మహామాయ) కృతాంజలియై త్వరి తముగా దేవతాత్ముడగు హిమవంతుని మహాగృహమునకేగెను. అచట ఆమెకు మహా హర్మ్యమునందు కూర్చుండిన హిమవత్పత్ని మేనాదేవి కనబడెను. ఆమె రత్నభూషణములు దాల్చి కొంచెము తెల్లనైన ముఖపద్మ కాంతితో ఉండెను. కొంచెము నలుపెక్కిన మొనలు కలిగి పైకెత్తినట్లున్న స్తన భారముచే ముందునకు వంచబడినట్లుండెను. మహౌషధి సమూహముతో కూర్చి కట్టబడిన మంత్రరాజము (మహామంత్ర రక్షాబంధము) ఆమె దేహము నాశ్రయించి ఉండెను. శుద్ధమగు హంసాతకము (బంగారు?)తో చేయబడి కట్టబడిన జీవరక్షాప్రద మహాసర్పము కలిగి ఉండెను.

విభావరి అచటకు వెళ్ళిన సమయము పగలు; ఆయినను ఆమెయుండిన గృహాంతర్భాగము మణిదీప గణముల జ్యోతిస్సులనుండి వెలువడు గొప్ప వెలుగుతో ప్రకాశితమై తెల్ల ఆవాలు చాల వెదజల్లబడి ఎందరో పరిచారికలు కలిగి శుచియగు చీన వస్త్రములు కప్పియుంచి గొప్ప పడకల పరపులతో ప్రకాశించుచు ధూపముల వాసనలతో మనోహరమయి సర్వ 'సర్జ' రసాదిరస ద్రవ్యముల ఉపయోగముతో కూడియుండెను. క్రమముగ పగలు గడచెను. అది దూర మయ్యెను. రాత్రి అయ్యెను. అపుడు ఆమేనాదేవీ మహాగృహమగు అత్యధికమగు సుఖ విశేషము కలది యయ్యెను. పురుషులలో చాలమంది గాఢ నిద్రయందు మునిగిరి. పరిచారికలు నిద్రతో తూగుచుండిరి. శివ ప్రీతికరమగు ఆ ప్రదేశమంతయు శుభకరమును క్రొత్తదిగ కనబడునదియునై ఉండెను. రాత్రి సంచారి పక్షులు అటునిటు సంచరించు చుండెను. రాక్షసులు సంచరించుచుండిరి. ముంగిళ్ళయందు క్షుద్ర భూతములు తిరుగుచుండెను. పరస్పర ప్రీతి పాత్రులగు ప్రియాప్రియులు గాఢ కంఠాలింగనమున మునిగిరి. ఇట్టి రాత్రికాలమున మేనా నేత్ర పద్మద్వయముకూడ విశ్రాంతికై కొంచెము కలవరపడుచుండెను. ఆదే సమయమున రాత్రి దేవీ మేనాదేవితో సంగమము (కూడిక) చెంది ఆమె ముఖమునుండి మేనా శరీరమున ప్రవేశించెను.%్‌

జన్మదాయా జగన్మాతుః క్రమేణ జఠరాన్తరమ్‌ | ఆవివేశాతులం జన్మ మన్యమానా క్షపా తువై. 91

అజీజయ చ్ఛవిం దేవ్యా గుహారణ్యా విభావరీ |

మేనాయాం పార్వత్యుత్పత్తిః

తతో జగతి నిర్వాణహేతు ర్హిమగిరి ప్రియా. 92

బ్రహ్మే ముహూర్తే సభగా ప్రాసూయత గహారణిమ్‌ |

తస్యాంతు జాయమానాయాం జన్తవ స్థ్సాణుజఙ్గమాః 93

అభవన్తుఖిన స్సర్వే సర్వలోకనివాసినః | నారకాణామపి తదా సుఖం సర్వగతం మహత్‌. 94

అభవత్క్రూరసత్త్వానాం చేతశ్శాన్తంచ దేహినామ్‌ | జ్యోతిషామపి తేజస్త్వం సుతరాం చాభవత్తదా. 95

ఘనాశ్రితాశ్చౌషధయ స్స్వాదువన్తి ఫలానిచ | గన్ధవన్తిచ మాల్యాని విమలంచ నభో7భవత్‌. 96

మారుతశ్చ సుఖస్పర్శో దిశశ్చ సుమనోహరాః| తదాచోద్బూతఫలిన పరిపాకగుణోజ్జ్వలాః 97

అభవత్పృథివీ దేవీ శాలిమాలా7తిసున్దరా | తపాంసి దీర్ఘచీర్ణాని మునీనాం భావితాత్మనామ్‌. 98

తస్మిన్జాతాని సాకల్యే కాలే నిర్మలచేతసామ్‌ | విస్మృతానితు శాస్త్రాణి ప్రాదుర్భావం ప్రపేదిరే. 99

ప్రభావం తీర్థముఖ్యానాం తదా పుణ్యతమం త్వభూత్‌ | అన్తరిక్షే7మారాశ్చాస న్విమానేషు సహస్రశః 100

సమహేన్ద్రహరిబ్రహ్మవాయువహ్నిపరురోగమాః | పుష్పవృష్టిం ప్రముముచు స్తస్మింస్తుహినభూధరే. 101

జగుర్గన్ధర్వముఖ్యాశ్చ ననృతుశ్చాప్సరోగణాః | మేరుప్రభృతయాశ్చాపి మూర్తిమన్తో మహాచలాః. 102

తస్మిన్మహోత్సవే ప్రాప్తే దివ్యభూభృతి మానవాః | సాగరాస్సరితశ్చైవ సమాజగ్ముశ్మ సర్వశః 103

హిమశైలో7భవల్లోకే తదా సర్వైశ్చరాచరైః | సేవ్యశ్చైవాభిగమ్యశ్చ సశ్రేయాంశ్చాచలోత్తమః. 104

అనుభూయోత్సవం దేవా జగ్ముస్స్వానాలయాన్ముదా | దేవనాగేన్ధ్రగన్ధర్వశైలలీలావరాఙ్జనాః. 105

హిమశైలసుతా దేవీ త్వహంపూర్వికయా తతః | క్రమేణ వృద్ధిమానితా లక్ష్మ్యా వాణ్యా వరైర్భుధైః . 106

క్రమేణ రూపసౌభాగ్యప్రబోధై ర్భువనత్రయమ్‌ | అజయద్రూపలక్ష్మ్యాపినిస్సాధారైర్నగాత్మజా. 107

నిరుపమానమగు జగన్మాతృ జననము జరుగబోవుచున్నదని ఎరిగి రాత్రి దేవి ఆ జగన్మాతృ మాతృ గర్భాంతర్భాగమును ప్రవేశించెను. తక్షణమే అచ్చట వ్యాపించి విభావరీదేవి గుహునకు అరణియగు (గుహుడనగా కుమారస్వామి; గుహుడమ అగ్ని జనించుటకు అరణివంటిది పార్వతి. ప్రాచీన సంప్రదాయమున అగ్నిని ఉత్పత్తి చేయుటకై మథించు కొయ్యపనిముట్టునకు అరణియనిపేరు. ఇది రెండు బాగములు-క్రింది భాగము గుంతతో ఉండు నది పూర్వారణి; మథించు పైభాగము ఉత్తరారణి.) పార్వతి దేహకాంతిని జయించి ఆమె శరీరచ్చాయ నలుపగు నట్లొనరించెను. అటు తరువాత బ్రాహ్మముహూర్తమునందు సుభగ (భర్తకు ప్రీతిపాత్రము) అగు హిమవత్పత్ని మేనాదేవి జగత్తునందంతట నిర్వాణము (సుఖము-మోక్షము) నకు హేతువగు గుహారణిని గ్రుహునకు జన్మస్థానమగు పార్వతిని) కనెను.

ఆ పార్వతి జనించుచుండ స్థిరచరములగు సర్వలోక నివాసి ప్రాణులు అన్నియు సుఖవంతములయ్యెను. నరకవాసులకును ఆ సమయమున సర్వ శరీర వ్యాపియగు మహాసుఖము కలిగెను. క్రూరమగు అంతఃకరణ వృత్తికల ప్రాణుల చేతస్సుకూడ శాంతమయ్యెను. జ్యోతిస్సుల కన్నిటికిని అపుడు మిక్కిలిగ తేజస్సధికమయ్యెను. ఓషధులును ఘనము (అధికవీర్యము) చే ఆశ్రయించబడినవి (మహాశ క్తిమంతములు) అయ్యెను. పూవులు సుగంధయుతములును ఆకాశము విమలమును అయ్యెను. వాయువులు సుఖ స్పర్శములును దిశ లతిమనోహరములును నయ్యెను. పృథివీ దేవియు ఉద్భూతమగు ఫలము (పంట) కలదియు వరిపైరు పంటల వరుసలతో అతి సుందరియు పంటల పరిపాకముతో నిండినదియు నయ్యెను. చాలా కాలమునుండియు భావితాత్ములయి (ఉత్తమ సంస్కారము నొందించబడిన అంతఃకరణ వృత్తి కలవారయి) నిర్మలచిత్తులై ఆచరించినను ఫలవంతములు కాక యుండిన తపస్సులును ఆ సమయమున సాకల్యము నొంది ఫలించెను. శాస్త్ర పండితులు చదివి మరచిన శాస్త్రములును ఆ సమయమును వారిచిత్తములందు సాక్షాత్కరించెను. ఉత్తమ తీర్థముల ప్రభావము ఎప్పటికంటె పుణ్యతమయ్యెను. మహేంద్ర హరిబ్రహ్మవాయువహ్ని ప్రముఖులగు దేవతలు వేలకొలది మంది అతరిక్షమునందు విమానములయందుండి హిమవంతుని మీద పూలవాన కురియించిరి. గంధర్వ ముఖ్యులు పాడిరి; అప్సరోగణములు నర్తించెను. మానవులుగా మూర్తిమంతములయి మేరువు మొదలగు మహాపర్వతములన్నియును సాగరములును నదులును అన్నియును దివ్య హిమాచలుని ఇంట చెరువఅయిన ఆ దివ్య మహోత్సవమునకై వచ్చెను. ఆ పర్వతోత్తముడగు హిమాచలుడును నయ్యెను. దేవతలును దేవనాగగంధర్వ పర్వంత జాతులవారును వారి వారి లీలా విలాసవతులగు స్త్రీలును ఆ ఉత్సవము ననుభవించి తమ తమ నివాసములకు సంతోషముతో వెడలిపోయిరి. లక్ష్మీవాణీ దేవతలును దేవతాశ్రేష్ఠులును (వారి స్త్రీలును) నేను ముందు నేను ముందనుచు ఆ హిమశైలపుత్త్రిని క్రమముగా పెంచి పెద్ద చేయుచుండిరి. ఆ పర్వతపుత్త్రి పార్వతి అసాధారణములగు రూప సౌభాగ్య ప్రబోధముల (వికాసముల) తోను రూపలక్ష్మితోను క్రమముగ లోకత్రయమును జయించెను.

నారదస్యేన్ద్రలోకగమనమ్‌.

ఏతస్మిన్నన్తరే శక్రో నారదం దేవసమ్మతమ్‌ | దేవర్షిమథ సస్మార కార్యసాధనసత్వరః 108

సతు శక్రస్య విజ్ఞాయ కాతం భగవాంస్తదా | ఆజగామ ముదా యుక్తో మహేన్ద్రస్య నివేశనమ్‌. 109

తంతు దృష్ట్వా సహస్రాక్ష స్సముత్థాయ మహాసనాత్‌ | యథార్హేణతు పాద్యేన పూజయామాస వాసవః. 110

శక్రప్రణీతాం తాంపూజాం ప్రతిగృహ్య యథావిధి | నారదఃకుశలం దేవమపృచ్ఛత్పాకశాసనమ్‌. 111

పృష్టేతు కుశ##లే శక్రఃప్రోవాచ వచనం విభుః |

ఇన్ద్రః : కుశలం జగతాం తావత్సమ్భూతం భువనత్రయే. 112

తత్ఫలోద్భవసమ్పత్తౌ త్వంభవాతంద్రితోమునే | వేదచైతత్సమస్తం త్వం తథాపి పరిచోదకః 113

నిర్వృతిం పరమాం యాతి నివేద్యార్థం సుహృజ్జనే |

తద్యథా శైలజా దేవీ యోగం యాయాత్పినాకినా. 114

శీఘ్రం తదుద్యతై స్సర్వైరస్మత్పక్షై ర్విధీయతామ్‌ |

అవగమ్యార్థ మఖిలం తతస్త్వామన్త్ర్య నారదః. 115

శక్రం జగామ భవనాద్ధిమశైలనివేశనమ్‌ | తత్ర ద్వార్‌స్థై స్సమౌనీన్ద్ర శ్చిత్రవేత్రలతాకులైః 116

వన్దితో హిమశైలేన నిర్గతేన పురో మునిః | సహసా ప్రవేశ్యభవనం భువోభూషణతాం గతమ్‌. 117

నివేదిత స్వయం హైమే హిమశైలేన విస్తృతే | మహాసనే మునివరో నిషసాదాతులద్యుతిః. 118

యథార్హం చార్ఘ్యపాద్యంచ శైలస్తసై#్మ న్యవేదయత్‌ | మునిస్తు ప్రతిజగ్రాహ తదర్ఘ్యం విధివత్తదా. 119

గృహీతార్ఘ్యం మునివర మపృచ్చ చ్ల్ఛక్‌ష్ణయా గిరా | కుశలం తపస శ్శనైః పుల్లాననామ్బుజః 120

ఇదే సమయమునందు ఇంద్రుడు దేవపూజ్యుడును దేవర్షియు నగు నారదుని తమ దేవకార్యమునకు సాధించుకొను త్వరతో స్మరించెను. భగవానుడా నారదుడును ఇంద్రుని కోరిక నెరిగి మోదయుక్తుడయి మహేంద్రభవనమునకు వచ్చెను. సహస్రనేత్రుడా వాసవుడు (ఇంద్రుడు) అతని చూచి తన మహాసనమునుండి లేచి యతార్హములగు పాద్యము (మొదలగు ఉపచార పూజల) తో పూజించెను. ఇంద్రుడు యతావిధిగా ఒనరించిన ఆ పూజనందుకొని నారదుడు పాకాసురుని అణచినవాడగు ఇంద్రుని కుశలమడిగెను. ఆ కుశలప్రశ్నమునకు సమాధానముగా విభుడగు ఇంద్రుడు ఈ వచనము పలికెను. భువనత్రయమునకును కుశలము కలిగించు అంకురము (దేవి) జనించినది. ఆ మొలకనుంచి ఫలము సంభవించి సంపన్నమగుటలో నీవును అతంద్రితుడవు (ప్రయత్న పరుడవు) కమ్ము; నీవును ఈ విషయమంతయును ఎరుగుదువు; ఐనను నీవు అడుగుచున్నావు. అదియుగాక తన హృదయమందలి విషయము సుహృజ్జనము నకు తెలుపుటచే పరమ సుఖము కలుగును. కావున నీవడిగినది చెప్పుచున్నాను. అది ఎట్టిది యనిన-శైలజాదేవి పినాకి (శివుని) తో వివాహ సంబంధముతో కూడిక నందవలయును. కావున మన పక్షము వారందరును అందులకై ప్రయత్నము చేయవలయును.

ఇట్లు ఇంద్రుడు చెప్పగా విషయమంతయు ఎరిగి అట్లే యగుగాక యని పలికి నారదుడు ఇంద్రుని కడవీడ్కోలు అందుకొని ఇంద్ర భవనమునుండి హిమాలయుని భవనమునకు పోయెను. అచ్చట బహు విధములగు వేత్రలతలను (పేము బెత్తములను) ధరించి తమ విధులందు వ్యాకులులైయున్న ద్వారపాలకుల నమస్కారము లందుకొని (వారు పోయి తెలుపగా) ముందునకు వచ్చిన హిమాలయుడు శీఘ్రమే లోనికి ప్రవేశింపజేయగా నారదుడు భువనములకే అలంకారమగు ఆ పర్వతుని భవనమును ప్రవేశించెను. అచట అమల ప్రకాశుడగు ఆ మునివరుడు స్వయముగా హిమాలయుడే పరచి చూపిన సువర్ణ మహాసనమునందు కూర్చుండెను. ఆ పర్వతుడు ఆయనకు యథార్హముగా అర్ఘ్యపాద్యాదికములను నివేదించెను నారదముని ఆ అర్ఘ్యాదికమును యథావిధానముగా గ్రహించెను. పిమ్మట హిమాలయడు వికసిత ముఖ పద్మముతో మెల్లగా మృదువగు వాక్కుతో ఆ మునివరుని తపోవిషయమున కుశలమడిగెను.

మునిరన్వపి రాజాన మపృచ్ఛత్కశలం తదా |

నారదః అహో7వతారితా స్సర్వే సన్నివేశా మహాగిరే. 121

పృథుత్వం మనసా తుల్యం కన్దరాణాం తవాచల | గురు త్వం తే గుణౌఘానాం స్థావరా దతిరిచ్యతే. 122

ప్రసన్నతాచ తోయస్య మనస్కో7ప్యధికా 7భవత్‌ | న లక్షయామ శ్శైలేన్ద్ర కుత్రాప్యధికతామతః 123

నానాతపోభిర్మునిభిర్జ్వలనార్కసమప్రభైః | పావనైః పావితో నిత్యం త్వత్కన్దరసమాశ్రయైః 124

అవమాన్య విమానంచ గగనేతు విరాగిణః | పితుర్గృహే ష్వివాసన్నా దేవగన్దర్వకిన్నరాః 125

అహోధన్యోసి శైలేన్ద్ర యస్య తే కన్దరం హరః | అధ్యాస్తేలోకనాధో హి సమాధానపరాయణః. 126

ఇత్యుక్తవతి దేవర్షౌ నారదే సాదరం గిరా | హిమశైలస్య మహిషీ మేనా మునిదిదృక్షయా. 127

అనుయాతా దుహిత్రాతు స్వల్పాళిపరిచారికా | లజ్జాప్రణయత్రస్తాజ్గీ ప్రవివేశ నివేశనమ్‌. 128

తత్ర స్థితో మునివర శ్శైలేన సహితోవశీ | దృష్ట్వా77గతం తపోరాశిం మునిం శైలప్రియా తదా. 129

వవన్దే గూఢవదనా పాణిపద్మకృతాఞ్జలిః | తాం విలోక్య మహాభాగో దేవర్షి రమితద్యుతిః. 130

ఆశీర్భిరమృతోద్గారూపాభి స్తాం వ్యవర్దయత్‌ | తతో విస్మితచిత్తాతు హిమవద్గిరిపుత్త్రికా. 131

ఉదైక్షన్నారదం దేవీ ముని మద్భుతరూపిణమ్‌ | ఏహి వత్సేతి చాప్యుక్తా ఋషిణా స్నిగ్ధయా గిరా . 132

కణ్ఠ గృహీత్వా పితర మజ్కే తు సముపావిశత్‌ | ఉవాచ మాతా తాం దేవీ మభివన్దయ పుత్త్రికే. 133

భగవంన్తం తతోధన్యం పతిమాప్స్యసి సమ్మతమ్‌ | ఇత్యుక్తాతు తతో మాత్రా వస్త్రాన్తపిహితాననా. 134

ఇఞ్చిన్నమ్రముఖీ భూత్వా వాక్యం నోవాచ కించన | తతః పునరువాచేదం వాక్యం మాతా సుతాం తదా.

వెంటనే నారదమునియు పర్వతరాజును పర్వతరాజ్యపు కుశలమడిగెను. తరువాత అతనిని నారదుడు సాదరముగ ఇట్లు ప్రశంసించెను. (హిమవంతుడు స్థూలదృష్టికి వర్వత శ్రేష్ఠము; త త్త్వదృష్టితో అతడు దేవతాత్ముడైన శివోపాసకుడు. ఈ నారదుడు చేయు ప్రశంస అందులకు తగినట్లు భావన చేయవలసియుండును.)

మహాగిరీ! నీ శరీరపు అన్ని సన్నివేశములు (అమరికలును) అవతారితములుగా నున్నవి. (నీవు పర్వత మాత్రుడవు కాక దేవతావతార రూపుడవు అని తెలుపుచున్నవి.) అచలమా! (స్థిరప్రజ్ఞుడవగు ఉపాసకుడా!) నీ కందరముల (ఎత్తైన శిలల నడుమనుండు లోతగు విశాల ప్రదేశముల) విశాలత నీ మనస్సులోతులతో సమానము; స్థావరరూపుడవగు నీ గురుత్వము (బరువు) దేవతాత్ముడవగు నీ గుణగణముల గురుత్వము (గొప్పదనుము) వలెనే లోకము లందరి అన్నిటి గొప్పదనమును మించియున్నది. నీయందలి నీటి ప్రసన్నత (తేటదనము) నీ మనస్సునందలి ప్రసన్నత (నిర్మలత్వము) వలెనే గొప్పది; శైలేంద్రమా! ఇంతకంటె గొప్పదనము ఎచ్చటను మాకు కనవచ్చుటలేదు. ఏలయన-నీకందరములు తమ ఆశ్రయ స్థానములుగా చేసికొని నానా తపస్సుల ననుష్ఠంచువారును అగ్నితో రవితో సమానముగా తేజోవంతులునగు పావనమునులు నిన్నెడతెగక పావనుని చేయుచున్నారు. తమ యానములగు విమానములను అలక్ష్యముచేసి అంతరిక్ష సంచారమునందు విర క్తిచెంది దేవగంధర్వ కిన్నరులు తండ్రి ఇండ్లయందువలె నీ ప్రదేశములందు వసించుచు నీకు చేరువయై యున్నారు. శైలేంద్రా! అహో! నీవు ధన్యుడవు; ఏలయన-లోకనాథుడగు హరుడు యోగ సమాధానము (చిత్తమును పరతత్త్వమున సమాహితము చేయుట) పరాయణము (పరమలక్ష్యము) గా నీకందరమును ఆశ్రయముగా చేసికొని ఇపుడున్నాడు. ( నీ హృదయాంతరాళమును పరమేశ్వరుని ఆవాసముగా చేసి కొన్న మహోపాసకుడవు నీవు.)

ఇట్లు దేవర్షియగు నారదుడు సాదరమగు వాక్కుతో పలుకునంతలో హిమాచలుని రాణియగు మేనాదేవి మునిని దర్శించు కోరికతో తన కూతురుగు పార్వతి తన వెంట రాగా కొలదిమంది చెలులును పరిచారికలును తోడురాగాలజ్జా ప్రీతులతో ముడుచుకొనిన అవయవములతో ఆ గృహ ప్రదేశమును ప్రవేశించెను. నిగృహీతేంద్రియుడగు ముని వరుడు నారదుడు అక్కడ హిమ శైలుని దగ్గరనుండెను. తపోరాశియగు ముని అటకు వచ్చియుండుట చూచి శైలుని ప్రియపత్ని హస్తపద్మములతో కృతాంజలియై చేతితో నోరు కప్పుకొని ( పెద్దలతో మాటాడునపుడు ఇది ఆచారము ) నమస్కారమునుచు నమస్కరించెను. మహాభాగుడును అమిత తేజోవంతుడునగు ఆదేవర్షి ఆమెను చూచి అమృత ప్రవాహరూపములగు ఆశీస్సులతో ఆ శైల పత్నియగు మేనను వర్ధిల్లుజేసెను. అంతట దేవియగు హిమవద్గిరి పుత్త్రి విస్మతయిత్తరాలయి ఆశ్చర్యకర రూప తేజోస్సులుగల మనిని మొగమెత్తి చూచెను. మునియు ప్రీతియుక్తమగు వాక్కుతో

'బిడ్డా' ఇటు రమ్ము!' అనెను. పార్వతి తండ్రిని కంఠమున గ్రహించి అతని తొడపై కూర్చుండెను. తల్లియగు మేన ఆదేవితో "పుత్త్రీ! భగవానుని అభివందనము చేయుము. దానిచే ధన్యుడును పూజ్యుడునునగు పతిని పొందెదవు." అనెను. తల్లి ఇట్లు పలుక ఆమెవస్త్రపు అంచుతో మొగము కప్పుకొని కొంచెముగా మొగము వంచుకొనెనే కాని ఏమియుననలేదు. అంతట తల్లి మరల పుత్త్రీతో ఇట్లు పలికెను: వత్సే వన్దయ దేవర్షిం తతో దాస్యామి తేశుభం | రత్న క్రీడనకం రమ్యం స్థాపితం యచ్చిరం మయా. 136

ఇత్యుక్తాతు తతోవేగా దుద్ధృత్య వదనం తదా | వవన్దే మూర్ధ్ని సన్దాయ కరపఙ్కజకుట్మలమ్‌. 137

కృతేతు వన్దనే తస్యా మాతా సఖిముఖేన తు | చోదయామాస శనకై స్తస్యాఃసౌభాగ్యశంసినామ్‌. 138

శరీరలక్షణానాంతు విజ్ఞానాయతు కౌతుకాత్‌ | సా స్త్రీస్వభావాద్దుహితృచిన్తార్థాం దృశ ముద్వహత్‌. 139

జ్ఞాత్వాతు హీఙ్గితం శైలోమహిష్యా హృదయేన తు | అనుద్గీర్ణాకృతి ర్మేనే రమ్య మేతదుపస్థితమ్‌. 140

నోదితశ్శైలమహిషీసఖ్యా మునివర స్తదా | స్మితాననో మహాభాగో వాక్యం ప్రోవాచ నారదః 141

న జాతో7 స్యాః పతిర్భద్రే లక్షణౖశ్చ వివర్జితా | ఉత్తానహస్తా సతతం చరణౖర్వ్యభిచారభిః 142

స్వచ్ఛాయయా భవిష్యేయం కిమన్య ద్బహు భణ్యతే | శ్రుత్వైతత్సమ్భ్రమావిష్టో ధ్వస్తధైర్యో హిమాచలః

నారదం ప్రత్యువాచేదం సాశ్రుకణ్ఠో మహాగిరిః |

"బిడ్డా! దేవర్షిని నమస్కరించుము. నామాట వినినచో-నేను నీకై చాలకాలమునుండి ఒక రతనాల మంచి ఆటవస్తువును దాచి ఉంచితినికదా! అది నీకిత్తును". తల్లి పలికిన ఈ మాటవిని పార్వతి శీఘ్రముగా మొగమెత్తి తన కేలుదామర మొగ్గల జంటను తలపై నిలిపి మునిని నమస్కరించెను. తరువాత పార్వతీమాత తన కన్నులయందు స్త్రీస్వబావ సిద్ధముగ తల్లులకు తమ బిడ్డల విషయముననుండు చింతను తోపజేయు కను చూపుతో చూచుచు పార్వతికి కలుగబోవు సౌభాగ్య లబ్దిని తెలుపు శరీర లక్షణములెట్లున్నవో ముని నడుగుమని తన సఖిని ప్రేరించెను. హిమవంతుడు తన హృదయమున తన రాణి హృదయాభిప్రాయమును ఎరిగియు తన మొగమున తన మనస్సులోని భావముబయట పడనీయలేదు. కాని ఇది ఏదియో శుభ##మే జరుగనున్నదని మాత్రము తలచెను.

హిమవంతుని రాణియగు మేన సఖి అడుగగా మహాభాగుడగు నారదుడు చిరునవ్వు తన మొగమున తోప ఈ వాక్యమును పలికెను:

"అమ్మాయీ! భ##ద్రే! (యోగ్యురాలవగు మేనాదేవీ!) ఈమెకు పతి ఇంకను పుట్టియుండలేదు. అదియునుగాక-ఈ కన్య (మంచి) లక్షణములు లేనిది; ఈమె చేతులు ఎల్లప్పుడును వెల్లకిల తిరిగియుండును. ఈమె పాదములు ఎల్లప్పుడు తమ నీడ ఉన్నచోట నిలువక చంచలములయి పోవుచుండును. ఈ మె ఇట్టిది. ఇంకను వేరుగా ఎక్కువగా చెప్పవలసినదేమున్నది ?"అనిన నాకదుని మాటలు విని మహాగిరయగు హిమాచలుడు ధైర్యము నశించి తడబడుచు కన్నీటిచే డగ్గుత్తిక పడు కంఠము కలవాడగుచు నారదునితో ఈ విధముగా మారు పలికెను:

నారదహిమవతోః పార్వతీవిషయకః సంవాదః

హిమవా9 ః సంసారస్వాతిదేషస్య దుర్వేదాహి గతిర్యతః 144

సృష్ట్యామవశ్యంభావిన్యా కేనాప్యతిశయాత్మనా | కర్త్రా ప్రణీతా మర్యాదా స్థితా సంసారిణా మియమ్‌. 145

యోజాయతేహిమద్వీర్యా జ్జనితు స్సహ్యసాధకః | జనితాప్యస్య జాతస్య న కిఞ్చిదితి చ స్ఫుటమ్‌. 146

స్వకర్మణౖవ జాయన్తే వివిధా భూతజాతయః | అణ్డజా హ్యణ్డజా జ్జాతాః పునర్జాయేత మానవః. 147

మానుషోపి సరీసృప్యాం మనుష్యత్వేపి జాయతే | తత్రాపి జాతౌ శ్రేష్ఠాయాం ధర్మస్యోత్కర్షణన తు. 148

అపుత్త్రజన్మిన శ్శేషాః ప్రాణినః సమవస్థితాః | మనుజాస్తత్ర జాయన్తే యతో న గృహదర్మిణః 149

క్రమేణాశ్రమసమ్ప్రాప్తి ర్బ్రహ్మచారివ్రతాదను | తస్య కర్తు ర్ని యోగేన సంసారో యేన వర్దితః150

సంసారస్యహి నోత్పత్తి స్సర్వే స్యుర్యది నిర్గృహాః | తతః కర్తాతు శాస్త్రేషు సుతాలాభః ప్రశంసితః 151

ప్రాణినాం మోహనార్థాయ నరకత్రాణసంశ్రయాత్‌ | స్త్రియా విరహతా సృష్టి ర్జన్తూనాం నోపపద్యతే. 152

స్త్రీజాతిశ్చ ప్రకృత్యైవ కృపణా దైన్యబాగినీ | శాస్త్రాలోచనసామర్థ్యాద్యుజ్ఘితాస్తాస్తు కర్మణా. 153

తాసాం చోపరి మా7వజ్ఞా భ##వేదితిచ వేధసా | శాస్త్రేషూక్త మసన్దిగ్దం బహుద్వారం మహాఫలమ్‌. 154

దశపుత్త్రసమా కన్యా యా న స్యాచ్ఛీలవర్జితా | వాక్యమేతత్ఫలభ్రష్టం పుంసాం జ్ఞానిప్రకోపనమ్‌. 155

కన్యాహి కృపణా శోచ్యా పితర్దుఃఖవివర్ధినీ | యాపి స్యాత్పూర్ణసర్వార్థా పతిపుత్త్రధనాదిభిః 156

కింపున ర్దుర్భగా హీనా పతిపుత్త్రధనాదిభిః | త్వంచోక్తవాన్త్సుతాయా మే శరీరే దోషసజ్గ్రహమ్‌ః.157

అహో ముహ్యామి శోచామి గ్లామి సీదామి నారద | అయుక్తమపి వక్తవ్య మప్రాప్యమపి సామ్ప్రతమ్‌. 158

"నేను ఏల దుఃఖపడుచుంటినన సంసారము అతి దోషయుక్తము; దీని గమనము ఎరుగుట సుసాధ్యము కాదు; ఏలయన తప్పక జరిగియే తీరవలసి జరుగుచుండు సృష్టి యందు సర్వాతిశాయియగు పరమాత్మరూపుడగు అనిర్వచనీయ శక్తిగల సృష్టికర్తచే సంసారస్థులగు జీవులకు ఈ చెప్పబోవు విధమున మర్యాద (వ్యవస్థ) చేయబడినది; ఎట్లన - ఎవడు- ఎవని వీర్యము వలన జనించునో-ఆ తండ్రికిని ఈ పుత్త్రుడు పుణ్యలోకముల సాధించువాడు కాడు; కనిక తండ్రియు ఈ జనించిన జీవునకు ఏమియు మేలు కీడులు చేయగలవాడు కాడు; వివిధ భూత జాతులును ఆయా ప్రాణులుగా స్వకర్మానుసారముగనే జనించుచుండును; అండజములు అండజములనుండియే పుట్టును; ఈ జన్మమందండజముగానున్న జీవుడే మరియొక జన్మమున మానవుడు కావచ్చును; మానవుడుగా ఇపుడున్న జీవుడును మరియొక జన్మమున సరీసృప యోనియందైనను మానవ యోనియందైనను జనించవచ్చును. అందునను తాను చేసికొనిన కర్మ ఫలానుసారము ధర్మోత్కర్షముననుసరించి శ్రేష్ఠప్రాణి జాతియందు జీవుడు పుట్టును. మనుష్యులు తప్ప మిగిలిన ప్రాణులు ఆయా కర్మానుష్ఠానమునకో పుణ్యలోక ప్రాప్తికో పుత్త్రులు కలుగవలయునను విషయమును ఎరుగవు; వాటికి పితృ పుత్త్ర సంబంధమును బట్టి తండ్రి కొరకై కుమారుడో-కుమారుని కొరకై తండ్రియో చేయు కర్మములునులేపు ; ఏలయనగా-మానవులు పుట్టుకతోనే శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతగల గృహస్థులుగా పుట్టుటలేదు. బ్రహ్మచారి వ్రతముతో ఆరంబమయి క్రమముగా అయా యాశ్రమములు సంప్రాప్తించును; ఇదియును ఏ సృష్టిక ర్త సంసారమును వర్దిల్లజేయునో ఆకర్త చేయు ఆజ్ఞచేతనే జరుగును. అందరు మానవులును నిర్గృహులు (గృహమనగా-గృహిణీ గృహముచ్చతే యను న్యాయానుసారము గృహమనబడు ఇల్లాలు; ఆమె లేనివారయి గృహస్థులు కాని వారు ) అయినచో సంసారము ఉత్పన్నము కానేకాదు; అందుచేతనే సృష్టిక ర్తచేత శాస్త్రములందు పుత్త్రీ లాభముకంటే పుత్త్రలాభము మేలని వ్రశంసింపబడినది; ఇట్లు చెప్పుట మానవులను మమకార మోహమున నిలుపుటకును నరకమునుండి కాపుడుటకును అని ఎరుగవలయును. కాని స్త్రీ లేనిదే సృష్టి జరుగు అవకాశములేదు. స్త్రీ జాతి ప్రకృతి సిద్దముగానే దీనత్వమునకు పాత్రము; (దయనీయమయినది); (స్త్రీలు సృష్టిక ర్తచేతనే ఇట్లు శాస్త్ర విచారణా సామర్థ్యముకాని కర్మానుష్ఠానయోగ్యత కాని లేనివారైరి; ఐనను ఈ హేతువుచే వారిని అవజ్ఞా (అవమాన) దృష్టితో చూడరాదనియు వారిని ఆదరించుట బహూ పుణ్యలోక ద్వారమును మహాఫలప్రదముననియు శీలరహిత కాని కన్య పదిమంది పుత్త్రులతో సమురాలనియు సృష్టికర్తయే శాస్త్రములందు అనందిగ్ధముగా-స్పష్టముగా-చెప్పియున్నాడు; కాని ఆలోచించగా ఈ వాక్యము నిష్ఫలమయినదియు పురుషులకు మనో వ్యథను ప్రకోపింపజేయునదియు నయియున్నది; ఏలయనగా-కన్య (కూతురు) దయనీయురాలును (ఆమె విషయమున) శోకింపవలసినదియు తండ్రికి దుఃఖమును వృద్ధి చేయునదియునై యున్నది; పతి పుత్త్ర ధనాదుల విషయమున ఏకొరతయులేక సర్వార్థ పూర్ణురాలైనను ఇంతే; మరి దుర్భగ (భర్తృ ప్రీతికి నోచుకొననిది) యు పుతిపుత్త్ర ధనాదులందు కొరత కలదియు ఐనచో ఇక చెప్పవలసినదేమి? అది కాక మీరు నాకూతు శరీమునందు అనేక దోషములున్నవని పలికితిరి. అయ్యో! అది విని నాకు మతిపోవుచున్నది; శోకము కలుగుచున్నది! శరీరమును చిత్తమును పట్టుతప్పుచున్నవి. నారదా! ఇప్పటి నా స్థితిలో తగని విషయమేయైనను పొందరానిదేయైనను ఈ విషయ మిట్టిదని తాము చెప్పవలయును.

అనుహ్రహాన్మమ చ్ఛిన్ది దుఃఖం కన్యాశ్రయం మునే | పరిచ్ఛిన్నేపి సన్దిగ్దే మనఃపరిభవాస్పదమ్‌. 159

తృష్ణా ముష్ణాతి నిష్ణాతా ఫలలాభాశ్రయా శుభా | స్త్రీణాం హి పరమం జన్మ కులానా ముభయాత్మనామ్‌.

ఇహాముత్ర సుఖాయోక్తా స్సత్పతిప్రాప్తిసంజ్ఞికాః | దుర్లభస్సత్పతిః స్త్రీణాం విగుణోపి పతిః కిల. 161

న ప్రాప్యతే వినా పుణ్యౖః పతిర్నార్యాః కదాచన | యతో నిస్సాధనో ధర్మః పరిమాణోజ్ఘి తా రతిః 162

ధనం జీవితపర్యన్తం పతౌ నార్యాః ప్రతిష్ఠితమ్‌ | నిర్దనో దుర్భగో మూర్ఖ స్సర్వలక్షణవర్జితః 163

దైవతం పరమం నార్యాః పతిరుక్త స్సదైవ హి | త్వయా చోక్తం చ దేవర్షే న జాతో7స్యాః పతిః కిల.

ఏతద్దౌర్భాగ్యమతుల మసఙ్ఖ్యం గురు దుస్సహమ్‌ | చరాచరే భూతసర్గే యదద్యాపిచ నో మునే 165

న స జాత ఇతి బ్రూషే తేన మే వ్యాకులం మనః |మనుష్యదేవజాతీనాం శుభాశుభనివేదకమ్‌. 166

లక్షణం హస్తపాదాభ్యాం విహితై ర్లక్షణౖ ః కిల | సేయముత్తానహస్తేతి త్వయోక్తా మునిపుఙ్గవ. 167

ఉత్తానహస్తతా ప్రోక్తా యాచతామేవ నిత్యదా | శుభోదయానాం ధన్యానాం న కదాచి త్ప్రయచ్ఛతామ్‌.

స్వచ్ఛాయయా7స్యాశ్చరణౌ త్వయాచ వ్యభిచారిణౌ | తత్రాపిశ్రేయసాం హ్యాశా నమునే ప్రతిభాతి నః

శరీరలక్షణా శ్చాన్యే పృధక్ఫలనివేదినః | సౌబాగ్యధనపుత్త్రాయుఃపతిలాభానుశంసినః 170

తైశ్చ సర్వైర్విహీనేయం త్వమాత్థ మునిపుఙ్గవ | త్వం మే సర్వం విజానాసి సత్యవాగసి చాప్యతః 171

ముహ్యామి మునిశార్దూల హృదయం దీర్యతీవ మే | ఇత్యుక్త్వా విరత శ్శైలో మహద్ధుఃఖం నివేద్య తు. 172

అనుగ్రహముతో మునీ! కన్య విషయమున నాకుగల దుఃఖమును ఛేదించుము. సంశయము కలిగించిన విషయములో ఇది ఇంతే; ఇంతకంటె మేలు గలుగ అదృష్టములేదు; అని నిశ్చయము కలిగినను మనస్సు అవమానమునకు పాలుపడియున్నను ఇంకను ఫలముకలుగునేమోయను విషయమునగల ఆశ మనస్సును దొంగలించి తన వశముచేసి కొనును గదా! ఏలయన స్త్రీల జన్మము ఉభయ వంశముల (పుట్టిన మెట్టిన ఇండ్ల) వారలకును మేలు కలిగింటతునది; స్త్రీకి మంచి మగడు దొరకుట ఈ ఇరు పక్షములవారికిని ఇహ పరఫల సాధకము; గుణహీనుడైనను స్త్రీలకు మొదలు భర్త దొరకుటయే దుర్లభము-పుణ్యములులేనిదే పతియే ఎన్నడును దొరకడు-అందురనిన సత్పతి దొరకుట మరియు దుర్లభము స్త్రీకి భర్తయందే ఆధారపడి యున్నది; నిర్దనుడు కురూపుడు దుర్భగుడు- (సౌందర్యాది లక్షణములు లేనందున స్త్రీల ప్రీతికి పాత్రుడుకాని వాడు ) మూర్ఖుడు ఏసల్లక్షణములును లేనివాడు ఐనను స్త్రీకి సదా పతియే పరమ దైవతమని శాస్త్రము చెప్పుచున్నది. కాని మీరో-దేవర్షీ! ఈమెకు ఇంకను పతి పుట్టనేలేదంటిరి; ఈ దౌర్భాగ్యము సాటిలేనిదియు లెక్కచేసి పరిమితి నిర్ణయించనలవి కానిదియు చాల బరువయినదియు (తల్లి దండ్రులకు) దుస్సహమును; చరాచర భూత సృష్టియందే ఇప్పటికి అతడు (ఈమెకుపతి) పుట్టలేదంటిరే! దానితోనే నా మనము వ్యాకులమైనది; మనుష్య దేవ జాతులవారలకు శుభా శుభాములను తెలుపు లక్షణములను హస్తపాదములందు అమరినచిహ్నములను బట్టియేకదా! ఇది ఇట్లుండ-మునిపుంగవా! ఈమె ఉత్తానహస్త (అరచేయి పైకి వచ్చునట్లు పెట్టుకొని యుండునది) యంటిరి; ఈ లక్షణము ఎల్లప్పుడును యాచించు కొనువారలకే కాని శుభోదయము(శుభసమృద్ది) కల ధన్యులకును ఇతరులకు ఇచ్చుదాతలకును ఎన్నడును అట్లుండదు కూడ ఈమె పాదములు తన నీడ యున్నచోటి నుండి కదలి పోవుచు చంచలములయి యుండునంటిరి ఆ లక్ష ణమునందు కూడా ఆమెకు శ్రేయము లబించునాశ నాకు కనబడుటలేదు. సౌభాగ్యము ధనము పుత్త్రులు ఆయువు పతి లభించునని తెలుపు వేరు వేరు ఫలముల ఆయా శరీర లక్షణములు ఎన్నియో కలవుకదా! అవియు ఏవియు ఈమెకు లేవని ముని పుంగవా! మీరంటిరి. నాకు తెలిసినంతవరకు మీరు సర్వజ్ఞులు సత్యవచనులు; కావునను మీ మాటవిని మునిశార్దులా! నాకు మోహము (ఏమియుతోచక పోవుట) కలుగు చున్నది; హృదయము బ్రద్దలగు చున్నట్లున్నది. అని ఇట్లు తన మహా దుఃఖమును తెలిపి హిమవంతుడు ఊరకుండెను.

శ్రుత్వైతదఖిలం తస్మాచ్ఛైలరాజముఖామ్బుజాత్‌ | స్మితపూర్వమువాచేదం నారదో దేవపూజితః. 173

నారదః హర్షస్థానే7 తిమహతి త్వయా దుఃఖం నివేద్యతే |

అపరిచ్ఛిన్నవాక్యార్థో మోహం యాసి మహాగిరే. 174

ఇమాం శృణు గిరం రహస్యపరినిష్ఠతామ్‌ | సమహితో మహాశైల మయోక్తస్య విచారణ. 175

న జాతో7స్యాః పతిర్దేవ్యా యన్మయోక్తం హిమాచల | స న జాతో మహాదేవో భూతభావోద్భవోభవః 176

శరణ్య శ్శాశ్వత శ్శాస్తా శఙ్కరః పరమేశ్వరః | బ్రహ్మవిష్ట్విన్ద్రమునయో గర్భజన్మజరార్దితాః 177

తసై#్యతే పరమేశస్య సర్వే క్రీడనకా గిరే | * బ్రహ్మాణ్డం తత్తదిచ్ఛాత స్సమ్భాతం భువనప్రభోః 178

విష్ణుర్యుగే యుగే జాతో నానాజాతిమహాతనుః | మన్యసే మాయయా జైతం విష్ణుం చాపి యుగే యుగే.

ఆత్మనో న వినాశో7స్తి స్థావరానై7పి భూధర | సంసారే జాయమానస్య మ్రియమాణస్య దేహినః 180

నశ్యతే దేహమేవాత్ర నాత్మనో నాశ ఉచ్యతే | బ్రహ్మాదిస్థావరాన్తో7యం సంసారో యః ప్రకీర్తితః 181

స జన్మమృత్యుదుఃఖార్తో హ్యవశః పరివర్తతే | మహాదేవో7చల స్థ్సాణు ర్న జాతో జనకో7జరః 182

భవిష్యతి పతి స్సో7స్యా జగన్నాధో నిరామయః | యదుక్తంచ మయా దేవీ అక్షణౖర్వర్జితా7పి చ 183

శృణు తస్యాపి వాక్యస్య సమ్యక్త్వేన విచారణమ్‌ | లక్షణం దైవకోహ్యఙ్క శ్శరీరావయవాశ్రయః 184

వంశాయుర్ధనసౌభాగ్యపరిమానప్రకాశకః | అనన్తస్యాప్రమేయస్య సౌభాగ్యస్యాస్య భూధర. 185

నైవాజ్కో లక్షణాకార శ్శరీరే సంవిధీయతే | అతో7స్యా లక్షణం గాత్రే శైల నాస్తి మహామతే. 186

శైలరాజ ముఖపద్మమునుండి వెలువడిన ఈ వచనమును విని దేవపూజితుడగు నారదుడు చిరునగవుతో ఇట్ల నేను; మహాహర్ష హేతువగు విషయమునున నీవు దుఃఖము ప్రకటించుచున్నావు. మహాగిరీ! వాక్యార్థమును స్పష్టముగ ఎరుగక వ్యామోహమందుచున్నావు. రహస్యార్థమును వివరించు నామాటను విని నే చెప్పిన దాని విచారణమునందు మనస్సు సమాహితమొనర్చుము. హిమాచలా! ఈమెకు పతి పుట్టలేదంటినే: దాని యర్థము ఏమన-అతడు మహాదేవుడు (శివుడు) ను భూతముల వ్యక్తస్థితిని ఉద్భవింపజేయు వాడునగుటచే భవుడనబడును; అంతే కాని అతడు పుట్టినవాడుకాడు; శరణ్యుడు-శాశ్వతుడు-ఎల్లరను శాసించువాడు-శంకరుడు- (శుభమును కలిగించువాడు) పరమేశ్వరుడు (ఈశ్వరులకును ఈశ్వరుడు) బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మునులు మొదలగు వారికెల్లరకు గర్భజన్మ జరా బాధలు కలవు; వారెల్లరు పరమేశునిచేతి ఆట వస్తువులు; ఈ బ్రహ్మండము ఆభువన ప్రభుని ఇచ్ఛ (సంకల్పము-ఇచ్ఛాశ క్తి) వలన జనించును; విష్ణువు ప్రతి యొక యుగమునందును నానాజన్మలనందు మహాతనువు (శరీరము) కలవా డై పుట్టును; ఇట్లు అంటినని యుగ యుగమునను విష్ణువుకూడ మాయకువశుడై పుట్టునను కొనుకున్నావేమో; స్ధావర ప్రాణులగు వృక్షములవరకుగూడ ఏ దేహము నందునను ఆత్మకు వానాశములేదు; సంసారమున పుట్టుచుచచ్చుచునుండు దేహికి దేహమే నశించును కాని ఆత్మకు నాశము లేదు. కాని ఇతరమగు దేహి జన్మమృత్యు దుఃఖములతో బాధనందుచు దేనియందును అవశుడై ( తన యధీనమందేమియు లేక) దేహమునుండి దేహమునకు మారుచుండును. కాని మహాదేవుడో- అచలుడు-స్థాణువు-ఎప్పుడును స్థిరుడు-అతడు ఇతరము (రు) లను జనింపజేయునే కాని తాను జనింపడు; జర (వార్ధక్యము) నందడు. జగన్నాధుడు నిరామయుడు (ఏదేషమును లేనివాడు) అగు అతడు ఈమెకు పతియగును. ఈదేవి లక్షణ వర్జిత అనిన నా మాటకుకూడ లెస్సగా విచారణము నిట్లెరుగుము. లక్షణను అనునది దైవకము (మన సంకల్పము లేకయే కలుగునది); ఇది శరీరావయపముల నాశ్రయించియుండు గురుతు; ( అవయవములందు గోచరించు ఆ లక్షణము వంశము-ఆయువు-ధనము-సౌభాగ్యము-ఇట్టివాని పరిమాణమును (ఎంతయను విషయము) తెలుపును; అనంతము-అప్రమేయము (హద్దుకాని పరిమాణుకాని లేనిది) అగు

________________________________________

* ఆస్తే బ్రహ్మా తదిచ్ఛాత స్సమ్భూతో భువనప్రభుః.

ఈమె సౌభాగ్యమునకు లక్షణము అని చెప్పదగిన అంకము (గురుతు) ఏదియు ఈ శరీరమునందు నిరూపింపదగినది లేదు. ఇందువలన మహామతీ! శైలా! ఈమె శరీరమున లక్షణములు లేవంటిని.

యచ్చాహముక్తవానస్యా హ్యుత్తానకరతా సదా | ఉత్తానో వరదః పాణిరేష దేవ్యా స్సదైవతు. 187

సురాసురముని వ్రాతవరదేయం భవిష్యతి | యచ్చ ప్రోక్తం మయా పాదౌ స్వచ్ఛాయావ్యభిచారిణౌ. 188

అస్యా శ్సృణు మమైవాపి వాగ్యుక్తిం శైలసత్తమ | చరణౌ పద్మసజ్కౌశావస్యామలనఖోజ్జ్వలౌ. 189

సురాసురాణం నమతా కిరీటమణికాన్తిభిః | విచిత్రవర్ణైర్భా స్యేతే స్వచ్ఛాయాప్రతిబిమ్బితౌ.190

ఏషా భార్యా జగద్భర్తుర్వృషాఙ్కస్య మహీధర | జననీ సర్వలోకస్య సమ్భూతా భూతభావనీ. 191

శివేయం పావనాయైవ త్వత్త్‌ త్రే పావకద్యుతిః | తద్యథా శీఘ్రమేవైషా యోగం యాయాత్పినాకినా. 192

తథా విధేయం విధివత్త్వయా శైలేన్ద్రనారదాత్సర్వమేవ హి | ఆత్మానం న పునర్జాతం మేనే మేనాపతి స్తదా.

నమస్కృత్య వృషాజ్కాయ మహాదేవాయ ధీమతే | ఉవాచ చాపి సంహృష్ణో నారదంతు హిమాచలః 195

హిమవా& : దుస్తరాన్నరకాద్ఘోరాదుద్ధృతో7స్మి త్వయా విభో |

పాతాళాదహముద్ధృత్య సప్తలోకాధిపః కృతః 196

హిమాచలో7స్మి విఖ్యాత స్త్వయా మునివరాధునా | హిమాచలాచ్ఛతగుణం ప్రాప్తో7స్మీతి సమున్నతిమ్‌. 197

ఆనన్దదివిజాహారి హృదయం మే7ధునా మునే | నాధ్యవస్యతి కృత్యానాం ప్రవిభాగవిచారణమ్‌. 198

యది వాచామధీశస్స్యాంత్వద్గుణానాం విచారణ | భవద్విధానాం నియత మమోఘం దర్శనం మునే. 199

తవాస్మాన్ప్రతి చాపల్యం వ్యక్తం మమ మహామునే | భవద్భిరేవ కృత్యోహం నివాసాయాత్మరూపిణామ్‌.

మునీనాం దేవతానాంచ స్వయం కర్తాపి కల్మషమ్‌ | తథాపి వస్తున్యేక స్మిన్నాజ్ఞా మే సమ్ప్రదీయతామ్‌. 201

ఈమె ఎప్పుడును ఉత్తానకరయైయుండునంటిని; అదియేమి అనిన-ఈ దేవీకరము ఎల్లప్పుడు వరము లిచ్చుటకై ఉత్తానుమయి వెల్లకిలనయి అరచేయి బయటపడుచు నుండును. ఈయమ సురలకును అసురులకును వరములొసగునది యగును. ఈమె చరణములు తమ నీడయున్నచోట నిలువక చరించుచుండునంటినిగదా! శైలసత్తమా!

ఈ మాటకు నా వచోవివరణము వినుము; పద్మ సమానములును నిర్మల నఖములతో ఉజ్జ్వలములుగునుగు ఈమె చరణములు ఈమెను నమస్కరించు సురాసురుల విచిత్ర వర్ణములుకల కిరీట మణికాంతులతో ప్రకాశించుచుండ ఆచరణముల ప్రతిబింబము లాకిరీట మణులందు ప్రతిబింబించుచుండును; (నమస్కరించువారు మారిన కొలదిని ఆ ప్రతిబింబముల స్థానములును మారుచుండును.) మహీధరా! ఈమె జగద్భర్త యగు వృషభధ్వజునకు భార్యయగును; భూత సృష్టికర్తయగు సర్వలోక జననియే అగ్ని ప్రకాశయగు అశివ (శివుని పత్ని) మిమ్ములను పవిత్రుల జేయుటకే నిక్షేత్రమునం (భార్యయం)దు సంభవించినది; కావున శైలేంద్రసత్తమా! ఈమె శీఘ్రముగా పినాకి (శివుని) కూడునట్లు నీవు యథావిధిగా చేయవలయును. హిమ భూధరమా! ఇందు దేవతల సుమహాకార్యముకూడ కలదుసుమా! అనగా మేనాపతియగు ఆ శైలేంద్రుడు నారదుని వలన ఇట్లంతయు వినినమీదట తాను మరల పుట్టినట్లే భావించెను. ధీమంతుడును వృషభ ధ్వజుడునునగు మహాదేవునకు (స్వచిత్తమున) నమస్కరించి హిమాచలుడు చక్కగ హర్షము చెంది నారదునితో ఇట్లనెను. విభూ! నీవు నన్ను దుస్తర ఘోర నరకములో పడకుండ లేవనెత్తితివి; నన్ను పాతాళమునుండి పైకెత్తి ఏడు ఊర్ద్వలోకములకును అధిపతిగా జేసితివి; ఇందవరకును మునివరా! హిమాచలుడని విఖ్యతుడనయి యుంటిని; ఇపుడంతకంటె నూరు ఇంతల సమున్నతినందితిని. మునీ! ఇపుడు నా హృదయము అనందామృతము ననుభవించుచున్నది. కాని నేను వాక్కులకు అధీశుడగు బృహస్పతియో బ్రహ్మయో అయియుండినను మీగుణముల విచారణమున యత్రించి మీ ఆయా కృత్యముల ప్రవిభాగమున విచారించుటలో కూడ నా హృదయమునకు శక్తి చాలదు; తమవంటి వారి దర్శనము వ్యర్థము కాదు; మహామునీ! ఇందు మా విషయమున మీకు గల చాపల్యము (చూడవలెననుగానే వచ్చి చూచి అనుగ్రహించుట) నాకు స్పష్టముగ గోచరించుచున్నది. నేను స్వయముగ పాపముల చేయువాడనేయైనను తమవంటి వారిచే తమవంటి మునులకును దేవతనకును నివాసమునకు నయోగ్యుడుగా చేయబడితిని. అయినను ఒక విషయమునందు నాకు మీరు ఆజ్ఞనీయవలయును.

ఇత్యుక్తవతి శైలేన్ద్రే స తదా హర్షనిర్భరే | ఉవాచ నారదో వాక్యం కృతం సర్వమితి ప్రభో. 202

సురకార్యే య ఏవార్థ స్తవాసి సుమహత్తరః | ఇత్యుక్తా నారదశ్శీఘ్రం జగామ త్రిదివం తతః. 203

స గత్వా దేవనదనం మహేన్ద్రం సన్దదర్శహ | తతో7భిరుపే స మునిరుకపవిష్టో మహాసనే. 204

పృష్టశ్శక్రేణ ప్రోవాచ హిమజాసంశ్రయాం కథామ్‌ |

నారదః : మమానురూపం కర్తవ్యం తన్యమా కృతమేవ హి. 205

కిన్తు పఞ్చశరసై#్యవ సమయే7య ముపస్థితః | ఇత్యక్తో దేవరాజస్తు మునినా కార్యదర్శినా. 206

చూతాజ్కురాస్త్రం సస్మార భగవాన్పా కశాసనః |

ఇన్ద్రస్మారితమదనసమాగమ స్తయోస్సంవాదశ్చ.

సంస్మృతస్తు తదా క్షిప్రం సహస్రాక్షేణ ధీమతా. 207

ఉపతస్థే రతివతిస్సవిసం ఝషద్వజః | ప్రాదుర్భూతంచ తం దృష్ట్వా శక్రః ప్రావాచ సాదరమ్‌. 208

శక్రః : ఉపదేశేన బహునా కిం త్వాం ప్రతివదే ప్రియమ్‌ |

మనోభవో7 సి తేనం త్వం వేత్సి భేతమనోగతమ్‌. 209

తద్యధార్థకమేవం త్వం కురు నాకసనదాం ప్రియమ్‌ | శఙ్కరం యోజయ క్షిప్రం గిరిపుత్ర్యా మనోభవ. 210

సంయుతో మధుమాసేన ఋతునా గచ్ఛ దుర్జయః | ఇత్యుక్తో మదనస్తేన శ##క్రేణ స్వార్థసిద్దయే. 211

ప్రోవాచ పఞ్చబాణో7 థ వాక్యం భీత శ్శతక్రతుమ్‌|

కామః : అనయా దేవసామగ్ర్యా *దేవరాజ మయా ప్రభో. 212

దుస్సాధశ్శక్‌ఙ్కరో దేవః కిం న వేత్సిజగత్ఫ్రభో | తస్య దేవస్య వేత్థ త్వం కరుణంతు యదవ్యయమ్‌.

ప్రాయః ప్రసాదః కోపోరి సర్వోహి మహతాం మహా7 | సర్వోపభోగసారా హి సున్దర్య స్స్వర్గసమ్భవాః.

అధ్యాశ్రితంచ యత్సౌఖ్యం భవతా నష్టచేషణ్టితమ్‌ | ప్రమాదాదథ విభ్రశ్యేదీశం ప్రతి విచిస్త్యతామ్‌. 215

ప్రాగేవ చేహ దృశ్యన్తే భేతానం కార్యసమ్భవాః |

విశేషంకాక్‌ఙ్షతాం శక్ర సామాన్యాద్భ్రంశనం ఫలమ్‌. 216

పర్వతరాజిట్లు హర్షనిర్భరుడై పలుకగా నారదుడును ప్రభూ! సర్వమును సరిపోయినది; దేవకార్యమేదియో అదియే నా సుమహత్తర కార్యమును; కనుక ఇకవేరుగా చెప్పవలసినదియు చేయవలసినదియు ఏమియులేరదు; '' అని పలికి శీఘ్రమే అటనుండి స్వర్గమేగెను. అతడట దేవేంద్ర భవనమునకు పోయి అతనిని సందర్శించెను. ఆ ముని యచట మనోహర మహాసనమున కూర్చొంచెను. ఇంద్రుడడుగు పార్వతీ విషయక వృత్తాంతమతనకి తెలిపి '' నేను చేయతగినది చేసితిని. ఇక ఇపుడు మన్మథునికి పినివడు సమయము వచ్చినది. '' అనెను. కార్యదర్శి ( ఏ పని ఎట్లు చేయవలెనో తెలిసి తెలుపు) నారదడిట్లు పలుక పాకాసురుని చంపిన భగవానుడు దేవరాజు అస్త్రముగా చూతాంకురము( మామిడి పూ మొలకను) ధరించి మన్మధుని తలచెను. ధీమంతుడగు సహస్రాక్షుడు సంస్మరించినంతగనే మత్స్యధ్యజుడగు రతీపతి నవిలాసముగా వచ్చి ఎదుట నిలిచెను. ప్రాదుర్భూడతుడయిన అతనిని చూచి ఇంద్రుడతనితో సాదరముగ ఇట్లు పలికెను. '' బహువచనములు పలుకవలసినదేమున్నది? నీ విషయమున ప్రియ వచనములేమి పలుగలను. నీవు మనోభవుడవు (మనసునందుండువాడు మనసునుండి పుట్టువాడు); కావుననే ప్రాణుల మనోగతమున నెరుగగలవు. కావున నీవు వాస్తవముగ స్వర్గవాసులకు ప్రియకరమగు పని చేయవలయును. శంకరుని శీఘ్రమే గిరిపుత్త్రితో కూర్చుము. నీవు దుర్జయుడవు; మధుమాన (వసంత) ఋతువుతో వెళ్ళుము.'' ''స్వార్థసిద్దికై శక్రుడిట్లు పలికినది. విని పంచబాణగడు మదనుడు భయపడి శతక్రతునితో;'' ప్రభూ! దేవరాజా! ఈ దేవసామగ్రితో శంకరదేవుడు దుర్జయుడని నీవు ఎరుగవా! ఆ దేవుని అవ్యయ (ఎన్నడును తరుగని) క్రియాశక్తి ఎట్టిదో నీకు తెలియును. తరచుగా (సాధారణముగా) మహాపురుషుల అనుగ్రహము కాని కోపముగాని ప్రతిదియు పెద్దదిగనే యుండును. స్వర్గమందలి సుందరులు సర్వోపభోగములును సారమని ( ప్రధానమని ) భావించువారు; నీవు చేయబోవు (చేయించబోవు) ఈ కష్ట(నాశకర) చేష్టవలన ఇంతవరకు నిన్ను అధ్యాశ్రయించియున్న సౌఖ్యముకూడ నీ పొరబాటునకు వశమయి విభ్రంశము (తొలగిపోవుట)ను పొందవచ్చును. ఈశ్వరుని విషయమున ఇదియంతయు నీవు ముందే ఆలోచించవలయును. ఏలయన పూర్వమునుండి ప్రాణులు చేయు వనుల ఫలితములలో ఎక్కువ ఏదియో కోరి పనిచేయగా ఉన్నదికూడ ఊడిపోవట దానికి ఫలమగుట కనబడుచున్నది. (కనుక నీవును ఏదో మహాకార్యము సాధించబోయి ఉన్న సుఖ సంపదలను కూడ పోగోట్లుకొను పని చేసుకొనకుము.)

శ్రుత్వా తద్వచనం శక్ర స్తమువాచామరై ర్వృతః |

శక్రః : వయం ప్రమాణం తే తత్ర రతికాన్తన కసంశయః. 217

సందం శేన వినా శక్తి రయస్కారస్య నేష్యతే | కన్యచిచ్చ క్వచిద్దృష్టం సామర్ధ్యం న తు సర్వతః. 218

ఈశ్వర మోహనార్థం రతి మధుభ్యాంసాంకం మరదనస్య హిమగిరిగమనమ్‌.

ఇత్యుక్తః ప్రయ¸° కామ స్సఖాయం మధుమాశ్రితః | రతియుక్తో జగామశు ప్రస్థం హిమవతస్తతః. 219

సతు తత్రాకరోచ్చిన్తాం కార్యస్యోపాయపూర్వికామ్‌ | నిష్కమ్పాహి మహార్థాయే మనస్తేషాం సుదుర్జయమ్‌.

తదాదేవేవ సఙ్షోభ్య నియతం సుజయో భ##వేత్‌ |

సంసిద్ధిం ప్రాప్నుయశ్చైవ పూర్వం సంక్షోభ్య మానసమ్‌. 221

*కర్షితో వివిధై ర్భావైర్వేషానుగమనైర్వినా | క్రోధక్రూరతరాసంగాంభీషణర్ష్యాం మహాసఖీమ్‌. 222

చాపల్యమూర్ద్ని విధ్వస్తదైర్యోద్ధారమహాబలమ్‌ | తామస్య వినియోక్ష్యామి మనసో వికృతిం పునః. 223

పిధాయ ధైర్యద్వారాణి సన్తోషమపకృష్య చ | అవగస్తుం హి మాం త్రత న కశ్చి దిహ పణ్డితః 224

వికల్పమాత్రసంస్థానే వైరూప్యం మనసో భ##వేత్‌ | పశ్చాన్మూల క్రియారమ్భగమ్భీరావర్తదుస్తరః 225

హరిష్యామి హరస్యాహం తపస్తనయ స్థిరాత్మన్‌ః | ఇన్ధ్రియగ్రామమావృత్య రమ్యసాధన సంవిదిః. 226

చిన్తయిత్వేతి మదనో భూతభర్తుస్తదాశ్రమమ్‌ | జగామ జగతా సారం సరళద్రమవేదికమ్‌. 227

శాస్తసత్త్వసమాకీర్ణ మచల ప్రానిసఙ్కలమ్‌ | నానాపుష్పలతాజాతం గగనస్థగణశ్వరమ్‌.228

దివ్యకాయవృషాధ్యుషణ్టం నీలశాడ్వలసానుకమ్‌ | తత్రావశ్యత్త్రనేత్రస్య రమ్యం కిఞ్చిద్ద్వితీయకమ్‌. 229

వీరకం లోకవీరేశ మీశానసదృశద్యుతిమ్‌ | యక్షకుఙ్కుమకిఞ్జల్కపుఞపిఙ్గజటాసటమ్‌. 230

వేత్రపాణిసమవ్యగ్రం భూతిభోగీన్ద్రభూషణమ్‌ |

________________________________________

*కథంచవివిధైర్భా వేర్ద్వేషానుగమనంవినా. గవాక్షస్థ.

మదునుని ఈ మాటలువిని ఇంద్రడు తన చుట్టునున్న దేవతల భావమునకు తగినట్లు ఇట్లనెను; '' రతీపతీ! నీవు ఏమియు సందేహింపకుము. ఆ విషయమున ప్రమాణ భేతులము మేము; సందంశంము( పట్టుకారు) లేనిదే అయస్కారునకు (ఇనుప పని చేయు కమ్మరివానికి ) శక్తి ఏమియులేదు. ఒక్కొక్కనికి ఒక్కొక్క పనియందు మాత్రమే సమర్థత కనబడుచున్నదికాని అన్ని పనులయందును సమర్థతలేరు.'' (ఇచట ఇంద్రుని వాక్యములు చాల గూడార్థముతో నున్నవి. ఆ అర్థము: మన్మథా! మా ఆజ్ఞానుసారము నీవు చేయు ఈ పనివలన శివునకు కలుగు కోఫలమును మేమనుభవింతుము. చెడిపోయినచో వేవే చెడిపోవుదుము. దాని విషయమున నీకు సందేహములు కలిగి నీవాలోచించి మాకు మంచి చెడ్డల నుపదేశించు పని నీకేమి కలదు? కమ్మరివానికి పట్టు కారువలె నీకు మాకు పనిముట్టు మాత్రమే. వాని పనివలన కలుగు మంచిచెడ్డలును పట్టుకారు ఆలోచించక తన పని తాను కమ్మరి చెప్పినట్లు చేయును- మాకు వానిని ఆలోచించుట తెలియును. పని చేయుట నీవిధి. మాకుపదేశింప నీవెవడవు? పోయి చెప్పిన పని చేయుము).

ఈ మాటవిని మన్మధుడు తన మిత్రడగు వసంతుని తోడు తీసికొని రతీదేవితో కూడి బయలుదేరి హిమాలయపు నెత్తము చేరెను. ఆతడచ్చట తన పనికై ఉపాయ పూర్వకముగా ఇట్లాలోచించెను; మహాతత్త్వ వేత్తలు ఎట్టి కంపమును లేనివారునగు వారి మనస్సును ఎవరును జయింపజాలరు. ( శివుడు అట్టివాడు) కావున మొటనే అట్టి వారి మనస్సును కలవరపచినచో వానిని జయించుట సుకరమగును. అట్లు చేసిన వారు కార్యసిద్ధి నందుదురు. ఆయనపై ద్వేషము నాకేమియు లేకున్నను వివిద భావములతో ఆయనను ఆకర్షించవలయును. క్రోధమునకు క్రూరతరమయిన చెలిమి కత్తెయగు భయంకర్ష్యాదేవిని చాపల్య భావపు తలపయి నిలుపవలయును. అది దైర్యౌన్నత్యపు మహాతబలమును ధ్వంసము చేయును. ఆ చాల్యము భావనము ఇతని ( శివుని) పై ఉపయోగింతురు. దానిచే ఇతని మనస్సునందు వికృతి(మార్పు) కలుగును. ధైర్య ద్వారములు మూయబడును. (ధైర్యమును కోల్పోవును.) సంతోషము తగ్గి పోవును. ఇట్లు చేయు నన్ను తెలిసికొనగల పండితుతెవడును లేడు. ఇది చేయుదమా అది చేయుదమా అని వికల్పములలో ఉన్నంతవరకు మనస్సు నిశ్చయమందక వికృతముయి పోవును. అటు తరువాత ప్రధాన క్రియను ఆచరించుట చేతకాక సుడిగుండములలో పడి కార్యగతి ప్రవాహమును తరించుట శక్యము కాకపోవును. కనుక నేనెక్కువగా ఆలోచించక రమ్యములు అగు సాధన సంవిధానముతో అతని ఇంద్రియములను ఆవరించి స్థిరచిత్తుడగు హరుని తపస్సును హరింతును.

ఇట్లాలోచించి మదనుడు భూపతియగు శివుని యాశ్రమమునకు పోయెను. అది లోకసారము; సరళవృక్షములక్రింద అరుగులచ్చట గలవు. ఆ ఆశ్రమము శాంతములగు ప్రాణులతో వ్యాప్తము; ఆ ప్రాణులన్నియు నిశ్చలములై యుండెను. నానా పుష్పములుగల లతలట నుండెను. ఆ ఆశ్రమపుటాకాశమున ఆయా ప్రమథ దేవ గణాధి వతులుండిరి. దివ్య శరీరయగు వృషభమటనుండెను. నల్లని పచ్చిక బయళ్ళతో నిండిన నెత్తములయందా యాశ్రమముండెను. అచ్చట త్రినేత్రునితో పాటుగ వీరులకు అధిపతియు శివుని తేజమువంటి తేజము కలవాడు అగు వీరకు డను ఉపానక శ్రేష్ఠుడు యక్ష కుంకుమపూవుల కేసరముల రాశివలె పింగవర్ణ జటలు మీసములు గడ్డము కలవాడు వేత్రము (ప్రేము దండము) చేతదాల్చి సావధానుడై విభూతి నాగశ్రేష్ఠ భూషణములు దాల్చిన వాడు అచట నుండెను.

తతో నిమీలితోన్ని ద్రపద్మవత్రాభలోచనమ్‌| 231

ప్రేక్షమాణమృజుస్థాన స్థిరనాసాగ్రలోచనమ్‌| శ్రవస్తరససిం హేన్ద్రచర్మలమ్బోత్తరీకమ్‌. 232

శ్రవణాహిముఖోన్ముక్తనిశ్శ్వాసానలపిఙ్గశమ్‌ | ప్రేఙ్ఖత్కపాలవర్యనత్తుమ్బిజటాచయమ్‌. 233

కృతవాసుకిపర్యఙ్కనాభిమూలనివేశితమ్‌ | బ్రహ్మాఞ్జలిస్థపుచ్ఛాగ్రనిద్దోరగభూషణమ్‌. 234

దదర్శ శఙ్కరం కామః క్రమాత్ప్రాప్తోన్తికం శ##నైః| తతో భ్రమరఝుఙ్కారమాలమ్బిద్రుమసాదకమ్‌. 235

ప్రవిష్టః కర్ణరన్ధ్రేణ భవస్య మదనో మనః | శఙ్కరస్తమథాకర్ణ్య మధురం మదనాశ్రయమ్‌. 236

సస్మార · చాద్రిదుహితాం దయితాం రక్తమానసః |తతస్సా తస్య శనకై స్తిరోభూయాతినిర్మలా. 237

సమాధిభావనా తస్థౌ లక్ష్యప్రత్యక్షరూపిణీ| తతస్తన్మయతాం యాతః ప్రత్యూహనిహతాశయః . 238

వసిత్వేన బుబోధేశో వికృతం మదనాత్మికామ్‌ | ఈషత్కోపసమావిష్టో ధైర్యమాలమ్బ్య ధూర్జటిః. 239

నిరాసే మదనస్థిత్యా యోగమాయాసమావృతః | స తయామాయయా೭೭విష్టో జజ్వాల మదనస్తతః . 240

ఇచ్ఛాశరీరో దుర్‌జ్ఞేయో రోషదోషమహాశ్రయః | హృదయాన్నిర్గత స్సోథ వాసనావ్యసనాత్మకః. 241

బహిఃస్థలం సమాలమ్బ్య హ్యుపతస్థౌ ఝుషధ్వజః | అనుయాతోథ హృద్యేన మిత్రేణ మధునాస్మరః. 242

సహకారతరోర్దృష్ట్వా మృదుమారుతనిర్థతమ్‌ | స్తబకం మదనో రమ్యం హరవక్షసి సత్వరమ్‌. 243

ముమోచ మోహనం నామ మార్గణం మకరద్వజః | శివస్య హృదయే శుద్ధే నాశశాలి మహాశరః . 244

పపాత వరుషః ప్రాంశుః పుష్పబాణో విమోహనః | తతః కరణసన్దేహో విద్ధస్తు హృదయే భవః . 245

బభూవ భూధరాకమ్ప్యధైర్యోపి మదనోన్ముఖః | తతః ప్రభుత్వాద్భావానాం సంక్షోభం సమపద్యత. 246

బాహ్యం బహు సమాసాద్య ప్రత్యూహప్రసవాత్మకమ్‌ |

క్రమముగ మన్మథుడు మెల్లగ రాగా రాగా అతినికి శంకరుడు కనబడెను. విప్పారినతామర పూరేకుల వంటి కనులు మూసికొని -సూటియగు స్థానమున స్థిరముగ నాసాగ్రమునందు కన్నులు నిలిపి చూచుచు- అతి మనోహరమయి సింహచర్మముతో పాటు వ్రేలాడు ఉత్తరీయమును దాల్చి - చెవులయందలి సర్పముల నోళులనుండి విడవబడు ఊర్పు వాయువులచే పచ్చనై- చెక్కిళ్ళవరకు సొరపిందెలవంటి జడలు వ్రేలాడుచు- వాసుకి సర్పమును మొలత్రాడుగా చుట్టుకొని నాభి మూలమున ముడిగా అమర్చుకొని యున్న ఆశివుని మన్మథుడు చూచెను. క్రిందికి వంగిన చెట్లుగల సానువులయందు వ్యాపించిన తుమ్మెదల ఝుంకారమునందు ప్రవేశించి మన్మథుడు చెవి రంధ్రపు మార్గమున శివుని మనస్సును ప్రవేశించెను. మన్మథునతో వ్యాప్తమయిన ఆ ధ్వనితే శివుడు తన మనస్సు రంజితము కాగా పార్వతిని తలచెను. ఆమె అతని ప్రీతికి పాత్రురాలు; అతి నిర్మలయగు పార్వతియు అంతవరకు అంతర్హిత అయియుండియు శివుడు స్మరించగనే సమాధి భావనయందు కనవచ్చు ప్రత్యక్షరూపము కలదై నిలిచెను. విఘ్నముచేత తన హృదయము దెబ్బ తినగా శివుడు పార్వతితో తన్మయ భావననందియు ఇంద్రియనిగ్రహము కలవాడు కావున ఇది మదనునిచే కలిగిన మనోవికారమని ఎరిగెను. కొంచెము కోపముండెను. ధైర్యము నవలంబించెను. తన మనమున మదనుని ఉనికిని తొలగించుకొనగోరి ధూర్జటి యోగమాయను (శక్తి త్రయాత్మికయగు శ్రీదేవిని) తనయందు వ్యాపింపజేసికొనెను. అంత మదనుడు ఆ యోగమాయావ్యప్తిచే మండెను. ( ఆ మంటలో బాధనందియు) వాడు కామరూపుడును సుకర ముగ జయింపరాని వాడును రోషాది మహాదోషములకు ఆశ్రయుడును కావున వాసనా (చిత్త సంస్కార) జనిత వ్యసన రూపుడై శివ హృదయమునుండి వెలికి వచ్చెను. బహిఃస్థలమాశ్రయించి నిలచెను. వాని వెంట మనోహరుడగు వసంతుడునుండెను. వాని ప్రభావమున తీయ మామిడి చెట్టునందు మందమాతరుత చలితమగు మామిడి పూగుత్తి మదనునకు కనబడెను. సత్వరముగా మకరధ్వజుడు మోహనమును బాణమును ధనువున సంధించి హరుని వక్షమున ఆ చూతకుసుమస్తబక భావితమగు ఆ శరమును వదలెను. సులభముగ నశించు లక్షణముగల ఆ మహాశరము శివుని శుద్ధ హృదయమునపడెను. అది పరుషమును దీర్ఘమును మిగుల మోహకశక్తి కలదియు; కావున శివుడు ఆ దెబ్బ తిని నంతనే తాను సహజముగ పర్వతమువలె అచలమగు ధైర్యము కలవాడయినను ఇంద్రియనిగ్రహము కోల్పోయి మదన పరవశుడయ్యెను. బహిఃప్రపంచమునందలి విఘ్న జనక సామగ్రీ రూపమగు ఆయా రాగ బావముల ప్రబావమే అధికమగుటచే శివుని చిత్తమున సంక్షోభము కలిగెను.

·దక్ష.

ధూర్జటిపాలస్థనేత్రవహ్నినా మదనభస్మీకరణమ్‌. తతోకోపానలోద్భూతఘోరహుఙ్కారబీషణ. 247

బభూవ వదనే నేత్రం తృతీయం దహనాకులమ్‌ | రుద్రస్య రౌద్రవపుషో జగత్సంహారభైరవమ్‌. 248

తదన్తికస్థే మదనే వ్యస్ఫారయత ధూర్జటిః | తేన నేత్రస్ఫులిఙ్గేన క్రోశతాం నాకవాసినామ్‌. 249

గమితో భస్మసాత్తూర్ణం కన్దర్పః కామిదర్పదః | సతుతం భస్మసాత్కృత్వా హరనేత్రోద్భవో నలః. 250

వ్యజృమ్బత జగద్దగ్ధుం జ్వాలాసఙ్ఘాతఘస్మరః | తతో భవో జగద్ధేతో ర్వ్యభజజ్జాతవేదనమ్‌ . 251

సహకారే మధౌ చన్ద్రే సమనస్సు వరిష్వపి| భృఙ్గేషు కోకిలాస్యేషు విభాగేన స్మపానలమ్‌. 252

స బాహ్యాన్తరవిద్ధేన హరేణ స్మరమార్గణః | రాగస్నేహసమిద్ధాన్తర్ధావం స్తీవ్రహుతాశనః. 253

విభక్తలోకసఙ్‌క్షోభకరో దుర్వారజృమ్భితః | సమ్పాప్తస్నేహ మ్పృక్తం కామినాం హృదయం కిల. 254

జ్వలత్యహర్నిశం భీమో దుశ్చికిత్స్యం సుఖాత్మకమ్‌ | విలోక్యహరహుఙ్కారజ్వాలా భస్మీకృతం న్మరమ్‌. 255

విలలాప రతిః క్రూరం బన్ధునా మధునా సహ| తతో విలవ్య బహుశో మధునా పరిసాన్త్వితా. 256

జగామ శరణం దేవమిన్దుమౌళిం త్రిలోచనమ్‌ | భృఙ్గానుయాతాం సఙ్గృహ్య పుష్పితాం సహకారజామ్‌. 257

లతాం పవిత్రకస్థానే పాణౌ పరభృతాం సఖీమ్‌ | నిర్వర్త్యతు జటాజూటం కుటిలై రలకై రతిః . 258

ఉద్ధూళ్య గాత్రం శుభ్రేణ హృద్యేన స్మరభస్మనా| జానుభ్యామవనిం గత్వా ప్రోవాచేన్దువిభూషణమ్‌. 259

అంతట రౌద్ర శరీరుడగు రుద్రుని కోపాగ్ని సంజనిత ఘోరహుంకార భయానకమగు ముకమునందలి తృతీయ నేత్రము జగత్ప్రళయ భయంకరమయి అగ్ని వ్యాప్తమయ్యెను. ఆ యగ్నిని ధూర్జటి తన సమీపస్థుడగు మదనునియందు వ్యాప్తమొనర్చెను. నాకవాసులు దేవతలు గగ్గోలు పెట్టుచున్నను లెక్కింపక ఆ నేత్రాగ్ని కణరాశి కాముకలుకు మదన పారవశ్యము కలిగించు కందర్పుని కడు శీఘ్రముగా భస్మీభూతుని జేసెను. కాని ఆ అగ్ని మదనదహనానంతరము జగముల దహింప విజృంభించెను. జ్వాలా సమూహములతో లోకములను తిని పొట్ట నింపుకొన ఆత్రపడుచున్న ఆ అగ్నిని శివుడు లోకానుగ్రహార్థమై తీయమామిడి చెట్టు- వసంతఋతువు- చంద్రుడు- మంచి పూవులు- తుమ్మెదలు- కోకిలలు- వీని యందు వంచెను. ఇది మన్నథుడు శివునిపై ప్రయోగించగా శివుని అంతః కరణమునందు ఆ దేవుని బహిరంగముల యందును వ్యాపించి విజృంభించి అగ్ని రూపమునంది శివ నేత్రాగ్ని సంపర్కమున తీవ్రహుతాశనుడైనందున మన్మథ సంబంధమున అనురాగ స్నేహముల బలమున ప్రజ్వలించును. అందునకే అది ఇట్లు పదార్థములయందు విభజింపబడియు వారింప శక్యముకాక విజృంభించి లోకమునందలి ప్రాణుల హృదయములకు సంక్షోభము కలిగించుచుండెను. కాముకులగు స్త్రీ పురుషుల హృదయములందలి స్నేహానురాగములనెడునూనెతో తడిసి ఇంకను అది జ్వలించి సుఖాత్మఖముగా కనబడుచు లోకములను బాధించుచున్నది. ఈ కామాగ్ని భయంకరమయినది; చికిత్స చేయనలవి కానిది.

ఇది ఇట్లుండ- మదనుని పత్ని రతి తన పతి హరహుంకార జనిత జ్వాలలతే భస్మీకృతుడగుటచూచి తన సోదరుడగు వసంతునితో కూడ క్రూరముగా విలపించెను. వసంతుడు ఓదార్చిన మీదట ఆమె చంద్రమౌళియగు త్రిలోచనుని శరణు వేడెను. తుమ్మెదలు వెంటనంటుచున్న పూచిన మామిడి రెమ్మను దర్భపవిత్రముగా చేత ధరించి ఆడు కోకిల తన చెలికత్తెగా తన వంకముంగురులనే జటాజూటముగా అమర్చికొని హృద్యమై తెల్లనిదగు తన పతి భస్మమునే భూతిగా ధరించి మోకాళ్లను నేలకు ఆనించి (ఇట్టి శివసేనా దీక్షా నియములతో ) రతి శివునికో ఇట్లు పలుకుచు ఆ దేవుని స్తుతించెను.

రతీదేవికృతశివస్తుతి

రతిః: ఓం నమశ్శివాయాస్తు నిరామయాయ నమశ్శివాయస్తు మనోమయాయ|

నమశ్శివాయాస్తు సురార్చితాయ తుభ్యం సదా భక్తకృపాపరాయ. 260

నమో భవాయస్తు భవోద్భవాయ నమో స్తు తే ధ్వన్తమనోభవాయ |

నమో స్తుతే గూఢమహావ్రతాయ నమస్స్వమాయాగహనాశ్రయా. 261

నమో స్తు శర్వాయ నమశ్శివాయ నమోస్తు సిద్ధాయ పురాన్తకాయ|

నమోస్తు కాలాయ నమః కలాయ నమోస్తుతే జ్ఞానవరప్రదాయ. 262

నమోస్తుతే కాలకాలాతిగాయ నమో నిసర్గామలభూషణాయ| నమస్త్వమేయాన్ధకమర్ధనాయ నమశ్శరణ్యాయ నమో గుణాయ. 263

నమోస్తుతే బామగణానుగాయ నమోస్తు నానాభువనాదికర్త్రే | నమోస్తు నానాజగతాం విధాత్రే నమోస్తు తే చిత్రఫలప్రయోక్త్రే. 264

సర్వావసానే ప్యవినాశినే నమోస్తు చిత్రాధ్వరభాగభోక్త్రే| నమోస్తు కర్మప్రభవస్య దాత్రే నమస్సదాతే భవసఙ్గహర్త్రే. 265

అనన్తరూపాయ సదైవ తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్‌| శశాఙ్కచిహ్నాయ నమోస్తు తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్‌ . 266

వృషేన్ద్రయానాయ పురాన్తకాయ నమః ప్రసిద్ధాయ మహౌషధాయ| నమోస్తు భక్తాభిమతప్రదాయ నమోస్తు సర్వార్తిహరాయ తుభ్యమ్‌ .267

చరాచరాచార విచారవర్యమాచార్యముత్ప్రేక్షితభూతసర్గమ్‌ | త్వామిన్దుమౌళిం శరణం ప్రసన్నా ప్రియాప్రమేయం మహతాంమహేశమ్‌.268

ప్రయచ్ఛ మే కామయశస్సమృద్ధిం పునః ప్రభో జీవతు కామదేవః | వైధవ్య హర్త్రే భగవన్నమస్తే ప్రియం వినా త్వాం ప్రియజీవితేషు. 269

త్వత్తో పరః కో బువనేష్విహాస్తి ప్రభుః ప్రియాయాః ప్రభవః ప్రియాణామ్‌| త్వమేవ చైకో భువనస్య నాధో దయాళురున్మూలితభక్తభీతిః. 270

(ఓమ్‌) - లోకములకెల్ల శాంతియగు గాక ! ఏ దోషమును నాశమును లేనివాడును మనోమయుడును శుభకరుడును సురార్చితుడును భక్త కృపావరుడునునగు భగవానునకు సమస్కారము. సంసార రూపుడు సంసార జనకుడు మన్మథనాశకుడు రహస్య మహా వ్రతముల నాచరించువాడు స్వమాయకు గూఢముగా ఆస్రయ భూతుడు అగు దేవునకు నమస్సు. దుష్టహింసకుడుసిద్ధుడు త్రిపురాంతకరుడు కాలరూపుడు కాల ప్రేరకుడు జ్ఞన వరప్రదుడునకు మహాదేవునకు నమస్కారము. కాలావయవములకు అతీతుడు స్వస్వరూపమునెడు నిర్మల భూషణముకలవాడు అమేయుడు అంధకాసుర నాశకుడు శరణ్యుడు నిర్గుణుడునకు పరమేశునకు నమస్కారము. భయంకర గుణములు తన వెంటనుండు వాడు నానా భువనములకును ఆదికర్త నానా జగన్నిర్మాత చిత్ర( వివధ) ఫలదాతయగు శివునకు వందనము. సర్వావసానమునందుకూడ నశించతని నేత్రములు కలవాడు నానావిధ యజ్ఞ భాగ భోక్త కర్మ సంజనిత ఫల నిర్మాత సంసార సంబంధనాశకుడు అగు మహాదేవునకు ప్రణామము. అనంత స్వరూపుడు అసహ్యకోపుడు చెంద్ర చిహ్నుడు ఆమేయమగు కొలత కలవాడు అగు నీకు నమస్సు. వృషభేంద్ర వాహనుడు పురాంతకుడు ప్రసిద్దుడు మహౌషద రూపుడు భక్తాభిమతద ప్రదుడు నర్వార్తి హరుడు నగు నీకు మనస్సు; చరాచర జగమందలి సకల ప్రాణుల- సకల పదార్థముల నడువడిని ఎరుగు వారితో శ్రేష్ఠుడు ఆచార్య (గురు) రూపుడు సంకల్పమాత్రమున భూతసృష్టి యొనర్చువాడు చంద్రమౌళి సర్వప్రియుడు అప్రమేయుడు గొప్పవారిలో గొప్పవాడు. మహేశుడునగు నిన్ను శరణు పొందితిని. ప్రభో! కామునకు ( నా పతికి) కీర్తి సమృద్ధి నిమ్ము. కామ దేవుని మరల బ్రదికింపుము. ప్రియ జీవితమును కరుణతో ఇచ్చుటకు సర్వప్రాణి ప్రియమగు ఆత్మ రూపుడవగు నీవు తప్ప ఈ భవనములందు మరెవ్వరు కలరు? మదన ప్రియమగు నాకు ప్రభువును ప్రియముల నొసగువాడను పరాపరార్థముల నిర్మించి భక్తుల కొసగువాడను సర్వభువన నాధుడును దయాపరుడును భక్తభీతి నాశకుడును నగువాడు నీవు తప్ప మరి ఎవ్వరును లేరు.

సూతః ఇత్థం శ్శఙ్కర ఈశ ఈశో వృషాకపి ర్మన్మథకాన్తయా తు| తుతోష ధోషాకరఖణ్డధారీ హ్యువాచ చైనాం మదురం నిరీక్ష్య. 271

శఙ్కరః * తే భవిష్యతి కామో యం మదనో లోకవిశ్రుతః | అనంగోలోక విఖ్యాతిః ఖ్యాతిం పుత్త్రి! గమిష్యతి. 272

సూతః ఇత్యుక్తా శిరసా వన్ద్య గిరీశం కామవల్లభా | జగామోపవనం రమ్యం రతిస్తుహినభూభృతః . 273

రురోదార్తాచ బహుశో దీనా రమ్యస్థలేతు సా | మరణవ్యవసాయాత్తు నివృత్తా గిరిశాజ్ఞయా. 274

అథ నారదవా క్యేన చోదితో హిమభూధరః| కృతాభరటణ సంస్కారాం కృతకౌతురమఙ్గళామ్‌ . 275

స్వర్గపుష్పకృతాపీడాం శుభచీనాంశుకాచితామ్‌ | సఖీభ్యాం సంయుతాం శైలో గృహీత్వా తనయాం తతః. 276

జగామ శుభయోగేన తదా సమ్పూర్ణమానసః | రతీహిమవత్సంవాదః

స కాననాన్యతిక్రమ్య వనాన్యుపవనానిచ .277

దదర్శ రుదతీం నారీమప్రతర్క్యమహౌజసమ్‌| రూపేణాసదృశీం లోకే +రమ్యాం సురమనోహరామ్‌. 278

కౌతుకేన పరామృశ్య తాం దృష్ట్వా రుదతీంగిరిః | ఉపసర్ప్య తత స్తస్యా నిరటం సోథ పృచ్ఛత. 279

హిమవాన్‌: కాసి కస్యాసి కల్యాణి కిమర్థం త్వం చ రోదిషి | నైతదల్పం మహాసత్త్వే కారణం లోకసున్ధరి. 280

సూతః: సా తస్య వచనం శ్రుత్వా ప్రోవాచ మధునా సహ| రుదతీ శోకజననం స్వసతీ దైన్యవర్థనమ్‌ . 281

రతిః: కామస్య దయితాం భార్యాం రతిం మాం విద్ధి సువ్రత| గిరీవస్మిన్త్స భగనాన్గిరీసస్తపసి స్థితః . 282

తేన ప్రత్యుహరుష్టేన విస్ఫార్యానలలోచనమ్‌ | 0విముచ్యాగ్ని శిఖా జ్వాలాం కామో భస్మావశేషితః. 283

అహంతు శరణం యాతా తం దేవం భయవిహ్వలా| స్తుతవత్యథ సంస్తుత్యా తతో మాం గిరిశో బ్రవీత్‌ . 284

మన్మథుని పత్ని ఇట్లు స్తుతించగా శంకరుడు (సుఖము కలిగించువాడు వృషాకపి (ధర్మరక్షకుడు) చంద్ర ఖండ ధారియగు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను అనుగ్రహపు చూపు చూచి ఇట్లు పలికెను. '' పుత్త్రీ! నీవు కోరినట్లే ఈ మదనుడు అనంగుడు (శరీరము లేనివాడు) అని లోక ప్రసిద్దినందును.''అనగా కాముని ప్రియురాలు రతి శిరసు వంచి గిరీశుడగు శివుని నమస్కరించి హిమ వంచమునందలి రమ్యమగు ఉపవనమునకు పోయెను. అచట ఆమె శివుని ఆజ్ఞ ననుసరించి మరణ ప్రయత్నమునుండి విరమించెనేకాని ఆర్తురాలయి ఒక రమ్య స్థలమున దీనభావముతో విలపించెను.

తరువాత హిమవంతుడు నారదుని ప్రేరణచే తన తనయయగు పార్వతిని ఆభరణములలో అలంకరింపజేసి శుభ సమయోచిత శుభ సంస్కారములతో సంస్కరింపజేసి స్వర్గమందలి (కల్పవృక్షపు) పూవులను శిరస్సున అలంకరింపజేసి శుభమగు పట్టు వస్త్రము ధరింపజేసి ఇద్దరు సఖులామె వెంట వచ్చుచుండ శుభయోగము సమకూరెనని నిండిన మనస్సుతో బయలుదేరి పోవుచుండెను. అతడట్లు కాననములను వనములను ఉప వనములను గడచి పోవుచుండ త్రోవలో నతనికి ఊహింపనలవి కాని మహాతేజస్సు కలది లోకమందెచ్చటను సాటిలేని రూపము కలది రమ్యరూపము కలది దేవతల మనస్సులనుకూడ హరించునది అగు స్త్రీ ఏడ్చుచు కనబడెను. హిమవంతుడామెను ప్రీతితో పరామర్శించి ఆమె

* భవితేతిచ కామోయం కాలాత్కాన్తో చిరాదపి. + రమ్యేషు వనసానుషు.

0దగోసౌఝుష కేతుస్తుమమకాన్తోతివల్లభః.

సమీపమునకేగి ఆమెను ఇట్లడిగెను. ''కల్యాణీ! నీవు ఎవరవు? ఎవరిదానవు నీవెందుల కై ఏడ్చుచున్నావు? గొప్ప నిబ్బరము కల దానవును లోకైక సుందరియు అగు నీవు ఏడ్చుటకేదో గొప్ప కారణమే యుండునను కొందును''. అనగా విని అంత వరకు వసంతునితో కూడి ఏడ్చుచుండిన ఆమో ఇంకను ఏడ్చుచు నిట్టూర్చుచు విను వారికి శోకమును జాలియు కలుగు నట్లు ఈ మాట పలికెను. నన్ను మన్మథుడు భార్యయగు రతిగా ఎరుగుము. ఈ గిరియందు భగవానుడు గిరిశుడు (శివుడు) తపమందున్నాడు. తనకు కలిగిన తపోవిఘ్నమునకు కోపించి అతడు తన అగ్ని నేత్రము తెరచి అగ్ని శిఖాజ్వాలను వదలి కాముని భస్మావశేషితునిగా జేసెను. నేను భయవిహ్వలనయి ఆ దేవుని శరణుచొచ్చి స్తుతించితిని. ఆ సంస్తుతి మెచ్చి శివుడిట్లు పలికెను.

తుష్టోహం కామదయితే కామస్తవ భవిష్యతి| స్తోత్రం తవాప్యధీయానో నరో భక్త్యా మదాశ్రయః. 285

లప్స్యతే కాఙ్జితం కామం నివర్త్య మరణాద్రతే | ప్రతీక్షతీచ తద్వాక్యమాశావేశాదిభిర్హ్యహమ్‌. 286

శరీరం పరిరక్షిప్యే కంచిత్కాలం మహామతే | ఇత్యుక్తస్తు తదా రత్యా శైలస్సమ్భ్రమభీషితః. 287

పాణావాదాయ దుహితాం గన్తుమైచ్ఛత్స్వకం పురమ్‌ | భావినో వశ్యభావిత్వాద్భవిత్రీ భూతభావినీ. 288

లజ్జమా నా సఖిముకే నోవాచ పితరం గిరిమ్‌ | పార్వతీహిమవతోస్తపోవిషయకస్సంవాదః . శైలపుత్త్రీః దుర్భగేన శరీరేణ కిం మమానేన కారణమ్‌. 289

కథంచ తాదృశం ప్రాప్తుం సుఖం మే స పతిర్భవేత్‌ | తపోభిః ప్రాప్యతేభీష్టం నాసాధ్యంహి తపస్యతః 290

దుర్భగత్వం వృథా లోకో వహతే సతి సాధనే| తపసి భ్రష్టసన్దేహ ఉద్యమోథ జిగీషయా. 291

జీవితాద్దుర్భగాచ్ఛ్రేయో మరణం హ్యతవస్యతః | సాహం తపః కరిష్యామి యదహం ప్రాప్య దుర్లభమ్‌. 292

భవిష్యామి న సన్దేహో నియమైశ్శోషయే తనుమ్‌ | ఇత్యుక్తశ్శైలరాజస్తు దుహిత్రా స్నేహవిక్లబః . 293

ఉవాచ వాచా శైలేన్ద్రో గద్గదస్నేహవర్ణయా| హిమవాన్‌ :ఉమాతి చపలే పుత్త్రిన క్షమం తావకం వపుః . 294

సోఢుం క్లేశాత్మరూపస్య తపసస్సౌమ్యదర్శనే | భావిన్యవ్యభిచర్యాణిపదార్థాని తవై వతు. 295

భావినోర్థా భవన్తేవ్య హఠేనానిచ్ఛతోపి హి| తస్మాన్న తపసా తేస్తి బాలే కిఞ్చిత్ప్రయోజనమ్‌. 296

భవనాయైన గచ్ఛామి చిన్తయిష్యామి తత్ర వై | ఇత్యుక్తాతు యదా నైవ గృహాయాభ్యేతి శైలజా. 297

తతస్స చిన్తయా೭೭ విష్టో దుహితాం ప్రశంసంస సః | తతో న్తరిక్షే దివ్యా వాగభూద్భువనభూతయే. 298

ఉమాతి చపలేపుత్త్రి త్వయోక్తా తనయా తదా | ఉమేతి నామ తేనాస్యా భువనేషు భవిష్యతి. 299

సిద్ధించ మూర్తిమత్యేషా సాధయిష్యతి చిన్తితామ్‌ | ఏతచ్ఛ్రుత్వా స వచనమాకాత్కాశపాణ్డురః . 300

అనుజ్ఞాయతుం శైలో జగామశు స్వమన్దిరమ్‌ |

''కాముని ప్రియురాలా! నేను తుష్టి చెందితిని. నీ ఈ కోరిక నెరవెరును. నీవు నన్నుద్ధేశించిచేసినస్తుతి భక్తితో అధ్యయనము చేసి నన్ను శరణు చొచ్చిన నరుడు తాను కోరిన కోరికల నీడేర్చుకొనును ఇటువంచి దుర్మరణమును పొందడు.''

నేను ఆశా బలముతో ఆ శివుని వాక్యపు ఫలమును ఎదురుచూచుచు ఓ మహాతేజశ్శాలీ ! కొంతకాలము ప్రతీక్షింతును. అని రతి పలికెను. ఈ మాటవిని హిమాచలుడు సంభ్రమమును భయమునుచెంది తన కూతురగు పార్వతిని చేత గ్రహించి తన పురమునకు తిరిగిపోదలచెను. భవితవ్యము అవశ్యభావి కావున భూతభవత్‌ (వర్తమాన) భావి సంఘటనములకు హేతు భూతురాలగు శక్త్యాత్మిక పార్వతి బిడియ పడుచు తన తండ్రితో ఇట్లనెను: తండ్రీ దుర్భగమగు (ప్రియప్రీతిపాత్రముకాని) ఈ శరీరముతో ప్రయోజనమేమి? అట్టి అనిర్వచనీయ సుఖము లభించుట కనుకూలముగా అట్టి పతి ఎట్లు లభించును? తపస్సుచే అభీష్టము లభించును. ఏలయన తపమాచరించు వానికి సాధ్యముకాని దేదియులేదు. లోకము (నందలి జనము) సాధనములు ఉండియు దుర్భగమగు చున్నది. (దేవతానుగ్రహమును సాధింపలేక పోవుచున్నది.) తపస్సువలన సాధ్యముకాని దేదియులేదను నిశ్చయముతో భ్రష్టసందేహుడై జిగీషతో (కార్యసాధన సంకల్పముతో ) ఉద్యమమునకు పూనవలయును. తపస్సు చేయక దురదృష్టవంతమగు జీవితము గడపుటకంటె మరణమే మేలు. కావున తపస్సాచరింతును. ఏలయన నేను దుర్లభమగు దానిని గూడ పొంది తీరుదును. ఏ మాత్రము నిందు సందేహము లేదు. నియములతో నా తనువునెండింపజేసికొందును. అని పార్వతి పలుకగా శైలరాజు పుత్త్రీ స్నేహముతో వివశుడై డగ్గుత్తి కచే స్నేహ పూర్ణముగా వినబడు వర్ణములుండునట్లు ఇట్లు పలికెను. ఉ-మా-(అమ్మాయీ వద్దు); పుత్త్రీ! నీవు అతి చపలు రాలవు; (మనస్సులోనికి వచ్చిన ఆలోచనములను వెంటనే ఆచరించవలెనని త్వరపడెదవు.) నీవు సౌమ్యదర్శనవు (సుకుమార రూపవు; క్లేశ ప్రధాన క్రియాసాధ్యమగు తపఃశ్రమను నీ తనువు సహించ జాలదు. నీ విషయములో ఏవేవి జరుగవలసి యున్నవో అవి తప్పక జరిగి తీరును: మనకు ఇష్టమున్నను లేకున్నను భవితవ్యవిషయములు సంభవించియే తీరును ;కావున బాలా! (అమాయికురాలా) తపస్సువలన నీకు వేరుగ కలుగు ప్రయోజము ఏమియు లేదు. నేనిపుడింటికి పోవుదును. అక్కడనే యాలోచింతును. అని ఇట్లు తండ్రి ఎంత చెప్పినను శైలజ ఇంటికి రానిష్టపడలేదు. రాలేదు. అనంతరము హిమవంతుడు ఈ పుత్త్రీ పట్టుదలకు చింతావిష్టుడయ్యును తుదకు ఆమెను ప్రశంసించెను. అనంతరము అంతరిక్షమునుండి భువన శుభకరమగు ఈ మాట వినబడెను. అతి చవలవగు పుత్త్రీ! వద్దు (ఉ-మా) అంటివి కావున ఈమె నామము భవనములందు ఉమా అని ప్రసిద్ధమగును. ఇంతే కాదు మూర్తీభవించిన సిద్ధి రూపయగు ఈమె తన చింతనమును సిద్ధింపజేసినొనును. అను ఈ అంతరిక్ష వచనమును విని రెల్లు పూవువలె తెల్లని ఆ హిమవంతుడు ఆమెను తపమాచరింప ననుమతించి త్వరితముగా స్వగృహమునకేగెను.

హిమవద్గిరౌ పార్వతీతపశ్చరణమ్‌.

సూతః : శైలజా ప్రయ¸° శైలమగమ్యమపి దైవతైః . 301

సఖీభ్యామనుయాతా తు నియతా నగరాజజా|శృఙ్గం హిమవతః పుణ్యం నానాధాతువిభూషితమ్‌. 302

దివ్యపుష్పలతాకీర్ణం సిద్ధదన్ధర్వసేవితమ్‌ | నానామృగగణాకీర్ణం భ్రమరైర్జుష్టపాదపమ్‌. 303

దివ్యప్రస్రవణోపేతం దీర్ఘికాభిరలఙ్కృతమ్‌ | నానాపక్షిగణాకీర్ణం చక్రలాకోపశోభితమ్‌. 304

జలజైస్థ్సలజైః పుషై#్పః ప్రోత్ఫుల్లైరుపశోభితమ్‌ | చిత్రకన్దరసంస్థానం గుహాగృహమనోహరమమ్‌. 305

విహఙ్గసఙ్ఘసంఘష్టం కల్పపాదపసఙ్కులమ్‌ . తత్రాపస్యన్మహాశాఖం సాఖినం హరితచ్ఛదమ్‌ . 306

సర్వర్తుకుసుమోహేతం మనోరథశతోజ్జ్వలమ్‌ | నానాపుష్పసమాకీర్ణం నానావిధఫలాచితమ్‌. 307

తతం సూర్యస్య రుచిభిర్భిన్న సంహతపల్లవమ్‌ | తత్రామ్బరాణి సన్త్యజ్య భూషణానిచ శైలజా| 308

సంవీతా వల్కలైర్దివ్యైర్దర్భనిర్మిత మేఖలా | త్రిస్స్నాతా పాచలాకారా బభూవ సరదాం శతమ్‌. 309

శతమే కేన శీర్ణేన వర్ణేనావర్తయత్తదా | నిరాహారా శతం సాభూత్సమానాం తపసాం నిదిః | 310

తత్రచోద్వేజితాస్సర్వే ప్రాణినస్తపసోగ్నినా | తతస్సస్మార బగవాన్నునీన్త్సప్త శతక్రతుః . 311

దేవేన్ద్ర ప్రేరితసప్తర్షీణాం పార్వతీ తపతోవనగమనం తత్సంవాదశ్చ. తేనమాగమ్య మునయస్సర్వే సముదితాస్తతః | పూజితాశ్చ మపేన్ద్రేణ పప్రచ్ఛుస్తత్ప్రయోజనమ్‌. 312

కిమర్థం హి సురశ్రేష్ఠ సంస్మృతాస్తు వయం త్వయా| శక్రః ప్రోవాచ శృణ్వన్తు భగవన్తః ప్రయోజనమ్‌. 313

హిమాచలే తపో ఘోరం తప్యతే భూధరాత్మజా| తస్యాశ్చాభిమతం కామం భవన్తః కర్తుమర్హథ. 314

తపస్సమాపనం దేవ్యా జగదర్థం త్వరాన్వితా | తథేత్యుక్త్వాతు తే శైలం సిద్ధసఙ్ఘాత సేవితమ్‌ . 315

పుర ఆగత్య మునస్తామూచుర్మధురాక్షరమ్‌ |

శైల పుత్రియగు పార్వతి దేవతలకు కూడ చేరనలవికాని పర్వత భాగమును చేరెను. ఆ నగరాజ పుత్త్రి వెంట ఇద్దరు చెలికత్తెలు మాత్రముండిరి. ఆయమ పూనసిద్ధపడియున్న తపోనియమమున కనుకూలముగా పర్వత శిఖర భాగమంతయు పుణ్యకరమును నానాగైరిక ధాతువువతో అలంకృతమునయి యుండెను. దివ్య పుష్పలతలు అట నుండెను. సిద్ధ గంధర్వులు నానా మృగ గణములు సంచరించుచుండిరి. చెట్లపయి తుమ్మెదలు ఝుమ్మనుచుండెను. మేలగు సెలయేళ్ళు దిగుడుబావులు చక్రవాకములు మొదలగు నానాజల పక్షులు మరి ఇతరములగు పక్షులు చక్కగ వికసించిన జలస్థల పుష్పములు వివిధ విచిత్ర కందరములు మనోహర గుహాగృహములు ఆటగలవు. కల్పవృక్షములును ఆయా వృక్షములపై కూయు పక్షుల కూతలును ఇంపు గొలుపుచుండెను.

ఇట్టి ప్రదేశపు నడుచు పచ్చని ఆకులతో పెద్ద కొమ్మలు గల వృక్షమొకటి ఆమెకు కనబడెను. అది సర్వ ఋతు కుసుమ భరితము అది ఎన్ని కోరికలపై తీర్చగలిగి ప్రకాశించుచుండెను. నానా పుష్ప ఫలములతో వ్యాప్తమయినది వేరయి యుండియు దట్టముగ క్రమ్ముకొనిన చిగురాకులతో అది అందగించుచుండెను. అట్టి తావున పార్వతి వెలగల తన వస్త్ర భూషణములు విడిచి నార వస్త్రములను దర్భలమొలత్రాటిని ధరించెను. త్రిషవణ (ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములందు ముమ్మారు) స్నానమాచరించుచు శరీరము ఎర్రవారి వెదలకొలది ఏండ్లు తపమాచరించుచు గడపెను. ఎండి రాలిన ఒక ఆకు ఒక దినమున కాహారముగా నూరేండ్లుండెను. ఆ తపోనిధి మరి మూరేండ్లు నిరాహారగనే యుండెను.

ఇంద్రుని ప్రేరణచే సప్తర్షులు పార్వతీ తపోవనమేగి ఆమెతో మాటాడుట.

ఇట్టి పార్వతీ తపోజనితాగ్నికి సర్వప్రాణులును భయమందెను. అంతట భగవానుడింద్రుడు సప్తర్షులను తలచెను. వారందరు వెంటనే వచ్చి ఇంద్రుచొనర్చిన పూజలనందుకొని 'మమ్ము నీవు స్మరించిన ప్రయోజనమేమి?' యని ప్రశ్నించిరి. ఇంద్రుడు వారితో ఇట్లు పలికెను. భగవంతులారా!నేను మిమ్ము స్మరించిన ప్రయోజనము తెలిపెద; వినుడు:హిమవచ్ఛైల పుత్త్రి హిమాచలమున ఘోర తపమాచరించుచున్నది; మీరామె అబిమతమెరిగి అది తీర్చ మిమ్ము ప్రార్థించుచున్నాను. లోకక్షేమార్థము ఆమె తపము త్వరలో ముగియవలయును. కావున మీరును త్వరపడవలయును. అనగా వారును సరేయని సిద్ధ జన సేవితమగు హిమశైలమున పార్వతీ తపశ్చర్యా ప్రదేశమునకేగిరి. ఆమె ఎదుట నిలిచి తీయని అక్షరములుగల వాక్యములతో పార్వతితో ఇట్లనిరి :

ఋషయః పుత్త్రీ కిం తే వ్యవసితః కామః కమలలోచనే. 316

తానువాచ తతో దేవీ సవ్రీడా గౌరువోన్ముఖీ | పార్వతీః తపస్యతో మహాభాగా ప్రాప్య మౌనం భవాదృశా9. 317

వన్దనాయ నియుక్తా ధీః పావయత్యవికల్పితమ్‌ | ప్రశ్నోన్ముఖత్వాద్భవతాం ముక్తనాసనమాదితః . 318

ఉపవిష్టాశ్శమం ముక్త్వా తతః ప్రక్ష్యథ మామతః | ఇత్యుక్త్వా సా తతతశ్చక్రే కృతాసనపరిగ్రహా 9. 319

సాతు తాన్పూజ్య విధివత్పూజ్యాం శ్చైవ విధానతః | ఉవాచాదిత్యసఙ్కాశాన్మునీన్త్సప్త సతీ శ##నైః . 320

త్యక్త్వా వ్రతాత్మకం మౌనం మౌనం జగ్రాహ హ్రీమయమ్‌ | భావం తస్యాశ్చ మోనాన్తం తస్యాస్సప్తర్షయో యదా. 321

గౌరవాదీనతాం ప్రాప్తాః పప్రచ్ఛుస్తాం పున స్తదా | సాపి గౌరవగర్భేణ మనసా చారుహాసినీ. 322

మునీఞ్ఛాన్త కథా లాపాన్ప్రోవాచ ప్రోజ్ఘ్య వాగ్యమమ్‌ | ఏవం భవన్తో జానిన్తి ప్రాణినాం మనసీప్సితమ్‌. 323

మనోగతిభిరత్యర్ధం కదర్థ్యం తే హి దేహినః | కేచిత్తు నియతాస్తత్ర గటనే విబుధోపమాః . 324

ఉపాయైర్దుర్లభాన్భావాన్ప్రాప్తుమిచ్ఛిన్త్యతన్ద్రితాః | అపరేతు పరిచ్చిన్నానానాకారాభ్యుపక్రమాః 325

దేహాన్తరార్థమారమ్భ *మాశ్రయన్తి ఫల ప్రదమ్‌ | మమత్వాకాశమ్భూతకుసుమస్రగ్విభూషితమ్‌. 326

వన్థ్యసుతం ప్రాప్తుకామం మనః ప్రరతే ముహుః | అహంకిల భవం దేవం పతిం ప్రాప్తుం సముద్యతా. 327

ప్రకృత్యైవ దురావాప్యం తపస్యన్తంచ సామ్ప్రతమ్‌| సురాసురైరనిర్ణీతం పరమార్థక్రియాస్రయమ్‌. 328

సామ్ప్రతం చాపి నిర్దగ్ధమదనాఙ్గమరాగిణమ్‌ | కథమారాధయేదీశం మాదృశీ శివమ్‌. 329

ఇత్యుక్తా మునయస్తేతు స్థిరతాం మనసస్తతః| జ్ఞాతుమస్యావచః ప్రోచుః ప్రక్రమాత్ప్రకృతార్థకమ్‌ . 330

కమలలోచనవగు పుత్త్రీ నీవే సంకల్పముతో తపశ్చర్య హూనితివనిన మునులతో పార్వతి బిడియపడుచు గౌరవపురస్సారముగా ఇట్లనెను. తపోనిష్ఠులగు తమవంటి మహానుభావులు లభింతునపుడు ఊరక నమస్కరించినను పవిత్రత కలుగుననుట నిస్సంశయము; కాని మీరు నన్ను ప్రశ్నించుటకున్ముఖులైయున్నారు. కావున మొదట ఆసనముల స్వీకరించుట యుక్తము; కూర్చుండి శ్రమ తీర్చుకొని పిమ్మట మీరు నన్ను ప్రశ్నించవచ్చును. అనుచు పార్వతి వారికి ఆసనములు ఆర్పించి వారినందు గూర్చుండజేసెను. పూజ్యులను సూర్య సమానులునగు ఆ సప్త మునులను ఆనతి యథావిధానముగా పూజించి తపో వ్రతరూపమగు మౌనము వదలెను; కాని బిడియముచే మౌనము పూనెను; సప్తర్షులను మౌనము నవలబించుటయందు ఆమె భావము గ్రహించిరి. ఆమె తమయందు చూపిన గౌరవమునకు వివశులైరి. వారపుడు మరల తాము మొదట అడిగిన ప్రశ్నమే యడిగిరి. మెల్లగ పార్వతియు ఇంపుగ చిరునవ్వు నగుచు ఆదరపూర్ణ మనస్సుతో మునుల ప్రశ్నము విని తన మౌనము విడిచి ఇట్లు పలికెను. ఈ విషయము తమకు తెలిసినదే కదా! ఏమనిన- ప్రాణులకు మనస్సునందేదో కోరికలు ఉండును. ప్రాణుల చుత్తవృత్తులును వారికి కలుగు కోరికలును వారిని వివశులనుగా చేయుచుండును. వాటిని వారు తీర్చుకొనజాలరు. కాని వారిలో కొందరు దేవతా సమానులగు నియమవంతులుందురు. మరికొందరు మాత్రము పరిమితమగు బుద్ధిశక్తితో దేహశక్తితో ఆయా కార్యములాచరించుచుందురు. అది వారి దేహాంతరమున మరు జన్మమున సహితము కలిగించుటకుపయోగించును కాని మోక్షము సాధనము కాదు. కాని నామనస్సు మాత్రము గగన కుసుమమాలను ధరించిన వంధ్యాసుతుని పొందవలెనని మరిమరి కోరుచున్నది. నేను దేవుడగు భవుని పతిగా పొందు పూనికతోనున్నాను. అతడు సహజముగనే అందరానివాడు; ప్రకృతము తపోనిష్ఠయందున్నవాడు. సురాసురులును అతడిట్టివాడని నిర్ణయింపజాలరు. పరమార్థ తత్తవోపయోగి కర్మలనే ఆశ్రయించి ఆచరించువాడా భగవానుడు; అతని హృదయమందే కోరికలును లేవు. అతడు ఇటీవలనే మదనుని దేహమునే దగ్ధమొనర్చినాడు. నావంటి స్త్రీ అటువంటి ఈశుడగు శివుని ఎట్లు మెప్పించగలదు?

అని ఇట్లు పార్వతి పలికినది విని అంతట ఆ మునులు ఆమె మనః స్థైర్యము నెరుగగోరి ప్రకృతమున కుపయోగించు క్రమగతమగు వాక్యమిట్లు పలికిరి:

మునయః ద్వివిధం తు సుఖం తత్ర పుత్త్రి ! లోకేషు భావ్యతే| శరీరస్యాస్య సమ్భోగై శ్చేచసశ్చాపి నిర్వృతిః. 331

ప్రకృత్యాతు స దిగ్వాసు భీమః పితృవనేశయః | కపాలీ భిక్షుకో నగ్నో విరూపాక్షస్థ్సిర క్రియః | 332

ప్రమత్తోన్మత్తకాకారో బీభత్సుః కృతసఙ్గ్రహాః | యతినా తేన తస్తేర్థో భూతనాధేన కాఙ్జితః . 333

యదిహ్యస్య శరీరస్య సుఖమిచ్చసి సామ్ప్రతమ్‌ | తత్కథం తే మహైదేవాద్భయభాజో జుగుప్సితాత్‌. 334

*మాపతన్తిహిత ప్రదమ్‌.

స్రవద్రక్తవసాభ్యక్తకలపాలకృతభూషణాత్‌| శ్వసదుగ్రభుఙ్గేన్ద్రకృతభూషణభీషణాత్‌. 335

శ్మశానవాసినో రౌద్ర ప్రమథానుగతాత్సతి | సురేన్ద్రముకుటవ్రాతనిఘృష్టచరణో7రిహా. 336

హరిరస్తి జగద్ధాతా శ్రీకాన్తో7నన్తమూర్తిమా& | నాధో యజ్ఞబుజామస్తి తథేన్ద్రః పాకశాసనః 337

దైవతానాం నిధిశ్చాస్తి జ్వలనస్సర్వకామకృత్‌ | వాయురస్తి జగద్ధాతా యఃప్రాణస్సర్వదేహినామ్‌. 338

తథా వైశ్రవణో రాజా సర్వార్థసహితః ప్రభుః | ఏభ్య ఏకతమం కస్మాన్న త్వం సమ్ప్రాప్తుమిచ్ఛసి. 339

ఉత్థానదేహసమ్ప్రాప్త్యా సుఖం తే మనసేప్సితమ్‌ | ఏవమేతత్తవాప్యత్ర ప్రభావో నాకసమ్పదామ్‌. 340

అస్మిన్దేహే పరేచాపి కల్యాణప్రాప్తయస్తవ | పితురేవాస్తి తే సర్వం సురేభ్యో యన్న విద్యతే. 341

అతస్తత్ప్రప్తయే క్లేశ స్తవాప్యత్రాఫలస్తవ | ప్రాయేణ ప్రార్థ్యతే హ్యత్రసుస్వల్పో హ్యతిదుర్లభః 342

అస్య తే విధియోగః స్యాద్ధాతా కర్తాత్ర చైవ హి |

పుత్త్రీ! లోకములందు లభించు సుఖము రెండు విధములని పెద్దల భావన; ఒకటి దైహిక సుఖములవలన కలుగు తృప్తి; రెండవది కేవలము చిత్తమున కలుగు ఈ తృప్తి ;నీవు పతిగా కోరు శివుడు ప్రకృతి (స్వభావము) చేతనే దిగంబరుడు; భీముడు (భయజ్కరుడు;) శ్మశానశాయి; కపాలము ధరించిన భిక్షకుడు దినమొలవాడు; వికృతమగు (బేసి) కన్నులవాడు; స్థిర క్రియుడు (శాశ్వతములగు పనులు చేయువాడు; మొండిపట్టుతో పనులు చేయువాడు); ప్రమత్తుల-ఉన్మత్తుల ఆకారము కలవాడు; రోతగొలుపు సామగ్రులను సేకరించుకొని యుండువాడు; భూతములకు ప్రభువు; అతని వలన నీకు తీరు కోరిక ఏమి? నీవు నీ ఈ శరీర సుఖమునే కోరుచుంటివనిన భయంకరుడు రోత గొలుపువాడు రక్తముకారుచు వసపూత కలిగిన కపాలములు అభరణములుగా ధరించిన వాడు బుసలుకొట్టు సర్పరాములు భూషణములుగా దాల్చిన భయంకరుడు శ్మశానవాసి రౌద్రులగు ప్రమథులు తన అనుచరులుగా గలవాడు అగు ఈ మహాదేవుని వలన నీకు కలుగు సుఖమేమున్నది?

దేవతల కిరీట సమూహముల ఒరపిడి తను పాదపద్మములు కలవాడు శత్రునాశకుడు లోకనిర్మాత శ్రీకాంతుడు అనంతమూర్తిధరుడు అగు హరియున్నాడు; యజ్ఞ భోక్తలగు దేవతలకధిపతి పాకాసుర సంహారి అగు ప్రాణభూతుడనగు వాయువున్నాడు, సర్వధనాధిపతియు ప్రభువు విశ్రవసుని పుత్త్రుడు రాజరాజునగు కుభేరుడున్నాడు; వీరియందుండి ఎవరినైన నీవు పతిగా పొందగోరరాదా? లేక ఒక వేళ మరియొక శరీరమున సుఖముల పొందగోరి తప మాచరించుచున్నావా? ఇంతేయగునేని అట్లయినను నీవు తపమాచరింపనక్కరలేదు; ఏలయన ఇచ్చటనే ఈ దేహముతోనే నీ తండ్రి ఇంటనే నీకు స్వర్గ సంపత్‌ సుఖము లభించుచునేయున్నది; ఇచట నీకన్ని శుభ సుఖములును కలవు; దేవతల వలన కూడ లబించనిదెల్ల నీకు నీ తండ్రినుండియే లభించును; కావున నీవందులకై తపమాచరించుచు శ్రమపడుట కూడ వ్యర్థము; అది కాక కల్యాణీ! ఎంత స్వల్ప ఫలమేయైనను మనసు కావలెనని మిగుల కోరినది దుర్లభమయి దూరము పోవుట లోకసహజము; నీవిట్లు తపస్సాచరించుచు శ్రమపడుట విధియోగము; బ్రహ్మ నీకిట్లు విధించినాడు కాబోలును; అని మునులు పార్వతితో పలికిరి.

సూతః : ఇత్యుక్తవత్సు కుపితా మునివర్యేషు శైలజా. 343

ఉవాచ క్రోధరక్తాక్షీ స్ఫురద్భిర్దశనచ్ఛదైః దేవీ : అసద్గ్రహస్య కానీతి ర్వ్యసనస్య క్వ యన్త్రణా 344

విపరీతార్థ బోద్ధారస్సత్పథే కేన యోజితా ః |

ఏవం మాం వేత్థ దుష్ప్రజ్ఞాం హ్యస్థానాసద్గ్రహప్రియామ్‌. 345

న మాం ప్రతి విచారో7స్తి యతో7హం కామయే విభుమ్‌| ప్రజాపతిసమాస్సర్వే భవన్తస్సర్వదర్శినంః 346

నూనం న వేత్థ దేవం జగతశ్శాశ్వతం ప్రభుమ్‌ | అజమీశానమవ్యక్తమమేయమహియోదయమ్‌. 347

అస్తాన్తద్ధర్మసద్భావసమ్భోధస్తావదద్భుత ః | విదుర్యం న హరిబ్రహ్మప్రముఖా హి సురేశ్వరాః. 348

యత్తత్సర్వం భవాత్సోత్థం భువనేషు వజృమ్బితమ్‌ | ప్రకటం సర్వభూతానాం తదప్యత్ర నవేత్థ కిమ్‌.

కసై#్యతద్గగనం మూర్తిః కస్యాగ్నిః కస్య మారుతః | కస్య భూః కస్యవసవః కశ్చన్త్రార్కవిలోచనః 350

కస్యార్చయన్తిలోకేషు లిఙ్గం భక్త్యా సురాನ್ಸುసురాః

యం బ్రువన్తీశ్వరం దేవా* విష్ణ్విన్ద్రాద్యా మహర్షయః 351

ప్రభావం ప్రభవం చైవ తేషామపి న వేత్థకిమ్‌ | అదితిః కస్య మాతేయం కస్మాజ్జాతో జనార్దనః 352

అదితేః కశ్యపాజ్జాతా దేవా నారాయణాదయః | మరిచేః కశ్యపః పుత్త్రోహ్యదితిర్దక్షపుత్త్రికా. 353

మరీచిశ్చాపి దక్షశ్చ సుతౌతు బ్రహ్మణః కిల | బ్రహ్మా హిరణ్మయాత్త్వణ్డాద్దివ్యసిద్ధివిభూషితాత్‌. 354

కస్య ప్రాదురభూద్ధ్యానాత్ప్ర క్షుబ్ధాః ప్రాకృతాంశకాః | ప్రకృతౌతు తృతీయాయామధుద్విడ్జననక్రియా. 355

జాతస్ససర్జ షడ్వర్గాన్బుద్దిపూర్వాం త్స్వకర్మజా & |

అనజః కో భ##వేద్వేధా బ్రహ్మణో7వ్యక్తజన్మనః 356

యస్స్వయోగేన సజ్‌క్షోభ్య ప్రాకృతం కృతవానిదమ్‌ | బ్రహ్మణస్సిద్ధిసర్వార్థమైశ్వర్యం లోకక ర్తృతామ్‌. 357

మునివర్యులు ఇట్లు పలికినది విని శైలజ కుపితురాలయి క్రోధరక్త నేత్రముతో కంపించు పెదవులతో ఇట్లు పలికెను. ''ఆలోచనలతో నడుచువానికి నీతిఏమున్నది? వ్యసనపరునకు అదుపు ఏమున్నది? మంచిని చెడుగుగా చెడుగును మంచిగా ఆలోచించు వానిని మంచి త్రోవలో పెట్టువారెవ్వరున్నారు? మీరు ఈ విధముగా నన్ను ప్రజ్ఞాహీనురాలుగా తగని స్థానమున తగని విధముగా ప్రీతి కలిగియున్నదాననుగా తలచుచున్నారుగదా! నా విషయమున మీరు సరిగా విచారణ చేయుటలేదు. నేను ఇట్లు మాటాడుట అహంకారముచే అని మీరనుకొనవచ్చును; ఏమనిన-మీరందరును ప్రజాపతులతో సమానులు; సర్వజ్ఞులుకూడ; ఐనను మీరు ఆ (మాహా) దేవుని సరిగా ఎరిగినట్లు లేదు; అతడు శాశ్వతుడు జగత్ప్రభువు అజుడు (పుట్టుకలేనివాడు); ఈశానుడు(సర్వమునకు నియంత) అవ్యక్తుడు (స్పష్ట రూపము లేనివాడు) అమేయ (ఎరుగరాని) మహిమ సమృద్ధికలవాడు; అది అట్లుండనిండు; అతడు ప్రతిష్ఠించిన ధర్మపు ఉనికిని సరిగా ఎరుగుటకూడ ఆశ్చర్యకరమగును విషయమే; హరి బ్రహ్మాది సురేశ్వరులును అతనినెరుగజాలరు; ఆ మహానుభావుని విభుత్వము వలన స్వయముగనే జనించినదై లోకములయందు విజృంభించి ప్రకటమైయున్న మహామహిమను కూడ మీరెరుగరేమోకదా! గగనము వాయువు భూమి వరుణుడు (జలములు) అతని మూర్తియేకదా! చంద్రసూర్యులాతని కన్నులు కదా! సురాసురులును భక్తితో అతని లింగ (చిహ్న) మును అర్చించుచున్నారే! బహ్మేంద్రాది దేవతలును మహర్షులును అతనిని సార్థకమగు ఈశ్వరనామముతో పిలుతురుగదా! ఆ శివమూర్తుల ప్రభావమును పుట్టుకను కూడ మీరు ఎరుగనట్లున్నది; ఈ అదితి ఎవరిమాత? జనార్దనుడెవరినుండి జనించెను? నారాయణాది దేవతలు అదితికశ్యపులకు జనించిరి. మరీచి పుత్త్రుడు కశ్యపుడు; దక్షుని పుత్త్రి అదితి; ఈ మరీచి దక్షులిరువురును బ్రహ్మ పుత్త్రులు; దివ్యసిద్ది విభూషిత మగు హిరణ్యయాండమునుండికదా బ్రహ్మజనించెను? ప్రకృత్యంశములన్నియు ఆ ఈశ్వరుని ధ్యానము (సంకల్పము) వలననే కదా ప్రక్షోభము (ప్రథమ స్పందము) నంది సృష్టి ప్రాదుర్భవించెను! మూల ప్రకృతి ఆయా జీవుల కామ-కర్మ కృతములయిన షడ్వర్గములను (జాయతే-ఆస్తి-విపరిణమునే-వర్ధితే-అపక్షీయతే-నశ్యతి అను షడ్భావ వికారములతో కూడిన ప్రాణి సృష్టిని) సృష్టించెను కదా! అజాతకుడు (పుట్టుకలేనివాడు) అనబడు బ్రహ్మకూడ అవ్యక్త తత్త్వమునకు జన్మకారణమగు పరబ్రహ్మ రూపుడగు ఈశ్వరునినుండియే కదా జనించెను? తన ధ్యాన ( సంకల్ప) బలమున ఈశ్వరుడే మూల ప్రకృతియందు క్షోభము (స్పందము) కలిగించి ఇదియంతము సృష్టించి బ్రహ్మయు సర్వార్థసిద్ధినంది సృష్టికి ఈశ్వరుడై (సమర్థుడై) లోక కర్తయగునట్లు చేసెను!

విదుర్విష్ణ్వాదయో యచ్చ స్వమహిమ్నా సదైవ హి |

కృత్వాన్యం దేహమన్యాదృక్తాదృత్వా పునర్హరిః 358

కురతే జగతః కృత్యముత్తమాధమమధ్యమమ్‌| ఏవమేవహి సంసారో యో జన్మమరణాత్మకః 359

కర్మణశ్చ ఫలం హ్యేతన్నానారూపసముద్భవమ్‌ |

అథ నారాయణో దేవస్స్వకాం చ్ఛాయాం సమాశ్రయత్‌ 360

తత్ప్రేరితః ప్రకురుతే జన్మ నానాప్రకారకమ్‌ |సాపవి కర్మణ ఏవోక్తా ప్రేరణావివశాత్మనామ్‌. 361

యథోన్మాదాదిదుష్టస్య మతిరేవహి సావ భ##వేత్‌ | ఇష్ట్యాన్యేవ యథర్థాని విపరీతాని మన్యతే. 362

లోకస్య వ్యవహారేషు స్పష్టేషుహసతేసదా | ధర్మాధర్మఫలావాప్తౌ విష్ణురేవ నిబోధితః 363

అథానాదిత్వమస్యాస్తి సామాన్యాత్తు తదాత్మనా | నహ్యస్య జీవితం దీర్ఘ దృష్టం దేహేతు కుత్రచిత్‌. 364

భవద్బిర్యస్య నో దృష్టమన్తరఙ్గమథాపివా | దేహినాం ధర్మ ఏవైష క్వచిజ్జాయేత్క్వచిన్మ్రియేత్‌. 365

క్వచిద్గర్భగతో నశ్యేత్కచిజ్జీవేజ్జరామయః | క్వచిత్సమాశ్శతం జీవేత్క్వచిద్బాల్యే విపద్యతే. 366

శతాయుః పురుషో యస్తు సో7నన్తస్స్వల్పజన్మనః జీవితో యో న మ్రియతే తస్మాత్సో7మర ఉచ్యతే.

అదృష్టజన్మనిధనా హ్యేవం విష్ణ్వాదయో మతాః | ఏతత్సంశుద్ధమైశ్వర్యం సంసారే కో లభేదిహ. 368

తత్త్రక్షయాదియోగాత్తు నానాశ్చర్యస్వరూపిణః | తస్మాద్విత్త సురాన్త్సర్వా న్మలినా న్త్సల్పభూతికా&.

నాహం భద్రాః కిలేచ్ఛామి బుతే శర్వాత్పినాకినః | స్థితంచ తారతమ్యేన ప్రాణినాం పరమం త్విదమ్‌. 370

ధీబలైశ్వర్యకార్యాదిప్రమాణం మహతాం మహత్‌ | యస్మాన్న కిఞ్చిదపరం సర్వం యస్మాత్ప్రవర్తతే.

యసై#్యశ్యర్యమనాద్యన్తం తమహం శరణం గతా | ఏష మే వ్యవసాయయశ్చ దీర్ఘో7తివిపరీతకః 372

యాత వా తిష్ఠతైవాథ మునయో మద్విధాయకాః |

స్వమహిమ సంపన్నుడగు ఆ ఈశ్వరుని విష్ణ్వాది దేవతలును ఎరుగ యత్నించుచుందురుగదా! ఈశ్వర సంకల్పముననే విష్ణువు అసాధారణములగు అట్టి దేహముల (అవతారముల)ను ధరించి ఉత్తమ మధ్యమాధమభేదములుగలలోక వ్యాపారముల నిర్వర్తించుచున్నాడుగదా! జన్మ మరణాత్మకమగు సంసారపు స్వరూపము ఇటువంటిది; ఇది యంతము-నానారూపములును నానా విధోద్భవములునుగల ఈ జగమంతయు-ప్రాణుల కర్మఫల రూపమయినది; ఇది ఇట్లుండ నారాయణుడును ఆ ఈశ్వరుని ప్రేరణతోనే తన ఛాయయగు వైష్ణవ మాయాశ్రయముతో నానావిధ జన్మములను దాల్చును. వివశాత్ములయి విష్ణ్వాదులందరునుపొందు ప్రేరణకూడ ఉన్మాదాది దోషదూషితులయిన వారి మతిప్రవృత్తి వంటిదే కాని వేరుకాదు. లోకమునందు జరుగు ప్రాణుల ఆయా వ్యవహారములనుచూచి ఈశ్వరుడు తనలోతాను నవ్వుకొను చుండును. మానవులాచరించు ధర్మాధర్మములకు పుణ్యపాప ఫలములు లభించుటకుఈశ్వరాధీనుడై విష్ణువేహేతుభూతుడని శాస్త్రములు నిర్దేశించుచున్నవి. ఈ జీవునకు సామాన్య సిద్ధాన్తముగా అనాదిత్వము చెప్పబడెనేకాని ఈతడు ఏదేహమందును దీర్ఘకాలముండడు; అంతేకాదు ఈజీవుని అంతరంగము (అంతఃరకణము) మీరుకాని మరెవ్వరుకాని చూచియుండలేదు. ఒకచోట పుట్టుట మరి యొకచోట చచ్చుటఅనునది దేహధారియగు జీవుని ధర్మము; అతడు ఒకటో గర్భ మందుండగనే మరి యొకటో వార్దకమున ఇంకొక చోట వ్యాధి చేత వేరొకచోట నూరేండ్లు జీవించి ఇంకొక దేహమున బాల్యమున మరణించును. స్వల్ప కాలము జీవించు వాని కంటెనూరేండ్లు జీవించువాడు అనంతకాల జీవిగా కనబడును; అట్లే (సృష్టికాలముంతయు) మరణించక జీవించియేయుండు వాడు అమరుడనబడుచున్నాడు; అల్పకాల జీవులగు మానవులకు వారి (దేవతల) మరణములు కనబడవు! అంతే; ఇట్లే విష్ణువు మొదల వారి చావుపుట్టుకలు సాధారణులు చూడలేకున్నారు; (కావునవారిని వీరు అమరులని తలచుచున్నారు); (ఈశ్వరునికిగల) ఇటువంటి (జన్మమరణాదులు బొత్తుగాలేని)ఈశ్వరత్వమును ఈ సంసారమును మరి ఎవ్వరు పొందగలరు. అక్కడు (ఈ ప్రపంచమున) జీవన మరణాదులు ఉండుచచే నానాశ్చర్య స్వరూపులు ఈ దేవతలందరును; కావున వీరందరును మలిన రూపులు; వీరి ఈశ్వరత్వము అల్పమయినది! పూజ్యులారా నేనుశ్వరుడు (సర్వప్రాణి సంహారి; శర్వుడనగా సర్వప్రాణులను నశించినను తాను మాత్రము నశించకుండ వాడని ఇచ్చట అర్థము.) పినాక దనుర్ధారియగు శివుని తప్పమరెవ్వని నేని పతిగాకోరను! ఐశ్వర్యాది షడ్గుణములును ఇతరులగు దేవతలయందు తార తమ్యముతో (ఒకరి యందెక్కువ-మరియొకరియందు తక్కువ) ఉన్నవి; కాని ఈశ్వరుని యందు ఇది పరమమయి (అత్యుత్కృష్టమయి) యున్నది; జ్ఞానబలైశ్వర్యాది లక్షణములు దేవునియందు మహత్తులలో మహత్‌ వరిమాణముననున్నవి ; అతని కంటె మరి గొప్పదికాని ఇతరము కానిలేదు సర్వమును; అతని నుండియే ప్రవర్తిల్లుచున్నది. అతని ఈశ్వరత్వమునకు ఆదియు అంతమునులేవు; అట్టి ఈశ్వరునే నేనాశ్రయించుచున్నాను. ఇదియే నా నిశ్చయమును- నా ప్రయత్నమును; ఇది లోక విరుద్ధమయినదే కావచ్చును; నన్ను ఆయాకార్య ములందాజ్ఞాపించు యోగ్యతగల ఋషులారా! మీరిది విని (సంతోషముతో) ఉన్నను సరియే; (కోపించి) వెడలిపోయినను సరియే; (నానిశ్చమయు మారునదికాదు) అని పార్వతి సప్తర్షులతోపలికెను.

సూతః :ఏవం నిశమ్య వచనం దేవ్యా మునివరాస్తదా. 373

ఆనన్దాశ్రుపరీతాక్షాస్వజుస్తా తతస్సతీమ్‌ | ఊచుశ్చ పరమప్రీతాశ్శైలజాం మధురం వచః . 374

మునయః అత్యద్భుతా7స్యహో దేవి జ్ఞానమూర్తిరివామలా | ప్రసాదయసి నో భావం భవభావప్రతిశ్రయాత్‌.

న తు విద్మో వయం తస్య దేవసై#్యశ్వర్యమద్భుతమ్‌ | నిశ్చయస్యాస్యదృఢతాం వేత్తుం వయమిహాగతాః.

అడిరాదేవ తన్వఙ్గి కామస్తే స భవిష్యతి | క్వాదిత్యస్య ప్రభా యాతి రత్నేభ్యః క్వ ద్యుతిః పృథిక్‌. 377

కో7ర్థో వర్ణాళికావ్యక్తః కథం త్వం గరిశం వినా | యామో నై కాభ్యుపాయేన తమభ్యర్థయితుం వయమ్‌. 378

అస్మాకమపి వై సో7ర్థస్సుతరాం హృది వర్తతే | అతస్త్వమేన హి. 379

అతో నిస్సంశయం కార్యం శఙ్కరోపి విధాస్యతి |

సప్తర్షీణా శఙ్కరపోవనగమనమ్‌.

ఇత్యుక్తాః పూజితా యాతా మునయో గిరికన్యయా. 380

ప్రయయుర్గిరిశం ద్రష్టుం ప్రస్థం హిమవతో మహత్‌ | గఙ్గామ్బు ప్లావితాత్మనం పిఙ్గబద్ధజటాసటమ్‌. 381

భృఙ్గౌనుయాతపాణిస్థమన్దారకుసుమస్రజమ్‌ | సమ్ప్రాప్య తే గిరేః ప్రస్థం దదృశుశ్శఙ్కరాశ్రమమ్‌. 382

ప్రశాన్తాశేషసత్త్వౌఘం నవస్తిమితకాననమ్‌ | నిశ్శబ్ధాక్షోభసలిల ప్రపాతం సర్వతోదిశమ్‌. 383

తత్రాపశ్యంస్తతో ద్వారి వీరకం వేత్రపాణినమ్‌ | సప్త తే మునయః పూడ్యా వినీతాః కార్యగౌరవాత్‌. 384

ఊచుర్మధురభాషిణ్యా వాచా తే వాగ్విదాం వరాః | ద్రుష్టుం వయమిహాయాతాశ్శరణ్యం గణనాయకమ్‌. 385

త్రిలోచనం విజానీహి సురకార్యప్రజోదితాః | త్వమేవ నో గతిస్తత్ర యథా కాలానతిక్రమః. 386

సాప్రార్థనైషా ప్రాయేణ ప్రతీహారమయః ప్రభు |

ఇట్లు పలికిన దేవీవచనములు విని తమ కన్నుల ఆనందాశ్రువులుక్రమ్మవారు అతపస్వినిని అభినందించిరి; పరమ ప్రీతులయి వారు మధురవచనములతో ఆమెతో ఇట్లనిరి; అహో! దేవీ!

అత్యద్భుతస్వ భావురాలగు నీవు నిర్మలజ్ఞాన రూపురాలవువలె కనబడుచున్నావు; నీవు సర్వ భావముతో భవుని(శివుని) ఆశ్రయించిన దానవయి మా భావమును ప్రసన్న మొనర్చుచున్నావు; కాని మేము అమహాదేవుని అద్భుతమగు ఐశ్వర్యమును (ఈశ్వరత్వమును) నీవువలె ఎరుగము; నీ నిశ్చయమునందలి దృఢత్వమును పరీక్షించి ఎరుగదలచి ఇచటకు వచ్చినాము. సుందరరూపా! అచిరకాలముననే నీ సంకల్పము నెరవేరును; సూర్యతేజము సూర్యుని కాని రత్నములను కాని విడిచి ఎక్కడకైన పోవునా? వర్ణరాశి రూపమగు శబ్దముచే వ్యక్తముకాక అర్థము వేరొకచోటికి పోదుగదా! అట్లే నీవును పరమేశుని విడిచియుండవు; కావున మేమును అనేకాభ్యుపాయములతో (నైనను) ఆ ఈశ్వరుని అభ్యర్థించుటకు (నీపక్షమున) పోవుచున్నాము; మాహృదయములందును (చాలా కాలముగా) ఈ విషయమే మిక్కిలిగా ఉండినది. ఈ కార్య సాధనమునకు కావలసిన నీతి (ఉపాయ) రూపురాలవును నీవే; కావుననే అందులకు కావలసిన బుద్ధి (ఆలోచనలు- నిశ్యయము) కూడ నీవేయయి యున్నావు; (నీకు శివునియందుగల దృఢానురాగ విషయక నిశ్చయమే ఈ కార్యము సిద్దించుటకు కావలసిన ఆ లోచనమును ఉపాయమును మాకు స్ఫురింపజేయును. ) ఈ హేతువున నీశంకరుడును నిస్సంశయముగ ఈ కార్యమును నెరవేరునట్లు చేయును.

అని ఇట్లు పలికి సప్తమునులు గురి పుత్త్రిచే పూజలందుకొని శివుని దర్శింపగోరి (అతడును) హిమవత్పర్వత సానువునకు బయలుదేరిరి. ఆ సానువు చాలా గొప్పది. శివుని వలెనే ఆ సానువును సమానముగ గంగా జలముతో తడుపబడిన శరీరము కలది; పచ్చని జడలను జూలును దాల్చి శివునివలెనే ఆ సానువు పచ్చని గైరిక ధాతువులతో అలంకృతము; శివుని చేతియందలి మందార కుసుమ మాలలను తుమ్మెదలనునరించచుండెను. సానువు నందలి వృక్షశాఖలయందు పూచిన పుష్ప శ్రేణులను తుమ్మెదలు వెంటాడుచుండెను. ఇట్టి హమవత్సానువునందలి శంకరాశ్రమమును ఆ ఋషులు దర్శించిరి. అచటి మృగ సమూహములు ప్రశాంతములై యుండెను మన ప్రదేశము కోమలమును నిశ్చలమునైయుండెను. నిశ్శబ్దములును కలత లేనివియునగు జల ప్రాపాతములు దానియన్ని దిశలందుండెను. ఆ ఆశ్రమద్వారమున పూజ్యులగు ఆ సప్త మునులకును తనచేత ప్రేప బెత్తము ధరించిన వీరకుడు కనబడెను. తాము వచ్చినపని గొప్పదియగుటే వారు వినయవంతులయి మాటలాడుటలో మేటి నేర్పరురు కావున మధుర భాషణయుతములగు వాక్కులతో అతనితో నిట్లనిరి: లోక శరణ్యుడును ప్రమథగణ నాయకుడునునగు త్రిలోచనుని ఈశ్వరుని దర్శించమేమిటకు వచ్చితిమి. దేవకార్యప్రేరణ మారాకకు హేతువని తెలియుము. కాలాతిక్రమము జరగకుండుటలో నీవే మాకు శరణ్యుడవు కావలయును. ఏలయన సాధారణముగా ద్వారపాలుర అనకూలతచేతనే ప్రభూవులు దర్శనమిత్తురు.

ఇత్యుక్తో మునిభిస్సోథ గౌరవాత్తానువాచ సః. 387

సమన్వాస్యాపరాం సన్ధ్యా స్నాత్యా మన్దాకినీజలే | క్షణన భవితా విప్రాస్తత్ర ద్రక్షథ శూలినమ్‌. 388

ఇత్యుక్తా మినయస్తస్థుస్తే తత్కాలప్రతీక్షిణ | గమ్భీరామ్బధరం ప్రావృట్తృషితాశ్చాతకా యథా. 389

తతః క్షణఏన నిష్నన్నస్సమాధానక్రియావిధిః | వీరాసనం విభేదేశో మృగచర్మనియామితమ్‌. 390

తతో నినీతో జానుభ్యామవలమ్బ్య మహీం తథా | ఉవాచ వీరకో దేవం ప్రణయైకసమాశ్రయః 391

సమ్ప్రాప్తా మునయస్సప్త త్వాం ద్రష్టుం దీప్తతేజస ః | విభో సమాదిశ ద్రష్టుమవగన్తుమిహార్హసి. 392

ఇత్యుక్తో ధూర్జటిస్తేన వీరకేణ మహాత్మనా | భ్రూభఙ్గసంజ్ఞయా తేషాం ప్రవేశం తం దదౌ తతా. 393

మూర్దకమ్పేన తంత్సప్త వీరకోపి మహామునీ& | ఆజుహావ విదూరస్థా& దర్శనాయ పినాకినః 394

త్వరాబద్దార్థచూడాస్తే లమ్బకృష్ణాజినామ్బరాః | వివిశుర్వేదికాం శుద్ధాం గిరీశన్య విభూతిభిః. 395

బద్ధపాణిపుటాక్షిప్తనానాపుష్పోత్కరాస్తః | పినాకిపాదయుగళం వన్ద్యం నాకనివాసినామ్‌ 396

తతస్స్నిగ్ధేక్షితాశ్శాన్తా మునయశ్శూలపాణినా | గిరిశం తే తతో దృష్ట్వా సమ్యక్తుష్టువురాదృతాః 397

మునులు పలికిన ఈ మాట విని వీరకుడాదరమున వారితో ఇట్లనెను : ''విప్రులారా! ఈశుడు మందాకినీ జలమున స్నానమాడి సాయం సంధ్యను ఉపాసించి క్షణకాలములో ఇటకు వచ్చును. అచ్చట మీరు పరమేశుని దర్శింతురుగాని.

ఈమాట విని మునులు వర్షాకాలమున దప్పిగొన్న చాతకములు గంభీర మేఘము వచ్చు సమయము కొరకు వలె శివుడు వచ్చు సమయమునకై ప్రతీక్షించుచు నిలిచిరి. తరువాత క్షణకాలములో శివుని యోగ సమాధానానుష్ఠానము ముగిసెను. మృగ చర్మమున నియమపూర్వకముగ అమర్చుకొనిన వీరాసనమును శివుడు వదలెను. అంతట వీరుకుడు వినయవంతుడై ప్రీతిభావముతో నిండిన మనస్సుతో మోకాళ్ళు వంచి నేలకు అనించి ఇట్లు శివునితో మనవి చేసెను; విభూ! దీపించు తేజస్సుకల సప్తమునులు మిమ్ము దర్శింప ఇటకు వచ్చినార. దర్శనమునకు అనుజ్ఞ ఈయవలెనని ఎరుగ ప్రార్థించుచున్నాను. అనిన మహాత్ముడగు వీరకుని వచనము విని శివుడు కనుబొమ విరుపు సైగతోనే వెంటనే వారికి ప్రవేశమనుమతించెను. వీరకుడును అచటికి దూరమున నిలిచియున్న సప్త మహర్షులును శివుని దర్శనమునకై రావలసినదిగా తన శిరఃకంపనముతోనే పిలిచెను. ఆ పిలుపునందుకొను త్వరలో ఊడిన జుట్టును సగమే ముడివేసుకొని తమ కృష్ణాజినములును వస్త్రములు వ్రేలాడుచుండ విభూతలతో సుద్ధమగు పరమేశుని వేదికను ప్రవేశించిరి. చేదోయి దొన్నెలతో స్వర్గ పుష్పముల రాసుల నీశునిపై వెదజల్లుచు వారు దేవతలకును వంద్యుడు అగు పినాకపాణి పాదపద్ములకు వందనమాచరించిరి. అంతట శూలపాణియు ప్రేమార్ద్రదృష్టులు తమపయి ప్రసరింపజేయ ఆ సప్తర్షులు అదరపూర్వకముగ గిరీశుని చూచుచు ఆదేవుని లెస్సగా నిట్లని స్తుతించిరి.

మనయః అహో కృతార్థా వయమేవ సామ్ప్రతం సురేశ్వరో యత్ప్రకటో భవిష్యతి. 398

జగత్యసౌ ధన్యతమో హిమాచలస్త్వదాశ్రయం యస్య సుతా తపస్యతి |

స దైత్యరాజోపి మహాబలోదయో విమూలితాశేషసరోపి తారకః 399

త్వదీయమంశం ప్రవిలోక్య కల్మషాత్స్వకం శరీరం పరిమోక్ష్యంతే హియః |

స ధన్యధీర్లకపితా చతుర్ముఖ హరిస్చ యత్సమ్భ్రమవహ్నిదీపితః 400

త్వజఙ్గ్రియుగ్మ హృదయేన బిభ్రతో మహాభితాపప్రశ##మైక హేతుకమ్‌ |

త్వమేవ చైకో వివిధాకృతిక్రియః కిలేతి వాచా విధురైర్విభాష్యతే. 401

అథాద్య ఏవం త్వమవైషి నాన్యథా జగత్తదానిర్ఘృణతాం తవ స్పృశేత్‌ |

న వేత్సి వా దుఃఖమిదం భవాత్మకం విహన్యతే తే ఖలు సర్వతః క్రియా. 402

ఉపేక్షసే చేజ్జగతాముపద్రవం దయాయయత్వం తవకేన కథ్యతే|

స్వయోగమాయామహిమాగహాశ్రయం న విద్యతే నిర్మల భూతి గౌరవమ్‌. 403

వయంచ తే ధన్యతరాశ్శరీరిణాం యదీదృశం త్వాం ప్రవిలోకయామాహే |

అదర్శనం తేనుమనోరథో యథా ప్రయాతిసాఫ్లయతయా మనోగతమ్‌. 404

జగద్విధానైకవిధే జగన్ముఖం కరిష్యసేతో వలభిచ్చార వయమ్‌ |

వినేమురేవం మునయో విసృజ్య తాంగిరం గిరీశశ్రుతిభూమిసన్నిధౌ. 405

ఉత్కృష్టకేదార రకతఇవావనీతలే సుబీజముష్టిం సుఫలాయ కర్షకాః |

సూతః తేషాం శ్రుత్వాతు తాం రమ్యాం ప్రక్రమోపక్రమ్రక్రియామ్‌. 406

వాచం వాచస్పతిరివ ప్రోవాచ స్మితసున్దరమ్‌ |

శఙ్కరః : జానే లోకవిధానస్య కన్యాత్కార్యముత్తమమ్‌. 407

జాతా ప్రాలేయశైలస్య సజ్కేతకనిరూపణా | సత్యముత్కణ్ఠితాస్సర్వే దేవకార్యర్థముద్యతాః. 408

తేషాం త్వరన్తి చేతాంసి కింతు కార్యం వివక్షితమ్‌ | లోకయాత్ర7నుగన్తవ్యా విశేషేణ విచక్షణౖః 409

సేవనైతే యతో ధర్మం తత్ప్రామాణ్యాత్పరే స్థితాః |

ఈశ్వరవివాహోద్యమనాయ సప్తర్షీణాం హిమాచలగమనమ్‌.

ఇత్యక్తా మునయో జగ్ముస్త్వరితాస్తుహినాచలమ్‌. 410

తత్రతే పూజితాస్తేన హిమశైలేన సాదరమ్‌ | ఊచుర్మునివరాః ప్రీతాస్స్వల్పవర్ణత్వరాన్వితాః 411

ఇపుడు మీదర్శనముచే మేమే ధన్యులమగుచున్నాము. ఈవిధముగా సురేశ్వరుడునులోకప్రసిద్ధి పడయచున్నాడు. మీయనుగ్రహమను నిర్మల జలముతో తడియగోరి ఒకానొక స్త్రీయును తపమాచరించుచున్నది; తపః ఫలమందుకొననున్నది. ఈ హిమాచలుడును లోకమున ధన్యతముడు; ఏలయన నీ ఆశ్రయము నర్థించి అతని పుత్త్రికయే తపమాచరించుచున్నది. మహాబల సమృద్ధి కలవాడై సమస్తసురులను నిర్మూలించిన తారకాసురుడు గూడ ధన్యుడే; ఏలయన వాడు నీ యంశభూతమగు తత్త్వమును (కుమారస్వామిని) దర్శించి తన పాపములనుండి ముక్తినందబోవుచున్నాడు. ఆ తారకుని వలన కలిగిన భయ సంభ్రములకు వశులై ఆ సంభ్రమాగ్నిచే ఉద్దీపితులయి మహా7భితాప ప్రశాంతి హేతువగు మీ పాదపద్మములను తమ హృదయముల దాల్చి మిమ్మారాధించు బ్రహ్మయు విష్ణువును ధన్యులు; వాస్తవమున నీవొక్కడవే ఐయుండియు వివిధాకృతులతో వివిధ క్రియలనిర్వర్తించుచున్నావు; ఇట్టి నిన్ను సరిగ ఎరుగలేక జనులు వాక్కులను శ్రమపెట్టుకొని వివిధములుగ నిన్ను గూర్చి పలుకుచుందురు. ఒక వేళ అద్యుడవగు నీవు ఈ విధముగా జరుగు లోకోప ద్రవమును ఎరిగియేయున్నావు; అనినచో లోకమప్పుడు నీవు నిర్దయుడవని నిన్ను నిందించవసివచ్చును. ఈ సంసారాత్మక (లోకమందలి ప్రాణుల) దుఃఖమును నీవెరుగకున్నావా? (ఎరుగుదువు;) నీవు చేయుఈ సృష్టిస్థితి క్రియలు అన్ని విధములుగా ( ఈ తారకాదులచే) దెబ్బ తినుచున్నవి: ఇట్టి ఈ జగదుపద్రవమును నీవు చూచుచు ఊరకున్నచో దయామయుడవని నిన్నెవరును ప్రశంసించరు. స్వయోగమాయామహిమలకు గూఢముగా (ఎవరికిని ఎరుగరాక) ఆశ్రయమయియున్న నీ నిర్మలైశ్వర్య గౌరవము నెవ్వరును కొనియాడరు. ఇట్టినిన్ను దర్శింపగలుచున్నందున మేము ప్రాణులన్నిటికంటే ధన్యతరులము; మొదట మేము మాకు మీదర్శనము కాదేమో యనుకొంటిమి; ఇపుడు తమ దర్శనముచే మామనోరథము సఫలమయినది. జగ్సృష్టిస్థితి సంహారకర్తవు జగములకు అదిభూతుడవును అగు నీవు ఎవరు కోరినను కోరకున్నను మేము కోరినంతకంటే అధికములగు కార్యమునే చేయుదువు; ఐనను మేమింద్రుని సందేశమును గొని నీకడకు వచ్చితిమి; అని ఇట్లు మునులు తమ వాక్కులను పరమేశుని శ్రవణ భూమి సమీపమున అర్పణచేసి వంగి నమస్కరించిరి. అది కర్షకులు మంచి పంట పండుటకా మేలగు పంటభూమియందు విత్తనముల నాటినట్లుండెను.

తగిన విధముగ అరంభించి కొనసాగించిన సప్తమహర్షులు రమ్య స్తుతి వచనములు విని పరమేశుడు చక్కని చిరునగవుతో మనోహరవచనములు బృహస్పతివలె ఇట్లు పలికెను. మీరు వచ్చిన పని నేను చేయు లోక విధానము నందలి ఉత్తమ సత్రార్యమునకు అంగమనియు అందులకై ఈ సర్వ సంకేతములనెరుకపరచు దేవి హమశైల పుత్త్రిగా జినించినదనియు నేనెరుగుదును. దేవతలందరును చాల తహతహపాటుతో ఉన్నారనుటయు నిజమే; మీరు దేవకార్యార్థమే పూని వచ్చితిరి. ఆ దేవతల మనస్సులును త్వరపడుచున్నవి. కాని నిర్వహింపదలచిన కార్యము నెరవేరుటకై విచక్షణులగువారు లోక వ్యవహారానుసారముగానే పని చేయవలయును. ఏలయన ఉత్తములగు వారు దర్మ వ్యవస్థ ననుసరించి ధర్మమునందు ప్రవర్తింతురు. ఇతరులు దానిని ప్రమాణముగా గ్రహించి నడుచుకొందురు. అనిన పరమేశుని మాటలు వినుచునే త్వరితముగా సప్తమునులును హిమవంతుని భవనమునకు ఏగిరి. అచట ఆ పర్వతరాజునే సాదర పూజలనందుకొని ప్రీతులయి మునివరులు అల్ప వర్ణము(వచనము) లతో త్వరతో ఇట్లు శైలేంద్రునితో పలికిరి.

మునయః : దేవో దుహితరం సాక్షాత్పినాకీ తవ మార్గతే |

తచ్ఛీఘ్రం పావయాత్మనమాహుత్యేవానలార్పణాత్‌. 412

కార్యమేతచ్చ దేవానాం సుచిరం పరవర్తతే | జగదుద్దరణాయైష విధాతవ్యస్సముద్యమః 413

సూతః ఇత్యుక్తసై#్తస్తదా శైలో హర్షావిష్ణా& వదన్మునీ& | అసమర్థో7భవద్వక్తుముత్తరం ప్రార్థయచ్ఛివమ్‌.

తతో మేనా మునీన్వన్ద్య ప్రోవాచ స్నేహవిక్లబా | దుహితుస్తాన్మునీంశ్చైవ చరణాశ్రయమర్థవిత్‌. 415

మేనా : యదర్థం దుహితుర్జన్మ నేచ్ఛన్త్యపి మహాఫలమ్‌ |

తదేవోపస్థితం సర్వం ప్రక్రమేణౖవ సామ్ప్రత్‌. 416

కులజన్మవయోరూపవిభూత్యృద్ధియతో7పియః |

వరం తస్యాః పితాహూయ సుతా దేయా హ్యయాచతః 417

తత్సఙ్గతా తపోఘోరం కథం పుత్త్రీ ప్రహాస్యతి | పుత్త్రీవాక్యాద్యదత్రాస్తి విధేయం తద్విధీయతామ్‌. 418

ఇత్యుక్తా మునయస్తే తు ప్రియయా హిమభూభృతః | ఊచుః పునరుదారార్థం నారీచిత్తవిశోధకమ్‌. 419

మునయః ఐశ్వర్యమవగచ్ఛస్వ శఙ్గరస్య సురాసురైః | ఆరాధ్యమానపాదాబ్జయుగళత్వాత్సునిర్వృతై ః

తస్యోపయోగి యద్రూపం సైవం యత్ప్రాప్తయే చిరమ్‌ | గోరం తపస్యే కన్యా తేనరూపేణ నిర్వృతి ః

యస్తద్వ్రతాని దివ్యాని నయిష్యతి సమాపనమ్‌ | తత్ర సా7వహితా తావత్తస్మాత్సైవ భవిష్యతి. 422

ఇత్యుక్తా గిరిణా సార్ధం తే యయుర్యత్ర శైలజా | జితార్కజ్వసలనాకారా తపస్తేజోమయయీ హ్యుమా. 423

హిమాలయా! సాక్షాత్‌ పినాకధారి నీ కొమరితను పత్నిగా కోరుచున్నాడు; కావున ఆహుతిని అగ్నియందర్పంచి నట్లు ఆమె నతని యందర్పించి నిన్ను నీవు పవిత్రునిగా జేసికొనుము; ఇందు చాలకాలముగా ఏర్పడిన దేవకార్యమును ఇమిడియున్నది; కావున జగదుద్ధణార్థమయి నీవు పూనిక నెరవేర్చవలయును. అనిన మునులమాట విని పర్వతరాజు హర్షావిష్టుడై వారితో ఏదో చెప్పనారంభించెను. కాని మాటాడజాలకపోయెను. కేవలము శివుని ప్రార్థించి ఊరకుండెను. అంతట మేనాదేవి పుత్త్రీ ప్రీతిపారవశ్యముతో మునుల నమస్కరించి బగవానుడగు ఈశ్వరుని పాదములను ఆశ్రయించిన అర్థవంతమగు వాక్యమిట్లు పలికెను! కూతురు పుట్టి ఉబయవంశములవారిని తరింపజేయును గావున ఆమె జన్మము మహాఫలప్రదమే; ఐనను ఆమె తల్లిదండ్రులను విడిచిపోవునను భయముచో కూతురు పుట్టవలెనని కోరరు; క్రమ పరిణామముగా ఇపుడదియే తటస్థించినది; కులజన్మ వయోరూపైశ్వర్య సమృద్ధి కల వరుడు లభించినచో అతడు కోరకున్నను కన్న తల్లిదండ్రూలాతని కామె నీయవలయును. ఆ శివుని యందే అసక్తురాలయిన మా పుత్త్రితన్నాయన కీయనిచో ఆ ఘోర తపమెట్ల విడుచును? కనుకఆమె మాటననుసరించి ఈ విషయములో ఏమి చేయదగునో ఆ పని చేయుడు; అని పలికిన హిమవత్సతియగు మేనా వచనములు విని మునులు ఆమె మనస్సు పరీక్షింపగోరి ఉదారార్థవంతమగు మాట ఇట్లు వచించిరి. దేవతలు ఆ మహాదేవునిపాదాబ్జ ద్వంద్వమును అరాధించి మిగుల సుఖమందుచున్నారనిన ఆ శంకరుని ఐశ్వర్యమెట్టిదో ఎరుగుము; ఆ శివునకు ఉపయోగించి ప్రీతి కలిగించు రూపము పొందగోరి నీ పుత్త్రి ఘోర తపమాచరించుచున్నది; ఆమెకా రూపముతో శివప్రాప్తి యను మహానందము లభించును. ఏ శంకరుడు ఆమె ఇంతవరకాచరించుచుండిన వ్రతములను ముగింపజేయునో అనియందే ఆమె అవధానము నిలిపి యున్నది; అట్టి ఆమె ఇపుడతని ఇల్లాలగును. అని ఇచ్లు పలికి ఆ సప్తమునులు హమవంతుని కూడ-రవి వహ్నితేజముల మించిన తేజము కలదియు తపస్తేజోమయ రూపయనగు పార్వతి తపమాచరించుటచో కేగిరి.

ప్రోచుస్తాం మునయస్స్నిగ్ధం సన్మాన్యపథమాగతమ్‌ |

రమ్యం ప్రియం మనోహారి మా రూపం తపసా దహ. 424

ప్రాతస్తే శఙ్గర పాణివ్షు పుత్త్రి గ్రహిష్యతి | వయమర్థితవన్తస్తే పితరం సర్వ ఆగతాః 425

పిత్రా సహ గృహం గచ్ఛవయం యామస్స్వమన్దిరమ్‌ | ఇత్యుక్తా తపసస్సత్యం ఫలమస్థీతి చిన్త్య సా.

త్వరమణా య¸° వేశ్మ పితుర్వివ్యార్థశోబితమ్‌ | సా తత్ర రజనీం మేనే వర్షాయుతసమాం సతీ 427

వదరదర్శనసఞ్జాతమహోత్కణ్ఠా సమాద్రిజా |

పార్వతీవివాహార్థ హిమవద్గిరౌ గృహాలఙ్కరణాదినిర్మాణమ్‌.

తతో ముహూర్తే బ్రహ్మేతు* తస్యాశ్చక్రుస్సుహృత్ప్రియాః. 428

నానామఙ్గళసన్దోహం యథావత్క్రమపూర్వకమ్‌ | దివ్యమణ్డనమఙ్గౌనాం మన్దిరే బహుమఙ్గళే. 429

ఉపాసతక గిరం మూర్తా ఋతవస్సార్వకామికాః | వాయవో వారిదాశ్చసన్త్సంమార్జనవిధై గిరేః 430

హర్మేషు శ్రీస్స్వయం దేవీ కృతనానార్థసాధనా | కాన్తిస్సర్వేషు బావేషు బుద్ధిశ్చాభవదాకులా. 431

చిన్తామణి ప్రభృతయో రత్నాశ్శైలం సమన్తః | ఉపతస్థుర్నగాశ్చవ కల్పకాశ్చ మహాద్రమాః 432

ఓషధ్యోమూర్తిమత్యశ్చ దివ్యౌషధిసమన్వితాః | రసాశ్చ ధాతవశ్ఛై సర్వే శై లస్య కిఙ్కరాః 433

కిఙ్కరాస్తస్య శైలస్య వ్యగ్రాశ్చాజ్ఞానువర్తినః | నద్యస్సముద్రా నిఖిలాస్థ్సావరం జఙ్గమంచ యత్‌. 434

తత్సర్వం హిమశైలస్య మహిమానమవర్ధయత్‌ |

మునులు ఆ పార్వతితో ప్రీతి పూర్వకముగా ఇట్లనిరి: సర్వజనాదరణీయమును రమ్యమును మనోహరమును ప్రీతికరమునునగు నీరూపమును తపోగ్నితో దహించుకొనుకుము. పుత్త్రీ! రేపటి ఉదయమే శంకరుడు నీపాణిని గ్రహించును. మేమందరమును వచ్చి ఈ విషయమును మీతండ్రిని అర్థించితిమి. నీవు నీతండ్రితో స్వగృహమేగుము; మేమును మా ఇండ్లకేగుదుము; ఇట్లు పలికిన సప్తర్షులు మాట వినిపార్వతి తపమునకు ఫలము కలుగుననుట సత్యమయ్యెనని సంతసముతో దివ్య పదార్థ శోభితము అగు పితృ భవనమునకు త్వరితముగా ఏగెను. అచట ఆ హైమవతికి వరునెప్పుడు చూచునాయను తహతహతో ఆ రాత్రి పదివేల యెండ్లుగా తోచెను. తరువాత బ్రహ్మ ముహూర్తమున ఆమె ప్రియసఖులు యథా సంప్రదాయముగ క్రమముతో సకల మంగళాలంకార సముదాయములతో ఆమెనలంకరించిరి. బహు మంగలభరితమగు మందిరమున ఆమెకు ఆయా యవయవులందు అనేకాభరణములలంకరించబడెను. ఆరు ఋతువులును మూర్తీభవించి సర్వకామముల పూరించుచు హిమవంతుని సేవించెను. వాయువులు కసవూడ్చెను; మేఘములు నీరు చల్లెను. లక్ష్మీదేవి అతని హర్మ్యములందు నానా పదార్థ సాధనములు అమర్చెను; సర్వ పదార్థములందును సర్వ భావములందును కాంతియు సమృద్ధియు వ్యాపించెను. చింతామణి మొదలగు రత్నములను పర్వతములును కల్పవృక్షాది మాహ వక్షములును వచ్చి హిమవంతుని కొలిచెను. ఓషధులు దివ్యౌషధములతో రసములతో ధాతువులతో కూడి మూర్తీభవించి హిమశైలమునకు కింకరులయ్యెను. అతని కింకరులును ఆశైలుని ఆజ్ఞానువర్తులై వ్యగ్రతతో పనులు చేయుచుండిరి. నదులును సముద్రములు సకల స్థిరచర ప్రాణి పదార్థ సముదాయమును హిమవంతుని మహత్త్వమును మరింత వృద్ధి పరచెను.

గన్దమాదనపర్వతే వివాహార్థమీశ్వరాలఙ్కరణమ్‌.

అభవన్మునయో నాగా యక్షగన్దర్వకిన్నరాః 435

శఙ్కరస్యాపి విబుధా గన్దమాదనపర్వతే| సర్వే మణ్డనసమ్భారాస్తస్థిర్నిర్మలమూర్తయుః 436

శర్వస్యాపి జటజూటచే చన్ద్రఖణ్డం పితామహాః | బబన్ధప్రణయోదార్‌ తత్ర స్ఫారితలోచనః 437

కపాలమాలాం విపులం చాముణ్డా మూర్ద్న్యబన్ధత | ఉవాచ చాపి గిరిశం పుత్త్రం జనయ శఙ్కర. 438

యోదైత్యేన్ద్రకులం హత్వా మాం రక్తైస్తర్పయిష్యతి | సౌరిర్జ్వలచ్ఛిరోరత్నముకుటం చానలోల్బణమ్‌. 439

భుజగాభరణం గృహ్య సజ్జం శమ్భోః పురో7భవత్‌ | శక్రో గుజాజినం తస్య వసాభ్యక్తాగ్రపల్లవమ్‌. 440

దధ్రే సరభసం స్విద్యద్విస్తిముఖపఙ్కజమ్‌ | వాయుశ్చ విపులం తీక్‌ష్ణశృఙ్కం హిమగిరిప్రభమ్‌. 441

వృషం విభూషయామాస హరయానం మనోహరమ్‌ | వితేనుర్నయనాన్తస్థాశ్శమ్భోస్సూర్యానలేన్దవః 442

స్వా ద్యుతిం లోకనాధస్య సగతిః కర్మసాక్షిణః | చితాభస్మ సమాదాయ కపాలే రజతప్రభమ్‌. 443

మనుజాస్థిమయీం మలామాబబన్ద చ పాణినా | ప్రేతాధిపః పురో దూరే సగదస్సమవర్తత. 444

నానాకారమహార్తనభూషణం ధనదాహృతమ్‌ | విహాయోదగ్రసర్పేన్ద్రకటకేన స్వపాణినా. 445

కర్ణోత్తంసం చకారేశో వాసుకిం తక్షకం స్వయమ్‌ | జలాధీశాహృతాం స్థాణుః ప్రసూనావేష్టితాం స్రజమ్‌.

తతస్తు తే గణాధీశా వినయాత్తత్ర వీరకమ్‌ | ప్రోచుర్వ్యగ్రాకృతే త్వన్నో సమావేదయ శూలినే. 447

నిష్పన్నాభరణం దేవం ప్రసాధ్యేశం ప్రసాధనైః సప్తవారిధయ స్తుస్థుః కర్తుం దర్పణవిభ్రమమ్‌. 448

ఇట్లు వివాహార్థము పార్వతి కలంకరణము జరుగుచుండ ఆట గంధమాదన పర్వతమున దేవతలందురును శంకరునలంకరింపదలచి నిర్మలమూర్తులై సకలములగు అలంకరణ సంభారముల ధరించి నిలిచిరి. వారిలో హ్రహ్మ విప్పారిన కన్నులతో శర్వుని జటాజూటమున ప్రేమోదార భావమున చంద్ర ఖండమును అమర్చెను. చాముండ (మాతృదేవత) శివశిరమున విపులమగు కపాలమాలను కట్టెను. దైత్యేంద్రకుల హంతయై రక్తముతో మాకు తృప్తి కలిగించు పుత్త్రుని కనుము శంకరా! యని ఆమె శంకరుని దీవించెను. యముడు ప్రకాశించు శిరోరత్నముల కలదై అగ్నివలె స్ఫుటముగ ప్రకాశించి సర్పాభరణమునుచేత ధరించి శంకరుని ముందు నిలిచెను. (( వానితో శివునలంకరించెను) ఇంద్రుడును చెమర్చుచున్న విశాల ముఖపద్ముడై వసపూత కల కొనలుగల గజ చర్మమును ఉత్సాహముతో శివునిచే ధరింపజేసెను. వాయువు శివునికై వహానముగా విశాలమయి వాడి కొమ్ములు కలిగి హిమగిరివలె తెల్లని కాంతి కలదైన మహోహర వృషభమును అలంకరించెను. సూర్య చంద్రాగ్నులు శంభుని నేత్రాంతరాళమున నిలిచి జగత్కర్మసాక్షియగు ఆ దేవుని శరీరమున తమ కాంతిన విస్తరింపజేసిరి. యుముడు కపాలమునందు వెండివలె మెరయు చితా భస్మమును తీసికొని తన చేతితో ఆ దేవుని కంఠమున మనుజాస్థిమయ మాలను కట్టి తనచేత గద ధరించి శివుని ఎదుటిభాగమున దూరముగా నిలువబడెను. కుబేరుడు స్వయముగా తెచ్చిన నానాకార మహారత్న భూషణమును వదలి ఈశుడు భయంకర సర్పేంద్రములు కడియముగానున్న తన చేతితో వాసుకిని తక్షుకుని తన చెవికి అభరణములుగా తానే ధరించెను. స్థాణు (శివ) దేపవుడు వరుణుడు తెచ్చినదై పూవులతో కూర్చిన మాలను కూడ ధరించుకొనెను. అంతట ప్రమథ గణాధీశులు వీరకునితో ( ఆపేరుగల ద్వారపాలునితో) ఆయా పనులయందు వ్యగ్రమగు ఆకృతిగల వీరకా! నీవు శూలికి మారాక నివేదింపుము అని వినయమున పలికిరి. సప్త సముద్రములును ఆయా అభరణములు సమకూర్చబడిన ఈశుని లెస్సగా అలంకరించి అద్దపు విలాసమును సమకూర్ప వేచియుండెను.

తతోవిలోకితాత్మానం మహామ్భుధిజలోదరే | ధరామాలిఙ్గ్య జానుభ్యం స్థాణుం ప్రోవాచ కేశవః 449

శోభ##సే దేవ రూపేణ జగదానన్దదాయినా | మాతరః పై#్రరయన్‌ కామవధూం వైధవ్యచిహ్నతామ్‌. 450

కాలో7యమితి చాలక్ష్య ప్రకారేఙ్గితసంజ్ఞయా | తతస్తాశ్చోదితా దేవమూచుః ప్రహసితాననాః 451

రతిః పురస్తవ ప్రాప్త నాభాతి మదనోజ్ఘితా | తతస్తాం సన్నివార్యాహ వామహస్తాగ్రసంజ్ఞయా. 452

ప్రయాణ గిరిజావక్త్రదర్శనోత్సుకమానసః |

స్వవివాహార్థమీశ్వరస్య బ్రహ్మవిష్ణ్వాది దైవత్తెస్సహ హిమాచలగమనమ్‌.

తతో హరో హిమగిరికన్దరాకృతిం సమున్నతం మృదగతిభిస్సచోదయ &153

మహావృషం గణతుములాహితేక్షణం సభూధరానశనిరివ ప్రకమ్పయ& |

తతో హరిర్ద్రుతపదపద్దతిః పురస్సరశ్శ్రమాద్ద్రుమనికరేషు విశ్రమ& 454

ధరారజశ్శబలితభూషణో7బ్రవీత్ప్రయాత మా కురత పథో7స్య సఙ్కటమ్‌|

ప్రభోఃపునః ప్రథమనియోగమూర్జయన్త్సుతో 7బ్రవీద్భ్రుకుటిముఖో7పి 455

వియచ్చారా వియతి కిమస్తికాన్తకం ప్రయాత నో ధరణిధరా విదూరతః |

మహార్ణవాః కురుత శిలోపమం పయస్సురద్విషాం గమనమహాసుకర్దమమ్‌. 456

గణశ్వరాశ్చపలతయా నగమ్యతాంసురేశ్వరైస్థ్సిరమతిభిశ్చ గమ్యతామ్‌ |

న భృఙ్గిణా స్వతనుమవేక్ష్య నీయతే పినాకినః పృథుముఖమణ్డలాగ్రతః 457

వృథా యమ ప్రకటితదన్తకోటరం త్వమాయుధం వహిసివిహాయసంభ్రమమ్‌|

పదానయ ద్రథతురగైః పురద్విషం ప్రముచ్యతే బహుతరమాతృసజ్కులమ్‌. 458

అమీ సురాః పృథగనుయాయిభిర్వృతాః పదాతోయ ద్విగుణపథా& హరప్రియాః |

స్వవాహనైః పవనవిధూతచామరైశ్చలధ్వజైర్వ్రజత విహారశాలిభిః 459

సురాస్స్వకం కిమితి నరాగమూర్జితం విచార్యతే నియతలయత్రయానుగమ్‌ |

ఈశుడు సముద్రజలములందు తన రూపు( అద్దమునందువలె) చూచికొనిన తరువాత హరి తన మోకాళ్ళు భూమిని తాకునట్లు వంచి అతనితో : ''దేవా! జగదానందదాయియగు రూపముతో ప్రకాశించుచున్నావు'' నెను. ఇదే సమయమని మాతృకలును వైధవ్య లక్షణములతో ఉన్న మన్మథ పత్నియగు రతిని ఆయా ప్రకారముల ఇంగిత నంజ్ఞలతో ప్రేరించిరి. తరువాత రతి తమ్మువేడుకొనగా వారు నవ్వు మొగములతో శివునుద్దేశించి ''దేవా! మదనుడు లేక రతి తమ ఎదుట కాంతిహీనయైయున్నది'' అనిరి. అప్పటికే పార్వతీ ముఖ దర్శనోత్సుక మానసుడైయున్న శివుడు ప్రయాణోన్ముఖుడై ఆమెను కొంచెము వేచియుండుమని తెలుపుడని ఎడమచేతి వ్రేళ్ళ సైగతోనే మాతృకలకు తెలిపెను.

శివుడు వివాహమునకై తరలి పోవుట

అనంతరము శివుడు హిమగిరి కందరమువలె తెల్లనగు మహావృషభమును మెత్తని కొరడా దెబ్బలతో తోలుచు సాగిపోవు చుండెను. అదియును సమ్మర్దముగా గుమియైయున్న ప్రమథలపై కన్నులు ప్రసరింప జేయుచు వజ్రము కొండలనువలె వారిని భయపెట్టుచు వణకించుచు సాగుచుండెను. అంతట హరియు త్వరతో అడుగులు వేయుచు ముందుగ పోవుచు శ్రమయైనపుడు చెట్ల నీడలందు మిశ్రమించుచు త్రోవలని ధరాధూళితో తనయాభరణములు వింతరంగులు కలవియగుచుండ పోవుచు ''ముందుకు నడచుచుండుడు; నిలువబడి ఈశుని త్రోవకు ఇబ్బంది కలిగించవలదు,'' అని జనులను హెచ్చరించుచుండెను. ప్రభువు మొదటనే తనకిచ్చిన యాజ్ను మన్నించుచు వీరకుడును కనుబొమలు ముడివేసి దేవతలారా! అకాశములో ఏమివింత చూచుచున్నారు? పర్వతములారా! మాకు దూరముగాపొండు; మహా సముద్రములారా! మహాసురసంచారమున బురదగానైన మీ జలమును శిలవలెగట్టి పరచుకొనుడు; గణాధిపతులారా! చంచలగతితో పోవలదు. దేవతలతోకలిసి స్థిరగతితో నడుపుడు. ఓ భృంగీ! నీవు నీ యొడలివంక చూచుకొనుచు అడ్డదిడ్డముగా పోవుచున్నావే కాని శివుడు తన విశాలముఖమండలాగ్రమును (చూపును) ప్రసరింపచేసిన త్రోవవెంట ఆయనను వహించకొని పోవటలేదు యమా; నీవు నీ దంతముల నడుమ సందులు బయల్పడ నోరుతెరచుకొని ఏ సంభ్రమము లేక ఊరకధండాయుధమును మోసికొని పోవుచున్నావు ( ఎచ్చరికగా లేవు; ) ఏలయన-త్రోవయంతయు రథముల గుర్రములను మాతృకలునుతమ తమ అనుచరులు తమవెంటరాగా కాలినడకతో నడుచుచున్న దేవతలును తమకువలసిన దానికి రెండింతల త్రోవనాక్రమించి శివునకు త్రోవవిడుచటలేదు. దేవతలారా! గాలికి చామరములు కదలియాడుచుండు ధ్వజములుచలించుచుండ ఠీవితో తమ తమ వాహనములారోహించినడువుడు; మీరు మూడు విధములగులయలతో మీరు మీరు సాధనచేసిన చేసిన రాగములను పాడరేల?

న కిన్నరైరభిభవితుం హి శక్యతే విభూషణప్రచయసముద్భవో ధ్వనిః 460

స్వజాతికాః కిమితి న షడ్జమధ్యమైః పృథుస్వరం బహుతరమత్ర వక్ష్యతే |

నతానతానతనతదేహతాఙ్గతాః పృథక్తయా సమయకృతావిభిన్నతామ్‌. 461

విశఙ్కితా భవదతిభేదశీలినః ప్రయాన్త్యమీ ద్రుతపదమేవ గౌడకాః |

విసంహతాః కిమితి నషాడ్గవాదయస్స్వగీతకైర్లలితపదప్రయోగజైః 462

ప్రభోః పురో భవతి హి యస్య చాక్షతం సముద్గతార్థకమితి తత్ప్రతీయతే |

అమీ పృథగ్విరచిత రమ్యరాసకం విలాసినో బహుగమకస్వభావకమ్‌. 463

ప్రయుఞ్జతే గిరిశ యశోవిసారిణం ప్రకీర్ణకం బహూతరరాగజాతయః |

అమీ కథం కకుభి కథాః ప్రతిక్షణం ధ్వనన్తి తే వివిధవధూవిమిశ్రితాః 464

న జాతయో ధ్వనిమురజాస్సమీరితా న మూర్ఛితాః కిమితచ మూర్ఛనాత్మికాః |

శ్రుతిప్రియక్రమగతిభేదసాధనం తతాదికం కిమితి న తుమ్బురేరితమ్‌. 465

న హన్యతే బహువిధవాద్యడమ్బరం ప్రకీర్ణవీణామురజాదినామ యత్‌ |

ఇతీరితే గిరిమవధానశాలినస్సురాస్సురాస్సపది తు వీరకాజ్ఞయా. 466

నియామితాః ప్రయయురతీవ హర్షితాశ్చరాచరం జగదఖిలం హ్యపూరయ& |

ఇతిస్తనత్కకుభి రసన్మహోర్ణవే స్తనద్ఘనే విదళితశైలకన్దరే. 467

జగత్యభూత్తుముల ఇవాకులీకృతః పినాకినా త్వరితగతేన భూధరః |

పరిజ్వలత్కనకసహస్రతోరణం క్వచిన్మిళన్మరకతవేశ్మవేదికమ్‌. 468

క్వచిత్క్వచిద్విమలవై డూర్యభూమికం క్వచిద్గళజ్జలధరమ్యనిర్ఘరమ్‌

చలధ్వజప్రవరసహస్రమణ్డితం సురద్రుమస్తబకవికీర్ణచత్వరమ్‌ 469

సితాసితారుణరుచిధాతువర్ణకం శ్రియోజ్జ్వలం ప్రవితతమార్గగోపురమ్‌|

విజృమ్భితాప్రతిమసధూమవారిదం సుగన్దిభిః పురపవనైర్మనోహరమ్‌. 470

కిన్నరులు తమ విభూషణముల రాపిడివలన కలుగు ధ్వనిని మరుగు పరచునంత గొంతెత్తి పాడలేకున్నారే! స్వజాతిజా( లగుప్రమథు) లారా! మీరును షడ్జ మధ్యమ స్వరములతో బిగ్గరగా బహుతరముగా పాడరేల? (కళావేత్తలగు) గౌడకులారా! మిగుల వంగి వంగిపోవు శరీరములతో మీరందరును మీ కళలకు సంబంధించిన వ్యవస్థను విడిచి ఎవరికివారై విడిపోయి భయపడుచు త్వరతో అడుగులు వేయుచు అట్లు పోవుచున్న రేల? షాడ్గవాది కళాభిజ్ఞులు కూడ అట్లు వేరువేరుగా విడి పడిపోయెదరేల? లలిత పదప్రయోగములతో సంపన్నములయిన మీమీ గీతకములతో ప్రభువునకు ఎదుట అతి స్పష్టార్థమగు అక్షత (ఏకొరతయులేని) సంగీతమును స్ఫుటముగా పాడరేల? ఈనాగజాతులవారును ఒక గుమిగానుండక ఎవరియంతట వారయి విడివడి రమ్యమగు రాసక నృత్తమును బహుగమక స్వభావవంతముగా అభినయించుచు పరమ శివుని యశమును వ్యాపింప జేయుచు ప్రకీర్ణక విధానమున అభినయించుచున్నారేల? ఈ వివిధ జాతులకు చెందిన దేవ యువతులును ఒక అమరికలో నుండక ఆయాదిక్కులందెచ్చట నెచ్చటనోచేరి పరస్పర మిశ్రితలయి ప్రతిక్షణమందును ఏవేవో మాటలో పాటలో పలుకుచు ధ్వనిచేయుదురేల? చక్కని ధ్వనులుగల మృదంగ వాద్యధ్వనులు వినవచ్చుటలేదు. సంగీత శాస్త్రీయ మార్ఛనా ప్రధానములగు మూర్ఛిత గీతికలు వినబడవు; ఇదియేమి? శ్రవణ ప్రీతికరమగు క్రమగతిగల సంగీత భేదములతో వివిధ సాధనములతో కూడినవియు తుంబురునిచే చెప్పబడినవియునగు వీణా మృదంగాది వాద్య విశేషములు చక్కగా మ్రోయింపబడవేల? ఇట్లు పలుకు వీరకుని వచనములవధరించి సురాసురుల నియమబద్ధులయి మిగుల హర్షముతో చరాచర జగమంతయు తామే నిండి ముందునకు సాగిపోవు చుండిరి.

ఇట్లు దిశలు ఉరుముచున్నట్లు ధ్వనించుచుండ మహార్ణవములు మ్రోగుచుండ మేఘములురుముచుండ గిరికందరములు పగులుచుండ జగమంతయు తుములమగుచుండ త్వరిత గమనమున తన నగరికి తరలి వచ్చుచున్న శివునిచే హిమ వంతుడు కలతనందెను.

ఆ హిమాలయ మహాగిరినగరమునందొకచోట మిగుల ప్రకాశించు వేలకొలది బంగారు తోరణములుండెను. ఒక దానికి మరియొకటి చేరువలో మరకత మణివేదికలుండెను. ఒకచోట వైడూర్యపు భూమికలుండెను. ఒకచోట జలజలపారు. అందమగు సెలయేళ్ళుండెను. ఆ నగరమందంతటను వేలకొలది పతాకలు కదలియాడుచు అలంకారమయి జలపారు అందమగు సెలయేళ్లుండెను. ఆ నగరమందంతటయు వేలకొలది పతాకలు కదలియాడుచు అలంకారమయి యుండెను. ఇండ్లముంగిళ్లయందు కల్పవృక్షముల పూలు చల్లబడి యుండెను. తెల్లని ఎర్రని నల్లనిగైరిక ధాతువులు వ్యాపించి యుండెను. త్రోవపొడవున భవన గోపురములు కనబడుచు శోభించుచుండెను. సుగంధ దూపపు పొగలతో నిరుపమానములగు మేఘములానగరపు ఆకాశమున క్రమ్మియుండెను. అంతట నా మనోహరవాయువులు వీచుచుండెను.

పుర ప్రవేశసమయే ఈశ్వరాదికమాలోక్య పౌరనారీణా మన్యోన్యసం ల్లావః.

హరోమహాగిరినగరం సమానదత్షణాదివ ప్రవరసురాసురస్తుతః |

తం ప్రవిశన్తమగాత్పృవిలోక్య వ్యాకులతాం నగరం గిరిభర్తుః. 471

హర్మ్యగవాక్షగతామరనారీలోచనీలసరోరుహమాలమ్‌. 472

సుప్రకటా సమదృశ్యత కాచిత్స్వాభరణాంశువితానవి గూఢా |

కా వ్యఖిలీకృతమణ్డనభూషా త్యక్తసఖీప్రణయా హరమైక్షత్‌. 473

కాచిదువాచవిలంబితమాలా కాతరతాం కసరఖిమాకురు మూడే |

దగ్ధమనోభవ ఏవ పినాకీ కామయతే రస్వయమేవ విహర్తుమ్‌. 474

కాచిదపి స్వయమేవ కపతన్తీ ప్రాహ వరాం విరహస్ఖలితాజ్గీమ్‌ |

మాచవలే మరనవ్యతిషజ్గం శజ్కరంజం స్ఖలనేన వద త్వమ్‌. 475

కాపి కృతవ్యవధానమదృష్టా యుక్తివశాద్గిరిశో హ్యయమూచే |

ఏషన మత్ర కసహస్రమఖాద్యా నాకనదామధిపాస్వ్యయముక్తైః. 476

నామభిరిన్దుజటం నిజసేవా ప్రాప్తిఫలాయ నతాస్తు ఘటన్తే |

ఏషన చైష న ఏష యదగ్రే ఘర్మవరీతతను శ్శశిమౌళీ. 477

ధావతి వజ్రధరో మరరాజో మార్గమయుం వివృతీకరణాయ |

ఏష స పద్మభవో యము పేత్య ప్రాంశుజటామృగచర్మనిగూఢః.478

నప్రణయఙ్కరఘట్టిత వక్తృః కిఞ్కిదువాచ మితం శ్రుతిమూలే |

ఏవమభూత్సురనారికులానాం చిత్తవిసంస్థులతా గురురాగాత్‌. 479

శఙ్కరసంశ్రయణాద్గిరిజాయా జన్మఫలం పరమస్త్వితి చోచుః | తతో హిమగిరేర్వేశ్మ విశ్వకర్మనివేదితమ్‌.

మహానీలయమస్తమ్భం జ్వలత్కాఞ్కనకుట్టిమమ్‌ | ముక్తాజాలపరిస్కారం నకజ్వలితౌషధిధీపితమ్‌. 481

క్రీడోద్యానసహసన్రాడ్యం కాఞ్చనాద్ధరీర్ఘికమ్‌ | మహేన్దృప్రముఖాస్సర్వే సురా దృష్ట్వా తదద్భుతమ్‌. 482

నేత్రాణి సఫలాన్యద్య మనోభిరితి తే దధుః | విమర్దకీర్ణకేయూరా హరిణా ద్వారి రోధితాః. 483

కథంచిదిన్దృప్రముఖావివిశుర్నాకవాసినః |

ఇట్లు సరాసరురుల స్తులందుకొనుచు పరమేశ్వరుడు ఒకక్షణకాలములో ఇట్టి హిమవన్మహా నగరము చేరెను.

ఈశ్వరుని పురప్రవేశము- నగరనారీ సంల్లాపము.

ఈశ్వరుడిట్లు తరలివచ్చి పురప్రవేశము సేయుచుండ హిమవన్నగరము సంభ్రమమున కలత నొందు మత్తైదువలతో తడబడు యాన సాధనములతో గందరగోళపడుచు త్రోవల పరుగెత్తు జనులు కల విశాల రాజు మార్గములతో రచ్చపట్టులతో నిండి ఆకులమయ్యేను. హర్మ్యముల గవాక్షముల కడకు వచ్చిన ఆమరస్త్రీల నేత్రక పంక్తులు నల్లకలువల మాలై కనువట్టుచుండెను. వారిలో ఒకతె తన ఆభరణ కాంతికిరణములందే మరుగుపడియు మిగుల ప్రకటయై కనబడెను. ఒకతె తన ఆభరణాంలంకరణము ముగియకయే తన చెలిపై ప్రీతిని కూడ విడిచి ఆయోను వదలి తానొక్కతెయే హరుని చూడవచ్చెను. ఒకతే ఇంకొకతెతో ''తెలివి తక్కవదానా! వేగిరిపాటుతో మాలనట్లే వ్రేలాడనిచ్చుకొనుచు రాకుము?'' అనెను. ఒకతె తాను శివుని చూడవలెనను త్వరతో పడుచుపోవుచునే శివ విరహముతో తడబడు శరీరముకల ఇంకొకతెతో '' ఈ పినాకి మన్మథునే దహించినవాడు, ఇతనికి స్త్రీలతో పొందు అక్కరలేదు. తానొక్కడే విహరింపగోరువాడితడు.'' అనెను. ఒకతెకు శివుడు కనబడనందున ఇంకొకతెతో యుక్తిగా ''చపలురాలా ! శివుని విషయములో మన్మథునితో సంబంధము కల మాటలేవియు పలుకకుము.'' అనెను. (ఆ మాటవిని శివుడిటు మొగము త్రిప్పినపుడాతని చూడవచ్చనని ఆమె ఆశ.) ఇంద్రాది దేవనాయకులును తామై పలుకు నామములతో స్తుతించి నమస్కరించుచు సేవాఫలమాశించి పూజించున దీతనినే అని ఒకతె పలికెను. 'ఈ చర్మ వస్త్రధారియే శివుడు'. అని ఒకతె పలికెను. ఏవని యముందు ఇంద్రుడ వజ్రఝధారియై చెమర్చుచు పరుగెత్తుచు త్రోవ విశాలము చేయుచున్నాడో అతడే సుమా శివుడు!' అనిమరియొకతె అనెను. పొడవు జడలు దాల్చి మృగ చర్మము ఒడలిపై కప్పుకొనియున్న ఎవనికడకు పొయి బ్రహ్మ ప్రేమపూర్వకముగా చెవి మొదట ఉంచిన తన నోటిని తన చేతితో మూసికొని మెల్లగా ఎదియో చెప్పు చున్నాడో అతడే శివుడు. అని ఒకతె పలికెను. ఇట్లు దేవస్త్రీలు శివుని చూచి తమలో తాము అనురాగ పారవశ్యమున పలుకుచు చిత్తము కలవరపడుచుండ ఇట్టి పరమేశుని ఆశ్రయింపగోరు గిరిపుత్త్రి జన్మము సఫలమునుచుండిరి.

అంతట విశ్వకర్మ నివేదించగా మహేంద్రాది దేవతలెల్లరును మహానీలమణియమ స్తంభములు ప్రజ్వలించు బంగారు గచ్చు నేలలు ముత్తెపుజాలర అలంకరణములు మహోషదీ లతాదీవ ప్రకాశము వేలకొలది క్రీడోద్యానములు బంగారు చుట్టుకట్టులు గల దిగుడు బావులు కల అద్భుతమగు హిమవన్నగరమును చూచి తమ నయనములు సఫలము సమ్మర్ధములో భుజకీర్తులు మొదలగు ఆభరణములు చెదరుచుండ దేవతలు లోపల ప్రవేశించిరి.

పార్వతీపరమేశ్వరయోర్వివాహమహోత్సవః.

ప్రణతేనాచలేన్ద్రేణ పూజితో థ చతుర్ముఖః. 484

చకార విధినా సర్వం విధిమన్త్రపురస్సరమ్‌ | శర్వస్య పాణిగ్రహమగ్నిసాక్షిపురస్కృతమ్‌.485

దాతా మహీభృతాం నాదో హోతా దేవశ్చతుర్ముఖః | వరః పశుపతి స్సాక్షాత్కన్యా విశ్వరణిస్తథా. 486

చరాచరాణి భూతాని సరాసురవరాణిచ | తత్రాప్యేతా నియమతో హ్యభవన్వ్యగ్రమూర్తయః. 487

ముయోచాబిజనాన్తృస్యశాలిరసౌషదా&| వ్యగ్రాతు పృధివీ సర్వా సర్వభావమనోరమా.

గృహీత్వా వరుణసన్సాక్షాద్రత్నా న్యాభరణాని చ | పుణ్యానితు విచిత్రాణి నానారత్నమయాని చ.489

తస్థౌ స్వాభరణో దేవో హర్షదస్సర్వదేహినామ్‌| ధనదశ్చాపి దివ్యాని హైమాన్నయాభరణాని చ. 490

జాతరూపవిచిత్రాణి ప్రయతస్సముపస్థితః | వాయుర్వవౌ చ సురభిస్సుఖసంస్పర్శనో విభుః. 491

ఛత్త్రమిన్దుకరోద్గారహాసితం చ శతక్రతుః | జగ్రాహ ముతస్స్రగ్వీ బాహుభిర్యహుభూషణౖః. 492

జగుర్గన్దర్వముశ్యాశ్చ ననృతుశ్చాప్సరాగణాః | వాదయన్నోతిమధురం జగుర్గన్ధర్వకిన్నరాః. 493

మ.పు.85)

మూర్తాశ్చఋతవస్తత్ర జగుశ్చశ ననృతుశ్చవై | చవలాశ్చ గణాస్తస్థుర్లోలయన్తో హిమాలయమ్‌. 494

ఉత్తిష్ఠన్క్రమశశ్చాత్ర విశ్వకృద్భగనేత్రహా | చకారౌద్వాహికం కృత్యం పత్న్యా సహ యథౌచితమ్‌. 495

దత్తార్ఘ్యో గిరిరాజేన సురబృన్దైర్వినోదితః | అవసత్తాం క్షపాం తత్ర పత్న్యా సహ పరాన్తకః. 496

తతో గన్ధర్వగీతేన నృత్యేనాప్సరసామపి | స్తుతిభిర్దేవదైత్యానాం విబుదో విబుధాధిపః. 497

అనంతరము అచలేంద్రుడు ప్రణతుడై ఒనర్చున పూజనందుకొని చతుర్ముఖుడు అగ్ని సాక్షికముగా విధి మంత్ర పురస్సరముగా శివుని పాణిగ్రహణ కృత్యమంతయు జరిపించెను. ఇందు పర్వతరాజు దాత; చతుర్ముఖదేవుడు పురోహితుడు; సాక్షాత్పశుపతి వరుడు; విశ్వరణి (విశ్వసృష్టికర్త్రియగు మహాదేవి) కన్య; చరాచర భూతములును సరారా కసురులును నియమంతులూ వ్యగ్రమూర్తులై పెండ్లి పెద్దలైరి.

ఈ పెండ్లిలో సర్వ పృథిని ( దేవత) యు సర్వభావములతో మనోహర రూపయై సంబరపడుచు తన యందుత్పన్నమయిన సర్వసస్యములను వరిధాన్యపు జాతులను రసముల నౌషధులను వధూవరులకు కానుకలిచ్చెను. సాక్షాత్‌గా వరుణుడు రత్నములను పుణ్యకరములును అద్భుతమును నానా రత్నములును అగు ఆభరణములను చేత ధరించి తానును మంచి యాభరణములు దాల్చి సర్వప్రాణములకు ఆనందకరుడై కానుకలీయ నిలువబడెను. కుబేరుడు సువర్ణాభరణములను సువర్ణ ఘటితములగు దివ్య రత్నాభరణములను ప్రయతుడై కానుకలిచ్చి నిలిచెను. వాయువు సుఖస్పర్శమును సువాసరనలను ఇచ్చుచు మెల్లగ వీచెను. ఇంద్రుడు చంద్ర కిరణ వికాసముతో నవ్వులు చిమ్ము ఛత్త్రమును శివుని శిరమునకు పట్టి బహు భూషణములు దాల్చిన బాహువులతో పూలమాలలతో ముదితుడై నిలిచెను. గంధర్వముఖ్యులు పాడిరి. అచ్చరలు నాట్యమాడిరి. గంధర్వులు కొందరును కిన్నరులును అతలి మధురముగా పాడుచు వాద్యముల మ్రోయించిరి. ఋతువులు రూపు దాల్చి యట నిలిచెను. ప్రమథగణపతులు చపలులై హిమవంతుని కలవరపరచుచు ఇచ్చవచ్చినట్లు ఆడిరి; పాడిరి. విశ్వకర్తయు భగుడను ఆదిత్యుని కన్నులూడగొట్టిన వాడునగు శివుడు క్రమముగా లేచి నిలిచి పత్నితోకూడి వివాహక్రియా శేషమును నిర్వర్తించెను.గిరిరాజిచ్చిన ఆర్ఘ్యముల (పూజలు) నందుకొని సుర బృందములు సమకూర్చిన వినోదముల కానందించుచు పురాంతకుడు పత్నితో కూడ ఆట ఆ రాత్రి గడపెను. గంధర్వుల గీతములతో అప్సరసల నృత్యముతో దేవదైత్యలు చేయు స్తుతులతో ఆ దేవాధిపుడా రాత్రి వినోదించెను.

వివాహానన్తరం పార్వత్యాసహేశ్వరస్య మన్దిరగిరిగమనమ్‌.

ఆమన్త్ర్య హిమశైలేన్ద్రం ప్రభాతే హ్యుమయా సహ | జగామ మన్దిరగిరిం వాయువేగేన శృఙ్గినా. 498

తతోగతే భగవతి నీలతోహితే సహోమయా రతి మలభన్న భూధరః |

సబాన్ధవో భవతి చ కస్య నో మనో విసంస్థులం గతి హి కన్యకాపితుః. 499

జ్వలన్మణిస్పుటనవహాటకోత్కట స్ఫురద్ద్యుతిస్పటికగవాక్షగోపురమ్‌|

హరో గిరౌ చిరమనుకల్పితం తదా విసర్జితామరనివహో విశత్స్వకమ్‌.500

తత్రోమానసహితో దేవో విజహార భగాక్షిహా | పురోద్యానేషు రమ్యేషు వివిక్తేషు వనేషు చ. 501

సురక్తహృదయో దేవ్యా మకరాఙ్కపురస్పరః |

గజననోత్పత్తిః

తతో బహుతిథే కాలే సుతకామా గిరేస్సుతా.502

సఖీభిస్సహితా క్రీడాం చక్రే కృత్త్రిమపుత్త్రకైః | కదాచిద్గన్ధతైలేన గాత్రమభ్యజ్య శైలజా. 503

చూర్ణైరుద్వర్తయామాస మలినాస్తరితాం తనుమ్‌ | తదుర్వర్తనకం గృహ్య నరం చక్రే గజాననమ్‌. 504

పుత్రకం క్రీడతే దేవీ తం చాక్షేవయదమ్భసి| జాహ్న వ్యాస్తు శివాసఖ్యా తతస్సోబూద్భృహత్తనుః. 505

కాయేనాతివిశాలేన జటదాపూరయత్తదా | పుత్త్రేత్యువాచ తం దేవీ పుత్త్రేత్యూచే చ జాహ్నవీ. 506

గాఙ్గేయ ఇతి దేవైస్సపూజితో భూద్గజాననః | వినాయకాదిపత్యం చతదా దాచ్చ పితామహః507

పునస్సా క్రీడనం చక్రే పుత్త్రకైర్వవర్ణనీ | మనోఙ్కురం రూఢమశోకస్య శుభాననా. 508

బృహస్పతిప్రముఖదేవానాం దేవ్యా సహ పుత్త్రవిషయకసంవాదః.

వర్ధయామాస తం చాపి కృతసనంస్కారమఙ్గళా | బృహస్పతి ముఖైర్విపై#్రర్దివస్పతిపురోగమైః.509

తతో దేవైస్స మునిభిః ప్రోక్తా దేవీ త్విదం వచః | భవాని భవతీ భవ్యా నమ్భూతా లోకభూతయే. 510

ప్రాయస్సుతఫలో లోకః పుత్త్రపౌత్తైశ్చ లభ్యతే | అపుత్త్రాశ్చ ప్రజాః ప్రాయో దృశ్యన్నతేదైవహేతవః.

ఆధునా దర్శితే మార్గే మర్యాదాం కర్తుమర్హసి | ఫలం కిం భవితా దేవి కల్పితైస్తపుత్త్రకైః. 512

ప్రభావితమున హిమవంతుని వీడ్కోలు అందుకొని పార్వతితో కూడి శివుడు వాయుకేగుడగు శృంగి వాహనముపై మంది(ద) రగిరి కేగెను. ఉమతోకూడి నీలలోహితుడు భగవానుడగా శివుడు వెడలిపోయినందున పర్వతరాజు ఆనందము లేనివాడయ్యెను. ఇంట బంధువలందరుండియు అతని కానందము లేదయ్యెను. ఇట్టి సమయమున కన్యాపితయగు ఎవని మనస్సు మాత్రము స్తిమితము తప్పకుండును?

శివుడును అటకుచేరి దేవతలకు అనుమతినిచ్చి తన గృహమును ప్రవేశించెను. అది ప్రకాశించు రత్న విశేషములు తాపటముచేసి (పుటము వేసిన ) క్రొత్త బంగారుతో చేసినదై మిగుల ప్రకాశించుచు కాంతులు గల స్పటికపు గవాక్షములును గోపురములును కలిగియుండునట్లు నిర్మించినది. అచట భగనేత్రహరుడగా హరుడు ఉమతో కూడి అత్యంతానుక్త హృదయుడై మన్మధునాదరించుచు రమ్యములగు నగరోద్యానములందును ఏకాంత వనములందును విహరించెను.

గజానన జననము

ఇట్లు చాలకాలము గడచెను. గిరిజ కుమారులు కావలెనను మక్కువ ఎక్కువయి చెలులతో కూడి బొమ్మలతో ఆడుకొనుడుండెను. ఒకమారామె తనయెడల సుగంధతైలము అభ్యంగము చేసికొనెను. నలుగు పొడితో శరీరపు మురికి నలచుకొనెను. ఆ మురికి నలుగుతో గజముఖము నారాకృతి గ లబొమ్మచేసెను. శివ ఆ బొమ్మతో చెలులతో కూడి ఆడుచునే ఆది గంగాజలములో వేసెను. అంత అది తన శరీరముతో జగము నిండునంత పెద్ద దయ్యెను. ఆ బొమ్మను గంగయు గౌరియు నాకొడుకు-నాకొడుకు- అనిరి. దేవతలు ఆ గజాననుని గంగా సుతుడని ఆరాధించిరి. బ్రహ్మ అతనికి వినాయకా (ప్రమథగణనాథా)ది పత్యము నిచ్చెను.

అవర వర్ణిని (ఉత్తమసుందరి) ఇంకను కల్పిత పుత్త్రకులతో ఆడుట మానలేదు. ఆశుభానన అపుడే మొలకెత్తిన ఆవోకపు మొలకకు పుత్త్రోచితములగు మంగళ సంస్కారములు జరిపించ నారంభించెను. అది చూచి ఇంద్రుడు బృహస్పతి మొదలగు దేవతలును మునులును ఆదేవి కడకువచ్చి ఇట్లనిరి: భవానీ! నీవు లోకక్షేమమునకై ఉద్భవివంచిన దానవు; శుభరూపవు; లోకమున ప్రాణులకు పుత్త్రులు జనించుటయే జన్మఫలము; పుత్త్రులు పౌత్త్రులు ఉన్ననే ఉత్తమలోకము లభించును. కాని దైవికములగు హేతువలతో కొందరు ఆపుత్త్రులగుటయు కనబడుచున్నది; ఈనాడు లోకమునకు పెద్దలు ఏ మార్గమును చూపియున్నారో ఆ మార్గముననే నీవును నడచి మర్యాదను (లోకవ్యవస్థను) నిలుపవలయునని వేడుచున్నాము. దేవీ! చెట్ల (మొక్కల) ను పుత్త్రులనుగా చేసికొనుటచే కలుగు ఫలము ఏమి? అని వారామెతో పిలికిరి.

ఇత్యుక్తా హర్షపూర్ణాఙ్గి ప్రావాచోమా శుభాం గిరమ్‌ |

దేవీ: ఏవం నిరుదకే దేశే కూపం యః కారయేద్భుదః. 513

బిన్దౌ బిన్దౌ చ తోయస్య వసతే వత్సరం దివి| దశకూవసమా వాసీ దశవాసీసమో హ్రదః. 514

దశహ్రదసమః పుత్త్రోదశపుత్త్రసమో ద్రుమః | ప్రోక్తాచైషైవ మర్యాదా నియతా లోకభావనీ. 514

ఇత్యుక్తాస్తు తతో విప్రా బృహస్పతిపురోగమాః | జగ్ముస్ప్వమన్దిరాణ్యవ భవానీం వన్ద్య సాదరమ్‌. 516

గతేషు తేషు దేవోపి శఙ్కరః పర్వతాత్మజామ్‌| పాణానా లమ్బమానేన శ##నైః ప్రావేశయచ్ఛుభామ్‌. 517

చిత్తప్రసాదజననం ప్రాసాదమనుగోపురమ్‌ | లమ్బమౌక్తిక దామానమతులం రత్నవేదికమ్‌. 518

నిర్ధౌతకలధౌతంచ క్రీడాగృహనోరమమ్‌ | ప్రకీర్ణకుసుమామోదమత్తాళికులకూజితమ్‌. 519

కిన్నరోద్గీతసజ్గీతం గృహాన్నతరితభిత్తికమ్‌| సుగన్థిధూపనజ్ఘాతమనః ప్రాప్యమలక్షితమ్‌. 520

క్రీడామయూరనారీభిర్వృతం వైతతవాదిభిః | హంససఙ్కాతతనంఘష్టం స్ఫాటిక స్తమ్భవేదికమ్‌. 521

అనావిలమతిప్రీత్యా బహుశః కిన్నరాకులమ్‌| శుకైర్యత్రాభిహన్యన్తే పద్మరాగవినిర్మితాః. 522

భిత్తయో దాడిమభ్రాన్త్యా ప్రతిమ్బితమౌక్తికాః |

పార్వతీపరమేశ్వరాయేరక్షక్రీడావర్ణనమ్‌.

తత్రాక్షక్రీడయా దేవో విహర్తుమువచక్రమే. 523

స్వచ్ఛేన్ద్రనీలభూభాగే క్రీడన్తౌ యత్రబింబితౌ| వపుస్సహాయతాం ప్రాప్తౌ వినోదరసనిర్వృతౌ. 524

ఏవం ప్రక్రీడతో స్త్రతదేవీశఙ్కరయేస్తదా| ప్రాదుర్భవన్మహాశబ్దన్తద్గృహోదరగోచరః. 525

మునులు ఇట్లు పలికినది విని తన మనస్సంతయు హర్షముతో నిండపార్వతీ ఇట్లనెను: పెద్దలు ఇట్లు చెప్పుదురు; జలమే లేని దేశమున కూప నర్మాణము చేసిన వివేకి ఆ కూపమందలి జలమున ఎన్ని బిందువు లుండునో అన్ని సంవత్సరములు స్వర్గమున వసించును; పదిబావులును ఒక హ్రదమును (పుణ్యమునుచ్చుటలో ) సమానము? పది హ్రదములు ఒక పుత్త్రుడును సమానము; పదిమంది పుత్త్రులు ఒక వృక్షముతో సమానము; లోకస్థితి కరమగు మర్యాద (వ్యవస్థ) పెద్దలచే ఇట్లేర్పరచబడినది. ఇట్లు ఆమె పలికెను పలుకలు విని బృహస్పతి మొదలగు అవిప్రులు భవానిని సాదరముగ నమసన్కరించి స్వగృహములకేగిరి. వారు వెళ్ళిన తరువాత శంకరదేవుడును శుభప్రాసాదమున ప్రవేశింపజేసెను. మరియు ఆ ప్రాసాదము ముత్తైమున దండలు వ్రేలాడుచున్నట్టిది; నిరుపమానమైననది; రత్నవేదికలు కలది;పుటము వేసి శుద్ధి చేసిన బంగారుకట్టడములు కలది; క్రీడాగృహములు కలిగి మనోరమయినది; అంతట వెదజల్లబడియున్న పూల వాసనతో మత్తెక్కిన తుమ్మెదల గుంపు చేయు ఝుంకారపు రొదలతో నిండిదినది; కిన్నరులు ఉచ్పైవః స్వరమున పాడు సంగీతధ్వనులు కలది; గదుల నడుమ చక్కని గోడలు కలది; సనువాసనలు కల పొగల గుములతో మనస్సు నాకర్షణించునది; ఇదివరకు ఎవరును ఎక్కడను చూచియుండనిది; ఆట నెమిళ్ళతోను (సుందరులగ) స్త్రీలతోను వీణాదివాద్యముల మ్రోయించువారదతోను కూడినది; గుంపులై ధ్వనులు చేయుచున్నట్టి హంసలు కలది. స్ఫటిక మణి నిర్మితములగు స్తంభములును వేదికలును కలది; ఏ మాలిన్యము ను లేనిది; అతి ప్రీతియుక్తులై యున్న కింనరులతో నిండినది; దానియందలి పద్మరాగ మణుల గోడలను చూచి దానిమ్మగింజలను బ్రాంతితో చిలుకలు వాటిని తమ ముక్కులతో పొండుచుచుండెను. ముత్తెములా ప్రాసాదపు గోడలందు ప్రతిబింబించి( రెట్టింపై) కనబడుచుండును.

ఇట్టి ప్రాసదామునందు పరమేశ్వరుడు పార్వతితో పాచికలాడుట మొదలుపెట్టెను. స్వచ్చమగు ఇంద్రనీల ఫలకము నందాడుచు దానియందు ప్రతిబింబించిన తమ శరీరమలే తోడుగా వినోదరన పారవశ్యముతో పార్వతీ పరమేశ్వరులుండిరి. ఇట్లా దేవీ శంకరులాడుచుండ ఆ భవనాంతరాళమునుండి మహాధ్వని యత్పన్నమైన వినబడెను.

తచ్ఛ్రుత్వా కైతుకాద్దేవీ కిమేతదివతి శఙ్కరమ్‌ | పప్రచ్ఛతం శుబతనుర్హరం విస్మయపూర్వకమ్‌. 526

ఉవాచ దేవీం నైతత్తే దృష్టపూర్వం శుచిస్మితే | ఏతే గణశాః క్రీడన్తే శైలే

స్మిన్మత్ప్రియాస్పదా. 527

తపసా బ్రహ్మచర్యేణ నియమైః క్షేత్రసేవనైః యైరహం తోషితః పూర్వం త ఏతే మనుజోత్తమాః 528

మత్సమీపమనుప్రాప్తా మమ హృద్యాశ్శుభాననే| కామతృప్తా మహోత్సాహా మహారూపా గుణాన్వితాః. 529

కర్మభిర్మిస్మయం తేషాం ప్రయామి బలశాలినామ్‌ | సామరస్యాస్య జగతస్సృష్టిసంహారణక్షమాః. 530

బ్రహ్మవిష్ణ్విన్దృగన్దర్వైస్సకిన్నరమహోరగౌక | వివర్జితో వ్యపహం నిత్యం నైభిర్విరహితో రమే. 531

హృద్యా మే చారుసర్వాఙ్కిత ఏతే క్రీడంతే గిరౌ | ఇత్యుక్తాతు తతో దేవీ త్యక్త్వా తద్విస్మయాకులా. 532

గవాక్షాన్తరమాసాద్య పై#్రక్షతైతా న్న్మితాననా | యావన్తస్తే కృశా దీర్ఘా హ్రస్వాస్థ్సూలా మహోదరాః.

వ్యాఘ్రేభవదనాః కేచిత్కే చిన్మేషాజరూపిణః అనేక ప్రాణిరూపాశ్చ జ్వాలాస్యాః కృష్ణపిఙ్గళాః. 534

సౌమ్యా భీమాస్మ్సితమాఖాః కృష్ణపిక్‌ఙ్గజటాసటాః | నానావిహఙ్గవదనా నానావిధమృగాననాః. 535

కౌశేయచర్మవసరనా నగ్నాశ్చాన్యే విరూపిణః | గోకర్ణా గజకర్ణాశ్చ బహువక్త్రేక్షణోదరాః. 536

బహుపాదా బహుబుజా దివ్య నానాస్త్రపాణయః | అనేకకుసుమాపీడా నానావ్యాళవిభూషణాః. 537

వృత్తాననాయుధధరా నానాకవచభూషణాః | విచిత్రవాహనాదూఢా దివ్యరూపా వియచ్ఛరాః. 538

వీణావాద్యరవాఘుష్టా నానాస్థానకనర్తనాః |

అది విని శుభ శరీరయగు దేవీ కుతూహలముతో విస్మయముతో ఇది ఏమియని శకంరునడిగెను. శివుడును శుచియగు చిరునగవు కలదానా! నీవిదివరకు కనివిని యుండవు; నా ప్రీతిపాత్రులగు గణాధిపతులీ శైలమున సదాక్రీడించుచుందురు; అదియే ఇది; అనెను. తపముచే బ్రహ్మచర్యముచే నియములచే క్షేత్రసేవనములచే పూర్వ జన్మములందు నన్ను మెప్పించినవారే వీరు; శుభానానా! ఆ మనుజులట్లు నా హృదయమును తమ వశమొనర్చుకొని నన్ను చేరి తమ కామముల (కొరికల) నీడేర్చుకొనిన మహోత్సాహులు; మహారూపులు, సద్గణాన్నితులైన వీరిని చూచి నాకే యా

శ్చర్యము కలుగుచుండును. దేవాదులతో కూడ ఈ జగమంతయు సృష్టింప-సంహరింప-గల వారు వీరు; బ్రహ్మ విష్ణ్వింద్ర గంధర్వకిన్నర మహోరగాదులెవ్వరు నాకడ లేకున్నను వీరు నన్నెప్పుడును విడువరు; వీరు మనోహర సనర్వాయమవులయి నా మనసన్సులోగొనువారు; అట్టివారు ఇపుడీ శైవలమున క్రీడీంచుచున్నారు. అనిన శివుని వచనములు విని వెంటనే దేవి ఆశ్చర్యవశురాలై ఆట విడిచి గవాక్ష రంధ్రములనుండి ఆది చూచుచు వికసతముఖి యయ్యెను. వారెందరందరును చిక్కినవారు పొడగరులు పొట్టివారు లావగువారు పెద్ద కడుపులవారు పులుల-ఏనుగుల-మొగములవారు-మేకల-గొర్రెల రూపములవారు- అనేక ప్రాణి రూపములవారు మండెడి మొగములవారు నల్లనివారు పింగళవర్ణులు సౌమ్యులు భయంకరులు స్మిత ముఖులు నల్లని-పింగ వర్ణము-జడలు జూలు కలవారు- నానా పక్షిముఖులు నానా మృగముఖులు పట్టువస్త్రములు- మృగ చర్మము దాల్చినవారు-దిన మొలవారు- విరూపులు-ఆవు చెవులవారు ఏనుగు చెవులవారు బహుముఖ నేత్రోదరమువారు బహుపాదులు బహుభుజులు దివ్య నానాపస్త్రములు చేబూనినవారు అనేక కుసుమములు కొప్పులందు దాల్చినవారు నానా సర్పభూషణులు తోడేళ్ళ మోములవారు నానాయుధదారులు నానా కవచ నానా భూషణ దారులు విచిత్ర వాహనారూడులు దివ్యరూపులు గగన సంచారులు వీణాది వాద్యముల మ్రోయించువారు నానా భూమికలు (వేషములు) దాల్చి నృత్యములొనరించువారు నయియుండిరి.

గణశాంస్తాంస్తదా దృష్ట్వా దేవీ ప్రోవాచశఙ్కరమ్‌. 539

దేవీ: గణశాః కతి సఙ్ఖ్యాతాః కింనామానః కిమాత్మకాః |

ఏకైకశో మమ బ్రూహి ధిష్టితా యే పృథక్పృథక్‌. 540

శఙ్కకః కోటిసఙ్ఖ్యా హ్యసఙ్ఖ్యాతా నానా విఖ్యాతా పౌరుషాః | జటదాపూరితం సర్వైరేభిర్భీమైర్మహాబలైః.

సిద్దక్షేత్రషు రథ్యాసుజీర్ణోద్యానేషు వేశ్యసు | దానవానాం శరీరేషు బాలేష్మున్మత్తకేషుచ. 542

ఏతే విశన్తి ముతదితా నానాసత్త్వాపహారిణః | ఊష్మపాః పేనపాశ్చైవ ధూమపా మధుపాయినః. 543

రక్తపాస్సర్వభక్షాశ్చ వాయుపా హ్యమ్భుజనాః | గేయనృత్యోపహారశ్చ నానావద్యారవప్రియాః. 544

న హ్యేషాం వైభవం మత్వా గుణాన్వక్తుం న శ##క్యేత| దేవీ: మార్గత్వగురత్తరాసఙ్గశ్శుద్గాఙ్గో ముఞ్జమేఖలి.

వామస్థేనచ శిక్యేన చవలో రఞ్ఠితాననః | పినద్దోత్పలస్రగ్దామా సుకాన్తో మధురాకృతిః 546

పాషాణశకలోత్తానకాంస్యతాలప్రవర్తనః | అసౌ గణశ్వరో దేవ కిన్నామా కిన్నరానుగః 547

య ఏష గణగీతేషు దత్త కర్ణౌ ముహర్మహుః | ఈశ్వరః : న నేష వీరకో దేవి సదా మద్ధృదయ ప్రియః.

నానాశ్చర్య గుణాదారో గణశ్వరగణాన్నవితః|

అట్లున్న ఇట్టి గణనాధుల చూచి దేవి శంకరునితో ఇట్లనెను: గణశులెందరు? వారి తాత్త్విక రూపయేమి? వారెవరెవరేయే స్థానముల నాశ్రమయించియుందురు? ఒక్కొక్కొటియే వేరువేకరుగా నాకు చెప్పవేడుచున్నాను. అనగా శంకరుడు దేవికిట్లు చెప్పెను. దేవీ! వీరు నానాకోట్ల సంఖ్యలతో నున్నారు; అసంఖ్యాకులనవచ్చును; వీరి పౌరుషములు విఖ్యాతములను నానావిధములను; (అజ్ఞులకు దుష్టులకు) భయంకరులను మహాబలులునగు వీరితో అందరితో జగమాపూరితమైయున్నది; సిద్ధిక్షేత్రములందును రచ్చపట్టులందును జీర్ణోద్యానములనందును జీర్ణగృహము లందును దానవుల శరీరములందును బాలురందును ఉన్మత్తులయందును వీరు సంతోషపూర్వకముగా ప్రవేశింతురు; నానా ప్రాణుల నవహరించుచుందురు; వీరు ఊష్మపులు ఫేనపులు ధూమపులు మధుపులు రక్తపులు సర్వభక్షులు వాయు భోజనులు జలభోజనులు(ఆవిరిని నురుగును పొగను తేనును రక్తమును త్రావువారు; ఏదయిననే తినినవారు వాయు వునో జలమునో ఆహారముగా గ్రహించువారు) గానము నృత్యము వీరికి ప్రియములగు కానుకలు; నానా వాద్య రవములు వీరికి ప్రీతికరమగుములు; వీరి వైభవము నూహించుటయు వీరి గుణముల పేర్కొనుటయు సాధ్యమే కాదు; అనగా దేవి ఇట్లనెను; దేవా! జింక చర్మము త్తరీయముగా శుద్ధాంగుచై ముంజదర్భతో చేసిన మొలత్రాడుతో నుండి ఎడమవైపు (చంకయందు) చిక్కము(ఉట్టి) దాల్చి చవలుడై మొగమున రంగులు పూసికొని కలువల మాలలు దండలు దాల్చి మిగుల ఇంపు గొల్పుచు మధురాకృతి కలిగి శిలాఖండముల-తెరచిన కంచు తాలములను-మ్రోయించుమ్రోయింప జేయుచు కిన్నరులు తనవెంట రాగా ప్రమథగణములు పాడు గీతమములకు మాటిమాటికి చెవి ఇచ్చచు ఉండిన ఈ గణాధిపతి నామము ఏమి? అనగా ఈశ్వరుడిట్లు పలికెను: దేవీ! ఈతని పురు వీరకుడు; నాకు హృదయప్రియుడు; నానాశ్చర్యగుణాశ్రయుడు; గణశ్వర గణములీతని కనుచరులయి యుండును; అనెను.

దేవీ: ఈదృశస్య సతస్యాస్తి మమోత్కణ్ఠా పురాస్తక. 549

కదాహమీదృశం పుత్త్రం ద్రక్ష్యామ్యానన్దదాయకమ్‌ |

ఈశ్వరః : ఏష ఏవ సుతస్తేస్తు నయనానన్దహేతుకః. 550

త్వయామాత్రా కృతార్థస్తు వీరోపి సుమధ్యమే |ఇత్యుక్తా ప్రేషయామాస విజయాం హర్షణోత్సుకా. 551

వీరకానయనాయాశు దుహితా హిమహూభృతః | సావరుహ్య త్వరాయుక్తా ప్రాసాదాదమ్భరస్పృశః. 552

విజయోవాచ గణపం గణమధ్యే ప్రవర్తనమ్‌ | విజయా: ఏహి వీరక చాపల్యాత్త్వాయా దేవః ప్రకోపితః.

కిముత్తరం పదరత్యేర్థేనృత్యరఙ్గేతు శైలజా| ఇత్యుక్తపాషాణశకలో మార్జితాననః. 554

అహుతస్తు తయోద్భూతమూల ప్రస్తావశంసకః |దేవ్యాస్సమీపాగచ్ఛజ్జయయాగతశ్చనైః. 555

ప్రాసాదశిఖరాత్ఫల్లరక్తామ్భుజనిభద్యుతిః | తం దృష్ట్వా ప్రసుతానల్పస్వాదుక్షీరవయేధరా. 556

గిరిజోవాచ నస్నేహం గిరా మధురవర్ణయా.

అది విని దేవి ఇట్లనెను: పురహరా! నాకిట్టి కొడుకు కావలెనని ఎంతయో తహతహగా నున్నది; ఆనందదాయకుడగు ఇట్టి పుత్త్రుని ఎప్పుడు కనెదనో కదా| అన ఈశ్వరుడు ఈతడే నీకు నయనానందహేతుకుడగు సుతుడు కానిమ్ము; అందమగు నడుముదానా! (నీ తాత్త్వికమగు అంతరరూము సర్వజగదానందకరము) నీవు తల్లివి కాగా ఈ వీరకుడును కృతార్థుడగును; అన విని హిమ శైలపుత్త్రిహర్షముతో కుతూహలముతో ఎప్పుడెప్పడును తహతహపాటుతో కూడినదయి వీరకుని పిలిచికొని రమ్మని సఖిని విజయను పంపెను.

ఆమెయు ఆకసమంటు ఆ ప్రాసాదమునుండిత్వరతో దిగి ప్రమథగణమథ్య క్రీడా ప్రవర్తకుడుగా ఉన్న వీరకునితో వీరకా ! నీవు చేసిన చిలిపి పనులకు మహాదేవునికి కోపము వచ్చినది; ఏమి ఉత్తరము ఇత్తువో వచ్చి ఇమ్ము; పార్వతియు నృత్యరంగ శాలయందున్నది; రమ్ము'' అనెను.

ఈ మాట విని వెంటనే వీరకుడు (తాను తాళములుగా మ్రోయించుచున్న) శిలాఖండములను విడిచి మొగము తుడిచికొనెను; ఆమె ఎందులకై పిలచినో ఆ విషయమున మూలముట్టగా చెప్పదలచి బయలుదేరెను. విజయ తన వెంట వచ్చుచుండ మెల్లగా దేవికడకు వచ్చెను; దేవి తాను ప్రాసాద శిఖరముందుండియే వీరుకుని చూచెను. వికసించిన ఎర్రదామర కాంతి వంటి కంతిగల దేవి స్తనములయందు పాలు చేసెను. ఇట్టి యానందశాను భావినియగు దేవి మధుర వర్ణయుతమగు వాక్కుతో స్నేహపూర్వకమగా వీరకునుతో ఇట్టు పలికెను.

స్వపుత్త్రీకృతవారకస్య ప్రమథగణౖస్సహ ఞ్చారవిషయవదేవీకృతహితోపదేశాది.

అథగద్యమ్‌.

ఉమా: ఏహ్యేహి జాతోసి మే పుత్త్రతాం దేవదేవేన దత్తో ధునా వీరకా|

ఇత్యేవమఙ్కే నిధాయథ తం పర్యష్వజత్కపోలే కలవాదినం మూర్ధ్న్యప్రాఘ్రాయ

సమ్మార్జ్యగాత్రాణి సమ్భూషయామానదివ్యైన్స్యయం భూషణౖః |

కిఙ్కిణీమేఖలానూపుర ప్రాజ్యమాణిక్య కేయరహోరోరుమాలగణౖనః

కోమలైః పల్లవైశ్చిత్రితైశ్చారుభిర్దివ్యమన్త్రోద్భవైస్తక్య శుభ్రైస్తతో

భూతిభిశ్చాకర్మోన్మిశ్రసిద్ధార్థకైరఙ్గరక్షావిధిమ్‌|

ఏవబమాదాయ చోవాచ కృత్వా స్రజం మూర్థ్ని గోరోచనాపత్రభఙ్గోజ్జ్వలైః|

వత్స గచ్చాదునా క్రీడసార్థం గణౖనరప్రమత్తో

వనేశ్వరభ్రవర్ణంశ##నైనర్య్వాళమాలాకులాశైలసానుద్రుమదన్తిభిర్భిన్ససారాః వరే నఙ్గినః|

జాహ్నవీయం జలం క్షుబ్ధతో యాకులం కూలం మా విశేథా బహువ్యాఘ్రజుష్టే వనే|

వత్ససజ్ఖ్యేషు దుర్గాగణశేష్వేతస్మన్వీరకే పుత్త్రభావోతుష్టాన్తః కరణాతిష్ఠతు|

స్వస్వపితృజనప్రార్థితభవ్యమాయాతిభావిస్యసౌ భవ్యతా|

సోపి నివృత్య సర్వగణౖ స్సస్మయమాహ బాలత్వలీలారకసావిష్టథీః|

ఏష మాత్రా స్వయం మే కృతభూషణో త ఏష షట ః పటరైర్భిన్ధభిస్సిన్దువారస్య

పుషై#్పరియం మాలతీమిశ్రితామాలికా మే శిరస్యాహితా |

యే యమాతోద్యదారీ గణస్తన్య దాష్యామి హస్తాదిదం క్రీడనమ్‌|

దక్షిణాత్పశ్ఛిమం పశ్చిమబాదుత్తరముత్తరాత్పూర్వమభ్యేత్య సఖ్యమా యుతా ప్రేక్షతీ తం

గవాక్షాస్తరాద్వీరకం శైలపుత్త్రీబహిః క్రీడితం వాజగన్మాతురేష చిత్తభ్రమః|

పుత్త్రలుబ్ధో జనస్తత్రకో మోహమాయాతి న స్వల్పచేతా జగో మాంసరక్తవిణ్మూత్రసజ్ఘాతదేహః|

ద్రష్టుమభ్యన్తరం నాకవాసిష్వన్దుమౌళిం ప్రవిష్టేషు కక్ష్యాన్తరమ్‌ |

వాహనాధ్యావరోహా గణాసై#్తర్యుతో లోకపాలైరస్త్రజం ముద్గరం లోడయ&

ఖడ్గపాశాసిదణ్డోత్కరానిర్మమ్‌ః కృతాన్తః కన్య కేనాహతో బ్రూత యాతేనవధ్యోసన్తి దణ్దన కిం దుఃస్పృహః|

భీమమూర్త్యాననేనాననేనాసికృత్యం గిరౌ య ఏషణోస్త్రజ్ఞోన కం వధ్యతే|

దేవదేవానుగం వీరకం లక్షణా ప్రాహ దేవీ వనం పర్వతా నిర్ఘరాణ్యగ్ని దేవానథో

భూతపా నిర్ఘరామ్బోనిపాతేషు నిమజ్ఞతః|

పుష్పజాలావనద్దేషు ధామస్వపి ప్రోత్తుఙ్గనానాద్రికుఞ్జోష్వనుగర్జతో హేమారుతాన్స్పోటనజేపణాన్కామతః|

కాఞ్చనోత్తుఙ్గశృఙ్గావరోహక్షితౌ హేమరేణూత్కరాసఙ్గపిఙ్గమద్యుతిమ్‌|

వనేచారిణామప్యసౌ చారిరమ్యో బభౌరూపవనమ్ప్న కోశే గణాధీశితుః|

మన్దరకన్దరే సున్దరోదారపుష్పప్రవాళామ్బుజే సిద్ధనారీభిః పీత రూపామృతం

విస్తృతైర్నేత్రపాత్తైరనున్మేషిభిర్వీరకం శైలపుత్రి నిమేషాన్తరాదస్మరత్త్రగృద్నీ వినోదార్ధినీ|

సో పి తాదృక్షణావాస్తపుణ్యోదయో యో పి జన్మాన్తరస్యాత్మజత్వం గతః|

క్రీడతస్తస్య తృప్తిః కథం జాయతే యేపి భావిజగద్వేధసా తేజసః కల్పితః ప్రతిక్షణం దివ్యగీతక్షణో

నృత్యలోలో కణశైస్స్వప్రణత్యక్షణం స్సింహనాదాకులే గణ్డశైలే7సృజద్రత్నజాలే బృహత్సాలతాలేక్షణ

పుల్లనానాతమాలాలికాలేక్షణం వృక్షమూలే విలోలో మరాళేక్షణ స్వల్పవఙ్కే జలేపఙ్కజాఢ్యే క్షణం

మాతురఙ్కే శుభే నిష్కళ##ఙ్కే పరిక్రీడతే బాలలీలావిహారి గణశాధిపో దేవతానన్దకారీ|

నికుఞ్జోషు విద్యాధరైర్గీతశీలః పినాకీవ లీలావిలాసైన్సలీలః. 557

తన పెంపుడు కొడుకయిన వీరకునకు దేవి చేసిన

బాలోచిత హితోపదేశము

(ఇదిగేయాత్మకమగు గద్యము): పార్వతి వీరకుని తన కడకు పిలుచుకొనుచు '' రారామ్ము నాయనా! వీరకా! దేవదేవుడు నాకు నిన్ను పుత్త్రునిగానిచ్చినాడు; కావున నీకు నాకు కుమారుడవయితివి! అనుచు అతనిని తన తొడపై కూర్చుండబెట్టుకొని చెక్కిళ్ళు నిమురుచు అతని ముద్దు మాటలకానందించుచు తల మూర్కొని అవయవముల (ధూళి) తుడిచి దివ్య భూషణములతో కోమల పల్లవములతో గజ్జెలు మొలత్రాడు అందెలు రత్నాల భుజకీర్తులు హారములు పుష్పమాలలు మొదలగువానితో స్వయమముగా నలంకరించెను. శుభ్ర విభూతులతో మంత్రించిన ఆవాలతో శరీర రక్ష చెసెను. పిమ్మట ఆమె వీరకునితో ఇట్లు బాలురకు చేయదగిని హితోపదేశము చేసెను; నాయనా! జాహ్నవి జలమున ప్రవేశింపకుము. కల్లోలితమగు నీటితో వ్యాప్తమయిన చోట్ల నది యొడ్డునకు కూడ పోవకుము. బహుదుష్ట వ్యాఘ్రములతో నిండిన అడవులు కలవు. వానియందు ప్రవేశింపకుము. అనెను.

అసంఖ్యాకులగు గణశులయందును తనకతి ప్రీతిపాత్రుడగు ఈ వీరకుని విషయమున దుర్గామూర్తియగు పార్వతి పుత్రి భావముతో నంతుష్టాంతరంగమైన వాత్సల్యముతో నుండును. అందుచేతనే ఆమె అతనితో పై విధముగా చెప్పెను. ఈ విధమగు వాత్సల్యము తమతమ పుత్రుల విషయమున లోకమునందలి మాతా పితరులెల్లరు కోరు కొనునదే; కాని వారి వాత్సల్యముతో మాయావరణముండును; పార్వతి చూపు వాత్సల్యము మాయ నతిక్రమించినది; మాయాతీతమయినది; ఆ వీరకుడును చిలిపి చేష్టలకు పోక సర్వగణ ప్రమథులతో కూడి బాల్యములకు తగిన ఆటల వలని ఆనందరసమనుభవించు ఆసక్తితో ఇట్లు పలికెను: ఇదుగో; ఇచ్చట మా అమ్మ నాకు తాను స్వయముగా చేసిన భూషణాలంకార సంస్కారము; ఇదిగో వస్త్రము; ఇవిగో దీనియందు సన్నని చుక్కలు; సిందువార పుష్పములతో కూర్చినది మాలతులు నడుమ నడుమ కూర్చినదియగు మాల ఇదిగో; మా అమ్మ నాతలలో ఉంచినది; వాద్యములు మ్రోయించెడి ఈ గణనాధులకీ ఆటవస్తువునిత్తును; అనుచు ఆడుచున్న ఆ వీరకునివైపు పార్వతీదేవి తన చెలితోకూడి గవాక్షమునుండి దక్షిణమునుండి పడమటకు ఆటనుండి ఉత్తరమునకు ఆటనుండి తూర్పునకు వచ్చుచు పోవుచు చూచుచు అతని ఆటల ముచ్చట కనుచుండెను. జగన్మాతకును ఇట్టి చిత్త భ్రమ మాశ్చర్యకరముగదా! ఆమెయే ఇట్లైనచో అల్ప బుద్ధులు జడులు మాంసరక్త మలమూత్ర సమూదాయ నిర్మిత శరీరులునగు సాధారణ జనులు పుత్త్రులపై మోహ మందుటలో నాశ్చర్యమేమి?

ఇది ఇట్లుండ ఇంతలో శివుని దర్శింపగోరి దేవతలు తమతమ వాహనములపై వచ్చి వాటిని దిగి కక్ష్యాంత రములు ప్రవేశించుచుండిరి. అంతలో ప్రమథగణనాధులు వచ్చి వారి వాహనములు (అల్లరిగా) ఎక్కుచు దిగుచు ఇట్లనుచుండిరి: అరే! ఈ యముడు తక్కిన లోకపాలురతో కలిసి ముద్గరము మాత్రమే చేతిలో ఊగించుచు ఖడ్గము పాశము అసి (ఒక విధమగు ఖడ్గము) దండము మొదలగు ఆయుధములందు మమకారమేలేక యున్నాడే! ఈతడు ఎవరివాడు? వీనిని ఇట్లు చూచి ఎవరైన పట్లుకొని కొట్టినచో ఏమిగతి; వీనికి ఇది ఏమి! ఇంత అలక్ష్యము! ఈతని భయంకర ముఖమును ఆకారమును చూచి ఎవరు భయపడుదురు? ఈ పర్వతమున ఇట్టి యాకారముతో పని మాత్రమేమున్నది? ఈతని ఆకారము చూచి ఇతడు అస్త్ర నిపుణుడని ఈతని నెవ్వరు కొట్టకుందురు? అనుచునే వేళాకోళము లాడుచున్న ప్రమథులను చూచి దేవతలు యమునితో '' ఆఁ! వీరి చిలిపి చేష్టలును కొంటె మాటలును ఇంతియేలెమ్ము! లోకపాలానుచరులారా! మీరును వీరికి భయపడకుడు'' అని ధైర్యము చెప్పుచుండిరి. వారిలో చేరి ఈ వీరకుడును ఆడుచుండెను.

దేవికి ఆతని మీది మమకారము అమితము; అందుచే అతచు వనములందాడుకొనబోవునపుడు రక్ష సేయగోరి వన పర్వత నిర్ఘరములందును అగ్ని దేవతా మార్గములందును ప్రకృతియందు సంచరించు భూతములను పొదరిండ్లయందు సంచరించు జల ప్రపాతములందు మునిగియుండు- పుష్పజాల వ్యాప్త స్థానములందు సంచరించు ఉన్నత నానా పర్వత నికుంజములందు ధ్వనించు వాయువులను ఉద్ధేశించు ఆమె "ఓ వాయువులారా! మీరు విజృంభణము తగ్గించి వీరకుని ఇచ్చకు తగినట్లు వీచుడు" అని పలికెను. మేరు పర్వతపు ఎత్తైన శిఖరములనుండి దిగుచు (జారుడుబండ ఆట) ఆడి బంగారు రేఖలతో బంగారు ధూళితో ఒడలు నిండిపోవగా దేవతలు సంచరించు వన రమ్య దేశములందు ప్రమథ గణములు తన వెంటనుండి కొలువగా సుందర మందార పుష్పములు చిగురాకులు పద్మములు గల మందర పర్వత కందరములందు సిద్ద స్త్రీలు తన రూపామృతము త్రావుచుండ పార్వతి అతని వినోదములకు వేడుకవడుచు నిమిషము కూడ ఱప్ప వాల్పక విప్పారిన కన్నులతో పత్త్ర వాత్సల్యముతో వీరకుని చూచుచుండెను. అతడును అట్టి ఉత్సవములననుభవించగల్గుట తన పుణ్యోదయమనుకొనుచు తాను పూర్వ జన్మాంతరమందును ఆమోకు పుత్త్రుడు యుండెనని గుర్తించి ఎంతకును తృప్తినందక ఆడుకొనుచుండెను. ఆ శుభరూపుడు బ్రహ్మదేవుని తేజముతో సృష్టంపబడినవాడు కాని సామాన్యుడుకాడు; ప్రతిక్షణమునను దివ్యులు పాడు గీతమల వినుచు వారి నృత్యముల నాసక్తితో చూచుచు గణశులు వందనములందుకొనుచు రత్నజాలపూర్ణమై పెద్దసాలతాల వృక్ష పూర్ణమయి సింహనాదాకులమగు గండ శైలములందు విచ్చిన నానా తమాల వృక్షకాలములు కల తావులందు క్రీడించు హంసలు గల తావులందు చెట్ల మొదళ్ళ యందు బురద అంతగా లేని తామర కొలకుల జలములందు శుభము నిష్కలంకములగు తల్లి ఒడియందు ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షణకాలము గణశులకును అధిపతియగు ఆ వీరకుడు బాలక్రీడలతో విహార వినోదమనుభవించుచు ఆడుకొనుచుండెను. ఆతడు దేవతల కానందము కలిగించుచు తిరుగుచుండెను. విద్యాధరులాతనిపై గీతములను పొదరిండ్ల యందు కూర్చుండి పాడుచుండెడివారు. ఆతడు మహాదేవుడును పినాకధారియనగు శివుని కంటె తక్కువవాడు. ఐనను ఈతడును ఆతని వలెనే లీలా విలాసములతో కూడివ క్రీడీంచుచుండెను.

ప్రకాశ్య భువనాభోగం తతో దినకరే గతే| దేశాన్తరం తదా పశ్చాద్ధూరమస్తాపనీధరమ్‌. 558

ఉదయస్తే పురో భావీ యో హి చాస్తే వనీధరః | మిత్రత్వస్య సుదృఢం హృదయే పరిచిన్త్యతామ్‌. 559

నిత్యమారాధితశ్శ్రీమాన్ప్రథుమూలస్సమన్తతః | నాకరోత్సవితుర్మేరురుపకారం పతిష్యతః. 560

యతిష్యే మావిమంస్థేతి సంశ్రయోతాఖిలం బుధః| దినాన్తానుగతో భానుస్వ్సజనత్వమపూరయత్‌. 561

సన్ద్యాబద్ధాఞ్జలిపుటా మునయో7భిముఖా రవిమ్‌ | యాచన్త్యాగమనం శీఘ్రం నివార్యాత్మని భావితామ్‌. 562

వ్యజృమ్భదథ లోకేస్మిన్క్రమాద్వైభావరం తమః | కుటిలస్యేవ హృదయే కాలుష్యం దూషయన్మనః. 563

జ్వలత్ఫణిఫణారత్నదీపోద్ద్యోతితభివత్తికే | శయనం శశిసఙ్ఘాతశుభ్రవస్తోత్తరచ్ఛదమ్‌. 564

నానారత్నద్యుతిలసచ్ఛక్రచాపవిడమ్భకమ్‌ | రత్నకిజ్కిణికాజాలం లమ్బముక్తాకలాపకమ్‌ . 565

కమనీయచలల్లో లవితానాచ్ఛాదితామ్బరమ్‌ | మన్దరే మన్దసఞ్చారశ్శనైర్గిరిసుతాయుతః. 567

తస్థౌ గిరిసుతాబాహులతావలితకన్దరః | శశిమౌళిసితజ్యోత్న్సాశుచిపూరితగోచరః. 567

గిరిజా7ప్యసితాపాజ్గీ నీలోత్పలదళచ్ఛవిః | విభావర్యాచ నమ్పృక్తా బభూవాతితమోమయీ. 568

తామువాచ హసన్‌ దేవః క్రీడా కేళికలాయుతామ్‌. 568u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవాసురసఙ్గ్రమే పార్వతీపరమేశ్వర యేర్వివాహాదికథనం

నామ త్రిపఞ్చాశదుత్తర శతతమో ధ్యాయః.

భువన విస్తారమును ప్రకాశింపజేసి అస్త పర్వతమునకు వెనుక దూరమున నున్న దేశాంతరమునకు రవి వెడలిపోయెను. మేరుపర్వతము తాను అవనీధరమే (భూమికి గల సుఖదుఃఖముల బరువును మోయునదే) కదా! రవియును( తనకును లోకమునకు వలెనే) మిత్రుడు (స్నేహముతో నుండువాడు-రవి- అని రెండర్ధములు. ఇది కాక-ఉదయించు సూర్యునికి మిత్రుడు అనియు అస్తమించు రవికి వరుణుడు అనియు శాస్త్ర వ్యవహారము.) కదా! అతని దృఢ మిత్రత్వమును ఆలోచించియే కాని ప్రతినిత్యమును ఆ రవికి తను ఆరాధించుచున్నాడు కదా! (రవి సదా మేరువును ప్రదక్షిణించుచుండును) అని ఆలోచించి విశాలమగు మూలము (మూలధము) లోకమందంతటను కల మేరువు పడమటి సముద్రములో అ స్తపర్వతమునకు వెనుకగా పడిపోవుచున్న (చిక్కులలో పడిపోవుచున్న) రవికి ఏమియు ఉపకారము చేయలేదు. (ఇది దుష్టుని స్వభావము కావున) వివేకి ఎప్పుడును ఉత్తమునినే ఆశ్రయించవలయును. పాపము! ఆ మేరు పర్వతము రవిని '' ఓయీ! నీవు మనస్సులో చింతపడకుము; నీ పుర్వృద్ధికయి యత్నింతు"నని మాట మాత్రమైన అనలేదే! ఐనను చింతపడక భానుడు దినాంతమను అవసాసదశ తన వెంటరాగా బాధనందక తాను సర్వ ప్రాణులకును స్వజనుడు అను మాటను నిలువబెట్టుకొనెను. రవికి రాబొవు బావి దుర్థశా దుఃఖమును ఆత్మల ( తమ మనస్సుల) యందే అణచుకొని మునులు బద్ధాంజలి పుటులైరవి కభిముఖులయి మరల శీఘ్రముగ రమ్మని ప్రార్థింప సాగిరి.

క్రమముగ ఈ లోకమునంతట విభావరికి (లోగడ బ్రహ్మ ఏ దేవిని- ప్రళయాధిష్ఠాత్రిని- యోగమాయను- ప్రార్థించెనో ఆ దేవియే ఈ విభావరి-రాత్రి) సంబంధించిన చీకటులు చెలరేగెను. అది నజ్జనుల మనస్సును కూడ కలుషితము చేయు దుర్జనుల హృదయములందలి మాలిన్యమువలె నుండెను.

శివుని శయనమందిరము నందలి గోడలు మహానాగముల పడగలందు జ్వలించు రత్నదీపములతో మిగుల ప్రకాశించుచుండెను. అందలి పానుపు నానా రత్నకాంతులతో ఇంద్ర ధనువువలె మెరయుచుండెను. దానిపై చంద్రుల సముదాయము వంటి తెల్లదుప్పటి మరచియుండెను. దానిపయి రతనాల చిరుగజ్జెలు వ్రేలాడుచుండెను. ముత్తెముల గుత్తులును వ్రేలాడుచుండెను. మనోహరముయి చంచలమయి కదలియాడు మేలు కట్టు ఆకాశమునే క్రమ్మివేయుచున్నదో యనునట్లుండెను. ఇట్టి మందిరమున ఇట్టి పాన్పుపై శంకరుడు మంద నంచారుడయి మెల్లగా గిరి సుతతో కూడి కూర్చుంచెను. క్రమముగా ఆతని కంఠము పార్వతీ బాహులతాలింగనమలో మునిగెను. అతని శిరమందలి చంద్రుని తెల్లని వెన్నెలలతో నిండి ఆ పరిసరములన్నియు పవిత్రములును నిర్మలములునయ్యెను. పార్వతియును స్వాభావికమగనే నల్లనికడగన్నులు కలది; ఆమె మేనిచాయ నల్ల కలువ పూరేకుల చాయను పోలినది; ఈ కాంతి విభావరీ (రాత్రి) కాంతితో సంపర్కమునంది అతి తమోమయమై కడు నల్ల నయి తోచెను. తనతో క్రీడించు తమ కమున ఆ కళలనెరిగి తన కడనున్న యాదేవితో మహాదేవుడు చిన్నగ నవ్వుచు ఇట్లు పలికెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున పార్వతీ పరమేశ్వర వివాహాది కథా నిరూపణమను నూట ఏబది మూడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters