Sri Matsya mahapuramu-2    Chapters   

ద్వింపంచాశదుత్తర శతతమో7ధ్యాయః - తారకజయః.

సూతః : తమాలోక్య పలాయన్తం విభ్రష్టధ్వజకార్ముకమ్‌ | హరిం దేవం సహస్రాక్షో మేనేభగ్నాన్త్సురానపి.

దైత్యాంశ్చ ముదితాన్దృష్ట్వా కర్తవ్యం నాధ్యగచ్ఛత | అథయో నికటం విష్ణో స్సురేశః పాకశాసనః. 2

ఉవాచచైనం మధురం వాక్యం ప్రోత్సాహకం పరమ్‌ | కిమేభిః క్రీడసే దేవ దానవైర్దుష్టమానసైః. 3

దుర్జనైర్లబ్ధరన్ధ్రస్య పురుషస్యకుతః క్రియా | శ##క్తేనోపేక్షితో నీచో మన్యతే బలమాత్మనః. 4

తస్మాన్న నీచం మతిమా న్గృహతంహి న సన్త్యజేత్‌ | అథాగ్రేసరసమ్పత్త్యా రథినో జయమాప్నుయుః. 5

కస్తేసమభవత్పూర్వం హిరణ్యాక్షవదే ప్రభో | హిరణ్యకశిపుర్దైత్యో వీర్యశాలీ మదోద్ధతః. 6

త్వాంప్రాప్యచ యతోనాసీదసురో విషమాకృతిః | భవత్‌ప్రతిబలా యే వా దైత్యేన్ద్రాస్సురవిద్విషః. 7

వినాశమాప్తాస్త్వాం ప్రాప్య శలభాఇవ పావకమ్‌ | సంయుగే సురదైత్యానాం త్వమేవాన్తకరో హరే. 8

తథైవాహవమత్తానాం భవ విష్ణోసురాశ్రయం | ఏవం ప్రబోధితో విష్ణుర్వ్యవర్ధతమహాభుజః. 9

బలేన తేజసా వృద్ద్యా సర్వభూతాశ్రయో హరిః | అథోవాచ సహస్రాక్షం కాలక్షమమధోక్షజః. 10

దైత్యేన్ద్రాసై#్సర్వధోపాయై శ్శక్యా హన్తుం హి నాన్యతః | దుర్జయస్తారకోదైత్యో ముక్త్వా సప్తదినం శిశుమ్‌.

కశ్చిత్త్స్రీధ్యతాంప్రాప్తో వధ్యో7న్యస్యకుమారికా | జమ్భస్తువధ్యతాం ప్రాప్తో దానవః క్రూరవిక్రమః. 12

తస్మాద్ధైర్యేణ దివ్యేన జహి జమ్భం జగద్ధరమ్‌ | అవధ్య స్సర్వభూతానాం త్వామృతే స తు దానవః. 13

నూట ఏబది రెండవ అధ్యాయము.

తారకాసుర విజయము.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ధ్వజమును ధనువును లేకుండగా పారిపోవుచున్న నారాయణ దేవునిచూచి ఇంద్రుడు రణమున దేవతలు ఓడిరని గ్రహించెను. దైత్యులు ముదితులయి యుండుటచూచి అతనికి ఏమి చేయుటకును తోచలేదు. పాకాసురుని అణచినవాడగు సురేంద్రుడు నారాయణునికడకు వచ్చిమిగుల ప్రోత్సాహకము మధురమగు వచనమునిట్లు పలికెను. దేవా! దుష్టమానసులగు ఈ దానవులతో ఆడుకొనెదవేల? దుర్జనులు తెలిసికొనిన లోపము కలవానికి కార్యాచరణమెక్కడిది? (అట్టివాడు ఏమియు చేయజాలడు.) శక్తుడగు వాడు నీచుని ఉపేక్షించినచో వాడది తన బలమే యనుకొనును. కావున మతిమంతుడగువాడు పట్టుబడిన నీచుని విడువరాదు. తమకు అగ్రేసరులగువారి సహాయ సంప్తిచేతనే వీరులు జయమందుదురందువా - ప్రభూ! మీరు హిరణ్యాక్షుని వధించి నపుడు మీకెవరు సహాయులుగా నుండిరి? హిరణ్యకశిపుడును వీరయయవదంతుడును మదముచే పొగరెక్కి చెలరేగినవాడును కదా? ఆ భయంకరాకారుడును నీదగ్గరకు రాగానే ఏమియు లేకుండ రూపుమాసిపోయెనుకదా! దేవశత్రుపులయి నీకు ప్రతిబలులుగా నిలిచిన దైత్యేంద్రులు ఎల్లరును నీదగ్గరకు రాగానే మంటలను చేరవచ్చిన మిడుతలవలె నయిరకదా! హరీ! యుద్ధమున అసురులకును దైత్యులకును నీవే నాశకరుడవు. ఇప్పుడును నీవు అట్లే వారికి అంతకుడవయి దేవత లకు ఆశ్రయమువగుము. ఇంద్రుడిట్లు ప్రబోధించగా మహాభుజుడును సర్వభూతములకు ఆశ్రయుడునునగు హరి బలమున తేజమున శక్తి సమృద్ధియందును మిఒగుల వృద్దిపొందెను. అంతట అధోక్షకుడు హరి ఆ కాలమునకు తగిన వాక్యమునిట్లు ఇంద్రునితో పలికెను. దైత్యేంద్రులను ఆయా వధోపాయముతోనేకాని మరియొక విధముగా చంపుట మనకు శక్యముకాదు. తారకుడు ఏడు దినముల శిశువుచేతిలో తప్ప జయింప అలవికాడు. ఒకడు స్త్రీచేతిలో చావ వలసినవాడు; ఇంకొకడు కుమారి చేతిలో చావవలయును. భయంకర విక్రముడగు జంభదానవుడు మాత్రము చంప సాధ్యుడు; ఆ దానవుడు కూడ నీచేతిలో తప్ప చచ్చువాడుకదాడు; కావున లోకహరుడగు జంభుని నీవు దివ్యధైర్యమవ లంబించి చంపుము. నారక్షణలో నీవు జగత్కంటకుడగు జంభ దానవుని నిర్మూలించుము.

మయా గుప్తో రణ జమ్భం జగత్కణ్టకముద్ధర | తద్వైకుణ్ఠవచశ్శ్రుత్వా సహస్రాక్షస్సురారిహా.14

సమాదిశత్సురాన్త్సర్వా న్త్సైన్యస్య రచనాంప్రతి | యత్సారంసర్వలోకేషు వీర్యస్యతపసో7పిచ. 15

తదేకాదశరుద్రాంశ్చ చకారాగ్రేసరా& హరిః | వ్యాళభోగాంగదోన్నద్ధా బలినో నీలకన్ధరాః. 16

చన్ద్రఖణ్డకషణ్డన మణ్డితోరుశిఖణ్డినః | శూలజ్వాలావలిప్తాఙ్గా భుజమణ్డలభైరవాః. 17

పిఙ్గోత్తుఙ్గజటాజూటా స్సింహచర్మాఙ్గసఙ్గినః | కపాలీశాదయో రుద్రా విద్రావితమహాసురాః. 18

కపాలీ పిఙ్గళో భీమో విరూపాక్షో విలోహితః | అజేశ వ్శాసనః శాస్తా శమ్భుశ్చణ్డః కుశస్తథా. 19

ఏతే ఏకాదశనాన్తబలారుద్రాః ప్రభావినః | పాలయన్తో బలప్యాంగం దారయన్తశ్చ దానవా9. 20

ఆప్యాయయన్త స్త్రిదశాన్‌ విగర్జన్తివామ్బుదాః | హిమాచలాభే మహతి కాఞ్చనామ్బురుహస్రజి. 21

ప్రచలచ్చామరే హేమదణ్డరత్నూఘమణ్డితే | ఐరావణ చతుర్దన్తే మాతఙ్గే మత్తసంప్థితే. 22

మహామదజలస్రావే కామరూపే శతక్రతుః | తస్థౌ హిమవతశ్శృఙ్గే భానుమానివ దీప్తిమా&. 23

తస్యారక్షత్పదం సవ్యం మారుతో7­ుత­క్రమః | రణయోపరమగ్నిస్తు జ్వాలాపూరితదిజ్ముఖమ్‌. 24

వృష్ఠరశక్షో7భవద్విష్ణు స్ససైన్యస్య శతక్రతోః | ఆదిత్యా వసవో విశ్వే మరుతశ్చాశ్వినావపి. 25

గన్ధర్వా రాక్షసా యక్షా స్సకిన్నరమహోరగాం | ప్రసాధితా శ్శస్త్రవిత్తా దధానా హేమభూషణాః. 26

కోటిశః కోటిశో బృన్దం బృన్దంచిహ్నోపలక్షితమ్‌ | విశ్రావయన్త స్స్వాం కీర్తిం వన్దిబృన్దైః పురస్సరైః. 27

వైకుంఠుడు పలికిన ఆ మాటవిని దేవశత్రు హంతయగు సహస్రాక్షుడింద్రుడు దేవతలనందరను సైన్యరచన చేయుడని యాజ్ఞాపించెను. సర్వలోకములయందలి తపోవీర్యములకు సారరూపులగు ఏకాదశరుద్రులను ఇంద్రుడు అగ్రేనరులను (సేనాపతులను)గా చేసెను. వారందరును సర్పముల పడగలు భుజకీర్తులుగా బిగించి కట్టుకొనినవారు; బలవంతులు; నీలకంఠులు; చంద్రరేఖా సమూహముతో అలంకృతములగు పెద్ద కేశపాశములు గలవారు; శూలముల కాంతుల జ్వాలతో పూయబడిన దేహములు గలవారు; భుజమండలములతో భయంకరులు, పచ్చనై ఎత్తయిన జటాజూటములు గలవారు; సింహచర్మములు శరీరములకు చుట్టుకొన్నవారు; మహా7సురుల తరిమినవారు; 1. కపాలి; 2. పింగళుడు 3. భీముడు 4. విరూపాక్షుడు 5. విలోహితుడు 6. అజేశుడు 7. శాసనుడు 8. శాస్త 9. శంభుడు 10. చండుడు 11. కుశుడు అని వారి నామములు; అనంతబలులు ప్రభావశాలురనగు ఈ ఏకాదశ రుద్రులును దేవ సేనా7గ్ర భాగమును పాలించుచు దానవులను చీల్చి చెండాడుచు దేవతలకు తృప్తి కలిగించుచు మేఘములవలె గర్జించు చుండిరి. హిమాచలము వంటిది గొప్పది బంగారు తామరల మాలలతో అలంకృతము కదలు చామరములు కలది బంగారు దండములతో రత్నరాసులతో అలంకృతము నాలుగు దంతములు కలది మత్తతతో నిలిచినది మహామదజలము స్రవించునది కామరూపధారియగు ఐరావత గజముపై దేవేంద్రుడు హిమాలయ శృంగమునందు తేజోవంతుడగు రవివలె కూర్చుండెను. అమిత విక్రముడగు వాయుదేవత ఇంద్రుని ఎడమవైపును - తన జ్వాలలతో దిజ్ముఖములను నింపుచు అగ్ని కుడివైపును కాపాడుచుండిరి. ఇంద్రుని అతని సేనను వెనుకనుండి శ్రీమహావిష్ణువు రక్ష సేయుచుండెను. ఆదిత్యులు వసువులు విశ్వదేవులు మరుత్తులు అశ్వినులు గంధర్వులు రాక్షసులు యక్షులు కిన్నరులు నాగులు అలంకరించు కొని శస్త్రములనే ధనముగా ఉంచుకొని బంగారు సొమ్ములు దాల్చి కోటికోటి ఒక్కొక్క బృందము బృందముగా తమ తమ బిరుదులు దాల్చియుండిరి. తమముందు నిలిచి స్తోత్ర పాఠకులు తమకీర్తులను వినిపించుచుండ ఇంద్రునితో కూడి ఈదేవ జాతులవారెల్లరును దర్పవంతులయి దైత్యవధకై ముందునకు వచ్చిరి.

పేతుర్దెత్యవధే దృప్తా స్సహేన్ద్రా స్సురజాతయః |

శతక్రతోరమరనికాయపాలితా పతాకినీ గజరథవాజినాదితా. 28

సదోన్నతధ్వజపటకోటిమణ్డితా బభూవ సా దితిసుతశోకవర్ధనీ |

సురైస్సహ గజాసురయుద్ధమ్‌.

ఆయాన్తీం తాం విలోక్యాథ సురసేనాం గజాసురః. 29

గజరూపో మహామ్భోదసంహతామ్భోధిభైవరః | పరశ్వథాయుధో దైత్యో దశనాభోగసఙ్కటః. 30

మమర్ద చరణౖర్దేవాం శ్చిక్షేపాన్యాన్కరేణచ | పరాన్సరశునా జఘ్నే దైత్యేన్ద్రో రౌద్రవిక్రమః. 31

తస్యపాతయతస్సేనాం యక్షగన్ధర్వకిన్నరాః | ముముచు స్సంహతాస్సర్వే చిత్రశస్త్రాస్త్రసంహతీః. 32

పాశాన్పరశ్వథాంశ్చక్రు ర్భుసుణ్డీంశ్చ సముద్గరా& | కున్తాన్ప్రాసానసీం స్తీక్షాన్ముద్గరాంశ్చతిదుస్సహా&. 33

తాన్త్సర్వాన్త్సో7గ్రసద్దైత్యః కమలానీవ యూథపః | కోపాస్ఫాలితదీర్ఘాగ్రకరాస్ఫోటేన పాతయ&. 34

విచచార రణ దేవాన్దుష్ప్రేక్ష్యో గజదానవః | యస్మిన్రణ సన్న్యపత త్సురబృన్దే గజాసురః. 35

తస్మింస్తస్మి న్మహాశబ్దో హాహాకారః కృతో7భవత్‌ | అథ విద్రవమాణంతు బలం ప్రేక్ష్యసమన్తతః. 36

రుద్రాః పరస్పరం ప్రోచు రహఙ్కారోద్గతార్చిషః |

భోభో గృహ్ణీత దైత్యేన్ద్రం భిత్త్వాచైనం మహాసురమ్‌. 37

ఘర్షితైర్నిశితైశ్శూలై ర్భఞ్జిషై#్యనం హి మర్మసు | కపాలీ వాక్యమాకర్ణ్య శూలం శితశిఖాముఖమ్‌. 38

సమ్మార్జ్యవామహస్తేన సంరమ్భవివృతేక్షణః | అథాగాద్భ్రుకుటీచక్రో దైత్యేన్ద్రాభిముఖో రణ. 39

దృఢేన ముష్టిబన్ధేన శూలం విష్టభ్య నిర్మలమ్‌ | జఘాన కుమ్భదేశేతు కపాలీ గజదానవమ్‌. 40

తతో దశాపి తే రుద్రా నిర్మలాయోముఖై రణ |

జఘ్నుశ్శూలైస్తు దైత్యేన్ద్రం శైలవర్ష్మాణమాహవే. 40

స్రుతశోణితరన్ధ్ర స్స నీలవూముఖార్దితః | బభౌకృష్ణచ్ఛవిర్దైత్య శ్శరదీవామలం సరః. 41

ప్రోత్ఫుల్లారుణనీలాబ్జసఙ్ఘాతై స్సర్వతో దిశమ్‌ | తస్యశుక్లతనుచ్ఛాయై రుద్రైర్హింసై#్రరివావృతమ్‌. 43

ఉపస్తితా ర్తిద్దైత్యో7థప్రచలత్కర్ణపల్లవః | భీమం బిభేద దశ##నై ర్నాభిదేశే గజాసురః. 44

దేవతా సమూహము రక్షించుచుండ ఏనుగుల రథముల గుర్రముల ధ్వనులతో కూడి ఎల్ల సమయములందును ధ్వజ వస్త్ర కోటులతో అలంకృతమయి ఒప్పు ఆ ఇంద్ర సేన దైత్యుల శోకము నధికము చేసెను. వచ్చుచున్న ఆ దేవ సేనను చూచి గజాసురుడు జగరూపుడును మహామేఘములతో కూడిన మహా సముద్రమువలె భయంకరుడును పరశువు ఆయుధముగా ధరించినవాడును విశాలదంతములతో వికటుడును నయి దేవతలను పాదములతో నలచెను - చేతులతో విసరెను - గండ్రగొడ్డటితో తెగగొట్టెను. ఆ రౌద్ర విక్రముడిట్లు తమ సేనను పడగొట్టుచుండ వేరువేరు విధములగు శస్త్రాస్త్రములతో సన్నద్ధులయి యక్ష గంధర్వ కిన్నరులు అందరును కూడి పాశములను పరశువులను భుశుండులను కుంతములను తీక్షములగు ప్రాసములను అతి దుఃసహములగు ముద్గరములను ప్రయోగించిరి. ఆ దైత్యుడు వాని నన్నిటిని గజరాజు కమలములనువలె మ్రింగెను. కోపముతో తన దీర్ఘభుజమును రచచిన చప్పుడుతోనే దేవతలను పడగొట్టుచు ఆ గజదైత్యుడు తేరి చూడనైన నలవికాక సంచరించెను. వాడు వచ్చిపడిన దేవతా బృందమునందెల్ల మహా హాహాకారము రేగుచుండెను. తమ సేన అన్ని దిక్కులకు పారిపోవుచుండుటచూచి అహంకారముతో రేగిన జ్వాలలతో వెలుగుచు రుద్రులు పరస్పరము ఇట్లు పలికిరి: ఏమయ్యా! ఈ దైత్యేంద్రుని పట్టుకొనుడు; ఈ మహాసురుని చీల్చుడు. పదును పెట్టిన నిశిత శూలములతో వీనిని మర్మములందు విరుగగొట్టుడు. ఈ వాక్యమును విని కపాలియను రుద్రుడు వాడి మొన కలిగిన శూలమును చక్కగా తుడిచి ఎడమచేతితో పట్టుకొనెను. చక్రములవలె కనుబొమలు ముడివేసి దృఢమగు పిడికిటి పట్టుతో నిర్మలమగు శూలము పట్టుకొని గజ దానవుని కుంభ దేశమున కొట్టెను. తరువాత దశరుద్రులు కూడ నిర్మలమగు ఉక్కు మొనలుగల శూలములతో పర్వతమువంటి దృఢ శరీరముగల ఆదైత్యుని కొట్టిరి. నీలమగు శూలపు మొనలతో పొడువబడుచు ఆ రంధ్రములనుండి రక్తము కారుచున్న నల్లని దేహకాంతిగల ఆ గజాసురుడు బాగుగా విచ్చిన నల్లకలువలతోను ఎర్రకలువలతోను తెల్లని దేహచ్ఛాయ కల హంసలతోను అన్ని వైపుల నిండిన శరదృతువునందలి నిర్మల సరస్సువలె ప్రకాశించెను. గజాసురుడు బాధనొందుచు చిగురాకులవంటి తన చెవులు కదలుచుండ తన దంతములతో రుద్రుని నాభిని చీల్చెను.

దృష్ట్వా తుసక్తం రుద్రాభ్యాం నవరుద్రాస్తతో ద్రుతమ్‌ | తతక్షుర్వివిధైఃశ##సై#్త్ర శ్శరీరమమరద్విషః. 45

నిర్భయా బలినో యుద్ధరణభూమ్యాంవ్యవస్థితాః | మృతంమహిషమాసాద్యవనేగోమాయవో యథా. 46

కపాలినంపరిత్యజ్య భీమంచాసుర పుఙ్గవః | వేగేన కుపితో దైత్యో నవరుద్రానుపాద్రవత్‌. 47

మమర్ద చరణాఘాతై ర్దన్తైశ్చాపి కరేణ చ | స తై స్తుమలుయుద్ధేన శ్రమమాపాదితో యదా. 48

తదాకపాలీ జగ్రాహ కరం తస్యామరద్విషః | భ్రామయామాస చాతీవ వేగేనచ గజాసురమ్‌. 49

దృష్ట్వా శ్రమాతురం దైత్యం కించిత్స్ఫురితజీవితమ్‌ |

నిరుత్సాహం రణ తస్మిన్యాతయుద్ధోత్సవోద్యమమ్‌. 50

తతః పరతతేవాస్య చర్మచోత్కృత్యభైరవమ్‌ | స్రవత్సర్వాఙ్గరక్తౌఘం చకారామ్బరమాత్మనః. 51

దృష్ట్వా వినిహతం దైత్యం దానవేన్ధ్రా మహాబలాః | విత్రేసుర్దుద్రువుర్జఘ్ను ర్ని పేతుశ్చ సహస్రశః. 52

దృష్ట్వా కపాలినో రూపం గజచర్మామ్బరావృతమ్‌ |

దిక్షు భూమౌతమేవోగ్రం రుద్రం దైత్యావ్యలోకయ&. 53

ఏవం వినిహతే తస్మి న్దానవేన్ద్రే మహాబలాః | ద్వివాధిరూఢో దైత్యేన్ద్రే హతదున్దుభినాతతః. 54

సురైస్సహ నిమినామమహాసుర యుద్దమ్‌.

కల్పాన్తామ్భుదనాదేన దుర్దరేణాపిదానవః | నిమిస్తత్రాత్తూర్ణం సురసైన్యలోడయత్‌. 55

యాం యాం నిమిగజో యాతి దిశం తాం తాం సవాహనాః | తత్యజుర్దుద్రువుర్దేవా భయార్తాస్త్యక్తచేతసః.

గన్ధేనసురమాతఙ్గా దుద్రువుస్తస్య హస్తినః | పలాయమానే సైన్యేతు సురాణాం పాకశాసనః | 57

తస్థౌ దిక్పాలకైస్సార్ధ మష్టభిః కేశ##వేనచ | సమ్ర్పాప్తో నిమిమాతఙ్గో యావచ్ఛక్రగజంప్రతి. 58

తావచ్ఛక్రగజో భీతో ముక్త్వా నాదం సుభైరవమ్‌ | ధ్రియమాణో7పియత్నేన రణ నైవ తిష్ఠతి. 59

పలాయతి గజే తస్మి న్నారూఢః పాకశాసనః | విపరీతముఖో యుద్ధ్య దానవేన్ద్రవధంప్రతి. 60

గజదైత్యుడు ఇద్దరు రుద్రులతో యుద్ధమున చిక్కి యుండుటచూచి మిగిలిన నవరుద్రులును వాని శరీరమును వివిధ శస్త్రములతో చెక్కిరి. చచ్చిన మహిషము దగ్గరనున్న నక్కలవలె వానికడ వారు ఆ బలశాలురు రణనిర్భయు లయియుండిరి. అంతట ఆ అసుర పుంగవుడు కపాలిని భీముని విడిచి నవ రుద్రులమీదకు పరుగెత్తెను. వారిని కాలి తాపులతో దంతములతోచేతులతో వాడు మర్దించెను. తుముల యుద్ధములో వాడు శ్రమనందగా కపాలి రుద్రుడు వాని చేయి పట్టుకొని వానిని మహావేగమున త్రిప్పెను. దానిచే వాడు శ్రమాతురుడై కొనఊపిరితో నుండి యుద్ధోత్సాహమును యుద్ధోత్సవపు పూనికను విడిచివేసెను. కపాలి రుద్రుడు వాడు పడుచుండగనే సర్వాంగములనుండి రక్తము కారుచుండ వాని చర్మమును భయంకరముగా ఒటిచి దానిని వస్త్రముగా చేసికొనెను. వాడు మరణించుటచూచి మహా బలులగు దానవులెల్ల వేలకొలదిగా భయపడిరి - పారిపోయిరి - దేవతల కొట్టిరి - వారిమీదకు వచ్చిపడిరి. రక్తసిక్తమైన గజ చర్మ వస్త్రము ధరించిన ఆకపాలి రుద్రుని చూచిన దానవులకు అన్ని దిక్కులందును భూమిమీదను వారికి ఆ భయంకర రుద్రుడే కనబడుచుండెను.

ఇట్లు మహాబలుడగు దైత్యుడు మరణించగా ప్రళయ మేఘమువలె మ్రోగు దుర్దరదుందుభి మ్రోగించుచు నిమియను దానవుడు ఏనుగునెక్కి అటకు పచ్చిపడి దేవసైన్యమును కలవరపెట్టెను. వాని గజము పోయిన దిక్కున నెల్ల దేవతలు భయార్తులయి తెలివి తప్పి తమ వామనములతో కూడ ఆ చోటు విడిచి పారిపోవుచుండిరి. దాని మదపు వాసన తగులగనే దేవగజములు చెల్లాచెదరగుచుండెను. దేవసేన పారిపోవుచున్నను ఇంద్రుడు మాత్రము నారాయణునితో దిక్పాలకులతో కూడి రణమున నిలిచెను. నిమి వామన గజము తన కడకు రాగానేన ఇంద్రుని ఐరావతము భయపడుచు భయంకరముగ ఘీంకరించుచు ఎంత నిలిపినను యుద్ధరంగమున నిలువక పారిపోసాగెను.

శతక్రతుశ్చచక్రేణ నిమిం వక్షస్యతాడయత్‌ | గదయా దన్తినంతస్య గణ్డస్థానే7హన ద్దృఢమ్‌. 61

తత్ప్రహార మచిన్త్యైవ నిమిర్నిశ్చలపౌరుషః | ఐరావతం కటీదేశే ముద్గరేణాభ్యతాడయత్‌. 62

స హతో ముద్గరేణాథ శక్రకుఞ్ఞర ఆహవే | జగామ పశ్చాచ్చరణౖ ర్ధరణీం భూధరాకృతిః. 63

లాఘవాతిప్రముత్థాయ తతో7మరహాగజః | రథాదపససర్పాశు భీషితో నిమిహస్తినా. 64

తతోవాయుర్వవౌ రూక్ష శ్చణ్డశ్శర్కర పాంసులః | సమ్ముఖో నిమిమాతఙ్గః పవనాచలకమ్పితః. 65

స్రుతరక్తో బభౌ శైలో ఘనధాతుహ్రతోయథా | ధనదోపి గదాం గుర్వీం తస్య దానవహస్తినః. 66

చిక్షేప హస్తాద్యైత్యేన్ద్రే నిపపాతస్య మూర్ధని | గజో గదానిపాతేన స తేన పరిమూర్ఛితం. 67

దన్తైర్భిత్త్వా ధరాంవేగా త్పపాతాదచలసన్నిభః | పతితేతుగజేతస్మిన్‌ సింహనాదో మహానభూత్‌. 68

సర్వతస్సురసైన్యానాం గజబృంహితబృంహితైః | హేషారవేణచాశ్వానాం గుణాస్ఫోటేన ధన్వినామ్‌.

దేవేన్ద్రజమ్భాసురయుద్ధమ్‌.

గజంతంనిహతందృష్ట్వా నిమించాపి పరాఙ్ముఖమ్‌ | శ్రుత్వాచ సింహనాదంచ సురాణామతికోపనః. 70

జమ్భోజజ్వాల కోపేన సిక్తాజ్యఇవ పావకః | స సురాన్కోపరక్తాక్షో ధనుష్యారోప్య సాయకమ్‌. 71

తిష్ఠతిష్ఠా బ్రవీత్సర్వాన్త్సారథించాస్యనోదయ | వేగేన చలతస్తస్య తద్రథస్యాభవద్ద్యుతిః. 72

యథా77దిత్యసహస్రస్య ఉద్గతస్యోదయాచలే | పతాకినా రథేనాజౌ కిఙ్కిణీజాలమాలినా. 73

అతిశుభ్రాతపత్రేణ స తేన స్యన్దనేనతు | ఘట్టయంత్సురసైన్యానాం హృదయానిచ దృశ్యతే. 74

పారిపోవుచున్న దానిమీదనే ఎదురుత్రిప్పిన మొగముతో ఉండి ఇంద్రుడు దైత్యునితో యుద్ధము చేసెను. అతడు చక్రముతో నిమి వక్షమున కొట్టెను. గదతో వాని గజమును గట్టిగా కొట్టెను. కాని వాడది లెక్క పెట్టక నిశ్చలపౌరుషుడై ముద్గరముతో ఐరావతపు కటిదేశమును కొట్టెను. ఆ దెబ్బతిని అది వెనుక కాళ్ళు ముడిచి కొండవలె క్రిందపడెను. అది నిమిగజమును చూచి భయపడుచు త్వరగా లేచి అటనుండి పారిపోయెను. అంతలో ఇసుక ధూళితో నిండిన భయంకర వాయువు వీచెను. దానికెదురు నిలిచిన నమి గజము రక్తము కారుచు గొప్ప గైరిక ధాతువుల మడుగుతో నున్న పర్వతమువలె ప్రకాశించెను. అంతలో కుబేరుడు బరువయిన గద ఎత్తి దైత్యేంద్రుని వైపు విసరగా అది నిమి గజపు తలపై పడెను. ఆ దెబ్బతో ఆ ఏనుగు మూర్ఛనందెను. దంతుమలతో భూమి చీలుచుండ అది కొండవలె నేలపై పడెను. దానితో దేవసేనలో సింహనాదములును ఏనుగుల ఘీంకారములును అధికమయ్యెను. ధానుష్కుల అల్లెత్రాళ్ళ టంకారములును గుర్రముల సకిలింతలును వ్యాపించెను. నిమి గజము చావగా నిమిదైత్యుడు పారిపోగా దేవతలు చేయు సింహనాదము విని జంభుడు నేయి పోసిన అగ్నివలె మహాకోపముతో మండిపడెను. వాడు కోపరక్త నేత్రుడై ధనువున బాణము సంధించి దేవతలనెల్లరను నిలుడు నిలుడనుచు తన సారథిని ప్రేరించుచు వేగముగ పోవుచున్న ఆతని రథకాంతి ఉదయపర్వతమున ఉదయించుచున్న సహస్రాదిత్య కాంతివలె నుండెను. పతాకములతో చిరుగంటల గుంపులతో శ్వేతచ్ఛత్త్రముతో ఒప్పు రథముతో వాడు దేవసేనల హృదయముల నలుగ గొట్టుచుండెను.

తమాయాన్తమభిప్రేక్ష్య దనుష్యాహితసాయకమ్‌ | శతక్రతుశ్చ తం దృష్ట్వా దృఢమాదత్తకార్ముకమ్‌. 75

బాణంచ తైలధౌతాగ్ర మర్ధచన్ద్రమజిహ్మగమ్‌ | తేనాస్య సశరం చాపంరణ చిచ్ఛేద వృత్రహా. 76

క్షిప్రం సన్త్యజ్య తచ్చాపం జమ్భో దానవనన్దనః | అన్యత్కార్ముకమాదాయ వేగేన శరసాదనమ్‌. 77

శరాంశ్చాశీలిషాకారాం సై#్తలధౌతానజిహ్మగా& | శక్రంవివ్యాధదశభి ర్జానుదేశేతు పత్రిభిః. 78

హృదయంతు త్రిభిశ్చాపి ద్వాభ్యాంచ స్కన్ధయోర్ద్వయోః | శక్రోపిదానవేన్ద్రాయ బాణజాలమపాసృజత్‌. 79

అప్రాప్తాన్దనానవేన్ద్రస్తు శరాఞ్చక్రభుజేరితా& | చిచ్ఛేద దశధా77కాశే శ##రైరగ్నిశిఖోపమైః. 80

తతస్తు శరజాలేన దేవేన్ద్రో దానవేశ్వరమ్‌ | ఆచ్ఛాదయన్నేవ తదా వర్షాస్వివఘనైర్నభః. 81

దైత్యోపి బాణజాలేన వ్యధమత్సాయకైశ్శితైః | యథా వాయుర్ఘనాటోపం దుర్నివార్యం దిశోముఖే. 82

తతశ్శక్రోపి సంరమ్భాన్న విశేషయతేయదా | దానవేన్ద్రం తదా చక్రే గన్ధర్వాస్త్రం మహాద్భుతమ్‌. 83

తతోస్య తేజసా వ్యాప్త మభూచ్చ గగనోదరమ్‌ | గన్ధర్వైః కిన్నరైశ్చాపి నానాప్రాకారతోరణౖః. 84

ముఞ్చద్భిరద్భుతాకారై రస్త్రవృష్టిం ప్రయత్నతః |

తయా7స్త్రవృష్ట్యా దైత్యానాం హన్యమానాం మహాచమూమ్‌. 85

జమ్భశ్శరణమాగచ్ఛదప్రమేయపరాక్రమమ్‌ | వ్యాకులోపి యదాదైత్య స్సహస్రాక్షాస్త్రపీడయా. 86

స్మరన్త్సాధుసమాచారం భీతత్రాణపరో7భవత్‌ | అథాస్త్రం మౌసలం నామ ముమోచదితినన్దనః. 87

తత్తదాముసలై స్సర్వమభవత్పూరితం జగత్‌ | ఏకప్రహారకరణౖరప్రధృషై#్యస్సమన్తతః. 88

గన్ధర్వనగరంతేషుగన్ధర్వాస్త్రవినిర్మితం | గాన్ధర్వమస్త్రం సన్ధాయ సురసైన్యేషు చాపరమ్‌. 89

ఏకైకన ప్రహారేణ గజానశ్వాన్మహారథా& | ఏతాం శ్చాప్యహనతిప్రం శతశో7థసహస్రశః. 90

ఇట్లు వచ్చుచున్న జంభునిచూచి ఇంద్రుడు దృఢమగు ధనువును తైలముతో శుద్ధిచేసిన మొనగలిగి సూటిగా పోవు అర్ధచంద్ర బాణమును తీసికొని దానితో దైత్యుని ధనుస్సును శరమును ఖండించెను. వాడు వెంటనే యది వదలి శరముల వెదజల్లు మరిఒక ధనువును తైలధైతములయి సూటిగపోవు సర్పాకృతి శరములను తీసికొని వానితో పదింటితో ఇంద్రుని మోకాళ్ళను రెండింటితో హృదయమును రెండింటితో భుజ మూలములను కొట్టెను. ఇంద్రుడును దానవేంద్రునిపయి బాణముల గమి వదలగా వాడవి తన దగ్గరకు వచ్చులోపలనే అగ్ని జ్వాలలవంటి బాణములతో పదేసి ముక్కలుగా ఖండించెను. ఇంద్రుడా దానవేశ్వరుని వర్షాకాలమును తాను మేఘములతో ఆకాశమును కప్పునట్లు కప్పెను. ఆ దానవుడును దుర్నివారములగు మేఘములను వాయువు దిఙ్ముఖములకు ఎగురగొట్టినట్లు తన వాడియుమ్ములతో ఇంద్రుని ఆ బాణములను చెదరగొట్టెను. ఇంద్రుడును తన క్రోధమును ఎక్కువ సేపు నిగ్రహించుకొనలేక దానవేంద్రునిపై గంధర్వాస్త్రమును మహాద్భుతమగు దానిని ప్రయోగించెను. అంత దాని తేజస్సుచే అంతరిక్షము వ్యాప్తమయ్యెను. గంధర్వులును కింనరులును (తమకు రక్షణగా) అద్భుతాకారములుగల నానా ప్రాకార తోరణములు నిర్మించి వానినుండి ప్రయత్నముచే అస్త్రవృష్టి కురియుచుండ దానితో దానవమహాసేన దెబ్బతినుచు అప్రమేయ పరాక్రముడగు జంభుని శరణు చొచ్చెను. వాడు తానును ఇంద్రుని అస్త్రములవలని పీడచే వ్యాకులుడయ్యును సాధుజనుల ప్రవర్తనమును స్మరించి భయపడినవారిని రక్షింపపూనెను. ఆ దైత్యుడు మౌనలాస్త్రమును విడువగా జగత్తంతయు అంతటను మసల ములతో నిండెను. అవి ఒకేవిధముగ తమ పనిచేయుచు ఎదిరించ - అణగించ - రానివై యుండెను. గంధర్వాస్త్రముతో నిర్మించబడిన గంధర్వ నగరములు (నగరాకార మేఘాదికము) ఈ ముసలములలో లయమందెను. జంభుడును మరియొక గంధర్వాస్త్రమును సంధించి పరసేనలపయి ప్రయోగించి ఒక్కొక్క దెబ్బతో వందలకొలదిగా గజములను అశ్వములను ఈ దేవతలలోని మహారథులను శీఘ్రమే నశింపజేయసాగెను.

తతస్సురాధిపశ్శక్రస్త్వాష్ట్వాస్త్రం సముదైరయత్‌ | సన్ధీయమానే త్వాష్ట్రేతు నిశ్చేరుః పావకార్చిషః. 91

తతో యన్త్రమయాన్దివ్యానాయుధాన్త్సపుప్రధర్షణా& | తైర్యన్త్రైరభవద్యుద్ధమ న్తరిక్షే వితానకమ్‌. 92

వితానకేన తేనాథ ప్రశమం మౌసలే గతే | శైలాస్త్రం ముముచే జమ్భో యన్త్రపఙ్ఘాతలోపనమ్‌. 93

అప్రమాణౖశ్చ పాషాణౖ స్తతోవర్షం ప్రవర్తత | త్వాష్ట్రాస్త్రజనితాన్యాశు యన్త్రాణి తదనన్తరమ్‌. 94

తేనోపలనిపాతేన గతాని తిలశస్తతః | యన్త్రాణి తిలశఃకృత్వా శైలాస్త్రంపరమూర్ధసు. 95

నిపపాతాశు వేగేన దారయన్పృథివీం తతః | తతో వజ్రాస్త్రమకరోత్సహస్రాక్షః పునర్దరః. 96

తేనోపలమహావర్షం వ్యశీర్యత సమన్తతః | తతః ప్రశాన్తే శైలాస్త్రే జమ్భో భూధరసన్నిభః. 97

ఐషీకమస్త్రమకరోత్త్వరితో7తిపరాక్రమః | ఐషీకేనాగమన్నాశం వజ్రాస్త్రంశ క్రవల్లభమ్‌. 98

విజృమ్భత్యథ చైషీకే పరమాస్త్రే సుదుర్దరే | జజ్వలుర్దేవసైన్యాని సస్యన్దన గజాని తు. 99

దహ్యమానేపై#్యషికేన తేజసాసురసత్తమః | ఆగ్నేయంచాస్త్రమకరో ద్బలహా పాకశాసనః.100

తేనాస్త్రేణ తదస్త్రంచ బభ్రంశే త దనన్తరమ్‌ | తస్మిన్ప్రతిహతే చాస్త్రే పావకాస్త్రే విజృమ్భతి. 101

జజ్వాల కాయంజమ్భస్య సరథంచ ససారథి | తతః ప్రతిహతే స్వాస్త్రేదైత్యేన్ద్రః ప్రతిభానవా&. 102

వారుణాస్త్రం ముమోచాశు శమనం పావకార్చిషః | తతో జలధరైర్వ్యోమ స్ఫురద్విద్యుల్లతాకులమ్‌. 103

గమ్భీరమురజాఘాతం దిశఃపూర్య సమన్తతం | కరీన్ద్రకరతుల్యాభి ర్జలధారాభిరమ్బరాత్‌. 104

పతన్తీభిరధస్సర్వం క్షణనాపూరితం బభౌ | శాన్తమాగ్నే యవస్త్రంతు ప్రవిలోక్య సురాధిపం. 105

అంత సురాధిపు డింద్రుడు త్వాష్ట్రాస్త్రమును ప్రయోగించెను. అతడది సంధించుచుండగనే అగ్నిజ్వాలలు చెలరేగెను. దానినుండి ఇంద్రుడు యంత్రమయములగు ఎదిరించ నలవికాని దివ్యాయుధములను కూడ వదలెను. ఆ యంత్రములతో అంతరిక్షమున పందిరి నిర్మించబడెను. దానితో మౌసలాస్త్రము శమించెను. జంభుడు ఈ యంత్ర సముదాయమును లోపింపజేయు శైలాస్త్రము ప్రయోగించ దానినుండి మహాప్రమాణముగల రాళ్ళవాన వ్రవర్తిల్లెను. అది యంత్రములను నూవు గింజలంతగచేసి శత్రువుల తలలపై పడెను. ఆ వేగముతో భూమికూడ బ్రద్దలయ్యెను. సహస్రాక్షుడగు పురందరు (ఇంద్రు) డంతట వజ్రాస్త్రము ప్రయోగించ శైలాస్త్రపు రాలవాన అన్నివైపులను శిథిలమయ్యెను. అది చూచి శైలము వంటివాడగు జంభుడు త్వరితముగా మహాపరాక్రమముతో ఐషీకాస్త్రమును ప్రయోగించి ఇంద్రునికి ప్రియమగు వజ్రాస్త్రమును శమింపజేసెను. దుర్ధరమగు ఐషీకాస్త్రమును వాడు సంధించుచుండగనే దేవసేనలు రథములతో గజములతో కూడ మండిపోయెను. ఐషీకాస్త్ర తేజముతో తమ సేన మండుచుండ సుసత్తముడును పాకా సురుని శాసించినవాడును బలాసురుని చంపినవాడునగు ఇంద్రుడు ఆగ్నేయాస్త్రము ప్రయోగించగా ఐషీకాస్త్రమణగి పోయెను. ఆగ్నేయాస్త్ర విజృంభణముతో జంభుని శరీరము కాలిపోయెను. వాని రథమును సారథియు కాలెను. తన యస్త్రము ఇట్లు ప్రతిహతము కాగా బుద్ధిస్ఫూర్తి కల ఆ దైత్యేంద్రుడు అగ్ని జ్వాలల నణచగల వారుణాస్త్రము ప్రయోగించెను. అంతట క్షణములో ఆకసము మేఘములతోను తళతళ మెరయు మెరపుతీగలలోను ఆకులమయ్యెను. గంభీరమగు మద్దెల మ్రోతల (వంటి ఉరుము) లతో దిక్కులంతట నిండిపోయి ఆకసమునుండి పడు ఏనుగు తొండపు లావు జలధారలతో భూమియంతయు దిక్కులన్నియు నిండిపోయెను. ఆగ్నేయాస్త్రము శమించుటచూచి ఇంద్రుడు మేఘసముదాయమును నశింపజేయగల వాయవ్యాస్త్రమును ప్రయోగించెను.

వాయవ్యమస్త్రమకరోన్మేఘసఙ్ఘాతనాశనమ్‌ | వాయవ్యాస్త్రబలేనాథ నిర్దూతే మేఘమణ్డలే. 106

బభూవ విమలం వ్యోమ నీలోత్పలదళప్రభమ్‌ | వాయునాచాతిరూక్షేణ కమ్పితాస్తేతు దానవాః. 107

నాశకంస్తత్ర తే స్థాతుం రణతు బలినో7పి యే | తతో జమ్భో7భవచ్ఛైలో దశయోజనవిస్తృతః. 108

మారుతప్రతిఘాతార్థం దేవతానాం భయావహః | ముక్తనానాయుధోదగ్రనిర్ముక్తాసిలతాద్రుమః. 109

తతఃప్రశమితే వా¸° దైత్యేన్ద్రే పర్వతాకృతౌ | మహావనిం వజ్రమయీం ముమోచాస్త్రం శతక్రతుః. 110

తయా7శన్యా పతితయా దైత్యస్యాచలరూపిణిం | కన్దరాణి వ్యశీర్యన్త సమన్తాన్నిర్దరాణిచ. 111

తత స్స దానవేన్ద్రస్య శైలమాయా న్యవర్తత | నివర్తితే శైలమయే దానవేన్ద్రో మహోత్కటః. 112

బభూవ కుఞ్జరో భీమో మహాశైలసమా కృతిః | మమర్దచ సురానీకం దన్తైశ్చాభ్యహనత్సురా&. 113

బభఞ్జ పృష్ఠతః కాంశ్చిత్కరేణావేష్ట్య దానవః | తతః క్షపయతస్తస్య సురసైన్యాని వృత్రహా. 114

అస్త్రం త్రైలోక్యదుర్ధర్షం నారసింహం ముమోచహ | తతస్సింహసహస్రాణి నిశ్చేరుస్తత్ర తేజసా. 115

కృతదంష్ట్రాగ్రహాసాని కర్కశాని నఖానిచ | తైర్విపాటితగాత్రో7సౌ గజమాయాం వ్యపోహయత్‌.

వాయవ్యాస్త్రముతో మేఘమండలము చెదరిపోగా ఆకాశము నల్లకలువ పూరేకులవలె నిర్మలమయ్యెను. అతి రూక్షమగు వాయువుచే దానవులు కంపితులైరి. వారిలో బలశాలురుకూడ రణమున నిలువజాలకపోయిరి. అంతట జంభుడు ఆ వాయువును ప్రతిహతము చేయుటకై దశయోజన విస్తారము గల పర్వతమయ్యెను. దేవతలకు భయము గొల్పుచువాడు భయంకరమగు నానాయుధములను ఖడ్గలతలను వృక్షములను దేవతలపై వదలుచుండెను. అంతట శతక్రతుడు (నూరు యజ్ఞములు చేసిన) ఇంద్రుడు పర్వతాకారుడగు జంభునిచే వాయువణచబడగా వానిపై వజ్రమయాస్త్రముతో మహావజ్రమును ప్రయోగించెను. ఆ వజ్రము పడగానే అచలరూపుడగు ఆ దైత్యేంద్రుని కందరములు (గుహలు) నిర్దరములు అంతటను చీలిపోయెను. అంట ఆ దానవేంద్రుని శైలరూపమాయ నివర్తించెను. అంతట మహా తీవ్రుడగు ఆ జంభుడు మహాపర్వత సమానాకార గజముగా మారెను. దేవసేన నది నలుగత్రొక్కెను. దంతములతో దేవతలను చావగొట్టెను. కొందరిని వీపుతో మరికొందరను తొండముతో చుట్టి విరుగగొట్టెను. ఇట్టు వాడు దేవసేనను నశింపజేయుచుండ వృత్రదానవుని చంపిన ఆ ఇంద్రుడు త్రిలోకముల వారికిని ఎదిరించనలవికాని నారసింహాస్త్రమును వదలెను. దాని తేజస్సులో నుండి వేలకొలది నారసింహమూర్తులు బయటికి వచ్చెను. ఆ మూర్తులు కోరల మొనలువిచ్చి నవ్వుచు కర్కశములగు గోళ్ళు కలవై యుండెను. వానినా గోళ్ళతో చీల్చి ఆమూర్తులు వాని గజ సంబంధ మాయను నశిపంజేసెను.

తతశ్చాశీవిషో ఘోరో7భవత్ఫణశతాకులః | విషనిశ్శ్వాసనిర్దగ్ధసుర సైన్యమహారథః. 117

తతోస్త్రంగారుడం చక్రే శక్రశ్చారుభుజస్తదా | తతో గరుత్మతాం తస్మాత్సహస్రాణి వినిర్యయుః. 118

తైర్గరుత్మభిరాసాద్య జమ్భోభుజగరూపధృక్‌ | కృతస్తుఖణ్డశో దైత్య స్సా7స్యమాయా వ్యనశ్యత. 119

ప్రణష్టాయాంతు మాయాయాం తతో జమ్భో మహాసురః | చకారరూపమతులం చన్ద్రాదిత్యపథానుగమ్‌. 120

వివృత్తవదనోగ్రస్తు సమియేషసురపుఙ్గవా& | తతో7స్యవినిశుర్వక్త్రం సమహారథకుఞ్జరాః. 121

సురసేనా7 విశద్భీమాం పాతాలోత్తాలతాలుకామ్‌ | సైన్యేషు గ్రస్యమానేషు దానవేనబలీయసా. 122

శక్రో దీనత్వమాపన్న శ్శ్రాన్తబాహుస్సవాహనః | కర్తవ్యతాం నాధ్యగమ త్ర్పోవాచేదం జనార్దనమ్‌. 123

కిమనన్తరమేవాస్తి కర్తవ్యస్యావశేషితమ్‌ | యదాశ్రిత్య వయంచాస్య దానవస్య యుయుత్సవః. 124

తతోహరి రువాచేదం వజ్రాయుధముదారధీః | న సామ్ర్పతంరణంత్యక్తుం శక్యం కాతరభీతవత్‌. 125

వధ్యాచాశు మహామాయ పురన్దర! రిపోస్త్వయా | మయైష లక్షితో దైత్యో7ధిష్ఠితః ప్రాప్తపౌరుషం. 126

మా శక్ర! మోహమాగచ్ఛ క్షిప్రం మే7స్త్రం స్మర ప్రభో | తతశ్శక్రః ప్రకుపితో దానవంప్రతి దేవరాట్‌. 127

నారాయణాస్త్రం ప్రయతో ముమోచాసురవక్షసి | ఏతస్మిన్నన్తరే దైత్యో వివృత్తాస్యో7గ్రసతక్షణాత్‌. 128

త్రీణిలక్షాణి గన్ధర్వకిన్నరోరగరక్షసామ్‌ | తతో నారాయణస్యాస్త్రం పపాతాసురవక్షసి. 129

మహాస్త్రభిన్నహృదయ స్సుస్రావ రుధిరం బహు | రణాఙ్గణమథోద్గాఢం తత్యాజాసురనన్దనః. 130

దతస్త్రతేజసా తస్య రూపం దైత్యస్య నాశితమ్‌ | తతశ్చాన్తర్దధేదైత్యో వియత్యనభిరక్షితః. 131

అంతట వాడు వందలకొలది పడగలతో అకులమయి తన విషశ్వాసలతో దేవసేనలోని మహారథులను కాల్చి వేయు మహాఘోర సర్పమయ్యెను. అంట మనోహర భుజశక్తి గల ఇంద్రుడు గరుఢాస్త్రమును ప్రయోగించగా దానినుండి వేలకొలది గరుడులు వెలువడిరి. వారు సర్పాకృతియగు జంభుని ఖండములు చేయగా దానితో వాని మాయ నశించెను. తన మాయ నశించగా జంభ మహాసురుడు చంద్ర సూర్యగమన మార్గ వ్యాపియగు అతులరూపము ధరించి నోరు తెరచి సుపుంగవులను మ్రింగ సంకల్పించెను. అంతట మహారథములును మహారథులును గజములును వానినోటిలోనికి పోయెను. దేవసేనయు పాతాలమువలె తాళ్ళ ప్రమాణముగల దౌడలుగల వాని భయంకరమగు నోటిలో ప్రవేశించెను. బలీయుడగు దానవుడు తన సేనను మ్రింగుచుండ ఇంద్రుడును తన వాహనమును అలసిపోగా దీనుడయ్యెను. ఏమి చేయవలయునో తోచక విష్ణునితో నతడిట్లు పలికెను. ఏకర్తవ్యమాశ్రయించి మనము దానవునితో యుద్ధము చేయవదలచితమో దానిలో ఇంకేమి మిగిలియున్నది? అనగా వజ్రాయుధునితో బుద్ధశాలియగు విష్ణునిట్లు పలికెను. చేతకాని పిరికివాడువలె నీవు ఇపుడు యుద్ధము మానుట సముచితముకాదు. పురందరా! నీవు శీఘ్రముగా నీ శత్రు మాయను నశింపచేయవలయును. నాకు ఈ దైత్యుడు తన అధిక పౌరుషమావ్రయించి స్థిరత్వము నొందినవాడుగా కనబడుచున్నాడు. నీవు మోహము నందకుము. శక్రా! ప్రభూ! శీఘ్రముగా నా అస్త్రమును స్మరింపుము. అనగా దేవరాజు ప్రకుపితుడై శుచియై దానవుని వక్షమున నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఇంతకు లోపలనే ఆదైత్యుడు నోరుతెరచి క్షణములో గంధర్వ కిన్నర నాగరక్షో జాతులవారిని మూడు లక్షలమందిని మ్రింగెను. అంతతో నారాయణాస్త్రమా అసురుని వక్షమున పడగా ఖేదిల్లిన ఆ హృదయమునుండి బహురక్తము స్రవించెను. ఆ దైత్యానంద కరుడు మహాగాఢమగు రణరంగమును విడిచిపోయెను. ఆ నారాయణాస్త్ర తేజముతో ఆదైత్యుని ఆ రూపము నశించగా వాడాకాశమున నెచటనో ఎవరికి కానరాకుండ అంతర్హితుడయ్యెను.

గగనస్థస్సదైత్యేన్ద్ర శ్శస్త్రాసనమతీన్ద్రియమ్‌ | ముమోచ సురసైన్యానాం సంహారకరనాన్ఛరా&. 132

ప్రాసాన్నరశ్వథాంశ్చక్రా న్వజ్రాన్బానాన్త్సముద్గరా& | కుఠారా& హులనాషణ్డా న్భిణ్డివాలానయోగదా&.

వవర్ష దానవోరౌద్రో హ్యవంధ్యానక్షయానపి | తైరసై#్త్రర్దానవోన్ముక్తై ర్దేవానీకేషు భీషణౖః. 134

బహుభిర్ధరణీ పూర్ణా శిరోభిశ్చ సకుణ్డలైః | ఊరుభిర్గజహస్తాభైః కరీన్ద్రైశ్చాచలోపమైః. 135

భగ్నోషాదణ్డచక్రాక్షై రథైస్సారథిభిస్సహ | దుస్సఞ్చారా7భవత్పృథ్వీ మాంసశోణితకర్దమా. 136

రుధిరోగ్రహ్రదావర్తా శవరాశిశిలోచ్చయా |

కబంధనృత్యసంకులే స్రవద్వసాపస్రకర్దమే | జగత్త్రయోపసంహృతౌ సమే సమస్తదేహినామ్‌ |

శృగాలగృధ్రవాయసాః పరం ప్రమోదమాదధుః | క్వచిద్వికృష్టలోచనః శవస్య రౌతి వాయసః. 137

వికృష్ణపీవరాంత్రకాః ప్రయాంతి జంబుకాః క్వచిత్‌ | క్వచిత్థ్సితో7తిభీషణః స్వచంచునర్వితో బకః |

మృతస్య మాంసమాహరన్‌ శ్వజాతయశ్చ సంస్థితాః | క్వచిద్వృకో గజాసృజం పపౌ నిలీయతాంత్రతః.

క్వచిత్తురంగ మండలీ వికృష్యతే శ్వజాతిభిః | క్వచిత్పిశాచజాతకైః ప్రపీతశోణితాసవైః |

స్వకామినీయుతైర్ద్రుతం ప్రమోదమత్త సంభ్రమైః | మమైతదానయాననం ఖురో7యమస్తు మే ప్రియః. 139

కరో7యమబ్జసంనిభో మమాస్తు కర్ణపూరకః | సరోషమీక్షతే7పరా దయాంవినా ప్రియం తదా |

పరా ప్రియా హ్యవాప యద్దృతోష్ణశోణితాసవమ్‌ | వికృష్య శావచర్మ తత్ప్రబద్ధసాంద్రపల్లవమ్‌. 140

చకార యక్షకామినీ తరుం కుఠారపాటితమ్‌ | గజస్య దంతమాత్మజం ప్రగృహ్య కుంభసంపుటమ్‌ |

విపాట్యమౌక్తికం పరం ప్రియప్రసాద మిచ్ఛతీ | సమాంసశోణితాసవం పపుశ్చ యక్షరాక్షసాః. 141

మృతాశ్వకేశవాసితం రసం ప్రగృహ్య పాణినా | ప్రియావిముక్త జీవితాత్సమానయాసృగాసవమ్‌ |

న పథ్యతాం ప్రయాతి మే గతం శ్మశానగోచరమ్‌ | నరస్య తజ్జహాత్యసౌ ప్రశస్యకింనరాననమ్‌. 142

సనాగ ఏషనో భయం దధాతి ముక్తజీవితో | న దానవస్య శక్యతే మయా తదేకయా77ననమ్‌ |

ఇతి ప్రియాయ వల్లభా వదంతి యక్షయోషితః | పరే కపాలపాణయః పిశాచయక్షరాక్షసాః. 143

వదంతి దేహి దేహి మే మమాతిభక్ష్యచారిణః | పరే7వతీర్య శోణితాపగాసు ధౌతమూర్తయః |

పితౄన్‌ ప్రతర్ప్య దేవతాః సమర్చయంతి చామిషైః | గజోడుపే సుసంస్థితాస్తరంతి శోణితహ్రదమ్‌.

ఇతి ప్రగాఢసంకటే సురాసరే సుసంగరే | భయం సముజ్ఝ్య దుర్జయా భటాః స్ఫుటంతి మానినః |

తత శ్శక్రో ధనేశశ్చ వరుణః పవనో7నలః. 144

యమో7థ నిరృతిశ్చాపి దివ్యా నస్త్రా న్మహాబలాః | ఆకాశే ముముచుస్సర్వే దానవాభిముఖం తతః. 145

దైత్యేంద్రుడగు జంభుడు ఎవరికిని ఇంద్రియములకు గోచరము కాకుండ ఆకసమునందుండి గొప్ప శస్త్రము లను సురసేనా సంహారకముగా ప్రయోగించెను. వ్యర్థములు కానివియు అక్షయము లునగు ప్రాసములను గండ్ర గొడ్డండ్రను చక్రములను ముద్గరములను గొడ్డండ్రను హులనములను భిండివాలములను ఇనువగదలను రౌద్రుడగు దానవుడు ప్రయోగించెను. దేవసేనలందు దానవునిచే ప్రయోగించబడిన భయంకరములగు బహు సంఖ్యగల అస్త్రముతోను కుండలముతో కూడిన శిరస్సులతోను ఏనుగు తొండములవంటి తొడలతోను కొండలవంటి ఏనుగులతోను విరిగిన కాడులు చక్రములు ఇరుసులు రథములు సారథులు అనువానితోను భూమి నిండినదై రక్తమాంసముల అడుసుతో రక్తపు భయంకర హ్రదములందలి సుడులతో శవరాశులనెడి కొండలతో కూడినదై సంచరించుటకే సాధ్యముకాని దయ్యెను. రణరంగమున కబంధములు గందరగోళముగా నృత్యము చేయుదుండెను. వసయు రక్తమును కారుచు అడుసుగా ఏర్పడెను. ఈస్థితి సమస్త ప్రాణులకును జగత్త్రయ ప్రళయముతో సమమైతోచుచుండెను. ఈ రణములో నక్కలు గ్రద్ధలు కాకులు చాల సంతోషమునందెను. రణరంగములో ఒకచోట కాకి యొకటి శవపు కన్ను పీకుచు కావు కావనుచుండెను. ఒకచోట నక్కలు బలిసిన ప్రేవులు ఈడ్చికొనిపోవుచుండెను. ఒకచోట కొంగ ఒకటి తన ముక్కుతో ఏదియో నమలుచు చూచువారికి భీతిగొల్పుచు కూర్చుండెను. వేరువేరు జాతుల కుక్కలొకచోట మృతుని మాంసమును తినుచుండెను. ఒకచోట తోడేలు ఏనుగు నెత్తురు త్రావి దాని ప్రేవులలో దాగి కూర్చుండెను. ఒకచోట కుక్కలు గుర్రముల శవములను ఈడ్చికొనిపోవుచుండెను. ఒకచోట పిశాచ జాతీయులు రక్తాసవము తెగ త్రావి తమ ప్రియురాండ్రతో కూడి వేగముగా పరుగిడుచు ప్రమోదముతో మత్తిల్లి సంబరపడుచుండిరి. ఈ శవపు మొగము నాకు తెచ్చి ఇమ్ము; ఈ (గుర్రపు) గిట్ట నాకు చాల ఇష్టము; ఈచేయి పద్మువలె నున్నది; నాకిది కర్ణపూరము (చెవి సొమ్ము) గా అగును; అనుచు కొందరు స్త్రీలనుచండ మరియొక పిశాచి రోషముతో కూడి దయ ఇంచుకయు లేక (తాను కోరిన మాంసాదికము తెచ్చి ఈయలేదని) తన ప్రియుని చూచుచుండెను. మరియొక (ప్రియుని) ప్రియురాలు తన ప్రియుడు ఉష్ణరక్తమను ఆసవము తనకు తెచ్చి ఈయగా ఒక శవపు చర్మము ఒలిచి దానిని చిక్కని చిగురాకు (దొన్నె)గా చేసికొనెను. (దానిలో రక్తాసవము త్రాగుచుండెను.) ఒక యక్షస్త్రీ గొడ్డలితో చెట్టునొకటిని నరకి (దానిని ఊయెలకట్టు స్తంభముగా చేసికొనెను.) ఏనుగు దంతమును శిశువుగా చేసికొనెను. ఏనుగు కుంభపు డిప్పను (ఊయెల తొట్టిగా) తీసికొనెను. కుంభమునుండి లభించిన ముత్తెముకూడ తీసికొనిపోయి అవి తన ప్రియునకిచ్చి అతని అనుగ్రహమును కోరెను. యక్షులును రాక్షసులును (అచ్చటచ్చట) రక్తాసవమును త్రావుచుండిరి.

ఒక పిశాచము తన అనుచర పిశాచమును పిలిచి ఇట్లనుచుండెను. శ్మశానమునందు కనబడుచు లభించు ప్రాచిపీనుగు రక్తము నాకు రుచించుటలేదు. తన ప్రియురాలి ఎదుట ప్రాణత్యాగము చేసిన ఆ కిన్నరుని రక్తాసవము నాకు తెచ్చి ఇమ్ము : అది అశ్వశవపు వెంట్రుకల వాసన పట్టించి ఉండవలయును; అని కిన్నరుని ముఖమునెత్తురు మెచ్చుచు ఆ పిశాచము మనుష్యశవమును (మెచ్చక) వదలివేసెను. ''ఆచచ్చిన ఏనుగును చూచుచు న్నను నాకేమియు భయము లేదు.'' ''ఆ దానవుని శవమును నేనొక్కదాననే తినలేను. (ఇద్దరము కలిసి తిందము.)'' అని ఇట్లు పలువిధములుగా యక్షస్త్రీలు (యక్షిణులు) తమ ప్రియులతో పలుకుచుండిరి. మరికొందరు యక్ష రాక్షసులు కపాలపాణులయి ఉండిరి. తెగతిండి పోతునైన నాకు ఇంకను ఇండు - ఇండు; అని కొందరనుచుండిరి. మరికొందరు రక్తనదులలో దిగి స్నానము చేయుచుండిరి. మరికొందరు రక్తముతో పితరులకు తర్పణము చేయుచు మాంసములను పితరులకు అర్పించుచుండిరి. మరికొందరు యక్షరాక్షస పిశాచాదులు ఏనుగుల పీనుగులు తెప్పలుగా నెత్తుటి మడుగులను దాటుచుండిరి.

ఇట్లు మిగుల సంకటమగు దేవాసుర యుద్ధములో వీరభటులు దుర్జయులై నిర్భయులై ప్రకాశించుచుండిరి.

అంతలో మహాబలులగు ఇంద్రుడున కుబేరుడును వరుణుడును వాయువును అగ్నియు యముడును నిరృతియు ఈ అందరును దానవుల వైపునకు ఆకాశములోనికి దివ్యాస్త్రములను వదలిరి.

అస్త్రాని వ్యర్థాం జగ్ముర్దేవానాం దానవంప్రతి | సంరమ్భం యాతి మహతా తద్రణం తుములేనచ. 146

గతిం న వివిదుశ్చాపి శ్రాన్తా దైత్యస్య దేవతాః | దైత్యాస్త్రభిన్నసర్వాఙ్గా నకిఞ్చిత్కరతాం గతాః. 147

పరస్పరం వ్యతీయన్త గావ శ్శీతార్దితా ఇవ | తదవస్థా& హరిర్దృష్ట్వా దేవశ్శక్రమువాచ హ. 148

బ్రహ్మాస్త్రం స్మర దేవేన్ద్ర యస్యబన్ధో న విద్యతే | విష్ణునా నోదితశ్శక్ర స్సస్మారస్త్రం మహౌజసమ్‌. 149

సమ్పూజితం దివ్యమరాతినాశనం సమాహితం బాణమమిత్రఘాతనమ్‌ |

ధనుష్యధృష్యం వినియోజ్య బుద్ధిమాన్త్సస్మార మన్త్రం ససమాధిమానసః. 150

స మన్త్రముచ్చార్య యతాంతరాశయో వధాయ దైత్యస్య ధియా7భిసన్ధితమ్‌ |

వికృష్య కర్ణాన్తమకుణ్ఠదీధితిం ముమోచ వీక్ష్యామ్బరమార్గమున్ముఖమ్‌. 151

అథాసురః ప్రేక్ష్య మహాస్త్రమాహితం విహాయ మాయామవనౌ వ్యతిష్ఠత |

ప్రవేపమానేన ముఖేన శుష్యతా బలేన గాత్రేణచ సమ్భ్రమాకులః. 152

తతో7స్య తస్యాస్త్రవరాభిమన్త్రితశ్శిరోర్ధచన్ద్రః ప్రసభం మహారణ |

పురన్దరస్యాసన బంధతాం గతో నవార్కబిమ్బం వపుషా విడమ్బయ&. 153

కిరీటకోటిస్ఫుటకాన్తిసఙ్కటం సుగన్ధినానాకుసుమాధివాసితమ్‌ |

ప్రకీర్ణధూమజ్వలనాభిమూర్ధజం పపాత జమ్భస్య శిర స్సకుణ్డలమ్‌. 154

తస్మిన్వినిహతే జమ్భే దానవేన్ద్రాః పరాఙ్ముఖాం | సర్వే తే భగ్నసఙ్కల్పాః ప్రయయుర్యత్ర తారకః. 155

తాంస్తు త్రస్తాన్త్సమాలోక్య శ్రుత్వాచ చతురో హతాః | సజమ్భాన్దానవేన్ద్రస్తు సురై రణముఖే తతం. 156

సావలేపం ససందర్పం సగర్వం సపరాక్రమమ్‌ | సాహఙ్కారం స్వసైన్యస్య తారకో రోషమావిశత్‌. 157

సజైత్రం రథామాస్థాయ సహస్రేణ గరుత్మతామ్‌ | సర్వాయుధపరిష్కారం సర్వాస్త్రపరిరక్షితమ్‌. 158

త్రైలోక్యబుద్ధిసన్ధిగ్ధం సువిస్తృతమహాసనమ్‌ | రణాయాభ్యపతత్తూర్ణం సైన్యేన మహతా వృతః. 159

జమ్భూస్త్రక్షతసర్వాఙ్గం త్యక్తైరావణదన్తినమ్‌ | జైత్రం మాతలిసఙ్గప్తం రథమిన్ద్రో7ధ్యతిష్ఠత. 160

తప్తహేమపరిష్కారం మహారత్నసమాచితమ్‌ | చతుర్యోజనవిస్తీర్ణం సిద్ధసఙ్గపరిశ్రితమ్‌. 161

గన్ధర్వకిన్నరైర్గీతమప్సరోనృత్యసఙ్కులమ్‌ | సర్వాయుధసుసమ్భాధం విచిత్రరచనోజ్జ్వలమ్‌. 162

దానవుని విషయములో దేవతల అస్త్రములు వ్యర్థములయ్యెను. ఆ యుద్ధము మహాతుములమయి కోపా వేశమునకు హేతువయ్యెను. దైత్యునితో (డి యుద్ధములో) అలసిన దేవతలకు ఏమి చేయుటకును తోచలేదు. వారి సర్వావయవములును దైత్యాస్త్రములతో గాయములయి వారేమియు చేయజాలకుండిరి. చలికి బాధనొందు గోవులవలె వారొకరిలో మరియొకరు ముడుచుకొనిరి.

ఇట్టి స్థితిలో నున్నవారిని చూచి విష్ణువు ఇంద్రునితో దేవేంద్రా! బంధరహితమగునది కావున బ్రహ్మాస్త్రమును స్మరింపుమనెను. విష్ణుప్రేరణచే నాతడు ధనువునొక బాణమును సంధించెను. అది మహాతేజోయుతము - సంపూజితము - దివ్యము శత్రునాశకము - సంధానము చేసినంతనే శత్రువులను చంపునది; ఎదిరించ నలవికాని యట్టి బాణమును ధనువునందమర్చి యతడు బుద్ధమంతుడు కావున సమాహిత చిత్తుడయి అస్త్రమంత్రమును స్మరించెను. నియమిత నమస్కుడయి యామంత్రముచ్చరించెను. అతడు మొగము ఎత్తి ఆకాశమువైపు చూచుచు - దైత్యవధనుద్దేశించి అభిసంధించినదియు వ్యర్థము కాని తేజము కలదియు నగు ఆబాణమును ఆకర్ణాంతము లాగిన ధనువు నుండి వదలెను.

అంతట ఆ జంభాసురుడును ఈ మహాస్త్ర సంధానము జరుగుట చూచుచునే తన మాయను విడిచి నేలపై నిలిచెను. వాని నోరెండసాగెను. శరీరము వణకసాగెను. బలము తగ్గినందున వాడు తడబడుచు కలతనొంద సాగెను. అంతట ఇంద్రుడు అస్త్రశ్రేష్ఠముతో అభిమంత్రించిన ఆ అర్ధ చంద్రశరము ఆ మహారణమునందు మహా బలముతో వెడలి ఇంద్రుడు చేయు శస్తాస్త్ర ప్రయోగమున అతనికి దగ్గరచుట్టమయి నూతన రవి బింబమును పోలిన రూపముతో శత్రువుపైపడెను. దానితో కిరీటపు కొనయంలి విస్ఫుటకాంతులతో నిండినది సుగంధయుత నానాపుష్పముల వాసనలలో మునిగినది ధూమావృతమగు అగ్నివలె ఒప్పు వెంట్రుకలు కలది కుండల సహితము అగు జంభాసుర శిరము పడిపోయెను.

ఆ జంభాసురుడు హతుడు కాగా దానవేంద్రుడు యుద్ధమునకు పెడమొగమయి భగ్న సంకల్పులై తారకా సురునికడకు పోయిరి. వాడును భయపడిన ఆ దైత్యులను చూచెను. జంభునితో కూడ నలుగురు దానవేంద్రులు రణరంగమున దేవతల చేతిలో మరణించిరని వినెను. తారకుడంతట అభిమానముతో దర్పముతో గర్వముతో పరా క్రమముతో అహఙ్కారముతో తన సైన్యమునకు రోషమెక్కించెను. పిమ్మట తారకుడు విజయశీలమగు రథమారో హించెను. అది వేయి గరుత్మంతులను పూన్చినది; సర్వాయుధములును అమర్చినది; సర్వాస్త్రముల రక్షనము కలది; త్రైలోక్యమందుండు సర్వ సమృద్ధులతో కూడినది; విశాలమగు పెద్ద అసనము కలది; వాడట్లు మహాసేనలతో కూడి శీఘ్రముగా యుద్ధమునకు వెడలెను. అంతకులోగా ఇంద్రుడును జంభుని అస్త్రశస్త్రముల దెబ్బలతో గాయపడిన సర్వావయవములునుకల ఐరావతమును విడిచి మాతలిచే రక్షితమును జయశీలమునగు రథము నధిష్ఠించియుండెను. అది కాచిన బంగారపు అలంకారములు కలది; మహారత్నములు తాపటము చేసినది; చతుర్యోజన విస్తీర్ణము; దానిని సిద్ధ సంఘములు చుట్టియుండెను. దాని చుట్టును గంధర్వులు కిన్నరులు పాడుచుండిరి. అప్సరసలు నృత్యమొనర్చు చుండిరి. ఆ రథము సర్వాయుధములతో దట్టమయి విచిత్రములు నాశ్చర్యకరములునగు కూర్పులతో ప్రకాశించుచుండెను.

తద్రథం దేవరాజస్య పరివార్య సమన్తతః | దంశితా లోకపాలాశ్చ తస్థుస్సగరుడధ్వజాః. 163

తతశ్చ చాల వసుధా తతో(థా) రూక్షో మరుద్వవౌ | తతోమ్భుధయ ఉద్ధూతా హతా చైవ రవిప్రభా. 164

తతో జజ్వాల (జ్వలుశ్‌ ) చాస్త్రాణి తతోకమ్పన్త బాహవః |

తతస్సమన్తముద్భ్రాన్తం తతో7దృశ్యతతారకః || 165

ఏకతస్తారకో దైత్య స్సురసఙ్ఘాస్తథైకతః | లోకావసానమేకస్థం లోకోద్ధరణమేకతః . 166

జగత్తజ్ఞయమేకత్ర జగత్పాలనమేకతః | చరాచరాణి భూతాని సురాసురావిభేదతః 167

తద్ద్విధా7ప్యేకతాం యాతం దదృశుః | ప్రేక్షకా ఇవ | యద్వస్తు కిఞ్చల్లోకేషు త్రిషు సత్తాస్వరూపకమ్‌ .

తత్ర త్వదృశ్యతాశేషం ఖిలీభూతవిభూతికమ్‌ |

అస్త్రాణి తేజంసి దనాని ధైర్యం శోభా ఫలం వీర్యపరాక్రమౌ చ . 169

సర్వౌజసాం తన్నికషం బభూవ సురాసురాణాం తపసాంబలస్య | సురైస్సహతారకాసురయుద్ధమ్‌ .

అథాభిముకమాయాస్తం తారకం నవభిస్తదా. 170

బాణౖ రనలకల్పాగ్రై ర్వివ్యధుర్‌ హృదితే సురాః | స తానచిన్త్య దైత్యేన్ద్ర స్సురబాణక్షతో హృది. 171

సచాపి నవభిరాణౖ స్సురాన్వివ్యాధ దానవః | జగద్ధారణసమ్భూతై శ్శల్యైరివ పురస్సరైః. 172

తతో7చ్ఛిన్న రశవ్రాతం సఙ్గ్రా మే ముముచు స్సురాః | అనన్తరంచ కాన్తానా మస్రుపాతమివానిసమ్‌ .

తదప్రాప్తం వియత్యేన నాశయామాస దానవః | శ##రైర్యతా కుచరితైః ప్రఖ్యాతిం పరమాం గతమ్‌. 174

ఆ దేవరాజ రతమునకు చుట్టుము అన్ని వైపులను దేవతలు హరితో కూడి కవచములు ధరించియుండిరి. భూమి కంపించెను. రూక్షమగు వాయువు వీచెను. సముద్రములు ఉవ్వెత్తుగ లేచి కలతపడెను. రవి తేజము తగ్గెను. అస్త్రములు మండెను. బాహువులు కంపించెను. ఇట్లుసమస్తముద్భ్రాంతమగునంతలో తారకుడట కనబడెను. ఒక వైపు తారకాసురుడు; మరొకవైపు దేవసంఘములు; ఒకవైపు లోకనాశము; మరొకవైపు లోకోద్దరణము; జగత్సంక్షయమొకవైపు; జగత్పాలనము మరియొకవైపు ; ఇట్లు దేవాసుర భేదముతో ఆ సేనాసముదాయము రెండు అయి యున్నను ఒక్కటియే అయియున్నట్లు కలబడుచుండుట సర్వభూతములును ప్రేక్షకులయి చూచుచుండెను. త్రిలోకము లందును సత్తా (ఉనికి) రూపములో నున్న ప్రతియొక వస్తువును ఆసమయములో తమ తమ విభూతులు కోల్పోయి కలబడుచుండెను. అస్త్రములు తేజస్సులు ధనములు దైర్యము శోభ బలము వీర్యము పరాక్రమము- అన్నియు తమ విబూతులను కోల్పోయెను. ఆ సన్నివేసము సురాసురుల సర్వతేజస్సులకును వారి తపోబలమునకును ఒరపిడి రాయి యయ్యెను.

అంతట ఆదేవతలును తమవైపునకు వచ్చుచున్న ఆతారకుని హృదయమును అగ్ని సమానాగ్రములు కల తొమ్మిదేసి బాణములతో కొట్టిరి. వాడట్లు హృదయమున దెబ్బదినియు ఆ బానములు లెక్కచేయక దేవతల నొక్కొక్కరిని తొమ్మిదేసి బానములతో నొప్పించెను. తారకుడు ప్రయోగించు బాణములు లోకనాశమునకే పుట్టిన వేమోయన్నట్లు ముందునకు పరుగిడుచుండెను. తరువాత కాలమున తమ భార్యలకన్నులనుండి నిరంతరము కారనున్న కన్నీరువలె ఎడతెగని బాణరాశిని దేవతలు దానవులపై ప్రయోగించిరి. ఆ బాణరాశి ఇంకను తనకడకు చేరకమునుపే ఇంకను ఆకాశమందుండగనే తారకుడు వానిని కుపుత్త్రుడు మహాప్రఖ్యాతిని పొందినదియు మిగుల నిర్మలమై క్రమమున కీర్తి వహించుచు వచ్చుచున్నదియునగు తన మహావంశమును తన చెడు ననడువడులతో నాశమొదించినట్లు నాశమందించెను.

సునిర్మలం క్రమాయాతం కుపుత్రస్థమహాకులమ్‌ | తతో నివార్య తద్బాణజాలం సురభుజేరితమ్‌. 175

బాణౖర్వ్యోమ దిశః పృథ్వీం పూరయామాస దానవః |

చిచ్ఛేద పుంఖదేశేతు స్వకైర్బాణౖశ్చ లాఘవాత్‌. 176

బాణజాలై స్సుతీక్షాగ్రైః కఙ్కబర్హిణవాజితైః | కర్ణాన్తకృష్టై ర్విమలై స్సువర్ణరజతోజ్జ్వలైః. 177

శాస్త్రార్థే సంశయప్రాప్తా న్యథోక్తా ర్థాన్వి కల్పితైః | తతశ్శతేన బాణానాం శ్రం వివ్యాధ దానవః.

నారాయణంచ సప్తత్యా శ##తేనచ హుతాశనమ్‌ | దశభిర్మారుతం మూర్ధ్ని యమం దశభిరేవచ. 179

ధనదం చైవ సప్తత్యా వరుణంచ దశాష్టభిః | వింశత్యా నిరృతిం దైత్యః పునశ్చాష్టభిరేవచ. 180

వివ్యాధ పునరేకైకం దశభిర్మర్మభేదిభిం | తథా స మాతలిం దైత్యో వివ్యాధ త్రిభిరాశుగైః. 181

గరుడం దైత్యరాజస్తు దశభిశ్చైవ ఆశుగైః | ఆరుణం దశభిశ్చైవ మహిషం దశభిస్తతః. 182

పునశ్చ దైత్యో దేవానాం తిలశో నతపర్వభిః | చకార వర్మజాలాని చిచ్ఛేదచ ధసూంషివై. 183

తతో వికవచా దేవా విధనుష్కా శ్శరక్షతాః | అథాన్యానిచ చాపాని రణ తస్మింస్తు వై శరా&. 184

సురలోకపాలా నీత్వా సమన్తా త్పర్యవారయ& | శ##రైశ్చ సత్వరం దేవా దానవేన్ద్రం ప్రపీడయ&. 185

తతస్తే దేవతాస్సర్వే క్రోధసంరక్తలోచనాః |

తతో దానవః క్రోధసంరక్తనేత్ర శ్శరానగ్నికల్పా న్వవర్షామరాణామ్‌. 186

బాణాన్త్సమాదాయ తథైవ పాలే జఘాన స క్షిప్రమిన్ద్రం సుబాహుమ్‌ |

మహేన్ద్రోప్యకంపద్రథోపస్థేవ రథస్థోపి శీఘ్రం సమోహః పపాత. 187

విలోక్యాన్తరిక్షేపహస్రార్కబిమ్బం పునర్దానవో విష్ణుముద్భూతవీర్యః |

శరాభ్యాం జఘానాంసమూలే సలీలస్తతః కేశవ స్యాపతచ్ఛార్జమగ్రే. 188

తతస్తారకః ప్రేతనాథం పృషత్కై ర్వసుం తస్య సవ్యే స్మరన్‌క్షుద్రభావమ్‌ |

శ##రైరగ్నికల్పైర్జలేశం చ కాలం రణశాతయద్దుర్జయో దైత్యరాజః. 189

శ##రైరగ్నికల్పైశ్చకారావు దైత్యస్తథా రాక్షసం భీతభీతందిశాసు |

పృషత్కైశ్చ రూక్షై ర్వికారప్రయక్తైశ్చ కారానలం లీలయైవాసురేశః. 190

పిమ్మట వాడు దేవతలు తమ భుజములతో ప్రయోగించిన బాణజాలమును నివారించి పిమ్మట బాణములతో భూమ్యాకాశములను దిక్కులను కూడ నింపెను. తన బాణజాలములతో దేవబాణములను పుంఖ (పింజ) ప్రదేశము లందు విరిగిపోవునట్లు ఖండించెను ఆ తారకుని బాణజాలములు మిగుల వాడియగు మొనలు కలవి; గ్రద్ధల - నెమళ్ళ ఈకలు రెక్కలు పింజలందు కట్టియున్నవి; చెవి వరకు ధనువు లాగి వదలినవి; విమలములయినవి; బంగారముతో వెండితో ప్రకాశించుచున్నవి; శాస్త్రార్థము చేయునప్పుడు సంశయ విషయములగు ఆయా యర్థములను వికల్పనములతో విడమరచి ఖండించినట్లు వాడు దేవ బాణములను ఖండించెను. పిమ్మట వాడు నూరు బాణములతో ఇంద్రుని కొట్టెను. డెబ్బదింటితో నారాయణుని నూరింటితో అగ్నిని పదింటితో వాయుదేవుని పదింటితో యముని డెబ్బదింటితో కుబేరుని పదునెనిమిదింటితో వరుణుని ఇరువది ఎనిమిదింటితో నిరృతిని కొట్టి మరల ఒక్కొక్కరిని మర్మ స్థానముల భేదించి నొప్పించు పదేసి బాణములతో కొట్టి మాతలిని మూడింటితోను గరుడుని పదింటితోను అరుణుని పదింటితోను యముని వాహనమగు మహిషమును పదిటితోను కొట్టెను. తరువాత వాడు కణుపు వంపులుగల బాణములతో దేవతల కవచ సమూహములను ధనువులను ముక్కలు చేసెను. దేవతలు కవచములును ధనువులును లేక బానములతో గాయపడి వేరు ధనువులను బానములను తీసికొని వాని చుట్టును మూగిరి. ఆ దానవేంద్రుడు సత్వరముగా దేవతలను శరములతో బాధించెను. అంతట దేవతలందరును క్రోధరక్త నేత్రులయిరి. అంతట దానవుడును క్రోధరక్తనేత్రుడయి అగ్ని సమాన బాణములను అమరులపై వర్షించెను. అటులేవాడు బాణములను తీసికొని ఉత్తమ భుజశాలియగు ఇంద్రుని శీఘ్రముగా నుదుట కొట్టెను. మహేంద్రుడును రథ పీఠమందే వణకిపోయెను. రథమందుండియు శీఘ్రముగా మోహమంది పడిపోయెను. వాడు అంతరిక్షమందు వేయి రవి బింబములు కనబడగా చూచి విష్ణువని గుర్తు తెలిసి తన వీర్యము ఉద్భూతము కాగా రెండు బానములతో నారాయణుని భుజ మూలమునందు కొట్టెను. తరువాత వాడు ప్రేతపతియగు యముని వసువులను వరుణుని అగ్ని కల్పములగు శరములతో గాయపరచెను. నిరృతిని అగ్నిని రూక్షములగు శరములతో అవలీలగా కొట్టి మిగుల నొప్పించెను.

క్షణాల్లబద్ధచిత్తాస్తథా విష్ణుశక్రానలాద్యాస్తు సంహత్య తీక్షైః పృషత్కైః |

ప్రచక్రుః ప్రచణ్డన దైత్యేన సార్ధం మహాసఙ్గరం సఙ్గరగ్రామకల్పమ్‌. 191

హఠాత్తస్యచాపం హరిస్తీక్షబాణౖ ర్హనత్సారథిం దైత్యరాజస్య హృద్యమ్‌ |

ధ్వజం ధూమకేతుః కిరీటం మహేన్ద్రో ధనేశో ధనుః కాఞ్చనానద్ధపృష్ఠమ్‌. 192

యమో బాహుదణ్డం రథాఙ్గాని వాయుర్నిశాచారిణామీశ్వరశ్చాపి వర్మ |

సూతః : తద్దృష్ట్వా యుద్ధ మమరై రకృత్రిమపరాక్రమమ్‌. 193

దైత్యనాధః కృతం సజ్ఖ్యే స్వబాహుయుగబాన్ధవః | ముమోచ ముద్గరం భీమం సహస్రాక్షాయ సఙ్గరే. 194

దృష్ట్వా ముద్గరమాయాన్త మనివార్యమథామ్బరే | రథాదాప్లుత్య ధరణీమగమ త్పాకశాసనః. 195

ముద్గరోపి రథోపస్థే పపాత పరుషస్వనః | స రథం చూర్ణయామాస మమారచ న మాతలిః. 196

గృహీత్వా పతితం దైత్యో జఘానోరసి కేశనమ్‌ | స్కన్ధే గరుత్మతస్సోపి నిషసాద విచేతనః. 197

ఖడ్గేన రాక్షసేన్ద్రంచ నిచకర్త సవాహనమ్‌ | యమంచ పాతయమాస భూమౌ దైత్యో భుసుణ్డినా. 198

వహ్నించ భిణ్డివాలేన తాడయామాస మూర్దని | వాయుంచ దోర్భ్యాముతిక్షప్య పాతయామాస భూతలే. 199

ధనేశంచ దనుఃకోట్యా కుట్టయామాస కోపనః | తతో దేవనికాయానా మేకైకం సమరే తతః. 200

క్షణకాలములో విష్ణువు ఇంద్రుడు అగ్ని మొదలగు వారు తెలివి తెచ్చుకొని ఒకటిగా కూడి వాడి యమ్ములతో ఆ ప్రచండుడగు తారక దైత్యునితోడ యుద్ధము చేసిరి. అది అనేక యుద్ధములతో సమానమై యుండెను. హరి హఠాత్తుగా ఆ దైత్యరాజు సారథిని వాని హృద్యమగు ధనువును వాడి యమ్ములతో కొట్టెను. అగ్ని వాని ధ్వజమును మహేంద్రుడు వాని కిరీటమును కుబేరుడు బంగారుతో వెనుకవైపు నలంకరించియున్న ధనువును యముడు వాని భుజదండమును వాయువు రథాంగములను నిరృతి వాని కవచమును కొట్టిరి. ఆకృత్త్రిమమగు పరాక్రమముతో అమరులు చేయు యుద్ధమును చూచి దైత్యనాథుడగు తారకుడు తన రెండు బాహువులే బంధువులు (సహాయులు)గా పూని భయంకర ముద్గరమును ఇంద్రునిపైకి విసరెను. అది ఆకాశమున వచ్చుచుండుట చూచి ఇంద్రుడు రథము నుండి దుమికిపోయెను. ఆ ముద్గరము పరుషధ్వనితో రథపు నడుమ పడి రథము పొడియయ్యెను. మాతలి మాత్రము చావలేదు. క్రిందపడి విష్ణుని పట్టుకొని వాడు వక్షమున గ్రుద్దెను. అతడు తెలివితప్పి గరుడుని మూపుపై పడిపోయెను. వాడు నిరృతిని వాని వాహనమును గాయపరచెను. భుసుండితో యముని పడగొట్టెను. వహ్నిని భిండి వాలముతో తలపయి కొట్టెను. వాయుదేవుని తన భుజములతో పైకెత్తి భూతమున పడవేసెను. కోపవంతుడై కుబేరుని తన ధనువు కొనతో నలుగ పొడిచెను. తరువాత దేవతా సమూహమునుండి ఒక్కొక్కరిని అసంఖ్యాకములగు అస్త్రములతో అమిత విక్రముడగు ఆ దైత్యేంద్రుడు కొట్టెను.

బఘానాసై#్త్రరసజ్ఖ్యాతైర్దైత్యేన్ద్రోమితవిక్రమః | లబ్ధసంజ్ఞః క్షణాద్విష్ణు శ్చక్రం జగ్రాహ సత్వరమ్‌. 201

దానవేన్ద్రవసాసిక్తం శితశేఖరికాముఖమ్‌ | తన్ముమోచాసురేన్ద్రస్య దృఢే వక్షసి కేశవః. 202

పపాత చక్రం దైత్యస్య హృదయే భాస్రద్యుతిః | విశీర్య తారకోరస్తత్‌ నీలోత్పలమివావనౌ. 203

తతో వజ్రం మహేన్ద్రోపి ప్రముమోచార్జితం చిరమ్‌ | యస్మిన్జయాశా శక్రస్య దానవేన్ద్రరణష్వభూత్‌.

తారకస్య స సమ్ర్పాప్య శరీరం శౌర్యశాలినః | వ్యశీర్యత వికీర్ణార్చిశ్శతధా శోచ్యతాం గతః. 205

వినాశమాగతం ముక్తం వాయునాసురవక్షసి | జ్వలితం జ్వలనాభాసమఙ్కుశం కులిశంయథా. 206

వినాశమాగతం దృష్ట్వా వాయు స్స్వాయుధ మాహవే |

దృఢం శైలేన్ద్రముత్పాట్య పుష్పితద్రుమకన్దరమ్‌. 207

చిక్షేప దానవేన్ద్రాయ పఞ్చయోజనివస్తరమ్‌ | మహీధరం తమాయాన్తం దైత్యస్మ్సితముఖస్తదా. 208

జగ్రాహ వామహస్తేన బాలః కన్దుకలీలయా | తతో దణ్డం సముద్యమ్య కృతాన్తః క్రోధమూర్ఛితః. 209

దైత్యేన్ద్రమూర్ధ్ని చిక్షేప భ్రామ్య వేగేన దుర్జయమ్‌ |

సోసురస్యాపతనూర్ధ్ని దైత్యస్సన్తర్జ్య దుద్రువాన్‌. 210

కల్పాన్తదహనాలోక్య మాజౌచ జ్వలనస్తదా | శక్తిం చిక్షేప దుర్ధర్షాం దానవేన్ద్రాయ సంయుగే. 211

నవా శిరీషమాలేవ సాస్య వక్షసి రాజతే | తతః ఖడ్గం సమాకృష్య కోశాదాకాశనిర్మలమ్‌. 212

ద్యుతిభాసితదిఙ్మోహం లోకపాలోహి నిరృతిః | చిక్షేప దానవేన్ద్రాయ తస్యాఙ్గే నిపపాత హ. 213

క్షణములో విష్ణువు తెలివినొంది సత్వరమే చక్రము గ్రహించి కేశవుడు అప్పటికి ఎందరో దానవుల వసలతో తడిసినదియు వాడియగు మొనలుదేరిన అంచులు గలదియు అగు అద్దానిని అసురేంద్రుని దృఢవక్షమున విడిచెను. అది రవితేజముతో తారకవక్షమునపడి దానిని చీల్చి నల్లకలువ పూవువలె భూమిపయి పడెను. ఇంద్రుడు దానవులతోడి రణములలో తనకు జయాశాప్రదముగా నున్న చిరార్జిత దనమగు వజ్రమును ప్రయోగించెను.

అది శౌర్యశాలియగు తారకుని శరీరమును తాకి తన జ్వాలలు చెల్లాచుదరయి నూరుగా విరిగి దయనీయ దశనందెను. వాయుదేవుడు తారకుని వక్షమున అంకుశమును అగ్నివలె జ్వలించుచున్న దానిని విడువగా అదియు వజ్రమువలెనే నాశమందెను. వాయువు తన ఆయుధము రణమున వ్యర్థమగుటచూచి పుష్పిక వృక్షములు కందరము లందుగల పంచయోజన విస్తృత పర్వతశ్రేష్ఠమును పెల్లగించి ప్రయోగించెను. తారకుడు దానిని అది ఇంకను వచ్చుచుండగనే - బాలుడు బంతిపట్టినట్లు పట్టివేసెను. అంత యముడు క్రోధమూర్ఛితుడయి దుర్జయమగు దండమును పూని ఎత్తి వేగముగా త్రిప్పి తారకుని తలమీదకు విసరెను. దైత్యుడద్దానిని బెదరించి తరిమెను. అగ్నిదేవుడు ఎవరికిని ఎదిరించ నలవికానిదై తనవలెనే ప్రకాశించుచు కనబడు శక్త్యాయుధమును తారకునిపై ప్రయోగించగా అది క్రొత్తగా వికసించిన శిరీష పుష్పమాల వలె వాని శరీరమందొప్పెను. అంతట లోకపాలుడగు నిరృతి ఒరనుండి ఆకాశమువలె నిర్మలమగు ఖడ్గమును లాగి తన కాంతులతో దిగ్భ్రాంతి గొలుపు అద్దానిని దానవేంద్రునిపై విసరగా అది వాని శరీరమునపడి శీఘ్రమే శతఖండములయ్యెను.

పతితశ్చాగమత్తస్య స శీఘ్రం శతఖణ్డతామ్‌ | జలేశస్తూగ్రదుర్గ్రన్థివిషపావకభైరవమ్‌. 214

ముమోచ పాశం దైత్యస్య భుజబన్ధాభిలాషుకః | స దైత్యభుజమాసాద్య సర్పస్సద్యో వ్యపద్యత. 215

స్ఫుటితః కవచఃక్రూరదశనాళిర్మహాహనుః | తతోశ్వినౌ సమన్తాత్తు ససాధ్యాస్సమహోరగాః. 216

యక్షరాక్షసగన్ధర్వా దివ్యనానాస్త్రపాణయః | జఘ్నుర్దైత్యేశ్వరం సర్వే సమ్భూయ సుమహాబలాః. 217

న చాస్యాస్త్రాణ్యసజ్జన్త గాత్రే వజ్రాచలోపమే | తతో రథాదవప్లుత్య తారకో దానవాధిపః. 218

జఘాన కోటిశో దేవాన్కరపార్షిభిరేవ తు | హతశేషాణి సైన్యాని దేవానాంచ ప్రదుద్రువుః. 219

దిశో భీతాని సన్త్యజ్య రణోపకరణానిచ | లోకపాలాంస్తతో దైత్యో బబన్ధ విముఖాన్రణ. 220

సకేశవాన్దృపాశైః పశుమారః పశూనివ | స భూయో రథమాస్థాయ జగామ స్వకమాలయమ్‌. 221

సిద్ధగన్ధర్వసంఘుష్టో విపులాచలమస్తకః | స్తూయామానో దితిసుతై రప్సరోభి ర్వినోదితః. 222

త్రైలోక్యలక్ష్మీస్తద్దేహం ప్రావిశత్స పురం యథా | నిషసాదాసనే పద్మరాగరత్నవినిర్మితే. 223

తతః కిన్నరగన్దర్వనాగనారీవినోదితైః | క్షణం వినోద్యమానస్స ప్రచలన్మణికుణ్డలః. 224

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవాసురఙ్గ్రామే తారకజయో నామ

ద్విజఞ్చాశదుత్తరశతతమోధ్యాయః.

జలాధిపతియగు వరుణుడు భయంకరములగు దుష్ట విషగ్రంథులందలి విషాగ్నులతో భయంకరమగు సర్పరూపమగు పాశాయుధమును దైత్య భుజబంధనముచేయు తలంపుతో వదలగా వాని భుజము దగ్గరకు రాగానే రంపముల వలె భయంకరములగు కోరలతో కూడిన పెద్దదౌడలు పగిలిపోయి ఆ * సర్పము మరణించెను. అంతట వానికి అన్ని వైపులను అశ్వినులు సాధ్యులు నాగులు యక్షరాక్షస గంధర్వులు అందరును ఒక్కుమ్మడియై ఆ మహాబలులు దివ్య నానాస్త్రహస్తులయి దైత్యేశ్వరుడగు తారకునిపై ప్రయోగించిరి. వజ్ర పర్వత సదృశమగు వాని దేహమున అవి గ్రుచ్చుకొననైనలేదు. దానవాధిపుడగు తారకుడు రథమునుండి దుమికి కోట్లకొలదిగా దేవతలను కర పార్శ్వములతో చావగొట్టగా హతశేష దేవసేనలు భీతములయి యుద్ధ సాధనములను వదలి దిశలకు పారెను. రణవిముఖులై పారిపోవు చున్న హరి మొదలగు దేవతలను అందరను లోకపాలురను కూడ కటికవాడు పశువులను బంధించినట్లు వాడు దృఢపాశములతో బంధించెను. వాడు మరల సిద్ధులు గంధర్వులు గానధ్వనులతో తను స్తుతించుచుండ దైత్యులు పొగడు చుండ అప్సరసలు వినోద పెట్టుచుండ విస్తృత శైలమువలె ఉన్నత శిరముతో తన నివాసమునకు పోయెను. త్రైలోక్య రాజ్యలక్ష్మియు వాని శరీరమునందు తన నగరమునందవలె ప్రవేశించెను. నాటినుండి వాడు కింనరులును గంధర్వులును నాగాంగనలును ఆయా వినోద ప్రక్రియలతో తను వినోదపెట్టుచు ఉత్సవములు జరుపుచుండ ప్రచలన్మణికుండలా లంకృతుడయి పద్మరాగమణీ వినిర్మిత పీఠమున కూర్చుండుచు త్రైలోక్యపాలనము సాగించెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారక జయమను

నూట ఏబది రెండవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters