Sri Matsya mahapuramu-2    Chapters   

పఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః.

శ్రీవిష్ణు కృతగ్రసనాసురవధః.

సూతః : తం దృష్ట్వా దానవాః క్రుద్ధా స్సఞ్చేలు సై#్స్వర్బలై ర్యుతాః |

సరఘా ఇవ మాక్షీకహరణ సర్వతోదిశమ్‌. 1

కృస్ణచామరజాలౌఘే సుధావిరచితాజ్కురే | చిత్రపఞ్చవతాకేతు ప్రభిన్నకరటాముఖే. 2

పర్వతాభే గజే భీమే మదస్రావిణి దుర్ధరే | ఆరుహ్యచ నిమిర్దైత్యో హరింప్రత్యుద్య¸° బలీ. 3

తస్యాసన్దానవారౌద్రా గజస్యపరిరక్షిణః | సప్తవింశతిసాహస్రాః కిరీటకవచోజ్జ్వలాః. 4

అశ్వారూఢశ్చ మథనో జబ్భకశ్చోష్ట్రవాహనః | శుమ్భోవివిపులం మేషం సమారుహ్యచ విజ్వలన్‌. 5

అపరే దానవేన్ద్రాస్తు ఖడ్గనానాస్త్రపాణయః | ఆజగ్ముస్సమరేక్రుద్ధా విష్ణుమక్లిష్టకారిణమ్‌. 6

పరిఘేణ నిమిర్దైత్యో మథనోముద్గరేణతు | శుమ్భశ్శూలేన తీక్ష్నేన ప్రాసేనగ్రసనస్తథా. 7

చక్రేణ మహిషః క్రుద్ధో జమ్భశ్శక్త్యామహాసురః | జఘ్నుర్నారాయణం సర్వే శేషాస్తీక్ష్నైశ్చమార్గణౖః. 8

తాన్యస్త్రాణి ప్రముక్తాని శరీరం వివిశుర్హరేః | గురూక్తాఉపదేశాస్తు సుశిష్యాయశుభా యథా. 9

అసమ్భ్రాన్తోరణ విష్ణు రథజగ్రాహకార్ముకమ్‌ | శరాంశ్ఛాశీ విషాకారాం సై#్తలధౌతానజిహ్మగా&. 10

తతోభిసన్ధ్య దైత్యాంస్తా నాకృష్యాకర్ణకార్ముకమ్‌ | అభ్యద్రవద్రణక్రుద్ధో దేవారీనతిపౌరుషః. 11

నిమింవివ్యాధవింశత్యా బాణానామగ్నివర్చసామ్‌ | మథనందశభిర్బాణౖ శ్శుమ్భంపఞ్చభిరేవచ. 12

ఏకేనమహిషంక్రుద్ధో వివ్యాధోరసిపత్రిణా | జమ్భంద్వాదశభిర్భాణౖ స్సర్వాంశ్చైకైకశస్త్రిభిః. 13

తస్యతల్లాఘవందృష్ట్వా దానవాఃక్రోధమూర్ఛితాః | ఘటమానాఃప్రయత్నేన చక్రురత్యద్భుతంరణమ్‌. 14

నూట ఏబదియవ అధ్యాయము.

మహావిష్ణువు గ్రసనాసురుని చంపుట.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పసాగెను: దానవులు అతనిని చూచి క్రుద్ధులయి తమతమ బలములతో కూడి తేనెటీగలు తేనెను తెచ్చుటకై కదలిపోవునట్లు అన్నివైపుల (కును) నుండియు కదలిరి. నల్లని చామరములసమూహముల రాసులును అమృతముతో చేసినట్లున్న దంతపు మొలకలును పలువన్నెల ఐదు పతాకలును కలిగి గండ స్థలపు అంచులనుండి మదము స్రవించుచు పర్వతమువలె నున్న దుర్ధరమగు భయంకర గజమునారోహించి బలశాలియగు నిమిదైత్యుడు హరివైపునకు పోయెను. ఆతని గజమును రక్షించుటకు కిరీటములతో కవచములతో ప్రకాశించు రాక్షసులిరువదియేడు వేలమంది రౌద్ర దైత్యులుండిరి. అశ్వమునెక్కి మథనుడు ఉష్ట్రముపై జంభకుడు ప్రకాశించు క్రుద్ధులయి ఆశ్చర్యకర కర్మాచరణ సమర్థుడగు విష్ణునితో యుద్ధమునకు వచ్చిరి. నిమిదైత్యుడు పరిఘముతో మథనుడు ముద్గరముతో శుంభుడు శూలముతో గ్రననుడు వాడియగు ప్రాసముతో క్రుద్ధుడై మహిషుడు చక్రముతో జంభ మహాసురుడు శక్తితో మిగిలిన మహాసురులు అందరును వాడియమ్ములతో విష్ణుని కొట్టిరి. వారు విడిచిన అస్త్రశస్త్రములు హరి శరీరమును గురువు చేసిన సదుపదేశము శిష్యుని హృదయమునందువలె ప్రవేశించెను.

అంతట విష్ణువు ఏమియు తడబాటు లేక ధనువును తీసికొని సర్పములవంటి శరములను - తైలముతో శుద్ధ పరచబడినవియై సూటిగా పొవు వానిని- వింట సంధించి ధనువాకర్ణాంతముగాలాగి ఆ అతిపౌరుషశాలి క్రుద్ధుడై ఆ దేవ శత్రువులపయికి పరుగెత్తెను. అతడు అగ్ని తేజస్కములగు ఇరువది బాణములతో నిమిని పది బాణములతో మథనుని ఐదింటితో శుంభుని ఒకదానితో పక్షమునందు మహిషుని పండ్రెండింటితో జంభుని ఒక్కొక్కరిని మూడేసి బాణములతో మిగిలిన వారిని క్రుద్ధుడయి కొట్టెను. అతని ఆ శీఘ్రవేగమును చూచి దానవులు క్రోధమూర్ఛితులయి ప్రయత్నపరులయి అద్భుతమగు రణమొనరించిరి.

చిచ్ఛేదాథదనుర్విష్ణో ర్నిమిర్భల్లేనదానవః | సన్ద్యమానంశరంహస్తే చిచ్ఛేదమహిషాసురః. 15

పీడయామాసగరుడం జమ్భస్తీక్ష్నైస్తుసాయకైః | భుజంచాస్యాహనద్గాడం శుమ్భోమ్భోధరసన్నిభః. 16

ఛిన్నే ధనుషి గోవిన్దో గదాంజగ్రాహభీషణమ్‌ | తాంప్రాహిణోత్సవేగేన మథనాయమహాహవే. 17

తామప్రాప్తాంనిమిర్బాణౖ శ్చిచ్ఛేదతిలశోరణ | తాంనాశమాగతాన్దృష్ట్వావిహీనేప్రార్థనామిప. 18

జగ్రాహముద్గరం ఘోరం దివ్యరత్న పరిష్కృతమ్‌ | తంముమోచాతివేగేన నిమిముద్దిశ్యదానవమ్‌. 19

తమాయాన్తంవియత్యేవ త్రయోదైత్యాన్యవారయ& | గదయాజమ్భదైత్యస్తు గ్రససంపట్టసేనతు. 20

శక్త్యాచమహిషోదైత్య స్స్వపక్షజయకాజ్ఞయా | నిరాకృతంతమాలోక్య దుర్జనప్రణయంయథా. 21

జగ్రాహశక్తిమత్యుగ్రా మష్టఘణ్ణోత్కటస్వనామ్‌ | జమ్భాయతాంసముద్దిశ్య ప్రాహిణోద్రణమూర్దని. 22

తామన్తరస్థాం జగ్రాహ గజోదానవనన్దనః | గృహీతాంతాంసమాలోక్య శిక్షామిపవివేకినా. 23

దృఢంభారసహంసారం సతదాదత్తకార్ముకమ్‌ | రౌద్రాస్త్రమభినన్ధాయ తస్మిన్బాణాన్ముమోచహ. 24

అంతట నిమిదానవుడు బాణముతో విష్ణుని ధనువును ఖండించెను. సంధించుచున్న బాణములు ఇంకను చేతియందుండగనే మహిషాసురుడది ఖండించెను. జంభుడు వాడి యమ్ములతో గరుడుని నొప్పించెను. మేఘసమానుడగు శుంభుడు నారాయణుని భుజమును గాఢముగా కొట్టెను. గోవిందుడంతట భయంకరమగు గద తీసికొని మహాయుద్ధమున వేగముతో మథనునిపయి ప్రయోగించెను. అది ఇంకను చేరులోపలనే నిమి దానిని నూపు గింజలంతగా చేసెను. హీనుని విషయమున ప్రార్థనవలె ఆగద వ్యర్థము కాగా హరి దివ్య రత్నాలంకృతమగు ముద్గరము తీసికొని నిమి దానవునిపయి ప్రయోగించెను. అది వచ్చుచు ఇంకను ఆకాశమందుండగనే గదతో జంభ దానవుడను పట్టినముతో గ్రననుడును శక్తితో మహిషుడును ఇట్లు ముగ్గురును స్వపక్ష జయకాంక్షతో దాని నడ్డగించిరి. దుర్జనుని విషయమున చూపిన ప్రీతివలె ఆ ముద్గరము వ్యర్థము కాగా చూచి అత్యుగ్రమును అష్టఘంటలతో భయంకర ధ్వని కలదియు అగు శక్తిని తీసికొని దానిని జంభునిపై ప్రయోగించెను. గజుడను దానవ నందనుడది నడుమ నుండగనే పట్టుకొనెను. వివేకియగు శిష్యుడు గ్రహించిన గురుశిక్షవలె అది గ్రహింపబడుట చూచి దృఢమును భార సహమును సారము కలదియునగు మరియొక ధనువును తీసికొని దానియందు రౌద్రస్త్రము సంధించిన బాణముల సంధించి వదలెను.

తతోస్త్రతేజసా సర్వం వ్యాప్తంలోకంచరాచరమ్‌ | తతో బాణమయంసర్వ మాకాశం సమదృశ్యత. 25

భూర్దశోవిదిశ##శ్చైవ బాణజాలమయంబభౌ | దృష్ట్వాతదస్త్రమాహాత్మ్యం సేనానీర్గ్రసనోసురః. 26

బ్రాహ్మమస్త్రంచకారాశు సర్వాస్త్రవినివారణమ్‌ | తేనసర్వంశమంయాతం రౌద్రస్త్రంలోకఘస్మరమ్‌. 27

అస్త్రే ప్రతిహతేతస్మి న్విష్ణుర్దానవసూదనః | కాలదణ్డాస్త్రమకరో త్సర్వలోకభయజ్కరమ్‌. 28

సన్ధీయమానేతస్మింస్తు మారుతఃపరుషోవవౌ | చకమ్పేచ మహీదేవీ భిన్నాశ్చామ్బుధయోభవ&. 29

తదస్త్రముగ్రందృష్ట్వాతు దానవా యుద్ధదుర్మదాః | చక్రురస్త్రాణిదివ్యాని నానారూపాణిసంయుగే. 30

నారాయణాస్త్రం గ్రసనస్తు చక్రే త్వాష్ట్రం నిమిశ్చాస్త్రవరం ముమోచ |

ఏకైకమస్త్రంచ చకార జమ్భస్తత్రాలదణ్డాస్త్రనివారణాయ. 31

యావచ్చసన్ధాయచ సమ్ప్రయాంతి దైత్యేశ్వరాస్త్వస్త్రనివారణాయ |

తావత్షణనైవ జఘనకోటిం దైత్యేశ్వరాణాం సగజాం సహాశ్వామ్‌. 32

అనన్తరంశాన్తమభూత్తదస్త్రం దైత్యాస్త్రయోగేనతుకాలదణ్డమ్‌ |

శాన్తంతమాలోక్య హరిస్స్వమస్త్రం సవిక్రమేణాపిపరీతమూర్తిః. 33

జగ్రాహచక్రంతపనాయుతాభ ముగ్రం చ మార్తణ్డమివద్వితీయమ్‌ |

చిక్షేప సేనాపతయేభినన్ధ్య కణ్ఠస్థలంవజ్రకఠోరముగ్రమ్‌. 34

చక్రంతదాకాశగతంవిలోక్య సర్వాత్మనాదైత్యపరాస్స్వవీర్యైః |

నాశక్నువన్వారయితుం ప్రచణ్డం దైవంయథాక్రమ్యముధేవజన్తుః. 35

తథాప్రతర్క్యంజయజన్యపర్యం చక్రంపపాతగ్రననస్యకణ్ఠ |

ద్విధాతుకృత్వాగ్రసనస్యకణ్ఠం తద్రక్తధారారుణ ఘెరనాభిః. 36

జగామ భూయోపి జనార్దనస్య పాణిం ప్రవృద్ధానలతుల్యదీప్తిమ్‌. 36

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవాసురసజ్గ్రమే శ్రీవిష్ణుకృతగ్రసనవధో నామ పఞ్చాశదుత్తరశతతమోధ్యాయః.

అంతట చరాచర లోకమంతయు ఆ అస్త్రతేజముతో వ్యాప్తమయ్యెను. ఆకసమంతయు బాణమయమయి కనబడెను. భూమియు దిశలును విదిశలును బాణజాలమయమయి ప్రకాశించెను. ఆ అస్త్ర మాహాత్మ్యమును చూచి సేనాపతియగు గ్రసనాసురుడు సర్వాస్త్రములను వారించగల బ్రాహ్మాస్త్రమును ప్రయోగించెను. దానితో లోకనాశకమగు రౌద్రాస్త్రము శాంతించెను. అది ప్రతిహతము కాగా దానవాంతకుడగు విష్ణువు సర్వలోకభయంకరమగు కాలదండా ద్రములు విచ్చుకొనెను. ఉగ్రమగు ఆ అస్త్రమును చూచి యుద్ధ దుర్మదులగు దానవులు రణమున నానారూపములగు నానాస్త్రములను ప్రయోగించిరి. గ్రసనుడు నారాయణాస్త్రమును నిమి త్వాష్ట్రాస్త్రమును జంభుడు వేరుగ ఒక్కొక్క అస్త్రమును కాలదండాస్త్ర నివారణార్థము ప్రయోగించిరి. కాని దైత్యేశ్వరులీయస్త్రములను సంధించి ప్రయోగించు లోపలనే క్షణకాలములో ఆ నారాయణ ప్రయుక్త కాలదండాస్త్రము కోటిమంది దైత్యేశ్వరులను ఎన్నో గజాశ్వములను కూడ చంపి తరువాత దానవులు ప్రయోగించిన అస్త్రములతో శాంతించెను. హరి తన యస్త్రము శాంతమగుట చూచి విక్రమముతో వ్యాప్తమగు రూపము కలవాడయి పదివేల సూర్యులవలె ప్రకాశించుచు రెండవ సూర్యునివంటి చక్రాయుధమును తీసికొని సేనాపతికి గురిపెట్టి వజ్రమువలె కఠోరమును ఉగ్రమును అగు ఆచక్రమును వాని కంఠస్థలముపై ప్రయోగించెను. ఆచక్రము ఆకాశమునందుండి వచ్చుచుండుట చూచియు దైత్యపరులు తమ వీరత్వముతో వారింపజాలక తమ పురుషకారముతో దైవమును అణగద్రొక్క యత్నించిన మానవులవలె వ్యర్థులయిరి. ఊహింపనలవికాని శక్తికలది యుద్ధజయము కలిగింప సమర్థమునగు అచక్రము గ్రననుని కంఠమును రెండుగా చేసి వాని రక్తధారలతో ఎర్రనై భయంకరమగు తన నాభికలదై ప్రవర్ధమానమగు అగ్నితో సమానమయి మరల జనార్దనుని హస్తమును చేరుకొనెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున విష్ణుడు గ్రననుని చంపుటయను నూట ఏబదియవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters