Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోనపఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః.

యమగ్రసనాసురయో ర్యుద్ధమ్‌.

సూతః : అథ గ్రనస మాలోక్య యమః క్రోధేన మూర్ఛితః | వవర్ష శరవర్షాణి గ్రసనే సూర్యవర్ఛసి. 1

సవిధ్యద్బహుభి ర్బాణౖ ర్గ్రసనో7తిపరాక్రమః | కృతప్రతికృతాకాఙ్షీ ధనురానమ్య భైరవమ్‌. 2

శ##తైః పఞ్చభి రత్యుగ్రై శ్శరాణాం యమమర్దయత్‌ | సో7విచిన్త్య శరవ్రాతం గ్రసనస్యాతిపౌరుషమ్‌. 3

బాణవృష్టిభి రగ్య్రాభి ర్యమో గ్రసన మర్దయత్‌ | కృతాన్తశరవృష్టించ పతితా మభిసర్వతీమ్‌. 4

చిచ్ఛేద శరవర్షేణ గ్రసనోదానవేశ్వరః | విఫలాం తాం సమాలోక్య యమ స్స్వాం శరసంహతిమ్‌. 5

ప్రాహిణక్ష న్ముద్గరం దీప్తం గ్రసనస్య రథంప్రతి | స తం ముద్గరమాయాన్త ముత్పత్య గగనస్థితమ్‌. 6

జగ్రాహ వామహస్తేన యామ్యం దానవనన్ధనః | తమేవ ముద్గరం గృహ్యయమస్య మహిషం రుషా. 7

తాడయామాస వేగేన స పపాతమహీతలే | ఉత్ల్పుత్యాథ యమ స్తస్మా న్మహిషా న్పపతిష్యతః. 8

ప్రాసేన తాడయామాన గ్రసనం వదనేదృఢమ్‌ | స తు ప్రాసప్రహేరేణ మూర్ఛితో న్యపతద్భువి. 9

గ్రసనం పతితం దృష్ట్వా జమ్భో భీమపరాక్రమః | యమస్య భిణ్డివాలేన ప్రహార మకరోద్ధృది. 10

యమస్తేన ప్రహారేణ సుస్రావ రుధిరం ముఖాత్‌ | కృతాన్తం మర్దితం దృష్ట్వా గదాపాణి ర్ధనాధిపః. 11

వృతో యక్షాయుతగణౖ ర్జమ్భం ప్రత్యుద్య¸°రుషా |

జమ్భో రుషా తమాయాన్తం దాన వానీకసంవృతః. 12

జగ్రాహ వాక్యం ప్రాజ్ఞస్తు యథాస్నిగ్ధేన భాషితమ్‌ | గ్రసనోలఘసంజ్ఞోథ యమస్య ప్రాహిణోద్గదామ్‌. 13

మణిహేమపరిష్కారాం గుర్వీమరిమర్దనీమ్‌ | తామాపత న్తీం సమ్ప్రేక్ష్య గదాం మహిషవాహనః. 14

గదాయాః ప్రతిఘాతార్థం గర్దన్జలదభైరమ్‌ | దణ్డంముమోచ కోపేన జ్వాలమాలాసమాకులమ్‌. 15

నూట నలువది తొమ్మిదవ అధ్యాయము.

దేవదానవ యుద్ధము.

యమగ్రసనాసుర యుద్ధము.

సూతుడు ఇట్లు చెప్పసాగెను : అంతలో యముడు గ్రసనాసురుని చూచి క్రోధవ్యాప్తుడయి ఆ సూర్యతేజస్కునిపై బాణములు కురిసెను. ఆ అతిపరాక్రముడా దెబ్బలకు ప్రతీకారముగా భయంకర ధనువెక్కుపెట్టి పంచశత భీకర బాణములతో యముని నొప్పించెను. అతడాతని అతి పౌరుషమును లెక్కపెట్టక ఉత్తమ బాణ వర్షములతో గ్రనసుని బాధించెను. ఆ దానవేశ్వరుడది తనమీదకు వచ్చుచుండగనే తన శరవర్షముతో ఖండించెను. తన శరరాశి వ్యర్థ మగుటచూచి యముడు వాని రథముమీదకు ముద్గరమును విసరెను. అది వచ్చుచు ఆకసమందుండగనే గ్రసనుడెడమ చేత ఎగసిపట్టి దానితోనే యముని మహిషమును కోపమును వేగముతో కొట్టి దానిని నేలబడగొట్టెను. మహిషము క్రింద పడునంతలో యముడు క్రిందకు దుమికి ప్రానముతో గ్రసనుని మొగముపై కొట్టెను. వాడు మూర్ఛితుడయి క్రింద పడెను. భయద పరాక్రముడగు జంభాసురుడది చూచి భిందివాలముతో యముని వక్షమున కొట్టెను. అతడు నెత్తురు నోటక్రక్కెను. యముడట్లు ముర్ధితుడగుట చూచి ధనాధిపతి కుబేరుడు పదివేల యక్షులతో కూడి గదాపాణియై జంభు నెదుర్కొనెను. దానవ సేనా పరివృతుడై జంభుడా కుబేరుని - ప్రాజ్ఞుడు తన మిత్రుని వాక్యమును గ్రహించినట్లు అందుకొనెను. అంతలో గ్రసనుడును తెలివినొంది యమునిపయి గద విసరెను. అది బరువయినది - స్వర్ణాలంకృతము - శత్రువుల మర్దించునది. అది తనపై వచ్చుచుండుట చూచి యముడు ప్రతీకారముగా మేఘమువలె గర్జించుచు కోపముతో జ్వాలామాలా సమాకులమగు దండము విసరెను.

సగదాం వియతిప్రాప్య రరాజామ్బుధరో యథా | సఙ్ఘర్షమభవత్తాభ్యాం శిలాభ్యామివ దుస్సహమ్‌. 16

తాభ్యాం నిశ్శేషనిర్హ్రాదజడీకృతదిగ న్తరమ్‌ | జగద్వ్యాకులతాంయాతం ప్రళయాగమశఙ్కయా. 17

క్షణాత్ప్రశాన్తనిర్హ్రాదం జ్వలదుల్కాసమాచితమ్‌ | నిష్పేషేణానయోర్భీమ మభూద్గగనగోచరమ్‌ 18

నిహత్యాథగదాన్దణ్డ స్తతోగ్రసనమూర్ధని | జిత్వా శియమివానర్థో దుర్వృత్తస్యాపతద్దృఢః. 19

స తు తేనప్రహారేణ దృష్ట్వా సతిమిరాదిశః | పపాత భూమౌ నిస్సంజ్ఞో భూమిరేణువిరూషితః. 20

తతో హాహారవో ఘోర స్సేనమో రుభయోరభూత్‌ | తతో ముహూర్తమాత్రేణ గ్రసనఃప్రాప్యచేతనామ్‌. 21

ఆవశ్య త్స్వాంతనుం ధ్వస్తాం విలోలాభరణామ్బరామ్‌ | సచాపి చిన్తయామాస క్షతప్రతికృతక్రియామ్‌. 22

మద్విధే7వస్తునిపుంసి ప్రభోః పరిభవోదయః | మయ్యాశ్రితాని సైన్యాని జితేమయివినాశినః. 23

అసమ్భావితఏవాస్తు జనస్స్వచ్ఛన్ధచేష్టితః | నతు వ్యర్థస్సదాహృష్ట స్స్వభావనిధనోనరః. 24

ఏవం సఞ్చిన్త్య వేగేన సముత్తస్థౌమహాబలః | ముద్గరం కాదణ్డాభం గృహాత్వాగిరిసన్నిభమ్‌. 25

గ్రసనోఘోరసఙ్కల్ప స్సన్దష్టోష్ఠపుటచ్ఛదః | రథేనత్వరితోగచ్ఛ న్నాససాదాంతకంరణ. 26

సమాసాద్యం యమంయుద్ధే | గ్రసనోభ్రామ్యముద్గరమ్‌ | వేగేనమహతారౌద్రం చిక్షేపయమమూర్ధని. 27

విలోక్య ముద్గరం దీప్తం యమః సంభ్రాంతలోచనః |

వంచయామాస దుర్ధర్షం ముద్గరంసమహాబలః. 28

తస్మిన్నపసృతేదూరం చండానాం భీమకర్మణామ్‌ | యామ్యానాంకింకారాణాంతు సహస్రంనిష్పి పేషహ. 29

తతస్య్వాం నిహతాందృష్ట్వా ఘోరాం కిఙ్కరవాహినీమ్‌ |

అగమత్పరమం క్షోభం నానా ప్రహరణాయుతమ్‌. 30

గ్రసనస్తు సమాలోక్యం తాం కిఙ్కరమాయీంచమూమ్‌. 31

మేనే యమసహాస్రాణి దృష్టాని యమమాయయా | విగ్రాహ్య గ్రసనస్సేనాం వ్యసృజఞ్ఛస్త్రవృష్టయః. 32

ఆ దండమాకనమున గ్రసనుని గదతో చేరి మేఘమువలె ప్రకాశించెను. ఆరెంటి సంఘర్షము శిలా సంఘర్షము వలె దుఃసహమయ్యెను. వాటి ధ్వనితో దిగన్తరము జడత్వమునందెను. ప్రళయము రానున్నదేమోయని జగత్తులు వ్యాకులత పొందెను. క్షణములో ఆ నిర్హ్రాదము శాంతించెను. రాపిడి నిప్పురవ్వలు ఆకసమున నిండెను. గగన దృశ్యము వీటి రాపిడితో భయంకరమయ్యెను. దండము గదను పిండిచేసి అనర్థము దుర్వర్తనుని సంపదను జయించినట్లా దానవుని జయించి వానితలపై పడెను. దానితో వాడు దిక్కులు చీకటులై తోచగావాడు తెలివితప్పి దూళితో మునిగి క్రిందపడెను. దాన ఇరుసేనలందు ఘోర హాహాకారము రేగెను. ముహూర్తమాత్రలో గ్రసనుడు తెలివంది తన శరీరము ఆభరణములు చెల్లాచెదురయి ధూళి దూసరమగుట గమనించెను. దీనికి ప్రతీకారము ఏమియని యోజించెను. ''నావంటి పనికిమాలిన వాని మూలమున ప్రభువునకవమానము; సేనలు నాపయి ఆధారపడియున్నవి; నేను నశించిన అవియు నశించును. తను ఇచ్చచొప్పున ప్రవర్తించు వానికి గౌరవము లేదు. ప్రాణికి మరణము స్వాభావికము. వాడు వ్యర్థుడయి సదా హర్షముతో బ్రదికిన లాభ##మేమి?'' అని ఆలోచించి ఆ మహాబలుడు వేగిరముగా లేచి కాలదండమును కొండను పోలిన ముద్గరమును చేబూని ఘోర సంకల్పుడై పెదవులు కొరుకుచు రథముపై శీఘ్రముగా పోయి యముని సమీపించెను. రౌద్రమగు ముద్గరమును మహావేగమున త్రిప్పి యముని తలపైకి విసరెను. ప్రకాశించుచు తన పయికివచ్చు దానిని చూచి యముడు కన్నులు తడబడ తాను మహాబలుడు కావున ఎట్లో దానిని తప్పించుకొనెను. ఆతడు తప్పించుకొని దూరము పోగా గ్రసనుడు భీమకర్ములును మహాకోపులు భయంకరులునగు వేలకొలది యమకింకరులను నలుగగొట్టెను. నానాయుధ సహితమగు తన ఘోర కింకరవాహినియు నిహతమగుటచూచి యముడు చాల కలతనందెను.

ఐనను కింకరమయముగానున్న యమసేనను చూచి గ్రసనుడు యముడే తన మాయతో వేలకొలది యములను సృష్టించెనేమో అనుకొనెను. వాడు ఆ సేనను ఎదిరించి శరవర్ష మద్దానిపై కురిసెను.

కల్పాన్తఘోరసఙ్కాశో బభూవక్రోధమూర్ఛితః | కాంశ్చిద్బిభేదశూలేన కాంశ్చిద్బాణౖరజిహ్మగైః. 33

కాంశ్చిత్సిపేషగదయా కాంశ్చిన్ముద్గరవృష్టిభిః | కాంశ్చిత్పాసప్రహారైస్తు దారుణౖస్తాడయ న్త్సతు. 34

అపరేబహుశ స్తస్య సలీలంబాహుమణ్డలైః | శిలాభిరపరేజఘ్న ర్ద్రుమైరన్యే మహోచ్ఛ్రయైః. 35

తస్యాపరేతుదశ##నై ర్నఖైరపిచందశయ9| అపరే ముష్టిభిఃవృష్ఠం కిఙ్కరాః ప్రహర న్తిచ. 36

అభిద్రుతస్తు తైర్ఘోరైర్గ్రసనః క్రోధమూర్ఛితః | ఉత్సృష్టగాత్రం భూపృష్ఠే నిష్పిపేషసహస్రశః. 37

కాంశ్చిదుచ్ఛ్రాయముష్టీభి ర్జఘ్నేకిఙ్కరసఞ్చయాన్‌ | సతుకిఙ్కరయుద్ధేన గ్రసనశ్శ్రమమాప్తవా9. 38

తమాలోక్యయమశ్శ్రాన్తం నిహతాంచస్వవాహినీమ్‌ | ఆజగామనముద్యమ్య దణ్డంమహిషవాహనః. 39

గ్రసనస్తు తమాయాన్త మాజఘ్నే గదయోరసి | అచిన్తయిత్వాతత్కర్మ గ్రసనస్యాన్తకస్తతః. 40

జఘ్నేచరథమూర్ధన్యాన్‌ వ్యాఘ్రాన్డణ్డనకోపనః | నచలద్భిర్విమథితై ర్వ్యాఘ్రైర్నసవికృష్యతే. 41

సంశయంపురుషస్యేవ చిత్తందైత్యస్య తద్రథమ్‌ | సముత్సృజ్యతదాదైత్యః పదాతిర్థరణీం గతః. 42

యమంభుజాభ్యామాదాయ యోధయామాసదానపః | యమోపి శస్త్రాణ్యుత్సృజ్యబాహుయుద్ధేవ్యవర్తత. 43

గ్రసనఃకటిస్త్రేతు యమంగుహ్యబలోద్ధతః | భ్రామయామాస వేగేన విచిత్తమివసమ్భ్రమః. 44

యమోపి కణ్ఠ7వష్టభ్య దైత్యం బాహుయుగేనతు | వేగేన భ్రామయామాస తముత్షిప్యమహీతలే. 45

తౌ తతో ముష్టిభిర్జఘ్ను ర్నర్దయన్తౌ పరస్పరమ్‌ | దైల్యేన్ద్రస్యాతికాయత్వా త్తతశ్శ్రాన్తభుజో యమః. 46

స్కన్ధే నిధాయ దైత్యస్య ముఖంవిశ్రాన్తుమైచ్ఛత | తమాలక్ష్య తతో దైత్య శ్శ్రాన్తమన్తకమోజసా. 47

నిష్పిపేష మహీపృష్ఠే బహుశః పార్‌ష్ణపాణిభిః | యావద్యమస్య వదనా త్సుస్రావ రుధిరం బహు. 48

వాడు క్రోధమూర్ఛితుడై కల్పాంతురుద్రుడయ్యెను. శూలముతో సూటిగపోవు బాణములతో గదతో ముద్గరములతో దారుణప్రాన ప్రహారములతో వారినందర చితుకగొట్టెను. కింకరులలో కొందరు విలాసముగా తమ బాహుమండలములతోను కొందరు రాలతోను కొందరు మహోన్నత వృక్షములతోను గ్రసనుని కొట్టిరి. మరికొందరు వానిని గోళ్ళతో పీకిరి; పండ్లతో కొరికిరి. మరి కొందరు పిడికిళ్ళతో వీపుపయి గ్రుద్ధిరి.

వారట్లు తన వెంటబడి బాధించగా గ్రసనుడు క్రోధముతో నిండి వారిని వేలమందిని శరీరములు ఎత్తి విడిచి నేలపై నలుగరాచెను. మరికొందరను పిడికిళ్ళు ఎత్తి కొట్టి చంపెను. దానితోవాడు బడలిక చెందెను. వాని చేతిలో తన సేన చచ్చుటయు వాడట్లగుటయు చూచి యముడు దండమెత్తి వాని పయికి పోవుచుండ వాడది గమనించి గదతో నతనిని కొట్టెను. యముడది లెక్క సేయక వాని రథమును లాగు వ్యాఘ్రములను చంపగా ఆ రథము కదలక పోయెను. సంశయముత్తదు పురుషుని చిత్తమును వదలినట్లు గ్రసనుడా రథము వదల పదాతియై యమునితో బాహు యుద్ధమునకు తలపడెను. యముడును ఆయుధములను వదలి వానితో నియుద్ధమునకే సిద్దపడెను. గ్రసనుడు తన కటివస్త్రములతో యముని మూటకట్టి పిచ్చివానిని సంభ్రమము త్రిప్పినట్లు గిరగిర త్రిప్పెను. యముడంతలో తన బాహు ద్వంద్వముతో వానిమెడ పట్టుకొని గిరగిర త్రిప్పి నేలపైకి విసరెను. తరువాత వారు పరస్పరము పిడికిళ్ళతో గ్రుద్దుకొనిరి. దైత్యుడతికాయుడు కావున దీనితో యముడు అలసెను. అతడు రాక్షసుని మొగము వీపుపై ఉంచుకొని విశ్రాంతి తీసికొనదలచెను. వాడదిగమనించి అతనిని నేలపై అదిమి తన బాహువులతో మోకాళ్ళతో నలుగపొడిచెను.

కుబేరజమ్భాసురయుద్ధమ్‌.

నిర్జీవితం యమం దృష్ట్వా తతస్సస్త్యజ్య దానవః | జయంప్రాప్యోద్ధతం ముక్త్వా నాదందైత్యోమహాబలః. 49

స్వకంసైన్యం సమాసాద్య తస్థౌగిరిరివాచలః | ధనాధిపస్య జమ్భేన సాయకైర్మర్మభేదిభిః. 50

దిశోవరుద్ధాః క్రుద్ధేన సైన్యం తస్యాహతం భృశమ్‌ | తద్దృష్ట్వా కర్మదైత్యస్య ధనాధ్యక్షః ప్రతాపవా&. 51

ఆకర్ణాకృష్టచాపస్తు జమ్భంవీక్ష్యమహాబలః | హృదివివ్యాధబాణానాం సహస్రేణాగ్నివర్చసామ్‌. 52

సారథిం చ శ##తేనాలం ధ్వజందశభిరేవచ | హస్తపాదంచ సప్తత్యా మార్గణౖర్దశభిర్దనుః. 53

మార్గణౖర్బర్హిపక్షాజ్కై సై#్తలధౌతైరజిహ్మగైః | తాడయామాసతంతీక్ష్నై శ్శరైర్వక్షసిదానవః. 54

తత్షనం ధైర్యమాలమ్బ్య ధనురాకృష్య భైరవమ్‌ | కిరన్బాణసహస్రాణి నిశితాని ధనాధిపః. 55

దిశశ్చ విదిశోభూమి మనీకాన్యసురస్యచ | సూదయామాస వేగేన నఞ్ఛాద్య రవిమణ్డలమ్‌. 56

జమ్భోపి శరమేకైకం శ##రైర్బహుభిరాహవే | చిచ్ఛేద లఘునన్ధానో ధనేశస్యాతిపౌరుషః. 57

తతో ధనేశ సజ్క్రుద్ధో దానవేన్ద్రస్య కర్మణా | వ్యధమత్తస్యసైన్యాని నానాసాయకవృష్టిభిః. 58

తద్దృష్టాతుకృతంకర్మ ధనాధ్యక్షేణ దానవః | గృహీత్వా ముద్గరంభీమ మాయసం హేమభూషితమ్‌. 59

ధనదాసుచరాన్యక్షా న్నిష్పిపేష సహస్రశః | తేవధ్యమానాదైత్యేన ముఞ్చన్తో భైరవాన్రవా&. 60

రథంధనవతేస్సర్వే పరివార్యవ్యవస్థితాః | దృష్టా తానర్దితాన్భృత్యా ఞ్ఛూలం జగ్రాహదారుణమ్‌. 61

తేనదైత్యసహస్రాణి సూదయామాస సత్వరః | క్షీయమాణష్వనేకేషు దానవః క్రోధమూర్ఛితః. 62

జుగ్రాహ పరశుం దైత్యో మర్దనంవిద్విషాంతతః | స తేన శితధారేణ ధసభర్తుర్మహారథమ్‌. 63

చిచ్ఛేద తిలశో దైత్యఆఖు స్స్నిగ్ధమివామ్బరమ్‌ |

యముడు నిర్జీవుడగుటచూచి దానవుడతనిని విడిచి ఉద్ధతమగు జయము పొందినందున ఆ మహాబల దైత్యుడు గర్జించి తన సైన్యమును చేరి కొండవలె అచలుడయి నిలిచెను. వాడు కుబేరునికి మర్మభేదకములుగా వదలిన బాణములతో దిక్కులునిండి మూతపడెను. వాడు కోపించి కుబేరసేనను కూడ మిగుల నొప్పించెను. అది చూచి ప్రతాపవంతుడా కుబేరుడును ధనువాకర్ణాంతములాగి అగ్ని తేజస్కములగు వేలకొలది బాణములను వాని వక్షముపై వదలెను. నూరిటితో సారథిని పదింటితో ధ్వజమును డెబ్బదితో వాని కాలుసేతులను పదిటితో ధనువును కొట్టెను. విషతైలముతో పూయబడి నెమలి ఈకలు పింజలందు కట్టియుండి సూటిగాపోవు బాణములను జంభుడు కుబేరుని రొమ్మున నాటెను. కుబేరుడు తత్‌క్షణమే ధైర్యము పూని భయంకరమగు ధనువు లాగి వాడియగు వేలకొలది బాణములతో దిక్కులను విదిక్కులను భూమిని జంభుని సేనను కప్పివేసెను. రవి మండలము మూసెను. దానవసెనను చంపెను. అతి పౌరుషుడగు జంభుడు కుబేరుని ప్రతియొక బాణమును తన వేలకొలది బాణములతో ఖండించెను. కుబేరుడు కోపించి నానా సాయక వర్షములతో వాని సేనను నశింపజేయసాగెను. అది చూచి జంభుడు స్వర్ణాలంకారములు కలది అయోమయము భయంకరమునగు ముద్గముపూని ధన దానుచరులగు యక్షులను వేలకొలదిగా నలుగగొట్టెను. వారా దెబ్బలు తినుచు తాళ##లేక భయంకరముగా ఆర్తధ్వనులు చేయుచు కుబేరుని రథమునకు చుట్టును మూగిరి. తన యనుచరులట్లు మర్దితులగుట చూచి కుబేరుడు దారుణమగు శూలము చేబూనెను. వేలకొలది రాక్షసులను చంపెను. దానవుడు తన వారు అనేకులు నశించుచుండుటచూచి శత్రు మర్దనమగు పరశువు పూని వాడి వాదరగల ఆ గండ్రగొడ్డలితో కుబేరుని రథమును నున్నని బట్టను ఎలుక ఖండించినట్లు నూపు గింజంత ముక్కలుగా నరకెను.

పదాతిరథ విత్తేశో గదామాదాయ భైరవామ్‌. 64

మహాహవవిమర్దేషు దృప్తశత్రువినాశనీమ్‌ | అధృష్యాం సర్వభూతానాం బహువర్షగణార్చితామ్‌. 65

నానాచన్దనదిగ్ధాజ్గీం దివ్యపుష్పాధివాసితామ్‌ | నిర్మలాయోమయీం గుర్వీ మమోఘాం హేమభూషణామ్‌. 66

చిక్షేప మూర్ధ్ని సజ్క్రుద్ధో జమ్భస్చచ ధనాధిపః | ఆయాన్తీంతాం సమాలోక్య తడిత్సజ్ఘాతమణ్డితామ్‌. 67

దైత్యో గదావిఘాతార్థం శస్త్రవృష్టిం ముమోచహ | చక్రాణికుణపాన్ప్రాసా న్భుసుణ్డీం పట్టసానపి. 68

హేమకేయూరబద్ధాభ్యాం బాహుభ్యాం చణ్డవిక్రమః | వ్యర్థీకృత్యచతాన్త్సర్వా నాయుధా న్దైత్యవక్షసి. 69

ప్రస్ఫురన్తీవపాతాశు మహోల్కేవాద్రికన్దరే | నతయాహిభతోగాఢం పపాత రథకూబరే. 70

స్రోతోభిశ్చాస్యరుధిరం సుస్రావ గతచేతనః | జమ్భంతు నిహతంమత్వా కుజమ్భో ఘోరనిస్వనః. 71

కుబేరకుజమ్భాసురయుద్ధమ్‌

ధనాధిపస్య సజ్క్రుద్ధో వాక్యేనాతీవ కోపితః | చక్రేబాణమయంజాలం దిక్షు యక్షాధిపస్యతు. 72

చిచ్ఛేదబాణజాలం త దర్ధచన్దైశ్శితైస్తతః | ముమోచ శరవృష్టించ తస్యయక్షాధిపోబలీ. 73

సతం దైత్యశ్శరవ్రాతం చిచ్ఛేద నిశితైశ్శరైః | వ్యర్థీకృతాంతు తాం వృష్టిందృష్ట్వా నచధనాధిపః. 74

శక్తింజగ్రాహ దుర్ధర్షాం హేమఘణ్ణావిభూషితామ్‌ | బాహునా రత్నకేయూరకా న్తిసన్తానహాసినా. 75

స తాం నిరూప్యవేగేన కుజమ్భాయముమోచహ | సా కుజమ్భస్య హృదయం దారయామాస దారుణా. 76

విత్తేహాస్వల్పసత్త్వస్య పురుషస్యావిభావితా | అథాస్య హృదయం భిత్త్వా జగామధరణీతలమ్‌. 77

తతో ముహూర్తాదస్వస్థో దానవోదారుణాకృతిః | జగ్రాహ పట్టసం దైత్యః ప్రాంశుంశితశిభాముఖమ్‌. 78

స తేన పట్టసేనాజౌ ధనదస్య స్తనాస్తరమ్‌ | వాక్యేన తీక్‌ష్ణరూపేణ మర్మాన్తరవిసర్పిణా. 79

నిర్బిభేదాభిజాతస్య హృదయం దుర్జనోయథా | తేన పట్టసపాతేన ధనేశోతీవ మూర్ఛితః. 80

నిషసాద రథోవస్థే జర్ఘరః పర్వతో యథా |

అంతట కుబేరుడు పదాతియై భయంకరమగు గదను తీసికొనెను. అది ఇదివరకు మహాయుద్ధ విమర్ధములందు గర్వించిన శత్రువుల నశింజేసినది; ఏ ప్రాణులకును ఎదిరించరానిది; ఎన్నోఏండ్లనుండి పూజింపబడుచుండినది; ఆ పూజతో బహుచందనములు పూయబడి బహు పుష్పములతో అధివాసితమయి యుండినది; నిర్మలము అగు ఉక్కుతో చేయబడి బరువయి అమోఘమయి స్వర్ణభూషణ భూషితమయినది; కుబేరుడు సంక్రుద్ధుడయి జంధుని తలపైకి దానిని విసరెను. మెరుపుల గుంపులతో అలంకృతమయి వచ్చుచున్న దానిని చూచి జంభుడు దాని నాపుటకయి బంగారు భూజకీర్తులతో అలంకృతములయిన తన బాహువులతో బాణవర్షమును చక్రములను కుణవములను భుశుండులను ప్రానములను వట్టినములను ప్రయోగించెను. ఆగద వాటినన్నిటిని వ్యర్థములనుగాజేసి మహోల్క ప్రకాశించుచు గిరి కందరమున పడినట్లు వాని పక్షమున వచ్చిపడెను. ఆ గదాఘాతముతో వాడు రథపు కూబరమున (నొగలమీద) తెలివి తప్పి పడి పోయెను. వాని ముక్కులనోట రక్తము స్రవించెను.

జంభుడు మరణించెనని తలచి కుజంభుడు కుబేరుని వాక్యమునివి మిగుల కోపించి భయంకర నినాదము చేయుచు అతని చుట్టును బాణపువల అల్లెను. బలియగు యక్షేశ్వరుడు వాడియగు అర్థ చంద్రబాణములతో ఆవలను చేదించి కుజంభునిపై శరవర్షము కురిసెను. అదైత్యుడు ఆ శర సమూహమును నిశిత శరములతో ఛేదించెను. తన శరవృష్టి వ్యర్థమగుటచూచి కుబేరుడు హేమఘంటా భూషితమగు శక్తిని (ఆయుధమును) దుర్దర్షమగు దానిని తీసికొని రతనాల భుజకీర్తుల కాంతి రాశితో నవ్వుచున్నదో అన్నట్లున్న తన బాహువుతో వేగమున గిరగిర త్రిప్పి కుజంభునిపై వదలెను. ఆ దారుణశక్తి కుజంభ హృదయమును చీల్చెను. గుండె నిబ్బరము లేనివాని హృదయమున వానిని తెలియక విచారణ చేయకపోవుటచే దూరిన ధనాశవలె వాని హృదయమును భేదించి భూమిని చేరెను. ఆ దైత్యుడు ముహూర్తకాల మన్వస్థుడై తేరుకొని దారుణాకారుడై పొడవయి వాడి మొనగల పట్టినమును చేతధరించి దానితో కుబేరుని వక్షమును హృదయ మర్మాంతర్భాగమున నాటుకొను తీక్‌ష్ణరూపమగు వాక్యముతో ఉత్తమవంశజాతుని హృదయమును వలె చీల్చెను. ఆ పట్టనముపడగానే కుబేరుడు మిగుల మూర్ఛితుడై శిథిలమయిన పర్వతమువలె రథపు అసనమున కూలబడెను.

నిరృతికుజమ్బయుద్ధమ్‌

తథాగతంతు తందృష్ట్వా ధనేశం నరవాహనః. 81

ఖడ్గహస్తో నిరృతిస్తు నిశాచరబలానుగః | అభిదుద్రావ వేగేన కుజమ్భం భీమవిక్రమమ్‌. 82

అథదృష్ట్వాతు దుర్ధర్షం కుజమ్భో రాక్షసేశ్వరః | చోదయామాస దైత్యాంశ్చ రాక్షసేశరథంప్రతి. 83

సదృష్ట్వా చోదితాంస్తేన బలాంస్తా నతిభీషణా& | రథదాప్లుత్యవేగేన భూషణద్యుతిభాస్కరః. 84

ఖడ్గేన కమలానీవ వికోశేనామ్బరత్విషా | చిచ్ఛేద బుజువక్త్రాణి విచిత్రాణి సమన్తతః. 85

నియమ్య తమదశ్చోర్ధ్వం దీర్ఘబాహుర్మహాసినా | సన్దష్టోష్ఠపుటాటోపభ్రుకుటీవికటాననః. 86

ప్రచణ్డకోవరక్తాక్షో న్యకృంతద్దానవాన్రణ | తతోనిశ్శేషితప్రాయాం విలోక్య స్వామనీకినీమ్‌. 87

దృష్ట్వాకుజమ్భోబహుధా రాక్షసేన్ద్రమభిద్రవత్‌ | లబ్ధసంజ్ఞోథ జమ్భస్తు ధనాధ్యక్షపదానుగా&. 88

జీవగ్రాహాస్త్సజగ్రాహ బద్ధ్వా పాశైస్సహస్రశః | మూర్తిమన్తితు రత్నాని నిధానానిచదానవాః. 89

వాహనానిచ దివ్యాని విమానాని సహస్రశః | ధనేశో లబ్ధసంజ్ఞస్తు తామవస్థాంవిలోక్యచ. 90

నిశ్శ్వస్యదీర్ఘముష్ణంచ రోషతామ్రవిలోచనః | ధ్యాత్వాస్త్రం గారుడందివ్యం బాణం సన్ధాయకార్ముకే. 91

ముమోచదానవానీకే తంబాణంశత్రుదారణమ్‌ | ప్రథమంకార్ముకాత్తస్య నిశ్చేరుర్ధూమరాజయః. 92

అనన్తరంస్ఫులిజ్గానాం కోటయో దీప్తవర్చసామ్‌ | తతోజ్వాలాకులంవ్యోమ చకారాస్త్రం సమస్తతః. 93

ధనవతి ఇట్లగుటచూచి నరవాహనుదగు నిరృతి నిశాచరబలము తనవెంట రాగా ఖడ్గ హస్తుడయి భీమవిక్రముడగు జంభునిమీదకు పరుగెత్తెను. ఎదిరించ నలవికాని నిరృతినిచూచి రాక్షసేశ్వరుడగు కుజంభుడు తన దైత్యులను అతని రథము పయికి పురికొల్పెను. అతి భీషణులగు వారిని చూచి తన భూషణ కాంతితో రవివలె వెలుగు ఆ నిరృతి శీఘ్రమే తన రథమునుండి దుమికి వచ్చి ఒరనుండి తీయగా ఆకాశమువలె నీలపు కాంతితో వెలుగు ఖడ్గముతో కమలములను వలె దైత్యుల ఋజు ముఖములను ఖండించెను. ఆకుంజంభుని క్రిందకి మీదకు రాకుండ అదుపులో నుండి ప్రచండకోవరక్త నేత్రుడై పెదవులు కొరుకుచు కనుబొమలు ముడిపడి వికటమయి కనబడగా దానవులను ఖండించెను. వాడుతన సేన దాదాపు నిఃశేషమగుట చూచి బహువిధముల నిరృతిమీదకు పరుగెత్తెను. అంతలో జంభుడు తెలివొంది కుబేరుని యనుచరులను వేలకొలదిమందిని పాశములతో సజీవముగా బంధించెను. అతని కాంతివంతములగు రత్నములను ధననిధులను దివ్య వాహనములను విమానములను దానవులు స్వాధీనమొనర్చుకొనిరి. అంతలో ధనపతి తెలివొంది ఆ స్థితిచూచి దీర్ఘమగు వేడి ఊర్పు విడిచి రోషరక్త నేత్రుడయి గారుడాస్త్రమును ధ్యానించి దానితో అభిమంత్రించిన బాణమును వింట సంధించి దానిని దానవ సేనపయి ప్రయోగించెను. అది శత్రు విదారణమయినది. దానిచే మొదట అతని ధనువునుండి పొగలగములు రేగెను. తరువాత దీప్త తేజస్కములగు కోట్లకొలది నిప్పుల రవ్వలు చలరేగెను. పిమ్మట ఆ అస్త్రము ఆకసమును అన్ని వైపులను జ్వాలలతో ఆకులపరచెను.

తతఃక్రమేణదుర్వారం నానారూపంతదాభవత్‌ | ముహూర్తం చాభవల్లోక మన్ధకారసమావృతమ్‌. 94

తతోన్తరిక్షేదృశ్యన్తే తేజాంసితు పరస్పరమ్‌ | కుజమ్భస్తం సమాలోక్య దానవోతిపరాక్రమః. 95

అభిదుద్రావవేగేన పదాతిర్దనదంనద& | అథాభిముఖమాయాన్తం దైత్యం దృష్ట్వాధనాధిపః. 96

బభూవసమ్ర్బమా విష్టః పలాయన పరాయణః | తతఃపలాయినస్తస్య మకుటోరత్నమణ్డితః. 97

పపాతభూతలే దీప్తో మహోల్కేవతదామ్బరాత్‌ | శూరాణామభిజాతానాం భర్తర్యవసృతే రణాత్‌. 98

మర్తుం నజ్గ్రమశిరసి యుక్తం తద్భూషణాగ్రతః | ఇతివ్యవస్యదుర్దర్షా నానాశస్త్రాస్త్రపాణయః. 99

యుయుత్సవస్థ్సితా యక్షా మకుటంపరివార్య తమ్‌ | అభిమానధనా వీరా ధనధస్యపదానుగాః. 100

తానమర్షాచ్చసమ్ప్రేక్ష్య దానవశ్చణ్డపౌరుషః | భసుణ్డీం భైరవాకారాం గృహీత్వాశైలగౌరవామ్‌. 101

రక్షిణో మకుటస్యాథ నిష్పిపేషనిశాచరః | తాన్ప్రమథ్యాథ దనుజో మకుటం తం స్వ కేరథే. 102

సమారోప్యామరరిపు ర్జిత్వా ధనదమాహవే | ధనానిరత్నానిచ మూర్తిమన్తి తథానిధానానిశరీరవన్తి. 103

ఆదాయ సర్వాణి జగామదైత్యో జమ్భస్స్వసైన్యం దనుజేన్ద్రనజ్ఘే |

ధనాధిపో విప్రతికీర్నమూర్ధజో జగామదీన స్సురభర్తుర న్తికమ్‌. 104

కుజమ్భేనాథ సంసక్తో రజనీచరనన్దనః | మాయామమోఘమాశ్రిత్య తామసీం రాక్షసేశ్వరః. 105

మోహయామాస దైత్యేన్ద్రం జగత్కృత్వా తమోమయమ్‌ | తతోవిఫలనేత్రాణి దానవానాం బలానిచ. 106

న శేకుశ్చలితుంతత్ర పదాదపి పదంతతః | తతో నానాస్త్రవర్షేణ దానవానాం మహాచమూమ్‌. 107

జఘ్ను ర్నీహారతిమిరపరమాతురవాహనామ్‌ | వధ్యమానేషు దైత్యేమకుజమ్భే మూఢచేతసి. 108

మహిషో దానవేన్ద్రస్తు కల్పాన్తామ్భోదసన్నిభః | అస్త్రం చకార సావిత్ర ముల్కానజ్ఘాతమణ్డితమ్‌. 109

అంతట ఆ అస్త్రము క్రమముగ ఎవరికి నడ్డగింప సాధ్యముకాని నానారూపములు ధరించెను. ముహూర్త కాలము లోక మంధకారావృతమయ్యెను. అంతలో అంతరిక్షమున పరస్పర వ్యాప్తములగు తేజస్సులు కానవచ్చెను. అంతట అతి పరాక్రముడగు కుజంభుడు పదాతియై కుబేరుని వైపునకు పరుగెత్తెను. ఆదైత్యుడు తనవైపునకు పరుగెత్తి వచ్చుట చూచి కుబేరుడు తడబడుచు పారిపోవ సిద్ధపడెను. పారిపోవు అతని రత్నాలంకృత కిరీటము అంబరము నుండి మహోల్కవలె ప్రాకాశించుచు భూతలమున పడెను. ఎవరికి నెదిరించరానివారును నానా శస్త్రాస్త్రహస్తులునభి మానధనులునగు ధనదా (కుబేరా) ను చరులగు యక్షులు ఆ పడిన మకుటముచుట్టును మూగి తమ ప్రభువు రణమునుండి పారిపోయినపుడు అతని భూషణము రణరంగమున పడిపోయి ఉండగా దానిముందు మరణించుటయే వీరులకు ఉచితము అనుచు యుద్ధమునకు సంసిద్ధులయిరి. చండ పౌరుషుడగు దానవుడా కుంజభుడు అది చూచి యోర్చజాలక భయంక కాకృతియై కొండంత బరువయిన భుశుండిని పట్టి మకుట రక్షకులను నలుగగొట్టెను. తరువాత వాడా కిరీటమును మూర్తివంతములగు కుబేరుని రత్నములను నిధులను కూడ తన రథమందుంచుకొని ఇట్లు కుబేరుని జయించి దనుజేంద్ర సంఘము నడుమనున్న తన సేనకడకు పోయెను. కుబేరుడు దీనుడై జుట్టు విరయబోసికొని ఇంద్రునికడకు పోయెను.

అంతట నిరృతి కుజంభునితో తలపడి అమోఘమగు తామనమాయనవలంబించి జగత్తంతయు నంధకారమయము కావించి ఆ దైత్యేంద్రుని మోహపరచెను. దానిచే దానవబలములు కనులు కనబడక తామున్న చోటినుండి అడుగైన కదల్చజాలకపోయిరి. నిరృతి సైనికులును మంచు చీకటిలో వరమాతురములయిన వాహనములతోనున్న దానవసేనను నానాస్త్ర వర్షముతో చావగొట్టిరి. ఇట్లు దైత్యులు చావుదెబ్బలు తినుచుండ కుజంభుడు మూఢచేతస్కుడు కాగా ప్రళయమేఘ సమానుడగు మహిష దానవేంద్రుడు ఉల్కలగమితో అలంకృతమయిన సావిత్రమను అస్త్రమును సంధించి ప్రయోగించెను.

విజృమ్భత్యథసావిత్రే పరమాస్త్రే ప్రతాపిని | ప్రణాశమగమత్తీవ్రం తమో ఘోరమనన్తరమ్‌. 110

తతోస్త్రవిస్ఫులిజ్గాజ్కం నభఃకృత్స్నంప్యజాయత | ప్రోత్ఫుల్లారుణపద్మౌఘం శరదీవామలంసరః. 111

తతస్తమసిసమ్భ్రాన్తే దైత్యేన్ద్రాః ప్రాప్తచక్షుషః | చక్రుఃక్రూరేణమనసా దేవానీకంమహాద్రుతమ్‌. 112

శ##సై#్త్రరమర్షాత్సంసక్తై ర్భుజజ్గాస్త్రవినోదితమ్‌ | అథాదాయధనుర్ఘోర మిఘుంచాశీవిషోపమమ్‌. 113

కుజమ్భోదావతక్షిప్రం రక్షోరజరథంప్రతి | రాక్షసేన్ద్రస్తమాయాన్తం విలోక్యసపదానుగమ్‌. 114

వివ్యాధనిశితైర్బాణౖః క్రూరాశీవిషభూషణౖః | ఆదానంచనసన్ధానం నమోక్షశ్చాస్యలక్ష్యతే. 115

చిచ్ఛేదతైశ్శరవ్రాతై స్తాఞ్ఛరానతిలాఘవాత్‌ | ధ్వజంశ##రేణతీవ్రేణ నిచకర్తామరద్విషః. 116

సారథించాస్యభ##ల్లేన రథ్యాన్బాణౖరపాహరత్‌ | కుజమ్భఃకార్ముకం దృష్ట్వా రాక్షసేన్ద్రస్యసంయుగే. 117

రోషరక్తేక్షణయుగో రథాదాప్లుత్యదానవః | ఖడ్గంజగ్రాహదుష్టాత్మా శరదమ్బరనిర్మలమ్‌. 118

చర్మచోదయఖండేందుదశ కేనవిభూషితమ్‌ | అభ్యద్రవద్రణదైత్యో రక్షోధిపతిమోజసా. 119

తంరక్షోధిపతిఃప్రాప్తం ముద్గరేణాహనద్యుధి | స తు తేనప్రహారేణ క్షీణస్సమ్భ్రాన్తమానసః. 120

తస్థావచేష్టోదనుజో యథాధీరోధరాధరః | సముహూర్తాత్సమాశ్వస్తో రాక్షసేన్ద్రోతిదుర్జయః. 121

రథమారుహ్యజగ్రాహ రక్షో వామకరేణతు | కేశేషునిరృతిందైత్యో జానునా೭೭ క్రమ్యధిష్ఠితః. 122

తతఃఖడ్గేనచశిర శ్ఛేత్తు మైచ్ఛదమర్షితః | ఏతస్మిన్నన్తరేదేవో వరుణోపామ్పతిర్ద్రుతమ్‌. 123

పాశేనదానవేన్ద్రస్య బబన్దాశుభుజద్వయమ్‌ | తతోబద్ధభుజం దైత్యం విఫలీకృతపౌరుషమ్‌. 124

తాడయామాసగదయా దయాముత్సృజ్యపాశభృత్‌ |

స తు తేనప్రహారేణ శ్రోత్రతఃక్షతజంవమ&. 125

దధార కాలమేఘస్య రూపంవిద్యుల్లతాభృతః | తదవస్థంతు తం దృష్ట్వా కుజమ్భం మహిషాసురః. 126

వ్యావృత్తవదనోగాథో గ్రస్తుమైచ్చత్సురాపుభౌ | నిరృతిం వరుణంచైవ తీక్‌ష్ణదంష్ట్రోత్కటాననః. 127

ప్రతాపి అగు సావిత్రమను అస్త్రశ్రేష్ఠము విజృంభించుచుండ వెంటనే ఘెరాంధకారము నశించెను. ఆకాశ మంతయు నిప్పురవ్వలతోనిండి శరత్కాలమున వికసించిన ఎర్ర దామరలు కల నిర్మల సరస్సువలె ప్రకాశించగా అంతవరకు చీకటిలో సంభ్రాంతులయియున్న దానవులకు కన్నులు వచ్చి వారు క్రూర మనస్కులయి దేవసేనను తరిమిరి. కోపముతోవారు వదలిన బాణములతో సార్పాస్త్రమును తొలగ గొట్టబడెను. అంతట భయంకర ధనువును సర్పమువంటి బాణములను తీసికొని నిరృతి రథము మీదకు కుజంభుడు పరుగెత్తెను. అతడు తన అనుచరులతో తన వైపునకు వచ్చుచుండుట చూచి నిరృతి క్రూర సర్ప విషము పూసిన నిశిత బాణములతో వారిని కొట్టెను. బాణములను తీసికొనుట సంధించుట విడుచుట తెలియరానంత వేగముగా ప్రయోగించిన బాణములతో నిరృతి కుజంభుని బాణములను మిగుల శీఘ్రముగా ఛేదించి ఒక తీవ్ర బాణముతో వాని ధ్వజమును కూల్చి ఒకదానితో సారిథిని మరికొన్ని బాణములతో గుర్రములను చంపెను. కుజంభుడా యుద్ధ విజృంభణలో నిరృతి ధనువును చూచి క్రోధ రక్తనేత్రుడయి తన రథమునుండి దుమికి శరదాకాశమువలె నిర్మలమగు ఖడ్గమును పది చంద్ర ఖండములు గల వలకను (డాలును) తీసికొని నిరృతిమీదకు పరుగెత్తెను. అతడు ముద్గరముతో దైత్యుని కొట్టగా వాడా దెబ్బతో నిశ్చేష్టుడై ధీరమగు పర్వతమువలె ఊరకుండిపోయెను. అతి దుర్జయుడగు రాక్షసేంద్రుడా కుజంభుడు ముహూర్తకాలముతో తెప్పరిల్లి నిరృతి రథమెక్కి ఎడమచేతితో అతనిని పట్టుకొని మోకాలితో అతనిని త్రొక్కిపట్టి జుట్టు పట్టుకొని మహాక్రోధముతో అతని తల నరుక పూనెను. ఇంతలో వరుణదేవుడు పాశముతో ఆ దానవేంద్రుని భుజద్వయమును బంధించెను. అట్లు దైత్యుని పౌరుషము విఫలము కాగా వరుణుడు దయమాలి గదతో వానిని కొట్టగా వాడా దెబ్బతో చెవులనుండి రక్తము క్రక్కుచు మెరపులతో నిండిన మేఘమువలె ప్రకాశించెను. కుజంభుడట్లగుట చూచి మహిషాసురుడు వాడి కోరలతో భయంకరమగు నోరు తెరచుకొని నిరృతిని వరుణుని మ్రింగుటకు పూనెను.

తావభిప్రాయమాలక్ష్య తస్యదైత్యస్య దూషితమ్‌ | త్యక్త్వా రథపథంభీతౌ మహిషస్యాతిరంహసః. 128

విప్రద్రుతౌ జవాదుగ్ర ముఖాభ్యాం భయవిహ్వలౌ | జగామ నిరృతిః క్షిప్రం శరణం పాకశాసనమ్‌. 129

క్రుద్ధస్తు మహిషోదైత్యో వరుణం సమభిద్రవత్‌ | తమన్తకముఖాసన్న మాలోక్యహిమదీధితిః. 130

చక్రేసోమాస్త్రనిస్సృష్ట హిమసజ్ఘాతసజ్కటమ్‌ | వాయవ్యం చాస్త్రమతం చన్ద్రశ్చక్రేద్వితీయకమ్‌. 131

వాయునా తేనచన్ద్రేణ సంశోషేణ హిమేనచ | వ్యథితాదానవస్సర్వే శీతభిన్నవిపౌరుషాః. 132

స శేకుశ్చలితుం తత్రనాస్త్రాణ్యాదాతుమేవచ | మహాహిమనిపాతేన శ##సై#్త్రశ్చన్ద్రప్రచోదితైః. 133

గాత్రాణ్యసురసైన్యానా మదహ్యన్తసమన్తతః | మహిషో నిష్ప్రయత్నస్తు శీతేనాకమ్పితాననః. 134

కక్షావాలమ్బ్య పాణిభ్యా ముపవిష్టోహ్యధోముఖః | సర్వే తే నిష్ప్రతీకారా దైత్యాశ్చన్ద్రమసాకృతాః. 135

రణచ్ఛాం దూరతస్త్యక్త్వా తస్థుస్తేజోవినార్దితాః | తత్రాబ్రవీ త్కాలనేమి ర్దైత్యాన్కో పేన దీపితః. 136

భోభోశృజ్గారిణశ్శూరా స్సర్వశస్త్రాస్త్రపారగాః | ఏకైకోపి జగత్సర్వం శక్తస్తులయితుంభుజైః. 137

ఏకైకోపి క్షమోగ్రస్తుం జగత్సర్వంచరాచరమ్‌ | ఏకైకస్యాపివర్యాప్తా న సర్వేపిదివౌకసః. 138

కలాం పూరయితుం యత్నా త్షోడశీమపివిక్రమైః | కింభయార్తాశ్చ తిష్ఠధ్వం సమరే పరనిర్జితాః. 139

న యుక్తమితి శూరాణాం విశేషా ద్దైత్యజన్మనామ్‌ | రాజాచ దితిజోస్మాకం తారకో లోకతారకః. 140

విరతానాం రణాదస్మా త్ర్కుద్ధః పాణా& హరిష్యతి | శీతేన నష్టస్మృతయో భ్రష్టవాక్యరుచ స్తథా. 141

మూకాస్తథాభవన్దైత్యా రణదర్శసవిహ్వలాః |

కుజంభుని దురాలోచనను గమనించి నిరృతి వరుణులు మహావేగియగు మహిషుని రథమార్గము విడిచి భయ విహ్వలులయి భయంకర ముఖములతో వేగముగా పారిపోయిరి. వారిలో నిరృతి శీఘ్రమే ఇంద్రుని శరణుజొచ్చెను. మహిషుడు కోపముతో వరుణుని మీదకు పరుగెత్తెను. వరుణుడట్లు యముని నోట పడనుండుట చూచి చంద్రుడు సోమాస్త్రము ప్రయోగించి మంచురాశితో సంకటము కలిగించెను. వాయవ్యాస్త్రముకూడ ప్రయోగించెను. అది సాటి లేనిది. ఆ మంచుతోను గాలిచే కలిగిన సంశోషము (ఎండుట) తోను దానవులు వ్యథనొందిరి. హిమశీతముచే వారి పౌరుషములు వ్యర్థమయ్యెను. వారు కదలలేక పోయిరి. అస్త్రశస్త్రముల తీసికొనలేకుండిరి. ఆ మహా హిమపాతముతోను చంద్రుడు ప్రయోగించిన అస్త్రములతోను దానవ శరీరములు కాలిపోవుచుండెను. చలితో మొగము వణకుచుండగా మహిషుడు నిశ్చేష్టుడయి చేతులతో చంకలు ముడిచి పట్టుకొని తలవంచుకొని కూర్చుండెను. ఇట్లు దానవులందరు చంద్రునిచే బాధలపాలయి తేజోరహితులయి ప్రతీకారమేమియు చేయలేక యుద్ధ సంకల్పము దూరముగా వదలి ఉండిపోయిరి. అంతట కాలనేమి కోపోద్దీపితుడయి దానవులతో నిట్లనెను. సర్వ శస్త్రాస్త్ర పారంగతులును శృంగారులునగు దానవ శూరులారా! మీలో ఒక్కొక్కరే తమ భుజములతో జగత్తంతయు ఊపివేయగలవారుగదా! చరాచర జగత్తంతయు మ్రింగగలవారు గదా! దేవతలందరు కలిసియు తమ విక్రమములన్నియు కలిపినను వారు మీలో ఒక్కొక్కని శక్తిలో పదారవవంతును పూరించుటకు కూడ చాలరే! ఇట్టి మీరు పరులకు ఓడి భయార్తులయి ఊరకుందురేల? ఇది ఏ శూరులకును తగదు; దైత్యజాతీయులకు మొదలే తగదు. లోక తారకుడగు తారకుడు మన ప్రభువు; మనము ఇట్లు యుద్ధ మును చాలించి వెనుకకు వచ్చినచో అతడు కోపించి మనల చంపును. అతడిట్లనుచున్నను దైత్యులు చలిచే స్మృతులు లేక వాక్య ప్రకటన శ క్తిలేక మూగవారయిరి. యుద్ధము చూడవలెనన్నంతనే వారికి కాళ్ళు వణకుచుండెను.

తాన్దృష్ట్వా నష్టచేతస్కా& దైత్యాన్శీతేన సాదితా&. 142

మత్వా కాలక్షమం కార్యం కాలనేమిర్మహాసురః | ఆశ్రిత్య దానవీం మాయాం వితత్య స్వం మహఃపునః.

పూరయామాన గగనందిశోవిదిశఏవచ | నిర్మమేదానవేన్ద్రో7సౌ శరీరేభాస్కరాయుతమ్‌. 144

దిశశ్చమాయయాచంద్రైః పూరయామాసపావకైః | తతో జ్వాలాకులంసర్వం త్రైలోక్యమభవత్తదా.

తేనజ్వాలాసముహేన హిమాంశురగమచ్ఛమమ్‌ | తతఃక్రమేణవిభ్రష్టం శీతదుర్దినమాబభౌ. 146

తత్బలందానవేన్ద్రాణాం మాయయాకాలనేమినః | తద్దృష్ట్వాదానవానీకం లబ్దసంజ్ఞందివాకరః. 147

ఉవాచచారుణందృష్ట్వా కోపాల్లోకైకలోచనః | దివాకరః: వహారుణ! రథంశీఘ్రం కాలనేమిరథంయతః. 148

విమర్దస్తత్రవిషమో భవితాశూరసజ్షయః | జితఏష శశాజ్కేన యద్వయంబలమాశ్రితాః. 149

ఇత్యుక్తశ్చోదయామాస రథంగరుడపూర్వజః | ప్రయత్నవిధృతైరశ్వై స్సితచామరవాలిభిః. 150

జగద్దీపోథభగవా న్జగ్రాహవితతంధనుః | శరౌ చ ద్వౌ మహాభాగో విషమాశీవిషద్యుతీ. 151

శమ్బరాస్త్రేణసన్ధాయ బాణమేకం ససర్జసః | ద్వితీయమిన్ద్రజాలేన యోజితం ప్రముమోచహ. 152

శమ్బరాస్త్రేణరూపాణాం క్షణాచ్చక్రేవిపర్యయమ్‌ | దేవానాందానవంరూపం దానవానాంచదైవికమ్‌. 153

మత్వా పరాన్త్సకానేన జఘ్నే ఘోరాస్త్రలాఘవాత్‌ | కాలనేమీరుషావిష్టః కృతా న్తఇవసజ్షయే. 154

కాంశ్చిత్ఖడ్గేన తీక్‌ష్ణన కాంశ్చిత్తారాశ్మవృష్టిభిః | కాంశ్చిద్గదాభిర్ఘోరాభిః కాంశ్చిద్ఘోరైఃపరశ్వథైః. 155

శిరాంసి కేషాంచిదపాతయత్సమం కాంశ్చిద్రథీంశ్చోష్ట్రరథాంశ్చ వేగతః |

కాంశ్చిత్పిపేషాథ రథాశ్వవేగా త్కాంశ్చిచ్చ కాష్ఠోద్ధతముష్టిపాతైః. 156

ఆ దైత్యదానవువు స్మృతిరహిత చేతస్కులగుటయు చలితో శక్తి రహితులగుటయు చూచి మహాసురుడా కాలనేమి అనమయమున కుచితమగు కార్యమాలోచించుకొనెను. దానవమాయ నాశ్రయించి తన తేజస్సును విస్తరించి దానితో గగనమును దిక్కులను విదిక్కులను నింపెను. తన శరీరమునందుండియే పదివేల భాస్కరులను నిర్మించెను. మాయతో దిక్కులన్నియు భయంకరాగ్నులతో నింపెను. దానితో త్రైలోక్యమును జ్వాలాకులమయి చంద్రుని శక్తి శమించెను. మంచు చల్లదనముతో ఏర్పడిన దుర్దినము తొలగెను. ఇట్లు కాలనేమి మాయతో దానవసేనకు తెలివి వచ్చుటచూచి లోకైక లోచనుడగు రవి కోపించి అరుణునితో రథమును శీఘ్రమే కాలనేమి యున్నచోటికి పొనిమ్ము. అచ్చట గొప్ప యుద్ధమును శూర సంక్షయమును జరుగవలయును. మనకు బలమువచ్చినది. దానితో వీడు చంద్రుని చేతిలో ఓడినట్లే. అనెను. ఇట్లు రవి పలుకగా అరుణుడు తెల్లని చామరముల కుచ్చులతో అలంకృతములయిన అశ్వములను యత్నముతో గ్రహించి రథమును అటకు పోనిచ్చెను. అంతట లోకదీపుడగు సూర్యభగవానుడు ధనువుతీసి ఎక్కుపెట్టె. ఆ మహాభాగుడు భయంకర సర్పములవంటి రెండు శరములు తీసి ఒకటి శంబరాస్త్రముతో ఇంకొకటి ఇంద్ర జాలముతో అనుసంధించి వదలెను. దానితో క్షణములో రూపవిపర్యయమేర్పడి దానవులు దేవతలుగా దేవతలు దానవులుగా కనబడసాగిరి. కాలనేమి ప్రళయ యమునివలె రోషించి పరులు అని తలచి తన వారినే చంపుచుండెను. తీక్‌ష్ణ ఖడ్గముతో భయజ్కర శిలావర్షముతో ఘెరమగు గదతో గండ్రగొడ్డలితో అనేకుల శిరస్సులను రథికులను రథములులాగు ఉష్ట్రములను ఖండించెను. రథములను నలుగగొట్టెను. రథములను గుర్రములను రథాశ్వముల వేగముతోనో పిడికిటిపోటులతోనో నలుగ పొడిచెను.

రణ వినిహతాన్‌పశ్యత్‌ నిమిస్స్వాన్దానవాధిపః | రూపం స్వంయత్‌ప్రపద్యన్తే హ్యసురాధర్షితాస్సురైః. 157

కాలనేమి రుషావిష్ట స్తేషాం రూపం స బుద్ధవా& | నిమిదైత్యస్తుతా న్దృష్ట్వా కాలనేమిమువాచహ. 158

అహం నిమి స్సురారాతే కాలనేమే వదస్వమామ్‌ | భవతామోహితేనాజౌనిహతాస్యురువిక్రమ. 159

దైత్యానాం దశలక్షాణి దుర్జయానాంసురైరిహ | సర్వాస్త్రవారణం ముఞ్చ బ్రాహ్మమస్త్రంత్వరాన్వితం. 160

స తేన బోధితో దైత్య స్సమ్భ్రమాకులచేతనః | యోజయామాస బాణన బ్రహ్మాస్త్రవిహితేనచ. 161

ముమోచచాపి దైత్యేన్ద్ర స్సస్వయంసురకణ్టకః | తతోస్త్రతేజసా వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్‌. 162

దేవానాం చాభవత్సైన్యం సర్వమేవ రుషాన్వితమ్‌ | శమ్బరాస్త్రంచ సంశాన్తం స్వయమాయోధనేబభౌ. 163

తస్మిన్ప్రతిహతే శ##స్త్రే భ్రష్టతేజా దివాకరః | మహేన్ద్రజాలమాశ్రిత్య చక్రేస్వాంకోటిశస్తనుమ్‌. 164

విష్పురద్రశ్మిసజ్ఘాతసమాక్రాన్తజగత్త్రయమ్‌ | తతాప దాసవానీకం గలన్‌మజ్జౌఘశోణితమ్‌. 165

తతస్సోవర్షదనలం సమన్తాదతిసంహతమ్‌ | చక్షూంషి దానవేన్ద్రాణాం చకారాన్దానిచ ప్రభుః. 166

గజానామగళ##న్మేదః పేతుశ్చాపి రథాభువి | తురజ్గమాః క్వథంతశ్చ ప్రమత్తా రథినోపిచ. 167

ఇతస్తతశ్చసలిలం పార్థయ న్తస్తృషా೭೭తురాః | ప్రచ్చాయవిటపాంశ్చైవగిరీణాం గహనానిచ. 168

తేషాంప్రార్థయతాంశీతం ద్రుమాన్తరవిసర్పిణాం | దావాగ్నిః ప్రజ్వలంస్తీవ్రో ఘోరో నిర్దగ్దపాదపః. 169

తోయార్థినః పురో దృష్ట్వా తోయం కల్లోలమాలి తత్‌ | పురఃస్థితమపి ప్రాప్తుం నశేకురవసాదితాః. 170

అప్రాప్య సలిలం భూమౌ వ్యాప్తాః స్మహతచేతసః | తత్ర తత్ర వ్యదృశ్యన్త మృతాదైత్యేశ్వరా భువి. 171

రథాగజాశ్చ వతితా స్తురజ్గాశ్చ సమాపితాః | స్థితావమన్తోదావన్తో గళచ్యుతవసాసృజః. 172

దానవానాం సహస్రాణి అదృశ్యన్త మృతానితు |

దేవతల చేతిలో మరణించు దానవులు మృతి సమయములో స్వరూపమునే ధరించుటతో నేమియను దానవుడు కాలనేమి చేతిలో కూడ తమవారే మరణించుట గమనించెను. కాలనేమి మాత్రము రోషావేశములో ఇది గురుతించలేదు. అంతట నేమి కాలనేమితో 'దేవశత్రూ! కాలనేమీ! (దేవతా రూపములో కనబడు) నేను నేమినయ్యా! నాతో మాటలాడుము. మాయామోహితుడవయిన నీచేతిలో మహా విక్రముడవగు నీచేతిలో దేవ దుర్జయులగు పది లక్షలమంది దానవులు మరణించిరి. నీవు శీఘ్రమే బ్రహ్మాస్త్రము వదలుము. ఆది సర్వాస్త్రములను ప్రతిహతమోనర్చును.' అని నేమి ప్రేరించగా సురకంటకు డాకాలనేమి త్వరపడుచు శరమున బ్రహ్మాస్త్రమును సంధించి ప్రయోగించెను. అంతట ఆ అస్త్రపు తేజముతో నచరాచరమగు త్రైలోక్యమును వ్యాప్తమయ్యెను. దేవసైన్యమంతయు రోషయుక్తమయ్యెను. శంబరాస్త్రప్రభావము శాంతించెను. దానితో సూర్యుడును శాంత తేజస్కుడయ్యెను. అంతట రవి మహేంద్రజాలము వహించి తన శరీరమును కోట్లకొలదిగా రూపొందించెను. మిగుల వెలుగొందు కిరణరాశితో జగత్త్రయ మాక్రాంతమయ్యెను. దానవసేన ఉడికిపోయి మజ్జారాశి రక్తరాసులు కారసాగెను. అంతట రవియు అన్నివైపుల కడుదట్టమగు అగ్నిని వర్షించి దానవేంద్రుల నేత్రములంధమొనరించెను. గజముల మేదస్సు కారెను. రథములు క్రిందపడెను. గుర్రము లుడికిపోయెను. రథికులు పిచ్చెత్తిరి. దప్పికవేసి నీరు నీరనుచు ఇటునటు పరువెత్తిరి. కొండలయందలి యుడపులకును చెట్లు దట్టమగు నీడలకును తహతహలాడిరి. వారు అట్లు చెట్లనడుమను క్రిందను లభించు నీడ కోరుచుండగనే ఘోరమగు దావాగ్ని వ్యాపించి చెట్లను కాల్చసాగెను. నీరు కావలసిన వారికి తమ ఎట్టెదుటనే అలల మాలలతో నిండిన నీరు కనబడుచుండినను శ్రమవలన దానివరకు పోలేకుండిరి. అచట చేరలేక హత చేతస్కులై భూమిపై చాచుకొని పడిపోవుచుండిరి. దానవశ్రేష్ఠులు రణరంగమునందచ్చటచ్చట మాత్రమే కనబడుచుండిరి. ఇట్లు రథములను గజములును అశ్వములును పడిపోయెను. పదాతులలో మిగిలినవారును పరుగెత్తుచు గొంతుకనుండి రక్తమును క్రక్కుచుండిరి. దానవులు వేలకొలదిగ మృతులయి కనబడుచుండిరి.

నజ్షయే దానవేన్ద్రాణాం తస్మిన్మహతి వర్తతే. 173

ప్రకోపా ద్వృత్తతామ్రాక్షః కాలనేమీ రుషాతురః | అభవత్కాలమేఘభ స్స్ఫురద్భూరిశతహ్రదః. 174

గమ్భీరాస్ఫోటనిర్హ్రాదో జగద్ధృదయకణ్టకః | ప్రచ్ఛాద్యగగనాభోగం రవిమాయాంవ్యనాశయత్‌. 175

శీతంవవర్షసలిలం దానవేన్ద్రబలప్రదమ్‌ | దైత్యాస్తాంపృష్టిమాసాద్య సమాశ్వస్తాస్తతః క్రమాత్‌. 176

బీజాజ్కురాఇవవ్లూనాః ప్రాప్యపృష్టింధరాతలే | తతస్సమేఘరూపీతు కాలనేమిర్మహాసురః. 177

శస్త్రవృష్టింపవర్షోగ్రాం దేవానీకేషుదుర్జయామ్‌ | తేషాంవృష్ట్యాసాద్యమానా దైత్యాస్త్రానాంమహౌజసామ్‌.

గతింకాంచిదపశ్యన్తో గావశ్శీతార్దితాఇవ | పరస్పరంవ్యలీయన్త వృష్ఠేషున్య స్తపాణయః. 179

స్వేషుబాధావ్యలీయన్తే గజేషుతురగేషుచ | వప్రేషుచభయత్రస్తా స్తత్రతత్రవిలిల్యిరే. 180

అపరేకుఞ్చితైర్తాత్రై స్స్వహ స్తపిహితాననాః | ఇతశ్చేతశ్చసమ్ర్భాన్తా శ్శత్రుముద్వీక్ష్య సర్వతః. 181

ఏవంప్రవృత్తేసజ్గ్రామే తుములే దేవసజ్షయే | దృశ్యన్తే పతితాభూమౌ శస్త్రభిన్నాజ్గసన్ధయః. 182

విభిన్నాభిన్నమూర్ధాన స్తథాచ్ఛిన్నోరుజానవః | విస్రస్తధ్వజసజ్ఘాని నిష్పిష్టధ్వజవజ్త్కయః. 183

నిర్గతైస్తురగైసై#్తస్తు గజైస్త్వచలసన్నిభైః | స్రుతరకర్తహ్రదైర్భూమి ర్వికృతా సమజాయత. 184

ఏవమాజౌ బలీదైత్యః కాలనేమిర్మహాసురః | జఘ్నే ముహూర్తమాత్రేణ గన్ధర్వాణాం దశాయుతా&. 185

యక్షాణాంపఞ్చలక్షాణి రక్షసామయుతానిషట్‌ | త్రీణిలక్షాణి జఘ్నేచ కిజ్కరాణాం తరస్వినామ్‌. 186

జఘ్నేరాక్షసముఖ్యానాం సప్తలక్షాణినిర్భయః | ఇతరేషామసజ్ఖ్యాత సురజాతినికాయినామ్‌. 187

జఘ్నే స కోటిశఃక్రుద్ధ శ్చిత్రాస్త్రరణదుర్జయః | ఏవంప్రతిభ##యే భీమేమహామరమహాకులే. 188

ఇట్లు దానవేంద్రులకు మహాక్షయము కలుగుచుండ కాలనేమి రోషావిష్టుడై తీవ్రకోపవశమున గ్రుడ్లు త్రిప్పుచు అనేకములగు మెరపులు మెరయుచు గంభీరములగు చరపులవంటి చటచట ధ్వనులతో ఉరుముచు ఉండు ప్రళయ మేఘమువంటి మేఘముగా అయ్యెను. లోక హృదయకంటకుడతడు ఇట్లయి గగన వైశాల్యమంతయు కప్పి రవి మాయను నశింపజేసెను. దానవులకు బలప్రదమగు చల్లని నీటిని వర్షించెను. దానిచే దానవులు తమపై వర్షము కురియగా వాడిన వరి మొలకలు వలె క్రమముగా ఓదార్పు పొంది తెప్పరిల్లిరి. తరువాత ఆ మేఘరూపిగానే కాలనేమి దేవసేనలపై దుర్జయమును ఉగ్రమునగు శస్త్ర వర్షము కురిసెను. మహాతేజోవంతములగు ఆ దైత్యాస్త్రముల వానతో బాధనొందుచు వేరుగతి కానరాక చలికి బాధపడు గోవులవలె అయి ఒకరి వీపులపై మరియొకరి చేతులు అనించుకొనిరి. ఒకరిలో ఇంకొకరు దాచిపెట్టుకొనిరి. ఏనుగులయందును గుర్రములయందును పాపము వాటి బాధ వాటియందే ఉండి పోయెను. అవి కొన్ని కొన్ని అయా ప్రాకారములయందును పర్వతావరణములందును అచ్చటచ్చట దాగెను. దేవ సైనికులు కొందరు చేతులతో తమ తమ మొగములు కప్పుకొని శరీరములు ముడుచుకొని పోయిరి. మరికొందరు శత్రువుల చూచుచు సంభ్రాంతులై ఏమియు తోచక ఇటునటు పరుగెత్తుచుండిరి. ఇట్లు జరుగుచున్న యుద్ధమున దేవతలకే సంక్షయమగుచుండెను. శస్త్రములతో తెగిన విరిగిన - అవయవ సంధులు - పగిలిన - పగులని - తలలు తెగిన తొడలు మోకాళ్ళు జారిపడిన ధ్వజ సంఘములు పిండి ఐన ధ్వజములు భూమిపై పడి కనబడుచుండెను. వెడలిపోవుచున్న గుర్రములతో కదలక కొండలవలెనున్న గజములతో స్రవించిన నెత్తుటి మడుగులతో భూమి వికృతమయ్యెను. ఇట్లు బలశాలియగు కాలనేమి దైత్యుడు ముహూర్త మాత్రములో పదివేల గంధర్వులను ఐదులక్షల యక్షులను అరువది వేలమంది (దేవవక్షమందలి) రక్షస్సులను మూడు లక్షల మంది కింకరులను ఏడు లక్షలమంది (దేవపక్షీయ) రాక్షసముఖ్యులను లెక్కపెట్టరానంత మంది ఇతరులగు దేవ జాతీయులను కోట్లకొలదిగ క్రుద్ధుడయి చంపి చిత్రములగు అస్త్రముల ప్రయోగించుచు రణ దుర్జయుడయ్యెను. ఇట్లు మహామరుల మహాసంఘమున భయానకమగు ప్రతిభయస్థితి ఏర్పడెను.

అశ్విదేవతయోః కాలనేమేశ్చ యుద్ధమ్‌.

సజ్క్రుద్దావశ్వినౌ వీరౌ చిత్రాస్త్రకవచోజ్జ్వలౌ | జఘ్నుతుస్తౌ రణదైత్యం కల్పాన్తానిలసన్నిభమ్‌. 189

తమాసాద్య రణఘోర మేకైకం షష్టిభి శ్శరైః | జఘ్నతుస్తౌతుతీక్‌ష్ణా గ్రై రసురం భీమదర్శనమ్‌. 190

తాభ్యాంబాణప్రహారైస్తు కిఞ్చిదాయస్తలోచనః జగ్రాహచక్రమష్టారం తైలధౌతంరణాస్తకమ్‌. 191

తేనచక్రేణ సోశ్విభ్యాం చిచ్ఛేదరథకూబరమ్‌ | జగ్రాహాథధనుర్దైత్య శ్శరాంశ్చాశీవిషోవమా&. 192

వవర్షదనుజోమమూర్ధ్ని నఞ్చాద్యాకాశగోచరమ్‌ | తాపప్యతిశితైశ్శసై#్త్ర శ్చిచ్ఛిదుర్వైది సాయకా&. 193

ఏతత్కర్మతయోర్దృష్ట్వా విస్మితః కోపమావిశత్‌ | మహతాసతు కోపేన నన్ధాయాయోమయంతదా. 194

జగ్రాహ ముద్గరం భీమం కాలదణ్డవిభీషణమ్‌ | స తతో భ్రామ్య వేగేన చిక్షేపాశ్విరథంప్రతి. 195

తంతు ముద్గరమాయాన్త మాలోక్యామ్బరగోచరమ్‌ | త్యక్త్వా రథౌ ధనుర్వేగా దాప్లుతౌ తరసాశ్వినౌ. 196

తౌరథౌసతునిష్పిష్య ముద్గరోచలసన్నిభః | దారయామాస ధరణీం హేమజాలపరిష్కృతః. 197

తస్యకర్మాథతం దృష్ట్వా భిషజౌచిత్రయోధినౌ | వజ్రాస్త్రంతు ప్రచక్రాతే దానవేన్ద్రనివారణమ్‌. 198

తతో వజ్రమయం వర్షం ప్రావర్తదతిదారుణమ్‌ | ఘోరవజ్రప్రహారైస్తు దైత్యేన్ద్రస్సతిరస్కృతః. 199

తద్దృష్ట్వాదుష్కరంకర్మ అశ్విభ్యాంభీమవిక్రమః | నారాయణాస్త్రం బలవాన్ముమోచ రణమూర్ధని.

వజ్రాస్త్రం శమయామాస దానవేన్ద్రోస్త్రతేజసా | తస్మిన్ర్పశాన్తే వజ్రాస్త్రే కాలనేమిరసన్తరమ్‌. 201

జీవగ్రాహం గ్రాహయితు మశ్వినౌతు ప్రచక్రమే | తావశ్వినౌ రణ భీతౌ సహస్రాక్షరథంప్రతి. 202

ప్రయాతౌ వేపమానౌతౌ తదాశస్త్రవివర్జితౌ | తయోరనుగతో దైత్యః కాలనేమిర్మహాబలః.

ప్రాప్యేన్ద్రస్యబలం చక్రే దైత్యానీకపదానుగః |

ఇది చూచి వీరులగు అశ్వినులు సంక్రుద్ధులయి ఆశ్చర్యము కలిగించు కవచముతో ఉజ్జ్వలులయి ప్రళయ కాలాగ్ని సమానుడగు ఆ దైత్యుని కాలనేమిని యుద్ధము నందు సమీపించి భయంకరాకారుడగు ఆ ఘోరుని ఒక్కొక్కరు అరువదేసి భాణములతో కొట్టిరి. వారి బాణపు దెబ్బలతో కన్నులు వానికి కొంచెము నొప్పి ఎతైను. ఎనిమిది అరలు గలదియు రణములో అంతకుని పోలినదియు అగు చక్రమును తీసికొని దానితోవాడు అశ్వినుల రథకూబరమును నరకెను. తరువాత వాడు ధనువు తీసికొని సర్ప సమానాకార శక్తులు కల శరముల ప్రయోగించి ఆకాశమును కప్పివేసి వారి తలలను నొప్పించెను. వారు మిగుల వాడి బాణములతో దైత్యుని బాణములను ఖండించిరి. వారి ఈకృత్యము చూచి కాలనేమి కోపావిష్టుడయి అయోమయమును కాలదండమువలె భయంకరమును (స్వయం) భీమమునునగు ముద్గరమును చేకొని అది వేగమున త్రిప్పి అశ్వినుల రథము పైకి విసరెను. అది తమవైపునకు వచ్చుచు అకాశములో కనబడగానే శీఘ్రముగా ఆశ్వినులు తమ రథమును ధనువులను విడిచి దుమికిరి. బంగారు (సొమ్ముల) తో అలంకృతమగు కొందరు పోలు ఆముద్గరము వారి రథమును పిండిచేసి భూమినికూడ చీల్చెను. ఆశ్చర్యకరయోధులా అశ్వినులు అదిచూచి దానవేంద్రుని వారించుటకై వజ్రాస్త్రము ప్రయోగించి అతి దారుణ వజ్రవృష్టి ప్రవర్తిల్లజేసిరి. ఘోర వజ్ర ప్రహారములతో ఆదైత్యేంద్రుడు మరుగుపడుటయేకాక సర్వసైన్యము కాంచుచుండ క్షణములో వాని రథము ధ్వజము ఛత్త్రము కాంచనమయ కవచము మిక్కిలిగ తిలలంత ముక్కలు చేయబడెను. అశ్వినుల ఆ దుష్కరకృత్యము చూచి బలశాలి భీమ విక్రముడా దైత్యుడు నారాయణాస్త్ర ప్రయోగముచే తత్తేజముచే వజ్రాస్త్రమణచివేసెను. మరి వెంటనే అశ్వినులను జీవగ్రాహముగా పట్టుటకును యత్నమారంభించెను. అశ్వినులు భయపడి వణకుచు తమ శస్త్రములు విడిచి భీతితో ఇంద్రరథముకడకు పరువెత్తిరి. మహాబలుడా కాలనేమిదైత్యుడు వారిని వెంటనంటి తనవెంట దైత్యానీకము వచ్చుచుండ ఇంద్రసేనను సమీపించెను.

తం దృష్ట్వా సర్వభూతాని విత్రేసుర్విహ్వలానితు. 203

దృష్ట్వా దైత్యస్య తత్ర్కోధం సర్వభూతాని మేనిరే | వరాజయం మహేన్ద్రస్య సర్వలోకక్షయావహమ్‌.

చేలుశ్శిఖిరిణో ముఖ్యాః పేతురుల్కా సభః స్థలాత్‌ | జగర్జుర్జలదాదిక్షు ఉద్భూతాశ్చ మహార్ణవాః. 204

దేవాసురసజ్గరం ప్రతి శ్రీవిష్ణోరాగమనమ్‌.

తాంభూత వికృతిం దృష్ట్వా భగవాన్గరుడధ్వజః | వ్యబుద్ధ్యదహివర్యాజ్కా ద్యోగనిద్రాం విహాయతామ్‌.

లక్ష్మీకరయుగాయస్తలాలితాజ్ఘ్రిసరోరుహః | శరదీవచనీలాబ్జకా స్తదేహరుచిర్విభుః. 207

కౌస్తుభోద్భాసితోరస్కః కాన్తకేయూరభాస్వరః | విమృష్యాసురసజ్షోభం వైనతేయమథాహ్వయత్‌. 208

ఆహూతేవస్థితేతస్మి న్నానాకారాస్త్రవర్షిణి | దివ్యనానాస్త్రతీవ్రార్చిరారుహ్యాగాత్తదాహవమ్‌. 209

తత్రావశ్యచ్చదేవేన్ద్ర మభిభూతమభిప్లవైః | దానవేన్ద్రైర్న వామ్భోదనఞ్చయైః పౌరుషోత్కటైః. 210

యథాహిపురుషో ఘోరైరభాగ్యైర్బలశాలిభిః | పరిత్రాణాయ సుకృతం సుక్షేత్ర కర్మనిర్మలే. 211

అథాపశ్యంస్తుదైత్యేన్ద్రా వియతి జ్యోతిమణ్డలమ్‌ | స్ఫుర న్తముదయాద్రిస్థం సూర్యముష్ణ త్విషాఇవ. 212

ప్రభావంజ్ఞాతుమిచ్ఛన్తో దానవాన్తస్య తేజసః | గరుత్మన్తమపశ్యన్త కల్పాన్తానలభైరవమ్‌. 213

తమాస్థితంచ మేఫ°ఘలిఖద్ద్యుతిసహస్రభమ్‌ | తమాలోక్యాసురేన్ద్రస్తు హర్షనిర్భరమానసః. 214

దైత్యుని ఆక్రోధము చూచి సర్వభూతములును అది సర్వలోక క్షయావహమయి దాన ఇంద్రుని పరాజయమగునని తలచెను. ప్రధాన పర్వతములే చలించెను. అకాసమునుండి ఉల్కలు పడెను. దిక్కులందు మేఘములురిమెను. సముద్రములు మిగుల పొంగెను. ఈ భూతస్థితి వికారమును చూచి భగవానుడు గరుడధ్వజుడు అంతవరకు తానవలంభించియున్న యోగనిద్రను విడిచి నాగ పర్యంకమునుండి మేలుకాంచి లేచెను. శ్రమనందినపుడులక్ష్మీ కరద్వంద్వముచే లాలించబడు పాదపద్మములు శరన్నీలోత్పల సుందర దేహకాంతి కౌస్తుభోద్భాసి వక్షము భాస్వర మనోహర కేయూరములు కల మహానుభావుడాతడు అసురులు కలిగించు కల్లోలమాలోచించి గరుడుని పిలిచెను. నానాకారాస్త్రముల వర్షించగల గరుడుడు తన పిలుపందుకొని రాగా అతని నారోహించి నారాయణుడు దివ్య నానాస్త్ర తీవ్ర జ్వాలాలంకృతుడై యుద్ధరంగమునకేగెను. అచట నతనికి కారు మొయిళ్ళగములను పోలి పౌరుషోత్కటులగు దానవేంద్రులు కలిగించు ఉపద్రవములతో ఇబ్బందిపడుచు ఇంద్రుడు కనబడెను. వంశానుగతముగా వచ్చి బాధించుచున్న ఘోర దురదృష్టములనుండి పురుషుని రక్షించుటకు అతడు ఉత్తమ దేశకాలములందాచరించిన సుకృతఫలము కాపావచ్చినట్లు నారాయణుడింద్రునిపుడు కాపాడచ్చెను. అంతలో దైత్యులకు వేడి వెలుగులతో ఉదయాద్రిపై ప్రకాశించు రవిని పోలిన జ్యోతిర్మండల మాకాశమున కానబడెను. ఆ తేజఃప్రభావమును దానవులెరుగ గోరుచున్నంతలో వారికి ప్రళయాగ్ని భీకరుడగు గరుడుడును కాంతులతో ఒప్పు వేలకొలది మెరపులగముల సమీపమందలి మేఘమువలె అతని నారోహించి యున్న అచ్యుతుడును కనబడిరి. అతనిని చూచి దైత్యేంద్రుడాకాలనేమి హర్షపూర్ణ మనస్కుడై ఇట్లనుకొనెను:

అయంచ దేవసర్వస్వం జితేస్మిన్నిర్జితాస్సురాః | అయం స దైత్యచక్రాణాం కృతాన్తః కేశవోహరిః. 215

ఏనమాశ్రిత్యలోకేశం యజ్ఞభాగభుజోమరాః |

శ్రీవిష్ణోః కాలనేమిప్రభృతీనాంచ యుద్ధమ్‌.

ఇత్యుక్త్వాతు సమస్తాస్తే పరివార్యసమస్తతః. 216

తంజఘ్నుర్వివిధైరసై#్త్ర స్సగరుత్మానమాహవే | కాలనేమిప్రభృతయో దశ దైత్యా మహారథాః. 217

షష్ట్యావివ్యాధ బాణానాం కాలనేమిర్జనార్దనమ్‌ | నేమిశ్శతేన బాణానాం *మథనోశీతిభిశ్శరైః. 218

జమ్భకశ్చైవ సప్తత్యా శుమ్బోదశభిరేవచ | శేషా దైత్యేశ్వరా స్సర్వే విష్ణు మేకైకశశ్వరైః. 219

దశభిర్దశభిర్యత్నా జ్జఘ్న స్తేగరుడంరణ | తేషామమృష్య తత్కర్మ విష్ణుర్దానవసూదనః. 220

ఏకైకం దానవం జఘ్నే షడ్భిష్షడ్భిరజిహ్మగైః | ఆకర్ణకృతష్టైర్భూయశ్చ కాలనేమిస్త్రిభిశ్శరైః. 221

విష్ణుంవివ్యాద హృదయే రోషాద్రక్తవిలోచనః | తస్యాశోభంత తే బాణా హృదయేతేనకాఞ్చనాః. 222

మయూఖానీవ దీప్తాని కైస్తుభస్యస్ఫుటత్విషః | తైర్బాణౖఃకిఞ్చిదాయస్తో హరిర్జగ్రాహ ముద్గరమ్‌. 223

''దేవతలకు సర్వస్వమీనారాయణుడే. ఇతడోడిన దేవతలోడుదురు. కేశవుడని హరియని ప్రసిద్ధుడగు ఈతడే దైత్యసేనలకు యముడు. లోకేశుడగు ఈతని నాశ్రయించియే దేవతలు యజ్ఞభాగ భోక్తలయియున్నారు.'' ఇట్లనుచుండగనే దానవులందరు హరి నన్నివైపుల చుట్టిరి. కాలనేమి మొదలగు మహారథులగు పదిమంది దైత్యులు గరుత్మంతుని నారాయణుని కూడ వివిధాస్త్రములతో కొట్టిరి. వారిలో కాలనేమి ఆరువదిటితో నిమి నూరింటితో - మథనుడు ఎనుబదింటితో - జంభకుడు డెబ్బదింటితో - శుంభుడు పదింటితో - మిగిలిన దైత్యేశ్వరులొక్కొక్కరొక్కటితో - బాణములతో

________________________________________

* మదనో.

విష్ణుని జనార్దనుని ప్రహరించిరి. గురుడుని పదేసి బాణములతో యత్నపూర్వకముగా (బలము కొలది) కొట్టిరి. దానవాంతకుడది సహించక ఒక్కొక్క దానవునారేసి బాణములతో కొట్టెను. మరల కాలనేమి రోషరక్త విలోచనుడయి చెవినంట ధనువులాగి విడిచి మూడు బాణములతో నారాయణుని రొమ్మున కొట్టెను. బంగారుతో కూడిన ఆ బాణములాతని హృదయమున స్పష్ట ద్యుతియగు కౌస్తుభరత్నపు దీప్త కిరణములవలె కానవచ్చెను. ఆ దెబ్బలతో కొంచెము శ్రమ నందియు విష్ణువు ముద్గరము తీసికొనెను.

సతుతద్ర్భామ్యవేగేన దానవాయవ్యసర్జయత్‌ | దానవేన్ద్రస్తమప్రాప్తం వియత్యేవశితైశ్శరైః. 224

చిచ్ఛేదతిలశః క్రూరో దర్శయన్పాణిలాఘవమ్‌ | తతో విష్ణుఃప్రకుపితః ప్రాసంజగ్రాహభైరవమ్‌. 225

తేన దైత్యస్యహృదయం తాడయామాసగాఢతః | క్షణనలబ్ధసంజ్ఞస్తు కాలనేమిర్మహాసురః. 226

శక్తిం జగ్రాహ తీక్ష్నాగ్రాం హేమఘణ్టాప్రహాసినీమ్‌ | తయా వామభుజం విష్ణోర్భిభేద దితినన్దనః. 227

శక్త్యాభిన్నం భుజం తస్య స్రుతశోణితమాబభౌ | పద్మరాగమయేనైవ కేయూరేణ విభూషితమ్‌. 228

తతోవిష్ణుః ప్రకుపితో జగ్రాహ విపులంధనుః | సప్తదశచ నారాచాంస్త్రీక్ష్నాంశ్చమర్మభేదినః. 229

షడ్భిర్దైత్యస్య హృదయం వివ్యాధచ శైరైస్త్రిభిః | చతుర్భిస్సారథించాస్య ధ్వజంచై కేనపత్రిణా. 230

ద్వాభ్యాంచ దనుషీచాపి భుజం సవ్యంచ పత్రిణా | స విద్ధోహృదయే గాఢం దైత్యో హరిశిలీముఖైః. 231

స్రుతరక్తారుణః ప్రాంశుః క్రీడాకులితమానసః | చకమ్పే మారుతేనేవ నోదితః కింశుకద్రుమః. 232

తమాకమ్పితమాలక్ష్య గదాంజగ్రాహకేశవః | తాంచ వేగేన చిక్షేపకాలనేమిరథంప్రతి. 233

సా పపాత శిరస్యుగ్రా విపులా కాలనేమినః | సచూర్ణితోత్తమాజ్గస్తు నిష్పిష్టమకుటోసురః. 234

స్రుతరక్తౌఘరంహస్తు స్రుతధాతు రివాచలః | పపాత స్వే రథే భ##గ్నే విసంజ్ఞశ్శిష్టజీవనః. 235

పతితస్య రథోపస్థే దానవస్యాచ్యుతో హరిః | స్మితపూర్వమువాచేదం వాక్యం చక్రయుధఃప్రభుః. 236

గచ్ఛాసురవిముక్తోసి సామ్ర్పతం జీవ నిర్భయః | తతస్స్వల్పేన కాలేన అహమేవ తవాన్తకః. 237

ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య సారథిః కాలనేమినః | అవవాహ్య రథం దూరమానయత్కాలనేమినమ్‌. 238

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవాసురసజ్గ్రామే కాలనేమిపరాజయో నామ ఏకోనపఞ్చాశదుత్తర శతతమోధ్యాయః.

అతడది వేగముగా త్రిప్పి దానవేంద్రునిపై విసరెను. క్రూరుడా దానవేంద్రుడు హస్త లాఘవము చూపుచు అది ఇంకను తను చేరక ఆకాశమందుండగనే నూపు గింజలంత ముక్కలు చేసెను. అంతట విష్ణువు ప్రకుపితుడై భయంకరమగు ప్రాసాయుధమును తీసికొనెను. ఆ ఆయుధముతో నారాయణుడు దైత్యుని హృదయమున కొట్టగా కాలనేమి క్షణముతో తెలివి తెచ్చుకొని తీక్ష్నమగు మొన కలిగి బంగరు గంటల చప్పుడులతో పెద్దగ నవ్వుచున్నదో యనునట్లున్న శక్తిని తీసి కొని దానితో విష్ణుని వామభూజము చీల్చెను. శక్తితో చీల్చి రక్తము కారుచున్న విస్ణువు భుజము పద్మరాగ మణిమయమగు భుజకీర్తితో వలె ప్రకాశించెను. అంత విస్ణువు ప్రకుపితుడయి విపుల ధనువును వాడియై మర్మభేదములను పదునేడు బాణములను తీసికొని తొమ్మిదిటితో దైత్యుని హృదయమును నాలుగింగితో వాని సారథిని ఒకదానితో ధ్వజమును రెంటితో వాని ధనువును ఒకదానితో ఎడమ భుజమును కొట్టెను. గాఢముగా హృదయమునతగిలిన హరి భాణముల దెబ్బలతో కారుచున్న రక్తముతో ఎర్రనయిన మహా బాధాకుల మానసుడై కాలనేమి గాలితో కదల్చబడిన మోదుగు చెట్టువలె కంపించెను. అది చూచి ఇదే యదనని కేశవుడు గద తీసికొని వేగమున కాలనేమి రథముపైకి విసరెను. ఉగ్రము విపులమునగు ఆగద కాలనేమి తలపై పడగా వాని శిరము చూర్ణయై మకుటము పిండియె వేగముగా స్రవించు రక్తప్రవాహముతో వాడు ధాతు ద్రవము స్రవించు పర్వతమట్లు కనబడెను. వాడు అట్లు విరిగిన తన రథముపై తెలివి తప్పి కొనఊపిరితో పడిపోయెను. రథాసనముపై పడిన ఆ దైత్యుని చూచి అచ్యుతుడు చక్రాయుధుడు ప్రభుడునగు హరి చిరునవ్వుతో ''అసురా! విడిచితి; పొమ్ము; ఇప్పటికి నిర్భయుడవయి బ్రతుకుము; తరువాత కొలదికాలములో నేనే నీకు యముడనగుదును.'' అనెను. ఈ మాటలు విని కాలనేమి సారథి అతని రథమును అటనుండి తొలగించి వానిని దూరముగా కొనిపోయెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున కాలనేమి పరాజయమను నూట నలుపది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters