Sri Matsya mahapuramu-2    Chapters  

షట్చత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

పుత్త్రార్థం వజ్రాజ్గకృతతపఃకథనమ్‌.

వరాజ్గీ : త్రాసితాన్మ్యపవిద్ధాస్మి తాడితా పీడితాపిచ | రౌద్రేణదేవరాజేన నష్టనాధేతి భూరిశః. 1

దుఃఖపారమపశ్యన్తీ ప్రాణాం స్త్యక్తుం వ్యవస్థితా | పుత్త్రంమే తారకందేహి దుఃఖశోకమహార్ణవాత్‌. 2

ఏవముక్త స్సదైత్యేన్ద్రః కోపవ్యాకులలోచనః | శక్తోపి దేవరాజస్య ప్రతికర్తుంమహాసురః. 3

తపఃకర్తుం పున ర్దైత్యో వ్యవస్యతమహాబలః | జ్ఞాత్వాతు తస్య తత్కర్మ బ్రహ్మా క్రూరతరంపునః. 4

ఆజగామతదాతత్ర యత్రాసౌ దితినన్దనః | ఉవాచ తసై#్మభగవా న్ర్పభుర్మధురయాగిరా. 5

బ్రహ్మా : కిమర్థం పుత్త్రభూయస్త్వం నియమంక్రూరమిచ్ఛసి

ఆహారాభిముఖో దైత్య! తన్మేబ్రూహి మహావ్రత. 6

యావదబ్దసహస్రేణ నిరాహారస్యవై ఫలమ్‌ | క్షణనైకేన తల్లబ్ధం త్య క్తాహారముపస్థితమ్‌. 7

త్యాగోహ్యస్రాప్తకామానాం కామేభ్యో స తథాగురుః | తథావాప్తంపరిత్యజ్య కామంకమలలోచన. 8

శ్రుత్వైతద్బ్రహ్మణోవాక్యం దైత్య ప్రాఞ్జలిరబ్రవీత్‌ | చిన్తయం స్తవసాయుక్తో హృదిబ్రహ్మముఖేరితమ్‌. 9

వజ్రాజ్గః : ఉత్థితేనమయాదృష్టా సమాధానా త్త్వదాజ్ఞయా | మహిషీ భీషితా దీనా రుద న్తీశాఖినస్తలే. 10

సా మయోక్తాతు తస్వజ్గీ దూయమానేన చేతసా | కిమేవం వర్తసే భీరు నచకిఙ్చిచ్చికీర్షసి. 11

ఇత్యుక్తా సామయాదేవ ప్రోవాచలలితాక్షరమ్‌ | వాక్యంవాచస్పతే!భీతా తన్వజ్గీహేతుసంహితమ్‌. 12

వరాజ్గీ : త్రాసితాన్మ్యపవిద్ధాస్మి ధర్షితాపీడితాపిచ | రౌ దేణదేవరాజేన నష్టనాధేతి భూరిశ ః. 13

దుఃఖస్యాన్తమపశ్యన్తీ ప్రాణాంస్త్యక్తుం వ్యవస్ధితా | పూత్త్రంమే తారకందైహి అస్మాద్దుఃఖమహార్ణవాత్‌. 14

ఏవముక్తస్తుసజ్షుబ్ద స్తస్యాఃపుత్త్రార్థముద్యతః | తపోఘెరంకరిష్యామి జయాయ త్రిదివౌకసామ్‌. 15

నూట నలువది ఆరవ అధ్యాయము.

వజ్రాంగుడు పుత్త్రార్థము తపము ఆచరించుట.

వరాంగి వజ్రాంగునితో ఇట్లు పలికెను: రౌద్రుడగు దేవరాజు నన్ను నా భర్త కనబడుట లేదను హేతువుది భయపెట్టెను. అలక్ష్యముగా చూచెను. కొట్టెను; ఎన్నో విధముల పీడించెను. దుఃఖమునకు అంతు కనబడక ప్రాణముల వదల పూనియున్నాను. ! ఈ దుఃఖశోక మహాసముద్రము నుండి తరింపజేయు తారకుడగు కుమారునిమ్ము. ఈ మాటవిని ఆ దైత్యేంద్రుడు కోపముచే వ్యాకుల చితుడయ్యెను. తాను ఇంద్రునకు ప్రతీకారము చేయశక్తి గలవాడే ఐనను మహాబలుడా దైత్యుడు మరల తపమేచేయ నిశ్చయించెను. అతడు మరల క్రూరతరమగు పనిచేయ దలచెనని ఎరిగి ఈ దైత్యుని కడకు బ్రహ్మ వచ్చెను. భగవానుడా ప్రభువు మధురవాక్కుతో ఇట్లు పలికెను: పుత్త్రా ! నీవు మరల క్రూరనియమమును పూనుటకు ఏల సంకల్పించితివి? ఇపుడే నీవు ఆహారము గ్రహించ దలచియుంటివి గదా! మహావ్రతా! దానినేల వదలుచున్నావో కారణము తెలుపుము. వేయిఏండ్లు నిరాహారుడైనందున కలుగునంత ఫలము-తనకు సిద్ధమై లభించిన ఆహారమును వదలిన వానికి ఒక క్షణములో లభించును. సుఖములు చేజిక్కనియప్పుడు వానిని విడుచుట చేజిక్కిన దానిని విడుచుట యంతగోప్ప పనికాదు.

బ్రహ్మ పలికిన ఈ మాటలు విని వజ్రాంగుడు దైత్యుడయ్యు తపోవంతుడు కావున బ్రహ్మ తన నోటితో పలికిన మాట (అర్థము)ను హృదయమున ఆలోచించుచు ప్రాంజలియై ఇట్లనెను: మీ ఆజ్ఞచే సమాధినుండి లేచిన నాకు నా భార్య బెదరించబడి దీనురాలయి చెట్టుక్రింద ఏడ్చుచు కనబడెను. నేను బాధనొందుచున్న చిత్తముతో ఆమెతో ఇట్లంటినిః ''పిరికిదానా! ఇట్లు ఏలయున్నావు? ఏదియో (చేయరానిది) చేయదలచియున్నావు. అదిఏయో చెప్పుము.'' దేవా! వాచస్పతీ; నేనిట్లడుగగా భీతురాలయియున్న ఆ సుందరి మనోహరాక్షరములలో హేతుయుక్తముగా ఈ వాక్యమును పలికెను : రౌద్రుడగు దేవరాజు నాభర్త కనబడుటలేదు గదాయని నన్ను భయపెట్టెను; అలక్ష్యముగా చూచెను; కొట్టెను; ఎన్నో విధముల పీడించెను. దుఃఖమునకు అంతు కనబడక ప్రాణములు వదల పూనియున్నాను. ఈ దుఃఖశోక మహాసముద్రము నుండి తరింపజేయు (తారకుడగు) కుమారుని ఇమ్ము. ఇట్లామె పలుకగా సంక్షోభము చెంది స్వర్గవాసుల జయమునకు సమర్థుడగు కుమారుని ఆమెకు ఇచ్చుటకై ఘెర తపస్సాచరింతును.

ఏతచ్ఛ్రుత్వా వచోదేవః పద్మగర్భోద్భవస్తదా | ఉవాచదైత్యరాజానం ప్రసన్నశ్చతురాసనః. 16

బ్రహ్మా! : అలం తేతపసా వత్స మాక్లేశేదుస్తరేవిశ | పుత్త్రస్తేతారకోనామ భవిష్యతిమహాబలః. 17

దేవసీమన్తినీకాన్తధమ్మిల్లస్యవిమోక్షణః | ఇత్యుక్తోదైత్యనాథస్తు ప్రణిపత్య పితామహమ్‌. 18

ఆగత్యానన్దయామాన మహిషీం హర్షితాననః | తౌ దమ్పతీకృతార్థౌతు జగ్మతు స్స్వాశ్రమంముదా. 19

వజ్రాజ్గేనాహితం గర్భం వరాజ్గీవరవర్ణినీ | పూర్ణంవర్షసహస్రం చ దధారోదకసవ్ల్పుుతా. 20

తారకాసురోత్పత్తిః.

తతోవర్షసహస్రాన్తే వరాజ్గీసుషువేసుతమ్‌ | జాయామానేతు దైత్యేన్ద్రే తస్మిన్లోకభయజ్కరే. 21

చచాల సకలాపృథ్వీ సముద్రాశ్చచకమ్పిరే | చేలు ర్మహీధరాస్సర్వే వపుర్వాతాశ్చ భీషణాః. 22

జేపుర్జవ్యంమునివరా నేదుర్వ్యాలమృగాఅపి | చన్ద్రసూర్యౌ జహుః కాన్తిం ననీహారా ధిశోభవ&. 23

జాతేమహాసురే తస్మి న్త్సర్వేచాపిమహాసురాః | ఆజగ్ముర్హృషితాస్తత్ర తథాచాసురయోషితః. 24

జగ్ముర్హర్షసమావిష్టా ననృతుశ్చాసురాజ్గనాః | తతో మహోత్సవోజాతో దానవానాం ద్విజోత్తమాః. 25

విషణ్ణమనసోదేవా స్సమహేన్ద్రాస్తదాభవ& | వరాజ్గీస్వసుతం దృష్ట్వా హర్షేణాపూరితా తదా. 26

బహుమేనే న దేవేన్ద్రవిజయంతు తథైవసా | జాతమాత్రస్తు దైత్యేన్ద్ర స్తారకశ్చణ్డవిక్రమః. 27

అభిషిక్తోసురైస్సర్వైః కుజమ్భమహిషాదిభిః | సర్వాసురమహారాజ్యే పృథివీతులనక్షమైః. 28

సతుప్రాప్య మహారాజ్యం తారకో మునిసత్తమాః | ఉవాచదానవశ్రేష్ఠో యుక్తి యుక్తమిదంవచః. 29

ఇతి శ్రీమత్స్యమహాపురాణ తారకోత్పత్త్యాదికథనం నామ షట్చ త్వారింశదుత్తరశతతమోధ్యాయః.

పద్మగర్భోద్భవుడు చతుర్ముఖుడునగు ఆదేవుడు ప్రసన్నుడై ఆదైత్యరాజవచనమునకు సమాధానముగా ఇట్లు పలికెను: నాయనా! నీవు తపస్సుచేయుట మానుము. దుస్తరమగుక్లేశమునందు ప్రవేశించకుము. దేవతా సువాసినుల అందములగు కొప్పులు వీడిపోవునట్లు చేయగల తారకుడను పుత్త్రుడు నీకు కలుగును. బ్రహ్మ ఇట్లు పలుకగా దైత్యనాథుడా వజ్రాంగుడు బ్రహ్మకు నమస్కరించి హర్షపూర్ణముఖుడై తన భార్యకడకు వచ్చి ఆమెనానంద పరచెను. ఆ దంపతులు కృతార్థులయి మోదముతో తమ యాశ్రమమునకు ఏగిరి; మహాసుందరియగు ఆవరాంగి వజ్రాంగుడు తన యందు నిలిపిన గర్భమును తాను నీటియందు తడియుచు నిండుగా వేయేండ్లు మోసెను. తరువాత వరాంగి కుమారుని కనెను. లోకభయంకరుడగు దైత్యేంద్రుడు (తారకుడు) జన్మించునపుడు సకల పృథ్వియు చలించెను. సముద్రములు కంపిల్లెను. పర్వతములు కదలెను. భయంకర వాయువులు వీచెను. మునీంద్రులు శాంతికై జప్యమంత్రములు జపించిరి; క్రూరమృగములును భయముతో కూతలు పెట్టెను. చంద్రసూర్యుల కాంతితగ్గెను. దిశలందు మంచు క్రమ్మెను. సర్వులగు అసురులును అసురాంగనలును ఆ బాలుడు జన్మించిన చోటికి సంతోషముతోవచ్చిరి. హర్షావేశముతో దానవాంగనలు నాట్యముచేసిరి. దానవులు మహోత్సవములు జరుపుకొనిరి. మహేంద్రాది దేవతల మనములు విషాదముతో నిండెను. వరాంగి తన సుతునిచూచి హర్షపూర్ణురాలయ్యెను. దేవేంద్రుని జయించుట పెద్దపనిగా ఆమెకు అనిపించలేదు. ఇదెంత పనిలెమ్మను కొనెను. పుట్టిన వెంటనే చండవిక్రముడగు ఆతారకుడు పృథివినే ఎత్తి ఊప గలిగిన కుజంభ-మహిషాదులగు అసురులచేత సర్వాసురమహారాజుగా అభిషేకింపబడెను. మునిసత్తములారా! ఆ తారకుడు తనకు మహారాజత్వము లభించగానే దానవశ్రేష్ఠుడు కావున అందులకు తగినయుక్తియుక్తమగు వచనమునిట్లు పలికెను:

ఇది శ్రీమత్స్యమహాపురాణమున తారకోత్పత్తి కథనమను నూటనలువది యారవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters