Sri Scanda Mahapuranamu-I    Chapters    

త్రయోవింశోధ్యాయ:

నారద Dªy¿RÁc

తతశ్చ శైలజా దేవీ చిక్రీడ సుభగా తదా | దేవగంధర్వకన్యాభిరగకింనరసంభావా:|

మునీనాం చాపి యా: కన్యాస్తాభి : సార్ధం చ శోభనా||1

కదాచిదథ మేరుస్థో వాసవ: పాండునందన| సస్మార మాం య¸°చాహం సంస్మృతోవాసనం తదా||2

మాం దృష్ట్వా చసహస్రాక్ష : సముతాయాతిహర్షితః | పూజయామాస తాం పూజాం ప్రతిగృహ్యమబృవమ్‌||3

మహాసుర మహోన్మాదకాలానల దివస్పతే కుశలం విద్యతే కచ్చిత్‌ తవ కచ్చిచ్చ నందసి||4

పృష్టస్త్యేవం మయా శక్ర: ప్రోవాచ వచనం స్మయన్‌ | కుశలస్యాంకురస్తావత్సంభూతో భువనత్రయే ||5

తత్ఫలోదయసంపత్తౌ తద్భవాన్‌ సంస్కృతో మునే | వేత్సి సర్వమతం త్వం వై తధాపి పరినోదక:||6

నిర్వృతిం పరమాం యత నివేద్యార్థం సుహృజ్జనే ||7

తద్బవాన్‌ శైలజాం దేవీం శైలేంద్రం శైలవల్లభామ్‌|| హరం సంభావయ వరం యన్నాన్యం రోచయంతి తే||8

తతస్తద్వాక్యమాకర్ణ్య గతోహం శైలసత్తమమ్‌|| ఓషదిప్రస్థనిలయం సాక్షాదివ దివసృతిమ్‌||9

ఇరవై మూడవ అధ్యాయము

నారదుడిట్లు చెప్పసాగెను. అటు తరువాత కల్యాణియగు పార్వతి దేవగంధర్వకన్యలతో,పర్వతకిన్నరముని కన్యలతో కలిసి ఆడుకొనెను (1) ఒకప్పుడు మేరు పర్వతము పై నున్న ఇంద్రుడు నన్ను స్మరించగా నేను అతని వద్దకు వెళ్ళితిని (2) నన్ను చూసి ఇంద్రుడు మిగుల సంతోషించి లేచి నిలిచి పూజించగా, ఆ పూజనుస్వీకరించి నేనిట్లంటివి .(3) ఓ సురశ్రేష్టా! స్వర్గరాజా! ఇంద్రా! మహాన్మత్తులకు కాలాగ్నివంటివాడా! నీకు క్షేమమా? ఆనందముగా నుంటివా? (4) అని అడుగగాఇంద్రుడు నవ్వుచూ నిట్లనెను ముల్లోకములలో కుశలమంకురించినది (5) ఆ అంకురము యొక్క ఫలము కలుగుటను గూర్చి నిన్ను స్మరించితిని మహమునీ! నీకంతా తెలియును అయిననూ నీవే ప్రేరకుడివి (6) మిత్రునికి నివేదించినచో పరమానందము కలుగును(7) కనుక నీవు పర్వతిని, శివుని కూర్చుము, శివుని తప్ప ఇతరుని వరునిగా ఇష్టపడనట్లు చేయుము'(8) అనగా విని నేనుఅనేక ఓషదులకు నిలయమై ఇంద్రునిగా నున్న పర్వతరాజు హిమవంతుని వద్దకు వెళ్ళితిని,(9) తత్ర హైమే స్వయం తేన మహాభక్త్యా నివేదితే| మహాసనే పూజితోహముపవిష్టో మహాసుఖమ్‌||10

గృహీతార్ఘ్యం తతో మాం చ పప్రచ్చ శ్లక్షయా గిరా| కుశలం తపస: శైల: శ##నై: పుల్లాననాంబుజ:||11

అహమప్యస్య తత్‌ ప్రోచ్య ప్రత్యవోచం గిరీశ్వరమ్‌ | త్వయా శైలేంద్ర పూర్వాం వాప్యరాం వా దిశం తథా||12

అవగాహ్య స్థితవతా క్రియతే ప్రాణిపాలనా | అహో ధన్యోసి విప్రేంద్రా: సాహయ్యేన తవాచల||13

తపోజపవ్రతస్నానై: సాధయంత్యాత్మన: పరమ్‌ | యజ్ఞాంగసాధవై: కాంశ్చిత్కందాదిపలదానత:||14

త్వం సముద్దరసి విప్రాన్‌ కిమత ప్రోచ్యతే తవ| అన్యేపి జీవా బహుధా త్వాముసాశ్రిత్య భూదర||15

ముదితా : ప్రతివర్తంతే గృహస్థమివ ప్రాణిన:| శీతమాతపవర్షాంశ్చ క్లేశాన్నానావిధాన్‌ సహన్‌||16

ఉపాకరోషి జంతూనామేవంరూపా హి సాధవ:| కిమత: ప్రోచ్యతే తుహ్యం ధన్యస్త్వం పృథీవీధర ||17

కందరం యస్య చాధ్యాస్తేస్వయం తవ మాహేశ్వరః | ఇత్యుక్తవతి వాక్యం చ యథార్థం మయి పాల్గున||18

హిమశైలస్య మహిషీ మేనా ఆగాద్దిదృక్షయా | అనుయాతా దుహిత్రా చ స్వల్పాశ్చ పరిచారికా:||19

అక్కడి హిమవంతుడు స్వయముగా నివేదించిన గొప్ప బంగారు సింహాసనము పై సుఖముగా కూర్చుంటిని (10) అర్ఘ్యమును గ్రహించిన నన్ను మధురముగా హిమవంతుడు ప్రేమతో కళ్ళువిప్పారగా తపస్సుయొక్క కుశలమును గూర్చి యడిగెను (11)నేను బదులిచ్చి ఇట్లంటిని శైలరాజా! నీవునూ పూర్వాపరదిక్కులను ఆక్రమించి ప్రాణిపాలనను చేయుచున్నావు నీవు ధన్యుడవు నీ సహాయముచేతనే విప్రశ్రేష్టులు తపస్సు , జపము, వ్రతము, స్నానము అనువానిచే తమ పరలోకమును సాధించుకొనుచున్నారు కొందరిని యజ్ఞాంగ సాధనములతో, కొందరిని కందాది ఫలములనిచ్చుటచేత నీవు ఉద్దరించుచున్నావు ఇంతకంటే నీ గూర్చి చెప్పేదేమి? (14) పర్వతరాజా! గ్రహస్థుని ప్రాణులవలె నిన్ను ఆశ్రయించి ఎన్నో జీవులు అనేక విధముగా ఆనందించుచున్నవి చలిని ఎండను వానను అనేకవిధములైన క్లేశములను సహించుచూ నీవు జంతువులకుపరించుచుంటివి ఇటువంటి వారే కదా సాధువులు! (16) ఇంతకంటే చెప్పునదేమి ! నీవు ధన్యుడవు (17) స్వయముగా మహేశ్వరుడే నీ గిరి కందరమును (గుహ) ఆశ్రయించి వున్నాడు అని నేను సత్యమును పలుకగా అంతలో హిమవంతుని భార్య మేన యనునది తన కూతురుతో కొలదిమంది పరిచారికలతో కలిసి నన్ను చూడగోరివచ్చెను (19)

లజ్జయానతసర్వాంగీ ప్రవివేశ సదో మహాత్‌ |తతో మాం శైలమహిషీ వవందే ప్రణిపత్య సా||20

వస్త్రనిర్గూడవదనా పాణిపద్మాకృతాంజలి: తామహం సత్యరూపాభిరాశీర్భి: సమవర్దయమ్‌||21

పతివ్రతా శుభాచారా సుభగా వీరసూ: శుభే | సదా వీరవతే చాపి భవ వంశోన్నతిప్రదే||22

తతోహం విస్మితాక్షీం చ హిమవద్దిరిపుత్రికామ్‌|' మృదువాణ్యా ప్రత్యవోచమేహి బాలే మమాంతికమ్‌||23

తతో దేవీ జగన్మాతా బాలభావం స్వకం మయి| దర్శయంతీ స్వపితరం కంఠే గృహ్యేంకమావిశత్‌||25

ఉవాచ వాచం తాం మందం మునిం వందయ పుత్రికే | మునే : ప్రసాదతోవశ్యం పతిమాప్స్యసి సంమతమ్‌||25

ఇత్యుక్తా సా తతో బాలా వస్త్రాంతపిహితాననా| కించిత్సహుంకృతో త్కంపం ప్రోచ్య నోవాచ కించన||26

తతో విస్మితచిత్తోహము పాచారవిదాంవర:| ప్రత్యవోచం పునర్దేవీమేహి దాస్యామి తే శుభే||27

రత్నక్రీడనకం రమ్యం స్థాపితం సుచిరం మయా| ఇత్యుక్తా సా తదోత్థాయ పితురంకాత్సవేగత:||28

వందమానా చ మే పాదౌ మయా నీతాంకమాత్మన:| మన్యతా తా జగత్పూజ్యాముక్తం బాలే తవోచితమ్‌||29

సిగ్గుతో కొంతవంగిన శరీరముతో ఆమె సభను ప్రవేశించి నాకు నమస్కరించెను మేలిముసుగులో నున్న మేన చేతులు జోడించగా నేనామెను నిజమగు ఆశీస్సులతో వర్ధిల్లుమంటివి (21) ప్రతివ్రతువు, శుభమగు ఆచారము గలదానవు ,ఐశ్వర్యము గల దానవగు నీవు వీరపుత్రికను కనుము వీరురాలవై వంశమునకు ఉన్నతిని కలుగజేయుము (22) అని నేను విస్మయముతో చూచుచున్న హిమవంతుని పుత్రికను మృదుస్వరముతో దగ్గరకు రమ్మని పిలిచితిని(23) అంతట ఆ జగన్మాత తన బాలభావమును నాయందు చూపించుచు తన తండ్రి బడిలో తండ్రికంఠమును పెనవేసుకొని కూర్చోనెను (24) అపుడు హిమవంతుడు మెల్లగాఇట్లనెను అమ్మా! మునీశ్వరులకు నమస్కరించుము మునీశ్వరుల ప్రసాదము వలన నీవు తప్పక కోరిన వానిని భర్తగా పొందగలవు (25) అనెను అపుడు కొంగుతో ముఖమును కప్పుకొని హూ యనుచూ సిగ్గిలిన హైమవతి ఏమి చెప్పకుండెను (26) అంతట విస్మయము నొందిన నేను ఉపచారములను బాగుగా తెలిసిన వానినగుటచే ఆమెతో నిట్లంటిని అమ్మా ! దగ్గరకు రమ్ము నీకు అందమైనది, రత్నములతో చేసినదియగు బొమ్మనిచ్చెదను నీ కొసమే చాలాకాలంగా వుంచాము , అనగా హైమవతి తండ్రి ఒడిలో నుండి వేగముగా లేచి నా కాళ్ళకు నమస్కరించగా నేనామెను నా ఒడిలో కూర్చుండబెట్టుకొంటిని ఆమెను జగత్పూజ్యురాలని భావించుచూ బాలా! నీకు తగినది నాకు కనబడుటలేదు(29)

న తత్పశ్యామి యత్తుభ్యం దద్మ్యాశీ: కా తవోచితా | ఇత్యుక్తే మాతృవాత్సల్యాత్‌ శైలేంద్రమహిషీ తదా || 30

నోదయామాస మాం మందమనాశీ: శంకితా తదా| భగవన్యేత్త్సి సర్వం త్వమతీతానాగతం ప్రభో ||31

తదహం జ్ఞాతుమిచ్చామి కీదృశోస్యా: పతిర్భవేత్‌|| శ్రుత్వేతి సస్మితముఖ: ప్రోవాచ నర్మవల్లభ:||32

న జాతోస్యా పతిర్భద్రే వర్తతే చ కులక్షణ: | నగ్నోతినిర్దన క్రోథి వృత: క్రూరైశ్చ సర్వదా||33

శ్రుత్వేతి సంభ్రమావిష్టో ధ్వస్తవీర్యో హిమాచల: | మాం తదా ప్రత్యువాచేదం సాశ్రుకంఠో మహాగిరి:||34

అహో విచిత్ర సంసారో దుర్వేద్యో మహతామపి| ప్రవరస్త్యపి శక్త్యా యే నరేషు న కృపాయతే||35

యత్నేన మహతా తావత్‌ పుణ్యౖర్భహువిధైరపి| సాధయత్యాత్మనో లోకో మానుష్యమతి దుర్లభమ్‌||36

అధృవం తద్దృవత్వే చ కథం చిత్పరికల్పతే | తత్రాపి దుర్లభానాం సమానవ్రతచారిణీ||37

సాధ్వీ మహాకులోత్పన్నా భార్యా యా స్యాత్పతివ్రతా| తత్రాపి దుర్లభం యచ్చ తయా ధర్మనిషేవణమ్‌||38

సహ వేదపురాణోక్తం జగత్త్రయహితావహమ్‌|| ఏతత్‌ సుదుర్లభం యచ్చ తస్యాం చైవ ప్రజాయతే ||39

తదపత్యం అపత్యార్థం సంసారే కిల నారద|

నీకు ఏ అశీర్వాదము తగును? అనగా మేన మాతృవాత్సల్యముచేత పార్వతినాశీర్వదించనేమోనని శంకించుచూ నన్నిట్లు, ప్రేరేపించెను భగవాన్‌ ! భూతభవిష్యత్తు తమకంతా తెలుసు ఈ బాలకు ఎట్టివాడు భర్తయగునో తెలుసుకొనగోరుచున్నాను అనగా విని, రహస్యమునిష్టపడు నేను నవ్వుచూ ఇట్లంటిని (32) ఈ బాలకు భర్తపుట్టడము కాదు ఇప్పుడు వున్నాడు అతను చెడు చిహ్నములుగ లవాడు నగ్నముగా నుండును ధనములేని వాడు కోపిష్టి ఎప్పుడూ క్రూరులతో నుండును (33) అనగా విని హిమవంతుడు శక్తి యుడిగిపోగా సంభ్రమునుపొంది గద్గదస్వరముతో నాతో ఇట్లనెను (34) అహో! ఈ సంసారము విచిత్రమైనది గొప్పవారు కూడా తెలుసుకొలేనిది నరులలో గొప్పవాడు కూడా తన శక్తితో తెలుసుకొలేడు మానవుడు గొప్ప ప్రయత్నముచేత, బహువిధపుణ్యములచేత అతిదుర్లభమగు మనుష్య జీవితమును పొందును (36) ధృవము కానిదైననూ ఏదో ఒకవిధముగా ఇది ధృవముగాచేయబడును ఆ మనుష్యజన్మలో ,సమానవ్రతము గలిగి సాధ్వియై ఉన్నత కులమున జన్మించిన ప్రతి వ్రతయగు భార్యను పొందుట దుర్లభము (37) అందునా ఆమెతో వేదపురాణోక్తమై లోకములన్నింటికి హితమును కలిగించు ధర్మమునుసేవించుట మిగుల దుర్లభము (38) అందునా ఆ భార్యా నుండి అపత్యమును అపత్యముకొరకే (సంతానము కొరకే) పొందుట దుర్లభము(39)

ఏతేషాం దుర్లభానాం హికించిత్‌ ప్రొప్నోతి పుణ్యవాన్‌||40

సర్వమేతదవాప్నోతి సకోపి యది వా నవా '| కించిత్‌ కేనాపి హి న్యూనం సంసార: కురుతే నరమ్‌||41

అథ సాంసారికో దోష: స్వకృతం యత్ర భుజ్యతే | గార్హస్థ్యం చ ప్రశంసంతి వేదా: సర్వేపి నారద||42

నేతి కేచిత్తత్ర పున: కథం తేయది నో గృహీ | అతో ధాత్రా చ శాస్త్రేషు సుతలాభ: ప్రశంసిత:||43

పునశ్చ సృష్టివృద్ద్యర్ధం నరకత్రాణనాయ చ | తత్ర స్త్రీణాం సముత్పత్తిం వినా సృష్టిర్న జాయతే ||44

సా చ జాతిప్రకృత్త్యేవ కృపణా దైన్యభాగినీ | తాసాముపరి మానజ్ఞా భ##వేదితి చ వేధసా|| శాస్త్రేఘూక్తమసందిగ్ధం వాక్యమేతన్మహత్పలమ్‌||45

దశపుత్రసమా కన్యా దశపుత్రాన్‌ ప్రవర్దయన్‌| యత్పలం లభ##తే మర్త్యస్తల్లభ్యం కన్యయైకయా||46

తస్మాత్కన్యా పితు: శోచ్యా సదా దు:ఖవివర్దినీ||47

యాపి స్యాత్పూర్ణసర్వార్థా పతిపుత్రధనాన్వితా | త్వయోక్తం చ కృతే హ్యస్యాస్తధ్వాక్యం మమ శోకదమ్‌||48

కేన దోషేణ మే పుత్రీ న యోగ్యా ఆశిషా మతా న జాతోస్యా: పతి : కస్మాద్వర్తతే వా కులక్షణ:||49

నిర్దవశ్చ మునే కస్మాత్‌ సర్వేషాం సర్వద: కుత ఇతి దుర్ఘలవాక్యం తే మనో మోహయతీవ మే||50

ఇట్టి దుర్లభమగు వానిలో నొకదానిని పొందిననూ పుణ్యవంతుడే (40)పుణ్యము గలవాడే ఒకదానినైననూపొందును) వీనినన్నింటిని పొందువాడు వుననాడా? లేడా? సంసారమే నరునికి ఏదో ఒకటి లేకుండా జేయును - (41) ఇక తానాచరించిన దానిననుభవించుట సంసార దోషము - వేదములన్ని గృహస్థాశ్రమమునే ప్రశంసించును - (42) కాదని కొందరందురు - అట్లైనచో వారెట్లు జన్మించినారు? కనుక బ్రహ్మ చేత శాస్త్రములందు పుత్రుని పొందుటయే ప్రశంసింపబడినది (43) ఇది సృష్టిని పెంచుటకు నరకమునుండి రక్షింపబడుటకు మాత్రమే కానీ స్త్రీల సముత్పత్తి లేక సృష్టి కలుగదు (44) ఆస్త్రీ జాతిస్వభావముచేత దీనురాలు అసహాయురాలు అట్టివారు అవమానము పాలు కారాదని బ్రహ్మ శాస్త్రములలో స్పష్టముగా, గొప్పఫలమునిచ్చు మాటను చెప్పెను (45) కన్య పదిమంది కుమారుల పెట్టు పది మంది కొడుకులను పెంచుచూ నరుడే ఫలమును, పొందునో దానిని ఒక కూతురుద్వారా పొందగలడు (46) కనుక కన్య తండ్రికి శోకమును, దుఖమును నిచ్చును (47) అన్ని భోగములుండి పతి, పుత్ర, ధనములున్ననూ కన్య తండ్రికి శోకమునుపెంచునది నీవు నా కూతురి విషయములో చెప్పినది నాకు దు:ఖమునిచ్చును (48) ఏ దోషముచేత నా కూతురు ఆశీర్వాదమునకు యోగ్యురాలు కాదు? ఈ మె పతి ఎందుకు జన్మించలేడు? వున్ననూ చెడులక్షణములు గలవాడెందుకాయెను ?(49) మునీ!నిర్దనుడైననూ అందరికి అన్ని ఇచ్చువాడెట్లగును? నీ క్లిష్టమగుమాట నన్ను మూడునిగా చేయుచున్నది(50)

ఇతి తం పుత్రవాత్సల్యాత్‌ సభార్యం శోకసంప్లుతమ్‌| అహమాశ్వాసయం వాగ్బిః సత్యాభిః పాండునందన||51

మా శుచ : శైలరాజ త్వం హర్షస్థానేతిపుణ్యభాక్‌ | శృణు తద్వచనం మహ్యం యన్మయోక్తం చ హ్యర్థమత్‌||52

జగన్మాతా త్వియం బాలా పుత్రీ తే సర్వసిద్దిదా| పురాభ##వే భవద్భార్యా సతీనామ్నా భవస్య యా||53

తదస్యా: కిమహం దద్మి రవేర్దీపమివాల్పక | సంచింత్యేతి మహాదేవ్యా నాశిషం దత్తవానహమ్‌||54

న జాతో స్యా: పతిశ్చేతి వర్తతే చ భవో హి స: | నస జాతో మహాదేవో భూతభవ్యభవోద్భవ:||55

శరణ్యః శాశ్వత: శాస్తా శంకర: పరమేశ్వర:||56

సర్వే దేవా యత్పదమామనన్తి వేదైశ్చ సర్వైరపి యో న లభ్య:| బ్రహ్మాది విశ్వం నను యస్య శైల బాలస్య వా క్రీడనకం వదంతి ||57

స చామంగల్యశీలోపి మంగళాయతనో హరః | నిర్థన సర్వదశ్చాసౌ వేద స్వం స్వయమేవ స:||58

స చ దేవోచల: స్ధాణుర్మహాదేవోజరో హర:| భవిష్యతి పతి సోస్యాస్తత్కిమర్ధం తు శోచసి||59

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కౌమారికాఖండే

కుమారేశమాహత్మ్యే హిమవదాశాసనం నామ త్రయోవింశోద్యాయ:||

అనగా విని నేను, భార్యతో సహా శోకమును పొందిన హిమవంతుని నిజమైన మాటలతో ఊరడించసాగితిని(51)పర్వతరాజా! ఆనందము పొందవలసినచో నీవు శోకించరాదు నీవు పుణ్యవంతుడవు అర్ధవంతముగా నేనన్నది వినుము(52) ఈ నీ పుత్రికగా నున్న బాలిక జగన్మాత అన్ని సిద్దులనిచ్చునది పూర్వ జన్మలో శివునికిభార్యగా సతీదేవి యను పేరుతో నుండినది (53) అట్టి ఈ జగన్మాతకు నేను సూర్యునికి అల్పుడు దీపమిచ్చినట్లు ఏమివ్వగలను? అని ఆలోచించి నేను ఆశీర్వదించలేదు .(54) ఈ బాలకు పతి పుట్టలేదు , వున్నాడన్నాను శివుడు జన్మలేనివాడు జన్మించు, జన్మించును, జన్మింపబోవు వానికతను కారణము (55) అతనే శరణము వేడదగువాడు నిత్యుడు శాసకుడు ,మంగళకరుడు, పరమేశ్వరుడు (56) అందరు దేవతలు ఏ పదమును గొప్పగా కీర్తించెదరో , అన్ని వేదములచే

కూడా ఎవరిని పొందలేమో బ్రహ్మ మొదలగు విశ్వము చిన్నపిల్లవాని అట వస్తువని ఎవరిని గూర్చి అందురో అట్టి శివుడు అమంగళ శీలుడైననూ మంగళములకు నివాసము (57) ధనములేకున్ననూ అందరికీ అన్నీ ఇచ్చువాడు తనను తాను తెలుసుకొనువాడు (జ్ఞాన స్వరూపుడు) (58) అట్టి మహాదేవుడు స్థిరమగువాడు కూటస్థుడు, అక్షరుడు అతనే ఈ బాలికకు పతియగును నీవెందులకు శోకించుచుంటివి?('59)

ఇదిశ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికా ఖండమున కుమారేశుని మాహత్మ్యమున నారదుడు హిమవంతుని ఊరడించుట యను ఇరవై మూడవ అధ్యాయము

చతుర్వింశోధ్యాయ:

నారద ఉవాచ -

ఏవం శృత్వా సభార్య: స ప్రమోద ప్లుతమానస: ప్రణమ్య మామితి ప్రాహ యద్యేవం పుణ్యవానహమ్‌|| 1

పునః కించిత్ప్ర్‌ వక్ష్యామి పుత్ర్యా మే దక్షిణ : కర:| ఉత్తాన: కారణం కిం తత్‌ శ్రోతుమిచ్చామి నారద||2

ఇతి పృష్టోస్మి శైలేన ప్రావోచం కారణం తదా| సర్వదైన కరో హ్యస్యా: సర్వేషాం ప్రాణినాం ప్రతి||3

అభయప్య ప్రదాతాసాపుత్తానస్తు కరస్తత :| ఏషా భార్యా జగద్భర్తుర్వృషాంకస్య మహీదర||4

జననీ సర్వలోకాస్య భావినీ భూతాభావినీ | తద్యథా శీఘ్రమేనైషా యోగం యాతు పినాకినా||5

త్వయా విధేయం విధివత్తదా శైలేంద్రసత్తమ | అస్త్వాత్ర సుమహాత్కార్యం దేవానాం హిమభూధర||6

ఇతిప్రోచ్య తమాపృచ్చ్య ప్రావోచం వాసవాయు తత్‌| మమ భూయస్తు కర్తవ్యం తన్మయా కృతమేవ హి||7

కిం తు పంచశర: ప్రేర్య: కార్యశేషేత్ర వాసవ ఇత్యాదిశ్య గతశ్చాహం తారకం ప్రతి పాల్గున ||8

కలిప్రియత్వామ్‌ తసై#్యనమర్ధం కథయితుం స్పుటమ్‌|| హిమాద్రిరపి మే వాక్యప్రేరిత: పార్వతీం ప్రతి|||9

భవస్యారాధనాం కర్తుం ససఖీమాదిశత్తదా | సాతం పరిచచారేశం తస్యా దృష్ట్వా సుశీలతామ్‌||10

ఇరవైనాలుగవ అధ్యాయము:

నారదుడిట్లు చెప్పసాగెను - అది విని హిమవంతుడు భార్యతో సహా ఆనందముతో ఉప్పోంగిన హృదయముతో నారదుని నమస్కరించి ఇట్లడిగెను (1) అయ్యా! నేను పుణ్యంతుడనైతే మిమ్ములనొకటి అడుగదలిచాను నాకూతురి కుడిచెయ్యి పైకిలేచినట్లున్నది కారణమేమిటి వినగోరుచున్నాను(2) అని అడుగగా నేను ఆ కారణమునిట్లు చెప్పితిని ఈ దక్షిణకరము ఎల్లప్పుడు అన్ని ప్రాణులకూ అభయమిచ్చునది కనుక పైకి లేచి నట్లున్నది(3) పర్వతరాజా! ఈ బాలిక జగత్తులను భరించు మహేశ్వరుని భార్య(4) అన్ని లోకములకు తల్లి కారణము ప్రాణుల ఉనికికి కారణము ఈమె శివునితో కలియునట్లు నీవు త్వరగా యథావిధి చేయము దేవతలకిందు గొప్ప ప్రయోజనమున్నది (6) అని పలికి అతనికి వీడ్కోలు పలికి వెళ్ళి ఇంద్రునితో ఆ విషయమును తెలిపితిని నేనే చేయవలసినదానిని చేసితిని ఇక మిగిలిన పనికై ప్రేరేపించవలెను అని అదేశించి నేను తారకాసురని వద్దకు వెళ్ళితిని '(8) అర్జునా కలిప్రియుడు ఇదంతా స్పష్టముగా చెప్పవలెనని వెళ్ళితిని హిమవంతుడు కూడా నా మాటలో ప్రేరితుడై శివుని ఆరాధించుటకు పార్వతిని సుఖులతోసహ వెళ్ళుటకు ఆదేశించును పార్వతి శివునికి పరిచర్యలను చేసెను (10)

పుష్పతోయఫలాద్యాని నియుక్తా పార్వతీ వ్యధాత్‌ | మహేంద్రోపి చ మద్వాక్యాత్స్మరం సస్మార భారత||11

ప చ తత్‌స్మరణం జ్ఞాత్వా వసంతరతిసంయుత!| చూతాంకురాస్త్రా : సహసా ప్రాదురాసీన్మనోభవ:||12

తమాహ చ వచో ధీమాన్‌స్మయన్నివ చ తం స్పృశన్‌ ఉపదేశన బహునా కిం త్వాం ప్రతి రతిప్రియ||13

చిత్తే వనసి తేన త్వం వేత్సి భూతమనోగతమ్‌| తథాపి త్వాం వదిష్యామి స్వకార్యపరతం స్మరన్‌||14

మమైకం సుమహత్కార్యం కుర్తుమర్హసి మన్మథ | మహేశ్వరం కృపానాథం సతీభార్యవియోజితమ్‌||15

సంయోజయ పునర్దేవ్యా హిమాద్రిగృహజాతయా | దేవీ దేవశ్చ తుష్టా తే కరిష్యత ఇహేప్సితమ్‌||16

మదన ఉవాచ-

ఆలీనమేతద్దేవేంద్ర స హి దేవస్తపోరత:| నాన్యాసాదయితవ్యాని తేజాంసి మనురబ్రవీత్‌||17

వేదాంతేషు చ మాం విప్రా గర్హయంతి పున: పున | మహాశనో మహాపాప్మా కామోయమనలో మహాన్‌||18

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినాం నిత్యవైరిణా | తస్మాదయం సదా త్యాజ్య కామోహిరివ సత్తమై: ||19

ఏవం శీలస్య మే కస్మాత్‌ ప్రతుష్యతి మహేశ్వర:||మద్యపస్యేవ పాపస్య వాసుదేవో జగద్గురు:||20

అట్లు నియమించబడిన పార్వతి శివునికి పూజకై పూలు, పళ్ళు, నీరు, తెచ్చి పెట్టెను ఇక ఇంద్రుడు నామాటపై మన్మధుని స్మరించెను (11) అది తెలిసి మన్మథుడు వసంతునితో ,రతితో కలిసి మామిడిపూతయే ఆయుధముగా ఒక్కమారుగా ఆవిర్భవించెను (12) అంత ఇంద్రుడు తెలివిగా నవ్వుచూ మన్మథుని స్పృశించుచూ ఇట్లనెను రతి ప్రియా! నీకు ఉపద్దేశమునెక్కువగా నివ్వవలసినది లేదు అందరి చిత్తమున నివసించు నీకు అందరి భావములు తెలియును అయినప్పటికీ నా కార్యపరత్వమును స్మరించుచూ నీకు చెప్పుదను (14)మన్మథా నీవు నా కొక పెద్దపనిని చేసి పెట్టవలెను సతియను తన భార్యనుండి వియోగమును పొందిన పరమకృపాళువగు మహేశ్వరుని నీవు హిమవంతుని ఇంట జన్మించిన సతీదేవితో కలుపుము అపుడు సంతోషించు శివపార్వతులు నీవు కోరినది చేయగలరు (16) అనగా మదనుడిట్లనెను దేవేంద్రా ! ఇది అసత్యము ఆ మహాదేవుడు తపోరతుడు తేజస్సు లనింకొకరు కలుపనవసరం లేదు మనువనెనుకదా! (17) ఇక విప్రులువేదాంతమున మరల మరల నన్ను నిందింతురు కామమునది అన్నింటికి గ్రహించునది గొప్ప పాపము నాచరించునది ఒకపెద్ద అగ్ని (18) జ్ఞానుల జ్ఞానము ఈ నిత్యశత్రువగు కామము చేత కప్పబడియున్నది కను క సాధువులు ఈ కామమును పామువలె ఎప్పుడూ విడిచి పెట్టవలెను అందురు (19) ఇట్టి స్వభావము గలనాపట్ల పాపియగు త్రాగుబోతుపట్లవలె మహేశ్వరుడు, జగద్గురువు ఎట్లు సంతుష్టుడగును ?(20)

ఇంద్ర ఉవాచ-

మైవం బ్రూహి మహాభాగ త్వాం వినా క: పుమాన్భువి| ధర్మమర్థం తథా కామం మోక్షం వా ప్రాప్తుమీశ్వర:||21

యత్కించిత్‌ సాధ్యతే లోకే మూలం తస్య చ కామనా| కథం కామం వినిందంతి తస్మాత్‌ తే మోక్షసాధకా:||22

సత్యం చాపి శృతేర్వాక్యం తవ రూపం త్రిధాగతమ్‌ | తామసం రాజసం చైవ సాత్వికం చాపి మన్మథ||23

అముక్తిత: కామనయా రూపం తత్తామసం తవ| సుఖబుద్ద్యా స్పృహ యాచ రూపం తద్రాజసం తవ||24

కేవలం యావదర్ధార్థం తద్రూపం సాత్త్వికం తవ తత్తే రూపత్రయమిదం బ్రూహి నోపాసతే హికే||25

త్వం సాక్షాత్పరమః పూజ్యః కురు కార్యమిదం హి న:|| అథవా పిడితాన్‌ దృష్ట్వా సామాన్యానపి పండితా:||స్వప్రాణౖరపి త్రాయంతి పరమేతన్మహాఫలమ్‌||26

ఇతి సంచింత్య కార్యం త్వం సర్వథా కురు తత్‌స్పుటమ్‌||27

ఇత్యాకర్ణ్య తథేత్యుక్త్వా వసంతరతిసంయుత :| పికాదిసైన్యసంపన్నో హిమాద్రిం ప్రయ¸°స్మర:||28

తత్రాపశ్యత శంభో : స పుణ్యమాశ్రమమండలమ్‌|| నానావృక్షసమాకీర్ణం శాంతసత్త్వసమాకులమ్‌||29

యథా సాక్షాన్మహేశానం గణాంశ్చాయుతశోస్య చ ||30

అపుడు ఇంద్రుడిట్లనెను మహాశయా! నీవట్లనవద్దు నీవు లేనిచో ఈ భూమి పై ధర్మార్థకామమోక్షములను పొందుటకుఎవరర్హులగుదురు (21) లోకములో ఏదైనా సాధ్యమవుతున్నదంటే దానికి మూలము కామన(కోరిక) కనుక మోక్షమును సాధించుగోరు వారు కామమునెట్లు నిందింతురు? (22) నీ రూపము మువ్విధముగా నుండునని శ్రుతి చెప్పినది నిజము నీరూపము తామసము , రాజసము, సాత్త్వికము (23) అందు ముక్తికై కాక కేవలము కోరికతో నుండునది నీ తామసరూపము సుఖబుద్దితో ,స్పృహ తో వుండు రూపము రాజసము (24) వస్తుస్థితి నాశ్రయించునది నీ సాత్త్వికరూపము అట్టి నీ మూడు రూపములను ఎవరుపాసించరు చెప్పుము (25) నీవు సాక్షాత్తు పరమపూజ్యునివి కనుక మాకీ పనిని చేసిపపెట్టుము అయిననూ ,పండితులు పీడితులను చూచి వారు సామాన్యులైననూ తాము తమ ప్రాణములొడ్డి రక్షింతురు కాని ఇది గొప్ప ప్రయోజనము అని అలోచించి నీవు ఈ పనిని చేయుము (27) అని ఇంద్రుడు విని మన్మథుడు సరేనని వసంతునితో , రతితో కలిసి కోకిలలు మొదలగు సైన్యముతో హిమవత్పర్వతము వైపు కదిలెను (28) అచట అనేక వృక్షములతో,శాంత స్వభావముగల జంతువులతోకూడియున్న శివుని ఆశ్రమములనను చూచెను (29) అక్కడ సాక్షాత్తు మహేశునివలె నున్న వీరకుడను శివుని ద్వార పాలుని , వేలకొలది ఇతర గుణములను మన్మథుడు చూచెను (30)

దదర్శ చ మహేశానం నాసాగ్రకృతలోచనమ్‌ | దేవదారుద్రుమచ్చాయావేదికామధ్యశ్రితమ్‌|| సమకాయం సుఖాసీనం సమాధిస్థం మహేశ్వరమ్‌||31

నిస్తరంగం వినిర్‌గ్రాహ్య స్థితమింద్రియగోచరాన్‌| ఆత్మానమాత్మానా దేవం ప్రవిష్టం తపసో నిధిమ్‌||32

తం తథావిధమాలోక్య సోంతర్భేదాయ యత్నవాన్‌| భ్రమరధ్వనివ్యాజేన వివేశ మదనో మన:||33

ఏతస్మిన్నంతరే దేవో వికాసితవిలోచన :| సస్మార నగరాజస్య తనయాం రక్తమానస||34

నివేదితా వీరకేణ వివేశ చ గిరే: సుతా | తస్మిన్కాలే మహాభాగా సదా యద్వదుపైతి సా||35

తతస్తస్యాం మన స్వీయమనురక్తమవేక్ష్య చ | నిగృహ్య లీలయా దేహః స్వకం పృష్టమవైక్షత| తావదాపూర్ణధనుషమపశ్యత రతిప్రియమ్‌||36

తన్నాశకృపయా దేవో నానాస్ధానేషు సోగమత్‌ తావత్పశ్యతి పృష్టస్థమాకృష్య ధనుష: శరమ్‌||37

సనదీః పర్వతావశ్చెవ ఆశ్రమాన్స సరసీస్తథా | పరిభ్రమన్మహాదేవ పృష్ఠస్థం తమవైక్షత||38

జగత్‌ త్రయం పరిభ్రమ్య పునరాగాత్స్వమాశ్రమమ్‌| పృష్ఠస్థమేవ వీక్ష్య ని: శ్వాసం మముచే హర:||39

తతస్తృతీయనేత్రోత్థవహ్నినా నాకవాసినామ్‌ | క్రోశతాం గమిత: కామో భస్మత్వం పాడునందన||40

అక్కడ మన్మథుడు నాసాగ్రము పై దృష్టిని నిలిపిన ,వృక్షముయొక్క నీడలో వేదిక పై నున్న, నిటారుగా దేహమునునిలిపి సుఖముగా కూర్చోని సమాధిస్థితితో ఇంద్రియవిషయములన్నింటినీ నిగ్రహించి తనలో తాను ప్రవేశించిన నిశ్చలుడైన మహేశ్వరుని చూచెను (32) ఆ తపోనిధినట్లు చూచి మన్మథుడు అంతరంగమును చేధించవలెనని తుమ్మెదల ధ్విని యను నెపముతో అతని యనసున ప్రవేశించెను (33) అంతలో దేవదేవుడు కళ్ళువిప్పి అనురాగముతో పార్వతిని తలచుకొనెను (34) అపుడు వీరకుడు పార్వతి ఎప్పటివలె వచ్చి వెళ్ళెననెను (35) అంతట పార్వతి యందు తన మనస్సు అనుర్తమగుటనుచూచి దేవదేవుడగు శివుడు లీలగా దానిని నిగ్రహించి తన వెనుక వైపున చూచెను (35) అంత బాణమునెక్కు పెట్టిన మన్మథుడు కనబడెను అతని నశింపజేయువలెనని శిపుడాస్థలమును విడిచి ఎన్నో ప్రదేశములకు వెళ్ళిననూ మన్మధుడు వెంటనుండెను నదులను పర్వతములనను, ఆశ్రములను , సరస్సులను ఎన్నింటిని చుట్టి వచ్చిననూ మన్మథుడు తన వెంటనంటుట చూచెను (38) ముల్లోకములలో తిరిగి పరమశివుడు చివరకు తన ఆశ్రమమునకు వచ్చి మన్మథుడు తనవెంటనే యుండుట చూచి నిశ్వసించెను (39) అంతట అతని మూడవ కంటినుండి వెలువడిన అగ్ని దేవతలు ఆక్రోశించుచుండగా మన్మథుని భస్మమొనర్చెను(40)

స తం తు భస్మసాత్‌ కృత్వా హరనేత్రోద్భవోనల :| వ్యజృంభత జగద్దగ్గుం జ్వాలాపూరితదిజ్మఖ :||41

తతో భవో జగద్దేతో: వ్యభజజ్ఞాతవేదనమ్‌| సాహంకారే జనే చంద్రే సుమనస్సు చ గీతకే|| 42

భృంగుషే కోకిలాస్యేషు విహరేషు స్మరానలమ్‌|| తత్ర్పాప్తౌ స్నేహసంయుక్తం కామినాం హృదయం కిల||43

జ్వాలయత్యనిశం సోగ్ని దుశ్చికిత్స్యోసుఖావహ:| విలోక్యహరని శ్వాసజ్వాలాభస్మీకృతం స్మరమ్‌||44

విలలాప రతిర్ధీనా మధునా బందునా సహ| విలపంతీ సుబహుశో మధునా పరిసాంత్వితా||45

రత్యా: ప్రలాపమాకర్ణ్య దేవదేవో వృషధ్వజ కృపయా పరయా ప్రాహ కామపత్నీం నిరీక్ష్యచ||46

అమూర్తోపి హ్యయం భ##ద్రే కార్యం సర్వం పతిస్తవ | రతికాలే ధృవం బాలే కరిష్యతి న సంశయ:||47

యదా విష్ణుశ్చ భవితా వాసుదేవాత్మజో విభు: తదా తస్య సుతో య: స్యాత్‌ స పతిస్తే భవిష్యతి||48

సా ప్రణమ్యతతో రుద్రమితిప్రోక్తా రతిస్తత:| జగామ స్వేచ్చయా గత్యా వసంతాదిభిరన్వితా||49

ఇతి శ్రీస్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కౌమారికాఖండే కుమారేశమాహత్మ్యే కామదహనో నామ చతుర్వింశోధ్యాయ:

ఆ అగ్ని మన్మథుని భస్మము చేసి అన్ని దిక్కులలో తన జ్వాలలతో ఎగియుచూ జగత్తును దహించుటకు విజృంభించెను (41) అంతట జగత్తును రక్షించుటకు పరమశివుడు ఆ అగ్నిని విడగొట్టి అహంకారముగల జనులలో , చంద్రునిలో, పూలలో , గీతములలో, తుమ్మెదులలో, కోకిల గొంతులో, విహారములలో వుంచెను దానిని పొందే కదా కామినుల హృదయము స్నేహమయమగు (43) ఆ అగ్ని అడ్డులేనిదై, దు:ఖమును కలిగించుచూ ఎల్లప్పుడే జ్వలింపజేయుచుండెను శివుని ని:శ్వాసజ్వలలచే మన్మథుడు భస్మమగుట చూచి రతీదేవి తన బందువగు వసంతునితో కలిసి దు:ఖించెను అట్టి ఆమెను చైత్రమే ఊరడించెను (45) ఆమె దు:ఖించుటను విని శివుడు దయతో ఆమెను చూచుచూ నిట్లనెను (46) అమ్మా! రూపము లేకున్ననూ నీ భర్త రతికాలములో కావలసిన దానిని చేయగలడు సంశయములేదు (47) వసుదేవునికి పుత్రునిగా విష్ణువు జన్మించినపుడు అతనికి కలుగు పుత్రుడు నీకు పతికాగలడు (48) అని ఊరడించగా రతిదేవి నమస్కరించి వసంతుడు మొదలగు వారితో కలిసి తనకు ఇష్టమైన విధముగా వెళ్ళిపోయెను (49)

ఇది శ్రీ స్కాంద మహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున కుమారేశుని మాహాత్మ్యములో కామదహనమను ఇరువదినాలుగవ అధ్యాయము

పంచవింశోధ్యాయ:

అర్జున ఉవాచ-

దేవర్షే వర్ణ్యతే చేయం కథా పీయూషసోదరా| పునరేతన్మునే బ్రూహి యదా వేత్తి మహేశ్వర:||1

భగవాన్‌ స్వాం సతీం భార్యాం వధార్ధం చాపి తారకమ్‌| పత్యాశ్చ విరహాత్తప్యన్‌ దదాహ కిమసౌ స్మరమ్‌||2

త్వయైవోక్తం స విరహాత్‌ సత్యాస్తప్యతి వై తప: | హిమాద్రిమాస్థితో దేవస్తస్యా :సంగమవాంఛయా||3

నారద ఉవాచ-

సత్యమేతత్పురా పార్థ భవస్యేదం మనీషితమ్‌|| అతప్తతపసా యోగో న కర్తవ్యో మయానఘ||4

తపో వినా శుద్దదేహో న కథంచన జాయతే | అశుద్దదేహేన సమం సంయోగో నైవ దైహిక:||5

మహత్కార్మాణి యానీహి తేషాం మూలం సదా తప:| నాతప్తతపసాం సిద్దిర్మహత్కరాణి యాంతి వై||6

ఏతస్మాత్కారణాద్దేవో దర్పితం తం దదాహ తు |తతో దగ్థే స్మరే చాపి పార్వతీమపి వ్రీడితామ్‌||7

విహాయ సగణో దేవ: కైలాసం సమపద్యత| దేవీ చ పరమోద్విగ్నా ప్రస్ఖలంతీ పదే పదే||8

జీవితం స్వం వినిందంతీ బబ్రామేతస్తతశ్చ సా |హిమాద్రిపి స్వే శృంగే రుదతీం పృష్టవాన్‌ రతిమ్‌||9

ఇరవై ఐదవ అధ్యాయము

అర్జునుడు నారదుని ఇట్లడిగెను దేవర్షి ! అమృతముతో కలిసి పుట్టినట్లున్న ఈ కథను వర్ణించుచుంటివి భగవంతుడగు మహేశ్వరుడు తన భార్యయగు సతిని వధించుట తారకుని ఎప్పుడు తెలుసుకొనునో చెప్పుము (1) సతీ విరహముతో తపించుచున్న శంకరుడు మన్మథుని దహించెను (2) సతీవిరహము వలన మహేశ్వరుడు ఆమెను కలియగోరి హిమాద్రిపై తపము నాచరించుచుండెనని నీవే చెప్పితివి (3) అని అడుగగా నారదుడు చెప్పసాగెను అర్జునా! పూర్వము శివుడట్లు చేయగోరెననుట సత్యమే కానీ పాపరహితుడా ! తపించకనే యోగము చేయరాదు (4) తపస్సు లేనిదే దేహము ఏవిధముగా నైననూ శుద్దము కాదు. శుద్దము కాని దేహముతో సంయోగము చేయరాదు(5) గొప్ప కార్యములన్నింటికీ మూలము ఎప్పటికైనా తపస్సే తపించని వారి మహత్కార్యములెప్పటికీ సిద్దించును (6) ఈ కారణముచేత పరమశివుడు దర్పించిన మన్మథుని దహించెను తరువాత శివుడు సిగ్గును పొంది పార్వతిని విడిచి తనగణముతో సహా కైలాసము చేరేను (7) ఇక పార్వతి కలతననుపొంది అడుగడుగున తొట్రుపడుచూ తన జీవితమునను బాగా నిందించుచూ ఇటు నటు పరిభ్రమించెను ఇక హిమవంతుడు తన శిఖరము పై రోదించుచున్న రతీదేవిని చూచి ఇట్లడిగెను(9)

కాసి కస్యాసి కల్యాణి కిమర్థం చాపి రోదిషి|పృష్టా సా చ రతి: సర్వం యథావృత్తం న్యవేదయత్‌||10

నివేదితే తథా రత్యా శైల: సంభ్రాంతమానస: ప్రాస్య స్వాం తనయాం పాణావాదాయాగాత్‌ స్వకం పురమ్‌|||11

సాతత్ర పితరౌ ప్రాహసఖీనాం వదనేన చ| దుర్భగేన శరీరేణ కిమనేన హికారణమ్‌ ||12

దేవాహసం పరిత్యక్ష్యే ప్రాప్స్యే వాభిమతం పతిమ్‌

| అసాద్యం చాప్యభీష్టం చ కథం ప్రాప్యం తపో వినా||13

నియమైర్వివిదైస్తస్మాత్‌ శోషయిష్యే కళేవరమ్‌| అనుజానీత మాం తత్ర మది వ: కరుణా మయి||14

శ్రేత్వేతి వచనం మాతా పితా చ ప్రాహ తాం శుభమ్‌| ఉ మేతి చపలే పుత్రి నక్షమం తావకం కపు:||15

సోడుం క్లేశాత్మరూపస్య తపస: సామ్యదర్శనే | భావీన్యప్యనివార్యాణి వస్తూని చ సదైవ తు||16

భావినోzర్థా భవంత్యేన నరస్యానిచ్చతోzపి హి | తస్మాన్న తపసా తేస్తి బాలే కించిత్‌ ప్రయోజనమ్‌||17

అమ్మా! నీ వెవరు? ఎవరికి చెందినదానవు ? ఎందుకీ విధంగా ఏడ్చుచున్నావు? అని హిమవంతుడడుగగా రతీదేవి జరిగిన దానినంతా నివేదించెను (10) అపుడు హిమవంతుడు సంభ్రమముతో కూతురు వద్దకు వెళ్ళి ఆమెను చేతులలో పట్టుకొని తన పురమునకు తీసుకొని పోయెను(11) అక్కడ తల్లిదండ్రుగగా పార్వతి తన సకుల ద్వారా ఇట్లు చెప్పించెను ఈ అభాగ్యమగు శరీరముతో నేమి? (12) దేహమనెడి నివాసమునైనా వదిలెదను కోరుకున్న పతినైనా పొందెదను కోరినది అసాద్యమైనప్పుడు తపస్సు తప్ప వేరొక సాధనమేమున్నది? (13) కనుక వివిధ నియమములతో ఈ కళేవరమును శుష్కింపజేసెదను మీకు నాపై దయయున్నచో అనుజ్ఞ నివ్వండి (14) అనగా ఆమె మాటను విని తల్లిదండ్రులు ,ఉమా, (అమ్మా! వద్దు) అనిపిలిచి ఇట్లనిరి చాపల్యముగల పుత్రికా! తపస్సు వద్దు క్లేశ##మే తనరూపముగా గల తపస్సును సహించుటకు నీ శరీరము సమర్థముకాదు (15) కలుగబోవునవి ఎప్పుడు అనివార్యములే (16) నరుడు కోరకపోయిననూ కలుగబోవునవి కలుగును కనుక అమ్మా! పార్వతీ! నీకు తపస్సు వలన ఏమి ప్రయోజనము లేదు(17)

శ్రీదేవ్యువాచ-

యదిదం భవతో వాక్యం న సమ్యగతి మే మతి:| కేవలం న హి దైవేన ప్రాప్తుమర్ధో హి శక్యతే||18

దైవాత్‌ కించిదర్థాత్‌ కించిత్‌ కించిదేవ స్వభావత:| పురుష: ఫలమాప్నోతి చతుర్థం నాత్రకారణమ్‌||19

బ్రహ్మణా చాపి బ్రహ్మత్వం ప్రాప్తం కిల తపోబలాత్‌ | అన్త్యెరపి చ యల్లబ్దం తన్న సంఖ్యాతుముత్సహే||20

అదృవేణ శరీరేణ యద్యభీష్టం న సాధ్యతే | పశ్చాత్స శోచ్యతే మంద: పతితేస్మిన్‌ శరీరకే||21

యస్య దేవాస్య ధర్మోయం క్వచిజ్ఞాయేత క్వచిన్మ్రియేత్‌| క్యచిద్గర్భగతం నశ్యేజ్ఞాతమాత్రం క్వచిత్తథా||22

బాల్యే చ ¸°వనే చాపి వార్దక్యేసి విపశ్యతి | తేన చంచలదేహేన కోర్థ స్వార్థో న చేద్భవేత్‌||23

ఇత్యుక్త్వా స్వసఖాయుక్తా పిత్రుభ్యాం సాశ్రు వీక్షితా | శృంగం హిమవత: పుణ్యంనానాశ్చర్యం జగామ సా||24

తత్రాంబరాణి సంత్యజ్య భూషణాని చ శైలజా| సంవీతా వల్కలైర్దివ్యైస్తపోతప్యత సంయతా||25

ఈశ్వంర హృది సంస్థాప్య ప్రణవాభ్యసనాదృతా | మునీనామప్యభూన్మాన్యా తదానీం పార్థ పార్వతీ||26

అని తల్లిదండ్రులనగా పార్వతీదేవి ఇట్లు బదులిచ్చెను మీరన్నది తగినకాదని నా అభిప్రాయము కేవలము దైవముచేత ఏ ప్రయెజనమునైనా పొందుట శక్యముకాదు(18) పురుషుడు దైవము ద్వారా కొంత పట్టుదల ద్వారా కొంత ప్రకృతిద్వారా కొంత ఫలమును పొందును -ఇందు నాలుగవ కారణము లేనే లేదు , (19)తపోబలము చేత బ్రహ్మ కూడా బ్రహ్మ కూడా బ్రహ్మత్వమును పొందెను కదా! ఇతరులు కూడా దేనిని పొందిరో దానిని లెక్కబెట్టి చెప్పుటకు నాకు ఉత్సాహము లేదు (20) అస్థిరమైన శరీరముచేత తనుకోరినదానిని పొందని మూర్ఖుడు ఆ శరీరము పడిపోయిన తరువాత శోకించును (21) ఎందుకనగా ఒకప్పుడు జన్మించుట, మరణించుట అనునవి శరీరధర్మములు, (22) బాల్యముననో, యవ్వనముననో, వృద్దాప్యముననో దేహము నశించును అట్టి చంచలదేహముతో స్వార్ధముదప్ప వేరేమి ప్రయోజనము గలదు? (23) అని పలికి పార్వతి తల్లిదండ్రులు కన్నటితో చూచుచుండగా తన సఖులతో కలిసి అనేకాశ్చర్యములుగల హిమవత్సర శిఖరమునుచేరెను (24) అక్కడ తన దివ్యవస్త్రములను, ఆభరణములను విడిచి, నారచీరలను ధరించి పార్వతి నియమముగా తపముచేయసాగెను (25) అర్జునా ! ఈశ్వరుని మనసులో నిలువుకొని , ప్రణవమునభ్యసించుటయందు ఆదరముగలిగి తపమాచరించుచున్న పార్వతి మునులకుకూడా పూజ్యారాలాయెను(26)

త్రిస్నాతా పాటలాపత్రభక్షకాభూచ్చతం సమా: | శతం చ బిల్వపత్రేణ శీర్ణేన కృతభోజనా||27

జలభక్షా శతం చాభూత్‌ శతం వై వాయుభోజనా | తతో నియమమాదాయ పాదాంగుష్టస్థితాభవత్‌|28

నిరాహరా తతస్తాపం ప్రాపుస్తత్‌తపసో జాన: | తతో జగత్సమాలోక్య తదీయతపసో జితమ్‌|29

హరస్తత్రాయ¸° సాక్షాత్‌ బ్రహ్మచారివపుర్‌ధర:| వసానో వల్కలం దివ్యం రౌరవాజినసంవృత:||30

సులక్షణాషాడధర: సద్వృత్త: ప్రతిభానవాన్‌| తతస్తం పూజయామాసుస్తత్సఖ్యో బహుమానత:||31

వక్తుమిచ్చు : శైలపుత్రీం సఖీభిరితి ఛోదిత:| బ్రహ్మన్నియం మహాభాగా గృ

హీతనియమా శుభా||32

ముహుర్తపంచమాత్రేణ నియమోస్యాః సమాప్యతే| తత్ర్పతీక్షస్వతంకాలం పశ్చాదస్మాత్సఖృసమమ్‌||33

నానావిధా ధర్మవార్తా: ప్రకరిష్యసి బ్రాహ్మణ| ఇత్యుక్త్వా విజయాద్యాస్తా దేవీ చరితవర్ణవై:||34

అశృముఖ్యో ద్విజస్యాగ్రే నిన్యు కాలం చ తం తదా | తత: కాలే కించిదూనే బ్రహ్మచారీ మహామతి:||35

విలోకనమిషేణాగాదాశ్రమోపస్థితం హ్రదమ్‌| నిపపాత చ తత్రాసౌ చుక్రోశాతితరాం తత:||36

దినమునకు మూడు పర్యాయములు స్నానము చేయుచూ, కేవల పాటలప్రతములను తినుచూ వంద సంవత్సరములుతపస్సుచేసెను అటు తరువాత నేలరాలిన బిల్వపత్రములను దినుచూ ఒక వంద సంవత్సరములు తపస్సు చేసెను (27) నీటిని త్రాగుచూ వందసంవత్సరములు గాలిని పీల్చుచూ ఒక వంద సంవత్సరములు తపమాచరించెను అటు తరువాత నియమముగా కాలివేలిపై నిలిచి తపమాచరించెను (28) ఆమె నిరాహరియై తపస్సు చేయుట వలన జనులు తపింపసాగిరి పార్వతి తన తపస్సుచే జగత్తును జయించుట చూచి శివుడు బ్రహ్మచారి రూపమున అక్కడకు వచ్చెను (29) అజినమును ధరించి, చేతిలో ఆషాడదండముతో చూచుటకు మంచి లక్షణములు గలిగి ఆ బ్రహ్మచారి పార్వతి తపోవనమును చేరేను (30) అపుడు పార్వతి చెలికత్తెలు బ్రహ్మచారిని పూజించిరి పార్వతితో మాటలాడగోరిన బ్రహ్మచారితో ఆ చెలికత్తెలిట్లనిరి ''బ్రాహ్మణా ! ఈ కల్యాణి నియమమును గ్రహించినది (32) ఇంకొక ఐదు నిముషములలో నియమము ముగియును అంతవరకు వేచిచూడుము అటు పై ఆమెతో నీవు నానావిధములగు ధర్మచర్చలు చేయగలవు (చేయవచ్చు) అని పలికి విజయ మొదలగు చెలికత్తెలు ఆ బ్రహ్మచారి ముందు పార్వతి చరిత్రను కన్నీటితో వరించుచూ కాలమును గడిపిరి (34) నియమము ముగించుటకు కొంతకాలము మిగిలియుండగానే బ్రహ్మచారి పరిసరములను చూచెదను మిషతో సమీపముననున్న నీటిమడుగు వద్దకు చేరి దానిలో పటి గట్టిగా అరవసాగెను.(36)

అహమత్ర నిమజ్ఞామి కోపి మూముద్దరేత భో:||ఇతి తారేణ క్రోశంతం శృత్వా తం విజయాదికా:||37

అజగ్ముస్త్వరయా యుక్తా దదుస్తసై#్మ కరం చ తా:| స చుక్రోశ తతో గాఢం దూరే దూరే పున: పున:||38

నాహం స్పృశామ్యసంసిద్దాం మ్రియే నానానృతం త్విదమ్‌| సమాప్తనియమా పార్వతీ స్వయమామ¸° ||39

స్వయం కరం దదావస్య తం చాసౌ నాభ్యనందత| భ##ద్రే యత్‌శుచి నైవ స్యాద్యచ్చైవావజ్ఞయా కృతమ్‌||40

సదోషేణ కృతం యచ్చ తదాదద్యాన్న కర్హిచిత్‌| సవ్యం చాశుచి తే హస్తం నావలంబామి కర్హిచిత్‌||41

ఇత్యుక్తా పార్వతీ ప్రాహ నాహం దత్తం చ దక్షిణమ్‌|| దదామి కస్యచిద్విప్ర దేవదేవాయ కల్పితమ్‌||42

దక్షిణం మే కరం గ్రహీతా భవ ఏవ చ || శీర్యతే చోగ్రతపసా సత్యమేతన్మయోదితమ్‌||43

విప్ర ఉవాచ-

యద్యేవమవలేపస్తే గమనం కేన వార్యతే | యథా తవ ప్రతిజ్జేయం మమాపీయం తథాచలా||44

రుద్రస్యాసి వయం మాన్యా : కీదృశం తే తపో వద| విషమస్థం యత్ర విప్రం మ్రియమాణముపేక్షసి ||45

అవజానాపి విప్రాంస్త్వం తత్‌శీఘ్రం వ్రజ దర్శనాత్‌| యది వా మన్యసే పూజ్యాంస్తతోభ్యుద్దర నాన్యథా||46

నేవిందులో మునిగిపోతున్నాను ఎవరైనా నన్ను తేవనెత్తండి' అని గట్టిగా బ్రహ్మచారి అరుచుచుండగా విని విజయ మొదలగు చెలికత్తెలు త్వరగా అక్కడికి వచ్చి అతనిని పైకి తీయుటకు తమ చేతిని చాచిరి(37) కాని బ్రహ్మచారి దూరముగా నుండి మరల గట్టిగా అరవసాగెను (38) మరణించుటకైనా సిద్దమే గానీ అసంసిద్దురాలిని ముట్టుకొనెను ఇది నిజము అని అతననుచుండగా తన నియమము పూర్తికాగా పార్వతి స్వయముగా అక్కడికి వచ్చెను (39) స్వయముగా తన చేతినివ్వగా బ్రహ్మచారి అంగీకరించలేదు కల్యాణి శ్రుద్దము కానిదానిని, అవమానముతో దోషముతో చేసినదానిని గ్రహించరాదు నీ ఈ ఎడమచెయ్యా ఆశుద్దము కనుక నేను అవలంభించను (41) అనగా పార్వతి అతనితో నిట్లనెను దేవదేవునికై ఏర్పరచబడినీ ఈ కుడిచేతిని వేరే ఎవరికీ నేవివ్వలేను (42) ఈశ్వరుడే నా ఈ కుడిచేతిని పట్టుకొనువాడు నా మహోగ్రతపస్సుచేత శివుడు కదిలిపోవును ఇది నిజము అనెను (43) అపుడు విప్రుడు నీ గర్వమట్టిదైనచో గమనమునెవరాపగలరు? నీ ప్రతిజ్ఞ ఎట్లు ఆచలమో నా ప్రతిజ్ఞ కూడా అచలమే (44)రుద్రునికి కూడా మేము పూజ్యులము మరణించుచున్న విప్రుని విషమస్థితిలో నున్న వానిను పేక్షించుచున్ననీ తపమెట్టిదో చెప్పుము (45) విప్రులనను అవమానించుచున్నావు కనుక కనబడుకుండా వెళ్లిపోమ్ము విప్రులు పూజ్యులని నీవు భావించుచున్నచో నన్నీ మడుగు నుండి పైకి లేపుము(46)

తతో విచార్య బహుధా ఇతి చేతి చ సా శుభా | విప్రస్యోద్దరతి సజ్జంతం భవవారిధౌ| ఏతత్‌ సందర్శనార్ధాయ తథా చక్రే భవోద్భవ:||48

ప్రోద్దృత్య చ తత: స్నాత్వా బుద్ద్వా యోగాసనం స్థితా ||49

బ్రహ్మచారీ తత: ప్రాహ ప్రవాసన్‌ కిమిదం శుభే | కరుకామాసి తన్వంగి ధృడయోగాసనస్థితా ||50

దేవీ ప్రాహ జ్వలయిష్యే శరీరం యోగవహ్నినా | మహాదేవ కృతమతిరుచ్చిష్టాహం యతోమభీష్టం కురు పార్వతీ ||52

నోపహన్యా కదాచిద్ది సాధుభిర్విప్రకామనా| ధర్మమేనం మన్యసే చేన్ముహుర్తం బ్రూహి పార్వతి ||53

దేవీ ప్రాహ బ్రూహి విప్ర ముహూర్తం సంస్థితా త్వహమ్‌|| తత: స్వయం వ్రతీ ప్రాహ దేవీం తాం స్వసఖీయుతామ్‌||54

కిమర్థమితి రంభోయ నవే వయసి దుశ్చరమ్‌| తపస్త్వాయా సమారబ్దం నానురూపం విభాతి మే||55

అటు తరువాత పార్వతి పెక్కువిధముల ఆలోచించి అన్ని ధర్మముల కంటే విప్రుని పైకి తీయుటయే అధికమని భావించెను(47) వెంటనే తన కుడిచేతినిచ్చి బ్రహ్మచారినీ నీటిమడుగు నుండి బయటకు లాగెను సంసారసాగరమున మునుగుచున్న పురుషుని స్త్రీ ఉద్దరించునని చూపుటకే శివుడట్లు చేసెను (48) శివుని పైకి లాగి పార్వతి మరల స్నానము చేసి యోగాసనమున కూర్చోనగా బ్రహ్మచారి నవ్వుచూ ఆమెతో నిట్లనెను కల్యాణీ! ధృడముగా యోగాసనమును కూర్చుండి నీవు ఏమి చేయబోవుచున్నావు? (50) అనగా పార్వతి యోగాగ్నితో ఈ శరీరమును జ్వలింపజేసెదను మహాదేవుని యందు మనసుగల నేను ఉచ్చిష్టురాలనైతిని (51) అనగా బ్రహ్మచారి ఇట్లనెను పార్వతీ ! బ్రాహ్మణుడిని గనుక నాతో కొంత ముచ్చటించి తరువాత నీకిష్టమైనట్లు చేయుము (52) సాధువులగువారు విప్రులకోరికను దెబ్బతీయరాదు ఇది ధర్మమును కొనినచో ఒక క్షణము చెప్పుము(53) అనగా అపుడు పార్వతి ఒక క్షణము నిలిచెద చెప్పుమనెను అపుడు బ్రహ్మచారి స్వయముగాచెలికత్తెలతో నున్న పార్వతి తో ఇట్లు సంభాషించసాగెను (54) సుందరీ! యవ్వనమున వీవీ కఠినమగు తపస్సు నారంభించితివెందుకు? ఇది సరైనదిగా నాకు తోచుటలేదు (55)

దుర్లభం ప్రాప్య మానుష్యం గిరిరాజగృహేధునా || భోగాంశ్చ దుర్లభాన్‌ దేవి త్వక్త్వా కిం క్లిశ్యతే వపు:||56

అతీవ దూయే వీక్ష్య త్వాం సుకుమారతరాకృతీమ| అత్యుగ్రతపసా క్లిష్టా పద్మినీవ హిమార్ధితా||57

ఇదం చాన్యత్తవ శుభే శిరసో రోగదం మమ| యద్దేహం త్యక్తుకామా త్వం ప్రబుద్దా నాసి బాలికే||58

వామ: కామో మనుష్యేషుసత్యమేతద్వచో యత:| స్సృహణీయాసి సర్వేషామేవం పీడయసే వపు:||59

అవిజ్ఞాతాన్వయో నగ్న: శూలీ భూతగణాధిప:| శ్మశాననిలయో భస్మోద్దూలనో వృషవాహన:||60

గజాజినో ద్విజిహ్వాద్యలంకృతాంగో జటాధర: విరూపాక్ష: కథంకారం నిర్గుణ స్యాత్తవోచితః ||61

గుణా యే కులశీలాద్యా వరాణాముదితా బుదై: తేషామేకోపి నైవాస్తి తస్మింస్తననోచిత: స తే||62

శోచనీయతమా పూర్వమాసిత్పార్వతి కౌముది| త్వం సంవృత్తా ద్వితీయాసి తస్యాస్తత్సంగమాశాయా||63

తపోధనా: సర్వసమా వయం యద్యాపి పార్వతి | దునోత్యేవ తవారంభః శూలాయాం మూపసత్‌క్రియా||64

వృషభారోహణం వాస: శ్మశానే పాణిసంగ్రహ :| సవ్యాలపాణినా క్షామగజత్వగ్భంధన: కథమ్‌||65

దుర్లభమగు మనుష్యజన్మను పొంది ,ఇపుడు పర్వతరాజు గృహమున దుర్లభ##మైన భోగములను విడనాడి నీవెందుకు శరీరమునను కష్టపెట్టుచున్నావు? (56) సుకుమారమగు నీ శరీరము తపస్సుచేత కష్టపడుటను చూచి మంచుచే వడలిన పద్మమును చూచినట్లు బాధపడుచుంటివి (57) ఇక నీ నిర్ణయము నాకు శిరోవేదనను కలిగించుచున్నది శరీరమును వదలివేయదలిచితిది నీవు ఆలోచించలేదా బాలికా? (58) మనుష్యులలో కామము దుర్మార్గుడనుట సత్యమే ఎందుకనగా నీవు అందరికీ పూజ్యరాలవై కూడా శరీరమును పీడించుచుంటివి (59) ఇక శివుడంటే తెలియదా? అతని వంశ##మేమిటో తెలియదు ,దిగంబరుడుచ శూలమును చేతబట్టి భూతగణముల నాయకుడై యుండెను శ్మశానమతని నివాసము భస్మమతని ఆభరణము, వృషభము వాహనము (60) గజచర్మమును ధరించి , పాములనే ఆభరణములుగా చేసుకొన్న జటిలుడతను ఎగుడుదిగుడు కన్నులవాడు అట్టినిర్గుణుడైన శివుడు నీకు తగిన వాడెట్లగును? (61) పండితులు చెప్పు వరుని గుణములగు కులము ,శీలము మున్నగువానిలో ఒక్కటైనా లేదు కనుక నీకు తగినవాడుకాడు (62) పార్వతీ ! పూర్వము శివుని సంగమమును కోరి వెన్నెల శోచనీయురాలైనది ఇక ఇప్పుడు నీవు రెండవదానివి (63) తపోధనులమగు మేము అన్నింటిని సమముగా చూచువారమే కానీ యజ్ఞస్తంభమునకు చేయు క్రియను శూలమునకు చేయుట బాధించునట్లు నీ ఈ ప్రయత్నము మమ్ము బాధించుచున్నది (64) ఎద్దునెక్కుట,శ్మశానములో నివసించుట ఎట్లు చేయగలవు ?పట్టు చర్మమును ధరించినీ చేతితో పాములను ధరించిన శివుని చేతినెట్లు పట్టుకోగలవు?(65)

జనహాస్యకరం సర్వం త్వయారబ్దమసాంప్రతమ్‌|| స్త్రీభావాద్బూతిసంపర్క: కథం చాభిమతస్తవ||--66

నివర్తయ మనస్తస్మాదస్మాత్సర్వవిరోధిన:| మృగాక్షి మదనారాతేర్మర్కటాక్షస్య ప్రార్థనాత్‌||67

విరుద్దవాదినం చైవం బ్రహ్మచారిణమీశ్వరమ్‌|| నిశమ్య కుపితా దేవీ ప్రాహ వాచా సగద్గదమ్‌||68

మా మా బ్రాహ్మణ భాషిష్టా విరుద్దమితి శంకరే || మహత్తమో యాతిపుమాన్‌ దేవదేవస్య నిందయా||69

న నమ్మగభిజానాసి తస్య దేవస్య చేష్టితమ్‌|| శృణు బ్రాహ్మణ త్వం పాపాద్యథాస్మాత్పరిముచ్యసే||70

స అతి: సర్వజగతాం కోస్య వేదాన్వయం తత: | సర్వం జగద్యస్య రూపం దిగ్వాసా: కీర్త్యతే తత:|71

గుణత్రయమమం శూలం శూలీ యస్మాద్భిభర్తి స :| అబద్దాః సర్వతో ముక్తా భూతా ఏవ చ తత్పతి:||72

శ్మశానం చాపి సంసారస్తద్వాసి కృపయార్థినామ్‌| భూతయ: కథితా భూతిస్తాం బిభ##ర్తే స భూతిభృత్‌ ||73

వృషో ధర్మ ఇతి ప్రోక్తస్తమారుడస్తతో వృషీ| సర్పాశ్చదోషా: క్రోధాద్యాస్తాన్‌ బిభర్తి జగన్మయ :||74

నానావిధా కర్మయోగా జటారూపా బిభర్తి స: | వేదత్రయా త్రినేత్రాణి త్రిపురం త్రిగుణం వపు:||75

నీవిపుడారంభించిన ఈ తపస్సు యుక్తమైనది కాదు - జనులచేత ఎగతాళి చేయబడునది స్త్రీవైయుండి ఐశ్వర్యమును పొందునట్లు నీవెట్లు కొరుచుంటివి? (66) కనుక అందరికీ విరుద్దమగు ఈ ప్రయత్నమునుండి బుద్దిని మరలింపుము ఓ సుందరీ!మదనుని శత్రువగు మర్కటాక్షుని (శివుని) కోరుటనుండి మనసుని మరలింపుము(67) అని ఆ బ్రహ్మచారి విరుద్దమును పలుకుట విని కోపించిన పార్వతీ దేవి గద్గదస్వరముతో నిట్లు బదులుచెప్పెను (68) బ్రాహ్మణా! శంకరుని పట్ల విరుద్దమును పలుకకుము దేవదేవుని నిందించుట చేత మానవుడు గొప్ప తమస్సును పొందును (69) నీవాదేవుని క్రియలను సరిగా తెలియజాలవు కనుక ఆ పాపమునుండి ముక్తుడవగునట్లు దేవదేవుని గూర్చి వినుము (70) అన్ని జగత్తులకు పరమశివుడు కారణమైనందుచే అతని వంశమునెవడెఱుగును? జగత్తంతా అతని రూపము కనుక అతనిని దిగంబరుడని యందురు(71)మూడు గుణములను శూలమును పట్టుటచే అతను శూలియనబడును బంధము లేనివారు ముక్తులగుదురుకాన అట్టిభూతములకు పతి భూతపతి యనబడును (72) శ్మశానమనగా సంసారమే దయతో అర్ధిజనులకై దానినాశ్రయించును ఈ చెప్పిన విభూతులను కలిగియున్నందుచే భూతిభృత్తనబడును (73) వృషమనగా ధర్మము దానినధిరోహించినందుచే శివుడు వృషీ యనబడును సర్వములనగా క్రోధమమున్నగునవి వాటిని భరించు జగన్మయుడు శివుడే (74) నానావిధములైన కర్మమోగములను జటారూపమున ధరించును కనుక జటీయనబడును అతని మూడు కన్నులు మూడు వేదములు మూడుగుణాలు శరీరమే త్రిపురము(75)

భస్మీకరోతి తద్దేవస్త్రీపురఘ్నస్తత: స్మృత: | ఏవం విధం మహాదేవం విదుర్యే సూక్ష్మదర్శిన:||76

కథంకారం హి తే నామ భజంతే నైవ తం హరమ్‌ || అథ వా భీతసంసారా: సర్వే విప్ర యతో జనా:||77

విమృశ్య కుర్యతే సర్వం విమృశ్యైతన్మయా కృతమ్‌|| శుభం వాప్యశుభం వాస్తు త్వమప్యేనం ప్రపూజయ||78

ఇతి బ్రువంత్యాం తస్యాం తు కించిత్‌ ప్రస్పురితాధరమ్‌|| విజ్ఞాయ తాం సఖీమాహ కిమష్యేష వివక్షుక||79

వార్యతామితి విప్రోయం మహద్దూషణభాషక:|| న కేవలం పాపభాగీ శ్రోతా వై స్యాన్న సంశయ:||80

అథ వా కిం చ న: కార్యం వాదేన సహ బ్రాహ్మణౖ :| కర్ణౌ సిధాయ యాస్యాయో యథా య: స్యాత్తథాస్తు స:||81

ఇత్యుక్త్యోత్థాయ గచ్చంత్యాం పిదాయ శ్రవణావుభౌ | స్వరూపం సముపాశ్రిత్య జగృహేవసనం హర:||82

తతో నిరీక్ష్యతం దేవం సంభ్రాంతా పరమేశ్వరీ| ప్రణిపత్య మహేశానం తుష్టావవనతా ఉమా||83

ప్రాహ తాం చ మహాదేవో దాసోస్మి తవ శోభ##నే | తపోద్రవ్యేణ క్రీతశ్చ సమాదిశ యథేప్సితమ్‌||84

ఆ త్రిగుణాత్మక శరీరమును భస్మముగా చేయును గాన శివుడు త్రిపురాంతకుడనబడెను సూక్ష్మామగు బుద్దిగలవారు మహేశ్వరుడిట్టివాడని తెలియుదురు (76) ఇతరులు హరుని పూజించకుండుట ఎట్లు? అయిననూ , జనులందరూ సంసారమునుండి భీతినొంది విమర్శించి పనులు చేయుదురు నేనిపుడు విమర్శించి ఈ పనిని చేసితిని (77) శుభమో,అశుభమో కానీ నీవూ ఈ శివుని బాగా పూజించుము (78) అని పలికి పార్వతి ఆ బ్రహ్మచారి పెదవిని కదల్చుటనుచూచి తన సఖితో ఈ బ్రహ్మచారి ఏదో చెప్పదలిచాడు ఇతనిని వారించండి ఈ విప్రుడు గొప్పవారిని తూలనాడుతూ మాటలాడువాడు , గొప్పవారిని నిందించేవాడే గాక అనిందను వినేవాడు పాపమును పొందును (80) అయిననూ బ్రాహ్మణులతో వాదించి మనకేమి ప్రయోజనము? ఆ బ్రహ్మచారి ఎలాగైనా నుండనీ మనము చెవులను మూసుకొని వెళ్ళిపోవుదము (81) అని పలికి లేచి చెవులను మూసుకొని వెళ్ళిపోవుచుండగా బ్రహ్మచారి రూపుని వీడి శంకరుడు స్వరూపములో ఆమె వస్త్రమును పట్టుకొనెను (82)అంత శివుని చూచిన పార్వతి సంభ్రమముతో సాగిలడి, తలవంచి అతనిని స్తుతించెను (83) అపుడు మహాదేవుడు పార్వతితో కల్యాణి! నేను తపోద్రవ్యముచే కొనబడిన దాసుడను నీవుకోరినదానిని అదేశించుము (84)

దేవ్యువాచ-

మనసస్త్వం ప్రభు: శంభో దత్తం తచ్చ మయా తవ| వపుష : పితరావీశౌ తౌ సమ్మానయితుమర్హసి||85

మహాదేవ ఉవాచ-

పిత్రా హితే పరిజ్ఞాతం దృష్ట్వా త్వాం రూపశాలినీమ్‌|| బాలాం స్వయంవరం పుత్రీమహం దాస్యామి నాన్యథా ||86

తత్తస్య సర్వమేవాస్తు వచనం త్వం హిమాచలమ్‌|| స్వయంవరార్థం సుశ్రోణి ప్రేరయ త్వాం వృణ తత:|87

ఇత్యుక్త్వా తాం మహాదేవ: శుచి : శుచిషదో విభు: జగామేష్టం తదాదేశం స్వపురం ప్రయయాచ సా||88

దృష్ట్వా దేవీం తదా హృష్టో మేనయా సహితోచల :||89

ఆలింగ్యాఘ్రాయం పప్రచ్చ సర్వం సా చ న్యవేదయత్‌ | దుహితుర్దేవదేవేన ఆజ్ఞప్తం తు హిమచల||90

స్వయం వరం ప్రముదిత: సర్వలోకేష్వఘోషయత్‌|| అశ్వినౌ ద్వాదశాదిత్యా గంధర్వగరుడోరగా:||91

యక్షా సిద్దాస్తథా సాధ్యా దైత్యా కింపురుషా నగా: | సముద్రాద్యాశ్చ యే కేచిత్రైక్యప్రవరాశ్చ యే ||92

త్రయం స్త్రింశత్సహస్రాణి త్రయస్త్రింశచ్చతాని చ | త్రయస్త్రింశచ్చయే దేవాస్త్రయస్త్రింశచ్చ కోటయ:||93

జగ్ముర్గిరీంద్రపుత్ర్యాస్తు స్వయంవరమనుత్తమమ్‌| ఆమంత్రితస్తథా విష్ణుర్మేరుమాహ హసన్నివ ||94

అంతట పార్వతీదేవీ ఇట్లునెను శివా! నీవు మనస్సుకు ప్రభువువు దానిని నీకు ఇచ్చివేసితిని ఇక ఈ శరీరానికి ప్రభువులు నాతల్లిదండ్రులు వారిని నీవు సమ్మానింపజేయుదగును (85) అనగా మహాదేవుడిట్లనెను పార్వతీ ! నీవు అందముగా నుండుటను చూచి నీతండ్రి స్వయంవరమునే నిన్నిచ్చెదని ప్రతిజ్ఞచేసేను (86) అదట్లే యగుగాక! నీవు వెళ్ళి నీ తండ్రి యగు హిమవంతుని స్వయంవరానికై ప్రేరేపించుము అటుతరువాత నేను నిన్ను వరింతును (87) అని పలికి పవిత్రుడై పవిత్రులయందు నివసించు హరుడు తనకిష్టమైన దేశమునకు వెళ్ళగా పార్వతి తన పురమునకు వెళ్లెను(88)పార్వతిని చూచి మేనతో సహా హిమవంతుడు సంతోషించెను (89) కౌగించుకొని మూర్కొని అడుగగా పార్వతి జరిగినదంతా నివేదించెను దేవదేవుడాజ్ఞాపించిన పార్వతీ స్వయంవరమును హిమవంతుడు అంతటా ప్రకటింపజేసేను(90)అశ్వినులు, ద్వాదశాదిత్యులు ,గంధర్వులు గరుడులు, సర్పములు, యక్షులు, సిద్దులు ,దైత్యులు, కింపురుషులు, పర్వతములు, సముద్రములు మొదలగువారు ముల్లోకములలో శ్రేష్టులైన వారచటికి చేరిరి ముప్పదిమూడువేలు,ముప్పది మూడువందలుచ ముప్పది కోట్లుగా వారంతా పార్వతి స్వయంవరమునకు వచ్చిరి అహూతుడైన విష్ణువు మేరువుతో నవ్వుతూ ఇట్లనెను (94)తాతాస్మాకం చ సా దేవి మేరో గచ్చ నమామి తామ్‌|| అథ శైలసుతా దేవీ హైమమారుహ్య శోభనమ్‌||95

విమానం సర్వతోభద్రం సర్వరత్నైరలంకృతమ్‌|| అప్సరోభి: ప్రనృత్యద్భి: సర్వాభరణషితా||96

గంధర్వసం ఘైర్వివిధైః కిన్నరైశ్చ సుశోభ##నై :|వందిభి : స్తూయామానా చవీరకాంస్యధరా స్థితా||97

సితాతపత్రరత్సాంశు మిశ్రితం చావహత్తదా| శాలినీ నామ పార్వత్యా: సంధ్యాపూర్ణేందుమండలా||98

చామరాసక్తహస్తాభిర్దివ్యస్త్రీభిశ్చ సంవృతా | మాలాం ప్రగృహ్య సా తస్థౌ సురద్రుమసముద్భవామ్‌||99

ఏవం తస్యాం స్థితాయాం తు స్థితే లోకత్రయే తదా| శిశుర్బూత్వా మహాదేవ క్రీడార్థం వృషభద్వజ:||100

ఉత్సంగతలసంగుప్తో బభూవ భగవాన్‌ భవ:| జయేతి యత్పదం ఖ్యాతం తస్య సత్యార్థమీశ్వరమ్‌||101

అథ దృష్ట్వా శిశుం దేవాస్తస్య ఉత్సంగవర్తిన :| కోయమత్రేతి సంమంత్ర్య చుక్రుశు: భృశోరోషితా:||102

వజ్రమాహారయత్తస్య బాహుముద్యమ్య వృత్రహా| సబాహురుద్యతస్తస్య తథైవ సమతిష్ఠత||103

స్తంభిత శిశురూపేణ దేవ దేవేన లీలయా ||

నాయానా ! మేరూ ! పార్వతి మనకూ దేవియే నీవు వెళ్ళుమూ, నేనామెకు నమస్కరించెదను అంతట పార్వతి అందమైన బంగారు విమానము నెక్కెను ఆ విమానము అన్ని వైపుల రక్షణతో, అనేక అలంకారాలను కలిగి అనేక రత్నములతో, ఆభరణములతో అలంకరింపబడి యుండెను నర్తించు అప్సరసలతో గంధర్వులతో, కిన్నరులతో, వందిజనులచే స్తుతింపబడుచూ వీరకాంస్యపాత్రతో నుండెను (97) తెల్లని ఛత్రముల రత్నములతో కలిసియుండెను శాలిని యను పేరుగల పార్వతి చెలికతై అందమైన ముఖము గలిగి చామరములను ధరించిన స్త్రీలతో గూడిన చేతిలో కల్పవృక్షము యొక్క పూలతో అల్లిన మాలను ధరించి నిలిచెను (99) ఆమె అట్లు నిలిచియుండగా,లోకత్రయమంతా నిలిచియుండగా వృషభధ్వజుడగు శివుడు శిశువై బడిలో దాచుకొనియుండెను జయ యను ప్రసిద్ది పదమును నిజము చేయుటకు ఈశ్వరుడట్లు శిశువగుటకు చూచి ఒడిలో నున్నశిశువుతో ఎవరితను ఇక్కడ యని పలికి మిగుల ఆక్రోశించిరి (102) ఇంద్రుడు తన వజ్రాయుధమును బట్టి చెయ్యత్తగా ఆ చేయి అట్లే నిలిచెను .(103) ఆ చెయ్యి శివురూపమున నున్న మహాదేవుని లీలచే స్తంభించెను (104)

వజ్రం క్షేప్తుం న శక్నోతి చాహుం చాలయితుం తదా||104

వహ్నిః శక్తిం తదా క్షేప్తుం న శశాక తదోత్థిత: | యమోzపి దండం ఖడ్గం చ నిర్‌ఋతిస్తం శిశుం ప్రతి || 105

పాశం చ వరుణో రాజా ధ్వజయష్టిం సమీరణః | సోమో గుడం ధనేశశ్చ గదాం సుమహతీం దృఢామ్‌||106

నానాయుధాని చాదిత్యా వసవస్తథా | మహాఘోరాణి శస్త్రాణి తారకాద్యాశ్చ దానవా:||107

స్తంభితా దేవదేవనా తథాన్యే భువనేషు యే | పూషా దంతాన్‌ దశన్‌దంతైర్భాలమైక్షత మోహిత:||108

తస్యాసి దశనా: పేతుః దృష్టమాత్రస్య శంభునా | భగశ్చ నేత్రే వికృతే చకార స్పుటితే చ తే||109

బలం తేజశ్చ యోగాంశ్చ సర్వేషాం జగృహే ప్రభు :| అథ తేషు స్థితేష్వేవ మన్యుమత్సు సురేష్వపి||110

బ్రహ్మ ధ్యానముపాశ్రిత్య బుబోధ హరచేష్టితమ్‌|| సాభిగమ్య మహాదేవం తుష్టావ ప్రయతో విధి:||111

పౌరాణౖః సామసంగీతైర్వెదికై: గుహ్వనామభిః | నమస్తుభ్యం మహాదేవ మహాదేవ్యై నమో నమ:||112

ప్రసాదాత్తవ బుద్దాదిర్జగదేతత్‌| మూఢాశ్చ దేవతా : సర్వా నైనం బుధ్యత శంకరమ్‌||113

మహాదేవమిహాయాంతం సర్వదేవనమస్కృతమ్‌|| గచ్చద్వం శరణం శీఘ్రం మరిజీవితుమిచ్చత||114

వజ్రాయుధమును ప్రయోగించుటకు పైకి తేచిన ప్రయెగించలేకపోయోను యముడు దడమునుచ, నిర్‌డుతి ఖఢ్గమును, వరుణుడు పాశమునువాయువు ధ్వజస్తంభమును, చంద్రుడు గుడమను ఆయుదమును కుబేరుడు గదను ప్రయోగించిలేకపోయేను యముడు దండమును, నిర్‌బుతి ఖడ్గమును, వరుణుడు పాశమును, వాయువు ద్వజస్తంభమును, చంద్రుడు గుడమను అయుధ్‌ఉను కుబేరుడు గదను ప్రయోగించలేకపోయిరి(106) ఆదిత్యులు నానావిధములుగా ఆయుదములను, వసుదేవతలు ముసలమును తారకాది దానవులు ఆయా ఘోరమైన అస్త్రములను ప్రయోగించలేకపోయిరి భువనములలో నున్న వారెల్లా స్తంభించిపోయిరి పూష (సూర్యుడు) వళ్ళుకొరుకుచూ మోహితుడై చాలకుని చూడసాగేను (108) శంకరుడతని చూచినంతనే పూష పళ్ళు నేలరాలెను భగుడనువాడు కళ్ళను పెద్దవిచేసి చెదరించెను (109) నారదరి బలాన్ని తేజస్సును యోగములను శంభుడు అట్లు దేవతలందరూ కోపముతో నుండగా బ్రహ్మ ధ్యానము నాశ్రయించి హరుడు చేసిన దానిని తెలుసుకొనెను వేంటనే శివుని చేరి వినయుముగా స్తుతించెను (111) పురాణనాములతో సామగసంగీముతే, వేదములులోకి రహస్యనామములతో మర్తునిట్లు తించెను మహదేవీ: మీకు నమస్కరము(112)నా ప్రసాదము చేత బుద్ది మొదలగుజగత్‌ ప్రవర్తించును మూడులైనదేవతలారా' : శంకరుని తెలియలేకుంటిరి అందరు దేవతలచే నమస్కరించబడి ఇక్కడకు వచ్చుచున్న మహాదేవుని, జీవించదలిచినచో శరణువేడండి(114)

తత: సంభ్రమసంపన్నాస్తుష్టువుః ప్రణతా :సురా: నమో నమో మహాదేవ పాహి పాహి జగత్పతే||115

దురాచారాన్‌ భవానస్మాన్‌ ఆత్మ ద్రోహపరాయణాన్‌ అహో పశ్యత నో మౌడ్యం జానంతస్తవ భావినీమ్‌||116

భార్యాముమాం మహాదేవీం తథాప్యత్ర సమాగతా: | యుక్షమేతద్యదస్మాకం రాజ్యం గృహ్యేత చాసురై: ||117

యేషామేవంవిధా బుద్దిరస్మాభి కిం కృతం త్విదమ్‌ | అథవా నోన దోషోస్త పశవో హి వయం యత:||118

త్వయైవ పతినా సర్వే ప్రేరితా: కుర్మహే విభో: ఈశ్వర: సర్వభూతానాం పతిస్త్వం పరమేశ్వర:||119

భ్రామయస్యఖిలం విశ్వం యంత్రారూఢం స్వమాయయా| యేన విభ్రామితా మూడా సమాయాతా: స్వయంపరమ్‌||120

తసై#్మ పశూనాం పతయే నమస్తుభ్యం ప్రసీద న: అథ తేషాం ప్రసన్నోభూత్‌ దేవదేవస్త్రయంబక :||121

యథాపూర్వం చకారైతాన్‌ సంస్తవాద్‌ బ్రహ్మణ: ప్రభు:| తారకప్రముఖా దైత్యా: సంక్రుద్దాస్తత్ర స్రోచిరే||122

కోయమంగ మహాదేవో న మన్యామో వయం చ తమ్‌| తత: ప్రవాస్య బాలోసౌ హూంకారం తీలయా వ్యధాత్‌||123

అంతట సంభ్రమము నొందిన దేవతలందరూ ప్రణమిల్లి హరుని స్తుతించిరి మహాదేవా! నీకు నమస్కారము జగత్పతీ మమ్ము రక్షించుము (115) మేము చెడునడత కలిగి ఆత్మ ద్రోహమును చేయువారము అట్టి మమ్ము రక్షించుము ఆహా! మన మౌడ్యమును చూడుడు ఈ మహాదేవి నీ భార్యయని తెలిసికూడా ఇక్కడకు వచ్చాము అసురులు మన రాజ్యమును గ్రహించినచో అది యక్తమేకదా? (117) ఇట్టి బుద్ది గల మేము పని చేసితిమి? అయినా మా దోషమేమీ లేదు మేము పశువులము కదా! (118) పశుపతియైన నీచే ప్రేరితులమై ఇదంతా చేయుచున్నాము నీవు ఈశ్వరుడవు అన్ని ప్రాణులకు పతివి పరమేశ్వరుడవు(119) యంత్రములోనుంచినట్లు నీ మాయచే విశ్వమునంతటినీ తిప్పుచున్నావు దానిచేత భ్రమించి మేమీ స్వయంవరమునకు వచ్చాము (120) పశుపతివైన నీకు నమస్కరములు మా పట్ల ప్రసన్నుడవుకమ్ము అని వేడుగా త్ర్యంబకుడగు శివుడు వారి పట్ల ప్రసన్నుడై స్తుతివలన వారిని ముందున్నట్లుగా చేసెను (122) నాయనా! ఈ మహాదేవుడెవరు? మేమతనిని అంగీకరించము అని దైత్యులనగా నవ్వి లీలగా హుంకారమును చేసేను (123)

హుంకారేణౖవ తే దైత్యా: స్వయమేవ నగరం గతా: | విస్మృతం సకలం తేషాం స్వయంవరముఖం చ తత్‌||124

మహాదేవ ప్రబావేన దైత్యానాం ఘోరకర్మనామ్‌| ఏవం యస్య ప్రబావో హి దేవదైత్యేషు పాల్గున||125

కథమీశ్వర వాక్యార్థస్తస్మాదన్యత్ర ముచ్యతే | అసంశయం విమూడాస్తే పశ్చాత్తాప: పురా మహాన్‌||126

ఈశ్వరం భువనస్యాస్య యే భజంతే న త్ర్యంబకమ్‌| తత: సంస్తూయమాన: స సురై: పద్మభువాదిభి:||127

వసుశ్చకార దేవేశ: త్ర్యంబక: పరమాద్భుతమ్‌| తేజసా తస్య దేవాస్తే సేంద్రచంద్రదివాకరా:||128

సబ్రహ్మకా: ససాధ్యాశ్చ వసుర్విశ్వే చ దేవతా:| సయామాశ్చ సరుద్రాశ్చ చక్షురప్రార్థయన్‌ ప్రభుమ్‌||129

తేభ్య: పరతమం చక్షుః స్వవపుర్ద్రష్టుముత్తమమ్‌| సబ్రహ్మకాస్తదా దేవాస్తమపశ్యన్‌ మహేశ్వరమ్‌||131

తతో జగుశ్చ మునయ: పుష్పవృష్టిం చ ఖేచరా! ముముచ్చుశ్చ తదా నేదుర్దేవదుందుభయో భృశమ్‌||132

హుంకారముతో దైత్యులంతా ఆ స్వయంవరమును మరచి తమ నగరమునకు వెళ్ళిపోయిరి (124) మహాదేవ ప్రభావముచే ఘోరకర్ములగు దైత్యులకట్లాయెను ఇట్టి ప్రభావముగల శివుని విడిచి ఈశ్వరుడు ను శబ్దము యొక్క అర్థము వేరొక చోట ఎట్లు కుదురును? ఈ భువనములకీశ్వరుడగు మహాదేవుని సేవించని వారు నిస్సంశయముగా గొప్పమూర్ఖులు (126)బ్రహ్మది దేవతలు పొగడుచుండగా శివుడు పరమాద్భుతమగు శరీరమునుకల్పించుకొనెను (127) సూర్యచంద్రులు, ఇంద్రుడు, బ్రహ్మ,సాధ్యులు, వస్తువులు,విశ్వేదేవతలు, యమ, రుద్రులు ప్రభువగు శివుని దివ్య చక్షువునిమ్మని ప్రార్ధించిరి (129) తన ఉత్తమమైన శరీరమును వారు చూచుటకు శివుడు వారికి పార్వతికి, హిమవంతునికి దివ్య చక్షువునిచ్చెను (130) రుద్రుని అనుగ్రహముచే దివ్యమూ ఉన్నతమగు చక్షువును పొందిన బ్రహ్మది దేవతలు మహేశ్వరుని చూచిరి అంత మునులు గానముచేయగా, ఖేచరులు పుష్పవర్షమును కురిపించిరి దేవ దుందుభులను అధికముగా మ్రోగించిరి(132)

జగుర్గంధర్వముఖ్యాశ్చ ననృతుశ్చాప్సరోగణా:| తస్య దేవీ తతో హృష్టా సమక్షం త్రిదివౌకసామ్‌||134

పాదయో: స్ధాపయామాస మాలాం దివ్యాం సుగంధీనీమ్‌|| సాదుసాద్వితి సంప్రోచ్య తయా తం తత్ర చర్చితమ్‌||135

సహ దేవ్యా నమశ్చక్రుః శిరోభిర్భూతలాశ్రితై: | సర్వే సబ్రహ్మకా దేవా జయేతి చ ముదా జగు:||136

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కౌమారికాఖండే కుమారేశమాహత్మ్యే శ్రీ మహాదేవవైవాహికోత్సాహవర్ణనం నామ పంచవింశోధ్యాయ:||

గంధర్వులు మున్నగువారు గానముచేసిరి అప్సరసల గణముల నర్తించెను గణరక్షకులందరూ ఆనందించిరి పార్వతీ దేవీ కూడా సంతోషించెను (133) బ్రహ్మది దేవతలు పార్వతి సంపూర్ణముగా నుండెనని, శివుడూయట్లే యుండెనని తలచిరి అంతట దేవతల సన్నిధిలో పార్వతి సంతోషముతో సుగంద యుక్తమగు దివ్యమైన మలను ఆ శివుని కాళ్ళవద్ద నుంచెను(134) అపుడు బ్రహ్మాది దేవతలు బాగు అని పలికి, పార్వతి పూజించిన శివుని దేవితో సహా నేలకు తాకు తలలతో నమస్కరించిరి 'జయ శంకర' యని ఆనందముతో గానముచేసిరి(136)

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున కుమారేశుని మాహ్మాత్యమున శ్రీ మహాదేవుని వివాహమహోత్సవ వర్ణనము అను ఇరువదియైదవ అధ్యాయము

షడ్వింశోధ్యాయ:

నారద ఉవాచc

అథ బ్రహ్మా మహాదేవమభివాద్య కృతాంజలి: | ఉద్వాహ: క్రియతాం దేవ ఇత్యువాచ మహేశ్వరమ్‌||1

తస్య తద్వచనం శృత్యా ప్రాహేదం భగవాన్‌ హర: | పరాధీనా వయం బ్రహ్మన్హిమాద్రేస్తవ చాపి యత్‌||2

యద్యుక్తం క్రియతాం తద్ది వయం యుష్మద్వశేదునా |తతో బ్రహ్మస్వయం దివ్యం పురం రత్నమయం శుభమ్‌||3

ఉద్వాహార్థం మహేశస్య తత్‌క్షణాత్సమకల్పయత్‌|| శతయోజనవిస్తీర్ణం ప్రాసాదశతశోభితమ్‌||4

పురే తస్మిన్‌ మహాదేవ : స్వయమేవ వ్యతిష్ఠత| తత: సప్తమునీన్‌ దేవశ్చింతితాభ్యాగతాన్పుర:||5

ప్రాహిణాదంబికాయాశ్చ స్థిరపత్రాద్దవీశ్వర: | సారుంధతీకాస్తే తత్ర హ్లదయంతో హిమాచలమ్‌||6

సభార్యమీశ్యరగుణౖ: స్థిరపత్రాణి చాదదుః తత| సంపూజితాస్తేన పునరాగమ్య తేచలాత్‌-||7

న్యవేదయంస్త్రయంబకాయ స చ తానభ్యనందత| ఉద్వాహార్థం తతో దేవో విశ్వం సర్వం న్యమంత్రయుత్‌||8

సమాగతం చ తత్సద్వం వినా దైత్యేర్దురాత్మభి:: స్దావరం జంగమం యచ్చ విశ్వం విష్ణుపురోగమమ్‌||9

సబ్రహ్మకం పురారాతేర్మహిమానమవర్దయత్‌|| తతస్తం విధిరాహేదం గంధమాదన పర్వతే||10

ఇరువదియారవ అధ్యాయము

నారదుడిట్లు చెప్పసాగెను-@ÈÁV »R½LRiVªy»R½ ú‡Áx¤¦¦¦øª«sV¥¦¦¦®µ…[ª«so¬sNTP ¿Á[»R½VÌÁV ÇÜ[²T…LiÀÁ ƒ«sª«sVxqsäLjiLiÀÁ „sªyx¤¦¦¦ª«sW²R…Vª«sV¬s'xmsÖÁZNPƒ«sV (1) A ª«sWÈÁƒ«sV „s¬s xmsLRi®ªs[VaRP*LRiV²R…V ®ªs[Vª«sVV xmsLSµ³k…ƒ«sVÌÁƒ«sV z¤¦¦¦ª«sVª«sLi»R½V¬sNTP „dsVNRPV G®µ…[µj… ¸R…VVNRPòª«sV¬s »][¿RÁVƒ¯[ µy¬s®ƒsÍýØ Â¿Á[¸R…VV²R…V Bxmso²R…V ®ªs[Vª«sVV „dsV ª«saRPª«sVVƒ«sƒ«sVLiÉÓÁ„sV (2) @ƒ«sgS ú‡Áx¤¦¦¦ø ª«sV}¤¦¦¦aRP*LRiV¬s „sªy¥¦¦¦¬s\ZNP xqs*¸R…Vª«sVVgS »yƒ«sV LRi»R½õª«sV¸R…Vª«sVgRiV µj…ª«sùª«sVgRiV xmsoLRiª«sVVƒ«sV ®ªsLiÈÁ®ƒs[ GLRiöLji¿Áƒ«sV @µj… ª«sLiµR…¹¸…WÇÁƒ«sª«sVVÌÁ „s{qsòLüRiª«sVV gRiÖÁgji, ª«sLiµR…ÌÁN]ÌÁµj… úFyryµR…ª«sVVÌÁ»][ a][Õ³ÁLi¿RÁV¿RÁVLi®²…ƒ«sV (4) @ÉíÓÁ xmsoLRiª«sVVƒ«s ª«sV¥¦¦¦®µ…[ª«so²R…V xqs*¸R…Vª«sVVgS ƒ«sVLi®²…ƒ«sV @Li»R½ÈÁ ª«sV¥¦¦¦®µ…[ª«so²R…V »R½ÌÁª«sgRi®ƒs[ ª«sÀÁ胫s ®µ…[ª«s»R½ÌÁƒ«sV, xqsxmsòLRiVxtsvÌÁƒ«sV, @LRiVLiµ³R…¼½ ®ªsVVµR…ÌÁgRiV ªyLji¬s zqósLRiª«sVgRiV „sªyx¤¦¦¦xmsú»R½ª«sVVƒ«s\ZNP FyLRi*¼½ ª«sµôR…NRPV xmsLi|msƒ«sV ªyLRiV z¤¦¦¦ª«sVª«sLi»R½V¬s ®ªs[Vƒ«s»][ xqsx¤¦¦¦ CaRP*LRiV¬s gRiVß᪫sVVÌÁƒ«sV ¿Ázmsö Aƒ«sLiµR…xmsLjiÀÁ zqósLRixmsú»R½ª«sVVÌÁƒ«sV GLRiöLjiÀÁLji (6) z¤¦¦¦ª«sVLi»R½V¬s¿Á[ xmspÑÁLixms‡Á²T…ƒ«s ªyLRiV ¼½Ljigji ª«sÀÁè CaRP*LRiV¬sNTP ¬s®ªs[µj…Li¿RÁgS CaRP*LRiV²R…V ªyLjiƒ«sÕ³Áƒ«sLiµj…Li¿Áƒ«sV ('7) »R½LRiVªy»R½ ª«sV¥¦¦¦®µ…[ª«so²R…V „sªy¥¦¦¦¬s\ZNP „saRP*ª«sVVƒ«sLi»R½ÉÓÁ¬ds A¥¦¦¦*¬sLi¿RÁgS, µR…VLS»R½VøQ\ÛÍÁƒ«s \®µ…»R½VùÌÁV »R½xmsö rôðyª«sLRiÇÁLigRiª«sW»R½øNRP „saRP*ª«sVLi»y „sxtñsvª«so ®ªsLiÈÁ „sªyx¤¦¦¦ª«sVVƒ«sNRPV „s¿Á[è|qsƒ«sV (9) ú‡Áx¤¦¦¦ø»][ bPª«so¬s ª«sVz¤¦¦¦ª«sVƒ«sV ª«sLôðjiLixmsÛÇÁ[¸R…VVgS, gRiLiµ³R…ª«sWµR…xmsLRi*»R½ª«sVV \|ms ú‡Áx¤¦¦¦ø xmsoLRiª«sVVƒ«sƒ«sVƒ«sõ bPª«so¬s»][ ¬sÈýÁ®ƒsƒ«sV (10)

పురే స్థితం వివాహస్య దేవ కాల: ప్రవర్తతే|| తతస్తస్య జటాజూటే చంద్రఖండం పితామహ: 11

బబంధ ప్రణయోదారవిస్సారితవిలోచన:|| కపర్దం శోభనం విష్ణు: స్వయం చక్రేస్య హర్షత:||12

కపాలమాలాం విపులాం చాముండా మూర్ధన్యబంధత| ఉవాచ చాపి గిరిశం పుత్రం జనయ శంకర||13

యో దైత్యేంద్రకులం హత్వా మాం రక్తైస్తర్పయిష్యతి | సూర్యో జ్వలత్‌శిఖారక్తం భాభాసితజగత్రయమ్‌||14

బబంధ దేవదేవస్య స్వయమేవ ప్రమోదత: శేషువాసుకిముఖ్యాశ్చ జ్వలంతస్తేజసా శుభా:||15

ఆత్మానం భూషణస్థానే స్వయం తే చక్రురీశ్వరే| వాయువశ్చ తతస్తీక్షశృంగం హిమగిరిప్రభమ్‌||16

వృషం విభూషయామాసుర్నానారత్నోపపత్తిభి: | శక్రో గజాజినం గృహ్య స్వయమగ్రే వ్యవస్థిత:||17

వినా భస్మ సమాధాయ కపాలే రజతప్రభుమ్‌| మనుజాస్థిమయీం మాలాం ప్రేతానాథశ్చ వందనమ్‌||18

వహ్నిస్తేజోమయం దివ్యమజినం ప్రదదౌ స్థిత:| ఏవం విభూషిత: సర్వైర్భృత్యైరీశో బభౌ భృశమ్‌||19

తతో హిమాద్రే పురుషా వీరకం ప్రోచిరే వచ: మా భూత్కాలాత్యయ: శీఘ్రం భవసై#్యతన్నివేద్యతామ్‌||20

దేవా ! వివాహకాలము గడుచుచున్నది అని పలికి దేవదేవుని జటాజూటమున చంద్రఖండమును అతను ప్రేమతో కన్నులు విప్పారగా బంధించెను (11) అట్లున్న జటాజూటమును విష్ణువు సంతోషముతో అతి సుందరముగా చేసేను (12) చాముండ వెడల్పైన కపాలమాలను శివుని తల పై కట్టి శంకరా దైత్యరాజుల వంశమును వధించి నన్ను రక్తముతో సంతృప్తిపరచు కొడుకును కనుమనెను(13) సూర్యుడు శివునిఖిఖను జ్వలించునట్లు, ముల్లోకముల ప్రకాశింపజేయునట్లు స్వయముగా ఆనందముతో కట్టెను(14) శేషుడు వాసుకి మొదలగు తేజస్వినాగులు ఈశ్వరుని భూషణస్థానము తాము స్వయముగా నిలిచిరి (15) వాయువులు స్వయముగా, హిమగిరిపై జన్మించి తీక్షనమైన కొమ్ములు గల వృషభమును అనేక రత్నవిశేషములతో అలంకరించిరి (16) ఇంద్రుడు గజచర్మమును గ్రహించి స్వయముగా ఎదుట నిలిచిరి (17) ప్రేతనాథుడు మానవుల ఎముకలతో చేసిన మాలను సిద్దముచేసెను (18) అగ్ని తేజోమయమయి దివ్యమగు అజినమునిచ్చి నిలిచెను ఇట్లు అందరు భృత్యులచే అలంకరింపబడిన ఈశ్వరుడు మిగులు ప్రకాశించెను (19) అంత హిమవంతుని మనుషులు శివుని ద్వారపాలకుడగు వీరకునితో ఆలస్యము కారాదు శివునికి దీనిని నివేదించుము అనిరి(20)

తతో దేవం ప్రణమ్యాహ వీరక: కరసంపుటీ| త్వరయంతి మహేశానం హిమాద్రే: పురుషాస్త్వమీ||-21

ఇతి శృత్వా వచో: దేవ: శీఘ్రమిత్యేన చాబ్రవీత్‌|| సప్త వారిధయస్తస్య చక్రుర్ధర్పణదర్శనమ్‌||22

తత్రైక్షత మహాదేవ స్వరూపం స జగన్మయమ్‌|| తతో బద్దాంజలిర్థీమాన్‌ స్ధాణుం ప్రోవాచ కేశవ:||23

దేవ దేవ మహాదేవ త్రిపురాంతక శంకర |శోభ##సేసేన రూపేణ .జగదానందదాయినా||24

మహేశ్వర యథా సాక్షాదపరస్త్వం మహేశ్వర:| తత: స్మయన్మహాదేవో జయేతి భువనే శ్రుత:||25

కరమాలంబ్య విష్ణోశ్చ వృషభం రురుహే శ##నై: | వసతో దేవా: శూలం తస్య న్యవేదయన్‌||26

ధనదో నిధిభిర్యుక్త: సమీపస్థస్తతో భవత్‌| స శూలపాణిర్విశ్వాత్మా సంచచాల తతో హర:||27

దేవదుందుభినాదైశ్చ పుష్పాసారైశ్చ గీతకై: నృత్యధ్భిరప్సరోభిశ్చ జయేతి చ మహాస్వనై:||28

నవ్యదక్షిణసంస్థానౌ బ్రహ్మవిష్ణూ తు జగ్మతు:| హంసం చ గరుడం చైవ సమారుహ్య మహాప్రభౌ||29

అథాదితిర్ధితి : సా చ దను: కద్రూ: సువర్ణజా| పౌలోమీ సురసా చైవ సింహికా సురభిర్ముని :||301

అంత వీరకుడు చేతులు జోడించి శివునికి నమస్కరించి ఇట్లనెను హిమవంతుని మనుషులు వీరు మిమ్ము త్వరపెట్టుచున్నారు (21)అనగా విని త్వరగా కానివ్వండని మహేశుడనెను అపుడు సప్తసముద్రములు అతనికి అద్దమువలె నిలిచినవి వానిలో మహాదేవుడు జగన్మయమగు తన స్వరూపమును చూచుకొనెను (22) తరువాత చేతులు జోడించి వచ్చిన బుద్దిమంతుడగు కేశవుడు హరునితో నిట్లనెను (23) దేవదేవా! త్రిపురాంతకా! శంకరా!: జగత్తుకానందము కలిగించు ఈ రూపముతో మిగులు శోభించుచుంటిని (24) మహేశ్వరా! నీకు నీవే సాటి అనగా నవ్వుచూ జయుడను ప్రసిద్దినొందిన మహాదేవుడు విష్ణువు చేతిని పట్టుకొని వృషభమును మెల్లగా ఎక్కెను అటు తరువాత వసుదేవతలు శూలమునతనికి తెచ్చిచ్చిరి. కుబేరుడు నిధులతో కలసి వచ్చి శివుని చెంతనిలిచెను అంతట చేత శూలము బట్టి విశ్వాత్ముడగు హరుడు ముందుకు కదిలెను (27) దేవదుందుభి ధ్వని ఇతర వాయుద్యములు ఘోష గంధర్వుల గీతములు, అప్సరసల నాట్యములు మొదలాయెను జయజయ ధ్వానములు వినబడెను (28) హంససై బ్రహ్మ గరుడునిపై విష్ణువు అతనికిరుపక్కలా నడిచి గొప్పకాంతితో శోభించిరి.(29) అట్లే దేవతల తల్లుల, భార్యలు వెంట నడిచిరి అందులో ముఖ్యులు అదితి, దితి, దను, కద్రువ, సువర్ణజ, పౌలోమి, సురస. సింహిక, సురభి ,ముని యనువారుండిరి(30)

సిద్దిర్మాయా క్షమా దుర్గా దేవీ స్వాహా స్వధా సుధా| సావిత్రీ చైవ గాయత్రీ లక్ష్మీ సా దక్షిణా ద్యుతి:||31

స్పృహామతిర్ద్రతిర్బుద్దిర్మందిర్‌ బుద్దిః సరస్వతీ | రాకా కుహూః సినీవాలీ దేవి భానుమతీ తథా||32

ధరణీ ధారణీ వేలా రాజ్ఞీ చాపి చ రోహాణీ | ఇత్యేతాశ్చాన్యదేవానాం మాతర: పత్నయస్తథా||33

ఉద్వాహం దేవదేవస్య జగ్ముః సర్వా ముదాన్వితాః | ఉరగా గరుడా యక్షా గంధర్వా : కిన్నరా నరా:||34

సాగరా గిరయో మేఘా మాసా: సంవత్సరాస్తథా| వేదా మంత్రాస్తథా యజ్ఞా శ్రౌతా ధర్మాశ్చ సర్వశ:||35

హుంకారా: ప్రణవాశ్చైవ ఇతిహాసా : సహస్రశ:| కటిశశ్చ తథా దేవా : మహేంద్రాద్యా: సవాహనా:||36

అనుజగ్ముర్మహాదేవం కోటిశోర్బుదశశ్చ హి| గణాశ్చ పృష్టతో జగ్ముః శంఖవర్ణాశ్చ కోటిశ:||37

దశభి: కేకరాఖ్యాశ్చ విద్యుతో ష్టాభిరేవ చ | చతు: షష్ట్వా విశాఖాశ్చ నవభి: పారియాత్రికా:||38

షడ్భి సర్వాంతక: శ్రీమాంస్తథైవ వికృతానన:| జ్వాలాకేశపో ద్వాదశభి: కోటిభి: సంవృతో య¸°||39

అట్లే సిద్ది ,మాయ,క్షమ, దుర్గ, దేవి, స్వాహ, స్వధా,సుధా, సావిత్రి, గాయత్రి, లక్ష్మి,దక్షిణ, ద్యుతి, స్పృహ,మతి, ధృతి,బుద్ది, మంది, బుద్ది, సరస్వతి, రాకా, కుహూ, సినీవాలి, దేవి, భానుమతి, ధరణి, ధారణి,వేలా, రాజ్ఞీ రోహిణి అనువారు మరికొందరు, ఆనందముతో దేవదేవుని వివాహమునకు వెళ్ళిరి -సర్పములు, గరుడులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నరులు, సాగరములు, పర్వతములు, మేఘములు, మాసములు, సంవత్సరముల, వేదమంత్రములు, యజ్ఞములు, శ్రౌతధర్మములు,హుంకారములు, ప్రణవములు, ఇతిహాసములు మున్నగువారు వేలకొలది, కోట్లకొలదిగా వచ్చిరి అట్లే మహేంద్రుడు మున్నగువారు తమ వాహనములతో కోట్లకొలదిగా శివుని వెంటనడిచిరి (36) శంఖములవలె తెల్లనైన గణములుకోట్లకొలదిగా శివుని వెంట నడిచెను.(37) కేకరములగు గణములు పదికోట్ల మందితో విద్యుత్తులనువారు ఎనిమిది కోట్ల మందితో విశాఖులు అరువది నాలుగుకోట్ల మందితో పారియాత్రికులు తొమ్మిది కోట్ల మందితో కూడి వచ్చిరి (38) సర్వాంతకుడనువాడు ఆరుకోట్లమందితో , వికృతాననుడను శ్రీ మంతుడు ఆరుకోట్లుమందితో ,జ్వాలాకేశుడు పన్నెండు కోట్లమందితో శివుని వెంట నడిచిరి(39)

సప్తభి: సమద: శ్రీమాన్‌ దుందుభోష్ఠాభిరేవ చ| పంచభిశ్చ కపాలీశ: షడ్భిః సంహ్రదక: శుభ:||40

కోటికోటిభిరేవైక: కుండక కుంభకస్తథా: | విష్టంభోz ష్టాభిరేవేహ గణప: సర్వసత్తమ:||41

పిప్పలశ్చ సహస్రేణ సన్నాదశ్చ తథా బలీ| ఆవేశసస్తథాష్ఠాభి: సప్తభిశ్చందతాపన:||42

మహాకేశ: సహస్రేణ నంది: ద్వాదశభిస్త థా| నగ: కాల: కరాళశ్చ మహాకాల: శ##తేన చ||43

అగ్నిక: శతకోట్యా వై కోట్యాగ్నిముఖ ఏవ చ | ఆదిత్య మూర్దా కోట్యా చ కోట్యా చైవ థనావహ:||44

సన్నాగశ్చ శ##తేనైన కుముద: కోటిభిస్త్రిభి :| అమోఘ: కోకిలశ్చైవ కోటికోట్యా సుమంత్రక:||45

కాకపాదస్తథా షష్ట్వా సంతానకస్తథా | మహాబలశ్చ నవభిర్మధుపింగశ్చ పింగళ:||46

నీలో నవత్యా సప్తత్యా చతుర్వక్త్రశ్చ పూర్వపాత్‌| వీరభద్రశ్చతు: షష్ట్వా కరణో బాలకస్తథా||47

పంచాక్షా శతమన్యుశ్చా మేఘమన్యుశ్చ వింశతి:| కోష్ఠకోటిశ్చతు: పష్ట్వా సుకేశో వృషభస్తథా||48

విశ్వరూపస్తాలకేతు: పంచాశచ్చ సితానన:| ఈశానో వృద్దదేవశ్చ దీప్తాత్మా మృత్యుహో తథా||49

సమదుడనువాడు ఏడుకోట్లమందితో ,దుందుభుడు, ఎనిమిది కోట్ల మందితో , కపాలీశుడు అయిదుకోట్ల మందితో, సంహ్రదకుడు ఆరుకోట్లమందితో నుండిరి (40) కుండకుడు, కుంభకుడు ఒక్కొక్కరే కోటికోటిమందిని తెచ్చిరి విష్టంభుడనుశ్రేష్ఠుడగు గణనాయకుడు ఎనిమిది కోట్లతో వచ్చెను (41) పిప్పలుడు, సన్నాధుడు వెయ్యికోట్ల మందితో , ఆవేశననుడు, ఎనిమిది కోట్లమందితో, చంద్రతాపనుడేడుకోట్లమందితో, మహేకేశుడువెయ్యికోట్లమందితో ,నంది పన్నెండుకోట్లతో, ఆవేశనుడు ఎనిమిది కోట్లమందితో, చంద్రతాపనుడేడుకోట్లమందితో, మహాకేశుడు వెయ్యికోట్లమందితో, నంది పన్నెండుకోట్లతో చ నగుడు, కాలుడు, కరాళుడు, మహాకాలుడు, అనువారు వందకోట్లమందితో వచ్చిరి (43) అగ్నికుడను వాడు నూరుకోట్లమందితో , అగ్నిముఖుడు, కోటిమందితో, అదిత్యమూర్దుడనువాడు కోటిమందితో , ధనావహుడు కోటిమందితో వచ్చిరి (44) సన్నాగుడు నూరుకోట్లమందితో, కుముదుడు మూడుకోట్ల మందితో ,ఆమోఘడు, కోకిలుడనువాడు వచ్చిరి (45) కాకపాదుడు అరవై కోట్లతో ,సంతానకుడరవైకోట్ల మందితో మహాబలుడుచ మధుసింగుడు, పింగళుడు తొమ్మది కోట్లతో వచ్చిరి (46)నీలుడు తొంభైకోట్లతో,చతుర్వక్త్రుడు డెబ్బెకోట్లతో, వీరభద్రుడు ,కరుణుడు, బాలకుడు అరువదినాలుగు కోట్లతో వచ్చిరి (47) పంచాక్షుడు ,శతమన్యు, మేఘమన్యు వనువారు ఇరవై కోట్లతో,సుకేశుడు, వృషభుడు, ఆరువదినాలుగు కోట్లతో , విశ్వరూపుడు, తాలకేతు యాభయి కోట్లతో వచ్చిరి ఈశానుడు , వృద్దదేవుడు, దీప్తాత్మ, మృత్యుహో అనువారట్లే వచ్చిరి(49)

విషాదో యమహా చైవ గణోభృంగిరిటిస్తథా | అశనో హాసకసశ్చైవ చతు: పష్ట్వా సహస్రపాత్‌||50

ఏతే చాన్యే చ గణపా అసంఖ్యాతా మహాబలా :| సర్వే సహస్రహస్తాశ్చ జటాముకుటధారిణ:||51

చంద్రలేఖావతంసాశ్చ నీలకంఠాస్త్రిలోచనా | హారకుండలకేయూరముకుటాద్యైరలంకృతా:||52

అణిమాదిగుణౖర్యుక్తా శక్తా: శాపప్రసాదయో: సూర్యకోటిప్రతీకాశాస్తత్రాజగ్ముర్గణశ్వరా:||53

పాతాళాంబరభూమిస్థా: సర్వలోకనివాసిన: తుంబురుర్నారదో హాహా హుహుశ్చైవ తు సామగా||54

తంత్రీమాదాయ వాద్యాంశ్చావాదయన్‌ శంకరోత్సవే | ఋషయ: కృత్స్నశ##శ్చైవ వేదగీతాంస్తపోధనా:||55

పుణ్యాన్‌ వైవాహికాన్‌ మంత్రాన్‌ జేపు : సంహృష్టమానసా: | ఏవం ప్రతస్థే గిరిశో వీజ్యానశ్చ గంగయా||56

తథా యమునయా చాపాం పతినా ధృతచ్చత్రయా| స్త్రీభిర్నానావిధాలాపైర్లాజాభిశ్చాననుమోదిత:||57

మహోత్సవేన దేవేశో గిరిస్థానం వివేశ స:|| ప్రభాసత్‌ స్వర్ఱకలశం తోరణానాం శ##తైర్యుతమ్‌||58

వైడూర్యబద్దభూమిస్థం రత్నజైశ్చ గృహైర్యుతమ్‌|| తత్ర్పవిశ్య స్తూయమానో ద్వారమభ్యాససాద హ||59

విషాదుడు , యమహో, భృంగిరిటి, అశనుడు, హాసకుడనువారు అరువది నాలుగు కోట్లు గణముల గలిగిరి(50) వీరు మరియు ఇతర గణరక్షకులు అసంఖ్యాకంగా వచ్చిరి, అందరూ వెయ్యి చేతులతో, జటలను ముడివేసి ధరించి, చంద్రవంకను తల పై దాల్చి నీలకంఠులు త్రినేత్రులై యుండిరి హారము కేయూరము, కుండలము, ముకుటము మున్నగువాని నలంకరించుకొని (52) అణిమాది సిద్దులు కలిగి శపించుటకు, అనుగ్రహించుటకు శక్తులుగా నుండిరి ఆ గణనాయకులు కోటిసూర్యులు కాంతితో శివుని వెంట నడిచిరి(53) వారేకాక, పాతాళములో నివసించువారు, ఆకాశమున నివసించువారు, అన్ని లోకములో నుండువారూ వచ్చిరి తుంఋరుడు, నారదుడు, హాహా హుహు అను సామగాయకులుచ వాద్యముల తెచ్చి తీగలను మీటి శంకరుని ఉత్సవమున సంగీతమును వినిపింపజేసిరి (54) తపోధనులైన ఋషులు పూర్తిగా, వచ్చి., వేదగీతములను, వివాహమున చదువు పుణ్యమంత్రములను సంతోషంగా జపించిరి (55) ఇట్లు శంకరుడు గంగాయమునులువీవెనలను వీచుచుండగా, సముద్రుడు గొడుగు పట్టుచుండగా ,స్త్రీలు అనేక విధములుగా ముచ్చుటించుచూ లాజలతో ఆమోదమును తెలుపుచుండగా గొప్ప ఆర్భాటముతో హిమగిరి స్థానమునను చేరెను (57) ఆ స్థానము స్వర్ణకలశముతో , వందలకొలది తోరణములతో శోభించుచుండెను (58) నేలపై వైడూర్యములనుంచిరి, గృహములు రత్నములతో చేయించిరి అది చేరి శివుడు అందరిచే స్తుతింపబడుచూ ద్వారమునుచేరెను,(59)

తతో హిమచలసత్త్ర దృశ్యతే వ్యాకులాకులు:| ఆదిశదాత్మభృత్యానాం మహాదేవ ఉపస్థితే ||60

తతో బ్రహ్మణమచలో గురుత్వే ప్రార్థయత్తదా| కృత్యానాం సర్వభారేషు వాసుదేవం చ బుద్దిమాన్‌||61

ప్రత్యాహ చ వివాహేస్మిన్‌ కుమారీ భ్రాతరం వివా| భవిష్యతి కథం విష్ణో లాజహోమాదికర్మసు||62

సుతో హి మమ మైనాక: స ప్రవిష్టోర్ణవే స్థిత:| ఇతి చింతావిషణ్ణం తం విష్ణురాహ మహామతి:|| 63

అత్ర చింతా న కర్తవ్యా గిరిరాజ కథంచన | అహం భ్రాతా జగన్మాతురేతదేవం చ నాన్యథా||64

తత: ప్రముదిత: శైల : పార్వతీం చ స్వలంకృతామ్‌|| సఖీభి: కోటిసంఖ్యాభిర్వృతాం ప్రావేశయత్సద:||65

తతో నీలమయస్తంభం జ్వలత్కాంచనకుట్టిమమ్‌|| ముక్తాజాలపరిష్కారం జ్వలదౌషధిపితమ్‌||66

రత్నాసనసహస్రాఢ్యం శతయోజనవిస్తృతమ్‌|| వివాహమండపం శర్వో వివేశానుచరావృత:||67

తత: శైల: సపత్నీక: పాదౌ ప్రక్షాల్య హర్షిత:| భవస్య తే తోయేన సిషిచేస్వం జగత్‌ తథా||68

పాద్యమాచమనం దత్‌త్వా మదుపర్కం చ గాం తధా | ప్రదానస్య ప్రయోగం చ సంచితయంతి బ్రాహ్మణా:||69

అక్కడి హిమవంతుడు కొంత వ్యాకులడై కనిపించెను - మహాదేవుని రాకతో అతను తన సేవకులకై ఆదేశించెను(60) అంతట బ్రహ్మను హిమవంతుడు, గురువుగా నుండుమని ప్రార్ధించెను అట్టే బుద్దిమంతుడగు వాసుదేవుని అన్ని భారములను సహించుమని కోరెను (61) తరువాత విషాదముగా ఇట్లనెను ఈ వివాహమున నాపుత్రిక సోదరుడు లేనిదవుతుంది లాజహోమ మొదలగు పనులలో సోదరుడు లేనిదెట్లు? (62) నాపుత్రుడైన మైనాకుడేమో సముద్రమును ప్రవేశించి అక్కడే వున్నాడు అని చింతతో విషాదముగా నున్న హిమవంతునితో మతిమంతుడగు విష్ణువిట్లనెను (63) గిరిరాజా! ఈ విషయమున ఏమాత్రమూచింతించపనిలేదు -జగన్మాతకు నేనే సోదరుడిని ఇది ఇంతే! ఇట్లైనచో క్రియలు కొనసాగెను లేనిచో కాదు'(64) అనగా హిమవంతుడు సంతసంచి, బాగుగా అలంకరింపబడిన పార్వతిని కోట్లకొలది సుఖులు వెంటనడుచుచుండగా సదస్సున ప్రవేశపపెట్టెను (65) అంతట అనుచరులతో కలిసి శివుడు కూడా నీలమయస్తంభములుగల, ప్రకాశించు బంగారుగోడలు గల ముత్యముల వరుసనుగల, ప్రకాశించు ఓషదులతో ప్రకాశించుచూ, వేలకొలది రత్నసింహాసనములు గలిగి వందయోజనముల విస్తారముగల వివాహమండపమును ప్రవేశించెను(67) అంతట గిరిరాజు మేనతో సహా, శివుని కాళ్ళను కడిగి ఆ నీటిని తనపై లోకముపై చల్లెను (68) పాద్యము , ఆచమనము, మధుపర్కమును, గోవునిచ్చి ఇక ప్రయోగమును గూర్చి బ్రాహ్మణులు ఆలోచించుచుండిరి.(69)

దౌహిత్రీం కవ్యవాహానాం దద్మి పుత్రీం స్వకామహమ్‌|| ఇత్యుక్త్వా తస్థివాన్‌ శైలో న జానాతి హరస్య స:|||70

తత: సర్వానపృచ్చత్స కులం కోపి న దేవ తత్‌| తతో విష్ణురిదం ప్రాహ పృచ్చంతేన్యే కిమర్థత:||71

అజ్ఞాతకులతాం తస్య పృచ్చతామయమేవ చ | అహిరేవ అహే: పాదాన్వేత్తి నాన్యో హిమాచల||72

స్వగోత్రం యది న బ్రూతే న దేయా భగినే మమ| తతో హాసస్తదా జజ్ఞే సర్వేషాం సుమహాస్వన:||73

నివృత్తశ్చ క్షణాద్భూయ: కిం వక్ష్యతి హరస్త్వితి || తతో విమృశ్య బహుధా కించిద్భీతాననో యథా|-|74

లజ్జాజడ: స్మితం చక్రే తత: పార్ధ న వై హర :| తతో విశిష్టా బ్రువతి శీఘ్రం కాలోతివర్తతే||75

హరి ప్రాహ: మహేశానం బిభ్యదావేద్మ్యహం తవ| మాతామహం చ పితరం ప్రయోగం శృణు భూధర||76

ఆత్మపుత్రాయ తే శంభో ఆత్మదౌహిత్రకాయ తే| ఇత్యుక్షే విష్ణునా సర్వే సాధుసాధ్వితి తే జగు:||77

దేవోప్యుదాహరేద్వృద్దిం సర్వేభ్యో ప్యదికాం వరామ్‌|| తత: శైలసథా చోక్యా దత్త్వా దీవీం చ సోదకమ్‌||78

ఆత్మానం చాపి దేవాయ ప్రదదౌ సోదకం నగ:|| తత: సర్వే తుష్టుపుస్తం వివాహం విస్మయాన్వితా:||79

పితృదేవతలు మనుమరాలగు , నా పుత్రికను నీకిచ్చుచుంటిని అని హిమవంతుడు హరుని కులగోత్రముల నెఱుగక మిన్నకుండెను (70) ఎవరికైనా తెలుసునేమోనని అందరినీ అడిగెను అంత విష్ణువు ఇతరులనడుగుట ఎందులకు?(71) అతని కులమెందుకు తెలియదో అతనిని అడుగుదమనెను (72) సర్పగతిని తెలుసుకొనుటకు సర్పమే సమర్థము వేరొకరు కాదు కదా! తన గోత్రమునుచెప్పనిచో నా సోదరిని ఇవ్వను అని అనగా అందరూ గట్టిగా నవ్విరి (73) అంతలోనే హరుడేమనునో యని అందరూ మిన్నకుండిరి అంతట బాగుగా ఆలోచించి శివుడు కొంత భయమునుపొంది సిగ్గుతో చేష్టలుడిగిన వాడై నవ్వెను అంతలో పెద్దలు సమయము మించిపోవుచున్నదని త్వరపెట్టిరి (75) అంత విష్ణువు శివునితో నీ తాతను ,తండ్రిని నేనెఱుగుదును పర్వతా రాజా! ఇక ప్రయోగమును వినుము అనెను (76) ఆత్మపుత్రుడు , ఆత్మదౌహిత్రూడూ అగు నీకు శంకరా పార్వతినిచ్చుచుంటిమని విష్ణువనగా అందరూ బాగు బాగు అని పలికిరి (77) అందరికీ ఈ దేవుడు అదికము శ్రేష్ఠమూ అగు వృద్దిని పెంచుగాక యని పలికి నీటితో తన పుత్రికను తనను కూడా శివునికి వేసెను అపుడందరూ విస్మయముతో ఆ వివాహమును కొనియాడిరి(79)

దాతా మహీభృతాం నాథో హోతా దేవశ్చతుర్ముఖా |వర: పశుపతి: సాక్షాత్కన్యా విశ్వారణిస్తథా||80

తత: స్తువత్సుమునిషు వుష్పవర్షే మహత్యపి | నదుత్సు దేవతూర్యేషు కరం జగ్రాహ త్రయంబక:||81

దేవో దేవీం సమాలోక్య సలజ్జాం హిమశైలజామ్‌ | న తృప్యతి న చాహ్లాదత్సా చ దేవం వృషధ్వజమ్‌||82

తత్ర బ్రహ్మదిమునయో దేవీమద్భుతరూపిణీమ్‌|| పశ్యంత: శరణం జగ్ముర్మనసా పరమేశ్వరమ్‌||83

మా ముహ్యామ పార్వతీం చ యథా నారదపర్వతౌ|| తతస్తథైవ తత్‌ చక్రే సర్వేషామీప్సితం వచః ||84

తతో దేవైశ్చ మునిభి :సంస్తుత పరమేశ్వర :| ప్రవివేశ శుభాం వేదిం మూర్తిమత్‌జ్వలనాశ్రితామ్‌||85

వేధాః శృతీరితైర్మంత్రైర్మూర్తిమద్బిరుపస్థితై:|| మూర్తమగ్నిం జహావ త్రి:: పరిక్రమ్య చ తం హర:||86

లాజోహోమ ఉమాభ్రాతా ప్రాహ తం సస్మిత హరి:| బహనో మిలితాః సంతి లోకా: సంమర్ద ఈశ్వర||87

సావదానేన రక్ష్యాణి భూషణాని త్వయా హర| తతో హరిశ్చ తం ప్రాహ స్వజనే మాz తిగోపయ||88

కించిత్ర్పార్థయా దాస్యామి విష్ణుస్తతో వరమ్‌|| త్వయి భక్తిర్‌ దృఢా మేస్తు స చ తద్దుర్లభం దదౌ||89

పర్వతరాజు దాత, హోత సాక్షాత్తు చతుర్ముఖుడు వరుడు సాక్షాత్తు శివుడు కన్య విశ్వమునకు అరణియగు మహాదేవి అని మునులు కొనియాడుచుండగా, పుష్పవర్షము కురియుచుండగా, దేవతూర్యములు మ్రోగుచుండగా శివుడూ పార్వతి చేతిని పట్టుకొనెను (81) శివుడు సిగ్గుతో నిలిచిన పార్వతిని చూడగా, ఆమె ఆ దేవుని చూచి తృప్తినొందకపోయెను (82) అచటబ్రహ్మది మునులు అద్బుతరూపముగల పార్వతిని చూచుచూ మనసులో పరమేశ్వరుని శరణుజొచ్చిరి (83) నారదుడు, హిమవంతుడెట్లు స్థిరముగా నుండిరో అట్లు మనమూ మోహము చెందరాదనుకొనిరి అది అట్లె ఆయెను (84) దేవతలు మునులు కొనియాడుచుండగా శివుడు సాక్షాత్తు అగ్నియే ఆశ్రయించిన పవిత్ర వేదికను ప్రవేశించెను (85) శ్రుతులు చెప్పిన మంత్రములు రూపుదాల్చి యుండగా , బ్రహ్మ అగ్నిదేవుని హవము చేసెను శివుడా ఆగ్నికి మూడుమార్లు ప్రదక్షిణము చేసి నమస్కరించెను (86) అంత లాజహోమముననే ఉమాదేవి సోదరుడు శ్రీ హరి ఈశ్వరా! చాలా లోకములు కలిసివచ్చి జననమ్మర్దమున్నది నీ ఆభరణములు జాగ్రత్త యనెను (87) అంతట శివుడతనితో స్వజనమని దాచకుము శ్రీహరి! ఏదైనా కోరుకొనుము,నేనే నీకిచ్చెదను అనగా విష్ణువు నీయందు దృడమైన భక్తియుండుగాక! యని కోరగా దుర్లభమగు ఆ వరమును విష్ణువుకు శివుడిచ్చెను (89)

దదతు: సృష్టిసంరక్షాం బ్రహ్మణ దక్షిణాముభౌ| ఆగ్నయే యజ్ఞభాగాంశ్చ ప్రీతౌ హరజనార్ధనౌ|90

భృగ్వాదీనాం తతో దత్‌త్వా శృతిరక్షణదక్షిణామ్‌|| తతో గీతైశ్చ నృత్యైశ్చ భోజనైశ్చ యథేప్పితై:||91

మహోత్సవైరనేకైశ్చ విస్మయం సమపద్యత | విసృజ్య లోకం తం సర్వం కిమిచ్చాదానకైర్భవ:||92

సరస్వత్యా చ పితరౌ దేవ్యాశ్చాzశ్వాస్య దు:ఖితౌ| ఆమంత్ర్య హిమశైలేంద్రం బ్రహ్మాణం చ సకేశవమ్‌||93

జగామ మందరగిరిం గిరిణా సానుగోర్చిత:||94

తతో గతే భగవతి నీలలోహితే సహోమయా గిరిమములం హి భూధర:| సబాంధవో రుదితి కస్య నో మనో విసంష్ఠులం జగతి హి కన్యకాపితు:||95

ఇమం వివాహం గిరిరాజపుత్ర్యా శృణోతి చాధ్యేతి చ యో నర: శుచి:| విశేషతశ్చాపి వివాహమంగళం వృద్దిమవాప్నుతే చిరమ్‌||96

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మహేశ్వరఖండే కౌమారికాఖండే కుమారేశమాహాత్మ్యేహరగౌరీవివాహవర్ణనం నామ షడ్వింశోధ్యాయ:

శివుడు , విష్ణువు ఇద్దరూ బ్రహ్మకు సృష్టి సంరక్షణను, అగ్నికి యజ్ఞభాగములను ప్రీతితో నిచ్చిరి (90) వేదరక్షణ దక్షిణను భృగుమొదలగు మునులకిచ్చిరి అటు తరువాత గీతముల, నృత్యములు, కోరిన భోజనములు, మహోత్సవములనేకములతో గొప్ప విస్మయమేర్పడెను(91) కోరిన దానములనిచ్చు శివుడు అందరికీ వీడ్కోలు పలికెను. (92) దు:ఖించుచున్నమేనాహిమవంతులను సరస్వతి ఊరడించెను అపుడు హిమవంతుని, బ్రహ్మ విష్ణువులను పిలిచి వీడ్కోలు పలికి హిమవంతునిచే అర్చించబడిన శివుడు మందర గిరికి బయలుదేరెను (94) పార్వతితో కలిసి శివుడట్లు వెళ్ళిపోగా హిమవంతుడు బంధువులతో కలసి రోదించసాగెను జగత్తులో కన్యకతండ్రియగు ఏ వ్యక్తికి మనస్సు విహ్వలమవదు? (95) పార్వతీ దేవి వివాహవిషయమును ఏనరుడు పవిత్రుడై వినునో, అధ్యయనముచేయునో విశేషముగా వివాహమంగళ సందర్భమున చదువునో అతను మంగళమును,వృద్దిని చిరకాలము పొందును-

ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున

కుమారేశమాహాత్మ్యమున శివపార్వతుల వివాహమును వర్ణించుట యను ఇరువది యారవ అధ్యాయము.

26

Sri Scanda Mahapuranamu-I    Chapters