Sri Scanda Mahapuranamu-I    Chapters    

చతుర్థశోధ్యాయ:

లోమశ ఉవాచ

తతో యుద్దమతీవాసీదసురైర్విష్ణునా సహ | తతస్సింహాస్సపక్షాస్తే దంశితా: పరమాద్భుతా:||1

అసురైరుహ్యమానాస్తే గరుత్మంతం వ్యదారయన్‌ | సింహాస్తే దారితాస్తేన ఖండశశ్చ విదారితా:||2

విష్ణునా చ తదా దైత్యాశ్చక్రేణ శకలీకృతా: | హతాంస్తానసురాన్‌ దృష్ట్యా కాలనేమి: ప్రతాపవాన్‌ ||3

త్రిశూలేనాహద్విష్ణుం రోషపర్యాకులేక్షణ:| తమాయాంతం చ జగృహే ముకుందోనాథసంశ్రయ:||4

కరణ వామేన జఘాన లీలయా తం కాలనేమిం హ్యసురం మహాబలమ్‌ తేనైన శూలేన సమాహతోసౌ మూర్చాన్వితోసౌ సహసా పపాత||5

పదునాలుగవ అధ్యాయము

అపుడు విష్ణువుతో అసురులకు గొప్ప యుద్దము జరిగెను. రెక్కలు గల సింహములు, జోడుతొడిగిన సైనికులు(1) అసురులను వహిస్తూ గరుత్మంతుని చీల్చెను. అపుడు గరుడుడు వానిని చీల్చి ముక్కలు జేసెను. (2)అపుడు విష్ణువు దైత్యులను చక్రముతో ముక్కలుగా చేసెను.అట్లు మరణించిన దైత్యులను చూచి ప్రతాపవంతుడగు కాలనేమి(3)రోషముతో త్రిశూలముతో విష్ణువుని పొడిచెను. అనాధులకాశ్రయమైన ముకుందుడు దానిని తన పైకి రాబోగా పట్టుకొనెను (4)అపుడు ఎడమచేతితో లీలగా కాలనేమియును దైత్యుని విష్ణువు కొట్టెను. అదే శూలముతో పొడవగా కాలనేమి మూర్ఛను పొంది ఒక్కమారుగా నేలకూలెను.(5)

పతిత:పునరుత్థాయ శ##నైరున్మీల్య లోచనే |పురత: స్థితమాలోక్య విష్ణుం సర్వగుహాశయమ్‌ ||6

లబ్దసంజ్ఞోబ్రవీద్వాక్యం కాలనేమిర్మహాబల: తవ యుద్దం న దాస్యామి నాస్తి లోకే స్పృహ మమ|| 7

యే యే సురా హతా యుద్దే అక్షయం లోకమాప్నుయు: బ్రహ్మణో వచనాత్సద్య ఇంద్రేణ సహ సంగతా:||8

భుంజతో వివిధాన్భోగాన్‌ దేవవద్విచరంతి తే ఇంద్రేణ సహితాస్సర్వే సంసారే చ పతంత్యథ||9

తస్మాద్యుద్ధే మరణం న కాంక్షే క్షణభంగురమ్‌ అన్యజన్మని మే వీర వైరభావాన్న సంశయ:| దాతుమర్హసి మే నాథ కైవల్యం కేవలం పరమ్‌|| 10

పడిన కాలనేమి మళ్ళీలేచి, నెమ్మదిగా కళ్ళువిప్పి ఎదుట నిలిచినవాడు అందరి హృదయాలలో నుండువాడగు విష్ణువును చూచి (6) స్పృహను పొంది ఇట్లనెను. యుద్దమును నీకు విడువజాలను. లోకమునందు నాకు కోరిక లేదు (7) యుద్దమున మరణించిన దైత్యులంతా అక్షయమైన లోకమును పొందెదరు గాక బ్రహ్మయొక్క మాట వలన వెంటనే ఇంద్రునితో కూడి(8)వివిధ భోగముల ననుభవిస్తూ దేవతలవలె చరించెదరు, ఇంద్రునితో గూడి మరల సంసారమున పడెదరు (9) కనుక అశాశ్వతమైన ఈ రణమున మరణమును ఈ జన్మయందు కోరను. వేరొక జన్మయందు మాత్రము వైరభావము వలన పరమమైన కైవల్యమును నీవివ్వలెను (10)

తథేతి దైత్యప్రవరో నిపాతిత: పరేణ పుంసా పరమార్థదేన |దత్త్వాభయం దేవతానాం తదానీం తథా సుధాం దేవతేభ్య: ప్రదత్త్వా|| 11

కాలనేమిర్హతో దైత్యో దేవా జాతా హ్యకణ్ఠకా: శల్యరూపో మహాన్‌ సద్యో విష్ణునా ప్రభవిష్ణునా|| 12

తిరోధానం గత: సద్యో భగవాన్కమలేక్షణ :| ఇంద్రోపి కదనం కృత్వా దైత్యానాం పరమాధ్బుతమ్‌|| 13

పతితానాం క్లీబరూపాణాం భగ్నానాం భీతచేతసామ్‌ ముక్తకచ్ఛశిఖానాం చచక్రే స కదన క్రియామ్‌ ||14

అర్థశాస్త్రవరో భూత్వా మహేంద్రో దురతిక్రమ: దైత్యానాం కాలరూపోసౌ శచీపతిరుదారధీ:||15

ఏవం నిహన్యమానానామసురాణాం శచీపతే: నివారణార్ధం భగవానాగతో నారదస్తదా || 16

అట్లే అని పరమపురుషుడైన వాడు పరమార్ధమునిచ్చు వాడగు విష్ణువు దైత్యుని పడగొట్టెను. దేవతలకపుడు అభయమునిచ్చి అమృతము నిచ్చెను. (11) శల్యము వంటి కాలనేమి మరణించగా దేవతలు కణ్టకము లేని వారైరి (12) కమలములవంటి నేత్రములు గల విష్ణువు వెంటనే మాయామవగా ఇంద్రుడు పరమాద్భుతముగా దైత్యులతో యుద్దము చేసెను. (13) పడిపోయిన అసమర్థులైన గాయపడిన భయమునొందిన, విడివడిన శిరోజాలుగల వారికి యుద్దక్రియనొనరించెను (14) మహేంద్రుడు అర్థశాస్త్రపరుడు, దైత్యులకు యమునివంటివాడు, శచీదేవిభర్త ఉదారబుద్దిగలవాడు (15)ఇట్లు అట్టి ఇంద్రుడు దైత్యులను దునుమాడుచుండగా అవుటకు నారదుడు వచ్చెను.(16)

నారద ఉవాచ:

యుద్దగతాశ్చ యే వీరా హ్యసురా రణమండలే | తేషామను కథం కర్తా భీతానాం చ విహింసనమ్‌ || 17

యే భీతాంశ్చ ప్రపన్నాంశ్చ ఘాతయంతి మదోద్ధతా: బ్రహ్మఘ్నాస్తేపి విజ్ఞేయా: మహాపాతకసంయుతా: 18

తస్మాత్త్వయా న కర్తవ్యం మనసాపి విహింసనమ్‌ ఏవముక్తస్తదా శక్రో నారదేన మహాత్మనా||19

సురసేనావ్విత: సద్య ఆగతో హి త్రివిష్టపమ్‌ తదా సర్వే సురగణా: సుహృద్భ్యశ్ఛ పరస్పరమ్‌ || బభూవుర్ముదితాస్సర్వే యక్షగంధర్వకిన్నరా :||20

తదా ఇంద్రొమరావత్యాం సహ శచ్యాభిషేచిత:||21

రణభూమిన పడిపోయిన వారిని ,భయమునొందిన అసురులనూ నీవెట్లు హింసించుచుంటివి (17) భయము నొందినవారిని, శరణుజొచ్చినవారిని , మదముచేత చంపువారు బ్రహ్మహత్య చేసిన వారితో సమానము గొప్ప పాపమును పొందుదురు.(18)కనుక నీవు

ఈ అసురులను మనసులో కూడా హింసించుటను తలబెట్టరాదు. అని నారదుడనిన ఇంద్రుడు (19) దేవసేనతో కలిసి వెంటనే స్వర్గమునకు వచ్చెను అపుడు దేవతాగణములన్ని, యక్షులు, గంధర్వులు, కిన్నరులు మిత్రులతో పరస్పరము ఆనందము నొందిన వారైరి (20) అపుడు ఇంద్రుడు శచితో అమరావతి యందు అభిషేకింపబడెను(21) (అభిషిక్తుడాయెను)

దేవర్షిప్రముఖైశ్చైవ బ్రహ్మర్షిప్రముఖైస్తదా | శక్రోపి విజయం ప్రాప్త: ప్రసాదాచ్ఛంకరస్య చ||22

తదా మహోత్సవో విప్రా దేవలోకే మహేనభూత్‌| శంఖాశ్చ పటహాశ్చైవ మృదంగా మురజా అపి ||23

గాయకాశ్చైవ గంధర్వా కిన్నరాశ్చాప్సరో గణా:| ననృతుర్జగుస్తుష్ఠువుశ్చ సిద్దచారణగుహ్యకా:||24

ఏవం విజయమాపన్న: శక్రో దేవేశ్వరస్తదా | దేవైర్హతాస్తదా దైత్యా: పతితాస్తే మహీతలే || 25

గతాసవో మహాత్మానో బలిప్రముఖతో హ్యమీ తపస్తప్తుం పురా విప్రో భార్గవో మానసోత్తరమ్‌||26

గత: శిషై#్య: పరివృతస్తస్మాద్యుద్దం న వేద తత్‌| అవశేషాశ్చ యే దైత్యాస్తే గతా భార్గవం ప్రతి|| 27

శంకరుని అనుగ్రహము వలన ఇంద్రుడు దేవర్షి, బ్రహ్మ ప్రముఖులతో విజయము నొందెను.(22)అపుడు ఓ విప్రులారా! దేవలోకమున గొప్ప ఉత్సవము జరిగెను. శంఖములు, తప్పెటలు, మృదంగములు, మురజ అను వాద్యములు, ఆనకములు, భేరి దుందుభి మొదలగునవి మ్రోగినవి (23)గాయకులగు, గంధర్వులు, కిన్నరులు , అప్సరసగణములు నాట్యము చేసినవి పాడినవి, అట్లే సిద్దులు, చారణులు, గుహ్యకులు స్తుతించిరి,(24) ఇట్లు ఇంద్రుడు విజయము నొందెను. దేవతలచేతిలో ప్రాణములనొదిలిన దైత్యులు భూతలము పై పడిరి. (25) బలిమొదలగు గొప్పవారు ప్రాణముల విడిచిరి, పూర్వము భార్గవుడు తపస్సు చేయుటకు మానస (సరోవరము) నకు ఉత్తరమునకు వెళ్ళెను(26) శిష్యులతో వెళ్ళిన శుక్రనికి యుద్దము గూర్చి తెలియలేదు మిగిలిన దైత్యులు అతని వద్దకు వెళ్ళిరి(27)

కధితం వై మహద్వృత్తమసురాణాం క్షయావహమ్‌ నిశమ్య మన్యుమావిష్టో హ్యాగతో భృగునందన:|| 28

శిష్త్వె: పరివృతో భూత్వా మృతాంస్తానసురానపి విద్యయా మృతజీవిన్యా పతితాన్సమజీవయత్‌|| 29

నిద్రాపాయగతా యద్వదుత్థితాస్తే తదాసురా: | ఉత్థితస్స బలి: ప్రాహ బార్గవం హ్యమితద్యుతిమ్‌|| 30

జీవితేన కిమద్యైవ మమ నాస్తి ప్రయోజనమ్‌ | పాతితస్త్రదశేంద్రేణ యథా కాపురుష

స్తథా|| 31

బలినోక్తం వచ: శ్రుత్వా శుక్రో వచనమబ్రవీత్‌ | మనప్వినో హి యే శూరా పతంతి సమరే బుధా:|32

యే శ##స్త్రేణ హతాస్సద్యో మృయమాణా ప్రజంతి వై| త్రివిష్టపం న సందేహ ఇతి వేదానుశాసనమ్‌|| 33

ఏవమాశ్వాసయామాస బలినం భృగునందన: | తపస్తతాప వివిధం దైత్యానాం సిద్దిదాయకమ్‌|| 34

తథా దైతా గతాస్సర్వే భృగుణా చ ప్రచోధితా: పాతాళమవసన్‌ సర్వే బలిముఖ్యాస్సుఖేన వై|| 35

ఇతిశ్రీస్కాందమహాపురాణ మాహేశ్వరఖండే

కేదారఖండే దేవాసురసంగ్రామే భార్గవేణ మృతదైత్యసంజీవనవర్ణనం నామ చతుర్ధశోధ్యాయ:

అసురులకు నాశనము కలిగించిన వృత్తాంతమంతా చెప్పబడగా విని శుక్రుడు కోపమునొందెను(28) శిష్యులతో గూడి మృతజీవినీ అనువిద్య చేత, మరణించిన అసురులనందరినీ బ్రతికించెను.(29)నిద్రనుండి లేచిన వారివలే అసురులందరూ అపుడు లేచిరి. బలి కూడా లేచి మిగులకాంతి శుక్రునితో నిట్లనెను. (30)నాకిపుడు జీవితమువలనేమిప్రయోజనము? పామరునివలె ఇంద్రుని చేతిలోదెబ్బతిని పడిపోతిని.(31) బలి అట్లనగా విని శుక్రుడనెను యుద్దమున ప్రాణమును వదులు అభిమానవంతులు పండితులుఅగువారు (32) శస్త్రము చేత దెబ్బతిని మరణించువారు నిస్సందేహముగా స్వర్గమును పొందెదరని వేదవాక్యము (33) అని శుక్రుడు బలిని ఓదార్చి దైత్యులకు సిద్దికలిగించు వివిధ తపస్సులనాచరించెను(34)అట్లే భృగువుచేత ప్రేరితులైన బలి మొదలైన దైత్యులు పాతాళమునకు వెళ్ళి సుఖముగా నివసించిరి.(35)

శ్రీ స్కాందపురాణమున మాహేశ్వరఖండమున

కేదారఖండమున శుక్రునిచే దైత్యులు బ్రతికింపబడుటయను పధ్నాలుగవ అధ్యాయము సమాప్తము

పంచదశోధ్యాయ:

ఋషయ ఊచు:

రాజ్యం ప్రాప్తో హి దేవేంద్ర: కథితస్తే గురుం వినా | గురోరవజ్ఞయా జాతో రాజ్యభ్రంశో హితస్య తు|| 1

కేన ప్రణోదితశ్చేందొ బభూవ చిరమాసనే | తత్సర్వం కథయాశు త్వం పరం కౌతూహలం హి న:||2

లోమశ ఉవాచ:

గురుణాసి వినా రాజ్యం కృతవాన్స శచీపతి: విశ్వరూపోక్తవిధినా ఇంద్రోరాజ్యే స్థితో మహన్‌ || 3

విశ్వకర్మసుతో విప్రా విశ్వరూపో మహానృప: | పురోహితోథ శక్రస్య యాజకశ్చాభవత్తదా||4

తస్మిన్యజ్ఞేవదానైశ్చ యజనే అసురాన్సురాన్‌ | మనుష్యాశ్చైవ త్రిశిరా అపరోక్షం శచీపతే:||5

దేవాన్‌ దదాతి సాక్రోశం దైత్యాంస్తూప్ణీమథాదదాత్‌ | మనుష్యాన్మధ్యపాతేన ప్రత్యహం సగ్రహాన్ద్విజ: ||6

పదిహేనవ అధ్యాయము

ఋషులు పలికిరి: గురువులేకనే దేవేంద్రుడు రాజ్యమునొందునని చెప్పితివి. గురువు నవమానించుటచేత అతనికి రాజ్యభ్రంశము కలిగినది (1)ఎవరిచేత ప్రేరితుడైన ఇంద్రుడు అసనమున ఎక్కువ కాలముండెను? మాకు మిక్కిలి కుతూహలమున్నందున దానిని గూర్చి త్వరగా చెప్పుము.(2) అనగా లోమశుడు పలికెను. గురువు లేకనే ఇంద్రుడు రాజ్యము చేసెను. అతను విశ్వరూపుడు చెప్పిన విధిని అనుసరించి రాజ్యమున నుండెను. (3)ఓ విప్రులారా! ఈ విశ్వరూపుడను గొప్ప రాజు విశ్వకర్మకుపుత్రుడు ఇంద్రునికి పురోహితుడు , యాజకుడుకూడా అయినాడు.(4)

ఏకదా తు మహేంద్రేణ సూచితో గురులాఘవాత్‌| అలక్ష్యమాణన తదా జ్ఞాతం తస్య చికీర్షితమ్‌|| 7

దైత్యానాం కార్యసిద్ద్వర్థమనదానం ప్రయచ్చతి | అసౌ పురోహితో స్మోకం పరేషాం చ ఫలప్రద:|| 8

ఇతి మత్వా తదా శక్రో వజ్రేణ శతపర్వణా| చిచ్చేద తచ్చిరాంస్యేవ తత్ద్కణాదభవద్వధ:||9

యేనాకరోత్సోమపానమజాయంత కపింజలా:| తతోన్యేన సురాపానాత్కలవింకాభవన్ముఖాత్‌||10

అన్యాసనాదజాయంత తత్తిరా విశ్వరూపిణ: ఏవం హతో విశ్వరూప: శ##క్రేణ మందభాగినా|| 11

బ్రహ్మహత్యా తదోద్భూతా దుర్ధర్షా చ భయావహా| దుర్దర్షా దుర్ముఖా దుష్టా చణ్డాలరజసాన్వితా|| 12

బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనాగమ:| ఇత్యేషామప్యఘవతామిదమేవ చ నిష్కృతి:||13

నామవ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయా మతి:||

ఒకమారు విశ్వరూపుడు గురువునందనాదరమును గలిగియుండగా ఇంద్రుడు సూచించిననూ అతడట్లే లక్ష్యపెట్టక యుండగా ఇంద్రుడతను చేయగోరినదానిని తెలుసుకొనెను.(7) దైత్యుల పని నెరవేరుటకై అవకాశమునిచ్చుచున్న ఈ పురోహితుడు మాకు ఇతరులకు కూడా ఫలమును కలిగించువాడు(8) అని తలచిన దేవేంద్రుడు వజ్రాయుధముతో అతని తలలను నరికివేసెను క్షణములోనే వధ జరిగెను(9) సోమపానము చేసిన ముఖమునుండి చాతక పక్షులు సురాపానముచేసిన ముఖమునుండి పిచ్చుకలుపుట్టెను(10) వేరొక ముఖమునుండి తిత్తిరి పక్షులు పుట్టెను. ఇట్లు మందభాగ్యుడైన ఇంద్రుని చేత విశ్వరూపుడు మరణించెను.(11)అపుడు అపశక్యం గానిది, భయము గొలుపునది యగు బ్రహ్మ హత్య ఉద్భవించెను. అది అపశక్యం గానిది, చెడు ముఖము గలది, దోషము కలది, చణ్ణాల (స్త్రీ) రజస్సుతో కూడినది (12) బ్రహ్మహత్య, సురను త్రాగుట, దొంగతనము, గురువు భార్యతో కూడుట అను పాపము చేసిన వారందరికీ విష్ణువుయొక్క నామస్మరణము, విష్ణువును గూర్చిన చింతన ఇదే నిష్కృతి(13)త్రిశిరా ధూమ్రహస్తా సాశక్రం గ్రస్తుముపాయ¸° ||14

తతో భ##యేన మహతా పలాయనపరోభవత్‌ | పలాయమానం తం దృష్ట్యా హ్యనుయాతాభయావహా || 15

యతో ధావతి సాధావత్తిష్టన్తమనుతిష్ఠతి | అంగకృతా యథా ఛాయా శక్రస్య పరివేష్ఠితుమ్‌|| ఆయాతి తావత్సహసా ఇంద్రోప్యపు న్యమజ్జత|| 16

శీఘ్రత్వేన యథా విప్రాశ్చిరంతన జలేచర: ||17

ఏవం దివ్యశతం పూర్ణం వర్షాణాం చ శచీపతే: వసతస్తస్య దు:ఖేన తథా చైవ శతద్వయమ్‌|| అరాజకం తదాజాతం నాకపృష్ఠే భయావహమ్‌ || 18

తదా చిన్తాన్వితా దేవా ఋషయోపి తపస్విన:| త్రైలోక్యం చాపదాగ్రస్తం బభూవ చ తదా ద్విజా:||19

అపుడా బ్రహ్మహత్య మూడు తలలు, ధూమ్రవర్ణపు చేయి గలిగి ఇంద్రుని మింగుటకు వచ్చినది(14) అపుడు మిక్కిలి భయముతో ఇంద్రుడు పారిపోవుచుండగా, భయముగొలుపుచూ అది వెంటపడినది.(15)ఎటు పరిగిడిన అటు ఆ బ్రహ్మహత్యపరుగిడను. కూర్చున్నపుడు తానూ కూర్చొనును శరీరముచే నేర్పడిన నీడవలె ఇంద్రుని చుట్టుముట్టుటకు వచ్చుచుండగా ఇంద్రుడు ఒక్కమారుగా నీటిలో మునిగెను.(16)శీఘ్రముగా .జలచరము వలె నీట మునిగెను (17) ఓ విప్రులారా! ఇట్లు ఇంద్రుడు దివ్యమగు సంవత్సరముల నూటిని గడిపెను. ఇట్లు దు:ఖములో రెండునూర్లదివ్యసంవత్సరములను ఇంద్రుడు గడుపగా స్వర్గమున భయంకరమగు అరాజకము పుట్టెను (18) అపుడు చింతతో దేవతలు మరియు తపస్వులగు ఋషులు వుండిరి. ఓ బ్రాహ్మణులారా! మూడులోకాలు ఆపదపాలై వుండెనను.(19) ఏకోపి బ్రహ్మహా యత్ర రాష్ట్రేవసతి నిర్భయ: | అకాలమరణం తత్ర సాధూనాముపజాయతే|| 20

రాజా పాపయుతో యస్మిన్రాష్ట్రే వసతి తత్ర నై| దుర్భిక్షం చైవ మరణం తథైవోపద్రవా ద్విజా:21

భవంతి బహవోనర్థా: ప్రజానాం నాశ##హేతవే| తస్మాద్రాజ్ఞా తు కర్తవ్యో ధర్మ: శ్రద్దాపరేణ హి|| 22

తథా ప్రకృతయో రాజ్ఞ: శుచిత్వేన ప్రతిష్ఠితా:| ఇంద్రేణ చ కృతం పాపం తేన పాపేన వై ద్విజా:| నానా విధైర్మహాతాపై: సోపద్రవమభూజ్జగత్‌|| 23

ఏ రాష్ట్రమున ఒకడైననూ బ్రహ్మహత్య చేసినవాడుండునో అక్కడ సాధువుపురుషులకు అకాలమరణము కలుగును.(20) ఏరాష్ట్రమున రాజు పాపము చేసి నివసించునో అక్కడ దుర్భిక్షము,మరణము మరియు ఉపద్రవములని బ్రాహ్మణులారా మీరు తెలుసుకొనుడు (21) పెక్కు అనర్థములు ప్రజల నాశనానికై కలుగును కనుక రాజు శ్రద్ధతో ధర్మమును పాటించవలెను (22)అట్లే ప్రజలు రాజుయొక్క శుచిత్వముపై ఆధారపడియుందురు. ఇంద్రుడు పాపము చేసెను ఓ బ్రాహ్మణులారా! ఆ పాపముచేత జగత్తు నానావిధ మహాతాపములతో ఉపద్రవము గలదాయోను.(23)

శౌనక ఉవాచ:

అశ్వమేధశ##తేనైన ప్రాప్తం రాజ్యం మహత్తరమ్‌ | దేవానామఖిలం సూత కస్మాద్విఘ్నమజాయత|| శక్రస్య చ మహాభాగ యథావద్కథయస్వ న:|| 24

సూతుఉవాచ:

దేవానాం దానవానాం చ మనుష్యాణాం విశేషత: కర్త్మెవ సుఖదు:ఖానాం హేతుభూతం న సంశయ : 25

ఇంద్రేణ చ కృతం దేవా మహాద్భుతం జుగుప్సి తమ్‌|| గురోరవజ్ఞా చ కృతా విశ్వరూపవధ: కృత:|| 26

గౌతమస్య గురో పత్నీ సేవితా తస్య తత్ఫలమ్‌ | ప్రాప్తం మహేంద్రేణ చిరం యస్య నాస్తి ప్రతిక్రియా|| 27

యే హిదుష్కృతకర్మాణో న కుర్వంతి చ నిష్కృతిమ్‌ | దుర్దశాం ప్రాప్నవన్త్యేతే యథైవేంద్రశ్శతక్రతు:|| 28

శౌనకుడనెను అశ్వమేథ యాగములు నూరు చేయుటచేత గొప్ప రాజ్యము లభించినది. ఓ సూతా! దేవతలకు ఇంద్రునికి విఘ్నమెందుకు వాటిల్లినదో ఉన్నదున్నట్లుగా చెప్పుము(24) సూతుడనెను దేవతలకు దానవులకు విశేషంగా మనుష్యులకు వారి కర్మయే సుఖదు:ఖాలకు కారణము. సంశయము లేదు(25) ఇంద్రుడు జుగుప్సను కలిగించు పనిని చేసాడు గురువును అవమానించాడు విశ్వరూపుని వధించాడు. (26) గురువగు గౌతముని భార్యతో రమించాడు. దానిని ఫలితాన్ని చాలాకాలానికి మహేంద్రుడు ఈ విధంగా పొందాడు. దీనికి ప్రతిక్రియ లేదు. (27)చెడుపనులు చేసినవారు నిష్కృతిని చేయునట్లుయితే తప్పనిసరిగా దేవేంద్రుని వలెనే చెడుదశను పొందుతారు (28)

దుష్కృతోపార్జిస్యాత: ప్రాయశ్చిత్తం హి తక్ష్కణాత్‌| కర్తవ్యం విధివద్విప్రా: సర్వపాపోపశాంతయే||29

ఉపపాతకమధ్యస్థం మహాపాతకతాం వ్రజేత్‌|| 30

తత: స్వధర్మనిష్టాం చ యే కుర్వన్తి సదా నరా:| ప్రాతర్మధ్యాహ్నసాయహ్నే తేషాం పాపం వినశ్యతి||31

ప్రాప్నువన్త్యుత్తమం లోకం నాత్ర కార్యా విచారణా| తస్మాదసౌ దురాచార: ప్రాప్తో వైకర్మణ : ఫలమ్‌ ||32

సంప్రధార్య తదా సర్వే లోకపాలాస్త్వరాన్వితా:| బృహస్పతిముపాగమ్య సర్వమాత్మని ధిష్టితమ్‌|| కథయామాసురవ్యగ్రా ఇంద్రస్య చ గురుం ప్రతి || 33

దేవైరుక్తం వచో విప్రా: నిశమ్య చ బృహస్పతి:| అరాజకం చ సంప్రాప్తం చింతయామాస బుద్దిమాన్‌ || 34

కిం కార్యం చాద్య కర్తవ్యం కథం శ్రేయో భవిష్యతి | దేవానాం చాద్యలోకానామృషీణాం భావితాత్మనామ్‌ || 35

ఓ విప్రులారా! చెడుపని ద్వారా సంక్రమించిన దానికి ప్రాయశ్చిత్తమును అన్ని పాపాల శాంతికై వెంటనే చేయవలెను(29) ఉపపాతకములశ్రేణిలో నున్నది మహాపాతకమవచ్చును. (30)ఏ జననులు ప్రొద్దున మధ్యాహ్నము, సాయంకాలము తమ ధర్మమును అనుష్టింతురో వారి పాపము నశించును (31) వారు ఉత్తమ లోకమును పొందెదరు ఇందు ఆలోచించవలసినది లేదు. కనుక, దురాచారుడైన ఇంద్రుడు తన కర్మయొక్క ఫలాన్ని పొందాడు,(32)అనగా అపుడు అందరూ దానిని చక్కగా గ్రహించి బృహస్పతి వద్దకు వెళ్ళి తమ మనసులో నిలిచనదగు ఇంద్రుని వృత్తాంతమును నింపాదిగా తెలియజేసిరి(33) ఓ విప్రులారా| దేవతల మాట వినిన బృహస్పతి దేవలోకమున తలెత్తిన అరాజకమును గూర్చి ఆలోచించెను(34) ఇపుడు ఏమి చేయవలెను? దేవతలకు,లోకములకు, మహాత్ములగు ఋషులకు మేలెట్లు కలుగును (35)

మనపైన చ తత్సర్వం కార్యాకార్యం విచార్య చ | జగామ శక్రం త్వరితో దేవైస్సహ మహాయశా:|| 36

ప్రాప్తో జలాశయం తం చ యత్రాస్తే హి పురందర: యస్య తీరే స్థితా హత్యా చండాలీవ భయావహా|| 37

తత్రోపవిష్టాస్తే సర్వే దేవా ఋషిగణాన్వితా: ఆహ్వానం చ కృతం తస్య శక్రస్య గురుణా స్వయమ్‌|| 38

సముత్థితస్తతశ్శక్రో దదర్శ స్వగురుం తదా| బాష్పపూరితవక్త్రో హి బృహస్పతిమభాషత|| 39

ప్రణిపత్య చ తత్రత్యాన్‌ కృతాంజలిరభాషత|| తదా దీనముఖో భూత్వా మనసా సంవిమృశ్యచ|| 40

గొప్ప కీర్తి గల బృహస్పతి ఏది చేయవలెనో మనసులోనే ఆలోచించుకొని దేవతలతో కలిసి త్వరగా ఇంద్రుడును చోటికి వెళ్ళెను. (36) ఇంద్రుడున్న నీటి మడుగువద్దకు వెళ్ళగా దాని బడ్డున బ్రహ్మహత్య ఛండాల స్త్రీ వలె భయము గొల్పుచూ నుండెను.(37) దేవతలు, ఋషిగణములు అక్కడ కూర్చొనిరి, బృహస్పతి స్వయముగా ఇంద్రుని పిలిచెను.(38) పైకి వచ్చిన ఇంద్రుడపుడు తన గురువును చూచి కళ్ళనిండా నీటితో (39) ప్రణామముచేసి దీనమగు ముఖము గలిగి, మనసులో ఆలోచిస్తూ బృహస్పతిని అక్కడి వారిని ఉద్దేశిస్తూ పలికెను (40)

స్వయమేవ కృతం పూర్వమజ్ఞానలక్షణం మహత్‌ | అధునైవ మయా కార్యం కిం కర్తవ్యం వద ప్రభో||41

ప్రహస్యోవాచ భగవాన్‌ బృహస్పతిరుదారధీ: పురా త్వయా కృతం యచ్చ యస్యేదం కర్మణ: ఫలమ్‌|| 42

మాం చ ఉద్దిశ్య భో ఇంద్ర తద్భోగాదేవ సంక్షయ: ప్రాయశ్చిత్తం హి హత్యాయా న దృష్టం స్మృతికారిభి: 43

అజ్ఞానతో హి యజ్ఞాతం పాపం తస్య ప్రతిక్రియా | కధితా ధర్మశాస్త్రజ్ఞై: సకామస్య నవిద్యతే|| 44

సకామేన కృతం పాపమకామం నైవ జాయతే | తాభ్యాం విషయభేదేన ప్రాయశ్చిత్తం విధీయతే||45

మరణాంతో విధి: కార్యో కామేన హి కృతేన హి| అజ్ఞాన జనితే పాపే ప్రాయశ్చిత్తం విధీయతే|| 46

ఇంతకుముందు నేను స్వయముగా అజ్ఞానమే లక్షణముగా గల గొప్ప పాపమునాచరించితిని. ఓ గురుదేవా! నేనిపుడు ఏమి చేయవలెనో తెలుపుడు(41) అపుడు ఉదారబుద్ది గల బృహస్పతి నవ్వుచూ అనెను ఇంతకు ముందు నీవు చేసిన దాని ఫలితమే ఇది. నా పట్ల నీవాచరించిన దాని అనుభవమే ఈ నాశనము ఇక హత్యకు ప్రాయశ్చిత్తమును స్మృతికారులు పేర్కొనలేదు.(43) అజ్ఞానము వల్ల పాపము చేసినచో ప్రాయశ్చిత్తముండును. అసి ధర్మశాస్త్రములు తెలిసినవారందరు. తెలిసి కోరికతో చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. (44) కోరికతో చేసిన పాపం కోరిక లేనిదిగా కాదు. కేవలం విషయ భేదముచే వాని వాని ప్రాయశ్చిత్తము విధింపబడుతుంది.(45) కోరికతో పాపమొనరించిన మరణమే విధింపబడాలి.(మరణము వరకు విధి)అజ్ఞానము వల్ల పాపము నాచరించిన దాని ప్రాయశ్చిత్తము విధింపబడుచున్నది.(46)

తస్మాత్త్వయా కృతం యచ్చ స్వయమేవ హతో ద్విజ: పురోహితశ్చ విద్వాంశ్చ తస్మాన్నాస్తి ప్రతిక్రియా || 47

యావన్మరణమప్యేతి తావదప్సు స్థిరో భవ|| 48

శతాశ్వమేధసంజ్ఞం చ యత్ఫలం తవ దుర్మతే | తన్నష్టం తక్ష్కణాదేవ ఘాతితో హి ద్విజో యదా|| 49

సచ్చిద్రే చ యథా తోయం న తిష్టతి ఘటేణ్వపి | తథైవ సుకృతం పాపే హీయతే చ ప్రదక్షిణమ్‌|| 50

తస్మాచ్చ దేవసంయోగాత్ర్పాప్తం స్వర్గాదికం చ యై : యథోక్తం తద్భవేత్తేషాం ధర్మిష్ఠానాం న సంశయ:|| 51

కునుక నీ వల్ల స్వయముగా పురోహితుడు విద్వాంసుడగు బ్రాహ్మణుడు చనిపోవుట చేత దానికి ప్రతిక్రియ లేదు (47)

మరణము వచ్చువరకు నీట మునిగి స్థిరముగా నుండుము.(48) ఓ చెడుబుద్ది గలవాడా! ఏ క్షణాన నీవు బ్రాహ్మణుని చంపితివో అదే క్షణాన నూరు అశ్వమేధముల ఫలము నశించినది (49) చిల్లులతో కూడిన కుండలో చుక్కకూడా నీరు వుండునట్లు పాపము వుండగా కొంచెమైననూ పుణ్యము వుండజాలదు (50) కనుక దేవతల సంయోగముచేత స్వర్గము మొదలైనవి ఎవరు పొందారో ధర్మిష్ఠులగు వారికది అట్లే వుండనిమ్ము (51)

ఏతచ్ఛత్వా వచస్తస్య శ్రకో వచనమబ్రవీత్‌ | కుకర్మణా మదీయేన ప్రాప్తమేతన్న సంశయ:|| 52

అమరావతీమాశు త్వం గచ్చ దేవర్షిభిస్సహ లోకానాం కార్యసిద్ద్యర్థే దేవానాం చ బృహస్పతే||ఇంద్రం కురు మహాభాగ యస్తే మనసి రోచతే|| 53

యథా మృతస్తథాహం వై బ్రహ్మహత్యానృతో మహాన్‌| రాగద్వేషసముత్థేన పాపేనాస్మి పరిప్లుత:|| 54

తస్మాత్త్యరాన్వితా యూయం దేవరాజానమాశు వై| కుర్వస్తు మదనుజ్ఞాతాస్సత్యం ప్రతివదామి వ:|| 55

ఏవముక్తాస్తదా సర్వే బృహస్పతిపురోగమా: ఏత్యామరావతీం తూర్ణం పురందరవిచేష్టితమ్‌ || కథయామాసురవ్యగ్రా: శచీం ప్రతి యథా తథా ||56

రాజ్యస్య హేతో: కిం కార్యం విమృశంత: పరస్పరమ్‌|| 57

ఏవం విమృశ్యమానానాం దేవానాం తత్ర నారద: | యదృచ్ఛయాగతస్తత్ర దేవర్షిరమిద్యుతి:||58

అతనట్లనగా విని ఇంద్రుడనెను చెడుపని చేసిన నేను ఈ ఫలమును పొందితిని, సంశయములేదు. (52) బృహస్సతీ! దేవర్షులతో కలిసి త్వరగా అమరావతికి వెళ్ళి లోకముల మరియు దేవతల కార్యసిద్దికై ఎవడు నీకు నచ్చునో అతనిని ఇంద్రుని చేయుము(53) గొప్ప బ్రహ్మహత్యతో కూడుకున్న నేను మరణించిన వానితో సమానము. రాగ,ద్వేషముల వల్ల కలిగిన పాపము నన్ను కమ్మకున్నది.(54) కనుక త్వరగా మీరంతా దేవరాజును ఏర్పరచుకొనండి, మీకు నేను అనుమతి నిస్తున్నాను. ఇది నిజము.(55)అట్లనగా బృహస్పతి మొదలైన ఋషులు అందరూ త్వరగా అమరావతికి వచ్చివున్నదున్నట్లుగా శచీదేవికి చెప్పిరి(56)రాజ్యము కొఱకు ఏమి చేయవలెనని పరస్పరము చర్చించుకొనిరి (57) ఇట్లు వారు చర్చించు కొనుచుండగా గొప్పకాంతిగల దేవర్షి నారదుడు అనుకోకుండా అక్కడికి వచ్చెను (58)

ఉవాచ పూజితో దేవాన్‌ కస్మాద్యూయం విచేతస: | తేనోక్తా : కథాయామాసు: సర్వం శక్రస్య చేష్టితమ్‌ || 59

గతమింద్రస్య చేంద్రత్వమేనసా పరమేణ తు | తత: ప్రోవాచ తాన్‌ దేవాన్‌ దేవర్షిర్నారదో వచ:||60

యూయం దేవాశ్చ సర్వజ్ఞాస్తపసా విక్రమేణ చ || తస్మాదింద్రో హి కర్తవ్యో నహుష: సోమవంశజ: ||61

సోస్మిన్‌ రాష్ట్రే ప్రతిష్ఠాప్యస్త్యరితేనైవ నిర్జరా: |ఏకోనమశ్వమేధానం శతం తేన మహాత్మనా|| కృతమస్తి మహాభాగా నహుషేణ చ యజ్వనా|| 62

శచ్యా శ్రుతం చ తద్వాక్యం నారదస్య ముఖోద్గతమ్‌ |గతాంత:పురమవ్యగ్రా బాష్పపూరితలోచనా ||63

నారదస్య వచ: శ్రుత్వా సర్వే దేవాన్వమోదయన్‌ ||64

దేవతలు తనను పూజించిన తరువాత వారెందుకు విమనస్కులై అడగగా వారు ఇంద్రుడు చేసిన దానిని నారదునికి చెప్పిరి.(59) ఈ మిక్కుటమైన పాపము వలన ఇంద్రుని ఇంద్రత్వము పోయినది. అటుపై దేవర్షి నారదుడు దేవతలతోఇట్లునెను (60) మీరంతా అంతా తెలిసినవారు గొప్పతపస్సు చేత సర్వజ్ఞులు కనుక సోమవంశమున పుట్టిన నహుషుని ఇంద్రునిగా చేయవలెను(61) ఓ దేవతలారా! అతనిని ఈ రాష్ట్రమున త్వరగా నిలుపుడు.యజ్ఞము చేసిన నహుషుడు తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములను చేసిన గొప్పవాడు(62) నారదుని నోటినుండి వెడలిన వాక్యమును శచీదేవి విని అంత:పురమునకు కన్నీళ్ళతో వెళ్ళిపోయినది.(63) నారదుని మాటలను దేవతలంతా ఆమోదించిరి (64)

నహుషం రాజ్యమారోడుమైకపద్యేన తే యదా ! అనీతో హి తదా రాజా నహుషో హ్యమరావతీమ్‌|| 65

రాజ్యం దత్తం మహేంద్రస్య సురైస్సర్వైర్మహర్షభి: తదాగస్త్యాదయ: సర్వేనహుషం పర్యుపాసత|| 66

గంధర్వాప్సరసో యక్షా విద్యాధరమహోరగా:| యక్షాస్సుపర్ణా: పతగా యే చాన్యే స్వర్గవాసిన:||67

తదా మహోత్సవో జాతోదేవపుర్యాం నిరంతర: శంఖతూర్యమృదంగాని నేదుర్దుందుభయ: సమమ్‌|| 68

గాయకాశ్చ జగుస్తత్ర తథా వాద్యాని వాదకా:| నర్తకా ననృతు స్తత్ర తథా రాజ్యమహోత్సవే|| 69

ఆభిషిక్తస్తదా తత్ర బృహస్పతి పురోగమై:||70

అర్చితో దేవసూక్తైశ్చ యథావద్గహపూజనమ్‌ || కృతవాంశ్చైవ ఋషిభిర్విద్వద్భివితాత్మభి:|71

వారంతా రాజ్యమున నిలుపుటకై నహుషుని అమరావతికి కొనివచ్చిరి,(65) దేవతలు, మహార్షులందరిచేత మహేంద్రుని రాజ్యము నహుషునికి ఇవ్వబడెను. అపుడు అగస్త్యుడు మొదలైన వారంతా నహుషుని సేవించిరి (66) గంధర్వులు, అప్సరసలు, యక్షులు విద్యాధరులు, మహాసర్పములు, సుపర్ణులు, పక్షులు అట్లే ఇతర స్వర్గనివాసులు నహుషుని సేవించిరి (67) అపుడు అమరావతియందు ఎడతెగకుండా గొప్ప ఉత్సవము జరిగినది. అందు శంఖములు, తూర్యములు, మృదంగములు,దుందుభులు సమముగా నినదించినవి.(68) గాయకులు గానము చేసిరి వాద్యగాళ్ళు వాద్యములు మ్రోగించిరి. నర్తకులు నర్తించిరి. (69) అపుడు నహుషుడు బృహస్పతి మొదలైన వారిచేత అభిషేకింపబడెను(70) దేవసూక్తముల చేత ఆర్చింపబడెను. గృహపూజనమును యథావిధిగా గొప్పవారు పండితులు అగు మహర్షులతో చేసేను.(71)

తథా చ సర్వై: పరిపూజితో మహాన్‌ రాజా సురాణాం నహుషస్తదానీమ్‌| ఇంద్రాసనే చేంద్రసమానరూప: సంస్తూయమాన: పరమేణ వర్చసా|| 72

సుగంధదీపైశ్చ సువాససా యుతో అలంకారభోగై: సువిరాజితాంగ:|| బభౌ తదానీం నహుషో మునీంద్రై: సంస్తూయమానో హితథా నరేంద్రై: ||73

ఇతి పరమకళాన్వితో సౌ సురమునిగణౖశ్చ పూజ్యమాన:| నహుషనృపవరోభవత్తదానీం హృది మహాతా హృచ్ఛయేన తప్త:||74

అట్లు ఇంద్రునితో సమానమగు రూపము గల వాడగు నహుషుడు దేవతలరాజై అందరిచేత బాగుగా పూజింపబడినవాడై సుగంధదీపములతో , చక్కని వస్త్రములతో, అలంకారాలతో కూడుకున్నవాడై మునీంద్రులచేత, నరేంద్రులచేత, స్తుతింపబడుచు ఇంద్రుని ఆసనమున మిగుల ప్రకాశించెను. (72,73) ఇట్లు గొప్పకళగలవాడు, సురముని గణాలచేత పూజించబడుచున్నవాడగు నహుషుడు అపుడు హృదయమున మన్మథభావముచేత పీడింపబడెను.(74)

నహుష ఉవాచ:

ఇంద్రాణీ కథమద్యైవ నాయతి మఘ సన్నిధౌ| తాం చాహ్వయత శీఘ్రం భో మావిలంబితుమర్హథ|| 75

నహుషస్య వచ: శ్రుత్వా బృహస్పతిరుదారధీ: | శచీ భవనమాసాద్య ఉవాచ చ సవిస్తరమ్‌||76

శక్రస్య దుర్నిమిత్తేన హ్యానీతో నహుషోత్ర వై| రాజ్యార్థే భామిని త్వం చ అర్ధాసనగతో భవ|| 77

శచీ ప్రహాస్య చోవాచ బృహస్పతిమకల్మషమ్‌ | అసౌ న పరిపూర్ణో హి యజ్ఞై: శక్రాసనే స్థిత:| ఏకోనమశ్వమేధానాం శతంకృతమనేన వై|| 78

తస్మాన్నయోగ్యో మాం ప్రాప్తుం తత్త్వతో హి విమృశ్యతామ్‌| యది మా సాభిలాషో హి పరస్త్రీయమచేతన:|| అవాహ్యవాహనేనైవ అత్రాగత్య లభేత మామ్‌ || 79

తథేతి గత్వా త్వరితో బృహస్పతిరువాచ తమ్‌| నహుషం కామసంతప్తం శచోక్తం చ యథాతథమ్‌ || 80

ఎందుకు శచీదేవి ఈనాడే నా వద్దకు రావడం లేదు? తొందరగా ఆమెను పిలవండి ఆలస్యం చేయరాదు(75) అనినహుషుడనగా విని బుద్దిమంతుడగు బృహస్పతి శచీదేవి భవనానికి వెళ్ళి సవిస్తరంగా చెప్పను. (76) శక్రుడు చేసిన చెడుపనుల కారణంగా నహుషుని ఇక్కడకు తెచ్చితిమి రాజ్యముకొరకు తెచ్చిన అతని అర్థాసనమును నీవుపొందుము(77) అనగా శచినవ్వి స్వచ్చమైన వాడగు బృహస్పతితో ననెను శక్రుని ఆసనమున కూర్చున్న ఇతను యజ్ఞములతో పరిపూర్ణుడుకాడు కేవలం తొంబైతొమ్మిది యజ్ఞములనితను జేసినాడు(78) కనుక వాస్తవానికి నన్ను పొందుటకు యోగ్యుడుకాదు. ఒకవేళ పరస్త్రీనైన నన్ను పొందగోరిన మోయకూడని వారిచేత మోయబడు వాహనములో ఇక్కడకు వచ్చి నన్ను పొందుగాక (79) అనగా బృహస్పతి అట్లేనని వెంటనే కామముతో తపించుచున్న నహుషుని వద్దకు వెళ్ళి శచీదేవి చెప్పిన దానిని ఉన్నదున్నట్లుగా తెలియజేసెను.(80)

తథేతి మత్వా రాజాసౌ నహుష: కామమోహిత !| విమృశ్చ పరయా బుద్ద్యా అవాహ్యం కిం ప్రశస్యతే||81

స బుద్ద్యా చ చిరం స్మృతా బ్రాహ్మణాశ్చ తపస్విన: | అవాహ్యాశ్చ భవన్త్యస్మాదాత్మానం వాహయామ్యహమ్‌|| 82

ద్వాభ్యాం చ తస్యా: ప్రాప్త్యర్థమితి మే హృగి వర్తతే | శిబికాం చ దదౌ తాభ్యాం ద్విజాభ్యాం కామమోహిత:|| 83

ఉపవిశ్వ తదా తస్యాం శిబికాయాం సమాహిత:| సర్ప సర్పేతి వచనాన్నోదయామాన తౌ తదా|| 84

అగస్త్య :శిబికావాహీ తత: కృద్దోశపన్నృపమ్‌ | విప్రాణామవమంతా త్వమున్మత్తోజగరో భవ||85

శాపోక్తిమాత్రతో రాజా పతితో బ్రాహ్మణస్య హి| తత్రై వాజగరో భూత్వా విప్రశాపో దురత్యయ:|| 86

అపుడు కామము చేత మోహమునొందిన నహుషుడు అలాగేనని తలచి, ఏది మేలైన అవాహ్యము (మోయకూడనిది) అని బాగుగా ఆలోచించెను.(81) చాలా సేపు ఆలోచించి తపస్సు గల బ్రాహ్మణులే ఆవాహ్యులనుకొని వారు తనను మోయునట్లుగా చేయుదుననుకొనెను.(82)శచీదేవిని పొందుటకు ఇద్దరు బ్రాహ్మణులచే పల్లకినీ మోయించవలెనని మనసులో వున్నది. అని వారిద్దరికీ కామమోహితుడైన సహుషుడు పల్లకినిచ్చెను.(83)చక్కగా పల్లకిలో కూర్చొని, వారిద్దరినీ కదులు మని ప్రేరేపించెను.(84) అపుడు పల్లకిని మోయుచున్న అగస్త్యుడు కోపము నొంది రాజునుశపించెను. బ్రాహ్మణులను అవమానించే నీవు ఉన్మత్తుడవు పామువు (కొండచిలువ) గమ్ము (85) అన్న శాపము చేత రాజు కొండచిలువయై నేలబడెను. విప్రుని శాపమును దాట శక్యము కాదు కదా!(86)

యథా హి నహుషో జాతస్తథా సర్వేపి తాదృశా: విప్రాణామవమానేన పతన్తి నిరయే శుచౌ|| 87

తస్మాత్సర్వప్రయత్నేన పదం ప్రాప్య విచక్షణౖ:| అప్రమత్తెర్నరైర్భావ్యమిహాముత్ర చ లబ్దయే ||88

తథైవ నహుష: సర్పో జాతోరణ్య మహాభ##యే | ఏవం చైవాభవత్తత్ర దేవలోకే హ్యరాజకమ్‌ ||89

తథైవ తే సురాస్సర్వే విస్మయావిష్టచేతన:| అహో బత మహత్కష్టం ప్రాప్తం రాజ్ఞా హ్యనేన వై||90

న మర్త్యలోకో న స్వర్గో జాతో హ్యస్య దురాత్మన: | సతామవజ్ఞయా సద్య: సుకృతం దగ్గమేవ హి||91

యాజ్ఞికో హ్యపరో లోకే కథ్యతాం చ మహామునే | తదోవాచ మహాతేజా నారదో మునిసత్తమ:|| 92

ఏవిధంగా నహుషుడు పతితుడైనాదో అట్లే ఇతరజనులుకూడా విప్రుల నవమానించుట చేత అశుచియగు నరకమున బడెదరు.(87) కనుక, ఇహ పరలాభమునకై నరులు కష్టపడి పొందిన స్థానమును అప్రమత్తులై విచక్షణతో చూచుకొనవలెను.(88) ఆ విధంగా నహుషుడు గొప్పఅరణ్యమున సర్పమాయెను అలాగే దేవలోకమునఅరాజకము నేర్పడెను (89) దేవతలంతా విస్మయము నొంది అనిరి. ఈ రోజు గొప్పకష్టమును పొందెను. (90) దురాత్ముడగు రాజు మర్త్యలోకమును గానీ, స్వర్గమును గానీ పొందకపోయెను (91)ఓ మహామునీ ! లోకమున వేరొక యాజ్జికుడెవరో చెప్పుము. అనిన గొప్పతేజస్సుగల ముని వుంగపుడగు నారదుడిట్లనెను.(92)

యయాతిం చ మహాభాగా ఆనయధ్వం త్వరాన్వితా! దేవదూతాస్తు వై తూర్ణం యయాతిం ద్రుతమానయన్‌ || 93

విమానమారుహ్య తదా మహాత్మా య¸° దివం దేవదూతైస్సమేత: పురస్కృతో దేవవరైస్తదానీం తథోరగైర్యక్షగంధర్వసిద్దై:|| 94

ఆయాత: సోమరావత్యాం త్రిదశైరభితోషిత: | ఇంద్రాసనే చోపావిష్టో బభాషే చ స సత్వరమ్‌||95

నారదేనైవముక్తస్తు త్వం రాజా యాజ్ఞికో హ్యసి | సతామవజ్ఞాయా ప్రాప్తో నహుషో దందశూకతామ్‌ ||96

యే ప్రాప్నువన్తి ధర్మిష్ఠా దైవేన పరమం పదమ్‌ | ప్రాక్తనేనైవ మూఢా స్తే నపశ్యంతి శుభాశుభమ్‌|| 97

పతంతి నరకే ఘోరే స్తబ్దా వే నాత్ర సంశయ:|| 98

ఓ మహానుభావులారా ! మీరు త్వరగా వెళ్ళి యయాతిని కొనిరండు అనగా అపుడు దేవదూతలు త్వరగా యయాతిని గొని వచ్చిరి. (93) మహత్ముడగు యయాతి విమానమెక్కి దేవలోకమునకు కలిసి వెళ్ళెను దేవతలలో శ్రేష్టులు మరియు యక్షులు, గంధర్వులు, సిద్దులు, ఉరగములు ముందు నడిచిరి (94) దేవతలచే స్తుతింపబడుచూ యయాతి అమరావతికి వచ్చెను ఇంద్రాసనము పైకూర్చుని త్వరగా మాట్లాడెను (95) అపుడు నారదుడు ఇట్లనెను నీవు రాజువు, యాజ్ఞికుడవు. ధర్మమునాచరించువారు దైవముచేత గొప్ప స్థితిని పొందిననూ శుభాశుభములను చూడలేక మూడులైఘోరమైన నరకమున పడెదరు. సంశయము లేదు మంచివారిని అవమానించుట చేత నహుషుడు సర్పమాయెను (96,97,98)

యయాతిరువాచ:

యై: కృతం చామితం పుణ్యం తేషాం విఘ్న: ప్రజాయతే | అల్పకత్వేన దేవర్షే విద్ది సర్వం పరం మమ|| 99

మహాదానాని దత్తాని అన్నదానయుతాని చ | గోదానాని బహూన్యేవ భూమిదానయుతాని చ || 100

తథైవ సర్వాణ్యపి చోత్తమాని దానాని చోక్తాని మనీషీభిర్యదా | ఏతాని సర్వాణి మయూ తథైవ దత్తాని కాలే చ మహావిధానత: || 101

యజ్ఞైరిష్టం వాజపేయాతిరాత్రై ర్జ్యోతిష్ఠోమై రాజసూయాదిభిశ్చ | శాస్త్రప్రోక్తైరశ్వమేధాదిభిశ్చ యూపైరేషాలంకృతా భూ : సమంతాత్‌ || 102

దేవదేవో జగన్నాథ ఇష్ఠో యజ్ఞైరనేకశ: గాలవాయ పురే దత్తా కన్యా త్వేషా చ మాధవీ|| 103

పత్నీత్వేన చతుర్భ్యశ్చ దత్తా : కన్యా మునే తదా | గాలవస్య గురోరర్థే విశ్వామిత్రస్య ధీమత:|| 104

ఏవం భూతాన్యనేకాని సుకృతాని మయా పురా| మహాంతి చ బహూన్యేవ తాని వక్తుం న పార్యతే || 105

యయాతి పలికెను ఓ దేవర్షీ ! అమితమైన పుణ్యము చేసిన వారికి కూడా అల్పత్వము చేత విఘ్నము కలుగును నీకు నాగూర్చి అంతా తెలుసు (99) అన్నదానముతో కూడా మహాదానము లివ్వబడినవి గోదానములు , పెక్కు భూదానములిచ్చితిని. (100)

అట్లే పండితులు పేర్కొనిన ఉత్తమ దానములన్నింటీనీ ఆయా కాలమున విధి పూర్వకముగా ఆచరించితిని(101) వాజపేయుము , అతిరాత్రము , జ్యోతిష్టోమము, రాజసూయము మున్నగు యజ్ఞముల నాచరించితిని విధి పూర్వకముగా ఆశ్వమేధాది క్రతువుల నాచరించి భూమినంతా యజ్ఞస్తంభములతో (యూప)అలంకరించితిని (102) అనేక రకాల యజ్ఞాలతో దేవదేవుడగు జగన్నాధుని అర్చించితిని, మాధవి యను ఈకన్యు గాలవునకు మునుపు ఇచ్చితిని(103) ఓ మునీ! అపుడే గాలవుడగు విశ్వామిత్రుని కొరకు నలుగురికి కన్యలను భార్యలుగా ఇచ్చితిని (104) ఇట్లు పెక్కు మంచి పనులను ఆచరించితిని. వానిని జెప్పనలవిగాదు.(105)

భూయ: పృష్ట: సర్వదేవై: స రాజా కృతం సర్వం గుప్తమేవం యథార్థమ్‌| విజ్ఞాతుమిచ్ఛాను యథార్థతోపి సర్వే వయం శ్రోతుకామా యయాతే || 106

వచో నిశమ్య దేవానాం యయాతిరమితద్యుతి:| కథయామాస తత్సర్వం పుణ్యశేషం యథార్థత:||107

కథితం సర్వమేతచ్చ నిశ్చేషం వ్యాసవత్తదా | స్వపుణ్యకథనేనైవ యయాతిరపతద్బువి|| 108

తత్ష్కణాదేవ సర్వేషాం సురాణాం తత్ర పశ్యతామ్‌ |ఏవమేవ తథా జాతమరాజకమతంద్రితమ్‌ ||109

అన్యో న దృశ్యతే లోకే యాజ్ఞికో యో హి తత్ర వై| శక్రాసనేభిషేకార్థం శ్రూయాతాం హి ద్విజోత్తమా:||110

సర్వే సురాశ్చ బుషయోథ మహాఫణీంద్రా గంధర్వయక్షఖగచారణకింనరాశ్చ | విద్యాధరా: సురగణాప్సరసాం గణాశ్చ చింతాపరా: సమభవన్మనుజాస్తథైవ||111

ఇతిశ్రీస్కాందే మహాపురాణ ఏకాశీతిసాహస్య్రాం సంహితాయాం మాహేశ్వరఖండే కేదారఖండే శివశాస్త్రీ దేవేంద్రస్వారాజ్యాభిషేకవృత్తాన్తే దేవేంద్రస్య బ్రహ్మహత్యోపద్రుతౌ సహుషశాపయయాతిభూపపుణ్యక్షయవృత్తాన్తం

ఇతి పంచదశోధ్యాయ:-15

అపుడు దేవతలంతా యయాతిని మీరాచరించిన రహస్యమైన వాస్తవాన్నంతా ఉన్నదున్నట్లుగా తెలియగొరుచున్నాము. ఓ యయాతీ! మాకు వినవెనని వున్నది.(106) అని అడగగా యయాతి తన పుణ్యశేషమును వున్నదున్నట్లుగా చెప్పెను.(107)విపులీకరించి యయాతి తన పుణ్యము నంతా ఏదీ మిగల్చకూండా చెప్పెను. తన పుణ్యమును చెప్పుటచేత యయాతి భూమి పై బడెను. (108) ఆక్షణముననే దేవతలంతా చూచుచుండగా ఆలస్యములేకుండా అరాజకమేర్పడెను.(109) ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! వినండి. అక్కడ ఇంద్రాసనమున అభిషేకించుటకు ఒక్క యాజ్ఞికుడు కూడా కనబడలేదు(110) అపుడు, దేవతలు,ఋషులు, గొప్ప సర్పములు, గంధర్వులు, యక్షులు, పక్షులు, చారణులు, కింనరులు, విద్యాధరులు, సురగణములు, అప్సరో గణములు,మానవులుకూడా చింతలో మునిగిరి(111)

శ్రీ స్కాంద మహాపురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండములో దేవేంద్రుని స్వారాజ్యాభిషేకవృత్తాన్తమున దేవేంద్రుని బ్రహ్మహత్యా పాతకము, నహుషునికి శాపము, యయాతి రాజు పుణ్యము క్షీణించుట అనువృత్తాన్తములు పదిహేనవ అధ్యాయము సమాప్తము-15

షోడశోధ్యాయ:

లోమశ ఉవాచ తత:శచీ తాన్‌ ప్రోహచ వాచం ధర్మార్థసంయుతామ్‌| మా చింతా క్రియతాం దేవా బృహస్పతిపురోగమా:|| 1

గచ్ఛత త్వరితా: సర్వే శక్రం ద్రష్టుం విచక్షణా: | బ్రహ్మహత్యాభిభూతోసౌ యత్రాస్తే సురసత్తమ:||2

బహునాం కారణనైవ విశ్వరూపో హి మందధీ:| హతస్తేన మహేంద్రేణ సర్వై: సోపి నిరాకృత:||3

తస్మాత్‌ సర్వైర్భవద్భిశ్చ గంతవ్యం యత్ర స ప్రభు:అవజ్ఞా హి కృతా పూర్వం మహేంద్రేణ తవానఘ | 4

అవజ్ఞామాత్రక్షుబ్దేన త్వయా శప్త: పురందర: | తథైవ శాపితశ్చాసి మయా త్వం హి బృహస్పతే||5

నిరస్తోసి హి తస్మాత్త్వమవసానపరో భవ|| 6

పదహారవ అధ్యాయము

లోమశుడు చెప్పెను. తరువాత శచీదేవి ధర్మార్థములతో కూడిన పలుకులను వారికి చెప్పెను. బృహస్పతి మొదలగు దేవతలారా! చింత చేయవలదు (1) దేవతలలో శ్రేష్టుడగు ఇంద్రుడు బ్రహ్మహత్యతో కప్పబడి వున్నచోటికి మీరంతా బుద్దిమంతులై వెళ్ళండి.(2) అల్ప బుద్దిగల విశ్వరూపుడు పెక్కుకారణముల చేత మహేంద్రునిచే చంపబడినాడు అందరూ అతనిని నిరాకరించితిరి.(3) కావున, మీరందరూ మహేంద్రుడున్న చోటికి వెళ్ళండి. ఓ బృహస్వతీ! పూర్వం ఇంద్రుడు నిన్ను అవమానించెను(4) ఆ అవమానముతో క్షోభను పొంది నీవు ఇంద్రుని శపించితిని. అదే విధంగా నేను నిన్ను శపించుచున్నాను.(5) మాచే వదలివేయబడినవాడివై అవసానపరుడవు గమ్ము(6)

యథా మదర్ధమానీతా శ##క్రే జీవతి తావుభౌ | త్వయి జీవతి భో బ్రహ్మన్‌ కార్యం తవ కరిష్యతి || 7

కో7పి సౌభాగ్యవాంల్లోకే తన క్షేత్ర జనిష్యతి | పుత్రం విఖ్యాతనామానమత్ర నైవాస్తి సంశయ:||8

గచ్చ శీఘ్రం సురైస్సార్థం శక్రమానయ మా చిరమ్‌ | ప్రయాసి త్వరితో నోచేత్పున: శాపం దదామి తే|| 9

శచ్యోక్తం వచనం శ్రుత్వా సురై: సార్థం జగామ సి:|| పురందరం గతాస్సర్వే బ్రహ్మనాత్యాభిపీడితమ్‌|| 10

సరసస్తీరమాసాద్య తే శక్రం చాభ్యవాదయన్‌ | దృష్ట్యా శ##క్రేణ తే సర్వే తదా హ్యప్సు స్థితేన వై|| 11

ఉవాచ దేవాన్‌ దేవేశ: కస్మాద్యూయమిహాగతా: అహం హి పాతకగ్రస్తో బ్రహ్మహత్యాపరిప్లుత: || అప్సు తిష్ఠామి భో దేవా ఏకాకీ తపసాన్విత:| 12

తచ్చృత్వా వచనం తస్య సర్వే దేవా: శతక్రతో :| ఊచుర్విహ్వలితా ఏనం దేవరాజానమద్భుతమ్‌|| 13

ఏతాదృశం న వాచ్యం తే పరేషాముపకారత: కృతం త్వయైవ యత్కర్మ విశ్వరూపవధాదికమ్‌|| 14

విశ్వకర్మ సుతేనైవ కృతం యాజనమద్భుతమ్‌ | యేన దేవా: క్షయం యాన్తి ఋషయోపి మహాప్రభా:||15

తస్మాద్దతస్త్యయా దేవ పరేషాముపకారత: తత: సర్వే వయం ప్రాప్తాస్త్యాం నేతుమమరావతీమ్‌|| 16

ఇంద్రుడు జీవించియుండగా నా కొరకు వారిద్దరినీ తెచ్చినట్లే నీవు జీవించివుండగా నీ పనిని వేరొకడు చేయగలడు(7) నీ స్థానమున గొప్పపేరుగల పుత్రుని ఎవడో ఒక అదృష్టవంతుడు కనగలడు(8) త్వరగా దేవతలతో కలిసి వెళ్ళి ఇంద్రుని తీసుకొని రమ్ము త్వరగా వెళ్ళనిచో మరల నీకు శాపమిచ్చెదను (9) శచీదేవి మాటలను విని బృహస్పతి త్వరగా దేవతలతో సహా బ్రహ్మహత్యచేత పీడింపబడిన ఇంద్రుడున్న చోటికి వెళ్ళెను. (10) సరస్సును సమీపించి వారందరూ ఇంద్రునికి అభివాదము చేసిరి, నీటిలోవున్న ఇంద్రుడు వారినపుడు చూచెను.(11) దేవేంద్రుడు వారిని చూచి మీరిక్కడికెందుకు వచ్చితిరి? నేను పాపమును పొంది బ్రహ్మహత్యతో కూడుకొని ఒంటరిగా తపస్సు చేయుచూ నీట వుంటినని (12) అనగా, విహ్వలులైన దేవతలు ఇంద్రునితో ఇట్లనిరి నీవిట్లు మాట్లడకూడదు ఇతరులకు ఉపకారము చేయుటకై నీవు విశ్వరూపుని వధించుట మున్నగువానిని చేసితివి. (14) విశ్వకర్మ యొక్క పుత్రుడు చేసిన యజ్ఞము వలన దేవతలు, గొప్పకాంతిగల ఋషులు క్షయము నొందుదురు. (15) కనుక అతనిని వధించుట ఇతరులకుపకరించును అని నీవు వధించితివి. అందుచేత నిన్ను అమరావతికి తీసుకొనివెళ్ళుటకు మేము వచ్చితిమి(16) ఏవం వివదమానేషు దేవేషు చ తదాబ్రవీత్‌ | బ్రహ్మహత్యా త్వరాయుక్తా దేవేంద్రం వరయామ్యహమ్‌ ||17

తదా బ్రహస్పతిర్వాక్యమువాచ సహసైవ తు ||18

బృహస్పతిరువాచ:

వాసార్థం చ కరిష్యామ: స్థానాని తవ సాంప్రతమ్‌ | ప్రసాంత్వితా తదా హత్యాదేవైస్తత్కార్యగౌరవాత్‌|| 19

విమృశ్యసర్వే విభజుశ్చతుర్ధా హత్యాం సురాస్తే ఋషయో మనీషిణ:| యక్షా:పిశాచా ఉరగా:పతంగా స్తథా చ సర్వే సురసిద్దచారణా:|| 20

ఆదౌ క్షమాం ప్రతి తదా ఊచు : సర్వే దివౌకస: | హే క్షమేంశస్త్వయా గ్రాహ్యోహత్యాయా: కార్యసిద్దయే|| 21

సురాణాం తద్వచ: శ్రుత్వా ధరిత్రీ కంపితావదత్‌ | కథం గ్రాహ్యోమయా హ్యంశో హత్యాయా స్తద్విమృశ్యతామ్‌|| 22

అహం హి సర్వభూతానాం ధాత్రీ విశ్వం ధరామ్యహమ్‌ |అపవిత్రా భవిష్యామి ఏనసా సంవృతా భృశమ్‌||23

పృథ్వ్యాస్తద్వచనం శ్రుత్వా బృహస్పతిరువాచ తామ్‌||

ఈ విధంగా దేవతలు తర్కించుకొనుచుండగా బ్రహ్మహత్య త్వరగా నేను దేవేంద్రుని వరించెద' ననెను (17) అపుడు బృహప్పతి వెంటనే ఇట్లనెను (18) నీవుండడానికిపడు నివాసాన్ని కల్పించెదము అపుడు బ్రహ్మహత్య కార్యము యొక్క గొప్పదనము వలన దేవతల చేత అనునయింపబడెను. (19)దేవతలు, యక్షులు, పిశాచులు సర్పములు,సిద్దులు,చారణులు బుద్దిమంతులైన ఋషులు కలిసి బ్రహ్మహత్యను నాలుగు భాగాలుగా విభజించిరి. మొదట దేవతలంతా భూమినుద్దేశించి ఇట్లనిరి 'ఓ పృథివీ! మా పని సిద్దించుటకు ఈ హత్యయొక్క ఒక అంశను నీవు గ్రహించవలెను(21) దేవతలమాటలను విని ధరిత్రి కంపించుచూ (వణకుచూ) అనెను. నేను హత్యయొక్క అంశ##నెట్లు గ్రహించగలనో ఆలోచించండి(22) నేను అన్ని ప్రాణులనుధరించుదానిని విశ్వాన్నంతా ధరించుచున్నాను. ఈ పాపము కమ్ముకొనిన నేను అపవిత్రురాలను అయ్యెదను(23) అని భూమి అనగా విని బృహస్పతి ఇట్లనెను.

మా భైషీశ్చారు సర్వాంగి నిష్పాపాసి న చాన్యథా|| 24

యదా యదుకులే శ్రీమాన్‌ వాసుదేవో భవిస్యతి | తద తత్పాదవిన్యాసాన్ని త్వం భవిష్యసి||25

కురు వాక్యం త్వమస్మాకం నాత్ర కార్యా విచారణా||26

ఇత్యుక్తా పృథివీ తేషాం నిష్సాపా సాకరోద్వచ: |తతో వృక్షాన్సమాహుయా సర్వే దేవా బ్రువన్‌ వచ:|| 27

హత్యాంశో హ గ్రహీతవ్యో భవద్బి: కార్యసిద్దయే | ఏవముక్తాబ్రువన్‌ వృక్షా సర్వే భవిష్యంతి తపస్విన:|| 28

వయం సర్వే తథా భూతాస్తాపసానాం ఫలప్రదా:| తదా హత్యాన్వితా:సర్వే భవిష్యంతి తపస్విన:||29

పాపినో హి మహాభాగాస్తస్మాత్సర్వం విమృశ్యతామ్‌ |తదా పురోధసా చోక్తా : సర్వే వృక్షాస్సమాగతా:||30

ఓ సుందరీ! భయపడవలదు. పాపము లేనిదానివే వేరే విధంగా కాదు. (24) వాసుదేవుడు యదుకులమున జన్మించినపుడతను నీ పై పాదముంచుట చేత నీవు పాపము లేనిదానివి కాగలవు (25) నీవు మా మాటలను పాటించుము. ఆలోచించపనిలేదు (26) అట్లు వారు పలుకగా ధరిత్రి పాపము లేనిదై అట్లేచేసెను.అపుడు దేవతలంతా వృక్షములను పిలిచి ఇట్లనిరి(27) మీరు పని సిద్దించుటకై హత్యయొక్క అంశమును తీసుకొనవలెను. అనగా వచ్చిన చెట్లన్నీ దేవతలతో ఇట్లనినవి(28)మేమంతా తాపసులకు ఫలములనిచ్చువారము అపుడు తాపసులుకూడా హత్యతో కూడుకొనిన వారయ్యెదరు.(29) పాపము పొందినవారవుదురు . కావున మీరాలోచించండి అపుడా వృక్షములతో బృహస్పతి ఇట్లనెను (30)

మా చింతా క్రియతాం సర్త్వే: ప్రసాదాచ్చ శతక్రతో:| ఛేధితాశ్చైవ సర్వే వై హ్యనేకాంశత్వమాగతా:||31

తతో విటపినో నిత్యం యూయం సర్వే భవిష్యథ | ఇత్యుక్తాస్తే తదా సర్వేగృహ్ణన్‌ హత్యాం విభాగశ:||32

తతో హ్యపస్సమాహూయ ఊచు: సర్వే దివౌకస: | అద్భిశ్చ గృహ్యతామద్య హత్యాంశ: కార్యసిద్దయే|| 33

తదా హ్వాపో మిళిత్వాథ ఊచు : సర్వా: పురోధనమ్‌ | యాని కాని చ పాపాని తథా దుశ్చరితాని చ || 34

అస్మత్సంపర్కసంబంధాత్‌ స్నానశౌచాశనాదిభి: పునంతి ప్రాణిన: సర్వే పాపేన పరివేష్టితా:||35

తాసాం వచనమాకర్ణ్య బృహస్పతిరువాచ హ: మా భయం క్రియతామాప ఏనసా దుస్తేరేణ హి|| 36

ఆప: పునంతు సర్వేషాం చరాచరనివాసినామ్‌| తదా స్త్రియస్ససమాహుయా బృహస్పతిరువాచహ||37

'మీరంతా చింతించపనిలేదు, ఇంద్రుని ప్రసాదమువలన మీరంతా ఛేదింపబడి అనేకాంశలను పొందితిరి,(31) మీరు అందరూ నిత్యమూ విటపములు గాగలరు అని అనగా వృక్షములన్నీ హత్యయొక్క అంశను విభజించి తీసుకొనినవి (32) అటు తరువాత దేవతందరూ నీటిని పిలిచి అడిగిరి. పని సిద్దించడానికి ఈ హత్య యొక్క అంశను తీసుకొండి అని (33)అపుడు నీళ్ళన్నీ కలిసి అన్నవి ఏయే పాపములు చెడుపనులు వున్నాయో(34) వానిని అన్ని ప్రాణులూ స్నానము శౌచము మొదలైన వానిచేత మా సంపర్కము వలననే దూరము చేసుకొనును.(35)వాని మాటలు విని బృహస్పతి ఇట్లనెను. ఈగొప్ప దైన దాటశక్యము గానిపాపమును చూచి భయపడవలదు(36) చరము, ఆచరములగు ప్రాణులనన్నింటినీ నీరు పవిత్రము చేయుగాక! అపుడు బృహస్పతి స్త్రీలను పిలిచి ఇట్లనెను (37)

అద్యైవ గ్రాహ్యో హత్యాంశ: సర్వకార్యార్థసిద్దయే | నిశమ్య తుద్గుర్వాక్యమూచు : సర్యాశ్చ యోషిత:|| 38

పాపమాచరతే యోషా తేన పాపేన నాన్యథా| లిప్యంతే బహవ: లిప్యంతే బహవ: పక్షా ఇతి వేదానుశాసనమ్‌ || 39

శ్రుతమస్తి న తే కించిద్దే పురోధో విమృశ్యతామ్‌ యోషిద్భ్య: ప్రోచ్యమానోపి ఉవాచాథ బృహస్పతి:|| 40

మా భయం క్రియతం సర్వా: పాపాదస్మాత్సులోచనా: |భవిష్యాణాం తథాన్యేషాం భవిష్యతి ఫలప్రద:|| హత్యాంశో యో హి సర్వాసాం యథా కామిత్వమేవచ || 41

ఏవమంశాశ్చ హత్యాయాశ్చత్వార: కల్పితా: సురై: నావాసమకరోత్‌ సద్యస్తేషు తేషు ద్విజోత్తమా:|| 42

నిష్పాపో హి తదా జాతో మహేద్రో హ్యభిషేచిత:| దేవపుర్యాం సురగణౖస్తథైవ ఋషిభిస్సహ||43

అందరి పని సిద్దించుటకై ఈనాడే హత్యయొక్క అంశను తీసుకొనవలెను. అనగా విని స్త్రీలంతా అనిరి (38) స్త్రీ పాపమాచరించును. ఆ పాపము చేత అనేక పక్షములు తాకబడినవి. వేరే విధంగా కాదని కదా వేదవాక్యము(39) ఓ బృహస్పతీ! ఇది నీవు విననిదా! ఆలోచించవలెను అని స్త్రీలంటూ వుండగానే బృహస్పతి అనెను. (40) ఓఅందమైన కన్నులు గలస్త్రీ జనులారా!మీరీ పాపము నుండి భయపడవద్దు రాబోవు కాలమున ఈ హత్యయొక్క అంశము అందరికీ వారి వారి కోరికననుసరించి ఫలమునిచ్చునదే కాగలదు.(41) ఇట్లు దేవతలు ఆ హత్యను నాలుగు అంశములుగా విభజించిరి. ఓ బ్రాహ్మణులారా! అపుడా బ్రహ్మహత్య ఆయావానియందు నివసించెను.(42) అపుడు పాపము లేని వాడైన మహేంద్రుడు సురగణములతో దేవర్షులతో కలిసి దేవపురియగు అమరావతి యందు అభిషేకింపబడెను.(43)

శచ్యా సమేతో హి తదా పురందరో బభూవ విశ్వాధిపతిర్మహాత్మా| దేవైస్సమేతో హి మహానుభావైర్ము నీశ్వరై: సిద్దగణౖస్తదానీమ్‌ || 44

తదాగ్నయ: శోభనా వాయవశ్చ సర్వే గ్రహా: సుప్రభా: శాంతియుక్తా :| జాతా: సద్య : పృథివీ శోభమానా తథాద్రయో మణిప్రభా బభూవు:|| 45

ప్రసన్నాని తథా హ్యాసన్‌ మనాంసి చమనస్వినామ్‌|| 46

నద్యశ్చామృతవాహిన్యో వృక్షా హ్యాసన్‌ సదాఫలా:| అకృష్టపచ్యౌషధయో బభూవుశ్చామృతోపమా:||47

ఐకపద్యేన సర్వేషామింద్రలోకనివాసినామ్‌ | బభూవ పరమోత్సాహో మహామోదకరస్తథా||48

అపుడు ఇంద్రుడు శచీదేవితో దేవతలతో గొప్పవారు మునీశ్వరులతో, సిద్దగణములతో కలిసి యుండెను (44) అపుడు అగ్నులు వాయువులు, హృద్యముగా నుండినవి గ్రహములన్నీ కాంతివంతములై శాంతిలో యుండినవి. ఒక్కమారుగా భూమి ప్రకాశవంతమైనది పర్వతములన్నీ మణికాంతులుగలవైనవి అభిమానవంతుల మనస్సులు ప్రసన్నములైనవి (46) నదులన్నీ నీటిని గలిగివున్నవి వృక్షములు ఎప్పటికీ ఫలముల నిచ్చునవిగా అయినవి. ఓషధులు అమృతము వలెనుంటూ పండించకనే పండునవిగా యుండినవి.(47) ఇంద్రుని లోకమున నివసించువారందరికీ ఒక్కమారుగా గొప్పఆనందమును గలిగించు ఉత్సవము ఏర్పడినది.(48)

లోమశ ఉవాచ:

ఏతస్మిన్నంతరే త్వష్టా చేంద్రమహోత్సవమ్‌ | బభూవ రుషితో తీవ పుత్రశోకప్రపీడిత:||49

జగామ నిర్వేదపరస్తపస్తప్తుం సుదారుణమ్‌ | తపసా తేన సంతుష్ఠో బ్రహ్మా లోకపితామమా:||50

త్వష్టారమబ్రవీత్తుష్టో వరం వరయ సుప్రత | తదా వవ్రే వరం త్వష్ట్యా సర్వలోకభయావహమ్‌|| వరం పుత్రో హి దాతవ్యో దేవానాం హి భయవహ:|| 51

తథేతి చ వరో దత్తో బ్రహ్మణా పరమేష్ఠినా| వరదానాత్సద్య ఏవ బభూవ పురుషస్తదా ||52

వృత్ర నామాంకితస్తత్ర దైత్యో హి పరమాద్భుత: | ధనుషాం శతమాత్రం హి ప్రత్యహం వవృథేసుర: ||53

పాతాళాన్నిర్గతా దైత్యా యే పురామృతమంథనే | ఘాతితాస్సురసం ఘైశ్చ భృగుణా జీవితాస్త్యరాత్‌ ||54

ఇంతలో, త్వష్ట ఇంద్రమహోత్సవమును చూసి పుత్రశోకముతో పీడింపబడుచూ మిక్కిలి కోపమును పొందెను.(49) దానిచేదారుణమైన తపస్సును చేయుటకువెళ్లెను ఆతపస్సుచేత లోకపితాబహుడగు బ్రహ్మ సంతోషించి (50) వరమునుకోరుకొమ్మని త్వష్టను అడిగెను.అపుడు త్వష్ట లోకములకు భయమును కలిగించు వరమును గోరెను. దేవతలకు భయము కలిగించు పుత్రునివ్వుము.(51) (అనగా) పరమేష్టియగు బ్రహ్మ వరము నిచ్చెను.వరము నిచ్చెను. వరము నిచ్చుటచే వెంటనే ఒక పురుషుడేర్పడెను(52)వృత్రుడను పేరుగలిగి ఆ పురుషుడు పరమాద్బుతముగా ప్రతిదినము నూరువిల్లుల పరిమాణముతో పెరుగసాగెను.(53)పూర్వము ఆమృతమథన సమయమున పాతాళమునుండి బయల్వెడలి సురసంఘముల చేత ప్రాణములవిడిచిన దైత్యులను భృగువు త్వరగా బ్రతికించెను.(54)

సర్వం మహీతలం వ్యాప్తం తేనైకేన మహాత్మనా||55

తదా సర్వేపి ఋషయో పద్యమానాస్తపస్విన: బ్రహ్మాణం త్వరితాస్సర్వే ఊచుర్వ్యసనమాగతమ్‌ ||56

తథా చేంద్రాదయో దేవా గంధర్వాస్సమరుద్గణా: | బ్రహ్మణా కథితం సర్వం త్వష్టుశ్చైతచ్చికీర్షితమ్‌||57

భవద్వధార్థం జనితస్తపసా పరమేణ తు | వృత్రోనామ మహాతేజా: సర్వదైత్యాధిపో మహాన్‌||58

తథాపి యత్న: క్రియతాం యథా వధ్యో భ##వేదసౌ|| నిశమ్య బ్రహ్మణో వాక్యమూచుర్దేవా: సవాసవా: 59

ఆ ఒక్క వృత్రునిచే మహీతలమంతా వ్యాపించగా (55) తపస్వులగు ఋషులంతా హింసింపబడుచున్నవారై త్వరగా బ్రహ్మను చేరుకొని వచ్చిపడిన కష్టమును గూర్చి చేప్పిరి. (56)అట్లు ఇంద్రుడు మొదలగు దేవతలు గంధర్వులు, మరుద్గణములతో కలిసి చెప్పగా బ్రహ్మ త్వష్ట చేయదలిచిన దానిని వారికి చెప్పెను.(57) మిమ్ములను వధించుటకు గొప్ప తపస్సు చేసి త్వష్ట ఈ గొప్ప తేజస్సుగల వృత్రుడగు దైత్యాధిపతిని జనింపజేసేను.(58) అయిననూ, మీరు ఇతనిని వధించు యత్నమును చేయండి. అని బ్రహ్మ అనగా విని ఇంద్రుడు మొదలగు దేవతలిట్లనిరి.(59)

దేవా ఊచు:

యదా ఇంద్రోహి హత్యాయా విముక్త: స్థాపితో దివి| తదాస్మాభిరకార్యం వై కృతమస్తి దురాసదమ్‌ || 60

శస్త్రాణ్యస్త్రాణ్యనేకాని సంక్షిప్తాని హ్యబుద్దిత: | దధీచస్యాశ్రమే బ్రహ్మన్‌ కిం కార్యం కరవామహే ||61

తచ్ఛృత్వా ప్రవాసన్‌ వాక్యం దేవాన్‌ బ్రహ్మా తదాబ్రవీత్‌ | చిరం స్థితాని విజ్ఞాయ గచ్చధ్వం తాని వై సురా:|| 62

గత్వా దేవాస్తదా సర్వే నాపశ్యన్‌ స్వం స్వమాయుధమ్‌ | పప్రచ్ఛుశ్చ దధీచిం తే సోవాదీన్త్నెవ వేద్మ్యహమ్‌|| 63

పునర్ర్భహ్మాణమాగత్వ ఊచుస్సర్వే మునేర్వచ :|| 64

దేవతలనిరి ఇంద్రుడు బ్రహ్మ హత్యనుండి విముక్తుడయి స్వర్గంలో తిరిగి స్థాపింపబడినపుడు మేము చేయగూడని దానిని చేసాము. (60) ఆలోచన లేకుండా మేము మా అనేక శస్త్రాలను, అస్త్రాలను దధీచి ఆశ్రమమున వుంచాము. ఓ బ్రహ్మదేవా!

మేము ఏమి చేయగలము (61) అది విని బ్రహ్మ నవ్వుతూ దేవతలతో ఇట్లనెను దేవతలారా! అవిచాలా కాలంగా వున్నవి. తెలుసుకొని రండి (62) అనగా దేవతలపుడు వెళ్ళి చూడగా తమ తమ ఆయుధాలు కనపడకుండెను. వారు దధీచి నడుగగా అతను తనకు తెలియదనెను. (63) వారంతా బ్రహ్మ వద్దకు మరలి వచ్చి దధీచిముని మాటలను చెప్పిరి.(64)

బ్రహ్మోవాచ తదా దేవాన్‌ సర్వేషాం కార్యసిద్దయే | తస్యాస్థీన్యేవయాచధ్వం ప్రదాస్యతి న సంశయ:|| 65

తచ్ఛృత్వా బ్రహ్మణోవాక్యం శక్రో వచనమబ్రవీత్‌ ||66

విశ్వరూపో హతో దేవ దేవానాం కార్యసిద్దయే ఏక ఏవ తదా బ్రహ్మన్‌ పాపిష్ఠోహం కృతస్సురై: 67

తథా పురోధసా చైవ ని: శ్రీకస్తత్‌క్షణాత్‌ కృత: | దిష్ట్యా పరమయా చాహం ప్రవిష్ఠో నిజమందిరమ్‌||68

దధీచం ఘాతయిత్వా వై తస్యాస్థీని బహున్యపి | అస్త్రాణి తాని భగవాన్‌ కృతాని హ్యశుభాని వై|| 69

త్వష్టా హి జనితో యో వై వృత్రో నామైష దైత్యరాట్‌ | కథం తం ఘాతయామ్యేవం సతతం పాపభీరుణా|| శక్రోక్తం నిశమ్యాథ బ్రహ్మా వాక్యమువాచ హ || 70

అపుడు దేవతలనుద్దేశించి అందరి కార్యసిద్దికై అతని ఎముకలనే యాచించండి తప్పక ఇవ్వగలడు అని బ్రహ్మ అనెను(65) అది విని శక్రుడనెను(66) ఓ దేవా ! దేవతల పని నెరవేరుటకై విశ్వరూపుని వధించితిని అపుడు దేవతలందరిచే నేనొక్కడినే పాపిష్ఠుడిగా చేయబడితిని.(67) అట్లే బృహస్పతి చేత ఒక్కక్షణముననే వైభవము కోల్పోయినవాడిగా చేయబడితిని అదృష్టవశముచే, మరల నా మందిరాన్ని చేరితిని (68) దధీచిని వధించి అతని పెక్కుఎముకలతో చేయబడిన అస్త్రాలు అశుభములుకదా!(69)త్వష్ట జనింపజేసిన ఈ దైత్యరాజుగు వృత్రుని ఎట్లు పాపభీరువగు నేను వధింపగలను? అని ఇంద్రుడనగా విని బ్రహ్మ ఇట్లనెను (70) అర్థశాస్త్రపరేణౖవ విధినా తనుబోధయత్‌ | ఆతతాయినమాయాంతం బ్రాహ్మణం వా తపస్వినమ్‌|| హంతుకామం జీఘాంసీయాన్న తేన బ్రహ్మహా భ##వేత్‌ || 71

ఇంద్ర ఉవాచ-

దధీచస్య వధాద్బ్రహ్మన్నహం భీతో న సంశయ: | తస్మాద్బ్రహ్మవధాత్‌ సత్యం మహదేనో భవిష్యతి|| 72

అతో న కార్యమస్మాభిర్బ్రాహ్మణానాం తు హేలనమ్‌ | హేలనాద్భహవో దోషా భవిష్యంతి నచాన్యథా||73

అదృష్టం పరమం ధర్మ్యం విధినా పరమేణ హి | కర్తవ్యం మనసా చైవం పురుషేణ విజానతా||74

ని:స్పృహం తస్య తద్వాక్యం శ్రుత్వా బ్రహ్మ హ్యువాచ తమ్‌ | శక్ర స్వబుధ్వా వర్తస్వ దధీచిం గచ్ఛ సత్వరమ్‌ ||75

యాచస్వ తస్య చాస్థీని దధీచే: కార్యగౌరవాత్‌ | గురుణా సహిత:శక్రో దేవైస్సహ సమన్విత:||76

బ్రహ్మ అర్థశాస్త్రపరమైన విధితో ఇంద్రునికి ఇట్లు తెలియజేసెను. ఆతతాయి అగువాడు, హింసించుకోరికతో వచ్చుచున్న ఎడల, అతను తపస్వియగు బ్రహ్మణుడైననూ వధించవలెను. దీనివలన బ్రహ్మహత్య కలగదు.(71)ఇంద్రుడనెను బ్రహ్మదేవా!దధీచి వధనుండి భయము నొందతిని.బ్రాహ్మణవధనుండి గొప్పపాపము తప్పక పుట్టును. (72)కనుక, బ్రాహ్మణులను హేళన చేయుట తగదు దీనినుండే పెక్కు దోషములు పుట్టును.(73)కనుక ఇదంతా తెలిసి వ్యక్తి దోషములు లేనిది ధర్మ బద్దమైనది అగు దానిని మాత్రమే గొప్ప విధితో చేయవలెను. ఆలోచించవలెను.(74) నిస్ప్సహతో కూడిన మాటలను విని బ్రహ్మ ఇంద్రునితో అనెను ఇంద్రా! నీ బుద్దితోనే ప్రవర్తించుము. త్వరగా దధీచి వద్దకు వెళ్ళుము.(75) మహత్తరకార్యము కనుక వెళ్ళి దధీచిని అతని ఎముకలను యాచించుము అనగా ఇంద్రుడు తన గురువు ఇతర దేవతలతో కూడిన దధీచి వద్దకు బయలుదేరెను(76)

తథేతి గత్వా సర్వే దధీచస్యాశ్రమం శుభమ్‌ | నానాసత్త్వసమాయుక్తం వైరభావవివర్జితమ్‌|| 77

మార్జారమూషకాశ్చైవ పరస్పరముదాన్వితా:| ఐకపద్యేన సింహాశ్చ గజిన్య: కలభైస్సహ||78

తథా జాత్యశ్చ వివిధా: క్రీడాయుక్తా : పరస్పరమ్‌|| నకులై: సహ సర్పాశ్చ క్రీడాయుక్తా: పరస్పరమ్‌||79

ఏవం విధాన్యనేకాని హ్యాశ్చర్యాణి తదాశ్రమే |పశ్యంతో విబుధాస్సర్వే విస్మయం పరమం యయు:||80

అథాసనే మునిశ్రేష్ఠం దదృశు: పరమాస్థితమ్‌| తేజసా పరమేణౖవ భ్రాజమానం యథా రవిమ్‌||81

విభావసుం ద్వితీయా వా సువర్చాసహితం తదా| యథా బ్రహ్మా హి సావిత్ర్యా తథాసౌ మునిసత్తమ:||82

అట్లే అని దేవతలందరూ పవిత్రమగు దధీచి ఆశ్రమమునకు వెళ్ళిరి. ఆ ఆశ్రమమున అనేక మృగములు వైరభావాన్ని (శత్రుభావాన్ని) విడిచి వుండినవి(77) పిల్లులు, ఎలుకలు,సింహాలు, ఆడ ఏనుగులు సంతోషముగా ఒక దానితో ఒకటి ఆడుకొనుచున్నవి.(78) అట్లే వివిధ జాతులకు చెందిన మృగములు ఆటలో మునిగినవి.ముంగిసలతో , పాములు కలిసి ఆడుచున్నవి.(79)ఇట్టి అనేకరకాల ఆశ్చర్యములను ఆ ఆశ్రమములో చూచి దేవతలంతా మిక్కిలి విస్మయాన్ని పొందిరి.(80)అటుపిమ్మట,వారు అసనమున కూర్చుని యున్న మునిశ్రేష్ఠుడగు దధీచిని చూచిరి అతనపుడు తన తేజస్సుచే సూర్యుని వలె ప్రకాశించుచుండెను.(81) సువర్చతో కూడిన రెండవ విభావసువలె నుండెను సావిత్రితో కూడివున్న బ్రహ్మవలె ఆ ముని వుండెను.(82)

తం ప్రణమ్య తతో దేవా వచనం చేదమబ్రువన్‌| త్వం దాతా త్రిషు లోకేషు త్వత్సకాశమిహాగతా:||83

నిశమ్య వచనం తేషాం దేవానాం మునిరబ్రవీత్‌ | కిమర్థమాగతాస్సర్వే వదధ్వం తత్‌ సురోత్తమా:||84

ప్రయచ్చామి న సందేహో నాన్యథా మమ భాషితమ్‌ తదోచు: సహితా: సర్వే దధీచిం స్వార్థకాముకా:||85

భయభీతా వయం విప్ర భవద్దర్శనకాంక్షిణ:| త్రాతారం త్వాం సమాకర్ణ్య బ్రహ్మణా నోదితా వయమ్‌|| 86

సంప్రాప్తా విద్ది తత్సర్వం దాతుమర్హోథ సువ్రత||87

నిశమ్య వచనం తేషాం కిం దాతవ్యం తదుచ్యతామ్‌| 88

అతనికి నమస్కరించి దేవతలిట్లనిరి ముల్లోకములలో నీవే దాతవు అని నీ వద్దకు మేము వచ్చితిమి(83)అనగా ముని అనెను దేవతలారా! మీరు వచ్చిన పని ఏమిటో తెలియజేయుడు.(84) నిస్సందేహముగా ఇచ్చెదను. నామాట వేరొకవిధముగా కాదు అనగా స్వార్థమును కోరుచున్న దేవతలంతా దధీచితో అనిరి.(85) ఓ విప్రా! భయభీతులమైయున్న మేము నీ దర్శనమును కోరియున్నాము. నీవే రక్షకుడవని విని బ్రహ్మచేత ప్రేరితులమైనాము.(86) ఇక్కడికి వచ్చితిమి అదంతా తెలిసి మాకు దానము చేయుటకు నీవే యోగ్యుడవు(87) వారి మాటలను విని ఏమివ్వవలెనో చెప్పవలెనని దధీచి అనెను(88)

తతో దేవా బ్రువన్‌ విప్ర దైత్యానాం నిధనాయ న: |శస్త్రనిర్మాణకార్యార్థం తవాస్థీని ప్రయచ్చ వై|| 89

ప్రవాస్యోవాచ విప్రర్షిస్తిధ్వం క్షణమేవ హి |స్వయమేవ త్వహం దేవాస్త్యక్షామ్యద్య కళేవరమ్‌||90

ఇత్యుక్త్వా తానథో పత్నీం సమూహూయ సువర్చసమ్‌| ప్రోవాచ స మహాతేజా: శృణుదేవి శుచిస్మితే || 91అత్యర్థం యాచితో దేవైస్యజామ్యేతత్కళేవరమ్‌| బ్రహ్మలోకం వ్రజామ్యద్య పరమేణ సమాధినా||92

మయి యాతే బ్రహ్మలోకం త్వం స్వధర్మేణ తత్ర మామ్‌| ప్రాప్సస్యేవ న సందేహో వృథా చింతాం చ మా కృధా:||93

ఇత్యుక్త్వా తాం స్వపత్నీం స ప్రేషయామాస చాశ్రమమ్‌ |తతో దేవాగ్రతో విప్ర: సమాధిమగమత్తదా||94

అటుపిమ్మట దేవతలు దధీచితో దైత్యులను వధించుటకు కావలసిన అస్త్రముల కొరకు నీ ఎముకలను ఇవ్వము అని అనిరి(89) అది విని నవ్వి దధీచి ఒక క్షణము ఆగుమని చెప్పి దేవతలారా! నేను స్వయముగా శరీరమును వదలెదననెను.(90)తరువాత సువర్చసయగు పత్నిని పిలిచి దధీచి ఇట్లు పలికెను. ఓ అందమైన నవ్వుకలదానా !(91)దేవతలు మిక్కిలి యాచించగా నేను నా శరీరమును వదలి పరమ సమాధిచేత బ్రహ్మలోకమునకు వెళ్ళుచున్నాను.(92) నేను బ్రహ్మలోకమునకు వెళ్ళగా నీవు నీ ధర్మము చేత నన్నక్కడ చేరగలవు. సందేహము లేదు. అనవసరముగా నీవు చింతింపవలదు(93) అని దధీచి తన భార్యను ఆశ్రమమునకు పంపి దేవతల ఎదుటనేసమాధి స్థితిలోకి వెళ్ళెను.(94)

సమాధినా పరేణౖవ విసృజ్య స్వం కళేవరమ్‌| బ్రహ్మలోకం గత: సద్య పునర్నావర్తతే యత:|| 95

దధీచి నామా మునిబృందవర్య: శివప్రియ: శివదీక్షాభియుక్త: |పరోపకారార్థమిదం కళేవరం శీఘ్రం స విప్రోత్యజదాత్మనా తదా||96

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ మాహేశ్వరఖండే

కేదారఖండే దేవైరస్థికృతే భ్యర్థితస్య దధీచేర్యోగేన స్వదేహ విసర్జనం నామ షోడశోధ్యాయ:

పరమ సమాధితో తన శరీరాన్ని వదిలి దధీచి తిరిగిరాని లోకమగు బ్రహ్మలోకమును వెంటనే చేరెను. (95) అట్లు మునిబ్బందములలో శ్రేష్ఠుడు శివప్రియుడు, శివప్రియుడు, శివదీక్షతో కూడిన వాడు అగు దధీచి ముని పరోపకారము కొరకు తన శరీరాన్ని వెంటనే వదలివేసేను.(96)

శ్రీ స్కాంపురాణములోని మాహేశ్వర ఖండములోని కేదారఖండములో దేవతలు అస్థికలను కోరగా దధీచి యోగముతో తన శరీరాన్ని వదులుట' అని పరహారవ అధ్యాయము సమాప్తము.

సప్త దశో7ధ్యాయ:

లోమశ ఉవాచ:

తతస్సర్వే సురగణా: దృష్ట్యా తం విలయం గతమ్‌ | చింతయంతస్సురగణా: కథం చ విదధామహే ||1

సురభిం చాహ్వాయిత్వాథ తదోవాచ శచీపతి: | కళేవరం దధీచస్య లిహ్యాస్త్యం వచనాన్మమ||2

తథేతి చ వచో మత్వా తత్‌క్షణా దేవ లిహ్య తత్‌| నిర్మాంసం చ కృతం సద్యస్తయా ధేన్వా కళేవరమ్‌ || 3

జగృహుస్తాని చాస్థీని చక్రు: శస్త్రాణి వై సురా:| తస్య వంశోద్భవం వజ్రం శిరో బ్రహ్మశిరస్తథా|| 4

అన్యాని చాస్థీని బహుని తస్య ఋషేస్తదానీం జగృహు: సురాశ్చ| తథా శిరాజాలమయాంశ్చ పాశాం శ్చక్రు: సురా వైరయుతాశ్చ దైత్యాన్‌|| 5

శస్త్రాణి కృత్వా తేసర్వే మహాబలపరాక్రమా :| యయుర్దేవాస్త్వరాయుక్తా వృత్రఘాతనతత్పరా:||6

పదిహేడవ అధ్యాయము

లోమశుడనెను- అటు తరువాత దేవగణములన్నీ దధీచి ప్రాణములను విడుచుటను చూచి,ఏమి చేయవలెనని ఆలోచించసాగినవి (1) అపుడు ఇంద్రుడు సురభిని పిలిచి తన మాటపై దధీచి కళేబరమును నాకమని చెప్పెను (2)సురభి అట్లే అని నాకి, దధీచి కళేబరమును మాంసము లేకుండా చేసెను.(3) అపుడు దేవతలు దధీచి ఎముకలను తీసుకొని శస్త్రములను చేసిరి. వెన్నముకనుండి వజ్రాయుధము, శిరస్సునుండి బ్రహ్మశిరస్సు అను ఆయుధములు తయారయినవి(4) అట్లే మిగతా ఎముకలను తీసుకొని దేవతలు సిరలతో కూడా ఆయుధములను చేసిరి(5) దైత్యుల పట్ల శత్రుత్వము గల అస్థికలు, సిరలతో శస్త్రముల చేసి గొప్ప బల పరాక్రమము గలవారై వృత్రుని వధింపగోరి త్వరగా బయలుదేరిరి.(6)

తత: సువర్చాశ్చ దధీచి పత్నీ యా ప్రేషితా సా సురకార్యసిద్దయే| వ్యలోకయత్తత్ర సమేత్య సర్వం మృతం పతిం దేహమథో దదర్శ తమ్‌|| 7

జ్ఞాత్వా చ తత్సర్వమిదం సురాణాం కృత్యం తదానీం చ చుకోప సాధ్వీ| దదౌ సతీ శాపమతీవ రుష్టా తదా సువర్భా ఋషివర్యపత్నీ||8

అహో సురా దుష్టతరాశ్చ సర్వే సర్వే హ్యశక్తాశ్చ తథైవ లుబ్దా:| తస్మాచ్చ సర్వేప్రజసో భవంతు దివౌకసోద్య ప్రభృతీత్యువాచ సా|| 9

ఏవం శాపం దదౌ తేషాం సురాణాం సా తపస్వినీ | ప్రవిశ్యాశ్వత్థమూలే సా స్వోదరం దారయత్తదా|| 10

నిర్గతో జఠరాద్గర్భో దధీచస్య మహాత్మన:| సాక్షాద్రుద్రావతారో సౌ పిప్పలాదో మహాప్రభ:|| 11

ప్రహస్య జననీ గర్భమువాచ రుషితేక్షణా | సువర్చా తం పిప్పలాదం చిరం తిష్ఠాస్య సన్నిధౌ|| 12

అశ్వత్థస్య మహాభాగ సర్వేషాం సఫలో భ##వే :| తథైవ భాషమాణా సా సువర్చా తనయం ప్రతి || పతిమన్వగమత్సాధ్వీ పరమేణ సమాధినా|| 13

ఏవం దధీచపత్నీ సా పతినా స్వర్గమవ్రజత్‌|| 14

తరువాత దధీచి పత్నియగు సువర్చ దేవతల పని సిద్దించుటకు భర్తచే పంపబడినదై తిరిగి వచ్చి జరిగినదంతా చూచెను. ప్రాణాలులేని భర్త దేహమును ఆమె చూచెను(7) దేవతల పని సిద్దించుటకు పంపబడిన దధీచి పత్ని తరువాత వచ్చి పతి మృత దేహమును చూచెను)(7) ఇదంతా దేవతల పని తెలుసుకొని ఆసాధ్వి కొపగించినదై దేవతలకు శాపమిచ్చెను.(8)అహో దేవతలంతా అతి దుష్టులు శక్తిలేనివారు లోభులు కనుక నేటి నుండి దేవతలంతా ప్రజలేని వారు అగుదురుగాక! అని ఆమె అనెను (9) ఇట్లు దేవతలను శపించి ఆ తపస్విని అశ్వత్థవృక్షము మూలము వద్ద తన ఉదరమును చీల్చెను (10) అపుడా జఠరమునుండి దధీచి గచ్భమగువాడు సాక్షాత్తు రుద్రుని అవతారమగు పిప్పలాదుడను గొప్పకాంతి గలవాడు బయటకు వచ్చెను. (11)అపుడు తల్లి గర్భమునుచూసి నవ్వుతూ, కంటినిండా కోపముండగా పిప్పలాదునితో ఈ రావి చెట్టువద్దనుండి అందరికి ఫలములనిమ్ము అని కుమారునితో మాట్లాడుతూనే పరమసమాధి ద్వారా పతిననుసరించెను(12, 13) ఇట్లు సాధ్వియగు దధీచపత్ని సువర్చపతితో స్వర్గమునకు వెళ్ళెను.(14)

తరువాత దధీచి పత్నియగు సువర్చ దేవతల పని సిద్దించుటకు భర్తచే పంపబడినదై, తిరిగి వచ్చి జరిగినదంతా చూచెను. ప్రాణాలులేని భర్త దేహమును ఆమె చూచెను(7) (దేవతల పని సిద్దించుటకు పంపబడిన దధీచిపత్ని తరువాత వచ్చి పతి మృతదేహమునుచూచెను. )(7) ఇదంతా దేవతల పని అని తెలుసుకొని ఆ సాధ్వి కోపగించినదై దేవతలకు శాపమిచ్చెను.(8) అహో దేవతలంతా అది దుష్టులు శక్తి లేనివారు లోభులు కనుక నేటి నుండి దేవతలంతా ప్రజలేని వారు అగుదురుగాక! అని ఆమె అనెను (9) ఇట్లు దేవతలను శపించి ఆ తపస్విని అశ్వత్థవృక్షము మూలము వద్ద తన ఉదరమునుచీల్చెను. (10) అపుడా జఠరము నుండి దధీచి గర్భమగువాడు ,సాక్షాత్తు రుద్రుని అవతారమగు పిప్పలాదుడను గొప్ప కాంతి గలవాడు బయటకు వచ్చెను. (11) అపుడు తల్లి ఆ గర్భమును చూసి నవ్వుతూ కంటినిండా కోపముండగా పిప్పలాదునితో ఈ రావిచెట్టు వద్దవుండి అందరికి ఫలములనిమ్ము అని కుమారునితో మాట్లాడుతూనే పరమసమాది ద్వారా పతిమసమాధి ద్వారా పతిననుసరించెను(12,13) ఇట్లు సాధ్వియగు దధీచపత్ని సువర్చపతితో స్వర్గమునకు వెళ్ళెను. (14)

తే దేవా: కృతశస్త్రాస్త్రా దైత్యాన్‌ ప్రతి సముత్సుకా: | ఆజగ్ముశ్చేంద్రముఖ్యాస్తే పరాక్రమా:|| 15

గురుం పురస్కృత్య తదాజ్ఞయా తే గణా: సురాణాం బహవస్తదానీమ్‌ | భువం సమాగత్య చ మధ్యదేశ మూచుశ్చ సర్వే పరమాస్త్రయుక్తా:|| 16

సమాగతానుపసృత్య దేవాంశ్చేంద్రపురోగమాన్‌ | య¸° వృత్రో మహోదైత్యో దైత్యవృన్దసమావృత:|| 17

యథా మేరోశ్చ శిఖరం పరిపూర్ణం ప్రదృశ్యతే| తథా సోపి మహాతేజా విశ్వకర్మసుతో మహాన్‌|| 18

తేన దృష్టో మహేంద్రశ్చ మహేంద్రేణ మహాసుర: | దేవానాం దానవానాం చ దర్శనం చ మహాద్బుతమ్‌ ||19

తదా తే బద్దవైరాశ్చ దేవదైత్యా: పరస్పరమ్‌| అన్యోన్యమభిసంరబ్దా జగర్జు: పరమాద్భుతమ్‌||20

గొప్ప బలపరాక్రమములు గల ఇంద్రుడు మొదలగు దేవతలు శస్త్రములను అస్త్రములను తయారుచేసి కొని ఉత్సుకతతో దైత్యులను ఎదుర్కొనిరి.(15) దేవతాగణములనేకములుగా దేవగురువు యొక్క ఆజ్ఞచే, అతనిని ముందిడుకొని మధ్యదేశ##మైన భూలోకమునకు అస్త్రములు ధరించవచ్చిరి.(16) ఇంద్రుడు మొదలైన దేవతలురాగా వారిని మహాదైత్యుడైన వృత్రుడు తన దైత్య సమూహములతో వచ్చిచేరెను (17) మేరు పర్వత శిఖరమెట్లు పరిపూర్ణముగా కనబడునో అట్లే గొప్ప తేజస్సు గలవాడు.విశ్వకర్మ పుత్రుడు వృత్రుడు కనబడెను(18) వృత్రుడు మహేంద్రుని, మహేంద్రుడు వృత్రుని చూచెను. దేవదానవులు మహాద్బుతముగా నుండెను.(19) అపుడు,శత్రుభావముగల దేవదైత్యులు ఒకరినొకరు దెబ్బతీయుటకు అత్యద్బుతముగా గర్జించిరి.(20)

వాదిత్రాణి చ భీమాని వాద్యమానాని సర్వశ: | శ్రూయంతేత్ర సురాసురసమాగమే || 21

వాద్యమానేషు తూర్వేషు తే సర్వే త్వరయాన్వితా అనేకై శస్త్రసంఘాతైర్జఘ్నరన్యో న్య మోజసా:22

తదా దేవా సురే యుద్దే త్రైలోక్యం సచరాచరమ్‌ | భ##యేన మహతా యుక్తం బభూవ గతచేతనమ్‌||23

ఛేదితా: స్ఫోటితాశ్చైవ కేచిచ్చస్త్రెర్ద్విధాకృతా: | నారాచైశ్చ తథా కేచిచ్చ్రస్త్రాసై#్త్ర: శకలీకృతా :|| 24

భ##ల్లైశ్చేరుర్హతా: కేచిద్వ్యంగభూతా దివౌకస:| రశ్మయో మేఘసంభూతా ప్రకాశంతే నభస్వివ:|| 25

శిరాంసి పతితాన్యేన బహుని చ నభస్తలాత్‌| నక్షత్రాణీవ చ యథా మహాప్రళయసంతులమ్‌|| 26

ప్రవర్తితం మధ్యదేశే సర్వభూతక్షయావహమ్‌ | శ##క్రేణ సహ సంగ్రామం చకార నముచిస్తదా|| 27

దేవదానవుల యుద్ద సమయమున భయం కరమైన వాద్యాలు మ్రోగింపబడినవి (21) అపుడు అందరూ త్వరగా శస్త్రముల గ్రహించి ఒకరినొకరు శస్త్రములచే బాధింపసాగిరి (22) ఆ యుద్దములో అపుడట్లు ప్రవర్తింపగా చరాచరములతో గూడినముల్లోకములు గొప్పభయముతో చెతన్యమును గోల్పోయినవి (23) కొందరు నరకబడిరి, మరికొందరు దెబ్బతీయబడిరి. కొందరు రెండుముక్కలుగా నరకబడిరి . లోహపు మెనగల బాణము చేత మరియు ఇతర ఆయుధముల చేత ఒకరినొకరు బాధించుకొనిరి. (24) దేవతలు కొందరు అంగములను కోల్పోయి భల్లులతో చరించుచూ, అవకాశమున మేఘములతో కూడి ప్రకాశించు కిరణముల వలెనుండిరి. (25) అకాశ తలమునుండి అనేకముగా తలలు మహా ప్రళయసమాయాన నక్షత్రాలవలె నేలరాలినవి.(26) అట్లు భూలోకమున అన్ని ప్రాణులకు నాశనమును కలిగించు యుద్దము ఇంద్రునికి, నముచికి మధ్య జరిగెను(27)

వజ్జేణ జఘ్నే తరసా నముచిం దేవరాట్‌ స్వయమ్‌| న రోమైకం చ త్రుటితం నముచేరసురస్య చ|| 28

వజ్రేణాపి తదా సర్వే విస్మయం పరమం గతా: అసురాశ్చ సురాశ్చైవ మహేంద్రో వ్రీడితస్తదా||29

గదయా నముచిం జఘ్నే గదా సాపి విచూర్ణితా| నముచేరంగలగ్నాపి పపాత వసుధాతలే||30

తథా శూలేన మహతా తం జఘాన పురందర: |తచ్చూలం శతథా చూర్ణం నముచేరంగమాశ్రితమ్‌||31

ఏవం తం వివిధై: శ##స్తెరాజఘాన సురారిహో | ప్రవాస్యమానో నముచిర్న జఘాన పురందరమ్‌|| 32

తూష్ణీం భూతస్తదా చేంద్రశ్చింతయా పరయా యుత: |కిం కార్యం కిమకార్యం వా ఇతీంద్రో నావిదత్తదా||33

ఇంద్రుడు స్వయముగా వజ్రయుధముతో నముచిని దెబ్బతీసిననూ ఏమీ చేయలేకపోయెను.(28) అది చూచిసురాసురులంతా గొప్ప ఆశ్చర్యాన్ని పొందిరి. ఇంద్రుడు సిగ్గుపడినాడు (29) ఇంద్రుడు గదతో నముచిని కొట్టగా, నముచి శరీరానికి తాకి అది చూర్ణమై నేలరాలెను (30) అపుడు గొప్ప శూలముతో నముచిని కొట్టెను కాని అదికూడా నముచి శరీరానికి తాకి వంద ముక్కలయినది.(31) ఇట్లు పలురకాల శస్త్రములతో ఇంద్రుడు నముచి మాత్రము నవ్వుచూ, ఇంద్రుని కొట్టలేదు. ఇంద్రుడు మిన్నకుండి చింతింపసాగెను ఏమి చేయాలో అతని కపుడు తెలియలేదు (33)

ఏతస్మిన్నంతరే తత్ర మహాయుద్దే మహాభ##యే |జాతానభోగతా వాణీ ఇంద్రముద్దిశ్య సత్వరమ్‌||34

జహ్యేనమద్యాశు మహేంద్ర దైత్యం దివౌకసాం ఘోరతరం భయావహమ్‌| ఫేనేన చైవాశు మహాసురేంద్ర మపాం సమీపేన దురాసదేన || 35

అన్యేన శ##స్త్రేణ చ అహతోసౌ వధ్య: కదాచిన్న భవత్యయం తు | తస్మాచ్చ దేవేశ వదార్దమస్య కురు ప్రయత్నం నముచేర్దురాత్మన:|| 36

నిశమ్య వాచం పరమార్థయుక్తాం దైవీం సదానందకరీం శుభావహమ్‌ | చక్రే పరం యత్నవతాం వరిష్టో గత్యోదధే : పారమనన్తవీర్య:|| 37

తత్రాగతం సమీక్ష్యాథ నముచి: క్రోదమూర్చిత:| హత్వా శూలేన దేవేంద్రం ప్రహసన్నిదమబ్రవీత్‌|| 38

ఇంతలో మహాభయంకరమైన ఆ గొప్పయుద్దములో ఆకాశవాణి ఇంద్రుని ఉద్దేశించి ఇట్లనెను (34) మహేంద్రా! దేవతలకు గొప్ప భయమును కలిగించు ఈ దైత్యుని సమీపించశక్యము గాని సముద్రము వద్ద నీటి నురుగుతో నేడు త్వరగా వధింపుము (35) వేరే శస్త్రముతో ఇతనిని వధించవీలు లేనందున, మహేంద్రా ఇతని వధకై యత్నము చేయుము (36) అని పలుకగా , ఆనందమును, శుభమును కలిగించు ఆ దేవతా సంబంధి వాక్కును గొప్ప అర్థము కలదానిని విని ఇంద్రుడు నముచిని వధించు ప్రయత్నములో సముద్ర తీరమును చేరెను. (37) అక్కడికి వచ్చిన ఇంద్రుని చూచి నముచి క్రోధముతో ఒళ్ళు మరిచెను. దేవేంద్రుని శూలముతో బాధించి నవ్వుతూ ఇట్లనెను (38)

సముద్రస్య తట: కస్మాత్సేవిత: సురసత్తమ |విహాయ రణభూమిం చ త్యక్తశస్త్రోభవద్భవాన్‌|| 39

త్వదీయేనైన వజ్రేణ కిం కృతం మమదుర్మతే ||40

తథాన్యాని చ శస్త్రాణి అస్త్రాణి సుబహుని చ | గృహీతాని పురా మందా హంతుం మామేవ చాధునా|| 41

కిం కరిష్యసి మాం హంతుం యుద్దాయ సముపస్థిత:| కేన శ##స్త్రేణ రే మంద యోద్దుమిచ్చసి సంయుగే||42

త్వాం ఘాతయామి చాద్యైవ యది తిప్ఠసి సంయుగే | నో చేద్గచ్చ మయా ముక్తశ్చిరం జీవ సుఖీ భవ|| 43

ఏవం స గర్వితం తస్య వాక్యమాహవశోభిన:| శ్రుత్వా మహేంద్రోపి రుషా జగృహే ఫేనమద్బుతమ్‌|| 44

ఫేనం కరస్థం దృష్ట్యా తు అసురా జహసుస్తదా||45

దేవశ్రేష్టా! రణభూమిని విడిచి ఆయుధాలను వదలి ఈ సముద్ర తటమునెందుకు చేరితిని (39)

దుర్మతీ! నీ వజ్రము నన్నేమి చేసినది? (40) ఇంతకు ముందు అనేక రకాల ఆయుధాలను నన్ను వధించుటకు అనేక రకాల ఆయుధాలను నన్ను విధించుట గ్రహించితిని.(41)

ఇపుడు యుద్దము చేయవచ్చిన నీవు నన్ను వధించుటకు ఏ శస్త్రమును తీసుకొనదలిచావు? యుద్దము ఏ శస్త్రముతో నన్ను దెబ్బతీసెదవు(42) యుద్దమున ఇంకనూ నీవు నిలిచిన నేడే నిన్ను వధించెను. లేనిచో నేను వదిలివేసిన వెళ్ళి సుఖంగా చాలాకాలం జీవించు,(43) ఇట్లు గర్వించిన నముచి పలుకగా యుద్దమున ఉచితమైన దానిని విని మహేంద్రుడు కూడా రోషముతో సురుగును అందుకొనెను(44) ఇంద్రుని చేతిలోని నురుగును చూచి ఆసురులంతా నవ్విరి (45)

క్షయం గతాని చాస్త్రాణి ఫేనేనైవ పురందర: హంతుమిచ్ఛతి మామద్య శతక్రతురుదారధీ:|| 46

ఏవం ప్రహస్య నముచిరవజ్ఞాయ పురందరమ్‌ | సావజ్ఞం పురతస్తస్దౌ నముచిర్దైత్యపుంగవ:||47

తదైవ తం స ఫేనేన శీఘ్రమింద్రో జఘాన హ||48

హతే తు నముచౌ దేవాస్సర్వే చైవ ముదాన్వితా:| సాధుసాధ్విది శ##బ్దేన ఋషయశ్చాభ్య పూజయన్‌||49

తదా సర్వే జయం ప్రాప్తా హత్వా నముచిమాహవే | దైత్యాస్తే కోపసంరబ్ధా యోద్దుకామా ముదాన్వితా:||50

పున: ప్రవవృతే యుద్దం దేవానాం దానవైస్సనా | శస్త్రాసై#్త్రర్బహుధా ముక్తై: పరస్పరవదైషిభి:||51

యదా తే హ్యసురా దేవై: పాతితాశ్చ పున:పున: | తదా వృత్రో మహాతేజా: శతక్రతుముపావ్రజత్‌|| 52

వృత్రం దృష్ట్యా తదా సర్వే సురాసురమానవా:| భ##యేన మహతావిష్టా:పతితా భువి శేరతే||53

ఏవం భీతేషు సర్వేషు నరసిద్దేషు వై తదా | ఇంద్రశ్చైరావణారూఢో వజ్రపాణి: ప్రతాపవాన్‌||54

ఛత్రేణ ధ్రియమాణన చామరేణ విరాజిత:| తదా సర్వైస్సమేతో హి లోకపాలై: ప్రతాపిత:||55

వృత్రం విలోక్యతే సర్వే లోకపాలా మహేశ్వరా: |భయభీతాశ్చ తే సర్వే శివం శరణమన్వయ:||56

అస్త్రాలన్నీ నశించినవి. ఇక ఇంద్రుడు నురుగును తీసుకొని నన్నీవాడు వధింప దలిచినాడు (46) అని నవ్వి నముచి ఇంద్రుని అవమానపరిచినాడు. అవమానముచేయుచూ ఇంద్రుని ఎదుట నిలిచాడు(47) అపుడు ఇంద్రుడు నురుగుతో నముచిని కొట్టెను. (48) నముచి మరణించగాచ, దేవతలంతా సంతోషించిరి. ఋషులుబాగు బాగు అని ఇంద్రుని కొనియాడిరి.(49)నముచిని చంపి దేవతలంతా సంతోషముగా నుండగా దైత్యులు కోపించి యుద్దము చేయవచ్చిరి.(50)అపుడు దేవదానవులకు మరల యుద్దము జరిగెను. ఒకరినొకరు వధించు కోరికతో శస్త్రాస్త్రాములను విడిచిరి.(51) దేవతల చేతిలో అసురులు మరల మరల నేలకూలగా ,గొప్ప తేజస్సుగల వృత్రుడు ఇంద్రుని సమీపించెను.(52)అపుడు దేవతలు దానవులు,మానవులు వృత్రుని జూచి భయపడి భూమిపై పడిరి(53) ఇట్లు అందరూ భయపడగా , ఇంద్రుడు వజ్రమునుచేత ధరించి ఐరావతమునెక్కి(54)ఛత్రచామరములు కలిగి లోకపాలురందరితో కలిసి వచ్చెను. (55) శక్తి కలిగిన లోకపాలురంతా వృత్రుని జూచి భయమునొంది శివుని శరణుజొచ్చిరి.(56)

మనసా చింతయన్‌ సర్వే శంకరం లోకశంకరమ్‌ | లింగం సంపూజ్య విధివన్మహేంద్రో జయకాముక :|| 57

గురుణా విదిత :సద్యో విశ్వాసేన పరేణ హి| ఉవాచ చ తదా శక్రం బృహస్పతిరుదారధీ:||58

బృహస్పతిరువాచ:

కార్తికే శుక్లపక్షే తు మందవారే త్రయోదశీ | సమగ్రా యది లభ్యేత సర్వప్రాపై#్త్య న సంశయ:|| 59

తస్యాం ప్రదోషసమయే లింగరూపీ సదాశివ:| పూజనీయో హి దేవేంద్ర సర్వకామార్ధసిద్దయే ||60

స్నాత్వా మధ్యాహ్నసమయే తిలామలకసంయుతమ్‌ | శివస్య చార్చనం కుర్యాద్గందపుష్పఫలాదిభి:||61

పశ్చాత్ర్పదోషవేళాయాం స్థావరం లింగమర్చయేత్‌ | స్వయంభు స్థాపితం చాపి పౌరుషేయమపౌరుషమ్‌||62

జనే వా విజనే వాపి అరణ్య వా తపోవనే | తల్లింగమర్చయేద్భక్త్యా ప్రదోషే తు విశేషత:||63

అందరూ లోకములకు శుభమును కలిగించు శంకరుని మనస్సులో ధ్యానించిరి. జయమును కోరుచున్న మహేంద్రుడు విధిపూర్వకముగా లింగమును పూజించెను. (57) ఉదారబుద్ది గల బృహస్పతి వెంటనే ఇంద్రునుద్దేశించి ఇట్లనెను.(58) కార్తీక శుక్ల పక్షము శనివారము పూర్తిగా త్రయోదశి యుండి లభించిన కార్యసిద్ది జరుగును. సంశయము లేదు (59) ఆరోజు ప్రదోష సమయాన లింగరూపముననున్న సదాశివుని పూజించిన అన్ని కోరికలు తీరును (60)మధ్యాహ్నసమయాన స్నానము చేసి, నువ్వులు, ఉసిరికలతో, గంధము, పుష్పములు ఫలములు మొదలగు వానితో శివుని అర్చించవలెను. (61)తరువాత, సాయంకాలమున,స్థిరముగా నున్న లింగమును, తనకు తానే వెలిసినది గానీ, స్థాపించినదానిని గాని, స్థాపించిన దానిని గాని ఎవరో ఒకరిచే వుంచబడినదానిని లేదా స్వయముగా నున్న దానిని అర్చించవలెను. (62) జనమధ్యమున గాని, ఏకాంతమున గానీచ అరణ్యమునందైనా తపోవనమునందైన శివలింగమును విశేషముగా ప్రదోషసమయాన అర్చించవలెను.(63)

గ్రామాద్బహి: స్థితం లింగం గ్రామాచ్చతగుణం ఫలమ్‌ | గ్రామ్యాచ్ఛతగుణం పుణ్యమరణ్య లింగమద్బుతమ్‌|| 64

ఆరణ్యాచ్చతగుణం పుణ్యమర్చితం పార్వతం యథా| పార్వతాచ్పైవ లింగాచ్చ ఫలం చాయుతసంజ్ఞితమ్‌|| తపోవనాశ్రితం లింగం పూజితం వా మహాఫలమ్‌ ||65

తస్మాదేతద్విభాగేన శివపూజార్చనం బుధై:| కర్తవ్యం నిపుణత్వేన తీర్థస్నానాదికం తథా||66

పంచపిండాన్‌ సముద్దృత్య స్నానమాత్రేణ శోభనమ్‌ | కూపే స్నానం ప్రకుర్వీత ఉద్దృత్య స్నానమాచరేత్‌|67

నదీస్నానం విశిష్టం చ మహానద్యాం విశేషత:||68

సర్వేషామపి తీర్దానాం గంగాస్నానం విశిష్యతే | దేవఖాతే చ తత్తుల్యం ప్రశస్తం స్నానమాచరేత్‌|| 69

గ్రామముననున్న శివలింగమును పూజించిన దానికంటే నూరు రెట్లు అధికఫలము గ్రామము వెలువల నున్న లింగార్చనచే కలుగును. అంతకంటే నూరురెట్లు ఫలము అరణ్యముననున్న లింగమునర్చించుటచే కలుగును.(64) దానికంటే నూరురెట్లు పర్వతముపైనున్న లింగమును పూజించుటచే, అంతకంటే పదివేల రెట్లు తపోవనముననున్న లింగమునర్చించుటచే కలుగును.(65)కనుక ఈ విభాగముతో విజ్ఞులు శివపూజను చేయవలెను. అట్లే తీర్ధస్నాము మొదలైన వానిని నిపుణముగా చేయవలెను.(66) అచట పంచపిండములను సమర్పించి స్నానము చేయుట ఉత్తమమైనది కూపమునుండి వీటిని గ్రహించి స్నానము చేయవలెను. చెరువు వద్ద దశపిండములను సమర్పించి స్నానము చేయవలెను.(67) నదీస్నానము, విశేష గుణము కలది. అందులోనూ మహా నదిలో స్నానము చేయుట అధికఫలమునిచ్చును. (68) అన్ని తీర్థములలోనూ గంగయందు స్నానమాడుట విశేషము, అందునూ ,సహజముగా ఏర్పడిన జలాశయమునందు స్నానము శ్రేష్ఠము(69)

ప్రదీపానాం సహస్రేణ దీపనీయ: సదాశివ:| తథా దీపశ##తేనాపి ద్వాత్రింశద్దీపమాలయా||70 ఘృతేన దీపయేద్దీపాన్‌ శివస్య పరితుష్టయే| తథా ఫలైశ్చ దీపైశ్చ నైవేద్యైర్గంధధూపకై:||71

ఉపచారై: పోడశభిర్లింగరూపీ సదాశివ:| పూజ్య ప్రదోషవేళాయాం నృభి: సర్వార్ధసిద్దయే||72

ప్రదక్షిణం ప్రకుర్వీత శతమష్టోత్తరం తథా | నమస్కారాన్‌ ప్రకుర్వీత తావత్‌ సంఖ్యాన్‌ ప్రయత్నత:||73

ప్రదక్షిణనమస్కారై: పూజనీయస్సదాశివ: | నామ్నాం శ##తేన రుద్రోసౌ స్తవనీయో యథావిధి||74

వేయి లేదా నూరు లేదా ముప్పది రెండు దీపముల మాలతో శివుని అర్చించవలెను.(70) శివుని తృప్తి కలిగించుటకై నేతితో దీపముల వెలిగించవలెను. అట్లే పళ్ళు, దీపము,లు, నైవేద్యములు, గంధము, ధూపము మొదలగునవి సమర్పింపవలెను.(71)షోడశోపచారములతో ప్రదోషవేళయందు శివుని లింగరూపమున పూజించిన నరులకు కోరికలన్నీ తీరును.(72) నూటా ఎనిమిది మార్లు ప్రదక్షిణము చేసి, అన్నిమార్లు నమస్కారము చేయవలెను.(73) ప్రదక్షిణ నమస్కారములతో సదాశివుని పూజింపవలెను. శివుని నూరుపేర్లతో యథావిధిగా స్తుతింపవలెను.(74)

నమో రుద్రాయ భీమాయ నీలకణ్ఠాయ వేధసే | కపర్దినే సురేశాయ వ్యోమకేశాయ వై నమ:|| 75

వృషధ్వజాయ సోమాయ నీలకణ్ఠాయ వై నమ: | దిగంబరాయ భర్గాయ ఉమాకాంత కపర్దినే ||76

తమోమయా వ్యాప్తాయ శిపివిష్టాయ వై నమ:| వ్యాళప్రియాయ వ్యాళాయ వ్యాళానాం పతయే నమ:|| 77

మహీధరాయ వ్యాఘ్రాయ పశూనాం పతయే నమ: | త్రిపురాంతకసింహాయ శార్దూలోగ్రరవా చ || 78

మీనాయ మీననాథయ సిద్దాయ పరమేష్టినే| కామాంతకాయ బుద్దాయ బుద్దీనాం పతయే నమ: 79

కపోతాయ విశిష్టాయ శిష్టాయ పరమాత్మనే| వేదాయ వేద బీజాయ దేవగుహ్యాయ వై నమ:||80

దీర్ఘాయ దీర్ఘదీర్ఘాయ దీర్ఘార్ఘాయ మహాయ చ | నమో జగత్ర్పతిష్ఠాయ వ్యోమరూపాయ వై నమ:|| 81

రుద్రునకు , భీమునకు , నీలకణ్ఠునకు , వేధకు, కపర్దునకు ,సురేశునకు, వ్యోమకేశునకు నమస్కారము(75) వృషధ్వజునకు సోమునకు, నీలకణ్ఠునకు, దిగంబరునకు, భర్గునకు, ఉమాకాంతునకు, కపర్దికి నమస్కారము (76) తమోమయునకు, వ్యాప్తునకు, శిపివిష్టునకు, వ్యాళప్రియునకు, వ్యాళునకు వ్యాళపతికి నమస్కారము.(77)మహీధరునకు, వ్యాఘ్రనకు, పశుపతికి, త్రిపురాంతకునకు,సింహునకు, శార్దూలోగ్రరవునకు నమస్కారము(78)మీనునికిచ మీననాధునికి , సిద్దునికి,పరమేష్టికి, కామాంతకునికి, బుద్దునకు, బుద్దిపతికి నమస్కారము(79) కపోతునకు, విశిష్ఠునకు, శిష్ఠునకు, పరమాత్మకు, వేదునకు, వేద బీజమునకు, దేవగుహ్యునకు నమస్కారము,(80) దీర్ఘునకు, దీర్ఘదీర్ఘునకు, దీర్ఘార్ఘునకు, మహునకు, జగత్ప్పతిష్ఠునకు, వ్యోమరూపునకు నమస్కారము.(81)

గజాసురవినాశాయ హ్యంధకాసురభేదినే | నీలలోహితశుక్లాయ చణ్ణముణ్ణప్రియాయ చ||82

భక్తప్రియాయ దేవాయ జ్ఞానజ్ఞానావ్యయాయ చ | మహేశయ నమస్తుభ్యం మహాదేవహరాయ చ||83

త్రినేత్రాయ త్రివేదాయ వేదాంగాయ నమో నమ:| అర్ధాయ అర్థరూపాయ పరమార్ధాయ వై నమ:||84

విశ్వరూపాయ విశ్వాయ విశ్వనాథాయ వై నమ: | శంకరాయ చ కాలాయ కాలావయవరూపిణ||85

అరూపాయ చ సూక్ష్మాయ సూక్ష్మసూక్ష్మాయ వై నమ: |శ్మశానవాసినే తుభ్యం నమస్తే కృత్తివాససే||86

శశాంకశేఖరాయైవ రుద్రవిశ్వాశ్రయాయ చ | దుర్గాయ దుర్గసారాయ దుర్గావయవసాక్షిణ|| 87

లింగరూపాయ లింగాయ లింగానాం పతయే నమ: | నమ :ప్రణవరూపాయ ప్రణవార్ధాయ వైనమ:||88

నమోనమ: కారణకారణాయ తే మృత్యుంజయామాత్మ భావస్వరూపిణ || త్రియంబకాయాసితకంఠభర్గ గౌరీపతే సకలమంగళ##హేతవే నమ:||89

గజాసుర వినాశునకు, అంధకాసురభేదికి, నీలలోహిత శుక్లునకు, చణ్డముణ్డ ప్రియునకు నమస్కారము(82) భక్త ప్రియునకు, దేవునకు, జ్ఞానాజ్ఞాన అవ్యయునకు, మహేశునకు, మహాదేవహరునకు నీకు నమస్కారము.(83) త్రినేత్రునకు,త్రివేదునకు, వేదాంగునకు, అర్థునుకి, అర్థరూపునికి, పరమార్థునికి నమస్కారము.(84) విశ్వరూపునకు, విశ్వునకు, విశ్వనాథునకు,శంకరునకు, కాలునకు, కాలావయవ రూపునకు నమస్కార ము.(85) అరూపునకు, సూక్ష్మునకు, సూక్ష్మసూక్ష్మునకు, కృత్తివాసునకు నమస్కారము.(86)శశాంకఖేఖరునికి, రుద్రునికి ,విశ్వాశ్రయునికి, దుర్గునికి, దుర్గసారమునగు వానికి, దుర్గావయవ సాక్షికి(87)లింగరూపునకు, లింగునికి, లింగపతికి, ప్రణవ రూపునికి, ప్రణవార్థమునకు నమస్కారము.(88) కారణమునకు కారణమగు వానికిచ మృత్యుంజయునకు , ఆత్మభవస్వరూపికి, త్ర్యంబకునికి, అసితికణ్ఠునకు, భర్గునకు,గౌరీపతికి, సకల మంగళ##హేతువునకు నమస్కారము.(89)

బృహస్పతిరువాచ:

నామ్నాం శతం మహేశస్య ఉచ్చార్యం వ్రతినా తదా: ప్రదక్షిణనమస్కారైరేతత్సంఖై: ప్రయత్నత:| కార్యం ప్రదోషసమయే తుష్ట్యర్థం శంకరస్య చ ||90

ఏవం వ్రతం సముద్దిష్టం తవ శక్ర మహామతే| శీఘ్రం కురు మహాభాగ పశ్చాద్యుద్దం కురు ప్రభో|| 91

శంభో: ప్రసాదాత్‌ సర్వం తే భవిష్యతి జయాదికమ్‌||92

వృత్రో హ్యయం మహాతేజా దైతేయస్తపసాపురా| శివం ప్రసాదయామాస పర్వతే గంధమాదనే||93

నామ్నా చిత్రరథో రాజా వనం చిత్రరథస్యతత్‌| ఏతజ్జానీహి భో ఇంద్ర శివపుర్యా: సమీపత:|| 94

యస్మిన్వనే మహాభాగ న సంతి చ షడూర్మయ:| తస్మాచ్చైత్రరథం నామ వనం పరమమంగళమ్‌|| తస్య రాజ్ఞ: శివేనైవ దత్తం యానం మహాద్భుతమ్‌|| 95

కామగం కింకిణీయుక్తం సిద్దచారణసేవితమ్‌ | గంధర్వైరప్సరోయక్షై: కిన్నరైరుపశోభితమ్‌|| 96

తతస్తేనైవ యానేన పృథివీం పర్యటన్పురా| తథా గిరిశముఖ్యాంశ్చ ద్వీపాంశ్చ వివిధాంస్తథా|| 97

బృహస్పతి పలికెను: అపుడు వ్రతము గ్రహించినవాడు శివుని నూరు నామములను చదవవలెను అన్ని ప్రదక్షిణాలను, నమస్కారాలను ప్రయత్న పూర్వకముగా చేయవలెను. శంకరుని ప్రీతికై వీనిని సాయం సమయాన చేయవలెను. (90) ఇంద్రా! ఇట్లు నీవు వ్రతము చేయదగినది ముందు వ్రతము చేసి తరువాత యుద్దము చేయుము.(91) శివుని ప్రసాదముచే నీకు జయము మొదలగునవి ప్రాప్తించును. (92)ఈ వృత్రుడను గొప్ప తేజస్సు గల దైత్యుడు పూర్వము గంధమదవ పర్వతము మీద తపస్సు చేసి శివుని ప్రసన్నుని చేసికొనెను. (93) అపుడతను చిత్రరథుడను రాజు. ఆ వనమూ అతనిదే ఇంద్రా! శివపురికి నమీపాననున్న వనమతనిదే(94) ఆవనమున అతివృష్టి అనావృష్టి, మూషిక, శలభ,శుక అత్యాసన్నరాజులను ఆరు పీడలు లేవు. కనుక ఆ వనము అత్యంత ముంగళ##మైనది. ఆ రాజునకు శివుడే గొప్ప యానమునొకదానినిచ్చెను(95)అది తన స్వామి కోరిక ననునరించి వెళ్ళునది. కింకిణీ వాద్యములు గలది. సిద్దచారణులచేత సేవింపబడినది. గంధర్వ, యక్ష, అప్పరస, కిన్నరులచేత శోభించునది.(96)ఆ వాహనము పైననే పూర్వము వృథివిని,గిరిశముఖ్యులను, వివిధ ధ్వీపములను పర్యటించెను.(97)

ఏకదా పర్యటన్రాజా నామ్నా చిత్రరథో మహాన్‌| కైలాసమాగతస్తత్ర స దదర్శపరాద్బుతమ్‌|| 98

సభాతలం మహేశస్య గణౖశ్చైవ విరాజితమ్‌ | అర్థాంగలగ్నయా దేవ్యా శోభితం చ మహేశ్వరమ్‌||99

నిరీక్ష్య దేవ్యా సహితం సదాశివం దేవ్యాన్వితం వాక్యమిదం బభాషే|| 100

వయం చ శంభో విషయాన్వితాశ్చ మంత్ర్యాదయ: స్త్రీజితాశ్చాపి చాన్యే | న లోకమధ్యే వయమేవ చాజ్ఞా: స్త్రీసేవనం లజ్జయా నైవ కుర్మ:||101

ఏతద్వాక్యం నిశమ్యాథ మహేశ: ప్రహసన్నివ| ఉవాచ న్యాయసంయుక్తం సర్వేషామపి శృణ్వతామ్‌ ||102

భయం లోకాపవాదాచ్చ సర్వేషామపి నాన్యథా| గ్రాసితం కాలకూటం చ సర్వేషామపి దుర్జరమ్‌|| 103

తథాపి ఉపహసో మే కృతో రాజ్ఞా హి దుర్జర: తం చిత్రరథమాహుయ గిరిజా వాక్యమబ్రవీత్‌||104

ఒకప్పుడు చిత్రరథుడను రాజు పర్యటించుచు కైలాసమునకు వచ్చి అద్భుతము నొకదానిని చూచెను.(98)మహేశుని సభాతలము గణములతో ప్రకాశించుచున్నది. శివుడు అర్ధాంగమునకు అంటుకొనియున్న పార్వతితో యుండగా చూచెను.(99) దేవితో నున్న శివుని చూచి ఇట్లనెను.(100) ఓ శంకరా:! మేమంతా విషయములతో కూడియున్న వారము మంత్రి మొదలగు వారమంతా స్త్రీకి వశులము. లోకమున మేమే అజ్ఞలము కాము, లజ్ఞతో స్త్రీ సేవనము చేయనే చేయుము అదివిని మహేశ్వరుడు నవ్వుచూ అందరూ వింటూ వుండగా న్యాయసమ్మతమైన మాటను చెప్పెను.(102) అందరికీ లోకాపవాదమునుండే భయము వేరే రకంగా కాదు అందరూ జీర్ణము చేసుకోలేని కాలకూటమును మింగితిని.(103) అయినప్పటికీ రాజు సహింపలేని అవమానమును చేసెను. అపుడు చిత్రరథుని పిలిచి పార్వతి ఇట్లనెను (104)

గిరిజోవాచ-

రే దురాత్మన్‌ కథం త్వజ్ఞ శంకరశ్చోపహాసిత: | మయా సహైవ మందాత్మన్‌ ద్రక్ష్యసే కర్మణ: ఫలమ్‌|| 105

సాధూనాం సమచిత్తానాముపహాసం కరోతి య:| దేవో వాప్యథవా మర్త్య: స విజ్ఞేయోధమాధమ:|| 106

ఏతే మునీంద్రాశ్చ మహానుభావా స్తథా హ్యమీ ఋషయో వేదగర్భా:| తథైవ సర్వే సనకాదయో హ్యమీ అజ్ఞాశ్చ సర్వే శివమర్చయంతే ||107

రే మూఢ సర్వేషు జనేష్వభిజ్ఞస్త్యమేక ఏవాద్యన చాపరే జనా: తస్మాదభిజ్ఞం హి కరోమి దైత్యం దేవైర్ద్విజైశ్చాపి బహిష్కృతం త్వామ్‌||108

ఏవం శప్తస్తయా దేవ్యాభవాన్యా రాజసత్తమ: రాజా చిత్రరథ: సద్య:పపాత సహసా దివ:|| 109

అసురీం యోనిమాసాద్య వృత్రో నామ్నాభవత్తదా | తపసా పరమేణౖవ త్వష్ట్రా సంయోజిత: క్రమాత్‌|| 110

తపసా తేన మహతా అజేయో వృత్ర ఉచ్యతే| తస్మాచ్చంభుం సమభ్యర్చ్య ప్రదోషే విధినాzధునా ||111

జహి వృత్రం మహాదైత్యం దేవానాం కార్యసిద్దయే | గురోస్తద్వచనం శ్రుత్వా ఉవాచాథ శతక్రతు:|| 112

సోద్యాపనవిధిం బ్రూహి ప్రదోషస్య చ మేzధునా ||

పార్వతి అనెను ఓయీ దురాత్ముడా| మూర్ఖుడా| శంకరునేల పరిహసించితివి? నాతో సహ కర్మఫలమును చూచెదవు? (105) సాధువులు, నిర్వికారులు అగు వారిని ఉపహసించువాడు దేవుడైనా మనుష్యుడైనా వాడు అధమాధముడని తెలుసుకొనవలెను.(106) ఇక్కడున్న మునీంద్రులు, వేదమునకు నెలవైన ఋషులు, సనకాదులందరూ తెలివిలేక శివునర్చించుచున్నారా?(107) మూర్ఖుడా! ఇంతమందిలో నీవొక్కడితే తెలివి గలవాడవా? ఇతరులు కారా? కనుక నిన్ను దేవతలు మరియు బ్రాహ్మణుల చేత బహిష్కృతుడైన దైత్యునిగా చేయుచున్నాను.(108) అని భవానీదేవి చేత శపింపబడిన చిత్రరథుడను రాజు ఒక్కమారుగాస్వర్గమునుండి వెంటనే పడిపోయెను,(109) అసురయోనిని పొంది వృత్రుడని పేరు పొందెను. అపుడు త్వష్ట గొప్ప తపస్సు చేత క్రమముగా వృత్రుని సంయోజితుని చేసెను., (110) అతని తీవ్ర తపస్సువలన వృత్రుడు జయింప వీలులేని వాడాయెను.కనుక నీవు ఇపుడు విధి ప్రకారము ప్రదోష సమయాన శివుని అర్చించుము.(111) దేవతల పని సిద్దించుటకు వృత్రుని వధించుము, అని బృహస్పతి అనగా విని ఇంద్రుడు (112) తనకు ప్రదోషమున చేయు విధిని ఉద్యాపన సహితముగా చెప్పుమనెను.(112)

బృహస్పతిరువాచ-

కార్తికేమాసి సంప్రాప్తే మందవారే త్రయోదశీ| సంపూర్తిస్తు భ##వేత్తత్ర సంపూర్ఱ వ్రత సిద్దయే|| 113

వృషభో రాజత: కార్య: వృష్ఠే తస్య సుపీఠకమ్‌ | తస్త్యోపరి న్యసేద్దేవముమాకాంతం త్రిలోచనమ్‌||114

పంచవక్త్రం దశభుజమర్థాంగే గిరిజాంసతీమ్‌| ఏవం చోమామహేశం చ సౌవర్ణం కారయేద్బుధ:||115

సవృషం తామ్రపత్రే చ వస్త్రేణ పరిగుణ్ణితే | స్థాపయిత్వోమయా సార్థం నానాభోగసమన్వితమ్‌|| 116

విధినా జాగరం కుర్యాద్రాత్రౌ శ్రద్దాసమన్విత: | పంచామృతేన స్నపనం కార్యమాదౌ ప్రయత్నత:117

బృహస్పతి చెప్పెను. కార్తీక మాసమురాగా శనివారమున త్రయోదశి పూర్తిగా వున్నపుడు సంపూర్ఱవ్రతము సిద్దించుటకు, (113) వెండితో ఎద్దు విగ్రహమునుచేయించి దాని వీపు పై పీఠమును చేయించి దాని పై ఉమాపతి యగు త్రిలోచనుని (114)ఐదు తలలు పది భుజములు, సగభాగమున పార్వతి వుండునట్టు బంగారముతో శివుని చేయించవలెను.(115)

వృషభముతో సహా శివుని రాగిరేకున, వస్త్రముతో కప్పి అనేక ఉపచారముతో నిలపవలెను.(116)

రాత్రి సమయాన విధిపూర్వకముగా శ్రద్దతో జాగరణ చేసి, మొదట పంచామృతముతో స్నానము చేయించవలెను.(117)

గోక్షీరస్నానం దేవేశ గోక్షీరేణ మయా కృతమ్‌ | స్నపనం దేవదేవేశ గృహణ పరమేశ్వర|| 118

దధ్నా చైవ మయా దేవ స్నపనం క్రియతేధునా| గృహాణ చ మయా దత్తం సుప్రసన్నో భవాద్య వై||119

సర్పిషా చ మయా దేవ స్నపనం క్రియతేదునా | గృహాణ శ్రద్దయా దత్తం తవ ప్రీత్యర్థమేవ చ || 120

ఇదం మధు మయా దత్తం తవ ప్రీత్యర్థమేవ చ| గృహాణ త్వం హి దేవదేవేశ మమ శాంతిప్రదో భవ: ||121

సితయా దేవదేవేశ స్నపనం క్రియతేధునా గృహాణ శ్రద్దయా దత్తాంసుప్రసన్నో భవ ప్రభో||122

ఏవం పంచామృతేనైవ స్నపనీయో వృషధ్వజ:| పశ్చాదర్ఘ్యంప్రదాతవ్యం తామ్రపత్రేణ ధీమతా|| 123

అనేనైవ చ మంత్రేణ ఉమాకాంతస్య తుష్టయే||

ఓ దేవా! గోక్షీరముతో నే చేసిన ఈ గోక్షీర స్నానమును గ్రహింపుము.(118) ఓపరమేశ్వరా! పెరుగుతో నేనుచేయు దధిస్నానమును గ్రహించి ప్రసన్నుడవు కమ్ము. (119) ఓ దేవా! నీ ప్రీతికై చేయు నేతి స్నానమును శ్రద్ధతో ఇచ్చిన దానిని గ్రహింపుము (120) దేవదేవేశా ! నీ ప్రీతికై తేనె నిచ్చుచున్నాను. గ్రహించు నాకు శాంతినిమ్ము (121) ఓ దేవా ! ఇపుడు శర్కరితో స్నానము చేయించుచున్నాను. శ్రద్దతో ఇచ్చిన దానిని నీవు గ్రహించి ప్రసన్నుడవు గమ్ము!(122) అని ఈ రకంగా శివునికి పంచామృతములతో స్నానము చేయించి తరువాత రాగిపాత్రతో అర్ఘ్యము నివ్వవలెను. శివునిసంతోషమునకై ఇదే మంత్రము చదువవలెను.(123)

అర్ఘ్యోసి త్యముమాకాంత అర్ఘేణానేన వై ప్రభో| గృహాణ త్వం మయా దత్తం ప్రసన్నో భవ శంకర|| 124

మయా దత్తం చ తే సాద్యం పుష్పగంధసమన్వితమ్‌| గృహాణ దేవదేవేశ ప్రసన్నో వరదో భవ|| 125

విష్టరం విష్ణరేణౖవ మయా దత్తం చ వై ప్రభో | శాంత్యర్థం తన దేవేశ వరదో భవ మే సదా|| 126

ఆచనీయం మయా దత్తం తవ విశ్వేశ్వర ప్రభో | గృహాణ పరమేశాన తుష్టో భవ మమాద్య వై|| 127

బ్రహ్మగ్రంథిసమాయుక్తం బ్రహ్మకర్మప్రవర్తకమ్‌ | యజ్ఞాపవీతం సౌవర్ణం మయా దత్తం తవ ప్రభో||128

సుగంధం చందనం దేవ మయా దత్తం చ వై ప్రభో| భక్త్యా పరమయా శంభో సుగంధం మాం భవ || 129

ఓ పార్వతీపతీ ! నీవు పూజ్యుడవు. నేనిచ్చు ఈ అర్ఘ్యమును గైకొని ప్రసన్నుడవు కమ్ము(124) దేవదేవేశా! నీకు నేనిచ్చు ఈ పుష్పమాల గంధముతో కూడుకొనిన పాద్యము గ్రహించి ప్రసన్నుడవై వరముల నిమ్ము.(125) ఆసనమును నీ శాంతి కొరకై ఇచ్చుచుంటివి, ఓ దేవా ! దీనిని గ్రహించి నాకు ఎల్లప్పుడూ వరముల నిమ్ము.(126) ఓ విశ్వేశ్వరా! నేనిచ్చే ఆచమనీయ జలమును గ్రహించి సంతోషము నొందుము. (127) ఓ ప్రభూ! నీకు నేను బ్రహ్మగ్రంథితో కూడుకుని బ్రహ్మకర్మలో ప్రవర్తింపజేయు బంగారపు జంధ్వమునిచ్చు చుంటిని.(128) దేవా! పరమ భక్తితో నేను నీకు చందన సుగంధము నిచ్చుచుంటిని. గ్రహించి నన్ను సుగంధము (పుణ్యము) గల వానిగా చేయుము.(129)

దీపం హి పరమం శంభో ఘృతప్రజ్వలితం మయా | దత్తం గృహేణ దేవేశ మమ జ్ఞానప్రదో భవ|| 130

దీపం విశిష్టం పరమం సర్వౌషధివిజృంభితమ్‌ గృహణ పరమేశాన మమ శాంత్యర్థమేవ చ|| 131

దీపావళిం మయా దత్తాం గృహాణ పరమేశ్వర | ఆరార్తికప్రదానేన మమ తేజ:ప్రదో భవ||132

ఫలదీపాదినైవేద్యతాంబూలాదిక్రమేణ చ | పూజనీయో విధానజ్ఞైస్తస్యాం రాత్రౌ విశేషత:|| 133

పశ్చాజ్జాగరణం కార్యం గృహే వా దేవతాలయే | వితానమణ్డపం కృత్వా నానాశ్చర్యసమన్వితమ్‌||134

అనేనైవ విధానేన ప్రదోషోద్యాపనే విధి: కార్యో విధిమతా శక్ర సర్వకార్యార్థసిద్దయే|| 135

ఓ శివా! నేతితో వెలిగించిన ఈ దీపమును గ్రహించి నాకు జ్ఞానము నిమ్ము.(130) నా శాంతికై అన్ని ఔషదులతో వెలిగించిన విశిష్ట దీపమును గ్రహింపుము.(131) పరమేశ్వరా! దీపముల వరుసను ఇచ్చుచుంటిని గ్రహించి, ఆరార్తిక ప్రదానము చేత నాకు తేజస్సు నిమ్ము.(132) ఇట్లా రాత్రియందు విశేషముగా ఫలములు, దీపములు, నైవేద్యము , తాంబూలము మొదలైన క్రమముగా విధానమును తెలిసి పూజింపవలెను,(132) తరువాత ఇంటిలో గానీ దేవాలయమున గానీ జాగరణము చేయవలెను. అనేక విశేషములతో కూడిన మండపమును నిర్మించి, గీత, వాదిత్ర, నృత్యములచే సదాశివుని పూజింపవలెను.(134) ఇంద్రా! ఇదే విధానముతో ప్రదోషమున ఉద్యాపనము అన్ని పనులు నెరవేరుటకై చేయవలెను.(135)

గురుణా కథితం సర్వం తచ్చకార శతక్రతు:| తేనైవ చ సహాయేన ఇంద్రో యుద్దపరాయణ:||136

వృత్రం ప్రతి సురై:సార్థం యుయుధే చ శతక్రతు: తుములం యుద్దమభవద్దేవానాం దానవైస్పహ|| 137

తస్మిన్‌ సుతుములే గాఢే దేవదైత్యక్షయావహే | ద్వంద్వయుద్దం సుతుములమతివేలం భయావహమ్‌||138

వ్యోమో యమేన యుయుధే హ్యగ్నినా తీక్షకోపన:| వరుణన మహాదంష్ట్రో వాయునా చ మహాబల:||139

ద్వంద్వయుద్దరతా: సర్వే అన్యోన్యబలకాంక్షిణ:||140

తథైవ తే దేవవరా మహాభుజా: సంగ్రామశురా జయినస్తదాభవన్‌ | పరాజయం దైత్యవరాశ్చ సర్వే ప్రాప్తాస్తదానీం పరమం సమంతాత్‌ ||141

దృష్ట్యా సురదైత్యవరాన్‌ పరాజితాన్‌ పలాయమానానథ కాందిశీకాన్‌| తదైవ వృత్ర : పరమేణ మన్యునా మహాబలో వాక్యమిదం బభాషే|| 142

బృహస్పతి చెప్పినదంతా ఇంద్రుడు చేసును. అతని సహాయముతోనే యుద్ద నిపుణుడైన ఇంద్రుడు (136) వృత్రునితో యుద్దము చేసెను దేవతలకు దానవులతో జరిగిన యుద్దముఅతిఘోరముగా నుండెను. (137) ఆ భీకర యుద్దము దేవదానవులకు క్షయమును కలిగించునదిగా వుండెను. అందు ద్వంద్వయుద్దము అతి భయంకరముగా జరిగెను. (138) వ్యోముడను దైత్యుడు యమునితో తీక్షన కోపనుడు అగ్నితో, మహేదంష్ట్రుడు వరుణునితో మహాబలుడు వాయువుతో యుద్దముచేసిరి.(139) అందరూ ద్వంద్వ యుద్దమునందు నేర్పరులై, పరస్పర బలమును కోరుచునుండిరి.(140) అపుడు గొప్ప బాహువులు గల దేవశ్రేష్ఠులు, సంగ్రామ శూరులై జయమునొందిరి. దైత్యులలో ప్రముఖులు అందరూ అన్ని వైపులనుండీ పరాజయము నొందిరి.(141) దేవతల చేతిలో ఓడి తోచిన దిక్కుకు పారిపోవుచున్న తన వారిని చూచి మహాబలుడైన వృత్రుడు తీవ్రమగు కోపముతో ఇట్లనెను. (142)

వృత్ర ఉవాచ:

హే దైత్యా: పరమార్తాశ్చ కస్మాద్యూయం భయాతురా: పలాయనా పరా: సర్వే విసృజ్య రణమద్భుతమ్‌ || 143

స్వం స్వం పరాక్రమం యుద్దాయ కృతనిశ్చయా :| దర్శయధ్వం సురగణాన్‌ సూదయధ్వం మహాబలా:|| 144

గదాభి: పట్టిశై: ఖడ్గై :శక్తితో మరయుద్గరై: అసిభిర్భిందిపాలైశ్చ పాశతోమరముష్టిబి:|| 145

తదా దేవాశ్చ యుయుధుర్దధీచాస్థిసముద్భవై:| శ##సై#్త్రరసై#్రశ్చ పరమైరసురాన్‌ సమదారయన్‌|| 146

పునర్దైత్యా హతా దేవై: ప్రాప్తాస్తేపి పరాజయమ్‌ | పునశ్చ తున వృత్రేణ నోద్యమానా: సురాన్‌ ప్రతి|| 147

యదా హి తే దైత్యవరా: సురేశై ర్నిహన్యమానాశ్చ విదుద్రుపుర్దిశ: కేచిద్దృష్ట్వా దానవాస్తే తదానీం భీతిత్రస్తా: క్లీబరూపా: క్రమేణ|| 148

ఓ దైత్యులారా! మీరంతా భయమును, అర్తిని పొంది ఎందులకీ రణభూమి వదిలి పారిపోతున్నారు? (143) యుద్దము చేయు పట్టుదలతో మీరంతా మీమీ పరాక్రమమును చూపించండి. మహాబలులారా! (144) గదలతో బడిశెలతో ,ఖడ్గములతో, శక్తి, తోమర, ముద్గరమున్నగు ఆయుధములతో, పాశము, తోమర, ముష్ఠిమున్నగు వానితో దేవ గణములను నాశనము చేయండి(145) అనగా అపుడు దేవతలు కూడా దధీచి మహర్షి ఎముకల నుండి ఏర్పడిన వివిధ శస్త్రాస్త్రములను చేతబూని యుద్దము చేసి అసురుల హతమార్చిరి.(146) మరల దైత్యులు దేవతల చేతిలో పరాజయము నొందిరి మరణము పాలైరి వృత్రుడు అసురులను మరల యుద్దమునకై ప్రేరేపించెను.(147) కొందరు దైత్యులు, దేవశ్రేష్ఠుల చేతిలో ప్రాణములొదిలిరి. మరికొందరు దెబ్బతిని పారిపోసాగిరి మరికొందరు అది చూచి మిక్కిలి భయమును పొంది నపుంసకులు వలె అయిపోయిరి.(148)

వృత్రేణ కోపినా చైవం ధిక్కృతా దైత్యపుంగవా: హే పులోమన్‌! మహాభాగ వృషపర్వన్నమోస్తుతే || 149

హే ధూమ్రాక్ష మహాకాల మహాదైత్య వృకాసుర | స్థూలాక్ష హే మహాదైత్య స్థూలదంష్ట్ర నమోస్తుతే|| 150

స్వర్గద్వారం విహాయైవం క్షత్రియాణాం మనస్వినామ్‌ | పలాయద్వే కిమర్థం వాసంగ్రామాంగణముత్తమమ్‌|| 151

సంగరే మరణం యేషాం తే యాంతి పరమం పదమ్‌| యుత్ర తత్ర చ లిప్పేత సంగ్రామే మరణం బుధ:||152

త్యజన్తి సంగరం యే వైతేయాన్తి నిరయం ధృవమ్‌||153

యే బ్రాహ్మణర్థే భృత్యార్థ్‌ స్వార్థే వై శస్త్రపాణయ:|| సంగ్రామం యే ప్రకుర్వన్తి మహాపాతకినో నరా:|| 154

శస్త్రఘాతహతా యే వై మృతా వా సంగరే తథా| తే యాంతి పరమం స్థానం నాత్ర కార్యా విచారణా|| 155

శ##సై#్త్రర్విచ్చిన్నదేహా యే గవార్థే స్వామికారణాత్‌| రణ మృతా: క్షతా యే వై తే యాతి పరమాం గతిమ్‌|| 156

అపుడు కోపగించిన వృత్రుడు దైత్య ముఖ్యులను చూచి ఛీత్కరించెను ఓ పులోముడా! వృషపర్వుడా!(149) ధూమ్రాక్షుడా! మహాకాలుడా! వృక్షాసురుడా! స్థూలాక్షుడా! స్థూలదంష్ట్రుడా! మీకు నమస్కారము(150) అభిమానవంతులగు క్షత్రియులు స్వర్గము నొందుటకు ఉత్తమ ద్వారమగు ఈ యుద్దమును వదిలి పారిపోయెదరేల? (151) యుద్దమున మరణించిన వారు పరమపదమును పొందెదరు. విజ్ఞడు యుద్దమున ఏదో ఒకచోట మరణము నొందగోరవలెను. (152) యుద్దమును విడిచిన వారు నిశ్చయముగా నరకమును పొందెదరు.(153) బ్రాహ్మణుల కొరకు, సేవకుల కొరకు, తమ కోరకు గానీ శస్త్రముల ధరించి యుద్దము చేయువారు గొప్ప పాతకముల చేసిననూ (154) యుద్దమున శస్త్రముల దెబ్బతినిన గానీ, ప్రాణములోదిలిన గానీ పరమ పదమును పొందెదరు. ఇది నిశ్చయము (155) గొవుల కొరకు స్వామి కొరకు శస్త్రముల చేత విచ్చిన్నమైన దేహము గలవారు, రణమున దెబ్బతిన్నవారు లేదా మరణించిన వారు ఉత్తమ గతని పిందెదరు.(156)

తస్మాద్రణ పియే శూరా : పాపినో నిహతా: పుర: ప్రాప్నువన్తి పరం స్థానం దుర్లభం జ్ఞానినామపి || 157

అథవా తీర్థగమనం వేదాధ్యయనమేవ చ | దేవతార్చనయజ్ఞాది శ్రేయాంసి వివిధాని చ|| 158

ఐకపద్యేన తాన్యేవ కళాం నార్హంతి షోడశీమ్‌ | సంగ్రామే పతితానాం చ సర్వశాస్త్రేష్వయం విధి:|| 159

తస్మోద్యుద్దావదానం చ కర్తవ్యమనిశంకితై:| భవద్భిర్నాన్యథా కార్యం దేవవాక్యప్రమాణతు :|| 160

యూయం సర్వే శౌరవృత్యా సమేతా: కులేన శీలేన మహానుభావా:|| పదాని తాన్యేవ పలాయమానా గచ్చంత్యశూరా రణమండలాచ్చ|| 161

త ఏవ సర్వే ఖలు పాపలోకాన్‌ గచ్చంతి నూనం వచనాత్‌ స్మృతేశ్చ|| 162

యే పాపిష్టాస్త్యధర్మస్థా బ్రహ్మఘ్నా గురుతల్పగా :| నరకం యాంతి తేపాపం తథైవ రణవిచ్చుతా:|| 163

తస్మాద్భవద్భిర్యోద్దవ్యం స్వామికార్యభరక్షమై: ఏనముక్తాస్తదా తేన వృత్రేణాపి మహాత్మనా||164

చక్రుస్తే వచనం తస్య అనురాశ్చ సురాన్‌ ప్రతి| చక్రు: సుతుములం యుద్దం సర్వలోకభయంకరమ్‌|| 165

కనుక రణమున చంపబడిన శూరులు పాపులైననూ, జ్ఞానులుకూడా పొందలేని పరమస్థితిని పొందెదరు.(157) లేదా,తీర్థముల దర్శించుట, వేదముల నధ్యయనము చేయుట, దేవతలను అర్చించుట, యజ్ఞముల చేయుట మొదలగు వివిధ శ్రేయస్సులు కూడా (158) కలిసి కూడా యుద్దములో నేలకూలిన వారి పదహారవ కళను కూడా పొందలేవు. అన్నిశాస్త్రములయందిదే విధి.(159) కనుక మీరు శంకను విడిచి ఉత్తమమైన యుద్దమును గ్రహించండి. దేవతల మాటను ప్రమాణముగా చేసి వేరొక విధముగా చేయరాదు.(160) మీరంతా శౌర్యముగలవారు , కులముతో, శీలముతో గొప్పవారు శూరులుకాని వారివలె రణమండలమునుండి పారిపోవుచుంటిరి.(161) పాపమొనరించినవారు అధర్మము నాచరించినవారు , బ్రహ్మ హత్యనుచేసినవారు, గురు తల్పమును పొందినవారు, అట్లే రణమునుండి పారిపోవువారు అందరూ పాపలోకములను తప్పక పొందుదురని స్మృతి వచనము(162,163) కనుక, యజమాని కార్యమును భరించుటయందు సమర్థులైన మీరంతా యుద్దమునుచేయవలెను. అని వృత్రుడు అసురుల నుద్దేశించి పలికెను.(164) అపుడు అసురులు అతని మాటననుసరించి దేవతలతో అన్ని లోకములకు భయము కలిగించు ఘోర యుద్దము చేసిరి(165)

తస్మిన్‌ ప్రవృత్తే తములేవిగాఢే వృత్రో మహాదైత్యపతి: స ఏక: ఉవాచ రోషేణ మహాద్బుతేన శతక్రతుం దేవవరైస్సమేతమే|| 166

వృత్ర ఉవాచ:

శృణు వాక్యం మయా చోక్తం ధర్మార్థ సహితం హితమ్‌ | త్వం దేవానాం పతిర్భూత్వా న జానాసి హితాహితమ్‌|| 167

కిం బలార్థపరో భూత్వా విశ్వరూపో హతస్త్యయా| ప్రాప్తమధ్యైవ భో ఇంద్ర తస్యేదం కర్మణ:పలమ్‌|| 168

యే దీర్ఘదర్శినో మందా మూఢా ధర్మబహిష్కృతా:| అకల్పా : కార్యసిద్ద్యర్థం యత్‌ కుర్వంతి చ నిష్పలమ్‌||తత్‌ సర్వం విద్ది దేవేంద్ర మనసా సంప్రధార్యతామ్‌ || 169

తస్మాద్దర్మపరో భూత్వా యుధ్యస్వ గతకల్మష:| భ్రాతృహా త్వం మమైవేంద్ర తస్మాత్త్యాం ఘాతయామ్యహమ్‌|| 170

మా ప్రయాహి స్థిరో భూత్వా దేవైశ్చ పరివారిత:| ఏవముక్తస్తు వృత్రేణ శక్రోతీవ రుష్వాన్విత:| ఐరావతం సమారుహ్య య¸° వృత్రజిఘాంసయా || 171

ఇంద్రమాయాంతమాలోక్య వృత్రో బలవతాం వర: ఉవాచ ప్రవాసన్‌ వాక్యం సర్వేషాం శృణ్వతామపి|| 172

ఆదౌ మాం ప్రహరస్వేతి తస్మాత్త్వాం ఘాతయామ్యహమ్‌ || 173

ఇత్యేవముక్తో దేవేంద్రోజఘానా గదయా భృశమ్‌ | వృత్రం బలవతాం శ్రేష్ట జానుదేశే మహాబలమ్‌ ||174

తామాపతంతీం జగ్రాహ కరేణౖకేన లీలయా| తయైవేనం జఘానాశు గదయా త్రిదివేశ్వరమ్‌|| 175

సా గదా పాతయామాస సవజ్రం చ పురందరమ్‌ | పతితం శక్రమాలోక్య వృత్ర ఊచే సురాన్‌ ప్రతి|| 176

అట్లు మొదలైన ఆ ఘోరయుద్దమున దైత్యుల గొప్ప ప్రభువగు వృత్రుడొకడే రోషముతో దేవతాశ్రేష్ఠులతో కూడివున్న ఇంద్రుని ఉద్దేశించి ఇట్లనెను.(166) ధర్మార్థములతో కూడినది, హితమును కలిగించునది యగు నా మాటను వినుము. నీవు దేవతల ప్రభువై కూడా మంచి చెడులను తెలియుకున్నావు (167) ఏ బలమును. ప్రయోజనమును ఆపేక్షించి నీవు విశ్వరూపుని వధించితివి ఓ ఇంద్రా! నీ కర్మయొక్క ఫలమీనాడు ప్రాప్తించినది.(168) దూరదృష్టి లేనివారు, మూర్ఖులు, అల్ప బుద్దులు,ధర్మము లేనివారు, అసమర్దులైపనిని సాధించుటకు చేయునదంతా నిష్పలమగునని తెలుసుకొని, మనసులోని నిలుపుకొనుము.(169) కనుక నీవు ధర్మపరుడవై , కల్మషమును విడిచి యుద్దము చేయుము. నీవు నా సోదరుని వధించినందున నేను నిన్ను వధించెదను (170) స్థిరుడవై, దేవతలు వెంటరాగా వెళ్ళిపోకుము అని వృత్రుడనగా ఇంద్రుడు మిగుల కోపముతో ఐరావతమునెక్కి వృత్రుని వధించు కోరికతో ముందుకేగెను. (171) తనవైపుకు వచ్చుచున్న ఇంద్రుని చూచి, మిక్కిలి బలవంతుడగు వృత్రుడు నవ్వుచూ, అందరూ వినుచుండగా ఇట్లనెను (172) ముందు నన్ను దెబ్బతీసెదనిన ఇంద్రుడు వృత్రుని గదతో మోకాలు వద్ద గట్టిగా కొట్టెను (173,174)వచ్చి పడుచున్న గదను వృత్రుడు లీలగా ఒకచేతితోనే పట్టుకొని దానితోనే మరల ఇంద్రుని కొట్టెను. (175) ఆ గద ఇంద్రుని వజ్రాయుధముతో సహ నేలకూల్చెను. క్రింద పడిన ఇంద్రుని చూచి వృత్రుడు దేవతలతో ఇట్లనెను.(176)

నయధ్వం స్వామినం దేవా : స్వపురీమమరావతీమ్‌||177

ఏతత్‌ శ్రుతా వచ: సత్యం వృత్రస్య చ మహాత్మన: | తథా చక్రు : సురా: సర్వే రణాచ్చేంద్రం సముత్సుకా:|| 178

అపోవాహ్య గజస్థం హి పరివార్య భయాతురా: సురా: సర్వే రణం హిత్వా జగ్ముస్తే త్రిదివం ప్రతి|| 179

తతో గతేషు దేవేషు ననర్త చ మహాసుర :| వృత్రో జహాస చ పరం తేనాపూర్యత దిక్తటమ్‌||180

చచాల చ మహీసర్వా సశైలవనకాననా | చుక్షుభే చ తదా సర్వం జంగమం స్థావరం తథా|| 181

శ్రుత్వా ప్రయాంతం దేవేంద్రం బ్రహ్మా లోకపితామహ: ఉపయాతోథ దేవేంద్రం స్వకమణ్డలువారిణా || అస్పృశత్‌ లబ్దసంజ్ఞోభూత్తత్‌ క్షణాచ్చ పురందర:|| 182

దృష్ట్యా పితామహం చాగ్రే వ్రీడాయుక్తో భవత్తదా | మహేంద్రం త్రపయా యుక్తం బ్రహ్మోవాచ పితామహ :|| 183

'ఓ దేవతలారా! మీ ప్రభువును మీ నగరమైన అమరావతికి గోనిపొండు (177) అని వృత్రుడు సత్యమును పలుకగా విని దేవతలు ఉత్సుకతతో రణభూమినుండి ఇంద్రుని గొని పోయిరి. (178) ఏనుగు పై నున్న ఇంద్రుని క్రిందకు దింపి, తప్పించి, దేవతలంతా భయాతురులై అతనిని చుట్టుముట్టి రణభూమిని వదలి స్వర్గమున కేగిరి(179) వారట్లు వెళ్ళగా మహాసురుడైన వృత్రుడు నాట్యము చేసెను. అతను నవ్వగా దానితో దిక్తటములు నిండిపోయెను(180) భూమి పర్వతములు, అరణ్యములతో సహా కంపించెను. స్థావర జంగమమంతా క్షోభనొందెను. (181) ఇంద్రుడు వెళ్ళిపోవుచున్నట్లు విని లోకపితామహుడగు బ్రహ్మ అతనిని సమీపించి తన కమణ్డలములొని నీటిని చిలకరించగా వెంటనే ఇంద్రుడు స్పృలోకి వచ్చెను. (182) తన ఎదుటనున్న బ్రహ్మను చూచి ఇంద్రుడు సిగ్గు నొందగా, సిగ్గుపడుచున్న దేవేంద్రునితో పితామహుడగా బ్రహ్మ ఇట్లనెను.(183)

బ్రహ్మోవాచ-

వృత్రో హి తపసా యుక్తో బ్రహ్మచర్యవ్రతే స్థిత:| త్వష్టుశ్చ తపసా యుక్తో వృత్రశ్చాయం మహాయశా:|| అజేయస్తపసోగ్రేణ తస్మాత్త్వం తపసా జయ || 184

వృత్రాసురో దైత్యపతిశ్చ శక్ర తే సమాధినా పరమేణౖవ జయ్య: | నిశమ్య వాక్యం పరమేష్టినో హరి: సస్మార దేవం వృషభధ్వజం తదా ||185

స్తుత్యా తదా తం స్తపమానో మహాత్మా పురందరో గురుణా నోదితో హి ||186

ఇంద్ర ఉవాచ:

నమో భర్గాయ దేవాయ దేవానామతిదుర్గమ | వరదో భవ దేవేశ దేవానాం కార్యసిద్దయే|| 187

ఏవం స్తుతిపరో భూత్వా శచీపతిరుదారధీ:| స్వకార్యదక్షో మందాత్మా ప్రపంచాభిరత: ఖలు ||188

ప్రపంచాభిరతా మూఢా: శివభక్తిరతా హ్యపి | న ప్రాప్నువన్తి తే స్థానం పరమేశస్య రాగిణ:||189

నిర్మలా నిరహంకారా యే జనా: పర్యుపాసతే | మృడం జ్ఞానప్రదం చేశం పరేశం శంభుమేవ చ ||190

తేషాం పరేషాం వరద ఇహాముత్ర చ శంకర: | మహేంద్రేణ స్తుత: శర్వో రాగిణా పరమేణ హి||191

రాగిణాం హి సదా శంభుర్దుర్లభో నాత్ర సంశయ:| తస్మాద్విరాగిణాం నిత్యం సన్ముఖో హి సదాశివ:||192

రాజా సరాణాం హి మహానురాగీ స్వకర్మసంసిద్దిమహాప్రవీణ: తస్మాత్‌ సదా క్లేశపర: శచీపతి: స్వకామభావాత్మపరో హి నిత్యమ్‌||193

బ్రహ్మ పలికెను- వృత్రుడు స్వయముగా తపస్సు నాచరించినవాడు, బ్రహ్మచర్య వ్రతముననున్న వాడు ఈ గొప్పకీర్తి గల వృత్రుడు త్వష్టయొక్క తపస్సు తోడైనవాడు కనుక జయింపశక్యము గానివాడు ఇంద్రా! నీవు ఉగ్రమైన తపస్సుతోనే ఇతని జయింపుము.(184) ఇంద్రా !దైత్యుల ప్రభువగు వృత్రుని నీవు పరమ సమాధిచేత జయింపుగలవు. అని బ్రహ్మ పలుకగా ఇంద్రుడు శివుని స్మరించెను. (185)గురువు తనను ప్రేరేపించగా ఇంద్రుడు శివుని స్తుతింపనాగెను (186)ఇంద్రుడు పలికెను దేవుడగు భర్గునకు, దేవతలకు కూడా పొంద శక్యముగాని శివునకు నమస్కారము. ఓ పరమశివా! దేవతల పని నెరవేరుటకై పరములనిచ్చు వాడవు గమ్ము.(187) అని తన కార్యమునందు నేర్పరి, ప్రపంచము నందు ఆసక్తి గల ఇంద్రుడు శివునిస్తుతించెను.(188) ప్రపంచమునందాసక్తి గలవారు. మూర్థులు,శివభక్తి గలిగివున్ననూ ఆసక్తి వలన ఈశ్వరుని పరమస్థితిని పొందరు.(189) మాలిన్యము లేనివారు ,అహంకారము లేని వారు అగు యే జనులు ఆనంద స్వరూపుని, జ్ఞానదాతను,ఈశ్వరుని, పరమేశ్వరుని, కల్యాణకరుని చక్కగా ఉపాసింతురో(190) వారికి శంకరుడు ఇహపరముల యందు వరముల నిచ్చువాడగును. ఇంద్రుడు ఆసక్తిగలిగి మహేశ్వరుని స్తుతించెను.(191) ఆసక్తిగలవారు శివుని ఎప్పటికి పొందలేరనుట నిస్సంశయము. కనుక వైరాగ్యము గలవారికి మాత్రమే సదాశివుడు సన్ముఖుడు (192) దేవతల రాజగు ఇంద్రుడు గొప్ప రాగి, తన పనిని నెరవేర్చుకొనుటలో నేర్పరి, కనుక తన కోరికల ననుసరించి ఎల్లప్పుడు కేశములనొందును.(193)

స్తవమానం తదా చేంద్రమబ్రవీత్కార్యగౌరవాత్‌ | విజ్ఞాయాఖిలదృగ్ద్రష్టా మహేశో లింగరూపవాన్‌ ||194

ఇంద్ర గచ్చ సురై: సార్థం వృత్రం వై దానవం ప్రతి | తపసైవ చ సాధ్యోయం రణ జేతుం శతక్రతో|| 195

ఇంద్రు ఉవాచ-

కేనోసాయేన సాధ్యోయం వృత్రో దైత్యవరో మహాన్‌ | తచ్చీఘ్రం కథ్యతాం శంభో యేన మే నిజయో భ##వేత్‌ ||196

రుద్ర ఉవాచ-

రణ న శక్యతే హంతుమపి దేవవరైరపి| తస్మాత్త్వయా హి కర్తవ్యం కుత్సితం కర్మ చాద్య వై|197

అస్య శాప: పురా దత్త:పార్వత్యా మమ సన్నిధౌ | అసౌ చిత్రరథో నామ్నా విఖ్యాతో భువనత్రయే||198

పర్యటన్‌ సువిమానేన మయా దత్తేన భాస్వతా | ఉపహాసాదిమాం యోనిం సంప్రాప్తో దైత్యపుంగవ:||199

తస్మాదజేయం జానీహి రణ రణవిదాం వర| ఏవముక్తో మహేంద్రోయం శంభునా యోగినా భృశమ్‌||200

తథేతి మత్వా శక్రోసౌ నియమం తముపాదదే||201

రంధ్రం ప్రతీక్ష్య వృత్రస్య తత్సమీపే సహస్రకమ్‌| వత్సరాణాం మహాభాగా వసన్‌ హంతుం మనో దధే|| 202

అంతర్వేద్యాం బహి: స్థిత్వా వజ్రపాణిరనుజ్ఞయా |గురో: పురోధసశ్చైన స్వకార్యమకరోద్‌ భృశమ్‌ ||203

తనను స్తుతించుచున్న ఇంద్రునితో అన్ని జ్ఞానముల జ్ఞాతయగు మహేశుడు లింగరూపియై, పని యొక్క గౌరవము చేత నిట్లనెను.(194) ఓ ఇంద్రా! దేవతలతో కలిసి దానవుడైన వృత్రుని గూర్చి వెళ్ళుము తపస్సుచే మాత్రమే ఇతనిని జయించుట సాధ్యము (195) ఇంద్రుడనెను. ఓ శంకరా! ఏ ఉపాయము చేత దైత్యశ్రేష్ఠుడగు వృత్రుడు నిర్జితుడగును? నాకు విజయము దేనిచే సిద్దించునో త్వరగా తెలియజేయుము. (196) రుద్రుడనెను దేవతా శ్రేష్టులు కూడా ఇతని యుద్దమున జయింపలేరు కనుక నీనీనాడు కుత్సితమైన కర్మ చేయవలెను.(197) పూర్వము నా సన్నిధిలో పార్వతి వృత్రుని శపించెను, ఇతను మూడులోకములందునూ ప్రసిద్దుడగు చిత్రరథుడను వాడు (198) నేనిచ్చిన కాంతివంతమైన విమానము నెక్కి పర్యటించుచూ చిత్రరథుడు నన్ను ఉపహిసించుట చేత ఈ రాక్షస యోనిని పొందెను.(199) ఓ ఇంద్రా! కనుక ఇతను రణములో అజేయుడని తెలుసుకొననుము అని యోగియగు శివుడు మహేంద్రునితో ననెను.(200) ఇంద్రుడు అట్లేనని నియమమును గ్రహించెను.(201)వృత్రుని బలహీనమైన స్థితిని గూర్చి ఎదురు చూచుచూ ఇంద్రుడు వేయి సంవత్సరాలు అతనికి దగ్గరలోనే నివసించుచూ అతనిని వధించుటకు ఆలోచించుచుండెను.(202) అంతర్వేదియందు ఇంద్రుడు బృహస్పతి ఆజ్ఞచేత బయటనే తన పనిని నెరవేర్చుకొనెను.(203)

ఏకదా నర్మదాయాం వై వృత్రో దానవపుంగవ: | దైత్యై: పరివృత: సర్వై: సమాయాతో యదృచ్చయా|| 204

ఇంద్ర : పరాభవం ప్రాప్తో నీతో దేవైర్దివం ప్రతి | అహమేవ హతారిశ్చ నాన్యోస్తి సదృశో మమ|| 205

మన్యమాన: సదా వృత్ర:పౌరుషేణ సమన్విత: | ప్రదోషసమయే విప్రా నర్మదాయాముపస్థిత:|| 206

దృష్టశ్చేంద్రేణ సుమహానసురై: పరివారిత: వృత్రో బలవతాం శ్రేష్ట ప్రదోషసమయే తదా||207

తస్మిన్‌ ప్రదోషే సంయుక్తా మందవారే త్రయోదశీ | ప్రదక్షిణానమస్కారైర్యథోక్తవిధినా తదా| పూజితో లింగరూపీ చ ఓంకారో నర్మదా తటే|| 209

ప్రదోషవ్రతమాహాత్మ్యాద్‌ వజ్రపాణి: ప్రతాపవాన్‌ | సంజాత: తత్‌క్షణాదేవ ప్రసాదాత్‌ శంకర్య చ|| 210

వృత్రోపి తపసా యుక్త: ప్రదోషసమయే మహాన్‌| నిద్రాసక్తోభవత్తత్ర శుండేన ప్రతిబోధిత:||211

స్వాపాత్‌ ప్రదోషవేలాయాం తపసా చార్జితం ఫలమ్‌ || ప్రణష్టం తక్ష్కణాదేవ ని:శ్రీకత్వముపాగత: ||212

దేవ్యా: శాపాచ్చ సంజాతో వృత్రో భగ్నమనోరథ|| 213

ఒకప్పుడు దానవశ్రేష్ఠుడైన వృత్రుడు దైత్యులతో కలిసి తలవని తలంపుగా నర్మదానదికి వచ్చెను. (204) ఇంద్రుడు ఓడిపోయి దేవతలచేత స్వర్గమునకు గొనిపోబడెను. నేనే శత్రువుల వధించినవాడు నాతో సమానమైనవాడు లేడు.(205) అని అనుకుంటూ ఎల్లప్పుడూ పౌరుషముతో నుండెను ఓ విప్రులారా! ఒక ప్రదోష సమయమున నర్మదా నది వద్ద అతడుండెను.(207) అ ప్రదోషమున, త్రయోదశీ అథి శనివారముతో కలిసియున్నది అపుడు బృహస్పతి ప్రేరేపించగా ఇంద్రుడు (208) నర్మదా తీరమున లింగరూపియగు ఓంకారుడగు శివుని ప్రదక్షిణ, నమస్కారములచే యథావిధి పూజించెను.(209) ఆ ప్రదోషవ్రత మాహాత్యము చేత ,శంకరుని అనుగ్రహము చేత ఇంద్రుడు అదే క్షణమున ప్రతాపవంతుడాయెను (210) తపస్సు గల వృత్రుడు కూడా ఆ ప్రదోష సమయాన శుండునిచేత మేల్కొలపబడి నిద్రయందాసక్తి గలవాడయెను (211) ప్రదోషవేళయందు నిద్రించుటచేత అతను సంపాదించిన తపస్సు యొక్క ఫలమంతా అదేక్షణాన నశించినది. వృత్రుడు తేజస్సు కోల్పోయినవాడాయెను(212) పార్వతీదేవి శాపముచేత వృత్రుడు భంగపడిన మనోరథము గలవాడాయెను.(213)

సంధ్యాపాదో గతో యావద్‌ వృత్రస్తీర్థముపావిశత్‌ |పరీతో వివిధైర్దైత్యైర్నానాయధసమన్వితై:|| 214

తస్య తత్కర్మణశ్చిద్రం ఛిద్రాన్వేషి శచీపతి: జ్ఞాత్వా గత: శ##నైర్‌ హంతుమాత్మశత్రుం శతక్రతు:||215

తావద్‌దైత్యా: సుసంరబ్దా: భీమా భీమపరాక్రమా:ఉత్తస్థుర్యుగవత్‌ సర్వే దు:సహాశ్చ శతక్రతుమ్‌|| 216

తతస్‌తైరభవద్‌ యుద్దం అతిప్రబలదండిభి: సర్వే దేవా సహాయార్థం తదాజగ్ము: శతక్రతో:||217

తదా దైత్యాశ్చ దేవాశ్చ యుయుధుస్తే తరస్విన: | రాత్రౌ యుద్దం సమభవత్‌ సురాసురవిమర్ధనమ్‌||218

అనేకశస్త్రసంవీతం మహారౌద్రమవర్తత | ఏవం ప్రవర్తమానే తు సంగ్రామే రౌద్రదారుణ | తదా వృత్రోథ సన్నద్దో గృహీత్వా శూలముల్బణమ్‌|| 219

ఇంద్రప్రముఖతో భూత్వా జగర్జాతివిభీషణమ్‌ | తస్య నాదప్రణాదేన త్రాసితం భువనత్రయమ్‌||220

ఐరావణం సమారుహ్య మహేంద్ర: శుశుభే తదా! ధ్రియమాణన చ్చత్రేణ చంద్రమణ్డలశోభినా || 221

చామరైర్వీజ్యమానోథ బభాషే దైత్యపుంగవమ్‌|| 222

సంధ్య యొక్క పాదము ఒకటి గతించువరకు వృత్రుడక్కడే వివిధ ఆయుధముల ధరించిన దైత్యులతో కలిసి కూర్చొని వుండెను. (214) లోపము కొరకై వెదకుచున్న ఇంద్రుడు, లోపము జరిగెనని తెలుసుకొని తన శత్రువును వధించుటకు వెళ్ళెను.(215) అప్పటికి దైత్యులు సిద్దముగా నుండిరి గొప్పపరాక్రమము గల వారందరు, ఎదిరింపశక్యము గాని వారు ఒక్కమారుగా ఇంద్రుని ఎదుర్కొనిరి.(216) అటు తరువాత మిక్కిలి బలముగల వారితో యుద్దము జరిగెను దేవతలంతా ఇంద్రునికి సహాయము చేయుటకై వచ్చిరి. (217) అపుడు దైత్యులు, దేవతలు కూడా వేగము కలిగి యుద్దము చేసిరి. సురాసురుల నశింపజేయు ఆ యుద్దము రాత్రి జరిగెను. (218) అనేక శస్త్రములతో కూడినదిగా ఆ మహారౌద్రమును కల యుద్దము ప్రవర్తించుచుండగా,వృత్రుడు సిద్దముగా నుండి తీక్ష్కణమైన శూలమును గ్రహించెను. (219) దానితో ఇంద్రుని ఎదుట నిలిచి,భయంకరముగా గర్జించెను. ఆ నాద ప్రతిధ్వనితో ముల్లోకములు భయమునొందెను. (220) మహేంద్రుడపుడు ఐరావతమునెక్కి శోభించెను. చంద్రమండలము వలె శోభించు ఛత్రముతో శోభిల్లు ఇంద్రుడు(221) చామరములతో వీచబడుచూ నుండి దైత్యశ్రేష్టుడగు వృత్రునితో నిట్లు పలికెను.(222)

ఇంద్ర ఉవాచ:

సంగ్రామం కురు మే వృత్ర బలేన మహతా వృత: శూరస్త్యమసి శూరాణాం తపసా పరమేణ హి|| 223

ఏవముక్తస్తదా తేన వృత్రో వాక్యమువాచ హ| ఆదౌ ప్రహర మామింద్ర పశ్చాత్త్వాం ఘాతయామ్యహమ్‌ || 224

తథేతి మత్త్యా తదతీవ దు:సహం వజ్రం తదానీం శతధారమేవ| స మోక్తుకామో హితదా పురందరో నివారితస్తేన మహాప్రభేణ || పురోధసా బుద్దిమతాం తథేతి మత్వా స చకార చేంద్ర:|| 225

గదాం ప్రగృహ్య దేవేంద్రో వృత్రాం వివ్యాధ తాం గదామ్‌ | వారయామాన వృత్రో సావతిథిం కృపణో యథా|| 226

వ్యర్థాం చ స్వగదాం దృష్ట్యా ఇంద్రశ్చింతామవాప హ|| 227

తం చిన్త్యమానం చ తదా పురందరు వృత్రో బభాషే పరిభర్‌త్సమాన:| పురాకృతం శక్ర మహాద్బుతం త్వయా| జగుప్సితం కర్మ చ విస్మృతం కిమ్‌ || యేనైవ జోతోసి సహస్రనేత్ర: శాపాన్మహర్షేరథ గౌతమస్య|| 228

యే శూరాశ్చేంద్రియగ్రామం వర్తంతే హి నియమ్య తు | తే జయం ప్రాప్నువంతీహ నేతరే హి భవాదృశా:|| 229

రణాజిరం మహాఘోరం పాపినాం నాత్ర సంశయ:||230

ఇంద్రుడనెను ఓ వృత్రా !గొప్ప తపస్సు చేత నీవు శూరులలో కూడా మేటివైనావు గొప్ప బలము కలిగి నాతో యుద్దము చేయుము. (223) అనగా వృత్రుడనెను ఇంద్రా! ముందు నీవునన్ను దెబ్బతీసిన తరువాత నేను నిన్ను వధించెను.(224) అలాగేనని తలచి ఇంద్రుడు ఎదురులేనిది నూరు అంచులు గలదియగు తన వజ్రాయుదమును ప్రయోగించునంతలో గొప్ప మేథావియగు బృహస్పతి అతనిని వారించెను. అపుడు ఇంద్రుడు బృహస్పతి మటను మన్నించెను (225) దేవేంద్రుడు గదనోకదానిని గ్రహించి వృత్రుని దెబ్బతీయగా, వృత్రుడు ఆగదను పిసినారి అతిథిని వారించినట్లు వారించెను గదకూడా వ్యర్థమగుట చూచి ఇంద్రుడు చింతనొందెను (227) చింతించుచున్న ఇంద్రుని చూచి వృత్రుడు బెదిరించి చున్నట్లుగా అనెను ఇంద్రా! నీవింతకు ముందు చేసిన మహాద్బుతమైనది జుగుప్సను కలిగించు పనిని మరచితివా! దానివల్లనే కదా నీవు గౌతమ మహర్షి శాపమునొంది, దానిచే సూరుకన్నులు గలవాడనైతివి(228) ఏ శూరులు ఇంద్రియ సమూహమును నిగ్రహించి ప్రవర్తింతురో, వారికే జయము,నీలాంటి వారికి కాదు.(229) పాపులకు కేవలం మహాఘోరమైన రణభూమియే ఇందు సంశయము లేదు.(230)

ఏవం నిర్‌భర్‌త్సయామాస దేవేంద్రం దైత్యపుంగవ: | త్రిశూలం ధూనయామాస దేవేంద్రో హి తడిత్సమమ్‌ || 231

తేన శూలేన మహతా వృత్రో ద్భుతపరాక్రమ :| బభౌ తీవ్రేణ తపసా యథా రుద్రో యుగాంతకృత్‌ || 232

తథాభూతం సమాలక్ష్య దేవరాజు శతక్రుతు: | అభ్యుద¸° హంతుకామో వృత్రం దానవపుంగవమ్‌ ||233

తమాయాంతమభిప్రేక్ష్య హంతుకామం పురందరమ్‌ జహాస పరమం తత్ర శక్రస్య చ భయావహమ్‌ || ముఖంప్రసార్య సుమహదాగతో హి పురందరమ్‌ ||234

గ్రస్తుకామో మహాతేజా దైత్యానామధిపస్తదా | ఆగత్య సహసా శక్రం గ్రాసయిత్వా సకుంజరమ్‌ ||235

సవజ్రం సకిరీటం చ ననర్త చ జగర్జ చ | నిమిషాంతరమాత్రేణ గ్రసితోసౌ పురందర:||236

హాహాకారో మహానాసీద్దేవానాం తత్ర పశ్యతామ్‌ | భూకంపో హి తదా హ్యాసీదుల్కాపాత: సహస్రశ:|| 237

తిమిరేణావృతం సర్వం జగత్‌ స్థావరజంగమమ్‌ | నర్తమానస్తదా వృత్రో బభూవ పరమద్యుతి:||238

విధ్యమానాస్తదా సర్వే దేవా బ్రహ్మాణమాగతా: | శశంసు: సర్వమేవైతద్‌ వృత్రా సురవిచేష్టితమ్‌|| 239

ఇట్లుదైత్యపుంగవుడైన వృత్రుడు ఇంద్రుని బెదిరించెను. దేవేంద్రుడు మెరుపుతో సమానమైన శూలమును ఝళిపించెను.(231) వృత్రుడా శూలముతో యుగాంతముల జేయు శంకరుడు తీవ్ర తపస్సుతో శోభించినట్లు ప్రకాశించెను. (232) అట్లు వృత్రుడుండగా చూచి దేవేంద్రుడు అతనిని వధించదలచి ఎదుర్కొనెను. (233) వచ్చిపడుపడుచున్న ఇంద్రుని చూచి వృత్రుడు అతనికి భయము కలుగునట్లుగా నవ్వెను.(234) వృత్రుడపుడు నోరు తెరిచి తనవైపు వస్తున్న ఇంద్రుని మింగివేయదలిచెను వచ్చిన ఇంద్రుని ఒక్కమారుగా ఐరావతముతో(235) వజ్రాయుధముతో , కిరీటముతో సహా మింగివేసి నర్తించెను. గర్జించెను. ఒక నిమిషములోనే ఇంద్రుడు మింగివేయబడెను (236) ఇది చూచుచున్న దేవతలు హ హకారములుచేయదొడగిరి అప్పుడు భూకంప మేర్పడెను.

వేలకొలదిగా ఉల్కలు నేల రాలెను (237) లోకమంతా చరాచరములతో సహా చీకటితో నిండెను. వృత్రుడపుడు నాట్యము చేయుచూ గొప్ప ప్రకాశము గలవాడాయెను (238) అప్పుడు దెబ్బతీయబడిన దేవతలంతా బ్రహ్మను చేరి అతనిని స్తుతించి, వృత్రాసురుని దారుణకృత్యమును విన్నవించిరి(239)

తత్‌ శ్రుత్వా భగవాన్‌ బ్రహ్మా వ్యథితో తీవ విస్మిత: కథం జాతం మహేంద్రస్య పరమాద్బుతమ్‌ || 240

దేవై: సహ తదా బ్రహ్మా సర్వలోకపితామహ: తుష్ఠావ గిరిశం దేవం పరమేణ సమాదినా|| 241

బ్రహ్మోవాచ:

ఓం నమో లింగరూపాయ మహాదేవాయ వై నమ: విశ్వరూపాయ దేవాయ విరూపాక్షాయ వై నమ:|| 242

త్రాహి త్రాహి త్రిలోకేశ వృత్రగ్రస్తం పురందరమ్‌ | తదా నభోగతా వాణీ సర్వేషామేవ శృణ్వతామ్‌|| 243

ఉవాచ హితకామాయ విధిం లింగార్చనే సతీ| ప్రదోషవ్రతయుక్తేన ఇంద్రేణ వికృతం కృతమ్‌| 244

నిర్మాల్యం పీఠికాం చైవ ఛాయాప్రాసాదమేవ చ | ప్రదక్షిణాం కృతవతా పీఠికాలంఘనం కృతమ్‌ || 245

లంఘయంతి చ యే మూఢాస్తే వై దండ్యా న సంశయ: | చండస్య గణముఖ్యస్య తస్మాత్‌ కుర్యాత్‌ ప్రయత్నత:|| ప్రదక్షిణానమస్కారౌ లింగార్చనసమన్విత:|| 246

శ్రేయ: ప్రాస్త్యేకబుద్ద్యా వై ప్రయత్నాత్‌ లింగపూజనమ్‌ | కార్యం దీక్షాపరైర్నిత్యం సర్వపాపోపశాంతయే || 247

ఆశరీరం చ తద్వాక్యం శ్రుత్వా బ్రహ్మాదయ: సురా | పవ్రచ్చుస్తే ప్రాంజలయో నభోవాణీ శుభావహామ్‌ ||248

కథమర్చామహే లింగం కేనైన విధినా తత: ప్రాతర్మధ్యాహ్నసమయే సాయంకాలే తథైవ చ|| 249

కాని పుష్పాణి సాయాహ్నే మధ్యాహ్నే చ తథైవ హి | ప్రాత: కాలే తు తాన్యేవ కథయస్వ యథాతధమ్‌ ||250

అదివిని బ్రహ్మ మిగులు బాధనొంది విస్మయముతో మహేంద్రునికిట్టి కష్టమెట్లు కలిగెను (240) అని దేవతలతో కలిసిగొప్ప సమాధియందు పరమేశ్వరునిట్లు స్తుతించెను (241) లింగరూపధారికి మహాదేవునకు నమస్కారము విశ్వరూపునకు, విరూపాక్షునకు నమస్కారము(242) ముల్లోకముల ప్రభువా ! వృత్రుని చేత మింగివేయబడిన ఇంద్రుని రక్షింపుము అనగా అపుడు ఆకాశవాణి అందరూ వినుచుండగా ఇట్లనెను.(243) హితమును ఓరుచున్న ఆ వాక్కు లింగపూజయందలి విధినిట్లు తెలిపెను ప్రదోషవ్రతమందున్న ఇంద్రుడు చేయరానిది చేసెను. (244) ప్రదక్షిణము చేసిన ఇంద్రుడు పీఠికాలంఘన మొనరించెను.నిర్మాల్యమును , పీఠికను, ఛాయాప్రసాదమునంతా వికృతమొనర్చెను. (245) ఎవరు మూడులై నియమమును దాటెదరో వారు గణముఖ్యుడగు చండునిచేత దండననొందెదరు. ఇందు సంశయము లేదు. కనుక లింగార్చనతో ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను (246) అన్ని పాపముల శాంతికై లింగార్చన పరులై దీక్షతో, శ్రేయస్సును పొందు బుద్దితో లింగపూజను చేయవలెను(247) ఆశరీరవాణిని విని బ్రహ్మ మొదలైన దేవతలు చేతులు జోడించి శుభము నొనరించు ఆ వాక్కునడిగిరి.(248)శివలింగమును మేము ఏవిధముగా పూజించవలెను? ప్రాత: కాలమున, మధ్యాహ్నమున, అట్లే సాయం కాలమున ఏఏ పుష్పములతో పూజించవలెనో తెలియజేయుము. (249,250)

తదా నభోగతా వాణీ కథయామాస విస్తరమ్‌ || 251

కరవీరం చార్కపుష్పం బృహతీపుష్పమేవ చ| ధత్తూరకుసుమం చైవ శతపత్రం తథైవ చ|| 252

ఆరగ్వధం చ పున్నాగం బకులం నాగకేశరమ్‌ | బ్రధ్నోత్పలం కదంబం చ మందారకుసుమం తథా|| 253

బహుని వరపుష్పాణి బహుని కమలాన్యపి | త్రికాలే చ పవిత్రాణి జ్ఞేయాని సతతం బుదై:254

జాతీపుష్పం మల్లికాయాశ్చ పుష్పం మోగరకం నీలపుష్పం తథైవ | తథా పుష్పం కుటజం కర్ణికారం కౌసుంభాఖ్యం వారిజం రక్తవర్ణమ్‌|| 255

ఏతాన్యేవ చ పుష్పాణి మధ్యాహ్నే లింగపూజనే విశిష్టాని మయోక్తాని సాయాహ్నే కథయామ్యహమ్‌ || 256

చంపకాని త్రికాలే చ పవిత్రాణి న సంశయ: రాత్రౌ మోగరకాణ్యవ పవిత్రాణి న సంశయ:|| 257

ఏవమర్చనభేదాంశ్చ జ్ఞాత్వా తల్లింగపూజనే | కార్యో విధిర్విజ్ఞైశ్చ సతతం చ శివాలయే|| 258

వృషభాంతరితో భూత్వా పీఠికాంతరమేవ చ | ప్రదక్షిణాం న కుర్వీత కుర్వన్‌ కిల్బిషమశ్నుతే || 259

తథా హ్యనేన శ##క్రేణ కృతం చైవ ప్రదక్షిణమ్‌ | రాజసం భావమాశ్రిత్య తస్మాజ్జాతం చ నిష్ఫలమ్‌|| 260

అపుడు ఆకాశవాణి విస్తరముగా చెప్పసాగెను. (251) గన్నేరు ,జిల్లేడు, వాకుడు, ఉమ్మెత్త మరియు కమలములు (252) రేలపువ్వు, సురపొన్న , పొగడ, నాగకేసరము (253) పెక్కు శ్రేష్టకుసుమములు, శ్రేష్ఠ కమలములు మూడు కాలముల యందునూ పవిత్రములని బుధులు తెలియవలెను (254) జాతిపుష్పము,మల్లిక, మోగరకము, నీల పుష్పము, కొడిసెపువ్వు, కొండగోగుపువ్వు, కౌసుంభమను ఎరుపువర్ణముగల కమలమూ పవిత్రములే(255) ఈ పుష్పములే మధ్యాహ్న సమయమున లింగపూజ చేయుటయందు విశిష్టములని చెప్పితిని. ఇక సాయంకాలమునకు చెప్పెదను.(256) చంపకములు మూడు కాలములయందునూ పవిత్రములే సంశయములేదు. రాత్రియందు మోగరక పుప్పములు పవిత్రములు (257) ఇట్లు అర్చన యందున్న భేదములను తెలిసి,విధి తెలిసినవారు శివాలయమున ఎల్లప్పటికీ లింగపూజయందలి విధిని పాటించవలెను (258) వృషభమునకు మధ్యవచ్చిగానీ, పీఠికను మధ్యవచ్చిగానీ ప్రదక్షిణముచేయకూడదు ఆ విధముగా చేసినట్లుయితే పాపమును పొందుదురు. (259) ఇంద్రుడు ఆ విధముగానే రాజసభావాన్ని ఆశ్రయించి ప్రదక్షిణము చేసినందువలన అది నిష్ఫలమే అయినది.(260)

గ్రసితోధ్యైవ వృత్రేణ సగజో హి పురందర: | భవద్బిరేవ తత్కార్యం యేన ఇంద్ర: ప్రముచ్యతే||261

మహారుద్రవిధానేన ముక్తోభవతి తత్‌క్షణాత్‌ | పురందరో హ్యయం దేవా నాత్ర కార్యా విచారణా||262

తేనైవ వచసా దేవా రుద్రమభ్యర్చ్య యత్నత: | యథోక్తేన విధానేన రుద్రసూక్తేన యత్నత:|| 263

తథాచైకాదుశీరుద్ర్యా రుద్రమభ్యర్చ్య వై సురా: | హవనం ప్రత్యహం చక్రుర్దశాంశేన ద్విజోత్తమా|| 264

జపం చ పూజం హవనం చ చక్రుర్విమోక్తుకామా: సహసా పురందరమ్‌ | శంభో : ప్రసాదాత్‌ సహసా వినిర్గత:కుక్షిం భిత్వా దేవరాజస్తదానీమ్‌||265

తం నిర్గతం సమీక్ష్యాథ దేవదేవేంద్రమోజసా,సగజం చ సవజ్రం చ సకీరీటం సకుణ్డలమ్‌ | శ్రియా పరమయా యుక్తం పురందరం మహౌజసమ్‌ || 266

దేవదుందుభయో నేదుస్తథా శంఖా హ్యనేకశ: గంధర్వాప్సరసో యక్షా ఋషయశ్చ ముదాన్వితా:||267

ఐకపద్యేన సర్వేషాం మహాహర్షో దివౌకసామ్‌ | సంజాత: తత్‌క్షణాదేవ యదా ముక్త: పురందర :||తదా శచీ సమాయాతా యత్ర ముక్త : పురందర:||

తదా శచీ సమాయాతా యత్ర ముక్తః పురందరః || 268

తత్ర శచ్యా సమేతోzసావభిషిక్తో మహర్షిభిః | పుణ్యహవాచనం తస్య కృతం సర్వైః ప్రయత్నతః || 269

ఏవం తదాభిషిక్తోసౌ మహేంద్ర ఋషిభి: పున: మహీ మంగలభూయిష్టా తదా జాతా ద్విజోత్తమా :|| 270

కనుక ఇంద్రుని , ఐరావతముతో సహా వృత్రుడీనాడు మింగివేసెను. ఇంద్రుడు ముక్తుడగునట్లు మీరే చేయవలెను.(261)దేవతలారా! మహారుద్రవిధానము చేత ఇంద్రుడు వెంటనే ముక్తుడవుతాడు ఇందు విచారణ అవసరం లేదు. (262) అపుడు దేవతలామాటననుసరించి ప్రయత్న పూర్వకముగా శివుని రుద్ర సూక్తముతో యథావిధిగా అర్చించిరి. (263)అట్లే ఏకాదశీ రౌద్రముతో రుద్రుని అర్చించి దాని దశాంశతో ప్రతిరోజూ హవనము చేసిరి(264) ఇంద్రుని వెంటనే విడిపింపగోరిన దేవతలు జపమును పూజను, హవనమును చేసిరి. అపుడు శివుని ప్రసాదముచేత దేవరాజైన ఇంద్రుడు వృత్రుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చెను. (265) అట్లు వచ్చిన అతనిని ఐరావతము, వజ్రాయుధము, కిరీట కుణ్ఢలములు, పూర్వ శోభ కలిగినవానిని గొప్ప శక్తిగలవానిని చూసి (266) గంధర్వులు. అప్సరసలు, యక్షులు, బుషులు సంతోషించిరి. దేవదుందుభులు, శంఖములు అనేకముగా మ్రోగెను. (267) ఆ క్షణముననే దేవతలకు అమితానందము కలిగెను ఇంద్రుడు ముక్తుడైన చోటికి శచీదేవి రాగా ఆమెతో ఇంద్రునికి మహర్షులు అభిషేకమును పుణ్యాహవాచనము చేసిరి(268,269) ఇట్లు ఇంద్రుడు ఋషులచే మరల ఆభిషేకింపబడెను. ఓ బ్రాహ్మణా శ్రేష్టులారా! ఆ సమయమున భూమి మంగలతమముగా అయినది.(270)

దిశ: ప్రసన్నతాం యాతా నిర్మలం చాభవన్నభ: శాంతాస్తదాగ్నయో హ్యాసన్మనాంసి చ మహాత్మనామ్‌ || 271

ఏవమాదీన్యనేకాని మంగలాని తతోభవన్‌ | ముక్తే శతక్రతౌ తస్మిన్‌ బభూవ పరమాద్బుతమ్‌|| 272

ఏవం ప్రవర్తమానే తు మహతాం చ మహోత్సవే| తావద్‌ వృత్తస్య పతితం శరీరం చ భయానకమ్‌||273

తత్రైవ బ్రహ్మహత్యా చ పాపిష్ఠా పతితా భువి | గంగాయమునయోర్మద్యే అంతర్వేదీతి కథ్యతే ||274

పుణ్యభూమిరితి ఖ్యాతా ప్రసిద్దా లోకపావనీ || వృత్రహత్యా ప్రతిష్ఠా సా యస్మిన్‌ దేశే స పాపవాన్‌|| 275

మలస్య బహుసంభూత్యా మాలావేతి ప్రకీర్తితా | తస్వాం తు మలభూమ్యాం వై వృత్రస్య చ మహచ్చిర:|| 276

షణ్మాసేష్వపతత్‌ సర్వై: కృత్తం దేవై: సవాసవై: ఏవం వృత్రవధం శక్రో జయమవాప హ|| 277

ఇంద్రాసనే చోపవిష్టో నిరాతంక: శచీపతి: | ఏతస్మిన్నంతరే దైత్వా : పాతాలవాసినం బలిమ్‌ ||శశంసు: సర్వమాగత్వ శక్రస్య చ విచేష్టితమ్‌ || 278

తేషాం తద్వచనం శ్రుత్వా వైరోచనీ రుషాన్విత: | శుక్రం పప్రచ్చ స తదా కథమింద్రో వశీ భ##వేత్‌279

తేనోక్తం బలయే రాజన్‌ జయస్యందనలబ్దయే | మహాయజ్ఞం కురుష్వాద్య తేన తే విజయో భ##వేత్‌|| 280

దిక్కులన్నీ ప్రసన్నముగా ఐనవి. ఆకాశము నిర్మలమాయెను. అగ్నులు , మహాత్ముల మనస్సులు కూడా శాంతించినవి,(271) అటుపిమ్మట ఇట్లాంటి శుభములు అనేకములుగా ఇంద్రుడు ముక్తుడవగా కలిగినవి (272) ఇట్లు శ్రేష్టులగు వారి మహోత్సవము ప్రవర్తించుచుండగా వృత్రుని భయంకర శరీరము నేలకూలినది.(274) గంగా యమునలకు మద్య అంతర్వేది యనుచోట పాపిష్ఠియగు బ్రహ్మహత్యకూడా నేల పై పడినది. (274)ఇది పుణ్యభూమి, లోకపావని యని వాసికెక్కినది. ఏ దేశమున వృత్రహత్య స్థిరపడినదో అది పాపముగల దేశము (275)అధికంగా మలము చేరినందున మాళవమని కీర్తించబడిన మలభూమియందు వృతుని గొప్ప శిరస్సు పడెను(276) ఆరుమాసములలో పడిన ఆ తలను ఇంద్రునితో సహా దేవతలంతా నరికిరి. ఇట్లు ఇంద్రుడు వృత్రుని వధించి జయమునొందెను. (277) ఏ అడ్డంకులు ఉపద్రవములు లేని ఇంద్రుడు ఇంద్రాసనము పై కూర్చుండెను. ఇంతలో దైత్యులందరూ పాతాలమునుండి బలిని సమీపించి ఇంద్రుని ఘోరకృత్యమును గూర్చి చెప్పిరి. (278) వారి మాటలను విన్న బలి రోషముతో ఇంద్రుడు వశములోకి ఎట్లు వచ్చునని శుక్రుని అడిగెను.(279) అపుడతను జయరథమును పొందుటకుమహాయజ్ఞమును చేయుమని దానితో విజయము అభించునని బలికి చెప్పెను.(280)

తేనోక్తో భృగుణా చైవం బలిర్యజ్ఞార్థముద్యతా:| దధౌ యానీహ ద్రవ్యాణి యజ్ఞయోగ్యాని తాని వై|| మేలయిత్వా త్వరేణౖవ వైరోచనిరుదారధీ :||281

ప్రవర్తితో మహాయజ్ఞో భార్గవేణ మహాత్మనా దీక్షాయుక్తో బలిరభూత్‌ జహువే హవ్యవాహనమ్‌|| 282

హూయమానే తదాగ్నౌ తుకర్మణా విధిహేతునా| తస్మాద్‌ బలే: సముత్పన్న: స్యందన: పరమాద్భుత:||283

హయైశ్చతుర్భి: సంయుక్తో ధ్వజే సింహో మహాప్రభ: | శస్త్రాసై#్ర:సంయుత: శ్రీమాన్‌ హయై: శ్వేతైరలంకృత:|| 284

తతశ్చావబృథస్నానం చక్రే శుక్రప్రణోదిత: | స్యందనం పూజయిత్వాథ ఆరురోహ బలిస్తదా || 285

దైత్యై: వరివృత: సద్యో యోద్దుకామ: పురందరమ్‌ సద్య ఏవ దివం ప్రాప్తో బలిర్వైరోచనోమహాన్‌|| 286

ఆగత్య సేనయా సార్థమారురోహామరావతీమ్‌ | సంరుద్దాం తాం పురీం దృష్ట్యా తదా తే సురసత్తమా|| విమర్శయిత్వా సుచిరమూచు: సర్వే బృహస్పతిమ్‌ ||287

కి కుర్మోద్య మహాభాగ ఆగతా దైత్యపుంగవా: యోద్దుకామా మహాఘోరా: సర్వే యుద్దవిశారదా:| 288

తేషాం తద్వచనం శ్రుత్వా బృహస్పతిరభాషత||289

ఏతే ఘృగముఖా ఘోరా భృగుణా నోదితా: సురా : అజేయాశ్చైవ తే సర్వే తపసా విక్రమేణ చ|| 290

ఏతన్నిశమ్య వచనం చ గుణాభియుక్తం సర్వే : సమభవన్‌ త్రపయాభియుక్తా :| ఇంద్రోపి బుద్దివికల: పరిచింతదయా చ వ్రీడాయుత: సమభవత్‌ పరిభర్‌త్స్యమాన:||291

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే బలిదైత్యస్య సంగ్రామోద్యోగవర్ణనం నామ సప్తదశోzధ్యాయ:

శుక్రుడట్లు తెలుపగా బలి యజ్ఞముచేయుటకు సిద్దపడి అందుకు కావలసిన పదార్థములనన్నింటిని సిద్దపరిచెను. అతను ఆ పదార్థముల అవసరముననుసరించి కలిపెను. (281) భార్గవుడు మహాయజ్ఞమును ప్రవర్తింపజేయగా బలి దీక్షాయుక్తుడై అగ్నిని కొలిచెను. (282)విధివత్‌ అగ్నికి హవ్యము నర్పించుచుండగా దానినుండి బలికొరకు అద్బుతమైన రథమొకటి ఉద్బవించెను (283) నాలుగు గుర్రములు కలిగి సింహధ్వజమును కలిగి, శస్త్రాస్త్రములను కలిగిన ఆ గొప్ప శోభ గల రథము తెల్లని గుర్రములతో అలంకరింపబడెను.(284) శుక్రుడు ప్రభోధించగా బలి అవబృథస్నానము చేసి రథమును పూజించ ఆధిరోహించెను. (285) వెంటనే ఇంద్రునితో యుద్దముచేయగోరి ఇతర దైత్యులతో కలిసి వైరోచనుడగు బలి స్వర్గలోకముననుచేరెను.(286) సేనతో కలిసివచ్చి అమరావతిని అధిరోహించెను. పురమట్లు ముట్లడింపబడుటను జూచి దేవతాశ్రేష్టులుచాలా సేపటివరకు ఆలోచించి బృహస్పతి ఇట్లనిరి(287) ఓ మహానుభావా! దైత్య ప్రముఖులు వచ్చేసారు ఈనాడేమి చేయుదము? వారంతా యుద్దమున నేర్పరులు ఎదిరింప శక్యముగాని వారు మనతో యుద్దముచేయగోరి వచ్చినారు (288) అనగా విని బృహస్పతి దేవతలతో అనెను (289) ఘోరమగు ఘృతుడు మొదలగు ఈ దౌత్యులంతా భృగువు చేత ప్రేరేపింపబడినారు తపస్సు ద్వారా పరాక్రమము ద్వారా కూడా వీరిని జయించుట శక్యము కాదు (290)గుణముతో కూడిన ఆ మాటను విని దేవతలంతా సిగ్గునొందిరి ఇంద్రుడు కూడా బుద్దిపరిపరి విధాలు పోగా, భయమునోందుచూ చింతించుచూ,సిగ్గుపడి నిలుచుండెను.(291)

ఇది శ్రీస్కాందమహాపురాణము యందలి మొదటి మాహేశ్వరఖండమందలి కేదారఖండమందున్న బలియను రాక్షసుడు సంగ్రామమునకు సిద్దిపడుటకు వర్ణించు పదిహేడవ అధ్యాయము సమాప్తము .

అష్టాదశోధ్యాయ:

లోమశDªy¿RÁc

కర్మణా పరిభూతో హి మహేంద్రో గురుమబ్రవీత్‌ వినా యత్నేన సంక్లేశాత్తర్తుం కర్మ కిముచ్యతామ్‌ || 1

బృహస్పతిరువాచేదం త్యక్త్యా చైవామరావతీమ్‌ | యాస్యామోన్యత్ర సర్వే వై సకుటుంబా జిగీషవ: 2

తథా చక్రు: సురా సర్వే హిత్వా చైవామరావతీమ్‌|| బర్హిణో రూపమాస్ధాయ గత: సద్య: పురందర:||3

కాకో భూత్యా యమ: సాక్షాత్‌ కృకలాసో ధనాధిప: అగ్ని కపోతకోభూత్త్వా భేకో భూత్వా మహేశ్వర:|| 4

నైఋతస్తత్‌ క్షణాదేవ కపోతోభూత్తతో గత: | పాశీ కపింజలో భూత్వా వాయు: పారావతోభూత్‌||5

ఏవం నానాతనుభృతో హిత్వా తే త్రిదివం గతా:| కశ్యపస్యాశ్రమం పుణ్యం సంప్రాప్తాస్తే భయాతురా:|| 6

అదితిం మాతరం సర్వే శశంసుర్దైత్యచేష్టితమ్‌ ||7

అపుణ్యం తదుపాకర్ణ్య హ్యదితి: పుత్రలాలసా | ఉవాచ కశ్యపం సా తు సురాణాం వ్యసనం మహత్‌ || మహేర్షే శ్రూయతాం వాక్యం శ్రుత్వా తత్‌కర్తుమర్హసి|| 8

దైత్యై పరాజితా దేవా హిత్వా చైవామరావతీమ్‌ | త్వదీయాశ్రమం ప్రాప్తాస్తాన్‌ రక్షస్వ ప్రజాపతే|| 9

పదునెనిమిదవ అధ్యాయము

లోమశుడు పలికెను: కర్మచేత పరిభవింపబడ్డ ఇంద్రుడు బృహస్పతిని ఏ కర్మచేత ప్రయత్నము లేకున్నా క్లేశమును దాటవచ్చో చెప్పుమని అడిగెను. (1) అమరావతిని వదిలి అందరమూ జయము కోరుతూ కుటుంబముతోసహా వేరొక చోటకి వెళ్ళుదమని బృహస్పతి పలికెను (2) అపుడు దేవతలంతా అమరావతిని వదలి బృహస్పతి చెప్పినట్లు చేసిరి. (3) ఇంద్రుడు వెంటనే నెమలి రూపమును ధరించి వెళ్ళెను (3) యముడు కాకిగా , కుబేరుడు తొండగా ,అగ్ని పావురముగా (పక్షిగా) మారి వెళ్లిరి(5)ఇట్లు వివిధ రూపములను ధరించిన దేవతలు స్వర్గమును విడిచి పవిత్రమైన కశ్యప మహర్షి ఆశ్రమమును భయముతో త్వరపడుతూ చేరిరి .(6) దైత్యులు చేస్తున్న దుష్కృత్యమును వారు తల్లియగు అదితికి విన్నవించిరి(7) పుత్రుల యందభిమానము గల అదితి ఆశుభ##మైన ఈ విషయమును విని ,దేవతలకు వచ్చిన ఈ కష్టమును గూర్చి కశ్యపునికి చెప్పెను. ఓ మహర్షీ! నా మాటను విని నేను చెప్పినట్లు చేయుము (8) ప్రజాపతి! దైత్యుల చేత ఓడిన దేవతలంతా అమరావతిని వీడి నీ ఆశ్రమమును చేరారు వారిని రక్షించుము అనినది.(9)

తస్మాస్తద్వచనం శ్రుత్వా కశ్యపో వాక్యమబ్రవీత్‌ | తపసా మహతా తన్వి జానీహి త్వం చ భామిని|| అజేయ హ్యసురా: సాధ్వి భృగుణా హ్యనుమోదితా:||10

తేషాం జయో హి తపసా ఉగ్రేణాద్యేన భామిని | కురు శీఘ్రతరేణౖవ సురాణాం కార్యసిద్దయే || 11

వ్రతమేతన్మహాభాగే కథయామ్యర్థసిద్దయే| 12

మాసి భాద్రపదే దేవి దశమ్యాం నియతా శుచి: ఏకభుక్తం ప్రకుర్వీత విష్ణో: ప్రీత్యర్థమేవ చ ||13

ప్రార్థనీయో హరి సాక్షాత్‌ సర్వకామవరేశ్వర: మంత్రేణానేన సుభ##గే తద్‌భ##క్తైర్వరవర్ణిని|| 14

తవ భక్తోస్మ్యహం నాథ దశమ్యాదిదినత్రయమ్‌ | వ్రతం చరామ్యహం విష్ణో అనుజ్ఞాం దాతుమర్హసి ||15

అనేనైవ చమంత్రేణ ప్రార్థనీయో జగత్పతి: ఏకభుక్తం ప్రకుర్వీత తచ్చ భక్తం చ కేవలమ్‌||16

రంభాపత్రే చ భోక్తవ్యం వర్జితం లవణన హి| ఏకాదశ్వాం చోపవాసం ప్రకుర్వీత ప్రయత్నత:||17

రాత్రౌ జాగరణం కుర్యాత్‌ ప్రయత్నేన సుమధ్యమే| ద్వాదశ్యాం నిపుణత్వేన పారణా తు విధానత:| కర్తవ్యా జ్ఞాతిభి :సార్థం భోజయిత్వా ద్విజోత్తమాన్‌ || 18

ఏవం ద్వాదశమాసాంస్తు కుర్యాద్‌ వ్రతమతంద్రిత : | మాసి భాద్రపదే ప్రాప్తే ఏకాదశ్యాం ప్రయత్నత: విష్ణుమభ్యర్చ్య యత్నేన కలశోపరి సంస్థితమ్‌ ||19

అదితి మాటను విని కశ్యపుడు ఇట్లనెను . ఓ సుందరీ గొప్ప తపస్సు చేత అసురులు జయింప వీలులేని వారు, భృగువుచేత అనుమతింపబడినారని తెలియుము. (10) దేవతల పని నెరవేరుటకై ఉగ్రమగు తపస్సుతో వెంటనే వారిని జయింపవలెను. (11)పని సిద్దించుటకు ఈ వ్రతము చెప్పెదను యథావిధిగా ప్రయత్న పూర్వకముగా దాని నాచరింపుము (12) భాద్రపద మాసమున దశమీ తిథియందు నియమమును గ్రహించి శుచిగా విష్ణువునకు ప్రీతి కలిగించుటకై ఒక పూట భోజనము చేయవలెను. (13)అన్ని కామములకు వరమునిచ్చు ప్రభువగు విష్ణువును విష్ణుభక్తులు ఈ మంత్రముతో ప్రార్థించవలెను.(14) ఓ ప్రభూ! నేను నీ భక్తుడను దశమీ మొదలుగా మూడురోజుల వ్రతము నాచరించు నాకు అనుమతినిమ్ము.(15) ఈ మంత్రముతో జగత్పతిని ప్రార్తించి, విభజించిన ఆహారమును ఒంటిపూట భుజించవలెను. (16) ఉప్పులేని ఆహారమును అరటి ఆకు పైనుంచి భుజించవలెను. ఏకాదశినాడు ప్రయత్నపూర్వకముగా ఉపవాసమునాచరించవలెను. (17) రాత్రి జాగరణము చేసి ద్వాదశినాడు తపవారితో సహా బ్రాహ్మణోత్తములకు భోజనము పెట్టిపారణము చేయవలెను. (18) భాద్రపదమాసము రాగా ఏకాదశినాడు ప్రయత్న పూర్వకముగా కలశము పై నున్న విష్ణువు నర్చించవలెను,(19)

సౌవర్ణం రాజతం వాపి యథాశక్తి ప్రకల్పయేత్‌ , శ్రవణన తు సంయుక్తాం ద్వాదశీం పాపనాశినీమ్‌|| వ్రతీ ఉపవసేద్‌ యత్నాత్‌ సర్వదోషప్రశాంతయే || 20

ఏవం హి కశ్యపేనోక్తం శ్రుత్వాదితిరథాచరత్‌ | వ్రతం సాంవత్సరం యావన్నియమేన సమన్వితా||21

వర్షాంతేన ప్రతేనైవ పరితుష్టో జనార్థన: | ప్రాదుర్భభూవ ద్వాదశ్యాం శ్రవణన తదా ద్విజా:||22

బటురూపధర: శ్రీ శో ద్విభుజ: కమలేక్షణ:| అతసీపుష్పసంకాశో వనమాలావిభూషిత:| 23

తం దృస్ఠ్యా విస్మయావిష్టా పూజామధ్యేదితిస్తదా | కశ్యపేన సమాయుక్తా సాస్తాషీత్‌ కమలేక్షణా|| 24

అదితరువాచ-

నమో నమ: కారణకారణాయ తే విశ్వాత్మనే విశ్వసృజే చిదాత్మనే | వరేణ్యరూపాయ పరావరాత్మనే హ్యకుంఠబోదాయ నమో నమస్తే || 25

ఇతి స్మృతస్తదాదిత్యా దేవానాం పతిరచ్యుత:ప్రవాస్య భగవానాహ అదితిం దేవమాతరమ్‌ ||26

శ్రీ భగవానువాచ-

తపసా పరమేణౖవ ప్రసన్నోహం తవానఘె | అమునా వపుషా చైవ దేవానాం కార్యసిద్దయే|| 27

శ్రుత్వా భగవతో వాక్యమదిస్తమువాచ హ | భగవన్‌ పరాజితా దేవా అసురైర్బలవత్తరై:|| తాన్‌ రక్ష శరణాపన్నాన్‌ సురాన్‌ సర్వాన్‌ జనార్దన|| 28

నిశమ్య వాక్యం కిల తచ్చ తస్యా విష్ణుర్వికుంఠాధిపతి: స ఏక: జ్ఞాత్వా చ సర్వం సురచేష్టితం తదా బలేశ్చ సర్వం చ చికీర్షితం చ ||29

కులశముపై విష్ణుప్రతిమను బంగారముతో గానీ, వెండితోగాని శక్తి కొలది చేయించవలెను శ్రవణా నక్షత్రముతో కూడినది పాపముల నశింపజేయునదియగు ద్వాదశీ తిథిన వ్రతము చేయువ్యక్తి అన్ని దోషములు నశించుటకై ఉపవాసము చేయవలెను.(20) ఇట్లు కశ్యపుడు చెప్పగా అదితి అట్లే చేసెను.నియమమును గ్రహించి సంవత్సరకాలము వ్రతమును చేసెను.(21)సంవత్సరమువగానే వ్రతము పూర్తి కాగా విష్ణువు సంతోషించి శ్రవణానక్షత్రముతో కూడిన ద్వాదశియందు సాక్షాత్కరించెను వటువు రూపమును ధరించిన విష్ణువురెండు భుజములుగలిగి పద్మముల వంటి నేత్రములు గలిగి అతసీ పుష్పమువలె ప్రకాశించుచూ వనమాలను ధరించియుండెను (23) అతనిని చూచి పూజమధ్యనున్న అదితి విస్మయమునొంది కశ్యపునితో కలిసి విష్ణువును స్తుతించెను. (24) అదితి పలికెను కారణమునకే కారణమైన వానికి, విశ్వాత్మునికి, విశ్వస్రష్టకు, చైతన్య రూపునకు, శ్రేష్ఠరూపునకు, పరావర రూపునకు, అకుంఠ జ్ఞానికి నమస్కారములు (25) అని అదితి స్మరించగా విష్ణువు నవ్వి దేవతల జననియగు అదితితో ననెను.(26) శ్రీ భగవంతుడనెను నీ గొప్ప తపస్సు చేత ప్రసన్నుడనైనాను. ఓ పాపరహితా! ఈ శరీరముతోనే దేవతల పనికొరకు ప్రసన్నుడనైనాను. (27) అనగా విని అదితి అనెను దేవా ! మిక్కిలి బలవంతులైన అసురుల చేతిలో ఓడిపోయి, శరణుజొచ్చిన దేవతలందరినీ రక్షించుము. (28) అనగా విని విష్ణువు సురులాచరించినది, బలి చేయగోరినదంతా తెలుసుకొనెను.(29)

కిం కార్యమద్యైవ మయా హి కార్యం యేనైవ దేవా జయమాప్నువన్తి | పరాజయం దైత్యవరాశ్చ సర్వే విష్ణు: పరాత్మైవ విచింత్య సర్వమ్‌ || 30

గదామువాచ భగవాన్‌ గచ్ఛస్వాద్య వధం ప్రతి | వైరోచనిం మహాభాగే ఘాతయస్వ త్వరాన్వితా|| 31

గదోవాచ హృషీకేశం ప్రహసన్తీవ భామినీ | మయా హ్యశక్యో వధితుం బ్రహ్మణ్యో హి బలిర్మహాన్‌ || 32

చక్రం ప్రతి తదా విష్ణురువాచ పరిసాన్త్యయన్‌ | త్వం గచ్చ బలినం హంతుం శీఘ్రమేవ సుదర్శన ||33

తదోవాచ త్వరేణౖవ చక్రపాణిం సుదర్శనమ్‌ | న శక్యతే మయా హంతుం బలినం హంతుం మహాప్రభో||34

బ్రహ్మణ్యోసి యథా విష్ణో తథాసౌ దైత్యపుంగవ: | ధనుషా చ తథైవోక్త: శార్‌జ్గిపాణిశ్చ విస్మిత:|| చింతయామాస బహుధా విమృశ్య సుచిరం బహు ||35

అత్రిరువాచ-

తదా తే హ్యసురా: సర్వే కిమకుర్వంస్తదుచ్యతామ్‌|| 36

లోమశ ఉవాచ:

తదా తే హ్యసురా: సర్వే బలిప్రభృతయో దివి | రురుధుర్నగరీం రమ్యాం యోద్దుకామా: పురందరమ్‌ ||37

న విదుర్హ్యసురా: సర్వే గతాన్‌ దేవాన్‌ త్రివిష్టపాత్‌ | నానారూపధరాంస్తస్మాత్‌ కశ్యపస్యాశ్రమం ప్రతి|| 38

దేవతలు జయము పొందునట్లు, దైత్యశ్రేష్టులు పరాజయము నొందునట్లు నేనేమి చేయవలెను అని విష్ణువు బాగా ఆలోచించెను. (30) తన గదతో విష్ణువు బలిని వధించుటకు వెళ్ళుమని అనగా (31) నవ్వుచూ ఆ గద బ్రహ్మణ్యుడైన బలిని తాను వధించలేనని అనెను (32) అపుడు ఓదార్చుచూ విష్ణువు బలిని వధించుటకు వెళ్ళుమని సుదర్శన చక్రముతో ననెను (33) అపుడా చక్రము బలిని వధించుట తన వల్ల కాదని అనెను. (34) ఓ విష్ణూ! నీవెట్లు బ్రహ్మణ్యుడవో ఈ దైత్యశ్రేష్టుడూ అట్లే అని ధనస్సు కూడా అనగా విష్ణువు విస్మయమునొంది, అనేక విధాలుగా విమర్శించి ఆలోచించెను (35) అత్రి పలికెను అపుడా సురులందరూ ఏమి చేసిరో చెప్పుడు (36) అనగా లోమశుడు చెప్పెను. అపుడా బలి మొదలగు అసురులందరూ ఇంద్రునితో యుద్దము చేయుటకై స్వర్గమున అమరావతిని ముట్టడించిరి (37) స్వర్గమునుండి దేవతలంతా అనేక రూపాలను ధరించి కశ్యపుని ఆశ్రమమునకు వెళ్ళి పోయారన్న విషయము దేవతలకు తెలియకుండినది.(38)

ప్రాకారమారుహ్య తదా హి సంభ్రమాద్‌ దైత్యా : సురేశం ప్రతి హంతుకామా:! యావత్‌ ప్రవిష్టా హ్యమరావతీం తాం శూన్యామపశ్యన్‌ పరితుష్టమానసా:|| 39

ఇంద్రసనే చ శుక్రేణ హ్యభిషిక్తో బలిస్తదా | సహాభిషేకవిధినాహ్యసురై: పరివారిత:||40

తథైవాధిష్టితో రాజ్యే బలిర్వైరోచనో మహాన్‌| శుశుభే పరయా భూత్యా మహేంద్రాధికృతస్తదా|| 41

నాగైశ్చాసురసంఘైశ్చ సేవ్యమానో మహేంద్రవత్‌ | సురద్రుమో జితస్తేన కామధేనుర్మణిస్తథా||42

దానైర్దాతా చ సర్వేషాం యేన్యే దానిత్వమాగతా: సర్వేషామేవ భూతానాం దానైర్దాతా బలిర్మహాన్‌||43

యాన యాన్‌ కామయతే కామాన్‌ తాన్‌ సర్వాన్వితరత్యసౌ |సర్వేభ్యోపి స చార్థిభ్యో దానవానామధీశ్వర:|| 44

శౌనక ఉవాచ:

దేవేంద్రో హి మహాభాగ న దదతి కదాచన| కథం బలిరసౌ దాతా కథయస్వ యథాతథమ్‌ ||45

లోమశ ఉవాచ-

యత్నతో యేన యత్కించిత్‌ క్రియతే సుకృతం నరై: శుభం వాస్యశుభం వాస్యశుభం వాపి జ్ఞాతవ్యం హి విపశ్చితా ||46

శక్రో హి యాజ్ఞికో విప్రా అశ్వమేధశ##తేన వై| ప్రాప్తరాజ్యోమరావత్యాం కేవలం భోగలోలువ:||47

అర్థితం తత్ఫలం విద్ది పున: కార్పణ్యమావిశత్‌ | పునర్మరణమావిశ్య క్షీణపుణ్యో భవిష్యతి||48

ప్రాకారము నెక్కి అసురలు ఇంద్రుని విధించుకోరికతో అమరావతియందు ప్రవేశించగా శూన్యముగా నున్న అమరావతికనబడెను. వారపుడు సంతోషించిరి.(39) శుక్రుడపుడు ఇంద్రుని అసనము పై బలిని అభిషేకించెను. అసురులతో కూడివున్న బలి అభిషేకింపబడెను.(40) అట్లు ఆసనమునధిష్టించిన బలి మహేంద్రుని అధికారమును పొంది గొప్ప ఐశ్వర్యముతో ప్రకాశించెను.(41) మహేంద్రునివలె నాగ గణములతో అసురగణములతో సేవించబడెను. కల్పవృక్షము, కామధేనువు, కౌస్తుభమణిమొదలగు వానిని జయించెను.(42) అందరికీ దానమిచ్చుట చేత బలి దాత కాగా , దానిచే ఇతరులు దానీ అని అనిపించుకొనిరి. అన్ని ప్రాణులకు గొప్పవాడైన బలియే దాతగా మారెను. (43) దానవరాజుఏఏ కోరికలతో తన నాశ్రయిస్తోరో వాటిని దానము చేసేవాడు (44) శౌనకుడనెను ఓ ఓ మహాభాగా! దేవేంద్రుడు ఎప్పుడు దానము చేయడు కదా! బలిదాత ఎట్లాయెను. వున్నదున్నట్లు చెప్పుము (45) లోమశుడునెను శుభముకానీ , ఆశుభము కానీ ప్రయత్నపూర్వకముగా దేనిచే నరులు కర్మనాచరింతురో దానిని విజ్ఞడు తెలుసుకొనవలెను. (46) ఓ బ్రాహ్మణులారా! యాజ్ఞికుడైన ఇంద్రుడు అశ్వమేథ యాగముల నూటినాచరించెను. దానిచే అమరావతిని పొంది కూడా భోగలాలసను పొందెను. (47) ఆఫలము సగమగుటచేత పిసినారితనము వచ్చినది ఇంద్రుడు మరల మరణము రాగా పుణ్యము క్షీణించినవాడు కాగలడు.(48)

య ఇంద్ర కృమిరేవ స్యాత్‌ కృమిరింద్రో హి జాయతే | తస్మాద్దానాత్‌ పరతరం నాన్యదస్తీహ మోచనమ్‌|| 49

దానాద్ది ప్రాప్యతే జ్ఞానం జ్ఞానాన్‌ మోక్షో న సంశయ: | మోక్షాత్పరతరా భక్తి : శూలపాణౌ హి వై ద్విజా:||50

దదాతి సర్వం సర్వేశ: ప్రసన్నాత్మా సదాశివ: | కించిదల్పేన తోయేన పరితుష్యతి శంకర:||51

అత్రైవోదాహరంతీమమితిహాసం పురాతనమ్‌ | విరోచనసుతేనేదం కృతమస్తి న సంశయ:|| 52

కితోవో హి మహాపాపో దేవబ్రాహ్మణనిందక : నికృత్యా పరయోపేత: పరదారరతో మహాన్‌ ||53

ఏకదా తు మహాపాపాత్‌ కైతవాచ్చ జితం ధనమ్‌ | గణికార్థే చ పుష్పాణి తాంబూలం చందనం తథా ||54

కాపీనమాత్రం తసై#్యవ కితవస్య ప్రదృశ్యతే | కరాభ్యాం స్వస్తికం కృత్వా గంధమాల్యాదికం చ యత్‌ || 55

గణికార్థముపాదాయ ధావమానో గృహం ప్రతి | తదా ప్రస్ఖలితో భూమౌ నిపపాత చ తత్‌క్షణాత్‌ ||56

పతనాన్మూర్ఛయా యుక్త: క్షణమాత్రం తదాభవత్‌ | తతో మూర్చాగతస్యాస్య పాపినోనిష్టకారిణ: 57

బుద్ది : సద్య: సముత్పన్నా కర్మణా ప్రాక్తనేన హి | నిర్వేదం పరమాపన్న: కితవో దు:ఖసంయుత:||58

భూమ్యాం నిపతితం యచ్చ గంధపుష్పాదికం మహత్‌ | సమర్పితం శివాయేతి కితవేనాప్యబుద్దినా||59

దానము చేయని ఇంద్రుడు అల్పమైన కీటకము కావచ్చు, దానమ చేసి అల్ప కీటకము ఇంద్రుడు కావచ్చు. కనుక దానము కంటే మించినది, ముక్తి ని కలిగించునది ఈ లోకమున లేదు (49) దానము వలన జ్ఞానము, జ్ఞానము వలన మోక్షము కలుగును. మోక్షము కంటే మించినది శివుని పట్ల భక్తి(50) ప్రసన్నుడైన సదాశివుడు దేనినైనా ఇవ్వగలడు, కొద్దిపాటి నీటిని సమర్పించిననూ శంకరుడూ సంతోషించును.(51) ఈ సందర్భంగా ఈ పురాతనమైన ఇతిహాసమును చెప్పెదరు,నిస్సంశయముగా ఇది విరోచన పుత్రుడైన బలిచేత జరిగినది.(52) ఒకానొక మహాపాపి యగు మోసగాడు, దేవతలను, బ్రహ్మణులను నిందించుచూ, పరమదరిద్రుడూననూ ఇతరుల భార్యలను కామించుచూ వుండినాడు(53) ఒకనాడు గొప్ప పాపము ద్వారా మోసము చేసి వేశ్యకొరకు ధనమును సంపాదించినాడు, ఆమెకై తాంబూలము, పుష్పములు,చందనమును గ్రహించెను (54) ఆ మోసగాడికి కౌపీనము మాత్రము మిగిలినది. కన్నమువేసి గంధమాల్యము మొదలగు వానిని(55) వేశ్యకొరకు తీసుకొని, ఇంటినుండి పరుగుతీస్తూ జారి నేలపై పడినాడు.(56) పడిపోవడం చేత మూర్చయందు క్షణకాలము వుండినాడు అపుడు మూర్చయందున్న అతనికి పురాకృత కర్మచేత బుద్ది కలిగి, దు:ఖముతో అమిత నిర్వేదమును పొందినాడు (57,58) బుద్దిలేని మోసగాడైననూ అ వ్యక్తి,భూమి పై పడిన గంధము పుష్పము మొదలగునవి శివునికి ఆక్షణముననే మనసులో సమర్పించెను.(59)

తేనైవ సుకృతేనైవ యమ్యైర్నీతో యమాలయమ్‌ | తం పాపీతి యమోవోచత్‌ సర్వలోకభయావహ:||60

పచనీయోసి మే మంద నరకేషు మహత్సు చ | ఇత్యుక్తో ధర్మరాజేన కితవో వాక్యమబ్రవీత్‌ ||61

పాపాచారో హి భగవన్‌ కశ్చిన్నైవ మయా కృత: విమృశ్యతాం మే సుకృతం యాథాతథ్యేన భో యమ||62

చిత్రగుప్తేన చాఖ్యాతం దత్తమస్తి త్వయా పున: పతితం చైవ దేహాంతే శివాయ పరమాత్మనే ||63

తేన కర్మవిపాకేన ఘటికాత్రయమేవ చ | శచీపతే: పదం విద్ది ప్రాప్స్యసి త్వం న సంశయ:||64

ఆగతస్తత్‌ క్షణాద్ధేవ: సురై సర్వై: సమన్విత: | ఐరావతం సమారుఢో నీతోసౌ శక్రమందిరమ్‌|| శక్ర: ప్రబోధితస్తేన గురుణా భావితాత్మనా || 65

ఘటికాత్రితయం యావత్తావత్‌ కాలం పురందర | నిజాసనేపి సంస్థాప్య: కితవోపి మమాజ్ఞయా|| 66

గురోర్వచనమాకర్ణ్య కృత్వా శిరసి తత్‌క్షణాత్‌ | గతోన్యత్రైవ శక్రోసౌ కితవో హి ప్రవేశిత:||67

శక్రాసనేభిషిక్తోసౌ రాజ్యం ప్రాప్త: శతక్రతో : | శంభోర్గంధప్రదానాచ్చ పుష్పతాంబూలసంయుతమ్‌ || 68

ఆ పాపి, అ మాత్రం సుకృతం చేత యమభటుల చేత యముని వద్దకు కొనిపోబడినాడు అన్ని లోకములకు భయమును కలిగించు యముడు ఇతను పాపి యని అనెను (60) మూర్ఖుడా ! నీవు మా నరకములయందు కాల్చబడుటకు యోగ్యుడవు ఇట్లు యముడనగా ఆ పాపియనెను.(61) ఓ యమా! నాపుణ్యమును వున్నది వున్నట్లుగా మరియొకసారి తరిచి చూడవలెను. ఏపాపపు ఆచారమునూ నేను చేయలేదు(62) అనగా చిత్రగుప్తుడనెను దేహావసాన సమయములో నీవు పరమాత్మయైన శివునకు నేలరాలినదానిని అర్పించావు (63) ఆకర్మ ఫలితంగా మూడు ఘటికల వరకు నీవు నిస్సంశయముగా ఇంద్రుని పదమును పొందెను (64) అనగా అదే క్షణములో దేవతలందరితో కలిసి ఇంద్రుడచటికి వచ్చి ఐరావతము పైన కూర్చోబెట్టి ఆ పాపిని స్వర్గమునకు తీసుకొనివెళ్ళెను. అపుడు మహాత్ముడైన బృహస్పతి ఇంద్రునితో ఇట్లనెను (65) ఓ యింద్రా ! ఇతను పాపి అయినప్పటికీనా ఆజ్ఞచేత మూడు ఘటికల వరకు నీ ఆసననముపై నిలపబడ వలెను. (66)అనగా ఇంద్రుడు గురువు మాటను విని, శిరసాధరించి వెంటనే వేరొకచోటికి వెళ్ళెను. తరువాత ఆ పాపి అనేక ఆశ్చర్యములతో కూడిన ఇంద్రభవనమును ప్రవేశించెను. (67)పుష్ప తాంబూల సహితమైన గంధమును శంకరునికి సమర్పించుటచేత ఆ పాపి ఇంద్రుని రాజ్యమును పొంది ఇంద్రాసనముపైన అభిషేకింపబడెను.(68)

కిం పున: శ్రద్ధయా యుక్తా : శివాయ పరమాత్మనే | అర్పయంతి సదా భక్త్యా గందపుష్పాదికం మహత్‌|| 69

శివసాయుజ్యమాయాతా: శివ సేనాసమన్వితా: | ప్రాప్నువన్తి మహామోదం శక్రో హ్యేషాంచ కింకర:||70

శిపూజారతానాం చ యత్‌ సుఖం శాంతచేతసామ్‌ | బ్రహ్మశక్రాదికానాం చ తత్‌ సుఖం దుర్లభం మహాత్‌ || 71

వరాకాస్తే న జానంతి మూఢా విషయలోలుపా: | వందనీయోమహాదేవో హ్యర్చనీయ: సదాశివ:|| 72

పూజనీయో మహాదేవ: ప్రాణిభిస్తత్త్వవేదిభి: తస్మాదింద్రత్వమాగమత్‌ కితవో ఘటికాత్రయమ్‌|| 73

పురోధసాభిషిక్తోసౌ పురందరపదే స్థిత: తదానీం నారదేనోక్త కితవో సౌ మహాయశా:||74

ఇంద్రాణీమానయస్వేతి యథా రాజ్యం సుశోభితమ్‌ తత: ప్రహస్య చోవాచ కితవ: శివవల్లభ:||75

ఇంద్రాణ్యా నాస్తి మే కార్యం న వాచ్యం తే మహామతే | ఏవముక్త్యాథ కితవ: ప్రదాతుముపచక్రమే ||76

ఐరావతమగస్త్యాయ ప్రదదౌ శివవల్లభ: విశ్వామిత్రాయ కితవో దదౌ హయముదారధీ:|| 77

ఉచ్చై:శ్రవససంజ్ఞం చ కామధేనుం మహాయశా:| దదౌ వశిష్ఠాయ తదా చింతామణిం మహాప్రభమ్‌ ||78

గాలవాయ మహాతేజాస్తదా కల్పతరుం చ స: | కౌండిన్యాయ మహాభాగ: కిలవొపి గృహం తదా|| 79

ఏవమాదీన్యనేకాని రత్నాని వివిధాని చ దదావృషిభ్యో ముదిత: శివ ప్రీత్యర్థమేవ చ ||

ఇక శ్రద్దతో పరమాత్మ యగు శివునికి ఎల్లప్పుడు భక్తితో గంధపుష్పాదులనిచ్చు వారిని గూర్చి చెప్పేదేముంది (69) వారు శివసాయుజ్యము ను పొంది శివసేనతో కూడి గొప్ప ఆనందమును పొందెదరు. ఇంద్రుడు కూడా వీరి సేవకుడగును (70) శివపూజయందనురక్తులైన వారగు ప్రశాంత చిత్తముగల వారికి కలుగు సుఖమును బ్రహ్మ ఇంద్రుడు మున్నగు వారుకూడా పొందలేరు (71) మూర్ఖులై విషయలోలులైన వారు అర్చకులు తెలియలేరు మహాదేవుడు, సదాశివుడు ఎల్లప్పుడూ పూజింపబడవలెను (72) తత్త్వమును తెలియు ప్రాణులు మహాదేవుని పూజింపవలెను దానిచేతనే మోసగాడు ,జూదరియగు వాడు మూడు ఘటికల కాలము వరకు ఇంద్రుడయినాడు '(73) బృహస్పతి చేత ఇంద్రాసనము పై అభిషేకింపబడినాడు. అపుడు గొప్పకీర్తిగల నారదుడతనితో యిట్లనెను. (74) నీకై ఇంద్రాణిని, శోభించు రాజ్యము వలె కొని తేగలము అనగా నవ్వి శివప్రియుడగు వాడిట్లనెను (75) ఇంద్రాణితో నాకు పనిలేదు గొప్ప బుద్దిగల నీకు చెప్ప పనిలేదు. అని అతను దానము చేయసాగెను. (76)అగస్త్యునికి ఐరావతమును, విశ్వామిత్రునికి ఉచై:శ్రవసమను గుర్రమును (77) వశిష్ఠునికి కామధేనువును చింతామణిని (78) గాలవునకు, కౌండిన్యునికి కల్పతరువును దానము చేసెను.(79) ఇట్టి అనేక రత్నములను ఆ శివభక్తుడు శివుని ప్రీతికై ఋషులకు దానముచేసెను.(80)

ఘటికాత్రితయం యావత్‌ తావత్కాలం దదౌ ప్రభు: ఘటికాత్రితయాదూర్థ్యం పూర్వస్వామీ సమాగత:|| 81

పురందరోz సురావత్యాముపవిశ్య నిజాసనే: ఋషిభి: సంస్తుతశ్చెవ శచ్యా సహ తదాభవత్‌ ||82

శచీమువాచ దుర్మేధా: కితవేనాసి భామిని| భుక్తా హ్యసై#్యవ కథయ యాథాతథ్యేన శోభ##నే||83

తదా ప్రవాస్య చోవాచ పురందరమకల్మషా | ఆత్మౌపమ్యేన సర్వత్ర పశ్యసి త్వం పురందర||84

అసౌ మహాత్మా కితవస్వరూపీ శివప్రసాదాత్‌ పరమార్థవిజ్ఞ: | వైరాగ్యయుక్తోహి మహానుభావో యేనాపి సర్వం పరమం ప్రపన్నమ్‌|| 85

రాజ్యాదికం మోహభయం చ పాశం త్యక్త్యా పరేభ్యో విజయీ స జాత:|| 86

వచో నిశమ్య దేవేశ ఇంద్రాణ్యా:స పురందర: | వ్రీడాయుక్తోభవత్తూప్ణీమింద్రాసనగతస్తదా || 87

బృహస్పతిమువాచేదం వాక్యం వాక్యవిదాం వర: ఐరావతో న దృశ్యేత తథైవోచ్చై:శ్రవా హయ:||88

పారిజాతాదయ: సర్వే పదార్థా: కేన వా హృతా: తతో గురురువాచేదం కితవేన కృతం మహత్‌ || 89

ఋషిభ్యో దత్తమద్యైవ యావత్‌ సత్తా హి తస్య వై| స్వసత్తాయాం మహత్యాం చ స్వసత్తా యే భవన్తి చ|| 90

మూడు ఘటికల వరకు అతను దానము చేసెను.అటుపైన పూర్వస్వామియగు ఇంద్రుడు వచ్చెను. (81) అతను తన ఆసనముపై కూర్చొని, శచీదేవితో సహా ఋషులచేత స్తుతింపబడెను. (82) దుర్మతియగు ఇంద్రుడు శచీదేవిని చూచి ఇట్లనెను భామినీ! నీవా ధూర్తుడిచేత అనుభవింపబడితివా? యథాతథముగా చెప్పుము (83) అనగా అపుడు కల్మషములేని శచీదేవి ఇంద్రుని చూచి నవ్వి నీవలెనే అంతటా చూచుచున్నావు ఇంద్రా!(84) ఈ వ్యక్తి ధూర్తుడి రూపంలో నున్న మహాత్ముడు. శివుని అనుగ్రహముచేత పరమారమును తెలిసినవాడు. వైరాగ్యము గలవాడు అతని గొప్ప రాజ్యమునంతా ,మోహభయ రూపమైన పాశమును విడిచి విజయమునొందినాడు.(86) అని శచీదేవి పలుకగా విని ఇంద్రుడు ఇంద్రాసనము పైన సిగ్గుపడుచూ ,మాట్లాడకుండా వుండెను. (87) అపుడు బృహస్పతిని చూచి ఇంద్రుడు ఐరావతము , ఉచ్చై:శ్రవము కనిపించుటలేదు (88) పారిజాతము మొదలైన పదార్థములన్నీ ఎవరిచేత హరింపబడినవి? అనగా బృహస్పతి ఆ ధూర్తుని చేతనే అని చెప్పెను.(89) అతనెంత కాలముండెనో అంతకాలము ఋషులకు దానమిచ్చెను. తమ ఉనికి గొప్పదిగా నున్నప్పుడు ఉనికిని కోల్పోనివారు శివునికి ఇష్టులు (90) అప్రమత్తాశ్చ యే నిత్యం శివధ్యాన పరాయణా: తే ప్రియా: శంకరసై#్వవ హిత్వా కర్మఫలాని వై|| కేవలం జ్ఞానమాశ్రిత్య తే యాంతి పరమం పదమ్‌' 91

ఏతత్‌శ్రుత్వా వచనం తస్య చేంద్రో బృహస్పతేర్వాక్యమిదం బభాషే! ప్రాయో యమో వక్ష్యతి సర్వమేతత్‌ సమృద్దయే హ్యాత్మనశ్చైవ శక్ర:||92

తథేతి మత్వా గురుణా సహైవ రాజా సురాణాం సహసా జగామ| స్వకార్యకామో హి తథా పురందరో య¸° పురీం సంయమనీం తదానీమ్‌ ||93

యమేన పూజ్యమానో హి శక్రో వాక్యమువాచ హ| త్వయా దత్తం మమ పదం కితవాయ దురాత్మనే ||94

అనేనైతత్‌ కృతం కర్మ జుగుప్సితం మహత్తరమ్‌ | మదీయాని చ రత్నాని యాని సర్వాణ్యనేన వై| ఏభ్య ఏభ్య: ప్రదాత్తాని ధర్మ జానీహి తత్త్వత:|| 95

త్వం ధర్మనామాసి కథం కితవాయ ప్రదత్తవాన్‌ | మమ రాజ్యవినాశాయ కృతమస్తి త్వయాధునా ||96

ఆనయస్వ మహాభాగ గజాదీని చ సత్వరమ్‌ | అన్యాని చైవ రత్నాని దత్తాని చ యతస్తత:97

నిశమ్య వాక్యం శక్రస్య యమో వచనమబ్రవీత్‌ | కితవం చ రుషావిష్ట: కిం త్వయా పాపినా కృతమ్‌ ||98

భోగార్థం చైవ యద్తత్తం శక్రరాజ్యం త్వయాధునా | ప్రదత్తం చ ద్విజాతిభ్యో హ్యన్యథా వై కృతం మహత్‌||99

అకార్యం వైత్వయా మూడ పరద్రవ్యాపహారణమ్‌ | తేన పాసేన మహతా నిరయం ప్రతిగచ్ఛసి||100

ఎవరు అప్రమత్తులై నిత్యము శివధ్యానమే పరముగా తలచెదరో వారు శంకరునికి ఇష్టులు.కర్మ ఫలములను విడిచి కేవలం జ్ఞానాన్ని ఆశ్రయించినవారు పరమపదమును పొందెదరు. (91) బృహస్పతి మాటలను విని ఇంద్రుడిట్లనెను చాలా వరకు యముడు దీని గూర్చి చెప్పగలడు. అని తన సంపద కొరకై (92) ఇంద్రుడు నిశ్చయించుకొని గురువుతో కలిసి తన పని నెరవేరుటకు యమపురికి వెళ్ళెను. (93) యముడు ఇంద్రుని పూజించిన పిదప, ఇంద్రుడిట్లనెను నీవే నా పదవిని దురాత్ముడగు ధూర్తుడగు వ్యక్తికి ఇచ్చితిని.(94)

అతను చాలా జగుప్సితమైన ఈ కర్మనిట్లు చేసాడు నారత్నాలనన్నింటిని ఆయా వ్యక్తులకు ఇచ్చివేసినాడు. ధర్మరాజా! వాస్తవమును తెలిసికొనుము(95) నీవు ధర్మమను పేరుగలవాడవు ధూర్తుడికెట్లు ఇచ్చితివి? నా రాజ్యవినాశనానికై నీవట్లు చేసితివి, (96) ఇపుడా గజము మొదలగు వానిని, మిగతా రత్నములన్నింటిని ఎవరికి ఇవ్వబడినవో అక్కడి నుండి తెమ్ము(97) అని ఇంద్రుడు అనగా యముడు కోపగించి కితవునితో నిట్లనెను పాపివైన నీవేమి చేసితివి? (98) భోగము కొరకు నీకివ్వబడిన ఇంద్రరాజ్యమును బ్రాహ్మణులకు దానము చేసితివి.(99) ఇంకా వేరే రీతిగా నీవు ఇతరుల ద్రవ్యమునపహరించుటను ఆకార్యమునుచేసితివి. దానివలన ఘోరపాపము నొంది నరకమునకు వెళ్ళగలవు.(100)

యమస్యవచనం శ్రుత్వా కితవో వాక్యమబ్రవీత్‌ | అహం నిరయగామీ చ నాత్ర కార్యావిచారణా || 101

యావత్‌ స్వతా మమ విభో జాతా శక్రాసనే తథా| తావత్‌ దత్తం హి యత్కించిద్‌ ద్విజేభ్యో హి యథాతధమ్‌ || 102

యమ ఉవాచ-

దానం ప్రశస్తం భూమ్యాం చ దృశ్యతే కర్మణ: ఫలమ్‌ | స్వర్గే దానం న దాతవ్యం కేనచిత్‌ కస్యచిత్‌ క్వచిత్‌ || తస్మాద్‌ దండ్యోసి రే మూఢ అశాస్త్రీయం కృతం త్వయా || 103

గురురాత్మవతాం శాస్త్రా రాజా శాస్తా దురాత్మనామ్‌ | సర్వేషాం పాపశీలానాం శాస్తాహం నాత్ర సంశయ:|| 104

ఏవం నిర్భర్‌త్సయిత్వా తం కితవం ధర్మరాట్‌ స్వయమ్‌ | ఉవాచ చిత్రగుప్తం చ నరకే పచ్యతామయమ్‌ ||105

తదా ప్రహస్య చోవాచ చిత్రగుప్తో యమం ప్రతి|| కథం నిరయయగామిత్వం కితవస్య భవిష్యతి | యేన దత్తో హ్యగస్త్యాయ గజ ఐరావతో మహాన్‌ || 106

తథాశ్వో హ్యబ్దిసంభూతో గాలవాయ మహాత్మనే |విశ్వామిత్రాయ భద్రం తే చింతామణిర్మహాప్రభ:|| 107

ఏవమాదీని రత్నాని దత్తాని కితవేన హి తేన కర్మవిపాకేన్‌ పూజనీయో జగత్‌త్రయే|| 108

శివముద్దిశ్య యద్దత్తం స్వర్గే మర్త్యే చ యైర్నరై: తత్సర్వం త్వక్షయం విద్యాన్నిశ్చిద్రం కర్మ చోచ్యతే || తస్మాన్నరకముగామిత్వం కితవస్య నవిద్యతే || 109

యముని మాటలను విని ధూరుడిట్లనెను. నేను నరకమునకు వెళ్ళువాడను. ఇందు విచారణ చేయనవసరం లేదు.(101) ఎంతవరకు నాకు ఇంద్రాసనముపైస్వత్వము కలిగెనో అంతవరకు బ్రాహ్మణులకు ఎంతో కొంత యథాతథముగా దానమిచ్చితిని.(102)యముడు అనెను భూలోకమున దానము శ్రేష్ఠమైనది ఆ కర్మయొక్క ఫలితము కూడా కనిపించుచున్నది స్వర్గమున మాత్రము ఎవరూ ,ఎవరికీ, ఎక్కడా, ఏమాత్రమూ దానమివ్వరాదు. శాస్త్రవిరుద్దంగా ప్రవర్తించిని నీవు దండనకు అర్హుడవు (103) బుద్దిమంతులకు గురువే శాసనమునిచ్చువాడు, దురాత్ములకు రాజే శాసకుడు మిగతా పాపశీలురందరినీ శాసించువాడను నేనే (104)అని ఆ ధూర్తుని ధర్మరాజే స్వయముగా బెదరించి చిత్రగుప్తునితో ఆ ధూర్తుని నరకమున కాల్పమని అనెను.(105)అపుడు చిత్రగుప్తుడు నవ్వి యమునితో ఇట్లనెను కితవుడు నరకమునకెట్లు వెళ్ళును? అగస్త్యునకు ఐరావతమను ఏనుగును (106) గాలవుడను ఋషికి సముద్రమునుండి జనించిన అశ్వమును, విశ్వమిత్రునికి చింతామణిని (107) ఇంకా ఇట్టి ఇతర రత్నములను దానముచేసెను. ఆ కర్మఫలముచేత అతను ముల్లోకములయందు పూజింపదగినవాడు(108) స్వర్గమునగాని, భూలోకమున గానీ ఏ నరులు శివుని ఉద్దేశించి ఏకాంతదానమును చేసెదరో అది అంతా అక్షయమగునని తెలియవలెను. ఆ కర్మకూడా సంపూర్ణమగును కనుక కితవుడు నరకమునకు వెళ్ళుట లేనేలేదు,(109)

యాని యాని చ పాపాని కితవస్య మహాత్మన: భస్మీభూతాని సర్వాణి జాతాని స్మరణాచ్చ వై|| 110

శంభో: ప్రసాదాత్‌ సర్వాణి సుకృతాని చ తత్‌క్షణాత్‌ | తద్వచశ్చిత్రగుప్తస్య నిశమ్య ప్రేతరాట్‌ స్వయమ్‌|| 111

ప్రహస్యావాజ్ముఖో భూత్వా ఇదమాహ శతక్రతుమ్‌ | త్వయా నాస్త్యత్ర సందేహో హార్జితం తేన వై మహత్‌ || 113

ప్రార్థయిత్వా హ్యగస్త్యాదీన్‌ మునీన్‌ సర్వాన్‌ విశేషత: అర్థేన ప్రణిపాతేన త్వయా లభ్యాని తాని చ || గజాదికాని రత్నాని యేన త్వం చ సుఖీ త్వరన్‌ || 114

తథేతి మత్వా వచనం పురందరో గత: పురీం స్వామవివేకదృష్టి: | అభ్యర్థయామాస వినమ్రకంధర శ్చర్షీంస్తతో లబ్దవాన్‌ పారిజాతమ్‌ ||115

అనేనైవ ప్రకారేణ లబ్దరాజ్య: పురందర: జాతస్తదామరావత్యాం రాజా సహ మహాత్మభి :||116

కితవస్య పునర్జన్మ దత్తం వైవస్వతేన హి | కించిత్కర్మవిపాకేన విరోచనసుతోభవత్‌||117

సురుచిర్జననీ తస్య కితవస్యాభవత్తదా | విరోచనస్య మహిషీ దుహితా వృషవర్వణ:||118

తదాప్రభృతి తసై#్యవ ప్రహ్లాదస్యాత్మజస్మ వై| సురుచేశ్చ తథాప్యాసీద్దర్మే దానే మహామతి:||119

మహాత్ముడైన ఆ జూదరి పాపములేని వుండెనో అవి శివుని స్మరణచేత భస్మమాయెను(110) శివుని ప్రసాదము చేత అదే క్షణములో అన్నీ సుకృతములాయెను. చిత్రగుప్తుని మాట విన్న యముడు (111) నవ్వి తలవంచి ఇంద్రునితో ఇట్లనెను నీవు దేవతల రాజువి.వృద్దుడవు రాజ్యలంపటము గలవాడవు (112) నూరు అశ్వమేథముల చేత ఒక జన్మలో మిగుల పుణ్యము ఆర్జించబడినది. ఇందు సందేహము లేదు. దానిచే గొప్ప స్థితిని పొందితివి. (113) అగస్త్యుడు మొదలైన మునులను విశేషముగా ప్రార్థించి, యాచించి, పాదపతనముచేత నీవు గజము మొదలైన రత్నాలను పొందగలవు. సుఖముగా నుండెదవు(114)ఈ ప్రకారముగానే ఇంద్రుడు రాజ్యమును పొంది అమరావతియందు మహాత్ములతో కలిసి రాజాయెను.(116) యముడు జాదరికి పునర్జన్మ నివ్వగా దాని ఫలితంగా అతను విరోచనుని పుత్రుడాయెను.(117)

అతని తల్లి సురుచి, ఆమె వృషపర్వుని కూతురు,విరోచనుని భార్య ఆమె ఉదరముననుచేరి ఆ మహాత్ముడుండెను (118) అది మెదలగు ప్రహ్లాదుని పుత్రుడగు బలికి సురుచికి దానధర్మములయందు గొప్ప బుద్ది కలిగెను (119)

తేనైవ జఠరస్థేన కృతా మతిరనుత్తమా | కితవేన కృతా విప్రా దుర్లభా యా మనీషిణామ్‌ ||120

ఏకదా వై తదా శక్రో య¸° వైరోచనం ప్రతి| హంతుకామో హి దైత్యేంద్రం విప్రో భూత్వాథ యాచక :||121

విరోచనగృహం ప్రాప్త ఇంద్రో వాక్యమువాచ హ| స్థవిరో బ్రాహ్మణో భూత్వా దేహితి మమ సుప్రత|| మనస్వీ త్వం చ దైత్యేంద్ర దాతా చ భువనత్రయే ||122

తవ విప్రా మహాభాగ చరితం పరమాద్భుతమ్‌ | వర్ఱయన్తి సమాజేషు స్థిత్వా కీర్తిం చ నిర్మలామ్‌ ||యాచకోహం చ దైత్యేంద్ర దాతుమర్హసి సుప్రత|| 123

తస్య తద్వచనం శ్రూత్వా దైత్యేంద్రో వాక్యమబ్రవీత్‌ | కిం దాతవ్యం తవ విభో వద శీఘ్రం మమాధునా||124

ఇంద్రో హి విప్రరూపేణ విరోచనమువాచ హ | యాచయామి చ దైత్యేంద్ర యదహం పరిభావిత:||125

ఆత్మప్రీత్యా చ దాతవ్యం మమ నాస్త్యత్ర సంశయ: ఉవాచ ప్రవాసన్‌ వాక్యం ప్రహ్లాదస్యాత్మజోసుర:||126

దదామ్యాత్మశిరో విప్ర యది కామయసేధునా | ఇదం రాజ్యమనాయాసమియం శ్రీర్నాన్యగామినీ ||అహం సమర్పయిష్యామి తవ నాస్త్యత్ర సంశయ:||127

ఇత్యుక్తస్తేన దైత్యేన విమృశ్య చ తదా హరి: ఉవాచ దేహి మే స్వీయం శిరో ముకుటసేవితమ్‌||128

జఠరమున నుండగానే శ్రేష్ఠమైన బుద్దిని కితవుడు పొందెను. ఆ బుద్ది ఇతరులు పొందలేనిది (120) ఒకనాడు ఇంద్రుడు బలిని వధించదలిచి, యాచకుడగు విప్రుని రూపంలో అతని దగ్గరకు వెళ్ళెను (121) బలిగృహమును చేరిన ఇంద్రుడు వృద్దబ్రాహ్మణుడై ఓ దైత్యరాజా! విప్రులు గోష్ఠులలో ఏ పరమాద్భుత చరిత్రను నిర్మలమైన నీ కీర్తిని వర్ణింతురు. నేను యాచకుడై వచ్చితిని. దానమునిమ్ము (123) అతని మాటలను విన్న బలి నేను నీకేమి ఇవ్వగలనో త్వరగా చెప్పుమని అనెను (124)విప్రరూపములో ఇంద్రుడు బలితో ఇట్లనెను ఓ రాక్షసరాజా! నీవు నన్ను గౌరవించినట్లయితే నిన్ను యాచించెదను (125) నీకు అమిత ప్రీతికరమైన దానిని నీకు ఇవ్వుము. ఇందు సంశయము లేదనిన, నవ్వి బలి ఇట్లనెను (126) ఓ విప్రుడా నీవు కోరినచో నా తలను కూడా ఇచ్చెదనిపుడు . అనాయాసమైన ఈ రాజ్యమును ఇంకోకరిని చేరని ఈ వైభవమును నీకు సమర్పించెదను, ఇందు సంశయము లేదు.(127) అని దైత్యరాజు అనగా , ఇంద్రుడు ఆలోచించి ముకుటముతో కూడిన నీ తలను నాకు ఇమ్ము అని కోరెను.(128)

ఏవముక్తే తు వచనే శ##క్రేణ ద్విజరూపిణా | త్వరన్మ హేంద్రాయ తదా శిర ఉత్కృత్య వై ముదా || స్వకరేణ దదౌ తసై#్మ ప్రహ్లాదస్యాత్మజోసుర:|| 129

ప్రహ్లాదేవ పురా యస్తు కృతో ధర్మ: సుదుష్కర :| కేవలాం భక్తిమాశ్రిత్య విష్ణోస్తత్పరచేతసా||130

దానాత్పరతరం చాన్యత్‌ క్వచిద్వస్తు న విద్యతే| స్వశక్త్యా యచ్చ కించిచ్చ తదానంత్యాయ కల్పతే | దానాత్‌ పరతరం నాన్యత్‌ త్రిషు లోకేషు విద్యతే || 132

సాత్త్యికం రాజసం చైవ తామసం చ ప్రకీర్తితమ్‌ తథా కృతమనేనైవ దానం సాత్త్వికలక్షణమ్‌||133

శిర ఉత్కృత్య చేంద్రాయ ప్రదత్తం విప్రరూపిణ| కిరీట : పతితస్తత్ర మణయో హి మహాప్రభా:|| 134

ఐక్యపద్యేన పతితాస్తే జాతా మండలాయ వై దైత్యానాం చ నరేంద్రాణాం పన్నగానాం తథైవ చ||135

విరోచనస్య తద్దానంత్రిషు లోకేషు విశ్రుతమ్‌ | గాయంత్యద్యాపి కవయో దైత్యేంద్రస్య మహాత్మనః||136

విరోచనస్య పుత్రోభూత్‌ కితవో సౌ మహాప్రభ: మృతే పితరి జాతోసౌ మాతా తస్య పతివ్రతా||137

కలేవరం చ తత్యాజ పతిలోకం గతా తత:| భార్గవేణాభిషిక్తోసౌ జనకస్య నిజసనే||138

నామ్నా బలిరితి ఖ్యాతో బభూవ చ మహాయశా:|| తేనసర్వే సురగణా: త్రాసితా: సుమహాబలా:|| 139

బ్రాహ్మణరూపములో ఇంద్రుడట్లనగా ప్రహ్లాదపుత్రుడగు బలి తన తలను నరికి తన చేతులతోనే సంతోషముగా ఇంద్రునికి దానమిచ్చెను. (129) పూర్వము ప్రహ్లాదుడు కేవలము విష్ణుభక్తినాశ్రయించి, తత్పరచిత్తుడుగా ఏ దుష్కరమగు ధర్మమునాచరించెనో అట్టిదిది(130) దానము కంటె శ్రేష్టమైనది ఏదీ లేదు ఆ దానముకూడా ఆర్తులకు చేసిన మహాపుణ్యము(131) తనశక్తిలో ఏ కొద్ది మాత్రము దానమిచ్చిననూ అది అనంతరమగును ముల్లోకములలో దానముకంటే మించినది లేదు (132) దానము సాత్త్వికము, రాజసయు, తామసము అని మూడు విధములు,బలి చేసిన దానము సాత్త్వికమగునది (133) శిరస్సును నరికి విప్రరూపియగు ఇంద్రుడికి దానము చేయుట సాత్త్వికము కిరీటము పడిపోయినది గొప్పకాంతి గల మణులు కూడా (134) ఒక్కమారుగా పడిపోయి మండలముగా మారినవి దైత్యులలో రాజులలో నాగులలో కూడా (135) బలిదానము ముల్లోకములలో ప్రసిద్దిమైనది దైత్యేంద్రుని గొప్పదనమును కవులిప్పటికీ గానము చేతురు.(136) ఈ గొప్పకాంతిగల జూదరి విరోచనుని పుత్రుడాయెను తండ్రి మరణించగా అతను జన్మించెను. తల్లి పతివ్రత(137) శరీరాన్ని వదలి పతిలోకమునకు వెళ్ళిను. బలి తండ్రి సింహాసనము పై భార్గవునిచే అభిషిక్తుడాయెను. (138) బలి అనుపేరుతో గొప్ప కీర్తిని పొందిన వైరోచనునిచే మహాబలము గల సురగణములన్నీ బెదరకొట్టబడెను.(139)

గతాస్తే కథితా: పూర్వం కశ్యపస్యాశ్రమం శుభమ్‌ | తదా బలిరభూదింద్రో దేవపుర్యాం మహాయశా:|| 140

స్వయం తతాప తపసా సూర్యో భూత్వా తదాసుర : ఈశో భూత్వా స్వయం చాస్తే ఐశాన్యాం దిశి పాలయన్‌ ||141

తథా చ నైర్‌ఋతో భూత్వా తథా త్వంబుపతి : స్వయమ్‌| ధనాధ్యక్ష ఉదీచ్యాం వై స్వయమాస్తే బలిస్తదా|| ఏవమాస్తే బలి: సాక్షాత్‌ స్వయమేవ త్రిలోకభుక్‌||142

శివార్చనరతేనైవ కితవేన బలిర్ద్విజా: పూర్వాభ్యాసేన తేనైవ మహాదానరతోభవత్‌||143

ఏకదా తు సభామధ్యే ఆస్థితో భృగుణా సహ| దైత్యైంద్రై: సంవృత: శ్రీమాన్‌ చండామార్కో వచోబ్రవీత్‌|| 144

ఆవాస: క్రియతామత్ర అసురైర్మమసన్నిధౌ | హిత్వా పాతాలమద్యైవ మా విలంబితుమర్హథ||145

భార్గవస్తదుపశ్రుత్య ప్రవాస్యేదమువాచ హ| యజ్ఞైశ్చ వివిధైశ్చైవ స్వర్గలోకే మహీయతే || 146

యాజ్ఞికైశ్చ మహారాజ నాన్యథా స్వర్గమేవ హి| భోక్తుం హి పార్యతేరాజన్నాన్యథా మమ భాషితమ్‌ ||147

గురోర్వచనమాజ్ఞాయ దైత్యేంద్రో వాక్యమబ్రవీత్‌ | మయా కృతం చ యత్కర్మ తేన సర్వే మహాసురా:||స్వర్గే వసంతు సుచిరం నాత్ర కార్య విచారణా||148

ప్రవాస్యోవాచ భగవాన్‌ భార్గవాణాం మహాతపా: బలినం బాలిశం మత్వా శుక్రో బుద్దిమతాం వర:||149

ఇంతకు ముందు చెప్పిన ఆ దేవతలుకశ్యపుని ఆశ్రమమునకు వెళ్లిరి. అపుడు బలి దేవపురియందు ఇంద్రుడాయెను(140) స్వయముగా తపస్సు చేసి సూర్యుడాయెను ఈశ్వరుడుగా అయిన బలి ఈశాన్య దిక్కును పాలించెను.(141) అట్లే నైర్‌బుతుడై వరుణుడై, ఉత్తరమునకు కుబేరుడై బలి స్వయముగా నుండెను. ఇట్లు ముల్లోకముల పాలించువానిగా బలియుండెను.(142) ఓ బ్రాహ్మణులారా! శివార్చనరతుడైన కితపుడుకనుక బలి పూర్వజన్మ అభ్యాసము చేత గొప్ప దానరుతుడాయెను.(143) ఒకనాడు సభమధ్యలో భృగు మహర్షితో నుండగా బలి నుద్దేశించి చండామార్యుడు ఇట్లనెను.(144) పాతాలమును వదలి అసురులు వెంటనే నా సన్నిధిలో ఇక్కడ నివాసమును చేయవలెను.ఆలస్యము చేయరాదు (145) భార్గవుడదివిని నవ్వి ఇట్లనెను వివిధయజ్ఞములతో స్వర్గమున వాసికెక్కుదురు.(146) యజ్ఞము చేసిన వారికే తప్ప వేరే విధముగాస్వర్గముననుభవించుట కుదరదు. ఓ రాజా! నామాటలు వేరే విధముగా కావు.(147) గురువు మాటను విని బలి ఇట్లనెను నేనాచరించినకర్మచేత అసురులంతా స్వర్గమున వసింతురు గావుత. ఇందు విచారించవలిసినది లేదు.(148) అపుడు గొప్పతపస్సంపన్నుడైన వాడు, బుద్దిమంతులలో శ్రేష్ఠుడు అగు శుక్రుడు బలిని మూర్ఖునిగా తలచి, నవ్వి ఇట్లనెను.(149)

యత్త్వయోక్తం చ వచనం బలే మమ న రోచతే | ఇహైవ త్వం సమాగత్య వస్తుం చేచ్ఛసి సువ్రత ||150

అశ్వమేధశ##తేనైవ యజ త్వం జాతవేదసమ్‌ | కర్మభూమిం గతో భూత్వా మా విలంబితుమర్హసి||151

తథేతి మత్వా స బలిర్మహాత్మా హిత్వా తదానీం త్రిదివం మనస్వీ| దైత్యై : సమేతో గురుణా చ సంగతో య¸° భువం సోనుచరై: సమేత:|| 152

తన్నర్మదాయా గురుకుల్య సంజ్ఞకం తీరే మహాతీర్థముదారశోభమ్‌ | గత్వా తదా దైత్యపతిర్మహాత్మా జిత్వా సమగ్రం వసుధాతలం చ|| 153

తతోzశ్వ మేదైర్బహుభిర్విచక్షణో గురుప్రయుక్త: స మహాయశా బలి: | ఈజే చ దీక్షాం పరమాముపేతో వైరోచనిం సత్యవతాం వరిష్ఠ:||154

కృత్వా బ్రాహ్మణమాచార్యమృత్విజ: షోడశాభవన్‌ | సుపరీక్షితేన తేనైవ భార్గవేణ మహాత్మనా |155

యజ్ఞానామూనమేకేన శతం దీక్షాపరేణ హి| బలినా చాశ్వమేధానాం పూర్ణం కర్తుం సమాదధే||156

యావద్యజ్ఞశతం పూర్ణం తస్య రాజ్ఞో భవిష్యతి| పురా ప్రోక్తం మయా చాత్ర హ్యదిత్యా వ్రతముత్తమమ్‌||157

ప్రతేన తేన సంతుష్టో భగవాన్‌ హరిరీశ్వర: | బటురూపేణ మహతా పుత్రభూతో బభూవ హ||158

అదిత్యా : కశ్యపేనైవ ఉపనీతస్తదా ప్రభు: | ఉపనీతేzథ సంప్రాప్తో బ్రహ్మా లోకపితామహ:||159

'బలీ! నీవన్నమాట నాకురుచించుటలేదు ఇక్కడకే వచ్చి నీవు నివసించగోరుచున్నావు.(150) అట్లైన విలంబము చేయక కర్మభూమి చేరి ఆశ్వమేధ యాగములు నూటిచే అగ్నిని యజించుము.(151) అలాగేనని తలిచి మనస్వియగు బలి అపుడు స్వర్గమును వీడి దైత్యులతో, గురువుతో కలిసి భూలోకమును చేరెను. (152) నర్మదా నదీతీరమున గురుకుల్యమను గొప్పతీర్థమును చేరిన దైత్యపతి, భూతలము నంతా జయించెను.(153) గురువుచేత ప్రేరితుడైన బలి పరమదీక్షతో అశ్వమేథయాగములచేత యజించెను (154) బ్రాహ్మణుని ఆచార్యునిగా చేసి, భార్గవునితో ఋత్విజులు పదహారుమంది అయిరి.(154) దీక్షాపరుడైన బలి అశ్వమేథ యాగముల తొంబైతొమ్మిదిటిని సంపూర్ణము చేయుటకు సన్నద్దుడాయెను.(156) నూరు యజ్ఞములు పూర్తి కాగా బలిచక్రవర్తికి పూర్వము నేను అదితికిచెప్పిన ఉత్తమవ్రతమట్లే జరుగును.(157) అదితికి పుత్రుడైన వటురూప విష్ణువునకు కశ్యపుడే ఉపనయనము చేసెను. ఉపనయనము కాగా లోక పితామహుడగు బ్రహ్మ అచటికి వచ్చెను.(159)

దత్తం యజ్ఞోపవీతం చ బ్రహ్మణా పరమేష్ఠినా | దండకాష్ఠం ప్రదత్తం హి సోమేన చమహాత్మనా ||160

మేఖలా చ సమానీతా అజినం చ మహాద్భుతమ్‌ | తథా చ పాదుకే చైవ మహ్యా దత్తే మహాత్మన:||161

తత్ర భిక్షా సమానీతా భవాన్యా చార్థసిద్దయే | ఏవం భగవతే దత్తం విష్ణవే వటురూపిణ|| 162

అభివంద్య తథా శ్రీశో వామనో హ్యదితిం తథా|కశ్యపం చ మహాతేజాయజ్ఞవాటం జగామ చ|| యాజ్ఞికస్య బలేరాహ ఛలనార్థం స్వయం ప్రభు:|| 163

తదా మహేశ: స జగామ స్వర్గం ప్రకంపయన్‌ గాం ప్రవదా భ##రేణ | స వామనో వటురూపీ చ సాక్షాద్విష్ణు : పరాత్మా సురకార్యహేతో:|| 164

గీర్భిర్యథార్థాభిరభిష్ఠుతో జనైర్మునీశ్వరైర్ధే హత్మా | త్వరేణ గచ్ఛన్‌ స యజ్ఞవాటం ప్రాప్తస్తదానీం జగదేకబంధు:||165

ఉద్గాపయన్‌ సామ యతో హి సాక్షాచ్చకార దేవో బటురూపవేష: ఉద్గీయమానో భగవాన్‌ స ఈశ్వరో వేదాంతవేద్యో హరిరీశ్వర: ప్రభు: ||166

దదర్శ తం మహాయజ్ఞమశ్వమేధం బలేస్తదా | ద్వారి స్థితో మహాతేజా వామనో బటురూపధృక్‌|| 167

బ్రహ్మరూపేణ మహతా వ్యాప్తమాసీద్దిగంతరమ్‌ | పవమానస్య బటోర్వామనస్య మహాత్మన:|| 168

తచ్చృత్వా చ బలి : ప్రాహ శండామర్కౌ చ బుద్దిమాన్‌ | బ్రాహ్మణా :కతిసంఖ్యాశ్చ ఆగతా: సంతి ఈక్ష్యతామ్‌ ||169

తథేతి మత్వా త్వరితావుత్థితౌ తౌ తదా ద్విజా: | శండామార్కౌ సమాగమ్య మండపద్వారి సంస్థితౌ|| 170

పరమేష్టియగు బ్రహ్మ యజ్ఞోపవీతమును, మహాత్ముడగు చంద్రుడు దండకాష్టమును ఇచ్చిరి(160) మేఖల, అజినము, పాదుకములు భూమిచేత ఇవ్వబడినవి.(161) కార్యసిద్దికై భవానీదేవి భిక్షను తెచ్చినది. ఇట్లు వటురూపములోనున్న విష్ణువునకు ఇవ్వబడినవి (162) లక్ష్మీపతియగు విష్ణువు వామనుడుగా అదితికి, కశ్యపునికి నమస్కరించి యజ్ఞవాటికకు వెళ్లెను (163) అపుడు విష్ణువు, పరమాత్మవామనుడగు వటువురూపములో దేవతలపని నెరవేరుటకై స్వర్గమును అడుగుల బరువుచేత ప్రకంపింపజేయుచూ భూలోకమునకు వెళ్ళను. (164) జనులచేత,మునీశ్వరులచేత, దేవగణముల చేత మహాత్ముడగు జగదేకబంధువు యథార్థములైన వాక్కుచే కీర్తింపబడుచూ యజ్ఞవాటికకు త్వరగా వెళ్ళెను. (165) వటురూపముననున్న విష్ణువు సామగానమును చేయుచు సాక్షాత్కరించెను. అతనే వేదాంతవేద్యుడుగా,ఈశ్వరుడుగా, ప్రభువుగా గానము చేయబడుచుండెను. (166) ఆ వామనుడు ద్వారము వద్ద నిలిచి బలియొక్క ఆశ్వమేథమనెడి మహాయజ్ఞమును చూచెను.(167) దిగంతరాళములన్నీ బ్రహ్మరూపి పవిత్రుడు వామనుడగుచూ లోకములను వ్యాపించుచున్న వటువు చేత నిండెను. (168) అది విని బలి శండామార్కులనుపిలిచి ఎంత మంది బ్రాహ్మణులు వచ్చిరో చూడుమనెను.(169) అలాగేనని వారు త్వరగాలేచివచ్చి మండపద్వారమువద్ద నిలుచుండిరి (170)దదృశాతే మహాత్మానం శ్రీహరిం వటురూపిణమ్‌ | త్వరితౌ పునరాయాతౌ బలే: శంసయితుం తదా|| 171

బ్రహ్మచారీ సమాయాత ఏక ఏవ న చాపర:| పఠనాదౌ మహారాజ చాగతస్తవ సన్నిధౌ || కిమర్థం తన్న జానీహి త్యం మహామతే || 172

ఏకముక్తే తు వచనే తాభ్యాం స చ మహామనా :| ఉత్థితస్తత్‌ క్షణాదేవ దర్శనార్దే వటుం ప్రతి||173

స దదర్శ మహాతేజా విరోచనసుతో మహాన్‌ | దండవత్పతితో భుమౌ నవామ శిరసా వటుమ్‌|| 174

ఆనయిత్వా బటుం సద్య: సన్నివేశ్యనిజాసనే | అర్ఘ్యపాద్యేన మహతాభ్యర్చయామాస తం వటుమ్‌||175

వినమ్రకంధరో భూత్వా ఉవాచ శ్లక్ణయా గిరా| కుత: కస్మాచ్చ కస్యాసి తచ్చీఘ్రం కథ్యతాం ప్రభో||176

తచ్ఛృత్వా వచనం తస్య విరోచనసుతస్య వై | మనసా హృషితశ్చాసౌ వామనో వక్తుమారభత్‌ || 177

వారక్కడ మహాత్ముడగు శ్రీహరిని వటురూపమున చూచి. త్వరగా మరలివచ్చి బలికి చెప్పిరి.(171) ఒక బ్రహ్మచారి మాత్రమే వచ్చినాడు వేరొకరు లేదు. పఠనము మొదట నీ సన్నిధికి వచ్చెను. నీ సన్నిధికి వచ్చెను. ఓ మహారాజా! కారణము మాకు తెలియదు. నీకుమాత్రము తెలియును.(172) ఇట్లు వారిద్దరూ ఆ ప్రాజ్ఞుడు వెంటనే లేచి వటువును చూడగోరెను.(173)విరోచనసుతుడు, గొప్ప తేజస్సు గలవాడగు బలి వటువుని చూసి, దండము వలె నేల పై బడి శిరసా నమస్కరించెను.(174) వెంటనే.వటువును లోనికి గొనివచ్చి తన ఆసనము పై కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యముల చేత అర్చించెను. (175) తలను వంచి మధురమైన వాక్కుతో వటువును ఓ ప్రభూ! ఎక్కడినుండి ఏ కారణముచేత ఇక్కడకు వచ్చితివి? నీవెవరి వాడవు? త్వరగా తెలుపుము(176) అనగా విని మనసున సంతోషించిన వామనరూపియగు విష్ణువు చెప్పనారంభించెను. (177)

భగవానువాచ:

త్వం హి రాజా త్రిలోకేశో నాన్యో భవితుమర్హసి | స్వకులం న్యూనతాం గచ్చేద్యో వై కాపురుష: స్మృత:|| 178

సమం వా చాధికో వాపి యో గచ్ఛేత్పురుష: స్మృత:| త్వయా కృతం చ యత్కర్మ న కృతం పూర్వజైస్తవ|| 179

దైత్యానాం చ వరిష్ఠా యే హిరణ్యకశిపాదయ: కృతం మహత్తపో యేన దివ్యం వర్షసహస్రకమ్‌||180

శరీరం భక్షితం యస్య జుషాణస్య తపో మహత్‌ | పిపీలికాభిర్బహుభిర్థం శైశ్చైవ సమావృతమ్‌ ||181

అభవత్తస్య తజ్‌జ్ఞాత్వా సురేంద్రో హ్యగమత్పురా | నగరం తస్య చ తదా సైన్యేన మహతా వృత:||182

తత్సన్నిధౌ హతా: సర్వే అసురా: దైత్యశత్రుణా | వింధ్యా తు మహిషీ తస్య నీయమానా నివారితా ||183

నారదేన పురా రాజన్‌ కించిత్కార్యం చికీర్షుణా|| శంభో: ప్రసాదాదఖిలం మనసా యత్‌ సమీక్షితమ్‌ | దైత్యేంద్రేణ చ తత్సర్వం తపసైవ వశీకృతమ్‌|| 184

తస్యా:పుత్రో మహాతేజా యేన నీతోభవత్సభామ్‌ || తస్య పుత్రో మహాభాగ పితామే పితృవత్సల :|| నామ్నావిరోచనో విద్వానింద్రో యేన మహాత్మనా|| 185

దానేన తోషితో రాజన్‌ స్వేనైవ శిరసా తదా | తస్యాత్మజోసి భో రాజన్‌ కృతం తే పరమం యశ:||186

యశోదీపేన మహతా దగ్దా: శలభవత్‌ సురా: | ఇంద్రోసి నిర్జితో యేన త్వయా నాస్త్యత్ర సంశయ:||187

శ్రుతమస్తి మయా సర్వం చరితం తవ సువ్రత | అల్పకోZహమిహాయాతో బ్రహ్మచర్యవ్రతే స్థిత:||188

ఉటజార్ధే చ మే దేహి భూమిం భూమిభృతాం వర| వటోస్తసై#్యవ తద్వాక్యం శ్రుత్వా బలిరభాషత||189

నీవు ముల్లోకములకు రాజువు తప్ప వేరొకరివి కాజాలవు ఎవడు చెడు పురుషుడో అతని కులము న్యూనతను పొందును. సమముగాను అధికముగాను ప్రవర్తించువాడు పురుషుడనబడును నీవు చేసిన పనిని నీ పూర్వికులు చేయలేరు (179) దివ్యమగు వేయి సంవత్సరములునీవు చేసిన గొప్ప తపస్సును దైత్యశ్రేష్టులగు హిరణ్యక శిపాదులుచేయలేదు (180) తపమునాచరించుచున్న నీ శరీరము , చీమలచే, కీటకములచే ఆవరించబడినది (181) అది తెలిసి ఇంద్రుడు తన సైన్యములో అతని నగరమునకు వెళ్ళెను.(182) అతని చెంతనే దైత్యశత్రువగు ఇంద్రునిచేత అసురులందరూ వధింపబడినారు అతని భార్యయైన వింధ్యను తీసుకొని వెళ్ళబోవుచున్న ఇంద్రుని నారదుడు అపివేసెను. (183) శివుని ప్రసాదముచేత మనసున ఏది చూచెనో దానినా దైత్యేంద్రుడు తపస్సు చేతనే వశమొనర్చుకొనెను. (184) ఆమె పుత్రుని సభకు తీసుకొని వెళ్ళెను అతని పుత్రుడగు నా తండ్రి విరోచనుడనువాడు, పితృవత్సలుడు, విద్వాంసుడు.(185) తన శిరస్సును దానమిచ్చుటచేత ఇంద్రుని సంతోషపరిచినాడు. అతని పుత్రుడవు నీవు ఓ రాజా! నీది గొప్పకీర్తి (186) కీర్తియను దీపముచేత దేవతలంతా మిడతల వలె దహింపబడినారు ఇంద్రుడు కూడానీచేత జయింపబడినాడు ఇందు సంశయము లేదు (187) ఓ సువ్రతా! నేను నీచరితమునంతా వింటిని నేను చిన్నవాడిని , బ్రహ్మచర్య వ్రతమున వుంటూ ఇక్కడకు వచ్చితిని.(188) రాజశ్రేష్టా ! కుటీరానికై నాకు భూమిని దానమిమ్ము అనగా బలి ఇట్లనెను (189)

హే వటో పండితో భూత్వా యదుక్తం వచనం పురా | శిశుత్వాత్‌ తన్న జానాసి శ్రుత్వా మన్యే యథార్థత:|| 190

వద శీఘ్రం మహాభాగ కియన్మాత్రాం మహీం తన | దాస్యామి త్వరితేనైవ మనసా తద్‌విమృశ్యతామ్‌ ||191

తదాహ వామనో వాక్యం స్మయన్మధురయా గిరా | అసంతోషపరా యే చ విస్రా నష్టా నసంశయ:|| 192

సంతుష్టా యే హి విప్రాస్తే నాన్యే వేషధరా హ్యమీ | స్వధర్మనిరతా రాజన్నిర్థంభా నిరవగ్రహా:||193

నిర్మత్సరా జితక్రోధా: వదాన్యా హి మహామతే | విప్రాస్తే హి మహాభాగ తైరియం ధార్యతే మహీ ||194

మనస్వీ త్వం బహుత్వాచ్చ దాతాసి భువనత్రయే | తథాపి యే ప్రదాతవ్యా మహీ త్రిపదసంమితా ||195

బహ్యుత్వే నాస్తి మే కార్యం మహ్యావై నూరసూదన | ప్రవేశమాత్రముటజం తథా మమ భవిష్యతి ||196

త్రిపదం పూర్యతేzస్మాకం వస్తుం నాస్త్యత్ర సంశయ: | తావత్సంఖ్యా ప్రదాతవ్యా యది దాతాసి భో బలే || 197

ప్రవాస్య తమువాచేదం బలిర్వైరోచనాత్మజ:| దాస్యామి తే మహీం కృత్స్నాం సశైలవనకాననామ్‌ ||198

మదీయాం వై మహాభాగ మయా దత్తాం గృహాణ వై| యాచకోzసి వటో పశ్య దానం దైత్యాత్‌ ప్రయాచసే|| 199

ఓ వటూ ! పండితుడవై ఏ మాటలను మునుపు పలికితివో యథార్థముగా నీవు శిశువైనందున తెలియజాలకున్నావనుకొందును.(190) మహాభాగా! నీకెంత భూమి కావలెనో ఆలోచించి త్వరగా చెప్పుము.(191) అపుడు వామనుడు నవ్వుచూ,మధురమగు వాక్కుతో నిట్లనెను సంతోషమునొందని బ్రాహ్మణులు నశించెదరు. సంశయములేదు.(192) సంతోషమునొందు బ్రాహ్మణులు స్వధర్మనిరతులు, దంభములేని వారు, నిరవగ్రహులు , మాత్సర్యము, క్రోథము లేనివారు, పూజ్యులు, ఆ విప్రుల చేతనే ఈ భూమి ధరింపబడుచున్నది.(194) నీవు అభిమానవంతుడవు ముల్లోకములలో వాసికోక్కిన దాతవు అయిననూ నాకు కేవలము మూడడుగుల నేలను దానమిమ్ము.(195) ఎక్కువ భూమితో నాకుపనిలేదు మూడడుగుల నేల సరిపోవును ఓ రాజా! నీవు దాతవైనచో నేనడుగు పెట్టినంత మేర భూమిని నాకు దానమిమ్ము,(197) అనగా నవ్వి వైరోచనుడగు బలి ఇట్లనెను. నీకు పర్వతములు, వనములు, అరణ్యములు గల ఈ నా భూమినంతా దానమిచ్చెదను యాచకుడవై అడిగితివి. దైత్యుడినుండి ప్రార్థించు నీవు ఈదానమును గ్రహించుము (199)

యాచకో హ్యల్పకో వాస్తు దాతా సర్వం విమృశ్య వై | తథా విలోక్య చాత్మానం హ్యర్థిభ్యశ్చ దదాతి వై| 200

ఆత్మౌపమ్యేన సర్వత్ర యో దదాతి హ్యుదారధీ: | తస్మాన్న యాచితవ్యం హి అర్థినా మందభాగినా|| 201

వటో దదామ్యహం తేzద్య సశైలవనకాననామ్‌ | పృథ్వీం సపర్వతాం సాబ్దిం నాన్యథా మమ భాషితమ్‌ ||202

పున: ప్రోవాచ స వటుర్విరోచనసుతం ప్రతి || పూర్యతే మమ దైత్యేంద్ర క్రమతో హి పదైస్త్రిభి: ||203

వటోస్తద్వచనం శ్రుత్వా అసురేంద్రో బలిస్తదా | ఉవాచ ప్రహసన్‌ వాక్యం మన్యమానో బలిర్భృశమ్‌ || గృహ్యతాం చ మయా దత్తాం పదైస్త్రిభిరలంకృతామ్‌ || 204

ఇత్యుక్తో వామన: ప్రాహ ప్రహసన్నసురం ప్రతి | సంకల్ప్య సకలాం పృథ్వీం దాతుమర్హసి సువ్రత ||205

తథేతి మత్వా బలినా సుపూజిత: స వామన: కశ్యపనందనో మహాన్‌ | బలిస్తదానీం సహసా నితాంతం సంస్తూయమానస్తు ఋషిభిర్మునీంద్రై: 206

తం పూజయిత్వా స బలిర్యావద్దాతుం సముద్యత:| గురుణా వారితస్తావద్విరోచనసుతో మహన్‌ ||207

న దాతవ్యం త్వయా దానం విష్ణవే వటురూపిణ | ఇంద్రార్థమాగత: సద్యో యజ్ఞవిఘ్నం కరోతి తే|| తస్మాత్‌ త్వయా న పూజ్యో హి విష్ణురధ్యాత్మదీపక: ||208

యాచకుడు అల్పుడైననూ దాత అంతా బాగుగా ఆలోచించి, తనను కూడా చూచి మరీ యాచకులకు దానమిచ్చును. (200) ఉదారమగు బుద్దిగలవాడు తనవలెనే అంతటా చూచి దానమిచ్చును కనుక మందభాగ్యుడగు యాచకుడు యాచించరాదు (201) వటూ! నేడు నేను నీకు ఈ భూమినంతా పర్వతములతో, వనములతో, అరణ్యములతో సహా ఇచ్చుచుంటిని. నామాట యథార్థము(202) అనగా వటువు బలితో మరల ఇట్లనెను . దైత్యరాజా! నేనడుగు పెట్టినంత మేర భూమినవ్వవలెను.(203)వటువుపలికిన మాటలను విని పరిహాసానికని తలచిన బలి ఇట్లనెను. నీ మూడడుగులచే (కొలవబడిన) అలంకరింపబడిన భూమిని దానమిచ్చుచుంటిని గ్రహించుము.(204) అనగా వామనుడు నవ్వుచూ బలితోననెను మొత్తం భూమిని సంకల్పించి ఇవ్వవలెను.(205) అనగా సరేనని తలిచి బలి వామనుని పూజించెను. ఋషులు, మునీంద్రులు అందరూ బలిని స్తుతింపసాగిరి.(206) వటువును పూజించి బలి దానమివ్వబోవుచుండగా గురువగు శుక్రుడతని వారించెను (207) వటురూపమునున్న విష్ణువుకు నీవు దానమివ్వరాదు - ఇంద్రుడి పనిమీద వచ్చిన విష్ణువు వెంటనే యజ్ఞమునకు అడ్డంకిని ఏర్పరచగలడు. కనుక నీవు విష్ణువును పూజింపరాదు.(208)

పురా కృతమనేనైన మోహినీ రూపధారిణా! దేవేభ్యశ్చామృతం దత్తం రాహ్యుర్యేన హతో మహాన్‌ ||209

యేన విద్రావితా దైత్యా: కాలనేమిర్హతో బలీ ||210

ఏవం విధోzయం పురుషో మహాత్మా స ఈశ్వరో విశ్వపతి :స ఏవ!విమృశ్య సర్వం మనసా మహామతే హితాహితం కర్తుమిహార్హసి త్వమ్‌ ||211

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే

బలియజ్ఞే వామనాగమనవర్ణనం నామ అష్టోదశోzధ్యాయ:

ఇంతకు మునుపు ఈ విష్ణువే మోహిని వేషమున దేవతలకు అమృతమునిచ్చెను రాహువును వధించెను (209) ఇతనే దైత్యులను పారద్రోలెను . కాలనేమిని వధించెను. (210) ఈ మహాత్ముడు ఇట్లాంటివాడు ఇతను సర్వశక్తి మంతుడు విశ్వపతికనుక గొప్పబుద్ది గలవాడా | మనసుయందు బాగుగా ఆలోచించి హిత , అహితములను తెలిసి దానమివ్వవలెను (211)

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటిదగు మాహేశ్వరఖండమున కేదారఖండమునందు బలియజ్ఞమునకు వామనుడు వచ్చుట అను పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము

ఏకోనవింశోzధ్యాయ:

లోమశఉవాచ- ఏవం సంబోధితో దైత్యో గురుణా భార్గవేణ హి ఉవాచ ప్రహన్వాక్యం మేఘ గంభీరయా గిరా ||1

త్వయోక్తోzహం హితార్థాయ యైర్వాక్యైశ్చాలితో zస్మ్యవామ్‌ తవ వాక్యం మమ ప్రీత్యై హితమప్యహితం భ##వేత్‌ ||2

దాస్యామి భిక్షితం చాసై#్మ విష్ణవే వటురూపిణ | పాత్రీభూతో హ్యయం విష్ణు: సర్వకర్మఫలేశ్వర:||3

యేషాం హృది స్థితో విష్ణుస్తే వై పాత్రతమా ధృవమ్‌ | యస్య నామ్నా సర్వమిదం పావిత్రమివ చోచ్యతే ||4

యేన వేదాశ్చ యజ్ఞాశ్చ మంత్రతంత్రాదయో హ్యమీ సర్వే సంపూర్ణతాం యాంతి సోzయం విశ్వేశ్వరో హరి:||5

ఆగత: కృపయా మేzద్య సర్వాత్మా హరిరీశ్వర:| ఉద్దర్తుం మాం నసందేహ ఏతజ్ఞానీహి తత్త్వత:||6

తస్య తద్వచనం శ్రుత్వా చుకోప చ రుషాన్విత:| భార్గవ: శప్తుమారేభే దైత్యేంద్రం ధర్మవత్సలమ్‌|| 7

మమ వాక్యమతిక్రమ్య దాతుమిచ్చస్యరిందమ| విగుణో భవరే మంద తస్మాత్త్వం ని:శ్రికో భవ||8

ఏవం శశాప చ తదా పరమార్థవిజ్ఞం శిష్యం మహాత్మానమగాధబోధమ్‌ || స వై జగామాథ మహాకవిస్త్వరాత్‌ స్వమాశ్రమం ధర్మవిదాం వరిష్ఠ:||9

గతే తు భార్గవే తస్మిన్‌ బలిర్వైరోచనాత్మజ: | వామనం చార్చయిత్వా స మహీం దాతుం ప్రచక్రమే ||10

పందొమ్మిదవ అధ్యాయము

లోమశుడనెను ఈ విధంగా గురువగు భార్గవుడనగా బలి నవ్వుచూ,మేఘ గంభీరమగు వాక్కుతో నిట్లనెను (1) హితము కొరకై నీవు నన్ను ఉద్దేశించి పలికిన పలుకుల వలన ప్రేరితుడనైతిని .నీవను మాటలు నా ప్రీతికొరకే, హితము కూడా అహితమగును (2) వటురూపమున నున్న విష్ణువుకు కోరినది దానమిచ్చెదను. అన్ని కర్మల ఫలములకు ప్రభువగు విష్ణువు దానమునకు పాత్రుడు (3) ఎవరి హృదయమున విష్ణువుండునో వారే నిశ్చయముగా అమిత యోగ్యులు విష్ణునామముచే ఇదంతా పవిత్రమనబడును (4) ఎవనిచేత వేదములు, యజ్ఞములు మంత్రతంత్రములు మున్నగునవన్నీ సంపూర్ణమగునో అతను విశ్వేశ్వరుడగు విష్ణువు (5) అట్టి విష్ణువు, కృపతో నా వద్దకీనాడు వచ్చెను. ఇది నిస్సందేహముగా నన్ను ఉద్దరించుటకొరకే ననిన వాస్తమును తెలుసుకొనుము (6) అనగా విని భార్గవుడు కోపగించి ధర్మవత్సలుడగు బలిని శపింపబోయెను. (7) ఓ రాజా! నా మాటను జవదాటి దానమివ్వ గోరుచున్నావు మూర్ఖుడా! గుణహీనుడవై వైభవమును కోల్పొనుము (8) ఇట్లు పరమార్థమును తెలిసిన అగాధ జ్ఞానము గలిగిన శిష్యుడగు బలిని శపించి, శుక్రుడు తన అశ్రమమునకు త్వరగా వెళ్ళిపోయెను (9) శుక్రుడట్లు వెళ్ళిపోగా , వైరోచనుడు బలి వామనునర్పించి భూమిని దానమిచ్చుటకు పక్రమించెను (10)

వింధ్యావలి:సమాగత్య బలేరర్ధాంశశోభితా! అవనిజ్య:బటో : పాదౌ ప్రదదౌ విష్ణవే మహీమ్‌ ||11

సంకల్పపూర్వేణ తదా విధినా విధికోవిద: సంకల్పేనైవ మహతా వవృధే భగవానజ||12

యదైకేన మహీ వ్యాప్తా విష్ణునా ప్రభవిష్ణునా | సర్వే స్వర్గా: ద్వితీయేన వ్యాప్తాస్తేన మహాత్మనా||13

సత్యలోకగతో విష్నోశ్చరణ: పరమేష్ఠినా | కమండలుగతేనైవ అంభసా చావనేనిజే||14

తత్పాదసంపర్కజలాచ్చ జాతా భాగీరథీ సర్వసుమంగలా చ| యయా త్రిలోకీ చ కృతా పవిత్రా యయా చ సర్వే సాగరా: సుముద్దృతా :| యయా కపర్ధ: పరిపూరితో వై శంభోస్తదానీం చ భగీరధేన || 15

తీర్థానాం తీర్థమాద్యం చ గంగాఖ్యమవతారితమ్‌ | తద్విష్ణోశ్చరణనైవ సమేతం బ్రహ్మణా కృతమ్‌||16

త్రివిక్రమాత్పరో హ్యాత్మా నామ్నా త్రివిక్రమోzభూత్‌ | త్రివిక్రమక్రమాక్రాంతం త్రైలోక్యం చ తదాzభవత్‌||17

పాదద్వయేన వా పూర్ణం జగదేతచ్చరాచరమ్‌ | విహాయ తత్‌ స్వరూపం చ దేవదేవో జనార్ధన: పునశ్చ వటురూపోzసౌ ఉపవిశ్య నిజాసనే ||18

తదా దేవా : సగంధర్వా మునయ: సిద్దచారణా: | ఆగతాశ్చ బలేర్యజ్ఞం ద్రష్టుం యజ్ఞపతిం ప్రభుమ్‌ ||19

తత్ర బ్రహ్మా సమాగత్య స్తుతిం చక్రే పరాత్మన:| బలేస్తత్రైవ చాన్యే చ దైత్యేంద్రాశ్చాగతాస్త్వరమ్‌||20

బలియొక్క అర్దాంశము (గా) శోభించు వింధ్యావళి రాగా ,బలి వటువుయొక్క పాదముల కడిగి భూమిని దానమిచ్చెను.(11) విధి తెలిసిన బలి విధిప్రకారము సంకల్పముచేసి ఇవ్వగా సంకల్పముతోనే విష్ణువు వర్దిల్లెను (12) ప్రభవించు శీలముగల విష్ణువుచే భూమి అంతయూ వ్యాపింపబడగా రెండవ పాదముచేత ఇరవై ఒక్కస్వర్గములు నిండెను. (13) విష్ణుపాదము సత్యలోకమును చేరగా బ్రహ్మ కమండలంలోనొ నీటితో పాదమును కడిగెను. (14) ఆ పాదసంపర్కము గల నీటినుండి పుట్టిన గంగానది సర్వసుమంగళ ముల్లోకములను పవిత్ర మొనర్చునది భగీరధుడు రప్పించగా శివుని జటాజూటమును నిండినది (15) తీర్థములన్నింటిలో మొదటీ తీర్థము గంగయను పేరుతో అవతరించినది. బ్రహ్మచేత విష్ణుపద సహితముగా చేయబడినది.(16) మూడడుగుల చేత పరమాత్మ త్రివిక్రముడను పేరు గలవాడాయెను. అపుడు ముల్లోకములు త్రివిక్రముని అడుగుల చేత ఆక్రమింపబడెను (17) చరాచరమగు జగత్తంతా రెండడుగుల చేత నిండగా దేవదేవుడగు జనార్దనుడు ఆ రూపమును వదలి మరల వటువుగా మారి తన ఆసనము పై కూర్చొండెను (18) అపుడు దేవతలు, గంధర్వులు మునులు .సిద్దులు, చారణులు, బలియజ్ఞమును, యజ్ఞపతియగు విష్ణువును చూచుటకు వచ్చిరి(19) అక్కడికేతెంచిన బ్రహ్మ పరమాత్మనుస్తుతింపసాగెను. ఇతర దైత్యేంద్రులు త్వరగా వచ్చి బలిని స్తుతింపసాగిరి.(20)

ఏభి:సర్వై :పరివృతో వామనో బలిసద్మని | ఉపవిశ్యాసనే సోథ ఉవాచ గరుడం ప్రతి||21

దైత్యో zసౌ బాలిశో భూత్వా దత్తానేన మహీ మమ |త్రిపదక్రమణనైవ గృహీతం చ పదద్వయమ్‌ ||22

పదమేకం ప్రతిశ్రుత్య న దదాతి హి దుర్మతి: తస్మాత్త్వాయా గృహీతవ్యం తృతీయం పదమేవ చ ||23

ఇత్యుక్తో గరుడస్తేన వామనేన మహాత్మనా వైరోచనిం వినిర్భర్త్ప్య వాక్యం చేదమువాచ హ|| 24

రే బలే కిం త్వయా మూఢ కృతమస్తి జుగుప్సితమ్‌| అవిద్యమానే హ్యర్థే హి కిం దదాసి పరమాత్మనే ||

ఔదార్యేణ హి కిం కార్మమల్పకేన త్వయాధునా||25

ఇత్యుక్తో బలిరావిష్ట: స్మయమాన: ఖగేశ్వరమ్‌| వక్ష్యమాణమిదం వాక్యం గరుత్మస్తం తదాబ్రవీత్‌||26

సమర్థోzస్మి మహాపక్ష కృపణో న భవామ్యహమ్‌ | యేనేదం కారితం సర్వం తసై#్మ కిం ప్రదదామ్యహమ్‌ ||27

అసమర్థో హ్యహం తాత కృతో నేన మహాత్మనా| తదోవాచ బలిం సోపి తార్‌క్ష్యపుత్రో మహామనా:||28

విష్ణవేzపి మహీం ప్రాదాస్త్యయా కిం విస్మృతం మహత్‌||29

దాతవ్యం తత్పదం విష్ణో: తృతీయం యత్ర్పతిశ్రుతమ్‌| న దదాసి కథం వీర నిరయే చ పతిష్యసి||30

వీరందరిచే కూడిన వామనుడు బలి బృహములో ఆసనము పై కూర్చండి గరుడునితో ననెను (21) ఈ దైత్యుడు క్రూరుడై నాకు మూడడుగుల నేలను దానమిచ్చెను రెండడుగుల నేలను గ్రహించితిని (22)ఇంకొక అడుగును ఇచ్చెదనని మాటనిచ్చి కూడా దుర్మతి దానమిచ్చుటలేదు కనుక నీవు మూడవ అడుగును గ్రహింపుము (23)అని వామనుడనగా గరుడుడు బలిని బెదిరించుచూ ఇట్లనెను (24) ఓ బలీ! మూఢుడా! జుగుప్సమగు పనిచేసితివి అర్థము లేనపుడు పరమాత్మ కేమి ఇవ్వగలవు ? అల్పుడవైన నీకు ఇపుడు ఔదార్యముచేత పని ఏమి? (25) అని అనగా బలి నవ్వి పక్షిరాజుతో ఇట్లనెను(26) గొప్ప రెక్కలుగల పక్షిరాజా! నేను దానమిచ్చుటకు సమర్థుడనే పిసివారిని దురాత్ముడిని కాబోను. ఎవరు దీనినంతా ఇట్లోనరించిరో అట్టివారికి నేనేమివ్వగలను.(27) నాయనా! ఇతని చేతనే నేను అసమర్థునిగా చేయబడితిని అనగా గరుడుడు బలిని గూర్చి ఇట్లనెను (28)దైత్యశ్రేషా! తెలిసి,గురువుచేత నివారింపబడీ నీవు విష్ణువునకు భూమిని దానమిచ్చితివి. దానిని మరచితివా ? (29)విష్ణువునకు మాటనిచ్చినట్లు మూడవ అడుగునేలను దానమిమ్ము లేనిచో నరకమున పడగలవు (30)

న దదాసి తృతీయం చ పదం మే స్వామిన: కథమ్‌ | బలాద్‌ గృహ్ణామి రే మూఢ ఇత్యుక్త్యా తం మహాసురమ్‌|| బబంధ వారుణౖ: పాశైర్విరోచనసుతం తదా|| 31

నితరాం నిష్ఠురో భూత్వా గరుడో జయతాం వర: బద్ధం స్వపతిమాలోక్య వింధ్యావలి: సమభ్యయాత్‌ ||32

బాణమేకం సమారోప్య వామనస్యాగ్రత: స్థితా | వామనేన తదా పృష్టా కేయం చాత్రాగత: స్థితా ||33

తదోవాచ మహాతేజా: ప్రహ్లాదో హ్యసురాధిప: బలే: పత్నీతి త్వాం ప్రాప్తా ఇయం వింధ్యావతీ సతీ||34

ప్రహ్లాదస్య వచ: శ్రుత్వా వామనో వాక్యమబ్రవీత్‌ | బ్రూహి వింధ్యావలే వాక్యం కిం కార్యం తే కరోమ్యహమ్‌|| ఏవముక్తా భగవతా వింధ్యావలిరభాషత||35

వింధ్యావలిరువాచ:

కస్మాద్బద్దో మమ పతిర్గరుడేన మహాత్మనా తత్కథ్యతాం మహాభాగ త్వరన్నేవ జనార్ధన || తదోవాచ మహాతేజా వటువేషధరో హరి:|| 36

శ్రీ భగవానువాచ-

అనేనైవ ప్రదత్తా మే మహీ త్రిపదలక్షణా | పదద్వయేన చ సమాక్రాంతం త్రైలోక్యమద్య వై||37

అనేన మమ దాతవ్యం తృతీయం పదమేవ చ | అస్మాద్బద్దో మయా సాధ్వి గరుడేనైవ తే పతి:||38

శ్రుత్వా భగవతో వాక్యమువాచ పరమం వచ: | ప్రతిశ్రుతమనేనైవ న దత్తం హి తవ ప్రభో||39

క్రాంతం త్రిభువనం చాద్య త్వయా విక్రమరూపిణా| తదస్మాకం విజఘ్నీధా: స్వర్గే వాప్యథవా భువి||40

నా ప్రభువుకు మూడవ అడుగునెట్లు ఇవ్వవు? బలముగా నిన్ను పట్టెదను అని మహాసురుడగు బలిని వారుణ పాశములచేత బందించెను. (31)పూర్తిగా కఠినుడైన గరుడుడట్లు బంధించగా అది చూచి వింధ్యావళి త్వరగా వచ్చెను. (32) ఒక బాణమును వింటికెక్కించి వామనుని ఎదుట నిలిచిన వింధ్యావళి చూచి వామనుడు నిలిచినది ఎవరని అడిగెను (33) అపుడు అసురరాజుగు ప్రహ్లాదుడు బలి భార్యయగు వింధ్యావళి నిన్ను చూడవచ్చినదనెను (34) ప్రహ్లాదుని మాటలను విని వామనుడనెను వింధ్యావళీ నీ కొరకై ఏ పని చేయవలెనో చెప్పుము అనగా ఆమె ఇట్లనెను(35) జనార్థనా! మహాత్ముడైన గరుడుడు నా భర్తనెందుకు బంధించెను? త్వరగా చెప్పుము అనగా వటువేషమును ధరించిన గొప్ప తేజస్వియగు విష్ణువనెను (36)ఇతనే నాకు మూడడుగుల మేర భూమిని దానమిచ్చెను ముల్లోకములను రెండడుగుల చేత ఆక్రమించితిని.(37)ఇతనిపుడు నాకు మూడవ అడుగునేలనివ్వ వలెను కనుక ఓ స్వాధీ! గరుడుడితని బంధించెను (38) అనగా విని ఆమె ఇట్లనెను ప్రభూ! ప్రతిజ్ఞ చేసి మూడవ అడుగు నేలనివ్వలేదు కదా! (39)విక్రమరూపమున నీవు ముల్లోకముల నాక్రమించితివి. మమ్ములనిక స్వర్గమున గానీ భూమి పై గాని వధింపుము.(40)

కించిన్న దత్తా హి విభో దేవదేవ జగత్పతే | ప్రవాస్య భగవానాహ తదా వింధ్యావలిం ప్రభు:|| 41

పదాని త్రీణీ మే చార్య దాతహ్యని కుతోzధునా | శీఘ్రం వద విశాలాక్షి యత్తే మనసి వర్తతే||42

త్వయా కుతో వేయమురుక్రమేణ క్రాంతా త్రిలోకీ భువనైకనాథ | తథైవ సర్వం జగదేకబంధో దేయం కిమస్మాభిరతుల్యరూపిణ|| 43

తస్మాద్విహాయ తద్విష్ణో త్వమేవం కురు సంప్రతి | ప్రతిశ్రుతాని మే భర్త్రా పదాని త్రీణి చాధునా||44

నిధేహి మే పదం త్వం హి శీర్ణి దేవవర ప్రభో | ద్వితీయం మే శిశోస్త్యం హి కురు మూర్థ్ని జగత్పతే||45

తృతీయం చ జగన్నాథ కురు శీర్ణి పతేర్మమ| ఏవం త్రీణి పదానీశ తవ దాస్యామి కేశవ||46

తస్యాస్తద్వచనం శ్రుత్వా పరితుష్టో జనార్థన :| ఉవాచ శ్లక్షయా వాచా విరోచనసుతం ప్రతి|| 48

పరితుష్టోzస్మ్యహం తాత కిం కార్యం కరవాణి తే| సర్వేషామపి దాతృ వరిష్ఠోzస మహామతే ||49

దేవదేవా! జగత్పతీ! నీకేమీ ఇవ్వలేదా? అనగా నవ్వి విష్ణువు వింధ్యావళితో ననెను(41) మూడడుగుల మేర నేలను నాకు దానమివ్వవలెను. ఎక్కడినుండి ఇత్తురో త్వరగా చెప్పుము. నీ మనసులో నున్న దానిని చెప్పుముగా నిలిచి సాధ్వియగు వింధ్యావళి విష్ణువుతో ననెను.(42) లోకైకనాథా! ముల్లోకములనూ నీవు వేగముగలఅడుగు చేత ఆక్రమించితివి. అట్లే అంతటినీ ఆక్రమించి ఆసమానరూపముతో నున్న నీకు మేమివ్వగలదేమి వున్నది? (43) కనుక ఆ మూడవ అడుగును వదలిఇట్లు చేయుము. నా భర్త నీకు మూడడుగుల నేలను ప్రతిజ్ఞ చేసెను గదా! ఈనాడు నాభర్త వానిని తప్పక ఇచ్చును. విచారించపనిలేదు. (44) దేవశ్రేష్ఠుడా! నీ అడుగును నా తలపై వుంచుము - రెండవ అడుగును నా బిడ్డ తలపై నుంచుము. (45) మూడవఅడుగును నా పతి తలపై వుంచుము. ఇట్లు ఓ కేశవా! నీ మూడడుగుల నిచ్చుచుంటివి (46) అని వింధ్యావళి పలుకగా విష్ణువు సంతోషించి , బలితో మధురముగా నిట్లనెను (47) భగవంతుడనెను దైత్యేంద్రా! ఆలస్యము చేయకుండా సుతలమునకు వెళ్ళి, అసురగణములన్నింటితో చిరకాలము జీవించుము. సుఖముగా నుండుము (48) నాయనా ! నేను సంతోషించితిని నీ కొరకేమి చేయగలను ? ఓ జ్ఞానీ! దాతలందరిలో నీవు శ్రేష్ఠుడవు (49)

వవం వరయ భద్రం తే సర్వాన్‌ కామాన్‌ దదామి తే త్రివిక్రమేణౖవముక్తో విరోచనసుతస్తదా|| 50

విముక్తో హి పరిష్వక్తో దేవదేవేన చక్రిణా| తదా బలిరువాచేదం వాక్యం వాక్యవిశారద:|| 51

త్వయా కృతమిదం సర్వం జగదేతచ్చరాచరమ్‌ | తస్మాన్న కామయే కించిత్‌ త్వత్పదాబ్జం వినా ప్రభో || 52

భక్తిరస్తు పదాంభోజే తవ దేవ జనార్థన | భూయో భూయశ్చ దేవేశ భక్తిర్బవతు శాశ్వతీ||53

ఏవమభ్యర్థితస్తేన భగవాన్‌ భూతభావన:|

భగవానువాచ:

బలే త్వంసుతలం యాహి జ్ఞాతి సంబంధిభిర్వృత: | ఏవముక్తస్తదా తేన అసురో వాక్యమబ్రవీత్‌ |55

సుతలే కిం ను మే కార్యం దేవదేవ వదస్వ మే | తిష్ఠామి తవ సాంనిధ్యే నాన్యథా వక్తుమర్హసి|| 56

తదోవాచ హృషీకేశో బలిం తం కృపయాన్విత:| అహం తవ సమీపస్థో భవామి సతతం నృప|| 57

ద్వారి స్థితిస్తవ విభో నివసామి నిత్యం మాఖిద్యతామసురవర్య బలే శృణుష్వ | వాక్యం తు మే వరమహో వరదస్తవాద్య వైకుంఠవాసిభిరలం చభజామి గేహమ్‌|| 58

తచ్ఛృత్వా వచనం తస్య విష్ణోరతులతేజస: జగామ సుతలం దైత్యో హ్యసురై : పరివారిత:||59

శుభమగు వరమును కోరుము. నీకు కోరినవన్నీ ఇచ్చెదను అని విష్ణువని బలిని (50) విడిపించి, కౌగలించుకొనగా వాక్యజ్ఞానముగల బలి ఇట్లనెను (51) ఓ ప్రభూ! చరాచరమగు ఈ జగత్తంతా నీ చేత సృష్టింపబడినది కావున నీ పదాబ్జమును తప్ప ఇతరమును దేనినీ కోరను.(52) జనార్థనా! నీ పాదకమలములపైని భక్తి నాకుండుగాక! శాశ్వతమగు భక్తి మరల మరల నీ పదముల పై నుండుగాక (53) అని బలి అభ్యర్థించగా స్థితి కారకుడగు విష్ణువు ప్రీతినొంది అతనితో నిట్లనెను (54) శ్రీ భగవంతుడనెను బలీ! నీవు జ్ఞాతులతో సంబంధులతో కలిసి సుతలమునకు వెళ్ళుము అనగా బలి ఇట్లడిగెను .(55) దేవదేవా! సుతలమున నాకు పనియేమున్నది? చెప్పుమ నీ సన్నిధిలో వుండెదను .వేరోక మాటను చెప్పరాదు(56) అనగా విష్ణువు కృపగలిగి బలితో ననెను ఓ రాజా! నేనెల్లప్పుడు నీకు సమీపమున నుండెదను.(57) నీ ద్వారము వద్ద నిత్యమూ నిలుచుండి నివసించెను ఖేదము పొందరాదు వినుము ఈ వాక్యము నీకు వరము నేను నీకు వరమిచ్చువాడను. వైకుంఠమున వసించువారితో ఇక చాలు నీగృహమును సేవించెదను (58) అనగా విని బలి అసురులతో కూడి సుతలమునకు వెళ్ళిపోయెను.(59)

తదా పుత్రశ##తేనైవ బాణముఖ్యేన సత్వరమ్‌ | వసమానో మహాబాహుర్దాతృణాం చ పరా గతి:|| 60

త్రైలోక్యే యాచకా యే చ సర్వే యాంతి బలిం ప్రతి | ద్వారా స్థితస్తస్య విష్ణు: ప్రయచ్ఛతి యథేప్సితమ్‌ || 61

భుక్తికామాశ్చ యే కేచిన్ముక్తికామాస్తథా పరే ! యేషాం యజ్ఞే చ తే విప్రాస్తభ్యై: సంప్రయచ్ఛతి||62

ఏవం విధో బలిర్జాత: ప్రసాదాత్‌ శంకర్య చ | పురా హి కితవత్యేన యద్దత్తం పరమాత్మనే |'|'63

అశుచిం భూమిమాసాద్య గంధపుష్పాదికం మహత్‌ | పతితం చార్పితం తేన శివాయ పరమాత్మనే||64

కిం పున: పరయా భక్త్యా చార్చయంతి మహేశ్వరమ్‌ | గంధం పుష్పం ఫలం తోయం తే యాంతి శివసన్నిధిమ్‌||65

శివాత్‌ పరతరో నాస్తి పూజనీయో హి భో ద్విజా: యే హి మూకాస్తథాంధాశ్చ పంగవో యే జడాస్తథా||66

జాతిహీనాశ్చ చండాలా: శ్వపచా హ్యంత్యజా హ్యమీ శివభక్తిపరా నిత్యం తే యాంతి పరమాం గతిమ్‌||67

తస్మాత్‌ సదిశివ : పూజ్య సర్వై రేవ మనీషిభి :| పూజనీయో హి సంపూజ్యో హ్యర్ఛనీయ :సదాశివ:|| 68

మహేశం పరమార్థజ్ఞాశ్చిత్రయంతి హృది స్థితమ్‌ | యత్ర జీవో భవత్యేవ శివస్తత్రైవ తిష్ఠతి||68

అపుడు దాతలకు పరమగతియగు బలి, బాణుడు మొదలగు తన నూర్గురు పుత్రులతో నివసించుచుండెను.(60) ముల్లోకములలోని యాచకులంతా బలి వద్దకు వెళ్ళెదరు అపుడు ద్వారము వద్దనున్న విష్ణువు వారికి కోరినది ఇచ్చును.(61)భోగమును కోరి కొందరు,ముక్తిని కోరి కొందరు ఇట్లు ఎవరు విష్ణువును యజమున నారాధింతురో వారికది ఇచ్చును,(62) ఇట్లు బలి శివుని అనుగ్రహముచేత గొప్ప వాడాయెను, పూర్వము జూదరిగా నుండి పరమాత్మకు(63) అశుచిగా భూమి పై పడిన గంధ పుష్పాదులను సమర్పించెను (64) పూర్వము జూదరిగా వుండి నేల పై పడిన గంధపుష్పాదులనే పరమాత్మ కర్పించిన బలి ఇంతవాడాయెను ఇక పరమ భక్తితో గంధమును పుష్పమును పలమును జలమును శివునికి ఇచ్చువారిని అర్చించువారిని గూర్చి చెప్పేదేముంది? వారు శివుని సన్నిధిని చేరెదరు (65) ఓ బ్రహ్మణులారా! శివునికన్న పరమ పూజ్యుడెవరూ లేరు మూగవారు, గుడ్డివారు కుంటివారు జుడులు (66) జాతి హీనులు, చండాలురు, అంత్యజులు అందరూ నిత్యం శివభక్తి పరాయణులైనచో పరమగతిని పొందెదరు.(67) కనుక విజ్ఞులందరూ శివుని పూజింపవలెను అర్చింపవలెను (68) పరమార్థము తెలిసినవారు శివుని

హృదయముననున్నవానిగా చిత్రించెదరు. జీవుడెక్కడుండునో శివుడక్కడే వుండును.(69)

వినా శివేన యత్కించిదశివం భవతి క్షణాత్‌| బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ గుణకార్యకరా హ్యమీ||70

రజోగుణాన్వితో బ్రహ్మా విష్ణు: సత్త్వగుణాన్వితా:| తమోగుణాశ్రితా రుద్రో గుణాతీతో మహేశ్వర:||71

లింగరూపో మహాదేవో హ్యర్చనీయో ముముక్షుభి: | శివాత్పరతరో నాస్తి భుక్తిముక్తిప్రదాయక:||72

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే

బలయే పరప్రదానవర్ణనం నామ ఏకోనవింశోzధ్యాయ:

శివుని లేనిచే ఏ కొద్ది దైనా ఒక్కక్షణములో అమంగళమగును బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరు గుణములు కార్యముల చేయువారు (70) రజో గుణముతో కూడినవాడు బ్రహ్మ సత్త్వ గుణము గలవాడు విష్ణువు, తమో గుణము గలవాడు రుద్రుడు మహేశ్వరుడు గుణములన్నింటికీ అతీతుడు(71) మోక్షము గోరువారు లింగరూపముననున్న మహాదేవుని అర్చించవలెను భుక్తిని, ముక్తిని ఇచ్చువాడు శివుడి కన్న వేరొకడు లేడు.(72)

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కేదారఖండమందు బలికి వరప్రదానమును వర్ణించు పందోమ్మిదవ అధ్యాయము

వింశోzధ్యాయ:

ఋషయ ఊచు:

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ సగుణా: కీర్తితాస్త్వయా | లింగరూపీ తథైవేశో నిర్గుణోzసౌ కథం వద||1

త్రిభిర్గుణౖర్‌ వ్యాప్తమిద చరాచరం జగన్మహద్వాప్యథ వాల్పకం వా మయామయం సర్వమిదం విభాతి లింగం వినా కేన కుతో విభాతి ||2

యద్‌దృశ్యమానం మహదల్పకం చ తన్నశ్వరం కృతకత్వాచ్చ సూత||3

తస్మాత్‌ విమృశ్య భో: సూత సంశయం చేత్తుమర్హసి | వ్యాసప్రసాదాత్‌ సకలం జానాసి త్వం న చాపర:|| 4

సూత ఉవాచ-

వ్యాసేన కథితం సర్వమస్మిన్నర్థే శుకం ప్రతి|

శుక ఉవాచ-

లింగరూపీ కథం శంభుర్నిర్గుణ : కథ్యతే త్వయా|| ఏతన్మే సంశయం తాత ఛేత్తుమర్హస్యశేషత:|| 5

ఇరవయ్యవ అధ్యాయము

ఋషులనిరి బ్రహ్మా విష్ణురుద్రులు సగుణులని నీవు కీర్తించితివి. ఈశ్వరుడు నిర్గుణుడెట్లో మాకు చెప్పుము(1)అల్పముగానీ, మహాత్తుకానీ,చరచరమైన ఈ జగత్తంతా మూడు గుణములచేత వ్యాపింపబడినది. మాయామయముగా ఇదంతా కనబడును. లింగములేక దేనిచేత ఇది ఇట్లు కనబడును ?(2) ఓ సూతా! పెద్దది గానీ చిన్నది గానీ కనబడునదంతా కృత్రిమమైనందున నశించు స్వభావము గలది కనుక నీవు విమర్శించి మా సంశయము ఛేదించవలెను. వ్యాసుని అనుగ్రహము చేత నీకంతా తెలియును. ఇతరులకు తెలియదు (4) సూతుడనెను ఈ విషయమును వ్యాసుడు శుకునికి అంతా తెలియజేసెను శుకుడనెను లింగరూపియగు శివుని నిర్గుణుడని నీవు ఎట్లనెదవు? నాయనా! నా ఈ సంశయమును పూర్తిగా తొలగింపుము (5)

వ్యాస ఉవాచ:

శృణు వత్స బ్రవీమ్యేతత్‌ పురా ప్రోక్తం చ నందినా! అగస్త్యం పృచ్చమానం చ యేన సర్వం శ్రుతం శుక|| 6

నిర్గుణం పరమాత్మానం విద్ది లింగస్వరూపిణమ్‌ | పరా శక్తిస్తథా జ్ఞేయా నిర్గుణా శాశ్వతీ సతీ|7

యయా కృతమిదం సర్వం గుణత్రయవిభావితమ్‌ | ఏతచ్చరాచరం విశ్వం నశ్వరం పరమార్థత:||8

ఏక ఏవ పరో హ్యాత్మా లింగరూపీ నిరంజన: ప్రకృత్యా తే సర్వే త్రిగుణా విలయం గతా:||9

యస్మిన్నేవ తతో లింగం లయనాత్‌ కథితం పురా | తస్మాల్లింగే లయం ప్రాప్తా పరా శక్తి: కుతోzపరే||10

వ్యాసుడు చెప్పెను నాయనా ! పూర్వము అగస్త్యుడడుగగా నంది చెప్పిన దానిని నీకు చెప్పెదను వినుము(6) నిర్గుణమగు పరమాత్మ లింగరూపమున నున్నట్లు తెలియము అదే విధముగా పరాశక్తి గుణరహితురాలు ,శాశ్వతముగా నుండునదని తెలియుము (7) ఆ శక్తి చేతనే పరమార్థములో నశించునదే అయిననూ చరాచరమగు విశ్వమంతా మూడు గుణములలో విశేషముగా భావింపబడుచూ చేయబడినది (8) పరమాత్మ లింగరూపమున ఏదీ అంటనివాడు ఒకడే మూడు గుణములూ ప్రకృతితో విలయమును పొందినవి (9) లయించినందున లింగమని అందువలననే అందరు కనుకే పరాశక్తి లింగమునందే లయము పొందినది. వేరోకదానిలో ఎందుకు?(10)

లీనా గుణాశ్చ రుద్రోక్త్యా యైరిదం బద్దమేవ చ | చ చరాచరం మహాభాగ తస్మాల్లింగం ప్రపూజయేత్‌ ||11

లింగం చ నిర్గుణం సాక్షాజ్జానీధ్వం భో ద్విజోత్తమా: లయాల్లింగస్య మాహాత్మ్యం గుణానాం పరికీర్త్యతే ||12

శంకర: సుఖదాతా హి ఉచ్యమానో మనీషిభి: సర్వో హి కథ్యతే విప్రా: సర్వేషామాశ్రయో హి స :||13

శంభుర్హి కథ్యతే విప్రా యస్మాచ్చ శుభసంభవ:|| 14

ఏవం సర్వాణి నామాని సార్థకాని మహాత్మన: తేనావృతం జగత్సర్వం శంభునా పరమేష్టినా||15

మహానుభావా! రుద్రుడు చెప్పుటచే గుణములన్నీ లీనమైవున్నవి.వానిచేత చరాచర జగత్తంతా బంధింపబడివున్నది. కనుక లింగమును చక్కగా పూజింపవలెను. (11) విప్రోత్తములారా ! లింగమును సాక్షాత్తు నిర్గుణమైనదిగా తెలిసికొనుము. లయించి వున్నందున లింగముయొక్క మాహాత్మ్యము గుణములదిగా చెప్పబడుచున్నది.(12) బుద్దిమంతులు శంకరుని సుఖమునిచ్చువాడని యందురు విప్రులారా! అందరికీ, అన్నిటికీ ఆశ్రయమైనందుచేత శంకరుని సర్వుడు అని అందురు (13) శుభమునకు ఉత్పత్తిస్థానమైనందున శంభువని పిలువబడును (14) ఇట్లు మహాత్ముడగు శివుని పేర్లన్నియూ అర్థముగలవియే పరమేష్టియగు శివునిచేత జగత్తంతా నిండియున్నది.(15)

ఋషయ ఊచు:

యదా దాక్షాయణీ చాగ్నౌ పతితా యజ్ఞకర్మణి | దక్షస్య చ మహాభాగా తిరోధానగతా సతీ|| 16

ప్రాదుర్భూతా కదా సూత కథ్యతాం తత్త్వయాzదునా | పరాశక్తిర్మహేశస్య మిలితా చ కథం పున:||17

ఏతత్‌ సర్వం మహాభాగ పూర్వవృత్తం చ తత్త్వత: | కథనీయం చ అస్మాకం నాన్యో వక్తాస్తి కశ్చన||18

మహానుభావా! సూతా ! దక్షుని యజ్ఞము జరుగు సమయాన మహానుభావురాలైన దక్షుని కూతురైన సతి అగ్నిలో పడి అంతర్ధానము చెందినది కదా! (16) ఎపుడు ఆమె ప్రాదుర్భవించినదో పరాశక్తి యగు ఆమె పరమేశుని మరల ఎపుడు కలిసినదో దానిని మాకు తెలియజేయుము.(17) మహానుభావా! పూర్వము జరిగినదీనినంతా వున్నదున్నట్లుగా మాకు తెలియజేయుము. వేరొక వ్యక్తి ఎవడూ చెప్పజాలడు (18)

సూత ఉవాచ:

జజ్ఞే దాక్షాయణీ బ్రహ్మన్‌ విదగ్దావయవా యదా| వినా శక్త్యా మహేశోzపి తతాప పరమం తప:|| 19

లీలాగృహీతవపుషా పర్వతే హిమవద్దిరౌ | భృంగినా సహ విశ్వేన నందినా చ తథైవ చ|| 20

తథా చండేన ముండేన తథాన్యైర్బహుభిర్‌ వృత: దశభి: కోటిగుణితైర్గణౖశ్చ పరివారిత:||21

గణానాం చైవ కోట్యో చ తథా పష్టిసహస్రకై: ఏవం తత్ర గణౖర్దేవ అవృతో వృషభధ్వజ:||22

తతో జుషాణ: సహసా మహాత్మా హిమాలయస్యాగ్రగతస్తథైవ | గణౖర్‌ వృతో వీరభద్రప్రధానై: స కేవలో మూలవిద్యావిహీన:||23

ఏతస్మిన్నంతరే దైత్యా : ప్రాదుర్బూతా హ్యవిద్యయా | విష్ణునా హి బలిర్భద్దస్తథా తే వై మహాబలా :||24

జాతా దైత్యాస్తతో విప్రా ఇంద్రోపద్రవకారకా: కాలఖంజా మహారౌద్రా: కాలకాయాస్తథాzపరే||25

నివాతకవచా: సర్వే రవరావకసంజ్ఞకా: అన్యే చ బహవో దైత్యా: ప్రజాసంహారకారకా:||26

తారకో నముచే: పుత్రస్తపసా పరమేణ హి | బ్రహ్మాణం తోషయామాస బ్రహ్మా తస్య తుతోష వై||27

ఎపుడైతే దక్షుని కూతురైన దాక్షాయణి పూర్తిగా దహింపబడిన అవయవములు గలదిగా అయినదో అపుడు శక్తిలేని మహేశుడు కూడా గొప్ప తపస్సు చేసెను.(19) హిమవత్పర్వతము పై లీలచే గ్రహించిన శరీరము గలవాడై శివుడు భృంగి, విశ్వుడు,నంది మొదలగు వారిచే కూడియుండెను.(20) అట్లే చండుడు, ముండుడు, మరియు ఇతర గణములు పదికోట్లతో కూడియుండెను.(21) కోటి గణములతో మరియు అరవైవేల గణములతో వృషభ ధ్వజుడగు శివుడుండెను (22) హిమాలయ పర్వతము పై భాగమున శివుడు వీరభద్రుడు మొదలైన గణములతో కేవలుడిగా, మూలావిద్య లేనివాడుగా నుండెను. (23) ఇంతలో అవిద్యచేత దైత్యులావిర్భవించారు విష్ణువు బలిని బంధించగా, మహాబలులైన దైత్యులు(24) ఇంద్రునికి ఉపద్రవముకలిగించువారైనారు. కాలఖంజులు మహారౌద్రులు , కాలకాయులు మరియు ఇతరులు(25) నివాత కవచులని పేరును పొంది రవరావక సంజ్ఞతో ప్రజలను సంహరింపసాగిరి.(26) నముచి పుత్రుడగు తారకుడనువాడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మననుసంతోషింప జేసెను. ఆ తపస్సు చేత బ్రహ్మ అతని పట్ల ప్రసన్నుడాయెను.(27)

వరాన్‌ దదౌ యథేష్టాంశ్చ తారకాయ దురాత్మనే వరం వృణీష్వ భద్రం తే సర్వాన్‌ కామాన్‌ దదామి తే || 28

తచ్ఛృత్వా వచనం తస్య బ్రహ్మణ: పరమేష్ఠిన: | వరయామాస చ తదా వరం లోకభయావహమ్‌||29

యది మే త్వం ప్రసన్నోzసి అజరామరతాం ప్రభో | దేహి మే యద్విజానాసి అజేయత్వం తథైవ చ ||30

ఏవముక్తస్తదా తేన తారకేణ దురాత్మనా | ఉవాచ ప్రవాసన్‌ వాక్యమమరత్వం కుతస్తవ || 31

జాతస్య హి ధృవో మృత్యురేతజ్ఞానీహి తత్త్వత: ప్రవాస్య తారక: ప్రాహ అజేయత్వం చ దేహి మే|| 32

బ్రహ్మోవాచ తదా దైత్యమజయత్వం తవానఘ| వినార్బకేణ దత్తం వై హ్యర్భకస్త్వాం విజేష్యతే ||33

తదా స తారక: ప్రాహ బ్రహ్మాణం ప్రణత: ప్రభో | ఏవం లబ్దవరో భూత్వా తారకో హి మహాబల:

దేవాన్‌ యుద్దార్థమాహూయ యముదే తై: సహాసుర:|| 35

సంతుష్టుడైన బ్రహ్మ దురాత్ముడగు తారకాసురునికి కోరిన వరములనిచ్చెను వరమును కోరుము. నీకు శుభమగును. నీవు కోరినవానినిచ్చెదను. (28) అట్లు బ్రహ్మ పలుకగా ఆ అసురుడు లోకములకు భయమును కలిగించు వరమును కోరెను (29) ఓ ప్రభూ !నీవు నాపట్ల ప్రసన్నుడవైతివేని నాకు ముసలితనము మరణము, పరాజయము లేకుండా వరము నిమ్ము (30) అని దురాత్ముడగు తారకుడనగా నవ్వుచూ బ్రహ్మ ఇట్లనెను. నీకు మరణము లేకుండా వుండుట ఎట్లు? (31) జన్మించిన ప్రతిదానికీ నిశ్చయముగా మరణమున్నదను వాస్తవమును తెలుసుకొనుము అనగా నవ్వి తారకుడనెను అయినచో అజేయుడనగునట్లు వరమునిమ్ము (32) అపుడు బ్రహ్మ తారకునితో ఓ పాపరహితుడైన తారకా! చిన్నపిల్లవాని చేతిలో తప్ప నీకెక్కడా పరాజయము సంభవించదు పిల్లవాడు నిన్ను జయించగలడు (33) అనగా అపుడు తారకుడు బ్రహ్మకు నమస్కరించి ఇట్లనెను ప్రభూ! దేవేశ! నేనీనాడు మీ ప్రసాదము వలన కృతార్థుడనైతిని (34) ఈ విధంగా మహాబలుడైన తారకుడు వరములను పొంది దేవతలను యుద్దానికై ఆహ్వానించి వారితో యుద్దము చేసెను.(35)

ముచుకుందం సమాశ్రిత్య దేవాస్తే జయినోzభవన్‌ | పున: పునర్వికుర్వాణా దేవాస్తే తారకేణ హి|| 36

ముచుకుందబలేనైవ జయామాపు : సురాస్తదా | కిం కర్తవ్యం హి చాస్మాకం యుధ్యమానైర్నిరంతరమ్‌||37

భవితవ్యమితి స్మృత్వా గతాస్తే బ్రహ్మణ : పదమ్‌ | బ్రహ్మణశ్చాగ్రతో భూత్వా హ్యబ్రువంస్తే సవాసవా:

దేవా ఊచు:

బలినా సహ పాతాలమాస్తే zసౌ మధుసూదన: | విష్ణుం వినా హితే సర్వే వృషాద్యా :పతితా :పరై:39

దైత్యేంద్ర్యైశ్చ మహాభాగ త్రాతుమర్హసి న: ప్రభో | తదా నభోగతా వాణీ హ్యూవాచ పరిసాంత్వ్య వై||40

హే దేవా: క్రియతామాశు మమ వాక్యం హి తత్త్వత: | శివాత్మజో యదా దేవా భవిష్యతి మహాబల:||41

యుద్దే పునస్తారకం చవధిష్యతి న సంశయ: యేనోపాయేన భగవాంఛంభు: సర్వగుహాశయ:||42

దారాపరిగ్రహీ దేవాస్తథా నీతిర్విధీయతామ్‌ | క్రియతాం చ పరో యత్నో భవద్బిర్నాన్యథా వచ:||43

యూయం దేవా విజానీధ్వమిత్యువాచాశరీరవాక్‌ | పరం విస్మయమాపన్నా ఊచుర్దేవా: పరస్పరమ్‌ ||44

ముచుకుందుని ఆశ్రయించిన దేవతలు జయమును పొందిరి. తారకుని చేతిలో మరల కష్టముల పొందుచున్న దేవతలు (36) ముచుకుందుని బలముచే జయమును పొందిరి ఇట్లు ఎడతెగక యుద్దము చేయు మనకు కర్తవ్యమేమి?(37) అని విధిని స్మరించి, బ్రహ్మపదమునుచేరిరి. బ్రహ్మ ఎదుట నిలిచి ఇంద్రాది దేవతలు ఇట్లు పలికిరి (38) దేవతలనిరి బలితో సహా విష్ణువు పాతాలముననున్నాడు అతను లేక ఇంద్రుడు మొదలైన దేవతలంతా అసురుల చేతిలో నేలకూలారు.(39) మమ్ము రక్షించుము ప్రభూ! అనగా ఆకాశము నుండి వారిని ఓదార్చుచూ వాణి వినిపించెను.(40) ఓ దేవతలారా! నేను చెప్పినట్లుగా త్వరగా మీరు చేయండి ఎప్పుడైతే శివుని కుమారుడు, మహాబలుడు జన్మిస్తోడో (41) అపుడతను యుద్దముతో తప్పకుండా తారకుని వధించగలడు (42) ఏ ఉపాయముచేత అందరి హృదయములలో నుండు భగవంతుడగు శివుడు (42) భార్యను గ్రహించునో అట్టి మార్గమును మీరు ఏర్పరచుటకు యత్నమును చేయండి(43) దేవతలారా! మీరు తెలుసుకొనుడు అని ఆ అశరీరవాక్కు పలకగా దేవతలు పరస్పరము విస్మయముతో మాట్లాడుకొనిరి(44)

శ్రుత్వా నభోగతాం వాణీమాజగ్ముస్తే హిమాలయమ్‌ | బృహస్పతిం పురస్కృత్య సర్వే దేవా వచోzబ్రువన్‌ ||45

హిమాలయం మహాభాగా :సర్వేకార్యా కార్యార్థగౌరవాత్‌ | హిమాలయ మహాభాగ శ్రూయతాం నోzధునా వచ:|| 46

తారకస్త్రాసయత్యస్మాన్‌ సాహాయ్యం తద్వదే కురు| త్వం శరణ్యో భవాస్మాకం సర్వేషాం చ తపస్వినామ్‌ || తస్మాత్‌ సర్వే వయం యాతా మహేంద్రసహితా విభో|| 47

ఆశరీరవాణిని వినిన దేవతలు బృహస్పతిని ముందిడుకొని హిమాలయము వద్దకు వచ్చి ఇట్లనిరి (45) కార్యము నెరవేరుట యను భారము వుండుటచేత హిమాలయముతో ననిరి మహానుభావా! హిమాలయా! నేడు మా మాటను వినుము.(46) తారకుడనువాడు మమ్ములను భయపెట్టుచున్నాడు అతనిని వధించుటలో నీవు సహాయము చేయుము. తపస్వులగు మా అందరికీ నీవు శరణమునిమ్ము. శరణముకై మేమంతా ఇంద్రునితో కూడి నీ వద్దకు వచ్చితిమి.(47)

లోమశ ఉవాచ-

ఏవమభ్యర్థితో దేవైర్హిమవాన్‌ గరిసత్తమ: | ఉవాచ దేవాన్‌ ప్రవాసన్‌ వాక్యవిదాం వర:||48

మహేంద్రముద్దిశ్య తదా హ్యుపహాససమన్విత:| అక్షమాశ్చ వయం సర్వే మహేంద్రేణ కృతా : సురా:||49

కిం కుర్మ: సురకార్యం చ తారకస్య వధం ప్రతి | పక్షయుక్తా వయం సర్వే యది స్యామ సురోత్తమా :||50

తదా వయం ఘాతయామస్తారకం సహ బాంధవై: అచలోzహం విపక్షశ్చ కిం కార్యం కరవాణి వ:||51

తస్య తద్వచనం శ్రుత్వా సర్వే దేవాస్తమబ్రువన్‌ | సర్వే యూయం వయం చైవ అసమర్దా వధం ప్రతి||52

యేన సాధ్యో భ##వేత్‌ శత్రుస్తారకో హి మహాబల: తదోవాచ మహాతేజా హిమవాన్‌ స సురాన్‌ ప్రతి||53

లోమశుడనెను ఇట్లు దేవతలు గిరిశ్రేష్ఠుడైన హిమవంతుడిని అభ్యర్థించగా, వాక్య జ్ఞానము గలవారిలో శ్రేష్ఠుడగు హిమవంతుడు దేవతలతో నవ్వుతూ అనెను (48) మేమందరమూ మహేంద్రుని చేత అసమర్థులుగా చేయబడినాము(49)తారకుని వధను గూర్చి దేవతల పనిని మేమేమి చేయగలము దేవతలారా! మాకు రెక్కలుండిన యెడల (50) బంధువులతో కలిసి తారకుని వధించగలము ఇపుడు కదలలేని వాడిని, రెక్కలు లేని వాడిని ఏమి చేయగలవాడను(51) అనగా విని దేవతలందరూ అనిరి తారకుని వధించుటకు మీరు మేము అందరమూ అసమర్థులమే కాని ఈ పనిని గూర్చి అలోచింపుము (52) మహాబలుడైన తారకుడు జయింపబడు పనిని గూర్చి ఆలోచింపుము ! అనగా హిమవంతుడు వారితోననెను (53)

కేనోపాయేన భో దేవాస్తారకం హంతుమిచ్చథ | కథయంతు త్వరేణౖవ కార్యం వేత్తుం మమైవ హి||54

తదా సురైః కథితం సర్వమేతద్వాణ్యా చోక్తం యత్పురా కార్యహేతోః |

శ్రుతం తదా గిరిణా వాక్యమేతత్తదోవాచ హిమివాన్‌ పర్వతో హి || 55

శివస్య పుత్రేణ చ ధీమతా యదా వధ్యో దైత్యస్తారకో వై మహాత్మా| తదా సర్వం సురకార్యం శుభం స్యాద్వాణ్యా చోక్తం సత్యమేతద్భవేచ్చ||56

తస్మాత్తదేనత్‌ క్రియతాం భవద్భిర్యథా మహేశ కురుతే పరిగ్రహమ్‌ కన్యా యథా తస్య శివస్య యోగ్యా నిరీక్ష్యతామాశు సురైరిదానీమ్‌ ||57

తస్యతద్వచనం శ్రుత్వా ప్రవాస్యోచు: సురాస్తదా | జనితవ్యా త్వయా కన్యా శివార్థం కార్యసిద్దయే || 58

సురాణాం చ గిరే వాక్యం కురు శీఘ్రం మహామతే | ఆధారస్త్వం తు దేవానాం భవిష్యసి న సంశయ:||59

ఇత్యుక్తో గిరిరాజోథ దేవై: స్వగృహమావిశత్‌ పత్నీం మేనాం చ పప్రచ్చ సురకార్యం సమాగతమ్‌ ||60

జనితవ్యా సుకన్యైకా సురకార్యార్థసిద్దయే దేవానాం చ ఋషీణాం చ తథైవ చ తపస్వినామ్‌ ||61

ప్రియం న భవతి స్త్రీణాం కన్యాజననమువ చ తథాపి చ కన్యైక ఆ వరాననే 62

దేవతలారా !మీరు ఏ ఉపాయముచేత తారకుని సంహరించకోరుచున్నారో తెలియజేయుడు నేనా కార్యమును తెలియుటకు మీరు చెప్పుడు (54)అనగా అపుడు దేవతలు చెప్పిరి కార్యముకొరకు ఆకాశవాణి చెప్పిన దానిని వారు చెప్పగా వినిన హిమవత్‌ పర్వతము ఇట్లనెను (55) తారకుడు శివుని పుత్రుని చేతిలోనే వధింపబడవలసినచో సురుల కార్యమంతా శుభము కాగలదు ఆశరీరవాణి సత్యమవగలదు.(56) కనుక,మీరు మహేశ్వరుడు వివాహమాడునట్లు చేయండి దేవతలంతా శివునికి యోగ్యమగు కన్యకైవెదకండి (57) అనగా నవ్వి దేవతలనిరి ఈ పని నెరవేరుటకు నీవే శివుని కోరకు కన్యను జనింపజేయవలెను (58) ఓ పర్వతరాజమా! మా ఈ దేవతలకు నీవే ఆధారము కనుక మా మాటను నెరవేర్చుము(59) అనగా పర్వతరాజు తన ఇంటికి మరల వెళ్ళి పత్నియగు మేనతో దేవతల కార్యమును గూర్చి చెప్పెను.(60) దేవతల, ఋషుల, మరియు తాపసుల కొరకు నీవు ఒక కన్యకకు జన్మనీయవలెను (61) బాలికకు జన్మనిచ్చుట స్త్రీలకు ప్రియము కాకపోయిననూ నీవు బాలికకు జన్మనీయవలెను (62)

ప్రవాస్య మేనా ప్రోవాచ స్వపతిం చ హిమాలయమ్‌ యదుక్తం భవతా వాక్యం శ్రూయతాం మే త్వయాzధునా || 63

కన్యాసదా దు:ఖకరీ నృణాం పతే స్త్రీణాం తథా శోకకరీ మహామతే | తస్మాద్‌ విమృశ్య సుచిరం స్వయమేవ బుద్ద్యా యథాహితం శైలపతే తదుచ్యతామ్‌ || 64

హిమవాంస్తదుపశ్రుత్య ప్రియాయా వచనం తదా ఉవాచ వాక్యం మేధానీ పరోపకరణాన్వితమ్‌ || 65

యేన యేన ప్రకారేణ పరేషాముపజీవనమ్‌ | భవిష్యతి చ తత్కార్యం ధీమతా పురుషేణ హి ||66

స్త్రియాపి చైవ తత్కార్యం పరోపకరణాన్వితమ్‌ ఏవం ప్రవర్తితా తేన గిరిణా మహీషీ తదా || దధార జఠరే కన్యాం మేనా భాగ్యవతీ తదా || 67

మహావిద్యా మహామాయా మహామేధా స్వరూపిణీ రుద్రకాలీ చ అంబా చ సతీ దాక్షాయణీ పరా || 68

తాం విభూతిం విశాలాక్షీ జఠరే పరమాం సతీ | బభార సా మహాభాగా మేనా చారువిలోచనా ||69

స్తుతిం చక్రుస్తదా దేవా ఋషయో యక్షకిన్నరా: మేనాయా భూరిభాగ్యాయాస్తథా హిమవతో గిరే || 70

అనగా నవ్వి మేన భర్తయగు హిమవంతునితో ఇట్లనెను మీరు చెప్పన దానిని వంటిని. నా మాటను వినుడు (63) మానవులనుకన్య దు:ఖమును కలిగించును స్త్రీలకు శోకమును కలిగించును. కనుక బాగుగా నీ బుద్దితో విచారించి హితమగుదానిని చెప్పుము(64) అని మేన పలికినపుడు హిమవంతుడు పరోపకారముతో కూడిన వాక్యమును పలికెను (65) బుద్దిమంతుడైన వ్యక్తి ఇతరుల జీవనము దేనిచేత కలుగునో దానినే చేయవలెను (66) పరోపకారముతో కూడినదానిని స్త్రీకూడా చేయవలెను. అని ప్రవర్తింపజేయగా మేన తన భాగ్యముచేత ఉదరమున కన్యను ధరించెను (67) మహావిద్య, మహామాయ మహామేధ స్వరూపిణి, రుద్రకాలి, అంబ, సతి, దాక్షాయణి (68) అనబడు ఆ పరమేశ్వర్యమును విశాలాక్షియగు మేన తన కడుపులో భరించుచూ నుండెను (69) అపుడు దేవతలు ,బుషులు, యక్షులు, కిన్నరులు, హిమవంతుని భాగ్యమును ,మేనయోక్క అమితభాగ్యమును స్తుతించిరి.(70)

ఏతస్మిన్నంతరే జాతా గిరిజా నామ నామత: | ప్రాదుర్భూతా యదా దేవీ సర్వేషాం చ సుఖప్రదా||71

దేవదుందుభయో నేదు: ననృతుశ్చాప్సరోగణా:| జగుర్గంధర్వపతయో ననృతుశ్చాప్సరోగణా:||72

పుష్పవర్షేణ మహతా వవృషుర్విబుధాస్తథా | తదా ప్రసన్నమభవత్సర్వం త్రైలోక్యమేవ చ||73

యదావతీర్ణా గిరిజా మహాసతీ తదైవ దైత్యా భయమావిశంస్తే| ప్రాప్తా ముదం దేవగణా మహర్షయః సచారణా: సిద్దగణాస్తథైవ|| 74

ఇతి శ్రీస్కాందే మహాపురాణ మాహేశ్వరఖండే కేదారఖండే శ్రీ భవాన్యుత్పత్తివర్ణనం నామ వింశోzధ్యాయ:

ఇంతలో దేవి గిరిజయను పేరుతో ప్రాదుర్భవించి అందరికీ సుఖమును కలిగించున దాయెను (71) దేవదుందుభులపుడు నినదించినవి అప్సరోగణములు నర్తించిరి .గంధర్వపతులు గానము చేయగా అప్సరోగణములు నాట్యము చేసిరి.(72) దేవతలు గొప్ప పుష్పవర్షమును వర్షింపజేసిరి అపుడు ముల్లోకములు కూడా ప్రసన్నమైనవి. (73) ఎపుడైతే మహాసతియగు గిరిజ అవతరించినదో అపుడు దైత్యులు భయమును పొందిరి దేవగణములు మహార్షులు, చారణులు,సిద్దిగణములు అనందమును పొందిరి.(74)

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మాహేశ్వరఖండమున

కేదారఖండమందు శ్రీ భావానీదేవి ఉత్పత్తివర్ణనము అను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.

ఏకవింశోధ్యాయ:

లోమశ:

వర్థమానా తదా సాధ్వీ రరాజు ప్రతివాసరమ్‌ | అష్టవర్షా యదా జాతా హిమాలయగృహే సతీ|| 1

మహేశో హిమ వద్‌ద్రోణ్యాం తతాప పరమం తప: సర్వైర్గణౖ: పరివృతో వీరభద్రాదిభిస్తదా||2

ఏతత్తపో జుషాణం తం మహేశం హిమవాన్‌ య¸° తత్పాదవల్లవం ద్రష్టుం పార్వత్యా సహ బుద్దిమాన్‌ ||3

యావత్సమాగతో ద్రుష్టుం నందినాసౌ నివారిత:| ద్వారి స్థితేన చ తదా క్షణమేకం స్థిరాzభవత్‌ ||4

పునర్విజ్ఞాపయామాస నందినా హిమవాన్‌ గిరి: విజ్ఞప్తో నందినా శంభురచలో ద్రష్టుమాగత :||5

తదాకర్ణ్య వచస్తస్య నందిన : పరమేశ్వర: ఆనయస్వ గిరిం చాత్ర నందినం వాక్యమబ్రవీత్‌ ||6

తథేతి మత్వా నందీ తం పర్వతం చ హిమాచలమ్‌ అనయామాస స తథా శంకరం లోకశంకరమ్‌|| 7

దృష్ట్యా తదానీం సకలేశ్వరం ప్రభుం తపో జుషాణం వినిమీలితేక్షణమ్‌||8

కపర్దినం చంద్రకలావిభూషణం వేదాంతవేద్యం పరమాత్మని స్థితమ్‌ | వవంద శీర్షాచ తదా హిమాచల: పరాం ముదం ప్రాపదహీనసత్త్వ :|| 9

ఉవాచ వాక్యం జగదేకమంగలం హిమాలయో వాక్యవిదాం వరిష్ఠ:|| 10

ఇరవై ఒకటవ అధ్యాయము

లోమశుడు చెప్పెను- సాధ్వియగు పార్వతి ప్రతిదినము పెరుగుచున్నదై ప్రకాశించెను. అమె హిమవంతుని ఇంట ఎనిమిది సంవత్సరాల బాలికగా పెరిగెను.(1) పరమశివుడు హిమవత్పర్వతము పై వీరభ్రదుడు మొదలైన తన గణములన్నీ కూడియుండగా గొప్పతనము జేసెను (2) ఇట్లు తపస్సును చేయుచున్న మహేశుని వద్దకు అతని పాదకమలమును చూచుటకై హిమవంతుడు పార్వతితో కలిసి వచ్చెను (3) చూచుటకు వచ్చిన హిమవంతుని ద్వారము వద్దనున్న నంది అడ్డగించెను . ఒక క్షణము కదలకుండా నిలిచెను (4) హిమవంతుడు నందిద్వారా విజ్ఞాపనము చేసెను పర్వతరాజు చూడగోరి వచ్చెనని నంది శివునికి విన్నవించెను.(5) నందిమాటను వినిన పరమేశ్వరుడు ఆ పర్వతమునిట్లు గొని రమ్మని నందికి చెప్పెను.(6) అట్లేనని పలికి నంది పర్వతరాజుగు హిమవంతుని లోకములకు కల్యాణముల కలుగజేయు శివుని వద్దకు గొనివచ్చెను. (7) అపుడు సకలేశ్వరుడు ప్రభువు కనులుమోడ్చి తపము జేయుచున్నవాడు జటాజూటము గలవాడు , చంద్రుని కళను తల పై ధరించినవాడు , వేదాంతములచేత మాత్రమే తెలియబడువాడు పరమాత్మ యందు నిలిచిన వాడు, అగు పరమేశ్వరుని హిమవంతుడు చూచెను.(8) గొప్ప శక్తి గల హిమవంతుడు పరమానందము నొంది తలవంచి నమస్కరించెను.(9) వాక్యజ్ఞానము గల వారిలో శ్రేష్టుడగు హిమవంతుడు జగదేకశుభమునొనర్చు శంకరునితో నిట్లనెను (10)

సభాగ్యోzహం మహాదేవ ప్రసాదాత్తువ శంకర | ప్రత్యవాం చాగమిష్యామి దర్శనార్థం తవ ప్రభో ||11

అనయా సహదేవేశ అనుజ్ఞాం దాతుమర్హసి| శ్రుత్వ తు వచనం తస్య దేవదేవో మహేశ్వర:||12

ఆగంతవ్యం త్వయా నిత్యం దర్శనార్థం మమాచల | కుమారీం చ గృహే స్థాప్య నాన్యథా మమ దర్శనమ్‌ ||13

అచల : ప్రత్యువాచేదం గిరిశం నతకంధర: కస్మాన్మయానయా సార్థం నాగంతవ్యం తదుచ్యతామ్‌ || ఆచలం చ వ్రతీ శంభు: ప్రహసన్వాక్య మబ్రవీత్‌ ||14

ఇయం కుమారీ సుశ్రోణీ తన్వీ చారు ప్రభాషిణీ నానేతవ్యా మత్సమీపే వారయామి పున: పున:|| 15

ఏతత్‌ శ్రుత్వా వచనం తస్య శంభోర్నిరామయం ని:స్ప్సహనిష్ఠురం వా | తపస్వినోక్తం వచనం నిశమ్య ఉవాచ గౌరీ చ వివాస్య శంభుమ్‌ ||16

శంకరా! నీ అనుగ్రహము చేత నేను భాగ్యము గలవాడనైతిని ప్రభూ ! నిన్ను చూచుటకు నేను ప్రతిదినమూ వచ్చెదను (11) ఈ పార్వతితో వచ్చుటకు నాకు అనుమతి నిమ్ము అని హిమవంతుడనగా దేవదేవుడగు శివుడు విని ఇట్లనెను (12) పర్వతరాజా! నన్ను చూచుటకు నీవు ప్రతి దినమూ రావచ్చును. కానీ నీ ఈ కుమారైను ఇంటిలోనుంచి మాత్రమే వేరొక విధముగా నాదర్శనము కలుగదు.(13)అపుడు హిమవంతుడు తలవంచి శివునితో ఈ కన్యతో సహా నేనెందుకు రాకూడదో తెలియజేయండి అనెను అపుడు శివుడు నవ్వుచూ ఇట్లు పలికెను (14) ఈ బాలిక అందమైన శరీరము గలది చక్కగా మాట్లాడునది నా వద్దకు ఈమెను నీవు తీసుకొని రావలదు. మరల మరల వారించుచుంటిని (15) అనగా ని:స్ప్సహతో నిష్టురముగా నున్న ఆ మాటను విని పార్వతి నవ్వి శివునితో నిట్లనెను (16)

గౌర్యువాచ-

తప: శక్త్యాన్విత: శంభో విపులం తప: | తవ బుద్దిరియం జాతా తపస్తప్తుం మహాత్మనః || 17

కస్త్వం కా ప్రకృతిః సూక్ష్మా భగవంస్తద్విమృశ్యతామ్‌ | పార్వత్యాస్తద్వచఃశ్రుత్వా మహేశో వాక్యమబ్రవీత్‌ || 18

గౌరి పలికెను - 'తపఃశక్తితో కూడుకొని యున్న నీవు గొప్పతపము నాచరించుచుంటివి. శంకరా! మహాత్ముడవగు నీకు తపమాచరించు బుద్ధి ఏర్పడినది. (17) నీవెవరు? సూక్ష్మమగు ప్రకృతి యేది? తరచి చూడుము'. అని పార్వతి పలుకగా విని శివుడిట్లనెను. (18)

తపసా పరమేణౖవ ప్రకృతిం నాశయామ్యహమ్‌ | ప్రకృత్యా రహితః సుభ్రు అహం తిష్ఠామి తత్త్వతః ||

తస్మాచ్చ ప్రకృతే: సిద్దేర్న కార్య: సంగ్రహ: క్వచిత్‌|| 19

ఘోరతపస్సు చేత నేను ప్రకృతిని లేకుండా చేసెదను ప్రకృతి లేకుండా నేను నా వాస్తవ రూపములో నుండెదను కనుక సిద్దికై ప్రకృతిలోని సంగ్రహమెన్నడూ చేయరాదు.(19)

పార్వత్యువాచ-

యదుక్తం పరయా వాచా వచనం శంకర త్వయా |సా కిం ప్రకృతిర్నైవ స్యాదతీతస్తాం భవాన్‌ కథమ్‌|| 20

యచ్చృణోపి యదశ్నాసి యచ్చ పశ్యసి శంకర| వాగ్వాదేన చ కిం కార్యమస్మాకం చాధునా ప్రభో||21

తత్సర్వం ప్రకృతే కార్యం మిధ్యావాదో నిరర్థక: | ప్రకృతే పరతో భూత్వా కిమర్థం తప్యతే తప:||22

త్వయా శంభోzధునా హ్యస్మిన్గిరౌ హిమవతి ప్రభో ప్రకృత్యా మిలితోzసి త్వం న జానాసి హి శంకర||23

వాగ్వాదేన చ కిం కార్యమస్మాకం చాధునా ప్రభో | ప్రకృతే: పరతస్త్వం చ యది సత్యం వచస్తవ| తర్హి త్వయా న భేతన్యం మమ శంకర సంప్రతి|| 24

ప్రవాస్య భగవాన్‌ దేవోగిరిజాం ప్రత్యువాచ హ||25

పార్వతి పలికెను శంకరా! పరావాక్కుతో నీవు పలికితివి. అది ప్రకృతి కాదా! నీవు దానికంటే అతీతుడెట్లయితివి?(20) ఇపుడు మనకు వాగ్వాదముతో నేమి లాభము? నీవు వింటున్నది, తింటున్నది,చూచుచున్నది (21) ఇదంతా ప్రకృతి యొక్క కార్యము మిథ్యానాదము ప్రయోజనములేనిది. ప్రకృతికంటే పరముగా నుండుచూ తపమెందుకాచరించు చుంటివి?(22) ఓ ప్రభూ ఈ హిమవత్సర్వతము పై నీవు ప్రకృతితో కూడిన యున్నావు. నీకది తెలియదా? (23) వాగ్వాదముచేత నేమి ప్రయోజనము ?ప్రకృతి కంటే పరముగా నున్నానని నీవన్నది నిజమైన యెడల నీ విపుడు నానుండి భయము పొంద పనిలేదు(24)అనగా విని శంకరుడునవ్వి పార్వతితో నిట్లనెను.(25)

మహాదేవ ఉవాచ:

ప్రత్యహం కురు మే సేవాం గిరిజే సాధుభాషిణి|| 26

ఇత్యేవముక్త్వా గిరిజాం మహేశో హిమాలయం వాక్యమథో బభాషే|| అత్రైవ సోzహం తపసా పరేణ చరామి భూమ్యాం పరమార్థభావ:|| 27

తపస్తప్తుమనుజ్ఞా మే దాతవ్యా పర్వతాధిప | అనుజ్ఞయా వినా కించిత్తప: కర్తుం న పార్వతే ||28

ఏతచ్ఛృత్వా వచస్తస్య దేవదేవస్య శూలినః | ప్రహస్య హిమవాన్‌ శంభుమిదం వచనమబ్రవీత్‌||29

త్వదీయం హి జగత్సర్వం సదేవాసురమానుషమ్‌ | కిమహం తు మహాదేవ తుచ్చో భూత్వా దదామి తే||30

ఏవముక్తో హిమవతా శంకరో లోకశంకర: | ప్రవాస్య గిరిరాజం తం యాహీతి ప్రాహ సాదరమ్‌||31

శంకరేణాభ్యనుజ్ఞాత: స్వగృహం హిమవాన్‌ య¸° | సార్ధం గిరిజయా సోzపి ప్రత్యహం దర్శనే స్థిత:||32

ఏవం కతిపయ: కాలో గతశ్చోపాసనాత్తయో:||33

సుతాపిత్రోశ్చ తత్రైవ శంకరో దురతిక్రమ:| పార్వతీం ప్రతి తత్రైవ చింతామాసేదిరే సురా:||34

తే చింత్యమానాశ్‌ సురాస్తదానీంకథం మహేశో గిరిజాం సమేష్యతి | కిం కార్యమద్యైవ వయం చ కుర్మో బృహస్పతే తత్కథయస్వ మా చిరమ్‌|| 35

బృహస్పతిరువాచేదం మహేంద్రం ప్రతి సద్వచ: | ఏవమేతత్త్వయా కార్యం మహేంద్ర శ్రూయతాం తదా||36

ఏతత్కార్యం మదనేనైవ రాజన్నాన్య: సమర్థో భవితా త్రిలోకే | విప్లావితం తాపసానాం తపో హి తస్మాత్త్వరాత్‌ ప్రార్థనీయో హిమార:|| 37

మహాదేవుడు పలికెను మంచి మాటలను పలుకు పార్వతీ! నీవు ప్రతిదినమూ నా సేవను జేయుము(26) అని పలికి శివుడు హిమవంతునితో ననెను. 'ఈ భూమియందు నేను తపము నాచరించుచూ వుండెదను (27) పర్వతరాజా!తపము చేయుటకు నాకనుమతి నిమ్ము అనుమతిలేకుండా తపస్సు చేయుట సాధ్యము కాదు (28) అనగా శూలము ధరించు దేవదేవుని మాటవిని హిమవంతుడు నవ్వి ఇట్లనెను (29) మహాదేవా! దేవతలు, అసురులు మానవులు గల ఈ జగత్తంతా నీదే .నామాటేమున్నది? తుచ్చుడనై నీకిచ్చెదను (30) అని పలుకగా నవ్వి శంకరుడు హిమవంతునికి సాదరముగా వెళ్ళుమని పలికెను (31) శంకరుని అనుమతి పొంది హిమవంతుడు తన ఇంటికి వెళ్ళి ప్రతిదినమూ శివుని దర్శనానికై పార్వతితో సహ వచ్చుచుండెను.(32) ఇట్లు శివుని ఉపాసనయందు వారిరువురికీ కొంతకాలము గడిచెను.(33)అక్కడే తండ్రీ కూతురు ఇరువురూ కాలము గడుపుటనూ, శివుని పొంద శక్యముగాక పోవుటయూ చూచి దేవతలు చింతను పొందిరి(34) మహేశ్వరుడెట్లు పార్వతిని కలియగలడు? అని దేవతలు చింతించుచూ బృహస్పతిని కలిసి ఏమి చేయవలెనో తెలుపుమని అడిగిరి (35) అపుడు బృహస్పతి మహేంద్రునితో ఈ విధముగా చేయవలెను వినుమనెను (36) రాజా ఈ పనిని మన్మథుడే చేయగలడు ముల్లోకములలో వేరెవరూ సమర్థులు కారు. అతను తాపసుల తపస్సును భంగపరుచును కనుక త్వరగా అతనిని ప్రార్థించుడు(37) గురోర్వచనమాకర్ణ్య ఆహ్వాయన్‌ మదనం హరి:| ఆహ్వానాదాజగామాధ మదన: కార్యసాధక:||38

రత్యా సమేత: సహ మాధనేన స పుష్పధన్వా పురత: సభాయామ్‌|మహేంద్రమాగమ్య ఉవాచ వాక్యం సగర్వితం లోకమనోహరం చ ||39

అహమాకారిత: కస్మాద్‌ బ్రూహి మేzద్య శచీపతే |కిం కార్యం కరవాణ్యద్య కథ్యతాం మా విలంబ్యతామ్‌ ||40

మమ స్మరణమాత్రేణ విభ్రష్ఠా హి తపస్విన: | త్వమేవ జానాసి హరే మమ వీర్యపరాక్రమౌ||41

మమవీర్యం చ జానాతి శ##క్తే: పుత్ర: పరాశర: ఏవం చాన్యే చ బహవో భృగ్వాద్యా: ఋషయో హ్యమీ||42

గురురప్యభిజానాతి భార్యోతథ్యస్య చైవ హి | తస్యాం జాతో భరద్వాజో గురుణా సంకరో హి స:||43

భరద్వాజో మహాభాగ ఇత్యువాచ గురుస్తదా | జానాతి మమ వీర్యం చ శౌర్యం చైవ ప్రజాపతి:|| 44

క్రోథో హి మమ బంధుశ్చ మహాబలపరాక్రమ: | ఉభాభ్యాం ద్రావితం విశ్వం జంగమాజంగమం మహత్‌ | బ్రహ్మాదిస్తంబపర్యంతం ప్లావితం సచరాచరమ్‌ ||45

బృహస్పతి మాటను విని ఇంద్రుడు మన్మథుని పిలిపించెను. ఆ పిలుపునందుకోని కార్యమును సాధించు మన్మథుడు వచ్చెను.(38) రతితో కలిసి, మాధవునితో సహ, పుష్పధనువును చేత ధరించి మన్మథుడు ఇంద్రుని వద్దకు వచ్చి సభయందు గర్వముతో, లోకముల మనస్సును హరించునట్లు పలికెను(39) ఓ ఇంద్రా! నన్నీనాడు పిలిపించిన కారణమేమి? నేనేమి చేయవలెను?ఆలస్యము చేయక తెలుపుము(40) నన్నుస్మరించినంత మాత్రాన తాపసుల భ్రష్టులైరి నా వీర్య పరాక్రమములు నీకే తెలియును.(41)నా శక్తిని శక్తి పుత్రుడగు పరాశరుడు ఎరుగును ఇట్లే భృగువు మొదలైన ఋషులెందరో నాశక్తి నెరుగుదురు.(42) గురువుకు తెలియును. ఉతథ్యుని భార్యకు తెలియును. ఆమె యందు పుట్టిన భరద్వాజుడు గురువుతో సంకరమే కదా! (43) భరద్వాజుడు మహానుభావుడని గురువనెను ప్రజాపతి కూడా నాశక్తిని శౌర్యమునూ ఎరుగును.(44) గొప్ప బల పరాక్రము గల క్రోధము నా బంధువు.ఈ కామక్రోథముల చేతనే చరాచర జగత్తంతా కరిగిపోవును బ్రహ్మ మొదలు స్తంబము వరకు చరాచరమంతా తేలిపోవును(45)

దేవా ఊచు:

మదన త్వం సమర్థోzసి అస్మాన్‌ జేతుం సదైవ హి| మహేశం ప్రతి గచ్చాశు సురకార్యసిద్దయే|| పార్వత్యా సహితం శంభుం కురుష్వాద్య మహామతే|| 46

దేవతలనిరి మన్మథా ! మమ్ములను జయించుటకు నీవెప్పుడూ సమర్థుడవే దేవతల పనినెరవేరుటకు శివుని వద్దకు వెళ్ళుము పార్వతితో కూడునట్లు శివుని చేయుము.(46)

ఏవమభ్యర్థితో దేవైర్మదనో విశ్వమోహన: జగామ త్వరితో భూత్వా అప్సరోభి: సమన్విత:|| తతో జగామాశు మహాధనుర్దరో విస్పార్య చాపం కుసుమాన్వితం మహత్‌ | తథైవ బాణాంశ్చ మనోరమాంశ్చ ప్రగృహ్య వీరో భువనైకజేతా || తస్మిన్‌ హిమాద్రౌ పరిదృశ్యమానోzవనౌ స్మరో యోదయతాం వరిష్ట:||48

తత్రాగతా తదా రంభా ఊర్వశీ పుంజికస్థలీ | సువ్లూెచా మిశ్రకేశీ చ సుభగా చ తిలోత్తమా|| 49

అన్యాశ్చ వివిధా జాతా సాహాయ్యే మదనస్య చ | అప్సరసో గణౖర్దృష్టా మదనేన సహైవ తా:||50

సర్వే గణాశ్చ సహసా మదనేన విమోహితా: | భృంగిణా చ తదా రంభా చండేన సహ చోర్వశీ||51

మేనకా వీరభ##ద్రేణ చండేన పుంజికస్థలీ | తిలోత్తమాదయస్తత్ర సంవృతాశ్చ గణౖస్తదా||52

ఉన్మత్తభూతైర్బహుభిస్త్రపాం త్యక్త్వా మనిషిభి: అకాలే కోకిలాభిశ్చ వ్యాప్తమాసీన్మహీతలమ్‌ ||53

అశోకాశ్చంపకాశ్చూతా యూధ్యశ్చైవ కదంబకా: నీపా: ప్రియాలా: పనసా రాజవృక్షాశ్చరాయణా:||54

ద్రాక్షావల్ల్య: ప్రదృశ్యన్తే బహులా నగకేసరా: తథా కదల్య: కేతక్యో భ్రమరైరుపశోభితా:||55

మత్తా మదనసంగేన హంసీభి: కలహంసకా:| కరేణుభిర్గజా హ్యాసన్‌ శిఖండీభి: శిఖండిన:||56

ఇట్లు దేవతలు అభ్యర్థించగా మన్మథుడు అప్సరసలతో కలిసి త్వరగా వెళ్ళెను.(47) గొప్ప ధనుస్సు గల మన్మథుడు పూలవిల్లును ఝళిపించి,మనోహరమైన బాణాలను చేత ధరించి, భువనములను జయించు యోధాగ్రేసరుడగు మదనుడు హిమవత్సర్వతము పై కానవచ్చెను (48) అపుడక్కడికి రంభ, ఊర్వశి, పుంజికస్థలి, సువ్లూెచ, మిశ్రకేశి, సభగ,తిలోత్తమ(49) మరియు ఇతర అప్సరసలు మదనునికి సహాయముచేయుటకైవచ్చిరి. వారిని మదనుడు చూచెను. (50) గణములన్నీ మదనునిచే మోహమునొందినవి. భృంగితో రంభ, చండునితో ఊర్వశి (51) వీరభద్రునితో మేనక , చండునితో పుంజికస్థలి, తిలోత్తమ మొదలగు వారిట్లు గణములతో కూడిరి.(52) పెక్కుమంది అట్లు ఉన్మత్తులైసిగ్గును విడిచిరి కాలము కాకున్ననూ మహీతలమంతా కోకిలలతో నిండెను.(53)అశోకములు, చంపకములు, చూత (మామిడి) కదంబములు, నీపవృక్షములు,ప్రియాలములు, పనస, రాజవృక్షములు, చరాయణములు (54) ద్రాక్షతీగెలు, నాగకేసరములు మిక్కుటముగా కనబడెను అట్టే అరటి వృక్షములు, కేతకీ పుష్పములు తుమ్మెదలతో ప్రకాశించెను.(55) మదనుని కలయికతో కలహంసలు, ఆడుహంసలు , అడుహంసలతో,ఏనుగులు ఆడ ఏనుగులతో,నెమళ్ళు ఆడనెమళ్ళతో కూడియుండెను.(56)

నిష్కామా హ్యాతురా హ్యాసన్‌ శివసంపర్కజైర్గుణౖ:| అకస్మాచ్చ తథా కథం జాతం విమృశ్య చ|| 57

శైలాదో హి మహాతేజా నందీ హ్యమితవిక్రమ:| రక్షసాం విబుధానాం వా కృత్యమస్తీత్యచింతయత్‌|| 58

ఏతస్మిన్నంతరే తత్ర మదనో హి ధనుర్థర: | పంచబాణాన్‌ సమారోప్య స్వకీయే ధనుషి ద్విజా:||59

తరోశ్చాయాం సమాశ్రిత్య దేవదారుగతాం తదా|| 59

నిరీక్ష్య శంభుం పరమాసనే స్థితం తపో జుషాణం పరమేష్ఠినం పతిమ్‌| గంగాధరం నీలతమాలకణ్ఠం కపర్దినం చంద్రకాలాసమేతమ్‌ ||60

భుజంగభోగాంకితసర్వగాత్రం పంచాననం సింహవిశాలవిక్రమమ్‌ | కర్పూరగౌరం పరయాన్వితం చ స వేద్దుకామో మదనస్తపస్వినమ్‌||61

దురాసదం దీప్తిమతాం పరిష్ఠం మహేశముగ్రం సహ మాధవేన|

యావచ్చివం వేద్దుకామ: శ##రేణ తావద్యాతా గిరిజా విశ్వమాతా||సఖీజనై: సంవృతా పూజనార్థం సదాశివం మంగలం మంగలానామ్‌||62

కనకకుసుమమాలాం సందధే నీలకంఠే సితకిరణమనోజ్ఞా దుర్లభా సా తదానీమ్‌ |స్మితవికసితనేత్రా చారువక్త్రం శివస్య సకల జనజనిత్రీ వీక్షమాణా బభూవ ||63

తావద్విద్ద: శ##రేణౖవ మోహనాఖ్యేన చ త్వరాత్‌ | విధ్యమానస్తదా శంభు: శ##నైరున్మీల్య లోచనే |దదర్శ గిరిజాం దేవోబ్దిర్యథా శశిన: కలామ్‌ ||64

కామనలు లేని వారు శివుని సంపర్కమునుండి పుట్టిన గుణములచేత ఆందోళన నొంది అకస్మాత్తుగా ఇదెట్లు ఏర్పడెను అని విచారించిరి(57) శైలాదుడగు నంది, అమిత శౌర్యముగల వాడు ఇది రాక్షసుల లేదా దేవతల పనియని అనుకొనెను(58) ఇంతలో ధనుస్సును ధరించిన మదనుడు తన విల్లుకు ఐదు బాణాలను ఎక్కుబెట్టి దేవదారువృక్షము యొక్క నీడను చేరెను,(59) అక్కడ పరమ అసనమున నున్న వాడిని తపము నాచరించుచున్నవాడిని గంగను ధరించియున్నవానిని నీలకంఠుని, కవర్థిని, చంద్రశేఖరుని, (60)శరీరము పై ఎల్లెడలా సర్పఫణముల నలంకరించినవానిని, ఐదు శిరస్సులుగలవానిని సింహము వంటి పరాక్రమవంతుని ,తేజోవంతుడగు శివుని,మాథవునితో కూడిన మదనుడు బాణముతో గొట్టబోవు నంతలో విశ్వమాతయగు పార్వతి చెలికత్తెలతో శివుని పూజించుటకు వచ్చెను.(62) తెల్లని కిరణముల వలె అందముగా నున్న పార్వతి అపుడు బంగారుపూమాలను నీలకంఠుని మెడలో వైచెను.జనులు తల్లియగు పార్వతి చిరునవ్వుతో , వికసించిన కనులతో శివుని అందమైన ముఖమునుచూడసాగెను (63) అపుడు మదనుడు మోహనమను బాణముతో శివుని కోట్టగా శివుడు నెమ్మదిగా కనులు తెరిచి చంద్రుని కళను సముద్రము చూచినట్లు, పార్వతి ముఖమును చూచెను. (64)

చారుప్రసన్నవదనాం బింబోష్ఠీం నస్మితేక్షణామ్‌ | సుద్విజామగ్నిజాం తన్వీం విశాలవదనోత్సవామ్‌ ||65

గౌరీం ప్రసన్నముద్రాం చ విశ్వమోహనమోహనామ్‌ | యయా త్రిలోకరచనా కృతా బ్రహ్మాదిభి: సహ|| 66

ఉత్పత్తిపాలనవానాశకరీ చ యా వై కృత్వాగ్రత: సత్త్వరజస్తమాంసి|సా చేతనేన దదృశే పురతో హరేణ సంమోహనీ సకల మంగలమంగలైకా|| 67

తాం నిరీక్ష్య భవో దేవో గిరిజాం లోకపావనీమ్‌ మమోహ దర్శనాత్తస్యా మదనేనాతురీకృత:|| విస్మయోత్ఫుల్లనయనో బభూవ సహసా శివ:|| 68

ఏవం విలోకమానో zసౌ దేవదేవో జగత్పతి: | మనసా దూయమానేన ఇదమాహ సదాశివ:|| 69

అనయా మోహిత: కస్మాత్తప:స్థోzహం నిరామయ: కుత: కస్మాచ్చ కేనేదం కృతమస్తి మమాప్రియమ్‌||70

తతో వ్యాలోకయచ్చంభుర్దిక్షు సర్వాసు సాదరమ్‌ | తావద్దృష్టో దక్షిణస్యాం దిశి హ్యాత్తవరాసన:| 71

చక్రీకృతధను: సజ్జం చక్రే వేద్దుం సదాశివమ్‌ | తావద్‌దృప్తో మహేశేన సరోషేణ తదా ద్విజా:||72

నిరీక్షితస్తృతీయేన చక్షుషా పరమేణ హి| మదనస్తత్‌ క్షణాదేవ జ్వాలామాలావృతో zభవత్‌ ||హాహాకారో మహానాసీద్దేవానాం తత్ర పశ్యతామ్‌ ||73

అందముగా , ప్రసన్నముగా నున్న ముఖముగలది, బింబము వంటి ఆధరము గలది నవ్వుచున్నా కన్నులుగలది, అగ్ని సముద్భవ ,అందమైన శరీరము గలది విశాల వదనముతో నున్నది (65) ప్రసన్నముద్ర గలది విశ్వమోహనునికి మోహము గలుగజేయునది. బ్రహ్మాదులతో కలిసి, ముల్లోకముల రచించినది యగు పార్వతిని చూచెను.,(65,66) సత్త్వ రజస్సు, తమస్సులను గుణాలను ముందుంచుకొని లోకముల ఉత్త్పత్తిని, పాలనను, వినాశాన్ని కలుగజేయు ఆ సంమోహిని యగు మంగళస్వరూపిణిని పార్వతిని చేతనుడగు శివుడు చూచెను.(67) ఇట్లు జగత్పతియగు ఆ దేవదేవుడు చూచి బాధపడుచున్న మనసుతో ఇట్లనుకొనెను (69) తపమునుందు ఏ బాధలూ లేకుండిన నేను ఈమె చేత మోహము నెట్లు పొందితిని? నాకు అప్రియమగు దీనిని ఎక్కడనుండి దేనికై ఎవరు చేసిరి?(70) అపుడు శివుడు సాదరముగా దిక్కులనన్నింటిని చూడగా దక్షిణ దిక్కుయందు ధనుస్సును చేతబట్టి యున్న మన్మధుడు కనబడెను.(71) ధనుస్సు చక్రము వలె చేసి సిద్దపరచి మరల శంకరుని బాణముతో మదనుడు కొట్టబోవు చుండెను అపుడు ఓ బ్రాహ్మణులారా! శివుడు కోపమును పొందెను.(72)దర్పముతో నున్న మన్మథుని మూడవ కంటితో చూచెనుమరుక్షణమున మన్మథుని జ్వాలమాల ఆవరించెను. దానిని చూచుచుండిన దేవతలందరు పెద్దగా 'హా హా' అని అరవదొడగిరి.(73)

దేవా ఊచు:

దేవదేవ మహాదేవ దేవానాం వరదో భవ | గిరిజాయా : సహాయార్థం ప్రేషితో మదనోzధునా||74

వృథా త్వయాథ దగ్ధోzసౌ మదనో హి మహాప్రభ: 75

త్వయా హి కార్యం జగదేకబంధో కార్యం సురాణాం పరమేణ వర్చసా| తస్యాం సముత్పత్స్యసి దేవ శంభో తేనైవ సర్వం భవతీహ కార్యమ్‌ ||76

తారకేణ మహాదేవ దేవా: సంపీడితా భృశమ్‌ | తదర్థంజీవితం చాస్య దత్త్వా చ గిరిజాం ప్రభో||77

వరయస్వ మహాభాగ దేవకార్యే భవ క్షమ: గజాసురాత్త్వయా త్రాతా వయం సర్వే దివౌకస:||78

కాలకూటాచ్చ నూనం హి రక్షితా: స్మో న చాన్యథా | భస్మాసురాచ్చ సర్వేశ త్వయాత్రాతా న సంశయ:||79

మదనోzయం సమాయాత: సురాణాం కార్యసిద్దయే తస్మాత్త్వయా రక్షణాయ ఉపకార: పరో హి న:||80

వినా తేన జగత్సర్వం నాశ##మేష్యతి శంకర | నిష్కామస్త్యం కథం శంభో స్వబుద్దా చ విమృశ్యతామ్‌||81

తదోవాచ రుషావిష్టో దేవాన్‌ ప్రతి మహేశ్వర:| వినా కామేన భో దేవా భవితవ్యం న చాన్యథా||82

యదా కామం పురస్కృత్య సర్వే దేవా: సవాసవాః పదభ్రష్టాశ్చ దు:ఖేన వ్యాప్తా దైన్యం సమాశ్రితా:||83

దేవతలు పలికి దేవదేవా! మహాదేవా! దేవతలకు వరములనిచ్చువాడవు గమ్ము పార్వతికి సహాయముచేయుటకై మదనుడు పంపబడెను.(74) గొప్ప కాంతి గల మదనుడు నీ చేత వృథా గా దహింపబడినాడు(75) జగదేకబంధువగు శంకరా! దేవతల పనిని నీవే నెరవేర్చవలెను పార్వతి యందు గొప్ప తేజస్సుతో నీవు పుట్టగలవు. దానిచేతనే పని పూర్తికాగలదు.(76)మహాదేవా! తారకుని చేత దేవతలు మిగుల పీడింపబడినారు కనుక వారికై మదనునికి జీవితమునిచ్చి ,గిరిజను వరించుము.(77) దేవా! దేవతల పరియందు సమర్థుడవు గమ్ము. గజాసురుని నుండి నీవే దేవతలమగు మమ్ములనందరినీ రక్షించితివి.(78)కాలకూలమునుండి కూడా నీవే మమ్ములను రక్షించితివి వేరొక విధముగా కాదు. భస్మాసురుని నుండి కూడా నీవే మమ్మురక్షించితివి.(79) దేవతల పని నెరవేరుటకై వచ్చినాడు ఈ మదనుడు కనుక నీవితనిని రక్షించవలెను అది మాకు గొప్ప ఉపకారము కాగలదు (80) శంకరా! అతను లేకపోయినచో జగత్తు నాశనమెందును నీవూ కామము లేనివాడవెట్లో నీ బుద్దిచేత ఆలోచింపుము(81) అనగా విని మహేశ్వరుడు కోపగించి దేవతలారా! కామము లేకనే వుండువలెను. వేరొక విధముగా కాదు(82) ఇంద్రాది దేవతలంతా కామమును ముందుంచుకొని కదా పరభ్రష్టులైనారు. దు:ఖాన్ని పొంది దైన్యాన్ని ఆశ్రయించినారు (83)

కామో హి నరకాయైవ సర్వేషాం ప్రాణినాం ధృవమ్‌| దు:ఖరూపీ హ్యనంగోzయం జానీధ్వం మమ భాషితమ్‌||84

తారకోzపి దురాచారో నిష్కామోzద్య భవిష్యతి |వినా కామేన చకథం పాపమాచరతే నర:||85

తస్మాత్కామో మయా దగ్గ: సర్వేషాం శాంతిహేతవే| యుష్మాభిశ్చ సురై: సర్వైరసురైశ్చ మహర్షిభి:||86

అన్యై: ప్రాణిభిరేవాత్ర తపసే ధీయతాం మన: కామక్రోధవిహీనం చ జగత్సర్వం మయా కృతమ్‌||87

తస్మాదేనం పాపినం దు:ఖమూలం న జీవయిష్యామి న జీవయిష్యామి సురా: ప్రతీక్ష్యతామ్‌ | నిరంతరం చాత్మసుఖప్రభోధమానందలక్షణమగాధమనన్యరూపమ్‌||88

ఏవముక్తాదా తేన శంభునా పరమేష్ఠినా | ఊచుర్మహర్షయుస్సర్వే శంకర లోకశంకరమ్‌||89

యదుక్తం భవతా శంభో పరేం శ్రేయస్కరం హిన : కిం తు వక్ష్యామ దేవేశ శ్రూయతాం చావధార్యతామ్‌ ||90

యధా సృష్టమిదం విశ్వం కామక్రోధసమన్వితమ్‌ | తత్సర్వం కామరూపం హి సకామో న తు హన్యతే ||91

ధర్మార్థకామమోహాశ్చ చత్వారో హ్యేకరూపతామ్‌ | నీతా యేన మహాదేవ స కామోzయం న హన్యతే ||92

కథం త్వయా హి సందగ్థ: కామో హి దురతిక్రమ: | యేన సంఘటితం విశ్వమాబ్రహ్మస్ఠావరాత్మకమ్‌|| 93

ప్రాణులన్నింటికి కామము నరకమునే కలిగించును. ఈ మన్మథుడు దు:ఖమే తన రూపముగా గలవాడు నామాటను తెలుసుకొనుడు (84) దురాచారుడైన తారకుడు కూడా ఈనాడు కామము లేని వాడగును కామము లేనిచో నరుడు పాపమోట్లాచరించును? (85) కనుకనే అందరి శాంతికొరకు నేనీ మదనుని దహించితిని దేవతలు , అసురులు,మహర్షులు మీరంతా ఇతర ప్రాణులతో కలిసి ఇక్కడ తపస్సు చేయుటకు చింతించండి నేనీ జగత్తునంతా కామక్రోధములు లేనిదానిగా చేసితిని.(86,87) కనుక దు:ఖమునకు మూలమైన పాపియగు ఈ మదనుని నేను బ్రతికించబోను దేవతలారా! చూడండి.నిరంతరము ఆత్మ సుఖమును, జ్ఞానమును, ఆనందమును, అగాధమూ , అనన్యమూ, అగు దీనిని గమనించుడు.(88) అని పరమేష్టియనగా విని ఆనందము నొందిన దేవతలు శంకరునితో ఇట్లనిరి.(89) పరమశివా! నీవన్నది నిస్సంశయముగా మాకు గొప్ప శ్రేయస్సును కలిగించునది. కానీ మేము చెప్పబోవునది వినుము శ్రద్దగా గ్రహింపుము (90) కామక్రోధములతోకూడినదిగాత విశ్వము సృష్టింపబడినది ఇదంతా కామమే అట్టి కామము వధింపబడలేదు (91) మహాదేవా!ధర్మార్థకామమోక్షముల నన్నింటినీ ఒకే రూపముగల వానినిగా చేసిన కామము వధింపబడలేదు.(92) బ్రహ్మ మొదలు స్థావరము వరకున్న విశ్వమునంతా కలిపిన దురతిక్రముడగు మదనుడు నీచేత ఎట్లు దహింపబడెను?(93)

కామేన హీయతే విశ్వం విశ్వం కామేన పాల్యతే| కామేనోత్పద్యతే విశ్వం తస్మాత్కామో మహాబల:||94

యస్మాత్ర్కోధో భవత్యుగ్రో యేన త్వం చ వశీకృత:| తస్మాత్కామం మహాదేవ సంబోధయితుమర్హసి||95

త్వయా సంపాదితో దేవ మదనో హి మహాబల:| సమర్థో హి సమర్థత్వాత్‌ సామర్థ్యం కరిష్యతి||96

ఋషిభిశ్చైవ ముక్తోzపి ద్విగుణం రూపమాసిత:|చక్షుషా హి తృతేయేన దగ్గుకామో హరస్తదా||97

మునిభిశ్చారణౖ: సిద్దైర్గణౖశ్చాపి సదాశివ :| స్తుతశ్చ వందితో రుద్ర : పినాకీ వృషవాహన:|98

మదనం చ తథా దగ్ద్వా త్యక్త్వా తం పర్వతం రుషా| హిమవంతాభిదం సద్యస్తిరోధానగతోzభవత్‌||99

తిరోధానగతం దేవీ వీక్ష్య దగ్దం చ మన్మథమ్‌| సకోకిలం చ సభృంగం సహచంపకమ్‌||100

తథైవ దగ్దం మదనం విలోక్య రత్యా విలాపం చ తదా మనస్వినీ| సబాష్పదీర్ఘం విమనా విమృశ్య కథం సరుద్రో వశగో భ##వేన్మమ||101

ఏవం విమృశ్య సుచిరం గిరిజాతదానీం సమ్మోహమాప చ సతీ హి తథా బభాసే| సమ్ముహ్యమానా రుదతీం నిరీక్ష్య రతిర్మహారూపవతీం మనస్వినీమ్‌ || 102

మా విషాదం కురు సఖి మదనం జీవయామ్మహమ్‌ | త్వదర్థం భో విశాలాక్షి తపసాzరాధయామ్యహమ్‌||103

ఈ విశ్వము కామము చేతనే నశించును కామము చేత పాలింపబడును, కామము చేత ఉత్పన్నమగును. కనుక కాలము గొప్ప బలము కలది.(94) దానినుండే ఉగ్రమైన క్రోధము కలుగును. దానిచేతనే నీవూ వశీకృతుడవైతివి. అట్టికామమును నీవు బ్రతికించవలెను (95) దేవా: నీ చేతనే మదనుడు మహాబలునిగా, సమర్థునిగా చేయబడినాడు. సమర్థుడు కనుక సామర్ధ్యమును చూపును (96) అని ఋషులు పలికినప్పటికీ పరమశివుడు మిగుల కోపమును పొంది మూడవ కన్నుతో దహించునట్లుండెను.(97) మునులు, సిద్దులు, చారణులు, గణములు అన్నీ వృషభవాహనుడగు పరమశివుని స్తుతించినవి.(98)పరమశివుడు మదనుని ఆ విధంగా దహించి ఆ హిమవత్పర్వతమును వీడి కోపముతో అంతర్దానమునొందెను.(99) శివుడావిధముగా తిరోధానము నొందుటను, మన్మథుడు కోకిలతో , భృంగ, చంపకములతో దహింపబడుటను పార్వతి చూచినది (100) మదనుడు దహింపబడుటచేత విలపించుచున్న రతిని చూచి పార్వతి కన్నీళ్ళతో శివుడు తన వశమునకెట్లు వచ్చునోనని చాలాసేపు ఆలోచించినది. (101) ఇట్లు చాలా సేపు ఆలోచించి సమ్మోహము నొందిన పార్వతితో దు:ఖించుచున్నరతీదేవి ఇట్లనెను ఓ సఖీ ! దు:ఖింపవలదు, మన్మథుని నేను జీవింపజేయుదును . ఓ విశాలక్షీ! నీ కొరకై నేను పరమశివుని తపస్సుతో ఆరాధించెదను.(103)

హరం రుద్రం విరూపాక్షం దేవదేవం జగద్గురుమ్‌| మా చింతాం కురు సుశ్రోణి మదనం జీవయామ్యహమ్‌||104

ఏవమాశ్వాస్య తాం సాధ్వీ గిరిజాం రతిరంజసా | తపస్తేపే చ సుమహత్పతిం ప్రాప్తుం సుమధ్యమా||105

మదనో యత్ర దగ్గశ్చ రుద్రేణ పరమాత్మనా | తప్యమానాం తపస్తత్ర నారదో దదృశే తదా||106

ఉవాచ గత్వా సహసా భామినీం రతిమంతికే కస్యాసి త్వం విశాలాక్షి కేన వా తప్యతే తప:|| 107

తరుణీ రూపసంపన్నా సౌభాగ్యేణ పరేణ హి | నారదస్య వచ: శ్రుత్వా రోషేణ మహతా తదా| ఉవాచ వాక్యం మధురం కించిన్నిష్టురమేవ చ || 108

హరుని, రుద్రుని, విరూపాక్షుని , దేవదేవుని, జగద్గురువును తపస్సుతో సంతోష పరిచెదను. చింతించవలదు. నేను మదనుని జీవింపజేసెదను.(104) ఈ విధంగా ఓదార్చి రతీదేవి వెంటనే తన పతిని పోందుటకు గోప్ప తపస్సు నాచరించెను.(105) శివుని చేత మదనుడు దహింపబడినచో తపస్సు చేయుచున్న రతిని నారదుడు చూచెను.(106) వెంటనే ఆమె వద్దకు వెళ్ళి ఓ సుందరీ! నీవెవరువు? దేనికై ఈతపమునాచరించు చుంటివి? అనెను (107) రూపవతియగు ఆ స్త్రీ నారదుని మటలను విని కొంత రోషముతో మదురమైననూ కొంత నిష్టురమైననూ కొంత నిష్టురముగా నున్న విధముగా పలికెను.(108)

రతిరువాచ-

నారదోzసి మయా జ్ఞాత: కుమారస్త్వం న సంశయ:| స్వస్వరూపాదర్శనం చ కర్తుమర్హసి సువ్రత||109

యథాగతేన మార్గేణ గచ్ఛ త్వం మా విలంబితమ్‌ | బటో న కించిజ్ఞానాసి కేవలం కలికృన్మహాన్‌||110

పరస్త్రీ కాముకా: క్షుద్రా విటా వ్యసనినశ్చ యే | తథా హ్యకర్మిణ: స్తబ్దాస్తేషాం మధ్యే త్వమగ్రణీ:||112

శశంస దైత్యరాజాయ దగ్దం మదనమేవ చ| రుద్రేణ క్రోధయుక్తేన తస్య భార్యా మనస్వినీ||113

తామానయ మహాభాగ భార్యాం కురు మహాబల | అతీన రూపసంపన్నా యా అనీస్త్యయాzనఘ|| తాసాం మధ్యే రూపవతీ రతి: సా మదనప్రియా||114

ఏకమాకర్ణ్య వచనం దేవర్షేర్భావితాత్మన: జగామ సహసా తత్ర యత్రాస్తే సా సుశోభనా||115

రతిపలికెను నీవు నారదుడవని నాకు తెలియును నీ రూపమును నాకు చూపింపుము (109) ఆలస్యము చేయకుండా వచ్చిన మార్గముననే వెళ్ళుము. ఓ వటువా! నీకేమి తెలియదా! నీవు దౌష్ట్యము నాచరించువాడవు.(110) పరస్త్రీని కోరువారు. క్షుద్రులు , విటులు, వ్యసనపరులు అట్లే అకర్మకులు, స్తబ్దులు అగువారితో నీవు మొదటివాడవు (111) అని ఈ విధముగా రతీదేవి పరుషముగా మాట్లాడగానారదుడు వెంటనే స్వయముగా శంబరుడను దైత్యశ్రేష్టుని వద్దకు వెళ్ళెను (112) మదనుడు దహనమైనట్లుగా ఆ రాజుకు తెలియజేసెను. కోపగించిన రుద్రుడు మదనుని దహింపజేసేను అతని భార్య అభిమానవతి.(113) నీవామెను తెచ్చి భార్యగా చేసుకొనుము . ఓ రాక్షసశ్రేష్టా ! నీవింతకు ముందు తెచ్చిన అతీవరూపవతులందరిలో రూపవతి ఈ మదనుని భార్య రతీదేవి (114) అని దేవర్షి చెప్పగా విని ఆ రాక్షసుడు వెంటనే రతీదేవియున్న చోటికి వెళ్ళెను.(115)

తాం దృష్ట్యా సువిశాలాక్షీం రతిం మదనమోహినీమ్‌| ఉవాచ ప్రవాసన్వాక్యం శంబరో దేవసంకట:|| 116

ఏహి తన్వి మయా సార్దం రాజ్యభోగాన్యథేష్టత: | భుంక్ష్య దేవి ప్రసాదాన్మే తపసా కిం ప్రయోజనమ్‌||117

ఏవముక్తా తదా తేన శంబరేణ మహాత్మనా | ఉవాచ తన్వీ మదురం మహిషీ మదనస్య సా|| 118

విధవాహం మహాబాహో నైవం భాషితుమర్హసి| రాజా త్వం సర్వదైత్యానాం లక్షణౖ పరివారిత:|| 119

ఏతత్తద్వచనం శ్రుత్వా శంబర కామమోహిత:| కరే గృహీతుకామోzసౌ తదా రత్యా నివారిత:||120

విమృశ్య మనసా సర్వమజేయత్వం చ తస్య వై | మాస్ప్సశ త్వం చ రే మూఢ మమ సంస్పర్శజేన వై||121

సంపర్కేణ చదగ్దోzసి నాన్యథా మమ భాషితమ్‌ | తదోవాచ మహాతేజా: శంబరు: ప్రహసన్నివ|| 122

దేవతలకు కష్టములనిచ్చు శంబరుడు మదనుని భార్యయగు రతీదేవిని చూచి నవ్వుచూ ఇట్లనెను.(116) ఓ సుందరీ!నాతో కలిసి రాజ్యమునుకు రమ్ము! నా ప్రసాదముతో రాజ్యమును,భోగములను యథేష్టముగా అనుభవింపుము. తపస్సు చేసిప్రయోజనమేమి? (117) అని శంబరుడనగా మదనుని భార్యయగు రతీదేవి ఇట్టనెను. (118) ఓ మహాబాహూ! నేను భర్తలేని దానను నాతో నీవీవిధముగా పలుకరాదు నీవు దైత్యులందరికీ రాజువు. అన్ని లక్షణములు గలవాడవు (119) అనగా విని కామమోహితుడైన శంబరుడు రతీదేవి చేతిని పట్టుకొనబోగా రతి అతనిని వారించెను (120) అతని అజేయత్వాన్ని మనసులోనేతలచి రతీదేవి మూర్ఖుడా! నన్ను తాకవద్దు .నా స్పర్శతో నీవు దహింపబడెదవు ఇతి తథ్యము. అనగా మహాతేజస్వియగు శంబరుడు నవ్వుచూ ఇట్లనెను.(121,122)

విభీషికాభిర్బహ్వీభిర్మాం భీషయసి మానిని | గచ్చ శీఘ్రం మమ గృహం బహూక్త్యా కిం ప్రయోజనమ్‌||123

ఇత్యచ్యమానేన తదా నీతా సా ప్రసభం తథా | స్వపురం పరమం తన్వీ శంబరేణ మనస్వినీ|| 124

కృతా మహానసేzధ్యక్ష్యా నామ్నా మాయావతీతి చ|| 125

మానినీ! ఈ బెదిరింపులతో నన్ను భయపెట్టుచుంటివా? త్వరగా నా ఇంటికి రమ్ము. ఎక్కువ భాషించి ఏమి ప్రయోజనము? (123) అని శంకరుడుమనస్వినియగు రతిని బలవంతముగా తన పురమునకు కొనిపోయెను (124) తనపురమున రతీదేవిని శబరుడు మాయావతియను పేరుతో వంటింటికి (పాకగృహానికి) అధ్యక్షురాలిని చేసెను.(125)

ఋషయ ఉచు:-

పార్వత్యాథ కృతం సర్వం మదనానయనం ప్రతి శంబరేణ హృతా తన్వీ మదనస్య ప్రియా సతీ | అత ఊర్ధ్వం తదా సూత కిం జాతం తత్ర వర్ణ్యతామ్‌ || 126

ఋషులు పలికిరి మదనుని జీవింపజేయుటకు పార్వతి అంతా చేసినది మదనుని భార్యను శంబరుడు అపహరించెను . ఓ సూతా అటుపైన ఏమి జరిగెనో వర్ణింపుము (126)

సూత ఉవాచ-

గతం తదాశివం దృష్ట్యా దగ్ద్యా మదనమోజసా పార్వతీ తపసా యుక్తా స్థితా తత్రైవ భామినీ || 127

పిత్రా తేన తదా తన్వీ మాత్రా చైవ విచారితా| బాలే ఏహి గృహే శీఘ్రం మా శ్రమం కర్తుమర్హసి|| 128

ఉక్తా తాభ్యాం తదా సాధ్వీ గిరిజా వాక్యమబ్రవీత్‌ ||129

పార్వత్యువాచ-

నాగచ్చామి గృహం మాతస్తాత మే శ్రుణు తత్త్వత: | వాక్యం ధర్మార్థయుక్తం చ యేన త్వం తోషమేష్యసి|| 130

శంభు పరేషాం పరమో దగ్దో యేన మహాబల:| మదనో మమ సాన్నిధ్యమానయేzత్రైవ తం శివమ్‌||131

సూతుడనెను తన తేజస్సుతో మదనుని దహించి శివుడు వెళ్ళిపోవుట చూచి పార్వతి తపస్సుచేయుచూ అక్కడనే వుండినది (127) ఆమె తల్లిదండ్రులు పార్వతిని గూర్చి విచారించిరి. బాలా ! త్వరగా ఇంటికి రమ్ము నీవు శ్రమపడవలదు.(128) అని వారిద్దరూ అనగా సాధ్వియగు పార్వతి ఇట్లనెను (129)పార్వతి పలికెను అమ్మా! నేను ఇంటికి రాను నాన్నా! నా మాటలను యథార్థముగా వినుడు . ఈ ధర్మార్థములతో కూడిన వాక్యముతో నీవు సంతోషము నొందెదవు (130) మహాబలుడగు మదనుని దహించిన పరాత్పరుడగు శివుని ఇక్కడికే నేను తెచ్చెదను.(131)దుర్లభో హితదా శంభుః ప్రాణినాం గృహమిచ్చతామ్‌| నాగఛ్చామి గృహం మాతస్తస్మాత్‌ సర్వం విమృశ్యతామ్‌|| 132

తదోవాచ మహాతేజా హిమవాన్‌ స్వసుతాం ప్రతి | దురారాధ్య: శివ:సాక్షాత్‌ సర్వదేవనస్కృత:||133

సా బాష్పపూరితేనైన కంఠేన స్వసుతాం ప్రతి | ఉవాచ మేనా తన్యంగి యాహి శీఘ్రం గృహం ప్రతి||134

తదా ప్రహస్య చోవాచ మాతరం ప్రతి పార్వతీ | ప్రతిజాం శ్రుణు మే మాతస్తపసా పరమేణ హి ||135

అత్రైవ తం సమానీయ వారయామి విచక్షణమ్‌| నాశయామి చ రుద్రస్య రుద్రత్వం వరివర్ణిని||136

సుఖరూపం పరిత్యజ్య గిరిజా చ మనస్వినీ | శంభోరారాధనం చక్రే పరమేణ సమాధినా||137

జయా చ విజయా చైవ మాధవీ చసులోచనా| సుశ్రుతా చ శ్రుతా చైవ తథైవ చ శుకీ పరా ||138

ప్రవ్లూెచా సుభగా శ్యామా చిత్రాంగీ చారుణీ స్వథా | ఏతాశ్చాన్యాశ్చ బహన: సఖ్యస్తా గిరిజాం ప్రతి | ఉపాసాం చక్రిరే సా చ దేవగర్భా చ భామినీ || 139

తపసా పరమోగ్రేణ చరంతీ చారుహాసినీ | మదనో యత్ర దగ్దశ్చ రుద్రేణ చ మహాత్మనా తత్రైవ వేదిం కృత్వా చ తస్యో పరి సుసంస్థితా || 140

ఇంటిని కోరుకొను ప్రాణులకు దుర్లభుడు శివుడు కనుక అమ్మా: నేను ఇంటికి రాను. అంతా నీవాలోచింపుము.(132) అనగా గొప్ప తేజస్సు గల హిమవంతుడు కూతురితో శివుడు ఆరాధింపశక్యము గాని వాడు దేవతలందరిచేత నమస్కరింపబడినవాడు, నీవాతని పొందజాలవు కనుక ఇంటికి రమ్ము.(133) అనెను మేన కన్నీళ్ళతో గద్గద స్వరముతో ఇట్లనెను అమ్మా! త్వరగా ఇంటికి రమ్ము (134) అపుడు నవ్వి పార్వతి, మేనతో ఇట్లనెను. అమ్మా! నా ప్రతిజ్ఞను వినుము గొప్ప తపస్సును నేనాచరించెదను (135) దానితో శివుని ఈ చోటికి తెచ్చి నన్ను వరించెటట్లు చేసేదను. రుద్రుని రుద్రత్వమును నశింపజేసెదను (136) సుఖమగు రూపమును వదలి పార్వతి పరమసమాధిలో ఉంటూ శివుని ఆరాధింపసాగెను.(137) జయ,విజయ,మాధవి,సులోచన, సుశ్రత, శ్రుత, శుకి (138) ప్రవ్లూెచ,సుభగ, శ్యమ, చిత్రాంగి, అరుణి, స్వథా, దేవగర్భ మరియు ఇతర సుఖులుచాలామంది పార్వతి చెంత వుండిరి. (139) మదనుడు శివుని చేత దహింపబడి చోటనే వేదికను ఏర్పాటు చేసుకొని, దానిపైనిలిచిన పార్వతి ఉగ్రతపమును ఆచరింపసాగెను.(140)

త్యక్త్వా జలాశనం బాలా పర్ణాదా హ్యభవచ్చు సా| తత: సాzర్ద్రాణి పర్ఱాని త్యక్త్యా శుష్కాణి చాదదే|| 141

శుష్కాణి ,చైవ పర్ణాని నాశితాని తయా యదా| అపర్ణేతి చ విఖ్యాతా బభూవ తనుమధ్యమా||142

వాయుపానరతా జాతా అంబుపానాదనంతరమ్‌ కాలక్రమేణ మహతా బభూవ గిరిజా సతీ|| ఏకాంగుష్ఠేవ తదా దధార చ నిజం వపు:||143

ఏవముగ్రేణ తపసా శంకరారాధనం సతీ | చకార పరయా తుష్ట్యా శంభో : ప్రీత్యర్థమేవ చ || 144

పరం భావం సమాశ్రిత్య జగన్మంగళమంగళా | తుష్ట్యర్థం చ మహేశస్య తతాప పరమం తప:||145

ఏవం దివ్యసహస్రాణి వర్షాణి చ తతాప వై| హిమాలయస్తదాగత్య పార్వతీం కృతనిశ్చయామ్‌||146

సభార్య: ససుతామాస్త ఉవాచ చమహాసతీమ్‌ | మా ఖిద్యతాం మహాదేవి తపసానేన భామిని ||147

క్వ రుద్రో దృశ్యతే బాలే విరక్తో నాత్ర సంశయ:| త్వం తన్వీ తరుణీ బాలా తపసా చ విమోహితా||148

భవిష్యతి న సందేహ: సత్యం ప్రతివదామి తే|| తస్మాదుత్తిష్ఠ యాహ్యాశు స్వగృహం వరవర్ణిని|| 149

కిం తేన తవ రుద్రేణ యేన దగ్ద: పురాzనఘే | మదనో నిర్వికారత్త్వాత్తం కథం ప్రార్థయిష్యసి||150

నీటిని త్రాగుట విడిచి పార్వతి ఆకులను తినుట మొదలిడెను. పచ్చి ఆకులను తినుట వదిలివేసి ఎండుటాకులను భుజింపసాగెను.(141)పార్వతి ఎప్పుడైతే ఎండుటాకులనుకూడా తినుట ఆపివేసినదో అప్పుడు అపర్ణ అను ప్రసిద్దమైన పేరును పొందినది (142) తరువాత కేవలముగాలిని భుజింపసాగినది. ఇట్లు కాలక్రమేణ తపము చేయుచున్న పార్వతి తన శరీరము యొక్క భారమును ఒంటి వేల పై నిలిచి మోయసాగెను.(143)ఇట్లు పార్వతి ఉగ్రమైన తపస్సుతో శంకరుని ఆరాధనమును పరమ ప్రీతితో చేసెను (144) శివుని ప్రీతి కై జగన్మంగళ మంగళయగు పార్వతి పరమభావముతో గొప్ప తపము నాచరించెను. (145) ఇట్లు వేలకొలది దివ్య సంవత్సరములు పార్వతి తపము చేసెను అపుడు హిమవంతుడు కృత నిశ్చయయగు పార్వతి వద్దకు వచ్చెను.(146) ఆప్తుని వలె హిమవంతుడు భార్యతో వచ్చి, పార్వతితో ఇట్లనెను మహాదేవి! నీవు ఈ తపస్సుతో కష్టపడరాదు (147) విరక్తుడు శివుడెట్లు కనబడును? నీవుతరుణిని, బాలవు తపస్సు చేత మోహము నొందినదానవు (148) సందేహము లేదు. నీకు నిజమును చెప్పుచున్నాను కనుక త్వరగా లేచి ఇంటికి వెళ్ళుము(149) మదనుని పూర్వము దహించిన రుద్రనితో నీకేమి? నిర్వికారుడగు శివుని నీవెట్లు ప్రార్దించగలవు ?(150)

గగనస్ధో యథా చంద్రో గ్రహీతుం న హి శక్యతే తథైవ దుర్గము శంభూర్జానీహి త్వం శుచిస్మితే|| 151

తథైవ మేనయా చోక్తా తథా సహ్యాద్రిణా సతీ మేరుణా మందరేణౖవ మైనాకేన తథైవ చ ||152

ఏభిరుక్తా తదా తన్వీ పార్వతీ తపసి స్థితా ఉవాచ ప్రవాసన్త్యేన హిమవంతం శుచిస్మితా||153

పురా ప్రోక్తం త్వయా తాత అంబ కిం విస్మృతం త్వయా అధునైవ ప్రతిజ్ఞాం చ శ్రుణుధ్వం మమ బాంధవా:||154

విరక్తోzసౌ మహాదేవో మదనో యేన వై హత: తం తోషయామి తపసా శంకరం లోకశంకరమ్‌||155

సర్వే యూయం చ గ్చంతు నాత్ర కార్యా విచారణా| దగ్దో హి మదనో యేన యేన దగ్దం గిరేర్వనమ్‌||156

తమానయామి చాత్రైవ తపసా కేవలేన హి| తపోబలేన మహతా సుసేవ్యో హి సదాశివ:||157

తం జానీధ్వం మహాభాగా : సత్యం సత్యం వదామ్యహమ్‌ ||158

సంభాషమాణా జననీం హిమాలయం చైవ తథా చమేనామ్‌ |

తథైవ మేరుం మితభాషిణీ తదా సా మందరం పర్వతరాజకన్యా |

జగ్ముస్తదా తేన పథా చ పార్వతీ యథాగతేనాపి విచక్షమాణా:|| 159

గతేషు తేషు సర్వేషు సఖీభి: పరివారితా | తత్రైవ చ తపస్తేపే పరమార్దా సతీ తదా||160

ఆకసముననున్న చంద్రుని గ్రహించుట ఎట్లు సాధ్యము కాదో శివుని పొందుట కూడా అట్లే సాధ్యముకాదు తెలుసుకొనుము.(151)అని హిమవంతుని వలెనే మేన, సహ్యాద్రి , మేరు, మందర, మైనక పర్వతములు పలికినవి (152) వారట్లు పలుకగా తపము నాచరించుచున్న పార్వతి నవ్వుచూ హిమవంతునితో ననెను (153) నాన్నా! అమ్మా! మునుపు నేనన్నది మీరు మరిచితిరా? బంధువులారా! ఇపుడే నా ప్రతిజ్ఞను వినుడు (154) మదనుని సంహరించినవాడు, విరక్తుడూ అగు లోకశంకరుడైన శివుని నేను తపస్సుచే సంతోషపరిచెదను (155) మీరంతా వెళ్ళండి ఈ విషయమున విచారించ పనిలేదు కేవల తపస్సు తో నేను మదనుని, పర్వతవనాన్ని దహించిన శివుని ఇక్కడికి కొని తెచ్చెదను సదాశివుడు గొప్ప తపస్సుతో సేవింపబడదగినవాడు (156) ,157) మహానుభావులారా! అతనే సత్యమని తెలుసుకొనుడు నేను నిజమునే చెప్పుచుంటిని (158) ఇట్లు పార్వతి తల్లితో తండ్రితో,మేరువుతో ,మందరముతో పలికి,మితభాషిణియై వుండినది అపుడు వారంతా ఆలోచించి వచ్చిన మార్గముననే వెళ్ళిపోయిరి,(159)

వారంతా వెళ్ళిపోగా, పార్వతి తన సఖులుతో కూడినదై అక్కడే తపస్సునాచరించసాగినది.(160)

తపసా తేన మహతా తప్తమాసీచ్చరాచరమ్‌| తదా సురాసురాస్సర్వే బ్రహ్మాణం శరణం గతా:||161

దేవా ఊచు:

త్వయా సృష్టమిదం సర్వం జగద్దేవ చరాచరమ్‌ | త్రాతుమర్హసి దేవాన్నస్త్యదన్యో నోపపద్యతే||162

అస్మాకం రక్షణ శక్త ఇత్యాకర్ణ్య వచస్తదా | విమృశ్య చ తదా బ్రహ్మా మనసా పరమేణ హి||163

గిరిజాతపసోద్భూతం దావాగ్నిం పరమం మహత్‌ | జ్ఞాత్వా బ్రహ్మా జగామాశు క్షీరాబ్దిం పరమాద్భుతమ్‌||164

తత్ర సుప్తం సుపర్యంకే శేషాఖ్యే చాతిశోభ##నే |లక్ష్మ్యా పాదోపయుగలం సేవ్య మానం నిరంతరమ్‌||165

దూరస్థేనాపి తారక్షేనతకంధరధారిణా | సేవ్యమానం శ్రియా కాంత్యా క్షాంత్యా వృత్యా దయాదిభి:||166

నవశక్తియుతం విష్ణుం పార్ఘదై: పరివారితమ్‌ | కుముదోzథ కుముద్వాంశ్చ సనకశ్చ సనందన:||167

సనాతనో మహాభాగ: ప్రసుప్తో విజయోzరిజిత్‌| జయంతశ్చ జయత్సేనో జయశ్పైవ మహాప్రభః||168

సనత్కుమార: సుతపో నారదశ్పైవ తుంబురు: పాంచజన్యో మహాశంభో గదా కౌమోదకీ తథా||169

సుదర్శనం తథా చాపం శార్జం చ పరమాద్బుతమ్‌ | ఏతాని వై రూపవంతి దృష్టాని పరమేష్టినా|| 170

ఆ గొప్ప తపస్సుతో చరాచరమంతా తపింపసాగెను అపుడు దేవదానవులంతా బ్రాహ్మను శరణుజొచ్చిరి(161) దేవతలనిరి దేవా ! చారాచరమగు ఈ జగత్తంతా నీచే సృజింపబడినది కనుక దేవతలమగు మమ్ము నీవు రక్షింపుము. నీవు తప్ప (162) మమ్ములను రక్షించు సమర్థులు వేరొకరు లేరని దేవతలనగా బ్రహ్మ దానిని గూర్చి విచారించెను (163) పార్వతి తపస్సు వలన కలిగిన గొప్ప దావాగ్నిని తెలుసుకొన్న బ్రహ్మ పాల సముద్రమును చేరెను(164) అక్కడ శేషమను సుందరమైన పర్యంకము పైన శయించిన వానిని,నిత్యము లక్ష్మీదేవి చేత పాదసేవ నొందుచున్న వానిని (165) మెడవంచి మ్రోయు గరుడునిచేత, శ్రీ చేత, కాంతి చేత, క్షాంతిచేత,దయ మొదలగు వానిచే సేవింపబడువానిని (166) నవశక్తులతో కూడిన వానిని పార్షదులతో కూడివున్న వానిని, విష్ణుమూర్తిని చూచెను కుముద, కుముద్వాన్‌, సనక, సనందన, సనాతన, ప్రసుప్త, విజయ, అరిజిత్‌, జయంత,జయుత్సేన. జయుడు(167,168) సుదర్శనము, శార్‌గ్జమను అద్భుతమైన చాపము మొదలగువానిని బ్రహ్మ చూనెను (170)

విష్ణో, సమీపే పరమాత్మో భృశం సమేత్య సర్వే సురదానవాస్తదా| విష్ణుం చాహు: పరమేష్ఠినాం పతిం తేరే తదానీముదధేర్మహాత్మన:||171

త్రాహి త్రాహి మహావిష్ణో తప్తాన్న: శరణాగతాన్‌ | తపసోగ్రేణ మహతా పార్వత్యా: పరమేణ హి|| శేషాసనే చోపావిష్ట ఉవాచ పరమేశ్వర:||172

యుష్మాభి: సహితశ్చాపి వ్రజామి పరమేశ్వరమ్‌ | మహాదేవం ప్రార్థయామో గిరిజాం ప్రతి వై సురా :||173

పాణిగ్రహార్థమధునా దేవదేవ: పినాకధృక్‌ యథా నేష్యతి తత్రైవ కరిష్యామోధునా వయమ్‌||174

తస్మాద్వయం గమిష్యామో యత్ర రుద్రో మహాప్రభు: తపసోగ్రేణ సంయుక్తో హ్యాస్తే పరమంగళ:||175

విష్ణోస్తద్వచనం శ్రుత్వా ఊచుస్సర్వే సురాసురా:| న యాస్యామో వయం సర్వే విరూపాక్షం మహాప్రభమ్‌||176

యదా దగ్ద: పురా తేన మదనో దురతిక్రమ: | తథైవ ధక్ష్యత్యస్మాకం నాత్ర కార్యా విచారణా||177

ప్రవాస్య భగవాన్విష్ణురువాచ పరమేశ్వర: మా భయం క్రియతం సర్వై: శివరూపీ సదాశివ:178

స న ధక్ష్యతి సర్వేషాం దేవానాం భయనాశన: తస్మాద్భవద్భిర్గంతవ్యం మయా సార్థం విచక్షణా:||179

శంభుం పురాణం హ్యధీశం వరేణ్యరూపం చ పరం పరాణామ్‌| తపో జుషాణం పరమార్థరూపం పరాత్పరం తం శరణం ప్రజామి||180

ఇతి శ్రీ స్కాందే పురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే

పార్వతీతపశ్చర్యావర్ణనం నామ ఏకవింశతితమోzధ్యాయ:

దేవదానవులంతా పరమాత్మ యగు విష్ణువును సమీపించి, సముద్రతీరమున విష్ణువుతో ఇట్లనిరి.(171) ఓ మహావిష్ణూ! పార్వతి యొక్క గొప్పతపస్సు చేత తపించుచూ నిన్ను శరణుజొచ్చిన మమ్ము రక్షింపుము అనగా శేషాసనము పైనున్న విష్ణువిట్లనెను (172)మీ అందరితో కలిసి పరమేశ్వరుని వద్దకు వెళ్ళెదము.మహాదేవుని పార్వతిని గూర్చి ప్రార్థించెదము. అక్కడకు కొని వెళ్ళునట్లుమనము ఇపుడు చేసెదము (174) కనుక మనము ఉగ్రమగు తపస్సు చేయుచూ రుద్రుడున్న చోటికి వెళ్ళదము' (175)అనివిష్ణువుఅనగా దేవదానవులందరూ మేమందరమూ విరూపాక్షుడగు శివుని వద్దకు రాజాలము(176) దురతిక్రముడగు మదనునిమునువు దహించినట్లే శివుడు మనలను దహించును. ఈ విషయమున ఆలోచించవలసినది లేదు (177) అనగా విని విష్ణువు నవ్వి ఇట్లనెను మీరంతా భయపడవలదు సదాశివుడు మంగళ స్వరూపుడు (178)అతనందరినీ దహించడు దేవతలకు భయమునునశింపజేయువాడు కనుక మీరు నాతో కలిసి రండి.(179) మంగళుని, పురాణుని,శ్రేష్ఠస్వరూపుని పరాత్పరుని,పరమార్థరూపమున తపమునాచరించు పరమశివుని శరణు జొచ్చెను.(180)

ఇది శ్రీ స్కాందమహాపురాణము నందలి మొదటి మాహేశ్వరఖండములోని

కేదారఖండమున పార్వతితపస్సు నాచరించుటను వర్ణించుట అను ఇరువది ఒకటవ అధ్యాయము

ద్వానింశోzధ్యాయ:

సూత ఉవాచ-

ఏవముక్తాస్తదా దేవా విష్ణునా పరమేష్టినా | జగ్ము: సర్వే మహాశం చ ద్రష్టుకామా: పినాకినమ్‌||1

పరే పారే సముద్రస్య పరమేణ సమాధినా | యోగపీఠే స్థితం శంభుం గణౖశ్చ పరివారితమ్‌||2

యజ్ఞోపవీతవిధినా ఉరసా బిభ్రతం వృతమ్‌ | వాసుకిం సర్పరాజం చ కంబళాశ్వతరౌ తథా||3

కర్ణద్వయే ధారయంతం తథా కర్కోటకేన హి| పులహేన చ బాహూభ్యాం ధారయంతం చ కంకణ ||4

సన్నూపూరే శంఖకపద్మకాభ్యాం సంధారయంతం చ విరాజమానమ్‌ | కర్పూరగౌరం శితికంఠమద్భుతం వృషాన్వితం దేవవరం దదర్శు:||5

తదా బ్రహ్మా చ విష్ణుశ్చ ఋషయో దేవదానవా :| తుష్ఠువుర్వివిధై: సూక్తైవేదోపనిదన్వితై:||6

ఇరువది రెండవ అధ్యాయము

సూతుడు చెప్పెను ఇట్లు పరమేష్టియగు విష్ణువనగా దేవతలు అపుడు శివుని చూచుటకు వెళ్ళిరి.(1)వారు సముద్రముయొక్క ఆవలి తీరములో పరమాధిలో యోగ పీఠము పై కూర్చున్న వానిని, గణములతో కూడియున్న వానిని (2)వాసుకిని, కంబళాశ్వతరములను యజ్ఞోపవీతముగా కర్ఱాభరణాలుగా ధరించు చున్నవానిని (3) కర్కోట పులహులను కంకణములుగా ధరించుచున్నవానిని (4) శంఖక పద్మకులను నూపురములుగా ధరించి ప్రకాశించుచున్న వానిని కర్పూరము వలె తెల్లనైనవానిని, నీలకంఠుని, వృషభముతో నున్న వానిని దేవతా శ్రేష్టుడగు పరమశివుని చూచిరి (5) అపుడు బ్రహ్మ,విష్ణువు,ఋషులు, దేవదానవులు వేదోపనిషదన్వితమైన వివిధ సూక్తములతో స్తుతించిరి.(6)

బ్రహ్మోవాచ-

నమో రుద్రాయ దేవాయ మదనాంతకరాయ చ భర్గాయ భూరిభాగ్యాయ త్రినేత్రాయ తివిష్టపే||7

శిపివిష్టాయ భీమాయ శేషశాయిన్నమో నమ:త్ర్యంబకాయ జగద్దాత్రే విశ్వరూపాయ వై నమ:||8

త్వం ధాతా సర్వలోకానాం పితా మాతా త్వమీశ్వర : | కృపయా పరయా యుక్త: పాహ్యస్మాంస్త్వం మహేశ్వర ||9

ఇత్థం స్తువత్సు దేవేషు నందీ ప్రోవాచ తాన్‌ ప్రతి | కిమర్థమాగతా యూయం కిం వా మనసి వర్తతే||10

తే ప్రోచుర్ణేవ కార్యర్థం విజ్ఞప్తుం శంభుమాగతా : విజ్ఞప్తో నందినా తేన శైలాదేన మహాత్మనా|| ధ్యానస్థితో మహాదేవ: సురకార్యార్థసిద్దయే||11

బ్రహ్మాదయ: సురగణా: సురసిద్దసంఘాస్త్వాం ద్రష్టుమేవ సురవర్య విశేయంతి| కార్యార్థినో zసురవరై: పరిభర్త్స్యమానా అభ్యాగతా: సపది శత్రుభిరర్థితాశ్చ||12

తస్మాత్త్వయా హి దేవేశ త్రాతవ్యాశ్చాధునా సురా: ఏవం తేన తదా శంభుర్విజ్ఞప్తో నందినా ద్విజా:||13

శ##నైశ్శనైరుపరమచ్ఛంభు: పరమకోపన: సమాదే పరమాత్మాzసావువాచ పరమేశ్వర:||14

బ్రహ్మపలికెను -రుద్రునకు , దేవునకు, మదనాంతకునకు, భర్గునకు, భూరిభాగ్యునకు, త్రినేత్రునకు, తివిష్టవునకు (7) శిపివిష్టునకు, భీమునకు .శేషకాయికి నమస్కారము త్ర్యంబకునకు, జగద్దాతకు, విశ్వరూపునకు నమస్కారము (8) మహేశ్వరా! నీవు అన్ని లోకముతలను ధరించువాడవు తల్లి తండ్రి ఈశ్వరుడవు నీవే గొప్ప కృపతో మమ్ము రక్షించుము (9) అని దేవతలు స్తుతించగా, నంది వారితో ఇట్లనెను మీరే ప్రయోజనం కోసమిచ్చటికి వచ్చితిరి? మీ మనసులో ఏమున్నది? (10) అనగా దేవతలు దేవతల పనిని గూర్చి శివునిప్రార్థించుటకు వచ్చితిమని తెలిపిరి. అపుడు మహాత్ముడగు నంది వారి పనిని గూర్చి ధ్యానముననున్న శివునకు విన్నవించెను (11) దేవేశా! బ్రహ్మ మొదలైన దేవతాగణాలు సురసిద్ద సంఘాలు నిన్న చూచుటకు త్వరపడుచున్నవి. అసురులచేత పీడింపబడి, బెదరింపబడి ఈ దేవతలుపనిమీద నీ వద్దకు వచ్చిరి. (12) కనుక నీవు దేవతలను రక్షింపవలెను. అని నంది శివుని ప్రార్థించెను (13) పరమ కోపనుడైన శివుడు నెమ్మదిగా సమాధిస్థితి నుండి బయటకు వచ్చి ఇట్లనెను.(14)

మహాదేవ ఉవాచ-

కస్మాద్యూయం మహాభాగా హ్యాగతా మత్సమీపగా :| బ్రహ్మాదయో హ్యమీ దేవా బ్రూత కారణమద్య వై!

తదా బ్రహ్మా హ్యువాచేదం సురకార్యం మహత్తరమ్‌| తారకేణ కృతం శంభో దేవానం పరమాద్భుతమ్‌||16

కష్టాత్కష్టతరం దేవ తద్విజ్ఞప్తుమిహాగతా : హే శంభో తవ పుత్రేణ ఔరసేన హతో భ##వేత్‌! తారకో దేవశత్రుశ్చ నాన్యథా మమ భాషితమ్‌|| 17

తస్మాత్త్వయా గిరిజా దేవ శంభో గృహీతవ్యా పాణినా దక్షణన | పాణిగ్రహేణౖవ మమానుభావ దత్తా గిరీంద్రేణ చ తాం కురుష్వ ||18

బ్రహ్మణో హి వచ: శ్రుత్వా ప్రహసన్నబ్రవీచ్చివ: | యదా మయా కృతా దేవీ గిరిజా సర్వసుందరీ||19

తదా సర్వే సురేంద్రాశ్చ ఋషయో మునయస్తథా| సకామాశ్చ భవిష్యంతి అక్షమాశ్చ పరే పథి||20

మదనో హి మయా దగ్ధ: సర్వేషాం కార్యసిద్దయే| మయా హ్యధికృతా తన్వీ గిరిజా చ సుమధ్యమా||21

తదానీమేవ భో దేవా: పార్వతీ మదనం చ సా| జీవయిష్యతి భో బ్రహ్మన్నాత్ర కార్యా విచారణా||22

ఏవం విమృశ్య భో దేవా : కార్యావిచారణా | మదనేనైవ దగ్దేన సురకార్త్యం మహత్కృతమ్‌||23

మహాదేవుడనెను మహానుభావులారా!బ్రహ్మాదిదేవతలైన మీరునా వద్దకెందుకు వచ్చారో చెప్పండి.(15)అనగా అపుడు బ్రహ్మదేవతల ఈ మహత్తర కార్యమును గూర్చి చెప్పెను పరమశివా! తారకుడు దేవతలకు ఒక గొప్ప కష్టమును కలిగించగా దానిని నీకు విన్నవించుటకు నీ వద్దకు వచ్చాము (16) శంకరా! ఆ తారకుడు నీ ఔరసపుత్రుడి చేతిలో మరణించును. ఇది సత్యము.(17) కనుక ఓ దేవా! నీవు పార్వతి కుడిచేతిని వివాహమును గ్రహించవలెను. మహానుభావా! నీకు పాణిగ్రహణమున గిరీంద్రునిచే ఇవ్వబడునట్లుగా నీవు చేయుము (18) అని బ్రహ్మ అనగా విని నవ్వుచూ శివుడిట్లనెను సర్వాంగ సుందరియైన పార్వతిని నేను ఎపుడు పత్నిగా గ్రహించెదనో అపుడు సురేంద్రులు ఋషులు మునులు అందరూ కామము గలవారై మోక్షమార్గమున అసమర్థులగుదురు.(19) అందరి కార్యము సిద్దించుటకై నేను మదనుని దహించితిని. సుందరియగు పార్వతికి అధికారమునిచ్చుచుంటివి(21) దేవతలారా! అప్పుడే పార్వతి మదనుని జీవింపజేయగలదు బ్రహ్మా ఇందు విచారించవలసినది లేదు (22) దేవతలారా! ఈ విధంగా విచారించి కార్యవిచారణమును చేయవలెను. మదనుడు దహింపబడుటచేతనే దేవతల గొప్పవని నెరవేరినది.(23)యూయం సర్వే చ నిష్కామా మయా నాస్వత్ర సంశయ: | యథాహం చ సురా: సర్వే తథా యూయం ప్రయత్నత:||24

తప: పరమయుక్తాశ్చ కారయామ: సుదుష్కరమ్‌:! పరమానందసంయుక్తా :సుఖిన: సర్వ ఏవ హి|| 25

యాయం సమాధినా తేన మదనేన చ విస్మృత్‌| కామో హి నరకాయైవ తస్మాత్‌ క్రోధోzభిజాయతే|| 26

క్రోధాద్భవతి సంమోహ: సమ్మోహాద్‌ భ్రమతే మన: కామక్రోధౌ పరిత్యజ్య భవద్భి:సురసత్తమై: సర్వైరేవ చ మంతవ్యం మద్వాక్యం నాన్యథా క్వచిత్‌ ||27

ఏవం విశ్రాన్య భగవాన్‌ స హి దేవో వృషధ్వజ:| సురాన్ప్రబోధయామాస తథా ఋషిగణాన్మునీన్‌ ||28

తూష్ణీం భూతోzభవచ్ఛంభుర్ద్యానమాశ్రిత్య వై పున : | ఆస్తే పురా గణౖశ్చ పరివారిత:||29

ధ్యానస్థితం చ తం దృష్ట్యా నందీ సర్వాన్విసృజ్య తాన్‌ | సబ్రహ్మసేంద్రాన్‌ విబుధానువాచ ప్రవాసన్నివ||30

యథా గతేన మార్గేణ గచ్ఛధ్వం మా విలంబితమ్‌ | తథేతి మత్వా తే సర్వే స్వం స్వం స్థానమథావ్రజన్‌||31

నాచేత మీరంతా నిష్కాములుగా చేయబడినారు ఇందు సంశయములేదు నేనెట్లు వుంటినో మీరునూ ప్రయత్నముచే ఆ విధంగా కాగలరు (24) గొప్ప తపస్సుచేత మనమందరమూ పరమానందముతో సుఖమునొందెదము కష్టమైన తపస్సును చేయగలము. మీరు యోగము చేత సుఖము నొందుడు. మదనుడు విస్మరించెను.(25) కామము నరకము కొరకే. ఆ కామము నుండి క్రోధము పుట్టును (26) క్రోధము నుండి సమ్మోహము, సమ్మోహము నుండి మనో విభ్రమము కలుగును. దేవతాశ్రేష్టులైన మీరంతా కామక్రోధములను వదలి నా మాటను గూర్చి ఆలోచించండి వేరొక విధముగా కాదు (27) అని వృషభధ్వజుడైన మహాదేవుడు తెలిపి, సురగణములను, ఋషిగనములను ప్రభోధింపజేసెను.(28) అతనపుడు ధ్యానమానాశ్రయించి మిన్నకుండెను ముందు వున్నట్లుగానే గణములతో కూడి వుండెను. (29) ధ్యానములో నున్న పరమశివుని చూచి నంది బ్రహ్మ,ఇంద్రుడు మొదలగు దేవతనందరినీ పంపివేయుచు, నవ్వుచూ ఇట్లనెను.(30) అలస్యము చేయకుండా మీరు వచ్చిన మార్గముననే వెళ్ళిపొండి వారందరూ అట్లే తమ తమ స్థానములకు వెళ్ళిరి.(31)గతేషు తేషు సర్వేషు సమాధిస్థోzభవద్భవ:| ఆత్మానమాత్మనా కృత్వా ఆత్మన్యేవ విచింతయన్‌ || 32

పరాత్పరతరం స్వచ్ఛంనిర్మలం నిరవగ్రహమ్‌ | నిరంజనం నిరాభాసం యస్మిన్ముహ్యంతి సూరయ:||33

భానుర్నభాత్యగ్నిరథో శశీ వా న జ్యోతిరేవం న చ మారుతో న హి | యం కేవలం వస్తువిచారతోzపి సూక్ష్మాత్పరం సూక్ష్మతరాత్పరం చ||34

అనిర్దేశ్యయచింత్యం చ నిర్వికారం నిరామయమ్‌ | జ్ఞప్తిమాత్రస్వరూపం చ న్యాసినో యాంతి తత్ర వై|| 35

శబ్దాతీతం నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం జ్ఞానగమ్యం త్వ గమ్యమ్‌ | యత్తద్వస్తు సర్వదా కథ్యతే వై వేదాతీతైశ్చాగమైర్మంత్రభూతై:|| 36

తద్వస్తుభూత భగవాన్‌ స ఈశ్వర: సినాకపాణిర్భగవాన్‌ వృపభద్వజ:| యేనైన సాక్షాన్మకరధ్వజో హతస్తపో జుషాణ పరమేశ్వర:స: 37

వారందరూ వెళ్ళిపోగా పరమశివుడు సమాధిమగ్నుడాయెను ఆత్మయందాత్మని నిలిపి ఆత్మచేత సమాధిస్థితుడాయెను (32)పరాత్పరము, స్వచ్చము, నిర్మలము, నిరవగ్రహము,నిరంజనము, నిరాభాసము అగు తత్త్వముగా యుండెను ఎవరియందు పండితులు రక్తులగుదురో (33) దేనిని సూర్యచంద్రులు, అగ్ని, నక్షత్రాలు ప్రకాశింపజేయజాలవో , వాయువు వీచదో, ఏ వస్తువు ఆలోచనకంటేనూ సూక్ష్మమైన దానికంటెనూ అతి సూక్ష్మమైన దానికంటే అతి సూక్ష్మమైనదో (34) ఏది నిర్ధేశింప వీలులేనిదో ఆలోచింపవీలులేనిదో, వికారములు లేనిదో, నిరామయమైనదో, జ్ఞానమే స్వరూపముగా కలదో విరక్తులు దేనిని పొందెదరో (35)ఏది శబ్దాతీతము, నిర్గుణము, నిర్వికారము, సన్మాత్రము, జ్ఞానముచే పొందదగినది అయిననూ ఇతర విధముగా పొందవీలులేనిదిగా వేదాతీతములైన మంత్రభూతములైన ఆగమములతో చెప్పబడుచున్నదో (36) అట్టి సద్వస్తువుగా పినాకపాణి , వృసభధ్వజుడుగు పరమశివుడు సమాధి స్థితిలో నుండెను మదనుని సాక్షాత్తూ దహించిన పరమశివుడు తపమునాచరించుచుండెను.(37)

లోమశ ఉవాచ-

గిరిజా హితదా దేవీ తతాప పరమం తప:| తపసా తేన రుద్రోzపి ఉత్తమం భయమాగత:|| 38

విజిత్య తపసా దేవీ పార్వతీ పరమేణ హి| శంభుం సర్వార్థదం స్థాణుం కేవలం స్వస్వరూపిణమ్‌ || 39

యదా జితస్తయా దేవ్యా తపసా వృషభద్వజ:| సమాధేశ్చలితో భూత్వా యత్ర సా పార్వతీ స్థితా||40

జగామ త్వరితేనైన దేవదేవ: పినాకధృక్‌ | తత్రాపశ్యత్‌ స్థితాం దేవీం సఖీభి: పరివారితామ్‌||41

లోమశుడనెను పార్వతి అపుడు ఘోరమైన తపస్సునుచేయగా రుద్రుడు కూడా మిగుల భయపడెను (38) పార్వతి గొప్ప తపస్సు చేసి అన్నింటిని ఇచ్చువాడు , కేవలుడు, స్థాణువు, సత్స్వరూపమున నున్న వాడగు శివుని జయించెను.(39) అపుడు శివుడు ఆ తపస్సుచేత జయింపబడి సమాధిస్థితి నుండి చలించినవాడై (40) త్వరగా పార్వతి వున్న చోటికి వెళ్ళి సఖులతో నున్న పార్వతిని చూచెను.(41)

వేదికోపరి విన్యస్తాం యథైవ శశిన: కళామ్‌ | స దేవస్తాం నిరీక్ష్యాథ బటుర్భూత్వాథ తత్‌క్షణాత్‌ ||42

బ్రహ్మచారి స్వరూపేణ మహేశో భగవాన్‌ భవ: | సఖీనాం మధ్యమాశ్రిత్య హ్యువాచ బటురూపవాన్‌ || కిమర్థమాళిమధ్యస్థా తన్వీ సర్వాంగసుందరీ|| 43

కేయం కుతో యాతా కిమర్థం తప్యతే తప: సర్వం మే కృథ్యతాం సఖ్యో యాథాతథ్యేన సంప్రతి||44

తదోవాచ జయా రుద్రం తపస: కారణం పరమ్‌ ||45

హిమాద్రేర్దుహితేయం వై తపసా రుద్రమీశ్వరమ్‌| ప్రాప్తుకామా పతిత్వేన సేయమత్రోపవిశ్యచ ||46

తపస్తతాప సుమహత్‌ సర్వేషాం దురతిక్రమమ్‌ | వటో జానీహి మే వాక్యం నాన్యథా మమ భాషితమ్‌ ||47

తచ్ర్చుత్వా వచనం తస్యా: ప్రవాస్యేదమువాచ హ| శృణ్వతీనాం సఖీనాం వై మహేశో వటురూపవాన్‌||48

మూఢేయం పార్వతీ సఖ్యో న జానాతి హితాహితమ్‌| కిమర్థం చ తప: కార్యం రుద్రప్రాప్త్యర్థమేవ చ ||49

సోzమంగళ కపాలీ చ శ్మశానాలయ ఏవ చ||50

చంద్రకళవలె వేదిక పై నున్న ఆ సుందరిని చూచి పరమశివుడు వటురూపమును వెంటనే ధరించెను.(42) బ్రహ్మచారి స్వరూపములో మహేశుడు సఖుల మధ్యకు వెళ్ళి ఈ సుందరి ఎందులకిట్లు సఖులమధ్యనున్నది ? (41) ఈ సుందరి ఎవరు? ఎవరి కన్యా? ఎక్కడినుండి వచ్చినది? తపస్సునెందుకు చేయుచున్నది? సఖులారా! ఇదంతా నాకిపుడు వాస్తవముగా చెప్పండి.(44) అనగా అపుడు పార్వతి సఖి అగు జయ అను స్త్రీ పార్వతి తపస్సు చేయుటకు కారణము రుద్రుడని చెప్పినది.(45) ఈ పార్వతి హిమవంతుని పుత్రిక తపస్సు చేత రుద్రుని పతిగా పొందగోరిన పార్వతి ఇక్కడ కూర్చొని (46) ఇతరులు దాట వీలులేని ఘెరమైన తపస్సు నాచరించినది. ఓ వటూ! నా వాక్యమును తెలుసుకొనుము. ఇది సత్యము అని జయచెప్పెను.(47) అదివిని వటురూపముననున్న మహేశుడునవ్వి సఖులందరూ వినుచుండగా ఇట్లనెను (48) సఖులారా! ఈ పార్వతి మూఢురాలు హితమును అహితమును తెలుసుకొనలేకున్నది. రుద్రుని పొందుట కొరకు తపమునాచరించుట ఎందులకు ?(49) ఆ పరమశివుడు అ మంగళ##మైనవాడు ,కపాలమును ధరించువాడు ,శ్మశానమే నివాసముగా గలవాడు అందరూ ఆ మంగళుడైనఅతనిని అనవసరముగా శివుడని అందురు.(50)

అనయా హి వృతో రుద్రో యదా సఖ్య: సమేష్యతి | తదేయమశుభా తన్వీ భవిష్యతి నసంశయ:||51

యో దక్షశాపాద్వికృతో యజ్ఞబాహ్యోzభవద్విట:| యే హ్యంగభూతా: శర్వస్య సర్పా హ్యాసన్‌ మహావిషా:||52

శవభస్మాన్వితో రుద్ర: కృత్తివాసా హ్యమంగళ: | పిశాచై: ప్రమథైర్భూతైరావృతో హి నిరంతరమ్‌|| 53

తేన రుద్రేణ కిం కార్యమనయా సుకుమారయా| నివార్వతాం సఖీభిశ్చ మర్తుకామా పిశాచవత్‌ ||54

ఇంద్రం హిత్వా మనోజ్ఞం చ యమం చైవ మహాప్రభుమ్‌ | నైబుతం చ విశాలాక్షం వరుణం చ అపాం పతిమ్‌ ||55

కుబేరం పవనం చైవ తథైవ చ విభావసుమ్‌ | ఏవమాదీని వాక్యాని ఉవాచ పరమేశ్వర:||

సఖీనాం శృణ్వతీనాం చ యత్ర సా తపసి స్థితా || 56

ఇత్యాకర్ణ్య వచస్తస్య రుద్రస్య వటురూపిణ: చుకోప చ శివా సాధ్వీ మహేశం వటురూపిణమ్‌ ||57

జయే త్వం విజయే సాధ్వి ప్రవ్లూెచేzప్యథ: | సుందరి | సులోచనే మహాభాగే సమీచీనం కృతం హి మే ||58

కిమేతస్య వటో: కార్యం భవతీనామిహాధునా | వటుస్వరూపమాస్థాయ ఆగతో దేవనిందక:|| 59

సఖులారా! ఈమెచేత వరింపబడి రుద్రుడు ఈమెతో కలిసి వచ్చునపుడు ఈ సుందరి నిస్సంశయముగా అశుభరాలగును.(51) ఏ రుద్రుడు దక్షుని శాపముచేత వికృతుడై ,యజ్ఞబాహ్యుడు, విటుడైనాడో, ఎవరికి గొప్ప విషముగలసర్పములు అంగాభరణాలైనాయో(52) ఏ రుద్రడు శవముల భస్మమును ఒంటికి అలుముకొనునో పిశాచములతో, ప్రమథులతో నిరంతరమూ కూడివుండువాడు , చర్మమునో ధరించువాడు(53) అగునట్టి రుద్రునితో ఈ సుకుమారికేమి పని? మరణించగోరుచున్న పార్వతిని పిశాచము వలె సఖులు నివారించవలెను. (54) మనోహరుడైన ఇంద్రుని, గొప్ప తేజస్వియగు యముని, విశాలాక్షుడగు నైఋతుని, జలాధిపతియగు వరుణుని (55) కుబేరుని, వాయుదేవుని, విభావసుని వదలి రుద్రుని కోరి మరణించగోరుచున్న పార్వతిని ఆపండి. అని ఈ విధముగా, సఖులు వినుచుండగా వటురూపమున నున్న పరమేశ్వరుడు మాట్లాడుట విని తపస్సుచేయుచున్న (56) పార్వతి వటువుపట్ల కోపగించెను. (57) జయా! విజయా!సాధ్వీ! ప్రవ్లూెచనా! సులోచనా! నేను చేసినది సరియైనదే (58) మీకీ వటువుతో నేమి పని? ఇపుడు దేవతలనిందించువాడు పటుస్వరూపమును ధరించి వచ్చినాడు.(59)

అయం విసృజ్యతాం సంఖ్య : కిమనేన ప్రయోజనమ్‌ వటుస్వరూపిణం రుద్రం కుపితా సా తతోzబ్రవీత్‌ ||60

వటో గచ్చాశు త్వరితో న స్థేయం చ త్వయాzధునా | కిమనేన ప్రలాపేన తవనాస్తి ప్రయోజనమ్‌ ||61

వటుర్నిర్భర్త్సితస్తత్ర తయా చైవం తదా పున: ప్రవాస్య వై స్థిరో భూత్వా పునర్వాక్యమథాబ్రవీత్‌ ||62

శ##నై:శ##నైరవితథాం విజయాం ప్రతి సత్వరమ్‌ | కస్మాత్‌ కోపస్తయా తన్వి కృత: కేనైవ హేతునా||63

సర్వేషామపి తద్వాచ్యం వచనం సూక్తమేవ యత్‌| యథోక్తేన చ వాక్యేన కస్మాత్తన్వీ ప్రకోపితా||64

య: శంభురుచ్యతే లోకే భిక్షుకో భిక్షుకప్రియ: | యది మేహ్యనృతం ప్రోక్తం తదా కోప ఇహోచిత:||65

ఇయం తావత్‌ సురూపా చ విరూపోzసౌ సదాశివ:| విశాలాక్షీ త్వియం చాలా విరూపాక్షో భవస్తథా||66

ఏవంభూతేన రుద్రేణ మోహితేయం కథం భ##వేత్‌ | సభాగ్యో హి పతి: స్త్రీణాం సదా భావ్యో రతిప్రియ:||67

ఇయం కథం మోహితాస్తి నిర్గుణన గుణాత్మికా | న శ్రుతో న చ విజ్ఞాతో న దృష్ట : కేన వా శివ:||68

ఇతనిని పంపించివేయండి ఇతనితో నేమిపని? అని పార్వతి వటు రూపముననున్న రుద్రుని కూడా ఉద్దేశించి తరువాత ఇట్లనెను. (60) వటువా! త్వరగా ఇక్కడినుండి వెళ్ళుము. ఇక ఇప్పుడునీవు వుండరాదు ఎందులకీ ప్రలాపము? నీకే ప్రయోజనమూ కలుగదు (61) అని పార్వతి బెదిరించగా అపుడా వటువు మరల నవ్వి స్థిరముగా నిలిచి ఇట్లనెను (62) నెమ్మది నెమ్మదిగా, పార్వతి చెలికత్తెయగు విజయతో శివుడు ఇట్లనెను. సుందరీ! ఎందుకీ తన్వి కోపమునొందుచున్నది? కారణమేమి?(63) అందరూ అనవలసిన దానిని నేను చక్కగా అనినపుడు సత్యమును చెప్పినపుడు సుందరి ఎందులకు మిగుల కోపించినది?(64)శంభుడని లోకమున పిలువబడువాడు భిక్షుకుడు, భిక్షుకులకు ప్రియుడు నేనన్న దానిలో అసత్యమున్న ఎడల కోపమునొందుట ఉచితము (65) ఈ పార్వతి సుందరి, సదాశివుడేమో విరూపి, పార్వతీదేవి చక్కని విశాలనేత్రములు గలది మరి శివుడువిరూపాక్షుడు (66) ఇట్లాంటి రుద్రుని పట్ల పార్వతి మోహమునొందుట ఎట్లు? భాగ్యము గలవాడు రతిప్రియుడగు పతిని కదా స్త్రీలు భావించవలిసినది!(67) గుణాత్మికయగు పార్వతి నిర్గుణుడగు శివునిచేత ఎట్లు మోహితురాలాయెను? ఏ ఒక్కడూ శివుని గూర్చి వినలేదు అతనిని చూడలేదు అతనిని తెలుసుకోలేదు.(68)

సకామానాం చ భూతానాం దుర్లభో హి సదాశివ: | తపసాపరమేణౖవ గర్వితేయం సుమధ్యమా||69

ని:స్తంభో హి సదా స్థాణు: కథం ప్రాప్స్యతి తం పతిమ్‌ మయోక్తం కిం విశాలాక్షి కస్మాన్మే రుషితాధునా||70

యావద్రోషో భ##వేనృణాం నారీణాం చ విశేషత: తేన రోషేణ తత్సర్వం భస్మీభూతం భవిష్యతి|| 71

సుకృతం చోర్జితం తన్వి సత్యమేవొదితం సతి | కామ: క్రోధశ్చ లోభశ్చ దంభో మాత్సర్యమేవ చ || 72

హింసేర్ష్యా చ ప్రపంచశ్చ తేన సర్వం వినశ్యతి | తస్మాత్తపస్విభిర్యుక్తం కామక్రోధాదివర్జనమ్‌ ||73

యదీశ్వరో హృది మధ్యే విభావ్యో మనీపిభిస్సర్వదా జ్ఞప్తిమాత్ర:| తదా సర్వైర్మునివృత్యా విభావ్యస్తపస్విభిర్నాన్యథా చింతనీయ:||74

ఏతచ్ఛృత్వా వచనం తస్య శంభోస్తదాబ్రవీద్విజయా తం చ సర్వమ్‌ | గచ్చాత్ర కించిత్తవ నాస్తి కార్యం న వక్తవ్యం వచనం బాలిశాన్యత్‌ ||75

ఏవం వివదమానం తం వటురూపం సదాశివమ్‌ | విసర్జయామాస తదా విజయా వాక్యకోవిదా||76

తిరోధానం గత: సద్యో మహేశో గిరిజాం ప్రతి| అలక్ష్యమాణ: సర్వాసాం స

ఖీనాం పరమేశ్వర:|| 77

కామముతోనున్నవారికి సదాశివుడు దుర్లభుడు గొప్ప తపస్సుచేత పార్వతి గర్వించినది.(69) శివుడు ఎల్లప్పుడూ స్థాణువు. అట్టి పతిని ఎట్లు పొందును? విశాలాక్షీ! నేనన్నదేమి? ఈ పార్వతి ఇపుడు కోపగించిన దెందులకు? (70) నరులకు అందునావిశేషముగా స్త్రీలకు కోపమున్నంత వరకు ఆ కోపముచే ఆర్జించిన పుణ్యము అంతా భస్మీభూతమగును.(71) నేను సత్యమును చెప్పుచుంటిని కామము ,క్రోథము, లోభము, దంభము, మాత్సర్యము (72) హింసా ఈర్ష్య,వీని వలన ప్రపంచమంతా నశించును. కనుక తపస్వులు కామక్రోథములను విడిచివేయుట యుక్తమే! (73) జ్ఞానమాత్రమే నైన ఈశ్వరుని జ్ఞానులు ఎల్లప్పుడూ హృదయమున విశేషముగా భావనచేయవలెననిన అందరూ మౌనులై, తపస్సు నాశ్రయించి మాత్రమే అట్లు చేయవలెను వేరొక విధముగా శివుని చింతించుట సాధ్యము కాదు (74) అని వటువుపలుకగా విని విజయ త్వరగా అతనితో నిట్లనెను. మూర్ఖుడా! వెళ్ళిపొమ్ము ! నీకేమీ పనిలేదు మరొక మాట మాట్లాడరాదు (75) అని వాక్యజ్ఞానముగల విజయ తనతో వాదించుచున్న పరమశివుడు విడచివేసెను (76) వెంటనే సఖులందరికీ కనబడకుండగా , పరమేశ్వరుడు పార్వతిని గూర్చి అంతర్హితుడాయెను.(77) పాదుర్భభూవ సహసా నిజరూపధరస్తదా| యదా ధ్యానస్థితా దేవీ నిజధ్యానపరా సతీ||78

తదా హృదిస్థో దేవేశో బహిర్దృష్టిచరోభవత్‌ | నేత్రే ఉన్మీల్య సాధ్వీ గిరిజాయతలోచనా| అపశ్యద్దేవదేవేశం సర్వలోకమహేశ్వరమ్‌ || 79

ద్విభుజం చైకవక్త్రం చ కృత్తివాససమధ్భుతమ్‌ | కపర్థం చంద్రరేఖాంకం నివీతం గజచర్మణా||80

కర్ణస్థౌ హి మహానాగౌ కంబలాశ్వతరౌ తదా| వాసుకి: సర్సరాజశ్చ కృతాహరో మహాద్యుతి:||81

వలయాని మహార్హాణి తదా సర్పమయాని చ | కృతాని తేన రుద్రేణ తథా శోభాకరాణి చ|| 82

ఏవంభూతస్తదా శంభుం పార్వతీం ప్రతి చాగ్రత:| ఉవాచ త్వరయా యుక్తో వరం వరయ భామిని|| 83

వ్రీడయా పరయా యుక్తా సాధ్వీ ప్రోవాచ శంకరమ్‌ త్వం నాథో మమ దేవేశ త్వయా కిం విస్మృతం పురా|| 84

దక్షయజ్ఞవినాశం చ యదర్థం కృతవాన్‌ ప్రభో | సత్వం సాహం సముత్పన్నా మేనాయాం కార్యసిద్దయే||85

దేవానాం దేవదేవేశ తారకస్య వధం ప్రతి | భవతో హి మయా దేవ భవిష్యతి కుమారక:||86

వెంటనే పరమశివుడు అపుడు నిజరూపమును ధరించి సాక్షాత్కరించెను. పార్వతి ధ్యానమున, ఆత్మధ్యానము చేయుచుండగా (78) హృదయముననున్న దేవేశుడు అపుడు బాహ్యదృష్టికి కూడా గోచరమాయెను. విశాలనేత్రములుగల పార్వతి కళ్ళు తెరచి దేవదేవుని, సర్వలోక మహేశుని చూచెను. (79) అపుడు శివుడు రెండు భుజములు, ఒక ముఖము గలిగి, కృత్తివాసుడుగా నుండెను జటాజాటమును.చంద్రరేఖను, గజచర్మను ధరించెను(80) కంబల, అశ్వతరములను గొప్ప సర్పములు కర్ణాభరణములాయెను సర్పరాజగు వాసుకి హారముగా చేయబడెను.(81) శోభను కలిగించు,గొప్ప సర్పముల వలయములను రుద్రుడవుడు ధరించియుండెను.(82) ఇట్లున్న పరమశివుడు అపుడు పార్వతి ఎదుట నిలిచి త్వరగా వరము కోరుకొమ్మని అనెను (83) అపుడు మిగుల సిగ్గును పొందిన శంకరునితో ఇట్లనెను దేవేశా! నీవు నా నాథుడవు పూర్వము చేసిన దక్షయజ్ఞ వినాశమును మరిచితివా?(84) ఎవరి కొరకు ఆ యజ్ఞము నాశనము చేయబడెనో అట్టివాడవు నీవు. ఇక నేను కార్యసిద్దికై మేనయందు జన్మించితిని (85) దేవదేవేశా! దేవతలకొరకు తారకుని వధను గూర్చి నీనుండి నాకు కుమారుడు కలగగలడు.(86)తస్మాత్త్వయా హి కర్తవ్యం మమ వాక్యం మహేశ్వర| గంతవ్యం హిమవత్పార్శ్వం నాత్ర కార్యా విచారణా|| 87

యాచస్వ మాం మహాదేవ ఋషిభి పరివారిత: | కరిష్యతి న సందేహస్తవ వై పిత్రా దత్తా యదా తవ||88

యథోక్తవిధినా తత్ర వివాహో న కృతస్త్వయా||89

న గ్రహా: పూజితాస్తేన దక్షేణ చ మహాత్మనా | గ్రహాణాం విషయత్వేన సచ్చిద్రోZయం మహానభూత్‌ ||90

తస్మాద్యథోక్తవిధినా కర్తుమర్హసి సువ్రత| వివాహం స్వం మహాభాగ దేవానాం కార్యసిద్దయే||91

తదోవాచ మహాబాహో గిరిజాం ప్రహసన్నివ| స్వభావేనైన తత్సర్వం జంగమాజంగమం మహత్‌|| జాతం త్వయా మోహితం చ త్రిగుణౖ: పరివేష్టితమ్‌||92

అహంకారాత్సముత్పన్నం మహత్తత్వం చ పార్వతి| మహత్తత్వాత్తమో జాతం తమసా వేష్టితం నభ:||93

నభసో వాయురుత్పన్నో వాయోరగ్నిరజాయత | అగ్నేరాప: సముత్పన్నా అద్భ్యోజాతా మహీతదా|| 94

మహ్యాదికాని స్థాస్నూని చరాణి చ వరాననే | దృశ్యం యత్సర్వమేవైతన్నశ్వరం విద్ది మానిని||95

కనుక ఓ మహేశ్వరా! నీవు నా మాట ననుసరించి చేయవలెను వెంటనే హిమవంతుని వద్దకు వెళ్ళవలెను. ఆలోచించపనిలేదు.(87) మహాదేవా ఋషులతో గూడి వెళ్ళి హిమవంతుని నుండి నన్ను యాచించుము. నీ మాటనే నా తండ్రి పాటించును. సందేహం లేదు (88) నేను దక్షుని పుత్రికగా యున్నపుడు నా తండ్రి నీకు నన్ను ఇచ్చెను కాని విధి ప్రకారము వివాహము జరగలేదు.(89) మహాత్ముడగు దక్షుడు గ్రహములను పూజించలేదు. గ్రహములకు విషయమై దక్షుడు హానిని పొందెను.(90) కనుక నీవు విధి ప్రకారము చేయవలెను దేవతల పని నెరవేరుటకు వివాహమును యథావిధిగా చేయవలెను.(91) అని పార్వతి అనగా పరమశివుడు నవ్వుచు ఇట్లనెను చరాచరమైన దంతా నీనుండి జనించును. త్రిగుణముచేత కూడుకున్నదై అది నీ చేత మోహమునొందునట్లు చేయబడును(92) పార్వతీ! అహంకారమునుండి మహత్తు ఉత్పన్నమగును మహత్తునుండి తమస్సు కలిగి ఆకాశమును ఆవరించెను.(93) ఆకాశమునుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలమునుండి పృథ్వీ ఉత్పన్నమైనవి.(94) సుందరీ! భూమి మొదలుగా చరాచరముగా కనబడునదంతా నశించు స్వభావము గలదిగా తెలుసుకొనుము (95)

ఏకోZనేకత్వమాపన్నో నిర్గుణో హి గుణావృత: స్వజ్యోతి యో నిత్యం పరజ్యోత్స్నాన్వితోZభవత్‌ || స్వతంత్ర: పరతంత్రశ్చ త్వయా దేవి మహత్‌ కృతమ్‌ || 96

మాయామయం కృతమిదం చ జగత్సమగ్రం సర్వాత్మనా అవధృతం పరయా చ బుద్ద్యా|

సర్వాత్మభి సుకృతిభిః పరమార్తభావై: సంసక్తిరింద్రియగణౖ పరివేష్టితం చ ||97

కే గ్రహా కే ఉడుగణా: కే బాధ్యంతే త్వయా కృతా విముక్తం చాధునా దేవి శర్వార్థం పరవర్ణిని ||98

గుణకార్యప్రసంగేన ఆవాం ప్రాదుర్భవ: కృత: త్వం హి వై ప్రకృతి సూక్ష్మా రజసత్త్వతమోమయీ||99

వ్యాపారదక్షాసతతమహం చైవ సుమధ్యమే | హిమాలయం న గచ్ఛామి న యాచామి కథంచన||100

దేహీతి వచనాత్‌ సద్య: పురుషో యాతిలాఘవమ్‌ | ఇత్థం జ్ఞాత్వా చ భో దేవి కిమస్మాకం వదస్వ వై||101

కార్యం త్వదాజ్ఞయా భ##ద్రే తత్సర్వం వక్తుమర్హసి | తేనోక్తాత్ర తదా సాధ్వీ ఉవాచ కమలేక్షణా||102

ఒక్కడుగా వున్ననూ అనేకముగా ఆయెను నిర్గుణుడయిననూ గుణములచే ఆవరించబడెను నిత్యమూ స్వయంజ్యోతిగా ప్రకాశించువాడు పరంజ్యోతితో కూడిన వాడాయెను. స్వతంత్రుడైననూ పరతంత్రుడాయెను దేవీ నీవే మహత్తును సృజించితివి.(96) నీచే జగత్తు అంతా మాయామయముగా చేయబడినది. పరజ్ఞానముచేత సర్వాత్మవై దీనిని నిలుపుదువు. యధార్థజ్ఞానముగల సాధువులతో సంగమును, ఇంద్రియ పరివేష్టనమును నీవే చేసితివి (97) గ్రహములేవి? నక్షత్రగణములేవి? నీచే సృజింపబడినవారెవ్వరు బాధింపబడుదురు? శివుని కొరకు ఇపుడిది విడిచివేయబడినది.(98) గుణముల కార్యముల ప్రసంగములో మనము ప్రాదుర్భవించాము నీవు సత్త్వరజస్తమోమయమగు సూక్ష్మమైన ప్రకృతిని (99) వ్యాపారదక్షురాలవు ఎల్లప్పుడు సుందరీ !నేను హిమాలయుని వద్దకు వెళ్లను. ఎట్టి విధముగా నైనా యాచించును (100)దేహి అను మాటవలన పురుషుడు వెంటనే చులకన యగును కనుక ఓ దేవి! ఇది తెలిసిన నీవు చేయవలసినదేమిటో చెప్పుము.(101) నీ ఆజ్ఞతో మేము చేయవలసిన దేమిటో చెప్పవలెను. అనిశివుడనగా విశాల నేత్రములు గల పార్వతి ఇట్లనెను (102)

త్వమాత్మా ప్రకృతిశ్చాహం నాత్ర కార్యా విచారణా| తథాపి శంభో కర్తవ్యం మమ చోద్వహనం మహత్‌ ||103

దేహో హ్యవిద్యాక్షిప్తో విదేహో హి భవాన్‌ పర: తథాష్యేవం మహాదేవ శరీరావరణం కురు||104

ప్రపంచరచనాం శంభో కురు వాక్యాన్మయ ప్రభో యాచస్వ మాం మహాదేవ సౌభాగ్యం చైవ దేహి మే||105

ఇత్యేవముక్త : స తయా మహాత్మా మహేశ్వరో లోకవిడంబనాయ| తథేతి మత్వా ప్రవాసన్‌ జగామ స్వమాలయం దేవవరై: సుపూజిత: ||106

ఏతస్మిన్నంతరే తత్ర హిమావాన్‌ గిరిభిస్సహ మేనయా భార్యయా సార్ధమాజగామ త్వరాన్విత:|| 107

పార్వతీదర్శనార్థం చ సుతైశ్చ పరివారిత: | తేన దృష్టా మహాదేవి సఖీభి: పరివారితా||108

పార్వత్యా చ తదా దృష్టో హిమవాన్‌ గిరిభిస్సవా| అభ్యుత్థానపరా సాధ్వీ ప్రణమ్య శిరసా తదా|| పితరౌ చ తదా భ్రాతృన్‌ బంధూంశ్త్పేవ చ సర్వశ:|| 109

స్వమంకమారోప్య మహాశయస్తదా సుతాం పరిష్వజ్య చ బాష్పపూరిత:| ఉవాచ వాక్యం మధురం హిమాలయం: కిం వై కృతం సాధ్వి యథాతథేన||110

తత్కథ్యతాం మహాభాగే సర్వం శుశ్రూషతాం హి న:| తచ్చృత్వా మధురం వాక్యమువాచ పితరం ప్రతి || 111నీవు ఆత్మవు నేను ప్రకృతిని. ఇందు విచారించవలసినది లేదు, అయినప్పటికీ ఓ పరమశివా| నన్ను వివాహము చేసుకొనవలెను.(103) దేహము అవిద్యచేత కూడుకొనినది. నీవు పరమాత్మవు. అయినప్పటికీ ఓ మహాదేవా! శరీరమునొకదానిని ఆశ్రయించుము (104) నా మాట పై ప్రపంచమునురచింపుము నుండి నన్ను యాచించుము నాకు సౌభాగ్యము నిమ్ము (105) అని పార్వతి యనగా మహేశ్వరుడు లోకముననుగ్రహించుటకై అలాగే యని తలచి నవ్వుచూ తన నివాసమునకు వెళ్ళను. (106) ఇంతలో హిమవంతుడు పర్వతములతో భార్యయగు మేనతో కలిసి త్వరగా వచ్చెను.(107) పుత్రులతో కలిసి పార్వతిని చూచుటకు వచ్చిన హిమవంతుడు సఖులతో కూడి యుండిన పార్వతిని చూచెను.(108)పార్వతి కూడా పర్వతరాజును చూచి, లేచి తల్లిదండ్రులకు,సోదరులకు , బంధువులకు తలవంచి నమస్కరించెను (109) మహానుభావుడగు హిమాలయుడు పార్వతిని తన ఒడిలో కూర్చుండబెట్టి కౌగలించుకొని కన్నీళ్ళతో తానేమి చేసేనో యథాతథముగా చెప్పమని మధురముగా అడిగెను.(110) తాము వినగోరుచున్నామని పర్వతరాజనగా పార్వతి మధురముగా తండ్రితో నిట్లనెను (111) తపసా పరమేణౖవ ప్రార్థితో మదనాంతక: శాంతం చ మే మహత్‌ కార్యం సర్వేషామపి దుర్లభమ్‌||112

తత్ర దృష్టో మహాదేవో వరణార్థం సమాగత: | స మయోక్త స్తదా శంభుర్మమ పాణిగ్రహ: కథమ్‌||113

క్రియతే చ తదా శంభో మమ పిత్రా వినాZధునా | యథాగతేన మార్గేణ గతోZసౌ త్రిపురాంతక:114

తస్యాస్తద్వచనం శ్రుత్వా అవాప పరమం ముదమ్‌| బంధుభిస్సహ ధర్మాత్మా ఉవాచ స్వసుతాం పున:||115

తండ్రీ ! గొప్ప తపస్సుతో మదనాంతకుడగు శివుని ప్రార్థించితిని. నా గొప్ప కార్యము అందరికీ దుర్లభమగునది సిద్దించినది (112) అపుడకడ నన్ను వరించుటకు వచ్చిన శివుని చూచితిని నా పాణిగ్రహణమును నా తండ్రి లేకుండా ఎట్లు చేతువు? అని నేను అడుగగా శివుడు వచ్చిన బాటనే వెళ్ళిపోయెను?(113,114) అని పార్వతి చెప్పగా బంధువులతో సహా హిమాలయుడు చాలా సంతోషించి తన కూతురితో ఇట్లనెను.(115)

స్వగృహం చాద్య గచ్చామో వయం సర్వే చ భూధరా: | అనయారాధితో దేవ: పినాకీ వృషభద్వజ:||116

ఇత్యూచుస్తే సురా: సర్వే హిమాలయపురోగమా:| పార్వతీ సహితా సర్వే తుష్టువుర్వాగ్భిరాదృతా:||117

తాం స్తూయమానాం చ తదా హిమాలయో హ్యోరోప్య చాంసం వరవర్ణినీం చ

సర్వేZథ శైలా : పరివార్య చోత్సుకా: సమానయామాసురథ స్వమాలయమ్‌||118

దేవదుందుభయో నేదు: శంఖతూర్యాణ్యనేకశ:| వాదిత్రాణి బహున్యేవ వాద్యమానాని సర్వశ:||119

పుష్పవర్షేణ మహతా తేనానీతాగృహం ప్రతి ||120

పర్వతములగు మనమంతా మన నివాసమును వెళ్ళెదము ఈ పార్వతి పినాకి వృషభధ్వజుడగు శివుని ఆరాధించినది (116)అనగా అపుడు హిమాలయుడు మొదలుకొని దేవతలు మరియు పార్వతి ఆదరముతో శివుని స్తుతించిరి.(117) వారందరూ ఆదరముతో పార్వతిని కూడా పొగుడుచుండగా హిమవంతుడు మేలువన్నె గల పార్వతిని తన ఒడిలో నిలిపెను. పర్వతములన్నీ ఉత్సుకతతో, చుట్టుముట్టి తమ వినాసమునకు కొని తెచ్చిరి.(118) అపుడు దేవదుంధుభులు , శంఖములు, తూర్యములు,వాదిత్రములు అనేకములు మ్రోగినవి. అఇ మ్రోగింపబడుచుండగా పుష్పవరముతో వారు పార్వతిని ఇంటికి తీసుకొని వచ్చిరి.(119,120)

సా పూజ్యమానా మహుభిస్తదానీం మహావిభూత్యుల్లసితాతపస్వినీ | తథైవ దేవై: సహ చారణౖశ్చ మహర్షిభి: సిద్దగణౖశ్చ సర్వశ:|| 121

పూజ్యమానా తదా దేవీ ఉవాచ కమలాసనమ్‌ దేవాన్‌ ఋషీన్‌ పితృన్‌ యక్షానన్యాన్‌ సర్వాన్సమాగతాన్‌||122

గచ్ఛధ్వం సర్వ ఏవైతే యేZన్యే వ్యాత్ర సమాగతా :| స్వం స్వం స్థానం యథాజోషం సేవ్యతాం పరమేశ్వర:||123

ఏవం తదానీం స్వపితుర్గృహం గతా సంశోభమానా పరమేణ వర్చసా| సా పార్వతి దేవవరై

:సుపూజితా సంచింతయన్తీ మనసా సదాశివమ్‌||124

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వఖండే కేదారఖండే

పార్వత్యై శంకరేణ స్యరూపదర్శనం నామ ద్వావింశోZధ్యాయ:

మహావిభూతితో ప్రకాశించుచున్న తపస్వినియగు పార్వతి దేవతలు,చారణులు,మహర్షులు. సిద్దగణములు మొదలగువానిచే అన్ని విధములుగా పూజించబడెను (121) అట్లు పూజింపబడుచున్న పార్వతి బ్రహ్మ ,దేవతలు, ఋషులు, పితరులు, యక్షులు మరియు అక్కడికే తెంచిన ఇతరులతో ఇట్లనెను (122) ఇక్కడికేతెంచిన మీరంతా ఇక మీమీ నివాసాలను త్వరగా వెళ్ళి పరమేశ్వరుని సేవించండి(123) ఈవిధంగా అపుడు తన తండ్రి ఇంటికి చేరిన పార్వతి గొప్ప వర్చస్సుతో దేవతలచే పూజింపబడుచూ మనసులో సదాశివుని గూర్చి ధ్యానించుచూ చుండెను.(124)

ఇది శ్రీ స్కాందమహాపురాణమందు మొదటి మాహేశ్వరఖండమందలికేదారఖండమున

శంకరుడు పార్వతికి తన రూపము చూపుట అను ఇరువది రెండవ అధ్యాయము.

త్రయోవింశోZధ్యాయ :

ఏతస్మిన్నంతరే తత్ర మహేశేన ప్రణోదితా: | ఆజగ్ము: సహసా సద్య ఋషయోZపి హిమాలయమ్‌ ||1

తాన్‌ దృష్ట్యా సహసోత్థాయ హిమాద్రి: ప్రీతమానస: పూజయామాస తాన్‌ సర్వామవాచ నతకంథర:|| 2

కిమర్థమాగతా యూయం బ్రూతాగమన కారణమ్‌ | తదోచు: సప్త ఋషయో మహేశ##ప్రేరితా వయమ్‌||3

సమాగతాస్త్వత్సకాశం కన్యాయాశ్చ విలోకనే| తానస్మాన్విద్ది భో: శైల స్వాం కన్యాం దర్శయాశు వై||4

తథేత్యుక్త్యా ఋపిగణానీతా తత్ర పార్వతీ | స్వోత్సంగే పరిగృహ్యాశు గిరీంద్ర : పుత్రవత్సల:|| హిమవాన్గిరిరాజోZథ ఉవాచ ప్రవాసన్నివ|| 5

ఇయం సుతా మదీయా హి వాక్యం శ్రుణుత మే పున: తపస్వినాం వరిష్ఠోZసౌ విరక్తో మదనాంతక: కృత: స్మర:|| 6

అత్యాసన్నే చాతిదూరే ఆఢ్యే ధనవివర్జితే | వృత్తిహీనే చ మూర్థే చ కన్యాదానం న శస్యతే || 7

మూఢాయ చ విరక్తాయ ఆత్మసంభావితాయ చ | ఆతురాయ ప్రమత్తాయ కన్యాదానం న కారయేత్‌ || 8

ఇరువది మూడవ అధ్యాయము

ఇంతలో మహేశుని చేత ప్రేరితులైన ఋషులుకూడా వెంటనే హిమాలయమునకు వచ్చిరి (1) వారిని చూచి హిమవంతుడు వెంటనే లేచి ప్రీతితో వారిని పూజించి తలను వంచి ఇట్లు పలికెను (2) మీరే కారణముచేత ఇక్కడకు వచ్చారు? చెప్పండి అనగా సప్తర్షులు ఇట్లనిరి మేము మహేశుని చేత ప్రేరేపింపబడి వచ్చితిమి(3)ఓ పర్వతరాజా! కన్యా దర్శనమునకై వచ్చినవారిగా మమ్ము తెలుసుకొని నీకన్యను మాకు చూపించుము (4) అనగా పర్వతరాజు అట్లే అని పలికి పార్వతిని పిలిపించెను. పుత్రవాత్సల్యముగ హిమవంతుడు తనకుమార్తెను ఒడిలో కూర్చుండబెట్లుకొని నవ్వుతూ ఇట్లనెను (5) ఈ కన్య నాకూతురు. ఇక నా మాటను వినుడు తపస్వి జనమందరిలో శ్రేష్ఠుడు, విరక్తుడు, మదనుని సంహరించిన వాడు(6) మన్మథుని అనంగునిగా చేసిన శివుడు వివాహము కోరువాడెట్లగును? చాలా సమీపమున నున్నవానికి ధనవంతునికి, ధనహీనునికి,వృత్తి లేనివానికి, మూర్ఖునికి కన్యాదానము చేయుట ప్రశస్తము కాదు.(7) మూడునికి విరక్తునికి, ఆత్మశ్లాఘను చేయువానికి రోగికి ప్రమత్తునికి కన్యాదానము చేయరాదు (8)

తస్మాన్మయా విచార్యైవ భవద్భిర్‌ ఋషిసత్తమా | ప్రదాతవ్యా మహేశాయ ఏతన్మే వ్రతముత్తమమ్‌ ||9

తచ్ఛ్రుత్వా గిరిరాజస్య వచనం తే మహర్షయ:| ఐకపద్యేన ఊచుస్తే ప్రవాస్య చ హిమాలయమ్‌ ||10

యయా కృతం తపస్తీవ్రం యయా చారాధిత:శివ:|| 11అస్యాస్తస్య చ భో: శైల న జానాసి చ కించన | మహిమానం పరం చైవ తస్మాదేనాం ప్రయచ్ఛ వై||12

శివాయ గిరిజామేనాం కురుష్వ వచనం హి న: తచ్ఛృత్వా వచనం తేషా మృషీణాం భావితాత్మనామ్‌||13

ఉవాచ త్వరయా యుక్త: పర్వతాన్పర్వతేశ్వర: | హే మేరో హే నిషధ కిం గంధమాదన మందర || మైనాక క్రియతామద్య శంసధ్వం చ యధాతథమ్‌|| 14

మేనా తదా ఉవాచేదం వాక్యం వాక్యవిశారదా| అధునా కిం విమర్శేన కృతం కార్యం తదైవ హి||15

ఉత్పన్నేయం మహాభాగా దేవకార్యార్థమేవ చ | ప్రదాతవ్యా శివాయేతి శివస్యార్థేZవతారితా|| 16

కనుక ఓ ఋషిశ్రేష్ఠులారా! నేను బాగా ఆలోచించి మహేశ్వరునికి నా కూతురునివ్వలెను ఇది నా ఉత్తమవ్రతము (9) అనగా వినిమహర్షులు నవ్వుచూ ఒక్కమారుగా అతనితో ఇట్లనిరి.(10) ఈ కన్య తీవ్రమైన తపస్సు చేసి శివునారాధించగా ఆతపస్సు చేత సంతోషించిన శివుడిపుడు ప్రసన్నుడైనాడు (11) ఓ పర్వతరాజా! శివపార్వతుల మహిమను నీవేమాత్రము ఎఱుగవు. కనుక పార్వతిని శివునకిమ్ము. (12) మా మాటలను పాటించుము అనిమహాత్ములైన ఋషులనగా విని పర్వతేశ్వరుడగు హిమవంతుడు త్వరగా ఇట్లనెను.(13)మేరు పర్వతమా ! నిషధా! గంధమాదనా! మైనకా! ఏమి చేయవలెనో వాస్తవముగా తెలుపుడు (14) అనగా అపుడు మేన వాక్యజ్ఞానము తెలిసినదై ఇట్లు పలికెను ఇపుడు తరచి చూచి ఏమి ఫలము ? ఆనాడే జరగవలసినది జరిగినది.(15) ఓ మహానుభావులారా! పార్వతి శివునికొరకు దేవతల పని నెరవేరుటకు ఉద్భవించినది. శివునికి ఇవ్వబడవలసినదిగా అవతరించినది.(16)

అనయారాధితో రుద్రో రుద్రేణ పరిభావితా | ఇయం సతీ మహాభాగా శివాయ ప్రతిదీయతామ్‌||17

నిమిత్తమాత్రం చ కృతం తయా వై శివపూజనే ఏతచ్చృత్వా వచస్తస్యా మేనాయా: పరిభాషితమ్‌||18

పరితుష్టో హి మాద్రిశ్చ వాక్యం చేదమువాచ హ | ఋషీన్ర్పతి నిరీక్షంస్తాం కన్యేయం మమ సంప్రతి||19

తత: సమానీయా సులోచనాం తాం| శ్యామాం నితంబార్పితమేఖలాం శుభామ్‌|

వైడూర్యముక్తావలయాన్‌ దధానాం | భాస్వత్‌ప్రభాం చాంద్రమసీం వ రేఖామ్‌ || 20

లావాణ్యామృతవాపికాం సువదనాం గౌరీం సువాసాం శుభాం|

దృష్ట్యా తే ఋషయోZపి మోహమగమన్‌ భ్రాంతాస్తదా సంభ్రమాత్‌||21

వోచుః కించన వాక్యమేవ సుధియో హ్యాసన్‌ ప్రమత్తా ఇవ | స్తబ్ధాః కాంతిమతీమతీవ రుచిరాం త్రైలోక్యనాథప్రియామ్‌ || 21

ఏవం తదా తే హ్యృషయోZపి మోహితా రూపేణ తస్యా: కిముతాథ దేవతా: |

తథైవ సర్వే చ నిరీక్ష్య తన్వీం సతీం గిరీంద్రస్య సుతాం శివప్రియామ్‌ ||22

ఈ పార్వతి రుద్రుని ఆరాధించినది.రుద్రుడీమెను అభిమానించెను. కనుక ఈ సతిని శివునికి ఇవ్వవలెను. (17) శివపూజయందు పార్వతి కేవలము నిమిత్తముగా చేసినది.అని మేన పలుకగా హిమవంతుడు సంతోషించి ఇట్లనెను ఋషులారా! నా ఈ కన్యను చూడుడు.(18,19) అటు పిమ్మట అందమైన నేత్రములుగలదానిని, నడుముపై జారిన వడ్డాణము గల దానిని వైడూర్య, ముత్యముల వలయముల ధరించుదానిని , ప్రకాశించు చంద్రుని రేఖవలెనున్న దానిని, లావణ్యమును అమృతమునకు బావివంటి దానిని, సుందరిని, చక్కని వస్త్రములధరించిన దానిని, శుభమును గూర్చు పార్వతిని చూచి, ఋషులు కూడా మోహము నొందిరి. సంభ్రాంతులైన ఋషులు ఏమీ మాట్లాడకుండా వుండిరి. విజ్ఞులైన గూడా ప్రమత్తులవలె మారి,కాంతిగలది అందమైనది, శివునికి ఇష్టమైనది యగు పార్వతిని చూచి స్తబ్ధులైరి.(21) ఇట్లు పార్వతిని చూచిన ఋషులే మోహము నొందినపుడు దేవతలను గూర్చి చెప్పేదేమి? వారునూ అట్లే పార్వతిని చూచుచుండిరి.(22)

తత: పునశ్చైత్య శివం శివప్రియా : శశంసురస్మా ఋషయస్తదానీమ్‌ ||23

ఋషయ ఊచు:

భూషితా హి గిరీంద్రేణ స్వసుతా నాస్తి సంశయ:| ఉద్యోఢుం గచ్ఛ దేవేశ దేవైశ్చ పరివారిత:||24

గచ్ఛ శీఘ్రం మహాదేవ పార్వతీమాత్మజన్మనే | తచ్ఛృత్వా వచనం తేషాం ప్రవాస్యేదమువాచ హ||25

వివాహో హి మహాభౄగా న దృష్టో న శ్రుతోZపి వా | మయా పురా చ ఋషయ: కథ్యతాం చ విశేషత:||26

తదోచుర్‌ ఋషయ: సర్వే ప్రవాసంత: సదాశివమ్‌| విష్ణుమాహ్వయ వై దేవ బ్రహ్మాణం చ శతక్రతుమ్‌|| 27

తథా ఋషిగణాంశ్చైవ యక్షగంధర్వపన్నగాన్‌ | సిద్దవిద్యాధరాంశ్చైవ కింనరాంశ్చాప్సరోగణాన్‌||28

ఏతాంశ్చాన్యాంశ్చ సుబహూనానయస్వేతి సత్వరమ్‌ | తదాకర్ణ్య ఋషిప్రోక్తం వాక్యం వాక్యవిశారద:||29

ఉవాచ నారదం దేవో విష్ణుమానయ సత్వరమ్‌ | బ్రహ్మాణం చ మహేంద్రం చ అన్యాంశ్చైవ సమానయ||30

అటుపిమ్మట శివప్రియులైన ఋషులు మరల శివుని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి.(23) ఋషులు చెప్పిరిదేవా! గిరీంద్రుడు తనకూతురిని అలంకరించెను. ఇందు సంశయములేదు. నీవు దేవతలతో గూడి ఆమెను వివాహమాడుటకు వెళ్ళుము ('24) మహాదేవా! ఆత్మజునికై పార్వతిని త్వరగా చేరుము. అని ఋషులనగా విని శివుడనవ్వి ఇట్లనెను (25) మహాభావులారా! నేను మునుపు వివాహమును చూచిగానీ వినిగానీ యుండలేదు. కనుక ఋషులారా! దానిని గూర్చినాకు విశేషముగాతెలియజేయుడు(26) అనగా అపుడు ఋషులందరూ నవ్వుచూ శివునితో ననిరి దేవా! విష్ణువును, బ్రహ్మను, ఇంద్రుని పిలువుము.(27) అట్లే ఋషిగణములను ,యక్షగంధర్వసర్పములను, సిద్దులను, విద్యాధరులను, కిన్నరులను అప్సరసలను ఆహ్వానించుము (28) వీరేకాక పెక్కు ఇతర గణములను త్వరగా ఆహ్వానించుము అని వాక్యజ్ఞులగు ఋషులు పలుకగా విని వాక్యవిశారదుడగు శివుడువిష్ణువును, బ్రహ్మను ఇంద్రుడిని. ఇతరులనందరినీ పిలుచుకొని రమ్మని నారదునితో ననెను.(29,30)

శంభోర్వచనమాదాయ శిరసా లోకపావన:| జగామ త్వరితో భూత్వా వైకుంఠం విష్ణువల్లభ:|| 31

దదర్శ దేవం పరమాననే స్థితం శ్రియా చదేవ్యా చ పరిసేవ్యమానమ్‌ | చతుర్భుజం దేవవరం మహాప్రభం నీలోత్పలాశ్యామతనుం వరేణ్యమ్‌ ||32

మహార్హరత్నావృతచారుకుండలం మహాకిరీటోత్తమరత్నభాస్వతమ్‌ | సువైజయంత్యా వనమాలయా వృతం స నారదస్తం భువనైకసుందరమ్‌ ||33

ఉవాచ నారదేZభ్యేత్య శంభోర్వాక్యమథాదరాత్‌ | బ్రహ్మవీణాం వాద్యమాన : సర్వజ్ఞఋషిసత్తమ:||34

ఏహ్యేహి త్వం మహావిష్ణో మహాదేవం త్వరాన్విత: | ఉద్వాహనార్థం శంభోశ్చ త్వమేక: కార్యసాధక:||35

ప్రవాస్య భగవాన్‌ ప్రాహ నారదం ప్రతి వై తదా | కథముద్వహనే బుద్దిరుత్పన్నా తస్య శూలిన :|| విజ్ఞాతార్థోZ;పి భగవాన్నారదం పరిపృష్టవాన్‌||36

లోకముల పవిత్రము జేయు విష్ణుపియ్రుడగు నారదుడా మాటను శిరసావహించి త్వరగా వైకుంఠమునకు వెళ్ళెను (31) అక్కడ పరమాసనమున కూర్చండి లక్ష్మీదేవిచేత సేవింపబడుచున్న చతుర్భుజుడగు విష్ణువును చూచెను విష్ణుమూర్తి గొప్పకాంతితో, నీలోత్పలము వంటి ఛాయతో ప్రకాశించుచుండెను(32) గొప్పరత్నములగల అందమైన కుండలములు ధరించి,గొప్పకిరీటమునందలి రత్నములతో ప్రకాశించుచూ, వనమాలయగు వైజయంతితో భువనైక సుందరుడిగా నుండెను.(33) అట్టి విష్ణువును సమీపించి నారదుడు బ్రహ్మవీణను మీటుచూ శివుని వాక్యమును ఆదరముతో తెలియజేసెను.(34) మహావిష్ణు! నీవు త్వరగా శివుని వివాహమునకై రమ్ము నీవొక్కడివే కార్యసాధకుడవు(35) అనగా విని విష్ణుమూర్తి నవ్వి నారడునితో ననెను. శూలమును ధరించు శివునికి వివాహము నందెట్లు మనసేర్పడెను? అని అన్ని విషయములు తెలిసిన వాడైననూ విష్ణుమూర్తి నారదుని అడిగెను.

నారద ఉవాచ:

తపసా మహతా రుద్ర: పార్వత్యా పరితోషిత:| స్వయమేవాగతస్తత్ర యత్రాస్తే గిరిజా సతీ||37

దాసోZహమవదచ్ఛంభు: పార్వత్యా పరితోషిత: పార్వతీం చ సమభ్చర్థ్య వరయస్వ చ భామిని||38

త్వరితేనావదచ్ఛంభుస్త్వామాహ్వయతి సంప్రతి | తస్య తద్వచనం శ్రూత్వా దేవదేవో జనార్దన:|| నారదేన సమాయుక్త: పార్షదై: పరిపారిత||39

సువర్ణమారుహ్య తదా మహాత్మా యోగీశ్వరాణాం ప్రభురచ్యుతో మహన్‌|

య¸° తదాకాశపథా హరి: స్వయం సనారదో దేవవరై: సమేత:||40

తం దృష్ట్యా త్వరితం దేవో యోగిధ్యేయాంఘ్రిపంకజ: | అభ్యుత్థాయ ముదా యుక్త: పరిష్వజ్య చ శార్జిణమ్‌ ||41

తదా హరిహరౌ దేవావైకపద్యేనతిష్టత ఊచతుః | స్మతదాన్యోన్యం క్షేమం కుశలమేవ చ || 42

ఈశ్వర ఉవాచ:

గిరిజాతపసా విష్ణో జితోZహం నాత్ర సంశయ: | పాణిగ్రహార్థమేవాద్య గంతుకామో హిమాలయమ్‌ ||43

యథార్థేన చ భో విష్ణో కథయామి తవాగ్రత: | యదా దక్షేణ భో విష్ణో ప్రదత్తా చ పురా సతీ|| 44

న చ సంకల్పవిధినా మయా పాణిగ్రహ : కృత: | అధునైవ మయా కార్యం కర్మవిస్తారణం బహు||45

యత్కార్యం తన్న జానామి సర్వం పాణిగ్రహణోచితమ్‌ | శంభోస్తద్వచనం శ్రుత్వా ప్రవాస్య మధుసూదన:||46

యావద్వక్తుం సమారేభే తావద్ర్బహ్మా సమాగత : | ఇంద్రేణ సహ సర్వైశ్చ లోకపాలైస్వరాన్విత:|| 47

నారదుడు చెప్పెను పార్వతి గొప్ప తపస్సుచేయగా శివుడు సంతోషించి గిరిజ వద్దకు తానే వచ్చెను (37) అంతేకాక తనకు దాసోZహమని కూడా పలికి తనను వరించుమని వేడుకొనెను (38) ఇప్పుడట్టి శివుడు నిన్ను ఆహ్వానించుచున్నాడు అని త్వరగా చెప్పెను. నారదుని మాట విని నారదునితో ఇతర సభ్యులతో కలసి (39) యోగీశ్వరుల ప్రభువు అచ్యుతుడు అగు హరి గరుడుని అధిరోహించి ఆకాశమార్గాన వెళ్ళెను. (40) అతనిని చూచి యోగులచేత ధ్యానింపబడదగు పాదపంకజములు గల శివుడు లేచి ఎదురువెళ్ళి సంతోషముతో అతనిని కౌగలించుకొనెను (41) అపుడు హరిహరులిద్దరూ ఒక దగ్గర కూర్చొని పరస్పరక్షేమమును కుశలమును అడిగిరి (42) ఈశ్వరుడనెను విష్ణూ! నిస్సందేహముగా నేను పార్వతి తపస్సుచే జయింపబడినాను ఇప్పుడు వివాహమునకై హిమాలయుని వద్దకు వెళ్ళగోరుచున్నాము.(43)నిజంగా నేను నీముందు చెప్పుచున్నాను. మునుపు నతిని దక్షుడు నాకిచ్చినపుడు (44) సంకల్పవిధితో నేను పాణిగ్రహణము చేయలేదు. ఇపుడే నేను కర్మ విస్తరమును మిగులచేయవలెను (45) పాణిగ్రహాణోచితమైన కార్యమును నేనెరుగును అని శివుడనగా నవ్వి మధుసూదనుడు మాట్లడబోవునంతలో బ్రహ్మ ఇంద్రునితో ఇతర లోకపాలకులతో కలిసి ఆచటికి వచ్చెను. (46,47)

తథైవ దేవా సురయక్షదానవా నాగా : పతంగాప్సరసో మహర్షయ: సమేత్య సర్వే పరివక్తుమీశమూచుస్తదానీం శిరసా ప్రణమ్య||48

గచ్ఛ గచ్ఛ మహాదేవ అస్మాభి : సహిత ప్రభో తతో విష్ణురువాచేదం ప్రస్తావసదృశం వచ:||49

గృహ్యోక్తవిధినా శంభో కర్మ కర్తుమిహార్హసి || నాందీముఖం మండమస్థాపనం తథా చైతత్కురు ధర్మేణ యుక్తమ్‌| మహానదీసంగమం వర్జయిత్వా కుర్వంతి కేచిద్వేదమనీషిణశ్చ||51

మండవస్థాపనం చైవ క్రియతాం హ్యధునా విభో| తథోక్తా శంభుశ్చకారాత్మహితాయవై||52

బ్రహ్మాదభి: కృతం తేన సర్వమభ్యుదయోచితమ్‌ | గ్రహాణాం పూజనం చక్రే కశ్యపో బ్రహ్మణా యుత:||53

తథాZత్రిశ్చ వరిష్టశ్చ గౌతమోZథ గురుర్భృగు : | కణ్వో బృహస్పతి శక్తిర్జమదగ్ని: పరాశర:||54

మార్కండేయ: శిలావాక శూన్యపాలోZక్షతశ్రమ:| అగస్త్యశ్చ్య వనో గర్గ : శిలాదోZథ మహాముని :||55

ఏతే చాన్యే చ బహవో హ్యాగతా: శివసన్నిధౌ| బ్రహ్మణా నోదితాస్తత్ర చక్రుస్తే విధివత్ర్కియామ్‌||56

అట్లే దేవాసురయక్షదానవులు నాగులు పతంగగణాలు అప్సరసలు,మహర్షులు అందరూ కలిసి వచ్చి తలవంచి నమస్కరించి ఈశ్వరునితో అనిరి (48) ప్రభూ! మహాదేవా!మాతో కలిసి నీవు బయలుదేరుము అనగా విష్ణువు ప్రస్తావము వలె ఇట్లు మాట్లాడెను.(49) శంకరా నీవు గృహ్యోక్తవిధితో నాంధీముఖము మొదలైన కర్మల చేయవలెను (50) నాందీముఖము మరియు మండవ స్థాపనమునుధర్మయుక్తమూ చేయుము. వేదజ్ఞానముగలవారు మహానది సంగమాన్న విడిచి ఇతరస్థలములలో దీనిని చేయేదురు. (51)ఇప్పుడు మండప స్థాపనమునుచేయుము. అనగా శివుడు ఆత్మహితమునకై అట్లే చేసెను (52) శంకరుడు బ్రహ్మ మొదలగు వారితో కలిసి అభ్యుదయానికి ఉచితమైనదంతా చేసెను. బ్రహ్మతో కూడి కశ్యపుడు గ్రహముల పూజించెను.(53)అట్లే అత్రి శ్రేష్ఠుడగు గౌతముడు, గురువగు భృగువు, కణ్యుడు, బృహస్పతి,శక్తి , జమదగ్ని, పరాశరుడు (54) మార్కండేయుడు,శిలావాకుడు, అక్షతశ్రముడగు శూన్యపాలుడు,అగస్త్యుడు, చ్యవనుడు, గర్గుడు, మహామునియగు శిలాదుడు(55) మరియు ఇతర ఋషులనేకులు శివుని వద్దకు వచ్చి బ్రహ్మ చేత ప్రేరితులై విధిపూర్వకముగా చేయవలసినదానిని చేసిరి.(56)

వేదోక్తవిధినా సర్వే వేదవేదాంగపారగా:| చక్రూ రక్షాం మహేశస్య కృతకౌతుకమంగళామ్‌||57

ఋగ్యజ: సామసహితై: సూక్తైర్నానావిధైస్తథా | మంగళాని చ భూరీణీ ఋషయస్తత్త్వవేదిన:|| 58

అభ్యంజనాదికం సర్వం చక్రుస్తస్య పరాత్మన: ఖ్యాత: కపర్దస్తసై#్యవ శివస్య పరమాత్మన:||59

అనేకైరౌక్మిర్యుక్తా ముండమాలాzభవత్తదా | యే సర్పా హ్యంగభూతాశ్చ తే సర్వే తత్ష్కణాదివ| బభూవుర్మండనాన్యేవ జాతరూపమయాని చ ||60

సర్వభూషణసంపన్నో దేవదేవో మహేశ్వర: | య¸° దేవై: పరివృత: శైలరాజపురం ప్రతి||61

చండికా వరభగినీ తదా జాతా భయావహా | ప్రేతాసనా గతా చండీ సర్పాభరణభూషితా ||62

హైమం కలశమాదాయ పూర్ణం మూర్నా మహాప్రభా| పరివారైర్మహాచండీ దీప్తాస్యా హ్యుగ్రలోచనా||63

తత్ర భూతాన్యనేకాని విరూపాణి సహస్రశ: | తై: సమేతాగ్రతశ్చండీ జగామ వికృతాననా||64

వేదవేదాంగపరాగులైన వారంతా కౌతుకమంగళమును నిర్వర్తించి మహేశ్వరునికి రక్షను చేసిరి.(57)తత్త్వవేత్తలగు ఋషులు ఋగ్యజుస్సామములతో కూడిన వివిధ సూక్తములతో పెక్కు మంగళములు చేసిరి.(58) పరమాత్మయగు శివునికి అభ్యంజనము మొదలైనవన్నీ ఆచరించిరి. అతని జటాజూటము ప్రసిద్దిమాయెను (59) అపుడు ముండమాల అనేక ముత్యములతో కూడినదాయెను. అంగభూతములైన సర్పములన్నియూ అదేక్షణము బంగారు అభరణములాయెను.(60) దేవదేవుడగు మహేశుడు అన్నిభూషణములనలకరించుకొని దేవతలు వెంటరాగా హిమాలయుని వద్దకు వెళ్లెను. (61) వరుని సహోదరియగు చండిక అపుడు భయముకలిగించునట్లు వుండెను. చండి ప్రేతమును అసనముగా చేసికొని పాములే ఆభరణములుగా ధరించి యుండెను.(62) గొప్పకాంతిగల చండి బంగారు పూర్ణకలశాన్ని తల పై నుంచుకొని జ్వలించుముఖముతో, ఉగ్రమగు కళ్ళతో పరివారముతో కలిసి యుండెను(63) అక్కడ వున్న వేలకొలది భూతగణములు విరూపములుగలవిగా నున్నవి. వానితో కూడిన చండి వాని ఎదుట వికృతమైన ముఖముతో నడిచెను.(64)

తస్యా: సర్వే పృష్టతశ్చ గాణా: పరమదారుణా: | కోట్యేకాదశసంఖ్యాకా రౌద్రా రుద్రప్రియాశ్చ యే||65

తదా డమరునిర్ఘోపవ్యాప్తమాసీజ్జగత్త్రయమ్‌ | భేరీభాంకారశ##బ్దేన శంఖానాం నినదేన చ|| 66

తదా దుందుభినిర్ఠోషై శబ్ద: కోలాహలోzభవత్‌ గణానాం పృష్టతో భూత్వా సర్వే దేవా: సముత్సుకా:|| అన్వయు: సర్వసిద్దాశ్చ లోకపాలైస్సమన్వితా:| 67

మధ్యే వ్రజన్మ హేంద్రోzథ ఐరావతముపాస్థిత: | శుభ్రేణోచ్చ్రియమాణన ఛత్రేణ పరమేణ హి||68

చామరైర్వీజ్యమానోzసౌ సురైర్బహుభిరావృత:| తదా తు వ్రజమానాస్త ఋషయో బహవో హ్యమీ||69

భరద్వాజాదయో విప్రా: శివస్యోద్వహనం ప్రతి | శాకిన్యో యాతుధానాశ్చ వేతాళా బ్రహ్మరాక్షసా:||70

భూతప్రేతపిశాచాశ్చ తథాన్యే ప్రమాధాదయ:| పృచ్చమానాస్తదా చండీం పృష్టతోzవగమంస్తదా||71

ఆ చండికి వెనుక పరమదారుణమగు రుద్రగణములు పదకొండు కోట్లు నడిచినవి.(65)అపుడు ముల్లోకములు డమురుధ్వనితో, భేరీ భాంకార శబ్దముతో ,శంఖముల నినాదముతో నిండెను (66) అట్లే దుంధుభి ద్వని యొక్క శబ్దముతో కోలాహలమేర్పడెను. దేవతలందరు ఉత్సుకతగలవారై సిద్దులు, లోకపాలురతో గూడి గణముల ననుసరించిరి.(67)మహేంద్రుడు ఐరావతమునెక్కి మధ్యలో వెళ్ళుచుండెను అతనికి శ్రేష్టమగు ఛత్రమును పట్టరి.(68) చామరములతో వీచుచుండిరి.అట్టి మహేంద్రుడు దేవతలులనేకులు వెంట రాగా వెళ్ళుచుండెను. అపుడు వెంట వెళ్ళుచున్న అనేకమంది ఋషులు (69) భరద్వాజుడు మొదలైన విప్రులు ,శాకినిలు, యాతుధానులు, బేతాళ, బ్రహ్మరాక్షసులు, (70) భూత ప్రేత పిశాచములుమరియు ఇతర ప్రమధులు మొదలగు గణములు చండిని శివుని వివాహము గూర్చి ప్రశ్నించ గోరి వెంటనడిచిరి.(71)

క్వ గతా సాzధునా చండీ ధావమానాస్తదా భృశమ్‌ | ప్రాప్తా గతా వ్రజంతీం తాం ప్రణిపత్య మహాప్రభామ్‌||72

అథ ప్రోచుస్తదా సర్వే చండీం భైరవసంయుతామ్‌ | వినాస్మాభి: కుతో యాసి వద చండి యథా తథా||73

ప్రవాస్యోవాచ సా చండీ భూతానాం తత్ర శృణ్వతామ్‌ | శంభోరుద్వహనార్థాయ ప్రేతారూఢా వ్రజామ్యహమ్‌||74

హైమం కలశమాదాయ శిరసా బిభ్రతీ స్వయమ్‌| కరవాలీస్వరూపేణ చండీ జాతా తత: స్వయమ్‌||75

భూతై: పరివృతా సర్వైః సర్వేషామగ్రతోzవ్రజత్‌ | గణాస్తామనుజగ్ముస్తే గణానాం పృష్ఠత: సురా:||76

ఇంద్రాదయో లోకపాలా: ఋషయస్తేzగ్ర పృష్ఠత: | ఋషీణాం పృష్ఠతో భూత్వా పార్షదాశ్చ మహాప్రభా :||77

విష్ణోరమితభావజ్ఞా ముకుందాచ్చ మనోరమా:| సర్వే పయోదసంకాశా: స్రగ్విణో వనమాలిన:|| శ్రీవత్సాంకధరా: సర్వే పీతవాసోన్వితాశ్చతే || 78

చతుర్భుజా: కుండలిన: కిరీటకటకాంగదై: హారనూపురసూత్రైశ్చ కటిసూత్రాంగుళీయకై:| శోభితాస్సర్వ ఏవైతే మహాపురుషలక్షణా:79

చండి ఎక్కడకు వెళ్ళినది? అని వారుపరుగెత్తుతూ చూచి ఆమెను సమీపించి నమస్కరించి ఇట్లడిగిరి.(72) మేము లేకుండా ఎక్కడకు వెళ్ళుచున్నావు: వున్నదున్నట్లుగా చెప్పుము అని వారు భైరవునితో కూడినున్న చండిని ఆడుగగా (73) ఆమె నవ్వి భూతములన్నీ వినుచుండగా ఇట్లనెను శివుని పెళ్ళికై నేను శవాన్నెక్కి వెళ్లుచున్నాను. అని(74) అపుడు చండి శిరస్సుపై స్వయముగా బంగారు కలశాన్ని మోయుచూ కరవాలి స్వరూపముతో నుండెను (75) అన్ని భూతగణములతో కలిసి వారి ముందు నడిచెను. గణములన్నీ చండిని అనుసరించగా దేవతలు గణముల ననుసరించిరి.(76) ఇంద్రాది లోకపాలకులు మరియు ఋషులు వారి ముందుండిరి పార్షదులు ఋషులు వెంటనడిచిరి (77)వారు విష్ణువు యొక్క భావమును తెలిసినవారు ముకుందుని కంటే మనోరమముగా నున్న వారు. వారందరూ మేఘచ్చాయగలిగి, వనమాలను, పూదండను ధరించి, శ్రీవత్సమను చిహ్నమును ధరించి, పీతాంబరముల ధరించి యుండిరి(78) చతుర్భుజులు, కుండలముల ధరించినవారు ,కిరీట, కటక, అంగదములు, హార,నూపుర, సూత్ర, కటిసూత్ర, అంగుళీయకముల ధరించి ప్రకాశిస్తున్న వారంతా మహాపురుష లక్షణములను కలిగివుండిరి.(79) తేషాం మధ్యే గతో విష్ణు: శ్రియోపేత: సురారిహా|| బభౌ త్రిలోకీకృతవిశ్వమంగళో మహానుభావైర్హృది కృత్య ధిష్ఠిత:| శివేన సాకం పరమార్థదస్తదా హరి: పరాత్మా జగదేకబంధు!|| 81

స తారక్ష్యపుత్రోపరి సంస్థితో మహాన్‌ లక్ష్మ్యా సమేతో భువనైకభర్తా| స చామరైర్వీజ్యమానో మునీంద్రై: సర్వైస్సమేతో హరిరీశ్వరో మహాన్‌ ||82

తధా విరించిర్నిజవాహనస్థో వేదై: సమేత: సహ షడ్భిరంగై:

తథాగమైస్సేతిహాసైః పురాణౖ: స సంవృతో హేమగర్బో బభూవ||83

వేధో హరిభ్యాం చ తథా సురేంద్రై: సమావృతశ్చర్షిభి: సంపరీత:|

వృషారూఢో వృషకేతుర్ధురాపో యోగీశ్వరైరపి సర్వైరగమ్య: 84

శుద్దస్ఫటికసంకాశం వృషభం ధర్మవత్సలం| సమేతో మాతృభిశ్చైవ గోభిశ్చ కృతలక్షణమ్‌||

ఏభిస్సమేతోzసురదానవై: సహ య¸° మహేశో విబుధైరలంకృత:| 85

హిమాలయం గిరివర్యం తదానీం పాణిగ్రహార్థం ప్రమదోత్తమాయా:|| 86

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే

శ్రీ శివస్య వివాహవర్ణనం నామ త్రయోవింశోzధ్యాయ:||

అసురులదునుమాడు విష్ణువు లక్ష్మీదేవితో వారి మధ్యనే వుండి నడిచెను. (80) అపుడు ముల్లోకములతో కూడిన విశ్వమునకు మంగళమును కూర్చువాడు మహాత్ములచే హృదయము నందు అధిష్ఠింపజేయబడినవాడు, జగదేకబంధువగు హరి శివునితో కలిసి నడిచెను.(81) అతను గరుడునిపై కూర్చుని లక్ష్మీదేవితోకూడియుండెను. మునీశ్వరులందరితో నున్న విష్ణువును చామరములతో వీచుచుండిరి.(82) అట్లే బ్రహ్మ తన వాహనమునెక్కి వేదవేదాంగములతో , ఇతిహాస, ఆగమ, పురాణాదులతో కూడియుండెను(83) బ్రహ్మ , విష్ణువు, దేవతలు, ఋషులు మున్నగువారు యోగీశ్వరులు వూడా పొందలేని వృషభవాహనుని శివుని వెంటనుండిరి.(84) అపుడు శుద్దస్ఫటికమువంటి వాడు, ధర్మమును పాలించు ధర్మప్రియుడు అగు శివుడు, వీరందరితో గూడి పార్వతి పాణిగ్రహణానికై హిమాలయమను పర్వతరాజు వద్దకు వెళ్ళెను(85.86)

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున

కేదారఖండమందు పరమశివుని వివాహవర్థనము అను ఇరవై మూడవ అధ్యాయము

చతుర్వింశోzధ్యాయ:

లోమశ ఉవాచ:

తథైవ సర్వం పరమా ముదాన్విత ! శ్చక్రే గిరీంద్ర: స్వసుతార్థేవ| 1

గర్గం పురస్కృత్య మహానుభావో | మంగళ్యభూమిం పరయా విభూత్య||

ఆహుయ విశ్వకర్మాణం కారమాయాస పాదరమ్‌ | మండపం చ సువిస్తీర్ణం వేదికాభిర్మనోరమమ్‌||2

ఆయుతేనైన విస్తారం యోజనానాం ద్విజోత్తమా:| యండపం చ గుణపితం నానాశ్చర్యసమన్వితమ్‌||3

స్థావరం జంగమం చైవ సదృశం చ మనోహరమ్‌ | జంగమం చ జితం తత్ర స్థావరేణ తథైవ చ||4

జంగమేన చ తత్రైవ జితం స్థాపరమేవ చ | పయసా చ జితా తత్ర స్థలభూమిరభూత్తదా||5

జలం కింసు స్థలం తత్ర న విదుస్తత్త్వతో జనా: క్వచిత్సింహా: క్వచిద్దంసా: సారసాశ్చ మహాప్రభా:||6

క్వచిచ్ఛిఖండినస్తత్ర కృత్రిమా: సుమనోహరా! | తథా నాగా: కృత్రిమాశ్చ హయాశ్చైవ తథా మృగా:||7

కే సత్యా: కే అసత్యాశ్చ సంస్కృతా విశ్వకర్మణా | తథైవ చైవం విధినా ద్వారపా అద్బుతా: కృతా:||8

ఇరవైనాలుగవ అధ్యాయము

లోమశుడనెను

మహాత్ముడైన గిరీంద్రుడు తన కూతురికొరకు మిక్కిలి సంతోషముతో అట్లే మాంగళ్యభూమిని గోప్ప ఐశ్వర్యముతో గర్గుని మొదలిడుకొనిచేసెను.(1) సాదరముగా విశ్వకర్మనాహ్వానించి విశాలమైన, వేదికలతో మనోహరముగా నున్న మండపమును నిర్మింపజేసెను. ఆ మండపము పదివేల యోజనముల విస్తీర్ణము గలిగి అన్ని గుణములు గలిగి అనేక ఆశ్చర్యములు గలదాయెను.(3) అక్కడ స్థావరము, సంగమమూ సమానముగా మనోహరముగా నుండెను - స్థావరము, జంగమములు ఒకదానినొకటి మించినట్లుండెను. (4) స్థలభూమి నీటిచే జయింపబడి నట్లుండెను. (5) జనులు అది జలమా లేకస్థలమా అని తెలియకుండిరి. ఒక చోట సింహాలు ఒకచోట హంసలు ఒకచో సారసములను పక్షులు కాంతివంతములై నుండెను.(6) ఒకచో కృత్రిమమైన సుందర మయూరులు, ఏనుగులు, గుర్రములు, లేళ్ళు చేయబడియుండెను. (7) ఏవి సత్యమో ఏవి ఆసత్యమో తెలియనట్టుగా విశ్వకర్మ చక్కగా చేసియుండెను అదే విధముగా అద్బుతమైన ద్వారము చేయబడును.(8)

పుంసో ధనూంషి చోత్కృష్య స్థావరా జంగమోపమా: తథాశ్వ: సాదిభిశ్చైవ గజాశ్చ గజసాదిభి:|| 9

చామరరైర్వీజ్యమానాశ్చ కేచిత్పుష్పాంకురాన్వితా: | కేచిచ్చ పురుషాసత్ర విరేజ: స్రగ్విణస్తథా|| 10

కృత్రిమాశ్చ తథా బహ్వ్య: పతాకా: ద్వారి స్థితా మహాలక్ష్మీ : క్షీరోదముద్భవా||11

గజా: స్వలంకృతా హ్యాసన్‌ కృత్రిమా హ్యకృతోపమా: తథాశ్వా: సాదిభిశ్చైవ గజాశ్చ గజసాదిభి:||12

రథా రథియుతా హ్యాసన్‌ కృత్రిమా హ్యకృతోపమా:| సర్వేషాం మోహనార్ధాయ తథా చ సంసద: కృతా:||13

మహాద్వారి స్థితో నందీ కృతస్తేన హి మండపే | శుద్దస్ఫటికసంకాశో యథా నందీ తథైవ స:||14

తస్యోపరి మహద్దివ్యం పుష్పకం రత్నభూషితమ్‌ | రాజితం పల్లవచ్చత్రైశ్చామరైశ్చ సుశోభితమ్‌|| 15

ధనుస్సులను ఎక్కుబెట్టియున్న పురుషులు నిలిచియున్ననూ కదులుచున్నవారి వలె యుండిరి. (చలనము లేకున్ననూ చలనమున్నట్లుండెను) అట్లే అశ్వకాండ్రతో అశ్వములు, మావటిలతో ఏనుగులూ కనబడెను.(9) అక్కడ కొందరు పురుషులు చామరములతో వీచబడుతూ కనబడిరి. కొందరు పుష్పాంకురములు గలిగి మరికొందరు పూమాలలధరించి వెలుగుచుండిరి.(10)అట్లే పెక్కు కృత్రిమ పతాకములు నిర్మింపబడెను. క్షీరసముద్రమునుండి వెలువడిన మహాలక్ష్మి ద్వారమువద్ద నిలుచుండెను.(11)కృత్రిమములైననూ సహజములుగా నున్న గజములుమావటి లతోచ అశ్వములు అశ్వికులతో అలంకరింపబడియుండెను.(12)కృత్రిమముగా నిర్మితమైననూ సహజముగా కనబడు రథములు రథికులతో అలంకరింపబడియుండెను. అందరినీమోహింపజేయుటకు సభలు చేయబడెను(13) విశ్వకర్మ మండపము నందు మహాద్వారము వద్ద నందిని తయారుజేసేను. శుద్దస్పటికమువలె ప్రకాశించు ఆ నంది నందివలె ప్రకాశించుచుండెను.(14) దాని పై రత్నములతో అలంకరించిన గొప్ప దివ్యమగు పుష్పకము పల్లవఛత్రములతో , చామరములతో అలరారుచుండెను.(15)

వామపార్శ్వే గజా ద్వౌ చ శుద్దకాశ్మీరసన్నిభౌ| చతుర్దంతౌ పష్టివర్షౌ మహాత్మానౌ మహాప్రభౌ||16

తథైవ దక్షిణ పార్శ్వే ద్వావశ్వౌ దంశితా కృతౌ| రత్నాలంకారసంయుక్తా న్లోకపాలాంస్తథైవ చ||17

షోడశప్రకృతీస్తేన యాథాతథ్యేన ధీమతా | సర్వే దేవా యథార్థేన కృతా వై విశ్వకర్మణా||18

తథైవ ఋషయస్సర్వే భృగ్వాద్యాశ్చ తపోధనా: విశ్చే చ పార్షదై: సాకమింద్రో హి పరమార్ధత:||19

కృతా: సర్వే మహాత్మానో యాథాతథ్యేన ధీమతా | ఏవంభూత: కృతస్తేన మండపో దివ్యరూపవాన్‌ ||20

అనేకాశ్చర్యసంభూతో దివ్యో దివ్యవిమోహన ! ఏతస్మిన్నంతరే తత్ర ఆగతో నారదోzగ్రత:||21

బ్రహ్మణా నోదితస్తత్ర హిమాలయగృహం ప్రతి | నారదోథ దదర్శాగ్రే ఆత్మానం వినయాన్వితమ్‌||22

భ్రాంతో హి నారదస్తేన కృత్రిమేణ మహాయశా:| అవలోకపరస్తత్ర చరితం విశ్వకర్మణ:||23

ప్రవిష్టో మండపం తస్య హిమాద్రే : రత్నచిత్రితమ్‌| సువర్ణకలశైర్జుష్టం రంభాద్యైరుపశోభితమ్‌||24

సహస్రస్తంభసంయుక్తం తతోzద్రి: స్వగణౖర్వృత:|తమృషిం పూజయామాస కిం కార్యమితి పృష్టవాన్‌ ||25

ఎడమప్రక్క శుద్దకాశ్మీరము వంటి ఏనుగులు రెండు, నాలుగు దంతములుగలవి, అరవైఏళ్ళ వయసు గలవి. గొప్పకాంతిగలవిగా ప్రకాశించుచుండెను (16) అట్టే కుడివైపున రెండు గుర్రములు వుండెను.రత్నలంకారములతో గూడిన లోకపాలురుండెను (17) బుద్దిమంతుడగు విశ్వకర్మ షోడశ ప్రకృతులను, దేవతలనందరినీ ఏర్పరచెను (18) అదే విధముగా తపోధనులను భృగు మొదలైన ఋషులనందరినీ, విశ్వేదేవతలను, సభ్యులతో కూడిన ఇంద్రుడిని యథార్థమాఅన్నట్లు విశ్వకర్మ నిర్మించెను (19) ఈ విధమైన దివ్యరూపములుగల మండపమును విశ్వకర్మ నిర్మించెను.(20)ఆ మండపము అనేక ఆశ్చర్యములతో కూడుకొనినది, దివ్యమైనది. దేవతలనూ మోహపరచునదిగా నుండెను అంతలో అక్కడికి దేవర్షియగు నారదుడు వచ్చును. (21) బ్రహ్మ పంపగా హిమాలయుని వద్దకు వచ్చిన నారదుడు ఎదుట వినయముతో కూడినట్లున్న తనను చూచి(22) ఆ కృతిమమైన దానివలన భ్రమను పొందెను విశ్వకర్మ నిర్మించిన దానిని చూడసాగెను.(23)నారదుడు

హిమవంతునిదైన రత్నఖచితమండపమును ప్రవేశించెను అది సువర్ణకలశములతో, రంభాదులతో వేయి స్తంభములతో అలరారుచుండెను (24) అంతలో తన గణములతో నున్న హిమవంతుడునారద మహర్షిని చూచి పూజించి, ఏమి పని యని ప్రశ్నించెను(25)

నారద ఉవాచ:

ఆగతాస్తే మహాత్మానో దేవా ఇంద్రపురోగమా: తథా మహర్షయస్సర్వే గణౖశ్చ పరివారితా:|| మహాదేవో వృషారూఢో హ్యాగతోద్వహనం ప్రతి|| 26

తతస్తద్వచనం శ్రుత్వా హిమవాన్గిరిసత్తమ: ఉవాచ నారదం వాక్యం ప్రశస్తమదురం మహత్‌||27

పూజాయిత్వా యథా న్యాయం గచ్చ త్వం శంకరం ప్రతి||28

తతస్తద్వచనం శ్రుత్వా మునిర్హిమవతో గిరే: తథైవ మత్వా శైలరాజానమబ్రవీత్‌ || మైనాకేన చ సహ్యేన మేరుణా గిరిణా సహ||| 29

ఏభిస్సమేతో హ్యధునా మహామతే యతస్వ శీఘ్రం శివమత్ర చానయ| దేవైస్సమేతం చ మహర్షివర్యై: సురాసురైరర్చితపాదపంకజమ్‌|| 30

తథేతి మత్వా స జగామ తూర్ణం సహైన తై: సర్వతరాజభిశ్చ| త్వరాగతశ్చైక పదేన శంభుం ప్రాప్నోదృషీణాం ప్రవరో మహాత్మా||31

తావద్‌దృష్టో మహాదేవో దేవైశ్చ పరివారిత: | తదా బ్రహ్మా చ విష్ణుశ్చ రుద్రశ్చైవ సురై: సహ||32

పప్రచ్ఛుర్నారదం సర్వే యేzన్యే రుద్రచరా భృశమ్‌ | కథ్యతాం పృచ్ఛమానానామస్మాకం కథ్యతే న హి||33

నారదుడు పలికెను ఇంద్రుడు మొదలైన దేవతలు, తమ గణములతో మహర్షులు, వృషభవాహనుడైన మహాదేవుడు వివాహమును గూర్చివచ్చిరి(26) అనగా విని పర్వతరాజుగు హిమవంతుడు యథావిధిగా అతని పూజించి ప్రశస్తముగా,మధురముగా నుండునట్లు నారదునితో ఇట్లనెను (27) నీవు శివుని వద్దకు వెళ్ళుము (28) అనగా ఆ మాటను విని నారదముని అట్లే అని తలచి హిమవంతునితో ఇట్లనెను . మైనాక,సహ్యమేరు పర్వతములతో కూడి నీవు ఇపుడు ప్రయత్నించి దేవతలతోగొప్ప మహర్షులతో కూడి వుండినవానిని సురాసురులతో అర్చింబడిన పాదపద్మము గల శివుని తీసుకొనిరమ్ము.(30) అనగా హిమవంతుడు అట్లేనని పర్వతరాజులతో కలిసి త్వరగా శివుని వద్దకు వచ్చును. (31)అపుడు మహాదేవుడు ఇతర దేవతలతో కూడియుండెను. బ్రహ్మ,విష్ణువు , రుద్రుడు మిగతా దేవతలతో కలిసి (32) నారదమునిని వివాహవిషయమున ప్రశ్నించిరి. ప్రశ్నించుచున్న మాకు తెలియజేయుము అని వారడిగిరి (33)ఏకైకస్యాత్మజా: స్వా: స్వా: సహ్యమైనాకమేరవ: | కన్యాందాస్యంతి వా శంభో : కిం త్విదానీం ప్రవర్తే||34

తతోzవోచన్మహాతేజా నారదశ్చర్షిసత్తమ:| బ్రహ్మాణం పురత: కృత్వా విష్ణుం ప్రతి సహేతుకమ్‌||35

ఏకాంతమాశ్రిత్య తదా సురేంద్రం స నారదో వాక్యమిదం బభాషే| త్వష్ట్రా కృతం తస్య మహాత్మనస్త్యయా కిం విస్మృతం తత్సకలం శచీపతే||36

పురాకృతం తస్య మహాత్మనస్త్యయా కిం విస్మృతం తత్సకలం శచీపతే| తస్మాదసౌ త్వాం విజిగీషుకామో గృహే వసంస్తస్య గిరేర్మహాత్మన:|| 37

అహో విమోహితస్తేన ప్రతిరూపేణ భాస్వతా | తథా విష్ణు: కృతస్తేన శంఖచక్రగదాదిభృత్‌||38

బ్రహ్మా చైవతథాభూతస్తం చైవ కృతవానసౌ||39

మాయామయో వృషభ##స్తేన వేషాత్కృతో హి నాగోzశ్వతరస్తథైవ |తథా చాన్యాన్యప్యనేనామరేంద్ర సర్వాణ్యవోల్లిఖితాన్యత్ర విద్ది||40

తచ్ఛృత్వా వచనం తస్య దేవేంద్రో వాక్యమబ్రవీత్‌ ||41

విష్ణుం ప్రతి తదా శీఘ్రం దృష్ట్యా యామి వసాత్ర భో: పుత్రశోకేన తప్తోzసౌ వ్యాజేనాన్యేనవాzకరోత్‌ ||42

సహ్య మైనాక మేరుపర్వతములు తమ తమ పుత్రికలనిచ్చెదరా ఏమి? శంకరా! ఇపుడేమి జరుగుచున్నది?(34) అనగా మహాతేజస్కుడగు నారదుడు బ్రహ్మను ముందిడుకొని విష్ణువుతో హేతుయుక్తంగా పలికెను. (35) అట్లే ఏకాంతమునదేవేంద్రునితో ఇట్లనెను త్వష్ట మహత్తరమైన భవనమునునిర్మించగా మేమంతా దానిచే మోహితుల మైతిమి(36) శచీపతీ! పూర్వమతను నీకు చేసిన దానిని మరిచితివా? ఈ త్వష్ట గిరిరాజు ఇంట నివసించుచూ నిన్ను జయింపగోరుచున్నాడు(37) అహా! ప్రకాశవంతమగు ప్రతిరూపముచేత విమోహితుడనైతిని.అట్లే త్వష్ట, శంఖము చక్రము గద మొదలగువానిని ధరించిన విష్ణువును నిర్మించెను.(38) అదే విధంగా అతను బ్రహ్మను కూడా నిర్మించెను(39) త్వష్టమాయామయమగు వృషభమును , ఏనుగును, అశ్వతరమును నిర్మించెను. అదేవిధంగా ఇతరమైనవనేకము అతని చేత చిత్రింపబడినవని తెలుసుకొనుము (40) అని నారదుడు తెలియజేయగా విని దేవేంద్రుడు ఇట్లు పలికెను (41) త్వరగా నేను విష్ణువు వద్దకు వెళ్ళి చూచివచ్చెదను నీవిక్కడనే వుండుము. పుత్ర శోకముతో తపించుచున్న విష్ణువే వేరొక మిషతో ఇట్లు చేసియుండవచ్చును.(42)

తదా శివోzపి మహాత్మా పంచబాణన మోహిత: | మహాభూతేన భూతేశస్త్వన్యేషాం చైవ కా కథా||52

ఏవం చవిద్యమానేzసౌ శంభు: పరమశోభన: కృతో హ్యనంగేన వశే యథాన్య: ప్రాకృతో జన:||53

మదనో హిబలీ లోకే యేన సర్వమిదం జగత్‌ | జితమస్తి నిజప్రాఢ్యా సదేవర్షిసమన్వితమ్‌|| 54

సర్వషామేవ భూతానాం దేవానాం చ విశేషత: రాజా హ్యనంగో బలవాన్యస్య చాజ్ఞా బలీయసీ ||55

పార్వతీ స్త్రీస్వరూపేణ అజేయో భువనత్రయే | తాం దృష్ట్యా హి స్త్రియం సర్వే ఋషయోz;పి విచక్షణా:||56

దేవా మనుష్యా గంధర్వా: పిశాచోరగరాక్షసా:| ఆజ్ఞానుల్లంఘిన : సర్వే మదనస్య మహాత్మన:||57

తపోబలేన మహతా తథా దానబలేన చ| వేత్తుం న శక్యో మదనో వినయేన వినా ద్విజా:||58

తస్మాదనంగస్య మహాన్‌ క్రోథో హి బలవత్తర:| ఈశ్వరం మదనేనైవం మోహితం వీక్ష్య మాధవ:||59

ఉవాచ వాక్యం వాక్యజ్ఞో మా చింతాం కురు వై ప్రభో | యదుక్తం నారదేనైవ మండపం ప్రతి సర్వశ:||60

త్వష్ట్రా కృతం విచిత్రం చ తత్సర్వం మదనాత్ర్పభో : తదానీం శంకరో వాక్యమువాచ మధుసూదనమ్‌ ||61

అపుడు మహాత్ముడు, భూతేశ్వరుడగు శివుడు పంచబాణములుగల మహాభూతమగు మన్మథుని చేతిలో మోహమునొందినపుడు ఇతరుల గూర్చి చెప్పేదేమున్నది? (52) ప్రాకృత జనులవలె పరమశోభనుడగు శివుని కూడా మన్మథుడు వశమునకు తెచ్చుకొనెను (53) మన్మథుడు నిజముగా లోకమున బలవంతుడు. అతనే దేవతలు, ఋషులు, గల ఈ జగత్తునంతా తన శక్తితో జయించెను(54) అన్ని భూతములకు విశేషముగా దేవతలకు రాజు బలవంతుడగు మన్మథుడే, అతని ఆజ్ఞ బలమైనది. (55) ముల్లోకములలో అతను పార్వతి యనుస్త్రీ రూపమున అజేయుడుగా నున్నాడు బుద్దిమంతులగు ఋషులుకూడా ఆమెను చూచి మోహము నొందిరి. (56) దేవతలు, మనుష్యులు,గంధర్వులు, పిశాచులు,సర్పములు, రాక్షసులు అందరూ మదనుని అజ్ఞను ఉల్లఘించలేరు. (57) బ్రాహ్మణులారా! గొప్ప తపోబలముతో దానబలముతో మదనుని తెలియజాలరు వినయముతో మాత్రమే తెలుసుకోగలరు (58) కనుక మన్మథుని క్రోధము మిక్కిలి బలము కలది ఈ విధంగా మదనుడు ఈశ్వరుని మోహపరుచుట చూచి విష్ణువు (59)చింతించవలదు మండపమును గూర్చి నారదుడు చెప్పినది (60) త్వష్ట నిర్మించిన చిత్రవిచిత్ర మండపము అంతా మన్మథుని కార్యమే అనగా శివుడు విష్ణువుతో నిట్లనెను (61)

అవిద్యయా కృతం తేన కృతం త్వష్ట్రా హి మండవమ్‌ కిం తు వక్ష్యామహే విష్ణో మండపః కేవలేన హి||62

వివాహో హి మహాభాగ అవిద్యా మూల ఏవ చ తస్మాత్సర్వే వయం యామ ఉద్వహార్దం చ సంప్రతి||63

నారదం చ పురస్కృత్య సర్వే దేవా: సవాసవా :హిమాద్రి సహితా జగ్ముర్మన్దిరం పరమాద్భుతమ్‌ -||అనేకాశ్చర్యసంయుక్తం విచిత్రం విశ్వకర్మణా||64

కృతం చ తేనాద్య పవిత్రముత్తమం తం యజ్ఞవాటం బహుభి: పురస్కృతమ్‌ | విచిత్రచిత్రం మనసో హరం చ తం యజ్ఞవాటం స చకార బుద్దిమాన్‌||65

ప్రవేక్ష్యమాణాస్తే సర్వే సురేంద్రా ఋషిభి: సహ దృష్ట్యా హిమాద్రిణా తత్ర అభ్యుత్థానగతో zభవత్‌||66

తథైవ తేషాం చ మనోహరాణి హర్మ్యాణి తేన పరికల్పితాని|

గంధర్వయక్షా: ప్రమథాశ్చ సిద్దాం దేవాశ్చ నాగాప్సరసాం గణాశ్చ||

వసంతి యత్రైవ సుఖేన తేభ్య: స త త్ర తత్రోపవనం చకార|| 67

తేషామర్దే మహార్హాణి ధారాజిరగృహాణి చ | అత్యద్బుతాని శోభంతే కృతాన్యేవ మహాత్మనా||68

నివాసార్దే కల్పితాని సావకాశాని తత్ర వై| దేవానాం చైవ సర్వేషామృషీణాం భావితాత్మనామ్‌||69

మహావిష్ణూ త్వష్ట అవిద్య చేత అవరించిన అటువంటి మండపమును నిర్మించెను అది కేవలమండపము(62) మహాత్మా! వివాహమునకు మూలము అవిద్యయే ఇక మనమంతా వివాహమును గూర్చి వెళ్ళెదము(63) ఆ తరువాత ఇంద్రుడు మొదలైన దేవతలు నారదుని ముందుంచుకొని హిమవంతునితో కలిసి ఆ పరమాద్భుతము అనేక ఆశ్చర్యములతో కూడినది, విశ్వకర్మచే నిర్మించబడినది అగు మందిరమునకు వెళ్ళిరి (64) పవిత్రమై, ఉత్తమమై అనేక ఆశ్చర్యములతో కూడినది,మనోహరమైనదగు యజ్ఞవాటికను విశ్వకర్మ నిర్మించగా (65) ఋషులతో కూడి దేవతలు ప్రవేశించబోవుచుండగా హిమవంతుడు చూచి వారికి ఎదురేగెను(66) అట్లే వారికై అందమైన భవనములు నిర్మించబడెను గంధర్వులు, యక్షులు, ప్రమథులు, దేవతలు,, నాగులు అప్సరసల గణములు ఎక్కడ సుఖముగా నివసించునో అటువంటి ఉపవనమును అచటచ నిర్మించెను.(67) వారికోసమే గొప్ప ధారా గృహములు, అత్యద్భుతముగా రాజిల్లునవి చేయబడెను.(68) దేవతలు మరియు మహాత్ములగు ఋషులకొరకు నివాసమునకై విశాలభవనములుల నిర్మించబడెను.(69)

ఏవం విస్తారయామాస విశ్వకర్మా బహ్యూన్యపి| మందిరాణి యథాయోగ్యం యత్ర తత్రైవ తిష్ఠతామ్‌||70

భైరవా: క్షేత్రపాలాశ్చ యేన్యే చ క్షేత్రవాసిన:| శ్మశానవాసినశ్చాన్యే యేన్యే న్యగ్రోధవాసిన:||71

అశ్వత్థసేవినశ్చాన్యే ఖేచరాశ్చ తథా పరే | యే యే యత్రోపవిష్టాశ్చ తత్ర తత్రైవ తేన వై||72

కృతాని చ మనోజ్ఞాని భవనాని మహాంతి వై| తేషామేవానుకూలాని భూతానాం విశ్వకర్మణా||73

తత్రైవ తే సర్వగణౖ: సమేతా నివాసితాస్తేన హిమాద్రిణా స్వయమ్‌|

సేంద్రా: సురా యక్షపిశాచరాక్షసాం గంధర్వవిద్యాప్సరసాం సమూహా:||74

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే

పార్వతీ పరిణయనే హిమాద్రిణా దేవానాం నివాసస్థానకరణవర్ణనం నామ చతుర్వింశోధ్యాయ:

ఈ విధంగా విశ్వకర్మ అక్కడ వుండువారికి యోగ్యమగునట్లు పెక్క భవనములను విస్తరింపజేసెను.(70) భైరవులు, క్షేత్రపాలులు మరియు క్షేత్రవాసులు, స్మశానవాసులు, మర్రి, రావి మొదలగు చెట్ల పై నివసించువారు(71) ఆకాశమున చరించువారు ఎక్కడెక్కడ వుందురో అక్కడక్కడ వారి కొందరు.(72) మనోహరములైన భవనములను విశ్వకర్మ నిర్మింపజేసెను. ఆ భూతములన్నింటికి అనుకూలముగా నుండునట్లు విశ్వకర్మ వానిని నిర్మించెను.(73) ఇంద్రునితో సహా దేవతలు, యక్షులు, పిశాచులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసలగణములన్ని సురగణములతో సహా నివసించునట్లు హిమవంతుడే స్వయంగా చేసెను.(74)

ఇది శ్రీస్కాందమహాపురాణమున మాహేశ్వరఖండముందలి కేదారఖండమున పార్వతి పరిణయమున హిమవంతుడు దేవతలకు నివాసస్థానముల నేర్పరుచుట యను ఇరువది నాలుగవ అధ్యాయము

Sri Scanda Mahapuranamu-I    Chapters