Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్ట సప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

పునః బ్రహ్మవిజ్ఞానమ్‌

అగ్ని రువాచ :

అహం బ్రహ్మపరం జ్యోతిః పృథివ్యంబ్వనలోజ్ఝితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్వాయ్వాకాశవివర్జితమ్‌.

అహం బ్రహ్మపరం జ్యోతిరాదికార్య వివర్జితమ్‌ | అహం బ్రహపరం జ్యోతిర్విరాడాత్మ వివర్జితమ్‌. 2

అహం బ్రహ్మపరం జ్యోతిర్జాగ్రత్థ్సాన వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్విశ్వాభావ వివర్జితమ్‌. 3

అహం బ్రహ్మపరం జ్యోతిరకారాక్షర వర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్వాక్పాణ్యంఘ్రి వివర్జితమ్‌. 4

అహం బ్రహ్మపరం జ్యోతిః పాయూపస్థ వివర్జితమ్‌ |

అహం బ్రహ్మపరం జ్యోతిః శ్రోత్రత్వక్చక్షు రుజ్ఝితమ్‌. 5

అహం బ్రహ్మపరం జ్యోతి రసరూప వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః సర్వగంధ వివర్జితమ్‌. 6

అహం బ్రహ్మపరం జ్యోతి ర్జిహ్వా ఘ్రాణ వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః స్పర్శశబ్ద వివర్జితమ్‌.

అహం బ్రహ్మపరం జ్యోతిర్మన్దబుద్ధి వివర్జితమ్‌ | అహంబ్రహ్మపరం జ్యోతిశ్చిత్తాహంకార వర్జితమ్‌. 8

అహం బ్రహ్మపరం జ్యోతిః ప్రాణాపాన వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్‌ వ్యానోదాన వివర్జితమ్‌.

అహం బ్రహ్మపరం జ్యోతిః సమాన పరివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్జరామరణ వర్జితమ్‌. 10

అహం బ్రహ్మపరం జ్యోతిః శోకమోహ వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః క్షుత్పిపాసా వివర్జితమ్‌.

అహం బ్రహ్మపరం జ్యోతిః శబ్దోద్భూతాది వర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్హిరణ్య గర్భవర్జితమ్‌. 12

అహం బ్రహ్మపరం జ్యోతిః స్వప్నావస్థా వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతి సై#్తజసాదివి వర్జితమ్‌. 13

అహం బ్రహ్మపరం జ్యోతిః రపకారాది వర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః సభాజ్ఞాన వివర్జితమ్‌. 14

అహం బ్రహ్మపరం జ్యోతిః అధ్యాహృత వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః సత్త్వాదిగుణ వివర్జితమ్‌.

అహం బ్రహ్మపరం జ్యోతిః సదసద్భావ వర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః సర్వాయవ వర్జితమ్‌. 16

అహం బ్రహ్మపరం జ్యోతిర్భేదా భేద వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః సుషుప్తిస్థాన వర్జితమ్‌. 17

అహం బ్రహ్మపరం జ్యోతిః ప్రాజ్ఞాభావ వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్మకారాది వివర్జితమ్‌. 18

అహం బ్రహ్మపరం జ్యోతిర్మానమేయ వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిర్మతి మాతృ వివర్జితమ్‌. 19

అహం బ్రహ్మపరం జ్యోతిః సాక్షిత్వాది వివర్జితమ్‌ | అహం బ్రహ్మపరం జ్యోతిః కార్యకారణ వర్జితమ్‌.

దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణహంకార వర్జితమ్‌|జాగత్స్వప్న సుషుప్త్యాది ముక్తం బ్రహ్మతురీయకమ్‌. 21

నిత్యశుద్ధ బుద్ధముక్తం సత్యమానంద మద్వయమ్‌ | బ్రహ్మాహ మస్త్యహం బ్రహ్మసవిజ్ఞానం విముక్త ఓం.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే బ్రహ్మవిజ్ఞానేష్ట సప్తత్యధిక త్రిశతతమోధ్యాయః.

అగ్ని పలికెను. పరజ్యోతి స్వరూపమును పృథివీ జల వాయు భిన్నమును అగు పరబ్రహ్మ నేనే. వాయువాకాశ భిన్నమగు జ్యోతిర్మయమైన పరబ్రహ్మను నేనే. అగ్న్యాది కార్య భిన్నమగు పరబ్రహ్మ నేనే. విరాట్‌ భిన్నమగు జ్యోతీ రూప బ్రహ్మ నేనే. జాగ్రదవస్థా శూన్యమగు జ్యోతీరూప బ్రహ్మ నేనే. విశ్వ భిన్నమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. ఆకారాక్షర వర్జితమగు జ్యోతీరూప బ్రహ్మ నేనే. వాక్పాణిపాద శూన్యమగు జ్యోతీరూప బ్రహ్మ నేనే. పాయూవస్థ రహితమగు జ్యోతీరూప బ్రహ్మ నేనే. శ్రోతత్వక్‌ చక్షూ రహితమగు జ్యోతీరూప బ్రహ్మ నేనే రసరూప వివర్జితము. సర్వ గంధశూన్యము, జిహ్వాఘ్రాణ రహితము, స్పర్శ శబ్ధరహితము మనోబుద్ధి శూన్యము, చిత్తాహంకార వర్జితము, ప్రాణాపాన, వ్యానోదాన సమాన రహితము జరామరణ శోక మోహక్షుత్పిపాసా వర్జితము శబ్దోద్భూతాది శూన్యము, హిరణ్య గర్భభిన్నము, స్వప్నా వస్థారహితము, తైజసాది భిన్నము, అపకార, సభాజ్ఞాన, అధ్యాహృత, సత్త్వాది గుణ సద సద్భావ రహితము సర్వావయవ శూన్యము భేదా భేద శూన్యము సుషుప్తి స్థానప్రాజ్ఞ భావమకారాది రహితము. మానమేయ మితి మాతృత్వ రహితము సాక్షిత్వాది శూన్యము, కార్యకారణ వర్జితము, దేహేంద్రియే మనో బుద్ధి ప్రాణాహంకార రహితము, జాగ్రత్స్నప్న సుషుప్త్యాది రహితము, తురీయము నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపము, సత్యము ఆనందము, అద్వయము, సవిజ్ఞానమగు జ్యోతీ రూప బ్రహ్మ నేనే సమాధి రూపము మోక్ష ప్రదము అగు పరబ్రహ్మ నేనే.

అగ్ని మహాపురాణమున బ్రహ్మ విజ్ఞానమున మూడు వందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page