Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకసప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ నరక నిరూణనమ్‌

అగ్నిరువాచ :

ఉక్తాని యమ మార్గాణి వక్ష్యేథ మరణ నృణామ్‌ | ఊష్మాప్రకుపితః కాయే తీవ్రవాయు సమీరితః. 1

శరీరముపరుధ్యాథ కృత్స్నాన్దోషాన్నుణద్ధివై | ఛినత్తి ప్రాణస్థానాని పునర్మర్మాణి చైవహి. 2

శైత్యాత్ర్పకుపితో వాయుశ్ఛిద్రమన్విష్యతే తతః | ద్వేనేత్రే ద్వౌ తథా కర్ణౌద్వౌతు నాసాపుటౌ తథా. 3

ఊర్ధ్వంతు సప్త ఛిద్రాణి అష్టమం వదనం తథా | ఏతైః ప్రాణో వినిర్యాతి ప్రాయశః శుభకర్మణామ్‌. 4

అధః పాయురుపస్థంచ అనేనాశుభకారిణామ్‌ | మూర్ధానం యోగినో భిత్త్వా జీవో యాత్యథ చేచ్ఛయా. 5

అంతకాలేతు సంప్రాప్తే ప్రాణపాన ముపస్థితే | తమసా సంవృతే జ్ఞానే సంవృతే జ్ఞానే సంవృతే చ మర్మసు. 6

నజీవో నాభ్యధిష్ఠానాచ్చాల్యతే మాతరిశ్వనా | బాధ్యమానశ్చానయతే అష్టాంగాః ప్రాణవృత్తికాః. 7

చ్యవన్తం జాయమానం వా ప్రవిశన్తం చ యోనిషు | ప్రపశ్యన్తిచతం సిద్ధాదేవా దివ్యేన చక్షుషా. 8

గృహ్ణాతి తతక్షణాద్యోగీ శరీరం చాతివాహిమ్‌ | ఆకాశవాయుతేజాంసి విగ్రహా దూర్ధ్వ గామినః. 9

జలం మహీచ పంచత్వ మాపన్నః పురుషః స్మృతః | అతివాహిక దేహన్తు యమదూతా నయంతితమ్‌. 10

యామ్యం మార్గం మహోఘోరం షడశీతి సహస్రకమ్‌ | అన్నోదకం నీయమానో బాంధవైర్దత్తమశ్నుతే. 11

యమం దృష్ట్వా యమోక్తేన చిత్రగుప్తేన చేరితాన్‌ | ప్రాప్నోతి నరకాన్రౌద్రాన్దర్మో శుభపథైర్దివమ్‌. 12

అగ్నిదేవుడు పలికెను. యమరాజ మార్గములను గూర్చి చెప్పియుంటిని. మనుష్యుల మరణములను గూర్చి చెప్పెదను. శరీరమున వాయువేగము అధికమైనపుడు పిత్తము ప్రకోపించి శరీరమును అవరుద్ధము చేసి సకల దోషములను ఆవరించి ప్రాణ స్థానములను, మర్మస్థానములను భేదించును. శైత్యముచే వాయువు ప్రకోపించి బయటకు పోవుటకు రంధ్రములను అన్వేషించుట ప్రారంభించును. శరీరము పైభాగమున రెండు నేత్రములు, రెండు కర్ణములు, రెండు నాసాపుటములు, ముఖము అను ఎనిమిది రంధ్రములున్నవి. సాధారణముగా పుణ్యాత్ముల ప్రాణము వీటి ద్వారా బయటకుపోవును పాపాత్ముల ప్రాణము క్రిందనున్న పాయూపస్థల ద్వారా పోవును. యోగుల ప్రాణము బ్రహ్మ రంధ్రమును భేదించి బయటకుపోవును. ఆ జీవుడు ఇచ్ఛానుసారముగ వెడలి పోవును. అంత కాలము వచ్చినపుడు ప్రాణము అపానములో కలిసి పోవును. తమస్సుచే ఆవృతుడై పోవును. మర్మ స్థానములు ఆచ్ఛాదితములగును. అపుడు జీవుడు వాయువుచే బాధితుడై నాభి స్థానము నుండి చలించును. అష్టాంగములు కల ప్రాణ వృత్తులను తీసుకొని శరీరము నుండి బయటకు వచ్చును. దేహము నుండి బయటకు వచ్చుట మరియొక జన్మ గ్రహించుట వివిధ యోను లందు ప్రవేశించుట మొదలగు సమయములలో ఆ జీవుని సిద్ధ పురుషులును దేవతలును దివ్య దృష్టితో చూడగలుగుదురు. మరణ సమనంతరమే జీవుడు అతి వాహిక శరీరమును గ్రహించును. అతడు త్యజించిన శరీరము నుండు ఆకాశ, వాయు. తేజస్సులు పైనున్న మూడు తత్వములలో కలసిపోవును. జల పృథ్వ్యంశములు క్రింది తత్త్వములలో కలసిపోవును. పురుషుడు పంచత్వమును పొందుట అనగా ఇదియే. యమదూతలు వానిని అతివాహిక శరీరములోనికి ప్రవేశ పెట్టుదురు. యమ లోక మార్గము చాల భయంకరము. ఎనభై ఆరు వేల యోజనముల దూరము. ఆ మార్గమున ప్రయాణించు జీవుడు తన బంధువులిచ్చిన అన్నోదకములను అనుభవించును. యముని చూచి ఆతని ఆజ్ఞ ప్రకారము చిత్రగుప్తుడు చెప్పిన భయంకరములగు నరకములను పొందును. ధర్మాత్ముడైనచో స్వర్గమునకు పోవును.

భుజ్యన్తే పాపిభిర్వక్ష్యే నరకాంస్తాశ్చ యాతనాః | అష్టావింశతి రేవాధః క్షితేర్నరక కోటయః. 13

సప్తమస్య తలస్యాన్తేఘోరే తమసి సంస్థితాః | ఘోరాఖ్యా ప్రథమాకోటిః సుఘోరా తదధః స్థితా. 14

అతిఘోరా మహాఘోరా ఘోరరూపాచ పంచమీ | షష్ఠీతరలతారాఖ్యాసప్తమీచ భయానకా.

15

భయోత్కటా కాలరాత్రీ మహాచండాచ చండయా | కోలాహలా ప్రచండాఖ్యా పద్మానరకనాయికా. 16

పద్మావతీ భీషణాచ భీమాచైవ కరాలికా | వికరాలా మహావజ్రా త్రికోణా పంచకోణికా. 17

సుదీర్ఘా వర్తులా సప్తభూమాచైవ సుభూమికా | దీప్తమాయాష్టా వింశతయః కోటయః పాపిదుఃఖదాః. 18

అష్టావింశతి కోటీనాం పంచ పంచ చనాయికాః | రౌరవాద్యాః శతంచైకం చత్వారింశచ్చతుష్టయమ్‌. 19

తామిస్ర మంధతామిస్రం మహారౌరవరౌరవౌ | అసిపత్రం వనంచైవ లోహఖారం తథైవచ. 20

నరకం కాలసూత్రంచ మహానరక మేవచ | సంజీవనం మహావీచి తపనం సంప్రతాపనమ్‌ 21

సంఘాతంచ సకాకోలం కుద్మలం పూతిమృత్తికమ్‌ | లోహశంకు మృజీషంచ ప్రధానం శాల్మలీంనదీమ్‌. 22

నరకాన్విద్ధి కోటీశ నాగాన్వై ఘోరదర్శనాన్‌ | పాత్యన్తే పాపకర్మాణ ఏకైకస్మిన్బహుష్వపి. 23

మార్జారోలూక గోమాయు గృధ్రాది వదనాశ్చతే | తైలద్రోణ్యాంనరం క్షిప్త్వాజ్వాలయంతిహుతాశనమ్‌. 24

అంబరీపేషు చైవాన్యాంస్తామ్రపాత్రేషు చాపరాన్‌ | అయః పాత్రేషు చైవాన్యాన్బహు వహ్నికణషుచ. 25

శూలాగ్రారోపితాశ్చాన్యే భిద్యంతే నరకేపరే | తాడ్యంతేచ కశాభిస్తు భోజ్యన్తే చాప్యయోగుడాన్‌. 26

యమదూతైర్నరాః పాంసూన్విష్ఠా రక్త కఫాదికాన్‌ | తప్తమద్యం పాయయంతి పాటయంతి పునర్నరాన్‌.

యంత్రేషు పీడయంతిస్మ భక్ష్యన్తే వాయసాదిభిః | తైలేనోష్ణేన సిచ్యన్తే భిద్యన్తేనేకధాశిరః

28

హాతాతేతి క్రందమానాః స్వకం నిందంతి కర్మతే | మహాపాతకజాన్‌ ఘోరాన్నరకాన్ర్పాప్య గర్హితాన్‌. 29

కర్మక్షయాత్ర్పజాయంతే మహాపాతకినస్త్విహ |

పాపాత్ములు అనుభవించు నరకములను, బాధలను చెప్పెదను. భూమి క్రింద ఇరువది ఎనిమిది నరక శ్రేణులు వున్నవి. అవి సప్తమ తలము క్రింద ఘోరాంధకారమున నున్నవి. వీటికి వరుసగా ఘోరా, సుఘోరా, అతి ఘోరా, మహాఘోరా, ఘోర రూపా, తరలతారా - భయానకా - భయోత్కటా, కాల రాత్రీ, మహా చండా, చండా, కోలాహలా, ప్రచండా, పద్మా, నరక నాయికా, పద్మావతీ, భూషణా, భీమా కరాలికా, మహా వజ్రా, త్రికోణా, పంచ కోణికా, సుదీర్ఘా, వర్తులా, సప్త భూమా, సుభూమికా, దీప్తమాయా యని పేర్లు. ఈ ఇరువది ఎనిమిది శ్రేణులును పాపాత్ములకు దుఃఖముల నిచ్చును. వీటిలో ఒక్కొక్క దాని యందు ఐదేసి చొప్పున ప్రధాన స్థానము లుండును. వాటికి రౌరవాది నామములు. వీటి మొత్తము సంఖ్య నూట నలుబది ఐదు. తామిస్ర అంధతామిస్ర మహా రౌరవ రౌరవ - అసిపత్రవన లోహభార, కాలసూత్ర మహా నరక, సంజీవన, మహావీచి, తపన, సంప్రతాపన, సంఘాత, కాకోల, కుడ్మల, పూతివృత్తిక, లోహశంకు, ఋజీష, ప్రధాన శాల్మలీవృక్ష, వైతరణీనది మొదలైన వాటిని అన్ని నరకములందును కోటి నాయకులుగా తెలుసుకొనవలెను. ఇవి చాల భయంకరములు. పాపాత్ములను వీటిలో ఒక్కక్క దాని యందు లేదా అనేకము లందు పడవేయ వచ్చును. యమదూతల ముఖములు మార్జార, ఉలూక, గోమాయు. గృధ్రాదుల ముఖముల వలె వుండును. నూనె తొట్టిలో మనుష్యుని పడవేసి అగ్నిని రగల్చెదరు. కొంతమందిని బొగ్గుల మీదను, కొంతమందిని తామ్ర పాత్రమునందును, మంగలములందును, లోహ పాత్రలందును పడవేయుదురు. కొందరిని శూలముపై గుచ్చుదురు. కొందరిని నరకములో పడవేసి ఛేదించుదురు. కొందరిని కొరడాలతో కొట్టుదురు. కొందరిచే కాలిన ఆయో గోళములను మ్రింగింప చేయుదురు. చాల మంది యమ దూతలు కలసి వారిచే ధూళి, మలము, రక్తము, కఫము మొదలైన వాటిని తినిపించును. కాచిన మద్యమును త్రాగింతురు. కొందరిని రంపముతో కోయుదురు. కొందరిని గానుగలో వేసి త్రిప్పుదురు. కొందరిని కాకులు మొదలగునవి పొడిచి పొడిచి కొందరిపై ఉష్ణ తైలము చల్లబడును. కొందరి శిరస్సులు ఛేదింపబడును. ఆ సమముయన జీవులు ఏడ్చుచు తమ పాపకర్మను నిందింతురు. ఈ విధముగా పాపాత్ములు తమ పాపములకు ఫలముగ నరక బాధలననుభవించి మరల మర్త్య లోకమున జన్మింతురు.

మృగశ్వ సూకరోష్ట్రాణాం బ్రహ్మహా యోనిమృచ్ఛతి. 30

ఖరపుక్కశ##వ్లుెచ్ఛానాం మద్యపః స్వర్ణహార్యపి | కృమికీట పతంగత్వం గురగస్తృణ గుల్మతామ్‌. 31

బ్రహ్మహాక్షయ రోగీస్యాత్పురాపః శ్యావదన్తక | స్వర్ణహారీతు కునఖీ దుశ్చర్మా గురుతల్పగః.

32

యోయేన సంస్పృశ##త్యేషాం స తల్లింగోభిజాయతే | అన్నహర్తామయావీస్యాన్మూకో వాగపహారకః. 33

ధాన్యం హృత్వాతిరిక్తాంగః పిశునః పూతినాశికః | తైల హృత్తైలపాయీ స్యాత్పూతి వక్రస్తు సూచకః. 34

పరస్యయోషితం హృత్వా బ్రహ్మస్వ మపహృత్యచ | అరణ్య నిర్జనే దేశేజాయతే బ్రహ్మరాక్షసః. 35

రత్నహారీ హీనజాతిర్గంధాం ఛుంఛుందరీ శుభాన్‌ | పత్రం శాకం శిఖీహృత్త్వాముఖరాధాస్యహారకః. 36

అజః పశుం పయః కాకోయాన ముష్ట్రః ఫలం కపిః | మధుదంశః ఫలంగృధ్రోగృహకాక ఉపస్కరమ్‌. 37

శ్విత్రీవస్త్రం సారసంచ రి&ుల్లీలవణ హారకః | ఉక్త అధ్యాత్మికస్తాపః శస్త్రాద్యైరాధి భౌతికః. 38

గ్రహాగ్నీదేవ పీడాద్యైరాధిదైవిక ఈరితః | త్రిధా తాపంహి సంసారం జ్ఞానయోగాద్వినాశ##యేత్‌.

కృచ్ఛ్రైర్ర్వతైశ్చ దానాద్యైర్విష్ణు పూజాది భిర్నరః. 39

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నరక నిరూపణం నామైక సప్తత్యధిక త్రిశతతమోధ్యాయః.

బ్రహ్మ హత్య చేసిన వాడు, లేడి, కుక్క, పంది, ఒంటెయై పుట్టును. మద్యము త్రాగిన వాడు చండాల. వ్లుెచ్ఛజన్మ పొందును. సువర్ణము అపహరించిన వాడు పురుగుగాను, మిడతగాను పుట్టును. గురుతల్పగుడు తృణముగాను, గుల్మముగాను బుట్టును. బ్రహ్మహత్య చేసినవాడు క్షయ రోగి యగును. సురాపానము చేసిన వాని దంతములు నల్లగా వుండును. సువర్ణస్తేయము చేసిన వాని నఖములు చెడిపోవును. గురుపత్నీ గమనము చేసిన వాని చర్మము దూషిత మగును. ఏ పాపము చేసెనో ఆ పాపము యొక్క చిహ్నములతో పుట్టును. అన్నము అపహరించినవాడు మాయావి అగును. వాణిని అపహరించిన వాడు మూగవాడగును. దాన్యము అపహరించిన వానికి ఏదో ఒక అంగము అధికముగ వుండును. చాడీలు చెప్పిన వాని ముక్కు. నుండి దుర్గంధము వచ్చును. తైలము అపహరించినవాడు గబ్బిలము అగును. ఒకరిపై ఒకరికి చెప్పువాడు దుర్గంధ ముఖము కలవాడగును. పర స్త్రీలను, బ్రాహ్మణ ధనమును అపహరించిన వాడు నిర్జన వనమున బ్రహ్మరాక్షసుడై పుట్టును. రత్నములు హరించిన వాడు నీచ జాతిలో పుట్టును. గంధ ద్రవ్యములు హరించిన వాడు చుంచువై పుట్టును. పత్రశాకములను అపహరించిన వాడు కోడి గాను, ధాన్యమును అపహరించిన వాడు ఎలుక గాను, పశువులను హరించిన వాడు మేక గాను, పాలు హరించిన వాడు కాకి గాను, వాహనము హరించిన వాడు ఒంటె గాను, ఫలములు హరించిన వాడు కోతి గాను, తేనె హరించిన వాడు ఈగ గాను, ఫలములు హరించిన వాడు గృధ్రము గాను, ఇంటిలోని సామాను అపహరించిన వాడు గృహకాకము గాను పుట్టును. వస్త్రములు హరించినవాడు బొల్లి కలవాడు గాను. రసమును అపహరించిన వాడును, ఉప్పును అపహరించినవాడును ఈగగా జన్మించును. ఇది అధ్యాత్మిక తాపవర్ణనము. శస్త్రాదులచే కలిగిన తాపము అధి భౌతికము. గృహ అగ్ని దేవతాదుల వలన కలిగినది అధి భౌతికము గృహ అగ్ని దేవతాదులు వలన కలిగినది అది దైవికము. ఈ త్రివిధ తాపములతో కూడిన సంసారమును మానవుడు జ్ఞాన యోగమును కఠిన వ్రతములను దానాదులను, విష్ణుపూజాదులను చేసి, దాట వలెను.

అగ్ని మహాపురాణమున నరక నిరూపణ మను మూడు వందల డెబ్బది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page