Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోన షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః

అథ కృత్సిద్ధరూపమ్‌

అగ్నిరువాచ :

కృతస్త్రిష్వని విజ్ఞేయాభావే కర్మణి కర్తరి | అజ్ల్యుట్‌ క్తింఘజోభావే యజకారత ఏవచ. 1

ఆచిధర్మస్యవినయ ఉత్కరః ప్రకరస్తథా ః దేవోభద్రః శ్రీకరశ్చల్యుటి రూపస్తు శోభనమ్‌. 2

క్తినివృద్ధిస్తుతిమతీ ఘఞిభావోథ యుచ్యపి | కారణాభావనేత్యాది అకారేచ చికిత్సయా. 3

తథాతవ్యో హ్యనీయశ్చ కర్తవ్యం కరణీయకమ్‌ | దేయం ధ్యేయంచైవ యతిణ్యతికార్యంచ కృత్యకాః. 4

కర్తరికాదయోజ్ఞేయా భావేకర్మణిచ క్వచిత్‌ | గతోగ్రామ గతోగ్రామమాశ్లిష్టశ్చ గురుస్త్వయా. 5

శతృశానచౌ భవన్నేధమానో భవన్త్యపి | ణ్వుల్తుచౌ సర్వధాతుభ్యో భావకోభవితాతథా. 6

క్విబంతశ్చ స్వయంభూశ్చ భూతేలిటః క్వసుః కానచ్‌ | బభూవివాన్పేచివాంశ్చ పేచానః శ్రద్ధధానకః. 7

అణిస్యుః కుంభకారాద్యా భూతేప్యుణాదయః స్మృతాః |

వాయుః పాయుశ్చ కారుః స్యహులం ఛందసీరితమ్‌. 8

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే కృదంతనిరూపణం నామైకోన షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.

కుమారస్వామి చెప్పెను. కృత్ర్పత్యయములు భావకర్మ కర్త్రర్థము లందు మూడింటి యందును వచ్చును. అచ్‌ ల్యుట్‌, క్తిన్‌, భావఘయ్‌, యచ్‌. అ, తవ్య, ఆదులు కృత్ర్పత్యయములు. అచ్‌ ప్రత్యయము చేర్చగా వినయః, ఉత్కరః, ప్రకరః, దేవః, భద్రః, శ్రీకరః మొదలగు రూపము సిద్ధించును. ల్యుట్‌ - శోభనమ్‌. క్తిన్‌ - వృద్ధిః, స్తుతిః మతిః ఘయ్‌ - భావః. యుచ్‌ - కారణా భావనా మొదలగునవి. ఆ - చికిత్సా, తవ్య - క ర్తవ్యమ్‌. ఉదాహరణము. అనీయ - కరణీయకమ్‌. యత్‌ - దేయం ధ్యేయమ్‌. ణ్యత్‌ - కార్యమ్‌. ఇవన్నియు కృత్య ప్రత్యయములు; క్తాదులు, కర్త్రర్థము నందు కొన్ని చోట్ల భావ కర్మార్థము లందును చేర్చబడును. ఉదాహరణ - గ్రామః గతః, గ్రామం గతః త్వయా గురు ఆశ్లిష్ట మొదలగునవి. శతృ - భవన్‌, శానచ్‌ - ఏధమానః, భవన్‌ స్త్రీ లింగములో భవన్తీ అగును. అన్ని ధాతువుల కంటెను నువుల్‌, తృచ్‌, ప్రత్యయములు వచ్చును, ఉదా:- భావనః, భవితా మొదలగునవి క్విప్‌ - స్వయంభూః, ల్యుట్‌కు భూతార్థమున క్వసు, కానచ్‌ ప్రత్యయములు చేర్చగ బభూవివాన్‌, పేచివాన్‌ పేచానః, శ్రద్దదానకః ఇత్యాది రూపములగును. అణ్‌ చేర్చగా - కుంభకారః మొదలగునవి సిద్ధించును. ఉణాదులు భూతార్థములందు కూడ వచ్చును. ఉదా:- కారః, పాయుః వాయుః ఇత్యాదులు ఛందయందు ఇవి బహుళముగా వచ్చును.

అగ్ని మహాపురాణమున కృదంతనిరూపణమను మూడువందల యేబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page