Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోన పంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః

అథ కౌమార వ్యాకరణమ్‌

స్కంద ఉవాచ :

వక్ష్యే వ్యాకరణం సారం సిద్ధశబ్ద స్వరూపకమ్‌ | కాత్యాయననిబోధాయ బాలానాం బోధనాయచ. 1

ప్రత్యాహారాదికాః సంజ్ఞాః శాస్త్రసంవ్యవహారగాః

అ ఇ ఉణ్‌ ఋక్‌ ఏఓఙ్‌ ఐఔచ్‌ హయవరట్‌

లణ్‌ ఞమఙణనమ్‌ ఝభయ్‌ ఘఢధష్‌

జబుగడశ్‌ ఖ ఫ చ ఠ థ చ ట తవ్‌ కపయ్‌

శషసర్‌ హల్‌ ఇతి ప్రత్యాహారః | ఉపదేశ ఇద్వలన్తం భ##వేదజనునాసికః. 2

ఆదివర్ణో గృహ్యమాణో7ప్యన్తేనేతా సహైవతు | తయోర్మధ్య గతానాం స్యాద్గ్రాహకః స్వస్యతద్యథా. 3

ఆణ్‌ ఏఙ్‌ అట్‌ యఙ్‌ భవ్‌ ఝష్‌ భష్‌ అక్‌ ఇక్‌ ఆణ్‌ ఇణ్‌ యణ్‌ పరేణ ణకారేణ |

ఆమ్‌ యమ్‌ జమ్‌ ఆచ్‌ ఇచ్‌ ఐచ్‌ ఆయ్‌ మయ్‌ ఝయ్‌ జవ్‌ ఝవ్‌ ఖవ్‌ శవ్‌

ఆశ్‌ హశ్‌ వశ్‌ భశ్‌ ఆల్‌ హల్‌ బల్‌ రల్‌ ఝట్‌ జల్‌ ఇతిప్రత్యాహారాః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కౌమారవ్యాకరణ శాస్త్రేసంజ్ఞాప్రకరణంనామైకోన పంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః.

స్కందుడు చెప్పెను. కాత్యాయనా : బాలకుల జ్ఞానము కొరకై వ్యాకరణ సారమగు సిద్ధ శబ్ద స్వరూపము చెప్పెదను. శాస్త్ర వ్యవహారములకు ఉప యుక్తములగు ప్రత్యాహారాది సంజ్ఞలు చెప్పెదను. ''అ, ఇ ఉణ్‌'' మొదలు, ''హల్‌'' వరకు మూలోక్తము ప్రత్యాహారము. ఉపదేశము నందు అంత్య మగు హల్లు, అనునాసిక మగు అచ్చు ఇత్సంజ్ఞకములు. అంతిమ ఇత్సంజ్ఞక వర్ణముతో కలిపి చెప్పబడిన అది వర్ణము తనకును మధ్యనున్న వర్ణములకును గ్రాహకము. వీటికి ప్రత్యాహారములని పేరు. ''అణ్‌'' మొదలు ''శల్‌'' వరకు మూలోక్తములగునవి ప్రత్యాహారములు. అణ్‌, ఞణ్‌, యణ్‌ వీటిలో పరనకారముతో ప్రత్యాహారము.

అగ్ని మహా పురాణమున కౌమార వ్యాకరణ శాస్త్రమున సంజ్ఞాప్రకరణ మను మూడు వందల నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page