Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచ త్రింశ దధిక శతతమో7ధ్యాయః.

అథ ప్రస్తార నిరూపణమ్‌

అగ్నిరువాచ :

ఛందో7త్ర సిద్ధం గాథాస్వాత్పాదే సర్వగురౌతథా | ప్రస్తార ఆద్యగాథోనః పరతుల్యౌ7థ పూర్వగః. 1

నష్టమధ్యే సమే7ంకేనః సమో7ర్ధవిషమే గురుః | ప్రతిలోమగుణం నాద్యం ద్విరుద్దిష్టక ఏకనుత్‌. 2

సంఖ్యాద్విరర్దేరూపేతు శూన్యం శూన్యే ద్విరీరితమ్‌ | తావదర్దే తద్గుణితం ద్విద్య్వూనంచ తదన్తతః. 3

పరే పూర్ణం పరే పూర్ణం మేరు ప్రస్తారతోభ##వేత్‌ | నగసంఖ్యావృత్తసంఖ్యాచాధ్వాంగులమథా7ర్ధతః

సంఖ్యైవ ద్విగుణ కోనోఛందఃసారో7యమీరితః. 4

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రస్తార నిరూపణం నామ పంచత్రింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. పేరు చెప్పని ఛందస్సులన్నియు గాథా ఛందస్సులో అంతర్గతములు. ఇపుడు ప్రస్తారము చెప్పబడుచున్నది. అన్ని అక్షరములును గురువులైన పాదములో ఆది గురువునకు క్రింద లఘువు వ్రాయవలెను. దాని పిమ్మట అదే క్రమమున వర్ణములను కూర్చవలెను. నష్ట సంఖ్యను సగము చేయగా ఒక లఘువు వ్రాయవలెను. సగము చేసినపుడు అది విషయమైనచో దానికి ఒకటి చేర్చి సమము చేసి మరల దానిని సగము చేయవలెను. ఇపుడు ఒక గుర్వక్షరము లభించును. ఎన్ని అక్షరముల ఛందస్సుయొక్క భేదము తెలియవలెనో అన్ని అక్షరములు పూర్తి యగు వరకు గురు లఘువులను వ్రాయుచు పోవలెను. ఉద్దిష్ట సంఖ్యను చెప్పుటకు గురు, లఘు వర్ణములను క్రమముగ. ఒక పంక్తిలో వ్రాసి వాటిపైన క్రమముగ ఒకటి నుండి రెట్టించుచు, అంకములు వుంచవలెను. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క తెలియవలెనో దాని అర్ధ భాగము తీసివేయబడును. అపుడు రెండు లభించును. దానిని వేరుగా వుంచవలెను. విషమ సంఖ్య నుండి ఒకటి తగ్గించగ, శూన్యము లభించును. దానిని రెండుకు క్రింద వ్రాయవలెను. శూన్య స్థానమున రెట్టింపు చేయవలెను. అట్లు చేయవచ్చిన అంకమును పైనున్న అర్థస్థానము నందుంచి దానిచేత గుణంచవలెను. మేరు ప్రస్తారముచే ఒక ఛందస్సులో ఎన్ని లఘువులు ఎన్ని గురువులు వుండునో, ఎన్ని వృత్తములు ఏర్పడునో తెలియును. మేరు ప్రస్తారమున క్రింది నుండిపైకి, అర్థాం గుళము చొప్పున విస్తారము తగ్గుచుండును. ఛందస్సంఖ్యను రెట్టించి, ఒక్కొక్కటి తగ్గించినచో అన్ని అంగుళముల ప్రస్తార దేశము ఏర్పడును. ఈ విధముగా ఛందస్సారము చెప్పబడినది.

అగ్ని మహాపురాణమున ప్రస్తార నిరూపణమను మూడువందల ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page