Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచవింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ అంశకాదిః

ఈశ్వర ఉవాచ :

రుద్రాక్షకటకం ధార్యం విషమం సుసమం దృఢమ్‌ | ఏకత్రి పంచ వదనం యథాలాభన్తు ధారయేత్‌. 1

ద్విచతుః షణ్ముఖం శస్తమవ్రణం తీవ్రకంటకమ్‌ | దక్షబాహౌ శిఖాదౌ చ ధారయేచ్చ తురాననమ్‌. 2

అబ్రహ్మచారీ బ్రహ్మచారీ అస్నాతః స్నాతకోభ##వేత్‌ | హైమీవా ముద్రికా ధార్యాశివమంత్రేణ చార్చ్యతు. 3

శివం శిఖాతథా జ్యోతిః సావిత్రశ్చేతిగోచరాః | గోచరన్తు కులం జ్ఞేయం తేన లక్ష్యస్తు దీక్షితః. 4

ప్రాజాపత్యో మహీపాలః కపోతో గ్రంథికః శివే | కుటిలాశ్చైవ వేతాలాః పద్మహంసాః శిఖాకులే. 5

ధృతరాష్ట్రా బకాః కాకా గోపాలా జ్యోతిసంజ్ఞకే | కుటికా నారఠాశ్చైవ గుటికా దండినో7పరే. 6

సావిత్రీ గోచరే చైవ మేకైకస్తుచతుర్విధః |

పరమేశ్వరుడు చెప్పెను. రుద్రాక్ష కటకమును ధరించవలెను. రుద్రాక్షల సంఖ్య విషమముగా వుండవలెను. యవి సమములు గను దృడములు గను వుండవలెను. ఏక ముఖమును గాని, త్రిముకమును గాని, పంచ ముఖమును గాని, యథాలాభముగా ధరించ వచ్చును. ద్విముఖ చతుర్ముఖ షణ్ముఖ రుద్రాక్షలు కూడా ప్రశస్తములే. బ్రద్దలగుట కాని పురుగు దొలుచుట కాని కలుగుటచే క్షతమలు కాకూడదు. వాటిపై కంటకము లుండవలెను. దక్షిణ భుజ శిఖాదులపై చతుర్ముఖ రుద్రాక్షను ధరించవలెను. అట్లు చేయుటచే అబ్రహ్మచారి బ్రహ్మచారి యగును. అస్నాతకుడు కూడ స్నాతరుడగును. లేదా శివమంత్రముతో పూజించి సువర్ణాంగుళీయకమును కుడిచేత ధరించవలెను. శివశిఖాజ్యోతి సావిత్రములు ఈ నాలుగును గోచరములు. గోచరమునకు కులము యని అర్థము. దీక్షితుడు దీనిని లక్ష్యము కొనవలెను. ప్రాజాపత్య మహీపాల కపోత గ్రంథికులు శివ కులమునకు చెందిన వారు. కుటిల వేతాల పద్మ హంసలు శిఖాకులమునకు చెందిన వారు. ధృతరాష్ట్రబక, కాక గోపాలులు జ్యోతి కులమునకు చెందిన వారు. కుటికా సాఠర, గుటికా దండులు సావిత్రీ కులమునకు చెందిన వారు. ఈ విధముగా ఒక్కక్క కులమున నాలుగేసి భేదములున్నవి.

సిద్ధాద్యంశక మాఖ్యాస్యే యే మంత్రః సుసిద్ధదః. 7

భూమౌతు మాతృకా లేఖ్యాః కూటషండ వివర్జితాః | మంత్రాక్షరాణి విశ్లిష్య అనుస్వారం నయేత్పృథక్‌. 8

సాధకస్యతు యాసంజ్ఞా తస్యా విశ్లేషణం చరేత్‌ | మంత్రస్యాదౌ తథాచాన్తే సాధకార్ణాని యోజయేత్‌ 9

సిద్ధఃసాధ్యః ఃసుసిద్దో7రిః సంజ్ఞాతో గణయేత్క్రమాత్‌ |

మతస్యాదౌ తథాచాన్తే సిద్ధిదః స్యాచ్ఛతాంశదః.

సిద్ధాదిశాన్త సిద్ధిశ్చ తతక్షణాదేవ సిద్ధ్యతి | సుసిద్ధాదిః సుసిద్ధాంతః సిద్ధవత్పరికల్పయేత్‌. 11

అరిమాదౌ తథాన్తే చ దూరతః పరివర్జయేత్‌ | సిద్ధఃసుసిద్దశ్చైకార్థే అరిః సాధ్యస్త థైవచ. 12

ఆదౌసిద్ధఃసితో మంత్రే తదన్తే తద్వ దేవహి | మధ్యేరిపుసహస్రాణి న దోపాయ భవన్తిహి. 13

మాయాప్రసాద ప్రణవేనాంశకః ఖ్యాతమంత్రకే | బ్రహ్మాంశకో బ్రహ్మవిద్యా విష్ణ్వంశో వైష్ణవఃస్మృతః.

రుద్రాంశకో భ##వేద్వీర ఇంద్రాంశ##శ్చేశ్వర ప్రియః | నాగాంశో నాగస్తబ్ధాక్షో యక్షాంశో భూషణప్రియః. 15

గంధర్వాంశో7తి గీతాదిర్‌ భీమాంశో రాక్షసాం శకః | దైత్యాంశః స్యాద్యుద్ధకార్యోమాని విద్యాధరాంశకః.

పిశాచాంశో మలాక్రాంతో మంత్రం దద్యాన్నిరీక్ష్యచ | మంత్ర ఏకాత్‌ఫడన్తః స్యాద్విద్యా పంచాశతావధి. 17

బాలా వింశాక్షరాన్తాచ రుద్రా ద్వావింశ గాయుధా | తత ఊర్ధ్వన్తు యేమంత్రా వృద్ధా యావచ్ఛతత్రయమ్‌.

అకారాది హకారాన్తాః క్రమాత్పక్షౌ సితాసితే | ఆనుస్వార విసర్గేణ వినాచైవ స్వరాదశ. 19

హ్రస్వాః శుక్లా దీర్ఘాః శ్యామా స్తిథయః ప్రతిపన్ముఖాః | ఉదితే శాంతికాదీని భ్రమితే వశ్యకాదికమ్‌. 20

భ్రామితే సంధయోద్వేషోచ్చాటనే స్తంభ##నే7స్తకమ్‌ | ఇడావాహే శాంతికాద్యం పింగలే కర్షణాదికమ్‌. 21

మారణోచ్చాట నాదీని విషువే పంచధా పృథక్‌ | అధరస్య గృహేపుథ్వీ ఊర్ధ్వేతేజో7న్తరా ద్రవః. 22

రంధ్ర పార్శ్వే బహిర్వాయుః సర్వం వ్యాప్య మహేశ్వరః | స్తంభంనం పార్థివే శాంతిర్జలే వశ్యాది తేజసే.

వా¸°స్యాద్భ్రమణం శూన్యే పుణ్య కాలే సమభ్యసేత్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయేంశకాది వర్ణనం నామ పంచవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

ఉత్తమ మంత్ర సిద్ధి నిచ్చు అంశములను చెప్పెదను కూట యంత్ర రహితములగు మాతృకాక్షరములను నేలపై వ్రాయవలెను. యంత్రాక్షరములను వేరువేరు చేసి అనుస్వారమును వేరు చేయవలెను. సాధకుని నామము నందలి అక్షరములను కూడా చేయవలెను. మంత్రము యొక్క అద్యంతాది అక్షరము లందు సాధకుని నామాక్షరములు చేర్చి సిద్ధము సాధ్యము సుసిద్ధము అరి యను సంజ్ఞలను అనుసరించి అక్షరములను క్రమమముగా లెక్కపెట్టవలెను. మంత్రము యొక్క అద్యంతము లందు సిద్ధము వున్నచో అది నూటికి నూరు పాళ్ళు సిద్ధిదాయకము. ఆద్యంతము లందు సిద్ధి కలది వెంటనే సిద్ధి నిచ్చును. ఆద్యంతము లందు సుసిద్ధమున్నచో ఆ మంత్రమును కూడ సిద్ధముగ గ్రహించవలెను. ఆద్యంతము లందు అరి వున్చచో ఆ మంత్రమును పరిత్యజించవలెను. సిద్ధము యనునవి కూడ తుల్యములే. మంత్రము యొక్క ఆద్యంతాక్షరము లందు సిద్ధమున్నచో మధ్య వేల కొలది అరి అక్షరములున్నను దోషకారకము కాదు. మాయ బీజము, ప్రాసాద బీజము ప్రణవము వీటి యోగముచే విఖ్యాత మంత్రము నందు క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్రాంశకములు ఏర్పడును. బ్రహ్మాంశకము బ్రహ్మ విద్య యనియు. విష్ణ్వ వంశకము వైష్ణవమనియు రుద్రాంశకము వీరమనియు చెప్పబడును. ఇంద్రాంశక మంత్రము ఈశ్వర ప్రియము నాగాంశ మంత్రము నాగములవలె స్తబ్ధ నేత్రము యక్షాంశ మంత్రము భూషణ, ప్రియము, గంధర్వాంశ మంత్రము, అతి గీతాది ప్రియము, భీమాంశ, రాక్షసాంశ దైత్యాంశ మంత్రములు యుద్ధ కారకములు. విద్యా ధరాంశ మంత్రము అభిమానదము. పిశాచాంశ మంత్రము మలాక్రాంతము. మంత్రమును పూర్తిగా పరీక్షించి ఉపదేశము చేయవలెను ఏకాక్షర మంత్రము మొదలు అనేకాక్షర మంత్రముల వరకు చివర ఫట్‌ చేర్చినచోయది మంత్ర మని చెప్పబడును. ఏబది అక్షరముల వరకు వున్న మంత్రము ''విద్య''. ఇరువది అక్షరముల వరకు వున్నది ''బాలావిద్య''. ఇరువది అక్షరముల వరకు వున్న అస్త్రాంత మంత్రము ''రుద్ర''. అంతకుమించి మూడు వందల అక్షరముల వరకు వున్న మంత్రమునకు వృద్ధయని పేరు. మంత్రములలో ''అకారము మొదలు హ కారము వరకు వున్న అక్షరము లుండును. మంత్రము లందు క్రమముగా శుక్ల కృష్ణ పక్షము లుండును. అనుస్వార విసర్గలు విడిచి స్వరములు పది. హ్రస్వ స్వరములు శుక్లపక్షము. దీర్ఘ స్వరము కృష్ణపక్షము. ఇవియే ప్రతిపదాది తిథులు. శాంతి కార్యములను ఉదయ కాలము నందును, వశీకరణ కర్మలను భ్రమిత కాలము నందును ద్వేషణ ఉచ్చాటన కర్మలను భ్రమిత కాలము నందు సంధ్యా ద్వయము నందును స్తంభన కర్మలను సూర్యాస్తమయ కాలమునందును చేయవలెను. ఇడానాది చరించునపుడు శాంతిక కర్మలు పింగళానాడి చలించునపుడు ఆకర్షణ కర్మలు చేయవలెను విషమ తలమున మారణ ఉచ్చటనాది పంచకర్మలు వేరు వేరుగ చేయవలెను అధర గృహమున పృథివియు, ఊర్ధ్వ గృహమున తేజస్సు మధ్య జలము చెప్పబడినవి. రంధ్రములు ఎచ్చట వుండునో అచటను, బాహ్య పార్శ్వము లందును. వాయువు లోపటి పార్శ్వము లందు ఆకాశము వుండును. పార్థివాంశమునందు స్తంభనము జలీయాంశము నందు శాంతి కర్మ తైజశాంసము నందు వశీకరణము. వాయువు నందు భ్రమణము ఆకాశము నందు పుణ్య కర్మయు చేయవలెను.

అగ్ని మహా పురాణము నందు ఆగ్నేయాంశకాది వర్ణన మను మూడు వందల ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page