Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రయోవింశత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ షడంగాన్యఘోరాస్త్రాణి

ఈశ్వర ఉవాచ :

ఓం హ్రూం హంస, ఇతిమంత్రేణ మృత్యురోగాది శామ్యతి |

లక్షాహుతిభిర్దూర్వాభిః శాంతిం పుష్టిం ప్రసాధయేత్‌. 1

అథవా ప్రణవేనైవ మాయయావా షడానన | దివ్యాన్తరిక్ష భౌమానాంశాంతి రుత్పాత వృక్షకే.2

ఓం నమోభగవతి గంగే కాలికాలి మహా కాలికాలి మాంస

శోణిత భోజనే రక్తకృష్ణ ముఖి వశమానయ, మానుషాన్‌ స్వాహా |

ఓ లక్షం జప్త్వాదశాంశేన హుత్వాస్యాత్సర్వ కర్మకృత్‌ |

వశంనయతి శక్రాదీన్మా నుషేష్వేషు కాకథా 3

ఆంతర్ధాన కరీవిద్యా మోహినీ జృంభణీతథా | వశంనయతి శత్రూణాం శత్రుబుద్ధి ప్రమోహినీ. 4

కామధేనురియం విద్యాసప్తధా పరికీర్తితా | మంత్రరాజం ప్రవక్ష్యామి శత్రుచౌరాది మోహనమ్‌. 5

మహాభ##యేషు సర్వేషు స్మర్తన్యం హరపూజితమ్‌ | లక్షం జప్త్వాతిలైర్హోమః సిధ్యేదుద్దారకం శృణు. 6

ఓం హలేశూలే ఏహిబ్రహ్మసత్యేన విష్ణుసత్యేన రుద్రసత్యేన రక్షమాంవాచేశ్వరాయ స్వాహా.

దుర్గాత్తారయతేస్మాత్తేవ దుర్గాశివామతా | ఓంచండ కపాలిని దంతాన్‌ కిటికిటి క్షిటిక్షిటి గుహ్యేఫట్‌

హ్రీం, అనేన మంత్రరాజేన క్షాలయిత్వాతు తండులాన్‌. 7

త్రింశద్వారాణి జప్త్వాని తచ్చౌరేషు ప్రదాయేత్‌ | దంతైశ్చూర్ణాని శుక్లాని పతితాని హి శుద్దయే. 8

ఓం జ్వలల్లోచన కపిల జటాభార భాస్వర విద్రావణ త్రైలోక్య డామర డామర దర దర భ్రమభ్రమ ఆ కట్ట ఆకట్ట తోటయ తోటయ మోటయ మోటయ దహ దహ పచ పచ ఏవం సిద్దరుద్రోజ్ఞాపయతి యదిగ్ర

హోపగతః స్వర్గలోకం దేవలోకంవా ఆరామ విహారాచలం తథాపి

తమార్తయిష్యామి బలింగృహ్ణ గృహ్ణ దదామితే స్వాహేతి |

క్షేత్రపాల బలిందత్త్వా గ్రహోన్నాసాద్వశం వ్రజేత్‌ | శత్రవో నాశమాయాన్తి రణవైరిగణక్షయః. 9

హంసబీజన్తు విన్యస్యవిషన్తు త్రివిధం హరేత్‌ | అగురుచందనం కుష్ఠం కుంకుమం నాగ కేసరమ్‌. 10

నఖంవై దేవ దారుంచ సమంకృత్వాథ ధూపకః | మాక్షికేణ సమాయుక్తో దేవవస్త్రాది ధూపనాత్‌. 11

వివాదే మోహనే స్త్రీణాం మండనే కలహే శుభః | కన్యాయా వరణ భాగ్యే మాయామంత్రేణ మంత్రితః.

హ్రీం రోచనా నాగపుష్పాణి కుంకుమంచ మనః శిలా| లలాటే తిలకం కృత్వాయం పశ్యేత్సవశీ భ##వేత్‌. 13

శతావర్యాస్తు చూర్ణంతు దుగ్దపీతంచ పుత్రకృత్‌ | నాగ కేసర చూర్ణంతు ఘృత పక్వస్తు పుత్రకృత్‌. 14

పాలాశ బీజ పానేన లభ##తే పుత్రకం తథా |

పరమేశ్వరుడు చెప్పెను. ''ఓం హ్రూం హంసః'' అనుమంత్ర మంత్రముచే మృత్యురోగాదులు శమించును. ఈ మంత్రముతో ఒకలక్షదూర్వా హోమములు చేసి శాంతి పుష్ఠి లభించును. లేదా కేవల ప్రణవమునుగాని, మాయ బీజమును (హ్రీం) గాని జపించుటచే దివ్యాంతరిక్షభౌమ ఉత్పాతమలు శమించును. ఉత్పాత వృక్షము కూడ శమించును. ''ఓం నమోభగవతి'' మొదలు సాహా'' వరకును వున్న మూలోక్త మంత్రమును లక్షజపము చేసి దశాంశ హోమములు చేసిన వాడు సర్వకర్మలను సాధించును. ఇంద్రాదులను కూడ వశము చేసుకొనును. మనుష్యుల విషయము చెప్పవలెనా. ఈ విద్య అంతర్ధానకారిణీ మోహినీజృంభణి, శత్రుబుద్ధిని మోహింపచేయునది ఈ కామధేను విద్య ఏడు విధములు శత్రుచోరాదులను మోహింపచేయునది. ఈశ్వర పూజితము సర్వ మహాభయముల యందు స్మరింపతగునది యగు మంత్రరాజమును చెప్పెదను. లక్ష జపించి తిల హోమము చేసినచో మంత్రము సిద్ధించును. దీని ఉద్ధారములు వినుము. ''ఓం హలే'' మొదలు ''సాహా'' వరకును వున్నమూలోక్తమైనది మంత్రము దుర్గ దుర్గమునుండి తరింప చేయునుగాన ఆమెకాపేరువచ్చినది. ఈమె మంగళ ప్రదురాలు. ''ఓం, హ్రీం చండకపాలిని'' మొదలు ఫట్‌ హ్రీం వరకును వున్న మూలోక్త మంత్రమును జపించి బియ్యము కడిగి వాటిని ఈ మంత్రముతో ముప్పది పర్యాయములు అభిమంత్రించి వాటిని దొంగలకు పంచిపెట్టినచో ఆ బియ్యమునమలగనే వారి తెల్లటి దంతము పడిపోవును. వారు చౌర్య పాప విముక్తులగుదురు. ''ఓం జ్వలల్లోచవ మొదలు తేస్వాహా'' అను మూలోక్త మంత్రముతో క్షేత్రపాలునకు బలియిచ్చి న్యాసము చేసినచో గ్రహము వశమగును. శత్రువులు నశింతురు రణ భూమియందు శత్రువులు హతులగుదురు. విషబీజ న్యాసముచే మూడు విధములగు విషములను లేదా విఘ్నములను హరించవచ్చును. అగురు చందన, కుష్ఠ, కుంకుమ, నాగ, కేసర, నఖ దేవదారువులను సమప్రమాణమున గ్రహించి నూరి ధూపము వేయవలెను. దీనిలో తేనె కలిపి దాని సుగంధముతో శరీరమును వస్త్రాదులను ధూపితము చేసినచో వివాదము స్త్రీ మోహనము శృంగారము కలహము మొదలగు సమయములందు శుభపలము లభించును. కన్యావరణ, భాగ్యోదయ సంబంధి కార్యము లందు కూడ సాఫల్యము లభించును. మాయా మంత్రము (హ్రీం)చే అభి మంత్రించిన రోచన నాగకేసర కుంకుమ మనశ్శిలలతో తిలకము ధరించి ఎవనిని చూచిన వాడు వశమగును. శతావరి చూర్ణమును పాలతో కలపి త్రాగినచో పుత్రులు ఉత్పాదింప కలుగును. నాగకేసర చూర్ణమును నేతిలో కలపి తిన్నను పలాశ బీజములను నూరి త్రాగినను పుత్రోత్పాదకుడగును.

ఓం ఉత్తిష్ఠ చాముండే జంభయ జంభయ మోహయ మోహయ అముకం

వశమానయ వశమానయ స్వాహా.

షడ్‌ వింశాసిద్దవిద్యాసా నదీతీరమృదాస్త్రియమ్‌. 15

కృత్వోన్మత్తరసేనైవ నామాలిఖ్యార్కపత్రకే | మూత్రోత్సర్గం తతః కృత్వా జపేత్తా మానయేత్త్స్రియమ్‌.

ఓం క్షుం సః వషడ్‌. మహామృత్యుంజయో మంత్రోజప్యాద్దోమాచ్మ పుష్టికృత్‌ |

ఓం హంసః, హ్రూం హం, నః, హ్రః సౌం, సై#్కః | మృతసంజీవనీ విద్యా అష్టార్ణా జయకృద్రణ. 17

మంత్రా ఈశాన ముఖ్యాశ్చ ధర్మకామాది దాయకాః | ఈశానః సర్వవిద్యానా మీశ్వరః సర్వ భూతానామ్‌.

బ్రహ్మణశ్చాధి పతిర్బ్రహ్మ శివోమే7స్తు సదాశివోమ్‌.

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |

తన్నో రుద్రః ప్రచోదయాత్‌.

ఓం అఘోరేభ్యో7థ ఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యస్తు సర్వతః. 19

సర్వేభ్యః సర్వశ##ర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః |

ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః |

రుద్రాయ నమః కాలాయనమః కలవికరణాయ నమో

బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః |

సర్వభూత దమనాయ నమో మనోస్మనాయ నమః |

ఓం సద్యోజాతం ప్రపద్యామి నద్యోజాతాయ వైనమః |

భ##వే భ##వేనాతిభ##వే భవస్వమాం భవోద్భనాయ నమః 20

పంచ బ్రహ్మాంగ షట్కంచ వక్ష్యే7హం భుక్తిముక్తిదమ్‌ |

ఓం నమః పరమాత్మనే పరాయ కామదాయ పరమేశ్వరాయ

యోగాయ యోగసంభవాయ సర్వకరాయ కురు కురు సత్య సత్య భవ భవ

భవోద్భవ వామదేవ సర్వకార్యకర పాపప్రశమన సదాశివ ప్రసన్న నమో7స్తుతే స్వాహా.

హృదయం సర్వార్థదంతు సప్తత్యక్షర సంయుతమ్‌ |

ఓం శివః శివాయ నమః శివః; ఓం హృదయే జ్వాలిని స్వాహా.

శిఖా; ఓం శివాత్మక మహా తేజః సర్వజ్ఞ ప్రభురావర్తయ మహాఘోర కవచ పింగల నమః.

మహాకవచ శివాజ్ఞయా హృదయం బంధ బంధ ఘూర్ణయ ఘూర్ణయ

చూర్ణయ చూర్ణయ సూక్ష్మ వజ్రధర వజ్రపాశ ధనుర్వజ్రా

శనివజ్ర శరీర మమ శరీర మనుప్రవిశ్య సర్వదుష్టాన్‌

స్తంభయ స్తంభయ హూమ్‌.

అక్షరాణాన్తు కవచం శతం పంచాక్షరాధికమ్‌. 29

ఓం ఓజనే నేత్రం ఓం ప్రస్ఛుర తనురూప చట చట ప్రచట ప్రచట

కట కట వమ వమ ఘాతాయ ఘాతాయ హుం హుం ఫట్‌ అఘోరస్త్రమ్‌. 22

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే షడంగాఘోరాస్త్రవర్ణనం నామ

త్రయో వింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

''ఓం ఉత్తిష్ఠ'' మొదలు ''స్వాహా'' వరకును వున్న మూలోక్తమగు నది ఇరువది ఆరు అక్షరమల సిద్ధ విద్య నదీ తీరమునందలి మట్టితో లక్ష్మీమూర్తి చేసి తత్తువులరసముతో మందార పత్రముపై ఇష్టస్త్రీ నామమును వ్రాయవలెను. పిమ్మట మూత్రోత్సర్గముచేసి ఈ మంత్రమును జపించినచో అభీష్టస్త్రీ వశమగును. ఓం జూం (''క్షుం సః వషట్‌'') ఇది మహామృత్యుం జయ మంత్రము. దీని జప హోమములు పుష్టి కార్యమలు 'ఓం హం సః హ్రూం హూం సః హ్రః సౌసై#్కః'' యీ అష్ట వర్ణ మృతసంజీవని విద్య రణమునందు జయము నిచ్చును. ఈశానాది మంత్రములు కూడ ధర్మకామాది దాయకమలు ''ఈశానః మొదలు భవోద్భ వాయనమః'' యను వరకును మూలోక్తములు ఐదు ఈశానాది మంత్రమలు. ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు పంచ బ్రహ్మ యొక్క ఆరు అంగములను చెప్పెదను. 'ఓం నమః'' పరమాత్మనే మొదలు ''తేస్వాహా'' వరకును వున్న డెబ్బది ఏడు అక్షరముల హృదయ మంత్రము మరోరథములను ఇచ్చును. ఓం శివ శివాయనమః'' ఇది శిరో మంత్రము. ఓం శివ హృదయే జ్వాలినీ స్వాహా శిఖాయై వషట్‌ ఇది శిఖా మంత్రము ఓంశివాత్మక మొదలు ''స్తంభయ హూం'' వరకు వున్నవి ఒకనూరు ఐదు అక్షరముల కవచ మంత్రము ఓం ఓజసే యనునది నేత మంత్రము. ఓం ''ప్రస్ఫుట'' మొదలు ''హూం ఫట్‌'' వరకును వున్నది అఘోరాస్త్ర మంత్రము.

అగ్నిమహాపురాణమున షండగా ఘోరాస్త్ర వర్ణనమను మూడువందల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page