Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుర్దశాధిక త్రిశతతమో7ధ్యాయః

అథ త్వరితాజ్ఞానమ్‌

అగ్ని రువాచ :

ఓం హ్రీం హ్రూం ఖే ఛే క్షః స్త్రీం హ్రూం క్షే హ్రీం ఫట్‌ త్వరితాయైనమః |

త్వరితాం పూజయేన్న్యస్య ద్విభుజాం చాష్టబాహుకమ్‌ |

ఆధార శక్తిం పద్మంచ సింహే దేవీం హృదాదికమ్‌. 1

పూర్వాదౌ గాయత్రీం యజేన్మండలే వైప్రణీతయా | హుంకారాం ఖేచరీం చండాం ఛేదనీం క్షేపణీం స్త్రియాః.

హుంకారాం క్షేమకారీంచ ఫట్కారీం మధ్యతోయజేత్‌ |

జయాంచ విజయా ద్వారి కింకరంచ తదగ్రతః. 3

తిలైర్హోమైశ్చ సర్వాపై#్త్యనామావ్యాహృతిభిస్తథా | అనంతాయ నమః స్వాహా కులికాయనమః స్వధా. 4

స్వాహా వాసుకి రాజాయ శంఖపాలాయ వౌషట్‌ | తక్షకాయ వషణ్నిత్యం మహాపద్మాయ వైనమః. 5

స్వాహా కర్కోట నాగాయ ఫట్‌ పద్మాయచ వై నమః |

అగ్ని దేవుడు పలికెను. ఓం హ్రీం హ్రూం ఖే, ఛే, క్షః స్త్రీం, హ్రూం, క్షే హ్రీం ఫట్‌ త్వరితాయై నమః యను మంత్రముతో న్యాస పూర్వకముగ ద్విభుజ లేదా అష్ట భుజ యగు త్వరితా దేవిని ధ్యానించుచు పూజించవలెను. సింహాసనమును దానిపై వున్న త్వరితాదేవిని ఆ దేవి నాల్గు వైపుల హృదయాద్యంగములను పూజించవలెను. పూర్వాదిక్కులందు హృదయాద్యంగములను పూజించి మండలముపై గాయత్రిని ప్రణీతాదేవిని పూజించవలెను. ఎనిమిది దళములపై హుంకారీ, ఖేచరీ చండా, భేదినీ, క్షేపణీ, స్త్రీ హుంకారీ, క్షేమంకరులను పూజించి, మధ్య యందు ఫట్కారిణి పూజించవలెను. దేవికి ఎదురుగా నున్న ద్వారము యొక్క దక్షిణ వామ పార్శ్వము లందు జయ విజయలను ద్వారా గ్రమున కింకరుని పూజించవలెను. తిల హోమములు చేసినచో సకలాభీష్ట వస్తువులు నశించును. దేవికి అలంకారములగు ఎనిమిది నాగులను నామోచ్చారణ పూర్వకముగ పూజించవలెను. అనంతాయ నమః సాహా కులికాయ నమః స్వధా, వాసుకి రాజాయ స్వాహా, శంఖపాలాయ వౌషట్‌, తక్షకాయ వషట్‌, మహాపద్మాయ నమః కర్కోట నాగాయ స్వాహా. పద్మాయ నమః ఫట్‌. ఇవి నాగపూజా మంత్రములు.

లిఖేన్నిగ్రహ చ క్రంతు ఏకాశీతి పదైర్నరః. 6

వస్త్రే పదేతనౌ భూర్జే శిలాయాం యష్టికాసుచ | మధ్యే కోష్ఠే సాధ్యనామ పూర్వాదౌ పట్టికాసుచ. 7

ఓం, హ్రీం, క్షూం, ఛంద ఛంద చతురః కంఠకాన్కాల రాత్రికామ్‌ |

ఐశాదావంబు పాదౌచ యమ రాజ్యంచ బాహ్యత | కాలీనారవమాలీ కాలీనామాక్ష మాలినీ. 8

మామోదేత త్తదోమోమా రక్షత స్వస్వభక్షవా | యమయాటటయామయ మటమో టటమో టమా. 9

వామోభూరి విభూమేయా టటరీశ్వశ్వరీ టట | యమరాజాద్బాహ్యతోవం తం తోయం మారణాత్మకమ్‌. 10

కంజలం నిమ్బనిర్యానమజ్జాసృగ్విష సంయుతమ్‌ | అంగారేణ సమాయుక్తం పింగలాధార సంయుతమ్‌.

కాకపక్షస్య లేఖన్యాశ్మశానే వాచతుష్పథే 11

నిధాపయేత్కుంభాధస్తాద్వల్మీకే వాథనిక్షి పేత్‌ | విభీతద్రుమ శాఖాధోయంత్రం సర్వారిమర్దనమ్‌. 12

పదినిలువురేఖలు, పది అడ్డరేఖలు, గీసినచో, ఎనుబది యొక్క పదములు ఏర్పడును, ఇది నిగ్రహ చక్రము, దీనిని వస్త్రముపై గాని వేదికపై గాని, భూర్జ వృక్షత్వక్కుపై గాని, శిలా పట్టముపై గాని యష్టి కలపై గాని, వ్రాయవచ్చును. మధ్యవర్తికోష్టము నందు పేరు వ్రాయవలెను. దాని పార్శ్వ భాగమున పూర్వాది దిక్కుల యందు నాలుగు పట్టికలపై భ్రూం, క్ష్రూం, భ్రూం, హ్రూం, యను నాలుగు బీజములు వ్రాసి ఈశావాది కోణములందు లోపలి వైపున కాళరాత్రి మంత్రమును వ్రాసి వెలుపల వైపున యమరాజ మంత్రము వ్రాయవలెను. ''కాశీ, మార'' మొదలు ''అక్షర'' వరకును మూలోక్తమైనది. కాశీ మంత్రము యమావాట, మొదలు రీటట, వరకువున్న మూలోక్త మంత్రము యమ మంత్రము. యమ మంత్రము వెలుపల నలువైపుల రం వ్రాసి దానిక్రింద యం వ్రాయవలెను. దీనిచే మారణాత్మక నిగ్రహ మంత్రము ఏర్పడును. వేపచిగురు మజ్జ రక్తము, విషము కలిపిన సిరాలో కొంచెము చితాబొగ్గు నూరి కలిపి దానిని పింగళ వర్ణమగు సిరా బుడ్డిలో వుంచి, కాకి ఈక కలముతో నిగ్రహ మంత్రము వ్రాసి దానిని శ్మశాన భూమి యందుకాని, చతుష్పథము నందుగాని, గోతిలో క్రిందికి పాతవలెను. లేదా పుట్టయందు వుంచవలెను. లేదా నిభీతక ద్రుమశాఖ క్రింద పాతవలెను. ఇట్లు చేయుటచే శత్రువు లందరును నశింతురు.

లిఖేచ్చాను గ్రహంచక్రం శుక్లపత్రే7థ భూర్జకే | లాక్షయా కుంకుమేనాథ ఖటికా చందనేనవా. 13

భువి భిత్తౌచ పూర్వాది నామమధ్యమ కోష్ఠగే | ఖండేతు వారి మధ్యస్థం ఓం హంసోవాపి పట్టిశమ్‌. 14

లక్ష్మీశ్లోకం శివాదౌచ రాక్షసాది క్రమాల్లిఖేత్‌ | శ్రీః సామమోమాసా శ్రీః సానౌయాజ్ఞేజ్ఞేయానౌసా. 15

మాయాలీలా లాలీయామా యాజ్ఞేజ్ఞేయా నౌసామాయా |

యత్రజ్ఞేయా బహిః శీఘ్రా దిక్షురం కలశంబహిః . 16

శుక్ల పక్షమున భూర్జపత్రము నందును నేలపైనను గోడపైనను లాక్షారసముతో గాని, కుంకుమతోగాని ఖడికాచందనముతో గాని అనుగ్రహ చక్రము వ్రాయవలెను. మధ్యకోష్టమున, వ్యక్తి పేరు ఠం, ఠం, యను అక్షరముల మధ్య వ్రాసి పూర్వాది వీథియందు, జూం, సః, వషట్‌, యనునది వ్రాసి, ఈశాన్యముతో ప్రారంభించి వీథిని విడచుచు ఆగ్నేయము పర్యంతము లక్ష్మీ మంత్రమును వ్రాయవలెను. ఇదిపై నాలుగు పంక్తులందును పూర్తి యగును. క్రిందినాలుగు పంక్తులలో అన్నిటికంటెను క్రిందనున్న నైఋతి కోణస్థ కోష్టమునందు ప్రారంభించి, కుడి పంక్తి తరవాతపై పంక్తి కూడ ఎడమనుండి కుడికి వ్రాయవలెను. ఈ విధముగా నాలుగు పంక్తులలో లక్ష్మీ మంత్రము పూర్తి యగును ''శ్రీసా'' మొదలు ''జ్ఞేయ'' వరకును మూలోక్తమగునది లక్ష్మీ మంత్రము. చక్ర బహిర్భాగమున నలువైపుల త్వరితా మంత్రముప్రతిదిక్కునందును ఒక పర్యాయము చొప్పున వ్రాయవలెను. ఈచతురశ్ర చక్రమును గోళ్ళరేఖతో, అదికలశలోనికి వెళ్ళునట్లు చుట్టి కలశ క్రింద ఒక కమలము ఏర్పరచి దానిపై కమలమును స్థాపించవలెను. కమలముపై స్థాపించిన పద్మచక్రమును వ్రాసి, దానిని ధరించినచో మృత్యువు తొలగును, స్వర్గము లభించును. అది శాంత సాధనమునకు కూడ ఉపయోగించును. సౌభాగ్యాదులను ఇచ్చును.

పద్మస్థ పద్మవక్రంచ మృత్యుజిత్సర్వగం ధృతిమ్‌ | శాంతీనాం పరమాశాన్తిః సౌభాగ్యాది ప్రదాయకమ్‌.

రుద్రేరుద్ర సమాఃకార్యాః కోష్టకాస్తత్రతా లిఖేత్‌ | ఓమాద్యా హ్రూంషడన్తాంచ అదివర్ణమథాన్తిమః. 18

విద్యావర్ణక్రమేణౖవ సంజ్ఞాంచ వషడన్తికమ్‌ | అధస్తాత్ర్పత్యంగిరైషా సర్వకామార్థ సాధికా. 19

ఏకాశీతిపదే సర్వామాది వర్ణక్రమేణతు | ఆదిమంయావ దన్తం స్యాద్యషడన్తంచ నామవై. 20

ఏషాప్రత్యంగిరా చాన్యా సర్వకార్యాది సాధనీ | నిగ్రహానుగ్రహశ్చక్రంచతుః షష్టి పదైర్లిఖేత్‌. 21

ఆనృతీసాచ విద్యాచక్రీం సఃహూం నామాథ మధ్యతః |

షట్‌కారాద్యాం పత్రగతాం త్రిహ్రీంకారేణ వేష్టయేత్‌. 22

కుంభవద్ధారితా సర్వశత్రు హృత్సర్వదాయికా | విషన్న శ్యేత్కర్ణ జపాదక్షరాద్యైశ్చ దండకైః. 23

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే త్వరితామంత్రకథనంనామ చతుర్దశాధిక త్రిశతతమో7ధ్యాయః.

పదకొండు నిలువురేఖలు పదకొండు అడ్డ రేఖలు గీసికూడ ఇరువది ఒక్క కోష్ఠములు ఏర్పరచి మధ్య కోష్ఠము నందు పేరు వ్రాయవలెను. ఈశాన్య కోష్ఠముతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమమున పండ్రెండు పర్యాయములు త్వరితా విద్యాక్షరములను హ్రీం, విడచి వ్రాయవలెను. రేఖాగ్ర భాగములందు త్రిశూల చిహ్నము వుంచవలెను. త్వరితా విద్యా వర్ణములను క్రమముగానే వ్రాసి అంతమున క్రింది వైపు వషట్‌, చేర్చవలెను. ఇది సర్వకామార్థ సాధకమగు ప్రత్యంగితా విద్య ఎనుబది యొక్క కోష్ఠములు గల చక్రముపై త్వరితా విద్యాక్షరములను మొదటి అక్షరముతో ప్రారంభించి వ్రాయవలెను. ఆరు పర్యాయముములు మంత్రములు వ్రాసిన పిమ్మట అంతములందు మిగిలిన కోష్ఠములపై పేరు వ్రాసి చివర వషట్‌ చేర్చవలెను. యిది రెండవ ప్రత్యంగిరా విద్య. సర్వార్థసాధికా అరువది నాలుకోష్టములుగల చక్రముపై గూడ నిగ్రహచక్రమును, అను గ్రహ చక్రమును వ్రాయవచ్చును. ఇది అమృతా విద్య. దీని మధ్య కోష్టమున క్రీం, సః. హూం, యనియు పేరును వ్రాయవలెను. బాహ్యభాగమున కమలము ఏర్పరచి దాని దళములపై విలోమ క్రమమున త్వరితా విద్యను వ్రాయవలెను. దానిని హ్రీం కారయుక్తములగు మూడు వృత్తాకార పంక్తులతో వేష్టించి కుంభాకారము యంత్రము లోపల లిఖితములగు ఈ విద్యను ధరించుటచే సర్వ శత్రువులు నశింతురు. సర్వము లభించును. రోగి చెవిలో దీనిని జపించినచో సర్పాది విషములు శాంతించును. దీని అక్షరములతో చిహ్నితములగు దండములతో శరీరముపై కొట్టినచో విషము శమించును.

అగ్ని మహాపురాణమున త్వరితా మంత్రనిరూపణమున మూడువందల పదునాలుగవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page