Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్తాధిక త్రిశతతమో7ధ్యాయః

అథు త్రైలోక్య మోహన మంత్రాః

అగ్నిరువాచ :

వక్ష్యే మంత్రం చతుర్వర్గ సిద్ధ్యై త్రైలోక్య మోహనమ్‌ |

ఓం శ్రీం హ్రీం హ్రూం ఓం నమః పురుషోత్తమ పురుషోత్తమ

పతి రూప లక్ష్మీ నివాస సకల జగత్షోభణ సర్వస్త్రీ

హృదయ దారణ త్రిభువన మదోన్మాదకర సురమనుజ

సుందరీజన మనాంసి తాపయ తాపయ దీపయ దీపయ శోషయ శోషయ

మారయ మారయ స్తంభయ స్తంభయ ద్రావయ ద్రావయ ఆకర్షయ అకర్షయ

పరమ సుభగ సర్వ సౌభాగ్యకర కామప్రద ఆముకం

హన హన చక్రేణ గదయా ఖడ్గేన సర్వబాణౖర్భింద భింద

పాశేనకట కట అంకుసే తాడయ తాడయ త్వర త్వర కిం

తిష్ఠతి యావత్‌ తావత్‌ సమీహితం మేసిద్ధం భవతిహ్రూం

ఫట్‌ నమః | ఓం పురుషోత్తమ త్రిభువనమదోన్మాదకర

హ్రూంఫట్‌ హృదయాయ నమః | కర్షయ మహాబల హ్రూం

ఫట్‌ అస్త్రాయ | తిభువనేశ్వర సర్వజన మనాంసి

హన హన దారయదారయ మమవశమానయ ఆనయ హ్రూం ఫట్‌నేత్రాయ |

త్రైలోక్యమోహన హృషీకెశా ప్రతిరూప సర్వస్త్రీ హృదయాకర్షణ ఆగచ్ఛాగచ్ఛనమః |

సాంగాక్షి వ్యాపకేనైవ న్యాసంమూల వదీరితమ్‌. 1

ఇష్ట్వాసంజప్య పంచా శత్సహస్రమ భిషిచ్యచ | కుండే7గ్నౌ దైవికే వహ్నౌచరుంకృత్వాశతం హునేత్‌. 2

పృథగ్దధిఘృతంక్షీరం చరుం సాజ్యం వయఃశృతమ్‌ | ద్వాదశాహుతిమూలేన సహస్రం చాక్షతాంస్తిలాన్‌. 3

యవం మధుత్రయంపుష్పం ఫలం దధిసమిచ్ఛతమ్‌ | హుత్వాపూర్ణాహుతిం శిష్టంప్రాశ##యేత్సఘృతంచరుమ్‌.

సంభోజ్య విప్రానాచార్యం తోషయేత్సిధ్యతేమనుః | స్నాత్వాయథా వదాచమ్య వాగ్యతోయాగ మందిరమ్‌. 5

గత్వాపద్మానవం బద్ధ్వాశోషయే ద్విధినావపుః | రక్షఘ్నవిఘ్న కృద్దిక్షున్యసేదాదౌ సుదర్శనమ్‌. 6

తం బీజం నాభిమధ్యస్థం ధూమ్రం చండానిలాత్మకమ్‌ | అశేష కల్మషం దేహాద్విశ్లేషయదను స్మరేత్‌. 7

రంబీజం హృదయాబ్జస్థం స్మృత్వా జ్వాలాభిరాదహేత్‌ | ఊర్ద్వాధ స్తిర్యగ్గాభిస్తు మూర్ద్నిసంప్లావయేద్వపుః 8

ధ్యాత్వామృతైర్బహిశ్చాంతః సుషుమ్నా మార్గగామిభిః | ఏవం శుద్దవపుః ప్రాణానాయమ్య మనునాత్రిధా. 9

విన్న్యసేన్న్యస్త హస్తాంతః శక్తిమస్తక వక్త్రయోః | గుహ్యేగలే దిక్షుహృది కుక్షౌదేహేచ సర్వతః. 10

ఆవాహ్య బ్రహ్మరంధ్రేణ హృత్పద్మే సూర్యమండలాత్‌ ః తారేణౖవం పరాత్మానం న్మరేత్తం సర్వలక్షణమ్‌.

త్రైలోక్య మోహనాయ విద్మహే స్మరాయ (?) ధీమహి | తన్నో విష్ణుఃప్రచోదయాత్‌.

ఆత్మార్చనా త్ర్కతుద్రవ్యం ప్రోక్షయేచ్ఛుద్ధ పాత్రకమ్‌ |

కృత్వాత్మ పూజాం విధినా స్థండిలేతం సమర్చయేత్‌. 12

అగ్ని దేవుడు పలికెను చతుర్వర్గ సిద్ధికై త్రైలోక్య మోహన మను మంత్రమును చెప్పెదను. "ఓం శ్రీం హ్రీం" మొదలు "ఆగచ్ఛ ఆగచ్ఛ నమః" వరకును మూలోక్తమగు మూలమంత్ర యుక్త వ్యాపక న్యాసము చెప్పబడినది. పూజ చేసి ఏబది వేల జపము చేసి అభిషేకము చేసి వైదిక విధిచే స్థాపించిన కుండాగ్నిలో నూరు హోమములు చేయవలయును. దధి ఘృత క్షీర ఘృతయుక్త చెరు శృత వయస్సులను వేర్వేరుగా మూల మంత్రముతో పండ్రెండ్రు పర్యాయములు హోమము చేసి అక్షత తిలయవలతో వెయ్యి హోమములు చేసి త్రిమధు పుష్ప ఫల దధి సమిధలతో నూరేసి హోమములు చేయవవలయును. పిదప పూర్ణాహుతి చేసి మిగిలిన ఘృత సహిత చెరువును భక్షించవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి అచార్యుని దక్షిణాదుతో సంతోషింప చేయవలయును. మంత్రము సిద్ధించును. స్నానా చమనములు చేసి మౌనముతో యాగ మందిరమున ప్రవేశించి పద్మాసనమున కూర్చుండి తాంత్రిక విధానముతో శరీర శోషణము చేయవలయును. ముందుగా రాక్షసులను విఘ్నకారక భూతములను అణచుటకై అన్ని దిక్కులందును సుదర్శన న్యాసము చేయవలయును. ఈ సుదర్శనము పంచ క్లేశములకు బీజము, ధూమ్ర వర్ణము ప్రచండానిల రూపము. నాభి ప్రదేశము నందున్న నా సకల పాపములను శరీరము నందుండి తొలగించుచున్నది యని భావన చేయవలయును. పిదప హృదయాబ్జము నందున్నరం బీజమును స్మరించి మీదను క్రిందను పార్శ్వము లందును వ్యాపించియున్న అగ్ని జ్వాలలచే ఆ పాప పుంజమును జ్వలింపచేసి భస్మము చేయవలయును. పిదప శిరస్సు నందు అమృత భావన చేసి సుషుమ్నా నాడీ మార్గమున వచ్చుచున్న ఆ అమృత ధారలచే తన శరీరమును బయటను లోపలను కూడ ఆప్లావితము చేయవలయును. ఈ విధముగా శుద్ధ శరీరుడై మూల మంత్రముతో మూడు ప్రాణాయామములు చేసి శిరో ముఖ గుహ్య గ్రీవ. సకలదిక్‌ హృదయ కుక్షి సమస్త శరీరము లందు హస్త ముంచి వాటిపై శక్తిన్యాసము చేయవలయును. సూర్య మండలము నుండి పరమాత్మను ఆవాహనము చేసి బ్రహ్మ రంధ్ర మార్గము నుండి హృదయ కమలమునకు తీసుకొని వచ్చి ప్రణవోచ్చారణ చేయుచు సర్వలక్ష లక్షణ సంపన్నుడగు ఆ పర మాత్మను స్మరిచవలెను. "త్రైలోక్య మోహనాయ విద్మహే" స్మరాయధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్‌" యనునది త్రైలోక్య మోహన గాయత్రి. అత్మార్చనానంతరము యజ్ఞ ద్రవ్యములను శుద్ధములగు పాత్రములను ప్రోక్షించి ఆత్మ వూజచేసి వేదికపై అర్చించవలెను.

కూర్మాది కల్పితే పీఠే పద్మస్థంగరుడోపరి | సర్వాంగ సుందరం ప్రాప్తవయో లావణ్య ¸°వనమ్‌. 13

మదాఘూర్ణితతామ్రాక్ష ముదారం స్మర విహ్వలమ్‌ | దివ్య మాల్యాంబర లేప భూషితం సస్మితాననమ్‌. 14

విష్ణుంనానా విధానేక పరివార పరిచ్ఛదమ్‌ | లోకాను గ్రహణం సౌమ్యం సహస్రాదిత్య తేజసమ్‌. 15

పంచబాణధరం ప్రాప్తకామైక్షం ద్విచతుర్భజమ్‌ . దేవస్త్రీభిర్వృతం దేవీముఖాసక్తేక్షణం జపేత్‌. 16

చక్రం శంఖం ధనుః ఖడ్గం గదా ముసల మంకుశమ్‌ | పాశంచ బిభ్రతం చార్చేదావాహాది విసర్గతః. 17

శ్రియం వామోరు జంఘాస్థాం శ్లిష్యన్తీం పాణినాపతిమ్‌ | సాబ్జవామకరాం పీనాం శ్రీవత్స కౌస్తుభాన్వితామ్‌.

మాలినం పీత వస్త్రంచ చక్రాద్యాఢ్యం హరింయజేత్‌ |

ఓం సుదర్శన మహాచక్రరాజ ధర్మశాంత దుష్ట

భయంకర చ్ఛిద చ్ఛిద విదారయ విదారయ పరమంత్రాన్‌

గ్రస గ్రస భక్షయ భక్షయ భూతాని నాశయ నాశయ

హ్రూం ఫట్‌ ఓం జలచరాయ స్వాహా ఖడ్గతీక్ష్‌

చ్ఛిన్ద చ్ఛిన్ద ఖడ్గాయనమః శార్జాయ సశరాయ హ్రూం ఫట్‌|

భూతగ్రామాయ విద్మహే చతుర్విధాయ ధీమహి |

తన్నో బ్రహ్మ ప్రచోదయాత్‌.

సంవర్తక శ్వసన పోథయ పోథయ హ్రూం ఫట్‌

స్వాహా | పాశ బంధ బంధ ఆకర్షయ ఆకర్షయ హ్రూం

ఫట్‌ | అంకుశేన కట్ట కట్ట హ్రూం ఫట్‌ |

క్రమాద్భుజేషు మంత్రై ః సై#్వరేభిరస్త్రాణి పూజయేత్‌. 19

ఓం పక్షిరాజాయ హ్రూం ఫట్‌ |

తార్ష్యం యజేత్కర్ణి కాయామంగ దేవాన్యథావిధి |

శక్తిరింద్రాది యంత్రేషు తార్ష్యాద్యా ధృత చామరాః. 20

శక్తయో7న్తే ప్రయోజ్యాదౌ సురేశాద్యాశ్చ దండినా | పీతేలక్ష్మీ సరస్వత్యౌ రతిప్రీతిజయాః సితాః. 21

కీర్తి కాంత్యాసితేశ్యామే తుష్టి పుష్ట్యౌస్మరోదితే | లోకే శాంతం యజేదేవం విష్ణు మిష్టార్థ సిద్ధయే. 22

ధ్యాయేన్మంత్రం జపిత్వైనం జుహుయాత్త్వ భిషేచయేత్‌ |

ఓం శ్రీం క్రీం హ్రీం హ్రూం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః |

ఏతత్పూజాదినా సర్వాన్కామానాప్నోతి పూర్వవవత్‌. 23

తోయైః సమ్మోహనీ పుషై#్పర్నిత్యం తేన చ తర్పయేత్‌ |

బ్రహ్మాసశక్ర శ్రీదండీ బీజం త్రైలోక్య మోహనమ్‌. 24

జప్త్వాత్రిలక్షం హుత్వాచ లక్షం బిల్వైశ్చ సాజ్యకైః |

తండులైః ఫలగంధాద్యైర్దూర్వాభిస్త్వాయురాప్నుయాత్‌. 25

తయాభిషేక హోమాది క్రియాతుష్టోహ్య భీష్టదః |

ఓం నమో భగవతే వరాహాయ భూర్భువః స్వః పతయే

భూపతిత్వం మేదేహి హృదయాయ స్వాహా |

పంచాంగం నిత్యమయుతం జప్త్వాయూ రాజ్య మాప్నుయాత్‌. 26

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే త్రైలోక్య మోహన మంత్ర కథనం నామ సప్తాధిక త్రిశతతమో7ధ్యాయః.

కూర్మాది రూపమున కల్పితమగు పీఠముపై గరుత్మంతునిపై పద్మాసనము నందున్న శ్రీ మహా విష్ణువు సర్వాంగ సుందరుడు. వయస్సు తగిన లావణ్య ¸°వనములు కలవాడు. అతని ఎర్రని నేత్రముల మదముచే తిరుగుచుండును ఉదారుడు. స్మరవిహ్వలుడు. దివ్య మాల్యాంబర ఆలేపములచే అలంకృతుడు. మందహాసము కలవాడు. అనేక విధములగు పరివార పరికరములు కలవాడు. లోకానుగ్రహ కారకుడు. సౌమ్యుడు. సహస్ర సూర్య తేజశ్శాలి. ఐదు బాణములు ధరించినవాడు. ఆతని అన్ని ఇంద్రియములును ప్రాప్తకామములు ఎనిమిది భుజములు గల వాడు. దేవతాస్త్రీలు యాతనిని చుట్టు ముట్టి యుందురు. ఆతని దృష్టి లక్ష్మీ ముఖపై లగ్నమై యుండును. ఈ విధముగ భగవంతుని ధ్యానించవలెను. ఆతని ఎనిమిది హస్తములలో వరుసగా చక్ర శంఖ ధనుః ఖడ్గ గదా, ముసల, అంకుశ, పాశములుండును. ఆతనిని

(అ) 35/2

ఆవాహనాదుల ద్వారా పూజించి అంతమును విసర్జించవలెను. శ్రీ మహా విష్ణుపు తన వామోరు జంఘలపై చేతితో తనను ఆలింగనము చేసుకొని వున్న లక్ష్మిని కూర్చుండబెట్టుకొని యుండును. ఆమె ఎడమ చేతిలో పద్మము వుండును. ఆమె బలిసి శ్రీవత్స కౌస్తుభములతో ప్రకాశించుచుండును. మాలా ధారియు, పీత వస్త్రుడు, చక్రాది ధారియు యగు హరిని పూజించ వలెను. "ఓం సుదర్శన మొదలు హుంఫట్‌" వరకును మూలములలో నున్నది. సుదర్శన మంత్రముతో సుదర్శనమును పూజించవలెను. "ఓం జల చరాయ స్వాహా" ఖడ్గ తీక్ష ఛింద, ఖడ్గాయ నమః శార్జాయ, సశరాయ హుంఫట్‌". ఇవి పాంచజన్యాది పూజా మంత్రములు. "భూతగ్రామాయ విద్మహే చతుర్విధాయధీ మహి" తన్నో బ్రహ్మ ప్రచోదయాత్‌. ఇది భూత గ్రామ గాయత్రి. సంవర్తక శ్వసన పోథయ పోథయ హుంఫట్‌ స్వాహా" పాశబంధ బంధ, ఆకర్షయ, ఆకర్షయ హుంఫట్‌. అంకుశ కట్ట కట్ట హుంఫట్‌". వీటిలో ముసలాదులను వాటి వాటి మంత్రములతో పూజించవలెను. "ఓం పక్షిరాజాయ హుంఫట్‌" యని గరుత్మంతుని పూజించవలెను. కర్ణిక యందు యథావిధికా అంగ దేవతలను పూజించి పూర్వాది దళములందు లక్ష్మ్యాది శక్తులను చాతురధారి ఆర్యాదులను పూజించవలెను. శక్తి పూజ అంతము నందు చేయవలయును. ముందుగ దండి సహితులగు ఇంద్రాదులను పూజించవలెను. లక్ష్మీ సరస్వతులు పీతవర్ణము కలవారు. రతి ప్రీతి జయలు శ్వేత వర్ణము కలవారు. కీర్తికాంతులు కూడ శ్వేత వర్ణులు తుష్టి పుష్టులు. శ్యామ వర్ణము కలవారు. వీరిలో స్మర భావముండును. లోకేశుని వరకు దేవతలను పూజించి అభీష్ట సిద్ధికై విష్ణువును పూజించవలెను. ఈ క్రింది మంత్రమును జపించి హోమాభిషేకములు చేయవలయును. "ఓం శ్రీం క్లీం హ్రీం హ్రూం త్రైలోక్య మోహనాయవిష్ణవే నమః" అని మంత్రము. ఈ విధముగా పూజాదులు చేయుటచే సర్వకామములను పొందును. జలముతో సంమోహనీ వృక్ష పుష్పముతోను పైమంత్రము చెప్పుచు నిత్యతర్పణము చేయవలయును. బ్రహ్మ ఇంద్ర శ్రీదేవి, దండి, బీజమంత్ర త్రైలోక్య మోహన విష్ణువులను పూజించి పైమంత్రమును మూడు లక్షను జపించి కమల పుష్ప బిల్వ పత్ర ఘృతములతోను. తుండల ఫల సుగంధ చందనాది ద్రవ్యములతోను దూర్వలతోను ఓక లక్ష హోమము చేయవలయును. దీర్ఘాయుర్దాయము పొందును. జపాభిషేకహోమాదులచే సంతుష్టుడై మహా విష్ణువు ఆభీష్ట ఫలములను ఇచ్చును. "ఓం నమో భగవతే వరాహాయా" భూర్భుభువన్న్వఃపతయే భూపతిత్వం మే దేహి హృదయాయ స్వాహా". ఇది వరాహమంత్రము. దీనికి ఐదంగము లుండును. ప్రతి దినము పది వేల చొప్పున జపము చేసిన వాడు ఆయుర్దాయమును రాజ్యమును పొందును.

అగ్ని మహా పురాణమునత్రైలోక్య మోహన మంత్ర కథన మును మూడు వందల యేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page