Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్వ్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ నానా మంత్రౌషధ నిరూపణమ్‌

అగ్ని రువాచ :

వాక్కర్మ పార్శ్వయుక్ముక్ల తోకకృతే మతోప్లవః హుతాన్తా దేశవర్ణేయం విద్యా ముఖ్యా సరస్వతీ. 1

అక్షా రాశీ వర్ణలక్షం జపేత్స మతిపాన్భవేత్‌ | అత్రిః సవహ్నిర్వా మాక్షిబిందురింద్రాయ హృత్పరః. 2

వజ్రపద్మధరం శక్రం పీత మావాహ్య పూజయేత్‌ | నియుతం హోమయేదాజ్య తిలాంస్తేనాభిషేచయేత్‌. 3

నృపాదిర్భ్రష్టరాజ్యాదీన్‌ రాజ్యపుత్రాది మాప్నుయాత్‌ | హృల్లేఖా శక్తి దేవాఖ్యా దోషాగ్నిర్దండి దండవాన్‌.

శివ మిష్ట్వా జపే చ్ఛక్తిమష్టమ్యాది చతుర్దశీమ్‌ | చక్రపాశాంకుశ ధరాం సభాయాం వరదాయికామ్‌. 5

హోమాదినాచ సౌభాగ్యం కవిత్వం పుత్రవాన్భవేత్‌ |

ఓం హ్రీం, ఓం నమః కామాయ సర్వజన హితాయ సర్వ

జన మోహనాయ ప్రజ్వలితాయ సర్వజన హృదయం

మమాత్మ గతం కురు. ఓం ఓం ఏతజ్జపాది నామంత్రోవశ యేత్సకలం జగత్‌. 6

ఓం హ్రీం చాముండే ఆముకం దహ దహ పచ పచ మమవశ మానయ ఆనయ ఠఠ.

వశీకరణకృన్‌మంత్రాశ్చాముండాయాః ప్రకీర్తితః | ఫలత్రయ కషాయేణ వరాంగం క్షాలయే ద్వశే. 7

ఆశ్వగంధాయవైః స్త్రీతు నిశాకర్పూర కాదినా | పిప్పలీ తండులాన్యష్టౌ మరిచానినచ వింశతిః. 8

బృహతీరస లేపాచ్చ వశేస్యాన్మరణాంతికం | కుటీరమూల త్రికటు క్షౌద్రలేపస్తథా భ##వేత్‌. 9

హిమం కపిత్థకరసం మాగధీ మధుకం మధు | తేషాంలేపః ప్రయుక్తస్తు దంపత్యోః స్వస్తిమావహేత్‌. 10

సశర్కరో యోనిలేపాత్కదంబ రసకోమధు | సహదేవీం మహాలక్ష్మీః పుత్రజీవి కృతాంజలిః. 11

ఏతచ్చూర్ణం శిరః క్షిప్తంలోకస్య వశముత్తమమ్‌ | త్రిఫలా చందనక్వాథ ప్రస్థాద్వికుడవం పృథక్‌. 12

భృంగ హేమరసం దోషాతావతీ చుంబ (ఛంబు) కంమధు |

ఘృతైః పక్వానిశాఛాయా శుష్కా లేప్యాతు రంజనీ. 13

విదారీంసోచ్చటా మాషచూర్ణీ భూతాం సశర్కరామ్‌ | మథితాంయః పిబేత్‌క్షీరైర్నిత్యం స్త్రీశతకం వ్రజేత్‌. 14

అగ్నిదేవుడు పలికెను. ''ఐం, కులజే ఐం సరస్వతిస్వాహా'' ఇది పదకొండు అక్షరముల ముఖ్యమంత్రమైన సరస్వతీ విద్యా. ఉప్పులేని ఆహారము తినుచు అక్షరలక్షలు జపము చేసినవాడు బుద్ధిమంతుడగును. అత్రి (ద్‌) అగ్ని (ర్‌) వామనేత్ర (ఈ) బిందు (ం) ఇవి కలుపగా ఏర్పడిన ''ద్రీం'' యను మంత్రము శత్రువులను పారద్రోలు మహామంత్రము వజ్రకమలములను ధరించిన పీతవర్ణుడగు ఇంద్రుని ఆవాహనచేసి పూజించి ఘృత తిలములతో లక్ష హోమములు చేయవలయును. పిదప తిల మిశ్రజలముతో ఇంద్రునకు అభిషేకము చేయవలయును. అట్లు చేయుటచే రాజు కోల్పోయిన రాజ్యమును పుత్రాదులను పొందును. హ్రీం అనుదానికి ''శక్తిదేవ'' యనిపేరు దీని ఉద్ధారము ఘోష అగ్ని దండి దండములు. శివా శివ పూజలు చేసి ఈ మంత్రమును జపించవలయును. అష్టమీనుండి చతుర్దశి వరకు పూజలో వుండవలెను. చేతులలో చక్రము పాశము అంకుశము అభయముద్ర ధరించిన వరదాత్రియగు దేవిని ఆరాధన చేసి హోమాదులు చేయుటచే సౌభాగ్యము కవితాశక్తి పుత్రులు లభింతురు. ''ఓం హ్రీం ఓంనమః'' మొదలు ''కురుకురు ఓం'' వరకును వున్న మూలోక్త మంత్రమును జపాదులు చేయుటచే సంపూర్ణ జగత్తువశములో నుండును. ఓంహ్రీం చాముండే అముకం దహదహ పచపచ మమవశమానయస్వాహా ఓం'' ఇది చాముండా వశీకరణమంత్రము. ఈవశీకరణ ప్రయోగ సమయమున స్త్రీ చల్లని త్రిఫలాజలముతో తన గుహ్యాంగమును కడుగుకొనవలయును. అశ్వగంధయవ క్షార హరిద్రా కర్పూరాదులు కూడ ఇందుకు ఉపయోగించవచ్చును. ఎనిమిది పిప్పలి తండులములు ఇరువది మిరియముగింజలు బృహతీరసము వీటి లేపముచే కూడ మరణాంతము వరకు వశము చేసుకొన గలుగును. కటీరమూల త్రికటు క్షౌద్ర లేపముకూడ ఇందులకు ఉపయోగించును. హిమ, కపిత్థక రస, మాగధీ మధు వీటి ప్రయోగము దంపతులకు క్షేమకరము. శర్కర కలిపిన కబందరసమును మధువును గుహ్యాంగము నందు లేపనము చేసినచో వశీకరణమగును. సహదేవి, మహాలక్ష్మి పుత్రజీవి కృతాంజలులు చూర్ణమును శిరస్సుపై ఉంచినచో ఇది ఉత్తమమైన వశీకరణ సాధనము. త్రిఫలా చందనముల క్వాథము ఒక ప్రస్థము వేరుగాను రెండుకుడవములు వేరుగాను వుంచి భృంగ హిమరసములు అంతే ప్రమాణము గల పసుపు చుంబకము తేనె. నేతిలో ఉడికించినపుడు పసుపు, ఎండిన పసుపు వీటి అన్నిటితో లేపము తయారుచేసి బిదారి జటా మాంస చూర్ణము నందు శర్కర కలిపి బాగుగా మర్దించి పాలతో ప్రతిదినము సేవించు పురుషుడు స్త్రీ శతముతో సంగమము చేయకలుగును.

గుల్మమాషతిలవ్రీహి చూర్ణక్షీర సితాన్వితమ్‌ | అశ్య (శ్వ) త్థవంశ దర్భాణాం మూలంవై వైష్ణవీశ్రియోః.

మూలందూర్వాశ్వ గంధోత్థం పిబేత్‌క్షీరైః సుతార్థినీ |

కౌంతీలక్ష్మ్యోః శిఫాధాత్రీ వజ్రం లోధ్రం వటాంకురమ్‌. 17

ఆజ్యక్షీరమృతౌపేయం పుత్రార్థం త్రిదివంస్త్రియా | పుత్రార్థినీ పిబేత్‌క్షీరం శ్రీమూలం సవటాంకురమ్‌. 18

శ్రీవటాంకుర దేవీనాం రసం నస్యే పిబేచ్చసా | శ్రీపద్మమూల ముతీక్షర మశ్వత్థోత్తర మూలయుక్‌. 18

తరలం పయసాయుక్తం కార్పాస ఫలపల్లవమ్‌ | ఆపామార్గస్య పుష్పాగ్రం నవం సమాహిషీపయః. 19

పుత్రార్థం చార్దషట్‌ శ్లోకైర్యోగాశ్చత్వార ఈరితాః | శర్కరోత్పల పుష్పాక్ష లోధ్ర చందనసారివాః. 20

స్రవమాణ స్త్రియా గర్భే దాతవ్యా స్తండులాంభసా | లాజాయష్టి సితాద్రాక్షాక్షౌద్ర సర్పిషివా లిహేత్‌. 21

గుల్మ, మాష, తిలవ్రీహి చూర్ణములతో పాలు శర్కరకలిపి అశ్వత్థ వంశ, దర్భమూల వైష్ణవీశ్రీ మూలములను దూర్వా అశ్వగంధ మూలములను పుత్రులు కోరు స్త్రీ పాలతో త్రాగవలెను. కాంతిలక్ష్మి శిఫాధాత్రి. వజ్ర, లోధ్ర, వటాంకురములను స్త్రీ ఋతుకాలమునందు ఆజ్యక్షీరములు కలిపి త్రాగవలెను. పుత్రుడు కలుగును. పుత్రార్థినియగు స్త్రీ శ్రీయను ఓషధీమూలమును వటాంకురమును క్షీరముతో త్రాగవలెను. శ్రీ వటాంకుర దేవీల రసమును నశ్యముగా తీసుకొనవచ్చును. త్రాగవచ్చును. శ్రీ పద్మమూల అశ్వత్థ ఉత్తరమూలములను పాలతో త్రాగవలెను. కార్పాస ఫలములను పల్లవములను పాలలో నూరి పలుచగ చేసి త్రాగవలెను. అపామార్గ నూతన పుష్పాగ్రములను గేదెపాలతో త్రాగవలెను. పైన చెప్పిన ఆరున్నర శ్లోకములలో నాలుగు పుత్రప్రాప్తియోగమును చెప్పుబడినవి. స్త్రీకి గర్భ స్రావమగుచున్నచో శర్కర, ఉత్పల పుష్ప, అక్షలోధ్ర, చందన. శారిబాలతలను బియ్యపుకడుగులో నూరిగాని లేదా లాజాయష్టిసితా, ద్రాక్ష, మధు, ఘృతములను కలిపిగాని స్త్రీ సేవించవలెను.

అటరూషకలాంగల్యోః కాకమాచ్యాః శిఫాపృథక్‌ | నాభేరధః సమాలిప్య ప్రసూతే ప్రమదా సుఖమ్‌. 22

రక్తం శుక్లం జపాపుష్పం రక్తశుక్ల స్రుతౌ పిబేత్‌ | కేసరం బృహతీ మూలం గోపీయష్టి తృణోత్పలమ్‌. 23

సాజక్షీరం సతైలం తద్భక్షణం రోమజన్మకృత్‌ | శీర్య మాణషు కేశేషు స్థాపనంచ భ##వేదిదమ్‌. 24

ధాత్రీ భృంగరసప్రస్థం తైలంచ క్షీరమాఢకమ్‌ | షష్ట్యంజన ఫలం తైలం తత్కుశాక్షి శిరోహితమ్‌. 25

హరిద్రారాజవృక్షత్వక్‌ చించాలవణలోధకౌ | పీతాఖారీ హరేదాశు గవాముదర బృంహణమ్‌. 26

ఓం నమో భగవతే త్ర్యంబకాయ ఉపశమయ ఉపశమయ

చులుచులు మిలి మిలి భిదభిద గోమానినీ చక్రిణీ హ్రూంఫట్‌ |

అస్మిన్‌ గ్రామే గోకులస్య రక్షాంకురు శాంతింకురు శాంతింకురు ఠఠఠ.

ఘంటాకర్ణో మహాసేనో వీరః ప్రోక్తో మహాబలః. 27

మారీనిర్నాశనకరః సమాం పాతు జగత్పతిః శోక్లౌచైవన్యసేదేతౌ మంత్రౌ గోరక్షకౌ పృథక్‌. 28

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానావిధ మంత్రౌషధాదికం నామ ద్వ్యధిక త్రిశతతమో7ధ్యాయః.

ఆటరూష, కలాంగలీ, కాకమాచీ శిఫలను నూరి నాభి క్రిందు భాగమున పూసినచో సుఖప్రసవమగును. రక్త శుక్ల జపాపుష్పములు రక్త శుక్ల ఓషధులు కలిపి త్రాగవలెను. కేసరబృహతీ మూల గోపీ షష్టి తృణోత్పలము లను మేక పాలతో నూరి తైలము కలిపితిన్నచో వెంట్రుకలు మొలచును. జట్టు ఊడిపోకుండగ చేయుటకు కూడ ఇవి ఉపయోగించును. ధాత్రి, భృంగరసములు ఒక్కొక్క ప్రస్థము, తైలము, ఒక అఢకము పాలు షష్టి అంజనల ఒక పలము తైలము ఇవియన్నియు నేత్రకేశ శిరస్సులకు హితకరములు. హరిద్రా రాజవృక్షత్వక్‌ | చించాలవణ లోధ్ర పీతఖారులు, ఆవుల పొట్ట ఉబ్బురోగమును తొలగించును. ఓం నమోభగవతే మొదలుకురు ఠఠఠ వరకును గల మూలోక్తమంత్రము గోసముదాయరక్షామంత్రము. మహాసేనుడు, వీరుడు అగు ఘంటాకర్ణుడు మహాబలవంతుడని చెప్పబడినాడు. జగత్పతియైన ఆతడు మహామారి వినాశకుడు. ఆతడునన్ను రక్షించుగాక! ఈ రెండు మంత్రములును గోరక్షక మంత్రములు. వీటిని వ్రాసి ఇంటిలో వుంచుకొనవలయుకు.

అగ్ని మహాపురాణమునందు నానా విధమంత్రౌషధాదికమను మూడు వందల రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page