Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ నవనవత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ బాలగ్రహహరబాలతంత్రమ్‌

అగ్ని రువాచ :

బాల తంత్రం ప్రవక్ష్యామి బాలాది గ్రహమర్దనమ్‌ | అథ జాతదినే వత్సం గ్రహీ గృహ్ణాతి పాపినీ. 1

గాత్రోద్వేగో నిరాహారో నానాగ్రీవా వివర్తనమ్‌ | తచ్చేష్టితమిదం తత్స్యాన్మాతౄణాంచ బలం హరేత్‌. 2

మత్స్యమాంస సురాభక్ష్య గంధస్రగ్ధూప దీపకైః | లిమ్పేచ్చ ధాతకీ లోధ్రమంజిష్ఠా తాలచందనైః. 3

మహిషాక్షేణ ధూపశ్చ ద్విరాత్రే భీషణీగ్రహీ | తచ్ఛేష్టా కాసనిశ్వాసౌ గాత్ర సంకోచనం ముహుః. 4

అజా మూత్రైర్లిపేత్కష్ణా సేవ్యాపామార్గ చందనైః | గోశృంగ దంతకేశైశ్చ ధూపయేత్పూర్వవద్బలిః.

గ్రహీ త్రి రాత్రే ఘంటాలీ తచ్చే ష్టా77క్రందనం ముహుః |

జృంభణం స్వనితం త్రాసో గాత్రోద్వేగమరోచనమ్‌. 6

కేసరాంజన గో హస్తిదంతం సాజపయో లిపేత్‌ | నఖరాజీ బిల్వదలైర్ధూపయేచ్ఛ బలిం హరేత్‌. 7

గ్రహీచతుర్థీ కాకోలీ గాత్రోద్వేగ మరోచనమ్‌ | ఫేనోద్గారోదిశో దృష్టిః కుల్మాషైః సానవైర్బలిః. 8

గజదన్తాహినిర్మోక వాజిమూత్ర ప్రలేపనమ్‌ | సరాజీనిమ్బ పత్రేణ ధూతకేశేన ధూపయేత్‌. 9

హంసాధికా పంచమీస్యాజ్జృంభా శ్వాసోర్ధ్వధారిణీ | ముష్టిబందశ్చ తచ్చేష్టాబలిం మత్స్యాదినాహరేత్‌. 10

మేషశృంగ బలాలోధ్రశిలాతాలైః శిశుంలిపేత్‌ | ఫట్కారీతు గ్రహీషష్ఠీం భయమోహ ప్రరోదనమ్‌. 11

నిరాహారో7ంగవిక్షేపో హరేన్మత్స్యాదినాబలిమ్‌ | రాజీ గుగ్గులు కుష్ఠేభదంతాద్యైర్ధూపలేపనైః. 12

సప్తమే ముక్తకేశ్యార్తః పూతిగంధో విజృంభణమ్‌ | సాదః ప్రరోదరనం కాసోధూపో వ్యాఘ్రనఖైర్లిపేత్‌. 13

(అ) 2/32

వచాగోమయగో మూత్రైః శ్రీదండీ చాష్టమేగ్రహీ | దిశో నిరీక్షణం జిహ్వాచాలనం కాసరోదనమ్‌. 14

బలిః పూర్వైవ మత్స్యాద్యైర్ధూపలేపేచ హింగులా | వచా సిద్ధార్థలశునైశ్చోర్ధ్వగ్రాహీ మహాగ్రహీ. 15

ఉద్వేజనోర్ధ్వనిఃశ్వాసః స్వముష్టి ద్వయభాదనమ్‌ | రక్తచందనకుష్ఠా ద్యైర్దూపయేల్లేప యేచ్ఛిశుమ్‌. 16

కపిరోమనఖైర్ధూపో దశమీ రోదనీగ్రహీ | తచ్చేష్టా రోదనం శశ్వత్సుగంధో నిలవర్ణతా. 17

ధూపోనింబేన భూతోగ్ర రాజీ సర్జరసైర్లిపేత్‌ | బలిం బహిర్హ రేల్లాజ కుల్మాషకవకోదనమ్‌. 18

యావత్త్రయో దశాహం స్యాదేవం ధూపాదికా క్రియా |

అగ్నిదేవుడు చెప్పెను. బాలాది గ్రహములను తొలగించు బాల తంత్రమును చెప్పెదను. పుట్టిన దినమున శిశువును పాపినియను గ్రహి ఆవేశించుమ. దానిచే శిశువు శరీరమున ఉద్వేగము కలుగును. పాలుత్రాగక మెడ ఇటుఅటు త్రిప్పుచుండును. ఇది పాపినీ గ్రహచేష్ట. దీనిని నివారించుటకు పాపిని గ్రహికిని మాతృకలకును మత్స్యమాంస సుర, భక్ష్య గంధమాలా, ధూపదీపములతో బలి ఇవ్వవలెను. ఆ శిశువు శరీరమున, ధాతకీలోధ్ర, మంజిష్ఠా తాల చందనముల లేపనముచేసి గుగ్గులు ధూపము వేయవలయును. రెండవ రోజున భీషణియను గ్రహి ఆవేశించును. కాసనిశ్వాసములు మాటిమాటికి గాత్ర సంకోచము ఇవిదానివలన కలుగు చేష్టలు. అట్టి శిశువుకు అజామూత్రముపోసి కృష్ణ, అపామార్గ చందనములతో అరగ దీసిన పిప్పలి లేపము చేయవలయును. గోశృంగ, దంత, కేశములతో ధూపము వేసి వెనుకటివలెనే బలియివ్వవలయును. మూడవ రోజు ఆక్రమించు గ్రహపేరు ''ఘంటాలి'' మాటిమాటికి యేడ్చుట ఆవులింత అరచుట భయము గాత్రోద్వేగము అరుచి ఇవి దానివలన కలుగు చేష్టలు. అట్టి శిశువునకు కేసరము రసాంజనము గోదంతము హస్తి దంతము వీటిని మేకపాలలో నూరి శరీరమునకు పూయవలయును. నఖ రాజీ బిల్వ పత్రములలో ధూపమువేసి వెనుకటివలెనే బలి యివ్వవలయును. నాల్గవ దినమున గ్రహికాకోలి. ఇది ఆవహించిన శిశువు గాత్రోద్వేగముతో ఎక్కువగా ఏడ్చును. నురుగుకక్కును. దిక్కులవైపు చూచును. దీనిశాంతికొరకై కుల్మష మద్యములతో బలియిచ్చి గజదంత సర్పత్వక్‌ అశ్వమూత్రములను శరీరమునకు పూసి రాజీనింబ పత్రములతో గొఱ్ఱ వెంట్రుకలతో ధూపము వేయవలయును. ఐదవ గ్రహియగు హంసాదిక ఆవులింతలను ఎగుడు శ్వాసలను, ముష్టిబంధనమును కలిగించును. వెనుకటి వలెనే బలి యివ్వవలయును. శిశు శరీరమునకు మేషశృంగ బలాలోధ్ర శిలా తాలములు పూయవలయును. ఆరవ గ్రహిపట్కారి. భయమును మోహమును అధిక రోదనమును కల్గించును. శిశువు ఆహారము తినక అవయవములను ఎక్కువగా కదల్చును. వెనుకటి వలె బలియివ్వవలయును. రాజీ, గుగ్గులు, కుష్ఠ గజదంతాదులతో ధూపన లేపనాదులు చేయవలయును. యేడవరోజున గ్రహిముక్తకేశి. దానిచే ఆక్రమించబడిన శిశువు దుఃఖాతురుడగును. శరీరము నుండి దుర్వాసనవచ్చును. ఆవులింత, అధికమగును. రోదనము కాసము కలుగును. వానికి వ్యాఘ్రనఖములతో ధూపము వేసి శరీరమునకు గోమయ గోమాత్రముల లేపనము చేయవలయును. ఎనిమిదవ దినమున గ్రహి శ్రీదండి. ఈ గ్రహి ఆవేశించిన శిశువు దిక్కులు చూచును. నాలుక కదల్చును. దగ్గును. రోదనము చేయును. పూర్వోక్తగు బలిని ఇవ్వవలయును. హింగులావచా, సిద్ధార్థలశునములతో ధూప అను లేపములు చేయవలయును. తొమ్మిదవది ఊర్ధ్వగ్రహియను మహాగ్రహి. యిది ఆవేశించిన శిశువు ఉద్వేగముతో ఊర్ధ్వనిశ్వాసములతో తన రెండు పిడికిళ్ళను నమలును. వానికి రక్తచందన కుష్ఠాదులతో ధూపలేపనములు చేయవలయును. కపిరోమ నఖములతో ధూపము వేయవలయును. పదవ దివసమున రోదని అను గ్రహి ఆవేశించును. అపుడు శిశువు ఎక్కువ రోదనము చేయును. శరీరము నీలవర్ణమై సుగంధయుక్తమగును. అట్టి శిశువునకు వేపాకుతో ధూపము, ఉగ్రరాజి సర్జరముల లేపము చేయవలయును. లాజకుల్మాష, ఓదనములతో దానికి బలియివ్వవలెను. ఈ విధముగ పదమూడు రోజుల వరకు ధూపాదిక క్రియజరుపవలయును.

గృహ్ణాతి మాసికం వత్సం పూతనా సంకులీగ్రహీ. 19

కాకవద్రోదనం శ్వాసో మూత్రగంధో7క్షి మీలనమ్‌ | గోమూత్ర స్నపసంతస్య గోదన్తేన చ ధూపనమ్‌. 20

పీతవస్త్రం దదేద్రక్త స్రగ్గంధౌ తైలదీపకః | త్రివిధం పాయసం మద్యం తిలం మాంసం చతుర్విధమ్‌. 21

కరం జాధో యమదిశి సప్తాహం తైర్బలిం హరేత్‌ | ద్విమాసికంచ ముకుటా వపుఃశీతంచ శీతలమ్‌. 22

ఛర్దిః స్యాన్ముఖ శోషాది పుష్పగంధాంశుకానిచ | అపూపమోదనం దీపః కృష్ణం నీరాది ధూపకమ్‌. 23

తృతీయే గోముఖీ నిద్రా సవిణ్మూత్ర ప్రరోదనమ్‌ | యవాః ప్రియంగుః పలలం కుల్మాషం శాకమోదనమ్‌.

క్షీరం పూర్వే దదేన్మధ్యే7హని ధూపశ్చ సర్పిషా | పంచ భంగేన తత్సాన్నం చతుర్థే పింగలార్తి హృత్‌.

తనుః శీతా పూతిగంధః శోషః సమ్రియతే ధ్రువమ్‌ | పంచమీలలనా గాత్రసాదః స్యాన్ముఖశోణితమ్‌. 26

అపానః పీతవర్ణశ్చ మత్స్యాద్యైర్దక్షిణ బలిః | షణ్మాసే పంకజా చేష్టా రోదనం వికృతః స్వరః. 27

మత్స్యమాంస సురాభక్త పుష్పగంధాదిభిర్బలిః | సప్తమే తు నిరాహారా పూతి గంధాది దన్తరుక్‌. 28

పిష్టమాంస సురామాంసైర్బలిః స్యాద్యమునాష్టమే | విస్ఫోట శోషణాద్యం స్యాత్తచ్చికిత్సాం నకారయేత్‌.

నవమే కుంభకర్ణ్యార్తో జ్వరీ ఛర్దతి పాలకమ్‌ | రోదనం మాంపకుల్మాష మద్యాద్యైర్వైశ్వకేబలిః. 30

దశ##మేతాపసీ చేష్టా నిరాహారో7క్షి మీలనమ్‌ | ఘంటా పతాకా పిష్టాక్తా సురామాంస బలిఃసమే 31

రాక్షస్యేకాదశీపీడా నేత్రాదౌన చికిత్సికామ్‌ | చంచలా ద్వాదశే శ్వాసః త్రాసాదిక విచేష్టితమ్‌ 32

బలిః పూర్వే7థ మధ్యాహ్నే కుల్మాషాద్యైస్తిలాదిభిః |

ఒక మాసము వయస్సు గల శిశువును పూతన యనుగ్రహి ఆవహించును. ఇది ఆవహించిన శిశువు కాకి వలె అరచుచు, ఏడ్చును. పొడవుగా శ్వాస పీల్చుచు మాటి మాటికి కండ్లు మూయును. వాసనమూత్ర గంధము వలె నుండును. అట్టి శిశువునకు గోమూత్రముచే స్నానము చేయించి, గోదంతము ధూపము వేయవలయును. ఆ పూతన కొరకై గ్రామమునకు దక్షిణమున కరంజ వృక్షము క్రింద ఒక సప్తాహము వరకు పీత వస్త్ర రక్త మాల్య మద్య తిల చతుర్విధమాంస గంధ దీప త్రివిధపాయసములతో బలి యివ్వవలెను. రెండు మాసముల శిశువును ముకట యనుగ్రహి ఆవహించును. ఆ శిశువు శరీరము పచ్చబడిపోయి చల్లబడును. జలుబు చేసి ముక్కు నుండి నీరు వచ్చును. ముఖము ఎండి పోవును. ఈ గ్రహి కొరకై పుష్ప గంధ, వస్త్ర అపూప, ఓదన, దీపములతో బలి యివ్వవలెను. కృష్ణాగరు మొదలగు వాటితో ధూపము వేయవలయును. మూడవ మాసమున గోముఖి ఆవహించును. ఆ శిశువు ఎక్కువ నిద్ర పోవును. మాటి మాటికి మలమూత్రములు విడుచుచు గట్టిగా ఏడ్చును. ఆ గ్రహి కొరకు ముందుగా తూర్పున యవ, ప్రియంగు, కుల్మాష, శాక, అన్న దుగ్ధముతో బలి యిచ్చి పిదప శిశువుకు మధ్యాహ్నమున పంచ భంగముతో స్నానమ చేయించి నేతితో ధూపము వేయవలయును. నాల్గవ మాసమున పింగళ యను గ్రహి ఆవహించును. అపుడు ఆ శిశువు శరీము తెల్లనై దుర్గంధము యుక్తమై ఎండిపోవ ప్రారంభించును. అట్టి శిశువు తప్పక మరణించును. ఐదవ మాసమున లలన అనుగ్రహించే ఆవహింపబడిన శిశువు శరీరము శిథిలమై పోవును. ముఖము ఎండి పోవును. దేహము పాలిపోయి అపాన వాయు వెడలు చుండును. లలనా శాంతికి దక్షిణ దిక్కునందు వెనుక చెప్పిన విధముగ బలి యివ్వవలెను. ఆరవ మాసమున పంకజ అనుగ్రహి ఆవహించును. దీనిచే రోదనము వికృత స్వరము మొదలగునవి కలుగును. ఈ గ్రహి కొరకు వెనుక చెప్పిన పదార్థములు అన్న పుష్ప గంధాదులు బలి యివ్వవలయును. ఏడవ మాసమున నిరాహార యను గ్రహి ఆవహించగా, దుర్గంధ దంత రోగాదులు కలుగును. నిరాహార కొరకై మిష్టాన్నము వెనుక చెప్పిన పదార్థములు బలి యివ్వవలయును. ఎనిమిదవ మాసమున యమున యను గ్రహి ఆవహించగా శిశువు శరీరముపై దద్దురులు బయలుదేరి. శరీరము ఎండి పోవును. దీని కొరకై చికిత్స చేయకూడదు. తొమ్మిదవ మాసమున కుంభకర్ణి యను గ్రహి ఆవహించిన శిశువు జ్వరము, జలుబులతో బాధపడును ఎక్కువగా ఏడ్చును. ఆ గ్రహికొరకై పూర్వము చెప్పిన పదార్థములు కుల్మాషములు మొదలగునవి ఈశాన్యమున బలి యివ్వవలయును. దశమ మాసమున తాపసిగ్రహి ఆవహించిన శిశువు ఆహారము త్యజించి కండ్లు మూసుకొని యుండును ఈ గ్రహి కొరకై ఘంటా, పతాకా, పిష్ఠాన్నములు మొదలగునవి బలిగా యివ్వవలెను. పదకొండవ మాసమున రాక్షసి యను గ్రహి ఆవహించగ శిశువు నేత్ర రోగముచే పీడితుడగును. దానికి చికిత్స చేయుట వ్యర్థము. పండ్రె డవ మాసమున చంచల యనుగ్రహి ఆవహించగా శిశువునకు దీర్ఘ నిశ్వాసము భయాదికము కలుగును. శాంతికొరకై మధ్యాహ్న సమయమున తూర్పు నందు కుల్మాష తిలాదులతో బలి యివ్వవలయును.

యాతనాతు ద్వితీయే7బ్ధే యాతనం రోదనాదికమ్‌. 33

తిలమాంస మద్యమాంసైర్బలిః స్నానాది పూర్వవత్‌ | తృతీయేరోదనీ కమ్పోరోదనం రక్తమూత్రకమ్‌. 34

గుడౌదనం తిలాపూపః ప్రతిమా తిలపిష్టజా | తిలస్నానం పంచపత్రైర్ధూపో రాజఫలత్వచా. 35

చతుర్థేచటకాశోఫోజ్వరః సర్వాంగ సాదనమ్‌ | మత్స్యమాంస తిలాద్యైశ్చ బలిః స్నానంచ ధూపనమ్‌. 36

చంచలాపంచమే7బ్ధేతు జ్వరస్త్రాసో 7ంగ సాదనమ్‌ |

మాంసౌదనాద్యైశ్చ బలిర్మేష శృంగేణ ధూపనమ్‌. 37

పలాశోదుంబరాశ్వత్థ వటబిల్వదలాంబుధృక్‌ | షష్ఠేబ్దే ధావనీశోషో వై రస్యం గాత్రసాదనమ్‌. 38

సప్తాహోభిర్బలిః పూర్వైర్ధూపః స్నానంచ భృంగకైః |

రెండవ సంవత్సరమున యాతన ఆవహించగా శిశువునకు యాతన కలుగును. రోదనాదికము ఉండును. శాంతి కొరకై వెనుకటి వలె స్నానాదికము చేయించి తిల మాంస, మద్యములు బలిగా యివ్వవలెను. మూడవ సంవత్సరమున రోదని గ్రహి ఆక్రమించగా కంపము రోదనము, రక్త మూత్రము కలుగును. ఇందు నిమిత్తమై గుడోదన, తిలాపూపములు తిలపిష్ఠముతో చేసిన ప్రతిమ దానము చేయవలయును. శిశువునకు తిలమిశ్ర జలముతో స్నానము చేయించి పంచ పత్రముల తోను రాజు ఫలత్వక్క్‌ తోను ధూపము వేయవలయును. నాల్గవ వర్షమున గ్రహి చిటక, బాలునకు జర్వము, వాపు అన్ని అవయవములందు నొప్పి కల్గును. ఛటక నిమిత్తమై వెనుక చెప్పిన పదార్థములను తిలలను బలి యిచ్చి బాలకునకు స్నానము చేయించి ధూపము వేయవలయును . ఐదవ వర్షమున గ్రహి చంచల. బాలుకు జ్వరము, భయము, అంగ శైథిల్యము కలుగును. చంచల కొరకై అన్నము మొదలగునవి బలి యిచ్చి బాలునకు మేష శృంగముతో ధూపము వేయవలయును. పరాశఉదుంబర అశ్వత్థ పట, బిల్వ, దళములు కలిసిన జలముతో వానికి స్నానము చేయించ వలయును. ఆరవ సంవత్సరమున ధావని యను గ్రహిచే ఆక్రమింపబడిన బాలుని శరీరము నీరసమై ఎండిపోవును. ప్రతి అవయవము నందును పీడ కలుగును. ఏడు దినముల వరకు వెనుక చెప్పిన పదార్థములను బలిగా యిచ్చి బాలకునకు భృంగ రాజముతో స్నానముచేయిచి ధూపము వేయవలయును.

సప్తమేయమునాచ్ఛర్దిరవచో హాసరోదనమ్‌. 39

మాంసపాయసమద్యాద్యైర్బలిః స్నానంచ ధూపనమ్‌ | అష్టమేవా జాతవేదా నిరాహారం ప్రరోదనమ్‌. 40

కృసరాపూపదధ్యాద్యైర్బలిః స్నానంచ ధూపనమ్‌ | కాలాబ్దేనవమే బాహ్వోరాస్ఫోటో గర్జనం భయమ్‌. 41

బలిఃస్యాత్కృనరాపూప సక్తుకుల్మాషపాయసైః | దశ##మే7బ్దే కలహంసీ దాహో7ంగకృశతా జ్వరః. 42

పౌలికాపూప దధ్యన్నైః పంచరాత్రం బలిం హరేత్‌ | నింబధూపః కుష్ఠలేపోతథైకా దశ##కేగ్రహీ. 43

దేవదూతీ నిష్ఠురవాగ్బలిర్లే పాదిపూర్వవత్‌ | బలికా ద్వాదశే శ్వాసో బలిర్లేపాది పూర్వవత్‌. 44

త్రయదశే వాయవీచ ముఖ బాహ్యాంగ సాదనమ్‌ | రక్తాన్న గంధమాల్యా ద్యైర్బలిః పంచదలైః స్నపేత్‌.

రాజీనిమ్బ దలైర్ధూపో యక్షిణీచ చతుర్దశే | చేష్టాశూలం జ్వరో దాహో మాంసభక్షాదికైర్మలిః. 46

స్నానాది పూర్వవచ్ఛాన్తైః ముండికార్తి స్త్రిపంచకే | తచ్చేష్టా సృక్స్రవః శశ్వత్కుర్యాన్మాతృచికిత్సనమ్‌.

వానరీషోడశీ భూమౌ పతేన్నిద్రా సదాజ్వరః | పాయసాద్యైస్త్రిరాత్రంచ బలిః స్నానాది పూర్వవత్‌. 48

గంధవతీ సప్తదశేగాత్రోద్వేగఃప్రరోదనమ్‌ | కుల్మాషాద్యైర్బలిః స్నానధూప లేపాది పూర్వవత్‌. 49

దినేశాః పూతనానామ వర్షేశాః సుకుమారికాః | ఓంనమః సర్వమాతృభ్యో బాలపీడా సంయోగం

భుంజ భుంజ చుట చుట స్పోటయ స్పోటయ

స్ఫుర స్ఫుర గృహ్ణ గృహ్ణ ఆకట్టయ ఆకట్టయ కట్టయ

కట్టయ ఏవం సిద్ధరూపోజ్ఞాపయతి | హరహర

నిర్దోషం కురుకురు బాలికాం బాలం స్త్రియం పురుషం వా సర్వగ్రహాణాముపక్రమాత్‌ |

చాముండే నమోదేవ్యై హ్రూం హ్రూం హ్రీం అపసర

దుష్టగ్రహాన్‌ హ్రూం తద్యథా గచ్ఛన్తు గృహ్యకాః

అన్యత్ర పంథానం రుద్రో జ్ఞాపయతి |

సర్వబాల గ్రహేషు స్యాన్మంత్రోయం సార్వకామికః. 50

ఓం నమోభగవతి చాముండే ముంచ ముంచ బాలం

బాలికాం వా బలిం గృహ్ణ గృహ్ణ జయజయ వసవస |

సర్వత్ర బలిదానే 7యం రక్షాకృత్పఠ్యతే మనుః

బ్రహ్మా విష్ణుః శివః స్కందో గౌరీ లక్ష్మీర్గణాదయః |

రక్షన్తు జ్వరదాహార్తం ముంచంతు చ కుమారకమ్‌. 51

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే బాలగ్రహ హర బాలతంత్ర నిరూపణం నామ నవనవత్యధిక ద్విశతతమోధ్యాయః.

ఏడవ సంవత్సరమున యమునా గ్రహి ఆవహించిన పిల్ల వానికి వాంతులు మాటలేక పోవుట ఎక్కువ నవ్వుట, ఏడ్చుట కలుగును. మాంస పాయస, మద్యాదులు బలి యిచ్చి స్నానము చేయించి ధూపము వేయవలయును. ఎనిమిదవ సంవత్సరమున జాత వేద ఆవహించగా, బాలుడు నిరాహారుడై ఏడ్చును. కృసర ఆపూప దధ్యాదులు బలిగా ఇచ్చి స్నానము చేయించి ధూపము వేయవలయును. తొమ్మిదవ వర్షమున కాల ఆవహించగా భుజములు కొట్టుకొనుట, గర్జనము భయము కలుగును. కృసర అపూప సక్తు కుల్మాష పాయసములు బలిగా ఇవ్వవలెను. పదవ సంవత్సరమున కలహంసి ఆవహించగా దాహము కృశత్వము జ్వరము కలుగును. ఐదు దినములు పౌలిక, దధి, అన్నములు బలిగా ఇవ్వవలెను. వేపాకుల ధూపము కుష్ఠ లేపనము చేయవలయును. పదకొండవ సంవత్సరమున దేవదూతి ఆవహించగా బాణుడు నిష్ఠురముగా పలుకును. వెనుకటి వలెనే బలి యిచ్చి లేపాదికము చేయవలయును. పండ్రెండవ సంవత్సరమున బలిక ఆవహించిన బాలుడు శ్వాస రోగముతో బాధపడును. వెనుకటివలెనే బలిలే పాదికము చేయవలయును. పదమూడవ సంవత్సరమున వాయని ఆవహించిన బాలునకు ముఖ రోగ అంగ శైథిల్యము కలుగును. రక్తాన్న గంధ మాల్యాదులు బలియిచ్చి బాలునకు పంచదళములతో స్నానము చేయించవలెను. రాజి నింబదళములు ధూపము వేయవలెను. పదునాల్గవ సంవత్సరమున యక్షిణి ఆవహించగా శూల జ్వర దాహాదులు కలుగును. మాంస భక్ష్యాదులతో బలి యివ్వవలయును. శాంతి కొరకై స్నానాదికము కూడ వెనుకటి వలెనే చేయవలెను. పదునైదవ సంవత్సరమున ముండికా గ్రహి ఆవహించిన బాలునకు సర్వదా రక్తస్రావము కల్గుచుండును. దీనికి చికిత్స చేయించకూడదు. పదునారవ సంవత్సరము వానరి ఆవహించిన బాలుడు నేలపై పడిపోవును. నిద్రా జ్వరాదులతో బాధపడును. మూడు దినములు పాయసాదులు బలిగా యిచ్చి స్నానాదికము వెనుకటి వలెనే చేయించవలెను. పదునేడవ సంవత్సరమున గంధవతి ఆవహించగా బాలకుని శరీరము ఉద్వేగము కలుగును. ఆతడు ఎక్కువగా ఏడ్చును. కుల్మాషాదికము బలిగా ఇచ్చి వెనుకటివలెనే స్నాన ధూప లేపనాదులు చేయవలెను. దిన దేవత పూతన వర్ష దేవత సుకుమారిక. ''ఓం నమః సర్వ మాతృభ్యః'' మొదలు ''రుద్రోజ్ఞాపయతి'' వరకు వున్న మూలోక్త మంత్రము సర్వ కామ ప్రదము. దీనిని బాల గ్రహ శాంతికై ఉపయోగించవలెను. ''ఓం నమో భగవతి'' మొదలు ''వస వస'' వరకు వున్న మూలోక్త మంత్రమును రక్షార్థమై బలి దాన సమయమున పఠించవలెను. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు గౌరి, గణాదులు రక్షింతురు గాక ! జ్వర దాహముతో బాధపడుచున్న పిల్లవానిని విడచెదరు గాక ! ఈ మంత్రము కూడ బాలగ్రహ నివారకము.

అగ్ని మహాపురాణమున బాలగ్రహహర బాల తంత్ర నిరూపణ మను రెండువందల తొంబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page