Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ నవత్యధిక ద్విశతతమోధ్యాయః

అథాశ్వ శాంతిః

శాలిహోత్ర ఉవాచ :

అశ్వశాంతిం ప్రవక్ష్వామి వాజిరోగ విమర్దినీమ్‌ | నిత్యాం నైమిత్తికీం కామ్యాం త్రివిధాం శృణు సుశ్రుత. 1

శుభేదినే శ్రీధరంచ శ్రియముచ్చైః శ్రవాశ్చతమ్‌| హయరాజం సమభ్యర్చ్య సావిత్రైర్జుహుయాధ్‌ఘృతమ్‌. 2

ద్విజేభ్యో దక్షిణాం దద్యాదశ్వ వృద్ధిస్తథా భ##వేత్‌ | ఆశ్వయుక్శుక్ల పక్షస్య పంచ దశ్యాంచ శాంతికమ్‌ 3

బహిః కుర్యాద్విశేషేణ నాసత్యౌ వరుణం యజేత్‌ | సముల్లిఖ్య తతో దేవీం శాఖాభిః పరివారయేత్‌. 4

ఘటాన్సర్వరసైః పూర్ణాన్దిక్షు దద్యాత్సవస్త్రకమ్‌ |

యవాజ్యం జుహుయాత్ర్పార్చ్య యజేదశ్వాంశ్చసాశ్వితాన్‌. 5

విప్రేభ్యో దక్షిణాం దద్యాన్నైమిత్తికమతః శృణు| మకరాదౌ హయానాంచ పద్మైర్విష్ణుం శ్రియంయజేత్‌. 6

బ్రహ్మాణం శంకరం సోమాదిత్యంచ తథాశ్వినౌ | రేవన్త ముచ్చైః శ్రవసం దిక్పాలాంశ్చ దలేష్వపి. 7

ప్రత్యేకం పూర్ణకుంభైశ్చ వేద్యాంతత్సౌమ్యతః స్థలే | తిలాక్షతాజ్య సిద్ధార్థాన్దేవతానాం శతం శతమ్‌.

ఉపోషితే కర్తవ్యం కర్మ చాశ్యరుజాపహమ్‌. 8

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయేశ్వశాంతికథనం నామ నవత్యధిక ద్విశతతమోధ్యాయః.

శాలిహోత్రుడు చెప్పెను : ఓ సుశ్రుతా! ఇపుడు అశ్వరోగములను తొలగించునదియు నిత్యనైమిత్తిక కామ్య రూపమున మూడువిధములైనదియగు అశ్వశాంతిని చెప్పెదను వినుము. శుభ దివసమున విష్ణువునకును లక్ష్మికిని ఉచ్చైశ్రవ పుత్రుడగు హయరాజునకును పూజచేసి సావిత్రమంత్రములతో ఘృత హోమముచేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చినచో అశ్వవృద్ధికలుగును. అశ్వీయుజ శుక్లపౌర్ణమి దివసమున నగరబహిఃప్రదేశమున శాంతికర్మ చేయవలయును. విశేషించి అశ్వినీ వరుణపూజ చేయవలయును పిదప దేవీచిత్రముగీసి నాల్గువైపుల నుండియు వృక్షశాఖలతోకప్పి సమస్తరస పూరితములగు వస్త్రవహితములయిన కలశలను స్థాపించవలెను. పిదప శ్రీదేవిని పూజించి యవాజ్యహోమము చేయవలయును. పిదప అశ్వినీ దేవతలను అశ్వములను పూజించి బ్రాహ్మణులకును దక్షిణఇవ్వవలెను. ఇపుడు నైమిత్తికశాంతిని వినుము. మకర సంక్రాంత్యాదులయందు అశ్వములను పూజించవలయును. విష్ణులక్ష్మి బ్రహ్మశివ చంద్రసూర్య రేవంత ఉచ్చైశ్రవస్సులను పద్మములతో పూజించవలెను. కమల దళములపై దిక్పాలులను పూజించవలెను. పూజింపదగిన ఒక్కొక్క దేవత కొరకు వేదికపై జలపూర్ణ కలశలు స్థాపించవలెను. ఈ దేవతల ఉత్తరమున తిల, అక్షత, ఆజ్య, సిద్ధార్థములను హోమము చేయవలయును. ఒక్కొక్క దేవతకు నూరుహోమములు చొప్పన చేయవలయును, అశ్వశాంతి నివారణమునకు ఉపవాసపూర్వకముగ శాంతికర్మ చేయవలయును.

అగ్నిమహాపురాణమున అశ్వశాంతికథనమను రెండువందల తొంబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page