Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్తాశీత్యధిక ద్విశతతమోధ్యాయః

అధ గజ చికిత్సా

పాలకాప్య ఉవాచ :

గజలక్ష్మీ చికిత్సాంచ లోమపాదవదామితే | దీర్ఘహస్తా మహోచ్ఛ్వాసాః ప్రశస్తాస్తే సహిష్ణవః. 1

వింశత్యష్టాదశ నఖాః శీతకాలమదాశ్చయే | దక్షిణశ్చోన్నతోదంతో బృంహితం జలదోపమమ్‌. 2

కర్ణౌచ విపులౌ యేషాం సూక్ష్మబింద్వన్వితాస్త్వచి | తేధార్యా నతథా ధార్యా వామనా యేత్వలక్షణాః. 3

హస్తిన్యః పార్శ్వ గర్భిణ్యో యేచ మూఢ మతంగజాః |

వర్ణం సత్త్వం బలం రూపం కాంతిః సంహననంజవః. 4

సప్తస్థితో గజేశ్చ దృక్సంగ్రామేరీంజయేత్సచ | కుంజరాః పరమా శోభా శిబిరస్య బలస్యచ. 5

పాలకాప్యుడు పలికెను. ఓ లోమపాదా ! నీకు గజ లక్షణములను, గజ చికిత్సను చెప్పెదను. దీర్ఘములైన తొండము లుండి, దీర్ఘ శ్వాస తీసుకును గజములు సహన శక్తి కలవి. ఇరువది లేదా పదునెనిమిది నఖము లుండి శీతకాలమున మదమును స్రవించునవి ప్రశస్తములు కుడిదంతము ఎత్తుగా వున్నవి, మేఘము వంటి బృంహితము కలవి విశాలమైన కర్ణములు కలిపి, చర్మపై సూక్ష్మ బిందువులు, కలవియు యగు ఏనుగులను సంగ్రహించవలెను. పొట్టి లక్షణ హీనములగు వాటిని సంగ్రహించరాదు. పార్శ్వ గర్భము గల ఆడ ఏనుగులను మూఢోన్మత్త గజములను వుంచుకొన గూడదు. వర్ణము సత్వము, బలము, రూపము, కాంతి సంహననము, జపము యను ఏడు సల్లక్షణములు గల గజము యుద్ధమున శత్రువులను జయించును. శిబిరమునకు, సేనకును గొప్పశోభ నిచ్చుననియు గజములే. రాజులు ఏనుగులు వలననే విజయమును కోరుకును చుందురు.

ఆ దృతః కుంజరైశ్చైవ విజయః పృథివీక్షితా |

పాకలేషుచ సర్వేషు కర్తవ్య మనువాసనమ్‌ . 6

ఘృత తైలాభ్యంగ యుక్తస్నానం వాతవివర్జితమ్‌ | స్కందేషు చ క్రియా కార్యా తథాపాలక వన్నృపైః.

గోమూత్రం పాండు రోగేషు రజనీభ్యాం ఘృతం ద్విజ | అనాహే తైల సిక్తస్య నిషేకన్తస్య శస్యతే. 8

లవణౖః పంచభిర్మిశ్రా ప్రతిపానాయ వారుణీ | విడంగత్రి ఫలావ్యోష సైంధవైః కవలాన్కృతాన్‌. 9

మూర్ఛాస్తు భోజయేన్నాగం క్షౌద్రం తోయం చ పాయయేత్‌ |

అభ్యంగః శిరసః శూలే నస్యంచైవ ప్రశస్యతే. 10

నాగానాం స్నేహ పూటకైః పాదరోగా నుపక్రమేత్‌ | పశ్చాత్కల్క కషాయేణ శోధనం చ విధీయతే. 11

శిఖితిత్తిరి లావానాం పిప్పలీ మరి చాన్వితైః | రసైః సంభోజయేన్నాగం వేపథుర్యస్య జాయతే. 12

బాలబిల్వం తథాలోధ్రందాతకీ సితయాసహ | అతీసార వినాశాయ పిండీం భుంజీత కుంజరః. 13

నస్యం కరగ్రహే దేయం ఘృతంలవణ సంయుతమ్‌ | మాగధీ నాగరాజాజీయ వాగూర్ముస్త సాధితాః. 14

ఉత్కర్ణకేతు దాతవ్యా వారాహం చ తథారసమ్‌ | దశమూల కులత్థావ్లు కాకమాచీవి పాచితమ్‌. 15

తైలం శృంఖల సంయుక్తం గలగ్రహ గదాపహమ్‌ | అష్టభిర్లవణౖః పిష్టైః ప్రసన్నాః పాయయేద్ధృతమ్‌. 16

మూత్రభంగేథ వాబీజం కథితంత్రా పుషస్యచ | త్వగ్ధోషేషు పిబేన్నిమ్బం వృషంవా క్వథితం ద్విపః. 17

గవాం మూత్రం విడంగాని కృహికోష్ఠేషుశస్యతే | శృంగవేరకణాద్రాక్షా శర్కరాభిః శృతంపయః. 18

క్షతక్షయకరం పానం తథా మాంసరసః శుభః | ముద్గౌదనం వ్యోషయుత మరుచౌతు ప్రశస్యతే. 19

త్రివృద్వ్యోషాగ్ని దంత్యర్కశ్యామా క్షీరేభ పిప్పలీ | ఏతైర్గుల్మహరః స్నేహః కృతశ్చైవ తథాపరః. 20

భేదనద్రావణాభ్యంగ స్నేహపానాను వాసనైః | సర్వానేవ సముత్పన్నాన్వి ద్రథీన్సముపాహరేత్‌. 21

ఏనుగులు. అన్ని విధముల జ్వరమునందును అనువాసనము చేయవలయును. ఘృత తైలాభ్యంగ యుక్తమగు స్నానము వాత రోగ వినాశకము స్కందో రోగమునకు కూడ పాలకమునందువలె ఏనుగులకు చికిత్సచేయవలయును. పాండు రోగమున గోమూతమును హరిద్రను ఘృతమును ఇవ్వవలెను. మలబంధమునందు శరీరమునకు తైలముపూసి స్నానము చేయించుట మంచిది. ఏనుగుకు పంచల వణయుక్తమగు మదిరను త్రాగించవలెను. మూర్ఛరోగము వచ్చిన ఏనుగును వాయు విడంగ త్రిఫలా, త్రికటు, సైంధవముల గ్రాసమును తినిపించి మధు యుక్తమగు జలము త్రాగించవలెను. శిరుశ్శూల రోగమునందు అభ్యంగము నశ్యము ప్రశస్తతములు తైలయుక్త పుటకములతో పాదరోగములకు చికిత్స ప్రారంభించి, పిదప కల్కకషాయములతో శోధనము చేయించవలెను. కంపన రోగముననున్న గజమునకు శికితిత్తిరి. లావపక్షుల మాం మును పిప్పలి మరిచములు కలిపి తినిపించవలెను అతీసారరోగమునందు బాలబిల్వ లోధ్రధాతకీ, శర్కరలతో పిండి తినిపించవలెను. తొండమునకు రోగము వచ్చినపుడు లవణయుక్తమగు ఘృతమును నశ్యముగ ఇవ్వవలెను. ఉత ర్ణ రోగము ందు మాగధి నాగరాజ, జీర. లతో చేసిన గంజి వారాహీకందరసము ఇవ్వవలెను. దశమూల కులుత్థ ఆవ్లుక కాకి మాచి, లతో చేసిన తైలమును మిర్చితో కలిపి ఉపయోగించినచో గల గ్రహరోగము నశించును. మూతకుచ్రరోగము నందు అష్టలవణయుక్తములగు సురను ఘృతమును. త్రాగించవలెను. లేదా త్రాపుష బీజక్వాథమును ఇవ్వవలెను. చర్మదోషమునందు నింబ, క్వాథముగాని, వృషక్వాథముగాని ఇవ్వవలెను. కోష్ఠ కుములను తొలగించుటకు గోమూత్ర వాయు విడంగములు ప్రశస్తములు, గాయములు మాన్పించుటకు శృంగబేరకణ ద్రాక్ష, శర్కరలతో కాచిన జలము ప్రశస్తము మాంసరసము కూడ హితకరము అరుచిరోగమున వ్యోషయుక్తమగు పెసల అన్నము మంచిది త్రివృత్‌ వ్యోష అగ్ని, దంతి, ఆర్క, శ్యామ, క్షీర గజ పిప్పలులతో చేసిన స్నేహము గుల్మరోగములు పోగొట్టును ఇట్లే గజ చికిత్స కుడు భేదన ద్రావణ అభ్యంగ స్నేహపాన, అనువాసనములతో గూడ అన్ని విధములగు విద్రధి రోగములను నశింపచేయవలెను.

యష్టికం ముద్గసూపేన శారదేన తథా పిబేత్‌ | బాలబిల్వైస్తథాలేపం కటరోగేషు శస్యతే. 22

విడంగేంద్రయవౌ హింగు సరలం రజనీద్వయమ్‌ | పూర్వాహ్నేదాపయే త్పిండాన్సర్వ శూలోపశాంతయే.

ప్రధాన భోజనే తేషాం షష్టిక వ్రీహిశాలయః | మధ్యమౌయవ గోధూమౌశేషాదంతిని చాధమాః. 24

యవశ్చైవ తథైవేక్షుర్నాగానాం బలవర్ధనః | నాగానాం యవసం శుష్కం తథా ధాతుప్రకోపనమ్‌. 25

మదక్షీణస్య నాగస్య పయః పానం ప్రశస్యతే | దీపనీయై స్తథా ద్రవ్యైః శృతోమాంసరసః శుభః. 26

వాయసఃకుక్కురశ్చోభౌ కాకోలూక కులో హరిః | భ##వేత్‌క్షౌద్రేణ సంయుక్తః పిండోయుద్ధేమహాపది. 27

కటుమత్స్య విడంగాని క్షారః కోషాతకీపయః | హరిద్రాచేతి ధూపోయం కుంజరస్యజయావహః. 28

పిప్పలీస్తండు లాసై#్తలం మాధ్వీకం మాక్షికం తథా | నేత్రయోః పరిషేకోయం దీపనీయః ప్రశస్యతే. 29

పురీషం చటకాయాశ్చ తథాపారావతస్యచ | క్షీరవృక్ష కరీషాశ్చ ప్రసన్నా యేష్టమంజనమ్‌. 30

అనేనాంజిత నేత్రస్తుకరోతి కదనంరణ | ఉత్పలానిచ నీలాని ముస్తం తగరమేవచ. 31

తండులోదక పిష్టాని నేత్ర నిర్వాపణం పరమ్‌ | నఖవృద్ధౌ నఖచ్ఛే దసై#్తల సేకశ్చ మాస్యపి. 32

శయ్యాస్థానం భ##వేచ్చాస్య కరీషైః పాంసుభిస్తథా | శరన్ని దాఘుయోః సేకః సర్పిషాచతథేష్యతే. 33

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గజ చికిత్సా నామ సప్తా శీత్యధిక ద్విశతతమోధ్యాయః.

గజమునకు కట రోగమునందు ముద్గ సూపముతో యష్టికమును కలిపి, బాల బిల్వములతో లేపము చేయవలయును. అన్ని విధముల శూలములను తొలగించుటకు దిన పూర్వ భాగమున పిడంగ, యింద్ర, యవ, హింగు వివిధ హరిద్రా పిండములను ఇవ్వవలెను. ఏనుగులకు ఉత్తమ భోజనము. యితర భక్ష్యములు అధమ భోజనము యవలు ఇక్షువు ఏనుగులకు బలమును పెంచును. శుష్క తృణము ధాతు ప్రకోపము కల్గించును. క్షీణించిన మదము గల గజమునకు పాలుత్రాగించుట అగ్నిదీప్తిని కలిగించు ద్రవ్యము. వండిన మాంస రసము లాభకరములు. వాయస, కుక్కుర కాక ఉలూక, హరులను క్షౌద్రముతో కలిపి పిండము చేసి, యుద్ధము నందు మహా పద యందును ఇవ్వవలెను. కటు, మత్స్య, విడంగ లవణ కోశాతకీ క్షీర, హరిద్రలతో ధూపము వేసినచో ఏనుగు జయప్రద మగును. పిప్పలి తండులములు బియ్యము తైలము మాధ్వీకము, తేనె వీటిని నేత్ర ముందు వేసినచో యవి దీపనీయములు. చటకా పురీషము, పారావత పురీషము, క్షీర వృక్షము. మద్యము వీటితోచేసిన అంజనము ఏనుగులకు ఇష్టమైనది. ఈ అంజనము నేత్రములకు పూసిన ఏనుగు యుద్ధము నందు శత్రువును మర్దించును. నీల కమలములు ముస్తతగరము, వీటిని, తండు లోదకము నందు నూరి, ఏనుగుల నేత్రములకు పెట్టినచో పరమ శాంతి నిచ్చును. గోళ్ళు పెరిగినపుడు వాటిని ఖండించ వలెను. ప్రతిమాసము తైలాభ్యంగనము చేయవలయును. ఏనుగులు శయ నించు స్థానమున ఎండిన పేడ పరాగము యుండవలెను. శర ద్గ్రీష్మము లందు వీటికి ఘృత సేకము చేయుట ఉపయోగ కరము.

అగ్ని మహాపురాణముల గజ చికిత్స యను రెండు వందల యెనభై ఏనవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page