Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రిసప్తత్యధిక ద్విశతతమోధ్యాయః

అథ సూర్యవంశవర్ణనమ్‌

అగ్నిరువాచ:

సూర్యవంశం సోమవంశం రాజ్ఞాంవంశం వదామితే | హరేర్ర్బహ్మాపద్మగో7భూన్మరీ చిర్బ్రహ్మణఃసుతః. 1

మరీచేః కశ్యపస్తస్మాద్వివస్వాంస్తస్య పత్న్యపి | సంజ్ఞా రాజ్ఞీప్రభాతిస్రో రాజ్ఞీరైవతపుత్రికా. 2

రేవన్తం సుషువే పుత్రం ప్రభాతం చ ప్రభారవేః |

త్వాష్ట్రీసంజ్ఞా మనుంపుత్రం యమలౌయమునాం యమమ్‌. 3

ఛాయా సంజ్ఞాచసావర్ణిం మనుం వైవస్వతం సుతమ్‌ | శనిం చ తపతీం విష్టింసంజ్ఞాయాం చాశ్వినౌపునః. 4

మనోర్వైవస్వత స్యాసన్పుత్రావైనవ తత్సమాః | ఇక్ష్యాకుశ్చైవ నాభాగో ధృష్టఃశర్యాతి రేవచ. 5

నరిష్యన్తస్తథా ప్రాంశుర్నాభాగాద్యష్ట సత్తమాః కరూషశ్చ పృషద్రశ్చ అయోధ్యాయాం మహాబలాః 6

కన్యేలా చ మనోరాసీద్బుధాత్తస్యాం పురూరవాః | పురూరవసముత్పాద్య సేలాసుద్యుమ్నతాంగతా. 7

సుద్యుమ్మాదుత్కలగయో వితతాశ్వస్త్రయోనృపాః | ఉత్కలస్యోత్కలం రాష్ట్రం వినతాశ్వస్య పశ్చిమా. 8

దిక్సర్వా రాజవర్యస్య గయస్యతుగయాపురీ | వసిష్ఠ వాక్యాత్సుద్యుమ్నః ప్రతిష్ఠానమవాపహ. 9

తత్రురూర వసేప్రాదాత్సుమ్నోరాజ్య మాప్యతు | నరిష్యతఃశకాః పుత్రానాభాగస్య చ వైష్ణవః. 10

అంబరీషః ప్రజాపాలో ధార్షకం ధృష్టతఃకులమ్‌! సుకల్పానర్తౌ శర్యాతెర్వైరోహ్యనర్తతోనృపః.11

ఆనర్తవిషయశ్చాసీత్పురీ చాసీత్కుశస్థలీ! రేవస్యరైవతః పుత్రః కకుద్మీ నామాధార్మికః. 12

జ్యేష్ఠః పుత్రశతస్యాసీద్రాజ్యం ప్రాప్యకుశస్థలీమ్‌!

అగ్నిదేవుడు పలికెను. ఇపుడు సూర్యవంశమును ఇతర రాజవంశమును గూర్చిచెప్పెదను. మహావిష్ణువు నాభికమలమనుండి బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మకుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. ఆతని కుమారుడు వివస్వంతుడు. ఆతనికి సంజ్ఞ, రాజ్ఞి, ప్రభయను ముగ్గురుభార్యలుండిరి. రాజ్ఞి రైవతకునిపుత్రి. ఆమె రేవంతుడను కుమారుని కనెను. ప్రభ ప్రభాతుడను పుత్రుని, త్వష్టకుమారైయైన సంజ్ఞ మనువుయను పుత్రుని, యమున, యముడుయను కవలలను కనెను. ఛాయయను నామాంతరముగల సంజ్ఞ సావర్ణ్యమనువును, శనిని, తపతి, విష్టి, యనుకన్యలను కనెను. పిదప సంజ్ఞకు అశ్వినీ కుమారులు జన్మించిరి. వైవస్వత మనువుకు, ఆతనితో సమానులగు పదిమంది కుమారులుపుట్టిరి. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు వృగుడు దిష్టుడు కరూశుడు, పృషధ్రుడు అను ఈ పదిమంది మహాబలులును అయోధ్యలో నివసించిరి. మనువునకు ఇలయనుకన్య పుట్టెను. ఆమెయందు బూధునకు, పురూరవుడు పుట్టెను. పురూరవును కనిన పిమ్మట ఆ ఇలశుద్యుమ్నుడిగా మారిపోయెను. సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు వినతాశ్వుడు అను రాజులు జన్మించిరి. ఉత్కలునకు ఉత్కలము రాష్ట్రమాయెను. పశ్చిమదేశము వినతాశ్వుల రాజ్యమాయెను. రాజశ్రేష్ఠుడైన గయునకు పూర్వదిక్కున అధికారము లభించెను. ఆతని రాజధాని గయాపురి. వశిష్ఠుని వాక్యము ప్రకారము సుద్యుమ్నుడు ప్రతిష్ఠానపురము చేరను. అచట రాజ్యమునుపొంది దానిని పురూరవసునకు ఇచ్చెను. నరిష్యంతుని పుత్రునకు శకులనుపేరు. నాభాగునకు విష్ణభక్తుడగు అంబరీషుడు జనించెను అతడు ప్రజలను బాగుగ పరిపాలించెను. ధృష్టుని నుండి ధాష్ట్రక వంశము విస్తరించెను. శర్యాతికి సుకన్య, ఆనర్తుడు, జనించిరి. ఆనర్తునకు రేవుడు జనించెను ఆతనిదేశము ఆనర్తదేశము. కుశస్థలి ఆతనిరాజధాని. రేవునకు రైవతుడు, జనించెను. ధార్మికుడైన అతనికి కకుద్మియని కూడ పేరు. తన తండ్రి నూర్గురు కుమారులలో ఇతడుజ్యేష్ఠుడగుటనే కుశస్థలిరాజ్యము ఆతనికి లభించెను.

సుకన్యాసహితః శ్రుత్వా గాంధర్వం బ్రహ్మణో7న్తికే | 13

ముహూర్త భూతందేవస్యమర్త్యేబహుయుగం గతమ్‌ |

ఆజగామ జయేనాథస్వాంపురీం యాదవైర్వృతామ్‌. 14

కృతాంద్వారవతీం నామ బహుద్వారాం మనోరమామ్‌ | భోజవృష్ట్యంద కైర్గుప్తాం వాసుదేవపురోగమైః. 15

రేవతీం బలదేవాయ దదౌజ్ఞాత్వాహ్యనిన్దితామ్‌ | తపఃసుమేరుశిఖరే తప్త్వావిష్ణ్వాలయంగతః. 16

నాభాగస్య చ పుత్రౌద్వౌవైశ్యౌ బ్రాహ్మణతాం గతౌ | కరూషన్యతు కారూషాః క్షత్రియాయుద్ధదుర్మదాః. 17

శూద్రత్వంచ వృషధ్రో7గాద్ధింసయిత్వా గురోశ్చగామ్‌ | మనుపుత్రాదథేక్ష్యా కోర్వికుక్షిర్దేవరాడభూత్‌. 18

వికుక్షేస్తు కకుత్థ్సో7భూత్తస్యపుత్రః సుయోధనః | తన్యపుత్రః పృథర్నామ విశ్వగాశ్వః పృథోఃసుతః 19

ఆయుస్తస్య చ పుత్రో7భూద్యువనాశ్వస్తథాసుతః | యువనాశ్వాచ్చ శ్రావన్తః పూర్వేశ్రావంతికాపురీ. 20

శ్రావస్తాద్బృహదశ్వో7 భూత్కువలాశ్వస్తతోనృపః | ధుంధుమారత్వ మగమద్ధుందోర్నామ్నాచవైపురా. 21

ధుంధుమారాస్త్రయో భూపాదృఢాశ్వోదండ ఏవచ | కపిలో7థ దృఢా శ్వాత్తుహర్యశ్వశ్చ ప్రమోదకః. 22

హర్యశ్వాచ్చ నికుంభో7భూత్సంహతాశ్వో నికుంభతః | అకృశాశ్వోరణాశ్వశ్చ సంహతాశ్వసుతావుభౌ. 23

యువనాశ్వో రణాశ్వస్యమాంధాతా యువనాశ్వతః | మాంధాతుః పురుకుత్సో7భూన్ముచుకుందో ద్వితీయకః.

ఒకనాడు అతడు కన్యాసహితుడై బ్రహ్మదగ్గరకువెళ్ళి అచట సంగీతమును వినుచుండెను. అచట బ్రహ్మకు ముహూర్తమొకటి మాత్రమే గడచెను. అంతలో మర్త్యలోకమున అనేక యుగములు సమాప్తమాయెను. అతడు శీఘ్రముగ యాదవులతో కూడిన తన నగరమునకు వచ్చెను. అచట కుశస్థలిస్థానమున అనేక ద్వారములు కలది, మనోహర మైనదియగు ద్వారవతీపట్టణము నిర్మితమై యుండెను. వాసుదేవుడు నాయకులుగాగల భోజవృష్టి అంధకులు దానిని రక్షించుచుండిరి. రేవతిని బలరామునకు ఇచ్చి సంసారమును అనిత్యవిషయమును తెలుసుకొని సుమేరు వర్వత శిఖరమున తపస్సుచేసి విష్ణుపదమును చేరెను. నాథాగుని యిద్దరు పుత్రులు వైశ్యులు. వారు బ్రాహ్మణత్వమును పొందిరి. కరూషునకు యుద్ధోన్మత్తులగు కరూషులను క్షత్రియులు జన్మించిరి. పృషధ్రుడు గురువుయొక్క గోవును హింసించుటచే శూద్రుడాయెను. మనుపుత్రుడైన ఇక్ష్వాకునకు దేవరాజుయైన "వికుక్షి" పుట్టెను. వికుక్షి పుత్రుడు కకుత్సుడు. అతని పుత్రుడు సుయోధనుడు, అతని పుత్రుడు వృథువు, అతని పుత్రుడు విశ్వగాశ్వుడు. అతనిపుత్రుడు వాయువు. వాని పుత్రుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడైన శ్రావంతుడు తూర్పుదిక్కున శ్రావంతికాపురమును నెలకొల్పెను. అతని పుత్రుడు బృహదశ్వుడు, వాని కుమారుడు కువలాశ్వుడు. ఇతడు పూర్వము దుంధు అను రాక్షసుని చంపుటచే దుంధుమారుడను పేరుపొందెను. ఆతనికి దృఢాశ్వుడు. దండుడు, కపిలుడు, అను ముగ్గురు రాజులు జన్మించిరి. దృఢాశ్వునకు హర్యశ్వుడు, ప్రమోదకుడుయను పుత్రులు పుట్టిరి హర్యశ్వుని కుమారుడు నికుంభుడు. ఆతనికుమారుడు సంహతాశ్వుడు. సంహతాశ్వునకు అకృషాశ్వుడు రణాశ్వుడుయను పుత్రులు పుట్టిరి. రణాశ్వునిపుత్రుడు యువనాశ్వుడు. ఆతనిపుత్రుడు మాంధాత. అతనికి పురుకుత్థ్సుడు ముచికుందుడు, అను పుత్రులు పుట్టిరి.

పురుకుత్సాత్త్రసద్దస్యుః సంభూతో నర్మదాభావః | సంభూతస్య సుధన్వా7భూత్త్రిధన్వాథసుధన్వనః. 25

త్రిధన్వనస్తు తరుణ స్తస్యసత్యవ్రతఃసుతః | సత్యవ్రతాత్సత్యరథో హరిశ్చంద్రశ్చ తత్సుతః. 26

హరిశ్చంద్రా ద్రోహితాశ్వో రోహితాశ్వాద్వృకో7భవత్‌ | వృకాద్బాహుశ్చ బాహోశ్చ నగరస్తస్యచప్రియా.

ప్రభాషష్టి సహస్రాణాం సుతానాం జననీహ్యభూత్‌ | తుష్టాదౌర్వాన్నృపాదేకం భానుమత్యసమంజనమ్‌. 28

ఖనన్తః పృథివీం దగ్ధా విష్ణునాబహుసాగరాః | అసమంజసోంశుమాంశ్చ దిలీపోంశుమతో7భవత్‌. 29

భగీరథో దిలీపాత్తుయేన గంగావతారితా | భగీరథాత్తు నాభాగో నాభాగాదంబరీక్షకః. 30

సింధుద్వీపో7ం బరీషాత్తుశ్రుతా యుస్తత్సుతఃస్మృతః | శ్రుతాయోరృ తపర్ణో7భూత్తస్యకల్మాష పాదకః.

కల్మాషాంఘ్రేః సర్వకర్మా హ్యనరణ్యస్తతో7భవత్‌ | అనరణ్యాత్తుని ఘ్నోథహ్యనమిత్రస్తతోరఘుః. 32

రఘోరభూద్దిలీపస్తు దిలీపాచ్చాప్యజోనృపః | దీర్ఘబాహుర జాత్కాలస్తజపాలనస్త తో7రవత్‌. 33

తథా దశరథో జాతస్తస్య పుత్రచతుష్టయమ్‌ | నారాయణాత్మకాః సర్వేరామస్తస్యాగ్రజో7భవత్‌. 34

రావణాంతకరోరాజా హ్యయోధ్యాయాం రఘూత్తమః | వాల్మీకిరస్యచరితం చక్రేతన్నారదశ్రవాత్‌. 35

రామపుత్రౌ కుశలవౌ సీతాయాంకు లవర్ధనౌ | అతిథిశ్చకుశాజ్‌ఙజ్ఞే నిషధస్తన్య చాత్మజః. 36

నిషధాత్తు నలోజజ్ఞే నభో7జాయతవైనలాత్‌ | నభనః పుండరీకో7భూత్సు ధన్వాచతతో7భవత్‌. 37

సుధన్వనో దేవానీకోహ్యహీనాశ్వశ్చ తత్సుతః | అహీనాశ్వాత్సహస్రాశ్వశ్చంద్రాలోకస్తతో7భవత్‌. 38

చంద్రావలోకతస్తారాపీడో7స్మాచ్చంద్ర పర్వతః | చంద్రగిరేర్భానురథః శ్రుతాయుస్తస్య చాత్మజః. 39

ఇక్ష్వాకు వంశప్రభవాః సూర్యవంశధరాః స్మృతాః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సూర్యవంశకీర్తనంనామ త్రిసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

పురుకుత్థ్సునకు నర్మదయందు త్రసద్దస్యుడుయను సంభూతుడను నామాంతరముగల పుత్రుడు పుట్టెను. సంభూతునికుమారుడు సుధన్వ. ఆతనిపుత్రుడు త్రిధన్వ, ఆతనిపుత్రుడు తరుణుడు. ఆతని పుత్రుడు సత్యవ్రతుడు. ఆతని పుత్రుడు సత్యరథుడు. ఆతనికి హరిశ్చంద్రుడు, ఆతనికిరోహితాశ్వుడు, ఆతనికి వృకుడు, ఆతనికిబాహువు ఆతనికి సగరుడు పుట్టెను. సగరుని ప్రియురాలగు ప్రభకు ఔర్వముని ప్రసాదముచే అరువదివేల పుత్రులనుకనెను. రెండవ భార్యయైన భానుమతికి అసమంజసుడను ఒకకుమారుడు జనించెను. సగరుని అరువదివేలమంది కుమారులను భూమిని త్రవ్వుచు కపిలునిచే చేయబడిరి. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఆతని కుమారుడు దిలీపుడు. ఆతనికి గంగను భూలోకమునకు తీసుకొనివచ్చిన భగీరథుడనుకుమారుడు పుట్టెను. ఆతనికి నాభాగుడు, ఆతనికి అంబరీషుడు, ఆతనికి సింధుద్వీపుడు వానికి శ్రుతాయువు, వానికి ఋతుపర్ణుడు, వానికి కల్మాషపాదుడు, వానికి సర్వకర్మ, వానికి అనరణ్యుడు; వానికి నిఘ్నుడు, వానికి దిలీపుడు, వానికి రఘువు, వానికి అజుడు, వానికి దశరథుడు పుట్టెను. దశరథునకు నారాయణ స్వరూపులగు నలుగురు కుమారులు పుట్టిరి. వారిలో జ్యేష్ఠుడు రాముడు, రావణాంతకుడైన ఆరఘూత్తముడు అయోధ్యకు రాజాయెను. అతని చరిత్రమును నారదునినుండి విని వాల్మీకి రామాయణముగ రచించెను. రామునకు సీతయందు, కులవర్ధములగు కుశలవులు జన్మించిరి. కుశునకు అతిథి ఆతనికి నిషధుడు ఆతనికి నలుడు, ఆతనికి నభుడు, ఆతనికి పుండరీకుడు ఆతనికి సుధన్వుడు, ఆతనికి దేవానీకుడు, ఆతనికి అహీనాశ్వుడు, ఆతనికి సహస్రాశ్వుడు, అతనికి చం

ద్రాలోకుడు, అతనికి తారాపీడుడు, ఆతనికి చంద్రపర్వతుడు, ఆతనికి భానురథుడు, ఆతనికి శ్రుతాయువు, జన్మించెను. ఇక్ష్వాకువంశీయులందరును సూర్యవంశ ప్రవర్తకులుగా చెప్పబడుదురు.

అగ్ని మహాపురాణమున సూర్యవంశకీర్తనమను రెండువందల డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page