Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ సామవిధానమ్‌

పుష్కర ఉవాచః

యజుర్విధానం కథితం వక్ష్యే సామ్నాం విధానకమ్‌ |

సంహితాం వైష్ణవీం జప్త్వా హుత్వా స్యాత్సర్వకామభాక్‌. 1

సంహితాం ఛాందసీం సాధు జప్త్వా ప్రీణాతిశంకరమ్‌ |

స్కాందీం పైత్ర్యాం సంహితాం చ జప్త్వాస్యాత్తు ప్రసాదవాన్‌. 2

యతఇంద్రం భజామహే హింసాదోష వినాశనమ్‌ | అవకీర్ణిముచ్యతే చ అగ్నిస్తిగ్మేతివై జపన్‌. 3

సర్వపాపహరం జ్ఞేయం పరితోయం (ష) చ తాసుచ | అవిక్రేయం చ విక్రీయ జపేద్ఘృత వతీతిచ. 4

అద్యానోదేవ సవితర్‌జ్ఞేయం దుఃస్వప్న నాశనమ్‌ | అబో ధ్యగ్నిరితి మంత్రేణ ఘృతం రామ యథావిధి. 5

అభ్యుక్ష్య ఘృతశేషేణ మేఖలా బంధ ఇష్యతే | స్త్రీణాం యాసాంతు గర్భాణి పతన్తి భృగుసత్తమ. 6

మణిం జాతస్య బాలస్య బధ్నీయాత్త దనంతరమ్‌ | సోమంరాజా నమేతేన వ్యాధిభిర్విప్రముచ్యేతే. 7

సర్వసామ ప్రయుం జానో నాప్నుయాత్సర్వజంభయమ్‌ |

మాద్యత్వా వాద్యతేత్యేతద్ధృత్వా విప్రః సహస్రశః. 8

శతావరి మణింబద్ధ్వా నాప్నుయాచ్ఛత్రుతో భయమ్‌ |

దీర్ఘతమసో7ర్క ఇతి హుత్వాన్నం ప్నాప్నుయాద్బహు. 9

స్వమధ్యాయన్తీతి జపన్న మ్రియేత పిపాసయా | త్వమియా ఓషధీ హ్యేతజ్జప్త్వా వ్యాధిం నచాప్నుయాత్‌. 10

పథి దేవవ్రతం జప్త్వా భ##యేభ్యోవిప్రముచ్యతే | యదింద్రో మునయేఖ్వేతి హుతం సౌభాగ్యవర్ధనమ్‌. 11

భగోన చిత్రం ఇత్యేవం నేత్రయో రంజనం హితమ్‌ | సౌభాగ్య వర్ధనం రామ నాత్ర కార్యావిచారణా. 12

జపేదింద్రేతివర్గంచ తథా సౌభాగ్య వర్ధనమ్‌ | పరిప్రియాహియః కారిః కామ్యాం సంస్రావయే త్త్స్రియమ్‌ 13

సాతం కామయతే రామ నాత్ర కార్యావిచారణా | రథన్తరం వామదేవ్యం బ్రహ్మవర్చసవర్ధనమ్‌. 14

పుష్కరుడు చెప్పెను : యజుర్విధానము చెప్పితిని. ఇపుడు సామవిధానమును చెప్పెదను వైష్ణవీసంహిత జపించి దశాంశ హోమము చేసినవాడు సమస్తకామములను పొందును. చాంధసీసంహితను యథావిధిగా జపించినవానిని శంకరుడు అనుగ్రహించును. స్కందసహితను జపించుటచే ప్రసన్నత లభించును. ''యతఇంద్రభజామహే'' (1321) ఈ మంత్రమును జపించుటచే హింసాదోషము నశించును. ''అగ్నిస్తిగ్మేన'' (22) అను మంత్రమును జపించు అపకీర్థి పాపవిముక్తుడగును. ''పరితోసించతాసుతం'' (512) అను సామమంత్రము సమస్తపాపవినాశకము. పొరపాటుచే నిషిద్ధ వస్తువులను విక్రయించినవాడు ''కృతవతీ భువనాః'' ఇత్యాదిమంత్రములను జపించవలెను అద్యానోదేవసవితః (141) అను మంత్రము దుఃస్వప్ననాశకము. పరశురామా! ''అబోద్యగ్నిః'' (1746) అను మంత్రముచే ఘృతహోమము చేసి మిగిలిన ఘృతముతో మేఖలబంధమును తడిపి దానిని గర్భస్రావముతో బాధపడుతున్న స్త్రీలకు కట్టవలెను. పుట్టిన పిల్ల వానికి పైమంత్రము అభిమంత్రించి మణికట్టవలెను. సోమంరాజానం (91) అను మంత్రమును జపించుటచే రోగిత్యాది విముక్తుడగును. సర్పసామప్రయోగము చేయువానికి సర్వభయముండదు. ''మా పాపత్వాయనో'' (918) అను మంత్రము నూరు హోమములు చేసి శతాపరీయుక్త మగు మణిని కట్టినచో శతృభయముండదు. ''దీర్ఘతమసో7ర్కః''అను మంత్రము తో హోమము చేసినచో అధిక అన్నములభించును. ''సమన్వాయంతః'' (607) అను మంత్రమును జపించువాడు దప్పికతో మరణించడు. త్వమిమాఓషధీః'' (604) అను మంత్రమును జపించువాడు ఎన్నడును వ్యాధిగ్రస్తుడు కాడు. దేవవ్రతసామను మార్గమునందు జపించువాడు భయవిముక్తుడగును. ''యదిందో7నునయత్‌'' (148) అను మంత్రముతో హోమము చేసిన సౌభాగ్యవృత్తికలుగును. ఓ పరశురామా! ''భోగోనచితో'' (449) అను మంత్రమును జపించి కండ్లకు కాటుక పెట్టినచో అది హితకరము సౌభాగ్యవర్ధకము అగును. సందేహములేదు. ఇంద్రశబ్దముతో ప్రారంభమగు మంత్రవర్గమును జపించిన సౌభాగ్యవృద్ధి కలుగును. ''పరిప్రియాదివఃకవిః'' అనుమంత్రమును తానుపొందగోరిన స్త్రీకి వినిపించినచో ఆమె ఆతనిపై అనురక్తురాలగును. సందేహము లేదు, రథంతర సామ వామ దేవ్య సామములు బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించును.

ప్రాశ##యేద్బాలకం నిత్యం వచాచూర్ణం ఘృతప్లుతమ్‌ | ఇంద్రమిద్గాథినం జప్త్వా భ##వేచ్ఛృఉతి ధరస్త్వసౌ. 15

హుత్వా రథన్తరం జప్త్వా పుత్రమాప్నోత్య సంశయమ్‌ | మయిశ్రీరితి మంత్రోయం జప్తవ్యః శ్రీవివర్ధనః.

వైరూప్యస్యాష్టకం నిత్యం ప్రయుంజానః శ్రియంలభేత్‌ |

సప్తాష్టకం ప్రయుంజానః సర్వాన్కా మానవాప్నుయాత్‌. 17

గవ్యేషుణతి యో నిత్యం సాయం ప్రాతరతంద్రితః | ఉపస్థానం గవాం కుర్యాత్తస్యస్యుస్తాః సదాగృహే.

ఘృతాక్తంతు యవద్రోణం వాత ఆవాతు భేషజమ్‌ | అనేన హుత్వా విధివత్సర్వాం మాయాం వ్యపోహతి.

ప్రదేవో దాసేన తిలాన్హుత్వా కార్మణకృంతనమ్‌ | అభిత్వాపూర్వపీతయే వషట్కార సమన్వితమ్‌. 20

వాసకేధ్మ సహస్రంతు హుతం యుద్ధే జయప్రదమ్‌ | హన్త్యశ్వ పురుషాన్కుర్యాద్భుధః పిష్టమయాఞ్ఛుభాన్‌.

పరకీయానథోద్ధిశ్యప్రదాన పురుషాం స్తథా | సుస్విన్నాన్సిష్టక వరాన్‌క్షురేణోత్కృత్య భాగశః. 22

అభిత్వాశూరణో నమో మంత్రేణానేన మంత్రివిత్‌ | కృత్వా సర్షపతై లాక్తాన్క్రోధేన జుహుయాత్తతః. 23

ఏతత్కృత్వా బుధః కర్మసంగ్రామే జయమాప్నుయాత్‌ | గారుడం వామదేవ్యం చ రథన్తర బృహద్రథౌ. 24

సర్వపాపప్రశమనాః కథితాః సంశయం వినా |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సామవిధానం నామైక షష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

''ఇంద్రమిద్గాథినో'' (198) అను మంత్రము జపించి ఘృతమిశ్రితమగు వచా చూర్ణమును ప్రతిదినము బాలునికి తినిపించినచో అతడు శృతిధరుడు (ఒక్కమాటు వినగనే జ్ఞాపకముంచుకొనువాడు) అగును రథతరసామను జపించి దానితో హోమచేసినచో నిస్సంశయముగ పుత్రుడు లభించును ''మయిశ్రీః'' 602 అను లక్ష్మివర్ధకమగు మంత్రమును జపించవలెను వైరుప్యాష్టకములను ప్రతి నము పఠించువానికి లక్ష్మి లభించును. సప్తాష్టకమును ప్రయోగించువానికి సమస్త కా ములు లభి చును. ప్రతిదినము ప్రాతఃసాయంకాలములందు ఆలస్యములేని వాడై ''గవ్యేషునోయధా'' (186) అను మంత్రముతో గోవు ఉపస్థానము చేయువాని ఇంటిలో సర్వదా గోవులుండును ''వాతఆవాతుభేషజం'' (184) అను మంత్రముతో నేతితో కలపిన ఒక ద్రోణమయవలను యథావిధిగా హోమము చేసినవాడు సమస్త మాయను తొలగించును ''పదైవ??సో'' (51) అను మంత్రముతో తిలహోమము చేయుటచే అభిచారకర్మతొలగును. ''అభిత్వాశూరనోనమో'' (232) అను సామకు అంతమున వషట్‌ కారముచేర్చి ఆవునూనెతో తడిపిన సమిధలను కోపముతో హోమముచేసినచో యుద్ధము నందు జయములభించును. గారుడ మంత్రము వామదేవ్య మంత్రము రథంతర బృహ ద్రస మంత్రములు నిస్సంశయముగ సర్వపాపవినాశకము విద్వాంసుడు సుందరమైన పిష్టమయములగు గజములను అశ్వములను మనుష్యులను నిర్మించి శత్రుపక్షమునందలి ప్రధాన వీరులను లక్ష్యముగ నిలిపి తడిసిన ఆ పిష్టమయ పురుషులను ముక్కముక్కలుగాచేసి వాటిని ఆవనూనెలో తడిపి క్రోధపూర్వకముగా ''అభిత్వాశూరనోనుమో'' (233) అను మంత్రముతో హోమము చేసిన యుద్ధము నందు విజయము లభించును.

అగ్ని మహాపురాణమునందు సామవిధానమును రెండు వందల అరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page