Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రిపంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః

అథ వ్యవహార నిరూపణమ్‌

అగ్నిరువాచ :

వ్యవహారం ప్రవక్ష్యామి నయానయ వివేకదమ్‌ | చతుష్పాచ్చ చతుః స్థానశ్చతుఃసాధన ఉచ్యతే. 1

చతుర్హితశ్చతుర్వ్యాపీ చతుష్కారీచ కీర్త్యతే | అష్టాంగో7ష్టాదశపదః శతశాఖస్తథైవచ. 2

త్రియోనిర్ద్వ్యభియోగశ్చ ద్విద్వారో ద్విగతిస్తథా | ధర్మశ్చ వ్యవహారశ్చ చరిత్రం రాజశాసనమ్‌. 3

చతుష్పాద్వ్యవహారాణా ముత్తరః పూర్వసాధకః | తత్రసత్యే స్థితోధర్మో వ్యవహారస్తు సాక్షిషు. 4

చరిత్రం సంగ్రహే పుంసాం రాజాజ్ఞాయాంతు శాసనమ్‌ | సామాద్యుపాయసాధ్యత్వాచ్చతుఃసాధనఉచ్యతే. 5

చతుర్ణామాశ్రమాణాంచ రక్షణాత్స చతుర్హితః | కర్తారం సాక్షిణశ్చైవ సభ్యాన్రాజానమేవచ. 6

వ్యాప్నోతి పాదశో యస్మాచ్చతుర్వ్యాపీతతః స్మృతః | ధర్మస్యార్థస్యయశసో లోకపంక్తే స్తథైవచ. 7

చతుర్ణాం కారణాదేష చతుష్కారీ ప్రకీర్తితః | రాజా సపురుషః సభ్యః శాస్త్రం గణక లేఖకౌ. 8

హిరణ్య మగ్నిరుదకమష్టాంగః సముదాహృతః | కామాత్ర్కోదాచ్చలోభాచ్చత్రిభ్యోయస్మాత్ర్పవర్తతే. 9

త్రియోనిః కీర్త్యతే తేన త్రయమేతద్వివాదకృత్‌ | ద్వ్యభియోగస్తు విజ్ఞేయః శంకాతత్వాభియోగతః. 10

శంకా సద్భిస్తు సంసర్గా త్తత్వం షోఢాధి దర్శనాత్‌ | పక్షద్వయాభిసంబంధాద్ద్విద్వారః సముదాహృతః. 11

పూర్వవాదస్తయోః పక్షః ప్రతిపక్షస్త్వనంతరః | భూతచ్ఛలానుసారిత్వాద్ద్విగతిః సముదాహృతా. 12

అగ్నిదేవుడు చెప్పెను : వసిష్ఠా ! ఇపుడు నయ - అనయముల వివేకమును తెలుపు వ్యవహారమును వర్ణించెదను. దీనికి నాలుగు చరణములు, నాలుగు స్థానములు, నాలుగు సాధనములు చెప్పబడినవి. ఇది నలుగురికి హితము చేకూర్చును. నలుగురికి సంబంధించి యుండును. నాలుగు చేయును. దీనికి ఎనిమిది అంగములు. పదునెనిమిది పదములు, నూరుశాఖలు మూడు యోనులు, రెండు అభియోగములు, రెండు ద్వారములు, రెండు గతులు ఉండును. ధర్మము, వ్యవహారము, చరిత్రము, రాజశాసనము అనునవి వ్యవహారదర్శనము యొక్క నాలుగు చరణములు. వీటిలో ఉత్తరోత్తరచరణములు పూర్వపూర్వ సాధకములు. వీటిలో ధర్మమునకు ఆధారము సత్యము. వ్యవహారమునకు ఆధారము సాక్ష్యము. చరిత్ర పురుష సంగ్రహాధీనము. శాసనము రాజాజ్ఞాధీనము. ఇది సామ - దాన - భేద - దండములచే సాధ్యము గాన చతుః సాధనము, ఇది అభియోక్త, సాక్షి, సభాసదులు, రాజు అనువారిపై ఒక్కొక్క పాదమున నిలచియుండును. అందుచే ఇది చతుర్య్వాపి. ఇదిధర్మ - అర్థ - యశో - లోకప్రియతలను నాల్గింటిని పెంచును గాన చతుష్కారి. రాజపురుష - సభాసద - శాస్త్ర - గణక - లేఖక - సువర్ణ - అగ్ని - జలములను ఎనిమిది అంగములు కలదగుటచే అష్టాంగము. మానవుడు కామ - క్రోధ - లోభములచే దీనియందు ప్రవృత్తుడగును. అందుచే ఇది త్రియోని. శంకాభియోగము, తత్త్వాభియోగము అని అభియోగములు రెండు విధములు. అందుచే ఇది ద్వ్యభియోగము. అసత్పురుష సంబంధముచే శంకాభియోగము, తగిన ప్రమాణములను చూచుటచే తత్త్వాభియోగము ఏర్పడును. దీనికి పూర్వవాద పక్షము (అభియోగముచేసినవాడు) ఉత్తరవాదప్రతిపక్షము, (ఎవనిపై అభియోగము చేయబడినదో వాడు) అను రెండు పక్షములుండును గాన ఇది ''ద్విద్వారము''. నిజముగా జరిగినది, కపటము అను రెండు పద్ధతులుండునుగాన ద్విగతి.

ఋణం దేయమదేయంచ యేనయత్రయథాచయత్‌ | దానగ్రహణ ధర్మశ్చ ఋణాదానమితిస్మృతమ్‌. 13

స్వద్రవ్యం యత్ర విశ్రమ్భాన్ని క్షిపత్యవిశంకితః | నిక్షేపం నామ త త్ర్పోక్తం వ్యవహార పదంబుధైః. 14

వణిక్ర్పభృతయో యత్ర కర్మ సంభూయకుర్వతే | తత్సంభూయ సముత్థానం వ్యవహార పదం విదుః. 15

దత్త్వా ద్రవ్యంచ సమ్యగ్‌యః పునరాదాతు మిచ్ఛతి |

దత్తాప్రదానికం నామ తద్వివాదపదం స్మృతమ్‌. 6

అభ్యుపేత్య చశుశ్రూషాంయస్తాం న ప్రతి పద్యతే | అశుశ్రూషాముపేత్యైవతద్వివాదపదముచ్యతే. 7

భృత్యానాం వేతనస్యోక్తా దానాదాన విధిక్రియా | వేతనస్యానపాకర్మ తద్వివాద పదంస్మృతమ్‌. 8

నిక్షిప్తం వా పరద్రవ్యం నష్టం లబ్ధ్వాపహృత్యవా | విక్రీయతే పరోక్షం యత్సజ్ఞేయో7స్వామి విక్రయః. 9

విక్రీయ పణ్యం మూల్యేన క్రేత్రేయచ్చనదీయతే | విక్రీయాసమ్ర్పదానం తద్వివాద పదముచ్యతే. 20

క్రీత్వా మూల్యేన యత్పణ్యం దుష్క్రీతం మన్యతేక్రయీ | క్రీతానుశయ ఇత్యేతద్వివాదపదముచ్యతే. 21

ఎట్టి ఋణమీయ వచ్చును. ఎట్టిది ఈయరాదు. ఎప్పుడు ఇవ్వవచ్చును. ఎప్పుడు ఇవ్వరాదు ఎట్లు ఇవ్వవలెను. ఋణమునిచ్చు విధానమేది. దానిని మరల రాబట్టుకొనుట ఎట్లు - ఈ విషయములనన్నింటిని విచారించుట 'ఋణదానము'. ఒక వ్యక్తి విశ్వాసముతో మరొకవ్యక్తి వద్ద ధనమును దాచి ఉంచినచో అది ''నిక్షేపము''. వర్తకులు మొదలగు వారు చాలమంది కలిసి పరస్పర సహకారముతో ఏదైన ఒకకార్యము చేసినచో అది ''సంభూయ సమత్థానము'' అను వివాదపదము. ఒక వ్యక్తి ఏదైన ఒక వస్తువును యథా విధిగ ఇతరునికి దానము చేసికూడ దీనిని తనకే ఉంచుకొనవలెనని కోరినచో అది ''దత్తాప్రదానిక'' వివాదపదము. సేవ చేసెదనని చెప్పి సేవచేయకున్నచో అది ''అభ్యుపేత్య-అశుశ్రూష'' అను వివాదపదము భృత్యులకు వేతనము సరిగా చెల్లించకపోవుటచే ఏర్పడినది ''వేతనా నపాకర్మ వివాదపదము''. తాకట్టు పెట్టిన లేదా నష్టమైన పరద్రవ్యమును, అపహరించిన దానిని, దాని స్వామికి తెలియకుండ అమ్మివేసినచో అది 'అస్వామి విక్రయము' అను వివాదపదము. వర్తకుడు ఒక వస్తువును అమ్మిన తరువాత కూడ దానిని కొన్నవానికి ఇవ్వకున్నచో అది ''విక్రీయాసంప్రదానము'' అను వివాదపదము ఒక వస్తువును కొన్నవాడు అది బాగులేదని అన్నచో అది ''క్రీతానుశయము'' అను వివాదపదము. గ్రాహకుడు ఒకవస్తువును మూల్యము చెల్లించి కొన్న పిమ్మట ఆ కొనుగోలు సరిగాలేదని తలచి. దానిని ఆదినమునందే వర్తకునకు తిరిగి ఇచ్చివేసినచో, విక్రేత దాని మూల్యమునంతను ఏమాత్రము తగ్గించకుండ క్రేతకు తిరిగిఇచ్చి వేయవలెను.

పాషండనై గమాదీనాం స్థితిః సమయ ఉచ్యతే | సమయ స్యానపాకర్మ తద్వివాద పదం స్మృతమ్‌. 22

సేతుకేదారమర్యాదా వికృష్టాకృష్ట నిశ్చయః | క్షేత్రాధికారేయత్ర స్యుర్వివాదః క్షేత్రజస్తుసః. 23

వైవాహికో విధిఃస్త్రీణాం యత్ర పుంసాంచ కీర్త్యతే | స్త్రీపుంసయోగసంజ్ఞం తుతద్వివాద పదంస్మృతమ్‌. 24

విభాగో7ర్థస్యపైత్రస్య పుత్త్రైర్యస్తు ప్రకల్ప్యతే | దాయభాగ ఇతి ప్రోక్తం తద్వివాద పదంబుధైః. 25

సహసాక్రియతే కర్మ యత్కించిద్బలదర్వితైః | తత్సాహసమితిప్రోక్తం వివాద పదముచ్యతే. 26

దేశజాతి కులాదీనామాక్రోశాద్వ్యంగ్య సంయుతమ్‌ | యద్వచః ప్రతికూలార్థం వాక్పారుష్యం తదుచ్యతే. 27

పరగాత్రేష్వభిద్రోహో హస్తపాదాయుధాదిభిః | అగ్న్యాదిభిశ్చోప ఘాతైర్ధండ పారుష్య ముచ్యతే. 28

అక్షవజ్ర శలాకా ద్యైర్దేవనం ద్యూతముచ్యతే | పశుక్రీడావయోభిశ్చప్రాణిద్యూతం సమాదిశేత్‌. 29

ప్రకీర్ణకః పునర్‌జ్ఞేయో వ్యవహారో నిరాశ్రయః | రాజ్ఞామాజ్ఞా ప్రతీఘాతస్తత్కర్మాకరణం తథా.

30

పాషండులు, నైగములు మొదలగు వారిస్థితికి సమయమని పేరు. దీనికి సంబంధించినది ''సమయానపాక కర్మ వివాదపదము''. పొలములపై అధికారమును పురస్కరించుకొని వంతెనలు, మళ్ళు, సరిహద్దులు - వీటిని గూర్చిన వివాదము ''క్షేత్రజము''. స్త్రీ-పురుషుల వివాహాదులను సంబంధించిననది ''స్త్రీ పుంసయోగ వివాదపదము''. తండ్రి ఆస్తిని పంచుకొను పుత్రులలో ఏర్పడినది ''దాయభాగ వివాదపదము''. బలగర్వముచే అనాలోచితముగ చేసిన అది ''సాహస వివాదపదము''. ఒక వ్యక్తిని ఆతని దేశము, జాతి, కులము మొదలగు వాటిని పురస్కరించుకొని దోషారోపణము చేయుచు విపరీతార్థములుగల వ్యంగ్యోక్తులు పలుకుట ''వాక్పారుష్య వివాదపదము''. హస్తపాదములచేగాని, ఆయుధముచేగాని, అగ్నిచేతగాని ఎవరికైన శరీరముపై అఘాతము కలిగించుట ''దండ పారుష్యము''. పాచికలు, తోలు ముక్కలు, ఏనుగు దంతములతో చేసిన శలాకలు.వీటిని ఉపయోగించి చేయు క్రీడకు ద్యూతమని పేరు. పశుపక్ష్యాదుల నుపయోగించి చేయు క్రీడ ''ప్రాణి ద్యూతము''. రాజు ఆజ్ఞను ఉల్లంఘించి ఆతడు చెప్పిన పని చేయకుండుట ''ప్రకీర్ణక'' మను వ్యవహారపదము. ఈ వివాదపదము రాజుకు సంబంధించినది. ఈ విధముగ వ్యవహారమునందు పదునెనిమిది పదము లున్నవి. వీటికి మరల నూరుభేదము లున్నవి. మనుష్యుల పనులనుబట్టి ఈ నూరుభేదము లేర్పడును.

వ్యవహారో7ష్టాదశ పదస్తేషాం బేదో7థ వైశతమ్‌ | క్రియా భేదాన్మనుష్యాణాం శతశాఖోనిగద్యతే. 31

వ్యవహారాన్నృపః పశ్యేత్‌ జ్ఞానివిప్త్రెరకోపనః | శత్రుమిత్ర సమాః సభ్యా అలోభాశ్రుతివేదినః. 32

ఆపశ్యంస్తాన్కార్య వశాత్సభ్యైర్విప్రం నియోజయేత్‌ | రాగాల్లోభాద్భయాద్వాపిస్మృత్యపేతాదికారిణః. 33

సభ్యాః పృథక్‌ పృథగ్దండ్యా వివాదాద్‌ ద్విగుణోదమః | స్మృత్యాచార వ్యపేతేన మార్గేణాధర్షితః పరైః. 34

ఆవేదయతి యద్రాజ్ఞే వ్యవహారం పదం హితత్‌. | ప్రత్యర్థినో7గ్రతో లేఖ్యం యథావేదిత మర్థినా 35

సమామాసతదర్ధాహర్నామ జాత్యాది చిహ్నితమ్‌ | శ్రుతాఢ్థస్యోత్తర లేఖ్యం పూర్వవేదక సన్నిధౌ. 36

తతో7ర్థం లేఖయేత్సద్యః ప్రతిజ్ఞాతార్థసాధనమ్‌ | తత్సిద్ధౌ సిద్ధి మాప్నోతి విపరీత మతో7న్యథా. 37

చతుష్పాద్వ్యవహారో7యం వివాదేషూ పదర్శితః | అభియోగమనిస్తార్య నైనం ప్రత్యభి యోజయేత్‌. 38

అభియుక్తంచ నాన్యేన త్యక్తం విప్రకృతిం నయేత్‌ | కుర్యాత్ర్పత్యభియోగం తు కలహే సాహ సేషుచ. 39

రాజు క్రోధరహితుడై జ్ఞానసంపన్నులగు బ్రాహ్మణులతో కలిసి వ్యవహారవిచారము చేయవలెను. వేదవేత్తలు, శత్రుమిత్రులను సమానదృష్టితో చూడగలిగినవారును, లోభరహితులును అగువారిని సభాసదులనుగ నియమించవలెను. తాను స్వయముగ వ్యవహారము చూడ వీలులేనప్పుడు రాజు సభాసదులతోపాటు విద్వాంసుడగు ఒక బ్రాహ్మణుని ఆకార్యమున నియమించవలెను. సభాసదులు రాగ-లోభ-భయాదులచే

ధర్మశాస్త్ర-ఆచారాది విరుద్ధములగు నిర్ణయములు చేసినచో రాజు వారిపై వేరు వేరు వివాదముకంటే రెట్టింపు అర్థదండముచే వారిని శిక్షించవలెను. ఎవ్వడైన ఒక వ్యక్తి మరొక వ్యక్తిచే ధర్మశాస్త్ర సమాచారములకు విరుద్ధముగ బాధింపబడినచో, అతడు రాజువద్దకువెళ్ళి ఆ విషయమును తెలిపిన అది 'వ్యవహారపద' మని చెప్పబడును. వాది చెప్పినదానినంతను రాజు సంవత్సరము, మాసము, పక్షము, దినము, పేరు. జాతి మొదలగు వాటితోసహా ప్రతివాది ఎదుట వ్రాయించవలెను. (వాది చేసిన నివేదనమునకు 'భాష' 'ప్రతిజ్ఞ' లేదా 'పక్షము' అని పేరు). ప్రతివాది వాది చెప్పినదంతయువిని దానికి ప్రత్యుత్తరము వాని ఎదుటనే వ్రాయించవలెను వాది ఆ సమయమునందే తాను చేసిన నివేదనమునకు ప్రమాణము వ్రాయించవలెను. నివేదనము ప్రమాణితమైనచో వాది జయించును, కానిచో పరాజితుడగును ఈ విధముగ వివాదమునందు నాలుగు పాదములు (అంశముగల) వ్యవహారము చూపబడినది. అభియుక్తునిపై వచ్చి జరుగుచున్న అభియోగమునకు నిర్ణయము కానంతవరకును అతనిపై వచ్చిన మరియొక అపరాధమును గూర్చి విచారణ చేయగూడదు. ఇతరునిచే అభియుక్తుడగు వానిపై విరుద్ధముగ ఏమియు చెప్పరాదు. కాని హింసాద్య పరాధాభియోగమైనచో దానిని, ముందునడచుచున్న అభియోగమునకు నిర్ణయము కాకపూర్వమే నడిపించవచ్చును.

ఉభయోః ప్రతిభూర్గ్రాహ్యః సమర్థః కామ్యనిర్ణయే | నిహ్నవే భావితో దద్యాద్ధనం రాజ్ఞేతు తత్సమమ్‌. 40

మిథ్యాభియోగా ద్ద్విగుణ మభియోగాద్ధనం హరేత్‌ | సాహసస్తేయ పారుష్యేష్వభి శాపాత్యయేస్త్రియాః. 41

విచారయేత్సద్య ఏవ కాలో7న్య త్రేచ్ఛయా స్మృతః | దేశాద్దేశాంతరం యాతి సృక్విణీ పరిలేఢి చ. 42

లలాటం స్విద్యతే చాస్య ముఖవై వర్ణ్య మేవచ | స్వ భావాద్వికృతిం గచ్ఛేన్మనో వాక్కాయకర్మభిః. 43

అభియోగే7థ వాసాక్ష్యే వాగ్దుష్టః పరికీర్తితః | సందిగ్ధార్థం స్వతంత్రోయః సాధయేద్యశ్చ నిష్పతేత్‌. 44

న చాహతో వదేత్కించిద్ధనీ దండ్యశ్చస స్మృతః | సాక్షిషూ భయతః సత్సు సాక్షిణః పూర్వవాదినః. 45

పూర్వపక్షే7ధరీ భూతే భవన్త్యుత్తర వాదినః | సగణశ్చే ద్వివాదః స్యాత్తత్ర హీనస్తు దాపయేత్‌. 46

దత్తం పణం వసుం చైవ ధనినో ధనమేవ చ | ఛలం నిరస్య దూతేన వ్యవహారాన్నయేన్నృపః. 47

భూతమప్యనుపన్యస్తం హీయతే వ్యవహారతః | నిహ్నుతే నిఖిలానేకమేక దేశ విభావితమ్‌. 48

దాప్యః నర్వాన్నృ పేణార్థాన్న గ్రాహ్యస్త్వని వేదితః | స్మృత్యోర్విరోధే న్యాయస్తు బలవాన్వ్య వహారతః. 49

అర్థశాస్త్రాద్ధి బలవద్దర్మ శాస్త్రమితి స్థితిః |

సభాసదసమేతుడైన సభాపతి (ప్రాడ్వివాకుడు) వాదిప్రతివాదుల వివాదమును నిర్ణయించుటకు సమర్థులగు వారిని 'ప్రతిభూ' (జామీను) గా ఏర్పరుపవలెను అర్థి (వాది) చేసిన అభియోగమును ప్రతివాది తిరస్కరించగా, అర్థి సాక్ష్యాదులు చూపి తన అభియోగమును ప్రతివాదిచే అంగీకరింపచేయగలిగినచో, ప్రతివాది అర్థికి ఇవ్వవలసిన ధనమంతయు చెల్లించి, అంతే ధనమును, దండముగా రాజుకు చెల్లించవలెను. అర్థి తన అభియోగమును నిరూపించుకొనజాలక మిథ్యాభియోగి యైనచో అతడు అభియుక్తధనమునకు రెట్టింపు ధనము రాజుకు అర్పించవలెను. హత్య దోపిడి, వాక్పారుష్యము, దండపారుష్యము, పాలు ఇచ్చు ఆవులను అపహరించుట, అభిశాపము (మహాపాతకము చేసినట్లు అభియోగము), అత్యయము (ప్రాణఘాతము), ధనాతిపాతము, స్త్రీ చరిత్ర మొదలగు వాటికి సంబంధించిన అభియోగము వచ్చినప్పుడు అపరాధి నుండి వెంటనే ఉత్తరము (సముజాయిషీ) తీసుకొనవలెను. ఆలస్యము చేయరాదు. ఇతర వివాదములలో వాది ప్రతివాదులు, సభాసదులు, ప్రాడ్వివాకుడు మొదలగువారి ఇచ్ఛననుసరించి సమయము తీసికొనవచ్చును. అభియోగ సమయమున అభియోగము చేయువాడుగాని, సాక్ష్యమిచ్చువాడు గాని ఒకచోటునుండి మరియొకచోటునకు తిరుగుచుండినను, స్థిరముగా ఉండజాలకున్నను, రెండుచెలివెలునాకుచున్నను, అతని నుదుట చెమటపట్టినను, ముఖము వెలవెలబోయినను, కంఠము ఎండిపోయి మాటతడబడినను, పూర్వాపర విరుద్ధముగ మాటలాడినను, ఇతరులకు సరిగాప్రత్యుత్తరమీయజాలకున్నను, ఇతరుల చూపులో చూపు కలుపజాలక పోయినను, పెదవులు వంకరటింకర చేయుచున్నను, ఈ విధముగ సహజముగనే మనో -వాక్‌ -శరీర క్రియలందు వికారము పొందినచో ఆతడు దుష్టుడని చెప్పబడినది. అప్పుతీసికొన్నవాడు నిరాకరించిన సందేహాస్పదమైన ఋణమును గూర్చి ఏదో విధముగ నిజమని నిరూపించుటకు ప్రయత్నించువాడును, రాజుపిలిపించినపుడు అతని యెదుట ఏమియు చెప్పజాలని వాడును దుష్టుడే. ఆతడు కూడ దండనీయుడు. ఇద్దరువాదుల పక్షములందు సాక్ష్యముచెప్పువారు లభ్యులైనపుడు పూర్వవాది సాక్షులనే ప్రశ్నింపవలెను. వాదికి జవాబుగ ''నేనీ క్షేత్రమును చాలకాలము క్రితమే దానరూపమున పొందితిని అప్పటినుండియు నేను దీనిని అనుభవించుచున్నాను'' అని చెప్పువాడు ఇచట. పూర్వవాది; ముందుగా అభియోగము చేసిన వాడు కాదు. అప్పుడు రెండవవాడు ''నిజమే, ఇది ఈతనికి దానమువలన లభించినది, కాని ఇతని నుండి అముకవ్యక్తి (ఫలానవ్యక్తి) దీనిని కొని నాకిచ్చినాడు'' అని చెప్పినచో అపుడు పూర్వపక్షము అసాధ్యము గాన దుర్బలమైపోవును. అపుడు ఉత్తరవాది సాక్షులను మాత్రమే ప్రశ్నించవలెను. వివాదము ఏదైన ఒక పందెముపై (షరతు) చేయబడినపుడు అట్లు పందెము వేసినవాడు ఓడిపోయినచో ఆతడు వేసిన పందెము సొమ్ము రాజుకు ఇచ్చివేయవలెను. అర్థి ధనవంతుడైనపుడు వివాదాస్పదమగు ధనము మాత్రమే ఆతనికి ఇప్పించవలెను. రాజు కపటము విడనాడి, సత్యము నాశ్రయించి వ్యవహార నిర్ణయము చేయవలెను. యథార్ధవస్తువైనను లిఖితపూర్వకముగ లేనిచో వ్యవహారమున పరాజయమే కలుగును అర్థి -సువర్ణ - రజత - వస్త్రాదివస్తువులను అభియోగ పత్రమున వ్రాయగా ప్రత్యర్థి వాటినన్నింటిని అంగీకరించినచో, అట్టి పరిస్థితులలో సాక్ష్యాధారముపై ప్రత్యర్థి ఆ వస్తువులలో ఏ ఒక్క వస్తువును ఒప్పుకొన్నను. రాజు అభియోగపత్రమునందు వ్రాసినవాటినన్నింటిని అర్థికి ప్రత్యర్థినే ఇప్పించవలెను. మొదట అభియోగపత్రమునందు వ్రాయబడనిదానిని ఆ వస్తుసూచియందు చేర్చుట జరిగినచో ఆ వస్తువును ఇప్పించవలసిన పనిలేదు. రెండు స్మృతి వాక్యములలోగాని, ధర్మశాస్త్ర రచనములలోగాని, పరస్పర విరోధము కనబడినచో సామాన్యాపవాద న్యాయము ననుసరించి సామాన్యశాస్త్రము కంటే విశేషశాస్త్రము బలీయమని నిర్ణయించవలెను. అర్థశాస్త్ర ధర్మములందు పరస్పరవిరోధమేర్పడినపుడు అర్థశాస్త్రముకంటే ధర్మశాస్త్రము బలీయమని మునులు చెప్పిన మర్యాద (కట్టుబాటు).

ప్రమాణం లిఖితం భుక్తిః సాక్షిణశ్చేతి కీర్తితమ్‌. 50

ఏషామన్యతమాభావే దివ్యాన్యతమ ముచ్యతే | సర్వేష్వేవ వివాదేషు బలవత్యుత్తరాక్రియా. 51

ఆధౌ ప్రతిగ్రహే క్రీతే పూర్వాతు బలవత్తరా | పశ్యతో బ్రువతో భూమేర్హాని ర్వింశతివార్షికీ. 52

పరేణ భుజ్యమానాయా ధనస్య దశవార్షికీ | ఆధి సీమోపనిక్షేప జడ బాల ధనైర్వినా. 53

తథోపనిధిరాజస్త్రీ శ్రోత్రియాణాం ధనైరపి| ఆధ్యాదీనాం విహర్తారం ధనినే దాపయేద్ధనమ్‌. 54

దండం చ తత్సమం రాజ్ఞే శక్త్య పేక్ష్య మథాపివా| ఆగమే7ప్యధికో భుక్తిం వినాపూర్వక్రమాగతామ్‌. 55

లిఖితము, భుక్తి, సాక్షి అనునవి మూడు మానుష ప్రమాణములు. 'భుక్తి' అనగా అనుభవించుట. ఈ మూడింటిలో ఏ ఒక్కటియు లభించనపుడు చెప్పబోవు దివ్యప్రమాణములలో ఏదైన ఒకదాని గ్రహించవలెను. ఋణము మొదలయిన సమస్త వివాదములందును ఉత్తర క్రియబలవత్తరము. ఉత్తరక్రియ సిద్ధీకృతమైనపుడు విజయము ఉత్తర వాదికే. పూర్వవాది తన పక్షమును సిద్ధము చేసినను ఆతడు ఓడిపోవును కాని ఆధి (తాకట్టు) ప్రతిగ్రహ - క్రీతములందు పూర్వక్రియ బలీయము. భూస్వామి చూచుచుండగనే ఒక వ్యక్తి ఆ భూమిని అనుభవించుచుండగా ఆతడేమియు అనకున్నచో ఇరువది సంవత్సరములు తరువాత ఆ భూమి అనుభవించువానికి చెందును. అది ధనమైనచో పది సంవత్సరములయిన తరువాత అనుభవించువానికి చెందును. కాని తాకట్టు, సరిహద్దు, నిక్షేపము, జడులధనము, బాలకులధనము, ఉపనిధి, రాజ-స్త్రీ-శ్రోత్రియుల ధనము - వీటి విషయమున పై నియమము వర్తించదు. పైన చెప్పినవారి సొత్తును చాలకాలము అనుభవించినంతమాత్రమున అపహరింపజూచువానిచే ఆ ధనమును స్వామికి ఇప్పించి, అంత ధనమును స్వామికి ఇప్పించి, అంత ధనమును దండించి రాజు తీసికొనవలెను. లేదా ఆ విధముగ అపహరించినవాని శక్తినిబట్టి, అధికముగాని, అల్పముగాని ధనమును దండరూపమున తీసికొనవలెను. సత్వమునకు హేతువగు ప్రతిగ్రహ-క్రయాదులకు ఆగమమని పేరు. ఆగమము భోగముకంటె ప్రబలము. సత్వమును స్థాపించుటకు ఆగమసాపేక్షమైన భోగమే ప్రమాణము. కాని పితృపితామహాది క్రమమున అనుభవింపబడు చున్నది. తప్ప ఇతర భోగమునందే ఆగమనమునకు ప్రాబల్యము. పూర్వపరంపరా ప్రాప్తమగు భోగము ఆగమముకంటెను ప్రబలమైనది. ఏమాత్రము ఉపభోగము లేని ఆగమమునకు బలము లేదు.

ఆగమో7పి బలం నైవ భుక్తిః స్తోకాపి యత్రనో | ఆగమేన విశుద్ధేన భోగోయాతి ప్రమాణతామ్‌. 56

అవిశుద్ధాగమో భోగః ప్రామాణ్యం నాధిగచ్ఛతి | ఆగమస్తు కృతోయేన సో7భియుక్తస్త ముద్ధరేత్‌. 57

నతత్సుతస్తత్సుతో వా భుక్తిస్తత్ర గరీయసీ | యో7భియుక్తః పరేతః స్యాత్తస్యరిక్థాత్తముద్ధరేత్‌. 58

నతత్ర కారణం భుక్తిరాగమేన వినాకృతా | బలోపాధివినిర్వృత్తాన్వ్యవహారాన్ని వర్తయేత్‌.

స్త్రీనక్తమన్తరాగారబహిః శత్రుకృతస్తథా | మత్తోన్మత్తార్తవ్యసని బాలభీత ప్రయోజితః. 60

అసంబద్ధ కృతశ్చైవ వ్యవహారో నసిధ్యతి |

విశుద్ధమైన ఆగమమును బట్టి భోగమునకు ప్రామాణ్యము వచ్చును. ఆగమము సరియైనది కానపుడు భోగము ప్రమాణము కాదు. భూమ్యాద్యాగమము కలవాడు, ''నీకిది ఎట్లు వచ్చినది?'' అని ఎవరైన అడిగినపుడు లిఖితాది ప్రమాణములచే ఆగమమును నిరూపించుకొనవలెను. వానిపుత్రపౌత్రాదులు ఆగమమును నిరూపించుకొనవలసిన పనిలేదు. పరంపరాగత భోగమే అచట ప్రమాణముగ గ్రహింపబడును. వ్యవహారనిర్ణయమునకు పూర్వమే ఒకడు మరణించినచో ఆతని ధనమునకు ఉత్తరాధికారులైన పుత్రాదులు లిఖితాది ప్రమాణముల ద్వారా ఆగమనమును నిరూపించుకొనవలెను. ఎందుచేతననగా ఆ వ్యవహారమునందు ఆగమము లేకుండ కేవలము భోగము ప్రమాణము కాజాలదు. బలాత్కార - భయాదులచే జరిపిన వ్యవహారమును త్రిప్పివేయవలెను. కేలము స్త్రీయే చేసిన అభియోగమును, రాత్రియందు చేసినదానిని, ఇంటిలోపల జరిగిన సంఘటనకు సంబంధించినదానిని, గ్రామాదుల వెలుపల నిర్జన ప్రదేశమునకు సంబంధించినదానిని, శత్రువుచేసిన దాడిని న్యాయాలయమునందు విచారణార్థము గ్రహింపరాదు, త్రిప్పివేయవలెను. మాదకద్రవ్య సేవనముచే మత్తులో నున్నవాడును, వాత-పిత్త-కఫ-సన్నిపాత- గ్రహావేశాదులచే ఉన్మత్తుడును, రోగపీడితుడును, ఇష్టవియోగ-అనిష్టప్రాప్తులచే దుఃఖితుడును, అప్రాప్తవయస్కుడును, శత్రువులు మొదలగువారి నుండి భయపడినవాడును నడిపిన వ్యవహారము ''అసిద్ధము'' అని చెప్పబడినది. అభియుక్తవస్తువుతో సంబంధము లేనివారు నడిపినది కూడ అసిద్ధము.

ప్రనష్టాధిశతం దేయం నృపేణ ధనినే ధనమ్‌. 61

విభావయేన్న చేల్లింగైస్తత్సమం దాతుమర్హతి | దేయం చౌర హృతం ద్రవ్యం రాజ్ఞాజనపదాయతు. 62

అశీతి భాగో వృద్ధిః న్యాన్మాసి మాసి సబంధకే | వర్ణక్రమాచ్ఛతం ద్విత్రి చతుష్పంచకమన్యథా. 63

సప్తతిస్తు పశుస్త్రీణాం రసస్యాష్ట గుణాపరా | వస్త్ర ధాన్యహిరణ్యానాం చతుస్త్రిద్విగుణాతథా. 64

ధనవంతుని ధనము ఎంత పోయినదో అది రాజు ఆతని కీయవలెను. పోయిన ధనమును దాని స్వామి గుర్తింప జాలకపోయినచో, ఎంతధనము పోయినదని రాజుకు చెప్పెనో అంతధనమును రాజునకు దండముగా ఇవ్వవలెను. చోరులు అపహరించిన ధనమును రాజు ఏ జనపదమునుండి అపహరించబడినదో ఆ జనపదమునకే ఇచ్చివేయవలెను. ఏదైన ఒక వస్తువును తాకట్టుపెట్టి తీసికొనిన ఋణముపై ఎనబదవభాగము (1/80) ప్రతి మాసము ఇవ్వవలెను. బంధకము (తాకట్టు) లేనిచో బ్రాహ్మణాది వర్ణక్రమమున ప్రతిశతము కొంచెము కొంచెము అధికమగు వడ్డీ తీసికొనవచ్చును. ఆడపశువులను ఋణముగా తీసికొనినపుడు వాటి పిల్లలు వడ్డీగా గ్రహించవలెను. నూనె నెయ్యి మొదలగు రసద్రవ్యములు ఋణముగా తీసికొన్నప్పుడు, అది పెరిగి పెరిగి ఎనిమిది రెట్లు కావచ్చును. అంతకు మించి వృద్ధి ఉండకూడదు. వస్త్ర-ధాన్య-సువర్ణముల విషయమున వృద్ధిక్రమముగా నాలుగు, మూడు, రెండు రెట్లవరకు ఉండవచ్చును; అంతకటె అధికము కాదు.

గ్రామాన్తరాత్తు దశకం సముద్రాదపి వింశతిమ్‌ | దద్యుర్వా స్వకృతాం పృద్ధిం సర్వే సర్వాసు జాతిషు. 65

ప్రసన్నం సాధయన్నర్థంన వాచ్యో నృపతిర్భవేత్‌ | సాధ్యమానో నృపం గచ్ఛేద్దండ్యో దాప్యశ్చ తద్ధనమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వ్యవహార నిరూపణం నామ త్రిపంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

వ్యాపారము కొరకై దుర్గమ వనప్రదేశములుదాటి ప్రయాణము చేయువారు ఋణదాతకు నూటికి పది చొప్పునను, సముద్రయానము చేయువారు నూటికి ఇరువదిచొప్పునను వృద్ధి ఇవ్వవలెను. లేదా అన్ని జాతులవారును, ఏజాతివారినుండి తీసుకున్న ఋణమైనను, అది సంబంధకమైనను (తాకట్టు ఉన్నది) అబంధక మైనను, ఋణదాతకును తమకును మధ్య జరిగిన ఒప్పందమును బట్టి వడ్డీ ఇవ్వవలెను. ఋణము తీసికొన్నవాడు ఏధనమునుతీసికొనెనో, అది సాక్షిప్రమాణితమైనపుడు, దానిని ఋణదాత వసూలు చేసుకొనుచున్నపుడు రాజు అడ్డుపెట్టగూడదు. ఋణదాత న్యాయసంగతముగ ఋణమువసూలు చేసికొనుచున్నను వానిపై అభియోగము చేయువానిని రాజు దండించవలెను. వానిచే ఆధనమిప్పించవలెను.

అగ్ని మహాపురాణమునందు వ్యవహారకథనమను రెండువందలఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page