Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచచత్వారింశ దధిక ద్విశతతమోధ్యాయః

అథ చామరాది లక్షణమ్‌

అగ్నిరువాచ :

చామరో రుక్మదండోగ్ర్యః ఛత్రం రాజ్ఞః ప్రశసయతే | హంసపక్షైర్విరచితం మయూరస్య శుకస్యచ.1

పక్షైర్వాథ బలాకాయా న కార్యం మిత్రపక్షకైః | చతురస్రం బ్రాహ్మణస్య వృత్తం రాజ్ఞశ్చ శుక్లకమ్‌.2

త్రిచతుః పంచషడ్‌ సప్తహ్యష్టపర్వాణి దండకే | భద్రాసనం క్షీరివృక్షైః పంచాశదఙ్గులోచ్ఛ్రయైః.3

విస్తారేణ త్రిహస్తం స్యాత్సువర్ణాద్యైశ్చ చిత్రితమ్‌| ధనుర్ద్రవ్య త్రయంలోహం శృంగందారు ద్విజోత్తమ.

జ్యాద్రవ్యత్రితయం చైవ వంశ భంగత్వచస్తథా | దారు చాపప్రమాణం తు శ్రేష్ఠం హస్త చతుష్టయమ్‌.4

తదేవ సమహీనంతు ప్రోక్తం మద్యకనీయసి | ముష్టి గ్రహనిమిత్తాని మధ్యేద్రవ్యాణి కారయేత్‌.6

స్వల్పకోటి స్త్వచాశృంగం శార్జగలౌహమయేద్విజ | కామినీభ్రూలతాకారా కోటిఃకార్యా సుసంయతా.7

పృథగ్వా విప్రఃమిశ్రంవా లౌహంశార్జం తుకారయేత్‌ | శార్జగం సముచితం కార్యం రుక్మబిందువిభూషితమ్‌.8

కుటిలంస్ఫుటితంచాపం సచ్ఛిద్రంచ న శస్యతే| సువర్ణం రజతం తామ్రం కృష్ణాయోదనుషిస్మృతమ్‌.9

మాహిషం శారభం శార్జగం రౌహిషంవాదనుఃశుభమ్‌ | చందనం వేతసంసాళం దావలం కకుభం తరుః.10

సర్వశ్రేష్ఠం ధనుర్వంశైర్గృహీతైః శరది శ్రితైః | పూజయేత్తు ధనుఃఖడ్గమంత్రై సై#్త్రలోక్యమోహనైః.11

అగ్నిదేవుడు పలికెను : వశిష్ఠా | సువర్ణదండభూషితమగు చామరము ఉత్తమము. హంస పక్షములతో గాని, మయూరపక్షములతోగాని, శుకపక్షములతో గాని నిర్మించిన ఛత్రము రాజునకు మంచిది. ఒక పక్షనిర్మితఛత్రమునుకూడ ఉపయోగించవచ్చును. మిశ్రితపక్షముల ఛత్రము మాత్రము మంచిది కాదు మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు లేదా ఎనిమిది పర్వములున్న దండము ప్రశస్తము. భద్రాసననము క్షీరవృక్షకాష్ఠముచే నిర్మితమై ఏబది అంగుళముల ఎత్తు ఉండవలెను. అది సువర్ణవిచిత్రతమై మూడు హస్తముల విస్తారముండవలెను. ఓ ద్విజశ్రేష్ఠా! ధనస్సును నిర్మించుటకు లోహముగాని, శృంగముగాని, కాష్ఠముగాని ఉపయోగించవలెను. వెదురు, భంగములేదా చర్మము నారికి ఉపయోగించును. దారు నిర్మితమగు శ్రేష్ఠధనస్సుయొక్క పొడవు నాలుగు హస్తములు- దానిలో ఒక్కొక్క హస్తము పొడవు తగ్గించగా మధ్యమ అధమ ధనస్సులేర్పడును పిడికిలితో పట్టుకొనుటకు ధనస్సునకు మధ్యభాగమున ఏదైన ద్రవ్యమునుపయోగించవలెను. ధనస్సుయొక్క కోటిని కామినీభ్రూలత ఆకారములో చాలగట్టిగ చేయవలెను. లోహ-శృంగధనస్సులను ప్రత్యేకముగ ఒక పదార్థముతోగాని, మిశ్రపదార్థములతోగాని తయారుచేయవలెను.శృంగధనస్సును అత్యంతోపయుక్తముగాను, సువర్ణ బింద్వలంకృతముగాను చేయవలెను. ధాతువులతో

సువర్ణ-రజిత-తామ్ర-కృష్ణలోహములను ఉపయోగించవలెను. శార్జగధనస్సులలో మహిష-శరభ-రోహిణమృగముల శృంగములతో నిర్మించినవి శుభములు. దారుమయశరాసనములలో చందన-వేతస-సాల-ధవ-అర్జున వృక్షముల కాష్ఠముతో నిర్మించినవి ఉత్తమములు. శరదృతువునందు పక్వమైన వెదురు కోసి నిర్మించిన ధనస్సు సర్వోత్తమము. ధనస్సును, ఖడ్గమును త్రైలోక్యమోహనమంత్రములతో పూజించవలెను.

అయనశ్చాథ వంశస్య శరస్యాప్య శరస్య చ | ఋజువో హేమర్ణాభాః స్నాయుశ్లిష్టాః సుపత్రకాః.12

రుక్మపుంఖాః సుపుంఖాస్తే తైలధౌతాః సువర్ణకాః | యాత్రాయామభిషేకాదౌ యజేద్బాణధనుర్ముఖాన్‌.13

సపతాకాస్త్రసంగ్రాహిసాంవత్సరతరాన్నృపః | బ్రహ్మావై మేరుశిఖరే స్వర్గగంగాతటే యజత్‌.14

లోహదైత్యం సదదృశే విఘ్నంయజ్ఞేతు చింతయన్‌ | తస్యచింతయతో వహ్నేః పురుషో భూద్బలిర్మహాన్‌,

వవన్దే జం చ తందేవా అభ్యనన్దంత హర్షితాః | తస్మాత్సనందకః ఖడ్గోదేవోక్తో హరిరగ్రహీత్‌.15

తం జగ్రాహ శ##నైర్దేవో వికోశఃసోభ్యపద్యత | ఖడ్గోనీతో రత్నముష్టిస్తతో భూచ్ఛతబాహుకః.17

దైత్యఃనగదయా దేవాన్ద్రావయామాస వైరణ| విష్ణునా ఖడ్గచ్ఛిన్నాని దైత్యగాత్రాణి భూతలే.18

పతితాని తు సంస్సర్శాన్నన్దకస్య చతానిహి | లోహ భూతాని సర్వాణి హత్వా తసై#్మ హిరర్వరమ్‌.19

దదౌ పవిత్ర మంగం తేహ్యాయుధాయ భ##వేద్భువి | హరిప్రసాదాద్ర్బహ్మాపి వినా విఘ్నం హరిం ప్రభుమ్‌.

పూజయామాసయజ్ఞేన వక్ష్యేథో ఖడ్గ లక్షణమ్‌ |

లోహము, వెదురు, సరకాండము వీటితొ గాని, మరియే ఇతర పదార్థములతో నిర్మించినను బాణము వంకర లేకుండగను, బంగారుకాంతికలదిగను, స్నాయుపువలె శ్లిష్టముగను, బంగారు పొన్నుతో భూషితముగను, తైలధౌతముగను, అందమైన రెక్కలు కట్టినదిగను ఉండవలెను. రాజు యాత్రయందును, అభిషేకమునందును, ధనుర్భాణములు మొదలగు అస్త్రములు, పతాకలు సంగ్రహించునపుడు దైవజ్ఞులను గూడ పూజించవలెను. పూర్వము బ్రహ్మదేవుడు సుమేరు పర్వత శిఖరమునందు, ఆకాశగంగాతీరమున యజ్ఞము చేసెను. అతడా యజ్ఞమునకు వచ్చియున్న లోహదైత్యుని చూచెను. ఆతనిని చూడగనే''వీడు నా యజ్ఞమున విఘ్నము కలిగించడుకదా!'' అని చింతలోపడెను. ఇట్టి చింతకలుగగనే అగ్ని నుండి బల వంతుడగు ఒక పురుషుడు ఆవిర్భవించి బ్రహ్మకు నమస్కరించెను. దేవతలు ప్రసన్నులై అతనిని అభినందించిరి. ఇట్లు అభినందింపబడుటచే అతడు 'నందక'మను పేరుతో ఒక ఖడ్గమాయెను. దేవతలు ప్రార్థింపగా శ్రీమహావిష్ణువు ఆ ఖడ్గమును తన ఆయుధముగ స్వీకరించెను. ఆ దేవాదిదేవుడు ఆ ఖడ్గమును దాని కంఠమున చేయి ఉంచి పట్టుకొనుటచే అది ఒరనుండి బైటకు వచ్చెను. ఆ ఖడ్గకాంతి నీలముగను, ముష్టిరత్నమయముగను ఉండెను. అది పెరిగి నూరు హస్తముల పొడవాయెను. లోకదైత్యుడు గదాప్రహారము చేయుచు దేవతలను యుద్ధభూమినుండి తరుమ మొదలిడెను. శ్రీమహావిష్ణువు ఆ ఖడ్గముతో దైత్యుని శరీరమునంతను ఖండించివేసెను. నందకము స్పర్శతగులగనే ఆ దైత్యుని లోహమయాంగము లన్నియు ఛిన్నాభిన్నాములై భూతలముపై పడిపోయినవి. ఈవిధముగ లోహాసురుని సంహరించి శ్రీమహావిష్ణువు- ''నీ పవిత్రశరీరము భూతలమున ఆయుధనిర్మాణమునకై ఉపయుక్తముగుగాక'' అని ఆతనికి వరమిచ్చెను. అనంతరము శ్రీమహావిష్ణు ప్రసాదముచే బ్రహ్మ సర్వసమర్థుడగు శ్రీ మహావిష్ణువును యజ్ఞముద్వారా నిర్విఘ్నముగ ఆరాధించెను. ఇపుడు నేను ఖడ్గ లక్షణములను చెప్పెదను.

ఖటీఖట్టరజాతాయే దర్శనీయాస్తుతే స్మృతాః. 21

కాయచ్ఛిదస్త్వార్షికాః స్యుర్దృఢాః సూర్పారకోద్బవాః | తీక్షణాః ఛ్చేధసహా వంగా స్తీక్షణాఃస్యుశ్చాంగదేశజాః. 22

శతార్ద మంగులానాంచ శ్రేష్ఠ ఖడ్గం ప్రకీర్తతమ్‌| తదర్ధం మధ్యమం జ్ఞేయం తతో హీనం నధారయేత్‌. 23

దీర్ఘం సుమధురం శబ్దం యస్యఖడ్గస్య సత్తమ| కింకీణీ సదృశం తస్య ధారణం శ్రేష్ఠముచ్యతే. 24

ఖడ్గఃపద్మ పలాశాగ్రో మండలాగ్రశ్చ శస్యతే | కరవీరదలాగ్రాభో ఘృతగంధో వియత్ప్రభః. 25

సమాఙ్గులస్థాః శస్యన్తే వ్రణాః ఖడ్గేషు లింగవత్‌ | కాకోలూక సువర్ణాభా విషమాస్తే న శోభనాః 26

ఖడ్గేన పశ్యేద్వదన ముచ్ఛిష్టో నస్పృశేదసిమ్‌ | మూల్యం జాతిం న కథయేన్నిశి కుర్యాన్నశీర్షకే. 27

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఆయుధ లక్షణాదికం నామ

పంచచత్వారింశ దధిక ద్విశతతమో ధ్యాయః.

ఖటీఖట్టర దేశమునందు నిర్మితములగు ఖడ్గములు చాల అందముగా ఉండును. ఋషీకదేశనిర్మితములు శరీరమును చీల్చివేయును. శూర్పారకదేశీయఖడ్గములు చాల దృఢముగ నుండును. వంగదేశఖడ్గములు తీక్షణములై దెబ్బను ఎదుర్కొన సమర్థములై యుండును. అంగదేశఖడ్గములు తీక్షణములు. ఏబది అంగుళముల ఖడ్గము ఉత్తమము. దానిలో సగము పరిమాణము గలది మధ్యమము. ఇంతకంటే తక్కువ ప్రమాణము గలదానిని ధరించగూడదు. మువ్వల ధ్వనివలె దీర్ఘశబ్దముచేయు ఖడ్గమును ధరించుట చాలమంచిది. పద్మపత్రమువలెగాని, మండలాకారముగాని, కరవీరపత్రమువలె గాని ఉన్న అగ్రముగలదియు, ఘృతగంధము కలదియు, ఆకాశశీలమును అగు ఖడ్గము ప్రశస్తము, ఖడ్గముపై, సమాంగుళము నందున్న లింగకారమగు వ్రణము ప్రశస్తము. కాక-ఉలూకములవంటి వర్ణముగలిగి విషమముగనుండు ఖడ్గములు మంగళకరములు కావు. ఖడ్గమునందు తనముఖము చూచుకొనగూడదు. ఖడ్గముజాతిని, మూల్యమునుకూడ ఎవ్వరికిని చెప్పరాదు. రాత్రి ఖడ్గమును తలవైపున పెట్టుకొని నిద్రింపరాదు.

అగ్నిమహాపురాణమునందు చామరాది లక్షణ కథనమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page