Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చత్వారింశ దధిక ద్విశతతమో7ధ్యాయః

అథ పునః షాడ్గుణ్యమ్‌

శ్రీరామ ఉవాచ :

మండలం చింతయేన్ముఖ్యం రాజాద్వాదశ రాజకమ్‌ | అరిర్మిత్రమరేర్మిత్రం మిత్రమిత్ర మతః పరమ్‌. 1

తథారి మిత్ర మిత్రంచ విజిగీషో పురఃస్మృతా | పార్‌ష్ణిగ్రాహః స్మృతః పశ్చాదాక్రన్దస్తదన్తరమ్‌. 2

అసారావనయోశ్చైవం విజిగీషోశ్చ మండలమ్‌ | అరేశ్చ విజిగీషోశ్చ మధ్యమో భూమ్యనన్తరః. 3

అనుగ్రహే సంహతయోర్ని గ్రహేవ్యస్తయోఃప్రభుః | మండలాద్బహిరేతేషాముదాసీనో బలాధికః. 4

అనుగ్రహే సంతానాం వ్యస్తానాంచ వదే ప్రభుః |

శ్రీరాముడు చెప్పెను : రాజు ముఖ్యముగ ద్వాదశమండలములను గూర్చి ఆలోచించుచుండవలెను. విజిగీషువగు (జయింపనిచ్ఛగల) రాజునకు పోరోభాగమునందు 1) అరి 2) మిత్రుడు 3) అరిమిత్రుడు 4) మిత్రమిత్రుడు 5) అరిమిత్రమిత్రుడు అను రాజులు (ఒకరితరువాత ఒకరు) ఉందురు. వెనుకభాగమున 1) పార్‌ష్ణిగ్రాహుడు 2) ఆక్రందుడు, పార్‌ణ్ణిగ్రాహాసారుడు 4) ఆక్రందాసారుడు అను రాజులు (ఒకరి వెనుక ఒకరు) ఉందురు. అరివిజిగీషువుల రాజ్యసీమలతో కలియు రాజ్యీసీమ కలవాడు మధ్యముడు. అరివిజిగీషువులు కలిసినచో మధ్యముడు కోశము, సైన్యాదిసాహాయ్యము చేసి వీరు రువుని అనుగ్రహింప సమర్థుడగును. కాని వీరిరువురును కలియకపోయినచో మధ్యమరాజు వీరువురిని వేరువేరుగాన క్రమమునగాని చంప సమర్థుడగును. వీరందరి మండలము వెలుపలనున్న అధికబలశాలియు అధికసైన్య సంపన్నుడును అగు రాజు ఉదాసీనుడు. విజిగీషు - అరి - మధ్యములు కలిసినచో ఉదాసీనుడు వీరిపై అనుగ్రహము మాత్రము చూపగలుగును. వీరు కలియకపోయినచో వీరినందరిని మార్చివేయగలుగును.

సంధించ విగ్రహం యానమాసనాది వదామితే. 5

బలవద్వి గృహీతేన సంధిం కుర్యాచ్చివాయ చ | కపలా ఉపహారశ్చ సన్తానః సంగతస్తథా. 6

ఉపన్యాసః ప్రతీకారః సంయోగః పురుషాన్తరః | అదృష్టనర ఆదిష్ట ఆత్మామి ష ఉపగ్రహః. 7

పరిశ్రయస్తథో చ్ఛిన్నస్తధా చ పరదూషణమ్‌ | స్కంధోపనేయః సంధిశ్చ సంధయః షోడశేరితాః. 8

పరస్పరోపకారశ్చ మైత్రః సంబంధకస్తథా | ఉపహారాశ్చ చత్వారః తేషు ముఖ్యాశ్చ సంధయః. 9

బాలో వృద్ధో దీర్ఘరోగస్తథా బంధుబహిష్కృతః | భీరుకో భీరుకజనో లుబ్ధోలుబ్ధ జనస్తథా. 10

విరక్త ప్రకృతిశ్చైవ విషయేష్వతి శక్తిమాన్‌ | అనేక చిత్తమంత్రశ్చ దేవబ్రాహ్మణ నిందకః 11

దైవోపహతకశ్చైవ దైవనిన్దరక ఏవ చ | దుర్బిక్ష వ్యసనోపేతో బలవ్యసన సంకులః. 12

స్వదేశస్థో బహురిపుర్ముక్తః కాలేనయశ్చహ | సత్యధర్మ వ్యపేతశ్చ వింశతిః పురుషా అమీ. 13

ఏతైః సంధిం నకుర్వీత విగృహ్ణీయాత్తు కేవలమ్‌ |

లక్ష్మణా ! నీకిపుడు సంధి - విగ్రహ - యాన - ఆసనాదులు విషయమును చెప్పెదను. బలవంతుడగు రాజుతో యుద్ధము వచ్చినపుడు తన పరిస్థితి శోచనీయముగ నున్నచో అపుడు సంధి చేసికొనుటయే మంచిది. కపాల - ఉపహార - సంతాన - సంగత - ఉపన్యాస - ప్రతీకార - సంయోగ - పురుషాంతర - అదృష్టనర - అధిష్ట - ఆత్మామిష - ఉపగ్రహ - పరిశ్రయ - ఉచ్ఛిన్న - పరదూషణ - స్కంధోపగేయములని సంధిలో పదునారు భేదములున్నవి. ఎవరితో సంధి చేసుకొనుచున్నారో ఆతడు సంధేయుడు. అభియోక్త అనభియోక్తఅని సంధేయుడు రెండు విధములు. అనభియోక్తతో (ఆక్రమణము చేయని వానితో) ఉపన్యాస - ప్రతీకార - సంయోగములను మూడు సంధులు చేసికొనవలెను. మిగిలినవి అభియోక్త (ఆక్రమణకారి)తో చేసికొనవలెను. కొందరి అభిప్రాయము ప్రకారము పరస్పరోపకారము, మైత్రము, సంబంధజము, ఉపహారము అని నాలుగు మాత్రమే సంధి భేదములు, బాలకుడు, వృద్ధుడు, చిరకాలరోగి, బంధుసోదరాది బహిష్కృతుడు, పిరికివాడు, పిరికిపందలైన సైనికులు గలవాడు, దురాశాపరులగు సేవకులు గలవాడు, అమాత్యాదిప్రకృతుల అనురాగము కోల్పోయినవాడు, అత్యంత విషయాసక్తుడు, అస్థిరచిత్తుడై అనేకుల ఎదుట మంత్రమును ప్రకటించువాడు, దేవతాబ్రాహ్మణనిందకుడు, దైవహతుడు, దైవమే సంద్విపత్తులకు కారణమని నమ్మి పురుషప్రయత్నము చేయనివాడు, దుర్భిక్షక్లేశములో నున్నవాడు, కారాగార మునందుంచబడిన లేదా శత్రువుచే చుట్టుముట్టబడిన సైన్యముకలవాడు, అయోగ్యప్రదేశమునందున్నవాడు, చాలమంది శత్రువులు కలవాడు, యుద్ధమునకు తగిన సమయమున తనసేవను నియమించని వాడు, సత్యధర్మభ్రష్టుడు - ఈ ఇరువది రకముల రాజుతో సంధి చేసికొనగూడదు; విగ్రహము మాత్రమే చేయవలెను.

పరస్పరాప కారేణ పుంసాం భవతి విగ్రహః. 14

ఆత్మనో7భ్యుదయా కాంక్షీ పీడ్యమానః పరేణవా | దేశకాల బలోపేతః ప్రారభేతేహ విగ్రహమ్‌. 15

రాజ్యస్త్రీస్థాన దేశానాం జ్ఞానస్య చ బలస్య చ | అపహారో మదోమానః పీడావైషయికీ తథా. 16

జ్ఞానాత్మశక్తి దర్మాణాం విఘాతో దైవమేవ చ | మిత్రార్థం చాపమానం చ తథా బంధువినాశనమ్‌. 17

భూతానుగ్రహవిచ్ఛేద స్తథా మండల దూషణమ్‌ | ఏకార్థాభినివేశిత్వమితి విగ్రహయోనయః. 18

సాపత్న్యం వాస్తుజం స్త్రీజం వాగ్జాతమపరాధజమ్‌ | వైరం పంచవిధం ప్రోక్తం సాధనైః ప్రశమంనయేత్‌.

కించిత్పలం నిష్పలంవా సందిగ్ధఫలమేవచ | తదాత్వేదోష జననమాయత్యాం చైవ నిష్పలమ్‌. 20

అయత్యాంచ తదాత్వే చ దోషసంజననం తథా | అవరిజ్ఞాతవీర్యేణ పరేణస్తోభితో7పివా. 21

(అ) 2 / 10

పరార్థ స్త్రీ నిమిత్తంచ దీర్ఘకాలం ద్విజైః సహ | అకాలదైవయుక్తేన బలోద్ధతసఖేన చ. 22

తదాత్వే ఫలసంయుక్తమాయత్యాం పలవర్జితమ్‌ | ఆయత్యాం ఫలసంయుక్తం తదాత్వే నిష్పలం తథా. 23

ఇతీమం షోడశవిధం నకుర్యాదేవ విగ్రహమ్‌ | తదాత్వాయతి సంశుద్ధం కర్మరాజాసదాచరేత్‌. 24

ఒకరికొకరు అపకారము చేసికొనుటచే మనుష్యులలో పరస్పరము కలహమేర్పడును. అభ్యదయము కోరు రాజు శత్రుపీడితుడైనపుడు దేశకాలము అనుకూలత్వమును, సైనికశక్తిని చూచుకొని విగ్రహము ప్రారంభింపవలెను. సప్తాంగ రాజ్యము, స్త్రీలు, జనపదమునందలి స్థానవిశేషము, రాష్ట్రములోని ఒక భాగము, జ్ఞానప్రదులగు ఉపాధ్యాయాదులు, సేన - వీటిలో దేనినైన అపహరించుటచే విగ్రహము ఏర్పడును. ఈ కారణములేగాక, మదము, అహంకారము, జనపదపీడ, జనమును నశింపచేయుట, ధనమునకు విఘాతము కలిగించుట, శక్తులకు విఘాతము, ధర్మవిఘాతము, దైవము, మిత్రకార్యసాధనము, మాననీయుల అవమానము, బంధువర్గ వినాశము, ప్రాణులకు తానిచ్చిన అభయమును విచ్ఛేదించుట, మండలదూషణము ఒకే ప్రయోజనమున ఇరువురు అపేక్షించుట ఈ ఇరువది కూడ విగ్రహహేతవులు. కొందరు విగ్రహము, సాపత్నము (సపతి సోదరుల మధ్య ఉండునది), వాస్తుజము (భూసువర్ణాది హేతుకము), స్త్రీహేతుకము, కటువచన జనిత క్రోధహేతుకము, అపరాధజనిత ప్రతిక్రియా బుద్ధిచే ఏర్పడునది అని ఐదు విధములని చెప్పిరి. ఫలితము చాల తక్కువ ఉండునది, నిష్ఫలము, ఫలప్రాప్తి విషయమున సందేహమున్నది, వెంటనే దోషములను కలిగించునది, భవిష్యత్తులో కూడ నిష్ఫలమైనది, వర్తమాన భవిష్యత్తులందు రెండింటి యందును దోషజనకమైనది, ఎంత బలపరాక్రమములున్నవాడో తెలియని శత్రువుతో ఏర్పడినది, ఇతరులచే రెచ్చగొట్టబడినది, ఇతరుల స్వార్థసిద్ధి కొరకై గాని. ఏదైన ఒక సాధారణ స్త్రీని పొందుటకు గాని ఏర్పడినది. సుదీర్ఘకాలము సాగునట్లు కనబడునది. శ్రేష్ఠులైన ద్విజులతో ఏర్పడినది. సుదీర్ఘ కాలము సాగునట్లు కనబడునది, శ్రేష్టులైన ద్వీజులలో ఏర్పడినది, దేవతావరములను పొంది అకస్మాత్తుగా బలవంతుడైన వానితో ఏర్పడినది. అధిక బలశాలులగు మిత్రులు కలవానితో సంభవించినది, వర్తమానమునందు ఫలమునిచ్చినను భవిష్యత్తునందు నిష్ఫలమైనది. భవిష్యత్తునందు ఫలప్రదమైననను వర్తమానమున నిష్పలమైనది -- ఈ పదునారు విధములగు విగ్రహములలో ఎన్నడును చిక్కుకొనరాదు. వర్తమానమునందును భవిష్యత్తునందును గూడ పూర్ణఫలము నీయగలుగు విగ్రహమును మాత్రమే రాజు అవలంబింపవలెను.

హృష్టం పుష్టం, బలం మత్వా గృహ్ణీయాద్విపరీతకమ్‌ | మిత్రమాక్రంద ఆసారో యదాస్యుర్దృడభక్తయః. 25

పరస్య విపరీతంచ తదావిగ్రహమాచరేత్‌ | విగృహ్య సంధాయ తథా సంభూయాథ ప్రసఙ్గతః. 26

ఉపేక్షయాచ నిపుణౖర్యానం పంచవిధంస్మృతమ్‌ | పరస్పరస్య సామర్థ్యవిఘాతాదాససం స్మృతమ్‌. 27

ఆరేశ్చ విజిగీషోశ్చయానవత్పంచధాసమృతమ్‌ | బలినోర్ధ్విషతోర్మధ్యే వాచాత్మానం సమర్పయన్‌. 28

ద్వైధీభావేన తిష్ఠేత కాకాక్షివదలక్షితః | ఉభయోరపి సంపాతే సేవేతబలవత్తరమ్‌. 29

యదాద్వావపినేచ్ఛేతాం సంశ్లేషం జాతసంవిదౌ | తదోపసర్పేత్తచ్ఛత్రుమధికం వాస్వయం వ్రజేత్‌. 30

ఉచ్ఛిడ్యమానో బలినా నిరుపాయప్రతిక్రియః | కులోద్ధతం సత్యమార్యమాసేవేతబలోత్కటమ్‌. 31

తద్దర్శనోపాస్తికతా నిత్యం తద్భావభావితా | తత్కారితాప్రశ్రయితావృత్తం సంశ్రయిణఃశ్రుతమ్‌. 32

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ షాడ్గుణ్యం నామచత్వారింశదధిక శతతమో7ధ్యాయః.

తనసేన హృష్టపుష్టమై ఉత్సాహముతో ఉన్నట్లును, శత్రుసేన ఇందుకు విపరీతముగా నున్నట్లును నమ్మకము ఏర్పడిన పిదప రాజు శత్రువును నిగ్రహించుటకై విగ్రహము నవలంబింపవలెను. మిత్ర - ఆక్రంద - ఆక్రందాసారులకు తనపై దృఢభక్తి యుండి శత్రువు పరిస్థితి దీనికి భిన్నముగా నున్నపుడు విగ్రహము ప్రారంభింపవలెను. విగృహ్యగమనము, సంధాయగమనము, సంభూయగమనము, ప్రాసంగిక గమనము, ఉపేక్షాపూర్వకగమనము అని యానము ఐదు విధములని నీతిజ్ఞులు చెప్పుదురు. శత్రువు విజిగీషువు కూడ ఒకరినొకరు ఏమియు చేయజాలక పోవుటచే ఆక్రమణము చేయక కూర్చుండుట ''ఆసనము'', యానము నందువలె దీనియందు కూడ విగృహ్యాసనము, సంధాయాసనము, సంభూయాసనము, ప్రసంగాసనము, ఉపేక్షాసనము అని ఐదు భేదములున్నవి. బలవంతులగు ఇద్దరు శత్రువుల వద్దకు రహస్యముగా ''నేను నారాజ్యము కూడ నీకు చెందినవే'' అని రహస్యముగా వార్త పంపి తాను దుర్గమునందు దాగియుండుట ''ద్వైధీభావము'', ఆ శత్రువు లిద్దరును కలిసి ఆక్రమణము చేసినచో వారిలో అధిక బలశాలిని శరణు పొందవలెను. వారిరువురును తనతో, ఎట్టిషరతుపైనను గూడ, సంధిచేసికొనుటకు నిరాకరించినచో వారిరువురికిని శత్రువైన మరొక రాజును గాని, అధిక బలశాలియగు రాజును గాని ఆశ్రయించవలెను. బలవంతుడైన శత్రువు ఆక్రమించగా ఆకష్టమునుండి తప్పించుకొను ఉపాయాంతరమేదియులేనపుడు కులీనుడును, సత్యవాదియు, సదాచారవంతుడును, శత్రువు కంటే అధిక బలవంతుడును అగు వేరొక రాజును ఆశ్రయించవలెను. ఇట్లు ఆశ్రయము కోరువారు ఆశ్రయదాత దర్శనము కొరకై వానిని ఆరాధించవలెను. సర్వదా ఆతని అభిప్రాయమునకు అనుకూలముగ ప్రవర్తించవలెను. ఆతని కార్యములు చేయవలెను. సర్వదా ఆతని విషయమున ఆదరము చూపవలెను. ఇది ఆశ్రయించువాని కర్తవ్యము.

అగ్ని మహాపురాణమునందు షాడ్గుణ్య కథనమను రెండువందల నలుబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page