Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్త్రింశ దధిక ద్విశతతమో7ధ్యాయః

అథ రణదీక్షా

పుష్కర ఉవాచ :

యాత్రావిధాన పూర్వంతు వక్ష్యే సాంగ్రామికం విధిమ్‌ | సప్తాహేన యదా యాత్రా భవిష్యతి మహీపతేః. 1

పూజనీయో హరిః శంభుర్మోదకాద్యైర్వినాయకః | ద్వితీయే7హని దిక్పాలాన్సం పూజ్యం శయనం చరేత్‌. 2

శయ్యాయాం వా తదగ్రే7థ దేవాన్న్పార్చ్య మనుంస్మరేత్‌ |

నమః శంభో త్రినేత్రాయ రుద్రాయ వరదాయచ. 3

వామనాయ విరూపాయ స్వప్నాధిపతయేనమః | భగవన్ధేవవ దేవేశ శూలభృద్ద్వృష వాహన. 4

ఇష్టానిష్టే మమాచక్ష్వ స్వప్నే సుప్తస్య శాశ్వత | యజ్జాగ్రతో దూరమితి పురోధామంత్రముచ్చరేత్‌. 5

తృతీయే7హని దిక్పాలాన్రుద్రాంస్తాన్దిక్పతీన్యజేత్‌ః | గ్రహాన్యజేచ్చతుర్థే7హ్ని పంచమే చాశ్వినౌ యజేత్‌. 6

మార్గేయా దేవతాస్తాసాం నద్యాదీనాం చ పూజనమ్‌ | దివ్యాంతరిక్ష భౌమస్థ దేవానాంచ తథా బలిః. 7

రాత్రౌ భూత గణానాం వాసుదేవాశ్చ పూజనమ్‌ | భద్రకాల్యాః శ్రియః కుర్యాత్ర్పార్థయేత్సర్వదేవతాః. 8

వాసుదేవః సంకర్షణః ప్రద్యుమ్నశ్చానిరుద్ధకః | నారాయణో7బ్జజో విష్ణుర్నరసింహోవరాహకః. 9

శివఈశ స్తత్పురుషో హ్యఘోరో రామ సత్యజః | సూర్యః సోమః కుజశ్చాన్ద్రి జీవ శుక్ర శ##నైశ్చరాః. 10

రాహుః కేతుర్గణపతిః సేనానీశ్చండికా హ్యుమా | లక్ష్మీః సరస్వతీ దుర్గాబ్రాహ్మణీప్రముఖాగణాః. 11

రుద్రా ఇంద్రాదయో వహ్నిర్నాగాస్తార్‌క్షో7పరేసురాః | దివ్యాంతరిక్ష భూమిష్ఠా విజయాయ భవన్తుమే. 12

మర్దయన్తురణ శత్రూన్సమ్ర్పగృహ్యోపకారకమ్‌ | సపుత్రమాతృ భృత్యో7హం దేవావః శరణంగతః. 13

చమూనాం పృష్ఠతోగత్వా రిపునాశో నమో7స్తువః | వినివృత్తః ప్రదాస్యామి దత్తాదభ్యధికం బలిమ్‌. 14

పుష్కరుడు పలికెను : ఇపుడు యుద్ధయాత్రావిధానమును, యుద్ధసమయమున చేయదగిన పనులను చెప్పెదను. ఏడు రోజులలో యుద్ధయాత్ర చేయవలెననగా మొదటి రోజున శ్రీమహావిష్ణువును, మహేశ్వరుని పూజించవలెను. మోదకాదులతో గణాధిపతిని పూజించవలెను. రెండవరోజున దిక్పాలకుల పూజచేసి, శయ్యపై కూర్చుండిగాని, అంతకుపూర్వమేగాని ఈ అర్థము గల మంత్రము జపించవలెను- ''త్రినేత్రా! రుద్రా! వరదాయకా! వామనా! వికటరూపధరా! శివా! నీవు స్వప్నాదిష్ఠాన దేవతవు నీకు మాటి మాటికి నమస్కరించుచున్నాను. నీవు దేవాధి దేవతలకు కూడ అధిపతివి. త్రిశూలధారివి. వృషభారూఢుడవు. సనాతనా! పరమేశ్వరా! నాకీ యుద్ధమునందు ఇష్టము కలుగునో అనిష్టము వాటిల్లునో స్వప్నమునందు చెప్పుము'' ఆ సమయమునందు పురోహితుడు ''యజ్జాగ్రతో దూరముపైతి'' (యజు. 31.1) అను మంత్రము పఠించవలెను. మూడవ రోజున దిక్కులను రక్షించు రుద్రులను దిక్పాలకులను పూజించవలెను. నాల్గవ రోజున గ్రహములను, ఐదవ రోజున ఆశ్వినీ కుమారులను, మార్గమున వచ్చు దేవీ - దేవతా - నద్యాదులను పూజించి, ద్యులోకాంత రిక్ష భూలోకములందుండు దేవతలకు బలి సమర్పించవలెను. రాత్రి భూత గణములకు బలి ఇవ్వవలెను. వాసుదేవ - భద్రకాళీ - లక్ష్యాదుల పూజచేసి సకల దేవతలను ప్రార్థించవలెను. ''వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - నారాయణ - బ్రహ్మ - విష్ణు - నరసింహ - వరాహ - శివ - ఈశాన - తత్పురుష - అఘోర - వామదేవ - సద్యోజాత - సూర్య - సోమ - భౌమ - బుధ - బృహస్పతి - శుక్ర - శ##నైశ్చర - రాహు - కేతు - గణశ - కార్తికేయ - చండికా - ఉమా - లక్ష్మి - సరస్వతీ - దుర్గా - బ్రహ్మాణ్యాదిగణ - రుద్ర - ఇంద్రాదిదేవ - అగ్ని నాగ - గరుడులును, ద్యులోకాంతరిక్ష భూములపై నివసించు ఇతరదేవతలును నాకు విజయమును ఇచ్చెదరుగాక. నేనిచ్చిన ఈ బలిని, పూజను స్వీకరించి దేవతలందరును యుద్ధమునందు నా శత్రువులను నశింపచేయుదురుగాక. దేవతలారా! నేను మాతృ - పుత్ర - భృత్య సహితుడనై మిమ్మును శరణు జొచ్చుచున్నాను. మీరు శత్రుసేన వెనకనుండి దానిని నశింప చేయుడు. నేను నమస్కరించుచున్నాను. యుద్ధము నుండి విజయవంతుడనై తిరిగి వచ్చినచో ఇపుడు చేసిన బలిపూజాదుల కంటే అధికముగ సమర్పించెదను.

షష్ఠే7హ్ని విజయస్నానం కర్తవ్యం చాభిషేకవత్‌ | యాత్రాదినే సప్తమే చ పూజయేచ్చ త్రివిక్రమమ్‌.

నీరాజనోక్తమంత్రైశ్చ ఆయుధం వాహనం యజేత్‌ | పుణ్యాహజయశ##బ్దేన మంత్రమేతన్నిశామయేత్‌. 16

దివ్యాన్తరిక్ష భూమిష్ఠాః సన్త్వాయుర్దాః సురాశ్చతే | దేవసిద్ధిం ప్రాప్నుహిత్వం దేవయాత్రాస్తుసాతవ. 17

రక్షస్తు దేవతాః సర్వా ఇతి శ్రుత్వా నృపో వ్రజేత్‌ | గృహీత్వా, స శరం, చాపం ధనుర్నాగేతి మంత్రతః. 18

తద్విష్ణోరితి జప్త్వాథ దధ్యాద్రిపు ముఖేపదమ్‌ | దక్షిణం పదం ద్వాత్రింశద్ధిక్షు ప్రాచ్యాదిషుక్రమాత్‌. 19

నాగం రథం హయం చైవ ధుర్యాంశ్చైవారుహేత్‌ క్రమాత్‌ |

ఆరుహ్య వాద్యైర్గచ్ఛేత్తు పృష్ఠతో నావలోకయేత్‌.

ఆరవరోజున రాజ్యాభిషేకము చేసికొనినట్లు విజయస్నానముచేసి ఏడవరోజున త్రివిక్రముని పూజించవలెను. నీరాజన మంత్రములతో ఆయుధ - వాహన పూజ చేయవలెను. ''పుణ్యాహ'' ''జయ'' శబ్దములతో బ్రాహ్మణముఖము నుండి ఈ మంత్రములను వినవలెను - '' రాజా! ద్యులోక - అంతరిక్ష - భూములపై నివసించు దేవతలు నాకు దీర్ఘాయువు నిచ్చెదరు గాక. దేవతలవలె నీవు సిద్ధిని పొందెదవుగాక. ఈ నీ యాత్ర దేవతా యాత్రయగునుగాక. దేవతలు నిన్ను రక్షింతురుగాక.'' ఈ ఆశీర్వాదము విని రాజు ముందుకు సాగవలెను. ''ధన్వనాగ'' (యజు. 2.39) ఇత్యాది మంత్రముతో ధనుర్బాణములు చేత ధరించి, ''తద్విష్ణోః'' (యజు. 6.5) ఇత్యాది మంత్రము జపించుచు శత్రువు వైపు ఎడమకాలు ఉంచి ముప్పది రెండు అడుగులు ముందుకు వేయవలెను. పిదప పూర్వ - దక్షిణ - పశ్చిమ - ఉత్తరముల వైపు వెళ్ళుటకు వరుసగ ఏనుగులు, రథములు, గుఱ్ఱములు, భారమును మోయు జంతువులు - వీటిపై ఎక్కి యుద్ధ వాద్యఘోషములతో ముందుకు సాగవలెను. వెనుకకు తిరిగి చూడగూడదు.

క్రోశమాత్రం గతస్తిష్ఠేత్పూజయేద్దేవతాద్విజాన్‌ | పరదేశం వ్రజేత్పశ్చాదాత్మసైన్యం హిపాలయన్‌. 21

రాజా ప్రాప్య విదేశంతు దేశపాలం తు పాలయేత్‌ | దేవానాం పూజనం కుర్యాన్న చ్ఛిన్ద్యాదాయమత్రతు. 22

నావమానయేత్తద్దేశ్యానాగత్య స్వపురం పునః | జయం ప్రాప్యార్చయేద్ధేవాన్దద్యాద్దానాని పార్థివః. 23

ద్వితీయో7హని సంగ్రామో భవిష్యతి యదాతదా | స్నాపయేద్గజమశ్వాది యజేద్దేవం నృసింమకమ్‌. 24

ఛత్రాది రాజలింగాని శస్త్రాణి నిశి వై గణాన్‌ | ప్రాతర్నృసింహకం పూజ్యం వాహనాద్యమశేషతః. 25

పురోధసాహుతం పశ్యేద్యహ్నిం హుత్వా ద్విజాన్యజేత్‌ |

గృహీత్వాసశరం చాపం గజాద్యారుహ్య వై వ్రజేత్‌. 26

దేశేత్వదృశ్యః శత్రూణాం కుర్యాత్ర్పకృతికల్పనామ్‌ |

సంహతాన్యోధయే దల్పాన్కామం విస్తారయేద్బహూన్‌. 27

ఒక క్రోసుదూరము వెళ్లిన పిదప ఆగి దేవతా బ్రాహ్మణుల పూజ చేయవలెను. రాజు తనవెనుక వచ్చుచున్న సైన్యమును రక్షించుకొనుచు ఇతరదేశమునకు యాత్ర చేయవలెను. విదేశమునకు వెళ్లినను తనదేశాచారమును పాలించుట రాజునకు కర్తవ్యము. ప్రతిదినమునందును దేవతాపూజ చేయవలెను. ఎవ్వని ఆదాయమునకును నష్టము కలిగించగూడదు. ఆదేశమునందలి మనుష్యులను ఎన్నడును అవమానించరాదు. విజయము పొంది తిరిగి తన దేశమునకు తిరిగి వచ్చిన పిమ్మట దేవతలకు పూజలుచేసి, దానమునీయవలెను. మరునాడు యుద్ధప్రారంభమగునన్నచో తొలిరోజున గజాశ్వాది వాహనములకు స్నానము చేయించి, నృసింహస్వామిని పూజించవలెను. ఛత్రాది రాజచిహ్నములకును, అస్త్రశస్త్రములకును, భూతగణములకును రాత్రిపూజలు చేసి ప్రాతఃకాలమున మరల నృసింహస్వామికిని, సకల వాహనాదులకును పూజచేయవలెను. పురోహితుడు హోమము చేసిన అగ్నిని చూచి, తాను కూడ హోమము చేసి, బ్రాహ్మణులసన్మానము చేసి, ధనుర్బాణములు ధరించి, గజారూఢుడై యుద్ధమునకు వెళ్లవలెను. శత్రుదేశమునందు అదృశ్యుడుగా ఉండి ప్రకృతి కల్పన సేనానివేశము చేయవలెను. సైనికులసంఖ్య తక్కువగా ఉన్నచో వారినందరిని ఒక్కచోట చేర్చి యుద్ధము చేయవలెను; అధికముగా ఉన్న వాళ్లను ఇచ్ఛానుసారముగ విస్తరింపచేయవలెను.

సూచీముఖం మనీకం స్యాదల్పానాం బహుభిఃసహ | వ్యూహాః ప్రాణ్యంగ రూపాశ్చ ద్రవ్యరూపాశ్చ కీర్తితాః.

గరుడో మకర వ్యూహశ్చక్రః శ్యేనస్తథైవచ | అర్థ చంద్రశ్చ వజ్రశ్చ శకట వ్యూహ ఏవచ. 29

మండలం సర్వతోభద్రః సూచీ వ్యూహశ్చతే నరాః | వ్యూహానామత సర్వేషాం పంచధా సైన్యకల్పనా. 30

ద్వౌ పక్షావనుపక్షౌ ద్వావవశ్యం పంచమం భ##వేత్‌ | ఏకేన యదివా ద్వాభ్యాం భాగాభ్యాం యుద్ధమాచరేత్‌.

భాగత్రయం స్థాపయేత్తు తేషాం రక్షార్థ మేవచ | నవ్యూహ కల్పనా కార్యా రాజ్ఞో భవతి కర్హిచిత్‌. 32

మూలచ్ఛేదే వినాశః స్యాన్న యుధ్యేచ్చ స్వయం నృపః | సైన్యస్య పశ్చాత్తిష్ఠేత్తు క్రోశమాత్రే మహీపతిః.

భగ్న సంధారణం తత్ర యోధానాం పరికీర్తితమ్‌ | ప్రధాన భంగే సైన్యస్య నావస్థానం విధీయతే. 34

నసంహతాన్న విరలాన్యోధాన్‌ వ్యూహే ప్రకల్పయేత్‌ | ఆయుధానాంతు సమ్మర్దోయథానస్యాత్పరస్పరమ్‌.

అల్పసంఖ్యాకులగు సైనికులతో అధిక సంఖ్యాకులగువారిని ఎదుర్కొనుటకు సూచీముఖమును వ్యూహము మంచిది. ప్రాణిశరీరసదృశములు, ద్రవ్యరూపములు అని వ్యూహములు రెండు విధములు. గరుడ - మకర - చక్ర - శ్యేన - అర్ధచంద్ర - వజ్ర - శకట - సర్వతోభద్రమండల - సూచీవ్యూహములను తొమ్మిది వ్యూహములు ప్రసిద్ధములు. అన్ని వ్యూహములందును సైనికులను ఐదు భాగములుగా విభజించి, రెండు పక్షములు, రెండు అనుపక్షములు ఏర్పరచి ఒక పంచమభాగమును గూడ ఉంచుకొనవలెను. యోధులలో ఒక భాగముతో గాని, రెండుభాగములతో గాని యుద్ధము చేయుచు మిగిలిన మూడుభాగములను వారి రక్షణకై ఉపయోగించవలెను. రాజును ఎన్నడును వ్యూహమునందు నిలువగూడదు. రాజే మూలము. అమూలము వినష్టమైనచో రాజ్యమే నశించును. అందుచే రాజు యుద్ధములో పాల్గొనగూడదు అతడు సైన్యమునకు వెనుక ఒక క్రోసుదూరము నందుండవలెను. అచటఉండి రాజు యుద్ధమునుండి పారిపోవుచున్న యోధులకు ధైర్యము చెప్పి ప్రోత్సహించవలెను. సేనాపతి పారిపోయినను, మరణించినను సైన్యము నిలువజాలదు. ప్యూహమునందలి యోధులు ఒకరికొకరు చాలదగ్గరగా గాని దూరముగాగాని నిలువకూడదు. ఒకరి ఆయుధములు ఒకరికి ఆయుధములు ఒకరికి తగులకుండునంత దూరమున నిలుపవలెను.

భేత్తుకామః పరానీకం సంహతై రేవ భేదయేత్‌ | భేదరక్ష్యాః పరేణాపి కర్తవ్యా సంహితా స్తథా. 36

ప్యూహం భేదావహం కుర్యాత్పరవ్యూహేషు చేచ్ఛయా | గజస్య పాదరక్షార్థాశ్చత్వారస్తు తథాద్విజ. 37

రథస్య చాశ్వాశ్చత్వారః సమాస్తస్యచ చర్మిణః | ధన్వినశ్చర్మిభిస్తుల్యాః పురస్తాచ్చర్మిణోరణ. 38

పృష్ఠతో ధన్వినః పశ్చాద్దన్వినాంతురగా రథాః | రథానాం కుంజరాః పశ్చాద్దాతవ్యాః పృథివీక్షితా. 39

శత్రువ్యూహమును భేదించుటకు యోధులందరును సంఘటితులై ప్రయత్నించవలెను. శత్రువులు తమవ్యూహమును భేదించుటకై ప్రయత్నించునపుడుకూడ యోధులు సంఘటితులై ఎదిరించవలెను. శత్రుసైన్యములోనికి చొచ్చుకొని పోవుటకు వీలగునట్లుగ ఇచ్ఛానుసారముగ వ్యూహరచన చేయవలెను. ఏనుగుల కాళ్లను రక్షించుటకై నాలుగు రథములను నియమించ వలెను. రథమును రక్షించుటకు నలుగురు ఆశ్వికులను, వారి రక్షణకై నలుగురేసి ఖడ్గచర్మధారులగు పదాతులను నలుగురేసి ధనుర్ధారులను ఏర్పరుపవలెను. యుద్ధమున అందరికంటే ముందు ఖడ్గధారులగు పదాతులుండవలెను. వారి వెనుక ధానుష్కులు, వారి వెనుక ఆశ్వికులు, వారి వెనుక రథములు, వారి వెనుక గజసేన ఉండునట్లు ఏర్పరుపవలెను.

పదాతికుంజరాశ్వానాం ధర్మకార్యం ప్రయత్నతః | శూరాః ప్రముఖతోదేయా స్కంధమాత్ర ప్రదర్శనమ్‌.

కర్తవ్యం భీరు సంఘేన శత్రువిద్రావకారకమ్‌ | దారయంతి పురస్తాత్తు నదేయా భీరవః పురః. 41

ప్రోత్సాహయన్త్యేవ రణ భీరూన్‌ శూరాః పురస్థితాః | ప్రాంశవః శుకనాసాశ్చయేచాజిహ్మేక్షణానరాః. 42

సంహతభ్రూ యుగాశ్చైవక్రోధనాః కలహప్రియాః | నిత్యహృష్టాః ప్రహృష్టాశ్చశూరా జ్ఞేయాశ్చకామినః. 43

సంహతానాం హతానాంచ రణాపనయనక్రియా|

పదాతులు, హాస్తికులు, ఆశ్వికులు ప్రయత్నపూర్వకముగ ధర్మయుద్ధము చేయవలెను. యుద్ధభూమి అగ్రమున శూరులగు యోధులను ఉంచవలెను. పిరికి వారిని ఎన్నడును ఉంచరాదు. ఎదుట నుంచిన శూరులకు శత్రువుల సమూహము మాత్రమే కనబడునట్లు ఏర్పరచవలెను. అపుడే వారు పౌరుషము చూపి శత్రువులను పారద్రోలగలరు. పిరికి వారిని సేనాగ్రము నందుంచినచో పారిపోయి స్వయముగనే వ్యూహమును భిన్నము చేయుదరు. అందుచే వారిని ముందుఉంచరాదు. శూరులు ముందున్నచో వెనుకనున్న భీరువులకు గూడ ఉత్సాహము కలిగింతురు. ఉన్నతులును, చిలుకముక్కుకలవారును, సౌమ్యమైన దృష్టి కలవారును, కలిసినకనుబొమ్మలు కలవారును, కోపశీలులును, కలహప్రియులును హర్షోత్సాహభరితులును, కామపరాయణులును అగువారు శూరులైనవీరులు.

ప్రతియుద్ధం గజానాంచ తొయదానాదికం చయత్‌. 44

ఆయుధానయనం చైవ పత్తికర్మ విధీయతే | రిపూణాం భేత్తుకామానాం స్వసైన్యస్యతురక్షణమ్‌. 45

ఖేదనం సంహతానాంచ చర్మిణాం కర్మకీర్తితమ్‌ | విముఖీకరణం యుద్ధే ధన్వినాంచ తథోచ్యతే. 46

దూరావసరణం యానం సుహతస్య తథోచ్యతే | త్రాసనం రిపుసైన్యానాం రథకర్మ తథోచ్యతే. 47

ఖేదనం సంహతానాంచ ఖేదనామపి సంహతిః | ప్రకార తోరణాట్టాలద్రుమభఙ్గశ్చ సద్గజే. 48

పత్తి భూర్విషమా జ్ఞేయా రథాశ్వస్యతథాసమా | సకర్దమా చ నాగానాం యుద్ధభూమిరుదాహృతా. 49

ఏవం విరచితవ్యూహః కృతపృష్ఠ దివాకరః |

గాయపడిన వారిని, మరణించినవారిని యుద్ధభూమినుండి తొలగించుట, యుద్ధరంగమునందున్న ఏనుగులకు నీరు త్రాగించుట, ఆయుధములు అందించుట ఇది పదాతుల కర్తవ్యము. శత్రుసైనికులు తమసైన్యమును భేదించకుండ రక్షించుచు శత్రువ్యూహమును భేదించుట ఖడ్గవీరుల కర్తవ్యము. శత్రువులను కొట్టి యుద్ధభూమి నుండి పారద్రోలుట ధనుర్ధరుల కర్తవ్యము. ఎక్కువగా గాయపడినవారిని యుద్ధభూమినుండి తొలగించి, తిరిగి వచ్చి శత్రుసైన్యమునందు భయముత్పన్నము చేయుట రథికుల కర్తవ్యము. సంఘటిత వ్యూహమును భేదించుట, భిన్నమైనదానిని కలుపుట, ప్రాకార ద్వారాదులను, ఇంటిపైభాగములను, వృక్షములను భగ్నము చేయుట గజముల కర్తవ్యము. పదాతులకు ఎగుడుదిగుడుగా నున్న భూమి, రథ-అశ్వములకు సమతలభూమి, ఏనుగులకు బురదనేల యుద్ధమునకు అనుకూలములు.

తథానులోమ శుక్రార్కి దిక్పాలమృదుమారుతా. 50

యోధానుత్తేజయేత్సర్వాన్నామగోత్రావదానతః | భోగప్రాప్త్యా చ విజయే స్వర్గప్రాప్త్యామృతస్యచ. 51

జిత్వారీన్భోగ సంప్రాప్తిర్మృతస్యచ పరాగతిః | నిష్కృతి స్వామి పిండస్య నాస్తియుద్ధసమాగతిః. 52

శూరాణాం రక్తమాయాతి తేన పాపం త్యజన్తితే | ఘాతాది దుఃఖ సహనం రణతత్పరమం తపః. 53

వారాప్సరః సహస్రాణి యాంతిశూరం రణమృతమ్‌ | స్వామీ సుకృతమాదత్తే భగ్నానాం విని వర్తినామ్‌. 54

బ్రహ్మహత్యాఫలం తేషాం తథాప్రోక్తం పదే పదే | త్యక్త్వా సహాయాన్యో గచ్ఛేద్దేవాస్తస్య వినష్టయే. 55

అశ్వమేధఫలం ప్రోక్తం శూరాణామనివర్తినామ్‌ | ధర్మనిష్ఠే జయోరాజ్ఞి యోద్ధవ్యాశ్చసమాః సమైః. 56

ఈ విధముగ వ్యూహరచన చేసి, సూర్యుడు వెనుకవైపు ఉన్నపుడు, శుక్ర - శ##నైశ్చరులును, దిక్పాలకులును అనుకూలముగానుండగా, ఎదుటినుండి మందవాయువు వీచుచుండగా, యుద్ధము చేయుచు, నామగోత్రాదులను పేర్కొని యోధులందరికిని ఉత్సాహము కలిగించవలెను. ''యుద్ధమునందు విజయము లభించినచో ఉత్తమభోగములు లభించును, మరణించినచో స్వర్గసుఖము లభించును '' అనికూడ చెప్పుచుండవలెను. వీరుడు శత్రువులను జయించినచో మనోవాంఛిత భోగములను పొందును. మరణించినచో ఉత్తమగతులను పొందును. స్వామి అన్నము తిన్నందులకు ఋణవిముక్తుడగును. అందుచే యుద్ధమువంటిది శ్రేష్ఠమైనది మరొకటి లేదు. శరీరము నుండి రక్తము స్రవించినచో వీరుడు పాపవిముక్తుడగును. యుద్ధమునందు శస్త్రప్రహారాదికష్టములను సహించవలసియుండును. అదియొక గొప్ప తపస్సు. యుద్ధమునందు ప్రాణ త్యాగము చేయు వీరునివద్దకు వేలకొలది అప్సరసలు వత్తురు. హతోత్సాహుడై యుద్ధభూమినుండి పారిపోవు యోధుని పుణ్యమంతయు ఆతని స్వామికి చేరును. అడుగడుగునను బ్రహ్మహత్యాపాపము వచ్చును. తన సహాయులను విడచి పారిపోవువానిని దేవతలు నశింపచేయుదురు. యుద్ధమునుండి అడుగుకదపని వీరునకు అశ్వమేధయాగఫలము లభించును.

గజాద్యైశ్చ గజాద్యాశ్చ సహన్తవ్యాః పలాయితః | నప్రేక్షకాః ప్రవిష్టాశ్చ హ్యశస్త్రాః పతితాదయః. 57

శాంతేనిద్రాభిభూతే చ అర్ధోత్తీర్ణేనదీవనే | దుర్దినేకూడయుద్ధాని శత్రు నాశార్థమూచరేత్‌. 58

బాహూ ప్రగృహ్య విక్రోశేద్భగ్నాభగ్నాః పరే ఇతి | ప్రాప్తం మిత్రం బలం భూరి నాయకో7త్రనిపాతితః.

సేనానీర్నిహతశ్చాయం భూపతిశ్చాపి విప్లుతః | విద్రుతానాంతుయోధానాం సుఖంఘాతో విధీయతే. 60

ధర్మమునందు దృఢముగా నిలచు రాజునకు విజయము లభించును. యోధులు తమతో సమానమైన యోధులతోడనే యుద్ధము చేయవలెను. హాస్తికాదులుతోడనే యుద్ధము చేయవలెను. పారిపోవుచున్నవారిని చంపకూడదు. యుద్ధము చూచుటకై వచ్చినవారిని, శస్త్రహీనులును, నేలపైపడిపోయినవారిని, ఎన్నడును చంపగూడదు. అలసి పోయినవానిని, నిద్రవచ్చినవానిని, నదీమధ్యయందుగాని, అడవియందుగాని ఉన్నవానిని కొట్టగూడదు. దుర్దినమునందు శత్రువులను నశింపచేయుటకై కూటయుద్ధము చేయవలెను. రెండు చేతులు పైకెత్తి - ''చూడుడు! శత్రువులు పారిపోవుచున్నారు. మన మిత్రసేన వచ్చినది. శత్రుసేనా సంచాలకులు మరణించినారు. సేనాపతి కూడ మరణించినాడు. శత్రురాజు కూడ మరణించినాడు'' అని గట్టిగా చెప్పవలెను.

ధూపాశ్చదేయాధర్మజ్ఞ తథాచ పరమోహనాః | పతాకాశ్చైవ సంభారో వాదిత్రాణాం భయావహః. 61

సంప్రాప్య విజయం యుద్ధే దేవాన్విప్రాంశ్చ సంయజేత్‌ | రత్నాని రాజగామీని ఆమాత్యేన కృతేరణ. 62

తస్యస్త్రియో న కస్యాపి రక్ష్యాస్తాశ్చ పరస్యచ | శత్రుం ప్రాప్య రణముక్తం పుత్రవత్పరిపాలయేత్‌. 63

పునస్తేన నయోద్ధవ్యం దేశాచారాది పాలయేత్‌ | తతశ్చ స్వపురం ప్రాప్య ధ్రువే భే ప్రవిశేద్గృహమ్‌. 64

దేవాది పూజనం కుర్యా ద్రక్షే ద్యోధకుటుంబకమ్‌ | సంవిభాగం పరావాపై#్తః కుర్యాద్భృత్య జనస్య చ. 64

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయేరణదీక్షా నామ షట్త్రింశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

పారిపోవుచున్న శత్రుయోధులను అనాయాసముగ చంపివేయవచ్చును. ఓ ధర్మజ్ఞా! శత్రువులను మోసగించుటకు కృత్రిమమగు సుగంధ ధూపమును ప్రసరింపచేయవలెను. విజయపతాకలు ఎగురవేయవలెను. వాద్యములను భయంకరముగ మ్రోగించవలెను. విజయము లభించినచో దేవతా-బ్రాహ్మణులను పూజించవలెను. అమాత్యుడు చేసిన యుద్ధము నందు లభించిన రత్నాదులను రాజునకే ఇవ్వవలెను. శత్రుస్త్రీలపై ఎవ్వరికిని అధికారములేదు. వారికి తగు రక్షణము ఇవ్వవలెను. యుద్ధమునందు సహాయకులు లేని శత్రువును పుత్రుని పాలించినట్లు పాలించవలెను. అతనితో మరల యుద్ధము చేయరాదు. ఆతని విషయమున దేశోచితాచారాదుల పాలనము చేయవలెను. యుద్ధమునందు విజయము లభించిన పిమ్మట నగరమునకు తిరిగివెళ్ళి ధ్రువనక్షత్రములందు రాజభవనమును ప్రవేశించవలెను. దేవతలను పూజించి, సైనికుల కుటుంబముల పోషణకు ఏర్పాట్లు చేయవలెను. శత్రువునుండి లభించిన ధనములో కొంతభాగము భృత్యులకు కూడ పంచి పెట్టవలెను. నేను చెప్పిన ఈ రణదీక్షానుసారము కార్యములు చేయు రాజుకు తప్పక విజయము లభించును.

అగ్ని మహాపురాణమునందు రణదీక్షావర్ణనమను రెండువందల ముప్పది యారవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page