Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్వాత్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః

పునః శకునాని

పుష్కర ఉవాచ :

విశన్తియేన మార్గేణ వాయసా బహవఃపురమ్‌ | తేన మార్గేణ రుద్ధస్య పురస్యగ్రహణం భ##వేత్‌. 1

సేనాయాం యదివాసార్థేనివిష్టోవాయసోరుదన్‌ | వామోభయాతురస్త్రస్తో భయం వహతిదుస్తరమ్‌. 2

ఛాయాఙ్గ వాహనోపానచ్ఛత్ర వస్త్రాది కుట్టనే | మృత్యుస్తత్పూజనే పూజా తదిష్టకరణ శుభమ్‌. 3

ప్రోషితాగమకృత్కాకః కుర్వన్ద్వారిగతాగతమ్‌ | రక్తం దగ్దం గృహేద్రవ్యం క్షిపన్వహ్నినివేదకః. 4

పుష్కరుడు చెప్పెను. శత్రు నగరములోనికి చాల కాకులు ఏ మార్గము ద్వారా ప్రవేశించునో ఆ మార్గము నుండి చుట్టుముట్టినచో ఆనగరము తనవశమగును. ఏదైన సేనకు, లేదా సముదాయమునకు ఎడమ ప్రక్కనుండి భయభీతమగు కాకి ఏడ్చుచు ప్రవేశించినచో అది రాబోవు భయమునకు సూచకము. శామియానా, అవయవములు, వాహనములు, పాదుకలు, ఛత్రము, వస్త్రము మొదలగు వాటిచే కాకి నలగకొట్టబడినచో అది తనకు మృత్యు సూచకము. దానిని పూజించినచో తనకు కూడ పూజ లభించును. అన్నాదులచే దానికి ఇష్టము చేకూర్చినచో తనకు గూడ ఇష్టము చేకూరును. కాకి మాటిమాటికి ఇంటి ద్వారము వద్దకు వచ్చుచు పోవుచు ఉన్నచో అది ఎవరో పరదేశీయుడు వచ్చుటకు సూచకము. అది ఏదైన ఎఱ్ణని వస్తువును గాని, కాలిన వస్తువును గాని ఇంటి మీద పెట్టినచో అది గృహదహనమునకు సూచకము.

న్యసేద్రక్తం పురస్తాచ్చ నివేదయతిబంధనమ్‌ | పీతం ద్రవ్యం తథారుక్మరూప్యమేవతు భార్గవ. 5

యచ్చైవోపనయేద్ద్రవ్యం తస్యలబ్దిం వినిర్దిశేత్‌ | ద్రవ్యం వాపనయేద్యత్తుతస్యహానిం వినిర్దిశేత్‌. 6

పురతో ధనలబ్ధిః స్యాదామమాంసస్యచ్ఛర్దనే | భూలబ్ధిః స్యాన్మృదః క్షేపేరాజ్యం రత్నార్పణమహత్‌. 7

యాతుః కాకో7నుకూలస్తుక్షేమః కర్మక్షమోభ##వేత్‌ | నత్వర్థసాధకోజ్ఞేయః ప్రతికూలో భయావహః. 8

సమ్ముఖే7భ్యేతి విరుదన్యాత్రా ఘాతకరోభ##వేత్‌ | వామః కాకః స్మృతోధన్యో దక్షిణో7ర్థవినాశకృత్‌. 9

వామో7నులోమగః శ్రేష్ఠో మధ్యమోదక్షిణః స్మృతః | ప్రతిలోమ గతిర్వామో గమనప్రతిషేధకృత్‌. 10

నివేదయతి యాత్రార్థ మభిప్రేతం గృహేగతః | ఏకాక్షి చరణస్త్వర్కం వీక్షమాణో భయావహః. 11

(ఆ)7

కోటరే, వసమానశ్చ, మహానర్థకరోభ##వేత్‌ | నశుభస్తూషరే కాకః పంకాంకః సతుశస్యతే. 12

అమేధ్యపూర్ణవదనః కాకః సర్వార్థసాధకః | జ్ఞేయాః పతత్త్రిణో7న్యేపికాకవద్భృగునన్ధన.13

భృగునందనా ! కాకి మనుష్యుని ఎదుట ఏదైన ఎఱ్ఱని వస్తువుపడ వేసినచో అతనికి కైదు శిక్ష వచ్చునని సూచింపబడును. పచ్చని రంగు గల వస్తువును పడవేసినచో బంగారము, వెండి లభించునని సూచన. ఏ వస్తువును తన వద్దకు తెచ్చి విడచునో అది లభించును. దేనిని తన దగ్గర నుండి తీసికొని పోవునో అది నష్టమగును. పచ్చి మాంసము తీసికొనివచ్చి ఎదుట పడవేసినచో ధనము, మట్టి పడవేసినచో భూమి, రత్నమును పడవేసినచో మహాసామ్రాజ్యము లభించును. యాత్రా చేయువానికి అనుకూల దిశయందు కాకి వెళ్ళినచో అది కల్యాణకరము, కార్యసాధకము. ప్రతికూల దిశయందు వెళ్ళినచో అది కార్యవిఘాతకము; భయంకరము. కాకి 'కావ్‌ కావ్‌' అనుచు ఎదుటికి వచ్చినచో యాత్రాభంగము కలుగును. కాకి ఎడమవైపున ఉన్నచో శుభము, కుడివైపున ఉన్నచో అశుభము. వామభాగమునందుండి అనుకూలమైన దిక్కు వైపు ఎగిరినచో శ్రేష్ఠము, కుడిప్రక్కన ఉండి అనుకూలమగు దిక్కు వైపు ఎగిరినచో మధ్యము ఫలము. వామ భాగమునందుండి ప్రతికూలమగు దిక్కువైపు వెళ్ళినచో అది యాత్రను నిషేధించుచున్నది. యాత్రాకాలమున కాకి వచ్చి ఇంటిపై వాలినచో అదిఅభీష్టసిద్ధి సూచకము. ఒక కాలు ఎత్తి, ఒక కంటితో సూర్యునివైపు చూచినచో భయము కలుగును. ఏదైన చెట్టు తొఱ్ఱలో కూర్చుండి అరచినచో గొప్ప అనర్థము కలుగును. ఊషరభూమి మీద కూర్చున్నచో అశుభము. కాని దానికి బురద అంటు కొన్నచో మంచిది. మలము మొదలగు అపవిత్ర వస్తువులను ముక్కున పెట్టుకొని కాకి కనబడినచో అన్ని కార్యములు సాధింపబడును. ఇతరపక్షులకు గూడ కాకికి వలెనే ఫలితము తెలియవలెను.

స్కన్ధావారాపసవ్యస్థాః శ్వానో విప్రవినాశకాః | ఇంద్రస్థానే నరేంద్రస్య పురేశస్యతు గోపురే. 14

అంతర్గృహే గృహేశస్య మరణాయ భ##వేద్భషన్‌ | యస్య జిఘ్రతి వామాంగం తస్య స్యాదర్థ సిద్ధయే. 15

భయాయదక్షిణం చాఙ్గం తథా భుజమదక్షిణమ్‌ | యాత్రాఘాతకరో యాతుర్భవేత్ర్పతి ముఖాగతః. 16

మార్గావరోధశోమార్గే చౌరాన్వదతి భార్గవ | అలాభో7స్థిముఖః పాపో రజ్జుక్షీర ముఖస్తథా. 17

సోపానత్కముఖో ధన్యో మాంసపూర్ణముఖో7పిచ | అమంగల్యముఖద్రవ్యం కేశం చైవాశుభం తథా. 18

అవమూత్ర్యాగ్రతో యాతి యస్య తస్య భయం భ##వేత్‌ |

యస్యావమూత్ర్య ప్రజతిశుభం దేశం తథాధ్రువమ్‌. 19

మంగల్యంచ తథాద్రవ్యం తస్యస్యాదర్థసిద్ధయే | శ్వవచ్చ రామ విజ్ఞేయా స్తథావై అంబుకాదయః. 20

సేనానివేశమునకు దక్షిణమున కుక్కలు వచ్చినచో అది బ్రాహ్మణ వినాశసూచకము. ఇంద్రధ్వజస్థానమునకు వచ్చినచో రాజునకును, నగరద్వారమునకు వచ్చినచో నగరాధీశునకును మృత్యువు కలుగును. కుక్క మొరుగుచు ఇంటిలోనికి చొరబడినచో గృహస్వామికి మృత్యువుకలుగును. కుక్క ఎవరిని ఎడమ అవయవములను నాకునో వానికి కార్యసిద్ధికలుగును. కుడి అవయవములను ఎడమభుజమును వాసన చూచినచో భయము వచ్చును. యాత్రకువెళ్ళు వానికి ఎదురుగా వచ్చినచో యాత్రావిఘ్నము కలుగును. భృగునందనా! కుక్క దారికి అడ్డముగా నిలబడినచో మార్గమున చోరభయము సూచితము. ముఖమునందు ఎముకను గ్రహించి కనబడినచో యాత్ర చేయువానికి లాభ##మేదియుకలగదు. త్రాడుచింకిరిగుడ్డ ముఖమునందు పెట్టుకొనియున్న కుక్కకూడ అశుభ సూచకము. చెప్పుకాని, మాంసముకాని నోటిలో కరచికొని ఎదురైనచో శుభము కలుగును. దానినోటిలో ఏదైన అమాంగలికమగు వస్తువుగాని, కేశముగాని ఉన్నచో అశుభ సూచకము. కుక్క ఎవని ఎదుట మూత్రము విడచి పోవునో వానికి భయము వచ్చును. మూత్రత్యాగానంతరము కుక్క ఏదైన శుభ స్థానమునకుగాని, శుభకరమగు వృక్షమువద్దకుగాని శుభకరమగు వస్తువుదగ్గరకుగాని వెళ్ళినచో కార్యము సిద్ధించును. పరశురామా! గ్రద్దమొదలగువాటి విషయముగూడ కుత్తవిషయమునందు వలెనే గ్రహించవలెను.

భయాయ స్వామినోజ్ఞేయమనిమిత్తం రుతం గవామ్‌ | నిశిచౌర భయాయస్యాద్వికృతం మృత్యవేతథా. 21

శివాయ స్వామినో రాత్రౌ బలీవర్ధోనదన్భవేత్‌ | ఉత్సృష్టవృషభో రాజ్ఞో విజయం సంప్రయచ్ఛతి. 22

అభయం భక్షయన్త్యశ్చ గావో దత్తాస్తథాస్వకాః | త్యక్తస్నేహాః స్వవత్సేషు గర్భక్షయకరామతాః. 23

భూమిం పాదైర్వినిఘ్నన్త్యో దీనా భీతా భయావహాః |

అర్ద్రాంగ్యో హృష్టరోమాశ్చ శృంగలగ్న మృదఃశుభాః. 24

మహిష్యాదిషు చాప్యేతత్సర్వంవాచ్యం విజానతా |

గోవులు ఆకారణముగా త్రేన్చుట ప్రారంభించినచో స్వామికిభయము కలుగును. ఆదిరాత్రిఅరచినచో చోరభయము వికృత స్వరూపస్వరముతో అరచినచో మృత్యుభయము. వృషభము రాత్రి గర్జించినచో స్వామికి కల్యాణమగును. ఆబోతు రంకెలు వేసినచో రాజుకు విజయము లభించును. తాను ఇచ్చిన గోవులుగాని, తన ఇంటిలోనున్న గోవులుగాని అభక్ష్యభక్షణము చేసినచో లేదా తమ దూడలపై ప్రేమచూపకున్నచో అది గర్భస్రావసూచకము. పాదములతో నేలనుగీయుగోవులు దీనము భయభీతములు అయిన గోవులును భయమును కలిగించును. తడిసిన శరీరముగలవి, ఆనందముచేవికసించిన రోమములు గలవి, కొమ్ములకుమట్టి అంటుకొన్నవి అయిన గోవులు శుభసూచకములు. బుద్ధిమంతులు గేదె మొదలగువాటి విషయమున గూడ ఈ విధముగానే శకునములు చెప్పవలెను.

ఆరోహణం తథా7న్యేన సపర్యాణస్య వాజినః. 25

జలోపవేశనం నేష్టం భూమౌచ పరివర్తనమ్‌ | విపత్కరం తురంగస్య సుప్తంవాప్య నిమిత్తతః. 26

యవమోదకయోర్ద్వేషస్త్వకస్మాచ్ఛ నశస్యతే | వదనాద్రుధిరోత్పత్తిర్వేపనం నచశస్యతే. 27

క్రీడన్బక్తైః కపోతైశ్చ సారికాభిర్మృతిం వదేత్‌ | సాశ్రునేత్రో జిహ్వయాచ పాదలేహీ వినష్టయే. 28

వామపాదేన చ తథా విలిఖంశ్చ వసుంధరామ్‌ | స్వపేద్వా వామ పార్శ్వేన దివావా నశుభప్రదః. 29

భయాయస్యాత్సకృన్మూత్రీ తథానిద్రావిలాననః | ఆరోహణం నచేద్దద్యాత్ర్పతీపం వా గృహం వ్రజేత్‌. 30

యాత్రావిఘాతమాచష్టే వామపార్శ్వం తథాస్పృశన్‌ | హేషమాణః శత్రుయోధం పాదస్పర్శ జయావహః.

జీను వేసిన తనగుఱ్ఱముపై ఇతరులు ఎక్కుట ఆ గుఱ్ఱము నీటిలో కూర్చుండిపోవుట, ఒకేచోట గుండ్రముగా తిరుగట ఇవి అనిష్టసూచకములు. ఏకారణము లేకుండ గుఱ్ఱము నిద్రపోవుట ఆపదను కలిగించును. యవలపైనను బెల్లము పైనను గుఱ్ఱమునకు అరుచికలిగినను, దాని ముఖమునుండి రక్తము కారుచున్నను, దాని శరీరమంతయువణకుచున్నను ఇవి అశుభసూచకములగు దుర్లక్షణములు. గుఱ్ఱము కొంగలతోను, పావురములతోను సారికలతోను ఆటలు ప్రారంభించినచో అది మృత్యుసూచకము. దాని నేత్రములనుండి కన్నీళ్లుకారినను అది నాలుకతో పాదమునాకికొనినను వినాశసూచకము అది ఎడమ డెక్కతో నేల త్రవ్వినను, ఎడమ ప్రక్క పండుకొనినను, పగలు నిద్రించినను శుభకారముకాదు. ఒకమాటు కొంచెము మూత్రము విడచునది, నిద్రచేమలినముఖముకలది అగు గుఱ్ఱము భయమునుసూచించును. గుఱ్ఱము తనపైకి ఎక్కనీయకున్నను ఎక్కునపుడు వెనుకకు తిరిగి ఇంటిలోనికి వెళ్ళిపోయినను, సవారిచేయువాని ఎడమ పార్శ్వమునందలి ఎముకలుస్పృశించినను యాత్రలో విఘ్నము కలుగును. శత్రుయోధులను చూచి సకిలించినను తన యజమాని పాదములను స్పృశించినను విజయము లభించును.

గ్రామేవ్రజతి నాగశ్చేన్మైథునం దేశహాభ##వేత్‌ | ప్రసూతా నాగవనితా మత్తాచాంతాయ భూపతేః. 32

ఆరోహణం న చేద్ధద్యాత్ర్పతీపం వా గృహం వ్రజేత్‌ | మదం వా వారణో జహ్యాద్రాజ ఘాతకరో భ##వేత్‌.

వామం దక్షిణం పాదేన పాదమాక్రమతే శుభః | దక్షిణంచ తథా దన్తం పరిమార్ష్‌టకరేణచ. 34

ఏనుగ గ్రామములో మైథునము చేసినచో అది దేశోపద్రవకారకము. ఆడ ఏనుగ గ్రామములో ఈనినను, పిచ్చిదైనను రాజవినాశ సూచకము. ఏనుగ తనపై ఎక్కనీయకున్నను, హస్తిశాల లోనికి వెళ్ళిపోయినను, మదధార స్రవించినను రాజుకు మరణము కలుగును. కుడిపాదము ఎడమకాలిపై ఉంచి, తుండముతో దంతములను తుడిచినచో అది శుభకరము.

వృషో7శ్వః కుంజరోవాపి, రిపుసైన్యగతో7శుభః | ఖండమేఘాతి వృష్ట్యా తు సేనానాశ మవాప్నుయాత్‌. 35

ప్రతికూలగ్రహర్షాత్తు తథా సమ్ముఖ మారుతాత్‌ | యాత్రాకాలే రణవాపి ఛత్రాది పతనం భయమ్‌. 36

హృష్టానరాశ్చానులోమా గ్రహా వై జయలక్షణమ్‌. |

కాకైర్యోధాభిభవనం క్రవ్యాద్భిర్మండలక్షయః | ప్రాచీపశ్చిమకైశానీ సౌమ్యాప్రేష్ఠా శుభాచదిక్‌. 37

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శకున నిరూపణం నామ ద్వాత్రింశకదధిక ద్విశతతమో7ధ్యాయః.

తన వృషభము గాని, గుఱ్ఱముగాని, ఏనుగు గాని శత్రు సైన్యములోనికి వెళ్ళిపోయినచో అశుభము కలుగును. కొద్ది దూరమునందే మేఘము అంతటను వ్యాపించి పెద్ద వర్షము కురిసినచో సేన నశించును. యాత్రా సమయమునందు గాని, యుద్ధ సమయము నందుగాని, గ్రహనక్షత్రములు ప్రతికూలమైనను, గాలి ఎదురుగా వీచినను, ఛత్రాదులు విరిగి పడి పోయినను, భయము కలుగును. యుద్ధము చేయు హర్షోత్సాహభరితులై, గ్రహములు కూడ అనుకూలముగా నున్నచో విజయము కలుగును. కాకులు, మాంసాహారి జంతువులను యోధులను తిరస్కరించినచో మండలము నశించును. పూర్వ-పశ్చిమ - ఈశాన్య దిక్కులు ప్రసన్నములై శాంతములుగా ఉన్నచో ప్రియము, శుభము అగు ఫలము లభించును.

అగ్ని మహాపురాణమునందు శకునవర్ణన మను రెండువందల ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page