Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ రాజధర్మాః

పుష్కర ఉవాచ :

రాజపుత్రస్య రక్షాచ కర్తవ్యా పృథివీభృతా | ధర్మార్థ కామశాస్త్రాణి ధనుర్వేదంచ శిక్షయేత్‌. 1

శిల్పాని శిక్షయేచ్చైవ మాపై#్తర్మిథ్యాప్రియం వదైః | శరీరరక్షావ్యాజేన రక్షిణో7స్య నియోజయేత్‌. 2

న చాస్య సంగో దాతవ్యః క్రుద్ధలుబ్ధవిమానితైః | అశక్యం తు గుణాధానం కర్తుం తం బంధయేత్సుఖైః. 3

అధికారేషు సర్వేషు వినీతం వినియోజయేత్‌ | మృగయాం పాన మక్షాంశ్చ రాజ్యనాశాంస్త్యజేన్నృపః. 4

దివాస్వప్నం వృథాట్యాం చ వాక్పారుష్యం వివర్జయేత్‌ |

నిందాంచ దండ పారుష్యమర్థదూషణ ముత్సృజేత్‌. 5

ఆకారాణాం సముచ్ఛేదో దుర్గాదీనామసత్క్రియా | అర్థానాం దూషణం ప్రోక్తం విప్రకీర్ణత్వమేవ చ. 6

ఆదేశకాలే యద్ధానమపాత్రే దానమేవచ | అర్థేషు దూషణం ప్రోక్తమసత్కర్మప్రవర్తనమ్‌. 7

కామం క్రోధం మదం మానం లోభం దర్పంచ వర్జయేత్‌ |

తతోభృత్యజయం కృత్వా పౌరజానపదంజయేత్‌. 8

జయేద్బాహ్యానరీన్పశ్చా ద్బాహ్యాశ్చ త్రివిధారయః | గురవస్తే యథాపూర్వం కుల్యానంతరకృత్రిమాః. 9

పితృపైతామహం మిత్రం సామన్తం చ తథారిపోః | కృత్రిమంచ మహాభాగ మిత్రం త్రివిధముచ్యతే. 10

పుష్కరుడు చెప్పెను : రాజు తన పుత్రుని బాగుగా రక్షించుకొనుచు ఆతనికి ధర్మశాస్త్ర -అర్థశాస్త్ర కామశాస్త్ర - ధనుర్వేదములందు శిక్షణ ఇవ్వవలెను. వివిధ శిల్పములను గూడ నేర్పవలెను. విశ్వాసపాత్రులు, ప్రియముగా మాటలాడువారు అగువారిని శిక్షకులుగా నియమించవలెను. రాజకుమారుని శరీరరక్షార్థమై కొందరిని నియమింపవలెను. కోపము కలవారు, లుబ్ధులు, అపమానితులు అయినవారినుండి రాజకుమారుని ఎక్కువగా సుఖపెట్టరాదు. ఆతడు చక్కగా శిక్షితుడైన పిమ్మట ఆతనిని అన్ని పనులందును నియమించవలెను. వేట, జూదము, మద్యపానము -ఇవి రాజ్యవినాశకరములగు దోషములు. రాజు వీటిని పరిత్యజించవలెను. పగటినిద్ర, పనిలేకుండగ తిరుగుట, కటుభాషణము- వీటిని పరిత్యజించ వలెను. ఇతరులను నిందించుట, తీక్‌ష్ణదండము, అర్థదూషణము కూడ విడువవలెను. బంగారము గనులు మొదలగునవి నశించిపోవుట, దుర్గాదులకు, మరమ్మతులు చేయకుండుట- ఇవి అర్థదూషణములు. ధనమును కొంచెము కొంచెము అనేక స్థానములందు ఉంచుట, అయోగ్యములైన దేశకాలములందు అపాత్రలకు దానముచేయుట చెడ్డపనులకై ధనమువెచ్చించుట, ఇవి కూడ అర్థదూషణములు కామ - క్రోధ - మథ - మన - లోభ - దర్పములను త్యజించవలెను. పిదప భృత్యులను వశమునందుంచుకొని, పిమ్మట నగరములోని వారిని, దేశములోని వారిని వశంగతులను చేసికొనవలెను. పిదప బాహ్యశత్రువులను జయించుటకై ప్రయత్నించవలెను. బాహ్యశత్రువులు మూడు రకములు- పాత శత్రుత్వము కలవారు రాజ్యపు సరిహద్దులలో ఉండువారు, తనతో శత్రుత్వమేర్పడినవారు. వీరిలో పూర్వపూర్వులు అధిక శత్రువులు. తాత ముత్తాతలనుంచి మిత్రులు, శత్రువుల శత్రువులు, కృత్రిములు అని మిత్రులు కూడ మూడు విధములు.

స్వామ్యమాత్యం జనపదా దుర్గం దండ స్తథైవ చ | కోశో మిత్రంచ ధర్మజ్ఞ సప్తాఙ్గం రాజ్యముచ్యతే. 11

మూలం స్వామీ సవై రక్ష్యస్తస్మాద్రాజ్యం విశేషతః |

రాజ్యాంగ ద్రోహిణం హన్యాత్కాలే తీక్‌ష్ణోమృదుర్బవేత్‌. 12

ఏవం లోకద్వయం రాజ్ఞో భృత్యైర్హాసం వివర్జయేత్‌ | భృత్యాః పరిభవంతీహ నృపం హర్షణం సత్కథమ్‌. 13

లోక సంగ్రహణార్థాయ కృతకవ్యసనోభ##వేత్‌ | స్మిత పూర్వాభిభాషీస్యాల్లోకానాం రంజనం చరేత్‌. 14

దీర్ఘసూత్రస్య నృపతేః కర్మహానిర్ధ్రువం భ##వేత్‌ | రాగే దర్పేచ మానే చ ద్రోహేపాపేచ కర్మణి. 15

అప్రియే చైవ వక్తవ్యే దీర్ఘసూత్రః ప్రశస్యతే | గుప్తమంత్రో భ##వేద్రాజా నాపదో గుప్తమంత్రతః. 16

ధర్మవేత్తవైన పరశురామా! రాజ్యమునకు - రాజు, మంత్రి, జనపదము, దుర్గము, సేన, కోషము, మిత్రులు అని ఏడు అంగములు. రాజ్యమునకు మూలము స్వామి (రాజు). అందుచే ఆతనిని ఎక్కువగా రక్షించవలెను. రాజ్యాంగ విద్రోహులను చంపివేయవలెను. సమయానుసారముగా రాజు కఠోరముగాను మృదువుగాను కూడ ప్రవర్తించవలెను. ఇట్లుండుటచే ఆతనికి రెండులోకములును బాగుపడును. రాజు భృత్యులతో పరిహాసము చేయరాదు. అందరితోడను నవ్వుతూ మాటలాడే రాజును సేవకులు అవమానింతురు. లోకులతో కలిసిమెలిసి ఉండుటకై రాజు కొన్ని లేని వ్యసనములు కూడ ఉన్నట్లు ప్రవర్తించవలెను. ప్రజలు ప్రసన్నులగు విధమున చిరునవ్వు నవ్వుచూ మాటలాడవలెను. దీర్ఘసూత్రి (పనులు చేయుటలో చాలాకాలం ఆలోచించువాడు) యైనరాజుయొక్క కార్యము లన్నియు నశించును. కాని రాగ - దర్ప - అభిమాన - ద్రోహ - పాపకర్మ - అప్రియభాషణాదులలో దీర్ఘసూత్రియైన రాజును అందరును ప్రశంసింతురు. రాజు తన మంత్రమును [ఆలోచనలను] గుప్తముగా ఉంచుకొనవలెను. అట్లు ఉంచుకొన్న ఎన్నటికిని ఆపదరాదు.

జ్ఞాయతే హి కృతం కర్మ నారబ్ధం తస్య రాజ్యకమ్‌ | ఆకారైరిఙ్గితైర్గత్యా చేష్టయా భాషితేన చ. 17

నేత్రవక్త్రవికారాభ్యాం గృహ్యతే7న్తర్గతం మనః | నైకస్తుమంత్రయేన్మంత్రం నరాజా బహుభిః సహ. 18

బహుభిర్మంత్రయేత్కామం రాజా మన్త్రాన్‌ పృథక్పృథక్‌ |

మంత్రిణామపినో కుర్యాన్మంత్రీ మంత్రప్రకాశనమ్‌.

క్వాపి కస్యాపి విశ్వాసో భవతీహసదానృణామ్‌ | నిశ్చయశ్చతథా మంత్రే కార్య ఏకేన సూరిణా. 20

నశ్యేదవినయాద్రాజా రాజ్యాంచ వినయాల్లభేత్‌ | త్రైవిద్యేభ్యస్త్రయీం విద్యాం దండనీతిం చ శాశ్వతీమ్‌. 21

అన్వీక్షికీం చార్థవిద్యాం వార్తారమ్భాంశ్చ లోకతః | జితేంద్రియో హి శక్నోతి వశే స్థాపయితుం ప్రజాః. 22

పూజ్యా దేవాద్విజాః సర్వే దద్యాద్దానాని తేషుచ | ద్విజే దానం చాక్షయో7యం నిధిః కైశ్చిన్ననాశ్యతే. 23

సంగ్రామేష్వనివర్తిత్వం ప్రజానాం పరిపాలనమ్‌ | దానాని బ్రాహ్మణానాం చ రాజ్ఞో నిశ్రేయసంవరమ్‌. 24

కృపణానాథ వృద్ధానాం విధవానాం చ యోషితామ్‌ | యోగ క్షేమంచ వృత్తించ తథైవ పరికల్పయేత్‌. 25

వర్ణాశ్రమ వ్యవస్థానం కార్యం తాపస పూజనమ్‌ | నవిశ్వసేచ్చ సర్వత్ర తాపనేషు చ విశ్వసేత్‌. 26

విశ్వాసయేచ్చాపి పరం తత్త్వ భూతేన హేతునా | బకవచ్చింతయేదర్థం సింహవచ్చపరాక్రమేత్‌. 27

వృకవచ్చావలుంపేత శశపచ్చ వినిష్పతేత్‌ | దృడప్రహారీ చ భ##వేత్తథా సూకరవన్నృపః 28

చిత్రాకారశ్చ శిభివద్దృడ భక్తిస్తథాశ్వవత్‌ | భ##వేచ్చ మధురాభాపీ తథాకోకిలవన్నృపః.29 అ (5)

కాకాశంకీ భ##వేన్నిత్యమజ్ఞాతాం వసతింవసేత్‌ | నా పరీక్షిత పూర్వంచ భోజనం శయనం స్పృశేత్‌. 30

నా విజ్ఞాతాం స్త్రియం గచ్చేన్నాజ్ఞాతం నావమారుహేత్‌ - రాష్ట్రకర్షీభ్రశ్యతే చ రాజ్యార్థాచ్చైవ జీవితాత్‌. 31

భృతో వత్సో జాతబలః కర్మయోగ్యస్తథాభ##వేత్‌ | తథారాష్ట్రం మహాభాగ భృతం కర్మసహం భ##వేత్‌. 32

సర్వం కర్మేదమాయత్తం విధానే దైవపౌరుషే | తయోర్దైవ మచింత్య హి పౌరుషే విద్యతే క్రియా. 33

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రాజధర్మోనామ పంచవింశత్యధిక ద్విశతతమోధ్యాయః.

రాజ్యకార్యములు పూర్తియైన తరువాతనే ఇతరులకు తెలియవలెను. వాటి ప్రారంభము ఎవ్వరికిని తెలియ కూడదు. మనుష్యుల ఆకారము, సంజ్ఞలు, చేష్టలు, ప్రవర్తన, మాటలు, నేత్రముఖ వికారములు - వీటిని పట్టిదారి మనస్సులోని ఆలోచనను పసిగట్ట వచ్చును. రాజు ఒంటరిగా రహస్యమైన విషయములను గూర్చి ఆలోచించగూడదు. చాలమందితో సలహా తీసికొనవచ్చును గాని ఒక్కొక్కరినే పిలపించి తీసికొనవలెను. రాజు యొక్క రహస్యాలోచనలను మంత్రి ఇతర మంత్రులకు గూడ చెప్పగూడదు. మనుష్యులకు సాధారణముగా ఎవ్వరో ఒక వ్యక్తి పైననే విశ్వాసమేర్పడును. అందుచే రాజు విద్వాంసుడైన ఒక మంత్రితో మాత్రమే ఆలోచనలు చేయవలెను. వినయములేని రాజు నశించును వినయవంతుడు రాజ్యము పొందగల్గును. వేదత్రయ పండితులనుండి, వేదత్రయమును, ప్రాచీనదండనీతిని, అన్వీక్షకిని, (న్యాయవేదాంతాదులు) అర్థశాస్త్రమును నేర్వవలెను వార్తను [కృషి, గోరక్ష, వాణిజ్యము మొ.] గూర్చిన జ్ఞానమును లోకమునుండి సంపాదించుకొనవలెను. తన ఇంద్రియములను వశములో ఉంచుకొన్న వాడే ప్రజలను వశములో ఉంచుకొన గల్గును. దేవతలను, సమస్త బ్రాహ్మణులను పోషించవలెను. వారికి దానములీయవలెను. బ్రాహ్మణన కిచ్చిన దానము అక్షయమగు దానినెవ్వరును నశింపచేయజాలరు. యుద్ధము నందు వీపు చూపకుండుట, ప్రజలను పాలించుట, బ్రాహ్మణులకు దానము లిచ్చుట ఇవి రాజునకు కల్యాణదాయకములు. దీనులు, అనాథులు, వృద్ధులు, విధవలగు స్త్రీలు మొదలగు వారి యోగ క్షేమములు చూచుచు, వారికి జీవనోపాధి కల్పింపవలెను. వర్ణాశ్రమధర్మ రక్షణము, మునులను సత్కరించుట ఇవి రాజుల కర్తవ్యములు. రాజు ఎవ్వరిని నమ్మకూడదు. కాని మునులను మాత్రము నమ్మవచ్చును. సరియైన ఉపాయములచే ఇతరులకు తనపై విశ్వాసమేర్పడునట్లు చేసికొనవలెను. రాజు స్వార్థమునుగూర్చి కొంగవలె ఆలోచించవలెను. సింహమువలె పరాక్రమము చూపవలెను. తోడేలు వలె శత్రువులను ఆక్రమించి చర్చించవలెను. చెవులపిల్లి వలె దుముకుచు అదృశ్యుడు కావలెను. సూకరమువలె దృఢప్రహారము చేయవలెను. నెమలివలె విచిత్రవేషమును ధరించవలెను. గుఱ్ఱమువలె దృఢమైన భక్తి కలిగియుండవలెను. కోకిలవలె మధురముగా మాటలాడవలెను. కాకివలె అందరి నుండి తప్పించుకొని యుండవలెను. ఎవరికిని తెలియని చోట నివసించవలెను. పరీక్షించకుండగ భోజనము చేయరాదు. శయ్యపై పరుండరాదు. ప్రజలను పీల్చివేయువాడు రాజ్యమును, జీవితమును కూడ కోల్పోవును. పోషింపబడిన లేగదూడ బలము కలదైన పిమ్మట పనులు చేయుటకు ఉపయోగించునట్లు బాగుగా రక్షించపబడిన రాష్ట్రము రాజునకు ఉపకరించును. కార్యములన్నియు దైవము మీదను పురుషకారముమీదను ఆధారపడి యుండును. వీటిలో దైవము అచింత్యము. పురుషకారము కార్యమును సాధించగలుగును. ప్రజానురాగమే రాజ్యమును, పృథివిని. లక్ష్మిని ఇచ్చు ఏకైక హేతువు.

అగ్ని మహాపురాణమునందు రాజధర్మ కథనమను రెండువందల ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page