Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

తథా గతేషు దేవేషు కావ్య స్తా న్ప్రత్యువాచ హ | బ్రహ్మణా పూర్వ ముక్తంయ చ్ఛృణుధ్వందానవోత్తమాః. 1

విష్ణుర్దైత్యవధే యుక్తో హనిష్యతి జనార్థనః | వారాహరూపమాస్థాయ హిరణ్యాక్ష యథా హతః. 2

యథా నృసింహరూపేణ హిరణ్యకశిపుర్హతః | తథా సర్వా న్కృతోత్సాహో హనష్యతి న చా%న్యథా. 3

న మే మంత్రబలం సమ్యక్రపతిభాతి యథా హరిం | జేతుం యూయం సమర్థాః స్థ మయా త్రాతాః సురానథ. 4

తస్మాత్కాలం ప్రతీక్షధ్వం కియంతం దానవోత్తమాః | అహమద్య మహాదేవం మంత్రార్థం ప్రవ్రజామి వై. 5

ప్రాప్య మంత్రా న్మహాదేవా దాగమిష్యామి సాంప్రతమ్‌ | యుష్మభ్యం తా న్ప్రదాస్యామి యథార్థం దానోవత్తమాః. 6

దైత్యాంః: పరాజితాః కథం స్థాతుం పృథివ్యాం మునిసత్తమ | శక్తా భవమో%ప్యబలా స్తావత్కాలం ప్రతీక్షితుమ్‌. 7

నిహతా బలినః సర్వే కేచిచ్ఛిష్టాశ్చ దానవాః | నాద్య యుక్తాశ్చ సంగ్రామే స్థాతు మేవం సుఖావహాః. 8

శుక్రః : యావదహం మంత్రవిద్యా మానయిష్యామి శంకరాత్‌ | తావద్భవద్భిః స్థాతవ్యం తపోయుక్తైః శమాన్వితైః. 9

సామదానాదయః ప్రోక్తా విద్వద్భిః సమయోచితాః | దేశం కాలం బలం వీరై ర్జాత్వా శక్తిబలం బుధైః. 10

సేవా%థ సమయే కార్యా శత్రూణాం శుభకామ్యయా | స్వశక్త్యుపచయే కాలే హంతవ్యా స్తే మనీషిభిః. 11

తదద్య వినయం కృత్వా సామపూర్వం ఛలేన వై | తిష్ఠధ్వం స్వనికేతేషు మదాగమన కాంక్షయా. 12

ప్రాప్య మంత్రాన్మహాదేవా దాగమిష్యామి దానవాః | యుధ్యామహే పునర్దేవా న్మంత్రమాస్థాయ వై బలమ్‌. 13

ఇత్యుక్త్వా%థ భృగుస్తేభ్యో జగామ కృతనిశ్చయః | మహాదేవం మహరాజ! మంత్రార్థం మునిసత్తమః. 14

పదకొండవ అధ్యాయము

శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట

అట్లు దేవతులు వెళ్ళిన మీదట శుక్రుడు దనుజులను గని యిట్లు పలికెను: ఓ దానవులారా! తొల్లి బ్రహ్మ నాతో పలికిన కొన్ని వాక్కులు కలవు. మీకు వినిపింతును. వానిని వినుడు. జనార్దనుడైన శ్రీమహావిష్ణువు ధర్మరక్షణకై దైత్య వధ గావించును. అట్టే మున్ను హరి వరాహరూపమున హిరణ్యాక్షు నంత మొందించెను. శ్రీ నృసింహరూపమున హిరణ్యకశిపుని చీల్చిచెండాడెను. అదేవిధముగ నతడెల్ల దైత్యగణములను చంపగలడు. ఇందు సందేహము లేదు. ఇపుడు హరిశక్తి ముందు నా మంత్రబలము పనిచేయదు. మీరు నా చేత రక్షింపబడినచో దేవతలను జయింపగలరు. కొంతకాల మోపికపట్టుడు. నేనిప్పటికిప్పుడే వరమంత్ర ప్రాప్తికై మహాదేవుని సన్నిధానమున కరుగగలను. నేను మహామంత్రశక్తి బడసి వెంటనే రాగలను. దాని బలమున మిమ్ము తప్పక రక్షింపగలను' అనవిని దైత్యులిట్లనిరి : మునిసత్తమా ! మేమోటమి చెందితిమి. ఈ నేలపై నింకెట్లు నిలువగలము? మీరు తిరిగివచ్చునంతదనుక మే మెదురుతెన్నులు చూచుచుండజాలము. మాలో మహాబలశాలురందఱును మడిసిరి. కొందఱు మాత్రము చావుదప్పి బయటపడిరి. ఇట్టి దీనస్థితిలో మేము రణమున నిలువజాలము. శుక్రాచార్యు డిట్లనెను: నేను శంకరు నుండి మంత్ర విద్య గ్రహించు నంతకాలము శాంతులై తపమొనర్చు చుండుడు. విబుధులు సమయోచితముగ సామదానాది చతురుపాయముల నెఱిగి దేశకాల శక్తులు దెలిసి మెలగవలయు నందురు. భద్రము గోరు బుద్ధిశాలి యవసరమైనచో వైరికి సేవయైన చేయవలయును. పిమ్మట తఱియెఱింగి బలము పుంజుకొని శత్రువును తుదముట్టించవలయును. కాన మీరిపు డతివినయము నటించి సామ మార్గముతో మీ మీ నిలయములకేగుడు - నా రాకకు దారి తెన్నులు చూచుచుండుడు. నేను మహాదేవుని నుండి మంత్రశక్తి గ్రహించి వచ్చిన మీదట మంత్రబలముతో దేవతలతో బోరు సాగింతము.' అట్లు శుక్రుడు దానవుల నొప్పించి మంత్రార్థము దృఢ సంకల్పముతో శివతరుడైన పరమశివుని సన్నిధికరిగెను. అపుడు రాక్షసులు సంధికొఱకు సత్యవాదియు సురలకు విశ్వాసపాత్రుడునైన ప్రహ్లాదుని దేవతుల సన్నిధి కంపిరి.

దానవాః ప్రేషయామాసుః ప్రహ్లాదం సురసన్నిధౌ | సత్యవాదిన మవ్యగ్రం సురాణాం ప్రత్యయప్రదమ్‌. 15

ప్రహ్లాదస్తు సురాన్ప్రాహ ప్రశ్రయావనతో నృపః | అసురైః సహితస్తత్ర వచనం నమ్రతాయుతమ్‌. 16

న్యస్త శస్త్రా వయం సర్వే నఃసన్నాహాస్తథైవ చ | దేవా స్తపం చరిష్యామః సంవృతా వాల్కలైర్యుతాః. 17

ప్రహ్లాదస్య వచః శ్రుత్వా సత్యా%భివ్యాహృతంతు తత్‌ | తతో దేవా న్యవర్తంత విజ్వరా ముదితాశ్చతే. 18

న్యస్త శ##స్త్రేషు దైత్యేషు వినివృత్తా స్తదా సురాః | విస్రబ్ధాః స్వగృహే న్గత్వా క్రీడాసక్తాః సుసంస్థితాః. 19

దైత్యా దంభం సమాలంబ్య తాపసా స్తపసంయుతాః | కశ్యపస్యాశ్రమే వాసం చక్రుః కావ్యా%%గమేచ్ఛయా. 20

కావ్యో గత్వా%థ కైలాసం మహాదేవం ప్రణమ్య చ | ఉవాచ విభూనాపృష్టం కిం తే కార్య మితి ప్రభుః. 21

మంత్రా నిచ్ఛా మ్యహం దేవ యే న సంతి బృహస్పతౌ | పరాజయాయ దేవానా మసురాణాం జయాయ చ. 22

తచ్ఛుత్వా వచనం తస్య సర్వజ్ఞః శంకరః శివః | చింతయామాస మనసా కిం కర్తవ్య మతః పరమ్‌. 23

సురేషు ద్రోహబుద్ధ్యా%సౌ మంత్రార్థ మిహ సాంప్రతమ్‌ ప్రాప్తః కావ్యో గురుస్తేషాం దైత్యానాంవిజయాయచ. 24

రక్షణీయా మయా దేవా ఇతి సంచింత్య శంకరః | దుష్కరం వ్రత మత్యుగ్రం తమువాచ మహేశ్వరః. 25

పూర్ణం వర్షసహస్రం తు కణధూమ మవాక్ఛిరాః | యది పాస్యసి భద్రం తే తతో మంత్రా నవాస్స్యసి. 26

ఇత్యుక్తో%సౌ ప్రణమ్యేశం బాఢమి త్యబ్రవీ ద్వచః | వ్రతం చరామ్యహం దేవ త్వయాజ్ఞప్తః సురేశ్వర. 27

ఇత్యుక్త్వా శంకరం కావ్య శ్చ కార వ్రతముత్తమం | ధూమపానరతః శాంతో మంత్రార్థం కృతనిశ్చయః. 28

తతో దేవాః పరిజ్ఞాయ కావ్యం వ్రతరతం తదా | దైత్యా న్దంభరతాంశ్చైవ బభూవుర్మంత్రతత్పరాః. 29

ఆతడు వేల్పుల సన్నిధి కసురులను వెంటగొనియేగి నమ్రవచనములతో దేవతలతో ఓ దేవతలారా! మేము కవచ సంన్యాసము నస్త్ర సంన్యాసమును చేసితిమి. నారచీరలు దాల్చి తపమొనరింప దలంచితిమి. అనగా ప్రహ్లాదుని సత్యవాక్కు లాలించి యమరులు రణముమాని బాధలుపాసి ప్రమోదభరితులై నిబ్బరముగ నుండిరి. అసురులు శస్త్ర నంన్యాసము సేయగా వారిని నమ్మి యమరులు తమ తమ నివాసముల కరిగి క్రీడాసక్తులై సుఖముండిరి. ఆంత దానవులును నిగ్రహము వహించి శుక్రుని శుభాగమనము గోరుచు తపముచేయుచు కశ్యపాశ్రమమందు వాసముండిరి. అటు శుక్రుడు కైలాసరిగి కరిగి శంభునకు ప్రణమిల్లెను. హరుడతని రాకకు కారణమడుగ ఓ మహాదేవా! నేను గురునియొద్ద లేని మంత్రములు గోరుచున్నాను. వానివలన సురపరాజయము - అసురజయము గలుగుగాక! యని శుక్రుడనెను. అతని పలుకు లాలించి సర్వజ్ఞుడు శివుడునైన శర్వుడు తన కర్తవ్యము గూర్చి యించుక యాలోచించెను. రాక్షసగురుడు దేవతలయందలి ద్రోహబుద్ధిచే తనకడకు మంత్రార్థము వచ్చెనని శివుడు నిశ్చయముగ దెలిసికొనెను. ఎల్లభంగుల దేవతలు తనకు రక్షణీయులని పరమశివుడు మదితలంచెను. ఆ యుగ్రుడు శుక్రునితో - నీవు మహోగ్రము దుస్సాధనమునైన యొక వ్రత మనుష్టించ వలయును అని పలికెను. వేయేండ్లు తలక్రిందుగ నుండి పొట్టుపొగ పానమొనర్చు చున్నచో నీ కోర్కె యీడేరును. అపుడు మంత్రములు పడయగలవు అని పలికెను. అపుడు శుక్రుడు చేతులు జోడించి యిట్లనెను. ఓ సర్వేశ్వరా! మహాప్రసాదము. మీ మాట పాటింతును. వ్రతమాచరింతును. అనుమతియిండు' అని పలికి శుక్రుడు ధూమపాయియై శాంతుడై మంత్రార్థము కఠిన వ్రత మాచరింప దొడగెను. శుక్రుడు వ్రతరతు డగుటయు రాక్షసులు దంభ నిరతులగుటయు విబుధు లెఱిగి మంత్రాలోచనలు సలుపుచుండిరి.

విచార్య మనసా సర్వే సంగ్రామాయోద్యతా నృప | యయుర్ధృ తాయుధా స్తత్ర యత్ర తే దానవోత్తమాః. 30

తా నాగతాన్స మీక్ష్యా2థ సాయుధాన్దంశితాం స్తథా | ఆసంస్తే భయసంవిగ్నా దైత్యా దేవా న్సమంతతః. 31

ఉత్పేతుః సహసా తే వై సన్నద్ధా న్భయకర్శితాః | అబ్రువ న్వచనం తథ్యం తే దీవా న్బల దర్పితాన్‌. 32

న్యస్తశ##స్త్రే భయవతి ఆచార్యే వ్రతమాస్థితే | దత్త్వా%భయం పురా దేవాః సంప్రాప్తానో జిఘాంసయా. 33

సత్యం వః క్వ గతం దేవా ధర్మశ్చ శృతినోదితః | న్యస్తశస్త్రా న హంతవ్యా భీతావ్యా భీతాశ్చ శరణం గతాః. 34

దేవాః : భవద్భిః ప్రేషితకావ్యో మంత్రార్థం కుహకేన చ | తపో జ్ఞాతం హి యష్మాకం తేన యుధ్యామ ఏవ హి. 35

సజ్జా భవంతు యుద్ధాయ సంనద్ధాః శస్త్రపాణయః | శత్రు శ్ఛిద్రేణ హంతవ్య ఏష ధర్మః సనాతన. 36

తచ్ఛ్రుత్వా వచనం దైత్యా విచార్య చ పరస్పరమ్‌ | పలాయనపరాః సర్వే నిర్గతా భయవిహ్వలా. 37

శరణం దానవా జగ్ము ర్భీతాస్తే కావ్యమాతరమ్‌ | పలాయనపరాఃసర్వే నిర్గతా భయవిహ్వలా. 38

కావ్యమాతాః నభేతవ్యం భయం త్యజత దానవాః | మత్సన్నిధౌ వర్తమానా న్న భీ ర్భవితు మర్హతి. 39

తచ్ఛ్రుత్వా వచనం దైత్యాః స్థితాస్తత్ర గతవ్యథాః | నిరాయుధా హ్యసంభ్రాంతా స్తత్రా%%శ్రమవరే%సురాః 40

దేవా స్తా న్విద్రుతా న్వీక్ష్య దానవాంస్తే పదానుగాః | అభిజగ్ముః ప్రసహ్యైతా నవిచార్య బలాబలమ్‌. 41

తత్రా%%గతాః సురాః సర్వే హంతుం దైత్యాన్సముద్యతాః | వారితాః కావ్యమాత్రా%పి జఘ్నుస్తానాశ్రమస్థితాన్‌. 42

హన్యమానాన్సురై ర్దృష్ట్వా కావ్యమతా'%తివేపితా | ఉవాచ సర్వాన్సనిద్రాం స్తపసా వై కరోమ్యహమ్‌. 43

మఱియు దేవతలాయుధములు దాల్చి దృఢనిశ్చయముతో రణోద్యక్తులై దానవులున్నయెడ కరిగిరి. దేవతలు కవచ కార్ముకములు దాల్చి నలుదెసలనుండి వచ్చి యొక్కుమ్మడి ముట్టడించుటగని దనుజులు భీతిల్లిరి. వారు దిక్కులేకుండిరి. దేవతలు బలగర్వితులై హఠాత్తుగా యుద్ధసన్నద్ధులై తమపై పడుటగని రాక్షసులు చకితులైరి. వారు దేవతలతో నిట్లు నిజము పలికిరి: ఓ యమరులారా! మే మస్త్ర సంన్యాసము చేసితిమిగదా! మాయాచార్యవర్యుడు వ్రతనిష్ఠుడయ్యెను. ఈ సమయము గని పెట్టి మీరు మా మీది కెత్తి వచ్చితిరే? మీరిచ్చిన యభయ మేమయ్యెను? మీ సత్యవాక్యము లేమయ్యెను? వేదవిహిత ధర్మమేడగలిసెను? శస్త్రత్యాగి-భీతుడు-శరణార్థి-వీరు హంతవ్యులు గారని పెద్దలందరుగదా'! అనవిని దేవత లిట్లనిరి : మమ్ము గెల్చుటకై మీరు కృపణత్వముతో శుక్రుని మంత్ర ప్రాప్తికై పంపితిరి. మీ తపమెందులకో మేము తెలిసికొంటిమి! కనుకనే మేము యుద్ధమునకు కలిసికట్టుగ నాయత్తమైతిమి. ఇపుడు మీరును శస్త్రపాణులై యుద్ధసన్నద్ధులు గండు. శత్రువు దుర్బలుడగుటకని వానిని చంపుట సనాతన యుద్ధనీతిగదా! అను వారి వచనము లాలకించి దైత్యులు తమలో తామలోచించుకొని భయవికలులై అచ్చోటు వదలి పారిపోయిరి. వారెల్లరును శుక్రుని తల్లికడ కరిగి శరణు వేడిరి. ఆమె భయకాతరులగు దనుజులనుగని వారి కభయమొసగి ఇట్లు నుడివెను : దనుజులారా! మీరు భయపడకుడు. జంకు వదలుడు. నా సన్నిధానమందు మీరెట్టి భయమును జెందబనిలేదు. ఆమె మాట లాలకించి దనుజులు భ్రమలును వెతలును మాని నిరాయుధులై యా యాశ్రమమందు వాసముండిరి. దేవతలంత బలాబలము లెఱుంగక కాలికి బుద్ధిచెప్పుచున్న దానవుల వెన్నంటిరి. శుక్రుని తల్లి వారి నడ్డగించెను. కాని, దేవత లాశ్రమస్థులగు దానవుల నెక్కడివాని నక్కడ పట్టి పల్లార్ప దొడంగిరి. అట్లు దనుజులు దేవతల చేతిలో మడియుట గని శుక్రుని తల్లి కినుకపూని నా తపోబలమున నేనిపుడే దేవతలను నిద్రపోవునట్లు చేయుదునని పలికెను.

ఇత్యుక్త్వా ప్రేరిత నిద్రా తానగత్యపపాత చ | సేంద్రా నిద్రావశం యాతా దేవా మూకపదాస్థితాః. 44

ఇంద్రం నిద్రాజితం దృష్ట్వా దీనం విష్ణుం రభాషత | మాం త్వం ప్రవిశ భద్రం తేనయే త్వాంచ సురోత్తమ. 45

ఏవ ముక్త స్తతో విష్ణుం ప్రవివేశ పురందరః | నిర్భయో గతనిద్రశ్చ బభూవ హరిరక్షితః. 46

రక్షితం హరిణా దృష్ట్వా శక్రం తత్ర గతవ్యథం | కావ్యమాతా తతః క్రుద్ధా వచనం చేద మబ్రవీత్‌. 47

మఘవం స్త్వాం భక్షయామి సవిష్ణుం వై తపోబలాత్‌ | పశ్యతాం సర్వదేవానా మీదృశం మే తపోబలమ్‌. 48

ఇత్యుక్తౌతు తయా దేవౌ విష్ణ్వింద్రౌ యోగ విద్యయా | అభిభూతౌ మహాత్మానౌ స్తబ్ధౌ తౌ సంబభూవతుః. 49

విస్మితాస్తు తదా దేవా దృష్ట్వా తావతిబాధితౌ | చక్రుః కిలకిలాశబ్దం తతస్తే దీనమానసాః. 50

క్రోశమానా న్సురా న్ద్రష్ట్వా విష్ణుం ప్రాహ శచీపతిః | విశేషేణాభిభూతో%స్మి త్వత్తో%హం మధుసూదన. 51

జహ్యేనాం తరసా విష్ణో! యావన్నోన దహేత్ర్పభో | తపసా దర్పితాం దుష్టాం మా విచారయ మాధవ. 52

ఇత్యుక్తో భగవాన్విష్ణుః శ##క్రేణ ప్రథితేన చ | చక్రం సస్మార తరసా ఘృణాం త్యక్త్వా%థ మాధవః. 53

స్మృతమాత్రం తు సంప్రాప్తం చక్రం విష్ణు వశానుగం | దధార చ కరే క్రుద్ధో వధార్థం శక్రనోదితః. 54

గృహీత్వా తత్కరే చక్రం శిరశ్చిచ్ఛేద రంహసా | హతాం దృష్ట్వా తు తాం శక్రో ముదితశ్చాభవత్తదా. 55

దేవాశ్చాతీవ సంతుష్టా హరిం జయజయేతి చ | తుష్టువు ర్ముదితాః సర్వే సంజాతా విగతజ్వరాః. 56

ఇంద్రావిష్ణూ తు సంజాతౌ తత్‌క్షణా ద్ధృదయవ్యథౌ | స్త్రీవధా చ్ఛంకమానౌ తు భృగోః శాపం దురత్యయమ్‌. 57

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ చతుర్థ స్కంధే ఏకాదశో%ధ్యాయః.

భృగుపతి నిద్రాదేవిని ప్రేరించగా ఆమె వారిని మోహితులనుగ జేసెను. ఇంద్రునితోడి దేవత లెల్లరును నిద్రావశులై మూగవోయి నేలపై బడిరి. అట్లు దీనత్వముతో నిద్రించి యున్న యింద్రునిగని విష్ణువు అతనితో ఓ సురోత్తమా ! నీవు నాలో ప్రవేశింపుము. నీకు మేలగు! అనెను. అది విని యింద్రుడు హరిలో ప్రవేశించెను. అపు డింద్రుడు నిర్నిద్రుడు-నిర్భయుడు-అనిరుద్ధరక్షితుడు నయ్యెను. అట్లు హరి రక్షితుడై యింద్రుడు వెతలు మానియుండుట గని శుక్రుని మాత కోపముతో, ఓ యింద్రా ! నేనిప్పుడే దేవతలందఱు చూచుచుండగ నిన్ను నీ హరిని మ్రింగివేయుదును. నా తపోమహిమ యట్టిది అనెను. అది విని ఇంద్రుడును విష్ణువును మహాయోగవిద్యలో జేరి స్తబ్ధులైయుండిరి. అట్లు హరింద్రులు తిరస్కృతులై పీడితులైయున్నందున దేవతలెల్లరు దీనమానసములతో హాహాకారములు చేసిరి. ఆర్తనాద మొనరించు దేవతలను గాంచి యింద్రుడు హరి కిట్లనెను. ఓ మాధవా! నేను నీకంటెను మిక్కిలి తిరస్కృతుడనైతిని. జనార్దనా! ఈమె తపోగర్వితురాలు-దుష్టురాలు. ఈమె మనలను దహించుటకు ముందే యీమెను నాశ మొందింపుము' అనెను. ఇంద్రుని ప్రార్థనము మన్నించి శ్రీ విష్ణువు స్త్రీవధ విషయమై ఘృణను వదలి తన చక్రమును మది దలంచెను. క్షణమాత్రాన చక్రము హరికి వశమయ్యెను. హరి యింద్ర చోదితుడై మహాకోపమున చక్రము చేతబూని వేగమే యామె తల ఖండించెను. ఆమె నిహతురాలు కాగా ఇంద్రుడు ప్రమోద మందెను. దేవతలును విగతజ్వరులై ప్రమోదభరితులునై హరికి జయజయధ్వనులు చేసిరి. అట్టు లింద్రుడు నుపేంద్రుడును బాధాముక్తులైరి. కాని, స్త్రీవధ దోషమును భృగుమహర్షి శాపమును దలచి వారు శంకాన్వితులైరి.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు శుక్రుడు మంత్రప్రాప్తికి తప మొనర్చుట యను పదుకొండవ అధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters