Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకవింశో%ధ్యాయః

వ్యాసః : సుబాహు రపి తచ్ఛ్రుత్వా యుక్తముక్తంతయాతదా| చింతావిష్టో బభూవాశు కిం కరత్వ్య మితః పరమ్‌. 1

సంగతాః పృథివీపాలాః ససైన్యాః సపరిగ్రహాః| ఉపవిష్టాశ్చ మంచేషు యోద్ధుకామా మహాబలాః. 2

యది బ్రవీహి తాన్సర్వాన్సుతా నాయాతి సాంప్రతమ్‌| తథా%పి కోపసంయుక్తా హన్యుర్మాం దుష్టబుద్ధయః. 3

న మే సైన్యబలం తాదృ ఙ్న దుర్గబల మద్భుతమ్‌| యేనాహం నృపతీ న్సర్వా న్ప్రత్యాదేష్టు మిహోత్సహే. 4

సుదర్శన స్తథైకాకీ హ్యసహాయో%ధనః శిశుః | కిం కర్త్యం నిమగ్నో%హం సర్వథా దుఃఖ సాగరే. 5

ఇతి చింతాపరో రాజా జగామ నృపసన్నిధౌ | ప్రణమ్య తానువాచాథ ప్రశ్రయావనతో నృపః.

6

కిం కర్తవ్యం నృపాః కామం నైతి మే మండపే సుతా| బహుశః ప్రేర్యమాణా%పి సా మాత్రా%పి మయాపిచ. 7

మూర్ధ్నా పతామి పాదేషు రాజ్ఞాం దాసో%స్మి సాంప్రతమ్‌| పూజాదికం గృహీత్వా%ద్య

వ్రజంతు సదనాని వః. 8

దధామి బహురత్నాని వస్త్రాణి చ గజాన్రథాన్‌| గృహీత్వా%ద్య కృపాంకృత్వా వ్రజంతు భవనాన్యుత. 9

న వశే మే సుతా బాలా; మ్రియేత యది ఖేదితా| తదా మే స్యా న్మహద్దుఃఖం తేన, చింతాతురో%స్మ్యహమ్‌. 10

భవంతః కరుణావంతో మహాభాగ్యా మహౌజసః కి మేతయా దుహిత్రా మేమందయా దుర్వినీతయా. 11

అనుగ్రాహ్యో%స్మి వఃకామం దాసో2హ మితి సర్వథా| సుతేవ మంతవ్యా భవద్ధిః సర్వథా మమ. 12

వ్యాసఉవాచ : శ్రుత్వా సుబాహువచనం నోచుః కేచనభూమిపాః| యుధాజిత్క్రోధతామ్రాక్షస్తమువాచ రుషా%న్వితః 13

ఇరువది ఒకటవ అధ్యాయము

సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట

వ్యాసముని తిలకు డిట్లనియె: ఆ విధముగ శశికళ పలుకగ సుబాహు వాలకించి చింతాకులితుడై తన కర్తవ్యమేమని దిగులొందెను. మహాబలశాలురగు భూపాలురు సేనా పరిగ్రహములతో పోరు సలుపవచ్చి యాసనములందు గూర్చుండిరి. ఇట్టి తరుణమున నా కూతురు సభామధ్యమునకు రానని పల్కినచో దుష్టులగు రాజులందఱును కుపితులై నన్ను వధించి తీరుదురు. ఈ రాజుల నందణ నోడింపగల సేనాదుర్గబలము నాకడ లేదు. ఈ సుదర్శనుడు బాలుడు - నిర్ధనుడు - ఏకాకి - నిస్సహాయుడు. ఇక నేనేమి చేయుదును? నేనిపుడు కడు దుఃఖసాగరమున మున్గితిని. ఇట్లు చింతావశుడైన సుబాహుడు రాజుల సన్నిధికేగి సవినయముగ చేతులు జోడించి వారికిట్లనియెను : నృపులారా! నేనిపుడేమి చేయుదును? నా భార్యయు నేను నామెకెంతయో నచ్చచెప్పి చూచితిమి. కాని నా కూతురీ సభామంటపమునకు రాననుచున్నది. నేను మీ పాదాలమీద నా తల యుంతును. నేను మీ దాసుడను. మీరు నేచేయు పూజాదికములు స్వీకరించి మీమీ నెలవులకు జనుడు. మీకు పలువిధములైన తేరులను గజములను వస్త్రములను రత్నరాసులను సమర్పింతును. దయచేసి వానిని స్వీకరించి మీమీ నెలవులకు జనుడు. నా బాలిక నా వశము దాటిపోయినది. ఆమె ఖేదపెట్టబడినయెడల మరణించినచో నాకుగొప్ప దుఃఖము కలుగునని చింతాక్రాంతుడనైనాను. మీరలు మహా తేజోవంతులు. దయామయులు. భాగ్యవంతులు. దుర్వినీతయు మందమతియునగు నా కూతుతో మీకేమి ప్రయోజనము? నే నెల్లభంగుల మీ దాసుడను. నన్ననుగ్రహింపుడు. నా కూతును మీ కూతుగ బావింపుడు అను సుబాహుని దీనవాక్కులు విని యెవ్వరేమియు బలుకక మిన్నకుండిరి. అపుడు యుధాజిత్తు క్రోధతామ్రాక్షుడై యిట్లనెను:

రాజ న్మూర్ఖో%సికింబ్రూషే కృత్వా కార్యం సునిందితమ్‌| స్వయంవరః కథంమోహాద్రచితః సంశ##యే సతి. 14

మిళితా భూభుజ స్సర్వే త్వయా%%హూతాః స్వయంవరే| కథమద్య నృపా గంతుం యోగ్యాస్తే స్వగృహాన్ప్రతి. 15

అవమాన్య నృపాన్సర్వాం స్త్వం కిం సుదర్శనాయ వై| దాతు మిచ్ఛసి పుత్రీంచ కిమనార్య మతఃపరమ్‌. 16

విచార్య పురుషేణాదౌ కార్యం వై శుభమిచ్ఛతా | ఆరబ్ధవ్యం త్వయా తత్తు కృతం రాజన్నజానతా. 17

ఏతా న్విహాయ నృపతీ న్బలవాహన సంయుతాన్‌ | వరం సుదర్శనం కర్తు ంకథమిచ్ఛసి సాంప్రతమ్‌? 18

అహం త్వా హన్మి పాపిష్ఠం తధా పశ్చాత్సుదర్శనమ్‌ | దౌహిత్రాయాద్య మే కన్యాం దాస్యామీతి వినిశ్చయః. 19

మయి తిష్ఠతి కో%న్యో%స్తి యః కన్యాం హర్తు మిచ్ఛతి | సుదర్శనః కియానద్య నిర్ధనో నిర్బలః శిశుః. 20

భారద్వాజాశ్రమే పూర్వం ముక్తో మునికృతే మయా | నాద్యాహం మోచయిష్యామి సర్వథా జీవితం శిశోః. 21

తస్మా ద్విచార్య సమ్యక్త్వం పుత్ర్యాచ భార్యయా సహ| ద్రౌహిత్రాయ ప్రియాంకన్యాం దేహి మే సుభ్రువంకిల. 22

సంబంధీ భవ దత్త్వా త్వం పుత్రీమేతాం మనోరమామ్‌| ఉచ్చాశ్రయః ప్రకర్తవ్యః సర్వదా శుభమిచ్ఛతా. 23

సుదర్శనాయ దత్త్వా త్వం పుత్రీం ప్రాణప్రియాం శుభామ్‌ | ఏకాకినే%ప్యరాజ్యాయ కిం సుఖం ప్రాప్తుమిచ్ఛసి? 24

పీకులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సుహృజ్జనమ్‌ | దృష్ట్వా కన్యా ప్రదాతవ్యా నాన్యథా సుఖమృచ్ఛతి.''

పరిచింతయ ధర్మం త్వం రాజ్యనీతించ శాశ్వతీమ్‌ | కురు కార్యం యథాయోగ్యం మా కృథా మతిమన్యథా. 25

సుహృదసి మమాత్యర్థం హితం తే ప్రబ్రవీమ్యహమ్‌ | సమానయ సుతాం రాజ న్మండపే తాం సఖీవృతామ్‌. 26

సుదర్శనమృతే చేయం పరిష్యతి యదా%ప్యసౌ | విగ్రహో మే తదా న స్యా ద్వినాహో%స్తుతవేప్సితః. 27

అన్యే నృపతయః సర్వే కులీనాః సబలాః సమాః | విరోధః కీదృశ స్త్వేనం వృణోద్యది నృపోత్తమ. 28

అన్యథా%మం హరిష్యే%ద్య బలాత్కన్యా మిమాంశుభామ్‌ | మా విరోధం సుదుస్సాధ్యం గచ్ఛ పార్థివసత్తమ.

ఓ రాజ! నీ వెంతటి మూర్ఖుడవు? ఎంత నింద్య మొనరించితివి? నీకు సందిగ్ధముగనున్న విషయమున మోహము కొలది ఇంత గొప్పగ స్వయంవరము నెందులకు చాటించితివి ? నీవు ఇందఱు రాజుల నాహ్వానించితివి. ఇపుడు వారిని వారివారి యిండ్ల కేగుమనిన వారూళ్లకెట్లేగ గలరు? ఇందఱ రాజులను తృణీకరించి సుదర్శనునకే కన్య నీయదలంచితివి. ఇంతకంటె ననార్య కృత్య మింకేమి యుండును? మేలు గొరు నరుడు మొదటనే చక్కగా విచారించి చేయదలచిన కార్యము నారంభింపవలయును. నీ వెఱుగ కిట్లొనర్చితివేల? నీ విపుడు బలవాహనోపేతులగు నిందఱ రాజులను త్రోసిరాజని సుదర్శను నెట్లు వరునిగ గోరుదువు? ఇపుడు మొట్టమొదట పాపిష్ఠుడవగు నిన్ను హతమూర్తును. పిమ్మట సుదర్శనుని తుద ముట్టింతును. ఆ పిదప నామనుమనికి నీ కన్య నిత్తును. ఇది నా నిశ్చయము. నేనుండగ కన్నియను హరింపగల మగధీరుడెవ్వడు? ఆ సుదర్శనుడు నిర్ధనుడు - బాలుడు. నా ముందడాతడెంత? ఆ నాడు భారద్వాజాశ్రమమున ముని వాక్కులచే నా నుండి యతుడు బ్రతికి బయటపడెను. ఇపుడు మాత్రమతని నెల్లవిధముల బ్రతుక నీయను. కనుక నీవిపుడు వెళ్ళి నీ భార్యతో కూతుతో చక్కగ నాలోచించుకుని వరానన యగు నీ గాదిలి కూతును నా మనుమనికిమ్ము. మనోరమ యగు ఈ నీ పుత్రికను మాకిచ్చి మా వియ్యంకుడవుకమ్ము! శ్రేయము గోరువాడెల్లవేళల మాహదాశ్రయము నాచరింప వలయును జుమా! ప్రాణప్రియ యగు నీ గారాబు పట్టిని రాజ్యములేక దిక్కుమ్రొక్కు లేనివానికిచ్చి యేమి సుఖము బడయగోరుదువు? కన్యను కులబల రూపములు మిత్ర రాజ్యవిత్త దుర్గములు గల వానిని జూచి యీయవలయును. కానిచో కన్య సుఃంపజాలదు. నీవు శాశ్వత ధర్మమును రాజనీతిని బాగుగ పరిశీలించి తగిన కార్య మొనరిపుము. ఊరక బుద్ధిని చెడగొట్టుకొనకుము. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవు. కాన నింతగ హితము చెప్పుచున్నాను. నీవు వెంటనే చెలులతో గూడిన నీ కూతు నీ సభామంటపమునకు రప్పింపుము. ఆమె సుదర్శను దక్కఇతరు నెవ్వరినైన వరించవచ్చును. నాకది సమ్మతమే. అపుడు నీ కోర్కిమేరకు పెండ్లి జరుగును. ఇతర రాజులెల్లరు కులీనులు; బలవంతులు; సములు. వారిలో నెవరి నే నొక్కని వరించిన నింక విరోధ మెక్కడిది? అట్లు కానిచో పగబూనుట మంచిదిగాదు. వెళ్ళి కార్యము చక్కబెట్టుము.

వ్యాసఉవాచ : యుధాజితా సమాదిష్టః సుబాహుః శోకసంయుతః | నిశ్శ్వసన్‌ భవనం గత్వా భార్యాం ప్రాహ శుచావృతః. 30

పుత్రీం బ్రూహి సుధర్మజ్ఞే ! కలహే సముపస్థితే | కిం కర్తవ్యం మయా శక్యం త్వద్వశ్బోస్మి సులోచనే ! 31

వ్యాసఉవాచ : సా శ్రుత్వా పతివాక్యం తు గత్వా ప్రాహ సుతాంతికమ్‌ ! వత్సే ! రాజా%తి దుఃఖార్తః పితా తే%ద్యాపి వర్తతే. 32

త్యదర్థే విగ్రహః కామం సముత్పన్నో2ద్య భూభృతామ్‌ | అన్యం వరయ సుశ్రోణి సుదర్శనమృతే నృపమ్‌. 33

యది సుదర్శనం వత్సే ! హఠాత్త్వం వై వరిష్యసి | యుధాజిత్త్వాంచ మాం చైవ హనిష్యతి బలాన్వితః. 34

సుదర్శనం చ రాజ్బాసౌ బలమత్తః ప్రతాపవాన్‌ | ద్వితీయ స్తే పతిః పశ్చాద్భవితా కలహే సతి. 35

తస్మా త్సుదర్శనం త్యక్త్యా వరయాన్యం నృపోత్తమమ్‌ | సుఖ మిచ్ఛసి చే న్మహ్యం తుభ్యం వా మృగలోచనే! 36

ఉభయో ర్వచనం శ్రుత్వా నిర్భయోవాచ కన్యకా |

సత్య ముక్తం నృపశ్రేష్ఠ | జానాసి చ వ్రతంమమ. 37

నాన్యం వృణోమి భూపాలం సుదర్శనమృతే క్వచిత్‌ | బిభేషి యది రాజేంద్ర నృపేభ్యః కిలకాతరః. 38

సుదర్శనాయ దత్త్వా మాం విసర్జయ పురాద్బహిః | స మాం రథే సమారోవ్య నిర్గమిష్యతి తే పురాత్‌. 39

భవితవ్యం తు పశ్చాద్వై భవిష్యతి నచాన్యథా | నాత్ర చింతా త్వయా కార్యా భవితవ్యే నృపోత్తమ ! 40

యద్భావి తద్భవత్యేవ సర్వథా%త్ర న సంశయః |

ఇట్లు యుధాజిత్తాదేశింపగ సుబాహువు శోకసంతప్తుడై నిట్టూర్చుచు తన భార్యతో - ఇపుడు మనకు ఘోరవిపత్తు సంభవించెనని మన కూతుతో జెప్పుము. నేనిపుడు నీకు వశుడను. నాకు కర్తవ్యము తోచుటలేదు అనెను. రాణి తన పతిమాట లాలించి కూతుచెంత కేగి యిట్లనియెను : పుత్త్రీ ! నీ మూలమున నీ తండ్రి దుఃఖాలపాలయి యున్నాడు. నీ నిమిత్తముగ రాజుల మధ్య పోరాటము సంఘటిల్లనున్నది. కాన సుదర్శనుని దక్క మఱియొక్కని వరింపుము. ఒకవేళ నీవు నీ మొండిపట్టుదలతో సుదర్శనునే వరించినచో యుధాజిత్తు తన బలము నుపయోగించి మనలనందఱ నూచకోతగ కోసివేయును. ఆ యుధాజిత్తు బలమత్తుడు-ప్రతాపి. అతడు సుదర్శనుని కూడ చంపును. అపుడైన నీకు వేరొకపతి కావలసివచ్చును. కనుక నీవు నామేలు గోరుదువేని ఆ సుదర్శనుని దక్కొరుని నృపతి కుమారుని వరింపుము అని తల్లి బోధించుచున్నంతలో సుబాహువేతెంచి తానునట్లే ఆమెకు నచ్చచెప్పెను. ఆ తల్లిదండ్రుల మాటలాలకించి శశికళ యిట్లనియెను. పీసరేశ్వర! నీవు పలికిన దంతయు నిజమే కాని నా వ్రతము గూడ నీకు దెలియనది కాదుకదా? నీవు రాజుల వలన భయపడినప్పటికిని నేను మాత్ర మెట్టి పరిస్థితిలోను సుదర్శనుని గాక యితరుని వరింపజాలను. కనుక నీవు నన్ను సుదర్శనునకు ధారపోసి మమ్ము పురము వెడల సాగనంపుము. అతడు నన్ను రథమెక్కించుకొని స్వేచ్ఛగ పయనించగలడు. అనంతర మేది కానున్నదో యది జరిగి తీరును. భవితవ్యమును గూర్చి యింతగ జింతింపవలదు. కానున్నది కాకమానదు. ఇందు సందియ మెందులకు?''

రాజోవాచ : న పుత్త్రి ! సాహసం కార్యం మతిమద్భిః కదాచన. 41

బహుభిర్న విరోద్ధవ్య' మితి వేదవిదోవిదుః | విస్రక్ష్యామి కథం కన్యాం దత్వా రాజసుతాయచ. 42

రాజానో వైరసంయుక్తాః కిం న రసాంప్రతమ్‌ | యది తే రోచతే వత్సే ! పణం సంవిదధామ్యహమ్‌. 43

జనకేన యథా పూర్వం కృతః సీతాస్వయంవరే | శైవం ధనుర్యథా తేన ధృతం కృత్వాపణం తథా. 44

తధా%హ మపి తన్వంగి ! కరోమ్యద్య దురాసదమ్‌ | వివాదో యేన రాజ్ఞాం వై కృతే సతి శమం వ్రజేత్‌. 45

పాలయిష్యతి యః కామం సతే భర్తా భవిష్యతి | సుదర్శన స్తథా%న్యో వా యః కశ్చిద్బలవత్తరః. 46

పాలయిత్వా పణం త్వాం వై వరయిష్యతి సర్వథా| ఏవం కృతే నృపాణాం తు వివాదః శమితో భ##వేత్‌. 47

సుఖేనాహం వివాహం తే కరిష్యామి తతఃపరమ్‌ |

రాజిట్లనియెను. ఓ పుత్రీ! మతిమంతులెప్పుడైన నతిసాహసముగ ప్రవర్తింపరు. పెక్కుమందితో వైరము తగదని వేదవిదులు వచింతురు. ఆ రాచకొమరునకు నిన్నిచ్చి యెట్లు సాగనంపగలను ? వైరభావముగల రాజులేదైన మూర్ఖించి చేయగలరు. కనుక నీకిష్టమైన నేదైన పణమేర్పరతును. తొల్లి జనకుడు సీతాస్వయంవరమునకు శివధనుర్భంగమును పణముగ నుంచలేదా ! ఇపుడు నేను నేదైన కఠినమగు పణమేర్పరతును. దానివలన రాజుల వివాదమణగి శాంతి యేర్పడును. ఒడ్డిన పణము నెవడు గెల్చునో యతడు నీ పతి కాగలడు. అతడు సుదర్శనుడు గావచ్చు ; లేక మరొక్క బలశాలి కావచ్చును ఆ పణములో గెలుపొందినవాడు నిన్ను తప్పక వరించి తీరును. అట్లు జరిగినపుడు రాజుల వివాదమును శాంతించును. ఆ పిమ్మట నీ వివాహము చక్కగ సుఖపూర్వకముగ నొనర్పగలను.

కన్యోవాచ : సందేహే నైవ మజ్జామి మూర్ఖకృత్య మిదం యతః. 48

మయా సుదర్శనః పూర్వం ధృత శ్చేతసి నాన్యథా | కారణం పుణ్యపాపానాం మన ఏవ మహీపతే. ! 49

నసా విధృతం త్యక్త్వా కథ మన్యం వృణ పితః | కృతే పణ మహారాజ! సర్వేషాం వశగా మ్యహమ్‌. 50

ఏకః పాలయితా ద్వౌ వా బహవోవా భవంతిచేత్‌ | కిం కర్తవ్యం తదా తాత ! వివాదే సముపస్థితే. 51

సంశయాధిష్ఠితే కార్యే మతిం నాహం కరోమ్యతః | మా చింతాం కురు రాజేంద్ర ! దేహి సుదర్శనాయమామ్‌. 52

వివాహం విధినా కృత్యా శం విధాస్యతి చండికా | యన్నామకీర్తనాదేవ దుఃఖౌఘో విలయం వ్రజేత్‌. 53

తాం స్మృత్వా పరమాం శక్తిం కురు కార్యమతంద్రిత! | గత్వా వద నృపేభ్యస్త్వం కృతాంజలిపుట్బోద్యవై. 54

ఆగంతవ్యం చ శ్వః సర్వైరిహ భూపైః స్వయంవరే | ఇత్యుక్త్యా త్వం విసృజాశు సర్వం నృపతిమండలమ్‌. 55

వివాహం కురు రాత్రౌ మే వేదోక్త విధినా నృప| పారిబర్హం యథాయోగ్యం దత్త్వా తసై#్మ విసర్జయ. 56

గమిష్యతి గృహీత్వా మాం ధ్రువసంధిసుతః కిల | కదాచిత్తే నృపాః క్రుద్ధాః సంగ్రామం కర్తు ముద్యతాః. 57

భవిష్యంతి తదా దేవీ సాహాయ్యం నః కరిష్యతి | సో%పి రాజసుతై సై#్త స్తు సంగ్రామం సంవిధాస్యతి. 58

దైవా న్మృధే మృతే తస్మి న్మరిష్యాహమప్యుత | స్వస్తి తే%స్తు గృహే తిష్ఠ దత్త్వా మాం సహసైన్యకః. 59

ఏకైవాహం గమిష్యామి తేన సార్ఠం రిరంసయా| ఇతి తస్యా వచః శ్రుత్వా రాజా%సౌ కృతనిశ్చయః. 60

మతిం చక్రే తథా కర్తుం విశ్వాసం ప్రతిపద్య చ | ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే ఏక వింశోధ్యాః

కన్య యిట్లనెను : నేను సందేహములో బడ దలంపను. నీవన్నట్లు చేయుట మూర్ఖులపని. నా యంతరంగములో మొట్టమొదట సుదర్శనుని సురూపమును నిశ్చలమతితో నొల్పుకొంటిని. పుణ్యపాపములకు కారణము మనసేకదా! నా యణువణువున మూర్తీభవించి యున్న వానిని వదలి మరొకరినెట్లు వరింపగలను? పణమేర్పరచినచో నేనందఱకును వశవర్తిని గావలసి వచ్చును. ఒకవేళ మన యొడ్డిన పణము నిద్దరు లేక పెక్కురు గెలిచినచో నప్పుడైన వివాదము తలయెత్తునుగద ! అపుడు మన కర్తవ్యమేమి? నా బుద్ధి సంశయాస్పదమైన పనిలో జిక్కుకొనదు. కాన రాజా ! చింతవదలి నన్ను సుదర్శనునకు ధారపోయుము. నీవు మా వివాహమును విధిగ జరిపింపుము. ఏ దేవదేవి మధుర దివ్యనామ సంకీర్తనమున సకల దుఃఖరాసులు నశించిపోవునో యా చండిక మనకు మేలు చేకూర్చును. ఆమెదీవెన మాకు తోడు. ఆ క్రియాశక్తిని నెమ్మదిలో గట్టిగ నమ్మి యప్రమత్తతతో కార్యమునకు బూనుకొనుము. నీవారాజులకు నమస్కరించి యంతయు నిట్లు దెలుపుము : ఱపు రాజులెల్లరు స్వయంవరమునకు రావలయును అని యాదేశించి వారిని వీడ్కొలుపుము. ఈ రాత్రియే వేదోక్తవిధిగ వివాహము జరిపించి యథాశక్తి కానుకలొసంగి సుదర్శనుని వీడుకొలుపుము. ఆ ధ్రువసంధి సుతుడు నన్నుగైకొని యేగునంతలో నొకవేళ రాజులు రోషాతిరేకమున రణముసలుప నిశ్చయించి వత్తురు. ఐనను ఆ చండికాభగవతి మాకు తోడునీడగ నిలిచి కరుణజూపి సాయమొనర్పగలదు. అపుడు సుదర్శనుడు వైరిరాజసుతులతో యుద్ధ మొనరింపగలడు. దైవ దుర్విపాకమున నతడు మరణించినచో నతడితోడ నేనేను చత్తును. కనుక నన్నతనికొసంగి సేనలతో నిశ్చింతగ నుండుము. అతనితోడ నేనొక్కతేనే క్రీడింపగోరి యేగగలను అను తన కూతు మాటలు విని రాజామెకు వివాహమొనరింప దలంచెను.

ఇది శ్రీదేవి భాగవతమందలి తృతీయస్కంధమం దిరువదియొకటవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters