Sri Devi Bhagavatam-1    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

సూతః : ఏవం సత్యవతీ తేన వృతా శంతనునా కిల | ద్వౌ పుత్రౌ చ తయా జాతౌ మృతౌ కాలవశా దపి. 1

వ్యాసవీర్యాత్తు సంజాతో ధృతరాష్ట్రో%0ధ ఏవ చ | మునిం దృష్ట్వాథ కామిన్యా నేత్రసమ్మీలనే కృతే. 2

శ్వేతరూపా యతో జాతా దృష్ట్వా వ్యాసం నృపాత్మజా | వ్యాసకోపా త్సముత్పన్నః పాండు స్తేన నసంశయః. 3

సంతోషిత స్తయా వ్యాసో దాస్యా కామకళావిదా | విదురస్తు సముత్పన్నో ధర్మాంశః సత్యవా క్ఛుచిః. 4

రాజ్యే సంస్థాపితః పాండుః కనీయానపి మంత్రిభిః | అంధత్వా ద్ధృతారష్ట్రో% సౌ నాధికారే నియోజితః. 5

భీష్మస్యానుమతే రాజ్యం ప్రాప్తః పాండు ర్మహాబలః | విదురో%ప్యథ మేధావీ మంత్రకార్యేనియోజితః. 6

ధృతరాష్ట్రస్య ద్వే భార్యే గాంధీరీ సౌబలీ స్మృతా | ద్వితీయా చ తథా వైశ్యా గార్హస్థ్యేషు ప్రతిష్ఠితా. 7

పాండోరపి తథా పత్న్యౌ ద్వే ప్రొక్తే వేదవాదిభిః | శౌరసేనీ తథా కుంతీ మాద్రీ చ మద్రదేశజా. 8

గాంధారీ సుషువే పుత్రశతం పరమశోభనమ్‌ | వైశ్యా%ప్యేకం సుతం కాంతం యుయుత్సుం సుషువే ప్రియమ్‌. 9

కుంతీ తు ప్రథమం కన్యా సూర్యా త్కర్ణం మనోహరమ్‌ | సుషువే పితృగేహ స్థా పశ్చా త్పాండుపరిగ్రహః. 10

ఆరవ అధ్యాయము

పాండవుల జన్మవృత్తాంతము

సూతుడిట్లనెను : ఆ ప్రకారముగా శంతనుడు సత్యవతిని పెండ్లి యాడెను. వారి కిరువురు కొమరులు గలిగి కాలవశులై మరణించిరి. ఆ వ్యాసమునితోడ కూడకకేగిన యంబిక మునిమూర్తుని చూడనోపక కన్నులు మూసికొనెను. ఫలితముగ ధృతరాష్ట్రుడు పుట్టుచీకుగ బుట్టెను. మరొకరాచకన్నె మునినిగాంచగానే యామె మొగము వెలవెలబోయెను. అందుచే వ్యాసుని కోపమున నామెకు పాండువర్ణము గలవా డుద్భంచెను. మూడవసారి కామకళావిదురాలగు దాసి వ్యాసుని సంతృప్తిని జేసెను. ఆ కారణమున ధర్మంశమున నామెకు సత్యవాది శుచియగు విదురుడు జన్మించెను. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడగుటవలన మంత్రు లతని కధికార మీయక చిన్నవాడైననను పాండుని రాజుగ నియోగుంచిరి. ఇట్లు బలశాలియగు పాండురాజు భీష్మ ననుమతిచే రాజయ్యెను. మేధావియగు విదురు డతనికి మంత్రిగ నియమింపడెను. ధృతరాష్ట్రునకు నిర్వురు భార్యలు గలరు. మొదటి యామె సుబలుని పుత్రియగు గాంధరి. రెండవ భార్య యింటిపనులు చక్కబెట్టుచుండు వైశ్య. అటులే పాండురాజునకు శూరసేనుని కూతురగు కుంతి, మద్రదేశపు రాజు కూతురు మాద్రియను భార్యలు గలరు. గాంధరి నూర్గురు కొడుకులను గనెను. వైశ్య యుయుత్సుడను నొక ప్రియ సుతుని గనెను. కుంతి తన తండ్రి

యింట నుండగ కన్నెప్రాయమునందె సూర్యునివలన కర్ణుని గనెను. తరువాత నామె పాండురాజునకు భార్య యయ్యెను.

ఋషయః : కిమేత తూత్స చిత్రం భాషసే మునిసత్తమ | జనితశ్చ సుతఃపూర్వంపాండునా సా వివాహితా. 11

సూర్య త్కర్ణః కథం జాతః కన్యాయాం వద విస్తరాత్‌ | కన్యా కథం పున ర్జాతా పాండునా సా వివాహితా. 12

సూతః :శూరసేనసుతా కుంతీ బాలభావే యదా ద్విజాః | కుంతిభోజేన రాజా తు ప్రార్థితా

కన్యకా శుభా. 13

కుంతిభోజేన సా బాలా పుత్రీ తు పరికల్పితా | సేవనార్థం తు దీప్తస్య విహితా చారుహాసినీ. 14

దుర్వాసాస్తు మునిః ప్రాప్త శ్చాతుర్మాస్యే స్థితో ద్విజః | పరిచర్యా కృతా కుంత్యా ముని స్తోషం జగామ హ . 15

దదౌ మంత్రం శుభం తసై#్య యేనాహూతః సురః స్వయమ్‌ | సమాయాతి

తథా కామం పూరయిష్యతి వాంఛితమ్‌. 16

గతే మునౌ తతః కుంతీ నిశ్చయార్ధం గృహే స్థితా | చింతయామాస మనసా

కం సురం సమచింతయే. 17

ఉదితశ్చతదా భాను స్తయాదృష్టో దివాకరః | మంత్రోచ్చారం తథా కృత్వా చాహూత స్తిగ్మగు స్తదా. 18

మండలా న్మానుషం రూపం కృత్వా సర్వాతపేశలమ్‌ | అవాతర త్తదా%%కాశా త్సమీపే

తత్రమందిరే. 19

దృష్ట్వా దేవం సమాయాంతం కుంతీ భానుం సువిస్మితా | వేపమానా రజోదోషం ప్రాప్తా సద్యస్తు భామినీ. 20

కృతాంజలిః స్తితా సూర్యం బభాషే చారులోచనా | సుప్రీతా దర్శనేనాద్యగచ్ఛ

త్వం నిజమండలమ్‌. 21

సూర్యః ఆహూతో% స్మి రథంకుంతి:త్వయా మంత్రబలేనవై | నమాంభజసికస్మాత్త్వ

ంసమాహూయపురోగతమ్‌. 22

కామార్తో%స్మ్యసితాపాంగి భజ మాం భావసంయుతమ్‌ | మంత్రేణాధీనతాం ప్రాప్తం క్రీడితుం నయ మామితి . 23

కుంతీ:న్యాస్మ్యహంతుధర్మజ్ఞ|సర్వసాక్షిన్నమామ్యహమ్‌|తవాప్యహంనదుర్వాచ్యాకులకన్యా% స్మిసువ్రత. 24

సూర్యః:లజ్జామేహతీచాద్యయదిగచ్ఛామ్యహంవృథా|వాచ్యతాం సర్వదేవానాంయాస్యామ్యత్రనసంశయః. 25

శప్స్యామితంద్విజంచాద్యయేనమంత్రఃసమర్పితః | తాంచాపి సుభృశం కుంతి నో చే న్మాం త్వం భజిష్యసి. 26

కన్యాధర్మః స్థిర స్తే స్యా న్న జ్ఞాస్యంతి జనాః కిల| మత్సమస్తు తథా పుత్రో భనితా తే వరాననే. 27

ఇత్యుక్త్వా తరణిః కుంతీం తన్మనస్కాం సులజ్జితామ్‌ | భుక్త్వా జగామ దేవేశో

వరం దత్వా% తివాంఛితమ్‌. 28

ఋషులిట్లనిరి: సూతమునీ| మొదట కుంతికి కొడుకు పుట్టెనంటివి. తరువాత పాండురా జామెను పరిగ్రహించెనంటివి. నీవంతయు వింతగ బలుకుచున్నావు. సూర్యునివలన కన్యకకు కర్ణుడెట్లు గలిగెను? ఆమెకు మరల పాండురాజుతో నెట్లువివాహమైనది? సూతుడిట్లనెను: శూర సేనుని కుంతి. ఆమెకు చిన్నప్పుడే కుంతిభోజుడను రాజు శూరసేనుని ప్రార్థించి తన కూతురుగ స్వీకరించెను. అట్లు కుంతిభోజు డామెను పుత్త్రిగ స్వీకరించి యామె నగ్నికార్యములందు సేవకు నియోగించెను. అంతనొకనాడు దుర్వాసోమహర్షి యామె పుట్టినింటికి చాతుర్మాస్యదీక్ష జరుపదలచి యేతెంచెను. అపుడు కుంతి యా మునీశ్వరునకు పరిచర్యలు చేయుచుండి నతనిని సంతుష్టునిగ జేసెను. అందుకు ముని యలరి యామె కొక దివ్య మంత్ర ముపదేశించెను. ఆమంత్రప్రభావమున దేవతలే వచ్చి వాంఛితార్థములు లీడెర్చగలరు. ముని వెళ్ళిన పిదప కుంతి మంత్రప్రభావ మెఱుగదలచి యే దేవత నాహ్వానింపవలయునాయని యాలోచించెను. అంతలో అపుడే ఉదయించిన దివాకరుడగు సూర్యుని చూచి యామె మంత్ర ముచ్చరించి రవి నాహ్వానించెను. అపు డాదిత్యుడాకాశమండలమందుండి దివ్యసుందరమైన మానావాకారమున నామె మందిరమం దామె సమీపమున నవతరించెను. అట్లు సూర్యునిగని కుంతి కడు విస్మయమందెను. భయమున కంపించెను. మరుక్షణమే పుష్పవతి యయ్యెను. ఆ చారులోచన కేల్మొగిచి నిలచి రవి కిట్లనియెను: మీ దర్శనభాగ్యమున నేనిపుడు సంతసిల్లితిని.ఇంక మీరు మీ నిజమండలమున కేగుడు. సూర్యుడిట్లనియె: కుంతీ| మంత్రబలమున నన్ను నీవు పిలిచితివి. పిలుపుపై వచ్చి నీముందు నిలచిన నన్ను నీవేల పొందకున్నావు? నల్లని కడ కన్నులు గల కుంతీ| నేను కామార్తుడను. నీయం దనురాగభావము కలవాడను.మంత్రాధీనుడనై వచ్చితిని. నీతో విహారించుటకై కొనిపొమ్ము. కుంతి నిట్లనియెను: ధర్మజ్ఞా| సర్వసాక్షీ| సువత్రా| నీకు నమస్కారము. నేను కన్నియను. కులకన్యనగు నన్నునీవిట్లు పరుషాలు పలపకరాదు. సూర్యుడిట్లనియెను: నేనిపుడు రిత్తగ వెళ్ళినచో దేవతలందరు నన్ను నిందసేతురు. పరిహసింతురు. నాకు వారిలో దలవంపులగును. ఇది నిజము. నన్ను నీవిపుడు కలియకున్నచో నిపుడే నిన్ను, నీకు మంత్రమొసంగినవిప్రుని శపింతును. వరాననా| జనులు ఇది గుర్తింపకుండునట్లును నీ కన్యాత్వము చెడకుండునట్లు చేయుదును. నావంటి కొడుకును నీకు కలుగును. అని పలికి రవి తనయందు భావముకలదై లజ్జతో కూడియున్న ఆ కుంతి ననుభవించి ఆమెకు వాంఛితమగు వరమునిచ్చి వెడలెను.

గర్భం దధార సుశ్రోణీ సుగుప్తే మందిరే స్థితా | ధాత్రీ వేద ప్రియా చైకా న మాతాన న జన స్తథా. 29

గుప్తః సద్మని పుత్రస్తు జాత శ్చాతి మనోహరః | కవచేనాతిరమ్యేణ కుండలాభ్యాం సమన్వితః. 30

ద్వితీయయివ సూర్యస్తు కుమారివ చాపరః | కరే కృత్వా%థ ధాత్రేయా తామువాచ సులజ్జితామ్‌. 31

కాంచింతాంకరభోరుత్వమాధత్సే%ద్యస్థితా%స్మ్యహమ్‌|మంజూషాయాంసుతంకుతీముంచంతీవాక్యమబ్రవీత్‌. 32

కింకరోమిసుతార్తా%హంత్యజేత్వాంప్రాణవల్లభమ్‌ | మందభాగ్య త్యజామి త్వాం సర్వలక్షణసంయుతమ్‌. 33

పాతు త్వాం సుగుణా%గుణా భగవతీ సర్వేశ్వరీచాంబికా | స్తనం సైవ దదాతు విశ్వజననీకాత్యయనీకామాదా. 34

ద్రక్ష్యే%హంముఖపంకజంసులలితంప్రాణప్రియాహంకదా|త్యక్త్వాత్వాంవిజనేవనేరవిసుతందుష్టాయథాసై#్వరిణీ. 35

సూతః : ఇత్యుక్త్వాతం సుతం కుంతీమంజూషాయాంధృతంకిల | ధాత్రీహస్తే దదౌ భీతా జనదర్శనత స్తథా. 36

స్నాత్వా త్రస్తా తదా కుంతీ పితృవేశ్మ న్యువాస సా| మంజూషా వహమానా చ

ప్రాప్తా హ్యధిరథేన వై. 37

రాధా సూతస్య భార్యా వై తయా%సౌ ప్రార్థితా సుతః :కర్ణో%భూ ద్బల వాన్వీరః పాలితః సూతపద్మని. 38

సుశ్రోణియగు కుంతి గర్భము ధరించి రహస్య మందిరమందే యుండెను. ఈ జరిగిన కార్యమామె దాదికి తప్పనామెతల్లికిగాని లోకులకుగాని మరెవ్వరకిని తెలియదు. తన రహస్యమందిరమున అతి మనోహరుడును అతిరమ్యములగు కవచకుండలములతో కూడినవాడునగు కుమారుడామెకు గలిగెను. రెండవ సూర్యుని, అపర కుమారస్వామివలె నా శిశువుండెను. ఆ బాలుని దాది యెత్తుకొని సిగ్గులో మునిగిన కుంతితో నిట్లనియెను: నీవేల యిపుడు చింతించుచున్నావు? నేనున్నానుకదా| కుంతి తన కుమారునొక పెట్టెలో

నుంచుచు నాతనితో నిట్లనెను: ఓసుతా! ఆర్తనగు నేను నా ప్రాణసముడవగు నిన్ను విడనాడుచున్నాను. ఏమి చేయగలను? ఆ సుగుణనిర్గుణ స్వరూప సర్వేశ్వరి భగవతి నిన్ను కాపాడుగాక! కోరికలదీర్చు ఆ విశ్వమాత నిను పాలించుగావుత! నేను దుష్టురాలగు సై#్వరణివలె లోకలోచనుని తనయుడవగు నిన్నొంటిగ వదలుచున్నాను. ప్రాణసముడవగు కుమారా! నీ లలిత ముఖకమలము మరల నెపుడు గాంతునో కదా! వెనుకటి జన్మములందు నేను త్రిలోకమాత నారాధింపలేదేమోకదా! ఓ నందనా! అదృష్టహీనురాలను నేను నిన్ను వనములందు వదలుచున్నాను. నా పాపబుద్ధికి నేనే పరిపరి విధాల పరితపించుచున్నాను ఈ రీతిగ కుంతి పలికి జనదర్శనభయమున తన పట్టిని పెట్టెలో భద్రముగ నుంచి దాదిచేతులో పెట్టెను. ఆ పిదప భయపడుచు స్నానముచేసి కుంతి తన తండ్రి యింట నుండెను. ఆ పెట్టె నదిలో కొట్టుకొని పోయిపోయి యధిరథుడనువానికిదొరకెను. ఆ యధిరథుడొక సూతుడు. అతని భార్య రాధ. ఆమె బాలుని గ్రహించి పెంచెను. ఆ వీరుడు బలశాలి యగు బాలుడే సూతునింట కర్ణుడను పేర విఖ్యాతి గాంచెను.

కుంతీ వివాహితా కన్యాపాండునా సా స్వయంవరే | మాద్రీ చైవావరా భార్యామద్రరాజసుతా శుభా. 39

మృగయాం రమమాణస్తు వనే పాండు ర్మహాబలః| జఘూన మృగబుద్ధ్యాతు రమమాణం మునిం వనే. 40

శ ప్త స్తేన తదా పాండు ర్మునినా కుపితేన చ | స్త్రీసంగం యది కర్తాసి తదా తే

మరణం ధ్రువమ్‌. 41

ఇతి శప్తస్తు మునినా పాండుః శోకసమన్వితః| త్యక్త్వాంరాజ్యం వనే వాసం చకార భృశదుఃఃతః. 42

కుంతీ మాద్రీచ భార్యే ద్వే జగ్మతుః సహ సంగతే| సేవనార్థం సతీ ధర్మం సంశ్రితే మునిసత్తమాః. 43

గంగాతీరే స్థితః పాండు ర్మునీనా మాశ్రమేషు చ | శృణ్వానో ధర్మశాస్త్రాణి చకార దుశ్చరం తపః. 44

కథాయాం వర్తమానాయాం కదాచి ద్ధర్మసంశ్రితమ్‌ | అశృణో ద్వచనం రాజా సుపృష్టం మునిభాషితమ్‌. 45

అపుత్రస్య గతి ర్నాస్తి స్వర్గే గంతుం పరంతప | యేనకేనాప్యుపాయేన పుత్రస్య

జననం చరేత్‌. 46

అంశజః పుత్రికాపుత్రఃక్షేత్రజో గోలక స్తథా | కుండః సహోఢః కానీనః క్రీతః ప్రాప్త స్తథా

వనే. 47

దత్తః కేనాపి చాశక్తౌ ధనగ్రాహిసుతాః స్మృతాః | ఉత్తరోత్తరతః పుత్రా నికృష్టా

ఇతి నిశ్చయః. 48

ఇత్యాకర్ణ్య తదా ప్రాహ కుంతీం కమలలోచమామ్‌ | సుత ముత్పాదయాశు త్వం

మునిం గత్వా తపోన్వితమ్‌. 49

మమా%%జ్ఞయా న దోషస్తే పురా రాజ్ఞా మహాత్మనా | వసిష్ఠా జ్ఞనితః పుత్రః సౌదాసేనేతి మే శ్రుతిమ్‌. 50

కొన్నాళ్లకు కుంతీ స్వయంవరము జరిగెను. అందామె పాండురాజును వరించెను. మద్రరాజసుతయగు మాద్రియు నతనికి రెండవ భార్యయయ్యెను. ఒకనాడు పాండురా జు వేటకేగి మృగరూపమున క్రీడించుచున్న మునిని మృగమను భ్రాంతిచే బాణము ఏసి చంపెను. ఆ ముని కోపించి స్త్రీ సంగమము సల్పునపుడు నీవు నిట్లే మరణింతు వని పాండురాజును శపించెను. పాండురాజటుల శపింపబడి శోకమునగుందుచు రాజ్యము వీడి వనవాసము చేయుచుండేను. కుంతీ మాద్రులు తమ సతీధర్మము నెఱపుటకు రాజునకు పరిచర్యలు చేయ నతని వెంట వెడలిరి. పాండురాజు పావన గంగా తీరమందలి మున్యాశ్రమములందుండి ధర్మశాస్త్రములు వినుచు కఠిన తప మాచరించెను. అత డొకసారి యచట జరుగుచున్న ధర్మ విషయకచర్చల ప్రసంగమున ముని భాషణము లిట్లు వినెను. అపుత్త్రకులకు స్వర్గలోక గమనమునకు గతులుండవు.కనుక నే విధముననైన పుత్త్రుని బడయవలయును. అంశజుడు పుత్త్రికాపుత్త్రుడు క్షేత్రజుడు గోలకుడు కుండుడు సహోఢుడు కానీనుడు క్రీతుడు వనప్రాప్తుడు అశక్తులవలన డబ్బునకమ్ముడు పోయినవాడు అను వీరెల్లరును తనయులే యగుదురు. వీరిలో వరుసగ నొకనికన్న మరొకడు తక్కువవాడు. ఇది నిజము. అను ముని మాటలు విని పాండురాజు కుంతితో నిట్లనియెను. నీవు వేగమే యొక మహామునిని గలియుటకు తపోవని కరుగుము. ఆ ముని దయ వలన పుత్త్రుని గనుము. నా యాజ్ఞవలన నీకు దోషమంటదు. మునుపు సౌదాసుడను రాజు వసిష్ఠమహర్షి వలన పుత్త్రుని బడసెనని వింటిని.

తం కుంతీ వచనం ప్రాహ మమ మంత్రో%స్తి కామదః | దత్తో దుర్వాససా పూర్వం సిద్ధిదః సర్వదా ప్రభో. 51

నిమంత్రయే%హం యం దేవం మంత్రేణానేన పార్థివ | ఆగచ్ఛే త్సర్వథా సో వై

మమ పార్మ్యే నియంత్రితః. 52

భర్తు ర్వాక్యేన సా తత్ర స్మృత్వా ధర్మం సురోత్తమమ్‌ | సంగమ్య సుషువే పుత్రం ప్రథమం చ యుధిష్ఠిరమ్‌. 53

వాయో ర్వృకోదరం పుత్రం జిష్ణుం చైవ శతక్రతోః | వర్షేత్రయః పుత్రాః కుంత్యాం జాతా మహాబలాః 54

మాద్రీ ప్రాహ పతిం పాండుం మంత్రం మే కురు సత్తమ | కిం కరోమి మహారాజ

దుఃఖం నాశయ మే ప్రభో. 55

ప్రార్థితా పతినా కుంతీ దదౌ మంత్రం దయాన్వితా | ఏకపుత్రప్రబంధేన మాద్రీ పతిమతే స్థితా. 56

స్మృత్వా తదా2శ్వినౌ దేవౌ మద్రరాజసుతా సుతౌ | నకులం సహదేవంచ సుషువే వరవర్ణినీ. 57

ఏవం తే పాండవాః పంచ క్షేత్రోత్పన్నాః సురాత్మజాః | వర్షవర్షాంతరే జాతా వనే తస్మన్ద్విజోత్తమాః. 58

అంత కుంతి యిట్లనియెను: 'ఓ కామదా! పూర్వము దుర్వాసో మహర్షి నాకు సిద్ధిప్రదమగు నొక మంత్రముపదేశించెను. అది నాయొద్ద గలదు. ఆ మంత్ర ప్రభావమున నేనే

దేవతనాహ్వానింతునో యా దేవత నా సన్నిధికి రాగలడు'' అపుడు కుంతి తన పతి యనుమతి బడసి ధర్మదేవతను స్మరించినది. ఆమె యతని కలయిక వలన యుధిష్ఠిరుని తొలి పుత్త్రుడగు బడసినది. పిదప నామె వాయుదేవుని దయవలన భీముని ఇంద్రుని యనుగ్రహమున కిరీటిని ప్రతియేట నొక్కొక్కని వంతున వరపుత్త్రులుగ బడిసినది. అపుడు మాద్రి పాండురాజుతో నిట్లనియెను: ప్రభూ ! నాకును బుత్త్రులను ప్రసాదించుము. నేనేమి చేయుదును ? నా దుఃఖము బాయు నట్లొనరింపుము. పాండురాజా విషయము కుంతితో జెప్పెను. కుంతి దయతో మాద్రికి మంత్రోపదేశము జేసెను. మాద్రికొక్కడే పుత్త్రుడు చాలునని పాండురాచు కట్టడి చేసెను. మాద్రి యశ్వనీదేవతలను మదిలో స్మరించి నకులసహాదేవుల నిర్వురను గనెను. ఈ ప్రకారముగ దేవతలు పాండురాజు క్షేత్రమునందు పంచపాండవులై యుద్భవించిరి. ఓ మునులారా! వారా యడవిలో నొకరి కింకొకరొక యేడు అంతరముగ నుద్భవించిరి.

ఏకస్మి న్సమయే పాండు ర్మాద్రీం దృష్ట్వా%థ నిర్జనే | ఆశ్రమే చాతికామార్తో జగ్రాహాగతవైశసః. 59

మామామామేతి బహుధా నిషిద్ధో%పి తయా భృశమ్‌ | ఆలిలింగ ప్రియాం దైవా

తృపాతా ధరణీతలే. 60

యథా వృక్షగతా వల్లీ ఛిన్నే పతతి వై ద్రుమే | తథా సా పతితా బాలా కుర్వంతీ

రోదనం బహు. 61

ప్రత్యాగతా తదా కుంతీ రుదతీ బాలకా స్తథా | మునయశ్చమహాభాగాః శ్రుత్వా

కోలహలం తదా. 62

మృతః పాండు స్తదా సర్వే మునయః సంశితవ్రతాః | సహాగ్నిభి ర్విధిం కృత్వా

గంగాతీరే తదా*%దహన్‌. 63

చక్రే స హైవ గమనం మాద్రీ దత్వా సుతౌ శిశూ | కుంత్యై ధర్మంపురస్కృత్య సతీ

నాం సత్యకామతః. 64

జలదానాదికం కృత్వా మునయ స్తత్ర వాసినః | పంచపుత్రయూతాం కుంతీ మనయ న్హస్తినాపురమ్‌. 65

తాం ప్రాప్తాం చ సమాజ్ఞాయ గాంగేయో విదుర స్తథా| నాగారా థృతరాష్ట్రస్య

సర్వే తత్ర సమాయయుః. 66

ఆగత్యా ఖేతదా తైస్తు కథితం నః సుతాః కిల | భీష్మేణ సత్కృతం వాక్యం దేవానాం సత్కృతాః సుతాః. 69

గతా నాగపురం సర్వే తానాదాయ సుతా న్వధూమ్‌ | భీష్మాదయః ప్రీతచిత్తాః పాలయామాసురర్థతః 70

ఏవం పార్థాః సముత్పన్నా గాంగేయే నాథ పాలితాః. 71

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కందే షష్ఠో%ధ్యాయః.

అంత నొకనాడు పాండురాజు చావుమూడగ కామార్తుడై ఆశ్రమమందు మాద్రిని సమీపించి బలాత్కారముగ నామె చేయి పట్టెను. ఆమె వద్దువద్దనియ యెంతగ మొఱ పెట్టి వారించినను పాండురాజు వినక తన ప్రియను తమిదీర కౌగిలించుకొనెను. వెంటనే యతడు మన్నుగఱచెను. చెట్టు పడినప్పుడు దాని నాశ్రయించియున్న తీవియగూడ పడునట్లు మాద్రి క్రిందబడి వలవల యేడవసాగెను. అపుడు కుంతియు రోదించుచు వచ్చెను. ఆ కోలాహలమును విని మునులును బాలకులును గుమిగూడిరి. అట్లు పాండురాజు దివంగతుడుగాగా మునులును పాండుపుత్త్రులును గలిసి గంగాతీరమున నతనికి దహన సంస్కారము లొనరించిరి. అపుడు మాద్రి తన సుతులను కుంతి కప్పగించినది. పిదప నామె సత్యచింతనతో సతీధర్మము పాటించుచు పాండురాజుతో సహగమించినది. ఆయాచోటుల వసించు మునులు పాండవులచేత దానములు తర్పణములు నాచరింపించిరి. పిదప వారు పాండవులను గొంతిని కరిపురికి గొనిపోయిరి. వారి శుభాగమన మెఱిగి గాంగేయుడు విదురుడు ధృతరాష్ట్రుడు ప్రజానీకము వారి కెదురేగెను. జనమునకు పాండురాజునకు గల శాపము తెలియును. కాన వారు కుంతినీ వరాననా! వీరలెవ్వరి పుత్త్రు'లని యడిగిరి. అపుడు కుంతి దుఃఖాన్వితయై వీరలు కురుకులమున ప్రభవించిన సురకుమారకులు అని నుడివి యామె వారు నమ్ముటకు తిరిగి దేవతలనే యాహ్వానించెను. అంత దేవత లేతెంచి గగనసీమపై వెలుగుమూర్తులై వీరు మా కన్నవారలే' యని వక్కాణించి పలికిరి. దేవవాక్కులకు భీష్ముడు విలువ నిచ్చెను. ఇట్లు భీష్ముడు దేవకుమారకుల గౌరవము నిలువబెట్టెను. అంత నచ్చటివారందఱును బాలకులను కుంతిని వెంట నిడుకొని హస్తినాపురములోని కరిగిరి. భీష్మాదులందరును సంప్రీతి మెఱయ తమ విభవముల కనుగుణముగ వారిని పోషించిరి. ఈ విధముగ కుంతీకుమారులు భీష్ముని చేత పరిరక్షింపబడిరి.

ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమందలి షష్ఠాధ్యాయము

Sri Devi Bhagavatam-1    Chapters