Sri Devi Bhagavatam-1    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

కృత స్వస్త్యయనో వృత్రో బ్రాహ్మణౖ ర్వేదపారగైః | నిర్జగామ రథారూఢో హంతుం శక్రం మహాబలః. 1

తదైవ రాక్షసాః క్రూరాః పురా దేవవరాజితాః | సమాజగ్ము శ్చ సేవార్థం వృత్రం జ్ఞాత్వా మహాబలమ్‌. 2

ఇంద్రదూతా స్తు తం దృష్ట్వా యుద్ధాయ తు సమాగతమ్‌ | వేగా దా గత్య వృత్తాంతం శశంసు స్తస్య చేష్టితమ్‌. 3

స్వామిన్‌ శీఘ్ర మిహాయాతి వృత్రో నామరిపుస్తవ | పుత్త్రఘాతాభితప్తేన దుఃసహో రాక్షసై ర్యుతః. 4

యత్నం కురు మహాభాగ శీఘ్ర మాయాతి సాంప్రతమ్‌ | మేరు మందర సంకాశో ఘోరశబ్దో%తి దారుణః. 5

ఏతస్మి న్నంతరే తత్ర భీతా దేవగణా భృశమ్‌ | ఆగత్యోచుః సురపతిం శృణ్వంతం దూతభాషితమ్‌. 6

మూడవ అధ్యాయము

వృత్రుడు దేవతల నోడించుట

వృత్రాసురుడు వేదపారగులగు విప్రులచేత స్వస్తివచనములు చదివించుకొని యింద్రవధకు రథమెక్కి జయబలుదేరెను. వృత్రుడు బలశాలియని మునుపు సురలచేతిలో నోటుపడిన క్రూరరాక్షసులెcఱిగి వృత్రుని సేవింప నేతెంచిరి. అట్లు బవరమునకు తరలివచ్చుచున్న రాక్షసులనుగని యింద్రదూతలు వేగ నింద్రునిజేరి వృత్రవృత్తాంతమిట్లు చెప్పిరి : స్వామీ! వృత్రుడు నీ శత్రువు. మహాబలశాలి. అతడు రథమెక్కి వచ్చుచున్నాడు. త్వష్ట తన పుత్రనాశమునకు మిగుల వగచి కోపముతో నభిచారమంత్రములతో నీ చావునకు వృత్రుని సృజించెను. వృత్రు డిపుడు రాక్షస పరివృతుడై దుస్సహుడై యున్నాడు. మేరుమందరసంకాశుడు అతడు ఘోరముగ శబ్దము చేయుచు వచ్చుచున్నాడు. మీరు సిద్ధపడుడు. అంతలో దేవతలు భయగ్రస్తులై యేతెంచి దూత మాటలు విని సురపతి కిట్లనిరి:

మఘవ న్దుర్ని మిత్తాని భవంతి త్రిదశాలయే | బహూని భయశంసీని పక్షిణాం విరుతాని చ. 8

కాకా గృధ్రా స్తథా శేన్యాః కంకాద్యాదారుణాఃఖగాః | రుదంతి వికృతైః శ##బ్దై రుత్కారై ర్భవనోపరి. 9

చీచీకూచీతి నినదా న్కుర్వంతి విమగా భృశమ్‌ | వాహనానాం చ నేత్రోభ్యో జలాధారాః పతంత్యధః. 10

శ్రూయతే%తి మహాన్‌ శబ్దో రుదతీనాం నిశాసుచ | రాక్షసీనాం మహాభాగ భవనోపరి దారుణః. 11

ప్రపతంతి ధ్వజా స్తూర్ణం వినా వాతేన మానద | ప్రభవంతి మహోత్పాతా దివి భూమ్యంతరిక్షణాః. 12

కృష్ణాంబరధరా నార్యో భ్రమంతి చ గృహే | యాంతు యాంతు గృహాత్తూర్ణం కుర్వంత్యో వికృతాననాః. 13

రాత్రౌ స్వప్నేషు కాంతానాం సుప్తానాం నిజమందిరే | కేశాం ల్లునంతి రాక్షస్యో భీషయంత్యో భృశాతురాః. 14

ఏవం విధాని దేవేశ భూకంపోల్కాదయ స్తథా | గోమాయవో రుదంతి స్మ నిశాయాం భవనాంగణ. 15

సరటానాం చ జాలాని ప్రభవంతి గృహే | అంగప్రస్ఫురణాదీని దుర్నిమిత్తాని సర్వశః. 16

వ్యాసః : ఇతి తేషాం వచః శ్రుత్వా చింతామాప సురేశ్వరః | బృహస్పతింసమాహూయ పప్రచ్ఛచ మనోగతమ్‌. 17

ఇంద్రః : బ్రహ్మన్కిముత ఘోరాణి నిమిత్తాని భవంతి వై | వాతాశ్చ దారుణా వాంతి ప్రపతంత్యులకాః ఖతః 18

సర్వజ్ఞో%సి మహాభాగ సమర్థో విఘ్ననాశ##నే | బుద్ధిమాన్‌ శాస్త్రతత్వజ్ఞో దేవతానాం గురు స్తథా. 19

కురు శాంతిం విధానజ్ఞ శత్రుక్షయవిధాయినీమ్‌ | యథా మే న భ##వే ద్దుఃఖం తథా కార్యం విధీయతామ్‌. 20

దేవేంద్రా! స్వర్గభూమిలో పెక్కు దుశ్శకునములు పొడముచున్నవి. పక్షులరావములు భయసూచకములుగా నున్నవి. మన భవనములు మీద కాకులు గ్రద్దలు మున్నగు పక్షులు దారుణముగ వికృతధ్వనులు చేయుచున్నవి. పక్షులు చీచీ కూచీ రావములు చేయుచున్నవి. వాహనముల కన్నులనుండి జొట జొట కన్నీరు గారుచున్నది. రాత్రియందు భవనాలమీద ఎవరి నోటనుండి వచ్చుచున్నదో తెలియని రోదన ధ్వను లతి దారుణ భీకరముగ వినబడుచున్నవి. పతాకలు గాలి లేకయే నేల బడుచున్నవి. ఇట్లు స్వర్గమునుండియు భూమ్యంతరిక్షములనుండియు పెక్కు మహోత్పాతము లుప్పతిల్లుచున్నవి. స్త్రీలు నల్లని చీరలు గట్టి వికృతముఖములతో నింటింట దిరుగుచు వెళ్లుడు వెళ్ళుడని కేకలు వేయుచున్నారు. దేవతాస్త్రీలు కలలందు రాక్షసుల కొప్పుపట్టి భయపెట్టి లాగినట్టుల గనుచున్నారు. ఉల్కాపాతములు-భూకంపముటు-భయకంపములు గల్గించుచున్నవి. రాత్రులందు నక్క లంగణములందూలలు పెట్టుచున్నవి. తొండల గుంపులు ప్రతి యింట పుట్టుచున్నవి. భుజాక్షిస్పందము అంగ ప్రస్థురణములు మెరమెరగల్గుచున్నవి. ఇట్లు పెక్కులు దుర్నిత్తములు గల్గుచున్నవి అను సరుల మాట లాలించి యింద్రుడు చింతాక్రాంతుడై బృహస్పతిని రావించి యతనికి తన భావమిట్లు తెల్పెను. ఓ మహాత్మా! ఇపుడు ఘోర దుర్నిమిత్తములు పెక్కులు గల్గుచున్నవి. గాలి బగబగ వీచుచున్నది. నింగి నుండి పడు ఉల్కలు కనకన లాడుచున్నవి. నీవు సర్వజ్ఞుడవు; విఘ్ననాశనమున దక్షుడవు; ధీశాలివి; శాస్త్రవేత్తవు; సురగురుడవు. ఇపుడు నీవు నా శత్రునాశమున కుపాయమాలోచించి నా చిత్తమునకు శాంతి చేకూర్చుము.

బృహస్పతి: కిం కరోమి సహస్రాక్ష త్వయా%ద్యదుష్కృతం కృతమ్‌ |

అనాగసం మునిం హత్వా కిం ఫలం సముపార్జితమ్‌. 21

అత్యుగ్రపుణ్యపాపానాం ఫలం భవతి సత్వరమ్‌ | విచార్య ఖలు కర్తవ్యం తద్భూతిమిచ్ఛతా. 22

పరోపతాపనం కర్మ న కర్తవ్యం కదాచన | న సుఖం విందతే ప్రాణీ పరపీడాపరాయణ. 23

మోహా ల్లోభా ద్ర్బహ్మహత్యా కృతా శక్రత్వయా%ధునా | తస్య పాపస్య సహసా ఫల మేత దుపాగతమ్‌. 24

అవధ్యః సర్వదేవానాం జాతో%సౌ వృత్రసంజ్ఞకః | హంతుం త్వాం స సమాయాతి దానవై ర్బహుభిర్వృత. 25

ఆయుధాని చ సర్వాణి వజ్రతుల్యాని వాసవ | త్వష్ట్రా దత్తాని దివ్యాని గృహీత్వా సముపస్థితః. 26

సమాగచ్ఛతి దుర్ధర్షో రథారూఢః ప్రతాపవాన్‌ | దేవేంద్ర ప్రలయం కుర్వ న్నాస్య మృత్యు ర్భవిష్యతి. 27

కోలాహల స్తదా జాతస్తథా బ్రువతి వాక్పతౌ | గంధర్వాః కిన్నరా యక్షా మునయశ్చ తపోధనాః. 28

సదనాని విహాయైవామరాః సర్వే పలాయితాః | తద్దృష్వా మహదాశ్చర్యం శక్ర శ్చింతాపరాయణ. 29

ఆజ్ఞాపయామాస తదా సేనోద్యోగాయ సేవకాన్‌ | ఆనయధ్వం వసూన్రుద్రా నశ్వినౌ చ దివాకరాన్‌. 30

పూషణం చ భగం వాయుం కుబేరం వరుణం యమమ్‌ | విమానేషు సమారుహ్య సాయుధాః సురసత్తమాః. 31

సమాగచ్ఛంతు తరసా శత్రు రాయాతి సాంప్రతమ్‌ | ఇత్యాజ్ఞాప్య సురపతిః సమారుహ్య గజోత్తమమ్‌. 32

బృహస్పతి యిట్లనెను : ''ఓ సహస్రాక్షా! నేనేమి చేతును? నీవు నిరపరాధుడగు ముని తల నరకించి దుష్కార్య మొనర్చితివి. అందుచే నింతగ చపలత్వ మందితివి. తీవ్రములగు పుణ్యపాపములకు ఫలితము బిఱబిఱ గల్గును. సంపదలు గోరువారు వివేకముతో నాలోచించి చక్కగ చేయవలయును. ఇతరులకు బాధగల్గించు పని యెన్నడును చేయరాదు. అవివేక మాపదలకు మూలము. పరపీడాపరాయణుడు శాంతిజెందడు. ఓ యింద్రా! నీవు లోభమోహములకు వశుడవై బ్రహ్మహత్య చేసితివి. ఆ పాపఫలితమే యిది. సురలంద ఱొక్కటిగ జేరినను వృత్రుడు చంపబడడు. అతడు నిన్ను చంపుటకు దానవులను గూడి వచ్చుచున్నాడు. అతడు త్వష్టవలన వజ్రమునుబోలు పెక్కు దివ్యాయుధములు బడసి సిద్ధముగ నున్నాడు. మహావీరుడగు అతడు ప్రళయము పుట్టించుచు చావులేనివాడై యేతెంచుచున్నాడు అని యిట్లు గురుడు వచించుచుండగనే పెద్ద కోలాహలము చెలరేగెను. అంత గంధర్వ-కిన్నర-యక్ష-ముని-తాపసులు దేవతలు తమతమ నెలవులు విడిచి గజిబిజిగ పారిపోయిరి. అది చూచి యింద్రుడు విచారగ్రస్తుడయ్యెను. అతడు తన సేవకులను సైన్యమాయత్తము చేయుట కిట్టు లాజ్ఞాపించెను : వసు-రుద్ర-అశ్వినులు-దివాకరులు-పూష-భగ-యమ-వాయు-కుబేరులు సాయుధులై విమానములెక్కి రావలయును. శత్రువు మనపై దండెత్తివచ్చుచున్నాడు. అని యాజ్ఞనొసంగి యింద్రుడైరావతమెక్కి -

బృహస్పతిం పురోధాయ నిర్గతో నిజమందిరాత్‌ | తథైవ త్రిదశాః సర్వే స్వంస్వం వాహనమాస్థితాః. 33

యుద్ధాయ కృతసంకల్పా నిర్యయుః శస్త్రపాణయః | వృత్తో%థ దానవై ర్యుక్తః సంప్రాప్తో మానసోత్తరమ్‌. 34

పర్వతే దేవతావాసం రమ్యం పాదపశోభితమ్‌ | ఇంద్రో%ప్యాగత్య సంగ్రామం చకరా మానసోత్తరే. 35

పర్వతే దేవతాయుక్తో వాచస్పతి పురఃసరః | తత్రాభూ ద్దారుణం యుద్ధం వృత్రవాసవయో స్తదా. 36

గదాసిపరిఘైః పాశై ర్బాణౖః శక్తిపరశ్వథైః | మానుషేణ ప్రమాణన సంగ్రామః శరదాం శతమ్‌. 37

బభూవ భయదో నౄణా మృషీణాం భావితాత్మనామ్‌ | వరుణః ప్రథమం భగ్న స్తతో వాయుగణః కిల. 38

యమో విభావసుః శక్రః సర్వే తే నిర్గతా రణాత్‌ | పలాయనపరా న్దృష్ట్వా దేవా నింద్రపురోగమాన్‌. 39

వృత్రో%పి పితరం ప్రాగాదాశ్రమస్థం ముదా%న్వితమ్‌ | ప్రణమ్య ప్రాహ త్వష్టారం పితుః కార్యం మయా కృతమ్‌. 40

దేవా వినిర్జితాః సర్వే సేంద్రాః సమరసంస్థితాః | విద్రుతా స్తే గతాః స్థానం యథాసింహాన్మృగా గజాః. 41

ఇంద్రః పదాతిరగమన్మయా%%నీతో గజోత్తమః | ఐరావతో%యం భగవ న్గృహాణ ద్విరదోత్తమమ్‌. 42

న హతాస్తే మయా తస్మా దయుక్తం భీతమారణమ్‌ | ఆజ్ఞాపయ పున స్తాత కిం కరోమి తవేప్సితమ్‌. 43

నిర్జరా నిర్గతాః సర్వే భయభీతాః శ్రమాతురాః | ఇంద్రో%పై#్యరావతం త్యక్త్వా భయభీతః పలాయితః. 44

-బృహస్పతిని ముందిడుకొని తన మందిరము వెడలెను. దేవత లెల్లరును తమ తమ వాహనము లలంకరించిరి. వారు శస్త్రములు దాల్చి యుద్ధసన్నద్ధులై తరలిరి. అట వృత్రుడు దానవులనుగూడి మానస సరస్సునకు నుత్తరమున విడిసెను. అచట మంచి వృక్షములుగల పర్వతము గలదు. అది దేవతావాసమున కనువుగ నెలవు. ఇంద్రుడు నచ్చటి కేతెంచి పోరునకు గడంగెను. అతడు గురుని తన ముందుంచుకొని సురలతో నేతెంచెను. అంత వృత్ర వాసవులకు ఘోర సమరము సంఘటిల్లెను. వారికి గద-అసి-పరిఘ-శక్తి-బాణ-పాశములతో గొడ్డండ్లతో మానవకాల జీవనప్రమాణము ననుసరించి నూఱండ్లు పోరు సాగెను. ఆ పోరు నర-ఋషులకు భయము గల్గించెను. వరుణుడు వాయువు అగ్ని-యమ-ఇంద్రులు క్రమముగ నోటుపడి రణమునుండి పారిపోయిరి. అట్టు లింద్రాదులు పారిపోవుటను వృత్రుడు చూచి ప్రమోదముతో తన తండ్రి యాశ్రమము చేరి యతనికి ప్రణమిల్లి నీ చెప్పిన పని చేసితి' ననెను. మృగరాజును గని గజములు-మృగములు-పారిపోవును. అట్లే నన్ను గని యింద్రుడు సురలును పారిపోయిరి. ఇంద్రుడు పాదచారియై కాలికి బుద్ధి చెప్పెను. ఇదిగో! యైరావతమును తెచ్చితిని. స్వీకరింపుము. పిరికిపందలను చంపుట తగదని వారిని వదలిపెట్టితిని. ఓ తండ్రీ! నా చేయవలసిన పిన యింకేమో తెలుపుము. దేవతలును గడగడలాడుచు శ్రమజెంది పరుగిడిరి. ఇంద్రుడైరావతము వదలి కాలికొద్ది పరుగెత్తెను.

ఇతి పుత్త్రవచః శ్రుత్వా త్వషా ప్రాహ ముదా%న్వితః | పుత్రవా నద్య జాతో%స్మి సఫలం మమ జీవితమ్‌. 45

త్వయా%హం పావితః పుత్ర గతోమే మానసో జ్వరః | నిశ్చలంమేమనోజాతందృష్ట్వావీర్యంతవాద్భుతమ్‌. 46

శృణు వక్ష్యా మ్యహం పుత్త్ర హితం తే%ద్య నిశామయ | తపః కురు మహాభాగ సావధానః స్థిరాసనః. 47

తపసా ప్రాప్యతే లక్ష్మీ స్తపసా రాజ్య ముత్తమమ్‌ | తపసా బలవృద్ధిః స్యా త్సంగ్రామే విజయ స్తథా. 49

ఆరాధ్య ద్రుహిణం దేవం లబ్ధ్వా పర మనుత్తమమ్‌ | జహి శక్రం దురాచారం బ్రహ్మహత్యా సమాయుతమ్‌. 50

సావధానః స్థిరోభూత్వా దాతారం భజ శంకరమ్‌ | వాంఛితం స వరం దద్యా త్సంతుష్ట శ్చతురాననః. 51

తోషయిత్వా విశ్వయోనిం బ్రహ్మాణ మమితౌజసమ్‌ | అవినాశిత్వ మాసాద్య జహి శక్రం కృతాగసమ్‌. 52

వైరం మనసి మే పుత్ర వర్తతే సుతఘాతజమ్‌ | న శాంతి మనుగచ్ఛామి న స్వపామి సుఖేన హ. 53

తాపసో మే హతః పుత్రో నిరాగాః పాప్మనా యతః | న విందామి సుఖం వృత్రత్వం మా ముద్ధర దుఃఃతమ్‌. 54

వ్యాసఉవాచ: తదా కర్ణ్య పితుర్వాక్యం వృత్రః క్రోధయుత స్తదా | ఆజ్ఞా మాదాయ చ పితుర్జ గామ తపసే ముదా. 55

గంధ మాదన మా సాద్య పుణ్యాం దేవధునీం శుభామ్‌ | స్నాత్వా కుశాసనం కృత్వా సంస్థిత శ్చ స్థిరాసనః. 56

త్యక్త్వాన్నం వారిపానం చ యోగాభ్యాస పరాయణః | ధ్యాయ న్విశ్వసృజం చిత్తే సోపవిష్టః స్థిరాసనే. 57

మఘవా తం తపస్యంతం జ్ఞాత్వా చింతాతురో హ్యభూత్‌ | గంధర్వా న్ర్పేషయామాస విఘ్నార్థం పాకశాసనః. 58

యక్షాం శ్చ పన్నగా న్సర్పా న్కిన్నరా నమితౌజసః | విద్యాధరా నప్సరసో దేవదూతా ననేకశః. 59

ఉపాయా సై#్తః కృతాః సమ్యక్తపోవిఘ్నాయ మాయిభిః | న చచాల తతో ధ్యాన త్త్వాష్ట్రః పరమతాపసః. 60

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే తృతీయో%ధ్యాయః

ఆ మాటలు విని త్వష్ట ముదమంది యిట్లనెను : నేను నేడు గదా నిజముగ పుత్త్రవంతుడ నైతిని! నా జీవితము నేడు గదా సఫలమైనది! నేను నీ వలన పవిత్రుడ నైతిని. నా మనోవ్యాధి తగ్గెను. నీ లోకాద్భుత విక్రమము గాంచి నా యెడద శాంతించినది. ఇపుడు నీకు మేలు బాట తెల్పెదను. వినుము. నీవు స్థిరాసముననుండి సావధానముగ తప మొనర్చుము. ఇంద్రుడు నానా విధముల మోసము చేయుటలో నేర్పరి. ఆతనిని నమ్మకుము. తపమువలన రాజలక్ష్ములు - విజయశ్రీలు - బలవృద్ధి గల్గును. బ్రహ్మవలన వరము బడయుము. బ్రహ్మహత్యాపాపి- దురాచారియగు నింద్రుని చంపుము. బ్రహ్మ మేళ్ళు గురియువాడు. అతని గూర్చి సావధానముగ తప మొనర్చుము. అతడు తుష్టిజెంది నీ కోరిక లీడేర్పగలడు. ప్రజాపతి తేజశ్శాలి. నీ వతనిని మెప్పించి యమరుడవు గమ్ము. పాపియగు నింద్రుని సంహరింపుము. పుత్త్రా! ఇంద్రుడు నా పుత్త్రుని చంపిన బాధ నన్ను పట్టి వేధించుచున్నది. నాకు కంటినిండ నిద్రపట్టుటలేదు. చిత్తశాంతి కఱవయినది. నా కొడు కే పాప మెఱుగనివాడు. తపస్వి. అత డొక పాపి చేతిలో చచ్చుటచే నాకు సుఖశాంతులు లేవు. ఈ దుఃఃతు నుద్ధరింపుము అను తన తండ్రి వచనములు విని తండ్రి యనుమతి బడసి కోపముతో వృత్రుడు తపమునకు గంధమాదనగిరి కేగెను. అతడు గంగలో గ్రుంకివచ్చి దర్భాసనము పై స్థిరాసనమున నుండెను. అన్నము నీరు వదలి ప్రాణాయామ పరాయణుడై ప్రజాపతిని చిత్తమందు గీలుకొల్పి ధ్యానించుచుండెను. అతడు తప మొనరించు టెఱిగి యింద్రుడు చింతాగ్రస్తు డయ్యెను. ఆత డతని తపోవిఘ్నమునకు గంధర్వులను-యక్ష-పన్నగ-సర్పములను-విద్యాధరాప్సరసలను పెక్కు దేవదూతలను పంపెను. వారెల్లరును మాయలు పన్ని వృత్రుని తపోవిఘ్నమునకు బూనుకొనిరి. కాని యా పరమతాపసు డే మాత్రము చలింపలేదు.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు వృత్రుడు దేవతల నోడించుటయను తృతీయాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters