Varahamahapuranam-1    Chapters   

ద్వినవతితమోధ్యాయః - తొంబది రెండవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

గతే తు నారదే దైత్య శ్చిన్తయామాస తాం శుభామ్‌,

కథితాం నారదముఖా చ్ఛ్రుత్వా విస్మిత మానసః. 1

నారదు డట్టు పోగా దైత్యుడు అచ్చెరు వొందిన మనస్సుతో ఆ నారదుని ముఖమునుండి వినిన ఆ సుందరిని గూర్చియే చింతించుచుండెను.

తామేవ చిన్తయన్‌ శర్మ న లేభే దైత్యసత్తమః,

అలంశర్మా మహామన్త్రీ ఆనినాయ మహాబలః. 2

ఆ దైత్యవరుడు ఆమెనే చింతించుచు సుఖము పొందడాయెను. మహామంత్రి, మహాబలుడు అగు అలంశర్మ తక్కిన మంత్రులను పిలిపించెను.

తస్యాష్టౌ మన్త్రిణః శూరా నీతిమన్తో బహుశ్రుతః,

ప్రఘసో విఘసశ్చైవ శంఖకర్ణో విభావసుః,

విద్యున్మాలీ సుమాలీ చ పర్జస్యః క్రూర ఏవచ. 3

ఆతనికి గొప్పనీతి వేత్తలు, శూరులు, పెక్కు శాస్త్రములలో ఆరితేరినవారు అగు మంత్రులు ఎనిమిదిమంది కలరు. ప్రఘసుడు, విఘసుడు, శంఖకర్ణుడు, విభావసుడు, విద్యున్మాలి, సుమాలి, క్రూరుడగు వర్జన్యుడు అనువారు (అలంశర్మ - ఒకడు)

ఏతే మన్త్రివరా స్తస్య ప్రాధాన్యేన ప్రకీర్తితాః,

తే దానవేంద్ర మాసీన మూచుః కృత్యం విధీయతామ్‌ 4

వీరాతనికి ముఖ్యులైన మంత్రులుగా ప్రసిద్ధి కెక్కినవారు. వారు కొలువున్న ఆరాక్షసరాజును గాంచి పనియేమో సెలవిమ్మని పలికిరి.

తేషాం తద్వచనం శ్రుత్వా దానవేన్ద్రో మహాబలః,

ఉవాచ కన్యాలాభార్థం నారదావాప్త నిశ్చయః. 5

వారి ఆ పలుకు విని మహాబలుడగు దానవేంద్రుడు నారదుని వలన పొందిన నిశ్చయము కలవాడు కావున కన్యాలాభము నాశించి యిట్లు పలికెను.

మహిష ఉవాచ - మహిషు డనెను.

మహ్యం తు కథితా బాలా నారదేన మహర్షిణా,

సా చాజిత్య సురాధ్యక్షం న లభ్యేత వరాంగనా. 6

నారదమహర్షి నాకొక బాలను గూర్చి చెప్పెను. కానీ దేవతల ప్రభువును గెలువక ఆవరాంగన లభింపదట.

ఏతదర్థం భవన్తో వై కథయన్తు విమృశ్య వై,

కధం సా లభ్యతే బాలా కథం దేవాశ్చ నిర్జితాః,

భ##వేయు రితి తత్సర్వం కథయన్తు ద్రుతం మమ. 7

మీరందరు విమర్శించి ఆ బాల నాకెట్లు వశమగునో దేవతలనెట్లు ఓడింతునో అదియంతయు త్వరగా నాకు తెలుపుడు.

ఏవ ముక్తా స్తతః సర్వే కథయామాసు రఞ్జసా,

ఊచుః సంమంత్ర్య తే సర్వే కథయామో వయం ప్రభో. 8

రక్కసు డిట్లు పలుకగా వారందరు ఇట్లనిరి. ప్రభూ! మేమందరము విచారించి చెప్పుదుము.

ఏవ ముక్త స్తథోవాచ ప్రఘసో దానవేశ్వరమ్‌,

యా సా తే కథితా దైత్య నారదేన మహాసతీ,

సా శక్తిః పరమా దేవీ వైష్ణవీ లోకధారిణీ. 9

వారట్లు పలుకగా ప్రఘసుడు దానవరాజుతో నిట్లనెను. రాజా! నారదుడు నీకు చెప్పిన ఆ మహాసతి పరమశక్తి వైష్ణవి. లోకముల నన్నింటిని పట్టి నిలుపునది.

గురుపత్నీ రాజపత్నీ తథా సామంతమోషితః,

జిఘృక్షన్‌ నశ్యతే రాజా తథాగమ్యాగమేన చ. 10

గురుపత్ని, రాజపత్ని, మరియు సామంతుని ఇల్లాండ్రు - ఇట్టివారిని పొందగోరురాజు నశించును. అట్లే పొందరాని స్త్రీలను పొందుట చేతను నాశనమగును.

ప్రఘసే నైవముక్తస్తు విఘసో వాక్య మబ్రవీత్‌,

సమ్యగుక్తం ప్రఘసేన తాం దేవీం ప్రతి పార్థివ. 11

ప్రఘసు డిట్లనగా విఘసు డిట్లు పలికెను. ప్రఘసుడు ఆ దేవిని గూర్చి లెస్సగా పలికెను.

యది నామ మతైక్యం తు బుద్ధిః స్మరణ మాగతా,

వరణీయా కుమారీ తు సర్వదా విజిగీషుభిః,

న స్వతంత్రేణ కన్యాయాః కార్యం క్వాపి ప్రకర్షణమ్‌. 12

నాబుద్ధికి ఒకటి తోచుచున్నది. అందరకు అది నచ్చినచో చేయవచ్చును. జయింపగోరువారు ఎల్లవేళల కన్యను వరింప వలయును. కాని ఎన్నటికిని కన్యను స్వతంత్రించి బలాత్కరింపరాదు.

యది వో రోచతే వాక్యం మదీయం మన్త్రిసత్తమాః,

తదానీం తాం శుభాం దేవీం గత్వా యాచన్తు మన్త్రిణః. 13

మీకీ మాట రుచించినచో మంత్రివరులారా! మంత్రులందరు అచటి కరిగి ఆ దేవిని యాచింపనగును.

యో మహాత్మా భ##వేత్‌ తస్యా బన్ధుస్తం యాచయామహే,

సామ్నైవాదౌ తతః పశ్చాత్‌ కరిష్యామః ప్రదానకమ్‌,

తతో భేదం కరిష్యాను స్తతో దణ్డం క్రమేణ చ. 14

ఆమెకు దొడ్డబుద్ధిగల చుట్ట మొకడున్నచో మొదట సామ మార్గమున యాచింతము. తరువాత దానమును ప్రయోగింతము. అటుపై భేదము, అదియు కుదరినిచో దండము ప్రయోగింతము.

అనేక క్రమయోగేన యది సా నైవ లభ్యతే,

తతః సన్నహ్య గచ్ఛామో బలాద్‌ గృహ్ణీమ తాం శుభామ్‌. 15

ఈ వరుసపద్ధతిలో ఆమె వశము కానియెడల అప్పుడు సాధనములు సమకూర్చుకొని ఆ సుందరిని బలముతో పట్టుకొందము.

విఘసేనైవ ముక్తేతు శేషాస్తు మన్త్రిణో వచః,

శుభ మూచుః ప్రశంసన్తః సర్వే హర్షితయా గిరా. 16

విఘసు డిట్లనగా తక్కిన మంత్రులందరు ఆమాటను కొనిమాడుచు సంతోషవాక్కుతో నిట్లనిరి.

సాధూక్తం విఘసేనేదం యత్‌ తాం ప్రతి వరాననామ్‌.

తదేవ క్రియతాం శీఘ్రం దూత స్తత్ర విసర్జ్యతామ్‌. 17

విఘసుడు ఆకాంతనుగూర్చి లెస్సగా పలికెను. అదియే త్వరగా చేయదగినది. అచటి కొక దూతను పంపవలయును.

యఃసర్వశాస్త్రనీతిజ్ఞః శుచిః శౌర్యసమన్వితః,

తస్మాద్‌ జ్ఞాత్వాతు తాం దేవీం వర్ణతో రూపతో గుణౖః. 18

పరాక్రమేణ శౌర్యేణ శౌణ్డీర్యేణ బలేన చ,

బంధువర్గేణ సామగ్ర్యా స్థానేన కారణన చ,

ఏవం జ్ఞాత్వా తు తాం దేవీం తతః కార్యం విధీయతామ్‌. 19

సర్వశాస్త్రములను నీతిని చక్కగా ఎరిగినవాడు, పవిత్రుడు, పరాక్రమవంతుడు అగుదూతను పంపి ఆతని వలన ఆదేవి వర్ణము, రూపము, గుణములు, పరాక్రమము, పాటవము, ధైర్యము, బలము, చుట్టపక్కములు, సాధనసంపత్తి, స్థానము మొదలగు వాని నన్నింటిని చక్కగా తెలిసికొని అటుపై కార్యమునకు దిగవలయును.

తతః సపది దైత్యస్య తద్వచః సాధు సాధ్వితి,

ప్రశశంసు ర్వరారోహే విఘనం మంత్రి సత్తమమ్‌. 20

అట్లుపలికి వారందరు, ఆ విఘసునిపలుకును, మంత్రులలో ఉత్తముడగు ఆ విఘసుని మేలుమేలని పొగడిరి.

ప్రశస్య సర్వే తం దూతం సంవేష్టు ముపచక్రముః,

విద్యుత్ర్పభం మహాభాగం మహామాయావిదం శుభమ్‌. 21

ప్రశంసించి వారందరు గొప్పవాడు, గొప్పమాయ లెరిగిన వాడు, ఉత్తముడు అగు విద్యుత్ర్పభుని దూతగా ఎన్నుకొనిరి.

విసర్జయిత్వా తం దూతం విఘసో వాక్య మబ్రవీత్‌,

సంనహ్యన్తాం దానవేన్ద్రా శ్చతురంగబలేన హ,

క్రియతాం విజయ స్తావద్‌ దేవసైన్యం ప్రతి ప్రభో. 22

అట్లా దూతను పంపిన పిదప విఘసు డిట్లు పలికెను. ప్రభూ! దానవప్రభువులందరు చతురంగబలముతో సంసిద్ధులై దేవసైన్యముపై విజయము సాధింపవలయును.

అసురేంద్ర సురై ర్భగ్నై స్తత్పరాక్రమభీషితా,

సా కన్యా వశతా మేతి త్వయి శ##క్రే సమాగతే. 23

అసురేంద్రా! దేవతలందరు విరిగిపోగా దేవేంద్రుడు నిన్ను చేరగా ఆ నీ పరాక్రమమునకు భీతిల్లినదై ఆ కన్య నీకు వశమగును.

లోకపాలై ర్జితై స్సర్వై స్తథైవ మరుతాం గణౖః,

నాగై ర్విద్యాధరైః సిద్ధై ర్గంధర్వైః సర్వతో జితైః,

రుద్రై ర్వసుభి రాదిత్యై స్త్వమేవేన్ద్రో భవిష్యసి. 24

లోకపాలురందరును, మరుత్తుల గణములును, నాగులును, విద్యాధరులును, సిద్ధులును, గంధర్వులును, రుద్రులును, వసువు లును, ఆదిత్యులును అన్ని విధములుగా అందరు నీకు ఓడి పోవగా నీవే యింద్రుడవు అగుదువు.

ఇన్ధ్రస్య తే శతం కన్యా దేవగన్ధర్వయోషితః,

వశమాయాన్తి సాపి స్యాత్‌ సర్వథా వశమాగతా. 25

ఇంద్రుడనగు నీకు దేవగంధర్వభామినులగు ఆ కన్యలందరు అన్ని విధములుగా వశమగుదురు. ఆ కన్యయు నీకు లొంగిపోవును.

ఏవ ముక్త స్తదా దైత్యః సేనాపతి మువాచ హ,

విరూపాక్షం మహామేఘవర్ణం నీలాంజనప్రభమ్‌. 26

అతడట్లు పలుకగా మహిషదైత్యుడు కారుమొయిలు వంటి వన్నెకలవాడు, కాటుకకొండ వంటి కాంతికలవాడును అగు విరూపాక్షుని - తనసేనాపతిని చూచి యిట్లు పలికెను.

ఆనీయతాం ద్రుతం సైన్యం హన్త్యశ్వరథపత్తినామ్‌,

యేన దేవాన్‌ సగంధర్వాన్‌ జయామి యుధి దుర్జయాన్‌. 27

ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, పదాతులుగల సైన్యమును వెంటనే సమాయత్తపరచుము. దానితో దేవతలను, గంధర్వులను యుద్ధమున గెలువరానివారిని - గెలిచెదను.

ఏవముర్తే విరూపాక్ష స్తథా సేనాపతి ర్ద్రుతమ్‌,

అనినాయ మహాసైన్య మనంత మపరాజితమ్‌. 28

అతడిట్లు పలుకగా విరూపాక్ష సేనాపతి వెనువెంటనే అంతులేనిది, ఓటమి ఎరుగనిది యగు మహాసైన్యమును రప్పించెను.

ఏకైకో దానవ స్తత్ర వజ్రహస్తనమో యుధి,

ఏకైకం స్పర్ధతే దేవం జేతుం స్వేన బలేన హ. 29

ఒక్కొక్కరక్కసుడు యుద్ధమున వజ్రముచేపట్టిన ఇంద్రుని కెనయగువాడు. ఒక్కొక్క దేవరాజును తనబలముతో గెలుచుటకు తొడలు గొట్టుచుండును.

తేషాం ప్రధానభూతానా మర్బుదం నవకోటయః,

యేషా యేవ స్యానుయితి తావద్‌ బలమథోర్జితమ్‌. 30

ఆ ముఖ్యుల సేనలు అర్బుదము, తొమ్మిది కోట్లు. అందే ఒక్కని నెవడెదిరించినను మొత్తముసేన అండగా నిలుచును. (అర్బుదము - పదికోట్లు)

తేషాం నైక సహస్రాణి దైత్యానాం తు మహాత్మనామ్‌,

సమితిం చక్రు రవ్యగ్రా స్తదా దైత్యాః ప్రహారిణః,

ప్రయాణం కారయామాసు ర్దేవసైన్య జిఘాంసయా. 31

దొడ్డ దేహబలముగల రక్కసులు వేలవేలు పోటుగాండ్రై యుద్ధమునకు సిద్ధపడిరి. దేవసైన్యమును నమిలి మ్రింగవలయునన్న కోరికతో పయనమైరి.

విచిత్రయానా వివిధధ్వజాగ్రా,

విచిత్రశస్త్రా వివిధోగ్రరూపాః,

దైత్యా సురాన్‌ జేతు మిచ్ఛన్త ఉచ్చై

ర్ననర్తు రాత్తాయుధభీమహస్తాః. 32

విచిత్రములగు వాహనములు, పెక్కుతీరులగు ధ్వజ పతాకలు, విచిత్రములగు ఆయుధములు గలవారై దేవతలను గెలుచుటకై ఆ రాక్షసులు పెక్కుభయంకర రూపములతో, ఎత్తి పట్టిన భయంకరములగు ఆయుధములు గల చేతులతో నృత్యమును చేసిరి.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్వినవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబదిరెండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters